సాక్షి, హైదరాబాద్: శీతాకాల సమావేశంలో వక్ఫ్ బోర్డు బిల్లు పార్లమెంట్‌లో పాస్ అవుతుందని అన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ముస్లిం సమాజానికి వ్యతిరేకం కాదని తెలిపారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో వక్ఫ్ మతం కిందకు రాదని చెబుతున్నాయని,. వక్ఫ్ అనేది ఇతర దేశాల్లో ప్రభుత్వం కిందనే ఉందని తెలిపారు. ఎవరడ్డుకున్నా వక్ఫ్ బోర్డు సవరణ జరుగుతుందని చెప్పారు.
ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు కీలకమని.. ఎవరైనా సర్వోన్నత న్యాయస్థాన తీర్పును గౌరవించాల్సిందేనని అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. దీనికి సుప్రీంకోర్టుకు మించి అధికారలిచ్చారని విమర్శించారు. ఔరంగజేబు విధానాలు ఇప్పటికీ ప్రజలను పీడిస్తున్నాయని పేర్కొన్నారు.
‘300 వందల ఏళ్ల క్రితం కింద ఔరంగా జేబు నోటి మాటతో భూములిచ్చి ఉండొచ్చు, కానీ నేడు కుప్పలువుకుప్పలుగా డాక్యుమెంట్స్‌తో భూములు మావని అంటున్నారు. వక్ఫ్ బోర్డు అనేది ఒక క్రూరమైన హాస్యం, నవ్వాలో, ఏడ్వాలో, బాధపడాలో తెలియని పరిస్థితి. దేవాలయం అనేది మతానికి సంధించింది. వక్ఫ్ ఆనేది సమాజానికి సంబంధించినది.
ముస్లిం ఓట్ల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ దేశాన్నైనా అమ్ముకుంటాయి. ఏఐసీసీలో ఖర్గే ఒక బొమ్మ మాత్రమే. నాడు మన్మోహన్ సింగ్‌ను ఎలా వాడుకున్నారో నేడు ఖర్గే కూడా అలాగే వాడుకుంటున్నారు.రాహుల్ తాత నెహ్రూ హాయంలో పాలేకర్ కమిషన్ ఏర్పాటు చేశారు. 1980 మండల్ కమిషన్ ఏర్పాటు చేశారు, ఎలాంటి చర్యలు లేవు. రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ విధానాలు నచ్చక అంబేద్కర్ కేబినెట్ వదిలేసి వెళ్లిపోయారు.రాజ్యాంగాన్ని బొంద పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది’ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment