Ramzan
-
Shoaib Malik-Sana Celebrate Eid:భార్య సనా జావెద్‌తో షోయబ్ మాలిక్ రంజాన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Eid Mubarak 2024: సానియా మీర్జాతో ఐఏఎస్ స్మితా సబర్వాల్ రంజాన్ వేడుకలు.. ఫొటోలు వైరల్
-
రంజాన్ నెలలో 10 లక్షల బిర్యానీ ఆర్డర్లు లాగించేసిన హైదరాబాదీలు
బిర్యానీ.. ఈ పేరు వింటే చాలు నోటిలో నీళ్లు ఊరాల్సిందే. బిర్యానీ వాసనకే సగం కడుపు నిండిపోతుంది. ఎప్పుడు రెస్టారెంట్‌కు వెళ్లినా బిర్యానీ తినకుంటే మాత్రం భోజనం అసంపూర్తిగా అనిపిస్తుంటుంది. ఇక మన హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ బిర్యానీ ఘుమఘుమలకు ఒక్క తెలుగు వారేంటి.. దేశవిదేశీయులు ఫిదా అవ్వాల్సిందే. అంతటి గొప్ప పేరును కలిగిన బిర్యానీని రంజాన్ మాసంలో హైదరాబాద్ వాసులు తెగ లాంగించారట.. ఈ ఒక్క నెలలోనే ఏకంగా పది లక్షలు(1 మిలియన్) బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. బిర్యానీ ఆర్డర్లలో దేశవ్యాప్తంగా హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచిందని పేర్కొంది. బిర్యానీతో పాటు హలీమ్ ఆర్డర్లలోనూ నగర వాసులు రికార్డు సృష్టించారని, నెల రోజుల వ్యవధిలో 5.3 లక్షల ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. ఈ ఏడాది రంజాన్ మాసం మార్చి 11న ప్రారంభమైన విషయం తెలిసిందే. నేటితో(శుక్రవారం) ముగిసింది. ఈ క్రమంలో తాజాగా దేశవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ ఆర్డర్ల గురించి వివరాలను స్విగ్గీ ప్రకటించింది. ఈ నెల రోజుల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 60 లక్షల పేట్ల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసినట్లు తెలిపింది. మిగతా నెలలతో పోలిస్తే రంజాన్ నెలలో బిర్యానీ ఆర్డర్లు 15 శాతం పెరిగాయని పేర్కొంది. రంజాన్ సందర్భంగా సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్య ఇఫ్తార్ ఆర్డర్లు 34% పెరిగినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఇఫ్తార్ ఆర్డర్లలోలో చికెన్ బిర్యానీ, మటన్ హలీమ్, సమోసా, ఫలుదా, ఖీర్‌లు టాప్ ప్లేస్‌లో ఉన్నట్లు చెప్పింది. హలీమ్ ఆర్డర్లలో ఏకంగా 1454.88 శాతం పెరుగుదల నమోదైందని, దీని తర్వాతి స్థానంలో ఫిర్ని ఆర్డర్లలో 80.97 శాతం, మాల్పువా ఆర్డర్లు 79.09 శాతం, ఫలుదా 57,93 శాతం, డేట్స్ 48.40 శాతం ఆర్డర్లు పెరిగాయని పేర్కొంది. -
అడ్వాన్స్డ్ ఈద్ ముబారక్.. ఇఫ్తార్ విందులో సీఎం వైఎస్ జగన్
సాక్షి, పుట్టపర్తి/కదిరి అర్బన్/బత్తలపల్లి: అందరికీ మేలు జరగాలని, ముస్లిం సోదరులందరికీ ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు (అడ్వాన్స్డ్ ఈద్ ముబారక్) తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. సోమవారం సాయంత్రం శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ముస్లిం సోదరులతో ఆప్యాయంగా మాట్లాడారు. విందులో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఉషశ్రీచరణ్, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, జఖియాఖానమ్, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, మాజీ మంత్రి షాకీర్, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, కదిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి బీఎస్ మక్బుల్, సీనియర్ నేతలు వజ్రభాస్కర్‌రెడ్డి, పూల శ్రీనివాసరెడ్డి, పెద్దసంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. -
Ramzan: సుర్మాతో.. కంటి సంబంధిత వ్యాధులకు చెక్!
ముస్లింలు పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసంలో ‘సుర్మా’ ఆద్యంతం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ప్రత్యేకత చాటుతోంది. ఈ మాసంలో ముస్లింలు వయోభేదం లేకుండా త్రికరణ శుద్ధితో ఉపవాసం(రోజా)ఉంటారు. ఖురాన్ పఠిస్తూ ఐదు పూటలా నమాజ్ ఆచరిస్తారు. మహ్మద్ ప్రవక్త బాటను అనుసరిస్తూ నిష్టగా ఉంటారు. ఈ క్రమంలో ఈ మాసంలో ముస్లింల నేత్రాలకు అలంకరించే సుర్మాకు ఎంతో విశిష్టత ఉంది. విధిగా కళ్లకు సుర్మా అలంకరించడం పవిత్ర కార్యంగా భావిస్తారు. సువాసన వెదజల్లే అత్తర్లకు ప్రాధాన్యమిస్తారు. ఇదీ.. సుర్మా ప్రశస్తి.. నిత్యం అల్లాహ్ నామస్మరణలో గడిపే దైవప్రవక్త హజ్రత్ మూసా అలైహిసలా తుస్సలాంకు అల్లా ప్రసన్నం పొంది అతడిని అల్లా ఎక్కడున్నాడో చూపించమని అనునయులు కోరుతారు. దీంతో ఈజిప్టు, సిరియా ప్రాంతాలకు చెందిన పెద్దలను సమీపంలోని కోహితూర్ పర్వతం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఒక్కసారి అల్లాహ్ నూర్ (ఓ వెలుగు)ప్రత్యక్షంకావడం చూసి ఆశ్చర్యానికి గురవుతారు.అప్పుడే కోహితూర్ పర్వతం భస్మమై బూడిదగా(చూర్ణంగా) మారుతుంది. దైవసంకల్పం కళ్లెదుట సాక్షాత్కరించడంతో తమలోని భక్తి ఉప్పొంగి ఆ చూర్ణాన్ని వారు కళ్లకు అద్దుకుంటారు. ఈ సమయంలో తమ కళ్లకు సుదూరంలోని చీమల కదలికలను సైతం పసిగట్టే విధంగా ప్రకాశవంతం కావడం గమనించి అల్లాహ్ కృపవల్లనే సాధ్యపడిందని భావిస్తారు. అప్పటి నుంచి కోహితూర్ పర్వతానికి చెందిన రాళ్ల చూర్ణమే క్రమంగా సుర్మాగా రూపాంతరం చెందిందనేది ముస్లింల ప్రగఢ నమ్మకం. కళ్లకెంతో మేలు..! భక్తితోపాటు వైద్యపరిభాషలోనూ ఈ సుర్మాకు ఆరోగ్యప్రదాయినిగా పేరుంది. కంటికి సంబంధించిన వ్యాధులకు నివారణగా, కళ్లకు చలువగా పనిచేస్తుంది. నమాజ్ చేయడానికి ముందు వజూ ఆచరించాక మహ్మద్‌ప్రవక్త కంటికి సుర్మా పెట్టుకునే వారని ప్రతీతి. రాత్రివేళ నిద్రపోయేముందు కళ్లకింద సుర్మ రాసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. సుర్మాతో కంటికి సంబంధించిన వ్యాధులు రావని నిరూపి తం కావడంతో ఇతరులు కూడా సుర్మాను రా సుకోవడానికి ఆకర్షితులవుతున్నారు. మహిళలు కళ్లకు కాటుక బదులు సుర్మా వాడడానికి ఇష్టపడుతున్నారు. అతిథులకు సుర్మ, అత్త ర్లు పూయడం ద్వారా గౌరవించే సంప్రదాయాన్ని ముస్లింలు కొనసాగిస్తున్నారు. సుర్మ, అత్తర్ల విక్రయాలు..! అనేక గ్రామాల్లో రంజాన్ సందర్భంగా అత్తర్లు, సుర్మా విక్రయాలకు గిరాకీ ఉంటుంది. దీనికోసం జిల్లాలో పలు అత్తర్లు, సుర్మా అమ్మకాల దుకాణాలు వెలిశాయి. సుర్మా కిలో పొడి ధర రూ.175 నుంచి రూ.550 వరకు ఉంటుంది. వీటిని చిన్న సీసాల్లో నింపి విక్రయిస్తుంటారు. ఇవి రూ10 నుంచి రూ . 100 విక్రయిస్తున్నారు. కంపెనీని బట్టి వీటి ధరలు నిర్ణయిస్తున్నారు. సుర్మాను భద్రపరచడానికి ఆకర్షణీయమైన ఆకారాల్లో సుర్మేన్లు (భరిణె) మార్కెట్లో ఉన్నాయి. వీటి ధర రూ.50 నుంచి రూ.300 వరకు అందుబాటులో ఉన్నాయి. ఇవి చదవండి: HOLI 2024: జీవితం వర్ణమయం -
రంజాన్ స్పెషల్: చిరంజీవిని కలిసిన అలీ..ఫోటోలు వైరల్
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా సినీ నటుడు అలీ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. ఇక రంజాన్ పర్వదినాన్ని చిరంజీవితో పంచుకోవడం ఎంతో అందంగా ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. కాగా అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. -
ముస్లింలకు ఈద్ ముబారక్ తెలుపుతూ సీఎం జగన్ ట్వీట్
-
రంజాన్ సందడి
సాక్షి, చైన్నె: నెలవంక కన్పించడంతో శనివారం రంజాన్ పండుగను జరుపుకునేందుకు రాష్ట్రంలోని ముస్లింలు సిద్ధమయ్యారు. ప్రత్యేక ప్రార్థనలకు మసీదులు ముస్తాబయ్యాయి. ముస్లింలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో పండుగ సందడి మిన్నంటుతోంది. మహ్మద్ ప్రవక్త సూక్తుల మేరకు పుణ్య కార్యాలకు, సమత మమతలకు నెలవుగా రంజాన్ మాసం నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ మాసంలో నరక ద్వారాలు మూసుకుని, స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయన్నది ముస్లింల నమ్మకం. అందుకే పాప కర్మల నుంచి విముక్తి పొందడానికి ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఈ మాసంలో ఉపవాస దీక్షల్ని (రోజా) ఆచరించారు. పేద, గొప్ప అన్న బేధం లేకుండా అల్లాకు విశ్వాసపాత్రులుగా ఉంటూ సేవల్లో నిమగ్నమయ్యారు. ధాన ధర్మాలు చేస్తూ ఈద్ ముబారక్ వేళకు సన్నద్ధమయ్యారు. నేడు పండుగ.. శుక్రవారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో శనివారం పండుగను జరుపుకునే విధంగా ప్రభుత్వ ఖాజీ ప్రకటించారు. దీంతో పరస్పరం ముస్లింలు మసీదుల వద్ద శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఉదయాన్నే పండుగను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. పవిత్ర రంజాన్ కోసం కొత్త బట్టల కొనుగోళ్లను ఇప్పటికే పూర్తి చేశారు. వస్తువుల కొనుగోళ్ల నిమిత్తం షాపింగ్ సెంటర్లకు తరలివచ్చారు. దీంతో ముస్లింలు అత్యధికంగా ఉండే నగరాలు, పట్టణాలు, ప్రాంతాలలో పండుగ వాతావరణం మిన్నంటుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం కొన్ని చోట్ల ఉదయం తొమ్మిది గంటలకు, మరికొన్ని చోట్ల తొమ్మిదిన్నర, పది గంటలకు రంజాన్ ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ఈద్గా మైదానాల్లో మరికొన్ని మసీదుల్లో ప్రార్థనలు జరగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని మసీదులను విద్యుద్దీప కాంతులతో అలంకరించి ఉండడం విశేషం. మరికొన్ని చోట్ల ఎండ వేడి నుంచి ఉపశమనం కల్గే విధంగా షామియానాలను, పందిళ్లను ఏర్పాటు చేశారు. అలాగే, రంజాన్ రోజున మాంసం విందు కోసం రాష్ట్రంలోని సంతలలో శుక్రవారం ఒక్క రోజు రూ.20 కోట్ల విలువ గల మేకలు, గోర్రెల విక్రయాలు జరిగాయి. ఇదిలా ఉండగా సౌదీ అరేబియాలో శుక్రవారం రంజాన్ పండుగ జరగడంతో ఆ కాలమానాన్ని అనుసరిస్తూ రాష్ట్రంలో కొన్ని మైనారిటీ సంఘాల నేతృత్వంలో ఈద్ ప్రార్థనలు జరిగాయి. నేతల శుభాకాంక్షలు.. రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని ముస్లింలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ప్రధాన ప్రతి పక్ష నేత, అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరుసెల్వం తమ వేర్వేరు ప్రకటనలలో ముస్లింలు అందరూ ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. రంజాన్ ప్రత్యేక ప్రార్థనలతో కుటుంబసమేతంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. ప్రేమానురాగాలు, సోదరభావం, సమానత్వం వికసించాలని ఆకాంక్షించారు. అలాగే డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, పీఎంకే నేత రాందాసు, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, ఎస్ఎంకే నేత శరత్‌కుమార్, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్, మనిద నేయ మక్కల్ కట్చి నేత జవహరుల్లా, తమిళ మానిల కాంగ్రెస్ అధినేత జీకే వాసన్, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్, చిన్నమ్మ శశికళ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ అళగిరి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. -
రంజాన్ కోసం అలీ దంపతుల ప్రిపరేషన్ చూస్తే కళ్లు చెదరాల్సిందే! ( ఫొటోలు)
-
హైదరాబాద్ అంటే చాలా ఇష్టం
-
రంజాన్: నోరూరిస్తున్న వంటలు.. జోరందుకున్న పాయాషోర్వా
సాక్షి,చార్మినార్: రంజాన్ మాసంలో వంటలు నోరూరిస్తున్నాయి. పాతబస్తీలో సాధారణ రోజుల్లో లభించే నాన్కీ రోటి, పాయాషోర్వా విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. రంజాన్ మాసంలో వీటిని విక్రయించే హోటళ్లు అధికంగా ఉంటాయి. దీంతో ఈ వంటకం కోసం క్యూ కడుతున్నారు. పాతబస్తీ సంస్కృతికి ఆచార వ్యవహారాలకు నాన్కీ రోటి గుర్తుగా నిలుస్తోంది. ఒకప్పుడు కేవలం ముస్లింలు మాత్రమే తినేవారు. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు లొట్టలేసుకొని మరీ తింటున్నారు. సాధారణ రోజుల్లో చాలా ముస్లిం కుటుంబాలు ఉదయం లేవగానే బ్రేక్ పాస్ట్‌లో నాన్కీ రోటిని పాయాషోర్వాతో కలిపి తింటారు. ► ఎలాంటి మసాలా దినుసులు, నూనె పదార్థాలు వాడకుండా కేవలం మైదా పిండితో తయారవుతుండటంతో పేదవారి దగ్గర నుంచి సంపన్న వర్గాల వరకు అందుబాటులో ఉంటుంది. ► పర్షియా భాషలో రోటిని ‘నాన్’ అంటారు. 400 ఏళ్ల క్రితమే ఈ వంటకం మనకు అలవాటైంది. ఇరాన్, టర్కీ దేశాలకు చెందిన ఈ ‘డిష్’ అరబ్బు దేశాల నుంచి మన దేశానికి వ్యాపించింది. ► ఎముకలకు బలాన్నిచ్చే పోషక విలువలు అధికంగా ఉండటంతో పాతబస్తీ ప్రజలు ఇష్టంగా తింటారు. ఇక్కడి ప్రముఖ హోటళ్లలో తెల్లవారు జామున 4 గంటల నుంచే అందుబాటులో ఉంటుంది. -
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు నియమ, నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదన్నారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించింది రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానధర్మాల ద్వారా ఖర్చు చేస్తారన్నారు. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపు మాపేందుకు చేసే కఠోర దీక్షే రంజాన్ ఉపవాస దీక్ష అని చెప్పారు. ఈ మేరకు శనివారం సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఉపవాస దీక్షలు ఆచరించబోతున్న ప్రతి ఒక్కరికీ అల్లా దయతో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం జగన్ శనివారం ట్వీట్ చేశారు. రంజాన్ నెల ప్రారంభమవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు. నెల రోజులపాటు అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలు ఆచరించబోతున్న ప్రతి ఒక్కరికీ అల్లా దయతో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2022 కాగా, దేశవ్యాప్తంగా నెలవంక కనబడటంతో ఆదివారం నుంచి రంజాన్ నెల ప్రారంభమవుతుందని రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్‌పాషా ఖుత్తారీ తెలిపారు. హైదరాబాద్‌లోని మొజాంజాహీ మార్కెట్లోని కమిటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ముస్లింలు ఆదివారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభించాలని సూచించారు -
మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ లౌకికవాద రాష్ట్రంగా విరాజిల్లుతోందని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రంజాన్ మాసంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా, ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకొనేలా ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. రంజాన్ మాసం సమీపిస్తున్న తరుణంలో... మంత్రులు, ఎమ్మెల్యేలు, పలు ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నెల 3నుంచి మొదలయ్యే రంజాన్ మాసం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, మసీదులు, ఈద్గాలకు మరమ్మతులు చేసి, అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఉపవాస దీక్షల్లో ఉండే వారికి అవసరమైన నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చూడాలని, రాత్రి వేళల్లో హోటళ్లు, దుకాణాలను మూసేయించొద్దని సూచించారు. -
రంజాన్ సందర్బంగా సామూహిక ప్రార్థనలు వద్దని విజ్ఞప్తి
-
తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ వేడుకలు
-
ముస్లిం సోదరులకు సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) తెలిపారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని, కరోనా మహమ్మారి నుంచి బయట పడి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లిం సోదరసోదరీమణులంతా నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో నిష్టగా అల్లాను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తారని ముఖ్యమంత్రి అన్నారు. అల్లా రక్షణ, కరుణ పొందాలనే లక్ష్యంతో రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని, ప్రతి ఒక్కరూ ఉన్నదానిలో ఎంతోకొంత దానధర్మాలు చేస్తారని, సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకొంటారని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. చదవండి : కోవిడ్ సంక్షోభంలో.. రైతు కష్టమే ఎక్కువ: సీఎం వైఎస్ జగన్ సీఎం జగన్ లేఖతోనే కదలిక -
ఎవరి ఇళ్లలో వారు ప్రార్థనలు చేసుకోవాలి: సీపీ అంజనీ కుమార్
-
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్: డిప్యూటీ సీఎం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ వేడుకలు జరుపుకోవాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. రంజాన్ పండుగపై రూయత్ హిలాల్ కమిటీ కూడా పలు సూచనలు చేసింది. రంజాన్ వేడుకలను శుక్రవారం రోజునే జరుపుకోవాలని కోరారు. మసీదులు, ఈద్గాలలో నలుగురు కంటే ఎక్కువ మంది ప్రార్థనలు చేయొద్దని సూచించారు. -
స్టార్ హీరో సినిమా: థియేటర్లో, ఓటీటీలో ఒకేసారి!
‘రాధే’ అనుకున్నట్టుగానే రంజాన్‌కు థియేటర్స్‌లో సందడి చేయనున్నాడు. అయితే ఈ నెల 13న ఒకేసారి ఇటు థియేటర్స్‌లో అటు ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కానుంది ‘రాధే’. ఓటీటీ డీల్ దాదాపు 230 కోట్లు ఉంటుందని బాలీవుడ్ టాక్. సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’. గత ఏడాది కరోనా సమయంలో కూడా ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్ వచ్చినా ముంబయ్ థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అభ్యర్ధనల మేరకు సల్మాన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ఒకేసారి ఓటీటీ, థియేటర్స్‌లో సినిమాను విడుదల చేస్తున్నారు. ముంబయ్‌లో థియేటర్స్ మూతబడటం, ఇంకా ఉత్తర, దక్షిణాదిన కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీటింగ్ వంటివి ‘రాధే’ సినిమాను ఇలా థియేటర్, ఓటీటీలో రిలీజ్ చేయడానికి కారణం అయ్యుంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చదవండి: ‘రంగస్థలం’ తమిళ ట్రైలర్: చిట్టిబాబు చింపేశాడుగా -
మర్కజ్లో ప్రార్థనలకు అనుమతి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని 50 మంది ప్రజలు రోజుకు 5 సార్లు ప్రార్థనలు చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. అయితే, కరోనా నేపథ్యంలో ప్రార్థనా స్థలాలను మూసివేయాలని ఢిల్లీ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(డీడీఎంఏ) జారీ చేసిన నోటిఫికేషన్లో లేదని వివరించింది. చాలా వరకు ప్రార్థనాస్థలాలు తెరిచే ఉంటున్నాయని పేర్కొంది. ఈ విషయంలో కేంద్రం కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలిపింది. డీడీఎంఏ ఈనెల 10వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్, ఇతర ప్రామాణిక కార్యాచరణ నిబంధనలకు లోబడి తమ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ రంజాన్ నెలలో నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంగణంలోని బంగ్లేవాలీ మసీదులోని బేస్మెంట్ పైనున్న మొదటి అంతస్తులో 50 మందికి రోజుకు 5 పర్యాయాలు నమాజ్ చేసుకునేందుకు అనుమతించాలని జస్టిస్ ముక్తా గుప్తా నిజాముద్దీన్ పోలీసులను ఆదేశించారు. డీడీఎంఏ ఉత్తర్వులతోపాటు, సామాజిక, మత, రాజకీయ, ఉత్సవ సంబంధ సమావేశాలను, ప్రజలు గుమికూడటాన్ని అనుమతించే విషయంలో అఫిడవిట్ సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. అయితే, మరింత మందిని అనుమతించాలనీ, మసీదులోని ఇతర అంతస్తుల్లో కూడా ప్రార్థనలు చేసుకునేందుకు వీలు కల్పించాలంటూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు తరఫున న్యాయవాది రమేశ్‌గుప్తా కోరగా కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా కోర్టు నిరాకరించింది. ఈ మేరకు నిజాముద్దీన్ ఎస్‌హెచ్‌వోకు దరఖాస్తు చేసుకోవచ్చనీ, దీనిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. ఇలా ఉండగా, కరోనా లాక్డౌన్ అమల్లో ఉండగా వేలాదిమందితో తబ్లిగీ జమాత్ నిర్వహించిన ఆరోపణలపై గత ఏడాది మార్చి 31వ తేదీ నుంచి మూతబడి ఉన్న నిజాముద్దీన్ మర్కజ్‌ను తిరిగి తెరిచేందుకు అనుమతివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై జూలై 15వ తేదీన విచారణ జరపనున్నట్లు హైకోర్టు తెలిపింది. చదవండి: ‘కుంభమేళా’పై విమర్శల వెల్లువ -
ముస్లిం ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వెసులుబాటు
సాక్షి, అమరావతి: రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. విధుల నుంచి గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 14 నుంచి మే 13 వరకు గంట ముందుగా ఇంటికి వెళ్లే అవకాశం కల్పించింది. రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం.. కోవిడ్ నిబంధనలతో రంజాన్ వేడుకలు నిర్వహించుకోవాలని సూచించింది. చదవండి: ఇ-వ్యవసాయం.. ఒక్క క్లిక్‌తో సమగ్ర సమాచారం హోంగార్డు భార్య మృతి కేసులో ట్విస్ట్ -
వస్త్రోత్పత్తిపై కరోనా పడగ
సిరిసిల్ల: ‘మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు’ఉంది సిరిసిల్ల నేతన్నల పరిస్థితి’. రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకునేందుకు వివిధ పథకాల్లో వస్త్రోత్పత్తి ఆర్డర్లను ఇస్తోంది. ఈ మేరకు బట్ట ఉత్పత్తి చేస్తూ.. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికులకు ఉపాధి కల్పిస్తూ.. వస్త్రోత్పత్తి రంగం ముందుకు సాగుతోంది. అంతా సాఫీగానే సాగుతుందని భావిస్తున్న తరుణంలో కోవిడ్–19 మహమ్మారి వస్త్రోత్పత్తి రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. రాష్ట్ర వ్యాప్తంగా 78 వేల మరమగ్గాలు ఉండగా.. ఒక్క సిరిసిల్లలోనే 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పాలిస్టర్ బట్టను కొనేవారు లేక వస్త్ర పరిశ్రమ కుదేలైంది. ప్రభుత్వం ఇచ్చిన సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), రంజాన్, బతుకమ్మ చీరల ఆర్డర్ల వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. వీటికి సంబంధించిన బిల్లులు అందక వస్త్రోత్పత్తిదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్లకు మొత్తంగా రూ.150 కోట్ల మేరకు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది మూలకు పడిన రంజాన్ బట్ట రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లింలకు కానుకగా అందించేందుకు సిరిసిల్లలోని వస్త్రోత్పత్తిదారులకు 26.23 లక్షల మీటర్ల షర్టింగ్ బట్టకు ఆర్డర్లు ఇచ్చారు. 2020 జనవరి 3వ తేదీన ఆర్డర్లు ఇచ్చిన జౌళిశాఖ అధికారులు.. ఫిబ్రవరి 20లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రంజాన్ బట్టను వస్త్రోత్పత్తిదారులు తయారు చేశారు. 10 లక్షల మీటర్ల బట్టను కొనుగోలు చేశారు. మరో 16.23 లక్షల మీటర్ల బట్ట కార్ఖానాల్లోనే ఉంది. ఈలోగా కరోనా లాక్డౌన్ రావడంతో సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్‌లో ఉత్పత్తి చేసిన రంజాన్ బట్ట నిల్వలు పేరుకుపోయాయి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి నూలు, కొనుగోలు చేసి, కార్మికులకు కూలి చెల్లించి అమ్మకానికి సిద్ధంగా ఉన్న బట్టను జౌళిశాఖ కొనుగోలు చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం రంజాన్ పండుగకు కొత్త బట్టలను పంపిణీ చేయలేదు. దీంతో సుమారు రూ.5.40 కోట్ల విలువైన నిల్వలు సిరిసిల్లలో ఉన్నాయి. ఎస్ఎస్ఏది అదే కథ సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ)లో 1.30 కోట్ల మీటర్ల బట్టను ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్లు ఇచ్చారు. వస్త్రోత్పత్తిదారులు ఆ మేరకు బట్ట ఉత్పత్తి చేశారు. పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ అందించాలని ప్రభుత్వం భావించి ముందే ఆర్డర్లు ఇచ్చింది. దీంతో ఉత్సాహంగా ఎస్ఎస్ఏ బట్ట ఉత్పత్తి అయింది. రూ.50 కోట్ల విలువైన బట్ట ఉత్పత్తి చేశారు. ఆరు నెలల కిందట ఈ బట్టను కొనుగోలు చేసిన జౌళిశాఖ ఇటీవల రూ.30 కోట్ల మేరకు చెల్లించింది. ఇంకా రూ.20 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. సంక్షేమ శాఖలకు సంబంధించి బట్టల బిల్లులు సైతం రూ.3 కోట్ల మేరకు ఇలాగే పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఇప్పుడు బతుకమ్మ చీరల ఉత్పత్తి పెట్టుబడిగా వస్త్రోత్పత్తిదారులు అప్పులు చేయాల్సి వస్తుంది. సిరిసిల్లలో ఏడు కోట్ల మీటర్ల బతుకమ్మ చీరల బట్టకు ఆర్డర్లు ఇవ్వగా దీని విలువ రూ.350 కోట్లు. 25 వేల మరమగ్గాలు, వెయ్యి ఆధునిక ర్యాపియర్ మగ్గాలపై 225 రంగుల్లో బతుకమ్మ చీరల ఉత్పత్తి సాగుతోంది. మంత్రి కేటీఆర్ వస్త్రోత్పత్తి ఆర్డర్ల బిల్లులు ఇప్పించాలని వస్త్రవ్యాపారులు కోరుతున్నారు. రూ. 30 కోట్లు ఇచ్చాం రంజాన్‌కు సంబంధించి కొనుగోలు చేసిన వస్త్రానికి ఇటీవల రూ.30 కోట్లు ఇచ్చాం. బతుకమ్మ చీరలను ఇప్పుడే సేకరిస్తున్నాం. దానికి ఎప్పటిలాగే పేమెంట్ ఇస్తాం. వస్త్రం క్వాలిటీ కంట్రోల్ నివేదిక వచ్చిన తరువాత గతంలో కొనుగోలు చేసిన వస్త్రాలకు సంబంధించి జీఎస్టీ బిల్లులను చూసి 10 శాతం బిల్లులను అందరికీ క్లియర్ చేస్తాం. బట్టను తీసుకున్న ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ఇంకా బిల్లులు రావాల్సి ఉన్నాయి. అవి రాగానే అన్నింటినీ క్లియర్ చేస్తాం. –శైలజా రామయ్యర్, జౌళిశాఖ డైరెక్టర్ -
తెల్లని కుర్తాలో మెరిసిన సానియా
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన వ్యక్తిగత , వృత్తిగత విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేసి అభిమానులను అలరిస్తారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఆమె తన కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్‌తో దిగిన ఓ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘రంజాన్ ఈద్ పండగ వేడుకలు’ అంటూ ఆమె క్యాప్షన్ జత చేశారు. కరోనా నేపథ్యంలో రంజాన్ పండుగను సానియా ఇంట్లోనే జరుపుకున్నారు. ఇక ముస్లిం సాంప్రదాయ వేషాధారణలో తెల్లని కుర్తాను ధరించిన సానియా.. ‘చాలా అందంగా కనిపిస్తున్నారు’అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సానియా ముద్దుల కొడుకు ఇజాన్స్ కూడా సంప్రదాయ దుస్తుల్లో క్యూట్‌గా ఉన్నాడు. ‘లాక్డౌన్ సమయంలో నేను మా కుంటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉంటూ రంజాన్ పండగ జరుపుకుంటున్నాను. దయ చేసి మీరు కూడా ఇంట్లోనే ఉండాలి’ అని సానియా మరో ట్వీట్లో అభిమానులకు విజ్ఞప్తి చేశారు. Eid vibes 🌙🤲🏽 #MyIzzy pic.twitter.com/O9BmeUBjql — Sania Mirza (@MirzaSania) May 25, 2020 -
ముస్లిం సోదరులకు ఏపీ గవర్నర్ శుభాకాంక్షలు
సాక్షి, రాజ్‌భవన్: క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికనే రంజాన్ పర్వదినం అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆయన ఆదివారం రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం ‘ఈద్ ఉల్ ఫితర్’ ముగిసిన శుభవేళ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఖురాన్ బోధనలు యుగ యుగాలుగా మానవాళిని ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. రంజాన్ మాస పవిత్రతతో ప్రతి వ్యక్తి మానసిక పరివర్తన చెంది ప్రేమమూర్తిగా మారుతాడని ఆయన అన్నారు. రంజాన్ మాసంలో ఆధ్యాత్మిక ఆరాధనతో అనుబంధం మరింత బలపడుతుందని గవర్నర్ చెప్పారు. క్రమశిక్షణను అనుసరిస్తూ శాంతి, సౌభ్రాతృత్వాన్ని లోకానికి చాటడంలో రంజాన్ మాసం ప్రత్యేకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కఠోర ఉపవాసవ్రతం సహనాన్ని పెంచుతుందని గవర్నర్ తెలిపారు. సర్వమానవాళి సమానత్వాన్ని చాటుతూ, దాతృత్వాన్ని అలవరచే పండుగ రంజాన్ అని ఆయన చెప్పారు. రంజాన్ పండుగ వేళ ఇస్లాంను గౌరవించే ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిసస్తునన్నానని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. -
రంజాన్ ప్రార్థనల్లో బుడ్డోడు.. నెటిజన్లు ఫిదా