
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ వద్దకు శనివారం సాయంత్రం పార్టీ కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం తొలిసారి నివాసానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. జగన్ కాన్వాయ్‌ను చూడగానే వారంతా పెద్ద పెట్టున సీఎం ...సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు.
ఓ దశలో వాహనం లోనికి వెళ్లేందుకు కూడా వీలు లేనంతగా పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వాహనం దిగి... అందరికీ అభివాదం చేశారు. అంతకు ముందు ఆయన గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ నెల 30న విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment