
7న సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష: కోదండరాం
జనవరి 7న నగరంలోని ఇందిరాపార్క్ వద్ద సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష చేపడతామని తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరాం వెల్లడించారు.
జనవరి 7న నగరంలోని ఇందిరాపార్క్ వద్ద సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష చేపడతామని తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరాం వెల్లడించారు. మంగళవారం ఉదయం ఆయన ఐకాస కార్యాలయం వద్ద మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్నీ రోజులు తమ నిరసనలు కొనసాగుతాయని తెలిపారు.
అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంపూర్ణ తెలంగాణ కోసం బిల్లులో అవసరమైన సవరణల కోసం తమ ఆందోళనలు కొనసాగుతునే ఉంటాయని కోదండరాం చెప్పారు.