సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్క్ వద్ద వైఎస్ షర్మిల చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇచ్చిన గడువు ముగియడంతో దీక్ష విరమించాలని పోలీసులు షర్మిలకు సూచించారు. అయినప్పటికీ ఆమె దీక్ష కొనసాగించడంతో పోలీసులు వైఎస్ షర్మిలను బలవంతంగా లోటస్‌పాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో ఇందిరాపార్క్ నుంచి లోటస్‌పాండ్‌కు పాదయాత్రగా బయల్దేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, షర్మిల అభిమానులకు మధ్య జరిగిన తోపులాటలో ఆమె కొద్దిసేపు స్పృహతప్పి పడిపోయారు. దీంతో పోలీసులు ఆమెను వాహనంలో లోటస్‌పాండ్‌కు తరలించారు. కాగా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి : ‘ఉద్యోగ దీక్ష’ చేపట్టిన వైఎస్ షర్మిల
వైఎస్సార్ జయంతి రోజున కొత్త పార్టీ: వైఎస్ షర్మిల
Comments
Please login to add a commentAdd a comment