‘లోకేశ్‌ను పప్పు అనడం కరెక్టే’ | undavalli arun kumar comments on nara lokesh | Sakshi
Sakshi News home page

‘లోకేశ్‌ను పప్పు అనడం కరెక్టే’

Published Wed, Apr 26 2017 2:12 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

‘లోకేశ్‌ను పప్పు అనడం కరెక్టే’ - Sakshi

‘లోకేశ్‌ను పప్పు అనడం కరెక్టే’

రాజమహేంద్రవరం: మంత్రి నారా లోకేశ్‌ను పప్పు అనడంలో తప్పేంలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు సర్కారు అతిగా స్పందించిందని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అనేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన రాలేదని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 2018 నాటికి గ్రావిటీ ద్వారా తాగునీరు వస్తుందని చెబుతున్నారని, అలా చేయగలిగితే ఓట్లన్నీ మీకే పడతాయని చెప్పారు. కాఫర్‌ డ్యామ్‌ ద్వారా నీళ్లు ఇస్తామంటున్నారని, అసలు కాఫర్‌ డ్యామ్‌ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు సాధ్యం కాదని ఉండవల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement