మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదాపై చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలను పలువురు రాజకీయ నేతలు ఎండగడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్నారు. గతంలో ప్రత్యేక హోదాతో ఏం లాభమని చంద్రబాబు ప్రశ్నించారని మాజీ ఎంపీ గుర్తు చేశారు. ఎన్నికలకు ఏడాది ముందు ప్రత్యేకహోదాపై రాజకీయం చేస్తున్నాడని.. మరోసారి అధికారంలోకి రావడానికే ఈ ప్రయత్నాలని ఎద్దేవ చేశారు. అంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వమని బీజేపీ తేల్చిచెప్పిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వస్తుందని స్పష్టం చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోయేదిలేదని తేల్చిచెప్పారు. ఏపీ విభజన తప్పుకాదని.. జరిగిన తీరు రాజ్యాంగ విరుద్దమని, నిబంధనలకు విరుద్దంగా బిల్లు పాస్ చేశారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు కంటే ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే ప్రజాదరణ ఎక్కువగా ఉందని మాజీ ఎంపీ తెలిపారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ర్‌సీపీ గెలుస్తుందని అందరూ భావించారని.. కానీ ఎన్నికల మేనేజ్మెంట్లో దిట్ట అయిన చంద్రబాబు రాజకీయ సమీకరణాలు మార్చేశాడని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ రాష్ట్రమంతా తిరిగిన తర్వాత అతడి బలం ఏంటో తెలుస్తుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment