ESL Narasimhan
-
గవర్నర్ నరసింహన్‌కు ఘనంగా వీడ్కోలు
-
దుఃఖం ఆపుకోలేకపోయారు...
సాక్షి, హైదరాబాద్ : ఎవరినీ నొప్పించని మనస్తత్వం, అందరినీ ఆప్యాయంగా పలకరించే స్వభావం గవర్నర్ నరసింహన్ సొంతం. తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం సేవలందించిన ఆయన... ఇక బై..బై అంటూ చెన్నైకి పయనమయ్యారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం ప్రగతిభవన్‌లో గవర్నర్ దంపతులకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్, విమలా నరసింహన్, సీఎం కేసీఆర్ ఉద్విగ్నానికి లోనయ్యారు. దుఃఖం ఆపుకోలేకపోయారు. మరోవైపు తమకు లభించిన ఆదరాభిమానాలకు చలించిన గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ కంటతడి పెట్టారు. కాగా అంతకు ముందు గవర్నర్ దంపతులను సీఎం దంపతులతోపాటు పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించారు. (చదవండి: నా పేరు నరసింహన్) -
భావోద్వేగానికి గురైన గవర్నర్ నరసింహన్
-
గవర్నర్ దంపతులకు ఆత్మీయ వీడ్కోలు
-
గవర్నర్ దంపతులను సాగనంపిన ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్ : బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ దంపతులు శనివారం సాయంత్రం చెన్నై బయలు దేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ప్రభుత్వాధికారులు వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసుల గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు. అంతకుముందు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలంగాణ గవర్నర్‌గా తమిళసై సౌందర్ రాజన్‌ను కేంద్రం నియమించిన నేపథ్యంలో నరసింహన్ సొంత రాష్ట్రం తమిళనాడుకు వెళ్తున్నారు. ఇక తెలంగాణ గవర్నర్‌గా తమిళసై సౌందర్ రాజన్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారానికి రాజ్‌భవన్‌లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. (చదవండి : మండపాల్లో కేసీఆర్ బొమ్మ చెక్కడంపై నిరసన) -
ప్రగతి భవన్లో గవర్నర్‌కు వీడ్కోలు సభ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ దంపతులకు ముఖ్యమంత్రి, మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. వీడ్కోలు అనంతరం గవర్నర్ ఈవాళ సాయంత్రం చెన్నై వెళ్లనున్నారు. మరోవైపు తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన తమిళసై సౌందర్ రాజన్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు రాజ్‌భవన్‌లో నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
అది నా వ్యక్తిగత జీవితంలో భాగం..
‘రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పడగా ఇరువురు సీఎంల నడుమ పలు సందర్భాల్లో విభేదాలు తలెత్తాయి. సాధ్యమైనంత మేర చర్చల ద్వారా వాటిని సామరస్యంగా పరిష్కరించా. భేద, దండోపాయాలతో సంబంధం లేకుండా సామ, దానాలతోనే సమస్యలు పరిష్కరించా’ అని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తెలిపారు. అంతరాత్మ ప్రబోధం మేరకు నడుచుకోవడంతోపాటు వ్యక్తిగత ఎజెండా లేకపోవడంతో సరైన మార్గంలో వెళ్లానన్నారు. తాను ఏ గ్రూపునకూ మద్దతివ్వలేదని, రాజ్యాంగ నిబంధనలకు లోబడే పనిచేశానని చెప్పారు. కేసీఆర్, జగన్‌కు అనుకూలంగా పనిచేశాననే ఆరోపణలు సరికాదన్నారు. ఏ పనిలోనైనా విమర్శలు సహజమన్నారు. తొమ్మిదిన్నరేళ్లకుపైగా ఉమ్మడి ఏపీ, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేసిన నరసింహన్.. మంగళవారం రాజ్‌భవన్ దర్బార్ హాల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గవర్నర్‌గా తనకు ఎదురైన అనుభవాలు, అనుభూతులను తనదైన చమత్కారపూరిత వ్యాఖ్యలతో పంచుకున్నారు. అలాగే తన శేషజీవితాన్ని ఎలా గడుపుతానో వివరించారు. గవర్నర్ల నియామకంలో పారదర్శకత, కేంద్రంలో సలహాదారు పదవి వంటి ప్రశ్నలపై ‘ఔటాఫ్ సిలబస్’అంటూ సమాధానం దాటవేశారు. నరసింహన్ పాలనానుభవాలు ఆయన మాటల్లోనే... – సాక్షి, హైదరాబాద్ కర్ఫ్యూ వాతావరణంలో బాధ్యతలు... ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు కర్ఫ్యూ వాతావరణంలో హైదరాబాద్‌లో అడుగు పెట్టా. శాంతిభద్రతల సమస్యతోపాటు కొందరు ఎమ్మెల్యేల రాజీనామాతో పాలన కూడా అస్తవ్యస్తంగా ఉండేది. రాష్ట్రపతి పాలన విధించేందుకే నన్ను గవర్నర్‌గా పంపారనే వార్తలు వచ్చాయి. కానీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పడంతోపాటు ఉద్యమంలో ఒక్క బుల్లెట్ కూడా కాల్చవద్దని చెప్పా. అలా జరిగితే ఉద్యమం పోలీసులకు వ్యతిరేకంగా మలుపు తిరుగుతుందని హెచ్చరించా. రాష్ట్ర విభజన జరిగితే ఇళ్లు, ఆస్తులు వదిలి వెళ్లాల్సి వస్తుందనే అపోహలు కొందరిలో ఉండేవి. కానీ రాజకీయ పార్టీలు, పోలీసులు, అధికారుల సహకారంతో అన్నింటినీ సమర్థంగా ఎదుర్కొన్నాం. రాష్ట్ర విభజన సమయంలో 3 నెలలపాటు రాష్ట్రపతి పాలనలోనూ కొన్ని సమస్యలు ఎదురైనా అందరి సహకారంతో ఎదుర్కొన్నా. ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో మొత్తం పరీక్షను రద్దు చేయడంపై అభ్యంతరాలు వచ్చినా లెక్కపెట్టలేదు. పుస్తకాలు రాయను.. రాజకీయాల్లో చేరను చెన్నైలోని వివిధ రెస్టారెంట్లలో దోసె, సాంబారు జుర్రుకుంటూ గడిపేస్తా. గవర్నర్‌గా పనిచేసిన కాలంలో చోటుచేసుకున్న ఘటనలపై పుస్తకం రాసే ఆలోచన లేదు. నేను రాజకీయాల్లో చేరను. జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా పనిచేయడంపై నాకు ఏ ఆహ్వానమూ అందలేదు. సోనియా, మోదీ సహా ఒక్కోక్కరికీ ఒక్కో రకమైన పాలనా శైలి ఉంటుంది. నేను జీవితంలో ఏదీ జరగాలని కోరుకోను. ఛత్తీస్‌గఢ్, ఉమ్మడి ఏపీ, తెలంగాణ, ఏపీ గవర్నర్‌గా సుదీర్ఘకాలం పనిచేస్తానని ఊహించలేదు. వ్యక్తిగతంగా గత తొమ్మిదిన్నరేళ్లలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. కొన్నిసార్లు నరుడిగా, మరికొన్ని సార్లు సింహంగా, ఇంకొన్నిసార్లు నరసింహన్‌గా రూపాలు ధరించాల్సి వచ్చింది. గవర్నర్‌గా రాక మునుపు సాదాసీదా ఉండేవాడిని. శేషజీవితాన్ని నాకు ఇష్టమున్న రీతిలో గడుపుతా. పోలీసు అధికారిగా అత్యున్నత పదవిలో ఉన్నప్పుడు కుటుంబానికి సమయం ఇచ్చేవాడిని. మీరూ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు మన రాష్ట్రం అనే భావనతో ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. సర్వాధికారిని కాదు... తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చే సందర్భంలో డిసెంబర్ 31వ తేదీ తర్వాత ఏం జరుగుతుందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా జనవరి 1వ తేదీ వస్తుందని బదులిచ్చా. దీంతో గవర్నర్ నరసింహన్ తెలంగాణ వ్యతిరేకి అంటూ విమర్శించారు. ఏదో సినిమాలో కూడా ఈ డైలాగ్‌ను పెట్టినట్లు గుర్తు. ‘సర్వాధికారి’ అంటూ ఓసారి నా శరీరానికి మహేశ్‌బాబు తలను కలిపి ఫొటో వేస్తే పరువునష్టం దావా వేస్తానని చెప్పా. నేను యూనిఫారం వేసుకున్నా. నేను అధికారినే తప్ప సర్వాధికారిని కాదు. అన్ని గుళ్లకూ వెళ్లలేదు... దేవుడి దయ, పెద్దల ఆశీస్సులు, ప్రజల ఆదరణతోనే గవర్నర్‌గా ఆటంకాలను అధిగమించా. ఏపీ, తెలంగాణ ప్రజల ఆదరాభిమా నాలు, మధుర జ్ఞాపకాలతో వెళ్తున్నా. ప్రతి అంశంపైనా నిర్మాణాత్మక విమర్శ అవసరమే. నేను గుళ్లకు వెళ్లడంపై మీడియాలో వచ్చే విమర్శలు సహా అన్ని రకాల వార్తలు చదువుతా. నేను గుడికి పోయి పాపాలు చేసి ఉండొచ్చు. నేను అన్ని గుడులకూ వెళ్లలేదు. కేవలం ఖైరతాబాద్ హనుమాన్, భద్రాచలం, యాదగిరిగుట్ట, తిరుమల దేవాలయాలనే సందర్శించా. దేవాలయాల సందర్శనపై వచ్చిన విమర్శలు కొన్నిసార్లు బాధించాయి. కొందరు పేకాట ఆడతారు. కొందరు మద్యం సేవిస్తారు. గుడులకు వెళ్లడం నా వ్యక్తిగత జీవితంలో భాగం. ఎమ్మెల్యేలు దాడి చేస్తారని ఊహించా.. ఉద్యమ సమయంలో ఏపీ ఉభయసభలను ఉద్దేశించి ప్రసం గించే సమయంలో శాసనసభ్యులు దాడి చేస్తారని ముందే ఊహించా. మైక్ లాక్కున్నా ప్రసంగం కొనసాగించేందుకు కార్డ్‌లెస్ మైక్ ధరించా. రక్తం కారినా ప్రసంగం ఆపొద్దని నిర్ణయించుకున్నా. ప్రసంగప్రతులు చింపేస్తారని కొన్ని అదనపు ప్రతులు వెంట తీసుకెళ్లా. సభ్యులు దూకడం, ఎగరడం వంటి వాటిని గమనిస్తూనే ప్రసంగాన్ని పూర్తి చేశా. అప్పుడు నవ్వడం మినహా ఏం చేయగలను? అదేరోజు సాయంత్రం నాగం జనార్దన్‌రెడ్డి ఓ వివాహ విందులో కలసి మీ ఆశీర్వాదాలు కావాలని అడిగారు. హోలీ సందర్భంగా ఓ నేత రాజ్‌భవన్‌లో రంగులు పూసి బయటకు వెళ్లాక గవర్నర్ గో బ్యాక్ అని నినాదాలు చేస్తానని ముందే చెప్పారు. రాజకీయ, వ్యక్తిగత, అధికారిక సంబంధాలను వేర్వేరుగా చూడటం వల్లే ఇన్నేళ్లపాటు పనిచేయగలిగా. నాతో పనిచేసిన సీఎంలంతా మంచివారే. -
భారీ గణనాథుడిని గవర్నర్ నరసింహన్ దంపతులు
-
తొలిపూజ నేనే చేస్తున్నా: నరసింహన్
సాక్షి, హైదరాబాద్ : వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ భారీ గణనాథుడిని గవర్నర్ నరసింహన్ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ఈ ఏడాది ద్వాదశాదిత్య రూపుడిగా దర్శనమిచ్చిన మహాగణపతికి తొలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ...తాను గవర్నర్ అయినప్పటి నుంచి ఖైరతాబాద్ గణేశ్‌ను దర్శించుకొని తొలి పూజ చేస్తున్నానని తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించేవారికి సకల శుభాలు కలుగుతాయన్నారు. వినాయకుడి ఆశీస్సులతో బంగారు తెలంగాణ... రత్నాల తెలంగాణ అవుతుందని ఆకాంక్షించారు. మరోవైపు ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడిని దర్శించుకునేందుకు పలువురు వీఐపీలతో పాటు సామాన్య భక్తులు కూడా భారీ సంఖ్యలో గణనాథుడి చెంతకు చేరుకుంటున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్ బండారు దత్తాత్రేయ, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయా రెడ్డి తదితరులు స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ సతీమణి అనితా నాగేందర్ స్వామి వారికి వెండితో తయారు చేసిన 75 అడుగుల జంధ్యాన్ని సమర్పించారు. అదే విధంగా లంగర్‌హౌస్‌కు చెందిన భక్తులు 750 కిలోల లడ్డూను మహాగణపతికి నివేదించారు. పద్మశాలి సంఘం ఖైరతాబాద్ నియోజకవర్గ ఆధ్వర్యంలో 75 అడుగుల జంధ్యం, కండువా, గరిక మాలను స్వామి వారికి అలంకరించారు. -
సంతృప్తిగా వెళ్తున్నా
సాక్షి, హైదరాబాద్ : ‘ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్‌గా సుదీర్ఘకాలం పనిచేసాను. గవర్నర్‌గా ఇన్నేళ్ల ప్రస్థానం పూర్తి సంతృప్తినిచ్చింది. తెలుగువారి ఆత్మీయాతానురాగాలతో వెళ్తున్నా’అని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. తెలంగాణకు కొత్త గవర్నర్‌గా డాక్టర్ తమిళిసై సౌందర రాజన్‌ను కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ మర్యాదపూర్వంగా మధ్యాహ్నం 3.30 గంటలకు నరసింహన్ని కలిశారు. సాయంత్రం 5.30 గంటల వరకు జరిగిన భేటీలో పలు విషయాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అత్యంత సుదీర్ఘకాలం గవర్నర్‌గా ఉమ్మడి ఏపీకి, తెలంగాణ ఏపీలకు గవర్నర్‌గా పనిచేయడం తన అదృష్టమని ఈ సందర్భంగా నరసింహన్ అన్నారు. ఇంతకాలం తెలుగు ప్రజలకు సేవచేయాల్సి రావడం తన పూర్వజన్మ సుకృతమని తెలిపారు. అభివృద్ధిలో రెండు రాష్ట్రాలు దూసుకుపోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇంతకాలం ఏపీ, తెలంగాణలో చేపట్టిన వివిధ ప్రతిష్టాత్మక, సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాష్ట్ర విభజన, తెలంగాణ ఉద్యమం, రాష్ట్రపతి పాలన వంటి చారిత్రక ఘటనలకు సాక్షీభూతంగా నిలవడం జీవితంలో మరిచిపోలేన్నారని తెలిసింది. ఆదివారం గవర్నర్ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం కేసీఆర్ పథకాలపై ప్రశంసలు తెలంగాణలో చేపట్టిన వివిధ పథకాలను గవర్నర్ నరసింహన్ ప్రశంసించినట్లు తెలిసింది. కాళేశ్వరం, రైతుబంధు, పింఛన్లు తదితర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినందుకు కేసీఆర్‌ను అభినందించారని సమాచారం. మొత్తానికి తెలుగు రాష్ట్రాలలో 9ఏళ్ల 8 నెలల సుదీర్ఘ సమయం గవర్నర్‌గా తనకు పూర్తిసంతృప్తినిచ్చిందని గవర్నర్ అన్నారని తెలిసింది. తెలుగు ప్రజలు పంచిన ఆత్మీయత, అనురాగాలు, జ్ఞాపకాలతో వెళుతున్నానని అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధిలో మరింత పురోగమించాలని ఆయన ఆకాంక్షించారు. థ్యాంక్యూ మిస్టర్ గవర్నర్! తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత తొలి గవర్నర్‌గా పరిపాలనలో తనకు ఎంతగానో సహకరించిన నరసింహన్‌కు కేసీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పలు కీలకమైన బిల్లులు, పథకాల ఆమోదం, అమలులో నరసింహన్ సలహాలు మరువలేనివని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల నిర్వహణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో గవర్నర్ అందించిన సహకారాన్ని కొనియాడారు. గవర్నర్ నరసింహన్ పూర్తి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆయన తెలంగాణకు అందించిన సేవలను తెలంగాణ ప్రజలు ఎన్నిటికీ మరిచిపోరని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రస్థానంలో ఆయన గవర్నర్‌గా ఉన్న సమయాన్ని ప్రత్యేక పేజీగా అభివర్ణించారు. గవర్నర్‌గా 2009 నుంచి 2019 వరకు నరసింహన్ పలు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమం, రాజీనామాలు, ఉప ఎన్నికలు, ఓటుకు నోటు కేసు వంటి కీలక ఘట్టాలను మరోసారి ఇద్దరూ తలచుకున్నారు. ఉద్యమకారుడిగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ కూడా గవర్నర్ హయాంలో జరిగిన ఘటనుల గుర్తుచేసుకున్నారు. త్వరలో గవర్నర్ దంపతులకు సన్మానం ఇంతకాలం తెలంగాణకు సేవలందించిన గవర్నర్ నరసింహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలకనుంది. రెండ్రోజుల్లో రాజ్‌భవన్‌లో భారీగా వీడ్కోలు సభను ఏర్పాటుచేసి నరసింహన్ దంపతులను ఘనంగా సన్మానించనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, వివిధ రంగాల ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వనించనున్నారు. తెలంగాణకు నూతన గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్ మరో వారం రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. కేంద్ర సర్వీసుల్లోకి నరసింహన్! సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ నూతన గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ నియమితులైన నేపథ్యంలో సుదీర్ఘకాలం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా, తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన నరసింహన్‌ను కేంద్ర సర్వీసుల్లోకి తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణకు కొత్త గవర్నర్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన అనంతరం నరసింహన్‌ను కేంద్ర హోంశాఖలో రిపోర్టు చేయాలని ప్రభుత్వ వర్గాలు కోరినట్టు తెలుస్తోంది. -
తొమ్మిదిన్నరేళ్ల అనుబంధం
సాక్షి, హైదరాబాద్ : గవర్నర్ అంటే రాజ్‌భవన్‌కే పరిమితమై ఏవో చిన్నా పెద్దా కార్యక్రమాల్లో కనబడతారనేది గతంలో మాట. కానీ తెలుగు రాష్ట్రాలకు సుదీర్ఘకాలంగా గవర్నర్‌గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ మాత్రం ఇందుకు పూర్తిగా విభిన్నమైన వ్యక్తి. ఈయన పేరు వినని తెలుగు ప్రజలు లేరంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంచార్జి గవర్నర్‌గా వచ్చి ఆ తర్వాత పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టి, తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా సేవలందించి, ఆ తర్వాత తెలంగాణ గవర్నర్‌గా.. ఇలా సుదీర్ఘకాలం ఆయన తెలుగు రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా ఉన్న ఆయన్ను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనపు బాధ్యతలు ఇచ్చి గవర్నర్‌గా నియమించారు. అప్పటి నుంచి తొమ్మిదిన్నరేళ్లకు పైగా ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగారు. ఆదివారం కేంద్రం ఆయన్ను గవర్నర్ బాధ్యతల నుంచి తప్పించి తమిళనాడుకు చెందిన డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను నియమించడంతో సుదీర్ఘకాలం పాటు సాగిన ఆయన గవర్నర్ ప్రస్థానం ముగిసింది. మొత్తంగా గవర్నర్‌గా 9 ఏళ్ల 8 నెలల 3 రోజుల పాటు ఈఎస్ఎల్ గవర్నర్‌గా పనిచేశారు. 2009 డిసెంబర్ 29 నుంచి.. రాష్ట్ర గవర్నర్‌గా నరసింహన్ క్లిష్ట సమయంలో బాధ్యతలు స్వీకరించారు. 2009లో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న చేసిన ప్రకటన, ఆ తర్వాత ఉపసంహరణతో తెలంగాణ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా ఉన్న ఆయన్ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలిక గవర్నర్‌గా నియమించారు. సీనియర్ పోలీసు అధికారిగా పదవీవిరమణ పొందిన నరసింహన్‌ను నియమించడం అప్పట్లో సంచలనం అయింది. తెలంగాణ ఉద్యమం అదుపు తప్పకుండా ఉండేందుకే ఆయన్ను గవర్నర్‌గా నియమించారనే చర్చ జరిగింది. ఆ తర్వాత 2010 జనవరి 23న ఆంధ్రప్రదేశ్ పూర్తిస్థాయి గవర్నర్‌గా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ఆయన గవర్నర్ హోదాలో తనదైన ముద్ర వేస్తూ పాలన సాగించారు. రాష్ట్ర విభజన సమయంలోనూ, కొత్త రాష్ట్రం ఏర్పాటు, ఎన్నికల నిర్వహణ, ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో విధులు, మళ్లీ తెలంగాణలో గవర్నర్‌గా పనిచేయడంలో ఆయన ముక్కుసూటిగా వ్యవహరిస్తూ.. స్పష్టమైన అవగాహనతో నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆకట్టుకున్నారు. ఐదుగురు సీఎంలతో ప్రమాణం సుదీర్ఘకాలం పాటు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన నరసింహన్ ఐదుగురు సీఎంలతో ప్రమాణం చేయించిన రికార్డును సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డితో, ఆ తర్వాత కేసీఆర్, చంద్రబాబులను, రెండోసారి కేసీఆర్‌తో, తొలిసారి జగన్మోహన్రెడ్డిలను తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఆయన ప్రమాణం చేయించారు. ఇక, మంత్రివర్గ విస్తరణల ద్వారా ఇరు రాష్ట్రాలకు మంత్రులను కూడా అదే స్థాయిలో ప్రమాణం చేయించిన ఘనతను దక్కించుకున్నారు. రాష్ట్రాల విభజన తర్వాత ఎదురైన సమస్యల పరిష్కారంలోనూ ఆయన చాలా సమన్వయంతో వ్యవహరించారు. సీఎంలు కేసీఆర్, చంద్రబాబులతో భేటీలు ఏర్పాటు చేయించడంతో పాటు విభజన సమస్యల పరిష్కారంలోనూ ఆయన చొరవ చూపారు. ఆ తర్వాత కేసీఆర్, జగన్మోహన్రెడ్డిల నేతృత్వంలోని ప్రభుత్వాల మధ్య సమస్యల పరిష్కారంలోనూ నరసింహన్ దిశానిర్దేశం చేశారు. మొత్తానికి తొమ్మిదిన్నరేళ్లకు పైగా రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేసిన నరసింహన్ రాష్ట్ర విభజనతో పాటు అనేక రాజకీయ పరిణామాలకు సాక్షీభూతంగా నిలిచి ఆ జ్ఞాపకాలన్నింటినీ పదిలపరుచుకుని వెళుతున్నారు. పౌరసేవలపైనా శ్రద్ధ విద్య, ఆరోగ్యం అంటే ఆయనకు ప్రాణం. రాజ్‌భవన్ ఉద్యోగుల పిల్లల కోసం ఉన్న పాఠశాలకు నూతన భవనాలు నిర్మింపజేసి కార్పొరేట్‌సంస్థ తరహాలో దాన్ని తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆ పాఠశాలలో సీటంటే హాట్‌కేక్‌గా మారింది. సమయం దొరికినప్పుడల్లా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై నిక్కచ్చిగా మాట్లాడేవారు. ఆసుపత్రులు ధనార్జనే ధ్యేయంగా కాకుండా సేవాదృక్పథంతో పనిచేయాలని చురకలంటించేవారు. విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలిచ్చే సంస్థల్లా మిగిలిపోకుండా పరిశోధనాలయాలుగా రూపాంతరం చెందాలని సూచించేవారు. ఏ సమస్య వచ్చినా గాంధీ ఆసుపత్రికే వెళ్లేవారు. ఆయనకు దైవభక్తి ఎక్కువే. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఖైరతాబాద్‌లోని ఆంజనేయ దేవాలయానికి వెళ్లేవారు. సంప్రదాయ వస్త్రధారణతో గుళ్లకు వెళ్లే నరసింహన్ స్వయంగా మంత్రోచ్ఛారణ చేసేవారు. రాజ్‌భవన్‌ను కూడా ఆయన ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. విమలానరసింహన్.. ది లేడీ గవర్నర్ నరసింహన్ రాష్ట్ర గవర్నర్‌గా ఎంత పరిచయమో ఆయన సతీమణి, విమలా నరసింహన్ కూడా అంతగానే సుపరిచితులు. చురుకైన వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకున్న విమల కూడా తనదైన శైలిలో వ్యవహరించేవారు. రాజ్‌భవన్ సిబ్బంది పట్ల ఆమె వ్యవహరించిన తీరు, రాజ్‌భవన్‌కు వచ్చే వారితో మెలిగే తీరు, గవర్నర్‌తో కలిసి బయట కార్యక్రమాలకు హాజరయినప్పుడు ఆమె ఆహార్యం, అనేక అంశాలపై ఆమెకున్న అవగాహన లాంటివి లేడీ గవర్నర్‌గా ఆమెకు ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. పని విషయంలో నర‘సింహ’మే! ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్‌గా నరసింహన్ బాధ్యతలు చేపట్టిన సమయంలో రెండు ప్రాంతాల్లోనూ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ సమయంలో ఆయన చాలా నేర్పుగా వ్యవహరించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహ ణ, ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం సమయంలో టీఆర్ఎస్ సభ్యులు ప్రసంగ ప్రతులను చించి గవర్నర్ పైనే విసిరేశారు. అయినా నరసింహన్ ఎక్కడా తగ్గలేదు. ఉద్యమ సమయంలో శాంతిభద్రతలను సమన్వయం చేశారు. 2014 ఎన్నికల ముందు దాదాపు 3 నెలల గవర్నర్ పాలనలోనూ తనదైన ముద్రను చూపించారు. -
నరసింహన్‌పై కేటీఆర్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణకు కొత్త గవర్నర్ నియమితులైన నేపథ్యంలో ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో ఉన్న అనుభూతులను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంచుకున్నారు. గత 10 ఏళ్లుగా నరసింహన్ రాష్ట్రానికి చాలా విషయాల్లో మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్విటర్ వేదికగా నరసింహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందూ కూడా ఆయన ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలని ఆకాంక్షించారు. ‘అనేక సందర్భాల్లో ఎన్నో అంశాలపై నరసింహన్ గారితో సంభాషించే అవకాశం కలిగింది’ అంటూ గతంలో నరసింహన్‌తో కలిసి దిగిన ఫోటోలను కేటీఆర్ ట్విట్టర్లో షేర్ చేశారు. అలానే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బీజేపీ నేత బండారు దత్తత్రేయకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. (చదవండి : తెలంగాణ నూతన గవర్నర్‌గా సౌందర్‌రాజన్) కాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్ నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుత గవర్నర్ నరసింహన్ స్థానంలో తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందర రాజన్‌ను ప్రకటించింది. (చదవండి : తెలంగాణ తొలి గవర్నర్‌గా నరసింహన్ విశిష్ట సేవలు) Had the good fortune of interacting numerous times in various capacities with Hon’ble Governor Sri ESL Narasimhan Garu Wholeheartedly thank sir for his sagacious guidance & for being a father figure for the state throughout last 10 years. Wishing you good health & peace sir 💐 pic.twitter.com/pRvh70dnZz — KTR (@KTRTRS) September 1, 2019 -
తెలంగాణ తొలి గవర్నర్‌గా నరసింహన్ విశిష్ట సేవలు
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోని అనేక రాజకీయ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. అదేవిధంగా రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కూడా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొల్పడంలో వారధిగా ఉన్నారు. విభజన అనంతరం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తొలి గవర్నర్‌గా పని చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన వ్యక్తిగత, వృత్తిగత వివరాలు.. నరసింహన్ 1945లో తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు ఎక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీనరసింహన్. హైదరాబాద్‌లోని లిటిల్‌ఫ్లవర్ హైస్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి ఉన్నత విద్య కోసం సొంత రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల నుంచి పొలిటికల్ సైన్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించారు. మద్రాసు లా కళాశాలలో న్యాయవిద్య పూర్తి చేశారు. 1968లో సివిల్ సర్వీసెస్‌లో ఐపీఎస్‌గా ఎంపికై ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించబడ్డారు. 1972లో ఇంటెలిజెన్స్ బ్యూరోకు తన సేవలు అందించారు. కాగా 2006 డిసెంబర్లో రిటైర్ అయ్యేవరకు అందులోనే పని చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అదే విధంగా రెండుదఫాలుగా విదేశీ వ్యవహారాల శాఖలో పనిచేశారు.1981-84 మధ్య మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ఫస్ట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. 1996 నుంచి 1999 వరకు విదేశాల్లోని రాయబార కార్యాలయాల భద్రతా వ్యవహారాలు చూశారు. 2006 డిసెంబర్లో నరసింహన్ రిటైర్ అయిన తర్వాత ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. అక్కడ మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి నరసింహన్ విశేష కృషి చేశారు. 2010 జనవరిలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నరసింహన్ బాధ్యతలు స్వీకరించారు. 2012 మేలో మరో ఐదు ఏళ్ల పదవీకాలాన్ని కేంద్రం ప్రభుత్వం పొడిగించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన 2 జూన్ 2014 నుంచి రెండు తెలుగు రాష్ర్టాలకు గవర్నర్‌గా కొనసాగారు. కొద్ది రోజుల క్రితమే కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్‌ను నియమించగా.. అప్పటినుంచి నరసింహన్ కేవలం తెలంగాణ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. నేషనల్ డిఫెన్స్ కాలేజీ పూర్వ విద్యార్థి అయిన నరసింహన్‌కు సంగీతం అంటే ఇష్టం. కర్ణాటక, హిందుస్థానీ సంగీతాన్ని ఇష్టపడతారు. నరసింహన్ సతీమణి విమలా నరసింహన్. వారికి ఇద్దరు కొడుకులు. -
ఏపీ గవర్నర్ భార్యకు నరసింహన్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కీళ్ల మారి్పడి శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకుంటున్న ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సతీమణి సుప్రవ హరిచందన్‌ను రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, విమల దంపతులు గురువారం పరామర్శించారు. ఆమెకు శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగిందని బిశ్వభూషణ్ వివరించారు. సుప్రవ త్వరగా కోలుకోవాలని నరసింహన్ దంపతులు ఆకాంక్షించారు. -
పీవీ సింధు, మానసి జోషికి నా అభినంధనలు
-
అందరికీ ఆమె రోల్‌మోడల్: నరసింహన్
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు 2020 ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించడం ఖాయమని తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. మన సత్తా ఏమిటో ప్రపంచానికి సింధు చాటిందని ప్రశంసించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌గా నిలిచిన సింధుతో పాటు, పారా బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన మానసి జోషిలను రాజ్‌భవన్‌లో గవర్నర్ దంపతులు సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ.. మానసి జోషి అద్భుత విజయం సాధించి అందరికీ రోల్ మోడల్‌గా నిలిచారని పొడిగారు. సింధు, మానసి సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఒలింపిక్స్ స్వర్ణ పతకంతో వచ్చే ఏడాది రాజ్‌భవన్‌కు రావాలని ఆకాంక్షించారు. కోచ్ పుల్లెల గోపీచంద్, సింధు తల్లిదండ్రులను ఆయన అభినందించారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించేందుకు శక్తివంచన లేకుండా కష్టపడతానని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకునేందుకు కృషి చేస్తానని సింధు పేర్కొంది. తెలంగాణ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పుల్లెల గోపీచంద్, సింధు తల్లిదండ్రులు, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. (చదవండి: ఆత్మీయ స్వాగతాలు... అభినందనలు..!) -
రాష్ట్రపతితో గవర్నర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ గవర్నర్ నరసింహన్ మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి కోవింద్‌తో సమావేశమైనట్లు తెలిసింది. వీరి భేటీలో త్వరలో జరగనున్న అన్ని రాష్ట్రాల గవర్నర్ల సమావేశంపై చర్చించుకున్నట్లు సమాచారం . -
గ్రీన్‌చాలెంజ్ @ 2 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ‘హరా హై తో భరా హై’(పచ్చగా ఉంటే నిండుగా ఉంటుంది) అంటూ గతేడాది మొదలైన గ్రీన్ చాలెంజ్ రెండు కోట్ల మొక్కలు నాటే దాకా చేరుకుంది. ఒకరు మొక్క నాటి మరో ముగ్గురు మొక్కలు నాటి, సంరక్షించేలా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ దీనిని ప్రారంభించారు. తాను స్వయంగా మొక్క నాటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్, నటుడు నాగార్జునను నామినేట్ చేశారు. వారం దరూ కూడా మొక్కలు నాటారు. ఇలా ఏడాది పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. ప్రముఖులతోపాటు సామాన్యులూ ఇందులో భాగస్వామ్యులయ్యారు. మొక్కలు నాటి, సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మధ్యలో లక్ష్యం ఒక కోటికి చేరినప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొక్కను నాటారు. ఈ లక్ష్యం ఆదివారం నాటికి రెండు కోట్లకు చేరటంతో మరోసారి ఎంపీ సంతోష్ మొక్క నాటారు. గతేడాది తాను నాటిన మొక్క ఏపుగా పెరగటంతో మరోసారి దానితో సెల్ఫీ దిగి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కార్యక్రమంలో ఇగ్నయిటెడ్ మైండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతి నిధులు కరుణాకర్‌రెడ్డి, రాఘవ పాల్గొన్నారు. మరో నలుగురికి గ్రీన్ చాలెంజ్ మరో నలుగురు ప్రముఖులకు ఎంపీ సంతోష్ గ్రీన్ చాలెంజ్ విసిరారు. వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సినీనటుడు అఖిల్ అక్కినేని, జీఎమ్మార్ అధినేత మల్లికార్జున్‌రావులను మొక్కలు నాటాల్సిందిగా కోరారు. తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ఇగ్నయిటెడ్ మైండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ గ్రీన్ చాలెంజ్‌ను చేపట్టింది. -
కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ భేటీ
-
కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలంగాణ గవర్నర్ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అక్కడ నుంచి ప్రగతి భవన్ చేరుకుని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ఈ భేటీలో పాల్గొన్నారు. -
ఆ క్లాజు వద్దు
సాక్షి, హైదరాబాద్ : నూతన పురపాలికల బిల్లుపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అభ్యంతరం వ్యక్తంచేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఓ క్లాజును బిల్లు నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేశారు. పురపాలక ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసే అధికారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కట్టబెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకోవడం సరికాదని పేర్కొన్నారు. పురపాలక ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేయడం రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోని అంశమని, ఈ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకుంటే ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నిబంధన రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కి విరుద్ధమని తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఈ బిల్లుకు గవర్నర్ ఓ సవరణ సూచించారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. గోప్యతతో గందరగోళం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొత్త పురపాలికల బిల్లును ఈనెల 19న రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో ఆమోదించిన తర్వాత గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపించింది. అయితే, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసే అధికారాలను తిరిగి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అప్పగిస్తూ బిల్లుకు సవరణ చేయాలని గవర్నర్ సూచించారు. దీంతో బిల్లుకు సవరణ జరిపేందుకు మళ్లీ రాష్ట్ర శాసనసభ ఆమోదం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాసనసభను ప్రొరోగ్ చేస్తూ ఇప్పటికే ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో, మళ్లీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వరకు వేచిచూడక తప్పదు. ఈ నేపథ్యంలో గవర్నర్ సూచన మేరకు మున్సిపల్ బిల్లుకు మార్పులు జరిపి అత్యవసర పరిస్థితుల రీత్యా ఆర్డినెన్స్ రూపంలో కొత్త పురపాలికల చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందనే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం గోప్యత పాటిస్తుండటంతో కొంత గందరగోళం నెలకొంది. గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సంబంధాలకు సంబంధించిన సున్నిత విషయం కావడంతో దీనిపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు గవర్నర్ కార్యాలయం గానీ అధికారికంగా స్పందించలేదు. ఆదివారమే సవరణ బిల్లుకు ఆమోదం ఓ సవరణతో బిల్లును గవర్నర్ నరసింహన్ గత ఆదివారమే ఆమోదించారని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. అయితే, కొత్త పురపాలికల బిల్లును ఆమోదించారా? లేక సవరణతో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర వేశారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. వాస్తవానికి తాను కోరుకున్న సవరణతో బిల్లును నేరుగా గవర్నర్ ఆమోదించడానికి వీలు లేదు. సదరు సవరణను శాసనసభ ఆమోదించిన తర్వాతే గవర్నర్ దానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. వచ్చేనెలలో కొత్త పురపాలికల చట్టం ద్వారానే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ సూచించిన సవరణతో ఆర్డినెన్స్ రూపంలో కొత్త పురపాలికల చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం గోప్యంగా ఆర్డినెన్స్ సైతం జారీ చేసిందని ఊహాగానాలు వచ్చాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించకపోవడంతో అసలు విషయం తెలియడంలేదు. -
మున్సిపల్ చట్టం ఆమోదానికి గవర్నర్ బ్రేక్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ నూతన మున్సిపల్ చట్టం ఆమోదానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ బ్రేక్ వేశారు. చట్ట సవరణ బిల్లుకు సంబంధించి కొన్ని అంశాలపై గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాగా మున్సిపల్ చట్టానికి తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లులో కలెక్టర్లకు ప్రజా ప్రతినిధులను తొలగించే అధికారంపై గవర్నర్ అభ్యంతరం తెలిపారు. అంతేకాకుండా మున్సిపల్ ఎన్నికలు తేదీలను కూడా ప్రభుత్వమే నిర్ణయించడంపై అభ్యంతరం చెబుతూ బిల్లును వెనక్కి పంపారు. గవర్నర్ చేసిన సూచనలపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మళ్లీ ఆర్డినెన్స్ జారీ చేసింది. కాగా కొత్త మున్సిపల్ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల ఉమ్మడి భాగస్వామ్యంతో మున్సిపల్‌పాలనను పరుగులు పెట్టించేలా ఈ చట్టాన్ని రూపొందించింది. ఓవైపు బాధ్యతలను గుర్తు చేస్తూనే మరో వైపు సంస్కరణలను ప్రవేశపెడుతూ రూపొందించిన ఈ చట్టంలో జిల్లా కలెక్టర్లను సూపర్‌బాస్‌లను చేసింది. మున్సిపల్‌పగ్గాలన్నీ వారికే అప్పగించి ప్రజాప్రతినిధుల పనితీరుపై ఓ కన్నేసి ఉంచేలా నిబంధనలను తీసుకొచ్చింది. చదవండి: జవాబుదారిలో భారీ మార్పులు తేడా వస్తే చైర్‌పర్సన్‌తోపాటు సభ్యులను సస్పెండ్ చేసే అధికారాలను కట్టబెట్టింది. హరిత మున్సిపాలిటీల కోసం బడ్జెట్లో 10% నిధులను ప్రత్యేకంగా కేటాయించడంతో పాటు.. నాటిన వాటిలో 85% మొక్కలు బతక్కపోతే సంబంధిత వార్డు మెంబర్, అధికారిపై కొరడా ఝళిపించనుంది. పాలకవర్గాలకు ఎన్నికలు, వాటి పనితీరు సమీక్ష, పాలన పర్యవేక్షణ, పట్టణ ప్రణాళిక నియమ నిబంధనలు, ఉద్యోగులకు ఏకీకృత సర్వీస్ రూల్స్, నైపుణ్య పెంపుదల కోసం స్వయం ప్రతిపత్తితో కూడిన సంస్థ ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ బోర్డుల ఏర్పాటు వంటి అంశాలతో శాసనసభ, మండలి ఆమోద ముద్ర వేసిన విషయం విదితమే. మరోవైపు నూతన పురపాలక చట్టంపై విపక్షాలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. -
మహిళా శక్తి @ చంద్రయాన్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించిన చంద్రయాన్–2 ప్రాజెక్టులో 30 శాతం మంది మహిళా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నట్టు సమాచారం. అంతరిక్ష శాస్త్ర విజ్ఞాన రంగం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తామేమీ తక్కువ కాదన్నట్టుగా చంద్రయాన్–2 ప్రయోగంలో 30 శాతం మంది మహిళలు ఎంతో కృషి చేశారు. త్రీ–ఇన్–ఒన్‌గా భావిస్తున్న చంద్రయాన్–2 ప్రాజెక్టులో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లు రూపొందించడంలో మహిళా శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారు. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్, బెంగళూరులోని ప్రొఫెసర్ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో పని చేసి ల్యాండర్, రోవర్‌ను రూపొందించడంలో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం కూడా ఉంది. ఇందులో కొంతమందిని మాత్రమే ఇక్కడ ఉదహరిస్తున్నాము. భారతదేశానికి ఎంతో తలమానికంగా నిలిచే ఈ ప్రయోగంలో మహిళా శాస్త్రవేత్తల కృషి దాగి ఉండడం విశేషం. ఇస్రోలో 30 మంది మహిళా శాస్త్రవేత్తలు పనిచేస్తుండగా ఈ ప్రయోగంలో రీతూ కరిథల్ మిషన్ డైరెక్టర్‌గా, ఎం.వనిత ప్రాజెక్టు డైరెక్టర్‌గా అత్యంత కీలకంగా ఉన్నారు. బాలు శ్రీ దేశాయ్, డాక్టర్ సీత, కె.కల్పన, టెస్సీ థామస్, డాక్టర్ నేహ సటక్ అనే శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో భాగస్వాములై మహిళాశక్తిని నిరూపించారు. ‘రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా’ రీతూ.. చంద్రయాన్–2 మిషన్ డైరెక్టర్‌గా వ్యవహరించిన రీతూ కరిథల్ ‘‘రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా’’గా ఇస్రోలో అందరూ పిలుస్తుంటారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగంలో కూడా ఈమె డిప్యూటీ ఆపరేషన్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈమె 2007లో మాజీ రాష్ట్రపతి, అణుపరీక్షల నిపుణులు డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం చేతుల మీదుగా ఇస్రో యంగ్ సైంటిస్ట్ అవార్డును కూడా అందుకున్నారు. చంద్రయాన్–2 మిషన్‌లో అత్యంత కీలకమైన మహిళా శాస్త్రవేత్తగా అందరి మన్ననలను అందుకుంటున్నారు. ఉపగ్రహాల తయారీలో దిట్ట.. చంద్రయాన్–2 ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా పనిచేసిన ఎం.వనిత ఉపగ్రహాల రూపకల్పనలో నిపుణురాలు. ఆమె డిజైన్ ఇంజినీర్‌గా శిక్షణ తీసుకుని చంద్రయాన్–2 అత్యంత కీలకమైన మహిళా శాస్త్రవేత్తగా ఎంతో గుర్తింపు పొందారు. ‘‘ఆస్ట్రనామికల్ సొసైటీ అఫ్ ఇండియా ’’నుంచి 2006లో బెస్ట్ ఉమెన్ సైంటిస్టు అవార్డును అందుకున్నారు. చంద్రయాన్–2 మిషన్ బాధ్యతలన్నింటిని వనిత చూసుకుని ప్రయోగాన్ని విజయవంతం చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. శాస్త్రవేత్తలకు అభినందనలు: గవర్నర్ చంద్రయాన్–2 ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు. భారతీయ అంతరిక్ష పరిశోధనల చరిత్రలో చంద్రయాన్2 మిషన్ భారీ ముందడుగు అని అన్నారు. గొప్ప ముందడుగు: ఏపీ సీఎం జగన్ చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతం అయినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలను అభినందించారు. అంతరిక్ష రంగంలో ఈ విజయం అతి గొప్ప ముందడుగు అని ప్రశంసించారు. ఈ విజయంతో భారత్ చంద్రునిపై ప్రయోగాలు చేస్తున్న దేశాల సరసన చేరిందని అన్నారు. సీఎం కేసీఆర్ అభినందనలు చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంలో భారతీయ శాస్త్రవేత్తల కఠోర శ్రమ, మేథా సంపత్తి దాగి ఉందని కొనియాడారు. -
జగన్ చరిత్ర సృష్టిస్తారు
‘‘మీరు (ముఖ్యమంత్రి జగన్) అభివృద్ధి కోసం, అవినీతి రహిత పాలన కోసం తపన పడుతున్నారు. అలాంటి మీ ప్రభుత్వం కలకాలం వర్థిల్లాలి. మీ ప్రభుత్వం చరిత్ర సృష్టించాలి అని మనసారా ప్రార్థిస్తున్నా. ఈ రాష్ట్రం విజయాన్ని, అభివృద్ధిని నేను కోరుకుంటా. ఈ రాష్ట్రం విజయవంతం అయితే అది నా విజయంగా భావిస్తా, గర్విస్తా. నేను తెలిసో... తెలియకో కొన్ని తప్పులు చేశా. కొన్ని సమయాల్లో తెలిసి చేశా, కొన్నిసార్లు తెలియక చేశా. వాటన్నింటికీ నన్ను క్షమించండి’’ ‘‘నరసింహావతారం స్తంభంలో నుంచి బయటకు వచ్చి పని పూర్తి చేసి వెళ్లి పోతుంది. రామావతారంలా సుదీర్ఘకాలం పాటు ఉండి తన భార్యను అడవులకు పంపేది కాదు. కానీ ఈ నరసింహావతారం మాత్రం ఇక్కడ చాలా కాలం పాటు ఉండిపోయింది’’ – వీడ్కోలు కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన ప్రారంభించిన ఈ 54 రోజుల్లోనే అద్భుతాలు చేశారని గవర్నర్ నరసింహన్ అభినందించారు. జగన్ తన పరిపాలనతో ఆంధ్రప్రదేశ్‌లో చరిత్ర సృష్టిస్తారని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరించిన నరసింహన్ రాష్ట్ర బాధ్యతల నుంచి వైదొలుగుతున్న నేపథ్యంలో సోమవారం విజయవాడలోని గేట్‌వే హోటల్లో వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ వైఎస్ జగన్ అసెంబ్లీలో చక్కటి సభా సంప్రదాయాలను పాటిస్తున్నారని కితాబిచ్చారు. పాలన ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఆయన టీ 20 క్రికెట్ తరహాలో ప్రతి బాల్‌ను బౌండరీని దాటించడమే కాకుండా సిక్సర్లు కొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ విజయవాడలోనే తన అక్షరాభ్యాసం,ప్రా«థమిక విద్య జరిగిందని నరసింహన్ వెల్లడించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఇంకా ఏమన్నారో వివరాలు ఆయన మాటల్లోనే.. ‘ఇవి నాకు, నా శ్రీమతి విమలకు ఉద్వేగపూరిత క్షణాలు. మిమ్మల్ని వీడి వెళుతున్నా. మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌తో నాకు విడదీయరాని సంబంధం ఉంది. విజయవాడలోని అట్కిన్సన్ స్కూల్లో నా అక్షరాభ్యాసం 1951లో జరిగింది. అప్పట్లో మేం గవర్నర్‌పేటలో నివాసం ఉన్నాం. ఐపీఎస్‌కు ఎంపికయ్యాక ట్రెయినింగ్ అనంతపురంలో కాగా నాకు పునర్జన్మ ఇచ్చింది నంద్యాల. ప్రమోషన్ మీద నియామకం జరిగింది ప్రకాశం జిల్లాలో. నా తల్లిదండ్రులు నాకు అహోబిలం నరసింహుడి పేరు పెట్టారు. అయితే నేను నరసింహుడి పాత్ర వహించానా లేదా? అనేది నాకు అర్థం కాని విషయం. త్యాగయ్య కీర్తన గుర్తుకొచ్చింది... ఇక జగన్మోహన్రెడ్డి విషయానికి వస్తే... ‘జే’ అనే అక్షరంతో మొదలయ్యే పేరు గల ఏ వ్యక్తి అయినా అందరిలో అత్యంత ప్రియమైనవారుగా, ముచ్చటైన వారుగా ఉంటారు. జగన్మోహన్ అంటే జగత్తులో మోహనుడు, విశ్వంలో అందరూ ప్రేమించే వ్యక్తి. జగన్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసేటపుడు నాకు త్యాగరాజస్వామి కీర్తన ‘‘నను పాలించగ నడిచీ వచ్చితివా... ఓ రామా...’’ గుర్తుకొచ్చింది. రాష్ట్ర ప్రజలంతా ‘మము పాలించగ నడిచీ వచ్చితివా... ఓ జగన్’ అని భావించారని నాకు అనిపించింది. కొద్ది రోజుల్లోనే అద్భుతాలు చూశా.. ఒక టీం కెప్టెన్‌గా, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే నేను అద్భుతాలను చూశా. టీ 20 మ్యాచ్‌లో తొలి పది ఓవర్లు బాగా ఆడిన తరువాత మధ్య ఓవర్లకు వచ్చేటప్పటికి పరిస్థితి స్థిమితంగా ఉంటుంది. చివరి ఓవర్లలో వేగంగా ఎక్కువ పరుగులు తీస్తారు. బహుశా మీరు కూడా దీన్నే పాటిస్తున్నారని భావిస్తున్నా. ఇపుడు మీరు పరుగులు హిట్ చేస్తున్నారు. ఆ తరువాత పరిస్థితిని సుస్థిరం చేసుకుంటారు. మీరు సెంచరీ చేస్తూ నాటౌట్‌గా ఉండాలని, మరిన్ని ఎక్కువ సెంచరీలు చేయాలని కోరుకుంటున్నా. ‘భారతి అమ్మ’ అంటే అందరికీ ఓ రకమైన శక్తిని ఇస్తుంది. బహుశా జగన్ తన భార్య భారతి నుంచి అదే శక్తిని పొందుతున్నారని భావిస్తున్నా. ఏమైనా వారిద్దరూ ప్రత్యేక దంపతులు అని చెబుతున్నా. చర్చలు.. సంప్రదింపులు.. భిన్నాభిప్రాయాలు.. తుది నిర్ణయం మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్ ముఖర్జీ చెప్పినట్లుగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చర్చలు, సంప్రదింపులు, భిన్నాభిప్రాయాలు ఆ తరువాత తుది నిర్ణయం ముఖ్యమైన అంశాలు. కొద్ది రోజులుగా ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న కార్యక్రమాల తీరును నేను గమనిస్తున్నా. మీరు (వైఎస్ జగన్) చక్కటి పార్లమెంటరీ సంప్రదాయాలను పాటిస్తున్నట్లు నాకు అర్థం అవుతోంది. చర్చ, సంప్రదింపులు, భిన్నాభిప్రాయాలు, ఆ తరువాత నిర్ణయం అనే విధానాన్ని మీరు అనుసరిస్తున్నారు. మీరు ఇదే తీరును కొనసాగించాలని కోరుకుంటున్నా. మీరు చాలా దూరం రాజకీయ ప్రయాణం చేయాలి. కొత్తగా పరిపాలనలోకి వచ్చారు. పునాదులు బాగా వేస్తే భవిష్యత్తులో అభివృద్ధి గట్టిగా ఉంటుంది. మీకు అద్భుతమైన జట్టు ఉంది. ఈ జట్టుతో ఆంధ్రప్రదేశ్‌లో చరిత్ర సృష్టిస్తారని గట్టిగా విశ్వసిస్తున్నా. ఇక్కడున్న మంత్రులందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. ఇన్నేళ్లుగా సహకరించిన కేంద్ర, రాష్ట్ర సర్వీసు అధికారులకు ధన్యవాదాలు. ఈ రాష్ట్రం మంచి కోసమే... మీకు రాయలసీమను జాగ్రత్తగా చూసుకునేందుకు అహోబిలంలో ఒక నరసింహుడున్నాడు. ఉత్తరాంధ్రను జాగ్రత్తగా చూసుకునేందుకు సింహాచలం నరసింహస్వామి ఉన్నాడు. ఇక్కడ పానకాల నరసింహస్వామి ఉంటాడు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు పుణ్యక్షేత్రాలైన తిరుపతి, కడప దర్గా, ఆ తరువాత చర్చికి వెళ్లారు. ఆ తరువాత తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్దకు వెళ్లారు. ఆ తరువాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లి వద్దకు వచ్చారు. అయితే మీరు అతి ముఖ్యమైన నరసింహస్వామిని దర్శించుకోలేదని, మీ తీర్థయాత్ర పూర్తి కాలేదని ఆరోజు ఆయనకు చెప్పా. జగన్.. నన్ను మీరు క్షమించాలి. గత 54 రోజుల్లో నేను నా పరిధులు అతిక్రమించి ఏదైనా చెప్పే చనువు తీసుకుని ఉండొచ్చు. మిమ్మల్ని నా కుమారుడిలా భావించి చెప్పా తప్ప వేరే ఉద్దేశం లేదు. నేను ఏం చెప్పినా అది ఈ రాష్ట్రం మంచి కోసం మాత్రమే’’ గవర్నర్‌కు ఘన సన్మానం గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఆయనకు శాలువ కప్పి సత్కరించారు. జగన్ సతీమణి వైఎస్ భారతి గవర్నర్ సతీమణి విమలా నరసింహన్‌కు పుష్పగుచ్ఛం, జ్ఞాపికను బహూకరించి గౌరవించారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. దుర్గమ్మ సేవలో నరసింహన్ దంపతులు ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ), గన్నవరం: అంతకుముందు గవర్నర్ నరసింహన్ దంపతులు ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి గవర్నర్ హోదాలో చివరిసారిగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా, కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, విజయవాడ సీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులోని అంతర్జాతీయ టెర్మినల్ ఆవరణలో గవర్నర్‌కు ఏపీ పోలీస్ ప్రత్యేక దళాల నేతృత్వంలో గౌరవ వందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. విజయవాడలో పర్యటన ముగిసిన అనంతరం సోమవారం రాత్రి గవర్నర్ నరసింహన్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. నాన్న పాత్ర పోషించారు: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘నాకు ఓవైపు మనసులో బాధగా ఉంది.. మరోవైపు ఆయన ఎక్కడికీ వెళ్లడం లేదు, పక్కనే ఉన్నారన్న ఆనందమూ ఉంది. గవర్నర్‌తో నాకు చాలా అనుబంధం, అనుభూతి ఉంది. గత పదేళ్లుగా బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఆయన. ఒక పెద్ద మనిషిగా ఇంచుమించుగా నాన్న పాత్రనే పోషిస్తూ నాకు సలహాలు ఇచ్చేవారు. నేను ముఖ్యమంత్రి అయిన తరువాత నా చేయి పట్టుకుని దగ్గరుండి నడిపించారు. అలాంటి వ్యక్తి దూరమవుతున్నారని మనసులో బాధగా అనిపించినా ఆయన ఆశీస్సులు మనకు ఎప్పుడూ ఉంటాయని భావిస్తున్నా. ఆయన ఎక్కడ ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, మా అందరి తరఫున ఎప్పుడూ గుర్తుంచుకుంటాం. ఆయనతో గడిపే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా’ -
నాన్నగారిలా సలహాలు ఇచ్చారు: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరికొంత కాలం గవర్నర్‌గా నరసింహన్ కొనసాగిఉంటే బాగుండేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ గవర్నర్‌కు వీడ్కోలు పలకడం ఓవైపు బాధగా ఉన్నా, మరోవైపు ఆయన మనతోనే ఉంటారన్న నమ్మకం ఉంది. నాన్నగారిలా నాకు అనేక సలహాలు ఇచ్చారు. నేను ముఖ్యమంత్రి అయ్యాక కూడా నన్ను ముందుండి నడిపించారు. మరికొంతకాలం ఆయన కొనసాగితే బాగుండేది. పెద్దాయన స్థానంలో ఆయన్ని ఎప్పుడూ మా మనసులోనే ఉంచుకుంటాం.’ అని పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ నియమితులు కావడంతో నరసింహన్ ఇక మీదట తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా కొనసాగనున్నారు. చదవండి: వైఎస్ జగన్ పాలనలో మరిన్ని సెంచరీలు చేయాలి: నరసింహన్ అంతకు ముందు గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ... తొమ్మిదిన్నరేళ్లపాటు రాష్ట్ర ప్రజలు తన మీద, తన భార్య విమల మీద చూపిన ప్రేమను మర్చిపోలేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. పాలనాపరంగా కొన్నిసార్లు తెలిసి తప్పులు చేశానని, కొన్నిసార్లు తెలియక తప్పులు చేశానని.... తన కారణంగా నొచ్చుకుంటే వారందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నానని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధిపథంలోకి దూసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతి, సీఎస్, డీజీపీ, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్ జగన్ మరిన్ని సెంచరీలు చేయాలి: నరసింహన్
సాక్షి, విజయవాడ: రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన ఈఎస్ఎల్ నరసింహన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ నియమితులు కావడంతో నరసింహన్ ఇక మీదట తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని గేట్‌వే హోటల్లో నరసింహన్‌కు వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు ఈ సందర్భంగా నరసింహన్, విమలా నరసింహన్‌ను సత్కరించి, జ్ఞాపికను అందచేశారు. వైఎస్ జగన్ పాలనలో మరిన్ని సెంచరీలు చేయాలి ఈ సందర్భంగా నరసింహన్...ఆంధ్రప్రదేశ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు చిన్నప్పుడు విజయవాడలోనే అక్షరాభాస్యం జరిగిందని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. నరసింహన్ మాట్లాడుతూ.. ‘ఏపీకి గవర్నర్‌గా వస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. గడిచిన పదేళ్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లాంటిది. ఈ 34 రోజులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన ప్రతి బాల్ సిక్సర్, బౌండరీలు తాకుతున్నట్లు ఉంది. పాలనలో వైఎస్ జగన్ మరిన్ని సెంచరీలు చేయాలని కోరుకుంటున్నా. వైఎస్ జగన్‌కు ఆయన సతీమణి భారతి ఒక బలం. అసెంబ్లీలో వైఎస్ జగన్ వ్యవహారశైలి నియమావళికి అనుగుణంగా కొనసాగుతోంది. గవర్నర్గాఈ నరసింహం వెళ్లిపోతున్నా...అహోబిలం, సింహాచలం, మంగళగిరి నరసింహులు మీతోనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అవినీతిరహిత రాష్ట్రం కోసం వైఎస్ జగన్ చేస్తున్న ప్రయత్నాలు కొనసాగాలి. నాకు సహకరించిన మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, అజేయ కల్లాం, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, పలువురు మంత్రులు, వైఎస్సార్ సీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఆత్మీయ విందు అనంతరం నరసింహన్ దంపతులు తిరిగి హైదరాబాద్ వెళనున్నారు. దుర్గమ్మ సన్నిధిలో నరసింహన్ అంతకు ముందు నరసింహన్ గవర్నర్ హోదాలో చివరిసారిగా ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు అశీర్వచనాలు పలికి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని ఆలయ ఈవో...గవర్నర్ దంపతులకు అందచేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అశాస్త్రీయంగా మున్సిపల్ చట్టం
సాక్షి, హైదరాబాద్: అశాస్త్రీయంగా రూపొందించిన మున్సిపల్ చట్టాన్ని ఆమోదించవద్దని, దానిని వెనక్కి తిప్పి పంపాలని బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేసింది. శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ, నేతలు డీకే అరుణ, టి.చంద్రశేఖర్‌రావు, విజయరామారావు, ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తదితరులు గవర్నర్‌ను కలిశారు. చట్టంలో లోపాలను పేర్కొంటూ నివేదికను అందజేశారు. ఈ చట్టం ఎన్ని కల సంఘం అధికారాలను హరించేలా ఉందని, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్లకు అప్పగించారని, అది సరికాదని, చట్టానికి సవరణలు అవసరమని పేర్కొన్నారు. ఏడు కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంలో శాస్త్రీయత, సరైన ప్రాతిపదిక, విధానం లేదని తెలియజేశారు. ప్రజల జీవన విధానానికి విఘాతం కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన అన్ని మున్సిపాలిటీలు నిన్నటి వరకు గ్రామ పంచాయితీలుగానే ఉన్నాయని, అక్కడి రైతులు, కార్మికులు, కూలీలు, కుల వృత్తులు, గ్రామీణ జీవన విధానం ఆయా గ్రామాలలో ఇంకా సజీవంగా ఉన్నాయని బీజేపీ నేతలు తెలిపారు. ఆర్థిక వనరులు, పన్నుల విధానం ఇంకా కుదుటపడలేదని, మున్సిపల్ జీవనవిధానానికి ప్రజలు ఇంకా అలవాటు పడలేదని, అప్పుడే మున్సిపల్ కార్పొరేషన్లుగా మార్చడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు. ఆయా గ్రామాలలో ప్రజలు ఇళ్లు నిర్మించుకోవాలంటే ఇక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరుగాల్సి వస్తుందని, ఆస్తి పన్ను, వృత్తిపన్ను, తాగునీటి పన్ను, గృహనిర్మాణ అనుమతి చార్జీలు పెరిగి ప్రజలపై తీవ్ర భారం పడుతుందని వివరించారు. మున్సిపాలిటీల ఏర్పాటులోనూ శాస్త్రీయత లోపించిదని పేర్కొన్నారు. పాలకవర్గాల కాలపరిమితి ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో రిట్ వేసిందని, దానిపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన కౌంటర్ అఫిడవిట్లో ఎన్నికల ముందు ప్రక్రియకు 141 రోజులు అవసరం ఉంటుందని రాసిందని వివరించింది. అయితే ఎన్నికల ముందు ప్రక్రియను 119 రోజులకు కుదిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. కానీ ఆ ప్రక్రియను హడావిడిగా మూడు వారాలోపే పూర్తి చేస్తూ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని ఎన్నికల సంఘంపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని వివరించారు. దీనివల్ల వార్డుల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళ ఓటర్ల గుర్తింపు , వార్డుల వారి ఓటర్ల లిస్టుల తయారీ, రిజర్వేషన్లు అన్నింటి విషయాలలో అవకతవకలు, అక్రమాలు, తప్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. -
22 లేదా 23న ఏపీ గవర్నర్ బాధ్యతలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 22న లేదా 23వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నట్టు సమాచారం. ఆయనను ఏపీ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడంతో ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున బుధవారం భువనేశ్వర్ వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఉత్తర్వులను ఆయనకు అందజేశారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున విశ్వభూషణ్‌కు పుష్పగుచ్చాన్ని, శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. కాగా విశ్వభూషణ్ హరిచందన్‌కు తెలుగు రాష్ట్రల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి హరిచందన్ కృషి చేస్తారని ఆయన ఆకాంక్షించారు. చదవండి: కొత్త గవర్నర్‌కు సీఎం జగన్ ఫోన్ -
‘పద్మావతి’ సన్నిధితో గవర్నర్ దంపతులు
సాక్షి, తిరుచానూరు: తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎల్ఎన్ నరసింహన్ దంపతులు శనివారం ఉదయం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. టీటీడీ తిరుపతి జేఈవో బసంత్ కుమార్, డిప్యూటీ ఈవో ఝాన్సీ తదితరులు గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. అలాగే ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా ఇస్తికాపాల్ స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులు అమ్మవారి దర్శనం అనంతరం శేష వస్త్రాన్ని, తీర్థ ప్రసాదాలను బహూకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ శివన్ తిరుమల: చంద్రయాన్-2 ప్రయోగం సందర్భంగా ఇస్రో చైర్మన్ శివన్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్-2 వాహక నౌక నమూనాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివన్ మాట్లాడుతూ.. చంద్రయాన్-2ను సోమవారం తెల్లవారుజామున 2.51 గంటలకు ప్రయోగిస్తామన్నారు. రెండు నెలల అనంతరం ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవానికి చేరుకుంటుందన్నారు. వర్షం వల్ల చంద్రయాన్-2 ప్రయోగానికి ఎలాంటి అంతరాయం కలగదని శివన్ తెలిపారు. -
గవర్నర్‌తో ముఖ్యమంత్రి జగన్ భేటీ
సాక్షి, అమరావతి/గన్నవరం: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. విజయవాడ గేట్‌వే హోటల్లో బస చేసిన గవర్నర్‌ను వైఎస్ జగన్ మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో కలిశారు. దాదాపు గంటసేపు అక్కడే ఉన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యమేర్పడింది. అసెంబ్లీలో రాబోయే అంశాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వైఎస్ జగన్ గవర్నర్ నరసింహన్‌కు వివరించినట్టు సమాచారం. అంతకుముందు హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో గన్నవరం చేరుకున్న గవర్నర్‌కు విమానాశ్రయంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, నూజివీడు సబ్‌కలెక్టర్ స్వప్నిల్దినకర్, విజయవాడ డీసీపీ హర్షవర్ధన్‌రాజు తదితరులు పుష్పగుచ్ఛాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ రోడ్డు మార్గం ద్వారా విజయవాడలోని గేట్‌వే హోటల్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అనంతరం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో గవర్నర్ విజయవాడ నుంచి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు. -
గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ
సాక్షి, విజయవాడ : బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో సీఎం జగన్ నగరంలోని గేట్‌వే హోటల్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జూలై 12న ఉదయం 11 గంటలకు సభలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్, ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తదితర అంశాలపై సీఎం జగన్ గవర్నర్‌తో చర్చించనున్నారు. ఇక మంగళవారం ముందుగానే గేట్‌వే హోటల్‌కు చేరుకున్న గవర్నర్ నరసింహన్‌కు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సాదర స్వాగతం పలికారు. -
నేడు రాష్ట్రానికి గవర్నర్ నరసింహన్
-
బాధ్యులపై చర్యలు చేపట్టారా?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ మార్కుల వ్యవహారంలో తలెత్తిన తప్పిదాలపై గవర్నర్ నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యా శాఖలపై సోమవారం గవర్నర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ ఫలితాల వ్యవహారంలో చోటుచేసుకున్న పరిణామాలపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మార్కుల్లో పొరపాట్లకు కారణమైన బాధ్యులను గుర్తించారా? ఏం చర్యలు చేపట్టారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా బోర్డు కార్యదర్శి అశోక్ కోర్టు క్లీన్ చీట్ ఇచ్చిందని పేర్కొన్నప్పటికీ అసంతృప్తిగానే ఆ అంశాన్ని ముగించినట్లు సమాచారం. అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా పక్కా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగాలని ఆదేశించినట్లు తెలిసింది. విద్యా సంబంధ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు సమాచారం. అలాగే పాఠశాల విద్య, ఉన్నత విద్య కార్యక్రమాలపైనా సమీ క్షించి, నాణ్యత ప్రమాణాల పెంపు కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారంపై అడిగినట్లు సమాచారం. సమావేశంలో ఉన్నత విద్య మం డలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, వెంకటరమణ, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్య కమిషనర్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.బాధ్యులపై చర్యలు చేపట్టారా? -
ఘనంగా అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-
రేపటి నుంచి అంతర్జాతీయ విత్తన సదస్సు
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి జూలై 3 వరకు 32వ అంతర్జాతీయ విత్తన సదస్సును (32 ఇస్టా కాంగ్రెస్) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని సీడ్ బౌల్ గా చూడాలన్న ఆశయంతో సీఎం కేసీఆర్ వినూత్న మార్పులతో దేశంలో రాష్ట్రాన్ని విత్తన కేంద్రంగా మార్చారని పేర్కొన్నారు. హైటెక్స్‌లో జరిగే ఈ ఇస్టా కాంగ్రెస్ సదస్సుతో తెలంగాణ ఖ్యాతి అంతర్జాతీయంగా వెలుగొందడం ఖాయమన్నారు. ఈ మేరకు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిసి ఈనెల 28న జరిగే ముగింపు సదస్సుకు రావాలని మంత్రి ఆహ్వానించారు. -
హైకోర్టు సీజేగా జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లోని దర్బార్‌హాల్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆయనతో ప్రమాణం చేయించారు. గవర్నర్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొత్త సీజేకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సతీమణి విమలా నరసింహన్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ఎండీ మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, తెలంగాణ, ఏపీ, కర్ణాటక హైకోర్టుల న్యాయమూర్తులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ కలకత్తా హైకోర్టుకు బదిలీ కావడంతో, గత మార్చి 28 నుంచి సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ ఈ నెల 19న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
65కు పెంచుతూ ఆర్డినెన్స్ జారీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రుల్లోని వైద్యులు, ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతూ గవర్నర్ నరసింహన్ ఆర్డినెన్స్ జారీచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే విరమణ వయసును పెంచాలని అప్పట్లో మంత్రి మండలి తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు రావడం, తర్వాత మళ్లీ సాధారణ ఎన్నికలు, అనంతరం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు... ఇలా ఎలక్షన్ కోడ్‌తో ఇప్పటివరకు అది ఆచరణలోకి రాలేదు. దీంతో ప్రభుత్వం అత్యవసరంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ప్రభుత్వ దంత వైద్య కళాశాలల అధ్యాపకులు, వైద్యులకు కూడా విరమణ వయస్సు 65ను అమలుచేస్తారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని గవర్నర్ విడుదల చేసిన రాజపత్రంలో పేర్కొన్నారు. బోధనాసుపత్రుల్లో పలువురి ఉద్యోగ విరమణ వల్ల అనేక ఖాళీలు ఏర్పడటం, వాటిని భర్తీ చేయకపోవడంతో వైద్య విద్య ఇబ్బందుల్లో పడుతుందని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. అంతేకాదు సకాలంలో పదోన్నతులు జరపకపోవడం వల్ల కూడా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కేడర్‌లోని సీనియర్ బోధనా సిబ్బందిలో భారీగా తగ్గుదల కనిపిస్తుందని ఆర్డినెన్స్‌లో వివరించారు. అంతేకాదు సూపర్ స్పెషాలిటీల్లోని కొన్ని యూనిట్లలో బోధనా సిబ్బంది కొరత అత్యంత తీవ్రంగా ఉందని, ఫలితంగా కొన్ని విభాగాలు దాదాపు మూసివేత అంచునకు చేరిన పరిస్థితి నెలకొందని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. బోధనా సిబ్బంది కొరతతో భారతీయ వైద్య మండలి, భారతీయ దంత వైద్య మండలీలు తనిఖీలకు వచ్చినప్పుడు పీజీ సీట్లతో సహా కొన్ని మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతమున్న సీట్ల గుర్తింపునూ కోల్పోయే పరిస్థితి ఉందని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచామని వివరించారు. రాష్ట్ర శాసనమండలి ఇప్పుడు సమావేశంలో లేనందువల్ల వెంటనే చర్య తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నందున ఆర్డినెన్స్ జారీచేస్తున్నట్లు వివరించారు. జూడాల సమ్మె విరమణ... బోధనాసుపత్రుల్లో విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల (జూడా)తో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం సచివాలయంలో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో జూడాల నేతలు డాక్టర్ విజయేందర్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మహేశ్, నరేష్, లోహిత్ తదితరులున్నారు. మంత్రి హామీ మేరకు సమ్మె విరమిస్తున్నట్లు వారు తెలిపారు. అన్ని బోధనాసుపత్రుల్లోని ఖాళీలను ఆరు నెలల నుంచి ఏడాదిలోగా భర్తీ చేస్తామని, నల్లగొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్టు పద్ధతిలో భర్తీని నిలిపివేసి రెగ్యులర్‌గా నియమిస్తామని తమకు మంత్రి హామీ ఇచ్చినట్లు వారు వివరించారు. ఖాళీలను మెడికల్ బోర్డు నేతృత్వంలో భర్తీ చేస్తామన్నారని తెలిపారు. విరమణ వయసు పెంపుపై ఆర్డినెన్స్ రావడంతో దానిపై సమ్మె కొనసాగించినా సర్కారు వెనక్కు తగ్గే పరిస్థితి లేకపోవడంతో జూడాలు సమ్మె విరమించారు. ఇదిలావుండగా విరమణ వయసును ఏకంగా ఏడేళ్లు పెంచడంతో బోధనాసుపత్రుల్లోని అనేక మంది వైద్యులు హర్షం వ్యక్తంచేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (ప్రజారోగ్యం) ప్రధాన కార్యదర్శి లాలూప్రసాద్ సహా పలువురు నేతలు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి హర్షం వెలిబుచ్చారు. ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులకు కూడా విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచాలని కోరారు. అలాగే నిర్ణీతకాల పదోన్నతులు తమకు కూడా కల్పించాలని విన్నవించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
తెలంగాణ హైకోర్టు సీజేగా రాఘవేంద్రసింగ్ చౌహన్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ప్రమాణం చేశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్.. జస్టిస్ చౌహాన్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. -
ప్రతి బడి, కళాశాలల్లో యోగాను పెట్టాలి: గవర్నర్ నరసింహన్
హైదరాబాద్: యోగాభ్యాసం వల్ల శారీరక దృఢత్వంతో పాటుగా మానసికబలం పెరుగుతుందని, ప్రతీ పాఠశాల, కళాశాలల్లోను యోగాను ప్రవేశపెట్టాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నా రు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సంస్కృతి రాజ్‌భవన్ కమ్యూనిటీ సెంటర్లో అధికారులు, సిబ్బందితో కలసి గవర్నర్ నరసింహన్ దంపతులు యోగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యోగా వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. గవర్నర్ యోగా గురువైన రవికిశోర్‌కు, ఆయన యోగా బృందానికి ఈ సందర్భంగా నరసింహన్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ సతీమణి విమలా నరసింహన్, మాజీ డీజీపీ ఏకే మహంతి పలువురు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
యోగ మనసుకు ఆహ్లాదాన్నీ ఇస్తుంది
-
మేడిగడ్డకు గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం
-
మేడిగడ్డకు గవర్నర్, మహారాష్ట్ర సీఎం
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మేడిగడ్డకు చేరుకున్నారు. యోగా డే సందర్భంగా రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి ప్రత్యేక విమానంలో మేడిగడ్డకు బయలుదేరారు. అక్కడ సీఎం కేసీఆర్ వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జలసంకల్ప యాగంలో పాల్గొన్నారు. కాగా ఇంతకు ముందే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మేడిగడ్డకు చేరుకున్నసంగతి తెలిసిందే. ముగ్గురు సీఎంలు గవర్నర్‌తో కలిసి యాగంలో పాల్గొన్నారు. మేడిగడ్డ వద్ద శృంగేరి పీఠం అర్చకుల ఆధ్వర్యంలో జలసంకల్ప యాగం కొనసాగుతోంది. ఈ యాగంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ పాల్గొన్నారు. అక్కడ జలసంకల్ప యాగం, పూజలు కొనసాగుతున్నాయి. -
రాజ్ భవన్లో యోగా డే సెలబ్రేషన్స్
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా యోగా డే కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యోగా డే వేడుకలు జరుగుతుండగా.. రాజ్‌భవన్‌లోని సంస్కృతి భవనంలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. యోగ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అందరికి యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగ అనేది మనుసుకు ఆహ్లాదాన్ని ఇస్తుందన్నారు. ఇకపై రోజు యోగ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు యోగ చేయాలని సూచించారు. యోగ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. రాజ్ భవన్ స్టాఫ్ అందరి కోసం యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ట్యాంక్‌బండ్ యోగాడేలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్యాంక్‌బండ్ వద్ద జరుగుతున్నయోగా డే సెలబ్రేషన్స్‌లో టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్, టూరిజం సెక్రటరీ బుర్రా వెంకటేశం పాల్గొన్నారు. బుద్దుని విగ్రహం దగ్గర నిర్వహించిన ఈ వేడుకల్లో మంత్రి ఆసనాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ.. మనదేశంలో యోగ పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం యోగ చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యోగాను తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రపంచ దేశాలు మన యోగాను ఫాలో అవుతున్నాయన్నారు. టూరిజంస్పాట్‌లో యోగాను ప్రమోట్ చేస్తామని తెలిపారు. -
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21న తలపెట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి రావాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన ఈ భేటీలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం, కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలకు శంకుస్థాపన కార్యక్రమాలతో పాటు పలు ఇతర అంశాలపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రణాళికను గవర్నర్‌కు వివరించారు. కార్యక్రమంలో భాగంగా ఈనెల 21న ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు హోమం నిర్వహిస్తున్నామని, ఆ తర్వాత ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. గవర్నర్‌తో సహా ఇతర ప్రముఖులను హైదరాబాద్ నుంచి అక్కడకు తీసుకెళ్లడానికి నాలుగు హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి ఏపీ, మహారాష్ట్ర రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవిస్‌లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం 2020తో పూర్తికానుందని, 45 లక్షల ఎకరాలకు 2 పంటలకు సాగునీరు అందుతుందని చెప్పారు. మంగళవారం జరిగిన రాష్ట్రమంత్రివర్గ సమావేశం విశేషాలను కూడా గవర్నర్‌కు తెలియజేశారు. ఈ నెల 27న కొత్త సచివాలయం, కొత్త శాసనసభ, శాసనమండలి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుత సచివాలయం ఉన్న చోటే కొత్త సచివాలయాన్ని, ఎర్రమంజిల్‌లో కొత్త శాసనసభ భవనాన్ని నిర్మించనున్నట్టు వెల్లడించారు. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటున్నామని వివరించారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, అధికారులు హైదరాబాద్‌లో సమావేశమై గోదావరి జలాల అంశంపై చర్చలు జరపనున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ కోసం కేటాయించిన భవనాలను తెలంగాణకు సత్వరమే అప్పగించడం పట్ల సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. -
ఉస్మానియా యూనివర్సిటీలో 80వ స్నాతకోత్సవం
-
ఎదిగినకొద్దీ ఒదిగుండాలి!
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాలు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని రాష్ట్ర గవర్నర్, వర్సిటీ చాన్స్‌లర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరహాలో ప్రతి యూనివర్సిటీ కూడా సామాజిక బాధ్యతగా పేద విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ వంటి అంశాల్లో శిక్షణ ఇప్పించాలని సూచించారు. సోమవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం 80వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వీసీ ప్రొఫెసర్ రామచంద్రన్ అధ్యక్షతన ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో 2013 నుంచి 2018 విద్యాసంవత్సరం వరకు అత్యధిక మార్కులు సాధించిన 200 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. అలాగే 851 మంది విద్యార్థులకు పీహెచ్డీ అవార్డులు ఇచ్చారు. కార్యక్రమానికి సీఎస్ఐఆర్ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలస్యమైనందుకు క్షమించండి.. ఏటా నిర్వహించాల్సిన స్నాతకోత్సవాన్ని అనివార్య కారణాల వల్ల గత ఆరేళ్ల నుంచి నిర్వహించలేకపోయామని, ఇందుకు విద్యార్థులంతా క్షమించాలని నరసింహన్ కోరారు. ఇకపై ఆ పరిస్థితి రానివ్వబోమని స్పష్టం చేశారు. వర్సిటీ అకాడమీ కేలండర్లో అడ్మిషన్లు, పరీక్షలు, ఫలితాలు ఎలా పొందుపర్చామో.. అలాగే వర్సిటీ స్నాతకోత్సవ తేదీ పొందుపర్చాలని సూచించారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఏటా స్నాతకోత్సవం నిర్వహించాలని ఆదేశించారు. ఎదిగే కొద్ది..ఒదిగి ఉన్నప్పుడే గుర్తింపు విద్యార్థులు ఉన్నతస్థితికి చేరుకున్నా.. తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, వారిని గౌరవించాలని సూచించారు. ‘గతంలో గురువులకు, శిష్యులకు మధ్య మంచి అవినాభావ సంబంధం ఉండేది. అంతా కలసి కుటుంబసభ్యుల్లా మెలిగేవారు. మంచి విద్యను అందించడంతో పాటు సత్యం, ధర్మం, వినయం, విధేయత, కష్టించేతత్వాన్ని నేర్పించేవారు. విద్యార్థి ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఇవి ఎంతో తోడ్పడేవి. ప్రస్తుతం గురు శిష్యులకు మధ్య అగాథం పెరిగింది. దీన్ని తగ్గించాలి. మనిషికి చదువు, ఉద్యోగం, సంపాదన, హోదాతో గుర్తింపు రాదు.. వినయం, విధేయతతోనే అసలైన గుర్తింపు దక్కుతుంది. మనిషి ఎదిగేకొద్ది వినయం పెరగాలి’అని పేర్కొన్నారు. పీహెచ్డీ అవార్డు గ్రహీతల్లో అసంతృప్తి స్నాతకోత్సవంలో నరసింహన్ చేతుల మీదుగా పీహెచ్డీ అవార్డు అందుకోవాలని ఆశపడ్డ విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కామర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సైన్స్ పీజీ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు దాతల పేరుతో ఏర్పాటు చేసిన బంగారు పతకాలు అందజేసి ఆ తర్వాత వెళ్లిపోయారు. దీంతో ఎస్.చంద్రశేఖర్, వీసీ రాంచంద్రం చేతుల మీదుగా అవార్డులు తీసుకోవాల్సి వచ్చింది. చాన్స్‌లర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవచ్చని ఆశపడ్డ పరిశోధకులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయకుండా వెళ్లిపోవడంతో విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, తమ పిల్లలు అవార్డులు తీసుకుంటుండగా చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులు, బంధువులకు నిరాశే మిగిలింది. భద్రత కారణాలు, ఆడిటోరియంలో విద్యార్థులు, అధ్యాపకులకు తగిన కుర్చీల్లేకపోవడంతో వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో వారంతా చెట్ల కిందే కూర్చున్నారు. క్రమశిక్షణలో రాజీపడొద్దు.. దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా ఒకటని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, దీన్ని ఇలాగే కాపాడుకోవాలని నరసింహన్ సూచించారు. క్షేత్రస్థాయి అవసరాలకు తగ్గట్లుగా వర్సిటీలు సిలబస్ రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం మానవ వనరులకు ఉండాల్సిన నైపుణ్యం, వర్సిటీల్లో బోధిస్తున్న విద్యకు మధ్య భారీ తేడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని పూరించాల్సిన బాధ్యత గురువులపైనే ఉందన్నారు. ప్రతి విద్యార్థి భారతీయుడిగా గర్వపడాలని, మనకు లేనిదంటూ ఏమీ లేదని, దేశానికి గొప్ప సంస్కృతి ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ అత్యంత కీలకమని, ఈ విషయంలో రాజీపడితే వారు భవిష్యత్తులో దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించారు. -
ఘనంగా ఓయూ 80వ స్నాతకోత్సవం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం 80వ స్నాతకోత్సవాలకు విశ్వవిద్యాలయం చాన్స్‌లర్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. దాదాపు ఆరేళ్ల తర్వాత జరిగిన స్నాతకోత్సవంలో 270 మంది విద్యార్థులకు గవర్నర్ బంగారు పతకాలను అందజేశారు. అలాగే పీహెచ్డీ పూర్తి చేసిన 680 మంది విద్యార్థులు డాక్టరేట్ పట్టాలను గవర్నర్ చేతుల మీదుగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగిస్తూ...విద్యార్థులు ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రులు, ఆచార్యులను విస్మరించరాదని హితవు పలికారు. విశ్వవిద్యాలయంలో విద్యతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని అన్నారు. ఐఐసీటీ డైరెక్టర్ చంద్రశేఖర్‌ను విద్యార్థులు రోల్ మోడల్‌గా తీసుకోవాలన్నారు. మానవత్వమే ప్రతి ఒక్కరి జీవన విధానంగా మారాలని పేర్కొన్న గవర్నర్... సమాజం కోసం త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేలా విద్యావిధానం ఎదగాలన్నారు. ఓయూ.. భారత దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ అని కొనియాడారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు యూనివర్సిటీ గౌరవాన్ని ఇనుమడింపజేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాల వైస్‌చాన్స్‌లర్ ప్రొ. రామచంద్రం, ఐఐసీటీ డైరెక్టర్ చంద్రశేఖర్, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. -
అవినీతి లేని పాలనే లక్ష్యం
సాక్షి, అమరావతి: పారదర్శకమైన, అవినీతి రహిత పాలన అందించడం.. నవరత్నాల సంక్షేమ ఫలాలు ప్రతి అర్హుని ఇంటికి చేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చెప్పారు. అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వినూత్న విధానాలు అవలంభిస్తామని.. ఇవి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని ఉద్ఘాటించారు. గత ప్రభుత్వం ఖాళీ ఖజానాను తమకు అప్పగించినప్పటికీ దుబారాకు అడ్డుకట్ట వేసి ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం, వెలిగొండతోపాటు ముఖ్యమైన ప్రాజెక్టులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రాజెక్టుల్లో నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడానికి కూడా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. శాసనమండలితోపాటు కొత్తగా కొలువుదీరిన శాసనసభను ఉద్దేశించి శుక్రవారం గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం సుపరిపాలన లక్ష్యాలను, విధానాలను ప్రతిబింబించేలా సూటిగా, స్పష్టంగా ఆయన ప్రసంగం కొనసాగింది. శాసనసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్.. కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. సుస్థిరత, పారదర్శకత, అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఓటువేశారని గవర్నర్ కితాబిచ్చారు. సమస్యల పరిష్కారంపై దృష్టి.. నరసింహన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘రాష్ట్ర విభజనవల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నం కాగా.. విభజనానంతరం ఏర్పడిన సవాళ్లను సక్రమంగా అధిగమించలేకపోవడంవల్ల మరికొన్ని చిక్కులు ఏర్పడ్డాయి. నూతన ప్రభుత్వానికి తక్షణమే ఈ సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. నిధులు, సహజ వనరులు, మానవ వనరుల దుర్వినియోగంవల్ల రాష్ట్రం మరింత అథోగతిపాలైంది. దాదాపు ఖాళీ ఖజానా సంక్రమించినందున అన్ని రకాల వనరులను అత్యంత సమర్థంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదు. సుపరిపాలన లక్ష్యంతో మంచి విధానాలు రూపొందించడంలో భాగస్వాములయ్యే సభ్యులందరికీ నేను మరోసారి స్వాగతం పలుకుతున్నాను. వారు ఈ రాష్ట్ర విలువలను, సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందిస్తారని విశ్వసిస్తున్నాను. గతంలో నిర్లక్ష్యానికి గురైన కొన్ని ప్రాంతాలు, కొన్ని వర్గాలను ప్రధాన జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది’.. అని గవర్నర్ వివరించారు. కేంద్ర సహకారానికి నిరంతర ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లో పేర్కొన్న అంశాలు, ఇతర హామీల సాధనకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని గవర్నర్ అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు ప్రారంభించామని.. వీటి విషయంలో తమ ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ఉందన్నారు. అలాగే, ప్రభుత్వ వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేసి రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలుపుతుంది. ఇందుకోసం ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తుంది. అవినీతిని నిర్మూలించడంతోపాటు లబ్ధిదారుల ఇంటికే సేవలు తీసుకెళ్లేందుకు సర్కారు చర్యలకు శ్రీకారం చుడుతుందని నరసింహన్ వివరించారు. పారదర్శకత, జవాబుదారీకి పెద్దపీట గత ప్రభుత్వ పాలనకు భిన్నంగా ఈ ప్రభుత్వం పూర్తిస్థాయిలో పారదర్శకతకు, జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తుంది. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేయడానికి వీల్లేదంటూ గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను మొట్టమొదట మా ప్రభుత్వం రద్దుచేయడం ఇందులో భాగమే. రెండో విషయానికి వస్తే.. టెండర్లు ఇవ్వడానికి ముందే ప్రతి టెండరును పరిశీలించేందుకు జ్యుడిషియల్ కమిషన్ సహాయాన్ని నా ప్రభుత్వం కోరుతుంది. అవినీతికి పాల్పడే అవకాశం లేకుండా ఈ చర్య కట్టుదిట్టం చేస్తుంది. అలాగే, ప్రభుత్వ ధనం వృథా కాకుండా నివారించేందుకు దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది. థర్డ్ పార్టీ పరిశీలన తర్వాత అవసరమైతే రివర్స్ టెండరు విధానాన్ని చేపడుతుంది. ఖర్చును సమర్థంగా తగ్గించడానికి , అధిక ధర బిడ్డింగులను నివారించడానికి భవిష్యత్తులో ఈ విధానం దేశంలోనే ట్రెండ్ సెట్టరు కానుంది. నవరత్నాలతో అనేక వర్గాలకు లబ్ధి పేదలు, నిరుపేదలు, అభాగ్యులకు సహాయపడే మార్గాలను అన్వేషించాలనేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భావజాలం. దీనిని గతంలోకంటే బాగా అమలుచేసేందుకు ఈ సర్కారు కట్టుబడి ఉంది. ‘నవరత్నాలు’ రూపకల్పన ఇందులో భాగమే. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, వైఎస్సార్ పింఛన్లు, పేదలందరికీ గృహాలు, యువతకు ఉపాథి–ఉద్యోగ కల్పన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, దశల వారీగా మద్య నిషేధం, జలయజ్ఞం ఇందులోనివే. తొమ్మిది సంక్షేమ ఇతివృత్తాలు కలిగిన ఈ పథకం జనాభాలోని భిన్న వర్గాలకు, రంగాలకు లబ్ధి చేకూర్చుతుంది. రైతు సంక్షేమమే ప్రాథమిక బాధ్యత రైతు సంక్షేమంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారిస్తుంది. 62 శాతం జనాభా ఇంకా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నందున వారి ప్రయోజనాలు, సంక్షేమం చూడటం ప్రాథమిక బాధ్యతగా నా సర్కారు భావించింది. నకిలీ విత్తనాల సరఫరాతో సహా అనేక రకాలుగా దోపిడీకి గురవుతున్న రైతుల గురించి ప్రభుత్వం తీవ్రంగా ఆందోళన చెందుతోంది. రైతులకు సంబంధించిన అన్ని సమస్యలపై లోతుగా అధ్యయనం చేసి సంస్కరణలు తీసుకురావడానికి రాష్ట్ర రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాథి హామీ పథకంతో వ్యవసాయ పనులను అనుసంధానం చేయడమనేది నేటికీ అస్పష్టంగా ఉంది. సాగు ఖర్చులను తగ్గించడానికి.. సీజన్లో వ్యవసాయ కార్మికులు అందుబాటులో ఉండేటట్లు చూడటానికి వీలుగా ఈ విధానాన్ని రూపొందించడానికి గల సాధ్యాసాధ్యాలను కమిషన్ అన్వేషిస్తుంది. అలాగే, మొదట చెప్పిన దానికన్నా ముందే (2019 అక్టోబరు 15 నుంచి) ప్రతి రైతు కుటుంబానికి రైతు భరోసా ద్వారా సాలుకు రూ.12,500లు ఈ ప్రభుత్వం అందిస్తుంది. ఇది రైతులకు నేరుగా రూ.10 వేల కోట్లకుపైగా నిధులు అందించేందుకు వీలు కల్పిస్తుంది. కౌలు రైతులకు కూడా సాయం అందుతుంది. సాగుదారులు, భూయజమానుల ప్రయోజనాలు, హక్కులకు భంగం కలుగకుండా కౌలు రైతుల ప్రయోజనాలు కాపాడాలని సర్కార్ నిర్ణయించింది. అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధి కులమతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హుల్లో చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందించాలనేదే సర్కారు మూడో ప్రాధాన్యం. ఇందులో భాగంగానే లబ్ధిదారుల ఇళ్లకే సంక్షేమ ఫలాలతోపాటు అన్ని సేవలు చేర్చడానికి గ్రామ సేవకుడు విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వలంటీరు, పట్టణాల్లో అయితే ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించి అన్ని పథకాలను ప్రజల ఇళ్ల వద్దకే చేరేలా చేస్తుంది. వలంటీర్‌కు రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తుంది. అంతేకాదు.. గ్రామ సచివాలయ పాలన అందుబాటులోకి వచ్చిన తర్వాత పౌరులిచ్చే ప్రతి అభ్యర్థన 72 గంటల్లో పరిష్కరించే వ్యవస్థ ఉంటుంది. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర పత్రంగా పరిగణించి అమలుచేసేందుకు నా సర్కారు బాధ్యత వహిస్తుంది. ఎలాంటి మార్పు లేకుండా ప్రతి వాగ్దానం అమలుచేస్తుంది. అమల్లోకొచ్చిన.. కొత్త సర్కారు తీసుకోనున్న కీలక నిర్ణయాలివే.. - రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వడంతోపాటు ఉచితంగా బోర్లు వేయిస్తుంది. - వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ అందించనుంది. - రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2,000 కోట్లతో ప్రకృతి విపత్తు సహాయ నిధి ఏర్పాటు. - సహకార డెయిరీలకు పాలు సరఫరా చేసే రైతులకు లీటరుకు రూ.4 ప్రోత్సాహకం అందిస్తుంది. - ఏదేని కారణంవల్ల రైతు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి వైఎస్సార్ బీమా పథకం కింద రూ.7 లక్షలు అందిస్తుంది. - ఐదు లక్షలలోపు వార్షికాదాయం ఉన్న ప్రతి కుటుంబానికి రూ. వెయ్యికి మించిన వైద్యం అవసరమైతే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం. ఈ పథకం కింద ప్రస్తుతమున్న 1095 వ్యాధులకు మరో 936 చేరుస్తాం. - దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలు, తలసేమియా వంటి వ్యాధులతో బాధపడే రోగలకు ప్రత్యేక సాయంగా నెలకు రూ.10 వేల పింఛను. - వైఎస్సార్ ఆరోగ్య శ్రీని సమర్థంగా అమలుపర్చడంతోపాటు ప్రభుత్వాస్పత్రులను మెరుగుపరిచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక. - గ్రామ ఆరోగ్య కార్యకర్తల నెలసరి గౌరవ వేతనాన్ని రూ.3,000 నుంచి రూ. 10,000కు పెంపు. - దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో భాగంగా మొదటి దశలో బెల్ట్‌షాపులను మూసివేతకు నిర్ణయం. - పిల్లలను పాఠశాలకు పంపించే ప్రతి తల్లికీ అమ్మ ఒడి పథకం కింద సంవత్సరానికి రూ.15,000లు చెల్లింపు. - సాంకేతిక, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ చేయడంతోపాటు ప్రతి విద్యార్థికి వసతి కోసం ఏటా రూ. 20,000 మంజూరు - ‘వైఎస్సార్ చేయూత’ కింద రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాల్లో మహిళల ఆర్థిక ప్రగతి కోసం 45–60 ఏళ్ల మధ్య వయసుగల వారికి ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75,000 చెల్లింపు. - ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, బలహీన వర్గాల నూతన వధువులకు వివాహ సమయంలో రూ. లక్ష ప్రోత్సాహకంగా అందిస్తాం. - ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. రాజకీయపరంగా నియమించే డైరెక్టర్లు, చైర్మన్లు, పాలక మండళ్లు తదితర నియామకాల్లో కూడా 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం. - కాపుల సంక్షేమానికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కేటాయించాలని ప్రణాళిక రూపొందించాం. అలాగే, ఆర్య వైశ్యులు, ముస్లింలు, క్రిస్టియన్లు, అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారిపట్ల తగు శ్రద్ధ చూపుతాం. - సామాజిక పింఛన్‌ను దశల వారీగా రూ.3,000కు పెంచుతామన్న హామీ మేరకు వైఎస్సార్ భరోసా పింఛను రూ.2,250కి పెంచాం. నాలుగేళ్లలో దీనిని రూ.3,000కు తీసుకెళ్తాం. అలాగే, పింఛనుకు అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించాం. దీనివల్ల 5 లక్షల మందికి అదనంగా ప్రయోజనం కలిగింది. - 2020 ఉగాది నుంచి 25 లక్షల ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. అలాగే, వచ్చే నాలుగేళ్లపాటు ఏటా 6 లక్షల ఇళ్లు నిర్మిస్తాం. - ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి కమిటీ ఏర్పాటు చేశాం. - పురపాలక పారిశుధ్య కార్మికుల వేతనాలను రూ.12,000 నుంచి రూ. 18,000కు పెంచాం. - ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) 27 శాతం జూలై నుంచి చెల్లిస్తాం. - గిరిజన సంక్షేమ శాఖలో సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు గౌరవ వేతనం రూ.400 నుంచి రూ.4,000కు పెంచాం. అంగన్వాడీలు, హోంగార్డులకు వేతనాలు పెంచాం. - అక్రమ మైనింగ్, అవినీతి నిరోధానికి కొత్త ఇసుక విధానం తెస్తాం. -
ఇచ్చిన ప్రతిహామీని సీఎం వైఎస్ జగన్ నేరవేరుస్తారు
-
గవర్నర్ ప్రసంగంపై ఎమ్మెల్యేల ప్రశంసలు
సాక్షి, అమరావతి : ఎన్నికలు ముగిసిన తర్వాత కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం ప్రసంగించారు. రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పరిపాలన లక్ష్యాలను, విధానాలను ప్రతిబింబించేలా ఆయన ప్రసంగం కొనసాగింది. నవరత్నాలను ప్రతీ ఇంటికి చేరుస్తామని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. ఇక గవర్నర్ ప్రసంగంపై పలువురు ఎమ్మెల్యేలు ప్రశంసలు కురిపించారు. (చదవండి : ఇంటింటికి నవరత్నాలు: గవర్నర్ నరసింహన్) గవర్నర్ ప్రసంగంపై ఎమ్మెల్యేల మాట.. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ విధానాలకు గవర్నర్ ప్రసంగం అద్దం పట్టింది. ఆయన ప్రసంగంలో ప్రభుత్వ ఉద్దేశాలు ప్రస్ఫుటమయ్యాయి. అణగారిన వర్గాలను చదువుతో అభివృద్ధి పథం వైపు నడిపించేందుకు చర్యలు చేపట్టనున్నారు. పోలవరంను కేంద్రం చేపట్టాల్సి ఉండగా గత ప్రభుత్వం తామే చేపడతానని తప్పుడు నిర్ణయాలు చేసింది. దేశంలో సామాజిక న్యాయం చేయడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది. మద్యపానంపై మా ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభిస్తోంది.- ఎమ్మెల్యే వరప్రసాద్ గవర్నర్ ప్రసంగం అద్భుతంగా ఉంది. రాష్ట్రంలోని రాజకీయ పక్షాలకు కనువిప్పు కలిగించేలా ప్రసంగం కొనసాగింది. ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా గవర్నర్ ప్రసంగం ఉంది.-ఎమ్మెల్యే మేరుగ నాగార్జున రాష్ట్రంలో వైఎస్ జగన్ వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు. గత పాలకుల అవినీతిపై ప్రజలు తగిన తీర్పు ఇచ్చారు. అవినీతి లేని పాలనను అందించాలని మా ప్రభుత్వం భావిస్తోంది. అమ్మఒడి వంటి గొప్ప పథకాలను తీసుకువచ్చారు. నవరత్నాల పేరుతో ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తాం. అవినీతి నిర్మూలనతో పాటు ప్రజాధనం దుబారా కాకుండా అరికట్టేందుకు చర్యలు చేపడతాం- ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు -
నేడు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం
సాక్షి, అమరావతి, విజయవాడ / గన్నవరం: కొత్తగా కొలువు తీరిన రాష్ట్ర శాసనసభ సభ్యులతో పాటు శాసనమండలి సభ్యులను ఉద్ధేశించి గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రసంగించనున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పరిపాలన లక్ష్యాలను, విధానాలను ప్రతిబింబించేలా గవర్నర్ ప్రసంగం ఉండనుంది. నెల తిరక్కముందే ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల్లో 60 శాతంపై విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్న విషయాన్ని గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు. మేనిఫెస్టోలోని నవరత్నాలు అమలుతోనే ప్రభుత్వం వేస్తున్న తొలి అడుగుల గురించి, అవినీతి రహిత.. పారదర్శకతతో కూడిన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా గవర్నర్ ప్రసంగం ద్వారా స్పష్టం చేయనున్నారు. గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్నాభిన్నమైనదనే విషయాన్ని కూడా గవర్నర్ ప్రసంగంలో స్పష్టం చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం మీద ప్రభుత్వ విధానాలను, లక్ష్యాలను గవర్నర్ తన ప్రసంగం ద్వారా వివరించనున్నారు. ఉభయ సభలనుద్ధేశించి గవర్నర్ ప్రసంగం పూర్తయ్యాక సభ వాయిదా పడుతుంది. శనివారం, ఆదివారం సభకు సెలవు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమ, మంగళవారాల్లో చర్చ అనంతరం సీఎం వైఎస్ జగన్ సమాధానం ఉంటుంది. విజయవాడకు చేరుకున్న గవర్నర్ ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు గురువారం గన్నవరం విమానాశ్రయంలో అధికారులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి బయలు దేరిన ఆయన మధ్యాహ్నం 2.25 గంటలకు గన్నవరం చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ కార్యదర్శి ఆర్పీ.సిసోడియా, జిల్లా కలెక్టర్ ఏఎండీ.ఇంతియాజ్, నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా గవర్నర్ విజయవాడ బయలుదేరి వెళ్లారు. అనంతరం సంప్రదాయ దుస్తుల్లో శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, ఈవో వి.కోటేశ్వరమ్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయనకు శేషవస్త్రాలు, అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. కాగా, విజయవాడలో గవర్నర్‌ను సీఎం జగన్మోహన్రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. -
విభజన అంశాలపై సమస్యలను పరిష్కరించండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర పునర్విభజన చట్టంలోని తొమ్మిది, పదవ షెడ్యూళ్లలోని ప్రభుత్వ రంగ సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్కు చెందిన సమస్యలను విచక్షణాధికారంతో పరిష్కరించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు. లాభాలు ఆర్జించే ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన నిధులను ఏ ప్రాతిపదికన పంపిణీ చేయాలనే దానిపై విభజన చట్టంలో పేర్కొనలేదని, ఈ నేపథ్యంలో గవర్నర్‌గా విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకుని, త్వరగా సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు. తొమ్మిదవ షెడ్యూల్లోని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల పంపిణీకి సంబంధించి షీలా బేడీ కమిటీ కొన్ని సిఫార్సులు చేసినప్పటికీ అవి అమల్లోకి రాలేదన్నారు. ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల గవర్నర్‌గా విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకోవాలని సీఎం కోరారు. కొన్ని ఇన్స్టిట్యూషన్లకు సంబంధించి అప్పుల పంపిణీ ఏ ప్రాతిపదికన చేయాలో విభజన చట్టంలో స్పష్టత లేదన్నారు. ఈ విషయంలో కూడా గవర్నర్‌గా నిర్ణయం తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు. తెలంగాణకు భవనాల అప్పగింత విషయంలో జరిగిన తరహాలోనే విభజనకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన బకాయిలు రాష్ట్రానికి రావాల్సి ఉందని, ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన సమస్యలున్నాయని.. వీటన్నింటినీ పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. గత ఐదేళ్లుగా చంద్రబాబు సర్కారు విభజన అంశాల పరిష్కారంపై పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జగన్ దృష్టి సారించడం విశేషం. -
గవర్నర్‌ను కలిసిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ : ఎన్నికలు ముగిసిన తర్వాత కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రేపు (శుక్రవారం) ప్రసంగించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలపై ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో నగరంలోని గేట్‌వే హోటల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఐదేళ్ల కాలంలో చేపట్టబోయే అభివృద్ధి పనులు, అవలంభించే విధానాలపై గవర్నర్ ప్రసంగం ఉండనుంది. -
గవర్నర్ల మార్పుపై ఊహాగానాలు..
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తర్వాత ప్రస్తుతం వివిధ రాష్ట్రాల గవర్నర్ల మార్పుపై ఊహాగానాలు సాగుతున్నాయి. పరిపాలన, రాజకీయ పరమైన కారణాల దృష్ట్యా పలు రాష్ట్రాల్లో కొత్త గవర్నర్లు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. చాలామంది గవర్నర్లు మోదీ మొదటిసారిగా ప్రధాని అయిన 2014లో నియమితులైనవారు కావడంతో తాజా పరిస్థితిని కేంద్ర హోం శాఖ సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు గవర్నర్లు చాలాకాలంగా కొనసాగుతున్నారు. కొందరు ఇతర రాష్ట్రాలకు ఇన్చార్జిలుగా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఛత్తీస్‌గఢ్ ఇన్చార్జిగా ఉన్నారు. ఈఎస్ఎల్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా అలాగే తెలంగాణ గవర్నర్‌గా పదేళ్లుగా కొనసాగుతున్నారు. కాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న అనిల్ బైజాల్ ప్రధానమంత్రి కార్యాలయానికి బదిలీ కావచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే గవర్నర్లను ఎప్పుడు మార్చేదీ, ఎందరిని మార్చేదీ తెలియరాలేదు. సోమవారం నాటి పరిణామాల తర్వాత ప్రభుత్వం ఈ వ్యవహారం గోప్యంగా ఉండాలని భావిస్తోంది. మరోవైపు అయిదు రాష్ట్రాల గవర్నర్లు...కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీ నాథ్ త్రిపాఠీ, తమిళనాడు గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్, జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము, అరుణాచల్ గవర్నర్ బీడీ మిశ్రా తదితరులు కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు. -
హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలను హోంమంత్రికి గవర్నర్ నివేదించారు. హోంమంత్రిగా అమిత్‌షా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి గవర్నర్ కలిశారు. భేటీ అనంతరం గవర్నర్ మాట్లాడుతూ... హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని, స్నేహపూర్వకంగా ఉంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ఏపీకి చెందిన ఉపయోగంలో లేని భవనాలను తెలంగాణ రాష్ట్రానికి పంపిణీ చేశామన్నారు. ఏపీ భవన్ సహా విభజన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని గవర్నర్ తెలిపారు. -
శ్రీవారిని దర్శించుకున్న పీఎం మోదీ, సీఎం జగన్
సాక్షి, తిరుమల : భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుపతికి చేరుకున్న మోదీ..అక్కడ ప్రజా ధన్యవాద సభలో పాల్గొన్నారు. అనంతరం తిరుమలకు చేరుకున్న మోదీకి శ్రీవారి ఆలయం ఎదుట ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీటీడీ ఈవో అనీల్‌కుమార్ సింఘాల్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. టీటీడీ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి మహాద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాన మంత్రి హోదాలో మోదీ మూడో సారి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇంతకు ముందు 2015 అక్టోబర్ 3వతేదీ, 2017 జనవరి 3న మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. -
నేడు తిరుమలకు ప్రధాని మోదీ రాక
-
నేడు సచివాలయానికి సీఎం జగన్
సాక్షి, అమరావతి: సచివాలయం తొలి బ్లాకులోని మొదటి అంతస్తులో గల సీఎం కార్యాలయంలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తొలిసారిగా ప్రవేశించనున్నారు. ఇందుకు ఉదయం 8.39 గంటలకు ముహూర్తంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్ జగన్ అన్ని శాఖల కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ వెంటనే సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో సమావేశం కానున్నారు. సీఎం కార్యాలయం పక్కనే గల కాన్ఫరెన్స్ హాల్లో ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన శంబంగి చిన అప్పలనాయుడు చేత 11.15 గంటలకు గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ కూడా హాజరవుతారు. అనంతరం తొలి బ్లాకు పక్కనే ఏర్పాటు చేసిన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికకు ముఖ్యమంత్రి చేరుకుంటారు. ఉదయం 11.49 గంటలకు గవర్నర్ నరసింహన్ మొత్తం 25 మంది చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత మంత్రివర్గ సభ్యులందరూ గవర్నర్, ముఖ్యమంత్రితో కలసి గ్రూపు ఫొటో దిగుతారు. ఈ నెల 10వ తేదీన ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో ఎన్నికల ప్రణాళికలోని నవరత్నాల అమలుపై ప్రధానంగా చర్చించడంతో పాటు కొన్ని పనులకు ఆమోదం తెలపనున్నారు. -
గవర్నర్ నరసింహన్‌తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
-
మంత్రివర్గ జాబితాను గవర్నర్‌కు అందజేసిన ఏపీ సీఎం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. శనివారం ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం గవర్నర్ విజయవాడకు చేరుకున్నారు. విజయవాడలోని గేట్ వే హోటల్లో బస చేసిన గవర్నర్‌ను ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న 25మంది జాబితాను ముఖ్యమంత్రి గవర్నర్‌కు అందజేశారు. ముఖ్యమంత్రి అందజేసిన మంత్రివర్గ జాబితాను గరర్నర్ రాజ్యాంగబద్ధంగా పరిశీలించిన అనంతరం సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ)కి పంపిస్తారు. తర్వాత జీఏడీ అధికారులు మంత్రులుగా నియమితులైనవారికి అధికారికంగా సమాచారం అందజేస్తారు. చదవండి : ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం సచివాలయంలో సిద్ధమౌతున్న సీఎం చాంబర్ -
ఏపీకి కొత్తగా భవనాలు...
-
హైదరాబాద్‌లో ఏపీకి కొత్తగా భవనాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిపోయిన వివాదాలను ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో పరిష్కరించుకునే దిశగా చకచకా అడుగులు పడుతున్నాయి. గత నెల 30న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పరస్పరం సహకరించుకుందామని, ఏపీ ప్రగతికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కేసీఆర్ ప్రకటించిన విదితమే. రాజ్‌భవన్‌లో శనివారం జరిగిన ఇఫ్తార్ విందు సందర్భంగా కూడా అధికారుల స్థాయిలో చర్చలు నిర్వహించి ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాలు నిరుపయోగంగా ఉన్న నేపథ్యంలో వాటిని తమకు అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ను కోరింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసు విభాగానికి కొత్తగా ఒక భవనం, ఇతర కార్యాలయాలు నిర్వహించుకోవడానికి మరొక భవనం కేటాయించాలని అభ్యర్థించింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం చేసిన తీర్మాన పత్రాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసి అందజేశారు. దీంతో గవర్నర్ తక్షణమే స్పందించి భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఏపీ పోలీసు విభాగానికి ఒక భవనం, ఇతర కార్యాలయాలకు మరొక భవనం కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 8 కింద తనకు సంక్రమించిన అధికారులను ఉపయోగించుకొని గవర్నర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉన్న భవనాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం బకాయిపడిన ఆస్తి పన్నులు, ఇతర చార్జీలను తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేయాలని గవర్నర్ సూచించారు. అయితే ఈ భవనాల విలువను పరిహారంగా చెల్లించాలని ఏపీ ప్రభుత్వం కోరనుందని ఆ రాష్ట్ర అధికార వర్గాల ద్వారా తెలిసింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకొని... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని రాష్ట్ర విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలు నిర్వహించుకునేలా విభజన సమయంలో ఇరు రాష్ట్రాలకు హైదరాబాద్‌లోని ప్రభుత్వ భవనాలను చెరి సగం కేటాయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అమరావతి నుంచి పని చేస్తుండటంతో హైదరాబాద్‌లో ఆ రాష్ట్రానికి కేటాయించిన భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి. వాటిని వాడుకోనప్పటికీ ఏపీ ప్రభుత్వం కరెంటు బిల్లులు, ఇతర పన్నులు చెల్లించాల్సి వస్తోంది. దాదాపు నాలుగేళ్లుగా ఖాళీగా ఉండటం, సరైన నిర్వహణ లేకపోవడంతో ఈ భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వాటికి సంబంధించి రూ. 10 కోట్లకుపైగా విద్యుత్ చార్జీలు, ఆస్తి పన్నులను ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. నిరుపయోగంగా ఉన్న ఈ భవనాలకు రక్షణగా వందల మంది ఏపీ ప్రభుత్వ భద్రత సిబ్బందితోపాటు నిర్వహణ కోసం మరికొందరు ఉద్యోగులు గత నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. సీఎం కేసీఆర్ హర్షం... హైదరాబాద్‌లోని ఏపీ ప్రభుత్వ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడంపట్ల సీఎం కేసీఆర్హర్షం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజాప్రయోజనాలే పరమావధిగా, స్నేహభావంతో ముందడుగు వేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రతి విషయంలోనూ వాస్తవిక దృష్టితో ఆలోచించి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ప్రభుత్వాలు పని చేస్తాయని సీఎం ఆకాంక్షించారు. ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, రెండు రాష్ట్రాల ప్రజలు క్షేమంగా ఉండాలని, అపరిష్కృత సమస్యలన్నీ సామరస్యపూర్వకంగా పరిష్కారం కావాలన్నదే తమ అభిమతమని సీఎం పేర్కొన్నారు. వివాదాలపై రెండు రాష్ట్రాల సీఎస్ల కమిటీ... తెలంగాణ, ఏపీల మధ్య అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు లేదా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాగల ఇతర సీనియర్ ఐఏఎస్‌ల నేతృత్వంలో ఉమ్మడి కమిటీ ఏర్పాటు చేయనున్నారు. గవర్నర్ నరసింహన్ సమక్షంలో శనివారం రాజ్‌భవన్‌లో సమావేశమైన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వై.ఎస్. జగన్ ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. త్వరలో ఈ కమిటీ ఏర్పాటు విషయంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ఉమ్మడిగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిపోయిన వివాదాల పరిష్కారానికి గత ఐదేళ్లలో తీసుకున్న చర్యలేమిటి? రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న ప్రభుత్వరంగ సంస్థల విభజన అంశంపై షీలా బిడే కమిటీ చేసిన సిఫారసులను యథాతథంగా అమలు చేయవచ్చా? లేక ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటుందా? అనే అంశాలపై సీఎస్ల కమిటీ సమావేశమై చర్చలు జరపనుంది. షెడ్యూల్ 9, 10లోని సంస్థల ఆస్తులు, అప్పుల విభజన, విద్యుత్ ఉద్యోగుల పంపకాలు, రూ. వేల కోట్లలో ఉన్న విద్యుత్ బిల్లుల వివాదాలు తదితర అంశాలపై అధ్యయనం జరపనుంది. కనీసం వారానికోసారి కమిటీ సమావేశమై అంశాలవారీగా చర్చలు జరపనుంది. చర్చలు కొలిక్కి వచ్చాక కమిటీలోని ఇరు రాష్ట్రాల అధికారులు వేర్వేరుగా నివేదికలను సమర్పించనున్నారు. ఈ నివేదికల ఆధారంగా ఇరు రాష్ట్రాల సీఎంలు మళ్లీ గవర్నర్ సమక్షంలో సమావేశమై చర్చల ద్వారా వివాదాల పరిష్కారానికి కృషి చేయనున్నారు. సమస్యలపై ఏకభిప్రాయం కుదిరే వరకు సీఎంలు సైతం ఒకటికి రెండుసార్లు సమావేశమయ్యే అవకాశాలున్నాయి. -
నాలుగైదు రోజుల్లో కేబినెట్ విస్తరణ!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. నాలుగైదు రోజుల్లో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని యోచిస్తున్నారు. ఈ నెల 7తో శాసనమండలి ఎన్నికల ప్రవర్తన నియమా వళి ముగియనుండగా, ఆ తర్వాత ఏ క్షణం లోనైనా మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ ఆదివారం ఉదయం పబ్లిక్ గార్డెన్స్‌లో 6వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని, అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో గంటకు పైగా సమావేశమయ్యారు. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, ఐదేళ్ల తెలంగాణలో సాధించిన పురోగతి, విజయాలు, ఏపీ–తెలంగాణ మధ్య విభేదాల పరిష్కారం తదితర అంశాలపై ఈ భేటీలో గవర్నర్‌తో సీఎం కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది. కొత్తగా మంత్రివర్గంలో చేరనున్న వారికి కేటాయించనున్న శాఖలు, ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న వారిలో కొందరి శాఖల మార్పు అంశం సైతం చర్చకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా గవర్నర్, కేసీఆర్ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బంగారు తెలంగాణ నిర్మా ణానికి గత ఐదేళ్లలో పటిష్ట పునాదులు పడ్డాయని, కొత్త రాష్ట్రమైనప్పటికీ అవరోధాల న్నింటినీ అధిగమించి అద్భుత ప్రగతి సాధించిం దని ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం, సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
విభజన వివాదాలకు తెర!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునే దిశగా మరో ముందడుగు పడింది. విభజన వివాదాల పరిష్కారం కోసం త్వరలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయినా ఇంకా కొలిక్కి రాని వివాదాలకు సత్వర ముగింపు పలకాలని అభిప్రాయానికి వచ్చారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ సందర్భంగా ముస్లిం సోదరులతో కలసి నమాజ్ చేస్తున్న గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వై.ఎస్. జగన్. చిత్రంలో ఏకే ఖాన్, ఎర్రబెల్లి, ఫరూక్ హుస్సేన్, మహమూద్ అలీ తదితరులు రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల విభజనతోపాటు విద్యుత్ ఉద్యోగుల విభజన, విద్యుత్ సంస్థల మధ్య విద్యుత్ బిల్లులు, ఆస్తులు, అప్పుల పంపకాలు, ఏపీ భవన్ విభజన తదితర అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు గడిచినా ఇంకా అపరిష్కృతంగా మిగిలిపోయిన అంశాలను ఉభయ ప్రయోజనకరంగా పరిష్కరించుకోవాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. రంజాన్ మాసం సందర్భంగా రాజ్‌భవన్ కాంప్లెక్స్‌లోని ‘సంస్కృతి’కమ్యూనిటీ హాల్లో గవర్నర్ శనివారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్ చేరుకున్న కేసీఆర్, జగన్... గవర్నర్ సమక్షంలో గంటకుపైగా చర్చలు జరిపారు. ఇఫ్తార్‌లో ఏపీ సీఎం వై.ఎస్. జగన్‌కు ఖర్జూరం తినిపిస్తున్న సీఎం కేసీఆర్ ప్రేమను పంచండి: గవర్నర్ సందేశం ప్రేమను పంచండి.. ప్రేమను చాటండి అని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పిలుపునిచ్చారు. రాజ్‌భవన్ కాంప్లెక్స్‌లోని సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఆయన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరినీ ప్రేమించండి.. ప్రేమను పంచండి అని అల్లా చెప్పారన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. అల్లా బోధనలను జీవితంలో ఆచరించాలని రంజాన్ సందేశమిస్తుందన్నారు. అందరికీ రంజాన్ పండుగ శుభకాంక్షాలు తెలిపారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లిం మత పెద్దలు, ప్రముఖులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ అనంతరం అక్కడే ముస్లిం సోదరులు మగ్రిబ్ నమాజ్ చేశారు. నమాజ్ అనంతరం గవర్నర్ అతిథులకు విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేందర్, ఎర్రబల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వై. విజయసాయిరెడ్డి, ఎంపీ వై.ఎస్. మిథున్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌కు పండు తినిపిస్తున్న ఏపీ సీఎం వై.ఎస్. జగన్ -
నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఐదు వసంతాలు పూర్తిచేసుకుని ఆరో వసంతంలో అడుగిడింది. ఎన్నో పోరాటాలు, ఎందరో బలిదానాల ప్రతిఫలంగా 2014 జూన్ 2న 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ.. ఆదివారం ఐదో ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. మూడు రోజుల పాటు వేడుకలు కొనసాగనున్నాయి. ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించనున్నారు. ఎల్బీ స్టేడియంలో జూన్ 3న 1001 మంది కళాకారులతో పేరిణి మహా నృత్య ప్రదర్శన, 4న 5 వేల మంది కళాకారులతో ఒగ్గు డోలు మహా విన్యాసాన్ని ప్రదర్శించనున్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా, రవీంద్రభారతిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో వేడుకలు.. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో సైతం ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించే బాధ్యతను రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారులకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మంత్రులు కొప్పుల ఈశ్వర్ (జగిత్యాల), తలసాని శ్రీనివాస్ (ఖమ్మం), ఈటల రాజేందర్ (కరీంనగర్), శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్‌నగర్), మల్లారెడ్డి (మేడ్చల్), ఇంద్రకరణ్ రెడ్డి (నిర్మల్), వి.ప్రశాంత్‌రెడ్డి (నిజామాబాద్), జగదీష్‌రెడ్డి (సూర్యాపేట), నిరంజన్‌రెడ్డి (వనపర్తి), దయాకర్‌రావు (వరంగల్ అర్బన్), ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి (నారాయణపేట), జీఆర్ రెడ్డి (రాజన్న సిరిసిల్ల), రామ్ లక్ష్మణ్ (జయశంకర్ భూపాలపల్లి), ఏకే గోయల్ (కొమురంభీం ఆసిఫాబాద్), ఏకే ఖాన్ (మహబూబాబాద్), రాజీవ్ శర్మ (మంచిర్యాల), అనురాగ్ శర్మ (నాగర్ కర్నూల్), డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ (నల్లగొండ), ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (వరంగల్ రూరల్), జెడ్పీ చైర్మన్లు శోభారాణి (ఆదిలాబాద్), వాసుదేవరావు (భద్రాద్రి కొత్తగూడెం) పద్మ (జనగామ), బండారు భాస్కర్ (జోగులాంబ గద్వాల), దఫేదార్ రాజు (కామారెడ్డి), రాజమణి (మెదక్), తుల ఉమ (పెద్దపల్లి), సునీత (వికారాబాద్), బాలు నాయక్ (యాదాద్రి భువనగిరి) ఆయా జిల్లాల్లో జరిగే రాష్టర అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. వినూత్నంగా ఆవిర్భావ వేడుకలు రాష్ట్ర అవతరణ దినోత్సవం అనగానే సీఎం అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడం, జెండా ఆవిష్కరించడం, సీఎం ప్రసంగం, ఎట్‌హోం కార్యక్రమంలాంటి పలు అధికారిక కార్యక్రమాలు అందరికీ గుర్తుకు వస్తాయి. వాటితో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా భాషా సాంస్కృతిక శాఖ విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు హైదరాబాద్ పబ్లిక్‌గార్డెన్, జూబ్లీహాల్, రవీంద్రభారతిలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కవి సమ్మేళనం, ఒగ్గుడోలు కళాకారుల నృత్యం, కూచిపూడి నృత్యం, జయజయహే తెలంగాణ నృత్య రూపకం, పేరిణి నృత్యం, ఒడిస్సీ నృత్యం, అవతరణ ఫిల్మోత్సవం, షార్ట్‌ఫిల్మ్‌ల స్క్రీనింగ్ వంటి పలు కార్యక్రమాలు వేడుకల్లో భాగంగా నిర్వహించనున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పూలతో అలంకరించిన అమరవీరుల స్తూపం 48 గంటల ‘ఫిల్మ్ మేకింగ్ ఛాలెంజ్’ ఇటీవలి కాలంలో లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు రూపొందించే యువ దర్శకులు ఎంతో మంది తమదైన సృజనాత్మకతతో ముందుకు వస్తున్నారు. తమ టాలెంట్‌కి పదును పెట్టుకుంటూ కొత్త కథలతో, కథనాలతో, టెక్నిక్, టెక్నాలజీతో తమ ప్రతిభని ప్రదర్శిస్తున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ రవీంద్రభారతిలో ఉన్న పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ కేంద్రంగా సినీవారం, సండే సినిమా కార్యక్రమాలను రూపొందించారు. ప్రతిఏటా నిర్వహించే పోటీలా కాకుండా ఈ సంవత్సరం అవతరణ ఫిల్మోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించనున్నారు. సినీ నిర్మాణంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 48 గంటల ఫిల్మ్ మేకింగ్ ఛాలెంజ్ ని తెలంగాణ ఫిల్మ్ మేకర్స్ కి పరిచయం చేస్తున్నారు. ఈ ఫిల్మ్ మేకింగ్ మారథాన్ గతనెల 24 సాయంత్రం 7 గంటలకు మొదలై 26 సాయంత్రం ఏడు గంటలకి ముగిసింది. భాషా సాంస్కృతిక శాఖ ప్రకటించే థీమ్, ప్రాప్, డైలాగ్ లేదా కేరెక్టర్ని వాడి నాలుగు నుంచి ఎనిమిది నిమిషాల షార్ట్ ఫిల్మ్ చేయడం ఇందులో ప్రత్యేకత. విజేతలకు జూన్ 3న రవీంద్రభారతి లో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానోత్సవం ఉంటుంది. మాధ్యమాల ద్వారా చేరువవుతున్న తెలంగాణ సంస్కృతి ప్రజలకు తొందరగా చేరువయ్యే ప్రసార, సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు యువత తెలంగాణ గొప్పతనాన్ని చాటి చెప్ప డానికి కృషిచేస్తున్నారు. గానం, నృత్యం, హావభావాలు, వేషధారణ వంటి అంశాలు ప్రస్ఫుటంగా కనిపించేలా షార్ట్‌ఫిల్మ్ తీయడం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండుగా మారింది. రోజురోజుకీ పెరుగుతున్న నెటిజన్ల సంఖ్య, యూట్యూబ్, అంతర్జాలవాడకం వం టి పలు అంశాలను పరిగణనలోకి తీసు కుని తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలు, డాక్యుమెంటరీల ప్రదర్శన, ఉత్తమ విదేశీ సినిమాల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. గత నాలుగేళ్లుగా ప్రతి సంవత్సరం జూన్ 2న రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా అవతరణ ‘ఫిల్మోత్సవం’పేరిట షార్ట్ ఫిలిం పోటీలను నిర్వహిస్తున్నారు. ఈసారి భిన్నంగా వేడుకలు ‘‘రవీంద్ర భారతిలో మూడు రోజులపాటు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. మొదటిరోజు అవార్డుల కార్యక్రమం, రెండోరోజు వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యం, గానం, అదేవిధంగా సాంస్కృతిక సారథి కళాకారుల పాటలు, తెలంగాణ గీతాలు, జూన్ 2న ఉదయం కవిసమ్మేళనం, సాయంత్రం చైతన్య గీతాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ప్రతియేటా నిర్వహించే అవతరణ దినోత్సవానికి కొంచెం భిన్నంగా 48 గంటల్లో ఫిల్మ్‌మేకింగ్ ఛాలెంజ్‌ని నిర్వహించాలనుకున్నాం. ఔత్సాహిక యువత తమ ప్రతిభను మెరుగుపరచడానికి సినీవారం, సండేసినిమా, ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహించాం. వారి ప్రతిభను నిరూపించుకునేందుకు ఆసక్తిగల సినిమా దర్శకులకు, టెక్నీషియన్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.’’ –మామిడి హరికృష్ణ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ తెలంగాణ సుభిక్షంగా ఉండాలి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు చేపట్టిన కార్యక్రమాలు కొనసాగించాలని, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకు అందేలా చూడాలన్నారు. ‘ప్రజల సంతోషమే ప్రభుత్వ విజయాలకి కొలమానం. రాబోయే రోజులలో ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ నిబద్ధతతో, పారదర్శకంగా అందరికీ అందేలా చూడాలి. బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వానికి విజయం చేకూరాలని, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను’అని అన్నారు. -
రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇఫ్తార్ విందు కేసీఆర్, వైఎస్ జగన్ హాజరు
-
ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్, కేసీఆర్ భేటీ
-
గవర్నర్‌ను కలిసిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
-
రాజ్‌భవన్‌లో వైఎస్ జగన్, కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో జరిగిన ఇఫ్తార్ విందులో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు అయ్యారు. ఇరువురు ముఖ్యమంత్రులు స్వీట్లు తినిపించుకున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ముస్లిం సోదరులు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. కాగా అంతకు ముందు గవర్నర్ సమక్షంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం అయ్యారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి పలు ఉమ్మడి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి వైఎస్ జగన్ హైదరాబాద్ వచ్చారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్, కేసీఆర్ భేటీ గవర్నర్‌ను కలిసిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రాష్ట్రపతి, ప్రధానితో నరసింహన్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం ఢిల్లీ వచ్చిన గవర్నర్ శుక్రవారం రాష్ట్రపతితో సమావేశమై తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను వివరించారు. అనంతరం మోదీని కలసి ప్రధానిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించడం పట్ల ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు కూడా రాష్ట్రపతి, ప్రధానితో భేటీ అయ్యారు. -
వైఎస్ జగన్ అనే నేను
సాక్షి, అమరావతి: అశేష జనవాహిని కేరింతలు.. హర్షధ్వానాలు.. దిక్కులు పిక్కటిల్లే నినాదాల నడుమ ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను..’ అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ నడిబొడ్డున గల ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉత్సాహం, ఉద్విగ్నభరిత వాతావరణంలో మధ్యాహ్నం సరిగ్గా 12.23 గంటల ముహూర్తానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, వైఎస్ జగన్‌తో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వ రహస్యాలను కాపాడతానని కూడా ప్రమాణం చేయించారు. జగన్ ప్రమాణం చేస్తున్నప్పుడు వేదికకు ఎడమవైపున ఆశీనురాలైన ఆయన మాతృమూర్తి వైఎస్ విజయమ్మ చలించారు.. కంటతడిపెట్టారు. ప్రమాణ స్వీకార సమయానికి ముందుగా అక్కడకు చేరుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తొలుత జగన్‌ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్ జారీ చేసిన నియామక పత్రాన్ని చదవి వినిపిస్తూ కాబోయే ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఆ వెంటనే గవర్నర్ లేచి లాంఛనంగా ‘..అనే నేను’ అంటూ తొలి పలుకు చెప్పగానే ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను, శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వ భౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగాని, పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని అన్నారు. వెను వెంటనే మళ్లీ గవర్నర్ ‘..అనే నేను’ అనగానే.. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియ వచ్చిన ఏవిషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్పప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏ వ్యక్తికీ లేదా.. వ్యక్తులకు తెలియ పరచనని లేదావెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే.. వేదికపై కాస్త ఎడంగా కూర్చున్న గవర్నర్‌సతీమణి విమలా నరసింహన్ ఒక పుష్పగుచ్ఛాన్ని జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డికి ఇచ్చి మనసారా అభినందనలు తెలియజేశారు. నవ్యాంధ్రలో నూతన అధ్యాయం.. 2019 మే 30.. నవ్యాంధ్రలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు తరలి వచ్చారు. ఉదయం నుంచే ఇందిరా గాంధీ స్టేడియం వద్ద సందడి నెలకొంది. స్టేడియం యావత్తు వైఎస్ జగన్ నినాదాలతో మార్మోగింది. గంటగంటకూ జనం పెరిగిపోవడంతో ఉదయం 10 గంటల తర్వాత అదుపు చేయడం పోలీసులకు కష్టతరమైంది. స్టేడియం బయట 14 ఎల్ఈడీ తెరల ముందు జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. జగన్, ఆయన కుటుంబ సభ్యులు తాడేపల్లిలోని నివాసం నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో తాడేపల్లి సెంటర్, వారధి మీదుగా మున్సిపల్ స్టేడియానికి చేరుకున్నారు. ఉదయం 11.50 గంటల సమయంలో జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి సభాస్థలికి చేరుకున్నప్పుడు ప్రజలు జేజేలు పలికారు. సభాస్థలి వద్ద పార్టీ నేతలు హెలికాప్టర్ నుంచి పూలు చల్లుతూ అభిమానాన్ని చాటుకున్న తీరు అపురూపం. వేదిక వద్దకు రాబోయే ముందు ఓపెన్ టాప్ జీప్‌లో వైఎస్ జగన్ జనానికి అభివాదం చేస్తూ సభా ప్రాంగణమంతా కలియతిరిగారు. అప్పటికే వేదికపైకి వచ్చిన తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, తెలంగాణ మంత్రులు, పుదుచ్ఛేరీ మాజీ మంత్రి మాల్లాడి కృష్ణారావులకు వినమ్రంగా నమస్కరిస్తూ వేదికపైకి వచ్చిన జగన్.. ప్రజలకు అభివాదం చేసినప్పుడు కొన్ని నిమిషాల పాటు ప్రాంగణమంతా హర్షధ్వానాలతో హోరెత్తింది. వైఎస్ జగన్ ఎదురేగి గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీసుబ్రమణ్యం ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సరిగ్గా 12.23 గంటలకు వైఎస్ జగన్‌తో నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గవర్నర్ దంపతులకు జగన్ స్వయంగా కిందకు వెళ్లి వీడ్కోలు పలికారు. అనంతరం స్టాలిన్, కేసీఆర్‌లు జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ మాట్లాడుతూ నాన్నగారి (డాక్టర్ వైఎస్సార్) పేరు నిలబెట్టి కనీసం మూడు నాలుగు టర్ముల వరకు మీ పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలని దీవిస్తున్నానని అన్నప్పుడు సభా ప్రాంగణం జగన్ నినాదంతో మార్మోగింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి అరుదైన రికార్డు తెలుగు రాష్ట్రాల చరిత్రలో జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం ఓ అరుదైన రికార్డుగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు దివంగత సీఎం వైఎస్సార్ కుమారుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అచ్చంగా తండ్రి బాటలోనే ఆయన తన తొలి సంతకానికి ఒక పవిత్రతను చేకూరుస్తూ అవ్వా తాతల పింఛన్ పెంపు ఫైలుపై సంతకం చేశారు. నాడు వైఎస్.. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాపై తొలి సంతకం చేశారు. అది నేటికీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అప్రతిహతంగా అమలవుతోంది.జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఆయన సతీమణి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, ఆ పార్టీ మరో నేత వై.వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజి, టీడీపీ నేతలు నన్నపనేని రాజకుమారి, కేఆర్ పుష్పరాజ్, సీనియర్ ఐఏఎస్, ఐపీస్ అధికారులు, సినీ ప్రముఖులు రాంగోపాల్‌వర్మ, దిల్ రాజు, మహివి రాఘవతో పాటు పలువురు హాజరయ్యారు. వీరితో పాటు జగన్ సతీమణి వైఎస్ భారతి, ఆయన ఇద్దరు కుమార్తెలు హర్షారెడ్డి, వర్షారెడ్డి, సోదరి షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ తదితరులు మాతృమూర్తి విజయమ్మతో కలిసి వేదికపై ఆశీనులయ్యారు. పెద్ద సంఖ్యలో వైఎస్ కుటుంబ సభ్యులు వేదికకు కింది వైపున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలో ఆశీనులయ్యారు. ఆకట్టుకున్న ప్రసంగం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం వైఎస్ జగన్ చేసిన ప్రసంగం అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. ’నేను మీ కష్టాలు చూశాను, మీ బాధలను విన్నాను, నేను ఉన్నాను’ అని జగన్ చెప్పినప్పుడు వివిధ గ్యాలరీలలో ఉన్న వారు తమ సీట్లలో నుంచి లేచి మరీ హర్షధ్వానాలు వ్యక్తం చేయడం గమనార్హం. ఆగస్టు 15లోగా సుమారు 4 లక్షల వాలంటీర్లను నియమిస్తామని ప్రకటించినప్పుడు యువకుల కేరింతలు మిన్నంటాయి. సభ ముగిసిన అనంతరం కూడా ఉద్యోగాల భర్తీపై యువతీ యువకులు పెద్దఎత్తున చర్చించుకోవడం గమనార్హం. అర్హులందరికీ పథకాలు అందేలా చూస్తామని.. కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయాలు, పార్టీలు చూడం అని జగన్ చేసిన ప్రకటనతో ’నాయకుడంటే ఇతనే.. తండ్రిని మించిన తనయుడు’ అని పలువురు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రణాళిక విలువను జగన్ చాటిచెప్పిన తీరు ఆకట్టుకుంది. ‘ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి గుర్తుకు వస్తారు. ఇప్పుడు తండ్రి అడుగుజాడల్లో నడిచి అవ్వాతాతల పెన్షన్‌ను రూ.2250కి పెంచి జగన్ చరితార్ధుడయ్యారు. పండుటాకులకు ఆసరా ఇచ్చిన ఈ పథకం ఉన్నంత కాలం జగన్‌ను మరచిపోవడం సాధ్యం కాదు’ అని ఓ వామపక్ష పార్టీ నాయకుడు రవీంద్ర అభిప్రాయపడ్డారు. మొత్తం మీద రాష్ట్రంలో నూతన అధ్యయనానికి నవ యువకుడు నడుం కట్టారని మేధావులు అభిప్రాయపడ్డారు. ప్రమాణ స్వీకారోత్సవం ఇలా.. ►11.50 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నుంచి బయలుదేరిన జగన్ ►12.04 గంటలకు స్టేడియంలోకి ప్రవేశం ►12.10 గంటలకు వేదికపైకి ►12.18 గంటలకు గవర్నర్ ప్రసంగం ►12.23 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం ►12.29 గంటలకు ప్రమాణ స్వీకారం ముంగింపు ►12.30 గంటలకు గవర్నర్‌కు జగన్ వీడ్కోలు ►12.41 గంటలకు జగన్ ప్రసంగం ►1.05 గంటలకు అవ్వాతాతల పెన్షన్ పెంపు ఫైలుపై జగన్ తొలి సంతకం -
ఇక స్వచ్ఛమైన పాలన
వైఎస్ జగన్ అనే నేను.. ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూముఖ్యమంత్రి పదవినిస్వీకరిస్తున్నాను. 3,648 కిలోమీటర్లుఈ నేల మీద నడిచినందుకు,పదేళ్లుగా మీలో ఒకడిగానిలిచినందుకు ఆకాశమంతవిజయాన్ని అందించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు,ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి,ప్రతి స్నేహితుడికి రెండు చేతులూ జోడించి పేరు పేరున హృదయపూర్వకకృతజ్ఞతలు తెలుపుతున్నాను. సాక్షి, అమరావతి : అవినీతి రహిత పాలన అందిస్తామని నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో వినూత్న, విప్లవాత్మకమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను 72 గంటల్లోనే ప్రజల ముంగిటకు చేరుస్తామని తెలిపారు. లంచాలు లేని వ్యవస్థను ప్రజల ముందుకు తెస్తూ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలోని అవినీతి కాంట్రాక్టులను రద్దు చేసి, దోచుకున్నదెంతో ప్రజల ఎదుట ఉంచుతామన్నారు. నవరత్నాల అమలులో భాగంగా అవ్వాతాతల పెన్షన్‌ను పెంచుతూ తొలి సంతకం చేశారు. ఐదు నెలల్లో రాష్ట్రంలో 5.60 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని యువతకు తీపి కబురు చెప్పారు. పాలనలో తీరు తెన్నులపై స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికే కబురందించేలా కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో ఆఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అశేష జనవాహిని ఆనందోత్సాహాల మధ్య ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, తమిళనాడులోని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల, సతీమణి వైఎస్ భారతితో పాటు అతిరథ మహారథులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలనుద్దేశించి తొలి ప్రసంగం చేశారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి నే విన్నాను.. నేనున్నాను.. పదేళ్లుగా నా రాజకీయ జీవితంలో, 3,648 కిలో మీటర్ల పాదయాత్రలో పేదలు పడ్డ కష్టాలుచూశాను. మధ్యతరగతి ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు విన్నాను. వారి కష్టాలు చూసిన, విన్న నేను.. ఈ వేదికపై నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ మీ అందరికీ నేనీ రోజు మాటిస్తున్నాను. మీ కష్టాలను నేను చూశాను.. మీ బాధలు నేను విన్నాను.. నేను ఉన్నాను.. అని ఇవాళ మీ అందరికీ చెబుతున్నాను. అందరి ఆశలు, అందరి ఆకాంక్షలు పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటూ మేనిఫెస్టో తీసుకువచ్చాం. మేనిఫెస్టోను కేవలం రెండే రెండు పేజీలతో ఎప్పుడూ ప్రజలకు గుర్తుండేట్టుగా, ప్రజలకు ఎప్పుడూ కన్పించే విధంగా తీసుకొచ్చాం. గత పాలకుల మాదిరిగా పేజీలకు పేజీలు.. బుక్కులు తీసుకురాలేదు. ఇందులో ప్రతి కులానికో పేజీ పెట్టి ఎలా మోసం చెయ్యాలన్న ఆలోచనతో తీసుకురాలేదు. ఎన్నికలయిపోయాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసే పత్రం కింద, ఒక బుక్కు కింద తీసుకు రాలేదు. మేనిఫెస్టో అంటే ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి. ఇది వైఎస్సార్ పెన్షన్ కానుక నవరత్నాల్లో మీ అందరికీ మాటిచ్చినట్టుగానే, మేనిఫెస్టోలోని ఒక అంశం గురించి మీ అందరికీ చెబుతాను. ఈ రోజు ఆ అవ్వా తాతల ఆశీస్సులు తీసుకునేందుకు ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా తీసుకునే నిర్ణయం చెబుతున్నా. నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఆ అవ్వా తాతలను పెన్షన్ ఎంత అని అడిగితే రూ.వెయ్యి అని చెప్పారు. కొంతమంది అవ్వలైతే అది కూడా రావడం లేదని చేతులూపుతూ చెబుతుండేవాళ్లు. ఎన్నికలకు కేవలం రెండు నెలలు మాత్రమే గడువున్నప్పుడు పింఛన్‌ను పెంచారు. అందుకే ఈ పరిస్థితి పూర్తిగా మార్చబోతున్నాను. నవరత్నాలలో ప్రతి అవ్వ, తాత, ప్రతి వితంతువుకు ఇచ్చిన మాట ప్రకారం వారి పెన్షన్‌ను రూ.3 వేల వరకు పెంచుకుంటూ వెళతాను. ఆ అవ్వా తాతల పెన్షన్‌ను జూన్ నెల నుంచి అక్షరాల రూ.2,250 నుంచి మొదలు పెట్టబోతున్నాను వైఎస్సార్ పెన్షన్ కానుకగా. దీనికి సంబంధించిన ఫైల్‌పై నేనీ రోజు మొట్ట మొదటి సంతకం పెడుతున్నాను. (సంతకం పెట్టారు.) ఈ సంవత్సరం రూ.2,250తో మొదలు పెడుతున్నాం. రేపు సంవత్సరం రూ.2,500కు తీసుకెళ్తాం. ఆ తర్వాత సంవత్సరం రూ.2,750కు.. ఆ తర్వాత ఏడాది రూ.3 వేలకు తీసుకెళ్తాం. అవ్వా తాతలకు ఇచ్చిన మాటను నెరవేర్చబోతున్నామని చెబుతూ.. ఆశీస్సులు ఇవ్వమని పేరుపేరునా ప్రతి అవ్వా తాతను మీ మనవడిగా రెండు చేతులు జోడించి కోరుతున్నా. ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు నవరత్నాల్లో చెప్పిన ప్రతి అంశమూ ప్రతి పేదవాడికీ అందాలి. ఇందులో కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు చూడకూడదు. ఇది జరగాలంటే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి. ఇందులో భాగంగా ఆగస్టు 15 నాటికి, అంటే ఇవాల్టి నుంచి కేవలం రెండున్నర నెలల కాలంలో గ్రామాల్లో గ్రామ వాలంటీర్లుగా అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని హామీ ఇస్తున్నా. ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు వీలుగా, లంచాలు లేని పరిపాలన దిశగా అడుగులేస్తూ ప్రతి గ్రామంలోనూ ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమిస్తున్నాం. గ్రామాల్లో చదువుకున్న పిల్లలు, సేవ చెయ్యాలనే ఆరాటం ఉన్న పిల్లలకు రూ.5 వేలు జీతమిస్తూ గ్రామ వాలంటీర్లుగా తీసుకుంటాం. రూ.5 వేలు ఎందుకిస్తున్నామో తెలుసా? ఈ వ్యవస్థలోకి లంచాలు రాకుండా చెయ్యాలని. ప్రజలకు చెందాల్సిన ఏ పథకంలో కూడా ఎటువంటి కక్కుర్తి, పక్షపాతం, లంచాలు ఉండకూడదని. సేవా దృక్పథం గల పిల్లలకు వేరే చోట మెరుగైన ఉద్యోగం దొరికే వరకు గ్రామ వాలంటీర్లుగా పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ నాలుగు లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి వస్తాయి. సర్కారీ సేవ అందకపోతే ఫోన్ కొట్టండి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేవలు ఏ ఒక్కరికి అందకపోయినా, ఎక్కడైనా పొరపాటున లంచాలు కన్పించినా ఊరుకోం. అదే ఆగస్టు 15వ తేదీన ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. అది నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే అనుసంధానమై ఉంటుంది. ఏ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందకపోయినా, వివక్ష కన్పించినా, ఏ ఒక్కచోట లంచాలు కన్పించినా, ముఖ్యమంత్రి కార్యాలయానికే నేరుగా వక్రీకరణ వార్తలు రాసే మీడియాను కోర్టుకీడుస్తాం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వాళ్లకు ముఖ్యమంత్రిగా ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఇంపుగా కన్పిస్తాడు. మిగిలిన వాళ్లను ఎప్పుడెప్పుడు దించాలా అని ఆలోచన చేస్తారు. వాళ్ల రాతలు అలా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఇది మన ఖర్మ. వాళ్లందరికీ నేను ఒకటే చెబుతున్నా. పారదర్శకంగా, జ్యుడీషియల్ కమిషన్ ద్వారా కాంట్రాక్టులను ఖరారు చేసిన తర్వాత కూడా వక్రీకరిస్తూ, దురుద్దేశంతో వార్తలు రాస్తే ప్రభుత్వం పరువు నష్టం దావా వేస్తుంది. హైకోర్టు జడ్జి దగ్గరకు వెళ్లి, శిక్షించమని గట్టిగా అడుగుతాం. అమ్మానాన్నకు పాదాభివందనం... చెరగని చిరునవ్వులతో ఆప్యాయతను చూపించినందుకు పేరుపేరున ఇక్కడకు వచ్చిన, ఇక్కడికి రాలేకపోయిన, ఆశీర్వదించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికి మరోసారి పేరుపేరున హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. ఆశీర్వదించిన దేవుడికి, పైనున్న నాన్న గారికి, నా పక్కనే ఉన్న నా తల్లికి పాదాభివందనం చేస్తూ.. మీ అందరి చల్లని దీవెనలకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలు పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా గ్రామ సచివాలయాలను తీసుకొస్తున్నాం. మీ గ్రామంలో అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం కల్పిస్తూ, మీ గ్రామంలో అక్షరాల పది మందికి గ్రామ సెక్రటేరియట్లో నేరుగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేట్టుగా చేస్తున్నామని అందరికీ హామీ ఇస్తున్నా. అక్టోబర్ 2, గాంధీ జయంతి నాడు ఈ కార్యక్రమం చేపట్టి, మరో 1.60 లక్షల ఉద్యోగాలు నేరుగా మీకు అందుబాటులోకి తెస్తాం. మీ పిల్లలే పది మంది మీ గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తారు. మీకు పెన్షన్, రేషన్ కార్డు, ఇల్లు, ఇంటి స్థలం, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, నవరత్నాల్లోని ఏ పథకమైనా, ఏది కావాలన్నా.. మీరు చెయ్యాల్సిందల్లా గ్రామ సెక్రటేరియట్‌కు వెళ్లి అప్లికేషన్ పెట్టండి. దరఖాస్తు చేసిన 72 గంటల్లోనే మీకు మంజూరయ్యేలా చేస్తాం. గత ప్రభుత్వంలో మాదిరిగా లంచాలుండవు. ఇప్పటి వరకు రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా మరేది కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలివ్వాల్సిన పరిస్థితి. పూర్తిగా లంచమనేదే లేకుండా, రికమండేషన్‌కు తావు లేకుండా ఏ ఒక్కరికైనా ఏ అవసరం ఉన్నా, 72 గంటల్లో మంజూరయ్యేలా చేస్తామని సీఎంగా హామీ ఇస్తున్నాను. గ్రామ వాలంటీర్లు గ్రామ సెక్రటేరియట్‌తో అనుసంధానమై పని చేస్తారు. నవరత్నాలతో పాటు, ప్రతి ప్రభుత్వ పథకం లంచాలు, రికమండేషన్లకు తావులేకుండా నేరుగా మీ ఇంటికొచ్చేలా డోర్ డెలివరీ చేస్తారు. ఇదొక్కటే కాదు.. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నవరత్నాల్లోని ప్రతి ఒక్కటీ తూచా తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇస్తున్నాను. కాంట్రాక్టుల్లో అవినీతి నిగ్గు తేలుస్తాం ఈ రాష్ట్రంలో అవినీతి, వివక్ష లేని స్వచ్ఛమైన పాలన అందించేందుకు పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు పూర్తిగా ప్రక్షాళన చేస్తాను. ఇందులో భాగంగా ఏయే కాంట్రాక్టుల్లో, ఏయే పనుల్లో అవినీతి జరిగిందో వాటిని పూర్తిగా రద్దుచేస్తాం. గతంలో చేసిన ట్రైలర్ మేడ్ ప్రీ క్వాలిఫికేషన్ కండీషన్స్‌ను పూర్తిగా మారుస్తూ ఎక్కువ మంది టెండర్లలో పాలు పంచుకునేలా అవకాశమిస్తూ రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొస్తాం. అంతేకాదు.. ఇంకో ఉదాహరణ. కరెంటు రేట్లు చూడండి. ఇతర రాష్ట్రాల్లో సోలార్, విండ్ పవర్ కోసం గ్లోబల్ టెండరింగ్ చేస్తూ యూనిట్ రూ.2.65కు, రూ.3కే అందుబాటులో ఉంటే, మన రాష్ట్రంలో ఎంతో తెలుసా? యూనిట్‌కు రూ.4.84తో నిన్నటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసింది. ఈ రకంగా దోచుకుంటున్న పరిస్థితి. అదే పీక్ అవర్స్ అయితే, దోచుకున్నది చాలదన్నట్టుగా అక్షరాల యూనిట్ రూ.6 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీ కళ్లెదుటకే తీసుకొచ్చి, మీ ఈ రేట్లన్నీ పూర్తిగా తగ్గిస్తాను. వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చెయ్యడంతోనే ఆగకుండా పారదర్శకతను తీసుకొస్తాం. ఇందులో భాగంగా రేపో మర్నాడో హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిసి, ఓ హైకోర్టు జడ్జిని ఇవ్వమని కోరతాం. ఆయన ఆధ్వర్యంలో, ఆయన చైర్మన్‌గా జ్యుడీషియల్ కమిషన్‌ను నియమిస్తాం. టెండర్లకు పోకముందు, ప్రతి కాంట్రాక్టును జ్యుడీషియల్ కమిషన్‌కు పంపి, ఆ హైకోర్టు జడ్జి చేసే ఏ సూచనలు, మార్పుల మేరకు కాంట్రాక్టులకు పారదర్శకంగా, ఎక్కడా అవినీతి లేకుండా టెండర్లు పిలుస్తాం. -
అక్టోబరు 2 కల్లా మరో లక్షా అరవై వేల ఉద్యోగాలు
-
ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు
-
గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా ఇంటికే
-
వైఎస్ జగన్ అనే నేను.. తొలి సంతకం..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమక్షంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...తనకు ఆకాశమంతటి విజయాన్ని చేకూర్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు నేత, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఇతర పెద్దలకు కృతఙ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చినట్లుగా నవరత్నాల్లోని ప్రతీ అంశాన్ని కులమత వర్గాలకు అతీతంగా ప్రతీ ఒక్కరికి అందేలా చూస్తామని పేర్కొన్నారు. అవ్వా, తాత, అక్కాచెల్లెళ్ల ఆశీస్సులు కోరుతూ ముఖ్యమంత్రిగా తన తొలి సంతకాన్ని వైఎస్సార్ పెన్షన్ ఫైల్‌పై చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో భాగంగా..‘వైఎస్ జగన్ అనే నేను ప్రజల ఇచ్చిన ఈ తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తున్నా. 3648 కిలోమీటర్లు ఈ నేల మీద నడిచినందుకు, తొమ్మిదేళ్ల కష్టానికి ప్రతిగా ఆకాశమంతటి విజయాన్ని అందించిన ప్రతీ అక్కా, చెల్లె, అవ్వా తాత, సోదరుడు, స్నేహితుడు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. పదేళ్ల నా రాజకీయ జీవితంలో.. 3648 కిలోమీటర్ల పాదయాత్రలో పేదలు పడిన కష్టాలు చూశాను. బాధలు విన్నాను. మీ కష్టాలు విన్న తర్వాత ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నాను. మీ అందరికీ నేను ఉన్నాను. అందరి ఆశలు, ఆకాంక్షలు పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటూ మేనిఫెస్టోలోని అన్ని అంశాలను పూర్తిగా అమలు చేస్తాం. గత ప్రభుత్వం మాదిరి ప్రతీ కులానికి ఓ పేజీ పెట్టి మోసం చేసేందుకు ప్రయత్నించలేదు. అటువంటి మోసాలకు తావు లేకుండా రెండే రెండు పేజీల మేనిఫెస్టో తెచ్చాను. మన సీఎం మన కోసం ఏం చేస్తాడన్న సంగతి ప్రలజందరికి తెలిసి ఉండాలి. దానికి అనుగుణంగా మేనిఫెస్టో తెచ్చి మీ కళ్ల ముందు పెట్టాను. మీ ఆకాంక్షల మేనిఫెస్టోను ఒక ఖురాన్, బైబిల్, భవద్గీతగా.. నా ఊపిరిగా భావిస్తానని సీఎం హోదాలో మాటా ఇస్తున్నాను. నవరత్నాలను అమలు చేస్తాను. అవ్వాతాతల ఆశీస్సుల కోసం ముఖ్యమంత్రిగా మొదటి సంతకం వైఎస్సార్ పెన్షన్ ఫైల్‌పై చేస్తున్నాను. జూన్ నెల నుంచి రూ. 2250 అందిస్తాం. తర్వాత ఏడాది రూ. 2500, మరుసటి ఏడాది రూ. 2750..అనంతరం రూ. 3000 వేలు అందిస్తాం’ అని పేర్కొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి రెండున్నర నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు.. ‘ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తాం. ఆగస్టు 15 వచ్చే సరికి అక్షరాలా మన గ్రామాల్లోని యువతకు గ్రామ వాలంటీర్లుగా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. గ్రామాల్లో చదువుకున్న పిల్లలకు రూ. 5 వేల జీతంతో గ్రామ వాలంటీర్లను నియమిస్తాం. వ్యవస్థల్లో లంచాలు లేకుండా చేసేందుకే వీరి నియామకం. సేవా దృక్పథం ఉన్న పిల్లలకు వేరే చోట ఉద్యోగం వచ్చేదాకా గ్రామ వాలంటీర్లుగా పని చేయవచ్చు. ప్రభుత్వ పథకాలు ఎవరికీ అందకపోయినా.. పొరపాటునైనా లంచాలు తీసుకుంటున్నారని తెలిసినా, వివక్ష కనిపించినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. విప్లవాత్మక, పారదర్శక పాలనకు నాంది పలుకుతాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అవినీతికి చోటుండదు పెంచిన పెన్షన్లు జూన్ నుంచే అమల్లోకి ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా ఇంటికే గ్రామ సచివాలయంలో 10 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోగా అర్హులకు పథకాల వర్తింపు సమస్యలు చెప్పుకునేందుకు ఆగస్టు 15 నుంచి కాల్ సెంటర్ సీఎం కార్యాలయంతో అనుసంధానం అక్టోబరు 2 కల్లా మరో లక్షా అరవై వేల ఉద్యోగాలు సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి అవినీతికి సంబంధించిన కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తాం కాంట్రాక్టుల్లో ఎక్కువ మంది టెండర్లలో పాలు పంచుకునేట్లుగా రివర్స్ టెండరింగ్ తెస్తాం రివర్స్ టెండరింగ్ ద్వారా చేకూరిన లబ్దిని ప్రజలకు చూపిస్తాం సోలార్ పవర్, విండ్ పవర్‌ను గత ప్రభుత్వం అత్యధిక ధర చెల్లించి కొనుగోలు చేసింది. వాటన్నింటినీ తగ్గిస్తాం. పారదర్శకతకై హైకోర్టు జడ్జి చేత జ్యుడిషియల్ కమిషన్ వేయమని అడుగుతాం హైకోర్టు జడ్జి సూచనల మేరకు టెండర్లలో మార్పులు చేసి కాంట్రాక్టర్లను పిలుస్తాం 3 దశల్లో మద్య నిషేధం అమలు చేస్తాం తప్పుడు కథనాలు రాసినా, ప్రసారం చేసినా ఎల్లోమీడియాపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం పరువు నష్టం దావా వేసి కోర్టును ఆశ్రయిస్తాం అవినీతి రహిత పాలన అందించేందుకు ఆర్నెళ్ల నుంచి ఏడాది పాటు మాకు సమయం ఇవ్వండి -
దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్
ఇంద్రకీలాద్రి /మంగళగిరిటౌన్/గన్నవరం: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో వి.కోటేశ్వరమ్మ, ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ నరసింహన్ దంపతులకు ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. నృసింహుని సేవలో గవర్నర్ గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులకు ఆలయ ఈవో మండేపూడి పానకాలరావు, అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత ఎగువసన్నిధిలోని పానకాల నరసింహస్వామిని దర్శించుకుని గవర్నర్ దంపతులు పానకాన్ని స్వీకరించారు. అనంతరం దిగువ సన్నిధిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకున్నారు. ఆలయ పండితులు వేదాశీర్వచనం అందజేశారు. స్వామివారి చిత్రపటాన్ని ఈవో బహూకరించారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో గవర్నర్‌కు ఘనస్వాగతం అంతకుముందు గవర్నర్ నరసింహన్ దంపతులకు గన్నవరం విమానాశ్రయంలో పలువురు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గురువారం విజయవాడలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించడానికి ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడికి చేరుకున్నారు. గవర్నర్ దంపతులకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ ఆర్పీ ఠాకూర్, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, ప్రొటొకాల్ డైరెక్టర్ కన్నల్ అశోక్, నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ రోడ్డు మార్గం ద్వారా విజయవాడ చేరుకున్నారు. -
గవర్నర్‌ను కలిసిన వైఎస్ జగన్
-
కనకదుర్గమ్మ దుర్గ గుడిలో వైఎస్ జగన్ పూజలు
-
వైఎస్ జగన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన దుర్గ గుడి ఈవో, ఆర్చకులు