
కురుబ లింగమయ్య హత్య కేసులో వైఎస్సార్‌సీపీ పోరాటం కొంతమేర ఫలించింది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులు ఆదర్శ్, మంజునాథ్ నాయుడులను పోలీసులు అరెస్ట్ చేశారు.
సాక్షి, అనంతపురం: కురుబ లింగమయ్య హత్య కేసులో వైఎస్సార్‌సీపీ పోరాటం కొంతమేర ఫలించింది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులు ఆదర్శ్, మంజునాథ్ నాయుడులను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు రమేష్, అనుచరులపై బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇద్దరిపైనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఒత్తిడికి పోలీసులు తలొగ్గారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పరిటాల సునీత ఒత్తిడితో కొందరిని కేసు నుంచి తప్పించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో టీడీపీ నేతలు దాడులు కొనసాగుతున్నాయి. రామచంద్రపురం మండలం రేఖల చేనులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త భూపతిరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. తీవ్ర గాయపడిన ఆయనను రుయా ఆస్పత్రికి తరలించారు. వినాయకస్వామి ఆలయం వద్ద టీడీపీ కార్యకర్త లీలా ప్రకాష్ దేవుడు భజన చేస్తుంటే అడ్డుకోవడంతో స్థానికులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్త భూపతి రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో అడ్డుకున్న భూపతి రెడ్డిని ఇంటి వద్ద నిద్రిస్తుంటే కత్తితో దాడి చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. రామచంద్రపురం మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న రామచంద్రపురం మండలంలో రౌడి రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.