Ambati Rambabu
-
స్వామిజీలపై అంత కక్ష ఎందుకు.. పవన్ ఇదేనా సనాతన ధర్మం
-
పోలవరంపై చారిత్రాత్మక తప్పిదం
-
చంద్రబాబూ.. పోలవరంపై ఇన్ని అసత్యాలా?: అంబటి
సాక్షి,గుంటూరు : పోలవరంపై అసెంబ్లీలో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో పోలవరంపై జరిగిన చర్చలో తాను చేసిన తప్పిదాలను వైఎస్సార్సీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..ఆనాడే ఎందుకు చేపట్టలేదు?:పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన 1941లోనే వచ్చింది. అంజయ్య హయాంలో 1981లో శంకుస్థాపన చేసి వదిలేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి, వెన్నెముక అంటున్న చంద్రబాబు, మరి వైఎస్సార్ వచ్చి పునాది వేసి, పనులు చేసే వరకు ఎందుకు స్పందించలేదు?. 1995లో మీరు సీఎం అయ్యారు. 2004 వరకు మీరు ఆ పదవిలో ఉండి కూడా, జీవనాడి ప్రాజెక్టు ఎందుకు చేపట్టలేదు? పునాది వేసి పనులు ఎందుకు చేపట్టలేదు? ఎందుకంటే, ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పం మీకు లేదు. కనీసం ఆ ఆలోచన కూడా మీకు లేదు. అదే వైఎస్సార్ 2004లో పనులు మొదలు పెట్టి, రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టారు. కుడి, ఎడమ కాల్వలు తవ్వారు. కానీ దురదృష్టవశాత్తూ ఆయన మరణించారు. ఆ తర్వాత ప్రాజెక్టును ఎవరూ పట్టించుకోలేదు.కేంద్రమే కడతామన్నా:2014లో రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. పనులు వారే పూర్తి చేస్తామన్నారు. కానీ, చంద్రబాబు ఏం చేశారు? తామే కడతామని తీసుకున్నారు. అసలు కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తమ చేతుల్లోకి ఎందుకు తీసుకుంది? అది చరిత్రాత్మక తప్పిదం. దాని ఫలితమే ప్రస్తుత పరిస్థితి. 2016లో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు చంద్రబాబు చేసిన మరో తప్పిదం.. 2013–14 ధరలతో ప్రాజెక్టు పనులు చేస్తామని ఒప్పుకోవడం. అదెలా సాధ్యం?. అంటే కేవలం కమిషన్ల కోసం, తనవారికి పనులు అప్పగించడం ఆయన లక్ష్యం, ఉద్దేశం.అయినా అన్నింటికీ మమ్మల్ని బాధ్యులను చేస్తున్నారు.ఇంకా తెలంగాణ నుంచి ఏడు మండలాల విలీనం చేయడంలో తనది కీలకపాత్ర అంటున్నారు. కానీ, నిజానికి అది విభజన చట్టంలోనే స్పష్టంగా ఉంది. దానిపైనా చంద్రబాబు అసత్యాలు చెబుతూ, అది తన ఘనత అంటున్నారు.ప్రాజెక్టు పనులపై ఆనాడేమన్నారు?:పోలవరం ప్రాజెక్టు పనుల్లో 72 శాతం 2019 నాటికి చేశామని, ఆ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం 3.8 శాతం పనులే చేసిందని చంద్రబాబు విమర్శిస్తున్నారు. మరి, ఆనాడు చంద్రబాబు ఏమన్నారు? 2018లో పోలవరం నుంచి నీళ్లిచ్చిన తర్వాతే, 2019లో ఎన్నికలకు వెళ్తామన్నారు. అదే మాట అసెంబ్లీలో అప్పటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు.మరి పనులు పూర్తి చేశారా? పనులు చేయకపోయినా, అదే పనిగా ప్రచారం చేసుకున్నారు. భజన చేయించుకున్నారు.మాకు నాలెడ్జ్ లేదన్నారు. మరి మీకు?:నాపైనా చంద్రబాబుగారు విమర్శ చేస్తూ.. నాకు టీఎంసీలు, క్యూసెక్స్ తెలియవని, డయాఫ్రమ్ వాల్ అంటే తెలియదని అన్నారు. ఔను నేను ఇంజనీర్‌ను కాదు. కానీ, మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక, అన్నీ తెలుసుకున్నాను.మరి నీవు చాలా తెలివైనవాడివి కదా? గతంలో ఒకసారి ఏమన్నావ్?. ‘కాఫర్ డ్యామ్ లేకుండానే డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని అనుకున్నాం’ అని చెప్పావు. అది ఎలా సాధ్యం అనుకున్నావు.ఇంకా చెప్పాలంటే చంద్రబాబు చేసిన అనేక తప్పిదాల వల్ల పోలవరం ప్రాజెక్టు చాలా ఆలస్యం అయింది. ఆ ప్రాజెక్టు సర్వనాశనం అయింది. ఇది వాస్తవం.ఇదీ చంద్రబాబు తప్పిదం:అసలు ఏ ప్రాజెక్టు అయినా, కట్టేటప్పుడు నీరు మళ్లిస్తారు. గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువ. ఒక్కోసారి 50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. కానీ, చంద్రబాబు ఏం చేశారంటే, నీరు డైవర్ట్ చేసేలా అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, స్పిల్‌వే.. వాటిలో ఏదీ పూర్తి చేయకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టారు.డయాఫ్రమ్ వాల్ అంటే..ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది. అది ప్రాజెక్టు మధ్యలో ఉంటుంది. నదీ ప్రవాహం మళ్లించకుండా దాన్ని కట్టడం వల్ల, వరద ఉధృతికి అది కొట్టుకుపోయింది. ఆ డయాఫ్రమ్‌వాల్‌ను 2016లో గ్యాప్–2 లో ప్రారంభించి చరిత్రాత్మక తప్పిదం చేశారు.పోనీ, కాఫర్ డ్యామ్ అయినా పూర్తి చేశారా? అంటే అదీ లేదు. సగం పనులు చేశారు. నది డైవర్షన్ చేయకుండా, కాఫర్ డ్యామ్ పూర్తి చేస్తే, నదీ ప్రవాహానికి కొట్టుకుపోతుందని, దాని మధ్యలో గ్యాప్‌లు పెట్టారు. ఫలితంగా మీ హయాంలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం మొదలైంది. అది ఒక్కటే కాదు.. కాఫర్‌డ్యామ్ వాల్‌కు కింద ఉన్న జెట్ డ్రౌటింగ్. అది కూడా దెబ్బతినడం మొదలైంది.నిపుణుల నోట..అదే మాట:డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన తర్వాత.. ఏం చేయాలన్న దానిపై చర్చించి, దేశంలో ఉన్న నిపుణులతో అధ్యయనం చేయించాలని నిర్ణయించాం. ఆ మేరకు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే, కేంద్రం నిపుణుల కమిటీ వేసింది. అందులో ఇద్దరు అమెరికా, ఇద్దరు కెనెడాకు చెందిన వారు. వారు ఇక్కడికి వచ్చి, అన్నీ అధ్యయనం చేసి, కేంద్ర జల స«ంఘానికి సమగ్ర నివేదిక ఇచ్చారు. వారు చెప్పిందేమిటంటే.. నదిని మళ్లించకుండా, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కట్టాలనుకోవడం ఒక తప్పిదం. డయాఫ్రమ్ వాల్‌ను పూర్తి చేయడానికి కట్టిన కాఫర్ డ్యామ్‌లో గ్యాప్‌లు వదలడం మరో తప్పిదం అని వారు స్పష్టంగా చెప్పారు. అంటే, అన్ని అనర్థాలకు కారణం చంద్రబాబు, ఆయన ప్రభుత్వం. అయినా, చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. అన్నింటినీ జగన్‌గారిపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్న ఆలోచన, ఇంట్రెస్ట్ లేదు. ఎంతసేపూ, ఆ పనుల్లో కమిషన్లు గుంజుకోవడం తప్ప.ఇదీ ఈ ఇరిగేషన్ మంత్రి నాలెడ్జ్:ఇప్పుడు ఒక ఇరిగేషన్ మంత్రి ఉన్నారు. ఆయనకు చాలా నాలెడ్జ్ ఉందంటారు. కానీ, ఆయన ఏమన్నారంటే.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును, కేంద్రం రీయింబర్స్ చేస్తే, జగన్‌గారు డైవర్ట్ చేశారట. అది రాష్ట్ర ప్రభుత్వ నిధి. అంతకు ముందు ఖర్చు చేస్తే, కేంద్రం తిరిగి ఇచ్చింది. మరి ఆ నిధులు డైవర్ట్ చేయడం ఏమిటి? అదీ ఈ ఇరిగేషన్ మంత్రి పరిజ్ఞానం!ఎత్తు తగ్గింపు మరో తప్పిదం:చంద్రబాబు మరో ఘోర తప్పిదం చేశారు. దాన్ని భవిష్యత్తులో కూడా సరి చేసుకోలేం. ఆనాడు పోలవరం ప్రాజెక్టులో తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు రూ.12 వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. దాని కోసం మేము చాలా ప్రయత్నాలు చేశాం. దాంతో ఇటీవల కేంద్ర క్యాబినెట్ దానికి ఆమోదం తెలిపింది. అయితే దానికి ముందు కేంద్ర క్యాబినెట్లో ఒక తీర్మానం చేశారు.పోలవరం ప్రాజెక్టు పనులను రెండు దశల్లో.. ఒకటి 41.15 మీటర్లు, రెండో దశలో 45.72 మీటర్ల అడుగులో నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. అది ప్రాజెక్టు మాన్యువల్‌లోనూ ఉంది. కానీ ఇప్పుడు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేస్తూ, ప్రాజెక్టును కేవలం 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ, ఆ నిధులు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఆ మేరకు క్యాబినెట్లో తీర్మానం చేశారు. ఇది వాస్తవం. అంటే ఇది టీడీపీ, బీజేపీ ప్రభుత్వ సంయుక్త నిర్ణయం.ఇదే నా సవాల్:కానీ, చంద్రబాబు ఏం అన్నారు? ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించాలని ప్రధానిగారు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఒకవేళ అది నిజమైతే, క్యాబినెట్ నోట్ చూపండి. అది చూపితే, నేను క్షమాపణ చెప్పి, నోరు మూసుకుంటాను. ఇదే నా సవాల్. మీరు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల రాష్ట్రం చాలా నష్టపోతుంది. కేవలం 115 టీఎంసీలు మాత్రమే ఉపయోగించుకోగలం. 195 టీఎంసీల నీరు వాడుకోలేం. దాని వల్ల చాలా నష్టం. చాలా వాటికి నీరందదు. ఆ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు గోదావరిలో కలిపారు. పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేస్తున్నారు.మా హయాంలోనే వేగంగా పనులు:మా హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి. స్పిల్‌వే పూర్తైంది.మా టైమ్‌లోనే ప్రాజెక్టు గేట్లు బిగించాం. నది మళ్లింపు చేశాం. అంటే, పైలట్ ఛానల్ కూడా పూర్తి చేశాం. రెండు కాఫర్ డ్యామ్‌లు కూడా మేమే పూర్తి చేశాం.కానీ చంద్రబాబు తన హయాంలో 72 శాతం పనులు పూర్తి చేశానని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. దాన్ని తన ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు.మరో విషయం:రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చాయంటే, అదంతా వైఎస్సార్ ఘనతే. వెలుగొండ కానీ, గుండ్లకమ్మ కానీ.. ఏదైనా ఆయన హయాంలోనే కట్టారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి, అది సర్వనాశనం కావడానికి చంద్రబాబే కారకుడు. ప్రపంచంలో ఎవరూ కూడా, నది డైవర్షన్ లేకుండా, ప్రాజెక్టు కట్టరు. కానీ చంద్రబాబు ఆ పని చేశారు. దాన్ని సమర్థించుకోవడానికి ఇవాళ తంటాలు పడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. -
కొడాలి నానిపై కేసు... అంబటి రాంబాబు రియాక్షన్
-
నా కూతురిపై టీడీపీ పోస్టులు..
-
జగన్ పై లోకేష్ ట్వీట్లు.. పోస్టులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
-
వైఎస్ జగన్‌పై అసభ్య పోస్టులు.. టీడీపీపై అంబటి రాంబాబు ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్, ఆయన కుటుంబసభ్యులపై టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులపై పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. పోస్టులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. వైఎస్ జగన్‌పై లోకేష్ చేసిన అసభ్యకర ట్వీట్లపై ఏం చర్యలు తీసుకున్నారంటూ అంబటి ప్రశ్నించారు.లోకేష్ ట్వీట్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ శ్రేణులు పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేశాం. గతంలో వైఎస్ జగన్‌పై అయ్యన్న పాత్రుడు అసభ్యకరమైన కామెంట్స్ చేయలేదా?. అయ్యన్న పాత్రుడిపై కూడా మేం ఫిర్యాదు చేశాం. చర్యలు తీసుకోవాలి’’ అని అంబటి డిమాండ్ చేశారు.వైఎస్సార్సీసీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారు. ఏపీలో అరాచక పాలన నడుస్తోంది. ఎన్ని కేసులు పెట్టిన న్యాయపరంగా పోరాడతాం. మేం కేసులకు భయపడే వ్యక్తులం కాదు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడే హోంమంత్రికి చట్టాలు ఉండవా?. కూటమి సర్కార్ వైఖరిని రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
‘అర్ధరాత్రి గౌతమ్‌రెడ్డి ఇంటి కిటికీని పగలగొట్టింది స్టూవర్ట్‌పురం దొంగలు కాదు.. పోలీసులు’
విజయవాడ: వైఎస్సార్సీపీ నేత పూనురు గౌతమ్‌రెడ్డి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించిన తీరు అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కనీస నిబంధనల్ని కూడా పోలీసులు పాటించలేదని, మెయిన్‌డోర్ వేసుంటే వెనుక వైపు ఉన్న కిటికీని పగలగొట్టి మరీ ఇంట్లోకి ప్రవేశించారన్నారు. అలా ప్రవేశించింది ఏ స్టూవర్ట్‌పురం దొంగలో కాదని, ఏకంగా పోలీసులే అటువంటి దుస్సాహానికి పాల్పడ్డారని అంబటి విమర్శించారు.వైఎస్సార్సీపీ నేత పూనురు గౌతమ్‌రెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీకి చెందని నేతలు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, మల్లాది విష్ణు, చంద్రశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, భాగలక్ష్మీ, శైలజారెడ్డి తదితరులు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అంబటి.. కూటమి సర్కారు అప్రజాస్వామిక చర్యలపై ధ్వజమెత్తారు.‘12వ తేదీ అర్ధరాత్రి పూనురు గౌతమ్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించిన తీరు దుర్మార్గం. కనీస నిబంధనలను కూడా పోలీసులు పాటించలేదు. మెయిన్ డోర్ వేసుంటే వెనుక వైపు ఉన్న కిటికీని పగలగొట్టారు. కిటికీని పగలగొట్టింది స్టూవర్ట్ పురం దొంగలు కాదు.. పోలీసులు. ఆ సమయంలో గౌతమ్ రెడ్డి భార్య తప్ప మరొకరు లేరు. పూనూరు గౌతమ్ రెడ్డి వైసీపీలో సీనియర్ నేత. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అభ్యర్ధిగా పోటీచేయించాలని భావించాం. గౌతమ్‌రెడ్డి ఇంట్లో సీసీ కెమెరా ఫుటేజ్ చూశాక మాకు ఆశ్చర్యమేసింది. పోలీసులు ఇలా కూడా వ్యవహరిస్తారా అనిపించింది. గండూరి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి గౌతమ్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. ఒక సివిల్ కేసును పోలీసులు అక్రమ కేసుగా మార్చారు. గౌతమ్ రెడ్డి పై పెట్టిన కేసు పూర్తిగా తప్పుడు కేసు. మహిళలు మాత్రమే ఉన్న సమయంలో అక్రమంగా పోలీసులు ఇంట్లోకి ప్రవేశిస్తే ఎవరికైనా భయం కలగదా. గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇంతకంటో వేరే మార్గమే లేదా?విజయవాడ పోలీస్ కమిషనర్ ,డిజిపిలను ప్రశ్నిస్తున్నా. మీ ఆదేశాలు లేకుండానే పోలీసులు ఇలా చేస్తారా?నేరం మోపబడిన వ్యక్తి ఇంట్లో ఇలా ప్రవేశించడం కరెక్టేనా అని హోంమంత్రి అనితను అడుగుతున్నా. ఏపీలో అరాచకం జరుగుతుందని మేం మొదట్నుంచి చెబుతున్నాం. గౌతమ్ రెడ్డిని పట్టుకోవడానికి ఇంతకంటే మరోమార్గం మీకు దొరకలేదా?, మహిళలు నిద్రిస్తున్న సమయంలో ఇలా చేయొచ్చా హోంమంత్రి సమాధానం చెప్పాలి. ఈ ఘటనను మేం తేలిగ్గా విడిచిపెట్టం...న్యాయపరంగా పోరాడుతాం. న్యాయసలహా తీసుకుని పోలీసుల పై ప్రవేట్ కేసు పెడతాం. పోలీసుల పై చర్యలు తీసుకుంటారా లేదా అనేది డీజీపీ, హోంమంత్రి సమాధానం చెప్పాలి’ అని అంబటి నిలదీశారు. ప్రశ్నించే వారిని కూటమి ప్రభుత్వం బెదిరిస్తోంది: ఎమ్మెల్యే చంద్రశేఖర్పోలీసులే అర్థరాత్రి దొంగల్లా ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నారని, ఏపీలో ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. గౌతమ్‌రెడ్డి నిజంగా తప్పు చేసి ఉంటే పోలీసులే ఇంత దుర్మార్గంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా డీజీపీ? అని ప్రశ్నించారు. ఈ రకమైన చర్యలు అప్రజాస్వామికమని, అర్థరాత్రి మహిళలున్న సమయంలో ఇళ్లల్లోకి పోలీసులు ప్రవేశించడం కరెక్టేనా? అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం నిర్బంధకాండను ప్రజలు తెలుసుకోవాలని, అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ న్యాయపోరాటం చేస్తుందన్నారు. -
కూటమి పార్టీలు అసెంబ్లీ ప్రతిష్ట దిగజార్చేలా ప్రయత్నించాయి
-
‘ఆ కుట్ర అందరికీ తెలుసు.. అదే చంద్రబాబు, కూటమి నేతల భయం’
సాక్షి, గుంటూరు: కూటమి పార్టీల నేతలు శాసనసభ స్థాయిని దిగజార్చేలా మాట్లాడారని.. వైఎస్ జగన్‌పై వాడిన భాష సరికాదంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘బెల్టు షాపులు పెడితే ఉక్కుపాదం మోపుతామన్నారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్టు షాపులే కనిపిస్తున్నాయి.’’ అని కూటమి సర్కార్‌పై నిప్పులు చెరిగారు.‘‘గతంలో జగన్‌పై రఘురామకృష్ణరాజు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసిన మీపై చర్యలు తీసుకుంటే తప్పా..?. వైఎస్సార్సీపీకి 11 సీట్లు రావడానికి కారణమైన కుట్ర అందరికీ తెలుసు. అందుకే చంద్రబాబు, కూటమి నేతలు భయపడుతున్నారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడగల వ్యక్తిత్వం జగన్‌ది. చంద్రబాబు కుట్రలు చేసి జగన్‌పై అవాకులు చవాకులు పేలుతున్నారు. రఘురామతో రచ్చబండ పెట్టించి తిట్టించింది చంద్రబాబే. ఏదో విధంగా జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయాలని ప్రయత్నిస్తున్నారు’’ అంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు.‘‘చంద్రబాబు అసెంబ్లీలో రఘురామకృష్ణంరాజును కస్టడీకి తీసుకుని హింసించారని చెప్పటం దారుణం. రఘురామ కృష్ణంరాజును హింసించలేదని సుప్రీంకోర్టే చెప్పింది. ఇప్పటివరకు పవన్ కల్యాణే నటుడు అనుకున్నాను. పవన్‌ను మించిన నటుడు చంద్రబాబు. హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబుపై ఎందుకు 420 కేసు నమోదు చేయకూడదు?. 100 ఎస్కో బార్లు, 1000 మంది చీటర్లు, లక్షలాదిమంది దోపిడీ దొంగలను రుబ్బి బొమ్మ తీస్తే వచ్చేదే చంద్రబాబు బొమ్మ. చంద్రబాబు అత్యంత నీచమైన స్వభావం గల వ్యక్తి...రచ్చబండ పేరుతో రఘురామ కృష్ణంరాజు.. వైఎస్ జగన్‌ను తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నాడు. ఎన్నికల అయిపోయిన తర్వాత రఘురామ కృష్ణంరాజు ఇక వైఎస్ జగన్‌ను దూషించనని చెప్పాడు. ఆ విషయం చంద్రబాబుకు గుర్తులేదా?. చంద్రబాబు అధికారం కోసం ఏ గడ్డైనా కరుస్తాడు. శాసనసభ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. సోషల్ మీడియాలో రఘురాం కృష్ణంరాజు మాట్లాడిన మాటలపై కేసులు ఎందుకు పెట్టడం లేదు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.ఇదీ చదవండి: వైఎస్ జగన్ ఆదేశం.. వైఎస్సార్సీపీ ‘ప్రత్యేక టాస్క్‌ఫోర్స్’ -
మేం ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవడం లేదు : అంబటి రాంబాబు
-
అయ్యా డీజీపీ ఎక్కడ ఉన్నారు ? అంబటి ఫైర్
-
ఇవాళ మరో కార్యకర్త పోలీసులు అరెస్ట్ చేశారు : అంబటి
-
‘నారా లోకేష్‌పై చర్యలేవి’
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ షోషల్‌మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులు సరికాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గత ఏడాదిలోని కంప్లైంట్‌పై ఒప్పుడు అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన గుంటూరు బుధవారం మీడియాతో మాట్లాడారు.‘‘ఇవాళ మరో కార్యకర్త రాజశేఖర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్, మా పార్టీ నేతలపై టీడీపీ పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేశాం. నా కుటుంబసభ్యులపై పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదు. మేం ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవటం లేదు. మాపై అనుచిత పోస్టులు పెట్టిస్తున్న లోకేష్‌పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?’’ అని నిలదీశారు.చదవండి: బాబు మాటలు ఉత్త డాబు అని తెలిపోయింది: విజయసాయిరెడ్డి -
సోషల్ మీడియా యాక్టివిస్టులను పరామర్శించిన YSRCP నేతలు
-
ఇంత అరాచకమా?.. కక్షగట్టి అక్రమ కేసులా?: అంబటి రాంబాబు ఫైర్
సాక్షి, గుంటూరు: సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు మేకా వెంకట్రామిరెడ్డి, కళ్ళం హరికృష్ణ రెడ్డితో పాటు పానుగంటి చైతన్యను ఆ పార్టీ నేతలు పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు మంగళవారం పరామర్శించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ, మహిళ అని చూడకుండా పోలీసులు టార్చర్ చేస్తున్నారన్నారు. సుధారాణి దంపతులను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.వర్రా రవీంద్రారెడ్డిని రాత్రి ఎందుకు అరెస్ట్‌చేశారు.? ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముంది?. ఏపీలో పౌర హక్కులు ఏమౌతున్నాయి.’’ అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలి. టీడీపీకి అనుకూలంగా పనిచేయొద్దన్న అంబటి.. పోలీసులు కక్షగట్టి అందరిని కేసుల్లో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు...గుంటూరు సబ్ జైలులో సోషల్ మీడియా కార్యకర్త సుధారాణి, ఆమె భర్తలను రిమాండ్ చేశారు. సుధారాణి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. భార్య, భర్తలు ఇద్దరూ జిల్లా జైలులో లేరు. పిటి వారెంట్ వేసి ఎక్కడికి తీసుకెళ్లారు తెలీదు. చిలకలూరిపేట సుధారాణి దంపతులను అక్రమంగా అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్లో కొట్టి, కోర్టులో ప్రవేశ పెట్టారు. మేజిస్ట్రేట్ సోషల్ మీడియా కార్యకర్త సుధారాణి వాగ్మూలాన్ని రికార్డు చేసి ఆమె చేతికి ఉన్న గాయాలను పరిశీలించి వైద్య సేవలకు ఆదేశించారు. అనంతరం జిల్లా జైలుకు రిమాండ్ విధించారు.ఎన్నికల అనంతరం ఊరు విడిచి హైదారాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. ప్రవీణ్ అనే ఐపీఎస్ అధికారి అరబ్ దేశాలలో అయితే ఇలాంటి వ్యవహారాల్లో నడిరోడ్డుపై కొట్టి చంపుతారంటూ మాట్లాడడం దారుణం. కోయ ప్రవీణ్ పైకి ఖాకీ చొక్కా వేసుకున్నాడు.. లోపల అంతా పసుపు పచ్చే. ఐపీఎస్ అధికారులు చట్ట పరిధిలో పని చేయాలి. చంద్రబాబు పులి మీద స్వారీ చేస్తున్నాడు.. ఆ పులే రేపు చంద్రబాబును తింటుంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై ఐటీడీపీ సోషల్ మీడియాలో చాలా దారుణంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. వాటిపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేసిన చర్యలు లేవు. చాలా మంది ఐపీఎస్ అధికారులు పైకి ఖాకీచొక్కా వేసుకొని లోపల ఎల్లో ఇన్నర్స్ వాడుతున్నారు.టీడీపీ వల్లే ఫేక్ ఎకౌంట్లు పెట్టి, అక్రమ పోస్టింగులు పెడుతున్నారు. చట్టాన్ని పాటించకపోతే సర్వనాశనం అవుతారు. పోలీసులు అక్రమంగా నిర్బంధించి వైఎస్ జగన్ పేరు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై పేర్లు చెప్పమని బెదిరిస్తున్నారు. మా సోషల్ మీడియాలో కార్యకర్తలకు అండగా ఉంటాం. త్వరలో సుప్రీంకోర్టును, రాష్ట్ర గవర్నర్ లను కలుస్తాం’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
సనాతన ధర్మం ఇదేనా !?
-
సప్త సముద్రాలు కాదు పది సముద్రాలూ దాటినా ఎవరిని వదలం..
-
విడదల రజినిని అంత మాట అన్నప్పుడు.. పవన్ కి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
-
బాబుపై సుమోటో కేసులేవీ పవన్?: అంబటి
గుంటూరు, సాక్షి: రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమకేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు మూడు నాలుగు రోజులు అక్రమంగా నిర్బంధించి చిత్ర హింసలకు గురి చేస్తున్నారని సీరియస్ అయ్యారు. దీనిపై వైయస్సార్సీపీ లీగల్ సెల్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత కూడా అరెస్టులు చేపిస్తున్నారని అన్నారు. ఆయన గుంటూరులో సోమవారం మీడియాతో మాట్లాడారు.అక్రమ కేసులు బనాయించిన అధికారులను మేం అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలే ప్రసక్తి లేదని వైఎస్ జగన్ చెప్పారు. అక్రమ కేసులు బనాయించి చట్ట విరుద్ధంగా వ్యవహరించిన అధికారులు డిప్యూటేషన్‌పై వచ్చి వెళ్లినా.. రిటైర్ అయిపోయిన వదిలే ప్రసక్తే లేదని క్లియర్‌గా చెప్పారు. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని పవన్ కల్యాణ్ అంటున్నారు. అధికారులను బెదిరించడం ఏమిటని పవన్ మాట్లాడుతున్నారు. అంటే పవన్ కల్యాణ్ మమ్మల్ని బెదిరిస్తున్నారా?. మీ బెదిరింపులకు భయపడే వారు ఇక్కడ లేరు.అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడితేనే వైఎస్ జగన్ భయపడలేదు. పెద్దపెద్ద వాళ్లతో ఎదురు తిరిగి పోరాడిన వ్యక్తి వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు సంఘ విద్రోహ శక్తులని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలుపై మరి సుమోటోగా కేసు నమోదు చేయాలిగా.. అని పవన్‌ను సూటిగా ప్రశ్నించారు...సుధారాణిని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కొట్టారు.మాజీమంత్రి విడుదల రజనిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. మాటలతో చెప్పుకోలేని విధంగా ఆమెను దూషిస్తూ అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. సాక్షాత్తు డీజీపీకి ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు. గత ప్రభుత్వంలో బాగా పనిచేసిన ముగ్గురు అధికారులపై వైఎస్సార్సీపీ ముద్ర వేసి సస్పెండ్ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కీలక పోస్టింగ్‌లో ఉన్న 14 మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇవ్వలేదు. సూపర్ సిక్స్, ఉచిత ఇసుక ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు పోలీసులపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారో నా నోటితో నేను చెప్పలేను’’ అని అన్నారు. -
సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు : అంబటి
-
సోషల్ మీడియా పెట్టిన పోస్టులపై డీజీపీకి ఫిర్యాదు చేశాం
-
రెండ్రోజులు చూస్తాం.. కోర్టును ఆశ్రయిస్తాం: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సహా ఇతర నేతలను కించపరిచేలా పెడుతున్న పోస్టులపై డీజీపికి వైఎస్సార్సీపీ బృందం ఫిర్యాదు చేసింది. ఆధారాలతో సహా వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, ఆదిమూలపు సురేష్, మల్లాది విష్ణు, కైలే అనిల్ కుమార్ తదితరులు ఫిర్యాదు చేశారు.దౌర్జన్యకాండపై కలిసికట్టుగా పోరాటం చేస్తాం: అంబటిఅనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్‌పై టీడీపీ సోషల్ మీడియా పెట్టిన పోస్టులపై డీజీపీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ‘‘టీడీపీ సోషల్ మీడియా పెట్టిన అసభ్యకరమైన పోస్టుల కాపీలను డీజీపీకి అందజేశాం. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌ల విషయాన్ని డీజీపీకి వివరించాం. ఏపీలో జరుగుతున్న దౌర్జన్యకాండపై కలిసికట్టుగా పోరాటం చేస్తాం’’ అని అంబటి రాంబాబు చెప్పారు.వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ సోషల్ మీడియా పోస్టులను డీజీపీకి ఇచ్చాం. చట్టప్రకారం చర్యలు తీసుకోమని కోరాం. మా సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు దారుణంగా కొట్టారు. సుధారాణి అనే యువతిపై చిలకలూరిపేట సీఐ తీవ్రంగా దాడి చేసి కొట్టారు. దీనిపై కూడా డీజీపికి ఫిర్యాదు చేశాం. వైఎస్ జగన్, భారతి, విజయమ్మ, అవినాష్‌రెడ్డి ఇతరులపై తప్పుడు కేసులు పెట్టారు. ఆ వివరాలు కూడా డీజీపికి ఇచ్చాం. మా వారిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకునేవరకు పోరాటం చేస్తాం. ఆడబిడ్డపై దాడులు జరిగితే సహించననే చంద్రబాబు సుధారాణి విషయంలో ఎలా స్పందిస్తారో వేచిచూస్తాం. మా ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో రెండు రోజులు చూస్తాం. తర్వాత కోర్టును ఆశ్రయిస్తాంకూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన: ఎమ్మెల్యే చంద్రశేఖర్చిన్న విషయాలకే పోలీసులు కేసులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ మండిపడ్డారు. ‘‘విచ్చలవిడిగా పేకాట నిర్వహిస్తున్నారంటే నాపై కేసు పెట్టారు. మంచినీటి కంటే ఎక్కువగా మద్యం ఏరులై పారుతోంది. ఎమ్మెల్యేగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నాపై నిర్బంధ కేసు పెట్టారు. ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రతిపక్షం కాకుండా ఇంకెవరు అడుగుతారు? పేకాట క్లబ్‌లను ఎందుకు కట్టడి చేయడం లేదు?. కూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన సాగిస్తోంది’’ అని ఆయన ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: చంద్రబాబు నియంత పాలన.. అక్రమ కేసులు సహించం: వైఎస్సార్సీపీ -
వేధింపులపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన మాజీమంత్రి అంబటి
-
ఒక మహిళను ఉగ్రవాదుల్లా హింసించారు: అంబటి రాంబాబు
గుంటూరు, సాక్షి: చిలకలూరిపేటకు చెందిన సుధారాణి దంపతులను వేధిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారని పలు చోట్ల కేసులు పెట్టారని అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘సుధారాణి దంపతులతోపాటు పిల్లలను కూడా తీసుకెళ్లారు. ఈ నెల 4న తీసుకెళ్లి నిన్న జడ్జిముందు ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ముందు సుధారాణి జరిగిందంతా చెప్పారు.పోలీసులు కొట్టిన గాయాలను న్యాయమూర్తికి చూపించారు సుధారాణి. ఒక మహిళను ఉగ్రవాదిని హింసించినట్టు హింసించారు. మహిళను ఐదు రోజులు చిత్ర హింసలు పెట్టారు. సుధారాణి దంపతులను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో అన్ని జిల్లాల ఎస్పీతో పాటు డీజీపీకి ఫిర్యాదు చేస్తాం. పోలీసు యంత్రాంగం చంద్రబాబు, లోకేష్ గుప్పిట్లోకి వెళ్లింది. పోలీస్ అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలి. పోలీసు యంత్రాంగం మానవహక్కులు హరిస్తున్నారు. పోలీసు దౌర్జన్యాలపై ఐఎస్సార్సీపీ న్యాయపోరాటం చేస్తుంది’’ అని అన్నారు.