
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేంద్రం చేస్తున్న అన్యాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రధాన కారణమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ధ్వజమెత్తారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కలసి ఉన్న చంద్రబాబు ఎన్నడూ ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదన్నారు.
బీజేపీతో చంద్రబాబుకు చెడింది కాబట్టి ఇప్పుడు ఆయన కేంద్రాన్ని అడుక్కొని ఏం లాభం అని ప్రశ్నించారు. ఏపీకి హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పిన రోజే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలని అన్ని పార్టీలు కోరినా పట్టించుకోని బాబు.. రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు అఖిలపక్షం పెడితే ఎవరొస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment