రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు సూచించిన మార్గంలో క్రమశిక్షణతో జీవితం సాగించాలని గుర్తు చేయడమే రంజాన్ పండుగ ఉద్దేశమన్నారు. మానవత్వం, పవిత్రతతో అన్ని మతాలను గౌరవించే దృక్పథానికి కట్టుబడి ఉన్నామని రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాలన్నారు.
సీఎం కేసీఆర్ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు
ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. మానవత్వం, దైవ చింతనతో జరుపుకునే పండుగగా ఈద్ ఉల్ ఫితర్‌ను అభివర్ణించారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనల ద్వారా మన హృదయాన్ని, శరీరాన్ని పునీతం చేసుకోవటంతో పాటు ప్రాపంచిక సుఖాలపై నియంత్రణ సాధించవచ్చని అన్నారు. ఈద్ ఉల్ ఫితర్ సంబరాల్లో ముస్లిం సోదరులతో పాటు తెలంగాణ ప్రభుత్వం సైతం పాలు పంచుకుంటుందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరం అల్లాను ప్రార్ధిద్దామన్నారు.