సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు లోటస్‌పాండ్‌లో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎంపీలందరూ హాజరవుతారని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. అంతకుముందు ఉదయం 10.30కు పార్టీ తెలంగాణ శాసనసభా పక్షం సమావేశం కూడా జరగనుంది.