ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌ | YS Jagan extends Ramzan greetings | Sakshi
Sakshi News home page

ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

Published Mon, Mar 31 2025 7:53 AM | Last Updated on Mon, Mar 31 2025 11:51 AM

YS Jagan extends Ramzan greetings

సాక్షి, తాడేపల్లి: ముస్లిం సోదరులకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు. అల్లా చూపిన మార్గంలో న‌డవాల‌ని, అల్లా చ‌ల్ల‌ని దీవెన‌లు అంద‌రికీ ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు

రంజాన్‌ పండుగ సందర్బంగా వైఎస్‌ జగన్‌..‘ముస్లింలకు రంజాన్‌ పండుగ ఎంతో పవిత్రమైనది. రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత. పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుక. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement