Guntur
-
గుంటూరులో మంత్రి సత్యకుమార్‌కు చేదు అనుభవం
-
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
-
ఏం.. తమాషాలు చేస్తున్నారా?.. పట్టాభిపురం పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి,అమరావతి: గుంటూరు పట్టాభిపురం పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు జారీ చేశాం. అయినా ఎందుకు తలదూరుస్తున్నారు’ అంటూ మండిపడింది. మంగళవారం హైకోర్టులో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సోదరి వజ్ర కుమారి, వసంత ఇంటి వ్యవహార కేసు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశించినా.. సివిల్ వ్యవహారంలో పట్టాభిపురం పోలీసులు జోక్యం చేసుకుంటున్నారంటూ వజ్రకుమారి, వసంతల తరఫున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ వ్యతిరేక వర్గానికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తమ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారని చెప్పారు. అనంతరం, తమ ఆదేశాలను ధిక్కరించిన పట్టాభిపురం పోలీసులపై హైకోర్టు న్యాయమూర్తి పై విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆదేశాలను కచ్చితంగా అమలు అయ్యేటట్లు చూడాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించారు. కోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తే సదరు పోలీసులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. -
టాలీవుడ్ డైరెక్టర్‌కు షాక్.. మాట్లాడుతుండగా మూకుమ్మడి దాడి!
ఇటీవల థియేటర్లలో విడుదలైన చిత్రం డ్రింకర్ సాయి. ఈ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టిపై దాడి జరిగింది. సక్సెస్ టూర్లో భాగంగా గుంటూరుకు వెళ్లిన ఆయన శివ థియేటర్ వద్ద మాట్లాడుతుండగా ఊహించని విధంగా ఆయనపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టిపై మంతెన సత్యనారాయణ ఫాన్స్ దాడి చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో ఆయన్ను కించపరిచేలా సీన్లు తీశారని విచక్షణ రహితంగా దాడి చేసినట్లు సమాచారం.కాగా.. డ్రింకర్ సాయి చిత్రాన్ని కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో తెరకెక్కించారు. ధర్మ, ఐశ్వర్య శర్మ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలైంది. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. ఓ డ్రింకర్ ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. #DrinkerSai దర్శకుడు మీద దాడి చేసిన మంతెన సత్యనారాయణ అభిమానులు.. pic.twitter.com/xQ7JL6IQbZ— Suresh PRO (@SureshPRO_) December 29, 2024 -
డ్యూటీ... డ్యాన్సుల్లో ట్రాక్ రికార్డ్
విశిష్ట రైల్వే సేవా పురస్కారానికి ఎంపికైన ఉద్యోగిగా గుంటూరుకు చెందిన జవ్వాది వెంకట అనూష వార్తల్లో నిలిచింది. దిల్లీ ప్రగతి మైదాన్ లో జరిగిన 69వ రైల్వే సేవా పురస్కారాల కార్యక్రమంలో అతి విశిష్ట రైల్వే సేవా పురస్కారాన్ని అందుకున్న అనూష కూచిపూడి నృత్యకారిణి కూడా. మనసు ఉంటే మార్గం ఉన్నట్టే... ఒక్క పడవ అని ఏమిటి ఎన్ని పడవల మీద అయినా ప్రయాణం అద్భుతంగా సాధ్యం అవుతుంది!నేర్చుకోవడానికి వ్యక్తులకు మించిన పాఠశాలలు ఉంటాయా?అనూషకు నాన్న ఒక పాఠశాల. ఆయన రైల్వేలో ఇంజినీర్. వృత్తిపట్ల అంకితభావం తండ్రి నుంచే నేర్చుకుంది. తాను కూడా నాన్నలాగే రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంది. జవ్వాది వెంకట నాగ సుబ్రమణ్యంతో అనూషకు వివాహం జరిగింది. ఆయన అప్పుడు కేరళ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. 2008లో మళ్లీ సివిల్స్ రాసి ఐఎఎస్‌కు ఎంపిక అయ్యారు. ‘మరింత కష్టపడాలి’ అనే పాఠాన్ని భర్త నుంచి నేర్చుకున్న అనూష ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజినీర్ (ఐఆర్ఎస్ఈ)గా ఎంపిక అయింది.ఇక కళలకు సంబంధించి అమ్మ తనకు పాఠశాల.తల్లి స్ఫూరితో కూచిపూడి నేర్చుకుంది. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత వేదాంతం రామలింగశాస్త్రి శిష్యురాలైన అనూష యూరోపియన్ తెలుగు అసోసియేషన్, అమెరికన్ తెలుగు అసోసియేషన్ కార్యక్రమాలలో చిన్నప్పుడే ప్రదర్శనలు ఇచ్చింది. ఈ ఏడాది జూన్ లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో భోపాల్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చింది.నృత్యంలో ‘భేష్’ అనిపించుకున్న అనూష ఉద్యోగ జీవితంలో ‘ది బెస్ట్’ అనిపించుకుంది.‘గుంటూరు డివిజన్ కు 2022లో వచ్చాను. కృష్ణకెనాల్ జంక్షన్ నుంచి కృష్ణా నదివైపు ఉన్న ట్రాక్ వీక్‌గా ఉండేది. దీనికోసం ప్రతి ఏటా 50 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చేది. జియో టైల్స్, జియో బ్రిడ్జెస్ వేసి కొత్త తరహాలో ట్రాక్‌ను పటిష్టపరిచాము. దీనివల్ల ఇప్పుడు ఏడాదికి రెండు లక్షలు కూడా ఖర్చు అవ్వడం లేదు. పెద్ద పెద్ద యంత్రాలు వాడకుండా ఎన్నో పనులను వినూత్న రీతిలో పూర్తి చేశాము. దీనికి కూడా జీఎం నుంచి ప్రశంసలు అందుకున్నాను. ఈ ప్రయోగాలు గుంటూరు డివిజన్ కు బోలెడంత పేరు తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే రైల్వేబోర్డు నన్ను గుర్తించింది. అతి విశిష్ట రైలు సేవా పురస్కారం దక్కింది. మన కష్టం వల్ల వచ్చిన ఫలితాన్ని చూసినప్పుడు వృత్తిపట్ల అంకితభావం మరింతగా పెరుగుతుంది’ అంటుంది అనూష. వృత్తి జీవితంలో, కూచిపూడి నృత్యకారిణిగా ఆమె మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆశిద్దాం.ఎన్నో అడ్డంకులు... అయినా సరే ముందుకు వెళ్లాం!నా భర్త అస్సాం కేడర్ ఐఏఎస్ కావడంతో నాకు కూడా నార్త్ ఈస్ట్ రైల్వేలో పోస్టింగ్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్‌గా వచ్చింది. అక్కడ తీవ్రవాదంతో పాటు బ్రహ్మపుత్ర వరదల సమస్య ఎక్కువగా ఉన్న కారణంగా ఏడాదిలో ఎనిమిది నెలలు ΄్లానింగ్, నాలుగు నెలలు మాత్రమే ఎగ్జిక్యూషన్ ఉండేది. అక్కడ ఉన్న పరిస్థితుల్లో రైలు నడిచేలా చర్యలు తీసుకోవడంతోపాటు సిబ్బందిని కాపాడుకోవడం కూడా ఒక పెద్ద టాస్క్‌లా ఉండేది. ఎన్నో ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు సాగాము. రెండు వర్గాల మద్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలో రైల్వే కూడా రాష్ట్ర పరిధిలోకి వచ్చింది. మేం కూడా వారితో కలిసి ప్రశాంతత నెలకొల్పే విషయంలో గట్టిగా పనిచేశాం. గౌరీపూర్ నుంచి బిలాస్పూర్ వరకూ కొత్త రైల్వేలైన్ వేసిన సమయంలో బ్రహ్మపుత్రపై పెద్ద పెద్ద బ్రిడ్జీల నిర్మాణం విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. భూసేకరణ కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. అన్నింటిని అధిగమించి రైల్వే లైన్ పూర్తి చేయడం పెద్ద అచీవ్మెంట్. దీనికి గుర్తింపుగా రైల్వే జీఎం అవార్డు వచ్చింది.– జవ్వాది వెంకట అనూష– దాళా రమేష్‌బాబు, సాక్షి ప్రతినిధి గుంటూరుఫోటోలు: షేక్ సుభానీ, లక్ష్మీపురం -
‘హామీలు ఇచ్చి మర్చిపోవడం చంద్రబాబుకి అలవాటే’
సాక్షి,గుంటూరు : కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ చార్జీల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.15,485 కోట్ల భారాన్ని మోపింది. ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ పోరుబాట కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి పార్టీ నేతలు వైఎస్సార్సీపీ పోరుబాట పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం గుంటూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ‘విద్యుత్ చార్జీల బాదుడుపై వైఎస్సార్సీపీ పోరుబాట’ పేరుతో పోస్టర్‌ను ఆవిష్కరించింది. పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, నూరి ఫాతిమాలు పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఈనెల 27న రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నాం. ఆరు నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. వైఎస్సార్సీపీ పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచారని తాము అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచమని చెప్పారు. ఛార్జీలు తగ్గిస్తామన్నారు. కానీ భారీ మొత్తంగా విద్యుత్ ఛార్జీలు పెంచారు. రెండు నెలల్లో రూ. 15484 కోట్ల భారం మోపారు. కూటమి నేతలకు రాష్ట్ర ప్రజలకు శఠగోపం పెట్టారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం, ఎన్నికలకు ముందు హమీలివ్వడం.. ఆ తర్వాత వాటిని మర్చిపోవడం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు.ప్రజలు అండగా వైఎస్సార్సీపీ పోరు బాట : భూమన వైఎస్సార్సీపీ పోరు బాట పోస్టర్‌ను ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. చంద్రబాబు ,పవన్ కళ్యాణలు ఎన్నికలకు ముందు విద్యుత్ భారాన్ని మోపమని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. రెండు విడతలగా 15 వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారం మోపారు. సూపర్ సిక్స్‌లో ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రతి నెలా డైవర్ట్ చేస్తున్నారు.ప్రతి పేదవాడి ఇంటికి 200యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపి, ధరలు పెంచి వారి నడ్డివిరుస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్సీపీ ఉంటుంది. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ విధంగా పోరాటాలు చేశారో.. అదే విధంగా మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం.మూడు లక్షల కోట్లు రూపాయలు ప్రజలకు నేరుగా అందించిన ఘనత వైఎస్ జగన్‌దే. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళన చేపడతాం. డిసెంబర్ 27వ తేదీ విద్యుత్ కార్యాలయాల్లో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై వినతి పత్రాన్ని ఇస్తాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. -
గుంటూరులో కొనసాగుతున్న టీడీపీ నేతల అరాచకం
-
పూర్తిగా చంద్రముఖిలా మారిన చంద్రబాబు.. వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో కుంభకోణాల మీద కుంభకోణాలు జరుగుతున్నాయి. చంద్రబాబు పూర్తిగా చంద్రముఖిగా మారిపోయారు.. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా.. ఇలా మాఫియాలు చేస్తున్నారన్నారని వైఎస్ జగన్ అన్నారు. ఇలాంటి సమయంలోనే మనం గొంతు విప్పాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. నాయకులుగా ఎదగడానికి ఇదొక అవకాశమని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ మాట్లాడుతూ.. ‘ఆరు నెలలు తిరక్కముందే చంద్రబాబు ప్రభుత్వంమీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీదా లేదు. ప్రతి కుటుంబానికి మనం మంచి చేశాం. కానీ, చంద్రబాబు అంతకంటే ఎక్కడు చేస్తానంటూ, ప్రతీ ఇంట్లో ప్రతీ ఒక్కరికీ ఒక హామీ ఇచ్చాడు. మనం కూడా అలాంటి హామీలు ఇద్దామని చాలామంది నాతో అన్నారు. గడచిన ఐదేళ్లలో చరిత్రలో ఎప్పుడూ చూడని మార్పులు మనం తీసుకువచ్చాం. ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశాం. మేనిఫెస్టోకు పవిత్రత తీసుకువచ్చాం, ప్రతీ హామీని తూచా తప్పకుండా అమలు చేశాం.చరిత్రలో వైఎస్సార్సీపీ ఒక్కటే..కోవిడ్ లాంటి సమస్యలు వచ్చినా, ప్రభుత్వ ఆదాయాలు తగ్గినా, ఖర్చు పెరిగినా, సాకులు చూపకుండా, కారణాలు చెప్పకుండా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేశాం. బడ్జెట్లోనే సంక్షేమ క్యాలెండర్ ప్రకటించాం. క్యాలెండర్ ప్రకారం ప్రతీ పథకాన్ని అమలు చేశాం. దేశ చరిత్రలో అమలు చేసిన పార్టీ ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే. చంద్రబాబు మాటలను పదిశాతం ప్రజలు నమ్మారు, నమ్మించగలిగారు. అందుకనే పరాజయం పాలయ్యాం. జగన్ చేశాడు కదా.. చంద్రబాబు కూడా చేస్తాడేమోనని కొంతమంది అనుకున్నారు. ఆరు నెలలు కూడా గడవకముందే చంద్రబాబు మోసాలు, అబద్ధాలు మన అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని లేపడమే, పులినోట్లో తలపెట్టడమే అని ఆరోజు చెప్పాను. దాన్ని ఇవాళ చంద్రబాబు నిజం చేస్తున్నారు. జగన్ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు పలావు పోయిందీ, బిర్యానీ పోయిందీ. ఉన్న పథకాలు పోయాయి.. ఇస్తానన్న పథకాలు రావడంలేదు. ఇప్పుడు ప్రజలపై బాదుడే బాదుడు మొదలైంది. ఆరు నెలల్లోనే ప్రజలపై కరెంటు ఛార్జీల రూపంలో భారం వేశాడు.అంతా మాఫియానే.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. స్కామ్‌ల మీద స్కాంలు నడుస్తున్నాయి. శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా.. ఇలా మాఫియాలు నడుస్తున్నాయి. మైనింగ్ జరగాలన్నా, ఏ కాంట్రాక్టు చేయాలన్నా ప్రతీ ఎమ్మెల్యే నుంచి మొదలుకుని ముఖ్యమంత్రి వరకూ నాకింత.. నీకింత అనే కార్యక్రమం నడుస్తోంది. మనం అంతా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ దిశగా పార్టీ అడుగులు వేయాలి. ప్రభుత్వం మీద వ్యతిరేకత పార్టీకి సానుకూలంగా మారాలంటే ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేయాలి. దీనిపై పార్టీ నాయకత్వాన్ని అంతా చైతన్యం చేస్తున్నాం. ఆరు నెలలకే మనం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు పాలన అలా నడుస్తోంది.రైతులు ఆగం..రైతులకు మనం ఏడాదికి ఇచ్చే రూ.13,500 ఎగిరిపోయింది.. చంద్రబాబు ఇస్తానన్న రూ.20వేలు ఇవ్వని పరిస్థితి ఉంది. ఉచిత పంటల బీమాను ఎత్తివేశారు. ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. పంటలకు ఎక్కడా గిట్టుబాటు ధరలు దొరకడం లేదు. ధాన్యం కొనుగోలు సమయంలోనే రైతులకు ఎఫ్‌టీవో ఇచ్చే వాళ్లం. రూ.300-400 తక్కువ రేటుకు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది. దీనిపై ఇది వరకే మనం కార్యక్రమం చేశాం. ఈనెల 27న కరెంటు ఛార్జీల మీద నిరసన వ్యక్తం చేస్తూ మరో కార్యక్రమం చేస్తున్నాం. పెరిగిన బిల్లులు చూపిస్తూ వాటిని కాల్చివేస్తున్న పరిస్థితులు చేస్తున్నాం. కరెంటు ఛార్జీల పెంపు మీద నిరసన కార్యక్రమాన్ని నియోజకవర్గాల స్థాయిలో చేపడుతున్నాం. మళ్లీ జనవరి 2న ఫీజు రియింబర్స్‌మెంట్, వసతి దీవెనమీద నిరసనలకు ప్లాన్ చేశాం.మన ప్రభుత్వ హయాంలో ప్రతీ త్రైమాసికానికి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పంపాం. జనవరి ఒకటో తేదీ నాటికి నాలుగు త్రైమాసికాలుగా ఫీజులు చెల్లించడం లేదు. అలాగే వసతి దీవెన బిల్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా రూ.3,900 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో చదువులకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. డబ్బులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. వీరికి అండగా జనవరి 3న జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమం చేస్తుంది:కష్టం ఎల్ల కాలం ఉండదు..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు, నష్టాలు ఉంటాయి. కేసులు కూడా పెడతారు, జైల్లో కూడా పెడతారు. ప్రతీ కష్టానికి ఫలితం ఉంటుంది. చీకటి తర్వాత వెలుగు కూడా వస్తుంది. ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా.. నావైపు చూడండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. నా భార్య బెయిల్ పిటిషన్ కనీసంగా 20 సార్లు పెట్టి ఉంటుంది. కింద కాంగ్రెస్, పైన కాంగ్రెస్. ఎన్ని కష్టాలు పెట్టినా.. నేను ముఖ్యమంత్రిని కాలేదా?. ఇది ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎల్లకాలం కష్టాలు ఉండవు. ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితులనైనా ఢీకొనేలా ఉందాం. మీ అందరికీ జగనన్న, పార్టీ తోడుగా ఉంటుంది.సాగునీటి సంఘాల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా చేశారు. వీఆర్వోలను మండల కేంద్రాలకు రప్పించి, పోలీసులను కాపలాగా పెట్టించి ఎన్నికలు జరిపారు. అలాంటప్పుడు ఎన్నికలు జరపడం ఎందుకు. రాజీనామాలు చేసి బయటకు వస్తే, రైతులు సంతోషంగా ఉన్నారా? లేదా? తెలుస్తుంది.విజన్ పేరిట మరో డ్రామా..విజన్ 2047 పేరిట మరో డ్రామా జరుగుతోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు, ఎల్లో మీడియా వారి మేనిఫెస్టోపై ఊదరగొట్టారు. ఈ మేనిఫెస్టోకు దిక్కులేదు, ఇప్పుడు 2047కు అర్థం ఏముంటుంది?. ఇప్పుడు చంద్రబాబు వయస్సు దాదాపు 80 ఏళ్లు. ఒక మనిషిని అభివృద్ధి బాటలో పట్టించడమే విజన్ అని నేను నమ్ముతాను. ఇప్పటి పిల్లాడు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలన్నదానిపై మనం ఆలోచనలు చేస్తే అది విజన్ అవుతుంది. అలాంటి ఆలోచనలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసింది. ప్రైవేటు స్కూల్స్.. గవర్నమెంటు స్కూల్స్‌తో పోటీపడే పరిస్థితిని తీసుకు వచ్చాం. ఉన్నత విద్యలో విద్యార్థులు అత్యాధునిక కోర్సులు చదువుకునేలా ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను నేర్చుకునే అవకాశం కల్పించాం.విజన్ మనది.. ఆరోగ్య రంగంలో కూడా విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చాం. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్ వ్యవస్థను తీసుకువచ్చాం. ప్రివెంటివ్ కేర్ విషయంలో అనేక చర్యలు తీసుకున్నాం. ఆర్బీకే వ్యవస్థ ఒక విజన్. ప్రతీ ఎకరాకు ఈ-క్రాప్ చేయడం విజన్. ప్రతీ ఎకరాకు ఉచిత పంటల బీమా తీసుకురావడం ఒక విజన్.రైతులకు కనీస మద్దతు ధర వచ్చేలా చేయడం ఒక విజన్. ఈ మార్పులన్నీ వచ్చింది వైయస్సార్సీపీ హయాంలోనే..మన ప్రభుత్వం రాక ముందు ఒక రూపాయి ప్రజలకు ఇస్తే.. అది నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి ఉండేదా?. హయంలో ఎక్కడా దళారీ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేర్చగలిగాం. గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి వద్దకే సేవలు అందించి గొప్ప విజన్‌ను తీసకురాగలిగాం. కానీ, రంగ రంగుల కథలు చెప్తున్నారు. దానికి విజన్ అని పేరుపెడుతున్నారు. దాన్ని విజన్ చేయడం అనరు.. దగా చేయడం అంటారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పెన్షన్లు కట్ చేశారు. కొత్త పెన్షన్లు ఒకరికి ఇవ్వకపోగా.. ఉన్న పెన్షన్లు కట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం పోరుబాటకు సిద్ధం కావాలి అని సూచనలు చేశారు. -
విజయ్ దివస్.. సాయుధ బలగాలకు సెల్యూట్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు విజయ్ దివస్. ఈ సందర్బంగా భారత సాయుధ బలగాల పరాక్రమంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం సైనికులు చేసిన ధైర్య సాహసాలను అందరూ స్మరించుకోవాలన్నారు.విజయ్ దివస్ సందర్భంగా వైఎస్ జగన్ స్పందించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘విజయ్ దివస్ సందర్భంగా మన సాయుధ బలగాల ధైర్యసాహసాలు, త్యాగాలను స్మరించుకుని, సెల్యూట్ చేద్దాం. 1971లో జరిగిన ఈ చారిత్రక విజయంలో మన సైనికులు చూపిన పరాక్రమం, సంకల్పం ఎనలేనిది. దేశం కోసం సైనికులు చేసిన ధైర్య సాహసాలు చరిత్రలో నిలిచిపోయేలా చేశాయి’ అని కామెంట్స్ చేశారు. On this special day of Vijay Diwas, we remember and salute the bravery and sacrifice of our armed forces. Their valor and determination in the historic 1971 victory liberated a nation and etched India’s courage in history. Jai Hind!— YS Jagan Mohan Reddy (@ysjagan) December 16, 2024 -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని మృతి
వాషింగ్టన్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన విద్యార్థిని నాగశ్రీ వందన పరిమళ మృతి చెందగా ఆమె ఇద్దరు స్నేహితులు గాయపడినట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీ వందన పరిమళ (26) ఉన్నత చదువుల కోసం 2022 డిసెంబర్లో అమెరికాకు వెళ్లారు. అక్కడ టెన్నెసీ రాష్ట్రంలోని మెంఫిస్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్)చదువుతున్నారు.అయితే ఈ తరుణంలో గత శుక్రవారం రాత్రి ఆమె తన స్నేహితులతో కలిసి కారులో వెళుతుండగా, రాక్‌వుడ్ ఎవెన్యూ సమీపంలో ట్రక్ వెనుక నుంచి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో నాగశ్రీ వందన పరిమళతో పాటు ఆమె స్నేహితులకు పవన్, నికిత్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్త ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వందన మరణించగా.. పవన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.కాగా, రోడ్డు ప్రమాదంలో నాగశ్రీ వందన పరిమళ మృతి చెందడంతో తెనాలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వందన భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అక్కడి అధికారులు, తెలుగు సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ప్రేమ్ కుమార్ ను బలవంతంగా తీసుకెళ్లారని కుటుంబ సభ్యుల ఫిర్యాదు
-
సోషల్ మీడియా కార్యకర్తని అర్థరాత్రి అరెస్టు చేసిన పోలీసులు
-
పోలీసుల పేరుతో అర్ధరాత్రి హల్చల్.. వైఎస్సార్సీపీ ప్రేమ్ కుమార్ ఎక్కడ?
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో అక్రమ కేసుల్లో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా గుంటూరులో సోషల్ మీడియా కార్యకర్తను అర్ధరాత్రి తీసుకువెళ్లడం తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై పోలీసులు సమాచారం ఇవ్వాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా ట్విట్టర్ వేదికగా అరెస్ట్ వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా అంబటి..‘గుంటూరుకి చెందిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త కొరిటిపాటి ప్రేమ్ కుమార్‌ను ఎవరో తీసుకెళ్లారు. అర్ధరాత్రి మూడు గంటలకు వచ్చి పోలీసులు అని చెప్పి.. ప్రేమ్ కుమార్‌ను తమ వెంట లాక్కెళ్లారు. ఈ ఘటనపై తక్షణమే పోలీసు డిపార్ట్మెంట్ ప్రేమ్ కుటుంబానికి సమాచారం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.ఇక, ఈ వీడియోలో కొందరు వ్యక్తులు ప్రేమ్ కుమార్‌కు తీసుకువెళ్తున్నారు. వారిలో ఏ ఒక్కరూ పోలీస్ యూనిఫామ్ ధరించకపోవడం గమనార్హం. మరోవైపు.. ప్రేమ్ కుమార్‌ను తీసుకున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు వారిని అడ్డుకున్నప్పటికీ వారు పట్టించుకోలేదు.ఈ సందర్బంగా తెలుగుదేశం నాయకులపైన పోస్టులు పెడతావా? అంటూ ప్రేమ్ కుమార్‌ను బలవంతంగా లాక్కెళ్లినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రేమ్ కుమార్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో ప్రేమ్ కుమార్‌ను బలవంతంగా ఎవరో తీసుకువెళ్లారని పోలీసులకు ఫిర్యాదుకు చేశారు. ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు.. ప్రేమ్ కుమార్‌కు వైఎస్సార్సీపీ నేతలు అండగా నిలిచారు. గుంటూరుకి చెందిన వైసిపి సోషల్ మీడియా కార్యకర్త కొరిటిపాటి ప్రేమ్ కుమార్ ని రాత్రి 3 గంటలకి పోలీసులని చెప్పి తీసుకువెళ్ళారు తక్షణమే పోలీసు డిపార్ట్మెంట్ ఆ కుటుంబానికి సమాచారం ఇవ్వాలి@Anitha_TDP @APPOLICE100 @dgpapofficial @police_guntur pic.twitter.com/k6kxGtOLqJ— Ambati Rambabu (@AmbatiRambabu) December 12, 2024ఇది కూడా చదవండి: మేడం చెప్పారు.. స్టేషన్‌కు రండి -
19 ఏళ్ల ఐటీ ఉద్యోగానికి బై చెప్పి, ప్రకృతి సేద్యంతో లాభాలు
దేశ విదేశాల్లో అధికాదాయాన్నిచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో అంతకంతకూ పెరిగే పని ఒత్తిడి, తీవ్ర అసంతృప్తి నుంచి బయటపడటానికి ప్రకృతితో తిరిగి మమేకం కావటం ఒక్కటే మార్గమని మునిపల్లె హరినాద్(52) భావించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె గ్రామానికి చెందిన కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి కుమారుడు హరినాద్. 1994లో బీటెక్ పూర్తి చేసి చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆస్ట్రేలియా, అమెరికా, యూకేలలో పనిచేశారు. నెలకు రూ. 1.5 లక్షల జీతంతో మిడిల్ మేనేజ్మెంట్ స్థాయిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ 2013లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎడతెగని పని వత్తిడితో నలుగుతూ కుటుంబానికి సమయం ఇవ్వలేని స్థితిలో ఎంత చేసినా సంతృప్తినివ్వని ఉద్యోగాన్ని కొనసాగించటం కన్నా.. సొంతూళ్లో కుటుంబ సభ్యులతో కలసి ప్రశాంతంగా జీవిస్తూ వారసత్వ భూమిలో సాధారణ రైతుగా కొత్త జీవితాన్ని ప్రారంభించటంలో నిజమైన ఆనందం ఉందని ఆయన భావించారు. ముందు నుంచే అధ్యయనంవిదేశాల్లో ఉన్న సమయంలో అక్కడి సూపర్ మార్కెట్లలో లభించే ఆర్గానిక్ ఉత్పత్తులకు ఆకర్షితులయ్యారు. ఖర్చు ఎక్కువైనా కల్తీలేని ఆహార పదార్ధాలను తాను కూడా ఎందుకు పండించేలేననే పట్టుదలతో ఇంటర్నెట్లో ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలనే అంశాలపై మూడేళ్లపాటు అధ్యయనం చేశారు. రసాయనిక అవశేషాల్లేని, పోషకాల సమతుల్యతతో కూడిన ఆరోగ్యాదాయకమైన ఆహారాన్ని పండించటమే ముఖ్యమైన పనిగా తలచి ఉద్యోగానికి 2013లో రాజీనామా ఇచ్చారు. ఆ కొత్తలోనే మధురైలో జరిగిన పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరంలో హరినాధ్ పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన ఇతర రైతులతో పరిచయాలు పెంచుకొని వారి క్షేత్రాలను సందర్శించి, వ్యవసాయం చేస్తూ నేర్చుకున్నారు. వారసత్వంగా సంక్రమించిన 2.5 ఎకరాల మాగాణి, అర ఎకరం మెట్టలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. (చిన్న ప్యాకెట్ : 30 రోజులైనా పండ్లు, కూరగాయలు పాడుకావు!)దిబ్బపై ఉద్యాన పంటలుమాగాణిలో సార్వాలో వరి, దాళ్వాలో మినుములు, పెసలు, నువ్వులు తదితర పంటలను హరినా«ద్ సాగు చేస్తున్నారు. మాగాణి పక్కనే 3 అడుగుల ఎత్తు దిబ్బగా ఉన్న అరెకరంలో పండ్లు, దుంపలు తదితర పంటలు పండిస్తున్నారు. అరటి, జామ, బొ΄్పాయి, కొబ్బరి, మునగ, కంద, అల్లం, కంద, మద్ది, మామిడి, టేకు పెంచుతున్నారు. తమ ప్రాంతంలో ఖరీఫ్‌లో వరి కోతలు అయ్యాక, రబీలో మొక్కజొన్న పూర్తయ్యాక పంట వ్యర్థాలను ఉత్తరాదిలో మాదిరిగా తగుల బెడుతున్నారని హరినా«ద్ తెలిపారు. గత ఏడాది ఇతర ΄÷లాల నుంచి వ్యాపించిన మంటలకు తమ అరెకరంలోని ఉద్యాన పంటలు కాలిపోయాయన్నారు. గోదావరి ఇసుకలు, కట్టుయానం...ప్రకృతి సేద్యానికి అనువైన దేశీ వరి రకాల సాగుపై హరినాద్ దృష్టి కేంద్రీకరించారు. వ్యవసాయం చేసిన అనుభవం లేక΄ోయినా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఒక్కో పని నేర్చుకుంటూ నిలదొక్కుకున్నారు. కాశీవిశ్వనాద్ (130 రోజులు) అనే సన్న తెల్ల వరి రకాన్ని 8 ఏళ్ల పాటు వరుసగా సాగు చేశారు. బీపీటీ కన్నా సన్నని ఈ రకం ధాన్యాన్ని పూర్తిగా ప్రకృతి సేద్యంలో ఎకరానికి అత్యధికంగా 25 బస్తాల దిగుబడి పొందారు. ఈ ఏడాది నుంచి 1.25 ఎకరాల్లో గోదావరి ఇసుకలు (110 రోజులు) సాగు చేస్తున్నారు. ఇది తెల్ల, సన్న రకం. త్వరలో నూర్పిడి చేయనున్నారు. ఎకరానికి 20 బస్తాల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. మరో 1.25 ఎకరాల్లో కట్టుయానం (180 రోజులు) అనే రెడ్ రైస్‌ను సాగు చేస్తున్నారు. ఇది 15 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రావచ్చని చెప్పారు.సంపూర్ణ సంతృప్తి, సంతోషం!ఉద్యోగ బాధ్యతల్లో అసంతృప్తి, పని ఒత్తిడితో ఏదో తెలియని వేదనకు గురయ్యాను. వారానికి 5 గంటలు నిద్రతో సరిపెట్టుకొని, పర్సనల్ పనులనూ మానుకొని, 3–4 నెలల ΄ాటు పనిచేసి ్ర΄ాజెక్టు పూర్తి చేసిన రోజులున్నాయి. డబ్బు వస్తుంది. కానీ, ఆ వత్తిడిమయ జీవితంలో సంతృప్తి, ఆనందం లేవు. గత 9 ఏళ్లుగా కుటుంబీకులతో ఉంటూ ప్రకృతి సేద్యం చేసే భాగ్యం కలిగింది. కుటుంబం అంతా మద్దతుగా నిలిచారు. రసాయనాల్లేకుండా వరి ధాన్యం తొలి ఏడాది 10 బస్తాల దిగుబడి తీయటం ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు 25 బస్తాల దిగుబడినిచ్చే స్థాయికి ΄÷లం సారవంతమైంది. ఈ ఏడాది జీవామృతం కూడా ఇవ్వలేదు. పూర్తి ప్రకృతి వ్యవసాయం అంటే ఇదే. రైతుగా మారి 6 కుటుంబాలకు ఏడాది ΄÷డవునా ఆరోగ్యదాయకమైన ఆహారం అందిస్తున్నా. అనేక ఆరోగ్య సమస్యలు తగ్గాయని, షుగర్‌ను నియంత్రించటం సులువైందని వారు చెబుతుంటే సంతృప్తిగా ఉంది. సొంతూళ్లో ప్రకృతి సేద్యం సంపూర్ణంగా సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తోంది. – మునిపల్లె హరినాద్ (93805 16443). మునిపల్లె, పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా ఈ ఏడాది జీవామృతమూ లేదు!పొలం దుక్కి చేయటం, రొటోవేటర్ వేయటం, దమ్ము చేయటం వంటి పనులను సొంత చిన్న ట్రాక్టర్‌తో స్వయంగా చేసుకోవటం నేర్చుకున్నారు హరినా«ద్. పచ్చిరొట్ట పంటలను కలియదున్నటం, జీవామృతం పిచికారీ, కాలువ నుంచి తోడుకునే నీటితో కలిపి ఆవు మూత్రం పారించటం చేస్తుంటారు. ఈ సంవత్సరం అవేవీ చెయ్యలేదన్నారు. అయినా, గోదావరి ఇసుకలు రకం ధాన్యం ఎకరానికి 20 బస్తాలకు తగ్గకుండా వస్తాయని సంతోషంగా తెలిపారు. నాట్లు, కలుపు తీత, కోతలు మనుషులతోనే చేయిస్తున్న హరినాద్కు ఎకరా వరి సాగుకు రూ. 35 వేల నుంచి 40 వేల వరకు ఖర్చు అవుతోంది. అన్నీ అనుకూలిస్తే రసాయనిక రైతులకు 40–45 బస్తాలు, తనకు 25 బస్తాల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని, అయినా తనకు మంచి ఆదాయమే వస్తున్నదన్నారు. ఆ ప్రాంతంలో అందరూ కౌలు రైతులే. కోత కోసి ఆ రోజే అమ్మేస్తుంటారు. హరినా«ద్ నెలకోసారి ధాన్యం మర పట్టించి కనీసం 6 కుటుంబాలకు నెల నెలా పంపుతూ ఉంటారు. కిలో బియ్యం రూ. వందకు అమ్ముతున్నారు. తాను నిర్ణయించిన ధరకు నేరుగా వినియోగదారులకు అమ్మటం వల్ల తనకు ఇతర రైతుల కన్నా అధికాదాయమే వస్తోందని హరినా«ద్ తెలిపారు. నేలను బాగు చేసుకుంటూ ఇతరులకూ ఆరోగ్యదాయక ఆహారాన్ని అందిస్తున్నానన్న సంతృప్తితో చాలా ఆనందంగా ఉన్నానని ఆయన తెలిపారు. – సయ్యద్ యాసిన్, సాక్షి, పొన్నూరు, గుంటూరు జిల్లా -
ఇక్కడ ఇళ్ల ధరలకు రెక్కలు..
దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో (టైర్–2) ఇళ్ల ధరలు ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో గణనీయంగా పెరిగాయి. 23 ప్రముఖ పట్టణాల్లో సగటున 65 శాతం ఎగిసినట్టు ప్రాప్ ఈక్విటీ సంస్థ వెల్లడించింది. అదే విధంగా ఐదు నగరాల్లో ధరలు తగ్గాయి.ముఖ్యంగా దక్షిణాదిన గుంటూరు పట్టణంలో 51 శాతం మేర ధరల్లో పెరుగుదల కనిపించింది. ఆ తర్వాత విశాఖపట్టణంలో 29 శాతం, విజయవాడలో 21 శాతం చొప్పున పెరిగాయి. దక్షిణాదిలోనే మంగళూరులో 41 శాతం, కోయింబత్తూర్‌లో 11 శాతం, గోవాలో 6 శాతం, కోచిలో 2 శాతం చొప్పున వృద్ధి చెందాయి. త్రివేండ్రంలో మాత్రం 4 శాతం, మైసూర్లో 14 శాతం చొప్పున ధరలు తగ్గాయి. జైపూర్ టాప్.. టైర్–2 పట్టణాల్లో దేశంలోనే అత్యధికంగా జైపూర్‌లో 65 శాతం మేర ధరలు పెరిగినట్టు ప్రాప్ ఈక్విటీ నివేదిక తెలిపింది. జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల్లో చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) ధర రూ.6,979కు చేరింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో రూ.4,240గా ఉండడం గమనార్హం. ఉత్తరాదిన ఆగ్రా.. ఉత్తరాదిన ఆగ్రాలో ఇళ్ల ధరలు 59 శాతం పెరిగాయి. ఆ తర్వాత చండీగఢ్‌లో 34 శాతం, బివాండిలో 25 శాతం, ఇండోర్‌లో 20 శాతం, డెహ్రాడూన్‌లో 14 శాతం, లుధియానాలో 11 శాతం, లక్నోలో ఒక శాతం చొప్పున ధరల్లో వృద్ధి కనిపించింది. భోపాల్‌లో 5 శాతం, మోహాలిలో 8 శాతం, సోనేపట్‌లో 26 శాతం చొప్పున ధరలు పతనమయ్యాయి.పశ్చిమాన గాంధీనగర్ పశ్చిమభారత్లో గాంధీనగర్‌లో అత్యధికంగా 19 శాతం మేర ఇళ్ల ధరలు ఎగిశాయి. ఆ తర్వాత సూరత్‌లో 14 శాతం, నాగ్‌పూర్‌లో 12 శాతం, వడోదరలో 10 శాతం, నాసిక్‌లో 4 శాతం, అహ్మదాబాద్‌లో 4 శాతం చొప్పున ధరలు పెరిగాయి. తూర్పున భువనేశ్వర్‌లో 15 శాతం, రాయ్‌పూర్‌లో 14 శాతం చొప్పున ఇళ్ల ధరల్లో వృద్ధి కనిపించింది.బలంగా డిమాండ్.. ‘‘టైర్–2 నగరాల్లో డెవలపర్లు, కార్పొరేట్లు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు, ఇన్వెస్టర్ల సమూహం నుంచి ఇళ్లకు ఆసక్తి పెరిగింది. ఈ నగరాల్లో భూమి చౌకగా లభించడం, మౌలిక ససతులతో పెద్ద ఎత్తున అనుసంధానత, బలమైన డిమాండ్ వెరసి ప్రీమియం, లగ్జరీ ఇళ్ల సరఫరా మెరుగుపడింది’’అని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజా తెలిపారు. -
గుంటూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టివేత
-
ఉద్యోగమని నమ్మించి చేపలు పట్టిస్తున్నారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టి యువకుల్ని తీసుకువెళ్లి.. వారితో కృష్ణా నదిలో చేపలు పట్టిస్తూ బందీలుగా మార్చుకుంటున్న వైనం వెలుగు చూసింది. ఈ ముఠా ఉచ్చులో చిక్కుకుని గుంటూరు జిల్లాకు చెందిన యువకుడు ప్రాణాలు అరచేత పట్టుకుని బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన ఆరిఫ్ అనే యువకుడు పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. ఉద్యోగ వేటలో ఉన్న ఆరిఫ్‌కు గుంటూరు నాజ్ సెంటర్‌కు చెందిన మొహిద్దీన్ పరిచయమయ్యాడు. వినుకొండలో చేపల అక్వేరియంలో ఉద్యోగం ఉందని.. వారానికి రూ.15 వేలు ఇస్తారని ఆరిఫ్‌ను మొహిద్దీన్ నమ్మించాడు. ఆ ఉద్యోగం కావాలంటే తనకు రూ.10 వేలు ఇవ్వాలన్నాడు. దీంతో ఆరిఫ్ తన బైక్ తాకట్టు పెట్టి రూ.10 వేలు ఇచ్చాడు. గత నెల 23న మొహిద్దీన్ కలిసి వ్యాన్‌లో బయలుదేరగా, గుంటూరులో మరో ఇద్దరిని, నరసరావుపేటలో మరో ముగ్గురిని ఎక్కించిన తర్వాత వ్యాన్‌లో ఖాళీలేదని, తాను వెనుక వస్తానని మొహిద్దీన్ మధ్యలో దిగిపోయాడు. రాత్రి నంద్యాల జిల్లా కొత్తపల్లి అడవుల్లోకి తీసుకెళ్లారు. అక్కడ కృష్ణా నదిలో పడవ ఎక్కించి సంగమేశ్వర వద్ద దింపారు. ఇక్కడకెందుకు తీసుకొచ్చారని అడగ్గా.. ఇక్కడ చేపలు పట్టాలని చెప్పి ఆరిఫ్ వద్ద ముఠా సభ్యులు ఫోన్ లాగేసుకున్నారు. ఎవరైనా వెళ్లిపోవడానికి ప్రయ త్నిస్తే ముఠా సభ్యులు చితకబాదుతుండటంతో ఆరిఫ్ బిక్కుబిక్కుమంటూ గడిపాడు. తన సెల్‌ఫోన్‌ను ఎలాగో దక్కించుకున్న ఆరిఫ్ ఇంకో వ్యక్తితో కలిసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. రోజంతా కొండల్లో నుంచి నడిచి బయటకు వచ్చి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. ఛార్జింగ్ అయిపోవడంతో ఫోన్ కట్ అయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై నల్లపాడు పోలీసుల సహాయంతో లొకేషన్ కనుక్కుని అక్కడికి వెళ్లారు. స్థానికులను విచారించగా.. ఇక్కడకు పనుల కోసం వచ్చిన వారిలో చాలామంది గల్లంతయ్యారని చెప్పడంతో ఆందోళన చెందారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే గుంటూరులో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకురావాలన్నారు. దీంతో ఆరిఫ్ కుటుంబ సభ్యులు తిరుగు ప్రయాణంలో మార్కాపురం రాగా.. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఆరిఫ్ ఇంటికి ఫోన్ చేసి కర్నూలు బస్టాండ్‌లో ఉన్నానని చెప్పడంతో వారు మార్కాపురం బస్ ఎక్కి రావాలని సూచించారు. అతను వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు మంగళవారం గుంటూరు చేరుకున్నారు. ముఠా వలలో చిక్కి పదుల సంఖ్యలో యువకులు అక్కడ ఉన్నారని, పోలీసులు వారిని కాపాడాలని ఆరిఫ్ ‘సాక్షి’కి తెలిపాడు. -
తిన్న కంచాన్ని కాళ్ళతో తన్నినట్టు...బాబు,పవన్ పై గుంటూరు వాలంటీర్లు ఫైర్
-
కోర్టు తీర్పుపై రిషితేశ్వరి తల్లిదండ్రుల ఆవేదన..
-
‘మా పాపకు అన్యాయం జరిగింది..’ రిషితేశ్వరి తల్లి కన్నీళ్లు
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును శుక్రవారం గుంటూరు కోర్టు కొట్టేసింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జడ్జి తీర్పు వెల్లడించారు. అయితే సాక్ష్యాలు ఇచ్చినా కూడా వాటిని కోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో అర్థం కావడం లేదని, ఈ కేసులో న్యాయం కోసం పోరాడతామని రిషితేశ్వరి తల్లి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది.రిషితేశ్వరి స్వస్థలం వరంగల్. నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ కోర్సు చేసిన ఆమె.. 2015 జులై 14వ తేదీన అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. అయితే తన ఆత్మహత్యకు ర్యాగింగే కారణమంటూ ఆమె రాసిన సూసైడ్ నోట్ దొరికింది. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే.. ర్యాగింగ్ వేధింపులతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలు లేవంటూ గుంటూరు జిల్లా ఐదవ కోర్టు .. తొమ్మిదేళ్ల విచారణ తర్వాత ఇప్పుడు కేసు కొట్టేసింది.‘‘మా పాప కేసులో మాకు అన్యాయం జరిగింది. ఈ కేసులో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మా పాప రాసిన డైరీ ని కూడా కోర్టుకు సబ్మిట్ చేశాం. మాకు న్యాయం చేయమని అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడిని, అప్పటి ఎస్పీ త్రిపాఠిని కలిశాం. మా పాపను ర్యాగింగ్ పేరుతో ఎలా వేధించారు రాసిన డైరీ ని కూడా ఒక కాపీ ఇచ్చాం. ఈ కేసులో 170 మంది సాక్షులు ఉన్నారు. మా అమ్మాయి రాసిన సూసైడ్ లెటర్‌ను ప్రతీ అధికారికి వాటిని సమర్పించాం. పది సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాం.. .. కానీ, మేమిచ్చిన సాక్ష్యాన్ని కోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అర్థం కావట్లేదు. న్యాయం కోసం అవసరమైతే సీఎం, డిప్యూటీ సీఎంలను కలుస్తాం. మాకు పైకోర్టుల్లో పోరాడే ఆర్థిక శక్తి లేదు. ప్రభుత్వమే సాయం చేయాలి. కేసులో న్యాయం జరగకపోతే మాకు మరణమే శరణ్యం’’ అని రిషితేశ్వరి తల్లి కన్నీళ్లు పెట్టకుంది.‘‘రిషితేశ్వరి ఆత్మహత్యకు ప్రేరేపించిన వారి పేర్లు డైరీలో ఉన్నాయి. ఆమె ఏ విధంగా వేధింపులకు గురైందో డైరీ ల్లో ఉన్నాయి. అవి అన్నీ కోర్టు ముందు ఉన్నాయి. తోటి విద్యార్థులు, సీనియర్లు ఏ విధంగా వేధించారో స్పష్టంగా ఉంది. ప్రిన్సిపాల్ బాబురావుకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. హాయ్ ల్యాండ్ లో ప్రెషర్స్ పార్టీలో లైంగికంగా వేధించారు. నిందితులకు శిక్ష పడుతుందని భావించాం. కానీ, కోర్టు కేసు కొట్టేసింది. ఈ తీర్పు న్యాయమైనది కాదని భావిస్తున్నాం. తీర్పుపై అప్పీల్ కు వెళ్ళాలన్నది నా నిర్ణయం. ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేస్తాను.::: రిషితేశ్వరి కేసులో స్పెషల్ పీపీ వైకే -
Ambati: సోషల్ మీడియా కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది
-
అధికారం శాశ్వతం కాదు.. గుర్తుంచుకోండి.. కూటమి ప్రభుత్వానికి విడుదల రజిని హెచ్చరిక
సాక్షి,పల్నాడు జిల్లా : అధికారం శాశ్వతం కాదు. గుర్తుంచుకోండి అని మాజీ మంత్రి విడుదల రజిని కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. పల్నాడు జిల్లా నరసరావు పేట జైల్లో ఉన్న వైఎస్సార్ సీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డిని పరామర్శించారు. అనంతరం విడదల రజిని మీడియాతో మాట్లాడారు.‘వైఎస్సార్సీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డి సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తే ఆయనపై అక్రమ కేసులు పెట్టారు. నరసరావుపేట జైలుకు పంపారు. కోటిరెడ్డికి 75 ఏళ్లు. సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్తే ఆ అధికారులను కోటిరెడ్డి కొట్టినట్టు, కులం పేరుతో దూషించినట్లు అక్రమ కేసులు బనాయించారు.ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే కోటిరెడ్డిపై కేసులు పెట్టారు. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. అది ఖచ్చితంగా రాజకీయ నాయకులు, పోలీసులు గుర్తు పెట్టుకోవాలి. వైఎస్సార్సీపీ నేతలు ఓ పథకం ప్రకారం జైలుకు పంపుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయి. రోజూ రాష్ట్రంలో ఎక్కడో చోట మహిళలపై దాడులు జరుగుతున్నాయి. మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఆనవాళ్లు దొరకడం లేదు. పోలీసులు మహిళలపై జరుగుతున్న దాడులపై దృష్టి పెట్టకుండా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై దృష్టి పెట్టారు’ అని విడదల రజిని మండిపడ్డారు. -
ఏపీ హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్ విచారణ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణల్పించాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అయితే.. తనపై నమోదైన కేసు కొట్టేయాలన్న పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. రామ్ గోపాల్ వర్మ అభ్యర్థనపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల నుంచి అరెస్టు ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని కోర్టు సూచించింది. ఈ క్రమంలోనే పోలీసుల విచారణకు తనకు మరికొంత సమయమిచ్చేలా ఆదేశించాలని కోర్టును ఆయన కోరారు. ఆ అభ్యర్థనను కూడా పోలీసులు ముందు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని వేసిన ఆర్జీవీ వేసిన పిటిషన్‌ను రెండు వారాల తర్వాతే విచారణ జరపనుంది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో నవంబర్ 19న పోలీసుల విచారణలో వర్మ పాల్గొనాల్సి ఉంది. -
Peruri Jyoti Varma: పవర్ ఫుల్
విరామం అంటే వెనక్కి తగ్గడం కాదు, పరాజయం అంతకంటే కాదు. విత్తనం నాటిన రోజు నుంచి అది పచ్చగా మొలకెత్తడానికి మధ్య కూడా విరామం ఉంటుంది. ఒకప్పుడు హ్యాండ్‌బాల్ గేమ్ నేషనల్ ప్లేయర్ అయిన జ్యోతి పెళ్లి తరువాత కుటుంబ బాధ్యతల వల్ల ఆటలకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. విరామం తర్వాత మళ్లీ ఆటల ప్రపంచంలోకి అడుగుపెట్టిన పేరూరి జ్యోతి పవర్ లిఫ్టింగ్‌లో తక్కువ సమయలోనే సాధన చేసి గోవాలో జరిగిన బెంచ్‌ప్రెస్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో 45 కిలోల బరువు ఎత్తి కాంస్యం సాధించింది. నిజానికి అది పతకం కాదు... అపూర్వమైన ఆత్మవిశ్వాసం...జ్యోతి స్వస్థలం మహారాష్ట్రలోని నాగ్‌పూర్. పెళ్లికిముందు హ్యాండ్‌బాల్ గేమ్‌లో నేషనల్ ప్లేయర్. 1994లో ‘విజ్ఞాన్ యూనివర్శిటీ’లో ప్రొఫెసర్‌గా చేస్తున్న డాక్టర్ పిఎల్ఎన్ వర్మతో వివాహం జరగడంతో గుంటూరుకు వచ్చింది. కుటుంబ బాధ్యతల వల్ల ఆటలకు దూరంగా ఉండక తప్పలేదు. అయితే వ్యాయామాలకు, యోగ సాధనకు విరామం ఇవ్వలేదు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, మగ్గం పని... వంటి అభిరుచుల పట్ల మక్కువను విడవలేదు. మనం అడుగుపెట్టే స్థలాలు కూడా భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి అంటారు. జ్యోతి విషయంలో అలాగే జరిగింది.ఏడాది క్రితం స్థానిక ‘ఇన్ఫినిటీ జిమ్’లో చేరి రకరకాల వ్యాయామాలు చేసేది. ఆమె ఉత్సాహం, పట్టుదల చూసి కోచ్ రమేష్ శర్మ ‘మీరు పవర్ లిఫ్టింగ్‌లో అద్భుతాలు సాధించగలరు’ అన్నారు. ఆమె నవ్వుతూ ఊరుకుంటే ఆ కథ అక్కడితో ముగిసేది. కోచ్ మాటలను ఆమె సీరియస్‌గా తీసుకుంది. ‘ఒకసారి ఎందుకు ప్రయత్నించకూడదు’ అనుకున్నది. అలా అనుకోవడంలో పతకాలు సాధించాలనే ఆశయం కంటే... ఆటల పట్ల చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టమే కారణం. ఆరు నెలల క్రితం పవర్ లిఫ్టింగ్‌లో సాధన మొదలుపెట్టింది. ఇది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించింది. ‘ఇంకా నువ్వు కాలేజీ స్టూడెంటే అని అనుకుంటున్నావా’ లాంటి వెటకారాలు వినిపించాయి. అయితే ఈ వెటకారాలు, మిరియాలు ఆమె సాధన ముందు నిలవలేకపోయాయి. మరింత దీక్షతో సాధన చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన మాస్టర్స్ నేషనల్స్‌లో కొద్దితేడాతో పతకం మిస్ అయింది. ‘పతకంతో తిరిగి వస్తావనుకున్నాం’ అన్నారు మిత్రులు. ‘వంద పతకాలతో తిరిగి వచ్చాను’ అన్నది జ్యోతి నవ్వుతూ. ఆమె చెప్పిన వంద పతకాలు... ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసంతోనే గోవాలో జరిగిన బెంచ్‌ప్రెస్ నేషనల్స్ చాంపియన్ షిప్లో రికార్డు స్థాయిలో 45 కేజీలు బరువు ఎత్తి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. నిజానికి ఇదిప్రారంభం మాత్రమే. ఆమె ఉత్సాహం, పట్టుదల చూస్తుంటే మరిన్ని విజయాలు ఆమె ఖాతాలో పడతాయని నిశ్చయంగా చెప్పవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే...ఏదైనా సాధించాలంటే మన విలువ మనం ముందుగా గుర్తించాలి. నిత్య వ్యాయామంతోనే ఆరోగ్యం సాధ్యం అవుతుంది. నాకు ఆరోగ్య సమస్యలున్నాయి. హైపో థైరాయిడ్, స్పాండిలైటిస్ నన్ను ఇబ్బంది పెట్టినా వాటిని అధిగమించి ముందుకు వెళ్తున్నాను. రోజూ యోగ, జిమ్, మెడిటేషన్, గార్డెనింగ్ చేస్తాను.– పేరూరి జ్యోతి– దాళా రమేష్‌బాబు, సాక్షి, గుంటూరుఫొటోలు: మురమళ్ల శ్రీనివాసరావు. -
గుంటూరులో మరో సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్