
వైఎస్ జగన్ సమైక్య దీక్ష ప్రారంభం
హైదరాబాద్ : సమైక్య రాష్ట్రం కోసం లోటస్ పాండ్ నివాసంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఉదయం 11.30గంటలకు ఆయన ముందుగా దీక్షా ప్రాంగణంలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి.. తన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. దీక్షావేదికతో పాటు, దీక్షకు మద్దతుగా తరలివచ్చే అభిమానులు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పార్టీనేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఎజెండాలు పక్కన పెట్టి ఎవరి జెండాలు వారు పట్టుకొని సమైక్య రాష్ట్రమే ఎజెండాగా అందరూ ముందుకు ఉరకాల్సిన సందర్భమిది. రాష్ట్రం ముక్కలు కాకుండా కాపాడుకోవడానికి రాజకీయాలకతీతంగా కదలాల్సిన చారిత్రక సందర్భమిది. జగన్ ఇచ్చిన ఈ పిలుపుతో సీమాంధ్రలో సమైక్య ఉద్యమం మహోధృతంగా కొనసాగుతోంది. ప్రాణం కాదు ప్రజలు ముఖ్యమంటూ జగన్ ఆమరణ దీక్ష ప్రారంభించారు.