undavalli arun kumar
-
విభజనపై పార్లమెంటులో చర్చకు కృషి చేయండి
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్రాన్ని విభజించిన తీరు, తద్వారా ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో చర్చ జరిగేలా నోటీసు ఇప్పించాలని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. ఈ మేరకు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు రాసిన లేఖను మంగళవారం రాజమహేంద్రవరంలో విడుదల చేశారు. 2014 నుంచి జరిగిన పరిణామాలను ఆ లేఖలో ప్రస్తావించారు. ‘2014 ఫిబ్రవరి 18న రాష్ట్ర విభజన బిల్లుపై ఎటువంటి చర్చా జరగకుండా.. ఎంతమంది విభజనకు అనుకూలమో.. ఎంతమంది వ్యతిరేకమో డివిజన్ ద్వారా లెక్క తేల్చకుండా, తలుపులు మూసేసి టీవీ ప్రత్యక్ష ప్రసారం నిలిపివేసి, రాష్ట్ర విభజన జరిగిపోయిందని లోక్‌సభలో ప్రకటించారు. ఈ విషయం మీకు తెలిసిందే..’ అని లేఖలో పేర్కొన్నారు. ‘రాష్ట్ర విభజనపై నేను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పదేళ్లుగా నడుసూ్తనే ఉన్నా... కేంద్రం నేటికీ కనీసం కౌంటర్ దాఖలు చేయలేదు. 2018 ఫిబ్రవరి 18న మీరు(పవన్) ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన బకాయిలు రూ.74,542 కోట్లుగా లెక్క తేల్చింది. 2018 జూలై 16న అప్పటి సీఎం చంద్రబాబును కలిసి లోక్‌సభలో జరిగిన దుర్మార్గం గురించి వివరించాను. నేను చూపించిన లోక్‌సభ రికార్డులను పరిశీలించిన చంద్రబాబు నా వాదనతో ఏకీభవించి, లోక్‌సభలో ఈ విషయం చర్చించేందుకు నోటీసు ఇవ్వాలని, అలాగే సుప్రీంకోర్టులో రాష్ట్రం తరఫున అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయించారు. కారణాలేమైనా అవి అమలు కాలేదు.2019 జనవరి 29న విజయవాడలో నేను ఏర్పాటు చేసిన సమావేశానికి వైఎస్సార్సీపీ, సీపీఎం తప్ప మిగిలిన ముఖ్య పార్టీల నేతలందరూ హాజరయ్యారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా మీరు స్వయంగా హాజరయ్యారు. 2019 ఎన్నికల అనంతరం ఎవరు అధికారంలోకి వచ్చినా, మనకు జరిగిన అన్యాయంపై పార్లమెంటులో చర్చించాలని, సుప్రీంకోర్టులో ప్రస్తావించాలని ఆ రోజు సమావేశంలో తీర్మానించుకున్నాం. ఇప్పుడు మీరు, చంద్రబాబు ఇద్దరూ బీజేపీతో కలిసి రాష్ట్రం, కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. విభజన సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోను, సహకరించిన బీజేపీ కేంద్రంలోను అధికారంలో ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టుకోవడానికి, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఇదే సరైన సమయం. మీరిద్దరూ శ్రద్ధ తీసుకుని, పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్ర విభజనపై, జరిగిన అన్యాయంపై చర్చకు నోటీసులు ఇప్పించాలి. దీంతోపాటు సుప్రీంకోర్టులో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన అంశాన్ని త్వరితగతిన ఒక కొలిక్కి తీసుకురావాలి.’ అని ఉండవల్లి ఆ లేఖలో పేర్కొన్నారు. -
నిజాయితీగా వాస్తవాలు చెప్పండి
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: చందాదారుల వివరాలను అందించే విషయంలో నిజాయితీగా ఉండాలని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయాల్లో పారదర్శకంగా ఉంటే అందరికీ మంచిదని మార్గదర్శికి స్పష్టం చేసింది. ఉండవల్లి అరుణ్ కుమార్ కోరిన విధంగా ఆయనకు పెన్‌డ్రైవ్‌లో చందాదారుల వివరాలను అందచేసే విషయంలో తగిన సమయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఈ కేసు గురించి మీడియా ముందు మాట్లాడకుండా అరుణ్ కుమార్‌ను నియంత్రిస్తూ గ్యాగ్ ఆర్డర్ జారీ చేయాలన్న మార్గదర్శి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఎలాంటి విచారణ చేపట్టకుండా ఈ దశలో అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఒకవేళ ఆయన మాట్లాడిన మాటలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయనుకుంటే తగిన విధంగా ముందుకెళ్లొచ్చునని మార్గదర్శికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ మొదలుపెట్టిన హైకోర్టుచట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని హెచ్‌యూఎఫ్ కర్త రామోజీ రావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధీకృత అధికారి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును కొట్టేస్తూ 2018 డిసెంబర్ 31న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశాయి. హైకోర్టు తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామోజీ, మార్గదర్శి కూడా వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును రద్దు చేసింది.ఈ వ్యవహారంపై తిరిగి విచారణ చేపట్టాలని, ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. డిపాజిట్ల సేకరణలో వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. తాను నగరంలో లేనందున విచారణను గురువారానికి వాయిదా వేయాలని ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణన్ రవిచందర్ ధర్మాసనాన్ని కోరారు.ఇందుకు ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గదర్శి తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా కూడా అంగీకరించారు. ఏ రోజైనా ఇబ్బంది లేదని, తన అభ్యర్థన మాత్రం పెన్‌డ్రైవ్ గురించేనని అరుణ్ కుమార్ చెప్పారు. తదుపరి విచారణకన్నా ముందే పెన్‌డ్రైవ్‌ను అందజేస్తే, కోర్టుకు సహకరించడం సులభంగా ఉంటుందని చెప్పారు. దీనిపై వాదనలు వినే సమయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది. గురువారం అరుణ్ కుమార్‌కు మంచి రోజని లూథ్రా వ్యాఖ్యానించగా.. అవునని, ఆ రోజున తాను స్వయంగా కోర్టు ముందు హాజరవుతానని, మీ ఉపన్యాసం వింటానని ఉండవల్లి చెప్పారు. చందాదారులు ఎవరో ఇప్పటికీ గుర్తించని మార్గదర్శి ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందిస్తూ.. చందారులందరికీ డిపాజిట్లు చెల్లించలేదని మార్గదర్శే అంగీకరించిందని «తెలిపారు. గత 10–15 సంవత్సరాలుగా ఎస్క్రో ఖాతాలో ఉన్న రూ.5.30 కోట్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయన్నారు. ఈ మొత్తాలు ఎవరివో మార్గదర్శి ఇప్పటివరకు గుర్తించలేకపోయిందని తెలిపారు. అందుకే ఈ విషయంలో కోర్టుకు సహకరించదలిచానని, ఓ అవకాశం ఇవ్వాలని కోరారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ముందుకు రావడంలేదన్నారు. వాదనల సమయంలో అన్ని విషయాలపైనా అవసరాన్ని బట్టి తగిన ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉండవల్లి పత్రికా ముఖంగా స్టేట్మెంట్లు ఇవ్వకుండా సలహా ఇవ్వాలని లూథ్రా కోరారు.గ్యాగ్ ఆర్డర్ కోసం అనుబంధ పిటిషన్ వేస్తామన్నారు. దీనిపై ఉండవల్లి తీవ్రంగా స్పందించారు. అవాస్తవాలతో మీరు (లూథ్రా) కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఘాటుగా చెప్పారు. ఈరోజు (సోమవారం) మార్గదర్శి కోర్టు ముందుంచిన 240 పేజీల కేసు వివరాల్లో దాదాపు 100 పేజీలు తన గురించే ఉన్నాయన్నారు. తాను మార్గదర్శిపై మాట్లాడిన విషయాలపై పత్రికల్లో వచ్చిన కథనాలను తర్జుమా చేసి కోర్టు ముందుంచారని, ఆ తర్జుమాలు చాలా అధ్వానంగా ఉన్నాయని అన్నారు. పత్రికల్లో ఏదో రాస్తే తనకు ఆపాదిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. గత 90 రోజుల్లో మీడియాతో మాట్లాడినట్లు ఏవైనా కథనాలు ఉంటే కోర్టు ముందుంచాలన్నారు. ఇది సంచలన కేసు అని, మీడియాకు ప్రతిదీ తెలుసునని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. గురువారం వాదనలు వింటామని, ఆ రోజుకి మీ మీ శక్తిని దాచిపెట్టుకోవాలంటూ వ్యాఖ్యానించింది.‘సన్‌లైట్ ఈజ్ ది బెస్ట్ డిస్ఇన్ఫెక్టెడ్’ (పారదర్శకంగా, నిజాయితీగా ఉండటం, వాస్తవాలను బహిర్గతం చేయడం) – మార్గదర్శిని ఉద్దేశించి ధర్మాసనం చెప్పిన యూఎస్ సుప్రీంకోర్టు జడ్జి లూయిస్ బ్రాండీస్ కొటేషన్ -
చందాదారుల వివరాలు ఎందుకివ్వరు?
సాక్షి, హైదరాబాద్: చందాదారులకు చెల్లింపులపై సుప్రీం కోర్టుకు అందజేసిన 69,531 పేజీల వివరాలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌కు ఎల్రక్టానిక్ఫార్మాట్లో ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను తెలంగాణ హైకోర్టు నిలదీసింది. ఇప్పటికే ఉండవల్లి వద్ద పేపర్ ఫార్మాట్లో వివరాలున్నాయని, కొన్ని ఇబ్బందుల కారణంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్ (పెన్ డ్రైవ్)లో కోరుతున్నారని హైకోర్టు తెలిపింది. దీనికి సమాధానం చెప్పేందుకు మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తటపటాయించారు. కొంత గడువు ఇస్తే మార్గదర్శి ఫైనాన్సియర్స్ నుంచి సూచనలు పొంది చెబుతానని బదులిచ్చారు. దీంతో తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది. ఆరోజున అన్ని వివరాలతో విచారణకు హాజరు కావాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), మార్గదర్శితో పాటు ఇరు రాష్ట్రాల న్యాయవాదులను ఆదేశించింది. చందాదారుల వివరాలను పెన్ డ్రైవ్‌లో తీసుకురావాలని ఆదేశించింది. ఈమేరకు జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట నిబంధలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పునిచి్చంది. ఈ తీర్పుపై ఉండవల్లి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈ ఏడాది ఏప్రిల్ 9న హైకోర్టు తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్సియర్స్ పిటిషన్లపై మరోసారి విచారణ ప్రారంభించింది. లూథ్రా వాదనకు ధర్మాసనం అభ్యంతరం ఈ వ్యవహారంపై జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణకు ఉండవల్లి అరుణ్‌కుమార్ వర్చువల్‌గా హాజరయ్యారు. సుప్రీం కోర్టుకు మార్గదర్శి అందజేసిన 69,531 పేజీల చందాదారుల వివరాలను పెన్‌డ్రైవ్‌లో ఇచ్చేలా ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. పేపర్ ఫార్మాట్లో వివరాలు తన వద్ద ఉన్నప్పటికీ, పరిశీలనకు ఇబ్బందిగా ఉందని తెలిపారు. కొన్ని అంశాలను ఇప్పటికే పరిశీలించానని, ఆ వివరాలన్నీ డొల్లగానే ఇచ్చారని అన్నారు. ఎల్రక్టానిక్ ఫార్మాట్లో ఇస్తే అక్రమాలు తెలియజేస్తానన్నారు. తాను ఎవరి తరఫున వకాలత్ తీసుకోలేదని, సుప్రీం కోర్టు సూచన మేరకు హైకోర్టుకు సాయం మాత్రమే చేస్తున్నా అని చెప్పారు. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది లూథ్రా వాదనలు వినిపిస్తూ.. చందాదారుల వివరాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పలేదన్నారు. దీనికి ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. పేపర్ ఫార్మాట్లో ఉన్న వివరాలనే పెన్‌డ్రైవ్‌లో కోరుతున్నారు కదా అని ప్రశ్నించింది. దీంతో గడువిస్తే సంస్థ నుంచి సూచనలు పొంది చెబుతానని లుథ్రా బదులిచ్చారు. కాగా, ఈ కేసులో పిటిషనర్–2 (రామోజీరావు) మృతి చెందారని తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వర్రావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని కూడా ధర్మాసనం నమోదు చేసుకుంది. -
మార్గదర్శి కేసు.. వారి వివరాలిస్తే ఇబ్బందేంటీ?: హైకోర్టు
హైదరాబాద్, సాక్షి: మార్గదర్శి కేసుపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. సోమవారం చేపట్టిన విచారణలో జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావుల ధర్మాసనం చందాదారుల వివరాలు ఇవ్వడానికి మీకేంటి ఇబ్బంది? అని మార్గదర్శి న్యాయవాది సిద్దార్థ లూద్రాను ప్రశ్నించింది. అయితే.. న్యాయవాది లూద్రా స్పందిస్తూ.. సుప్రీంకోర్టు వివరాలు ఇవ్వాలని చెప్పలేదన్న కోర్టుకు తెలిపారు. ఉండవల్లి అరుణ కుమార్ వద్ద పేపర్ ఫార్మాట్లో వివరాలున్నాయి. ఆయన ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో అడుగుతున్నారు. ఇవ్వడానికి ఇబ్బందేంటో చెప్పండని హైకోర్టు ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది. పిటిషనర్ నుంచి సూచనలు పొంది తెలియజేస్తామని న్యాయవాది లూద్రా అన్నారు. అన్ని వివరాలతో రావాలని ఆర్బీఐ, లూద్రాకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్–2 రామోజీరావు మృతిచెందారని తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్( పీపీ) హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక..తదుపరి విచారణ నవంబర్ 4వ తేదీకి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.చదవండి: చందాలు ఎవరికి తిరిగిచ్చారో.. ఇవ్వలేదో వివరాల్లేవు -
మార్గదర్శి వివరాలిస్తే.. అక్రమాలు తేలుస్తా..
-
వైవి సుబ్బారెడ్డిపై నీచమైన ఆరోపణలు చేస్తారా?: ఉండవల్లి
-
‘మార్గదర్శి’కి చంద్రబాబు ఉపకారం దారుణం
సాక్షి, రాజమహేంద్రవరం: ఆర్థిక అవకతవకలు, అక్రమాలకు అడ్డాగా నిలిచిన మార్గదర్శికి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యక్షంగా ఉపకారం చేయడం దారుణమని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మండిపడ్డారు. దీంతో మార్గదర్శి, చంద్రబాబు ముసుగు తొలగిందన్నారు. బాబు చరిత్రలో ఇది అతిపెద్ద మచ్చగా నిలిచిపోవడం ఖాయమని చెప్పారు. గత ప్రభుత్వం మార్గదర్శిపై దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఉపసంహరించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే మార్గదర్శిని కాపాడతానన్నారని గుర్తు చేశారు.ఆయన అన్నట్లే ఇప్పుడు కాపాడుతున్నారని ఆరోపించారు. ఇది చంద్రబాబు ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పన్నారు. డిపాజిట్లపై ఫ్యూచర్ సబ్‌్రస్కిప్షన్ ఉండకూడదని నిబంధన ఉన్నా.. మార్గదర్శి దీన్ని కొనసాగించిందన్నారు. చంద్రబాబు మార్గదర్శిపై అఫిడవిట్ ఉపసంహరించుకున్నా కేసు ఆగదని.. ఆయనను ఇందులో పార్టీ చేసే పరిస్థితి వస్తుందన్నారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు ఏం చేసినా చట్టానికి దొరకకుండా చేస్తారు.. సీఎం చంద్రబాబు ఏం చేసినా చట్టానికి దొరక్కుండా చేస్తారు.. కానీ మార్గదర్శికి బహిరంగంగా సాయం చేసి తన ముసుగు తొలగించారు. గత ప్రభుత్వ హయాంలో ఫ్యూచర్ సబ్‌్రస్కిప్షన్ పేరుతో మార్గదర్శి సేకరిస్తున్న డిపాజిట్లు చట్టవిరుద్ధమని దాని బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.1,051 కోట్లను అటాచ్ చేశారు. ఇది అన్యాయమని అప్పట్లో మార్గదర్శి కోర్టుకు వెళ్లలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. గత ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఉపసంహరించుకునేలా చేసింది. అటాచ్ చేసిన ఆ నగదు మొత్తాన్ని వెనక్కు ఇచ్చేయాలని ప్రభుత్వం చెప్పడం దారుణం. సెపె్టంబర్ 11న మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు వాయిదాకు వస్తున్న సమయంలో ఇలా చేయడం తగదు. అక్కడ కూడా ఏదో చేయబోతున్నారని అర్థమవుతోంది. మార్గదర్శి చేసింది తప్పేనని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది.. మార్గదర్శి చేసింది తప్పేనని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఫండమెంటల్ యాక్ట్ 1982 ప్రకారం.. చిట్‌ఫండ్ వ్యాపారి ఇతర వ్యాపారాలు చేయకూడదనే నిబంధన ఉంది. రామోజీరావు అన్ని వ్యాపారాలు, ఆయన సామ్రాజ్య విస్తరణ మొత్తం ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుతో నడుస్తున్నవే. గత ప్రభుత్వ హయాంలో మార్గదర్శి చిట్‌ఫండ్ బ్రాంచ్‌లను మూసేశారు. దీంతో వారి ఖాతాలన్నింటినీ తెలంగాణలోని ఇతర బ్రాంచ్‌లకు మార్గదర్శి తరలించింది. చంద్రబాబు రాగానే ఎట్టి పరిస్థితుల్లో తమ సంస్థను వ్యతిరేకించరని తెలుసు. ఇలాంటి పనులు చేసే ముందు ప్రజలు ఏమనుకుంటారోనని సీఎం ఆలోచించాలి. మార్గదర్శిలో ఉన్న మొత్తం డబ్బులో 70 శాతం అన్ అకౌంటబుల్. దీన్ని ఖచి్చతంగా నిరూపిస్తా. పన్ను ఎగవేతదారులకు మార్గదర్శి ఫైనాన్స్ కేంద్రంగా నిలిచింది.దేశంలోనే ధనిక సీఎం చంద్రబాబు తమకు రూ.900 కోట్ల ఆస్తులు ఉన్నట్లు చంద్రబాబు 2024 ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.900 కోట్లు ఉంటే బహిరంగ మార్కెట్లో ఈ మొత్తం రూ.వేల కోట్లు ఉంటుంది. చంద్రబాబు భార్య భువనేశ్వరి మాత్రం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ వద్ద తమ ఆస్తి రూ.25 వేల కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. ఎక్కడి నుంచి అంత ఆస్తి వచి్చందని ఎవరైనా ప్రశి్నంచారా? చట్టబద్ధంగా ఆయన అక్రమాలు చేసినట్లు ఎవరైనా ఫిర్యాదు చేశారా? ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టిన సందర్భాలు గతంలో లేవు. పీఎస్సార్ ఆంజనేయులు మంచి అధికారి. ప్రభుత్వం వైఎస్ జగన్ హయాంలో పనిచేసిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదు. -
మార్గదర్శి కోసం ముసుగు తీసేసాడు: Undavalli Arun Kumar
-
KSR Live Show: ఈవీఎంలపై అనుమానాలు నిజమే.. ఉండవల్లి బయటపెట్టిన సంచలన నిజాలు
-
KSR Live Show: ఈవీఎంలపై అనుమానాలు నిజమే.. ఉండవల్లి బయటపెట్టిన సంచలన నిజాలు
-
మార్గదర్శి కేసులో చంద్రబాబు ఏం చేస్తారో?.. ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
-
రామోజీ ఆర్థిక నేరగాడే
సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్సియర్స్ నిర్భీతిగా నిబంధనలను ఉల్లంఘించి ఆర్థిక దోపిడీకి పాల్పడినట్లు స్పష్టమైంది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు కూడా చైర్మన్‌గా వ్యవహరించిన ఈనాడు అధిపతి చెరుకూరి రామోజీరావు (ఇటీవల మరణించారు) ఆర్థిక నేరస్తుడని తేటతెల్లమైంది. చట్టానికి తాను అతీతమన్నట్టుగా దశాబ్దాలుగా ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడి భారీగా దోపిడీకి తెగించినట్లు నిగ్గు తేలింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి విస్పష్టంగా ప్రకటించింది. ఈ మేరకు తాజాగా తెలంగాణ హైకోర్టుకు ఈ నెల 13న లిఖితపూర్వకంగా కౌంటర్లో నివేదించింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా పూర్వాపరాలివి. ఆర్బీఐకి తెలియకుండానే...హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఏర్పాటైంది. ఈ హెచ్‌యూఎఫ్‌కు రామోజీరావు కర్త. డిపాజిట్లు వసూలు చేసేందుకు హెచ్‌యూఎఫ్‌లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతివ్వదు. ఇక్కడ అసక్తికర విషయం ఏమిటంటే అసలు మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనే సంస్థ ఉన్నట్లు రిజర్వ్ బ్యాంకుకే తెలియదు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండానే రామోజీరావు నేతృత్వంలోని మార్గదర్శి ఫైనాన్సియర్స్ తన కార్యకలాపాలను కొనసాగించింది. ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా 2006 మార్చి నాటికి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి రూ.2,610.38 కోట్లను డిపాజిట్లుగా సేకరించింది. ఇంత భారీ మొత్తాల్లో డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి అప్పట్లో ప్రతీ సంవత్సరం వందల కోట్ల రూపాయల్లో నష్టాలు చూపింది. 2000 మార్చి 30వ తేదీ నాటికి 619.25 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేయగా, 2006 మార్చి 30 నాటికి వసూలు చేసిన డిపాజిట్ల మొత్తాన్ని రూ.2,610.38 కోట్లుగా చూపింది. ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసినప్పటికీ 2006 మార్చి నాటికి రూ.1,369.47 కోట్లను వృద్ధి చెందుతున్న నష్టాలుగా చూపింది. అంటే 50 శాతం డిపాజిటర్లకు డిపాజిట్లు చెల్లించలేని పరిస్థితికి మార్గదర్శి ఫైనాన్సియర్స్ చేరింది. డిపాజిటర్లకు వడ్డీలు, మెచ్యూరిటీ మొత్తాలు చెల్లించేందుకు మళ్లీ డిపాజిట్లు తీసుకోవడం మొదలు పెట్టింది. ఇలా మార్గదర్శి ఆర్థికంగా మనుగడ సాగించింది. ఉండవల్లి ఫిర్యాదుతో కదిలిన మార్గదర్శి పునాదులు.. మార్గదర్శి ఫైనాన్సియర్స్ చట్ట ఉల్లంఘనలపై 2006లో అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమ డిపాజిట్ల కథ వెలుగులోకి వచ్చింది. ఉండవల్లి ఫిర్యాదును కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐకి పంపింది. దీంతో ఆర్బీఐ మార్గదర్శి ఫైనాన్సియర్స్ వివరణ కోరింది. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్) హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్)కు వర్తించదని మార్గదర్శి ఆర్బీఐకి రాతపూర్వకంగా తెలిపింది. అందులో ఎక్కడా కూడా డిపాజిట్లు వసూలు చేయలేదని మాత్రం చెప్పలేదు. అంతేకాక 2006 సెప్టెంబర్ 16 నుంచి రూ.లక్ష అంతకన్నా తక్కువ మొత్తాలను డిపాజిట్లుగా స్వీకరించడాన్ని నిలిపేశామని ఆర్బీఐకి చెప్పింది. ఈ వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. అక్రమాల నిగ్గు తేల్చే బాధ్యత రంగాచారికి ఆర్బీఐ సూచన మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించడంతోపాటు మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలను, అవకతవకలను నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006 డిసెంబర్ 19న జీవో జారీ చేసింది. అలాగే మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ అధికారి టి.కృష్ణరాజును అదీకృత అధికారిగా నియమించింది. దీంతో ఉలిక్కిపడ్డ రామోజీరావు... మార్గదర్శి ఫైనాన్సియర్స్ ద్వారా అటు రంగాచారి, ఇటు కృష్ణరాజు నియామకాలను సవాలు చేస్తూ 2006లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు వారి నియామకాలను రద్దు చేసేందుకు తిరస్కరిస్తూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ పిటిషన్లను కొట్టేసింది. మార్గదర్శి, రామోజీల ప్రాసిక్యూషన్ కోసం కృష్ణరాజు ఫిర్యాదు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్సియర్స్, హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి టి.కృష్ణరాజు 2008, జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) దాఖలు చేశారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధమని, అయితే మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఇందుకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి నేరం చేసిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 58ఈ కింద శిక్షార్హమని తెలిపారు. ఈ ఫిర్యాదును కొట్టేయాలని కోరుతూ మార్గదర్శి 2008లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం, మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేసేందుకు నిరాకరించింది. మార్గదర్శిపై చర్యల నిలిపివేతకు సుప్రీంకోర్టు తిరస్కృతి కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో రామోజీరావు 2010లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఫిర్యాదులో విచారణను సెక్షన్ 45(ఎస్)(1), 45(ఎస్)(2), 58బీ(5ఏ) రెడ్ విత్ సెక్షన్ 58(ఈ)లకే పరిమితం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని నాంపల్లి కోర్టును కోరారు. ఈ అభ్యర్థనను నాంపల్లి కోర్టు తోసిపుచ్చుతూ 2011లో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులపై మార్గదర్శి, రామోజీరావు హైకోర్టును ఆశ్రయించారు. హెచ్‌యూఎఫ్ అయిన మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదంటూ వాదించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ... మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ 2011లో మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు నాంపల్లి కోర్టు ముందున్న ఫిర్యాదు (సీసీ 540)లో తదుపరి చర్యలను నిలిపేసేందుకు నిరాకరించింది. అలాగే హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను కొనసాగించేందుకు సైతం నిరాకరించింది. ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు మార్గదర్శికి అనుకూలంగా తీర్పు... ఆ తర్వాత 2019, జనవరి ఒకటో తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజన జరిగింది. అంటే 31.12.2018న ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు. అందరూ విభజన పనుల్లో నిమగ్నమయ్యారు. అటు న్యాయవాదులు, ఇటు న్యాయమూర్తులు అందరూ భావోద్వేగ వాతావరణంలో ఉన్నారు. కేసుల విచారణపై ఎవరూ దృష్టి సారించలేని పరిస్థితి. ఇదే అదునుగా భావించిన రామోజీరావు నాంపల్లి కోర్టులో కృష్ణరాజు ఫిర్యాదును కొట్టేయాలంటూ 2011లో దాఖలు చేసిన తన వ్యాజ్యాలను 2018, డిసెంబర్ 31వ తేదీన విచారణకు తెప్పించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. రామోజీరావు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు విన్న జస్టిస్ రజనీ అదే రోజున... అంటే 2018, డిసెంబర్ 31న తీర్పు కూడా ఇచ్చేశారు. హెచ్‌యూఎఫ్ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి రాదని జస్టిస్ రజనీ తన తీర్పులో తేల్చేశారు. మార్గదర్శి, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చారు. మార్గదర్శి, రామోజీరావులకు క్లీన్చిట్ ఇచ్చేసిన న్యాయమూర్తి... డిపాజిట్ల సేకరణ విషయంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్, రామోజీరావులకు అసలు ఎలాంటి దురుద్దేశాలు లేవంటూ న్యాయమూర్తి సర్టిఫికెట్ ఇచ్చేయడం ఈ తీర్పులో ఆసక్తికర విషయం. అంతేకాక డిపాజిట్లను తిరిగి చెల్లించే ప్రక్రియను మొదలుపెట్టారని చెప్పిన హైకోర్టు, పరోక్షంగా మార్గదర్శి, రామోజీరావు చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన విషయాన్ని నిర్ధారించినట్లు అయింది. ఇంత పెద్ద కేసులో ఒకే రోజు విచారణ జరిపి తీర్పునివ్వడం విశేషం. అసలు ఈ కేసు విచారణకు వచ్చినట్లు గానీ, న్యాయమూర్తి ఈ విధంగా తీర్పునిచ్చినట్లు గానీ ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత కొద్ది నెలలకు ఈ తీర్పు వెలుగు చూసింది. దీంతో మార్గదర్శి ఫైనాన్సియర్స్ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అప్రమత్తమై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం 2019లో ఇంప్లీడ్ అయింది. యావజ్జీవ ఖైదు... రెండింతల జరిమానా అక్రమ డిపాజిట్ల కేసులో నేరం నిరూపితమైతే భారీ జరిమానాతోపాటు ఆ సంస్థ బాధ్యులకు రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉందని ఈ ఏడాది ఏప్రిల్‌లో న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆ సంస్థ చైర్మన్ రామోజీ ఇటీవల మృతిచెందారు. కానీ నేరం రుజువైతే నేరంగానే పరిగణిస్తారు. ఆ సంస్థ నిర్వాహకులు అందుకు బాధ్యత వహించక తప్పదు. ఇక సేకరించిన అక్రమ డిపాజిట్లు రూ.రూ.2,610.38కోట్లకు రెట్టింపు జరిమానా విధించే అవకాశం ఉంది. బెడిసికొట్టిన ‘పత్రికా స్వేచ్ఛ’ పన్నాగంపత్రికా స్వేచ్ఛ ముసుగులో ఈ కేసు నుంచి బయటపడేందుకు నాడు రామోజీరావు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. ఈనాడు పత్రికకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యతిరేకం కాబట్టే ఈ కేసు విషయంలో పట్టుబడుతోందని రామోజీరావు తరఫున ప్రముఖ న్యాయవాదులు వినిపించిన వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ అంశానికి, అక్రమ డిపాజిట్లకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ఉండొద్దని వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికలు ఉన్నందునే ఈ కేసుపై ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోందన్న రామోజీ తరఫు న్యాయవాదుల వాదనలతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించలేదు. ‘ఎన్నికలు ఉంటే ఈనాడుకు ఏమైంది? ఈనాడు ఏమీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కదా..? ఈనాడు కేవలం ఓ పత్రికే కదా..! ఎన్నికలతో ఏం సంబంధం?’ అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. దీంతో ఉండవల్లి అరుణ్ కుమార్‌పై నెపాన్ని నెట్టివేసేందుకు రామోజీ తరఫు న్యాయవాదులు విఫలయత్నం చేశారు. రంగాచారి నివేదికలోని కీలక అంశాలు ⇒ రంగాచారి విచారణకు రామోజీరావు, మార్గదర్శి ఎంతమాత్రం సహకరించలేదు. కార్యాలయాల్లో తనిఖీలకు అడ్డుపడ్డారు. కావాల్సిన డాక్యుమెంట్లు ఇవ్వకుండా ముప్పుతిప్పులు పెట్టారు. తమ పిటిషన్లు కోర్టుల ముందు పెండింగ్‌లో ఉన్నాయని, అందువల్ల డాక్యుమెంట్లు ఇచ్చేది లేదన్నారు. చివరకు ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన అన్నీ డాక్యుమెంట్లను పరిశీలించిన రంగాచారి 2007 ఫిబ్రవరి 19న తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ⇒ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్లు సేకరించిందని రంగాచారి తేల్చారు. ⇒ డిపాజిటర్లకు వడ్డీ చెల్లించే అలవాటే మార్గదర్శికి లేదని, ఒత్తిడి చేస్తేనే చెల్లిస్తుందంటూ ఓ డిపాజిటర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్న విషయాన్ని రంగాచారి తన నివేదికలో పొందుపరిచారు. ⇒ డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ లేదని, దాని ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ తీవ్ర నష్టాల్లో ఉండటమే అందుకు కారణమని స్పష్టంచేశారు. ⇒ రామోజీరావు తన అనుబంధ కంపెనీలకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిధులను మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తేల్చారు. క్రియాశీలకంగా లేని అనేక కంపెనీలకు మార్గదర్శి నిధులను బదలాయించినట్లు వారు సమర్పించిన డాక్యుమెంట్లే స్పష్టంగా చెబుతున్నాయని పేర్కొన్నారు. ⇒ రామోజీ గ్రూపులోని ఇతర కంపెనీల్లో కూడా ఇలాగే ఒక గ్రూపు నిధులను మరో గ్రూపునకు బదలాయించడం జరిగిందని పేర్కొన్నారు. ⇒ 2000, ఆ తర్వాత సంవత్సరాల్లోని బ్యాలెన్స్ షీట్లను గమనిస్తే మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో రామోజీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని, మొత్తం ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లతోనే మార్గదర్శిని నడిపారని తెలిపారు. ⇒ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ తప్ప మిగిలిన అన్నీ కంపెనీలు నష్టాల్లో ఉన్నట్లు బ్యాలెన్స్ షీట్ల పరిశీలన ద్వారా తెలిసిందని రంగాచారి తన నివేదికలో వివరించారు. -
తస్సాదియ్యా... మన రోశయ్య!
విషయ పరిజ్ఞానం, లెక్కలు, తేదీలు, చమత్కారం, సమయ స్ఫూర్తి, ముక్కుసూటిగా ప్రవాహ వేగంతో మాట్లాడే లక్షణం, స్పష్టమైన ఉచ్చా రణ, గంభీరమైన కంఠస్వరం వంటి లక్షణాలు మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ కొణిజేటి రోశయ్యకు ఓ ప్రత్యేకతను సంతరించిపెట్టాయి. శాసన సభలోనూ, బయటా ఆయన మాట్లాడిన ప్రతిమాటా ఒక చెణుకే.ఓసారి రోశయ్య అల్లుడు ఒక విందులో తన మిత్రులతో ఎంజాయ్ చేస్తూ టీవీ ఛానెళ్లకు చిక్కారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో టీడీపీ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. సభలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ మూకుమ్మడిగా ఉత్సాహంతో రెచ్చిపోయారు. చివరగా రోశయ్య తాపీగా నిలబడ్డారు. ‘అధ్యక్షా... ఎన్టీ రామారావు గారికీ, నాకూ దేవుడు మంచి అల్లుళ్ళనివ్వలేదు. ఏంచేస్తాం అధ్యక్షా’ అనేసి ఠక్కున కూర్చున్నారు. పాపం... తెలుగు తమ్ముళ్లు నవ్వలేరు, నవ్వకుండా ఉండలేరు. ఇక చంద్రబాబు పరిస్థితి సరే సరి! మిగతా సభ్యుల నవ్వులతో ఆనాటి సభ వెల్లివిరిసింది.మరోసారి సభలో చంద్రబాబు ఆరోపణలపై ప్రతిస్పందిస్తూ ... ‘అధ్యక్షా... స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని నేను డ్రామా కంపెనీవాడు అనలేదు. ముందు ఆయన డ్రామాలు వేశాడు. తరవాత సినిమాల్లోకి వెళ్లి ప్రముఖ నటుడయ్యాడు అన్నానంతే. మీరు (చంద్రబాబును ఉద్దేశించి) ఒకప్పుడు ఆయన్ను గౌరవించారు. మధ్యలో పోయింది. తర్వాత మళ్ళీ వచ్చింది... సరే, నన్ను తెలివితేటలు గలవాణ్ణని అన్నారు. నేను తెలివితేటలు గలవాణ్ణయితే ఇలా ఉంటానా? ఒంటరిగా ఉన్నప్పుడెప్పుడో అదనుచూసి రాజశేఖర రెడ్డిని ఒక్కపోటు పొడిచి ఆ సీట్లో కూర్చునేవాడిని...’ అన్నారు. అంతే... చంద్రబాబు, ఆ పార్టీ సభ్యులు కిక్కురుమంటే ఒట్టు.వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇష్టమైన ఓ చెణుకు గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ ఇలా చెప్పారు: ‘‘రోశయ్య ఓసారి రాజమండ్రిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్టులకు వెళ్లడంపై మాట్లాడుతూ, ఇది రాష్ట్రానికి మంచిది కాదు–అప్పుల ఊబిలోకి పోతాం అన్నారు... సరే విలేకర్లు తర్వాత ఆయన మాటల్ని మరో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఫైనాన్స్ మినిస్టర్ (యనమల రామృష్ణుడు)తో అని, దీనికేమంటారు? అని అడిగారు. అందుకాయన మేమేమైనా తప్పు చేస్తున్నామా, ఫెసిలిటీ ఉంది, వాడుకుంటున్నాం. దాని కెందుకింత గొడవ? అన్నారు. ఈ సంగతి ఇంకో ప్రెస్ కాన్ఫరెన్సులో రోశయ్యతో చెప్పి, దీనిపై మీరేమంటారు? అని అడిగారు. దీనికి రోశయ్య ‘చూడు నాయనా... ప్రతి ఊరికీ శ్మశానం ఫెసిలిటీ ఉంటుంది. ఉంది కదాని వాడుకోం కదా, జీవుడు పోయిన తర్వాతే అక్కడికి పట్టుకెళ్ళేది’ అని జవాబిచ్చారు.చెణుకులు విసరడమే కాదు అణకువలోనూ, అందరితో కలివిడిగా ఉండడంలోనూ ఆయన పెట్టింది పేరు. ముఖ్యమంత్రి పదవినుంచి వైదొలగుతూ తన పేషీలో సెక్రెటరీ, పీ.ఏ, ఇతర ఉద్యోగులందరి సీట్ల దగ్గరకూ వెళ్లి ‘నా టెర్మ్ అయిపోయింది. కృతజ్ఞతలు. నా వల్ల ఏమైనా ఇబ్బందిపడి ఉంటే ఏమీ అనుకోకండి’ అని వినమ్రంగా చెప్పారు రోశయ్య.శాసన మండలి సభ్యునిగా ఎన్టీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి, మండలి రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకునేలా చేశాడని నాటి విశ్లేషకులు అంటుంటారు. రోశయ్య ఏ పదవి చేపట్టినా ఉద్యోగంలా భావించారు. అసంతృప్తిగా పని చేయడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. అవినీతి మచ్చలేని నిలువెత్తు నిజాయితీ ఆయన. ప్రత్యర్థులు సైతం ఒప్పుకునే సత్యమిది. రాజకీయాల్లో ఆయన స్థానం ఎప్పటికీ భర్తీ చేయలేనిది.– తిరుమలగిరి సురేందర్,ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ -
ఆ 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి!?
సాక్షి, రాజమహేంద్రవరం: దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 20 లక్షల ఈవీఎంలు కనపడకుండా పోయాయంటూ కమ్యూనిస్టులు, ప్రజల నుంచి వస్తున్న ఆరోపణలపై సీఎం చంద్రబాబునాయుడు స్పందించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల నిమిత్తం 60 లక్షల ఈవీఎంలు దిగుమతి చేసుకుంటే.. వీటిలో 40 లక్షలు వినియోగించారని, మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడో ఒకచోట ఉండాలి కదా అని ప్రశ్నించారు. ఈవీఎంల వినియోగం విషయమై సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్నికల కమిషన్‌ను కోరితే.. తమకేం తెలీదని.. ప్రభుత్వం తమకు ఇచ్చిన ఈవీఎంలనే ఉపయోగించామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఉండవల్లి అన్నారు. రాజమహేంద్రవరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇదే విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్‌ను అడగాలంటూ తప్పించుకుంటోందని ఆరోపించారు. ఓ కమ్యునిస్టు నేత సైతం ఇదే అనుమానం వ్యక్తంచేశారన్నారు. ఈవీఎంల గోల్మాల్ అంశాన్ని ఒక కమ్యూనిస్టు నాయకుడు తన దృష్టికి తీసుకొచ్చారని ఉండవల్లి చెప్పారు. గతంలో ఈవీఎంల పనితీరుపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తంచేసినందున ఇప్పుడు ఈవీఎంల గోల్‌మాల్‌పై విచారణకు ఆయన డిమాండ్ చేయాలని కోరారు. తాము వేసిన ఓటు ఎవరికి వెళ్లిందోననే అపోహ ప్రస్తుతం నెలకొందని, ప్రజల్లో అటువంటి అనుమానం రావడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై చంద్రబాబు దృష్టిపెట్టాలని ఉండవల్లి సూచించారు. కేంద్రంలో ఎన్డీయే, ఇండియా కూటములకు ఓట్ల తేడా కేవలం 1.9 శాతం మాత్రమేనన్నారు. అహంకారం పెరిగిపోయిందని ప్రధాని మోదీని ఉద్దేశించి ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ అని ఉండవచ్చన్నారు.వైఎస్సార్సీపీకి మళ్లీ మంచి రోజులు..ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనైపోయిందనుకోవద్దని.. ఓటమి పాలైన ఆ పార్టీ నాయకులు నిరాశ చెందాల్సిన అవసరంలేదన్నారు. 11 స్థానాలే వచ్చినా ఆ పార్టీ ఓట్ల శాతం బాగుందని.. వారికి మళ్లీ మంచి రోజులు రావచ్చని ఉండవల్లి చెప్పారు. గతంలో ఓటమి చెందిన చంద్రబాబు ప్రస్తుత గెలుపే దీనికి నిదర్శనమన్నారు. ఇదే తరహా పరిస్థితులు తమిళనాడు రాజకీయాల్లో సైతం గతంలో చోటుచేసుకున్నాయని చెప్పారు. తమిళనాడులో 1989లో ఎంజీ రామచంద్రన్ మరణానంతరం జరిగిన ఎన్నికల్లో కరుణానిధి పార్టీకి 169, జయలలిత పార్టీకి 30 సీట్లు వచ్చాయని.. ఆ తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో జయలలితకు 225, కరుణానిధికి 7 సీట్లు మాత్రమే వచ్చాయని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష పాత్ర పోషించారని చెప్పారు. అలాగే, 1996లో కరుణానిధి 221 సీట్లు సాధించగా.. జయలలిత నాలుగు స్థానాలకే పరిమితమయ్యారన్నారు. మళ్లీ 2011 ఎన్నికల్లో జయలలిత ఏకంగా 203 సీట్లు సాధించారని చెప్పారు. దీనినిబట్టి చూస్తే రాజకీయాల్లో నిస్సత్తువ ఉండకూడదని ఉండవల్లి అన్నారు. వైఎస్సార్సీపీ అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించాలని సూచించారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం బాబు పోరాడాలి..మరోవైపు.. ఎన్డీయే ప్రభుత్వం చంద్రబాబుపై ఆధారపడి ఉందని, ఆయన ఢిల్లీలో తన పలుకుబడి ఉపయోగించి రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్రానికి అందాల్సిన నిధుల సాధనకు కృషిచేయాలని ఉండవల్లి సూచించారు. రాష్ట్ర విభజన హామీ మేరకు ఏపీకి రూ.1.42 లక్షల కోట్లలో 50 శాతం ఆస్తులు రావాలని, వాటిని సాధించుకునేందుకు పోరాడాలని సూచించారు.రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ సందర్భంగా 2014లో పార్లమెంట్లో ఏం జరిగిందో తెలుసుకుని, ఇప్పుడు బాబు చర్చకు డిమాండ్ చేయాలన్నారు. అలాగే, త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై నోటీసు ఇప్పించాలన్నారు. వివాదాస్పద ఎలక్టోరల్ బాండ్లపై సైతం చర్చ జరగాలని ఆకాంక్షించారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసును చంద్రబాబు ప్రభుత్వమే సీబీఐకి అప్పగించే అవకాశం ఉందని ఉండవల్లి చెప్పారు. జగన్ జైలుకెళ్లే అవకాశం ఉండదు..అక్రమాస్తుల కేసులో జగన్ మళ్లీ జైలుకెళ్లే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి అన్ని చార్జిషీట్లూ పూర్తయ్యాయని చెప్పారు. ఇక కమ్మ, కాపులది డెడ్లీ కాంబినేషన్ అని.. కసి, పట్టుదలవల్లే చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చారని, ఆయనపై జగన్ కక్షసాధింపు చర్యలు చేపట్టారని ప్రజలు నమ్మారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ ఓటమికి మద్యం పాలసీ కూడా ఒక కారణం కావచ్చునన్నారు. ఆ పార్టీ నేతలు బూతులు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. అలాంటి వారివల్లే కొంతమంది వైఎస్సార్సీపీకి దూరమయ్యారని చెప్పారు. -
రామోజీ రావుపై నాకు వ్యకిగతంగా ఎలాంటి కోపం లేదు
-
సిద్దార్థ్ లూథ్రా కి నేను ఒక్కటే చెప్పా..!
-
రామోజీరావు పట్ల కూడా చట్టం చట్టప్రకారమే వ్యవహరిస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్
-
జనం సొమ్ముతో గురివింద విందు!
సాక్షి, అమరావతి: ఆర్థిక అక్రమాల ఉగ్రవాది ‘ఈనాడు’ రామోజీ పాపాలు పండాయి! చట్టాలంటే లెక్క లేకుండా దశాబ్దాలుగా సాగిస్తున్న ఆర్థిక అక్రమాలకు చెక్ పడింది. వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకునే ఎత్తుగడలు ఎల్లకాలం సాగవని రుజుౖవెంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిబంధనలకు విరుద్ధంగా సాగించిన అక్రమ డిపాజిట్ల దందా రామోజీ మెడకు చుట్టుకుంది. టీడీపీ హయాంలో చంద్రబాబు అండదండలతో ‘రమణ’ మంత్రంతో కనికట్టు చేసి అక్రమ డిపాజిట్ల కేసు నుంచి తప్పించుకున్నా చట్టం నుంచి తప్పించుకోలేక పోయారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల కేసును కొట్టివేయడానికి వీల్లేదని, ఆ కేసును సమగ్రంగా విచారించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈనాడు పేరుతో పత్రికా స్వేచ్ఛ ముసుగులో ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు రామోజీ చేసిన ప్రయత్నాలన్నీ సుప్రీంకోర్టు క్రియాశీలత ముందు వీగిపోయాయి. ఈనాడు అంటే ఆఫ్టరాల్ ఒక పేపర్ మాత్రమేనని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేకంగా ఉందన్న రామోజీ మొసలి కన్నీళ్లను కొట్టిపారేస్తూ సుప్రీంకోర్టు విప్లవాత్మకమైన తీర్పును విస్పష్టంగా వెలువరించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా పూర్వాపరాలు ఇవిగో... రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్ల సేకరణ.. నిర్భీతిగా నిబంధనల ఉల్లంఘన చట్టాలకు తాను అతీతం అన్నట్టుగా భావించే రామోజీరావు మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట బరితెగించి ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారు. ఆర్బీఐ చట్టం 45 ఎస్ ప్రకారం ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. అంతేగానీ ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు కాని వ్యక్తులు, సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబాలు(హెచ్‌యూఎఫ్)లు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకూడదు. ఈ నిబంధనను రామోజీ నిర్భీతిగా ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు సేకరించారు. 2006లో అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఫిర్యాదుతో సీఐడీ దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు 1997 నుంచి 2006 వరకు యథేచ్ఛగా అక్రమ డిపాజిట్లు సేకరించినట్లు గుర్తించడంతో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ 2006లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారమే అప్పటికి రూ.2,610.38 కోట్లు అక్రమ డిపాజిట్లు సేకరించినట్లు వెల్లడైంది. హెచ్యూఎఫ్గా తాము డిపాజిట్లు సేకరించవచ్చంటూ రామోజీ చేసిన వితండవాదాన్ని ఆర్బీఐ అప్పట్లోనే సమ్మతించలేదు. సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్‌యూఎఫ్‌లు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. తన ఆర్థిక అక్రమాల వ్యవహారం బట్టబయలు కావడంతో రామోజీ అనివార్యంగా తప్పిదాలను అంగీకరించారు. డిపాజిట్‌దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని, మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను మూసి వేస్తామని ప్రకటించారు. అక్రమ డిపాజిట్ల వివరాలు వెల్లడించం.. 2006 నాటికే 32,385 మంది నుంచి రూ.2,610.38 కోట్లు డిపాజిట్లుగా సేకరించామని పేర్కొన్న రామోజీరావు 2008లో కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తాము ఇంకా చెల్లించాల్సిన డిపాజిట్లు రూ.1,864.10 కోట్లు అని వెల్లడించారు. మరి మిగతా రూ.746.28 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయో ఆయన వెల్లడించలేదు. మరోవైపు తాము సేకరించిన డిపాజిట్లను పూర్తిగా చెల్లించేశామని 2012 తరువాత రామోజీ తాపీగా ప్రకటించారు. దీనిపై ఉండవల్లి అరుణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. డిపాజిట్లు ఎవరెవరి నుంచి ఎంతెంత సేకరించారు..? ఎవరెవరికి ఎంతెంత డిపాజిట్లు ఏయే తేదీల్లో చెల్లించారు...? నగదు రూపంలో చెల్లించారా? చెక్కుల రూపంలో చెల్లించారా? అనే వివరాలు వెల్లడించేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ వాస్తవాలు ఏమిటో వెలికి తీసేందుకు ప్రయత్నించాల్సి ఉండగా... నాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంగానీ, ఆ తరువాత చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ సర్కారుగానీ ఉద్దేశపూర్వకంగానే మౌనం దాల్చాయి. తద్వారా రామోజీరావు ఆర్థిక అక్రమాలకు పరోక్షంగా వత్తాసు పలికాయి. దాంతో రామోజీరావు తాను సేకరించిన అక్రమ డిపాజిట్ల వివరాలు చెపాల్సిన అవసరం లేదంటూ వితండవాదాన్ని వినిపించారు. తమకు ఎలాంటి క్రిమినల్ లయబులిటీ లేదని వాదిస్తూ వచ్చారు. ఈ క్రమంలో 2018 డిసెంబర్ 21న (ఉమ్మడి హైకోర్టు చివరి పనిదినాన) మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. డిపాజిటర్ల ప్రయోజనాల కోసం ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన నాటి చంద్రబాబు సర్కారు ఏమీ పట్టనట్లు మౌనంగా ఉండిపోయింది. తద్వారా రామోజీ ఆర్థిక అక్రమాలకు చంద్రబాబు దన్నుగా నిలిచారు. అక్రమ డిపాజిట్లే... ఆర్థిక నేరస్తుడే: ఆర్బీఐ స్పష్టీకరణ ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్‌ను ఉల్లంఘిస్తూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి సోదాహరణంగా వివరించింది. ఆ డిపాజిట్లను ఎవరెవరికి తిరిగి చెల్లించారో.. ఎంతెంత చొప్పున చెల్లించారో వివరాలు వెల్లడించాల్సిందేనని వాదించింది. ఈ కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగానే మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. ఈ కేసులో పార్టీ పర్సన్ ఇన్చార్జ్గా ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ సెక్షన్ 45 ఎస్ కింద హెచ్‌యూఎఫ్ సంస్థలు డిపాజిట్లు సేకరించవచ్చా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫు న్యాయవాది రమేశ్‌బాబు తన వాదనలు వినిపిస్తూ ‘ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్ ప్రకారం ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మినహా ఇతర సంస్థలు, వ్యక్తులు డిపాజిట్లు సేకరించకూడదు. హెచ్‌యూఎఫ్ కూడా డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదు. కాబట్టి హెచ్‌యూఎఫ్ పేరిట మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్లను సేకరించడం అక్రమమే, చట్ట విరుద్ధమే. రామోజీ ఆర్థిక నేరస్తుడే ’అని విస్పష్టంగా తేల్చి చెప్పారు. దీంతో ఈ కేసులో రిజర్వు బ్యాంక్‌ను కూడా పార్టీగా చేర్చి సుప్రీంకోర్టు విచారణను కొనసాగించింది. కేసును నిలబెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కేసు విషయంలో డిపాజిట్‌దారుల ప్రయోజనాలను కాపాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు వ్యతిరేకంగా ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది. దీంతో ఈ కేసు నీరుగారిపోకుండా చూడగలిగింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ వసూలు చేసిన అక్రమ డిపాజిట్లు వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు గత ఏడాది ఆదేశించింది. ‘ఈనాడు’కు వ్యతిరేకంగా ఉండొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం ఎప్పటి మాదిరిగానే పత్రికా స్వేచ్ఛ ముసుగులో తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు రామోజీ వేసిన ఎత్తుగడను సుప్రీంకోర్టు తిప్పికొట్టింది. ఈనాడు పత్రికకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం కాబట్టే ఈ కేసు విషయంలో ఇంత పట్టుబడుతోందని రామోజీ తరపున ప్రముఖ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, లూథ్రా, అభిషేక్‌మను సింఘ్వీలు వాదించినా ఫలితం లేకపోయింది. ఈ అంశానికి, అక్రమ డిపాజిట్లకు సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ఉండొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఎన్నికలు ఉన్నందునే ఈ కేసుపై ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోందన్న రామోజీ తరపు న్యాయవాదుల వాదనలతో అత్యున్నత న్యాయస్థానం సమ్మతించలేదు. ‘ఎన్నికలు ఉంటే ఈనాడుకు ఏమైంది? ఈనాడు ఏమీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కదా..? ఈనాడు కేవలం ఓ పత్రికే కదా..? ఎన్నికలతో ఏం సంబంధం?’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో ఉండవల్లి అరుణ్ కుమార్‌పైకి నెపాన్ని నెట్టివేసేందుకు రామోజీ తరపు న్యాయవాదులు విఫలయత్నం చేశారు. ఉండవల్లి ఓ రాజకీయ నేత అని పేర్కొంటూ గతంలో హైకోర్టు తీర్పుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ తెలుగులో ఉన్న వీడియో రికార్డులు తర్జుమా చేసి మరీ వినిపించారు. అయితే న్యాయస్థానాల తీర్పుపై విశ్లేషించవచ్చని, అదేమీ తప్పు కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానాల తీర్పులపై విశ్లేషణలు జరగాలనే తాము కోరుకుంటామని తెలిపింది. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి చదువుకున్న వ్యక్తులు విశ్లేషిస్తే మరింత మంచిదని కూడా వ్యాఖ్యానించింది. మేమే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నాం కదా...? అంటే న్యాయస్థానాల తీర్పుపై విశ్లేషించినట్లే కదా? అని ప్రశ్నించింది. దాంతో తప్పించుకునేందుకు రామోజీ వేసిన అన్ని ఎత్తుగడలు బెడిసికొట్టాయి. అక్రమ డిపాజిట్ల కేసును తెలంగాణ హైకోర్టు ఆరు నెలల్లో విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యావజ్జీవ ఖైదు...రెండింతల జరిమానా! మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో నేరం నిరూపితమైతే రామోజీరావుకు రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. దీంతోపాటు ఆయన సేకరించిన అక్రమ డిపాజిట్లు రూ.2,600 కోట్లకు రెట్టింపు జరిమానా విధించవచ్చన్నారు. దీన్నిబట్టి రామోజీకి రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్షతో పాటు రూ.5,200 కోట్ల జరిమానా చెల్లించాలని తీర్పు వెలువడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
మార్గదర్శి కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ, సాక్షి: సుప్రీం కోర్టులో మార్గదర్శికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని.. ఇందుకుగానూ నిజాలు నిగ్గు తేల్చాలంటూ తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి డిపాజిట్ల కేసు రిఫర్ చేస్తూ తీర్పు ఇచ్చింది. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా గత వాదనల ఆధారంగా ద్విసభ్య బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. ‘‘డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలి. పబ్లిక్ నోటీసు ఇచ్చి.. ఇంకా ఎవరైనా డిపాజిటర్లకి మనీ ఇంకా తిరిగి ఇవ్వలేదా? అనేది తెలుసుకోవాలి. ఇందుగానూ హైకోర్టు మాజీ జడ్జి ఒకరిని నియమించాలి. .. ఏపీలో కూడా డిపాజిటర్లు ఉన్నారు కాబట్టే అనుమతి ఇచ్చాం. మేము మెరిట్స్‌లోకి వెళ్ళడం లేదు. మేము తెలంగాణ హై కోర్టుకు రిఫర్ చేస్తున్నాం. రెండు మూడు నెలల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరపాలి. ఆర్ బీఐ కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాలి. ఉండవల్లి అరుణ్‌కుమార్ కూడా హైకోర్టుకు సహకరించాలి.తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ఆర్బీఐ, అలాగే.. ఉండవల్లి ఈ కేసులో వాదనలు వినిపించాలి.ఆరు నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి. ఈ కేసుపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం. తెలంగాణ హైకోర్టు లో వాదనలు వినిపించండి’’ అని ద్విసభ్య ధర్మాసనం తీర్పు ద్వారా స్పష్టం చేసింది. ఏపీ వాదనలు: కేసు నడుస్తుండగా రూ,2,300 కోట్లు అదనపు డిపాజిట్లు సేకరించారు ఏపీ తరఫున వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలి మార్గదర్శి వాదనలు: 2.7 లక్షల డిపాజిటర్లు ఉన్నారు అందరికీ డబ్బు తిరిగి చెల్లించాము సుప్రీం కోర్టులో ఉండవల్లి.. ‘‘రామోజీ రావు అంటే అందరికీ భయం.. రామోజీ రావుకు నేనంటే భయం’’. ‘ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేకంగా ఉంది’ : రామోజీ తరఫు న్యాయవాదులు ‘‘అయితే ఎంటీ... ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము ఆదేశించలేం’’: సుప్రీం కోర్టు తీర్పు తర్వాత సాక్షి టీవీతో ఉండవల్లి మాట్లాడుతూ.. తన 17 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘సుప్రీం కోర్టు తీర్పుతో మా వాదన నిజమే అని రుజువైంది. దేశంలో న్యాయం బతికే ఉందని తేటతెల్లమైంది. మార్గదర్శి డిపాజిట్లు సేకరించడమే నేరం. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశామంటే చెల్లదు. 45Sకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించడమే చట్టవిరుద్ధం. చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణకు రెండేళ్ల జైలు శిక్ష ఉంటుంది. మా తరఫున సుప్రీంకోర్టు మార్గదర్శిని అనేక ప్రశ్నలు అడిగింది. ఈ కేసు గురించి నేను మాట్లాడకుండా చేయాలన్న రామోజీరావు ప్రయత్నం విఫలమయ్యింది. ఆఖరికి.. నాపై గ్యాగ్ ఆర్డర్ తేవాలని ప్రయత్నం చేశారు. కానీ, నా పోరాటం వృథా కాలేదు’’ అని ఉండవల్లి పేర్కొన్నారు. నేపథ్యం ఇదే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం–1934లోని సెక్షన్ 45(ఎస్) నిబంధనను ఉల్లంఘించి, దాదాపు రూ.2300 కోట్ల మేర డిపాజిట్లను సేకరించిందన్నది రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై ఉన్న ప్రధాన అభియోగం. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ 2006లో మార్గదర్శి రూ.2,300 కోట్ల డిపాజిట్లను సేకరించిదని ఉండవల్లి అప్పట్లో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చర్యలకు సిద్ధమైన అప్పటి ఏపీ ప్రభుత్వం ఓ ప్రత్యేక అధికారిని నియమించింది. ఈ క్రమంలో 2008లో ప్రభుత్వం తరఫున కంప్లైంట్ దాఖలు అవ్వగా.. దాన్ని కొట్టివేయాలంటూ పదేళ్ల తరువాత మార్గదర్శి సంస్థ ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో 2018 డిసెంబర్ 31 మార్గదర్శిపై క్రిమినల్ కేసును కొట్టి వేస్తూ.. హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో చట్టాన్ని తప్పుదోవ పట్టించి మార్గదర్శిపై క్రిమినల్ కేసు కొట్టివేశారని, ఆ తీర్పును సమీక్షించాలని 2019లో ఉండవల్లి సుప్రీం కోర్టులో ఆశ్రయించారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసులో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను భాగస్వామ్యం చేయాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు కూడా. అప్పటి నుంచి ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. గత విచారణే కీలకం మార్గదర్శి సంస్థ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని గత విచారణలో(ఫిబ్రవరి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. సెక్షన్ 45-Sకి వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని, మార్గదర్శి కూడా ఇలాగే డిపాజిట్లు సేకరించిందని ఆర్బీఐ తెలిపింది. మరోవైపు.. కోర్టులో కేసు నడుస్తుండగానే ఉండగానే అదనంగా మరో రూ. 2 వేల కోట్లు వసూలు చేశారని, మొత్తం 4,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని ఏపీ ప్రభుత్వం సైతం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇంకోవైపు.. ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా.. లేదా? అన్నది ముఖ్యం కాదని, చట్ట విరుద్ధంగా సేకరించారా.. లేదా? అన్నదే ముఖ్యమని అరుణ్ కుమార్ వాదించారు. -
మార్గదర్శి అక్రమాల కేసులో నేడు కీలక విచారణ
సాక్షి, ఢిల్లీ: రామోజీరావు మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో నేడు(మంగళవారం) కీలక విచారణ జరగనుంది. చట్ట విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. ఈ క్రమంలో గత విచారణలో కేసు ఊహించని మలుపు తిరిగిన దృష్ట్యా.. ఇవాళ్టి విచారణపై ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మార్గదర్శి సంస్థ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని గత విచారణలో(ఫిబ్రవరి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. సెక్షన్ 45-Sకి వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని, మార్గదర్శి కూడా ఇలాగే డిపాజిట్లు సేకరించిందని ఆర్బీఐ తెలిపింది. మరోవైపు.. కోర్టులో కేసు నడుస్తుండగానే ఉండగానే అదనంగా మరో రూ. 2 వేల కోట్లు వసూలు చేశారని, మొత్తం 4,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని ఏపీ ప్రభుత్వం సైతం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇంకోవైపు.. ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా.. లేదా? అన్నది ముఖ్యం కాదని, చట్ట విరుద్ధంగా సేకరించారా.. లేదా? అన్నదే ముఖ్యమని అరుణ్ కుమార్ వాదించారు. ఈ వాదనల తదనంతరం సమగ్ర విచారణ కోసం నేటికి విచారణను వాయిదా వేసింది కోర్టు. ఇవాళ జరగబోయే విచారణ మార్గదర్శి కేసును మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నేడు ఈ పిటిషన్‌పై విచారణ జరపనుంది. -
రామోజీకి భారీ షాక్.. ఫలించిన ఉండవల్లి పోరాటం
-
పోలవరంపై చంద్రబాబు అంతులేని నిర్లక్ష్యం
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అంతులేని నిర్లక్ష్యం నెలకొందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రజలను బస్సుల్లో తీసుకు వెళ్లి మరీ భజనలు చేయించడం పైనే చంద్రబాబు దృష్టి పెట్టారు తప్ప.. చేసిందేమీ లేదని విమర్శించారు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు 70:30 నిష్పత్తిలో నిర్మించాల్సి ఉన్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొంది, నేటికి పదేళ్లు పూర్తయిందన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన వ్యవహారం పూర్తిగా అప్రజాస్వామికమన్నారు. బిల్లు ఆమోదం విషయంలో లోక్‌సభ ప్రచురించిన డాక్యుమెంట్ ఆధారంగా తాను కోర్టును ఆశ్రయించానని చెప్పారు. బిల్లు ఆమోదం తప్పని తనకు మద్దతుగా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని అన్నారు. ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి మన్మోహన్సింగ్ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. 2015 డిసెంబర్ నాటికి నీతిఆయోగ్ తయారు చేసిన నివేదిక ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు రామచంద్రరావు కోరినప్పటికీ కేంద్రం నిరాకరించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.17 వేల కోట్లు అడిగితే రూ. 4 వేల కోట్లు తగ్గించి ఇచ్చిందని, ట్యాక్స్ ఇన్సెంటివ్‌లు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 89 ఆస్తులను 58:42 నిష్పత్తిలో పంచుకోవాల్సిందిగా తొమ్మిదో షెడ్యూల్లో పెట్టారని, దీనిపై ఇంతవరకూ ఎటువంటి సమాధానమూ ఇవ్వలేదని అన్నారు. కొట్టుకు చావండని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం వదిలేసిందని దుయ్యబట్టారు. ఏ ఇన్స్టిట్యూట్ కట్టాలన్నా కేంద్రం నిధులు మంజూరు చేయడం లేదన్నారు. తెలంగాణ, ఆంధ్రా మధ్య తేలాల్సిన ఆస్తుల విలువ రూ. 1.46 లక్షల కోట్లు ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన రాజ్యాంగబద్ధమా, కాదా అనే విషయంపై పార్లమెంటులో చర్చ జరగాలన్నారు. రాష్ట్రపునర్విభజనపై సుప్రీంకోర్టులో వేసిన కేసును అడ్వాన్స్ చేయిస్తే కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా అఫిడవిట్ ఫైల్ చేయాల్సి ఉంటుందని ఉండవల్లి చెప్పారు. -
ఉండవల్లి పిటిషన్ పై వాయిదా
-
చంద్రబాబు ఆరోగ్యంపై ఉండవల్లి కామెంట్స్
-
స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి 100% జరిగింది..!