copper dam
-
చంద్రబాబు తప్పిదం వల్లే.. జీవనాడి.. జీవచ్ఛవం!
-
సిగ్గుచేటు.. వరదల్లో జెండాలతో రాజకీయాలు చేస్తారా: మంత్రి అంబటి
సాక్షి, కర్నూలు: వర్షాల నేపథ్యంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్‌పై ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి. చంద్రబాబు పాలనలో వర్షాలు పడటం కానీ, గేట్లు ఎత్తడంగానీ జరగలేదు. వరద బాధితులు ఇబ్బందులు పడుతుంటే ,చంద్రబాబు మాత్రం పార్టీ జెండాలతో కార్యకర్తలతో రాజకీయాలు చేస్తున్నాడు. గోదావరి వరద బాధితులతో చంద్రబాబు టీడీపీ జెండాలతో వెళ్తారా? ఇది సిగ్గుచేటు కాదా?. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. నదుల్లో నీళ్లు ఫుల్‌గా ఉన్నాయి. అన్ని ప్రాజెక్టులు నిండుతాయి. వరదలు ఈ ఏడాది చాలా ముందుగా వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు జాప్యానికి చంద్రబాబే కారణం. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం టీడీపీ ప్రభుత్వం చేసిన చారిత్రాత్మక తప్పిదం. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ ఎవరైనా నిర్మిస్తారా?. కాఫర్ డ్యామ్ పూర్తయిన తర్వాతే డయాఫ్రమ్ నిర్మించాలని నిపుణులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే పనులు వేగంగా పూర్తి చేస్తున్నాము. చంద్రబాబు అహంతోనే పోలవరం నిర్మాణంలో జాప్యం జరిగింది’’ అని ఆరోపించారు. ఇది కూడా చదవండి: రాష్ట్రపతి ఎన్నిక; టీడీపీ డబుల్ గేమ్ -
వంద మహానాడులు చేసినా బాబు అధికారంలోకి రాలేడు..
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మంత్రి అంబటి రాంబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబువి దుర్మార్గమైన రాజకీయలు. చంద్రబాబు ఓ విష సర్పం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడమే తప్ప మహానాడులో చేసిందేమీ లేదు. బడుగు, బలహీన వర్గాలకు చంద్రబాబు ఏమీ చేయలేదు. అది మహానాడు కాదు.. మోసపునాడు. వంద మహానాడులు చేసినా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాలేడు. వచ్చే ఐదేళ్లు కూడా చంద్రబాబుకు నిద్రపట్టదు. చంద్రబాబు తప్పిదం వల్లే డయాఫ్రమ్ వాల్ కూలిపోయింది. కాఫర్ డ్యామ్ పూర్తికాకముందే డయా ఫ్రమ్ వాల్ నిర్మించారు. చంద్రబాబు చారిత్రాత్మక తప్పు చేయడం వల్లే ఇలా జరిగింది. మంత్రి ఇళ్లు దగ్ధమైతే మహానాడులో ఖండించారా?. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకంగా మహానాడు జరుగుతోంది’’ అని ఆరోపించారు. -
సహజ మార్గంలోకి గోదావరి ప్రవాహం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు వద్ద ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణంతో గోదావరి సహజ ప్రవాహ మార్గానికి అడ్డుకట్ట వేసి.. సింగన్నపల్లి ఎగువన అప్రోచ్ చానల్, స్పిల్ వే, స్పిల్ చానల్, పైలట్ చానల్ మీదుగా మళ్లించిన గోదావరి ప్రవాహం శనివారం పోలవరానికి దిగువన నదీ సహజ మార్గంలోకి ప్రవేశించింది. ప్రవాహ జలాలు ధవళేశ్వరం బ్యారేజీ వైపు దూసుకెళ్తున్నాయి. దీంతో ఈ నెల 15న గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేయడానికి మార్గం సుగమమైంది. పోలవరం ప్రాజెక్టులో 194.6 టీఎంసీలను నిల్వ చేయడానికి వీలుగా చేపట్టిన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) నిర్మాణానికి వీలుగా గోదావరిని స్పిల్‌వే వైపు మళ్లించేందుకు ఎగువ కాఫర్ డ్యామ్‌ను ప్రభుత్వం నిర్మించింది. స్పిల్‌వే వైపు గోదావరిని మళ్లించేందుకు అప్రోచ్ చానల్ తవ్వకం పనులు కొలిక్కి రావడంతో శుక్రవారం అడ్డుకట్టను తెంచి.. 2.18 కి.మీ. పొడవున తవ్విన అప్రోచ్ చానల్ మీదుగా ప్రవాహాన్ని దారి మళ్లించారు. సుమారు పది వేల క్యూసెక్కుల ప్రవాహం రివర్ స్లూయిజ్‌ల ద్వారా స్పిల్ చానల్‌కు చేరుతోంది. 4.42 కి.మీ. పొడవున ఉన్న స్పిల్ చానల్, పైలట్ చానల్ నిండితేనే గోదావరి ప్రవాహం సహజ మార్గంలోకి ప్రవేశిస్తుంది. ఈ చానళ్లు నిండాలంటే కనీసం ఒక టీఎంసీకి పైగా అవసరం. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్పిల్ చానల్, పైలట్ చానల్ నిండటంతో ప్రవాహం తిరిగి సహజ మార్గంలోకి ప్రవేశించింది. కాఫర్ డ్యామ్‌కు ఎగువన సహజ మార్గం నుంచి అప్రోచ్ చానల్, స్పిల్‌వే, స్పిల్ చానల్, పైలట్ చానల్ మీదుగా 6.6 కి.మీ. పొడవున దారి మళ్లిన గోదావరి 24 గంటలపాటు ప్రవహించి తిరిగి సహజ మార్గంలోకి ప్రవేశించడం గమనార్హం. పైలట్ చానల్ ద్వారా సుమారు 10 వేల క్యూసెక్కులు ప్రవాహం సహజ మార్గం మీదుగా ధవళేశ్వరం బ్యారేజీ వైపు వెళుతోంది. ఆదివారం సాయంత్రానికి ప్రవాహం ధవళేశ్వరం బ్యారేజీని చేరుతుంది. గోదావరి పరీవాహక ప్రాంతంలో ప్రధానంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రోజురోజుకూ ప్రవాహ ఉద్ధృతి పెరగనుంది. ఎగువ కాఫర్ డ్యామ్ ప్రభావం వల్ల నీటిమట్టం 25 అడుగుల ఎత్తు దాటితే.. పోలవరం స్పిల్ వే రేడియల్ గేట్ల మీదుగా తొలిసారిగా గోదావరి వరద జలాలు దిగువకు చేరతాయి. -
‘మరో మూడేళ్లలో పోలవరం పూర్తి’
సాక్షి, విజయవాడ : పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మరో మూడేళ్ళు పడుతుందని ప్రాజెక్ట్ అథారిటీ సీఈవో రాజేంద్ర కుమార్ జైన్ అన్నారు. కాఫర్ డ్యాం పాక్షికంగానే పూర్తైందని పేర్కొన్నారు. పలు కీలక అంశాలపై చర్చించేందుకు ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం ముగిసన నేపథ్యంలో రాజేంద్ర కుమార్ జైన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... కాఫర్ డ్యాం రక్షణ పనుల పురోగతి, వరద అంచనా వ్యవస్థలపై చర్చించామని తెలిపారు. ప్రస్తుతం 10 వేల క్యూసెక్కుల వరదను అంచనా వేస్తున్నామని...దీని వలన కాఫర్ డ్యాంకు ఎటువంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. అయితే వరదలు రాకముందే పనులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు శుక్రవారం అక్కడికి వెళ్తున్నామని తెలిపారు. ఇంకా ఆడిట్ జరుగుతూనే ఉంది.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికై కేంద్రం నుంచి ఇప్పటి వరకు రూ. 6,700 కోట్లు విడుదలయ్యాయని సీఈవో రాజేంద్ర కుమార్ జౌన్ పేర్కొన్నారు. నిధుల కోసం రాష్ట్రం నుంచి కేంద్రానికి బిల్లులు పంపే విషయంలో కొన్ని ఫార్మాలిటీస్‌ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. ఈ క్రమంలో 2014 వరకు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు చేసిన వ్యయంపై కేంద్రం ఆడిట్ చేసిందని వెల్లడించారు. ఇందులో భాగంగా ఆర్ అండ్ ఆర్ కింద రూ. 1300 కోట్ల వ్యయంపై ఇంకా ఆడిట్ జరుగుతూనే ఉందని పేర్కొన్నారు. అదే విధంగా ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పెంచడంపై కేంద్ర పరిధిలోని ఎస్టిమేషన్ కమిటీ పరిశీలిస్తోందని.. ఈ విషయంపై ఇప్పటికే ఒక మీటింగ్ కూడా జరిగిందని తెలిపారు. పెరిగిన అంచనా వ్యయాలపై మరిన్ని వివరాలు ఇవ్వాలని ఈ కమిటీ రాష్ట్రాన్ని కోరినట్లు వెల్లడించారు. -
పోలవరం సమీక్ష
-
ప్రణాళికా లోపానికి పరాకాష్ట
పోలవరం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: పోలవరం ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్నామని, యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా గురువారం పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకున్న జగన్మోహన్రెడ్డి పోలవరం పనులపై మూడుసార్లు ఏరియల్ సర్వే నిర్వహించారు. తర్వాత ప్రాజెక్టు ప్రాంతంలో కలియతిరిగారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్.. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్(ఈసీఆర్ఎఫ్), డయాఫ్రమ్ వాల్, దిగువ కాఫర్ డ్యామ్ పనులను నిశితంగా పరిశీలించారు. వాటి స్థితిగతులపై జలనవరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, సీఈ శ్రీధర్‌లను ప్రశ్నించారు. పనుల్లో పురోగతి లేకపోవడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిపుణుల కమిటీని పంపించి ఇప్పటివరకు చేసిన పనులపై ఆడిటింగ్ చేయిద్దామన్నారు. పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అవసరమైన వనరులు సమకూరుస్తామని స్పష్టం చేశారు. రెండో దశలో మొత్తం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పని చేద్దామని అధికారులకు జగన్ పిలుపునిచ్చారు. పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత కాన్ఫరెన్స్ హాల్లో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, మంత్రులు కన్నబాబు, విశ్వరూప్, తానేటి వనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి కార్యదర్శి సొల్మన్ ఆరోగ్యరాజ్, అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డిలతో కలిసి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అప్పుడెంత.. ఇప్పుడెంత? పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌లో 58.19 శాతం, కుడి కాలువ పనులు 91.64, ఎడమ కాలువ పనులు 69.33 శాతం.. వెరసి మొత్తం ప్రాజెక్టు పనులు 66.77 శాతం పూర్తయినట్లు ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, సీఈ శ్రీధర్‌లు జగన్మోహన్రెడ్డికి వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. 2014కు ముందు పోలవరం ప్రాజెక్టు ఎంత పరిమాణం పూర్తయింది? 2014 నుంచి 2019 వరకూ ఎంత పరిమాణం పూర్తయిందో చెప్పాలని అన్నారు. పనుల పరిమాణం లెక్కలు లేవని అధికారులు బదులిచ్చారు. ఆ గణాంకాలను తన ముందుంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అనంతరం అంశాల వారీగా లోతుగా సమీక్షించారు. గురువారం పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షలో ముఖ్యమంత్రి, అధికారుల మధ్య సంభాషణ సీఎం జగన్: స్పిల్ వే, స్పిల్ ఛానల్లో ఇప్పటికీ 156.54 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని తవ్వకం, 8.53 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు మిగిలిపోయాయి. రోజుకు ఎన్ని క్యూబిక్ మీటర్ల మట్టి, కాంక్రీట్ పనులు చేయగలరు? సీఈ శ్రీధర్: ఏప్రిల్ వరకూ రోజుకు గరిష్టంగా 40 వేల క్యూబిక్ మీటర్ల మట్టి పని, సగటున 5 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేశాం. కానీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆదేశాల మేరకు మే నుంచి పనులు ఆపేశాం. జగన్: స్పిల్ వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యామ్ పనులను మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారు? ఈఎన్సీ: అక్టోబర్ వరకూ గోదావరిలో వరద ఉంటుంది. అప్పటిదాకా పనులు చేపట్టడం సాధ్యం కాదు. జగన్: నాలుగు నెలల సమయం వృథా అన్నమాట. నాయకులకు అధికారులు వాస్తవాలు చెప్పాలి. తప్పుదోవ పట్టించకూడదు. ప్రణాళిక లేకపోవడం వల్లే కాఫర్ డ్యామ్ కట్టారు. స్పిల్ వేను పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు వాస్తవాలు చెప్పండి. స్పిల్ వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యామ్‌ను ఎప్పటిలోగా పూర్తి చేయొచ్చు. సీఈ శ్రీధర్: కేంద్ర జలసంఘం నుంచి కొన్ని డిజైన్లు ఆమోదం పొందాల్సి ఉంది. ఆ డిజైన్లు వస్తే మూడు లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ తగ్గుతుంది. అంటే.. 5.53 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు మాత్రమే చేయాలి. స్పిల్ వే స్తంభాలు(ఫియర్స్)కు క్రిటికల్ కాంక్రీటింగ్ చేయాల్సి ఉంటుంది. ‘నవయుగ’ సంస్థ ప్రతినిధి శ్రీధర్: మార్చి నాటికి స్పిల్ వే, స్పిల్ చానల్‌ను పూర్తి చేస్తాం. జగన్: స్పిల్ వేకు గేట్ల కోసం 18 వేల టన్నుల స్టీల్ అవసరమైతే ఇప్పటిదాకా 12,583 టన్నుల స్టీల్ సేకరించారు. మిగతాది ఎప్పటిలోగా సేకరిస్తారు? హైడ్రాలిక్ సిలిండర్లు, హాయిస్ట్‌లను ఎప్పటిలోగా తెప్పిస్తారు? 2020 మే నాటికి గేట్ల పనులు పూర్తి చేయగలరా? ‘బీకెమ్’ సంస్థ ప్రతినిధి: 2020 ఫిబ్రవరి నాటికి స్పిల్ వే ఫియర్స్‌ను పూర్తి చేస్తే.. మే నాటికి గేట్ల పనులు పూర్తి చేస్తాం. జర్మనీ నుంచి హైడ్రాలిక్ సిలిండర్లు, ఇటలీ నుంచి హాయిస్ట్‌లను దిగుమతి చేసుకుంటున్నాం. జగన్: 2020 మే నాటికి స్పిల్ వే గేట్లు బిగించే పనులు పూర్తి చేయాల్సిందే. స్పిల్ వే, స్పిల్ ఛానల్‌కు సమాంతరంగా కాఫర్ డ్యామ్ పనులు 2020 మే నాటికి పూర్తి చేయాలి. లేకపోతే మళ్లీ ఇప్పటి పరిస్థితే ఉత్పన్నమవుతుంది. వీటికి సమారంతంగా ఈసీఆర్ఎఫ్ పనులు చేపట్టవచ్చు కదా? ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? ‘నవయుగ’ ప్రతినిధి శ్రీధర్: 2020 ఫిబ్రవరి నుంచి ఈసీఆర్ఎఫ్ పనులు ప్రారంభించి.. పది నెలల్లో అంటే 2020 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం. జగన్: పది నెలలు కాదు.. 12 నెలల్లో అంటే 2021 ఫిబ్రవరి నాటికి ఈసీఆర్‌ఎఫ్‌ను పూర్తి చేయండి. 2021 మే నాటికి జలాశయంలో 39 మీటర్ల మేర నీటిని నిల్వ చేయవచ్చు. అప్పుడు ఎన్ని మీటర్ల కాంటూర్ వరకూ ఎన్ని గ్రామాలు ముంపునకు గురువుతాయి? ఈఎన్సీ: జలాశయంలో 222 గ్రామాలు ముంపునకు గురువుతాయి. 39 మీటర్ల మేర జలాశయంలో నీటిని నిల్వ చేస్తే 41.15 మీటర్ల కాంటూర్ పరిధి వరకూ 113 ముంపు గ్రామాలకు పునరావాసం కల్పించాలి. 25 వేల నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. జగన్: తొలి దశలో 113 గ్రామాల నిర్వాసితులకు 2021 మేలోగా పునరావాసం కల్పించాల్సిందే. ఇందుకు ఎంత డబ్బులు అవసరమో చెప్పండి? ఆర్ఆండ్ఆర్ కమిషనర్ రేఖారాణి: 45 పునరావాస కాలనీల నిర్మాణం చేపట్టాం. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తాం. జగన్: పునరావాస కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లు నాణ్యంగా లేవని నిర్వాసితులు ఫిర్యాదులు చేస్తున్నారు. నిర్వాసితులకు ఇళ్లు నిర్మించి ఇవ్వకుండా, అందుకు సమానమైన డబ్బులు ఇవ్వండి. కాలనీల్లో ప్లాట్లు కేటాయించండి.. నిర్వాసితులు ఇళ్లు నిర్మించుకుంటారు. అంతర్గత రహదారులు, మురుగునీటి కాలువలు, విద్యుత్ సౌకర్యం, పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించండి. రేఖారాణి: పునరావాస కాలనీ నిర్మాణాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించాం. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి: ఇళ్ల నిర్మాణంపై కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. జగన్: అందుకే వాటికి అయ్యే వ్యయాన్ని నిర్వాసితులకు ఇవ్వమంటున్నా. పునాది వేసుకుంటే ఇంత.. కిటికీల వరకూ గోడలు నిర్మిస్తే ఇంత.. రూఫ్ లెవల్ వరకూ నిర్మిస్తే ఇంత.. పైకప్పు వేస్తే ఇంత అని నిర్ణయించి నిర్వాసితులకే ఇవ్వండి. దీనివల్ల ఒక్కో నిర్వాసితుడిపై రూ.60 వేల మేర జీఎస్టీ భారం తగ్గుతుంది కదా? రేఖారాణి: అలాగే చేస్తాం. జగన్: గిరిజన నిర్వాసితులకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చాం. 2005లో సేకరించిన భూమికి ఎకరానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నాం. ఈ రెండు హామీల అమలుకు ఎంత ఖర్చవుతుందో ప్రతిపాదనలు పంపండి. జూలై నుంచి అక్టోబర్ వరకూ నాలుగు నెలల్లో వరదల వల్ల ప్రాజెక్టు పనులు చేయలేరు కాబట్టి నిపుణుల కమిటీని పంపించి ఇప్పటివరకు చేసిన పనులపై ఆడిటింగ్ చేయిద్దాం. పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అవసరమైన వనరులు సమకూరుస్తాం. రెండో దశలో మొత్తం నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తాం. ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి.. కుడి, ఎడమ కాలువల ఆయకట్టుతోపాటు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పని చేద్దాం. పోలవరం ప్రాజెక్టు పనుల గురించి అధికారులతో మాట్లాడుతున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు ‘‘పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసి ఇదిగో అప్పుడు కుడి కాలువకు గ్రావిటీపై నీళ్లు ఇస్తాం.. ఇదిగో ఇప్పుడు చేస్తామని మాట మారుస్తూ వచ్చారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేయకుండానే కాఫర్ డ్యామ్ పనులు చేపట్టడం అతి పెద్ద తప్పు. ఇటు కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేయలేకపోయారు. అటు స్పిల్ వే, స్పిల్ ఛానల్ కూడా పూర్తి చేయలేకపోయారు. పోనీ కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేసి కుడి కాలువకు నీళ్లు ఇచ్చే ఉద్దేశమైనా ఉందా అంటే అదీ లేదు. అందుకు అవసరమైన టన్నెల్(కుడి అనుసంధానం), అప్రోచ్ ఛానల్ పనులు చేయకపోవడమే అందుకు నిదర్శనం. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. ప్రణాళిక లోపానికి, తప్పుడు విధానాలకు ఇదో పరాకాష్ట. జూలై నుంచి అక్టోబర్ వరకూ గోదావరికి భారీగా వరదలు వస్తాయి. కాఫర్ డ్యామ్, స్పిల్ వే, స్పిల్ ఛానల్ మీదుగా వరద ప్రవాహం దిగువకు వెళ్తుంది. దీనివల్ల నాలుగు నెలలపాటు ఎలాంటి పనులు చేపట్టడానికి అవకాశం ఉండదు’’ పోలవరం ప్రాజెక్ట్‌పై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, అధికారులు ‘‘మాపై ప్రజలు అత్యంత విశ్వాసంతో అఖండ విజయాన్ని చేకూర్చారు. మాట ఇచ్చాక తప్పకూడదు. మాపై ప్రజల్లో ఉన్న సదభిప్రాయాన్ని కోల్పోవడానికి మేం సిద్ధంగా లేము. క్షేత్రస్థాయిలో పరిస్థితులను బేరీజు వేసుకుని పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎప్పటిలోగా పూర్తి చేయవచ్చో చెప్పండి. పనులు పూర్తి చేయడానికి సరైన ప్రణాళిక వేసుకుందాం. అవసరమైన వనరులు సమకూరుస్తాం. ప్రాజెక్టును పూర్తి చేద్దాం’’ ‘‘పోలవరం స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులను నవంబర్‌లో పున:ప్రారంభించి, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాల్సిందే. 2020 మే నాటికి స్పిల్ వేకు గేట్లు బిగించే పనులు పూర్తి కావాలి. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకోవద్దు. స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు పూర్తయితేనే గోదావరి వరదను దిగువకు మళ్లించవచ్చు. లేదంటే ఇప్పటిలానే పరిస్థితి తయారవుతుంది. నాలుగు నెలల సమయం వృథా అవుతుంది. స్పిల్ వే, స్పిల్ ఛానల్‌కు సమాంతరంగా కాఫర్ డ్యామ్ పనులను 2020 మే నాటికి పూర్తి చేయాల్సిందే. 2020 ఫిబ్రవరి నుంచి ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్(ఈసీఆర్ఎఫ్) పనులు ప్రారంభించి పది నెలల్లో పూర్తి చేస్తామంటున్నారు. పది నెలల్లో కాదు.. 12 నెలల్లో అంటే 2021 ఫిబ్రవరి నాటికి ఈ పనులు పూర్తి చేయాల్సిందే. 2020 మే నాటికి తొలి దశలో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 113 గ్రామాల్లోని నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి’’ – పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి -
ప్లానింగ్ లోపమే శాపం
-
ప్రణాళిక లోపమే పోలవరానికి శాపం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి లోపం, ప్రణాళిక రాహిత్యం పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారుతోందంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కుండబద్ధలు కొట్టింది. విజయవాడలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు పనులపై పీపీఏ బుధవారమూ సమీక్ష సమావేశం నిర్వహించింది. పూణేలో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్ఎస్)లో నిర్మించిన నమూనా పోలవరం జలాశయంలో వివిధ స్థాయిలో వరదను పంపి.. ప్రయోగాలు చేసి డిజైన్లలో మార్పులు చేర్పులు చేయాలని పేర్కొంది. జనవరి మొదటి వారంలో ఢిల్లీలో నిర్వహించే డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) సమావేశంంలో పెండింగ్ డిజైన్లు, స్పిల్‌వే, కాఫర్ డ్యామ్‌ల పనులను పూర్తి చేయడంపై సమగ్రంగా చర్చించి.. నిర్ణయం తీసుకుందామని సూచించింది. ఆలోగా నమూనా డిజైన్లు సిద్ధం చేయాలని ఆదేశించింది. హెడ్ వర్క్స్‌లో స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనుల్లో 194.92 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 17.06 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మిగిలి ఉందని.. గేట్ల తయారీ పనులు పూర్తి చేశామని పీపీఏకు సీఈ శ్రీధర్ వివరించారు. మే నెలాఖరుకు నాలుగు భాగాలుగా కాఫర్ డ్యామ్ పనులు పూర్తిచేయడానికి ప్రణాళిక రచించామన్నారు. దీనిపై పీపీఏ సీఈవో ఆర్కే జైన్ స్పందిస్తూ మే నెలాఖరు నాటికి స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేయగలిగితేనే.. జూన్ రెండో వారం నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని నదిలోకి మళ్లించవచ్చునన్నారు. ఇదే సమయంలో డీడీఆర్పీ ఛైర్మన్ ఏబీ పాండ్య స్పందిస్తూ హెడ్ వర్క్స్‌కు సంబంధించిన 45 డిజైన్లలో ఇప్పటివరకూ సీడబ్ల్యూసీ 27 డిజైన్లను ఆమోదించిందని మిగతా 18 డిజైన్లు అత్యంత కీలకమైనవని, వీటిని కూడా వీలైనంత తొందరగా ఆమోదించేలా చర్యలు తీసుకుంటామని, అయితే ఇప్పటికీ కాంట్రాక్టర్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిజైన్ నమునాలు తమకు అందకపోవడాన్ని ఎత్తిచూపారు. పనుల నాణ్యతపై పెదవివిరుపు..: పోలవరం స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనుల్లో నాణ్యతపై వైకే శర్మ నేతృత్వంలోని కేంద్ర నిపుణుల కమిటీ తప్పుబట్టడంపై పీపీఏ ప్రధానంగా చర్చించింది. జలాశయం పనుల పర్యవేక్షణ, నాణ్యత పరిశీలనకు వేర్వేరు అధికారులను నియమించాలని.. కానీ ఒకే అధికారిని ఆ రెండు పదవుల్లో నియమించడాన్ని తప్పుబట్టింది. సెంట్రింగ్, షట్టరింగ్ పనులు సక్రమంగా చేయకపోవడం వల్లే స్పిల్‌వేకు పలు బ్లాక్‌లలో పగుళ్లు ఏర్పడ్డాయని, వాటిని పూడ్చడంపై సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) సూచలన ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కుడి, ఎడమ కాలువలకు నీటిని సరఫరా చేసే అనుసంధానాల (కనెక్టివిటీస్) పనుల్లో పురోగతి కన్పించకపోవడాన్ని ఎత్తిచూపింది. ఆ పనులను కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించి.. మే నాటికి పూర్తయ్యేలా చూస్తామని జలవనరుల శాఖ అధికారులు పీపీఏకు వివరించారు. ఈ సందర్భంలోనే మే నెలాఖరు నాటికి హెడ్ వర్క్స్, కాలువలు పూర్తి చేస్తామని చెబుతున్నారని, అయితే ఇప్పటికీ డిస్ట్రిబ్యూటరీ పనులు ప్రారంభించకుండా ఆయకట్టుకు నీళ్లు ఎలా అందిస్తారని పీపీఏ సీఈవో ఆర్కే జైన్ ప్రశ్నించారు. ఇది ప్రణాళిక రాహిత్యాన్ని ఎత్తిచూపుతోందని వ్యాఖ్యానించారు. పునరావాసంపై ప్రతి వారం సమీక్ష..: కేంద్ర జల సంఘం ఆమోదించిన ప్రకారం కాఫర్ డ్యామ్‌ను 41.5 మీటర్ల ఎత్తుతో నిర్మించి.. నీటిని నిల్వ చేస్తే 18,118 కుటుంబాల ప్రజలు నిర్వాసితులు అవుతారన్నారు. ఇప్పటివరకూ 3,922 కుటుంబాలకే పునరావాసం కల్పించారని.. మిగిలిన కుటుంబాలకు మేలోగా ఎలా పునరావాసం కల్పిస్తారని పీపీఏ ప్రశ్నించింది. దీనిపై సహాయ, పునరావాస కమిషనర్ రేఖారాణి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి స్పందిస్తూ ఇప్పటికే టెండర్లు పిలిచామని, పనులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. టెండర్లలో పునరావాస కాలనీల నిర్మాణానికి కనీస గడువు 12 నెలలు పెట్టారని.. ఇప్పుడేమో మే నెలాఖరకు పూర్తి చేస్తామని చెబుతున్నారని.. ఎలా విశ్వసించాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇకపై ప్రతి వారం సమీక్షలు నిర్వహిస్తామని.. వాటి ఆధారంగా> చర్యలు తీసుకుంటామని పీపీఏ సీఈవో ఆర్కే జైన్ స్పష్టం చేశారు. -
నట్టేట్లో పోలవరం నాణ్యత
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్(జలాశయం) పనుల్లో నాణ్యతా లోపాలు మరోసారి బహిర్గతమయ్యాయి. గోదావరి నదిలో సాధారణ వరద ప్రవాహానికే కాఫర్ డ్యామ్ పునాది(జెట్ గ్రౌటింగ్) కొట్టుకుపోవడం గమనార్హం. ప్రభుత్వ పెద్దలు తమకు బాగా కావాల్సిన కాంట్రాక్టర్లకే ‘నామినేషన్ విధానం’లో పోలవరం ప్రాజెక్టు పనులు అప్పగించిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టర్లు పనులు ఎలా చేసినా అభ్యంతరం చెప్పకుండా బిల్లులు చెల్లించేలా.. వాటి పర్యవేక్షణకు, నాణ్యత పరిశీలనకు వేర్వేరుగా చీఫ్ ఇంజనీర్లను నియమించకుండా ఒకే చీఫ్ ఇంజనీర్‌ను నియమించారు. దాంతో పనులు నాసిరకంగా చేసినా నాణ్యంగా ఉన్నట్లుగా ధ్రువీకరించి, బిల్లులు మంజూరు చేస్తున్నారు. పోలవరం జలాశయం స్పిల్ వే(కాంక్రీట్ ఆనకట్ట)లో చీలికలు ఏర్పడ్డాయి. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సభ్యులు వైకే శర్మ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నాణ్యతా లోపాలను బహిర్గతం చేసింది. ఇటీవల లోక్‌సభ, శాసనసభలకు సమర్పించిన నివేదికల్లోనూ పోలవరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యతా లోపాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) కడిగి పారేసింది. తూతూమంత్రంగా జెట్ గ్రౌటింగ్ పనులు గోదావరి నదిలో 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు నీటిని విడుదల చేసేలా పోలవరం జలాశయం డిజైన్ రూపొందించారు. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్(ఈసీఆర్ఎఫ్) పనులు పూర్తయ్యేలోగా 41.5 మీటర్ల ఎత్తున నిర్మించే కాఫర్ డ్యామ్‌లోనే నీటిని నిల్వ చేసి, వచ్చే ఏడాది మే నాటికి గ్రావిటీపై కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు పదేపదే ప్రకటిస్తున్నారు. కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం.. కాఫర్ డ్యామ్ నిర్మాణానికి పునాదిని షీట్ ఫైల్స్ విధానంలో వేయాలి. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే కాఫర్ డ్యామ్ పునాది పనులను కెల్లర్ అనే సంస్థకు నామినేషన్‌పై కట్టబెట్టారు. జెట్ గ్రౌటింగ్ విధానంలో కాఫర్ డ్యామ్ పనులు చేస్తామని ఈ సంస్థ ప్రకటించింది. గోదావరి నదీ గర్భంలో ఈసీఆర్‌ఎఫ్‌కు ఎగువన, దిగువన కాఫర్ డ్యామ్ నిర్మించే ప్రాంతంలో ప్రతి 1.5 మీటర్లకూ రాతి పొర వచ్చే వరకూ బోరు బావి తవ్వి, అధిక ఒత్తిడితో సిమెంట్, ఇసుక, బెంటనైట్ మిశ్రమాన్ని పంపితే భూగర్భంలో ఏవైనా చీలికలు ఉంటే మూసుకుపోయి అత్యంత పటిష్టవంతమైన ఒక గోడ తరహాలో పొర తయారవుతుంది. దీనివల్ల చుక్క నీరు కూడా లీకవ్వదు. దీన్నే జెట్ గ్రౌటింగ్ అంటారు. ఈ పునాదిపైనే కాఫర్ డ్యామ్ నిర్మించాలి. ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ పనులను 2308 కాలమ్స్, దిగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ పనులు 945 కాలమ్స్ ద్వారా పూర్తి చేశామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కానీ, ఈ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. అందువల్లే సాధారణ వరద ప్రవాహానికే జెట్ గ్రౌటింగ్ పునాది కొట్టుకుపోయిందని జలవనరుల శాఖ సీనియర్ ఇంజనీర్లు చెబుతున్నారు. డెన్సిఫికేషన్ చేయకుండానే.. ఇసుక తిన్నెల్లో నిర్మించే ఈసీఆర్‌ఎఫ్‌కు ఎగువన 500 మీటర్లు.. దిగువన 500 మీటర్ల పొడవున నదీ గర్భంలో డెన్సిఫికేషన్(సాంద్రీకరణ) విధానంలో ఇసుక పొరలను పటిష్టం చేయాలి. యంత్రాలతో అధిక ఒత్తిడితో ఇసుక పొరలను కూరాలి. దీనివల్ల ఈసీఆర్‌ఎఫ్‌కు ఎగువన.. దిగువన నదీ గర్భంలో గట్టి పొర ఏర్పడుతుంది. నీరు లీకేజీ కాదు. కాఫర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ల భద్రతకు డోకా ఉండదు. అయితే, కాంట్రాక్టర్ డెన్సిఫికేషన్ సక్రమంగా చేయలేదని ఆ పనులను పర్యవేక్షిస్తున్న కీలక అధికారి ఒకరు చెప్పారు. డెన్సిఫికేషన్ చేయకుండానే కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్, ఈసీఆర్ఎఫ్ డయాఫ్రమ్ వాల్ పనులు చేశారు. ఇసుక పొరల్లో చీలికలు యథాతథంగా ఉండిపోయాయి. దాంతో భూగర్భంలో నీటి లీకేజీలు కావడం వల్లే సాధారణ వరద ప్రవాహానికే జెట్ గ్రౌటింగ్ కొట్టుకుపోయిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డయాఫ్రమ్ వాల్ పనులు సైతం అక్కడక్కడ కొట్టుకుపోయినట్లు చెబుతున్నారు. నాణ్యతా లోపాలను సరిదిద్దకుండా కాఫర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్లను నిర్మిస్తే జలాశయం భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. -
పోలవరం మేమే కడతాం
-
పోలవరం మేమే కడతాం
2019నాటికి పూర్తి చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు సాక్షి, విజయవాడ, అమరావతి: గోదావరి జలాలను 2018 నాటికి గ్రావిటీతో కృష్ణానదికి చేర్చడం, 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద గోదావరి జలాలు కృష్ణానదిలో కలిసే చోట చంద్రబాబు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం ఇచ్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కొంతమంది కాపర్ డ్యాంకు, మెయిన్ డ్యాంకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. చెరువులను గొలుసుకట్టుగా అనుసంధానం చేసి భూగర్భ జలాలను పెంచాలన్నారు. కంప చెట్లు, తుమ్మ చెట్లు తొలగించాలన్నారు. ఈ ఏడాది నాలుగు లక్షల పంటకుంటలు తవ్వాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. గోదావరి నీళ్లను సోమశిలకు మళ్లిస్తాం ఈ ఏడాది ఎన్ని ఇబ్బందులు వచ్చినా గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు తెచ్చామని సీఎం చెప్పారు. కృష్ణా జలాలను నాగార్జునసాగర్ కుడికాల్వ ద్వారా రాయలసీమకు ఇచ్చి ఒక పంట కాపాడుకోగలిగామని చెప్పారు. రాబోయే రోజుల్లో గోదావరి జలాలు కృష్ణానదికి, అక్కడ నుంచి పెన్నానదికి తీసుకువెళ్లి సోమశిల ప్రాజెక్టు వరకు మళ్లిస్తామని చెప్పారు. కృష్ణా, గోదావరి డెల్టాల్లో నారుమళ్లు వేసుకుని పంటలు సకాలంలో పండించి తుపానుల బారిన పడకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు. ఏటా 50 కోట్ల మొక్కలు నాటాలి: సీఎం రాష్ట్రవ్యాప్తంగా జూలై 1వతేదీన ‘వనం మనం’ కార్యక్రమాన్ని కోటి మొక్కలు నాటి పెద్ద ఎత్తున నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. గుంటూరు జిల్లా కొండవీడు నుంచి ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. కార్తీక మాసంలో జరిగే ‘వనమహోత్సవం’ వరకూ దీన్ని నిరాటంకంగా చేపట్టేందుకు మంత్రులతో పాటు అంతా బాధ్యత తీసుకోవాలని కోరారు. -
‘లోకేశ్‌ను పప్పు అనడం కరెక్టే’
రాజమహేంద్రవరం: మంత్రి నారా లోకేశ్‌ను పప్పు అనడంలో తప్పేంలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు సర్కారు అతిగా స్పందించిందని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అనేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన రాలేదని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2018 నాటికి గ్రావిటీ ద్వారా తాగునీరు వస్తుందని చెబుతున్నారని, అలా చేయగలిగితే ఓట్లన్నీ మీకే పడతాయని చెప్పారు. కాఫర్ డ్యామ్ ద్వారా నీళ్లు ఇస్తామంటున్నారని, అసలు కాఫర్ డ్యామ్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు సాధ్యం కాదని ఉండవల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు.