lotus pand
-
క్షీణిస్తున్న వైఎస్ షర్మిల ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ దీక్ష చేస్తున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోంది. లోటస్‌పాండ్‌లో దీక్షను కొనసాగిస్తున్న షర్మిలను వైద్యులు పరీక్షించారు. షుగర్ లెవల్స్ 88 నుంచి 62కు తగ్గాయని, బరువు 2 కిలోలు తగ్గినట్లు ఆమెను పరీక్షించిన డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయాలంటూ 72 గంటల దీక్ష చేస్తానని ప్రకటించిన షర్మిల.. గురువారం ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద దీక్ష చేపట్టారు. పోలీసులు సాయంత్రం వరకే అనుమతివ్వడం, ఆ తర్వాత ఆమె పాదయాత్రగా లోటస్‌పాండ్‌కు బయల్దేరడం.. మధ్యలోనే పోలీసులు ఆమెను అడ్డుకుని ఆమె ఇంటివద్ద వదిలేయడంతో అక్కడే దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. మంచినీరు మాత్రమే తాగుతూ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దు.. మీ కోసం తోడబుట్టిన అక్కగా నేను పోరాటం చేస్తా. ప్రభుత్వ రంగంలోనే కాదు.. ప్రైవేట్‌రంగం లో కూడా 11 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎస్సార్‌ది’అని అన్నారు. షర్మిలకు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి మద్దతు తెలిపారు. ఆటో యూనియన్ నేత అమానుల్లాఖాన్ ఆటోలతో భారీ ర్యాలీగా వచ్చి షర్మిలకు మద్దతు తెలిపారు. చదవండి: కాంగ్రెస్ వడివడిగా.. -
వైఎస్ షర్మిల దీక్ష భగ్నం
-
వైఎస్ షర్మిల దీక్ష భగ్నం
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్క్ వద్ద వైఎస్ షర్మిల చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇచ్చిన గడువు ముగియడంతో దీక్ష విరమించాలని పోలీసులు షర్మిలకు సూచించారు. అయినప్పటికీ ఆమె దీక్ష కొనసాగించడంతో పోలీసులు వైఎస్ షర్మిలను బలవంతంగా లోటస్‌పాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో ఇందిరాపార్క్ నుంచి లోటస్‌పాండ్‌కు పాదయాత్రగా బయల్దేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, షర్మిల అభిమానులకు మధ్య జరిగిన తోపులాటలో ఆమె కొద్దిసేపు స్పృహతప్పి పడిపోయారు. దీంతో పోలీసులు ఆమెను వాహనంలో లోటస్‌పాండ్‌కు తరలించారు. కాగా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి : ‘ఉద్యోగ దీక్ష’ చేపట్టిన వైఎస్ షర్మిల వైఎస్సార్ జయంతి రోజున కొత్త పార్టీ: వైఎస్ షర్మిల -
వరంగల్ ఇంకా వెనకబడే ఉంది : వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: ఎంతో మంది ఉద్యమకారులను, మరెంతో మంది కళాకారులు అందించిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంకా వెనకబడే ఉందని దివంగత సీఎం వైఎస్సార్ తనయ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, ఒక్కపాటతో తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన అందెశ్రీ, కాళోజీ నారాయణరావు, నా తెలంగాణ.. కోటి రతనాల వీణ అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్యులు, రాణిరుద్రమ లాంటి ధీరులు పుట్టిన నేల ఓరుగల్లు అని కొనియాడారు. బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. వైఎస్సార్, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాల వేసిన అనంతరం జై తెలంగాణ.. జై జై తెలంగాణ అంటూ షర్మిల ప్రసంగించారు. విద్యార్థులు ముందు ఉండి ఉద్యమం చేస్తేనే తెలంగాణ సాధ్యమైందని, విద్యార్థుల బలిదానాలతో అధికారంలోకి వచ్చిన పాలకులు వాళ్లను మరిచిపోయారన్నారు. హక్కుల కోసం విద్యార్థులు ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. నేటికి సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజు ది మిలియన్ మార్చ్.. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. శ్రీరాంసాగర్ స్టేజ్–2 పనులను దివంగత సీఎం వైఎస్సార్ పూర్తి చేశారని, దేవాదుల ఫేజ్–1, 2లను 80 శాతం పూర్తి చేశారని, ఇంకో 20 శాతం పనులు పూర్తి చేస్తే లక్ష ఎకరాలకు నీళ్లందేవని వివరించారు. కాంతన్పల్లి ముందుకు వెళ్లకపోవడం బాధాకరమన్నారు. కాకతీయ థర్మల్ ప్రాజెక్టు వైఎస్సార్ ఆలోచనేనని చెప్పా రు. రాజన్న బతికుంటే వరంగల్ జిల్లా ప్రగతి పథంలో దూసుకుపోయేదని వెల్లడించారు. వరంగల్ జిల్లాలో రైతులు, మహిళలు ఎలా ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. వరంగల్ స్మార్ట్ సిటీ అయ్యేట్టు ఉందా, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వస్తోందా.. అని ప్రశ్నించారు. మొన్న వచ్చిన వరదలకు వరంగల్ ఏమైందో చూశారు కదా అని అన్నారు. కాకతీయ వర్సిటీలో వీసీ ఉన్నారా?.. విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తే దాడులు జరపడం బాధాకరమని, అమానుషమన్నారు. జర్నలిస్టులకు కూడా సంఘీభావం తెలుపుతున్నామన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన అందరికీ వందనాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా నేతలు షర్మిల కు తలపాగా పెట్టి, ఖడ్గం బహూకరించారు. వరంగల్ జిల్లాపై మీ సూచనలు, సలహాలు ఇవ్వాలని షర్మిల కోరారు. ఈ కార్యక్రమంలో కొండా రాఘవరెడ్డి, ఇందిరాశోభన్, వరంగల్ జిల్లా నేతలు ఎన్ శాంతికుమార్, డాక్టర్ చంద్రజా వాడపల్లి, కల్యాణ్‌రాజ్, వెంకటరెడ్డి, అచ్చిరెడ్డి, దేవానాయక్ తదితరులు పాల్గొన్నారు. చదవండి : (కేసీఆర్‌కు ఓటమి భయం.. అందుకే ఫిట్మెంట్ లీక్) (లక్షా 30 వేల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చాం: కేటీఆర్) -
లోటస్ పాండ్ చేరుకున్న వైఎస్ జగన్
-
లోటస్ పాండ్ వద్ద సందడి వాతావరణం
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ వద్దకు శనివారం సాయంత్రం పార్టీ కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం తొలిసారి నివాసానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. జగన్ కాన్వాయ్‌ను చూడగానే వారంతా పెద్ద పెట్టున సీఎం ...సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఓ దశలో వాహనం లోనికి వెళ్లేందుకు కూడా వీలు లేనంతగా పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వాహనం దిగి... అందరికీ అభివాదం చేశారు. అంతకు ముందు ఆయన గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ నెల 30న విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. -
రేపు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం ఉదయం 9.30 గంటలకు లోటస్‌పాండ్‌లో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎంపీలందరూ హాజరవుతారు. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోఈ పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించ వలసిన వ్యూహంపై వీరు చర్చిస్తారు. -
రేపు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు లోటస్‌పాండ్‌లో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎంపీలందరూ హాజరవుతారని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. అంతకుముందు ఉదయం 10.30కు పార్టీ తెలంగాణ శాసనసభా పక్షం సమావేశం కూడా జరగనుంది. -
లోటస్ పాండ్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 124వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. లోటస్ పాండ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ కర్నూలు జిల్లా పర్యటనకు బయల్దేరారు. -
వైఎస్ జగన్ సమైక్య దీక్ష ప్రారంభం
హైదరాబాద్ : సమైక్య రాష్ట్రం కోసం లోటస్ పాండ్ నివాసంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఉదయం 11.30గంటలకు ఆయన ముందుగా దీక్షా ప్రాంగణంలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి.. తన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. దీక్షావేదికతో పాటు, దీక్షకు మద్దతుగా తరలివచ్చే అభిమానులు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పార్టీనేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎజెండాలు పక్కన పెట్టి ఎవరి జెండాలు వారు పట్టుకొని సమైక్య రాష్ట్రమే ఎజెండాగా అందరూ ముందుకు ఉరకాల్సిన సందర్భమిది. రాష్ట్రం ముక్కలు కాకుండా కాపాడుకోవడానికి రాజకీయాలకతీతంగా కదలాల్సిన చారిత్రక సందర్భమిది. జగన్ ఇచ్చిన ఈ పిలుపుతో సీమాంధ్రలో సమైక్య ఉద్యమం మహోధృతంగా కొనసాగుతోంది. ప్రాణం కాదు ప్రజలు ముఖ్యమంటూ జగన్ ఆమరణ దీక్ష ప్రారంభించారు. -
వైఎస్ జగన్ సమైక్య దీక్ష ప్రారంభం
-
లోటస్ పాండ్ లో పార్టీ నేతలతో వైఎస్ జగన్ భేటీ
-
పార్టీ ముఖ్యనేతలతో జగన్ సమావేశం
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం లోటస్ పాండ్‌లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వైఎస్ విజయమ్మ, మైసూరారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సోమయాజులు, బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈరోజు మధ్యాహ్నం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు. -
లోటస్ పాండ్‌కు రెండోరోజు అభిమానుల తాకిడి
హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం లోటస్ పాండ్ గురువారం కూడా జన సంద్రమైంది. జగన్‌ను చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తున్నారు. అభిమానులను ఆయన... కాసేపట్లో వీరిని కలవనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యకర్తలు, అభిమానులను కలుస్తారు. దాంతో తమ అభిమాన నేతను చూసేందుకు తరలి వస్తున్నారు. -
తొలిరోజే పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టిన జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిరోజే పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టారు. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆయన బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. దాదాపు అరగంటపాటు ఈ భేటి జరిగింది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? మిగిలిన రాజకీయ పార్టీలపై ఒత్తిడి ఎలా పెంచాలనే దానిపై సమాలోచనలు జరిగాయి. రాజీనామా చేయకుండా డ్రామాలాడుతున్న కాంగ్రెస్, టీడీపీ నాయకులు తీరుపై ఎలా ఎండగట్టాలనే దానిపై చర్చించినట్టు తెలుస్తోంది.