
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్లుండి (మంగళవారం) శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లి పర్యటించనున్నారు. శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ బీసీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
ఉదయం 10.40 గంటలకు శ్రీసత్యసాయి జిల్లా సీకేపల్లి చేరుకుని అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లి వెళతారు. అక్కడ ఇటీవల టీడీపీ నాయకుల చేతిలో దారుణ హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ బీసీ కార్యకర్త కురబ లింగమయ్య నివాసంలో ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి బయలుదేరతారు.