
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మంత్రి అంబటి రాంబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబువి దుర్మార్గమైన రాజకీయలు. చంద్రబాబు ఓ విష సర్పం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టడమే తప్ప మహానాడులో చేసిందేమీ లేదు.
బడుగు, బలహీన వర్గాలకు చంద్రబాబు ఏమీ చేయలేదు. అది మహానాడు కాదు.. మోసపునాడు. వంద మహానాడులు చేసినా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాలేడు. వచ్చే ఐదేళ్లు కూడా చంద్రబాబుకు నిద‍్రపట్టదు. చంద్రబాబు తప్పిదం వల్లే డయాఫ్రమ్ వాల్ కూలిపోయింది. కాఫర్ డ్యామ్ పూర్తికాకముందే డయా ఫ‍్రమ్ వాల్ నిర్మించారు. చంద్రబాబు చారిత్రాత్మక తప్పు చేయడం వల్లే ఇలా జరిగింది. మంత్రి ఇళ్లు దగ్ధమైతే మహానాడులో ఖండించారా?. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకంగా మహానాడు జరుగుతోంది’’ అని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment