అంబటి రాంబాబుపై సీఐ జులుం | Pattabhipuram CI Venkateswarlu Over Action Behaviour With Ambati Rambabu During Vennupotu Dinam Protest | Sakshi
Sakshi News home page

అంబటి రాంబాబుపై సీఐ జులుం

Jun 4 2025 2:03 PM | Updated on Jun 4 2025 4:43 PM

Pattabhipuram CI Venkateswarlu over action on ambati rambabu

సాక్షి,గుంటూరు: వైఎస్సార్‌సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు ఓవరాక్షన్ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర నుంచి కలెక్టరేట్‌కు వెళ్తుండగా  టీజేపీఎస్‌ కాలేజీ వద్ద అంబటి రాంబాబును పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. 

అయితే,తాము నిరసన కార్యక్రమానికి అనుమతి తిసుకున్నా ఎందుకు అడ్డుకున్నారని సీఐని అంబటి రాంబాబు ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన సీఐ.. అడ్డుకుంటాం అంటూ అంబటిపై దౌర్జన్యానికి దిగారు. అంబటి రాంబాబుకు వేలు చూపిస్తూ దురుసుగా ప్రవర్తించారు. అంబటి రాంబాబుని ఏంటి పళ్ళు కోరుకుతున్నావ్ అంటూ అంబటి రాంబాబుకు మీదకు వెళ్లారు. ప్రస్తుతం సీఐ వెంకటేశ్వర్లు దురుసు ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

దమ్ముంటే ఆపు .. అంబటి VS పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement