
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.దశమి రా.11.13 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: పుష్యమి ఉ.10.01 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: రా.11.03 నుండి 12.43 వరకు, దుర్ముహూర్తం: ప.12.25 నుండి 1.14 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు, అమృతఘడియలు: లేవు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.54, సూర్యాస్తమయం: 6.10.
మేషం.... వ్యయప్రయాసలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆరోగ్యభంగం. వృత్తి,వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
వృషభం... చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వస్తులాభాలు. నూతన ఉద్యోగలాభం. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
మిథునం... కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. బంధువులతో విభేదాలు. పనులు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.
కర్కాటకం... బంధువుల నుంచి కీలక సమాచారం. విద్యాయత్నాలు సానుకూలం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు.
సింహం.... ముఖ్యమైన పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. మిత్రుల నుంచి ఒత్తిడులు. .
కన్య.. విద్యార్థులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు.
తుల... వ్యవహారాలలో పురోగతి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి.
వృశ్చికం... బంధువుల నుంచి విమర్శలు. పనుల్లో తొందరపాటు. ధనవ్యయం. నిరుద్యోగులకు ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
ధనుస్సు....... పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు ఒత్తిడులు పెంచుతారు. అనారోగ్యం. నిర్ణయాలు కొన్ని వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. దైవచింతన.
మకరం... శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు వీడతాయి.
కుంభం... నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
మీనం... బంధువులు, మిత్రులతో తగాదాలు. ఆరోగ్యభంగం. శ్రమకు ఫలితం కనిపించదు. కొన్ని పనులు హఠాత్తుగా విరమిస్తారు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు కొంత మందగిస్తాయి.