Indira Park
-
ఇందిరాపార్క్ వద్దకు ఆటోలో ప్రయాణించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల మహా ధర్నాకు మద్దతు తెలిపిందేందుకు వెళ్లిన ఆయన ఆటోలో ప్రయాణించారు. కేటీఆర్ మొదట నందినగర్‌లోని తన నివాసం నుంచి కారులో బయలుదేరారు. ఆ తర్వాత కొందరు సీనియర్ నాయకులతో కలిసి ఆటో ఎక్కిన కేటీఆర్ మహాధర్నా వద్దకు చేరుకున్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన ఆటో డ్రైవర్‌తో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆటో యూనియన్స్ మహాధర్నాకు నాయకత్వం వహిస్తున్న ఆటో కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు పథకం కారణంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామన్న ప్రభుత్వ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.Live: "ఆటో డ్రైవర్ల మహా ధర్నా"కు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS https://t.co/GLu6PB9jbC— BRS Party (@BRSparty) November 5, 2024 తెలంగాణ వచ్చాక ఆటో డ్రైవర్లకు రోజు రూ. 2 వేలు సంపాదిస్తే అన్ని ఖర్చులూ పోను.. 8 వందలు మిగిలేవి. అదే ఇప్పుడు మహాలక్ష్మి పథకంతో 8 వందలు వస్తే ఖర్చులు పోను 2 వందలు మిగలడం లేదు, అధికారంలోకి రాక ముందు గతంలో ఆటోలో తిరిగిన రాహుల్ గాంధీ అన్నారు. అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి 12,000 వేలు ఇస్తాను అన్నారు. కానీ ఏమీ ఇవ్వలేదు. 12 నెలల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు తీర్చిన గ్యారంటీలు ఎన్ని అని ఆలోచన చేయాలి. ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కోలేక ఈ 12 నెలల్లో ఎందరు తనువు చాలించారో లెక్కలతో సహా అసెంబ్లీలో ఇచ్చాం. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నారు. కానీ చేయలేదు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. ఆనాడు కేసీఆ ర్తెచ్చిన ఇన్స్యూరెన్స్ను తొలగించాలి అనుకుంటున్నారు. ఓలా, ఉబర్‌తో జరుగుతున్న నష్టాన్ని పురిస్తా అన్న మాట మీద ప్రభుత్వం నిలబడాలి.రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది. బయటకు పోతే తంతారు అని.. పోలీసుల బందోబస్తు లేనిది బయటకు పోవుడు కష్టం అన్నట్లు ఉంది. హోమ్ గార్డుతో సహా అందరు పోలీసులు కష్టల్లోనే ఉన్నారు. ఇంకా నాలుగు ఏళ్ల సినిమా ఉంది. జైల్లో పెట్టిన మేము వెనక్కి తగ్గము మీరు మా వెంట ఉండాలి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి అని కోరుతున్నాం. ఏఐటీయూసీతో పాటు అనేక ఆటో కార్మికులు అందరూ వల్ల సమస్యల పట్ల జెండాలు ఒకటవ్వాలి. అసెంబ్లీలో శాసన సభ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. మీ తరుపున మేము కొట్లడతాము. ఆటో కార్మిక ఐక్యత వర్ధిల్లాలి.’ అని తెలిపారు. -
మూసీ పక్కన టెంపుల్స్ కూల్చే దమ్ముందా?.. కిషన్‌రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా రేవంత్ ఉందా? అని ప్రశ్నించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. పైసా, పైసా కూడబెట్టుకుని కట్టుకున్న పేదల గూడును కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే.. మహిళలకు, రైతులకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు.తెలంగాణ బీజేపీ నేతలు ఇందిరా పార్క్ వద్ద మూసీ పరివాహక ప్రాంత బాధితులకు మద్దతుగా ‘చేయి చేసిన కీడు-మూసీ బాధితులకు బీజేపీ తోడు పేరుతో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌కు సవాల్ చేస్తున్నాను. మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితులతో నివాసం ఉండటానికి మేం సిద్ధం. చంచల్ గూడ, చర్లపల్లి జైలుకు వెళ్ళడానికి మేం రెడీ. మూసీ ప్రక్షాళనకు, సుందరీకరణకు మేం వ్యతిరేకం. పేద ప్రజల గూడు లేకుండా చేయవద్దని కోరుతున్నాను.మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టండి. రేవంత్ అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా ఒక్క పేద వాడి ఇంటి పనికి కూడా శంకుస్థాపన చేయలేదు. పైసా, పైసా కూడబెట్టుకుని కట్టుకున్న పేదల గూడును కూల్చేస్తున్నారు. కష్టపడి కట్టుకున్న ఇళ్ళు కూల్చివేస్తుంటే ఏం చేయాలో తెలియక బాధితులు బిక్కుబిక్కుమంటున్నారు. పేద ప్రజలకు అండగా నిలబడే కార్యక్రమం బీజేపీ చేస్తుంది. మహిళలకు, రైతులకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. మూసీ సుందరీకరణ కోసం గత ప్రభుత్వం కూడా పేదలను భయభ్రాంతులకు గురిచేశారు. బీఆర్ఎస్ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారు. బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంత ప్రజల్లో పర్యటించి.. వారి బాధలు తెలుసుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టాలని రేవంత్‌కు కల వచ్చినట్టుంది.రేవంత్‌కి మరో సవాల్ చేస్తున్నా.. మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా?. మూసీ పరివాహక ప్రాంతం గురించి రేవంత్‌కి తెలుసా?. మూసీ పక్కన అనేక మైసమ్మ దేవాలయాలు, పోచమ్మ దేవాలయాలు, ముత్యాలమ్మ దేవాలయాలు ఉన్నాయి. వాటిని కూల్చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. -
ఫోన్ ట్యాపింగ్ పై బీజేపీ నేతల ధర్నా
-
కాసేపట్లో ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ధర్నా
-
ఇందిరా పార్క్‌లో ధర్నా చేస్తున్న కర్ణాటక రైతులపై దాడికి దిగిన కాంగ్రెస్ నేతలు
-
ఇందిరాపార్కు వద్ద ANMల ఉద్రిక్తత
-
గాంధీభవన్, ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అవమానకరంగా చిత్రీకరించారంటూ కాంగ్రెస్ నేతుల నిరసనలు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో, పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. గాంధీ భవన్ వద్దకు భారీ పోలీసులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, పోలీసులు మధ్య వాగ్వాదం తోపులాట చోటుచేసుకుంది. అనంతరం, గాంధీ భవన్ గేటుకు భారీకేడ్లు వేసి పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు.. ఇందిరా పార్క్ వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఎన్ఎంలు ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరా పార్క్ వద్దకు చేరుకుని.. వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో, తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్బంగా పలువురు ఏఎన్ఎంలకు గాయాలయ్యాయి. మహిళా ఏఎన్ఎంలు ఒకరు సొమ్మసిల్లి పడిపోయారు. అయితే, గత కొంతకాలంగా వారిని పర్మినెంట్ చేయాలని ఏఎన్ఎంలు ఆందోళన చేస్తున్నారు. ఇది కూడా చదవండి: హంగు కాదు.. బీజేపీ డకౌట్ అవుతుంది: హరీష్ రావు -
KTR: హైదరాబాద్ ఉక్కు వంతెన ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నగరంలో నూతన బ్రిడ్జిలను నిర్మిస్తోంది. ఈ క్రమంలో మరో ప్రత్యేకమైన వంతెన ఇవాళ తెరుచుకుంది. ఇందిరా పార్క్-వీఎస్టీ ఉక్కు వంతెనను మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ వంతెన పేరు ఇందిరా పార్కు నాయిని నరసింహ రెడ్డి స్టీల్ బ్రిడ్జ్. కార్మిక నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి గౌరవార్థం నామకరణం చేశారు. ఇందిరా పార్క్ చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్ భవన్ సమీపంలోని VST చౌరస్తా వరకు ఈ బ్రిడ్జిని నిర్మించారు. తద్వారా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్ నగర్, వీఎస్టీ జంక్షన్లలో ఏర్పడే ట్రాఫిక్ రద్దీ తగ్గనుందని ప్రభుత్వం భావిస్తోంది. దక్షిణ భారత దేశంలోనే మొదటి పొడవైన స్టీల్ బ్రిడ్జ్. జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఈ బ్రిడ్జికి ఓ ప్రత్యేకత ఉంది. తొలిసారి భూసేకరణ లేకుండానే ఈ బ్రిడ్జిని నిర్మించారు. మెట్రో పై నుంచి ఉండడం ఈ బ్రిడ్జికి ఉన్న మరో ప్రత్యేకత. బ్రిడ్జి పొడవు 2.62 కిలోమీటర్లు.. వెడల్పు నాలుగు లైన్లు ఈ బ్రిడ్జి కోసం 12, 316 మెట్రిక్ టన్నుల ఉక్కు వినియోగించారు. 81 స్టీల్ పిల్లర్లు, 426 ఉక్కు దూలాలు వినియోగించారు. కాంక్రీట్ 60-100 ఏళ్లు, స్టీల్ 100 ఏళ్లకు పైగా మన్నికగా ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద(ఎస్ఆర్డీపీ) రూ. 450 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని జీహెచ్ఎంసీ నిర్మించింది. రోజుకు లక్ష వాహనాలు తిరిగే ఈ రూట్లో వాహనదారులకు బిజీ టైంలో 30-40 నిమిషాల టైం పట్టేది. ఈ వంతెన నిర్మాణంలో కేవలం ఐదే నిమిషాల్లో ప్రయాణం కొనసాగించొచ్చని అధికారులు చెబుతున్నారు. Good Morning Friends 😍❤️ Minister @KTRBRS will inaugurate the Naini Narsimhareddy Steel Bridge today#SteelBridge #Hyderabad #KTR pic.twitter.com/UzRW03wQ3M — Latha (@LathaReddy704) August 19, 2023 స్టీల్ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాం. ఈ బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలు తీరతాయి. ఎస్ఆర్డీపీలో ఇది 36వ ప్రాజెక్టు. హైదరాబాద్‌లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. :::బ్రిడ్జిని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో బీజేపీ మహాధర్నా
-
బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు(మంగళవారం) హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసుకోవచ్చని తెలిపింది. కాగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యంపై తెలంగాణ బీజేపీ నేతలు ఈనెల 25న ఇందిరాపార్క్ వద్దనున్న ధర్నాచౌక్‌లో నిరసనకు పిలుపునిచ్చింది. అయితే అనుమతి కోసం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను బీజేపీ నేతలు సంప్రదించగా.. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. నేడు న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై మధ్యాహ్నం హైకోర్టు విచారణ జరిపింది. ధర్నాకు అనుమతి ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే కేంద్రం ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతి భద్రతల విఘాతం కలగలేదా? అని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించింది.. 5వేల మందికి మీరు భద్రత కల్పించలేకపోతే ఎలా అని పోలీసులపై మండిపడింది. బీజేపీ మహాధర్నాకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. చదవండి: TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం -
స్తబ్ధత వీడేలా.. జోరుగా
సాక్షి, హైదరాబాద్: అధ్యక్షుడి మార్పునకు సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలతో కొంతకాలంగా పార్టీలో ఏర్పడిన స్తబ్ధతను దూరం చేసే దిశలో బీజేపీ వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. పార్టీ నాయకులు, కేడర్‌లో జోష్ నింపేలా వివిధ వర్గాల ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై ఆందోళనలకు సిద్ధమౌతోంది. ఇందులో భాగంగా రైతు రుణ మాఫీని వెంటనే పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన కార్య క్రమాలు నిర్వహించనుంది. ఆదివారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రారంభించిన టిఫిన్ బాక్స్ ‘బైఠక్’లను ఈ నెలాఖరు వరకు కొనసాగించనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లలో 18, 19 తేదీలలో ఈ బైఠక్లను నిర్వహించాలని నిర్ణయించినట్టు పార్టీ నాయకులు తెలి పారు. ఎక్కడికక్కడ నేతలంతా ఒకచోట చేరి పార్టీకి సంబంధించిన అంశాలు, ఇతర విషయాలపై స్వేచ్ఛగా మాట్లాడుకోవడం ఈ బైఠక్ల ముఖ్యోద్దేశమని ఓ ముఖ్యనేత సాక్షికి తెలిపారు. ప్రతినెలా ఈ టిఫిన్ బాక్స్ బైఠక్‌లు నిర్వహించాలని నాయకత్వం నిర్ణయించిందని బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి చెప్పారు. 20 నుంచే రంగంలోకి కిషన్‌రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి.. అమెరికా, లండన్ పర్యట నల నుంచి తిరిగొచ్చాక ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించే భారీ సభ ద్వారా ఎన్నికలపై పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. జాతీయ నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. దీనికి ముందే ఈ నెల 20న బాటసింగారంలో డబుల్ బెడ్రూం ఇళ్లను కిషన్‌రెడ్డి పరిశీలించనున్నారు. భారీ కాన్వాయ్‌తో ఆయన అక్కడకు వెళ్తారని తెలుస్తోంది. పేదలకు 7 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీఆర్ఎస్.. కేవలం కొన్నివేలే పూర్తి చేసిందంటూ ఎండగట్టా లని భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ ఇళ్ల నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ 24న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, 25న ఇందిరాపార్కు వద్ద ధర్నా బీజేపీ నిర్వహించనుంది. ఇక నిరుద్యోగ యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని కూడా పార్టీ నిర్ణయించింది. -
తలసాని Vs రేవంత్.. ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గొల్ల కురుమలను కించపరిచేలా రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. దున్నపోతులతో గాంధీభవన్‌ను ముట్టడించేందుకు యాదవ సంఘం యత్నించింది. సమాచారం అందుకున్న పోలీసులు గొల్ల కురుమలను అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు. తలసాని Vs రేవంత్ కాగా రాష్ట్రంలోని యాదవ, కురుమలను అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి తలసానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని యాదవ జేఏసీ డిమాండ్ చేసింది. తమ సామాజికవర్గాన్ని తక్కువ అంచనా వేయకూడదని, రాష్ట్రంలో 20 శాతానికి పైగా జనాభా ఉన్నదని, తమ సత్తా ఏమిటో చూపుతామని అన్నారు. రేవంత్ రెడ్డి ఏ గల్లీలో తిరిగినా అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే 25న వేలాదిగా యాదవులు, కురుమలు దున్నపోతులతో ఇందిరాపార్కు నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తామని, అక్కడి నుంచి గాంధీ భవన్‌కు చేరుకొని ముట్టడిస్తామని మంగళవారం హెచ్చరించారు. -
ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే ప్రభుత్వం అరెస్ట్‌లు చేస్తోంది: షర్మిల
-
YS Sharmila Deeksha: నేను ఎందుకు వెనక్కి తగ్గాలి?: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్టీపీ ఆధ్వర్యంలో ‘టీ–సేవ్’ నిరుద్యోగ దీక్షను ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం ఇందిరాపార్కు వద్ద చేపట్టారు. ఈ దీక్షలో ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, ‘‘నేను ఎందుకు వెనక్కి తగ్గాలి. రాజకీయాలంటేనే చీదరించుకునే దానిని.. మాకు పోలీసులతో గొడవ పెట్టుకోవడానికి ఏం అవసరం. తెలంగాణ యువత కోసం పోరాడుతున్నా. నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తేవడానికి వైఎస్ హయాంలో పోలీసులు పనిచేశారు. సెల్ఫ్ డిఫెన్స్‌లో చేశాను తప్ప.. పోలీసులను కించపరచాలని కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘బంగారు తెలంగాణ ఎక్కడ?. కల్వకుంట్ల కుటుంబం బంగారు తెలంగాణగా మారింది. సిట్ విచారణ కొండను తవ్వి ఎలుకను పట్టే విధంగా ఉంది. సిట్ విచారణలో సూత్రధారులను వదిలేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ప్రభుత్వ శాఖల్లో సమాచారం తీసుకోవడం అంత సులభమా?. ఐపీ అడ్రస్, పాస్వర్డ్ తెలిస్తే చాలా?. కేటీఆర్ తనకేమీ సంబంధం అంటున్నారు. ఐటీశాఖ బాధ్యతలు ఏంటో మీకు తెలుసా?. ఐటీ చట్టం-2000 వరకు అన్ని శాఖల్లో వాడే కంప్యూటర్లకు ఐటీ శాఖదే బాధ్యత. 2018లో టీఎస్పీఎస్సీలో కంప్యూటర్లు కొన్నారు.. ఐటీశాఖ సైబర్ సెక్యూరిటీ ఆడిట్ ఎప్పుడైనా చేసిందా?’’ అని షర్మిల ప్రశ్నించారు. ‘‘సైబర్ సెక్యూరిటీ ఆడిట్ జరిగి ఉంటే పేపర్ లీకేజీ జరిగేది కాదు. సిట్ అధికారులను ప్రగతిభవన్ గుప్పెట్లో పెట్టుకున్నారు. తీగలాగితే ఐటీ డొంక కదులుతుంది. కేటీఆర్‌ను కాపాడటానికే సిట్ ప్రయత్నం చేస్తుంది. దమ్ముంటే సీబీఐ దర్యాప్తు కోరండి. కేసీఆర్‌కు 10 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రం పంపుతున్నా’’ అని షర్మిల అన్నారు. చదవండి: TS: వాతావరణశాఖ హెచ్చరిక.. ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన -
మా నౌకరీలు మాగ్గావాలే
సాక్షి, హైదరాబాద్: ఈనెల 25న ‘మా నౌకరీలు మాగ్గావాలే’నినాదంతో బీజేపీ ఆధ్వర్యంలో ‘నిరుద్యోగ మహా ధర్నా’నిర్వహించనున్నారు. ఇందిరాపార్కు వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరుద్యోగ యువతతో కలసి ఈ ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నాయకులు సమావేశమయ్యారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా ఇదివరకే రాసిన వివిధ పరీక్షలు రద్దయి దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నందున, వారికి మద్దతుగా వివిధ రూపాల్లో ఆందోళనా కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నిర్వహించిన సాగరహారం, మిలియన్ మార్చ్ వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. ఇందులో భాగంగా తొలుత 25న ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని, పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని, ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలనే డిమాండ్లతో ఈ ధర్నా నిర్వహించనున్నారు. ప్రశ్నించే గొంతుకలకు అండగా.. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై గళం విప్పుతూ.. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న వివిధ సంస్థలు, జర్నలిస్టులకు అండగా నిలవాలని, వారి పక్షాన పోరాడాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. వివిధ సంస్థలు, స్వతంత్ర జర్నలిస్టులకు మద్దతుగా నిలిచేందుకు పార్టీనేతలు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులతో బండి సంజయ్ ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎం.రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, పార్టీ లీగల్ సెల్ నాయకులు ఆంటోనీరెడ్డి, పార్టీ కార్యదర్శి జయశ్రీ, అధికార ప్రతినిధి జె.సంగప్ప పాల్గొన్నారు. -
స్టీల్ బ్రిడ్జి.. నగరానికే తలమానికం
ముషీరాబాద్: ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు 2.6 కిలోమీటర్ల మేర రూ.440 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎలివేటెడ్ స్టీల్ బ్రిడ్జి నగరానికే తలమానికం కానుందని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి స్టీల్ బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. పనులు నత్త నడకన సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీలోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే రాత్రింబవళ్లూ పని చేయాలని కేటీఆర్ సూచించారు. ఇందిరాపార్కు చౌరస్తా నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చి పనులను పరిశీలించారు. అనంతరం వీఎస్టీ వద్ద నిర్మితమవుతున్న ర్యాంప్‌పైకి ఎక్కి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరమైతే ట్రాఫిక్‌ను మళ్లించి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్‌ను తగ్గించి ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల ప్రజల సౌకర్యార్థం స్టీల్ బ్రిడ్జీని చేపడుతున్నామని తెలిపారు. నగర పౌరులకు ట్రాఫిక్ రద్దీ సమస్యకు ఉపశమనం లభిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రిటైనింగ్ వాల్ పనుల పరిశీలన.. స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఎస్ఎన్డీపీలో భాగంగా చేపట్టిన హుస్సేన్‌సాగర్ నాలా రిటైనింగ్ వాల్ పనులను మంత్రి కేటీఆర్ సమీక్షించారు. హుస్సేన్‌సాగర్ వరద నీటి ద్వారా లోతట్టు ప్రాంత ప్రజలకు భవిష్యత్తులో ముంపు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రిటైనింగ్ వాల్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం చిక్కడపల్లిలోని కూరగాయల మార్కెట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. చేపల మార్కెట్ కోసం డిజైన్ రూపొందించండి.. దేశంలోనే ఫ్రెష్ ఫిష్ మార్కెట్ ఎక్కడ ఉందంటే రాంనగర్‌లోనే ఉందనే విధంగా చేపల మార్కెట్‌ను మంచి డిజైన్ చేసి వారం రోజుల్లో తీసుకురావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తనయుడు ముఠా జైసింహకు మంత్రి కేటీఆర్ బాధ్యతలను అప్పగించారు. జాగా నేను ఇప్పిస్తా.. డబ్బులు ఇప్పిస్తా వారం రోజుల్లో డిజైన్ చేసి తీసుకురా అని జైసింహతో చెప్పారు. ఈఎన్సీలు శ్రీధర్, జియావుద్దీన్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. -
30న ‘అనాథల అరిగోస’ పేరుతో దీక్ష
పంజగుట్ట: అనాథలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలు గుర్తు చేసేందుకు 30వ తేదీన ఇందిరాపార్క్ వద్ద ‘అనాథల అరిగోస’ పేరుతో దీక్ష నిర్వహిస్తున్నట్లు అనాథల హక్కుల పోరాట వేదిక వ్యవ స్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. పోరాట వేదిక ఆధ్వర్యంలో సోమవా రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అనాథ హక్కుల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలు గుర్తుచేస్తూ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. వేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ప్రొఫెసర్ హరగోపాల్, కాంగ్రెస్ నేతలు మల్లు రవి, అద్దంకి దయాకర్, రాములు నాయక్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆప్ నేత ఇందిరా శోభన్, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు రాములుతోపాటు పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. మందకృష్ణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనాథలకు ఎన్నో హామీలు ఇచ్చి నేటికి ఏడు సంవత్సరాల ఏడు నెలలు అయ్యిందని ఇప్పటికీ అవి నెరవేర్చకుండా మోసం చేశారని విమర్శించారు. -
హైదరాబాద్‌లో హై టెన్షన్.. అసెంబ్లీ టూ ప్రగతి భవన్ రోడ్డు మూసివేత!
సాక్షి, తెలంగాణ: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలు ప్రయత్నించారు. వీఆర్ఏలు, పలు ప్రజాసంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో అసెంబ్లీ నుంచి ప్రగతిభవన్ రోడ్డును పోలీసులు మూసివేశారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అక్కడున్న వ్యాపార సముదాయాలను సైతం పోలీసులు మూసివేయించారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక, ఇందిరా పార్క్ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన వీఆర్ఏలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు, వీఆర్ఏల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు.. వీఆర్ఏలపై లాఠీచార్జ్ చేశారు. కాగా, పెద్ద ఎత్తున జిల్లాల నుంచి వీఆర్ఏలు హైదరాబాద్‌కు తరలివచ్చినట్టు సమాచారం. అయితే, వీఆర్ఏల సమస్యలపై జిల్లాలో, గ్రామాల్లో వీఆర్ఏలు గత 50 రోజుల నుంచి నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం వల్లే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఇందిరా పార్క్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కాగా, పే స్కేల్ అమలు చేయాలంటూ వీఆర్ఏలు డిమాండ్ చేస్తున్నారు. రెడ్డి కార్పొరేషన్ కోసం రెడ్డి సంఘం ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని మత్య్సకారులు, సింగరేణి కార్మికులు నిరసనలు తెలిపారు. దీంతో ఎక్కడికక్కడ ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం వెంటనే బదిలీలు, పదోన్నతుల అమలుకు జీవో జారీ చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక, అసెంబ్లీ ముట్టడికి ఏడు సంఘాలు ప్రయత్నించినట్టు సమాచారం. -
ఇందిరా పార్క్‌లో హోలీ సంబరాలు
-
9న ఉపాధ్యాయుల మహాధర్నా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు వ్యతిరేకంగా ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపడుతున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ప్రకటించింది. ఉపాధ్యాయులంతా పెద్ద ఎత్తున ఈ ధర్నాకు తరలి వస్తున్నట్టు తెలిపింది. లోపభూయిష్టంగా ఉన్న ఈ జీవోకు సవరణలు చేసే వరకు వెనక్కు తగ్గేదిలేదని, ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని వెల్లడించింది. యూఎస్పీసీ నేతలు సోమవారం హైదరాబాద్ యూటీఎఫ్ కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడుతూ, తమ పట్ల ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాధర్నాను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ఇవేవీ తమ ఆందోళనను అడ్డుకోలేవన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, సర్కార్ దిగిరాకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. బలవంతపు బదిలీలు చేశారు.. టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ, టీచర్ల మనోగతానికి విరుద్ధంగా ప్రభుత్వం బలవంతపు బదిలీలు చేసిందని ఆరోపించారు. స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే భవిష్యత్‌లో ‘నాన్ లోకల్స్ గో బ్యాక్’ అనే నినాదం బలపడే వీలుందన్నారు. టీచర్లు పెట్టుకున్న అప్పీళ్లను బుట్టదాఖలు చేయడం దుర్మార్గమన్నారు. పరస్పర బదిలీల్లోనూ అన్యాయమైన నిబంధనలు పెట్టడం దారుణమన్నారు. వివాహానికి ముందు స్థానికతను ప్రమాణంగా తీసుకుంటే ఎంతోమంది నష్టపోతారని తెలిపారు. పరస్పర బదిలీల్లో సీనియారిటీని కోల్పోవాల్సిన పరిస్థితి టీచర్లకు నష్టం చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ జీవో వల్ల ఉపాధ్యాయులు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారని యూటీఎఫ్ నేత జంగయ్య ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్య సమస్యలున్న వాళ్లను దూర ప్రాంతాలకు బదిలీ చేయడం దుర్మార్గమన్నారు. 2012 నుంచి అంతర్ జిల్లా బదిలీలు చేపట్టలేదని గుర్తుచేశారు. స్పౌజ్ అప్పీళ్లను పరిష్కరించకపోవడం వల్ల టీచర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని డీటీఎఫ్ నేత టి.లింగారెడ్డి అన్నారు. తమ డిమాండ్లను ఒప్పుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి ఎదురీత తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని, దీన్ని టీచర్లు ఎంతమాత్రం సహించలేరని టీపీటీఎఫ్ నేత మైస శ్రీనివాసులు పేర్కొన్నారు. బాధిత ఉపాధ్యాయులంతా మహాధర్నాకు స్వచ్ఛందంగా హాజరవాలని యూఎస్పీసీ టీచర్లకు పిలుపునిచ్చింది. విలేకరుల సమావేశంలో జాదా వెంకట్రావ్, ఎ.రమణ, గాలయ్య, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు. -
దిక్కుమాలిన ప్రభుత్వం కేంద్రంలో ఉంది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: వరి కొనుగోలు అంశంపై కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య చెలరేగుతున్న మంట ఇప్పట్లో చల్లారేట్లు లేదు. ధాన్యాన్ని కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం గురువారం మహా దర్నా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఈ ధర్నలో సీఎం కేసీఆర్‌తో సహా, మంత్రులు, ఎమ్మెల్యే పాల్గొన్నారు. చదవండి: ఇందిరాపార్క్ ధర్నా ముగిశాక రాజ్‌భవన్‌కు టీఆర్ఎస్ పాదయాత్ర? ఈ మేరకు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..తెలంగాణలో పండించే వడ్లను కొంటరా.. కొనరా అని కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం సూటిగా సమాధానం చెప్పకుండా వంకర టింకరగా సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గోస తెలంగాణలోనే కాదు..దేశం మొత్తం ఉందన్నారు.. రైతు చట్టాలను రద్దు చేయండని ఏడాదిగా ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నారని గుర్తు చేశారు. వానాకాలం పంటనే కొనే దిక్కు లేదు కానీ కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటను ఎక్కడి నుంచి కొంటుందని ఎద్దేవా చేశారు. చదవండి: టీఆర్ఎస్ మహాధర్నా: స్టేజి కింద కూర్చున్న కేటీఆర్.. నాగలితో ఎమ్మెల్యే కేంద్రంలో దిక్కుమాలిన ప్రభుత్వం ఉందని సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. దేశాన్ని పాలించిన అన్ని పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ప్రస్తుత ఈ దుస్థితికి కారణం ఆ పార్టీలేనని విమర్శించారు. వాస్తవాలు చెప్పలేక కేంద్రం అడ్డగోలు మాట్లాడుతోందని మండిపడ్డారు. హంగర్ ఇండెక్స్‌లో భారత దేశం 101 స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ కంటే భారత్ దీన స్థితిలో ఉందన్నారు. బీజేపీ అబద్ధాలు మాట్లాడుతూ అడ్డగోలు పాలన చేస్తోందని మండిపడ్డారు. ‘ఐటీఆర్ ప్రాజెక్టు ఇవ్వమంటే ఇవ్లేదు.. ప్రతి జిల్లాకు నవోదయాలు ఇవ్వమంటే ఇవ్వలే. చాలా ఓపికతో ఉన్నాం. ఈ సభలో కూడా బీజేపీకి సీఐడీలు ఉన్నారు. నిన్న కూడా ప్రధానికి లేఖ రాసిన. వడ్లు కొంటరా, కొనరా అని అడిగితే ఉలుకు పలుకు లేదు. రైతులు ఇబ్బంది పడతారనే యాసంగిలో వడ్లు వేయొద్దని చెప్పిన. పదవులను చిత్తు కాగితాల్లా ఎన్నిసార్లు వదిలేశామో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. రైతు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రాజీ పోరాటం చేస్తాం. అనేక సమస్యలను పెండింగ్‌లో పెట్టారు. కుల గణన చేయాలని తీర్మాణం చేసి పంపితే ఇప్పటి వరకు దిక్కు లేదు. సమస్యలను పక్కకు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. నీళ్లివ్వకుండా రాష్ట్రాల మధ్య తగాదాలు పెడుతున్నారు. సమస్యలను ఎత్తి చూపితే పాకిస్తాన్ అని విద్వేషాలు రెచ్చగొడుతోంది బీజేపీ. కరెంట్ కోసం తెలంగాణ 30ఏళ్లు ఏడ్చింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాకే కరెంట్ సమస్య తీరింది. కరెంట్ మోటర్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెబుతోంది. రైతు కడుపు నిండా కరెంట్ ఇచ్చేది తెలంగాణే. బీజేపీకి చరమగీతం పాడితేనే ఈ దేశానికి విముక్తి’ అని సీఎం కేసీఆర్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. -
టీఆర్ఎస్ మహాధర్నా: స్టేజి కింద కూర్చున్న కేటీఆర్.. నాగలితో ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోలు అంశం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. వరి కొనుగోలుపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో వరి కొనుగోలుపై కేంద్రం అవలంభిస్తున్న ద్వంద వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం గురువారం మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందిరా పార్క్ వద్ద కొనసాగుతున్న ఈ ధర్నాలో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చదవండి: కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టాం: సీఎం కేసీఆర్ అయితే కేసీఆర్‌తో సహా మంత్రులంతా స్టేజి పైన కూర్చొని ఉండగా కేవలం కేటీఆర్ ఒక్కరే స్టేజి కింద కార్యకర్తలు ముందు కూర్చున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మహాధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన శరీరంపై వడ్ల కంకులను అంకరించుకొని.. భుజంపై నాగలి పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇదే తొలిసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ చేపడుతున్న ఆందోళనల్లో ఇది నాలుగోది. అయితే సీఎం కేసీఆర్ స్వయంగా నిరసనలో పాల్గొనడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలపవడంపై టీఆర్ఎస్ రాష్ట్ర బంద్‌ను నిర్వహించింది. అనంతరం కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన భారత్ బంద్‌లో పాల్గొంది. ధాన్యం సేకరణ సమస్యను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టింది. తాజాగా ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ ఈ నిరసనలో ఆయన కూడా పాల్గొన్నారు. ఈ మహాధర్నా మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. -
గవర్నర్ తమిళిసైని కలిసిన టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం గురువారం మహా దర్నా నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఈ ధర్నలో సీఎం కేసీఆర్‌తో సహా, మంత్రులు, ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ ధర్నా మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. మహాధర్నా తరువాత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి సీఎం కేసీఆర్ వినతి పత్రం అందించారు చదవండి: మంత్రి కేటీఆర్ చొరవ.. ఐదేళ్ల చిన్నారిని దత్తత తీసుకున్న కలెక్టర్ ఇందిరాపార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా ముగిశాఖ టీఆర్ఎస్ మంత్రులు బస్సులో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ఈ మేరకు ఎంపీ కేశవరావు నేతృత్వంలోని బృందం 10 మంది మంత్రులు,10 ఎంపీలు గవర్నర్నర్‌ను కలిసి రైతు సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. వీరిలో గంగుల కమలాకర్, మంత్రి సత్యవతి రాథోడ్, కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కడియం శ్రీహరి, నారదాసు లక్ష్మణ్‌రావు, మంత్రులు నిరంజన్ రెడ్డి, తలసాని, శ్రీనివాస్ గౌడ్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే జోగు రామన్న, పద్మాదేవేందర్‌రెడ్డి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాలోత్ కవిత, భాను ప్రసాద్ ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వరి కొనుగోలు విషయంలో కేంద్ర ద్వంద వైఖరిని నిరసిస్తూ ధర్నా చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర విధానం వల్ల రైతులు దెబ్బతింటున్నారని, కేంద్ర వైఖరి రైతులకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఈ యుద్ధం ఆగదు. ఇది ఆరంభం మాత్రమే. అంతం కాదని స్పష్టం చేశారు. పంజాబ్‌లో మాదిరిగా తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 50 రోజులు గడిచిన కేంద్ర నుంచి ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల గురించి ప్రధానికి లేఖలు కూడా రాశామని.. గ్రామగ్రామల్లో వివిధ రకాల ఆందోళనలు కొనసాగుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు ‘ఈ పోరాటం ఇక్కడితో ఆగదు. ఈ యుద్ధం ఢిల్లీ దాకా పోవాలి. కేంద్రం కళ్ళు తెర్పించడానికి ఈ యుద్ధం. మంత్రులే ధర్న కు కూర్చుంటున్నారు అంటున్నారు. 2006లో నాటి గుజరాత్ సీఎం నేటి ప్రధాని మోదీ కూడా ధర్నా చేశారు. రైతుల పక్షాన మేముంటం. పోరాటాలు మాకు కొత్త కాదు’ కాదు అని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు సాయి చంద్ పాటకు మంత్రి కేటీఆర్ చప్పట్లు కొడుతూ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. -
ఇందిరాపార్క్ వద్ద రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ ధర్నా
-
లవర్స్‌కు షాకిచ్చిన ఇందిరా పార్క్: వెనక్కి తగ్గిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్‌లో ప్రముఖ పార్క్‌లోకి పెళ్లికాని జంటలను నిషేధించే ఉత్తర్వుల బోర్డు కలకలం సృష్టించింది. ‘‘పెళ్లి కాని జంటలకు పార్కులోనికి ప్రవేశం లేదు” అంటూ తాజాగా ఇందిరా పార్కు యాజమాన్యం ఒక బోర్డు పెట్టింది. పార్క్ మేనేజ్మెంట్ కొత్త మోరల్ పోలీసింగ్ వ్యవహారం దుమారాన్ని రేపింది. పరోక్షంగా ప్రేమికులకు ప్రవేశం లేదన్నట్టు హుకుం జారీ చేయడంపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. తాలిబన్లు ఎక్కడో వేరే దేశంలో లేరు, మన చుట్టూనే వున్నారు, కావాలంటే వెళ్లి చూడండి హైదరాబాద్ ఇందిరాపార్క్‌కి అంటూ ఈ నిర్ణయంపై మహిళా ఉద్యమకారులు మండిపడ్డారు. పబ్లిక్ పార్క్ అనేది లింగభేదం లేని జంటలతో సహా చట్టాన్ని గౌరవించే పౌరులందరికీ అనుమతినిచ్చే ప్రదేశం. పార్క్‌లోకి ప్రవేశానికి 'వివాహం' ఎలా ప్రామాణికంగా ఉంటుందంటూ యాక్టివిస్ట్ మీరా సంగమిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి : తిప్ప తీగ, నిమ్మగడ్డి, అశ్వగంధ ఉపయోగాలు తెలుసా!? ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్క్ అంటే చాలా ఫ్యామస్. ఈ పార్క్‌ను సందర్శించే వారిలో పిల్లలు, ప్రేమికుల సంఖ్య ఎక్కువ. మరీ ముఖ్యంగా మార్నింగ్ వాక్కు వచ్చే వారితో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. అందులోనూ ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన ప్రత్యక అభివృద్ది కార్యక్రమాలతో మరింత సందడి నెలకొంది. అయితే తాజాగా ప్రేమ జంటలకు షాక్ ఇవ్వడంపై భారీ వ్యతిరేకత రావడంతో ఈ బోర్డును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అసౌకర్యానికి చింతిస్తున్నాం అంటూ మరో బోర్డు తగిలించింది. అయితే పార్క్ ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులు క్రమంగా తనిఖీలు నిర్వహిస్తూ తగిన శ్రద్ధ వహించాలని కోరినట్టు తెలిపింది. మరోవైపు ఇందిరా పార్కుతోపాటు, నగరంలోని ఇతర ప్రముఖ పార్కుల్లో కూడా ఇలాంటి ఆదేశాలే అమల్లోకి రానున్నాయంటూ సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళన వ్యక్తం కావడవం గమనార్హం. చదవండి : Kabul Airport: వరుస పేలుళ్ల కలకలం, 13 మంది మృతి New low & new level of moral policing by Indira Park Mgmt in Hyd! A public park is an open space for all law abiding citizens, including consenting couples across genders. How can 'marriage' be criteria for entry! @GHMCOnline & @GadwalvijayaTRS this is clearly unconstitutional. pic.twitter.com/4rNWo2RHZE — Meera Sanghamitra (@meeracomposes) August 26, 2021 -
ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత: ఛలో రాజ్‌భవన్ అడ్డగింత
-
వైఎస్ షర్మిల దీక్ష భగ్నం
-
వైఎస్ షర్మిల దీక్ష భగ్నం
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్క్ వద్ద వైఎస్ షర్మిల చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇచ్చిన గడువు ముగియడంతో దీక్ష విరమించాలని పోలీసులు షర్మిలకు సూచించారు. అయినప్పటికీ ఆమె దీక్ష కొనసాగించడంతో పోలీసులు వైఎస్ షర్మిలను బలవంతంగా లోటస్‌పాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో ఇందిరాపార్క్ నుంచి లోటస్‌పాండ్‌కు పాదయాత్రగా బయల్దేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, షర్మిల అభిమానులకు మధ్య జరిగిన తోపులాటలో ఆమె కొద్దిసేపు స్పృహతప్పి పడిపోయారు. దీంతో పోలీసులు ఆమెను వాహనంలో లోటస్‌పాండ్‌కు తరలించారు. కాగా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి : ‘ఉద్యోగ దీక్ష’ చేపట్టిన వైఎస్ షర్మిల వైఎస్సార్ జయంతి రోజున కొత్త పార్టీ: వైఎస్ షర్మిల -
‘ఉద్యోగ దీక్ష’ చేపట్టిన వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్క్ వద్ద వైఎస్ షర్మిల దీక్ష చేపట్టారు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించి.. నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం ఆమె దీక్షకు ఉపక్రమించారు. సాయంత్రం 5 గంటల వరకు వైఎస్ షర్మిల దీక్ష కొనసాగనుంది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, నిరుద్యోగులను సీఎం కేసీఆర్ పట్టించుకోవటం లేదన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఉద్యమాలు చేస్తే అణచివేస్తున్నారని.. నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు నిరాహార దీక్ష కొనసాగిస్తామని వైఎస్ షర్మిల వెల్లడించారు. చదవండి: జరిమానా తప్పించుకోవడానికి...క్యా ఐడియా సర్ జీ ప్రమోషన్లు వదులుకుని మరీ తిష్ట? ఎవరా అధికారులు? -
హైదరాబాద్: పంచతత్వ పార్క్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
పంచతత్వ పార్క్ ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : నగర ప్రజలకు పంచతత్వ పార్క్ అందుబాటులోకి వచ్చింది. ఇందిరా పార్క్‌లో నిర్మించిన ఆక్యుప్రెజర్ వాకింగ్ ట్రాక్‌ను మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఎనిమిది అంశాలతో ఎకరం విస్తీర్ణంలో ఈ ట్రాక్‌ను నిర్మించారు. కంకర రాళ్లు, నల్లరేగడి మట్టి, నీరు, ఇసుక, చెక్కపొట్టు, గులకరాళ్లతో నిర్మించిన ఈ ట్రాక్ మీద నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలోని నరాలపై ఒత్తిడి పడుతుంది. అంతేకాకుండా ట్రాక్ సర్కిల్లో వివిధ రకాల ఔషధ మొక్కలను పెంచారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, నగర మేయర్ బొంతు రామ్మెహన్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు. -
ఇందిరా పార్కులో గంధం చెట్ల స్మగ్లింగ్
-
ఇందిరా పార్కులో ‘గంధం’ దొంగలు
ముషీరాబాద్/కవాడిగూడ: నగరంలోని ఇందిరా పార్కులో గంధం చెట్ల స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోంది. అర్ధరాత్రిపూట కొంతమంది స్మగ్లర్లు గంధపు చెట్లను రంపంతో కోసుకుని లారీల్లో గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తున్నారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ హారి్టకల్చర్ అధికారులు గాం«దీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు రోజులుగా ఇందిరాపార్క్ సెక్యూరిటీ సిబ్బంది, సమీపంలో నివాసితులను విచారిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారులు నిద్రమత్తును వీడకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గతంలో ఇందిరాపార్క్ నుంచి సందర్శకులు వెళ్లిన అనంతరం రాత్రి 10 గంటలకు సిబ్బంది లైట్లను ఆర్పి వారు వెళ్లేపోయేవారు. కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో లైట్లను అలాగే ఉంచేవారు. ఇటీవల ఆటోమేటిక్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసి, రాత్రి 10 గంటల తర్వాత పార్క్ మొత్తం లైట్లను ఆరి్పవేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు వెలిగేలా సిస్టంను రూపొందించారు. దీనిని అలుసుగా తీసుకున్న కొందరు వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో లోయర్‌ట్యాంక్ కట్టమైసమ్మ ప్రాంతం నుంచి ఇందిరాపార్క్‌లోకి చొరబడుతున్నారు. గంధం చెట్లను పెద్ద పెద్ద రంపాలతో నరికి తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. పదేళ్ల క్రితం ఇదే తరహాలో స్మగ్లింగ్ పదేళ్ల క్రితం ఇదే పార్క్‌లో ఉన్న గంధం చెట్లను స్మగ్లర్లు నరుక్కుని అక్రమంగా తరలించారు. దీనిపై అప్పట్లో జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత భద్రతను పెంచారు. రెండ్రోజుల కిత్రం.. గత ఆదివారం అర్ధరాత్రి కొందరు దుండగులు పార్క్‌లోకి చొరబడ్డారు. సుమారు 11 గంధపు చెట్లను రంపాలతో కోసి కొమ్మలను అక్కడే పడేసి దుంగలను మాత్రం లోయర్‌ట్యాంక్‌బండ్ వైపుగా తరలించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఉదయం 4 గంటలకు ఇందిరాపార్క్‌కు వచ్చే వాకర్స్ కంటపడకుండా కొమ్మలను సైతం తీసివేసినట్లు తెలిసింది. అనంతరం గాం«దీనగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పార్క్ సెక్యూరిటీని, అధికారులతో పాటు సమీపంలో నివసించే వారిని సైతం గుట్టుచప్పుడు కాకుండా విచారిస్తున్నారు. దీనిపై చిక్కడపల్లి ఏసీపీ శ్రీధర్‌ను వివరణ కోరగా.. రెండు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. విచారణ వేగవంతంగా జరుగుతోందన్నారు. ఈ స్మగ్లింగ్‌కి పాల్పడింది బయట వ్యక్తులేనని, ఇందిరాపార్క్ సిబ్బంది సహకారం ఉందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నామన్నారు. -
మహానగరం ఇక విశ్వనగరం: కేటీఆర్
హైదరాబాద్: మహానగరం మణిహారాలసమాహారంగా రూపుదాల్చుతోంది. ట్రా‘ఫికర్’ లేకుండా ఇప్పటికే నిర్మించిన ఫ్లైఓవర్లకు మరో రెండు ఫ్లై ఓవర్లు తోడుకానున్నాయి. ఇందిరాపార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా వీఎస్టీ వరకు నిర్మించబోయే స్టీల్ బ్రిడ్జిని, రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు మరో బ్రిడ్జిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్‌లతో కలసి మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం ఇందిరాపార్కు వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ మహానగరంగా కీర్తిగాంచిన హైదరాబాద్ విశ్వనగరంగా పురుడుపోసుకుంటోందని అన్నారు. ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు స్టీల్‌బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్ దీర్ఘకాలికంగా ఉందని, అది తమ ప్రభుత్వ హయాంలో నెరవేరుతుండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రూ.426 కోట్ల ఎస్ఆర్డీపీ నిధులతో చేపట్టిన రెండు ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేసుకున్నామని, ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు రూ.350 కోట్లతో 2.6 కిలోమీటర్ల స్టీల్ బ్రిడ్జి, రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి వరకు రూ.76 కోట్ల వ్యయంతో 900 మీటర్ల బ్రిడ్జి అందుబాటులోకి రానుం దని చెప్పారు. నగరంలో మరో రూ.6 వేల కోట్ల ఎస్ఆర్డీపీ నిధులతో పనులు నడుస్తున్నాయన్నారు. లాక్డౌన్ సమయంలో దాదాపు నాలుగురెట్ల వేగంతో కోట్లాది రూపాయల నిర్మాణపనులు పూర్తి చేశామని వివరించారు. హైదరాబాద్ రహదారులపై రద్దీ తగ్గాలనే ఉద్దేశంతో ఎస్ఆర్డీపీ, హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా కొత్త లింక్ రోడ్లు, మిస్సింగ్ రోడ్లు నిర్మించుకుంటూ ముందుకుపోతున్నామని వివరించారు. నిర్వహణ పటిష్టంగా ఉండాలని 710 కిలోమీటర్ల ముఖ్యమైన రోడ్లను సీఆర్ఎంపీ పేరిట ప్రైవేటు సంస్థలకు అప్పగించామని చెప్పారు. భవిష్యత్‌లో రక్షణ రంగం స్థలాల అవసరం ఉంటుందని, నాగపూర్, రామగుం డం హైవేలపై సైతం 18 కిలోమీటర్ల మేర స్కైవేలు నిర్మించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా పరిశీలిస్తోందని, దీనికి కేంద్రమం త్రి కిషన్‌రెడ్డి సహకారం కావాలని కోరారు. హైదరాబాద్‌లో 36 కిలోమీటర్ల స్కైవేలు నిర్మిస్తే వాహనాల రద్దీ తగ్గే అవకాశం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమన్నారు. హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మార్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పాన్ని వేగవంతంగా ముందుకు తీసుకుపోయేందుకు రోడ్ల విస్తరణ, నూతన రోడ్లు, ఫ్లైఓవర్లు, స్కైవేలు, స్టీల్ బ్రిడ్జ్‌ల నిర్మాణాలను ప్రణాళికాబద్ధంగా, విస్తృతంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. కాగా, కోవిడ్–19 కట్టడి గురించి కేటీఆర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ బ్రహ్మాండంగా పనిచేస్తోందని, ఇంకా కొన్ని పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కలసిమెలసి అభివృద్ధి చేసుకుందాం: కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఎన్నో ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయాలకతీతంగా కలసిమెలసి అభివృద్ధి చేసుకుందామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. ‘ఇప్పుడు హైదరాబాద్ సిటీ అనగానే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు సినిమాహాళ్లకు కేంద్రంగా ఉన్న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు మంచి పేరు ఉంది. ఇది చాలా కీలకమైన ప్రాంతం’అని ఆయన అన్నారు. నగరంలోకి పెట్టుబడులు రావాలంటే ట్రాఫిక్ సమస్య ఉండొద్దని, పెట్టుబడుదారులు ఇప్పుడు బెంగళూరు వెళ్లాలంటే ట్రాఫిక్ సమస్య కారణంగా భయపడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, జీహెచ్ఎంసీ అధికారులు, నియోజకవర్గ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘ఆ కుట్ర వెనుక మోహన్ భగవత్’
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగాన్ని విస్మరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మండిపడ్డారు. ప్రభుత్వాల తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఇందిరా పార్కులో సోమవారం దీక్ష చేపట్టింది. ఈ ధర్నాలో ఆయనతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కుంతియా, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమారుతో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంపత్ కమార్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని బీజేపీ అడ్డుకోవాలని చూస్తుందన్నారు. రిజర్వేషన్లను పున సమీక్షిస్తామని సుప్రీంకోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా బడుగు, బలహీనవర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దళితులు, బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్‌కు వ్యతిరేకంగా అడుగులు పడుతున్నాయని, మానవ హక్కులను కాపాడుకోవడానికి పోరాటం చేయవలసిన దౌర్బాగ్యం వచ్చిందన్నారు. రాజ్యాంగంలో ఉన్న వాటిని అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని.. తమ పార్టీ బీదల పార్టీ అని ఆయన పేర్కొన్నారు. ఓబీసీ సెల్ చైర్మన్ కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ.. అంబేద్కర్ భావజాలాన్ని అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని.. సుప్రీంకోర్టు తీర్పు కొన్ని వర్గాల వారికి మాత్రమే అనుకూలంగా ఉందని ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాల వారిని హీనంగా చూస్తున్న అగ్రవర్ణాల వారికి అనుకూలంగా ఈ తీర్పు ఉందన్నారు. బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లపై సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్ళిందో చెప్పాలన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాలన్నారు. ఈ కుట్ర వెనుక మోహన్ భగవత్ ఉన్నారని ఆరోపించారు. తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తే బీసీ నాయకుడుగా చెప్పుకునే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించింది కూడా కాంగ్రెస్మే అని తెలిపారు. దేశంలో 80 శాతం ఉన్న బడుగు బలహీన వర్గాల నుంచి తొలగించి.. అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించారని, రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఆర్టీసీని నాకివ్వండి.. లాభాల్లో నడిపిస్తా!
సాక్షి, హైదరాబాద్ : ‘ఆర్టీసీని నడపడం మీకు చేతకాకుంటే నాకివ్వండి. వేల కోట్ల లాభాల్లో నడిపిస్తాను’ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రభుత్వానికి సవాల్ చేశారు. ప్రభుత్వం తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. గురువారం ఇందిరాపార్క్ వద్ద వామపక్షాలు చేపట్టిన సామూహిక దీక్షను ఆయన ప్రారంభించి సమ్మెకు తన మద్దతును తెలిపారు. అనంతరం ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడతూ.. తమిళనాడు తరహాలో డీజిల్ ధరలను ప్రభుత్వం భరిస్తే ఆర్టీసీకి నష్టాలు రావని వెల్లడించారు. ప్రభుత్వం ఆర్టీసీకి నయాపైసా ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ ఆదాయం తీసుకోకుండా ఉంటే చాలన్నారు. ఆర్టీసీ ఏటా డీజిల్‌పై 1300 కోట్లు ఖర్చు చేస్తే 300 కోట్లు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తుందని పేర్కొన్నారు. నష్టాలొచ్చినా ఆర్టీసీపై పన్నులు వసూలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని విమర్శించారు. ప్రైవేటు బస్సులను అరికడితే ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తుందని సూచించారు. ప్రభుత్వం అబద్దపు ప్రచారాలను మానుకోవాలని నాగేశ్వర్ కోరారు. అంతకు ముందు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. సమ్మె విషయంలో ప్రస్తుతం సీఎం వర్సెస్ తెలంగాణ సమాజం అనే విధంగా మారిందన్నారు. తెలంగాణ సమాజం బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా సమ్మె న్యాయమైందే అంటున్నారని వ్యాఖ్యానించారు. సీఎం మొండి వైఖరి వల్ల చీకటి రోజులు వస్తున్నాయని ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అభిప్రాయపడ్డారు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ తనకు ఎదురులేదని విర్రవీగుతున్నాడని విమర్శించారు. ఐదుగురు కార్మికులు మరణించిన తర్వాత కూడా మానవత్వం లేదా? అని ప్రశ్నించారు. కార్మికులపై కక్ష కట్టిన కేసీఆర్ సమ్మెను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం దీక్ష
-
ఆమరణ నిరాహార దీక్షకు దిగిన భట్టి
సాక్షి, హైదరాబాద్ : తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత భట్టి విక్రమార్క మల్లు నిరాహార దీక్షకు దిగారు. ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్షలో భాగంగా 36 గంటల పాటు ఆయన దీక్ష చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏఐసీసీ ఇంచార్జి ఆర్సీ కుంతియా దీక్షను ప్రారంభించగా.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, వీహెచ్, శ్రీధర్ బాబు, జీవన్‌రెడ్డి, సీతక్క, బలమూరి వెంకట్ తదితర పార్టీ నేతలు దీక్షలో కూర్చున్నారు. వీరికి మద్దతుగా అశేష కాంగ్రెస్ శ్రేణుల ఇందిరాపార్కుకు తరలి వచ్చాయి. ఈ క్రమంలో గత కాంగ్రెస్‌తో పాటు మహాకూటమిలో భాగమైన పలువురు టీటీడీపీ నేతలు కూడా ఈ దీక్షకు సంఘీభావం తెలిపారు. టీజేఎస్ కన్వీనర్ కోదండరాం కూడా తన మద్దతు తెలిపారు. కాగా అధికార టీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంపై భట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..‘శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతే.. ఒక పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీలో చేరాలని రాజ్యాంగంలో ఉంది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని టీఆర్ఎస్ పార్టీ అనుకూల మీడియాలో అని ప్రచారం జరుగుతోంది. ఇది నిజం కాదు. ప్రజలు ఎవరిని గెలిపించినా మేము డబ్బుతో ఆ నాయకులను కొంటామని కేసీఆర్ అనుకుంటున్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పు. ఈ విషయం గురించి ప్రజలే ఆలోచించాలని కోరుతున్నా. రాష్ట్రంలో జరుగుతున్న ఈ వికృత చర్యలను గమనించాలి’ అని భట్టి ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. -
వేదికపైనే కొట్టుకున్న వీహెచ్, నగేశ్..
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ.. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ తీరును ఖండిస్తూ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు, టీపీసీసీ అధికార ప్రతినిధి నగేశ్ బాహాబాహీకి దిగారు. దీంతో ధర్నా కార్యక్రమం రసాభాసగా మారింది. వేదికపై నుంచి వీహెచ్ మాట్లాడుతుండగా, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా అక్కడికి వచ్చారు. ఆయన్ను ఆహ్వానిస్తూ మైక్‌లో వీహెచ్ అనౌన్స్ చేశారు. అదే సమయంలో నగేశ్ కూడా వేదికపైకి వెళ్లారు. కుంతియా కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో నగేశ్ కూర్చునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నగేశ్, వీహెచ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. నగేశ్‌పై వీహెచ్ చేయి చేసుకోవడంతో నగేశ్ వీహెచ్ చొక్కా పట్టుకున్నాడు. తోపులాటలో ఇద్దరూ కిందపడిపోవడంతో అక్కడున్న వారు వీహెచ్‌ను పైకిలేపి ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి వచ్చినప్పుడు బాధ్యతగల నాయకుడు ఇలా ప్రవర్తించడం సరికాదంటూ వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరాం, నారాయణ జోక్యం చేసుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఏకంగా వేదిక మీదే కాంగ్రెస్ నేతలు కొట్టుకోవడంతో అఖిలపక్ష నేతలు బిత్తరపోయారు. చనిపోయిన పిల్లల కుటుంబాల ముందు ఇలా మనం కొట్టుకోవడం వారిని అవమానించడమేనని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే మీరు గాంధీభవన్‌లో కొట్లాడుకోండంటూ సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. నగేష్‌ను పార్టీ నుంచి బహిష్కరించే యోచన! ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో వీహెచ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ ఘర్షణ పడటాన్ని పార్టీ తీవ్రంగానే పరిగణించింది. శనివారం రాత్రి పార్టీ క్రమశిక్షణ సంఘం అత్యవసరంగా భేటీ అయింది. కమిటీ చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భేటీలో ఈ గొడవపై చర్చించారు. సీనియర్ నేత వీహెచ్‌పై నగేశ్ దాడి చేసినట్లుగానే భావిస్తున్నట్లు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని తేల్చిచెప్పింది. నగేశ్‌ను పార్టీ నుంచి బహిష్కరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు... దీనికి సంబంధించి ఘటనా స్థలంలో ఉన్న కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, మండలి విపక్ష మాజీ నేత షబ్బీర్ అలీ కమిటీ నివేదిక ఇవ్వాలని కుంతియా ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా నగేశ్‌పై చర్యలు తీసుకోనున్నారు. -
కేసీఆర్‌కి కౌంట్‌డౌన్ మొదలైంది: అద్దంకి
సాక్షి, హైదరాబాద్: బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు లేదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ఇందిరాపార్క్ దగ్గర జరుగుతున్న అంబేద్కర్ వాదుల మహాగర్జనలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో కేసీఆర్‌ను మించిన నియంత లేడని, అంబేద్కర్ కాలి గోటికి కూడా ఆయన సరిపోరని విమర్శించారు. అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్ ఎటు పోయిండు అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఎందుకు అంబేద్కర్ గురించి మాట్లాడం లేదని నిలదీశారు. రాజ్యాంగంపై గౌరవం లేదు కానీ దేశానికి ప్రధానమంత్రి అవుతానని అన్ని రాజకీయ పార్టీలను కేసీఆర్ కలుస్తున్నారని అన్నారు. కేసీఆర్‌కి కౌంట్‌డౌన్ మొదలైందని హెచ్చరించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కేసీఆర్ అణిచివేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు విమర్శించారు. రాజ్యాంగ నిర్మాతను కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా అవమానించిందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగoలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు నిరసనగా నిర్వహిస్తున్న ఈ మహాగర్జనలో మందకృష్ణ మాదిగ, ప్రొఫెసర్ కోదండరాం, వీహెచ్ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, చాడ వెంకటరెడ్డి, ఎల్ రమణ, విమలక్క, సంధ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరాపార్క్‌లో అగ్రిగోల్డ్ బాధితుల రిలే నిరాహార దీక్ష
-
ఇందిరాపార్క్ వద్ద ఎమ్‌ఎస్‌వోల మహా ధర్నా
-
అరెస్ట్‌లకు నిరసనగా అయ్యప్ప భక్తుల ధర్నా
సాక్షి, హైదరాబాద్ : శబరిమల ఆలయం వద్ద భక్తుల అరెస్ట్‌లను నిరసిస్తూ .. రాష్ట్రానికి చెందిన అయ్యప్ప భక్తులు ధర్నాకు దిగారు. అయ్యప్ప ఐక్య వేదిక నేతృత్వంలో మంగళవారం ఇందిరా పార్క్‌లో అయ్యప్ప భక్తులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా స్వాములు శబరిమల దర్శనానికి అనుమతి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రభుత్వాలు కలగజేసుకుని కేరళ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని కోరారు. చివరకు అయ్యప్ప స్వాములు కూడా ధర్నాలు చేయాల్సి రావడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ధర్నాలో పాల్గొని అయ్యప్ప భక్తులకు మద్దతు తెలిపారు. -
ధర్నాచౌక్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్‌ను కొనసాగించాలని మంగళవారం హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందనే కారణంతో ప్రభుత్వం ధర్నాచౌక్‌ను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో నిరసనలు తెలుపడంపై నిషేధం విధించారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు హైకోర్టును ఆశ్రయించారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్‌ను యథావిధిగా కొనసాగించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ధర్నాచౌక్ పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఆరు వారాల వరకు ధర్నా చౌక్‌ను యథావిధిగా కొనసాగించాలని న్యాయస్థానం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆరు వారాలు పరిశీలించిన తర్వాత ఈ అంశంపై పూర్తి స్థాయిలో స్పందిస్తామని తెలిపింది. ఇకపై ధర్నా చౌక్‌లో యథావిధిగా నిరసనలు తెలుపడానికి కోర్టు అనుమతినిచ్చింది. -
కేసీఆర్‌పై లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందిరా పార్క్ తరలింపును అడ్డుకుంటునందుకు కేసీఆర్‌ను తనను బెదిరించారన్నారు. ఇందిరాపార్క్‌లో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో వాకర్స్ భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు. పార్క్‌కి అందరు వచ్చే సమయంలో మంటలు వ్యాపించడంతో వాకర్స్ ఆందోళనకు దిగారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ..అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇందిరా పార్క్‌లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చెత్త చెదారంతో ఇందిరా పార్క్ డంపింగ్ యార్డ్‌లా తయారైందని మండిపడ్డారు. -
అణచివేత కుదరదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో నిరసన గళాలు వినిపించేందుకు వేదికైన ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిరసన ప్రదర్శనలను ప్రభు త్వం నిషేధించడంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. నగరం నడిబొడ్డునున్న ఈ ప్రాంతంలో ధర్నాలపై ఉక్కుపాదం మోపడాన్ని తప్పుబట్టింది. ‘ఇది భారతదేశం. ఇక్కడ నిరసన గళాలను అణచివేస్తామంటే కుదరదు. ధర్నాల వల్ల ఇబ్బంది కలుగుతుందనుకుంటే అర్థవంతమైన ఆంక్షలు విధించాలి. అంతే తప్ప ఎక్కడో ఊరు అవతల 50 కిలోమీటర్ల దూరంలో ధర్నాలు చేసుకోమంటే ఎలా? అడవిలో సెల్‌టవర్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? సింహాలు, పులులు సెల్ఫోన్లు వాడవు కదా. మనుషులు ఉన్న చోటే సెల్‌టవర్లు పెట్టాలి. అలాగే ధర్నాచౌక్ కూడా. జనాల మధ్యలో ధర్నాలు చేయకుండా రిషీకేశ్‌కు వెళ్లి చేయమంటారా? అధికారంలోకి వచ్చేందుకు ఈ ధర్నా చౌక్ చాలా మందికి ఉపయోగపడిందన్న విషయాన్ని విస్మరిస్తే ఎలా?’అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. ధర్నాచౌక్ కోసం గుర్తించిన ప్రాంతాలు, అక్కడ కల్పించిన సౌకర్యాల వంటి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే చివరి అవకాశమని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఆ రోజున ధర్నాచౌక్ వ్యవహారాన్ని తేల్చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి. రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బహిరంగ సభలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, ఊరేగింపులు తదితర కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయగా ఇదే అంశంపై విశ్రాంత ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించింది. ఈ రెండు వ్యాజ్యాలపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హనుమంతరావు తరఫు న్యాయవాది సి. దామోదర్‌రెడ్డి వాదిస్తూ ఎన్నో ఏళ్లుగా ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందుకే దానికి ధర్నాచౌక్ అని పేరు వచ్చిందని తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చౌక్ వద్ద ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి అనుమతివ్వడం లేదని, నగరానికి 25 కిలోమీటర్ల అవతల ధర్నాలు చేసుకోవాలని చెబుతోందని వివరించారు. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె. రామచంద్రరావు స్పందిస్తూ శంషాబాద్, షామీర్పేట, జవహర్‌నగర్, మేడిపల్లి తదితర ప్రాంతాలను ధర్నాల కోసం ప్రాథమికంగా ఎంపిక చేశామని, వాటి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు, ఇతర నిరసన కార్యక్రమాలు చేపడుతుండటం వల్ల స్థానికులకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. చెరువుల దగ్గర ఇళ్లు కట్టుకుని.. నీళ్లు ఇళ్లల్లోకి వస్తున్నాయంటే ఎలా? ఈ సందర్భంగా ధర్మాసం స్పందిస్తూ ‘ఎప్పటి నుంచో ఉన్న చెరువు దగ్గరకు వచ్చి జనాలు ఇళ్లు కట్టుకుంటారు. ఆ తరువాత ఆ చెరువు వల్ల వర్షాకాలంలో నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని, దాన్ని పూడ్చేయాలని అడుగుతారు. మీరు చెప్పేది కూడా అలాగే ఉంది. ఇందిరాపార్క్ ఎప్పటి నుంచో ఉంది. ఆ తరువాతే దాని చుట్టుపక్కల ఇళ్లు వచ్చాయి. ఇది భారతదేశం. ఇక్కడ నిరసన గళాలను అణచివేస్తామంటే కుదరదు. ధర్నాలు, నిరసన కార్యక్రమాల వల్ల ఇబ్బంది కలుగుతుందనుకుంటే అర్థవంతమైన ఆంక్షలు విధించాలి. అంతేతప్ప నిషేధం విధిస్తామంటే ఎలా? ఎక్కడో 50 కిలోమీటర్ల దూరానికి వెళ్లి ధర్నాలు చేసుకోమనడం ఎంత వరకు సబబు? సెల్‌ఫోన్ టవర్లను అడవుల్లో పెట్టడం వల్ల ప్రయోజనం ఏముంటుంది. సింహాలు, పులులు సెల్ఫోన్లు వాడవు కదా. అందుకే మనుషులు ఉండే చోటే సెల్‌టవర్లు పెట్టాలి. అలాగే ధర్నాచౌక్‌లు కూడా. జనాల మధ్యలో కాకుండా రిషీకేశ్‌లో ధర్నాలు చేసుకోమంటారా?’అంటూ ప్రశ్నించింది. ధర్నాచౌక్ వద్ద ధర్నాలు, ఆందోళనలు, ఇతర నిరసన కార్యక్రమాలపై నిషేధం విధించడం ఏమాత్రం సబబు కాదని ధర్మాసనం ప్రాథమికంగా అభిప్రాయపడింది. 2017లో దాఖలైన వ్యాజ్యంలో ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించింది. చివరి అవకాశం ఇస్తున్నామని, తదుపరి విచారణ నాటికి కౌంటర్ దాఖలు చేసి తీరాలని స్పష్టం చేసింది. ధర్నాల కోసం పలు ప్రాంతాలను ఎప్పటిక చేశామని చెబుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని, వాటిని పరిశీలించి తదుపరి విచారణలో తగిన ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా, వాదనల సందర్భంగా రిటైర్డ్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు బిగ్గరగా మాట్లాడటంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘ఈ కేసులో మీరు పిటిషనర్ కాదు. మీరు రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించి విచారణ జరుపుతోంది. లేఖ రాయడంతో మీ పని ముగిసింది. మీరు ఏ రకంగానూ జోక్యం చేసుకోవడం సాధ్యం కాదు’అని తేల్చిచెప్పింది. దీంతో ఆయన వాదనలు ముగిసే వరకు మౌనంగా ఉన్నారు. -
నగరంలో అగ్నిప్రమాదం..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఇందిరాపార్క్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. డంపింగ్ యార్డ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది 5 ఫైరింజన్లతో మంటలను అర్పేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ధర్నాచౌక్‌తో ఇబ్బంది లేదు
►ఇది ప్రజాభిప్రాయం.. ►దీనివల్ల స్థానిక చిరు వ్యాపారులకు ఉపాధి ►ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ చాడ వెంకటరెడ్డి కవాడిగూడ: ఇందిరాపార్కు వద్ద గల ధర్నాచౌక్‌తో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, దీనివల్ల స్థానికంగా చిరు వ్యాపారాలు చేసుకునేందుకు ఉపాధి దొరుకుతోందని ఇందిరా పార్కు పరిసరాల బస్తీ ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అదివారం ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, టీజేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు పరిసరాల బస్తీ ప్రజల అభిప్రాయల సేకరణకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా భీమమైదానం, తాళ్లబస్తీ, ఎల్ఐసీ కాలనీ, బండమైసమ్మ బస్తీ, అంబేడ్కర్‌నగర్ తదితర బస్తీల్లో ఇంటింటికి వెళ్లి ధర్నాచౌక్‌తో గల ఇబ్బందులను అడిగారు. దీంతో స్థానికులు పైవిధంగా స్పందించారు. ప్రజలు తమ బాధలు చేప్పుకునేందుకు అనేక సంవత్సరాలుగా ధర్నాచౌక్‌కు వస్తున్నారని, వారివల్ల ఇబ్బందులు లేవన్నారు. ఇందిరాపార్కు వద్దనే ధర్నాచౌక్‌ను కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ చాడ వెంకటరెడ్డి, కో–కన్వీనర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు, సీపీఎం నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్, న్యూడెమోక్రసీ నాయకురాలు, ఐఎఫ్టీయూ రాష్ట్ర సహయ కార్యదర్శి జి.అనురాధ, ఝాన్సీ మాట్లాడారు. ప్రజాగొంతుకగా ఉన్న ధర్నా చౌక్‌ను నగర శివార్లకు తరిలించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. పోలీసులు, టీఆర్ఎస్ నేతలు కుట్రలో భాగమయ్యారన్నారు. ధర్నా చౌక్ తరలింపు వెనక రియల్ ఎస్టేట్ వ్యాపారుల హస్తం ఉందన్నారు. ప్రజలంతా ధర్నా చౌక్ ఇక్కడే కొనసాగాలని కోరుతున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవించాలని సూచించారు. దీనిపై అన్ని పార్టీల ప్రతినిధులను ఆహ్వానించి, అఖిలపక్షంతో సమాలోచనలు జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
హింస బాధ్యత సర్కారుదే!
స్పష్టం చేసిన ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ - ప్రభుత్వం అనుకూల, వ్యతిరేక వర్గాలకు ఒకేరోజు అనుమతి ఇచ్చింది - అనుకూల ధర్నా పేరిట వచ్చింది టీఆర్ఎస్ శ్రేణులు, మఫ్టీ పోలీసులే - పోలీసులు దాడిలో 35 మందికిపైగా తీవ్రంగా గాయాలయ్యాయి - ధర్నాచౌక్‌ను యథాతథంగా కొనసాగించాల్సిందే - కమిటీ నేతలు కోదండరాం, చాడ, తమ్మినేని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద సోమవారం జరిగిన హింసకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ స్పష్టం చేసింది. ఈ అంశంపై అనుకూల, వ్యతిరేక వర్గాల నిరసనలకు ఒకే రోజు ప్రభుత్వం అవకాశం కల్పించి రెచ్చ గొట్టిందని మండిపడింది. ధర్నాచౌక్ కొన సాగింపుపై రాష్ట్ర ప్రభుత్వ సానుకూల స్పంద న కోసం వారం పాటు వేచి చూస్తామని.. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది. సోమవారం ధర్నాకు ప్రభుత్వం అనుమతినిచ్చి అక్కడే టెంట్లు, కుర్చీలు, మంచినీళ్లు ఏర్పాటు చేసినందున.. అది ఇక ముందు కూడా కొనసాగుతుందని ఆశిస్తు న్నట్లు పేర్కొంది. ఈ ధర్నాకు సంఘీభావం ప్రకటించి, పాల్గొన్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీ, జనసేన నేతలకు ధన్య వాదా లు తెలిపింది. ధర్నాచౌక్ ఘటనపై సోమ వారం సాయంత్రం మగ్దూంభవన్‌లో పరి రక్షణ కమిటీ సమావేశమైంది. ఇందులో చాడ వెంకటరెడ్డి, ఆదిరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీర భద్రం, డీజీ నరసింహారావు (సీపీఎం), కోదండరాం, వెంకటరెడ్డి (టీజేఏసీ), సాది నేని వెంకటేశ్వరరావు, కె.గోవర్ధన్ (న్యూ డెమోక్రసీ–చంద్రన్న), పోటు రంగారావు, రమాదేవి (న్యూడెమోక్రసీ– రాయల), విమ లక్క (అరుణోదయ), రవిచంద్ (టీడీఎఫ్), నలమాస కృష్ణ (టీపీఎఫ్), పీఎల్ విశ్వే శ్వరరావు (ఆప్), తాండ్రకుమార్ (ఎంపీసీఐ– యూ), నరహరి (ఎస్‌యూసీఐ–సీ), కె.సజ య (సామాజిక కార్యకర్త) పాల్గొని చర్చిం చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ తీరు కుట్ర పూరితం ధర్నాచౌక్ విషయంలో ప్రభుత్వం వ్యవహ రించిన తీరును ఖండిస్తున్నామని చాడ వెంక టరెడ్డి చెప్పారు. తమ ధర్నాకు అనుమతి ఇచ్చి నట్లే ఇచ్చి... అనుకూల ధర్నా పేరిట తమ నిరసనను అణచివేయడానికి కుట్ర పన్నార న్నారు. సీఐ శ్రీదేవి, కొందరు కానిస్టేబుళ్లు మఫ్టీలో అనుకూల ధర్నాలో పాల్గొన్నారని, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, కార్యకర్తలు అందు లో చేరి ప్రణాళిక ప్రకారం వ్యవహరించారని చెప్పారు. ధర్నాచౌక్‌ను యథాతథంగా కొనసా గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అతి తెలివిగా వ్యవహరించడమే సోమవారం నాటి ఘటనకు కారణమని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ధర్నాకు అనుమతించాక అక్క డికి చేరుకోవడం తమ హక్కు అని.. దానిని ఉల్లంఘించిన పోలీసులపై చర్య తీసుకోవా లని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతలు అధికార గర్వంతో వ్యవహరిస్తున్నారని, తెలంగాణ సమాజానికి వారే క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. ఏసీపీ నర్సయ్య స్వయంగా లాఠీ పట్టుకుని కార్యకర్తలను కొట్టారని, ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు తనను విచక్ష ణారహితంగా కొట్టి, గాయపరిచారని సాది నేని వెంకటేశ్వర రావు తెలిపారు. మహిళలపై మగ పోలీసులు దాడి చేశారని విమలక్క చెప్పారు. అనుకూల ధర్నాకు టెంట్లు, సదు పాయాలు ఎవరు సమకూర్చారో చెప్పాల న్నారు. ధర్నాచౌక్‌తో మార్నింగ్ వాకర్స్‌కు ఇబ్బంది లేదని వారి సంఘం కూడా స్పష్టం చేసిందని డా.సుధాకర్ వెల్లడించారు. హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ముందుకు: కోదండరాం ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం, ఐక్యంగా పనిచేస్తామని.. టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రకటించారు. పోలీసులు ధర్నాకు అనుమతిచ్చామని చెప్పి.. నిర సనకారులను గొడ్లను బాదినట్లు బాదా రని మండిపడ్డారు. 35 మందికిపైగా గాయపడ్డారని, అందులో 12 మందికి తలకు దెబ్బలు తగలడంతో పాటు కాళ్లు, చేతులు విరిగాయని వెల్లడించారు. సోమ వారం నుంచి ధర్నాచౌక్‌ను ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘నాలుకలు కొస్తాం, తలకాయలు తీస్తా మన్న భాషే ప్రభుత్వంలోని వారికి వచ్చి న భాష’ అని విమర్శించారు. ఖమ్మం మిర్చి రైతులపై పెట్టిన రాజద్రోహం కేసును ఉపసంహరించు కోవాలన్నారు. -
ధర్నాచౌక్ ప్రజల ప్రాథమిక హక్కు: లక్ష్మణ్
హైదరాబాద్: ధర్నాచౌక్ రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కు దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ధర్నాచౌక్ వద్ద జరిగిన ఘటనలపై ఆయన స్పందిస్తూ.. స్థానికంగా ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా పరిమితితో కూడిన ధర్నా చౌక్‌ను కొనసాగించాలి. ప్రత్యామ్నాయ మార్గం చూయించాలి. ధర్నాచౌక్ అంశాన్ని అధికార పార్టీ రాజకీయం చేస్తోంది. తెలంగాణ కొరకు అనేక ఆందోళనలు, ఉద్యమాలు చేసిన అనుభవం ప్రజలకు ఉందని అన్నారు. -
ప్రభుత్వమే నడిపిస్తోంది: వీహెచ్
హైదరాబాద్: ధర్నా చౌక్ వద్ద కాలనీవాసులు ఎవరూ ఆందోళన చేయడంలేదని, ప్రభుత్వమే ఈ వ్యవహారాన్ని నడిపిస్తోందని కాంగ్రెస్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు అన్నారు. సోమవారం ఆయన జేఏసీ పిలుపు మేరకు మద్దతు తెలుపుతూ ఇందిరా పార్కులోని ధర్నాచౌక్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ధర్నాచౌక్ వద్ద బైఠాయించి సేవ్ ధర్నాచౌక్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం కావాలనే ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ ఏమీ తెలియనట్టుగా నటిస్తోందన్నారు. ఏదిఏమైనా ధర్నాచౌక్‌ను ఇక్కడి నుంచి తరలించకుండా అడ్డుకుంటామని ఆయన అన్నారు. -
ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత
-
ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : ఇందిరాపార్క్‌లోని ధర్నాచౌక్ సోమవారం పోటాపోటీ ఆందోళనతో దద్దరిల్లింది. ధర్నా చౌక్ తరలింపుపై అనుకూల, ప్రతికూల వర్గాల నినాదాలతో హోరెత్తింది. ధర్నాచౌక్ తరలింపును నిరసిస్తూ టీజేఏసీ చేపట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అలాగే ధర్నాచౌక్ తరలించాలంటూ స్థానిక కాలనీవాసులు చేపట్టిన ఆందోళనకూ పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఈ రోజు ఉదయం టీ. జేఏసీ నేతలు, వామపక్షాల నేతలతో పాటు స్థానికులు కూడా ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగారు. ధర్నాచౌక్‌ను వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని స్థానికులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నినాదాలు చేస్తుండగా.. సీపీఐ కార్యకర్తలు ధర్నా చౌక్‌ను తరలించొద్దని పెద్ద ఎత్తున దూసుకురావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు కుర్చీలు, కర్రలు, జెండాలతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో స్థానికులకు పలువురు వాకర్స్‌కు గాయాలయ్యాయి. మఫ్టీలో ఉన్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ఇరు వర్గాల వారి నినాదాలు, దాడుల మధ్య ఇందిరాపార్క్ రణరంగాన్ని తలపిస్తోంది. కాగా ఇరు వర్గాలు సంయమనం పాటించి తమ సమస్యలను శాంతియుతంగా చెప్పుకోవాలని పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గత రెండు నెలలుగా ధర్నాచౌక్‌లో ఎలాంటి ఆందోళనలకు అనుమతి ఇవ్వడంలేదని... అయితే ఈ ఒక్క రోజు మాత్రమే అనుమతి ఇచ్చామని తెలిపారు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా... చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
‘ధర్నా చౌక్’పై నిర్ణయాన్ని ఉపసంహరించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లెక్కలేనన్ని ఉద్యమాలకు వేదికైన హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్దనున్న ధర్నా చౌక్ కోసం స్వరాష్ట్రంలో పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అభిప్రాయపడ్డారు. తాము కేవలం ధర్నా చౌక్ స్థలం కోసం ఉద్యమించడం లేదని, బాధిత ప్రజలు తెలిపే నిరసన హక్కు కోసం ఉద్యమిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ధర్నా చౌక్‌ను ఎత్తివేసే నిర్ణయం వాపసు తీసుకోవాలంటూ కోదండరాం నేతృత్వంలో అఖిలపక్షం నేతలు గురువారం డీజీపీ అనురాగ్ శర్మను కలసి విన్నవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జేఏసీ చేపట్టిన ఏ కార్యక్రమమూ విఫలం కాలేదని, ధర్నా చౌక్ విషయంలోనూ ప్రజలను చైతన్యవంతులను చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వివిధ వర్గాల ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాలను నిరసనలుగా వ్యక్తపరిచే హక్కు ఇన్నాళ్లూ ధర్నా చౌక్ వద్దే సాగిందని, భవిష్యత్తులోనూ అక్కడే కొనసాగాలని తాము పోరాటం చేస్తున్నామన్నారు. ఈ విషయం ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఉద్యమించాల్సిన దుస్థితి ఏర్పడిందని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నా చౌక్‌ను కొనసాగించాలని డీజీపీని కోరామని, ఈ నెల 15లోగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. లేకుంటే చలో ధర్నా చౌక్ చేపడతామని, లాఠీ దెబ్బలు, పోలీసు తూటాలకు భయపడే ప్రసక్తే లేదని కోదండరాం తేల్చిచెప్పారు. ధర్నా చౌక్ పరిరక్షణలో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు గన్‌పార్క్ వద్ద ఆందోళన నిర్వహిస్తామని, దీనికి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా జరిపితీరుతామని ఆయన స్పష్టం చేశారు. అఖిలపక్షంలో మాజీ మంత్రి, టీడీపీ నేత బోడ జనార్దన్, కాంగ్రెస్ నేతలు బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్, సీపీఐ నేత మల్లెపల్లి ఆదిరెడ్డి, సీపీఎం తరఫున నర్సింహారావు, జేఏసీ కో కన్వీనర్ బైరి రమేష్, కో చైర్మన్ పురుషోత్తం, పీఓడబ్ల్యూ సం«ధ్య, ప్రజాఫ్రంట్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బతుకు.. బర్బాద్!
ధర్నాచౌక్ తరలింపు నిర్ణయంతో చితికిన బడుగు జీవితాలు అది వేనవేల గొంతుకల ధిక్కార ప్రాంతం.. సంఘటిత, అసంఘటిత కార్మికుల సమ్మె హక్కుకు చిరునామా.. విద్యా ర్థుల బిగిపిడికిలి బావుటా.. మహిళా సంఘాలు, ఆశవర్కర్లు, నిరుద్యోగులు, ఉద్యోగుల హక్కుల ప్రకటనకు వేదిక.. అదే కూతవేటు దూరంలోని పాలకుల చెవిని సోకేలా నినదిస్తూ నిత్య సందడితో కనిపించే ధర్నాచౌక్!! ధర్నాచౌక్‌ను నగర శివార్లకు తరలించాలన్న నిర్ణయంతో.. ఆ గల్లీతో పెనవేసుకున్న పేదల బతుకులిప్పుడు బజారున పడ్డాయి. నినాదాలతో పొడిబారిన గొంతులకు నిమ్మకాయ సోడా ఇచ్చే యాదగిరి బండి, కొబ్బరినీళ్లతో సేదదీర్చే రాజరాజేశ్వరి, నినాదాలను మోసుకొచ్చే ఫ్లెక్సీ బాయ్ లింగస్వామి, నినాదాలను ప్రతిధ్వనించే ఎస్డీఎస్ సౌండ్ సిస్టమ్ ఇబ్రహీం, వైఎస్సార్ పాదయాత్ర మొదలుకొని, కేసీఆర్, కల్వకుంట్ల కవిత, హరీశ్‌రావు లాంటి ఎందరో రాజకీయ నేతలకు 16 ఏళ్లుగా తన టెంట్‌తో నీడనిచ్చిన సాయి టెంట్ హౌజ్ వెంకటేశ్, ఎండనకా, వాననకా అతిచౌకగా అన్నం వండి వార్చి ఉద్యమకారుల ఆకలి తీర్చిన సాయి తిరుమల మెస్, జైభవానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, సలీం బజ్జీ బండి, రాజేశ్ చాయ్బండి, పాన్‌షాప్ గణేశ్, టీ వాలాలు, సిగరెట్ టేలాలూ అన్నీ ఇప్పుడు ధర్నా చౌక్తోపాటే మూగబోయాయి! మూసివేతకు దగ్గరగా ఉన్నాయి. వారి అరిగోసకు అక్షర రూపం ఈ కథనం... – సాక్షి, హైదరాబాద్ పని దొరుకుడు కష్టమైంది మాది భువనగిరి దగ్గర జంపల్లి. ఇంటర్ వరకు చదివిన. ముగ్గురు చెల్లెళ్లు, అమ్మను నేనే చూడాలి. నాన్న లేరు. పనికోసం హైదరాబాద్‌కొచ్చిన. పొద్దున 8 నుంచి సాయంత్రం 8 వరకు ధర్నాచౌక్‌లో ఫ్లెక్సీలు ఫిట్ చేయడం నా పని. అందుకు మా ఓనర్ నాకు రోజుకి రూ.450 ఇస్తాడు. కానీ ఇప్పుడు పని దొరకడం కష్టంగా ఉంది. అప్పుడు నెలరోజులు దొరికేటిది.ఇప్పుడు పది రోజులే దొరుకుతంది. నాలాంటి కూలీలు వేలమంది ఉన్నారు. – లింగస్వామి, ఫ్లెక్సీ బాయ్ ఇప్పుడెక్కడికి పోవాలె? నేను వరంగల్ నుంచి వచ్చాను. 18 ఏళ్ల నుంచి ఈ ధర్నా చౌక్లనే ఉంటున్న. ఇప్పుడె క్కడికి పోవాలె? పొద్దునొచ్చి, రాత్రిదాక ఇక్కడే సోడాలు అమ్ముత. వైఎస్ గారి పాద యాత్రప్పుడు మొదటిసారిగా సోడా బండి కొనుక్కున్న. ధర్నాచౌక్ ఉన్నప్పుడు రూ.వె య్యి దాకా ఉండే గిరాకి ఇప్పుడు సగం కన్నా తక్కువైంది. ఏం జేయాల్నో తెలుస్తలేదు. – యాదగిరి, నిమ్మ సోడా బండి మా బతుకులే పోయినయ్ ధర్నాచౌక్ పోయినంక మా బతుకులే పోయినయ్. గరీబోల్లకి ఏం బిజినెస్ చేయొస్తదమ్మ? బజ్జీలేసుకున్డు దప్ప. గదిగూడ ఏసుకోకుంటైపాయె. ధర్నా చౌక్ ఉన్నప్పుడు పది కిలోల బజ్జీపిండితోని బజ్జీలేసేటోణ్ణి. ఇప్పుడు 2 కిలోల పిండి కూడా ఒడుస్తలేదు. – సలీం, బజ్జీ బండి నిర్వాహకుడు రోజుకు 800 వచ్చేవి.. నేను నడవ లేను. 85 శాతం వైకల్యంతో ఏం పనిచేయొస్తది? అందుకే ఫ్రెండ్ బండి దగ్గర చాయ్లమ్ము తున్న. అప్పుడు ధర్నా లు జేసేటోళ్ళు వచ్చేది కాబట్టి రోజుకి S 7, ఎనిమిదొందలొచ్చేటియి. ఇప్పుడు 200 కూడా దొరుకుతలేవు. – రాజేశ్, చాయ్బండి ఇక నా బిడ్డల ఇంజనీరింగ్ చదువు కలే ఇక్కడ పదహారేళ్లుగా టెంట్ హౌస్ నడుపుతున్నా. ఇన్ని రోజులు ధర్నాచౌక్‌ను నమ్ముకొని బతికిన. బిడ్డలిద్దరిదీ ఇంటర్ అయిపోయింది. కొడుకు టెంత్ అయింది. బిడ్డలని ఇంజనీరింగ్ చదివించాలను కున్నాను. కానీ ధర్నా చౌక్ ఎత్తేసినంక మొత్తం బతుకేపోయింది. దుకాణానికి రూ.5,500 అద్దె కూడా కట్టలేకపోతున్నాం. షాప్ ఎత్తేయాలనుకుంటున్నా. ఇక నా బిడ్డల ఇంజనీరింగ్ చదువు కలే. డిగ్రీలో చేర్పిస్తాన్న. కేసీఆర్, హరీశ్‌రావు, కల్వకుంట్ల కవిత అందరికీ టెంట్లు మోసినం. అయినా యిప్పుడు ఫాయిదా లేదు! – వెంకటేశ్, సాయిరాం టెంట్ హౌస్ బిజినెస్ మొత్తం పడిపోయింది మేం కూడా టీఆర్ఎస్సే. అయితే ధర్నాచౌక్ బోయినంక బిజినెస్ మొత్తం పడిపోయింది. రూ.40 ఇస్తే కడుపునిండా అన్నం పెట్టెటోళ్లం. రోజుకి నాలుగైదు వేలొచ్చేటియి. యిప్పుడు వెయ్యి కూడా బిజినెస్ జరగట్లేదు. – రాజు, జైభవానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇంటి కిరాయికి కూడా డబ్బులు రావడం లేదు మేమిద్దరం రోజంతా పనిచేస్తే ఐదారొందల కొబ్బరి బోండాలు అమ్మే వాళ్లం. ఇప్పుడు 100 కాయలు కూడా అమ్ముడుకావడం లేదు. ఇంటి కిరా యికి కూడా డబ్బులు రావడం లేదు. – రాజేశ్వరి, రాజబాబు కొబ్బరి బోండాం బండి మా షాపు నాయినే ఓపెన్ చేశారు ఇక్కడ మా నాన్న పాన్టేలా నడుపుతడు. గిరాకీ సగం పడిపోయింది. మేమంతా టీఆర్ఎస్సే. ఇప్పటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఈ షాప్ ఓపెన్ చేశారు. ధర్నా చౌక్ ఎత్తివేసినంక నష్టంమొస్తున్న మాట నిజమే. ప్రభుత్వం ఏంజేసినా ప్రజల కోసమే అని ఇంకా నమ్ముతున్నం. – గణేశ్, పాన్‌షాప్ -
ఇందిరాపార్కు ఆక్రమణ విజయవంతం చేయాలి
ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ధర్నాచౌక్ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఈ నెల 15న నిర్వహించనున్న ఇందిరా పార్కు ఆక్రమణను విజయవంతం చేయాలని భాగస్వామ్య పక్షాలు, ప్రజాసంఘాలు నిర్ణయించాయి. ఉద్యమంలో పాల్గొనే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు, సామాజిక సంఘాలు ధర్నాచౌక్ ఆక్రమణలో భాగస్వాములయ్యేలా చూడాలని తీర్మానించాయి. పోలీసులు అడ్డంకులు సృష్టించినా, నిర్బంధిం చినా పార్కును చేరుకొని ప్రజాకాంక్షను ప్రభుత్వానికి చాటాలని నిర్ణయించాయి. ఇందిరా పార్కు ఆక్రమణ కార్యాచరణపై మంగళవారం రాత్రి మఖ్దూంభవన్‌లో సమావేశం జరిగింది. ఇందిరాపార్కు నిరసనకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రజాసంఘాలు హెచ్చరించాయి. పార్కు ఆక్రమణకు అనుమతి కోరుతూ 11న డీజీపీని, 12న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలుసుకోవా లని తీర్మానించాయి. ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ 12న కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు గన్‌పార్కు అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలపాలని నిర్ణయించాయి. సమావేశంలో చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), ఎం.కోదండరాం (టీజేఏసీ), కె.గోవర్ధన్ (న్యూడెమోక్రసీ–చంద్రన్న), విమలక్క (అరుణోదయ) తదితరులు పాల్గొన్నారు. -
ధర్నాచౌక్ ప్రజా గొంతుక: చాడ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ను నిషేధించి అప్రకటిత అత్యవసర పరిస్థితిని సృష్టించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించకుండా నిషేధం విధించడంతో పాటు అక్కడ నిరసనలు తెలిపిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజా గొంతుకగా నిలిచిన ధర్నాచౌక్ పరిరక్షణలో భాగంగా శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ధర్నాచౌక్ కోసం దీర్ఘకాలిక ఉద్యమం
⇒ లెఫ్ట్, ప్రజాసంఘాల నిర్ణయం ⇒ నేడు ప్రజాసంఘాల నేతలతో సదస్సు సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నిరసనలకు అవకాశం కల్పించే వరకు వివిధ రూపాల్లో దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్ధం కావాలని వామపక్షాలు, ప్రజాసంఘాలు నిర్ణయించాయి. ఈ దిశలో ఉమ్మడి కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీగా ఏర్పడినా, రాబోయే రోజు ల్లో దానిని విస్తృతపరిచి కలిసొచ్చే శక్తులను భాగ స్వాములను చేయాలనే ఆలోచనతో ఉన్నాయి. ముం దుగా జిల్లాస్థాయిల్లో ధర్నాచౌక్ పరిరక్షణపై ప్రచార కార్య క్రమాలు నిర్వహించి, అన్ని జిల్లాలు, మండల స్థాయిల నుంచి ఈ ఉద్యమంలో వివిధ వర్గాలు పాల్గొనేలా చేయా లని వామపక్షాలు, ప్రజాసంఘాలు భావిస్తున్నాయి. దీనికి అనుగుణంగా అన్ని జిల్లాల్లో రౌండ్‌టేబుల్ సమావే శాలను నిర్వహించాలని నిర్ణయించాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రజాసంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఇతర బాధ్యులతో కూడిన రాష్ట్ర సదస్సును నిర్వహించనున్నారు. ఉమ్మడి కార్యాచరణ చేపట్టే దిశలో ఈ నెల 14 వరకు జిల్లాల్లో వివిధ రూపాల్లో కార్యక్రమాలను చేపట్టను న్నారు. 15 నుంచి వచ్చేనెల 9 వరకు మగ్దూంభవన్‌లో రిలే నిరాహారదీక్షల ద్వారా మద్దతును కూడగట్టాలని, మే 10న హైదరాబాద్ ఆక్రమ ణను చేపట్టాలని నిర్ణయించారు. ఇతర పార్టీల భాగస్వామ్యంపై భిన్నాభిప్రాయాలు... ఇదిలా ఉండగా ధర్నాచౌక్ పునరుద్ధరణ విషయంలో కాం గ్రెస్, బీజేపీ, టీడీపీలను కూడా కలుపుకుని పోవాలని గురువారం రాత్రి జరిగిన భేటీలో కొందరు సూచించినా దానిపై ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. ఈ సమస్యపై వామపక్షాలు, ప్రజాసంఘాలు పోరాడుతున్న విధంగానే ఇతర పార్టీలు కూడా కృషి చేస్తేనే విస్తృత ప్రాతిపదికపై కలవొచ్చునని సీపీఐ, సీపీఎం నాయకులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. -
ధర్నాచౌక్‌ను అక్కడే కొనసాగించాలి
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కువద్ద ఉన్న ధర్నాచౌక్‌ను అక్కడే కొనసాగించాలని మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ధర్నాచౌక్ తరలింపు యోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్లు పెంచాలంటూ ఢిల్లీలో పార్లమెంట్ సమీపంలోని జంతర్‌మంతర్ వద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ధర్నా చేద్దామంటూ చెప్పిన సీఎం.. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ధర్నాచౌక్‌ను నగర శివార్లలోకి తరలిస్తామంటే ఎలా అని శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నించారు. రిజర్వేషన్ల వల్ల నష్టం జరుగుతోందంటూ పోలీస్‌శాఖలో ఏసీపీ స్థాయి అధికారి వాట్సాప్ గ్రూప్‌లో సందేశం పెట్టడం తీవ్రమైన అంశమని, దీనిపై చర్య తీసుకోవాలని ఎమ్మెస్ ప్రభాకర్ కోరారు. ఇటువంటివి అత్యంత అభ్యంతరకరమని, ఈ వ్యాఖ్యలను చేసినట్లు తేలితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కడియం చెప్పారు. -
తరలిస్తే సహించం
బీజేపీ ఎమ్మెల్యేల హెచ్చరిక హైదరాబాద్: ఇందిరాపార్కు వద్దనున్న «ధర్నాచౌక్‌ను నగర శివార్లకు తరలిస్తే సహిం చమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ మండిపడ్డారు. ఇందిరాపార్కు వద్ద ధర్నాల నిషేధానికి నిరసనగా గురు వారం బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పాద యాత్ర నిర్వహించారు. బీజేపీ శాసన సభాపక్షనేత జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్ రావు ఇందిరాపార్కు నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేశారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి బీజం వేసిన ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ను తరలిస్తామంటే ఊరుకోబోమని, ఉద్యమా నికి ఊపిరిగా నిలిచిన పార్టీలను, ప్రజా సంస్థలను ఏకం చేసి పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరా టాలు చేస్తామన్నారు. ఎమ్మెల్యేలతో కలసి ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నాలు చేస్తా మని చెబుతున్న కేసిఆర్.. ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్‌ను ఎత్తివేయడం విడ్డూరంగా ఉందన్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పత్రికా స్వేచ్చను, ప్రజాస్వామ్యాన్ని హరించిన ఫలితంగా 1977 ఎన్నికలల్లో ఇందిరాగాంధీకి ప్రజలు ఎలాంటి గుణ పాఠం చేప్పారో గుర్తుచేశారు. ధర్నాచౌక్‌పై నిషేధాన్ని వెంటనే ఉపసంహ రించుకో వాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజాగ్రహనికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. -
ధర్నాచౌక్‌ను కొనసాగించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజల సమస్యలపై నిరసన వ్యక్తంచేయడానికి కూడా అవకాశం లేకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అఖిలపక్ష నేతలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు గురువారం గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో జంతర్‌మంతర్ దగ్గర ధర్నా చేస్తామని సాక్షాత్తూ శాసనమండలిలోనే చెప్పిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, రాష్ట్రంలో మాత్రం ఇందిరాపార్కు దగ్గర ధర్నాచౌక్ లేకుండా చేయాలని నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని వారు గవర్నర్‌కు విన్నవించారు. ఈ బృందంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి (టీపీసీసీ అధ్యక్షుడు), కె.లక్ష్మణ్ (బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు), ఎల్.రమణ (టీటీడీపీ అధ్యక్షుడు), చాడ వెంకటరెడ్డి (సీపీఐ రాష్ట్ర కార్యదర్శి), నాగయ్య(సీపీఎం), కె.శివకుమార్ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), ఆర్.కృష్ణయ్య(ఎమ్మెల్యే), మంద కృష్ణమాదిగ (ఎంఆర్పీఎస్), గోపాలశర్మ,, ఇటిక్యాల పురుషోత్తం (తెలంగాణ జేఏసీ), వెంకటేశ్వర్రావు (న్యూ డెమొక్రసీ), టి.కుమార్ (ఎంసీపీఐ– యూ), జానకి రాములు (ఆర్ఎస్పీ), బండా సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్) తదితరులు ఉన్నారు. ప్రజా సమస్యలపై నిరసన తెలియజేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగ పరిరక్షకునిగా గవర్నరుపై ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంకోసం ఇందిరాపార్కు దగ్గర వందలకొద్ది సభలు, సమావేశాలు, నిరసన దీక్షలు జరిగాయని అఖిలపక్షం నేతలు గవర్నర్‌కు వివరించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతున్నదనే కుంటి సాకుతో ధర్నాచౌక్‌ను ఇందిరా పార్కువద్ద లేకుండా చేయాలని ప్రభుత్వం ప్రయ త్నిస్తున్నదన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బేగంపేటలోని క్యాంపు కార్యాల యానికి వేలమందిని తరలించారని, దానికి ట్రాఫిక్ అంతరాయం కలుగలేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించాచు. రాష్ట్రంలో 25 ఏళ్లుగా జరిగిన నిరసనలకు సంబంధించిన ఫోటోలను, క్లిప్పింగులను మంద కృష్ణ మాదిగ గవర్నర్‌కు చూపించారు. ధర్నాచౌక్‌ను తరలించవద్దని, శాంతియు తంగా జరిగే నిరసనలకు అవకాశం కల్పించాలని కోరారు. -
‘గొంతెత్తే హక్కు కోల్పోయేలా కనిపిస్తోంది’
హైదరాబాద్: ‘సమస్యలను చెప్పుకోవడం, సర్కారుపై నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. ఆ హక్కును కాలరాసే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు. కానీ రాష్ట్రంలో ప్రజల హక్కులను నిర్భందించే ప్రయత్నం జరుగుతోంది. ఇది మంచి సంకేతం కాదు. ఎన్నో పోరాటల ఫలితంగా ఇందిరాపార్క్ వద్ద నిరసనలు, ధర్నాలు చేసుకోవడానికి అవకాశం దక్కింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నాచౌక్‌ను ఎత్తేస్తాం.. అవేవో నగర శివారు ప్రాంతాల్లో చేసుకొండి అంటే కుదరదు. ఈనెల 23న ఇందిరాపార్క్ వద్ద భారీ సదస్సు నిర్వహిస్తున్నాం. వచ్చే వాళ్లంతా బోనాలు, బతుకమ్మలు, పీర్లు, వృత్తుల చిహ్నాలతో హాజరు కావాలి. సగటుపౌరుడి బలమేంటో ప్రభుత్వానికి తెలియజేయాలి.’ అని తెలంగాణ ఐక్య కార్యచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. ధర్నాచౌక్ పరిరక్షణపై బుధవారం మక్ధూంభవన్లో వామపక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ.. ‘జేఏసీ ఆధ్వర్యంలో రైతు దీక్ష కోసం అనుమతి అడిగితే పోలీసులు నిరాకరించారు. నిర్వాసితుల దీక్ష అంటే అందుకూ అనుమతి ఇవ్వలేదు. ఇక నిరుద్యోగ సభకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు తీసుకున్నారు. అనుమతి కోసం పోలీసులను సంప్రదిస్తే పొద్దంతా వేచి చూడాల్సిన పరిస్థితి. తీరా అంతసేపు ఎదురుచూస్తే రాత్రికి వచ్చి అనుమతి ఇవ్వడం లేదు అని తాపీగా చెప్తారు. తెల్లారి కార్యక్రమం చేసుకోనీయకుండా చేస్తున్నారు. ఇదంతా ఒక రకమైన అణిచివేతలా కనిపిస్తోంది.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సామాన్యుడు గొంతెత్తే హక్కును సైతం కోల్పోయేలా కనిపిస్తోందని, ఇందిరాపార్క్ వద్ద నిరసన వ్యక్తం చేసుకోవద్దనడం సరైన నిర్ణయం కాదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈనెల 23న చేపట్టే కార్యక్రమానికి అన్ని వర్గాలు హాజరు కావాలన్నారు. అక్కడే వంటా-వార్పు చేపట్టాలని, కళాకారులతో ఆటా-పాటా, ధూంధాం కూడా ఉంటుందన్నారు. కార్యక్రమానికి వచ్చే వాళ్లంతా జాతీయ జెండాతో పాటు తెలంగాణ ప్రతీకలైన చిహ్నాలను వెంట తెచ్చుకోవాలన్నారు. జిల్లాస్థాయిలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. -
‘ధర్నాచౌక్ అంటే ప్రభుత్వానికి భయమెందుకు?’
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజారంజకమైన పాలన సాగుతున్నట్లయితే, ఇందిరాపార్క్ వద్ద ధర్నాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో చెప్పాలని శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అధికార పక్షాన్ని ప్రశ్నించారు. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మండలిలో పలు అంశాలపై విపక్ష నేతలు మాట్లాడుతూ అధికారపక్షాన్ని ఇరుకున పెట్టారు. ఎమ్మెల్సీ పొంగులేటి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు రుణమాఫీ పూర్తిగా అమలుకాకపోవడంతో రైతులకు సకాలంలో రుణాలు అందక, పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించక నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మరోవైపు అంతా ఫీల్‌గుడ్ అన్నట్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించిందని దుయ్యబట్టారు. ధర్నాచౌక్‌ను వేరే ప్రాంతానికి తరలించాలని భావించడం ఏరకమైన ప్రజాస్వామ్యమో ప్రభుత్వం చెప్పాలన్నారు. -
మార్పుపై పునరాలోచించాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్‌ను మరో చోటికి మార్చే విషయంపై పునరాలోచించాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి లేఖ రాశారు. ధర్నాచౌక్‌ను అక్కడే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ధర్నాచౌక్‌ను నగర శివార్లలోని ప్రాంతాలకు తరలిస్తే ధర్నాలు, నిరసనల ద్వారా ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అవకాశం లేకుండా పోతుందన్నారు. రాష్ట్రం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా, సీఎంను ప్రత్యక్షంగా కలసి వినతులు సమర్పించే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ వాస్తవ విషయాలను గుర్తించాలని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను గుర్తించక ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం మంచి పద్ధతి కాదన్నారు. -
మూగబోయిన ‘ధర్నాచౌక్’
ఇందిరాపార్కు వద్ద నిరసనలకు అనుమతులివ్వని పోలీసులు ⇒ రాజధాని చుట్టూ నాలుగు ప్రాంతాల గుర్తింపు సాక్షి, హైదరాబాద్: రాజధానిలో నిరసనలకు కేరాఫ్‌గా ఉన్న ధర్నాచౌక్ మూగబోయింది. ఇక్కడ ధర్నాలు నిర్వహించుకోవడానికి పోలీ సులు అనుమతులు నిలిపివేశారు. నగరానికి నాలుగు వైపులా... కాప్రాలోని జవహర్‌నగర్, ఘట్కేసర్ సమీపంలోని ప్రతాప్ సింగారం, దుండిగల్ వద్ద గండిమైసమ్మ, శంషాబాద్ల్లో ‘ధర్నాచౌక్స్’ఏర్పాటు చేశారు. ఆందోళనకా రులను అక్కడికే పంపిస్తున్నారు. అనుమతు లు కూడా ఆయా ప్రాంతాల అధికారుల నుంచే తీసుకోవాల్సిందిగా స్పష్టం చేస్తున్నారు. ప్రత్యేక ఉత్తర్వులు లేకుండానే... ఇందిరాపార్క్ సమీపంలో నిరసనలు చేసు కోవడానికి ప్రత్యేకంగా ధర్నాచౌక్‌కు కేటాయి స్తున్నట్లు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ జీవో కానీ, ఆదేశాలు కానీ ఇవ్వలేదు. రాజధాని కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నిరసనకారులకు సచివాలయం వద్దే నిరసలు తెలిపేవారు. అయితే దీనికి ఓ వేదిక కావాలనే ఉద్దేశంతో 1996–97ల్లో ఇందిరాపార్క్ పక్కనున్న 40–50 ఎకరాల గ్రౌండ్‌ను ఎంపిక చేశారు. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే ఇది ధర్నా చౌక్‌గా మారిపోయింది. ఇందిరాపార్క్ ఎదురుగా ఎన్టీఆర్ స్టేడియం నిర్మించిన తర్వాత వివాదం రేగింది. కొందరు ఆ ప్రాంతంలో నిరసనల నిర్వహణపై న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు అక్కడ రాజకీయ పార్టీల సభలకు అనుమతి ఇవ్వద్దం టూ ఆదేశించింది. ఈ పరిణామం తర్వాత ఇందిరాపార్క్–ఎన్టీఆర్ స్టేడియం మధ్య ప్రాంతాన్ని 2002లో ధర్నా చౌక్‌గా ఎంపిక చేసిన పోలీసులు అక్కడే నిరసనలకు అనుమతులు ఇస్తూ వచ్చారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో... గత పదిహేనేళ్లలో ధర్నాచౌక్ చుట్టపక్కల జనా వాసాలు, ట్రాఫిక్ గణనీయంగా పెరిగిపోయా యి. అనేక కార్యాలయాలు, ఆస్పత్రులు వెలి శాయి. దీంతో ఇక్కడ ఆందోళనప్పుడు స్థాని కులకు ఇబ్బందులు తప్పట్లేదు. సమీపంలోని ఎల్ఐసీ కాలనీ వాసులు దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. కొన్నిసార్లు పోలీసులు రోడ్లు మూసేస్తుండటంతో రాకపోకలూ సాధ్యం కావట్లేదని మెరపెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్‌లో ఉంది. వీటన్నింటినీ బేరీజు వేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని ఎంపిక చేయాల్సిందిగా పోలీసు విభాగాన్ని ఆదేశించింది. అందరికీ అందుబాటులో ఉండేలా... నగర శివార్లలో ధర్నాచౌక్ కోసం ఒకే ప్రాం తంలో 30–40 ఎకరాల స్థలం ఎంపిక చేయా లని పోలీసు విభాగం తొలుత భావించింది. అయితే ఏదో ఓ పక్కన ఉంటే మిగిలిన వైపు జిల్లాల నుంచి వచ్చే వారికి ఇబ్బందని కొందరు అధికారులు వాదించారు. దీంతో నగరానికి నాలుగు వైపులా 20 నుంచి 25 కిమీ దూరంలో ఉన్న జవహర్‌నగర్, ప్రతాప్ సింగారం, గండిమైసమ్మ, శంషాబాద్‌లో అనువైన ప్రాంతాలను గుర్తించారు. ఒక్కో ప్రాంతం విస్తీర్ణం గరిష్టంగా ఐదెకరాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రశ్నించే గొంతును మూయడం అసాధ్యం... చీమల దండుని నిలిపివేసేందుకు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా అన్ని అడ్డుగోడలను దాటుకొని చీమలు చేరాల్సిన చోటుకి చేరుకుంటాయి. ఇది సహజ సూత్రం. అలాగే ధర్నా చౌక్ తరలించి, ప్రశ్నించే గొంతులను మూయడం అసాధ్యమైన విషయం అని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. ధర్నా చౌక్‌ని మార్చడం భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధం. – కోదండరాం, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రాథమిక హక్కులకు భంగం ప్రజల్లో ఉన్న నిరసన కారణాలను తెలుసు కొని వాటిని పరిష్కరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి అవసరం. ప్రజల అసంతృప్తిని అణచివేయాలని చూడడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కలకు వ్యతిరేకం. నిరంకుశం. – జీవన్‌కుమార్, మానవ హక్కుల సంఘం హింస వైపు ఉసిగొల్పడమే... రాజధానిలో కాకుండా పక్క జిల్లాలకు ధర్నా చౌక్‌ని మార్చడమంటే ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను కనీసం వినడానికి కూడా సిద్ధంగా లేనట్టు. నిరసనను తెలిపే హక్కుకూడా లేకుండా చేసి, హింసవైపు వుసిగొల్పడమే. – నారాయణరావు, పౌరహక్కుల సంఘం నిరసన హక్కును హరించడమే... ఇది ప్రజాస్వామికంగా నిరసన తెలిపే హక్కుని హరించడమే. ఉద్యమాల కారణంగానే తెలంగాణ వచ్చింది. నాడు చంద్రబాబు జన సంచారంలేని ఇందిరాపార్కుకి ధర్నాచౌక్‌ను మార్చారు. కేసీఆర్ ప్రభుత్వం మరింత అసహనాన్ని ప్రదర్శించడం దుర్మార్గం. – సంధ్య, ప్రగతిశీల మహిళా సంఘం -
ఫుట్‌పాత్‌పై ప్రసవ వేదన
అక్కడే ఆడ శిశువుకు జన్మనిచ్చిన మహిళ హైదరాబాద్: అర్ధరాత్రి వేళ బంధువుల ఇంటికి వెళ్లేందుకు వచ్చిన ఓ నిండుచూలాలికి పురిటి నొప్పులు వచ్చాయి. స్థానికులు 108కి సమా చారమందించారు. అనంతరం ఆమె పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు సమీపంలో నివాసం ఉండే జ్యోతి(24) నల్లకుంటలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు శుక్రవారం రాత్రి బయలుదేరింది. రాత్రి 11.10కి నల్లకుంట చేరుకోగానే.. ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో చౌరస్తా సమీపంలోని ఓ స్వీట్ షాప్ వద్ద ఫుట్‌పాత్‌పై కూలబడిపోయింది. నొప్పులతో ఇబ్బందిపడుతున్న ఆమెను చూసిన ఇద్దరు యువకులు పోలీసులు, 108కి సమాచారమందించారు. 108 సిబ్బంది, రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు మహిళల సహకారంతో జ్యోతి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
ధర్నా శివార్..!
► ధర్నా చౌక్‌ను నగర శివారుకు మార్చాలని పోలీసు శాఖకు ప్రభుత్వ ఆదేశం ► ఇందిరాపార్క్ వద్ద 16 ఏళ్లుగా సాగుతున్న నిరసనల ప్రస్థానానికి త్వరలో తెర ► శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ సమస్య నేపథ్యంలోనే.. ► 30 ఎకరాల్లో ప్రత్యామ్నాయ ప్రదేశం గుర్తించాలని సూచన ► మియాపూర్, ఉప్పల్, నాగోల్, రాజేంద్రనగర్‌లలో పోలీసుల స్థలాన్వేషణ ► అన్ని సదుపాయాలతో నిరసనలు జరుపుకునేలా ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్ : వివిధ వర్గాల ప్రజలు రాజధానిలో తమ నిరసన గళం వినిపించేందుకు చిరునామాగా నిలిచిన ఇందిరాపార్క్ ధర్నా చౌక్ ప్రాంతం త్వరలో మూగబోనుంది. విద్యార్థి, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయ, ప్రజాసంఘాలు ధర్నాలు, ఆందోళనలు జరుపుకునేందుకు ఉన్న వేదిక మరోచోటుకు తరలివెళ్లనుంది. హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిరక్షణ, పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నగరం మధ్యలో ఉన్న ధర్నా చౌక్‌ను నగర శివారుకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా త్వరితగతిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ధర్నా చౌక్ కోసం ఇతర ప్రాంతాల్లో స్థలం వెతికే పనిలో నిమగ్నమయ్యారు. 16 ఏళ్లుగా అదే వేదిక... ఉమ్మడి ఏపీలో 2000 సంవత్సరం వరకు సచివాలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలోనే ఆందోళనలు జరిగేవి. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారం కోసం అక్కడే నిరసన తెలిపేవారు. అయితే చంద్రబాబు హయాంలో సచివాలయం వద్ద ధర్నాలు, ఆందోళనలు చేయకూడదంటూ ఆదేశించి మరోచోటుకు తరలించాలని పోలీసు శాఖను ఆదేశించారు. దీంతో ఇందిరాపార్క్, ఎన్టీఆర్ స్టేడియం పరిసరాల్లో తమ అనుమతితో ధర్నాలు, నిరసనలు చేసుకోవచ్చని అప్పటి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందిరాపార్క్–డీబీఆర్ మిల్స్ రోడ్‌ను ధర్నా చౌక్‌గా ఏర్పాటు చేశారు. ఉద్యమాలు, నిరసనలు అక్కడే జరిగేవి. ఇలా దాదాపు 16 ఏళ్లుగా కొనసాగుతున్న ధర్నా చౌక్ ప్రస్థానం అతి త్వరలో ఇందిరా పార్క్ వద్ద ముగియనుంది. నగర శివారులో 30 ఎకరాల్లో... సచివాలయం, అసెంబ్లీ, డీజీపీ.. ఇలా ప్రభుత్వంలోని కీలక విభాగాలన్నీ సెంట్రల్ జోన్ పరిధిలోనే ఉన్నాయి. ఈ పరిధిలోనే ధర్నాల ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకునేలా నిరసనకారులు ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేవారు. అయితే ఇక ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్‌ను తరలిస్తే ఎక్కడ పెడతారన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో మియాపూర్, నాగోల్, ఉప్పల్, ఎల్బీ నగర్, సాగర్ రోడ్, రాజేంద్రనగర్, నార్సింగి తదితర ప్రాంతాల్లో ధర్నా చౌక్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రాంతాలను గుర్తిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 25 నుంచి 30 ఎకరాల్లో ధర్నా చౌక్‌ను విశాలంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు, బహిరంగ సభలు, రౌండ్ టేబుల్ సమావేశాలు.. ఇలా ప్రతి కార్యక్రమాన్నీ అన్ని సదుపాయాలతో అక్కడే నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. అయితే ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వాధికారులకు సమస్యలు చెప్పుకునేందుకు ఉన్న ‘దగ్గరి ప్రాంతం’ నుంచి శివారుకు ధర్నా చౌక్‌ను తరలించాలనుకోవడంపై కొంత నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ధర్నా చౌక్‌ను ఇందిరా పార్క్ వద్ద నుంచి తరలించాలా లేక అదే ప్రాంతంలో కొనసాగాలించాలా అనే అంశంపై గతంలో మూడు అసెంబ్లీ హౌస్ కమిటీలు ఏర్పాటైనప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయాయి. గతంలోనే హైకోర్టులో పిటిషన్... ఇందిరాపార్క్ వద్దనున్న ధర్నా చౌక్ వల్ల తమకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నిత్యం పోలీసు చర్యలతో విసిగిపోతున్నామని ఆ ప్రాంత సమీపంలోని ఎల్ఐసీ కాలనీ అసోసియేషన్ గతంలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆందోళనల సమయంలో పోలీసులు అక్కడి రోడ్డు మార్గాన్ని మూసేస్తుండటం వల్ల తాము ఇళ్లకు వెళ్లేందుకు గుర్తింపు కార్డులు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాలనీ అసోసియేషన్ తమ పిటిషన్లో పేర్కొంది. అందువల్ల ధర్నా చౌక్‌ను తమ నివాసాల పరిసరాల నుంచి తరలించాలని కోర్టును కోరింది. దీనిపై పోలీసు శాఖ కౌంటర్ వేసినా హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ఎల్ఐసీ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. -
లవ్‌కు నో ఎంట్రీ
నిత్యం వందలాది ప్రేమ జంటలతో కళకళలాడే ఇందిరాపార్కు వాలంటైన్ డే నాడు మాత్రం వెలవెలబోయింది. సాధారణ రోజులల్లో ఇక్కడి ప్రతి చెట్టు, పుట్ట వద్ద జంటలే ప్రేమ కబుర్లలో మునిగితేలేవారు. మంగళవారం పార్కు నిర్వాహకులు, పోలీసులు సైతం ప్రేమ జంటలకు అనుమతిని నిరాకరించి, బందోబస్తు ఏర్పాటు చేయడంతో పార్కు కళతప్పింది. – కవాడిగూడ జంటలు లేవాయె.. నిత్యం ప్రేమ జంటలతో నిండిపోయే బంజారాహిల్స్‌లోని జలగం వెంగళరావు పార్కు సైతం మంగళవారం కళ తప్పింది. పార్కుల్లో తిరిగే ప్రేమ జంటలకు పెళ్లి చేస్తామంటూ భజరంగ్‌దళ్ హెచ్చరికల నేపధ్యంలో జంటలు ఇటువైరు వచ్చేందుకు సాహసించలేదు. – బంజారాహిల్స్ వాలంటైన్ డేను పురస్కరించుకుని మంగళవారం పార్కులు కళ తప్పితే.. నెక్లెస్ రోడ్డు మాత్రం ప్రేమ జంటలతో కళకళలాడింది. అక్కడి పచ్చికపై కూర్చుని కబుర్లాడుకుని.. సెల్ఫీలు దిగారు. కేక్ కట్చేసుని, బహుమతులు ఇచ్చిపుచ్చుకుని ఆనందం పంచుకున్నారు. -
పోలీసులు వేధిస్తున్నారు: కోదండరామ్
-
పోలీసులు వేధిస్తున్నారు: కోదండరామ్
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు జరిగిందే ఉద్యోగాల కోసం.. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదని విమర్శించారు. ఇప్పటివరకు కేవలం 15 వేల ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కోచింగ్ తీసుకున్న యువత ఇంటికి వెళ్ళలేక.. ఇక్కడ ఉండలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి అనేక సార్లు తెలియ చేసినా లాభం లేకుండా పోయిందన్నారు. ఈ నెల 22 న నిరుద్యోగులతో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులతో కలిసి సభ నిర్వహిస్తామని చెప్పారు. నిరుద్యోగులు ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో పోలీసుల తీరు సరిగా లేదన్నారు. జేఏసీ నాయకులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇలాంటి చర్యకు పాల్పడడం శోచనీయమన్నారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఇలాంటివి ఎన్నో చూశాం.. మేము భయపడేవాళ్లం కాదన్నారు. సమాజంలో ఎవరైనా సంఘాలు పెట్టుకోవచ్చు.. ఇది పోలీసులకు చెప్పాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. రెండున్నర సంవత్సరాలు వేచి చూశాం.. ఉద్యోగాల విషయంలో ఎక్కువ కాలం వెయిట్ చేస్తే వయసు అయిపోతుందన్నారు. ఉద్యోగాలపై చర్చకు జేఏసీ సిద్ధంగా ఉందన్నారు. -
ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలి
-
రేషన్ డీలర్ల పోరుబాట
• ప్రభుత్వం తమ సమస్యలు తీర్చాలని డిమాండ్ • 10న ఇందిరా పార్కు వద్ద నిరసన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయినప్పటికీ తమ సమస్యలు మాత్రం తీరడం లేదంటూ ప్రభుత్వ చౌక ధరల దుకాణ డీలర్లు ఆందోళన బాట పట్టనున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేలా చేయడం కోసం ఈ నెల 10న హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. అయినా సర్కారు స్పందించకుంటే ఆమరణ దీక్షకు దిగనున్నారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ గతేడాది ఆగస్టులో ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తుల రమేశ్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మంత్రికి 15 సార్లు విజ్ఞప్తి చేశామని, కమిషనర్‌ను కలిసినా, ప్రభుత్వం తమ సమస్యలను పక్కన పెట్టేసిందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకు 10వ తేదీన ఒక రోజు దీక్ష చేస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 23 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని రమేశ్‌బాబు చెప్పారు. ఇవీ ప్రధాన డిమాండ్లు... ⇔ రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. లేకుంటే కనీసం రూ.20వేల –రూ.30వేల గౌరవ వేతనమన్నా ఇవ్వాలి. ⇔ ఆరోగ్య కార్డులు, ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలి. ⇔ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ–పాస్ విధానం అమలు చేస్తున్న 1,545 రేషన్ డీలర్లకు తొమ్మిది నెలలుగా ఇవ్వాల్సిన కమీషన్‌ను చెల్లించాలి. ఒక్కో డీలర్‌కు కనీసం రూ. లక్ష దాకా కమీషన్ ఇవ్వాల్సి ఉంది. ⇔ ప్రతి నెలా రేషన్ సరుకులు తీసుకో వడానికి చెల్లించాల్సిన డీడీల కోసం వడ్డీలేని రుణాలు ఇవ్వాలి. -
ఇందిరా పార్క్ వద్ద యూత్ కాంగ్రెస్ ధర్నా
-
అవి సర్కారు హత్యలే
- చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులపై సీపీఐ నేత నారాయణ - ఇందిరా పార్కు వద్ద చేనేత అఖిలపక్ష వేదిక ఆధ్వర్యంలో ధర్నా - వెంటనే చేనేత విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ హైదరాబాద్: చేనేత కార్మికుల ఆత్మ హత్యలు, ఆకలి చావులు సర్కారు హత్య లేనని, వారిపై కేసులు నమోదు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ డిమాండ్ చేశారు. చేనేత విధా నం ప్రకటించాలని కోరుతూ తెలంగాణ చేనేత అఖిలపక్ష వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద చేనేత కార్మి కులు ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా చేనేత కార్మికులు ధర్నా శిబిరం వద్ద మగ్గాలపై వస్త్రాలు నేస్తూ, మహిళలు రాట్నాలపై పనిచేస్తూ నిరసన తెలిపారు. ధర్నాను ఉద్దేశించి నారాయణ మాట్లా డుతూ.. పాలకులు దేవుళ్లకు పట్టువస్త్రాలు సమర్పించి భక్తిని చాటుకుంటారే తప్ప.. వాటిని నేసే చేనేత కార్మికులపై మాత్రం వారికి భక్తి ఉండదని అన్నారు. తిరుపతి వెంకన్న, బెజవాడ అమ్మ వారికి రూ.కోట్ల ఆభరణాలు సమర్పించాలనుకునే కేసీఆర్.. ఆ డబ్బును చేనేత కార్మికులకు ఇస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. అన్ని రంగాలకు బడ్జెట్లో నిధులుంటాయి కానీ.. చేనేతకు మాత్రం నిధుల కేటాయింపు ఉండదని, చేనేతకు సహాయం అనేది వృత్తికి సంబంధించినది కాదని, అది ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. చేనేత సమస్యల పరిష్కారానికి కలసికట్టుగా పోరాటం చేయాలని, ఇందుకు సీపీఐ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చేనేత కార్మికులను ఆదుకునేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలని, సమగ్రమైన చేనేత విధానాన్ని ప్రకటించాలని, సమస్యల పరిష్కారం కోసం చేనేత కార్మిక సహకార సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ చేనేత కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. సీపీఎం నాయకుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ గిట్టుబాటు కూలీ లభించక అనేక మంది చేనేత కార్మికులు వలస పోతున్నారని వాపోయారు. కాంగ్రెస్ నేత మల్లు రవి మాట్లాడుతూ మనిషికి నాగరికత నేర్పిన చేనేత కార్మికులు ప్రస్తుతం సమస్యల పరిష్కారం కోసం రోడ్డు ఎక్కాల్సి రావడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ, తెలంగాణ చేనేత అఖిలపక్ష వేదిక నాయకులు ధనుంజయ, గడ్డం జగన్నాథం, సిల్వేరు కాశీనాథ్, గోశిక యాదగిరి, పాశికంటి లక్ష్మీనర్సయ్య, వెంకటేష్, కూరపాటి రమేష్, గర్ధాసు బాలయ్య, సత్యనారాయణ, రాంచంద్రం, నరేందర్, కాశీనాథం తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరా పార్క్ వద్ద హోంగార్డుల ఆందోళన
హైదరాబాద్: హోం గార్డులు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఇందిరా పార్క్ వద్ద హోంగార్డులు గురువారం ఆందోళనకు దిగారు. కానిస్టేబుళ్లతో పాటు సమానంగా పనిచేస్తున్నా తమకు గుర్తింపు లేదని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో కుటుంబపోషణ భారమవుతోందన్నారు. వెంటనే ప్రభుత్వం హోం గార్డులను పర్మినెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. లేకపోతే తమ ఆందోళలను భవిష్యత్ లో మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
రేపు ఇందిరాపార్క్ వద్ద రైతు దీక్ష
హైదరాబాద్: నగరంలోని ఇందిరాపార్క్ వద్ద రేపు (ఆదివారం) ఉదయం 10 గంటలకు రైతు దీక్ష చేపట్టనున్నారు. ఈ రైతు దీక్షలో తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొననున్నారు. తెలంగాణ ఏర్పాడ్డాక తొలిసారి కోదండరామ్ దీక్షకు దిగుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవడం లేదని కోదండరామ్ దీక్షకు దిగుతున్నట్టు సమాచారం. -
కేజీబీవీ సమస్యలపై నేడు మహాధర్నా
సాక్షి, హైదరాబాద్: కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లోని (కేజీబీవీ) ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4న మహాధర్నా నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సిరెడ్డి, రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరాపార్కు వద్ద ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పదో పీఆర్సీ ప్రకారం వేతనాలు, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, హెల్త్‌కార్డులు, వేసవి సెలవులు తదితర డిమాండ్ల సాధనకు ధర్నా చేస్తున్నట్లు వివరించారు. -
ఇందిరాపార్క్ వద్ద వీహెచ్ ధర్నా
హైదరాబాద్ : భాగ్యనగరంలో గతంలో గుంత చూపిస్తే రూ. వెయ్యి ఇస్తామని టీఆర్ఎస్ నేతలు చెప్పారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) ఆరోపించారు. ఇప్పుడు నగరమంతా గుంతలే దర్శనమిస్తున్నాయని ఆయన విమర్శించారు. నగరంలోని రహదారుల దుస్థితిపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు బుధవారం ఇందిరా పార్కు వద్ద ధర్నా చేపట్టారు. నగర జీవి ఇంటి నుంచి బయటకొస్తే మళ్లీ ఇల్లు చేరే వరకు భరోసా లేదని వి.హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
హక్కులను హరిస్తుంటే సహించం
మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం జరిగేదాకా పోరాటం: ఉత్తమ్ ఇందిరాపార్కు వద్ద పీసీసీ ధర్నా సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి పేద రైతులు, కూలీలు, ప్రజల హక్కులను రాష్ట్ర ప్రభుత్వమే కాలరాస్తున్నదని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. మల్లన్న సాగర్ నిర్వాసిత రైతులు వంద రోజులు దీక్ష చేసిన నేపథ్యంలో సంఘీభావంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ధర్నాకు ఉత్తమ్, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి డి.కె.అరుణ, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు, నాయకులు సర్వే సత్యనారాయణ, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎం.కోదండ రెడ్డి హాజరయ్యారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వైఎస్సార్ కాంగ్రెస్ నేత నల్లా సూర్యప్రకాశ్ తదితరులు ధర్నాకు సంఘీభావం ప్రకటించారు. ఉత్తమ్ మాట్లాడుతూ, కాంట్రాక్టర్ల ద్వారా కమీషన్లు దండుకోవడానికి ప్రభుత్వం పేద ప్రజలను గ్రామాల నుంచి పోలీసులతో, రెవెన్యూ అధికారులతో తరిమివేస్తున్నదని విమర్శించారు. భూ సేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాస చర్యలు చేపట్టాలని రైతులు పోరాడుతున్నా.. ప్రభుత్వం నిర్బంధం విధించి, పోలీసులతో కేసులు పెట్టి, బలవంతంగా భూములను గుంజుకునే కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. భూ సేకరణ చేయకుండా, బెదిరించి కొనుగోలు చేస్తున్నదన్నారు. దీనివల్ల భూమి లేని పేదలకు, భూమిపై ఆధారపడిన వృత్తిదారులు, కూలీలకు పునరావాసం లేకుండా పోతుందని పేర్కొన్నారు. రైతులకు న్యాయం చేయకుండా, బలవంతపు భూ సేకరణతో హక్కులను హరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని ప్రకటించారు. జైపాల్ రెడ్డి, షబ్బీర్ అలీ మాట్లాడుతూ, మల్లన్న సాగర్ పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ విధించడం, రైతులపై కేసులు పెట్టి వేధించడంపై పోరాడుతున్న రైతులకు అండగా ఉంటామన్నారు. అప్రజాస్వామికంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరించే ప్రభుత్వాలపై తెలంగాణ ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. కాంగ్రె స్ అధికారంలోకి వస్తే మల్లన్న సాగర్ కింద భూములు పోగొట్టుకున్న రైతులకు తిరిగి అప్పగిస్తామని జైపాల్‌రెడ్డి అన్నారు. ఇచ్చే పరిస్థితి లేకపోతే భూ సేకరణ చట్టం-2013 కింద పరిహారం అందచేస్తామన్నారు. వైఎస్సార్సీపీ రైతు సంఘం అధ్యక్షుడు కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ 27 నెలల కేసీఆర్ పాలన అబద్ధాలతోనే సాగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌ల సొంత జిల్లాలలోనే వంద రోజులుగా రైతులు చేస్తున్న దీక్షలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామిక సంప్రదాయాలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నదని విమర్శించారు. వీటిపై ప్రజల పక్షాన జరిగే పోరాటాలకు అండగా ఉంటామని తెలిపారు. నేడు గవర్నర్‌ను కలవనున్న పీసీసీ మల్లన్న సాగర్‌లో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘన, ప్రాథమిక హక్కులను కాలరాయడంపై గవర్నర్‌కు పీసీసీ సోమవారం ఫిర్యాదు చేయనుంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ నేతృత్వంలో పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు గవర్నర్‌ను కలసి వినతి పత్రం అందజేయనున్నారు. అనంతరం గజ్వేల్‌లో జరిగే మల్లన్నసాగర్ నిర్వాసితులకు సంఘీభావ సభకు హాజరు కావడానికి బయలుదేరి వెళ్లనున్నారు. -
'రేపు సాయంత్రం వరకు ఉంటా కేసీఆర్.. చర్చకు రా'
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ సవాల్ విసిరారు. తాను రేపు సాయంత్రం వరకు దీక్షలోనే ఉంటానని, జిల్లాల విభజనపై బహిరంగ చర్చకు రావాలని సవాల్లో డిమాండ్ చేశారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అశాస్త్రీయంగా ఉందని పేర్కొంటూ శనివారం ఇందిరాపార్క్ వద్ద రెండు రోజులు నిరాహార దీక్షను పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాల విభజన అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా సరే చర్చకు రావొచ్చని అన్నారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరుగుతుందని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఏయే ప్రాతిపదికన జిల్లాల విభజన చేస్తున్నారో చెప్పాలన్నారు. అఖిలపక్ష భేటీలో ముసాయిదాను ఏ పార్టీలు ఆమోదించలేదని చెప్పారు.