సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల మహా ధర్నాకు మద్దతు తెలిపిందేందుకు వెళ్లిన ఆయన ఆటోలో ప్రయాణించారు. కేటీఆర్ మొదట నందినగర్‌లోని తన నివాసం నుంచి కారులో బయలుదేరారు. ఆ తర్వాత కొందరు సీనియర్ నాయకులతో కలిసి ఆటో ఎక్కిన కేటీఆర్ మహాధర్నా వద్దకు చేరుకున్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన ఆటో డ్రైవర్‌తో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆటో యూనియన్స్ మహాధర్నాకు నాయకత్వం వహిస్తున్న ఆటో కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు పథకం కారణంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామన్న ప్రభుత్వ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.
Live: "ఆటో డ్రైవర్ల మహా ధర్నా"కు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS https://t.co/GLu6PB9jbC
— BRS Party (@BRSparty) November 5, 2024
తెలంగాణ వచ్చాక ఆటో డ్రైవర్లకు రోజు రూ. 2 వేలు సంపాదిస్తే అన్ని ఖర్చులూ పోను.. 8 వందలు మిగిలేవి. అదే ఇప్పుడు మహాలక్ష్మి పథకంతో 8 వందలు వస్తే ఖర్చులు పోను 2 వందలు మిగలడం లేదు, అధికారంలోకి రాక ముందు గతంలో ఆటోలో తిరిగిన రాహుల్ గాంధీ అన్నారు. అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి 12,000 వేలు ఇస్తాను అన్నారు. కానీ ఏమీ ఇవ్వలేదు.
12 నెలల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు తీర్చిన గ్యారంటీలు ఎన్ని అని ఆలోచన చేయాలి. ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కోలేక ఈ 12 నెలల్లో ఎందరు తనువు చాలించారో లెక్కలతో సహా అసెంబ్లీలో ఇచ్చాం. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నారు. కానీ చేయలేదు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. ఆనాడు కేసీఆ ర్‌తెచ్చిన ఇన్స్యూరెన్స్‌ను తొలగించాలి అనుకుంటున్నారు. ఓలా, ఉబర్‌తో జరుగుతున్న నష్టాన్ని పురిస్తా అన్న మాట మీద ప్రభుత్వం నిలబడాలి.
రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది. బయటకు పోతే తంతారు అని.. పోలీసుల బందోబస్తు లేనిది బయటకు పోవుడు కష్టం అన్నట్లు ఉంది. హోమ్ గార్డుతో సహా అందరు పోలీసులు కష్టల్లోనే ఉన్నారు. ఇంకా నాలుగు ఏళ్ల సినిమా ఉంది. జైల్లో పెట్టిన మేము వెనక్కి తగ్గము మీరు మా వెంట ఉండాలి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి అని కోరుతున్నాం. ఏఐటీయూసీతో పాటు అనేక ఆటో కార్మికులు అందరూ వల్ల సమస్యల పట్ల జెండాలు ఒకటవ్వాలి. అసెంబ్లీలో శాసన సభ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. మీ తరుపున మేము కొట్లడతాము. ఆటో కార్మిక ఐక్యత వర్ధిల్లాలి.’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment