హైదరాబాద్, సాక్షి: మార్గదర్శి కేసుపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. సోమవారం చేపట్టిన విచారణలో జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావుల ధర్మాసనం చందాదారుల వివరాలు ఇవ్వడానికి మీకేంటి ఇబ్బంది? అని మార్గదర్శి న్యాయవాది సిద్దార్థ లూద్రాను ప్రశ్నించింది.
అయితే.. న్యాయవాది లూద్రా స్పందిస్తూ.. సుప్రీంకోర్టు వివరాలు ఇవ్వాలని చెప్పలేదన్న కోర్టుకు తెలిపారు. ఉండవల్లి అరుణ కుమార్ వద్ద పేపర్ ఫార్మాట్‌లో వివరాలున్నాయి. ఆయన ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో అడుగుతున్నారు. ఇవ్వడానికి ఇబ్బందేంటో చెప్పండని హైకోర్టు ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది.
పిటిషనర్ నుంచి సూచనలు పొంది తెలియజేస్తామని న్యాయవాది లూద్రా అన్నారు. అన్ని వివరాలతో రావాలని ఆర్బీఐ, లూద్రాకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్–2 రామోజీరావు మృతిచెందారని తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్( పీపీ) హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక..తదుపరి విచారణ నవంబర్ 4వ తేదీకి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment