auto driver
-
Driver Neelam: ఆటో డ్రైవర్ సీట్లో ఆమె.. సలాం కొట్టాల్సిందే!
కుటుంబం అనే బండిలో అందరిలా ఆమె ప్యాసింజర్ సీట్లో కూర్చోవాలనుకోలేదు. పరిస్థితుల ప్రభావంతో.. తన బతుకు బండికి తానే సారథిగా మారింది. ‘ఇలాంటి పనులు మగాళ్లే చేయాలమ్మా..’ అని తోటి మహిళలే సూటిపోటి మాటలు అంటున్నా.. మగవాళ్లు వంకర చూపులు చూస్తున్నా.. ఆమె మాత్రం తన గమ్యం వైపు దూసుకుపోతోంది. అందుకే ఆ డ్రైవర్ గాథ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.ఆమె పేరు నీలమ్(Neelam). ఢిల్లీలో బిజీ రోడ్లపై ఆటో డ్రైవర్‌గా కనిపిస్తోంది. నిత్యం మెట్రోలో వెళ్లే ఓ ఉద్యోగిణి.. ఎందుకనో ఆ ఆటో ఎక్కాల్సి వచ్చింది. ‘‘ఆటోను నడిపేది ఓ మహిళనా?’’ అని తొలుత ఆమె కూడా అందరిలా ఆశ్చర్యపోయింది. ఈ పనినే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందని నీలమ్‌ను కుతూహలంతో అడిగిందామె. అక్కడి నుంచి జీవితం ఒకసారి నీలమ్ ఎదుట గిర్రున తిరిగింది.అందరిలాగే పెళ్లై కోటి ఆశలతో అత్తింటి అడుగు మోపిందామె. కానీ, ఆ ఇంట అడుగడుగునా ఆమెకు వేధింపులే (Domestic Violence) ఎదురయ్యాయి. చివరకు.. కట్టుకున్నవాడు కూడా ఆ వేధింపులను మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఓపిక ఉన్నంతకాలం భరించిన ఆమె.. అది నశించడంతో చంటి బిడ్డతో సహా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చాక కష్టాలు స్వాగతం పలికాయి. చేయడానికి ఆమెకు ఏ పని దొరకలేదు. సొంతంగా ఏదైనా చేయాలని అనుకున్నా.. పుట్టింటి వాళ్ల ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. అందుకనే.. ఇలా ఆటో నడుపుతున్నట్లు నవ్వుతూ చెప్పిందామె.కానీ, ఆ మహిళా ఆటో డ్రైవర్(Woman Auto Driver) పెదాలపై నవ్వు కంటే ఆమె గొంతులో దిగమింగుకుంటున్న బాధ, కళ్లలో కూతురికి బంగారు భవిష్యత్తు అందించాలని పడుతున్న ఆరాటం రెండూ కనిపించాయి. అందుకే నీలమ్ కథను ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సమాజంలో మార్పును స్వాగతించేవాళ్లెందరో నీలమ్ నిర్ణయాన్ని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. -
ఆటో డ్రైవర్ చెంపదెబ్బ..కుప్పకూలిన మాజీ ఎమ్మెల్యే
బెంగళూరు:కర్ణాటక బెలగావిలో విషాదఘటన జరిగింది. గోవాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సూర్యాజీ(68) మమ్లేదార్ బెలగావిలో ఖాడే బజార్‌లోని ఓ లాడ్జి బుక్ చేసుకున్నారు. లాడ్జికి కారులో వస్తుండగా అక్కడి ఇరుకైన రోడ్డులో చిన్న ప్రమాదం జరిగింది. సూర్యాజీ కారు ఓ ఆటోను చిన్నగా ఢీకొట్టింది. ఆటోకు పెద్ద నష్టమేమీ జరగకపోయినా ఆ ఆటో డ్రైవర్ సూర్యాజీతో గొడవకు దిగాడు.ఈ గొడవలో సూర్యాజీని ఆ ఆటో డ్రైవర్ చెంపపై కొట్టాడు. ఇది ఇక్కడితో ముగిసిన తర్వాత సూర్యాజీ లాడ్జికి చేరుకుని మెట్లు ఎక్కి తన గదిలోకి వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా సూర్యాజీ చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. సూర్యాజీ చనిపోవడానికి గల కారణాలను డాక్టర్లు వెల్లడించాల్సి ఉంది. పోలీసులు ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆటో డ్రైవర్‌తో గొడవతో పాటు సూర్యాజీ కుప్పకూలిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో నమోదయ్యాయి. కాగా, సూర్యాజీ గోవాలోని పొండా నియోజకవర్గానికి 2012 నుంచి 2017 దాకా ఎమ్మెల్యేగా పనిచేయడం గమనార్హం. -
భార్య పుట్టింటికి వెళ్లిందని ఆటోడ్రైవర్ సంబరం
బొమ్మనహళ్లి: బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ ఒకరు తన భార్య పుట్టింటికి వెళ్లడంతో తనకు సంతోషంగా ఉందని పోస్టర్‌ను తన ఆటోకి వేసుకొని తన ఆటోలో ఎక్కిన ప్రయాణికులకు బిస్కెట్లు పంపిణీ చేసిన సంఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. దానిని ఒక ప్రయాణికుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం అది చక్కర్లు కొడుతోంది. ఆటో డ్రైవర్ తన ఆటోలో ఉన్న తన సీటు వెనుకాల పోస్టర్‌ను కన్నడతోపాటు ఇంగ్లిష్‌లో వేయడంతో పాటు దాని పక్కనే బిస్కెట్లు పెట్టి తన ఆటో ఎక్కిన వారికి వాటిని ఇవ్వడంతో పాటు సంతోషం వ్యక్తం చేశాడు. దాంతో ఒక ప్రయాణికుడు ఆటో డ్రైవర్ సంతోషాన్ని చూసి దానిని సోషల్ మీడియాలో పెట్టాడు. దాంతో ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. View this post on Instagram A post shared by EPIC MEDIA (@_epic69) -
చుక్కలు పాడిన చక్కటి పాట..!
బిటిష్ రాక్ బ్యాండ్ ‘కోల్డ్ ప్లే’ వరల్డ్ టూర్‌తో హల్చల్ చేస్తోంది, మన దేశంలోనూ ప్రదర్శన ఇచ్చింది. ఒకప్పటి ‘యూనివర్శిటీ కాలేజ్ లండన్’ మిత్రులు ‘కోల్డ్ ప్లే’గా సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు.సేఫ్టీ, యెల్లోలాంటి ఆల్బమ్‌లతో శ్రోతలకు దగ్గరయ్యారు. లైవ్ పెర్ఫార్మెన్స్లో తమదైన ప్రత్యేకత చాటుకున్నారు.ఇటీవల అహ్మదాబాద్‌కు చెందిన ఆటోడ్రైవర్ ‘కోల్డ్ ప్లే’ హిట్ సాంగ్ ‘స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్’ పాడి నెటిజనుల చేత వారెవా అనిపించుకున్నాడు. కొందరైతే ‘కోల్డ్ ప్లే తదుపరి కచేరిలో ప్రత్యేక స్థానానికి ఇతడు అర్హుడు’ అని ప్రశంసించారు.‘నేను కోల్డ్ ప్లేకు వీరాభిమానిని’ అంటున్నాడు ఆటోడ్రైవర్. ‘స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్’ మనం కూడా ఒకసారి పాడుకుందాం....కాజ్ యూ ఆర్ ఏ స్కై/ కాజ్ యూ ఆర్ ఏ స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్ఐయామ్ గొన్నా గివ్ యూ మై హార్ట్/ కాజ్ యూ లైట్ అప్ ది పాఐ డోన్ట్ కేర్ కాజ్ యూ ఆర్ ఏ స్కై View this post on Instagram A post shared by Navendu (@chasing.nothing) (చదవండి: బ్రకోలి ఆరోగ్యానికి మంచిదని కొనేస్తున్నారా..?) -
విజయ్ పార్టీలో ఆటో డ్రైవర్‌కు కీలక పదవి
సాక్షి, చెన్నై: నాగరిక రాజకీయం అంటూ ముందుకు సాగుతున్న తమిళగ వెట్రి కళగం నేత విజయ్ తన పార్టీ రూపు రేఖలను వినూత్నంగా తీర్చిదిద్దుతున్నారు. సూట్ కేసులతో విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే వారిని పక్కన పెట్టి, తన అభిమానిగా చేసిన సేవలకు గుర్తింపు ఇస్తున్నారు. ఇందులో భాగంగా చెన్నైలో ఓ జిల్లాకు ఆటోడ్రైవర్‌ను కార్యదర్శిగా నియమించారు. కోయంబత్తూరులో దివ్యాంగుడికి జిల్లా కార్యదర్శి పదవి కేటాయించారు. గృహిణిగా ఉన్న తన వీరాభిమానికి రామనాధపురం జిల్లా కార్యదర్శి పదవి అప్పగించారు. వివరాలు.. తమిళగ వెట్రి కళగం ఆవిర్భావం, జెండా ఆవిష్కరణ, మహానాడు నిర్వహణ అంటూ అన్నీ వినూత్నంగా విజయ్ నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 2026 అసెంబ్లీ ఎన్నికలే తన లక్ష్యం అంటూ ముందుకు సాగుతున్న ఆయన ప్రజా ప్రయాణానికి శ్రీకారం చుట్టినా, ఇంకా పూర్తిస్థాయిలో రాజకీయాలతో ప్రజలలోకి చొచ్చుకెళ్లలేదు. ఇందుకోసం కసరత్తులు జరుగుతున్నాయి. అదే సమయంలో పార్టీ పరంగా జిల్లాల కమిటీల ఏర్పాటును విస్తృతం చేశారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, కొన్ని చోట్ల రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక జిల్లా, మరికొన్ని చోట్ల మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక జిల్లాను తీర్చిదిద్ది కమిటీలను ప్రకటిస్తూ వస్తున్నారు. ఒక్కో జిల్లాకు ఒక కార్యదర్శి, ఒక సంయుక్త కార్యదర్శి, ఒక సహాయ కార్యదర్శి, ఒక కోశాధికారితో పాటూ 10 మంది సర్వ సభ్య సమావేశం సభ్యులను నియమిస్తున్నారు. ఈ పది మందిలోనూ నలుగురు మహిళలను తప్పనిసరిగా నియమిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు విడతలుగా కార్యదర్శులు జాబితాను విడుదల చేశారు. ప్రతి విడతలతోనూ 19 చొప్పున జిల్లాలకు కమిటీలు ఉంటూ వచ్చాయి.సాధారణ కార్యకర్తలకు గుర్తింపు ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు తన అభిమాన సంఘాల్లో శ్రమిస్తున్న సాదాసీదా వ్యక్తులను గుర్తించి వారికి పదవులు అప్పగిస్తుండటం విశేషం. ఇందులో భాగంగా దక్షిణ చెన్నై ఉత్తర జిల్లా కార్యదర్శి టీ నగర్‌కు చెందిన కె. అప్పును నియమించారు. ఈ అప్పు ఆటో డ్రైవర్, రోజు వారి ఆటో నడపడం ద్వారా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. విజయ్ను గుండెల్లో పెట్టుకుని ఆయనే సర్వం అని ముందుకెళ్తూ వచ్చిన అప్పుకు పార్టీలో గుర్తింపు కల్పించారు. జిల్లా కార్యదర్శి పదవి అప్పగించి, రాజకీయ ప్రయాణానికి అవసరమయ్యే అన్ని బాధ్యతలను పార్టీ చూసుకునే దిశగా ఏర్పాట్లు చేయడం విశేషం. అలాగే, కోయంబత్తూరు తూర్పు జిల్లా కార్యదర్శిగా దివ్యాంగుడైన బాబును నియమించారు. మూడు చక్రాల వాహనంలో తిరుగుతూ విజయ్ కోసం ప్రాణాలరి్పంచేందుకు సిద్ధం అని చెప్పుకుంటూ వచ్చిన బాబును గుర్తించి పదవి అప్పగించడం మరో విశేషం. ఇక, తనకు వీరాభిమానిగా ఉన్న గృహిణి మలర్ వెలి జయబాలను గుర్తించి రామనాథపురం జిల్లా కార్యదర్శి పదవిని అప్పగించారు. పదవులు తమకంటే తమకు ఇవ్వాలని అనేక మంది తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తుంటే, తనకు నిజమైన సేవకులుగా ఉండే వారిని గుర్తించి విజయ్ పదవులను అప్పగిస్తుండడం గమనార్హం. విజయ్ అభిమానాన్ని చూస్తారేగానీ, నోట్లను, షూట్ కేసులను కాదు అని ఆటో డ్రైవర్ అప్పు పేర్కొంటున్నారు. తన లాంటి వారికి రాజకీయ గుర్తింపు కలి్పంచే విధంగా పదవి అప్పగించిన విజయ్ను సీఎం చేయడమే లక్ష్యంగా శ్రమిస్తానని దివ్యాంగుడైన బాబు పేర్కొంటున్నారు. -
ఆటో డ్రైవర్ కిరాతకం.. మహిళపై అత్యాచారం
ముంబై: ఇరవై ఏళ్ల మహిళపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్ును ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నలసోపరా నివాసి అయిన మహిళ మంగళవారం అర్థరాత్రి గోరేగావ్‌లోని రైల్వే స్టేషన్ సమీపంలో కనిపించింది. అయితే ఒక ఆటోను బుక్ చేసుకున్న ఆ మహిళకి ఆటో డ్రైవర్ మాయ మాటలు చెప్పి అర్నాలా బీచ్‌కు తీసుకెళ్లాడు. తొలుత ఒక హోటల్‌కు తీసుకెళ్లదామని ప్లాన్ చేసిన ఆటో ్డ్రైవర్.. ఆ మహిళ వద్ద సరైన గుర్తింపు ాకార్డులు లేకపోవడంతో హోటల్ రూమ్ ఇవ్వలేదు. ాదాంతో అక్కడ్నుంచి ఆ మహిళని నేరుగా బీచ్‌కు తీసుకెళ్లాడు. ఆ మహిళ ఇంటికి సరిగ్గా 12 కి.ీమీ ఉంటుందని పోలీసులు తమ ివిచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.ప్రైవేట్ పార్ట్స్ లో సర్జికల్ బ్లేడ్, రాళ్లుఆ ుమహిళపై అత్యాచారానికి పాల్పడిన అనంతరం నిందితుడిగా భావిస్తున్న ఆటో డ్రైవర్.. ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో సర్జికల్ బ్లేడ్ తో పాటు రాళ్లను చొప్పించినట్లు గుర్తించారు. ఈ ఘటన తర్వాత తనకు విపరీతమైన నొప్పి రావడంతో ఆమె స్థానిక పోలీసుల్ని సంప్రదించింది. దాంతో సదరు మహిళని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా, సర్జికల్ బ్లేడ్, రాళ్లతో సహా ఇతర వస్తువులను ఆమె ప్రైవేట్ భాగాలలో బలవంతంగా చొప్పించినట్లు వెల్లడైంది. వైద్యులు విజయవంతంగా వస్తువులను తొలగించినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఆటో డ్రైవర్ ను శుక్రవారం అదుపులోకి తీసుకుని అత్యాచారం కేసు నమోదు చేశారు.ఆ మహిళపై గతంలో రెండుసార్లు అత్యాచారంఅయితే ఆ మహిళపై గతంలో కూడా అత్యాచారం జరిగిన విషయాన్ని ఆమె తండ్రి తమకు చెప్పినట్లు ోపోలీసులు పేర్కొన్నారు. 2023లో ముంబై నిర్మలా నగర్ శివాజీ నగర్లో ఆమె అత్యాచారానికి గురైన విషయాన్ని పోలీసులు తెలిపారు.ఆమె మానసిక పరిస్థితి బాగాలేకనే..!ఆ మహిళ మానసిక పరిస్థితిపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మానసిక పరిస్థితి బాగా లేకనే ఆమె పలుమార్లు అత్యాచారానికి ుగురై ఉండవచ్చినదే పోలీసుల అనుమానం. -
ఆటో డ్రైవర్‌ను కలిసిన సైఫ్ అలీఖాన్.. ఎంత నగదు ఇచ్చారంటే?
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సైఫ్‌పై దాడి జరిగిన తర్వాత ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానా తన ఆటోలోనే లీలావత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. సకాలంలో ఆస్పత్రికి చేరుకోవడంతో సైఫ్‌కు ప్రాణాపాయం తప్పింది. దీంతో ఆటో డ్రైవర్‌ను పలువురు అభినందించారు.ఈనెల 16న సైఫ్ ఇంట్లోకి చోరీకి యత్నించిన వ్యక్తి హీరోపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వెంటనే సైఫ్ ఆస్పత్రికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ సమయంలో సైఫ్‌ను ఆటోలో ముంబయిలోని లీలావతికి తీసుకెళ్లారు భజన్ సింగ్. ఆ సమయంలో అతనెవరో తాను గుర్తు పట్టలేదన్నారు. సకాలంలో ఆస్పత్రికి చేర్చడమే తన లక్ష్యంగా ఆటో నడిపినట్లు భజన్ సింగ్ వెల్లడించారు. అయితే సైఫ్ ప్రాణాలు కాపాడిన భజన్ సింగ్‌కు ముంబయికి చెందిన ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ అందించింది. సైఫ్ ఆర్థిక సాయం..తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌కు సైఫ్ అలీ ఖాన్ ఆర్థిక సాయమందించారు. తనవంతుగా రూ.50 వేలను భజన్ సింగ్ రానాకు అంద జేశారు. ఈ సందర్భంగా ఆపద సమయంలో తనను రక్షించినందుకు అతనికి సైఫ్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే అంతకు ముందు తన ఆటోలో వచ్చింది సైఫ్ అలీఖాన్ అని తెలియదని.. వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని భజన్ సింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.నిందితుడి అరెస్ట్.. సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందిచతుడి ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ షరీఫుల్‌గా అతన్ని గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన కోర్టులో హాజరు పరచగా ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. దీంతో పోలీసులు అతనితో పాటు సైఫ్ ఇంటికి వెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. -
వెంటాడి మరీ.. పట్టపగలే హనుమకొండలో దారుణం
హనుమకొండ, సాక్షి: పట్టపగలే నగరంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం పోయేలా చేసింది. అందరూ చూస్తుండగా.. వెంటాడి మరీ అతన్ని కిరాతకంగా హత్య చేశారు. హనుమకొండలో బుధవారం దారుణం చోటు చేసుకుంది.ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరు వ్యక్తులు తమలో తాము గొడవ పడ్డారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగడంతో హత్యకు దారి తీసింది. మాచర్ల రాజ్‌కుమార్, ఏనుగు వెంకటేశ్వర్లు ఆటోడ్రైవర్లు. ఈ ఇద్దరికీ స్థానికంగా ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది.అయితే ఈ విషయమై ఇద్దరు నడిరోడ్డుపై వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోవెంకటేశ్వర్లు రాజ్‌కుమార్‌ను వెంబడించాడు. సుబేదారి డీమార్ట్ ఎదురుగా దొరకబుచ్చుకుని దారుణంగా చంపాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృత దేహాన్ని.. ఎంజీఎంకు తరలించారు. ఆపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. ఆటో డ్రైవర్‌కు పారితోషికం ఎంత ఇచ్చారంటే? (ఫోటోలు)
-
సైఫ్ అలీ ఖాన్‌ను గుర్తు పట్టలేదు.. డబ్బులు కూడా తీసుకోలేదు: ఆటో డ్రైవర్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సైఫ్ ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇంట్లో చోరికి యత్నించిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్‌ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని 30 ఏళ్ల బంగ్లాదేశీయునిగా(Bangladesh) పోలీసులు గుర్తించారు. అతని అసలు పేరు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్. భారత్ వచ్చాక బిజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడని అధికారులు తెలిపారు.అయితే దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్‌ను ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తండ్రిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆటో డ్రైవర్ వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తెలిపారు. అయితే సైఫ్‌ను రక్షించినందుకు అతనికి ముంబయిలోని ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ఆ రోజు రాత్రి జరిగిన విషయాన్ని వెల్లడించారు. తాను ఆటోలో వెళ్తండగా ఓ మహిళ ఆగండి అంటూ గట్టిగా అరిచిందని.. దీంతో వెంటనే యూ టర్న్ తీసుకుని బిల్డింగ్ గేట్ దగ్గరికి వచ్చానని తెలిపాడు. అక్కడి రాగానే ఆ వ్యక్తి దుస్తులంతా ఎర్రగా రక్తంతో తడిసిపోయి ఉన్నాయి.. అప్పుడు సమయం దాదాపు 2 గంటల 45 నిమిషాలవుతోందని అతను వివరించాడు. రోడ్డు పూర్తిగా నిర్మానుష్యంగా ఉండడంతో.. బాంద్రా వెస్ట్ నుంచి టర్నర్ రోడ్, హిల్ రోడ్ ద్వారా లీలావతి హాస్పిటల్‌కు చేరుకున్నాం. వారివెంట వచ్చిన పిల్లవాడు మధ్యలో కూర్చున్నాడు.. అతని కుడి వైపున గాయపడిన వ్యక్తి (సైఫ్) కూర్చున్నాడు.. కానీ రాత్రి కావడంతో నేను అతన్ని గుర్తించలేకపోయాను.. వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేరుకోవడమే లక్ష్యంగా ఆటోను నడిపినట్లు వెల్లడించారు. -
హైదరాబాద్‌లో హత్య.. కోదాడలో శవం
కోదాడ: సామాజిక మాధ్యమంలో చురుగ్గా ఉండే ఓ బాలిక చేసిన తప్పిదం ఆమె తల్లిదండ్రులను హంతకులుగా మార్చగా, మరో యువకుడు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఈ ఏడాది మార్చి నెలలో హైదరాబాద్‌లో హత్యకు గురై.. నాగార్జునసాగర్ కాలువలో శవంగా తేలిన యువకుడి కేసును పోలీసులు తొమ్మిది నెలల తర్వాత ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన ఓ కారు డ్రైవర్ తన భార్యతో కలిసి బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వలసవచ్చి జగద్గిరిగుట్ట సమీపంలో నివాసముంటున్నారు. వీరికి 10వ తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే సదరు బాలిక తరచూ రీల్స్ చేస్తూ పోస్ట్ చేసేది. ఈ పోస్టులను బోరబండకు చెందిన వివాహితుడైన ఆటో డ్రైవర్ కుమార్ గమనించి ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి పరిచయం పెంచుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో కుమార్ బాలికకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లి ఒక దగ్గర బంధించాడు. ట్యాబ్ సాయంతో కనిపెట్టి.. తమ కుమార్తె కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని భావించారు. ఈ క్రమంలో బాలిక ట్యాబ్‌ను ఓపెన్ చేసి కుమార్‌తో చేసిన చాటింగ్‌ను గుర్తించారు. దీంతో బాలిక తల్లి మరో స్త్రీగా సామాజిక మాధ్యమంలో ఆటో డ్రైవర్ కుమార్‌తో పరిచయం పెంచుకుని తమ ఇంటికి ఆహ్వానించింది. ఆటోలో కుమార్ జగద్గిరిగుట్టకు వచ్చాడు. కుమార్ రాగానే అతడిని బంధించి తమ కుమార్తె ఆచూకీ చెప్పాలని ప్రాధేయపడ్డారు. ఎంత బతిమిలాడినా కుమార్ ఆచూకీ చెప్పకపోవడంతో అతడిపై తీవ్రంగా దాడి చేశారు. ఆ దాడిలో కుమార్ అపస్మారకస్థితికి చేరడంతో అతడి కాళ్లు, చేతులు కట్టేసి కారులో విజయవాడ వైపు తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో మునగాల వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న నాగార్జునసాగర్ ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద ముక్త్యాల మేజర్ కాలువలో కుమార్‌ను పడేసి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. కుమార్ మృతదేహం కోదాడ సమీపంలోని బాలాజీనగర్ వద్ద కాలువ ఒడ్డుకు చేరింది. పోలీసులు గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి స్థానిక కొమరబండ చెరువు అంచున ఖననం చేశారు. టెక్నాలజీ పట్టించింది.. మార్చిలో జరిగిన ఈ ఘటన తర్వాత బాలిక తల్లిదండ్రులు హైదరాబాద్ చేరుకుని తమకు ఏమీ తెలియనట్లు వారి పనులు వారు చేసుకోసాగారు. సదరు బాలిక కూడా హైదరాబాద్‌లోని నింబోలిఅడ్డాలోని ఓ అనాథశరణాలయంలో ఉందని తెలుసుకొని ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. కుమార్ కనిపించకపోవడం, ఆటో కూడా దొరక్కపోవడంతో కుమార్ భార్య బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కుమార్ ఆటోకు ఉన్న నంబర్ ప్లేట్ మార్చి సదరు బాలిక తండ్రి ఉపయోగిస్తున్నాడు. దానిపై ఉన్న పేటీఎం క్యూఆర్ కోడ్‌ను మాత్రం తొలగించలేదు. ఆటోకు ఉన్న ప్రత్యేకమైన బంపర్‌ను కూడా అలాగే ఉంచారు. ఈ ఆనవాళ్లతో 10 రోజుల క్రితం పోలీసులు ఆటోను పట్టుకొని దానిని ఉపయోగిస్తున్న బాలిక తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య విషయం బయటపడింది. బోరబండ పోలీసులు రెండు రోజుల క్రితం కోదాడకు వచ్చి మృతదేహాన్ని జేసీబీ సాయంతో తవ్వించారు. ఎముకలను డీఎన్ఏ పరీక్షలకు పంపి అది కుమార్ మృతదేహమా.. కాదా అని నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం బాలిక ఒంటరిగా మారగా, కుమార్ భార్య భర్తను కోల్పోయి రోడ్డున పడింది. -
ఆటో రామన్న
-
రోజుకో చావుతో తెలంగాణ తెల్లారుతోంది: రేవంత్ సర్కారుపై కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అసమర్థ పాలనలో తెలంగాణలో రోజుకు ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రలకు బడుగు బలహీన వర్గాలు బలైపోతున్నాయని అన్నారు. రైతులు, ఆటోడ్రైవర్లతోపాటు వివిధ వర్గాలకు చెందిన వారు నిత్యం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్‌లో స్పందిస్తూ..రోజుకో చావుతో తెలంగాణ తెల్లారుతోందని, కాంగ్రెసోడి కుట్రలకు బలైపోతున్నదని మండిపడ్డారు. రాజ్యహింసతో రాష్ట్రం నిత్యం తల్లడిల్లుతోందని, గాయాలతో గోడుగోడునా విలపిస్తోందని విమర్శించారు. రైతు రారాజుగా బ్రతికిన తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృత్యమాయెనని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధికి చిరునామాగా మారిన రాష్ట్రంలో జీవనోపాధి కరువై బడుగులు బలిపీఠం ఎక్కవట్టెనని ఆయన వాపోయారు. ఇది ఎవడు చేసిన పాపమని, ముమ్మాటికీ మార్పు తీసుకొచ్చిన శాపమేనని పేర్కొన్నారు.రోజుకో చావుతో తెలంగాణ తెల్లారుతోంది కాంగ్రెసోడి కుట్రలకు బలైపోతుంది!రాజ్యహింసతో నిత్యం తల్లడిల్లుతోందిగాయాలతో గోడుగోడునా విలపిస్తోంది!రైతు రారాజుగా బ్రతికిన తెలంగాణలో... అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృత్యమాయే!ఉపాధికి చిరునామాగా మారిన రాష్ట్రంలో..జీవనోపాధి కరువై బడుగులు… pic.twitter.com/KPHWnAg7PN— KTR (@KTRBRS) November 19, 2024 -
మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి
-
ఆటో డ్రైవర్ల ధర్నాకు కేటీఆర్ మద్దతు
-
ఇందిరాపార్క్ వద్దకు ఆటోలో ప్రయాణించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల మహా ధర్నాకు మద్దతు తెలిపిందేందుకు వెళ్లిన ఆయన ఆటోలో ప్రయాణించారు. కేటీఆర్ మొదట నందినగర్‌లోని తన నివాసం నుంచి కారులో బయలుదేరారు. ఆ తర్వాత కొందరు సీనియర్ నాయకులతో కలిసి ఆటో ఎక్కిన కేటీఆర్ మహాధర్నా వద్దకు చేరుకున్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన ఆటో డ్రైవర్‌తో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆటో యూనియన్స్ మహాధర్నాకు నాయకత్వం వహిస్తున్న ఆటో కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు పథకం కారణంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామన్న ప్రభుత్వ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.Live: "ఆటో డ్రైవర్ల మహా ధర్నా"కు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS https://t.co/GLu6PB9jbC— BRS Party (@BRSparty) November 5, 2024 తెలంగాణ వచ్చాక ఆటో డ్రైవర్లకు రోజు రూ. 2 వేలు సంపాదిస్తే అన్ని ఖర్చులూ పోను.. 8 వందలు మిగిలేవి. అదే ఇప్పుడు మహాలక్ష్మి పథకంతో 8 వందలు వస్తే ఖర్చులు పోను 2 వందలు మిగలడం లేదు, అధికారంలోకి రాక ముందు గతంలో ఆటోలో తిరిగిన రాహుల్ గాంధీ అన్నారు. అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి 12,000 వేలు ఇస్తాను అన్నారు. కానీ ఏమీ ఇవ్వలేదు. 12 నెలల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు తీర్చిన గ్యారంటీలు ఎన్ని అని ఆలోచన చేయాలి. ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కోలేక ఈ 12 నెలల్లో ఎందరు తనువు చాలించారో లెక్కలతో సహా అసెంబ్లీలో ఇచ్చాం. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నారు. కానీ చేయలేదు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. ఆనాడు కేసీఆ ర్తెచ్చిన ఇన్స్యూరెన్స్ను తొలగించాలి అనుకుంటున్నారు. ఓలా, ఉబర్‌తో జరుగుతున్న నష్టాన్ని పురిస్తా అన్న మాట మీద ప్రభుత్వం నిలబడాలి.రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది. బయటకు పోతే తంతారు అని.. పోలీసుల బందోబస్తు లేనిది బయటకు పోవుడు కష్టం అన్నట్లు ఉంది. హోమ్ గార్డుతో సహా అందరు పోలీసులు కష్టల్లోనే ఉన్నారు. ఇంకా నాలుగు ఏళ్ల సినిమా ఉంది. జైల్లో పెట్టిన మేము వెనక్కి తగ్గము మీరు మా వెంట ఉండాలి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి అని కోరుతున్నాం. ఏఐటీయూసీతో పాటు అనేక ఆటో కార్మికులు అందరూ వల్ల సమస్యల పట్ల జెండాలు ఒకటవ్వాలి. అసెంబ్లీలో శాసన సభ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. మీ తరుపున మేము కొట్లడతాము. ఆటో కార్మిక ఐక్యత వర్ధిల్లాలి.’ అని తెలిపారు. -
మార్పు కోసం.. ఆటో డ్రైవర్ ఆలోచన..
సాక్షి, హైదరాబాద్: ఆయనో ఆటో డ్రైవర్.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ ఉరుకులు పరుగుల జీవితం.. ఎంతో కష్టపడితే కానీ ఐదు వేళ్లూ నోట్లోకి వెళ్లవు. కానీ ఆయన ఆలోచనలు మాత్రం ప్రతిక్షణం సమాజం గురించే.. సమాజంలో ఉన్న సమస్యలు.. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న విపరీత ధోరణులపై అనుక్షణం ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే యువతలో, సమాజంలో మార్పు తీసుకురావాలని సంకల్పించాడు. అయితే ఓ ఆటోడ్రైవర్.. తాను ఏదో ఒకటి చేయాలని సంకల్పించాడు. తన పరిధిలో ఏం చేయగలనో ఆలోచించాడు. కూడళ్లు, విద్యుత్ స్తంభాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో మనం మారాలి.. మార్పు రావాలి.. అంటూ కొటేషన్స్ రాయడం ప్రారంభించారు. ఆయన పేరు దాడే శ్రీనివాస్.. అంబర్‌పేటకు చెందిన శ్రీనివాస్.. రెండున్నరేళ్లకు పైగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు.రోజుకో కొటేషన్..వివేకానంద సూక్తులు, వాక్యాలు తనకు ఎంతో స్ఫూర్తినిస్తాయని చెబుతున్నాడు 45 ఏళ్ల శ్రీనివాస్. ఈయనకు దేశ భక్తి కూడా ఎక్కువే. తన ఆటోలో ప్రయాణించే వారు తమ సమస్యలు చెప్పుకొంటుంటే ఎంతో బాధ అనిపించేదని, వీటన్నింటికీ కారణం సమాజంలో పెరుగుతున్న విపరీత ధోరణులే కారణమని పేర్కొంటున్నాడు. ఇక, తల్లిదండ్రులను ఆస్తుల కోసం హింసించడం.. పెద్ద వారిపై గౌరవం లేకుండా ఉండటం వంటివి ఎన్నో ఉదంతాలు చూసి ఆవేదనకు గురయ్యేవాడినని గుర్తు చేసుకున్నాడు. ఇక, యువత చెడు అలవాట్లకు బానిసై విలువలు లేని జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి వారిలో చిన్న మార్పు అయినా వస్తుందనే నమ్మకంతో ఇలా కొటేషన్లు రాస్తున్నానని చెప్పాడు. అలాగే తన ఆటోపై కూడా ప్రతి రోజూ కొత్త కొటేషన్లు రాస్తుంటానని వివరించాడు.చిన్నతనంలోనే నగరానికి.. షాద్‌నగర్ కుర్వగూడకు చెందిన శ్రీనివాస్ చిన్నతనంలోనే నగరానికి వలస వచ్చాడు. ఇంటరీ్మడియెట్లోనే చదువు ఆపేసిన శ్రీనివాస్.. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిని కూడా చిన్నప్పటి నుంచే మంచి మార్గంలో నిలపాలనే ఉద్దేశంతో ఇంట్లో చిన్న బోర్డు ఏర్పాటు చేసి, దానిపై మంచి సూక్తులు రాసేవాడట. దీంతో వారు కూడా పెద్ద చదువులు చదువుకొని.. మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ధర్మబద్ధంగా, సహనంతో ప్రతి ఒక్కరూ జీవిస్తే సమాజంలో ఉన్న అనేక సమస్యలు రూపుమాపుతాయనేది తన నమ్మకమని చెబుతున్నాడు. -
ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన భార్య!
తొండంగి: కథ అడ్డం తిరిగింది.. ఐదు రోజుల కిందట జరిగిన ఆటో డ్రైవర్ మృతి కేసులో కొత్త కోణం బయట పడింది.. భార్యే ప్రియుడితో కలసి చంపిందని బంధువులు అనుమానిస్తుండగా, వారిద్దరూ పారిపోతుండగా బంధువులు, గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తొండంగి మండలం ఏవీ నగరంలో గురువారం చర్చనీయాంశమైంది. మృతుని సోదరుడు, సోదరి, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఏవీ నగరం గ్రామానికి చెందిన బత్తిన మధుబాబు (38)కు ఇదే గ్రామానికి చెందిన అతని మేనమామ డేగల ప్రకాష్ కుమార్తె శిరీషతో 2014లో వివాహం జరిగింది.వీరికి ఆరేళ్ల జాయ్ అనే పాప ఉంది. ఆటో డ్రైవర్‌గా మధుబాబు జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి తమ్ముడు కిషోర్, చెల్లెలు ఝాన్సీరాణి ఉన్నారు. తల్లిదండ్రులు చాలాకాలం కిందట మృతి చెందారు. కాగా కిషోర్ కాకినాడ ఆర్టీసీలో మెకానిక్‌గా చేస్తున్నాడు. శిరీష నర్సుగా కొంత కాలం కిందట కత్తిపూడి రిఫరల్ ఆస్పత్రిలో పనిచేసింది. అక్కడ పనిచేసిన సమయంలో శంఖవరం మండలం శృంగవరం గ్రామానికి చెందిన పీతల ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలిసిన మధుబాబుకు, శిరీషల మధ్య తరచూ మనస్పర్థలు వచ్చాయి. దీంతో భర్తను విడిచి శిరీష హైదరాబాద్‌లో చెల్లెలు ఇంటికి కుమార్తెను తీసుకుని వెళ్లిపోయింది. 20 రోజుల కిందట శిరీష హైదరాబాద్‌లో కుమార్తె జాయ్‌ను ఉంచి మళ్లీ ఏవీ నగరంలోని మధుబాబు ఇంటికి వచ్చింది. ఈ నెల 17న మధుబాబుకు బీపీ తక్కువగా ఉందని కత్తిపూడిలో రిఫరల్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు శిరీష 18న కాకినాడలో ఉంటున్న మరిది కిషోర్‌కు తెలిపింది. దీంతో ఏవీ నగరంలో తన స్నేహితుడిని ఆస్పత్రికి వెళ్లమని చెప్పి అనంతరం కిషోర్ ఆస్పత్రికి చేరుకున్నాడు. అనంతరం మధుబాబుకు పలు పరీక్షలు చేయాలని వైద్యులు సూచించడంతో శుక్రవారం ఏవీ నగరంలో ఇంటికి వచ్చారు. ఆ రోజంతా ఆరోగ్యంగానే మధుబాబు గ్రామంలో తిరిగాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం ఉదయం చనిపోయాడని శిరీష అతని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. మధుబాబు ఒంటిపై గాయాలున్నట్టు కిషోర్ చూసి శిరీష ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో ఐదు రోజుల అనంతరం బుధవారం అర్ధరాత్రి శిరీషతో అక్రమ సంబంధం ఉన్న పీతల ప్రశాంత్ గ్రామంలోకి రావడం, వీరిద్దరూ పారిపోతుండగా పట్టుకున్నామని మృతుని సోదరుడు కిషోర్, చెల్లెలు భర్త చిన్న తెలిపారు. పట్టుబడిన వారిని పోలీసులకు అప్పగించారు. అక్రమ సంబంధం కారణంగా ప్రియునితో కలసి తన అన్నను హతమార్చారని కిషోర్, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధుబాబు మృతి మిస్టరీగా మారింది.అనుమానాస్పద మృతిగా కేసుఏవీ నగరంలో మధుబాబు మృతిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్టు ఎస్సై జగన్మోహన్రావు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహిస్తామన్నారు. కేసు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. -
కన్నడ టీచర్.. ఈ ఆటోడ్రైవర్
బొమ్మనహళ్లి: బెంగళూరు కర్ణాటక రాజధాని అన్న సంగతి తెలిసిందే. కానీ ఇక్కడ కొన్ని లక్షల మందికి కన్నడ రాదు, తెలియదు. అదే పెద్ద వింత. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చినవారు ఇందులో ఎక్కువ. అటువంటి వారికి కొంచైమెనా కన్నడ కస్తూరి గొప్పతనాన్ని వివరించాలని ఓ ఆటోడ్రైవర్ కంకణం కట్టుకున్నాడు. అతనే బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్ అజ్మల్ సుల్తాన్. ఆటోలో కొన్ని పోస్టర్లను అతికించాడు. అందులో ఆంగ్ల, కన్నడ పదాల అర్థాలు ఉన్నాయి. ఎవరైనా సులభంగా కన్నడను తెలుసుకోవచ్చు. నమస్కార సార్– హెలో సార్, ఎల్లి ఇదిరా– వేర్ ఆర్ యూ?, ఎస్ట్ అయితు– హౌ మచ్?, యూపిఐ ఇదియా క్యాష్ నా– ఈజ్ ఇట్ యుపిఐ, ఆర్ క్యాష్? అనే చిన్న చిన్న పదాలతో పోస్టర్లు ఉన్నాయి. చాలా సరళంగా కన్నడను అర్థం చేసుకోవచ్చని ఆయన చెబుతున్నారు. కన్నడ రానివారు ఆటోలో ఎక్కినప్పుడు గమ్యం చేరేవరకు కొన్ని కన్నడ పదాలను నేర్పించే యత్నం చేస్తానని చెప్పాడు. ఆయన కృషి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఆదరణ పొందుతోంది. -
‘ఆటో’ బతుకులు అస్తవ్యస్థం
సాక్షి, అమరావతి: ‘అటో డ్రైవర్ కె.శివారెడ్డి ఊర్మిళనగర్ రెండో లైనులో అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. ఇటీవల వచ్చిన బుడమేరు వరదలకు ఆ ఇల్లు మునిగిపోయింది. జీవనాధారమైన ఆటోతో పాటు ద్విచక్రవాహనం పూర్తిగా పాడైపోయాయి. సచివాలయ సిబ్బంది వచ్చి వివరాలు నమోదు చేసుకుని వెళ్లారు. కానీ ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా పరిహారం రాలేదు. అప్పు చేసి ఆటోకు మరమ్మతులు చేయించుకుంటే రూ.45 వేలు ఖర్చయింది. ఇంటికిగానీ, వాహనాలకు గానీ పరిహారం ఇప్పించాలంటూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాడు.పదహారేళ్లుగా ఇదే ప్రాంతంలో ఆటో నడుపుతున్న నా పేరు ఎందుకు జాబితాలో లేదని ఎవరిని అడిగినా సమాధానం చెప్పడంలేదని వాపోతున్నాడు.’’...ఇది బుడమేరు వరదల్లో ఆటోలను కోల్పోయిన వేలాది మంది డ్రైవర్ల ఆవేదన. నగరంలో తిరిగే ఆటోలలో అతకధికం సింగ్ నగర్, ఇందిరానాయక్ నగర్, పాయకాపురం, కండ్రిగ, వాంబేకాలనీ, మిల్క్ ప్రాజెక్ట్, డాబా కోట్లు సెంటర్, రాజరాజేశ్వరిపేట, నందమూరి కాలనీ, భరతమాత కాలనీ, ఊరి్మళనగర్ల నుంచే వస్తున్నాయి. అక్కడి నిరుద్యోగులు డ్రైవర్లుగా మారి జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వారందరి జీవితాలు అస్తవ్యస్ధంగా మారాయి. ఈ నేపధ్యంలో ఆ ప్రాంతాల్లో పర్యటించి బాధితుల బతుకు చిత్రంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ ఇది.మరమ్మతులకు కొత్త అప్పులురోజుల తరబడి ముంపులోనే ఉండటంతో ఆటోలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బయట మెకానిక్ దగ్గర నుంచి కంపెనీ షోరూమ్ వరకూ ఒక్కో దాని మరమ్మతులకే రూ.12 వేల నుంచి రూ.75 వేల వరకూ వ్యయం అవుతోంది. రేడియేటర్, ఇంజిన్, బ్యాటరీతో పాటు బీఎస్ 6 వాహనాల్లో సెన్సార్లు పాడవ్వడంతో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇన్ని వాహనాలకు మరమ్మతులు చేసేందుకు మెకానిక్‌ల కొరత ఉండటంతో రోజుల తరబడి మోటార్ షెడ్ల వద్దే ఆటోలు పడి ఉంటున్నాయి. ఒకసారి మరమ్మతు చేసినా మళ్లీ మళ్లీ కొత్త లోపాలు బయటపడుతున్నాయి. దీంతో కొత్త అప్పులు చేసి మరమ్మతులకు వెచి్చస్తున్నారు. ఉపాధి లేక, కుటుంబాలను పోషించుకోలేక, వాయిదాలు కట్టలేక అవస్థలు పడుతున్నామని డ్రైవర్లు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఓట్లేయించుకున్న రాష్ట్ర ప్రభుత్వంగానీ, స్థానిక ప్రజాప్రతినిధులుగానీ తమను అసలు పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు.బీమా సంస్థల కొర్రీలువరద నీటిలో మునిగిన ఆటోలకు క్లెయిమ్‌లు ఎగవేసేందుకు బీమా సంస్థలు ఉన్న అన్ని అవకాశాలనూ వాడుకుంటున్నాయి. బీమా చేసే సమయంలో డ్రైవర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి తెలియని షరతులను పొందుపరిచి వాటిని ఇప్పుడు సాకుగా చూపిస్తున్నాయి. ఒక ఆటోకి బీమా రావాలంటే సుమారు రెండు నెలలు సమయం పడుతుందని తప్పించుకుంటున్నాయి. అదికూడా వరద వచి్చనప్పటి నుంచి ప్రతి దశలోనూ తీసిన ఫొటోలు, వీడియోలు ఉంటేనే బీమా వర్తిస్తుందని మెలికపెడుతున్నాయి.ప్రాణాలే కాపాడుకుంటామా, ఫొటోలు తీస్తామా అంటూ బాధితులు అడుగుతుంటే బీమా సంస్థలు సమాధానం చెప్పడం లేదు. రెండు వారాల్లోనే క్లెయిమ్‌లు పూర్తి చేసేలా బీమా సంస్థలతో మాట్లాడామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. ఆచరణలో మాత్రం అది శూన్యం. బీమా సంస్థలు కనీసం 45 రోజుల పాటు ఆటోను ఉన్న చోటు నుంచి కదపకుండా ఉంచాలని చెప్పాయి. అప్పటి వరకూ మరమ్మతు చేయకపోతే మొత్తానికే పనికిరాదని, ప్రభుత్వం ఈ విషయంలో పట్టించుకోవడం లేదని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు.పరిహారం లేదురాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సెప్టెంబర్ 1న విజయవాడలో వదర విలయం సృష్టించింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారి జీవనాధారాలైన ఆటోలు, మోటార్ సైకిళ్లు వరద నీటిలో పూర్తిగా మునిపోయాయి. రోజుల తరబడి బురద నీటిలోనే నానిపోవడంతో ఇంజిన్, సెన్సార్లు,కార్బొరేటర్ వంటి ముఖ్యమైన భాగాలు దెబ్బతిన్నాయి. ఆటోకి రూ.10 వేలు, ద్విచక్ర వాహనానికి రూ.3 వేలు చొప్పున పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం రకరకాల కొర్రీలతో మూడొంతుల మందిని మోసం చేసింది. ఆటో నడిపితేగానీ పూటగడవని నిరుపేదలు వాటిని బాగు చేసుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక ప్రభుత్వ కార్యాలయాలు,అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. బుడమేరు వరదల వల్ల దాదాపు 15 వేలకుపైగా అటోలు నీట మునిగితే ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం కేవలం 6,515 మాత్రమే ఉన్నట్టు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో 4,348 ఆటోలకు పరిహారం అందించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేశారు. కానీ వాస్తవానికి మొత్తం బాధితుల్లో దాదాపు 80 శాతం మంది ఆటోవాలాలకు నష్టం పరిహారం అందలేదని బాధితులు చెబుతున్నారు. చాలా మంది పేర్లు బాధితుల జాబితాలోనే లేవు..కొందరి పేర్లు ఉన్నా వారికి డబ్బులు పడలేదు.ఎవరూ పట్టించుకోవట్లేదు‘‘వరదల్లో ఇల్లు మునిగిపోయింది. ఆటో బాగా బెబ్బతింది. ప్రస్తుతానికి నడిచేలా చేయడానికి రూ.8 వేలు ఖర్చయ్యింది. ప్రభుత్వం రూ.10 వేల ఇస్తామని చెప్పింది. కానీ మా వివరాలను నమోదు చేయడానికి కూడా ఎవరూ రాలేదు. సచివాలయంలో అడిగితే కలెక్టరేట్‌కు వెళ్లమని చెప్పారు. అక్కడికి వెళితే ఎవరూ పట్టించుకోవడం లేదు.’’ –లింగయ్య, ఆటో డ్రైవర్, రాజీవ్‌నగర్ కాలనీజీవనాధారం పోతే పరిహారం రాదా?‘‘ఆటో నడిపితేగానీ మా కుటుంబం నడవదు. వరదల వల్ల ఆటో మునిగిపోయి జీవనాధారాన్ని కోల్పోయాం. బీమా రావాలంటే 45 రోజులు ఆటోను వాడకూడదంటున్నారు. బాగు చేయించుకునే స్తోమత కూడా లేదు. అయినా జాబితాలో మా పేరు లేదంటున్నారు. సచివాలయానికి వెళ్లి అడిగితే తమకేమీ తెలియని చెబుతున్నారు. మా గోడును ఎవరికి చెప్పుకోవాలి. మమ్మల్ని ఆదుకునేవారెవరు.’’ –బాబ్జి, ఆటో డ్రైవర్, రాజరాజేశ్వరిపేటఅద్దె ఆటోనే ఆధారం‘‘నేను ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతున్నాను. వరదకు ఆటో మునిగిపోయింది. ఎలాంటి పరిహారం రాలేదు. ఎవరిని అడిగినా ఎలాంటి ఉపయోగం లేదు.ఏం చేయాలో తెలియడం లేదు.’’ –దుర్గారావు, ఆటో డ్రైవర్, వాంబేకాలనీ.చాలా ఖర్చవుతోంది‘ఇంటర్ చదివి ఆటో నడుపుతున్నాను. మా నాన్న కూడా ఆటో డ్రైవరే. రెండు ఆటోలూ వరదలో మునిగిపోయాయి.ఒక సారి రిపేరుకి రూ.12 వేలు ఖర్చయ్యింది. కానీ మళ్లీ రేడియేటర్ పాడయ్యింది. నాలుగు రోజులుగా మెకానిక్ దగ్గరే పెట్టి బాగుచేయిస్తున్నాం.’’ –వై.సాయి, ఆటో డ్రైవర్, పాయకాపురం. -
వాచీలోనే క్యూఆర్ కోడ్... అదిరిందయ్యా ఆటో డ్రైవర్!
బెంగళూరుకు చెందిన ఈ ‘స్మార్ట్’ఆటో డ్రైవర్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందనలు అందుకున్నాడు. ఎందుకంటే మనవాడు యూపీఐ చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ స్మార్ట్ వాచ్‌ను వాడుతున్నాడు మరి! సదరు ఫొటోను ఓ నెటిజన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దాంతో అది తెగ వైరలవుతోంది. అలా రైల్వే మంత్రి దృష్టినీ ఆకర్షించింది. ఆ ఫోటోను ఆయన రీట్వీట్ చేశారు. ‘యూపీఐ కా స్వాగ్! చెల్లింపులు మరింత సులువయ్యాయి’అంటూ కామెట్ చేశారు. ఆటోడ్రైవర్‌కు సోషల్ మీడియాలో ప్రశంసలు వెలులవెత్తుతున్నాయి. ఐటీలో ట్రెండ్ సెట్టర్ అయిన బెంగళూరు ఆ సాంకేతిక పరిజ్ఞానం వాడకంలోనూ ట్రెండ్ సెట్ చేస్తోందంటూ యూజర్లు కామెంట్ చేస్తున్నారు. ‘నవ భారత ముఖచిత్రమిది’అని ఒకరు, ‘డిజిటల్ ఇండియా మ్యాజిక్’అని మరొకరు పోస్ట్ చేశారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2016లో ప్రారంభించిన యూపీఐ బ్యాంకుల మధ్య తక్షణ బదిలీలకు వీలు కలి్పంచడం ద్వారా చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యువతిపై ఓలా డ్రైవర్ దాడి, స్పందించిన ఓలా: వీడియో వైరల్
బెంగళూరులో ఓలా ఆటో డ్రైవర్ ఒక యువతిపై అనుచితంగా ప్రవర్తించి, దుర్బాషలాడి, దాడిచేసిన ఘటన కలకలం రేపింది. బుధవారం జరిగినఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. బాధిత యువతి ఎక్స్‌లో షేర్ చేసిన వివరాల ప్రకారం తన స్నేహితురాలితో కలిసి బెంగళూరు సిటీలో ఓలా ఆటో రైడ్‌ను బుక్ చేసుకున్నారు. తొందరగా వెళ్లాలనే ఉద్దేశంలో ఇద్దరూ ఓలా రైడ్ కోసం ప్రయత్నించగా ఇద్దరివీ బుక్ అయ్యాయి. ఇదే వివాదానికి దారి తీసింది. ముందుగా వచ్చిన ఆటోలో యువతులిద్దరూ ఎక్కి కూర్చున్నారు. ఇంతలో 15 నిమిషాలు ఆలస్యం చూపించిన రెండో ఆటోను రద్దు చేసింది. కానీ అక్కడికి చేరుకున్న రెండో ఆటోవాలా తన రైడ్ ఎందుకు క్యాన్సిల్ చేశారంటూ వాదనకు దిగాడు. అంతేకాదు పెట్రోల్ ఊరికే వస్తుందా, అంటూ రెచ్చిపోయాడు. అంతటితో ఆగలేదు దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి దిగాడు ఆటో డ్రైవర్. దీంతో నన్ను చెంపపై ఎందుకు కొట్టావ్ అంటూ ఆమె గట్టిగా నిలదీసింది. అప్పటిదాకా చోద్యం చూస్తూ కూర్చున్న మిగిలిన డ్రైవర్లు, జోక్యం చేసుకుని అతగాడిని పక్కకు తీసుకెళ్లారు.Yesterday I faced severe harassment and was physically assaulted by your auto driver in Bangalore after a simple ride cancellation. Despite reporting, your customer support has been unresponsive. Immediate action is needed! @Olacabs @ola_supports @BlrCityPolice pic.twitter.com/iTkXFKDMS7— Niti (@nihihiti) September 4, 2024కాగా బాధిత యువతి నితి తన నిరాశను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది. ఓలా కస్టమర్ సపోర్ట్ ఫిర్యాదు చేసినా, ఆటోమేటెడ్ ప్రత్యుత్తరాలు మాత్రమే అందాయి తప్ప, అంతకుమించి ఎలాంటి స్పందన లేదని ట్వీట్ చేసింది. తన స్నేహితురాలు క్లాస్ మిస్ కాకుండా చూసుకోవడానికి రెండు ఆటోలను బుక్ చేసుకోవడం మాత్రమే తమ తప్పు అని, రైడ్ రద్దుపై వివాదాలు సర్వసాధారణమైనప్పటికీ, డ్రైవర్ బెదిరింపులు, అమానుష ప్రవర్తన హద్దు మీరిందంటూ ఆగ్రహం చేసింది. అయితే దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.ఓలా స్పందనఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై ఓలా స్పందించింది. డ్రైవర్ చర్యలను ఖండిస్తోంది. నిందితుడైన డ్రైవర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అటువంటి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి తమ ప్రయాణీకుల భద్రతకు భరోసాకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. -
'ఆ తల్లి గొప్ప యోధురాలు': 55 ఏళ్ల వయసులో..!
ఓ ఒంటరి తల్లి రెస్ట్ తీససుకునే వయసులో ఆటో నడుపుతూ ఎందరికో ప్రేరణగా నిలిచింది. చెట్టంత కొడుకు ఉండి కూడా అనాథలా తన పొట్ట పోషించుకోవడానికి ఆటో డ్రైవర్‌గా మారాల్సి వచ్చింది. అందులో ఎదురయ్యే సవాళ్లను లెక్కచేయకుండా యోధురాలి వలే రాత్రిళ్లు కూడా ఆటో నడుపుతోంది. పైగా అడుక్కోవడం తప్పుగాని పనిచేసుకుని బతకడం తప్పుకాదని చెబుతుండటం విశేషం. అందుకు సబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో 55 ఏళ్ల ఓ మహిళ ఆటోను నడుపుతున్నట్లు కనిపిస్తుంది. ఆటో డ్రైవర్‌గా అర్థరాత్రి సమయాల్లో తిరగడం కష్టమైనా ఉక్కు సంకల్పంతో ధీశాలిగా ఆటోని నడుపుకుంటూ వెళ్లడం విశేషం. తన కొడుకు తనను గౌరవించకపోగా డబ్బుకోసం తనతో గొడపడుతున్నాడనే విషయాన్ని చెప్పుకొచ్చింది. బహుశా నా పెంపకంలోని లోపం అయ్యి ఉండొచ్చని బాధగా చెప్పింది. ఆమె తన భర్తను కోల్పోవడం వల్ల ఇలా రోడ్డు మీదకు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ వృత్తి చేసేందుకు నామూషీగా అనిపించలేదా అని అడగగా..అడుక్కోవడం సిగ్గు కానీ, ఏదో పనిచేసుకుంటున్నప్పుడూ సిగ్గు ఎందుకు అని ఎదురు ప్రశ్న వేస్తోంది. కష్టాల్లో కూడా సానుకూల దృక్పథంతో వ్యవహరించిన తీరు ఎందరికో స్ఫూర్తినిస్తుంది. అందుకు సంబంధించిన వీడియోని ఆయుష్ గోస్వామి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆ ఆ తల్లి గొప్ప యోధురాలు అని, మరికొందరూ..ఆమె కొడుకు మనిషిగా విఫలమయ్యాడు అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ayush Goswami | Business (@aapkartekyaho) (చదవండి: 'అమ్మ చేతి వంటే కంఫర్ట్ ఫుడ్'..!) -
జైనూరులో ఉద్రిక్తత
సాక్షి, ఆసిఫాబాద్/సాక్షి, హైదరాబాద్: గత ఆదివారం ఓ మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం చేయడంతో పాటు హత్యకు ప్రయతి్నంచిన ఘటన మంగళవారం వెలుగులోకి రావడం, బాధిత వర్గం పెద్దయెత్తున ఆందోళనకు దిగడంతో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు బుధవారం ఉదయం నిందితుడి ఇళ్లు, ఆటోను తగలబెట్టడంతో మొదలైన విధ్వంసం సాయంత్రం వరకూ కొనసాగింది. పట్టణంలో బంద్‌కు పిలుపునిచ్చిన బాధిత వర్గం మరో వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. వారికి చెందిన రెండు ప్రార్థనా మందిరాల్లో ఫర్నిచర్ కొందరు ధ్వంసం చేశారు. నాయకులపై దాడి చేయడమే కాకుండా వారి ఇళ్లపై రాళ్ల వర్షం కురిపించారు. ఇళ్లల్లోకి చొరబడి సామాగ్రి పగులగొట్టారు. కార్లు, మాక్సీ క్యాబ్‌లు, బైక్‌లను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. 100కు పైగా దుకాణాలను తగులబెట్టారు. నిందితుడికి చెందిన వర్గం జైనూరు వదిలి మైదాన ప్రాంతానికి తరలి పోవాలని డిమాండ్ చేశారు. వేలాది మంది బాధిత వర్గం వారు పట్టణంలోకి చేరుకుని ఒక్కసారిగా విధ్వంసానికి పాల్పడడం, ఇంకోవైపు మరోవర్గం కూడా కొన్నిచోట్ల దాడులకు దిగడంతో వారిని నిలువరించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. కాగా జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు నేతృత్వంలో బాధిత వర్గాన్ని శాంతింప జేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇరువర్గాల వారు సంయమనం పాటించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఒక ప్రకటనలో కోరారు. బాధితురాలికి మంత్రి సీతక్క పరామర్శ గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జైనూరు బాధితురాలిని మంత్రి సీతక్క పరామర్శించారు. మరింత మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. స్థానిక యువత సంయమనం పాటించాలని కోరారు. కాగా కాలేయ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం షాపెల్లి గ్రామానికి చెందిన ముద్రబోయిన రఘును కూడా మంత్రి పరామర్శించారు.1,000 మంది పోలీసులు, ఆర్ఏఎఫ్తో బందోబస్తు: డీజీపీజైనూరులో జిల్లా యంత్రాంగం కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించిందని డీజీపీ జితేందర్ తెలిపారు. మహిళపై అత్యాచారయత్నం, హత్యాయత్నం ఘటనతో జైనూరులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లు బుధవారం ఒక ప్రకటనలో ఆయన వెల్లడించారు. దాడులు, ప్రతిదాడులతో పరిస్థితి చేయి దాటుతుండడంతో ఆదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, జగిత్యాల, తెలంగాణ స్పెషల్ పోలీసు ప్లాటూన్స్ కలిసి మొత్తం 1,000 మంది పోలీసులను, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దింపినట్లు తెలిపారు. జైనూరులో పరిస్థితిని తనతో పాటు అదనపు డీజీ (శాంతిభద్రతలు), నార్త్ జోన్ ఐజీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్నెట్పై నిషేధం విధించామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీజీపీ వెల్లడించారు. -
Hyderabad: గచ్చిబౌలిలో కిడ్నాప్ కలకలం
హైదరాబాద్, సాక్షి: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేయడానికి ఓ వ్యక్తి యత్నించాడు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ అప్రమత్తం కావటంతో ప్రమాదం తప్పింది. కొండాపూర్ మజీద్ బండలో ఓ ప్రైవేట్ స్కూల్‌కి వెళ్లేందుకు పిల్లలు ఆటో కోసం చూశారు. అయితే.. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ పిల్లలు చేయిపట్టుకొని ఆటోలో ఎక్కించాడు. అనంతరం ఆటో మజీద్ బండ స్మశానవాటికవైపు వేళ్తుండటంతో అనుమానం వచ్చిన చిన్నారులు ఆ వ్యక్తిని ప్రశ్నించారు. అప్రమత్తం అయిన ఆటో డ్రైవర్ పిల్లలతో పాటు ఉన్న కిడ్నాపర్ పట్టుకొని సమీపంలో ట్రాఫిక్ పోలీసులకు అప్పగించాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ చందానగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉదయం 9 గంటలకు చందానగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన చిన్నారులు సుమారు 8 గంటల పాటు స్టేషన్లో ఉన్నారు. కిడ్నప్ ఘటనస్ధలం తమ పరిధిలోకి రాదంటూ సాయంత్రం గచ్చిబౌలీ పోలీసులకు అప్పగించారు. సకాలంలో స్పందించి తమ పిల్లలను కిడ్నాపర్ నుంచి రక్షించిన ఆటో డ్రైవర్‌ను పిల్లల కుటుంబ సభ్యులు అభినందించారు. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. -
నీళ్లలో మత్తు మందు ఇచ్చి.. నర్సింగ్ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అఘాయిత్యం
ముంబై: మహిళలపై నిత్యం జరుగుతున్న అఘాయిత్యాలు తీవ్ర ఆందోళనలు రెకేత్తిస్తున్నాయి. కోల్‌కతా ఘటన తరువాత ఇంకా ఎక్కువయ్యాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో లైంగిక వేధింపుల ఘటనలు నమోదు కాగా.. తాజాగా మరో నర్సింగ్ విద్యార్ధిపై అత్యాచారానికి పాల్పడిన ఉదంతం వెలుగుచూసింది.మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం విధులు పూర్తి చేసుకొని యువతి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రత్నగిరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సింగ్ విద్యార్థిని ఆటోలో ఇంటికి బయల్దేరింది. మార్గమధ్యలో డ్రైవర్‌ను నీళ్లు అడగ్గా.. అతను తాగే నీటిలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. దీంతో యువతి స్పృహ కోల్పోయి పడిపోయింది. అక్కడి నుంచి ఆమెను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.చంపక్ గ్రౌండ్ సమీపంలో తీవ్ర గాయాలతో బాధితురాలు అపస్మారక స్థితిలో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. యువతికి అనేక గాయాలైనట్లు వైద్యులు తెలపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.ఈ ఘటన రత్నగిరిలో కలకలం రేపింది. ఈ కేసులో సత్వర చర్యలు తీసుకోవాలని, నేరానికి పాల్పడిన నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ నర్సులు, ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రి వెలుపల నిరసనలు చేపట్టారు. -
ఆడబిడ్డలపై ఆగని అఘాయిత్యాలు
ప్రత్తిపాడు/ఫిరంగిపురం/టి.నరసాపురం: బాలికలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో ఒకేరోజు రెండు కేసులు.. ఏలూరు జిల్లాలో ఓ కేసు నమోదైంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు గ్రామానికి చెందిన దళిత బాలిక (13) నడింపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుంది. ఈ నెల 12న అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గండికోట వెంకటేశ్వరరావు ఉరఫ్ వెంకట్ పాఠశాలకు సమీపంలోని పంట పొలాల్లోకి బాలికను తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మంగళవారం బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ చేసిన ఎస్ఐ రవీంద్ర వెంకట్‌పై పోక్సో యాక్ట్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంకట్‌ను అదుపులోకి తీసుకున్నారు.వేధింపులతో బాలిక ఆత్మహత్య ఫిరంగిపురం మండలంలో యువకుడి వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. సీఐ వీరేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (17) ఇంటి వద్ద ఉంటుంది. ఈమెకు కొన్నాళ్ల కిందట బంధువుల అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో బాలిక తన బంధువులతో ఫిరంగిపురం తిరునాళ్లకు వచ్చింది.ఆ సమయంలో ఆ యువకుడు తన మిత్రులతో వెళ్లి బాలిక గురించి అసభ్యంగా మాట్లాడటంతో బాలిక తండ్రి యువకుడిని మందలించాడు. ఆ యువకుడు మరికొంతమందితో ఆ గ్రామానికి వెళ్లి బాలిక తండ్రిపై దాడి చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక పురుగుమందు తాగింది. ఆమెను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు బంధువులు తరలించగా..చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు యువకుడితో పాటు మరికొంతమందిపై మంగళవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా, బాలికను వేధిస్తున్న యువకుడు ఆదివారం అర్థరాత్రి ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.హోటల్ గదిలో బంధించి లైంగిక దాడిబాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురు యువకులపై టి.నరసాపురం పోలీసులు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు మంగళవారం మీడియాకు తెలిపారు. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలోని బొర్రంపాలేనికి చెందిన బాలిక (16) జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఈ నెల 6న బాలిక అదృశ్యం కావడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యం కేసు దర్యాప్తు దర్యాప్తు జరుగుతుండగానే బాలిక ఈ నెల 15న టి.నరసాపురం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తనపై లైంగిక దాడి జరిగిందని, దీనికి నలుగురు యువకులు బాధ్యులని చెప్పి ఫిర్యాదు చేసింది. దీంతో అదృశ్యం కేసును పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మార్పు చేశారు. ఆమె ఫిర్యాదు వివరాలను పోలీసులు వెల్లడిస్తూ.. బాలిక హైసూ్కల్లో చదువుతున్న సమయంలోనే గ్రామానికి చెందిన యువకుడు (20) ప్రేమిస్తున్నానని వెంటపడుతూ ఆమెను వేధించేవాడని తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆమెను జంగారెడ్డిగూడెంలోని ఓ హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. ఆ హాస్టల్ నుంచే బాలిక ప్రైవేట్ కళాశాలలో విద్యను అభ్యసిస్తోంది. ఈ క్రమంలో ఇంటికి వచ్చిన బాలిక ఈ నెల 6 నుంచి కనిపించలేదు. ప్రేమిస్తున్నానన్న యువకుడికి మరో ముగ్గురు యువకులు సహకరించడంతో..వారంతా కలిసి బాలికను కిడ్నాప్ చేసి విశాఖకు తీసుకువెళ్లారు. అక్కడ ఓ హోటల్ గదిలో బాలికను బంధించిన యువకుడు ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. -
ట్రాఫిక్ హోంగార్డుపై ఆటో వాలా దాడి
బంజారాహిల్స్: రాంగ్రూట్లో వస్తున్నావని ప్రశ్నించిన ట్రాఫిక్ హోంగార్డుపై ఆటోవాలా దౌర్జన్యానికి పాల్పడ్డాడు. హోంగార్డును ఉరికించి తీవ్రంగా కొడుతూ బండరాయితో హత్య చేసేందుకు యతి్నంచిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ ముత్యాల మెహర్ రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ హోంగార్డు జయప్రకాష్ కృష్ణానగర్ ఇందిరానగర్ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్నాడు. ఎల్లారెడ్డిగూడకు చెందిన ఆటోడ్రైవర్ ఎండీ ఒమర్ షరీఫ్ ఇందిరానగర్ గడ్డ నుంచి రాంగ్రూట్లో కృష్ణానగర్ వైపు వస్తున్నాడు. ఇదేం పద్ధతి అని, రాంగ్రూట్లో ఎందుకు వస్తున్నావని హోంగార్డు ప్రశ్నించాడు. నన్నే ఆపుతావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఆటోడ్రైవర్ షరీఫ్.. హోంగార్డుపై విచక్షణారహితంగా పిడిగుద్దులతో గాయపర్చాడు. నిందితుడి నుంచి తప్పించుకోవడానికి ప్రయతి్నంచిన హోంగార్డును వెంబడించి చితకబాదాడు. అందరూ చూస్తుండగానే అక్కడ ఉన్న బండరాయిని ఎత్తుకుని హోంగార్డును హత్య చేసేందుకు యత్నించగా బాధితుడు త్రుటిలో తప్పించుకుని నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గంటల వ్యవధిలోనే పరారీలో ఉన్న ఆటోడ్రైవర్‌ను పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 132, 121, 125 (ఏ), 126 (2), 119, ఎంవీయాక్ట్ 177 కింద కేసు నమోదు చేసి ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంగ్లిష్ యాదవ్ చాచా
ఆంగ్లంలో మాట్లాడితే ఆశ్చర్యపోయి, అబ్బురపడే రోజులు కావు ఇవి.. ఇంగ్లిష్‌లో మాట్లాడడం ఈరోజుల్లో చాలా సహజం. అయితే ఒక ఆటో డ్రైవర్ ఇంగ్లిష్‌లో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. మూడు మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మహారాష్ట్రలోని అమరావతిలో యాదవ్ చాచా అనే ఆటో డ్రైవర్ ఉన్నాడు. ఇతడిని ‘ఆటోడ్రైవర్ యాదవ్ చాచా’ అని పిలిచే వారు చాలా తక్కువ. ‘ఇంగ్లిష్ యాదవ్ చాచా’ అనే పిలిచేవారే ఎక్కువ. దీనికి కారణం యాదవ్ ఇంగ్లిష్ బాగా మాట్లాడుతాడు. తాజా వైరల్ వీడియోలో భూషణ్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ యాదవ్‌తో ఇంగ్లిష్‌లో మాట్లాడించాడు. ‘ఇంగ్లిష్ తెలిస్తే ఇంగ్లాండ్, అమెరికాలాంటి ఎన్నో దేశాలకు వెళ్లవచ్చు. ఇంగ్లిష్ నేర్చుకోండి. ఇది అంతర్జాతీయ భాష’ అంటూ మాట్లాడాడు యాదవ్. -
ప్రాణం తీసిన ఒక్క రూపాయి
ఖిలా వరంగల్: వరంగల్‌లో దారుణం జరిగింది. ‘ఆ్రఫ్టాల్ నువ్వు ఒక ఆటోడ్రైవర్వు. ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివా’..? అంటూ ఇద్దరి మధ్య జరిగిన చిన్న ఘర్షణ చివరికి ఒకరి ప్రాణం తీసింది. శనివారం వరంగల్ క్రిస్టియన్ కాలనీ గాం«దీనగర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ మిల్స్‌కాలనీ గరీబ్‌నగర్ గొర్రెకుంటకు చెందిన ఇసంపెల్లి ప్రేమ్‌సాగర్ (38) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రేమ్‌సాగర్ గాందీనగర్‌లోని ‘నబీ రూ.59కే చికెన్ బిర్యానీ’సెంటర్‌కు వెళ్లాడు. ఆదే సమయంలో గాందీనగర్‌కు చెందిన జన్ను అరవింద్ అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు స్నేహితులే. ఈ క్రమంలో ప్రేమ్‌సాగర్ బిర్యానీ తీసుకుని రూ.59కి బదులు రూ.60 ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. పక్కనే ఉన్న అరవింద్ దీనిపై స్పందించి.. ‘ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివి అయ్యావా’అంటూ ప్రేమ్‌సాగర్‌ను హేళన చేస్తూ మాట్లాడాడు. దీంతో ప్రేమ్‌సాగర్ ఒక్కసారిగా ఆవేశానికిలోనై ‘నేను ఏమైనా అడుక్కు తింటున్నానా.. ఏం మాట్లాడుతున్నావు’అంటూ అరవింద్‌ను నిలదీశాడు. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. తోపులాటలో అరవింద్, బలంగా ప్రేమ్‌సాగర్‌ను నెట్టివేయగా రోడ్డుపై పడిపోయాడు. దీంతో అతని తలకు బలమైన గాయమై చిన్నమెదడు చిట్లి ముక్కు, చెవుల్లోనుంచి రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ప్రేమ్‌సాగర్ తమ్ముడు విద్యాసాగర్‌తోపాటు అరవింద్ కలసి ఆటోలో ప్రేమ్‌సాగర్‌ను ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 1 గంట సమయంలో ప్రేమ్‌సాగర్ మృతిచెందాడు. వెంటనే అరవింద్ ఎంజీఎం నుంచి నేరుగా మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు లొంగిపోయాడు. మృతుడి సోదరుడు విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు శనివారం అరవింద్‌పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మల్లయ్య తెలిపారు. -
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నా లాగా కష్టపడకుండా నా బిడ్డలు పెరగాలి.. చదువుకోవాలి. ఉన్నత స్థితిలోకి రావాలని అని తల్లిదండ్రులు పిల్లల అభివృద్ధికోసం కష్టపడతారు.వారి బంగారు భవిష్యత్తుకోసం కలగంటారు. అలాగే పిలలు అమ్మా నాన్నల్ని కాలు కిందపెట్టకుండా చూసుకోవాలి. మంచి కారు కొనాలి.. ఇల్లు కొనాలి.. ఇలా రకరకాలుగా ఊహించుకుంటారు. తమ ఆశయ సాధన కోసం పట్టుదలగా చదువుతారు. అచ్చం ఇలాగే చెన్నైలోని ఒక అమ్మాయి ఆలోచించింది. తన తల్లిదండ్రులు ఏ వస్తువునైనా ధర ట్యాగ్ చూడకుండా నచ్చింది కొనుక్కోవాలి అని కలగంది ఓ ఆటో డ్రైవర్ కూతురు. దాన్ని సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ స్టోరీ పూర్తిగా అర్థం కావాలంటే వివరాలను తెలుసుకుందాం రండి!I want to be at a place where my parents don’t see the price tag when they go to a shop,says Poongodhai, daughter of an auto-driver, who came first among GCC schools scoring 578 in the class XII board exams. Speaking in fluent English, Poongodhai of Perambur GCC school said she… pic.twitter.com/2T1Mbnz8vB— Omjasvin M D (@omjasvinTOI) May 6, 2024తాజాగా తమిళనాడు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచింది ఆటోడ్రైవర్ కుమార్తె పూంగోధయ్. పెరంబూర్ జీసీసీ స్కూల్‌కు చెందిన పూంగోధయ్ 578 స్కోరుతో పాఠశాల టాపర్‌గా నిలిచింది. తన కుటుంబం, సోదరి కాలేజీ, సిబ్బంది, తన ఇలా ప్రతీ ఒక్కరూ బాగా సహక రించారంటూ ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతూ బికామ్, సీఏ చదవాలని కోరుకుంటోంది.Her sister Shobana breaks down responding to her sister’s success coming first among GCC schools in the 12th board examinations. Both of them are daughters of auto driver pic.twitter.com/qSS6EffAbP— Omjasvin M D (@omjasvinTOI) May 6, 2024ఒక చిన్న అద్దే ఇంట్లో నివసించే ఆమె తండ్రి ఒక ఆటో డ్రైవర్. తల్లి డొమెస్టిక్ హెల్పర్‌గా పని చేస్తుంది. తండ్రి ఆరోగ్యం అంతంత మాత్రమే. సోదరి బి.ఫార్మ్ చేస్తోంది. తండ్రి అనారోగ్యం రీత్యా కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. తండ్రి పడుతున్న కష్టాన్ని గమనించిన అక్కా చెల్లెళ్లిద్దరూ చదువుల్లో రాణించారు. సోదరి స్కూలు ఫస్ట్ రావడంపై శోభన భావోద్వేగానికి లోనయింది. తమ బిడ్డలు రాణించడం సంతోషంగా ఉందంటూ ఆనందం ప్రకటించారు తల్లి దండ్రులు.అటు ఇది తమ టీచర్ల ఘనత అని పెరంబూర్‌లోని పాఠశాల హెచ్ఎం కూడా ఆనందాన్ని ప్రకటించారు. 6వ తరగతి నుంచి ఇంగ్లీషు నేర్పుతామని, దీంతో విద్యార్థులు అనర్గళంగా మాట్లాడుతారని చెప్పారు. స్పోకెన్ ఇంగ్లీష్‌లో తామిచ్చిన శిక్షణే ఇందుకు నిదర్శనమని చెప్పారు. -
పది రోజుల్లో బిడ్డ పెళ్లి.. అంతలోనే తండ్రి మృతి
కోరుట్ల: పది రోజుల్లో బిడ్డ పెళ్లి.. అంతలోనే వాంతులు చేసుకొని, మృతిచెందాడు కోరుట్లకు చెందిన ఓ ఆటోడ్రైవర్. వైద్యులు సమయానికి చికిత్స అందించక పోవడం వల్లే చనిపోయాడని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి ఫర్నిచర్ ధ్వంసం చేసి, దవాఖానా ఎదుట ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని హాజీపురకు చెందిన నజీబుర్ రెహ్మాన్(48) ఆటోడ్రైవర్. ఆదివారం మధ్యాహ్నం బస్టాండ్ ఆటో అడ్డా వద్ద వాంతులు చేసుకున్నాడు. అక్కడున్నవారు అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించకుండా గంటసేపు కాలయాపన చేసి, చివరికి నజీబుర్ రెహ్మాన్ మృతిచెందినట్లు చె ప్పారు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెబితే మరో ఆస్పత్రికి తీసుకువెళ్లేవారమని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధువులతో కలి సి ఆస్పత్రి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసి, ఆందో ళన చేపట్టారు. వైద్యుడు శ్రవణ్, సిబ్బందిపై గొడవకు దిగడంతో ఓ గదిలోకి వెళ్లి, దాక్కున్నారు.న్యాయం జరిగేలా చూస్తామని హామీ..పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ గొడవ సద్దుమణగలేదు. బాధితులు వైద్య సిబ్బంది దాక్కున్న గదిలోకి పెట్రోల్ విసరడంతో అప్రమత్తమయ్యారు. వారిని అక్కడినుంచి సురక్షితంగా తరలించారు. సుమారు 4 గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. చివరకు మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్రావు, కోరుట్ల సీఐ సురేశ్‌బాబు, ఎస్సైలు చిరంజీవి, శ్యాంరాజ్, నవీన్ మృతుడి బంధువులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఈ నెల 17న పెద్ద కూతురి వివాహం జరగాల్సి ఉంది. ఈ సమయంలో నజీబుర్ రెహ్మాన్ ఆకస్మిక మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.వాంతులు చేసుకున్న కోరుట్లవాసివైద్యులు చికిత్స అందించలేదనికుటుంబసభ్యుల ఆరోపణప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు,సిబ్బందితో గొడవఫర్నిచర్ ధ్వంసం -
సమ్మర్ హీట్‌కి ఈ ఆటో డ్రైవర్ భలే చెక్ పెట్టాడు!
ఈ ఏడాది సమ్మర్ మొదలవ్వక మునుపే ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. అయినప్పటికీ ఏదో ఒక పని మీద బయటకు వెళ్లకుండా పని అవ్వదు. అలాంటి తరుణంలో ఓ ఆటో డ్రైవర్ ఎండ నుంచి రక్షణ కోసం చేసిన ఆలోచన నెటిజన్లు ఫిదా అయ్యారు. వాట్ ఐడియా బాస్ అంటూ అతడిపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.ఏం చేశాడంటే..?మనసుంటే మార్గం ఉంటుందన్న రూటులో సరికొత్తగా ఆలోచించాడు ఈ ఆటో డ్రైవర్. ఈ ఎండలకు ఏసీ కారు లాంటివి తప్ప సాధారణ బస్సు, ఆటోల్లో ప్రయాణించడం మహా కష్టం. ముఖ్యంగా ఆటోలో ఎడపెడా వేడి గాల్పు కొట్టేస్తుంది. అందుకని ఈ డ్రైవర్ ఆటో చుట్టూతా చక్కగా కవర్ అయ్యేలా మటితో నింపిన గోను ఏర్పాటు చేసి గడ్డి నాట్లు వచ్చేలా చేశాడు.దీంతో ఆటోలో కూర్చొన్న వాళ్లకు మండే ఎండలో చల్లటి వెన్నెల్లో ఉన్న పీల్ కలుగుతుంది. ఆటోలో సహజసిద్ధమైన ఏసీ కదూ ఇది..!నిజంగా ఈ డ్రైవర్ ఆలోచనకు హ్యాట్సాప్ అని చెప్పకుండా ఉండలేం కదూ..!. మొత్తం పల్లె పచ్చదనాన్ని ఆటోతో పట్నంలోకి తీసుకొచ్చాడేమో..! అన్నంత అందంగా ఉంది కదూ ఆ డ్రైవర్ ఐడియా..! View this post on Instagram A post shared by WAHED MIRZA (@wahed_mirza8639) -
లేదు డ్రైవర్ మాటలకూ సీఎం జగన్ ఫిదా..!
-
ఎన్నికల బరిలో ఆటో డ్రైవర్
దేశంలో త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలు పలు చోట్ల ఆసక్తికరంగా మారాయి. యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను వెల్లడించాయి. ఇంతలోనే ఈ స్థానం నుంచి ఒక ఆటో డ్రైవర్ ఎన్నికల రంగంలోకి దూకి, తాను బీజేపీ అభ్యర్థి డాక్టర్ మహేశ్ శర్మ, ఎస్పీ అభ్యర్థి మహేంద్ర నగర్‌లకు పోటీ ఇస్తానని చెబుతున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన జ్ఞానదీప్ అనే ఆటో డ్రైవర్ గౌతమ్ బుద్ధ నగర్ లోక్‌సభ ఎన్నికల్లో తన పోటీకి సంబంధించి నామినేషన్ పత్రాలను జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో దాఖలు చేశాడు. ఈయన ఆటో నడుపుతూ చాలాకాలంగా గ్రేటర్ నోయిడాలో తన కుటుంబంతో పాటు ఉంటున్నాడు. జ్ఞాన్‌దీప్ మీడియాతో మాట్లాడుతూ గౌతమ్‌బుద్ధనగర్‌లో ఇప్పటి వరకు ఏ నేత కూడా అభివృద్ధి పనులు చేపట్టలేదని, అందుకే తాను రంగంలోకి దిగుతున్నానని తెలిపాడు. తాను మార్పును కోరుకుంటున్నానని, అందుకోసం పాటుపడతానని పేర్కొన్నాడు. స్థానికంగా రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయాడు. తాను రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ మహేశ్ శర్మ, ఎస్పీ అభ్యర్థి మహేంద్ర నగర్‌లకు పోటీగా నిలుస్తానని తెలిపాడు. తాను ఎంపీగా ఎన్నికైతే స్థానికంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, ట్రాన్స్జెండర్లకు ఇళ్లు మంజూరు చేయడంతోపాటు వారికి ఉపాధి కల్పించేందుకు చేయూతనిస్తానని అన్నాడు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండేలా, వారు మూడు షిఫ్టుల్లో పనిచేసేలా చూస్తానని పేర్కొన్నాడు.. लोकसभा चुनाव 2024 गौतमबुद्ध नगर में खड़ा हुआ गजब उम्मीवार, भाजपा-सपा को टक्कर देने आया एमपी का ड्राइवर, देखिए दिलचस्प वीडियो @ECISVEEP #LokSabhaElection2024 #Noida (@mayank_tawer ) pic.twitter.com/1HIsaBPEWo — Tricity Today (@tricitytoday) April 1, 2024 -
హాయి హాయిగా... కూల్ కూల్‌గా!
ఎలాంటి క్యాప్షన్ లేకుండా రమీజ్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన చెన్నై ఆటోడ్రైవర్ వీడియో 3 కోట్ల ఎనభై ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ‘ఏమిటీ ఆటోడ్రైవర్ స్పెషాలిటీ?’ అనే విషయానికి వస్తే... ఎండా కాలంలో చెన్నైలో వేడి అంతా ఇంతా కాదు. ఈ వేడిని తట్టుకోవడానికి సదరు ఆటోడ్రైవర్ ఎకో ఫ్రెండ్లీ ఏసీ ఫ్యాన్‌ను తయారుచేసి తన ఆటోలో బిగించాడు. ఆటోడ్రైవరే కాదు ప్రయాణికులు కూడా హాయి హాయిగా కూల్ కూల్‌గా ప్రయాణిస్తున్నారు. -
ఆ ఆటో డ్రైవర్ ఇంగ్లీష్‌కి టూరిస్ట్ ఫిదా!
విదేశీ టూరిస్టలు మన దేశంలోని చారిత్రక ప్రదేశాలకు వచ్చినప్పుడూ ఇబ్బంది పడుతుంటారు. మనతో కమ్యూనికేషన్ చేయలేక నానాపాట్లు పడుతుంటారు వాళ్లు. అందులోనూ మన దేశంలో చాలామందికి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడటం రాకపోవడం లేదా వాళ్లు చెప్పింది అర్థం చేసుకోలేక ఇబ్బంది పడతుండటం జరుగుతుంది. కానీ ఈ ఆటో డ్రైవర్ మాత్రం అర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడి యూకే టూరిస్ట్‌ని ఆకట్టుకున్నాడు. అతడు ఇంగ్లీష్ మాట్లాడుతున్న తీరుకి ఇంప్రెస్ అయ్యి అతడితో జరిగిన సంభాషణను వివరిస్తూ.. అందుకు సంబధించిన వీడియోని కూడా నెట్టింట షేర్ చేయడంతో తెగ వైరల్ అవ్వుతోంది. బ్రిటిష్ వాగ్లర్ జాకీ ఇటీవల కేరళ పర్యటనలో ఉన్నప్పుడూ జరిగింది ఈ ఘటన. అతను అక్కడ ఓ హోటల్లో స్టే చేశాడు. అయితే ఆ హోటల్ని ఖాళీ చేద్దామంటే.. సడెన్‌గా ఏటీఎం వర్క్ చేయడం మానేసింది. దీంతో ఫోర్ట్ కొచ్చికి వెళ్లే ప్రధాన రహదారి గుండా ఏటీఎం సెంటర్ ఎక్కడుందా? అని సర్చ్ చేయడం మొదలుపెట్టాడు. ఇంతలో అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ ఆష్రఫ్ ఏంటీ సార్ అంటూ ఆంగ్లంలో ఆ టూరిస్ట్‌ని పలకరించాడు. మొహమాటంగా టూరిస్ట్ పొడిపొడిగా సమాధానం ఇచ్చి వెళ్లేందుకు యత్నిస్తుంటే..ఎక్కడికైనా వెళ్తారా? ఆటో కావాలా అంటూ ఫ్రెండ్లీగా అర్థవంతమైన ఆంగ్లంలో మాట్లాడుతుండటంతో.. ధైర్యంగా టూరిస్ట్ తన సమస్య వివరిస్తాడు. దాని గురించి తెలియజేయడమే కాకుండా ఆటోలో రావాల్సిందిగా కోరతాడు డ్రైవర్. అందుకు టూరిస్ట్ నిరాకరిస్తాడు. అయితే ఏటీఎం కోసం కాంప్లిమెంటరీ రైడ్ చేయమంటూ తన ఆటోలోకి ఆహ్వానిస్తాడు. ఆ ఆటోడ్రైవర్ మర్యాదపూర్వకమైన తీరుని చూసి టూరిస్ట్ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాతా ఆ టూరిస్ట్‌ని ఏటీఎం సెంటర్ వద్ద డ్రాప్ చేసి వెళ్లిపోతాడు ఆటో డ్రైవర్. చక్కగా మంచి ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడడాని ఆ ఆటో డ్రైవర్ని మెచ్చుకుంటూ అతనితో జరిగిన సంభాషణ గురించి పోస్ట్‌లో రాసుకొచ్చాడు ఆ యూకే టూరిస్ట్. గతంలో ఇలా పర్యాటనకు వెళ్లినప్పుడూ పలు భాషా సమస్యలు ఎదుర్కొన్నాని ఆ పోస్ట్‌లో తెలిపాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనికి మిలియన్లలో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. View this post on Instagram A post shared by Zakky (@zakkyzuu) (చదవండి: 1200 ఏళ్ల నాటి పురాతన సమాధి..అందులో ఏకంగా కోట్లు..!) -
ఏం చేస్తున్నామన్నది కాదు ముఖ్యం...మహిళా ఆటో డ్రైవర్ సక్సెస్ స్టోరీ
ఏ పని అయితేనేం.. గౌరవంగా బతకాలి.. ఒకళ్ల మీద ఆధారపడకుండా బతకాలి.. ఇదీ హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న అరుణ అంతరంగం. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం. ఆటోడ్రైవర్‌గా పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది.. తాను చేస్తున్న పని పట్ల ఈ నిబద్ధతే ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపింది. బిజీ బిజీ నగరంలో, ట్రాఫిక్ కష్టాలను ఈదుతూ కుటుంబ బాధ్యతలను మోస్తోంది. బిడ్డల్ని ప్రాణానికి ప్రాణంగా సాదుకుంటోంది. ఏడడుగులు నడిచి, కడదాకా తోడు ఉంటానని బాస చేసిన భర్త అనారోగ్యంతో తనకు దూరమైతే... కుంగిపోలేదు. ఆ కష్టాన్ని దిగమింగుకుంది. ఆడది అంటే అబల కాదు.. ఆడపులిలా బతకాలి అన్న భర్త మాటలే ఆమెకు వేద మంత్రాలయ్యాయి. ఆయన నేర్పించిన విద్యతోనే బతుకు దెరువు వెతుక్కుంది. కష్టాలు, కన్నీళ్లు ఎన్నొచ్చినా.. వెరవ లేదు. చివరికి తోటి డ్రైవర్ల నుంచి వేధింపులొచ్చినా బెదరలేదు. అన్నల్లా ఆదరించిన మరికొంతమంది ఆటో కార్మికులు, కుటుంబం మద్దతుతో నెగ్గుకొస్తోంది. నేను నేటి మహిళను అంటోంది. సాధారణంగా మగవాళ్లకే పరిమితమని భావించే మోటార్ ఫీల్డ్‌లో సత్తా చాటుకుంటోంది అరుణ. హైదరాబాద్ రోడ్లపై రివ్వున దూసుకు పోతుంది. బాధలొచ్చాయని భయపడకుండా తనలాగా ధైర్యంగా బతకాలని తోటి మహిళలందరికీ పిలుపునిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలందరికీ శుభాకాంక్షలు అందిస్తోంది సాక్షి. డాట్ కామ్. -
ఛాయ్‌వాలా పీఎం.. ఆటోవాలా సీఎం: మిలింద్ దేవరా
ముంబయి: కాంగ్రెస్‌ను వీడి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరిన సీనియర్ నేత మిలింద్ దేవరా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజకీయాల్లో ప్రస్తుత మార్పులు సమానత్వ విలువల్ని కోరుకుంటున్నాయని చెప్పారు. టీ అమ్మేవారు ప్రధానమంత్రి స్థానంలో.. రిక్షా నడిపే వ్యక్తి మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని అన్నారు. ఈ మార్పు భారత రాజకీయాల్ని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. ఏక్నాథ్ షిండ్ సామర్థ్యంపై తనకు నమ్మకం ఉందని మిలింద్ దేవరా అన్నారు. ఆయన సారథ్యంలో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని చెప్పారు. "దేశంలోని అత్యంత కష్టపడి పనిచేసే, అందుబాటులో ఉండే సీఎంలలో ఏక్నాథ్ షిండే ఒకరు. మహారాష్ట్రలో అణగారిన వర్గాల పట్ల ఆయనకున్న అవగాహన, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి ఆయన చేసిన కృషి అభినందనీయం" అని ఆయన స్పష్టం చేశారు. "మహారాష్ట్రుల సంపన్నమైన భవిష్యత్తు కోసం షిండే ప్రయత్నాలతో ప్రేరణ పొందాను. ఆయన కృషికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను. భారతదేశం కోసం నరేంద్ర మోదీ, అమిత్ షాల దూరదృష్టి నన్ను ఆకర్షించాయి." అని మిలింద్ దేవరా అన్నారు. "సృజనాత్మక ఆలోచనలకు విలువనిచ్చి, నా సామర్థ్యాలను గుర్తించే నాయకుడితో నేను పని చేయాలనుకుంటున్నాను. ఏక్నాథ్ షిండే నా సామర్థ్యాలను నమ్ముతారు." అని దేవరా అన్నారు. కష్టపడి పనిచేయడం వల్ల అసాధ్యమైన విషయాలు కూడా సాధ్యమవుతాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో కీలక నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరిపోయారు. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురైన దేవరా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇదీ చదవండి: ‘ఏక్ భారత్...’కు ప్రతిబింబం పొంగల్: మోదీ -
చిన్న వివాదం.. ఆ డీఎస్పీ ప్రాణం తీసింది!
ఛండీగఢ్: చిన్న వివాదం పంజాబ్‌లో ఓ పోలీస్ ఉన్నతాధికారి ప్రాణం పోయేందుకు కారణమైంది. ఓ ఆటోడ్రైవర్‌తో గొడవ కారణంగానే ఆయన ప్రాణం పోయింది. అయితే.. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి 48 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు జలంధర్ పోలీసులు. అర్జున అవార్డు గ్రహీత, పంజాబ్ పోలీస్ ఉన్నతాధికారి(డీఎస్పీ స్థాయి) దల్బీర్ సింగ్ డియోల్ (54)హత్యకు గురికావడం పంజాబ్‌లో అలజడి రేపింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఓ ఆటో డ్రైవర్ అని, అతనితో దల్బీర్ వాగ్వాదానికి దిగడమే హత్యకు కారణమైందని చివరకు పోలీసులు నిర్ధారించారు. ఏం జరిగిందంటే.. దల్బీర్ సింగ్ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా స్నేహితులతో కలిసి సాయంత్రం వేళ బయటకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో తనను ఇంటి దగ్గర దింపాలని సదరు ఆటో డ్రైవర్‌ను కోరారు. అందుకు డ్రైవర్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. అది కాస్త ఘర్షణగా మారే క్రమంలో.. దల్బీర్ దగ్గర ఉన్న సర్వీస్ తుపాకీని లాక్కుని ఆ డ్రైవర్ కాల్పులు జరిపాడు. దాంతో దల్బీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆపై జలంధర్ నగర శివారులో ఓ కాలువ సమీపంలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు. మరుసటిరోజు జుగల్ కిషోర్ అనే పోలీసాధికారి ఆ మృతదేహాన్ని మొదటగా గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో దర్యాప్తు మొదలైంది. ఛేదించారిలా.. ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు.. ఓ ఆటోను గుర్తించారు. దాని నెంబర్ ప్లేట్ ఆధారంగా.. అక్కడి నుంచి ఉన్న మూడు దారుల్లో ట్రేస్ చేసే యత్నం చేశారు. అదే సమయంలో ఆ కాలువకు దగ్గర్లోని టవర్‌కు వచ్చిన మొబైల్ సిగ్నల్స్ ఆధారంగానూ సమాంతరంగా దర్యాప్తు కొనసాగించారు. చివరకు నిందితుడిని ఆటో డ్రైవర్ విజయ్ కుమార్‌గా గుర్తించి అరెస్టు చేశారు. అతడిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఆసియా క్రీడల్లో దల్బీర్ వెయిట్ లిఫ్టింగ్‌లో బంగారు పతకాన్ని సాధించారు. అందుకే 2000లో ఆయనను కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. అనంతరం ఆయన పోలీసుశాఖలో చేరారు. -
ఏకంగా మూడు పెళ్లిల్లు! చివరికి అత్తమామలను దారుణంగా..
మహబూబ్‌నగర్: యువతిని ప్రేమించి మూడో వివాహం చేసుకున్న వ్యక్తి తనకు కట్నం కావాలంటూ అత్తమామను ఇంటికి పిలిపించి కత్తితో పొడిచిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మంగంపేట్‌తండాకు చెందిన సభావత్ సాగర్ హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే క్రమంలో వనపర్తి జిల్లా ఖిల్లాఘణపూర్‌కు చెందిన ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భిణిగా ఉన్న సమయంలో ఆస్పత్రిలో చేర్పించకపోవడంతో ఆమె మృతి చెందింది. కొన్ని రోజుల తర్వాత ఖిల్లాఘణపూర్ పక్కనే ఉన్న మరో తండాకు చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఈమె గర్భిణిగా ఉన్న సమయంలో గండేడ్ మండలం పంచలింగాల్‌తండాకు చెందిన మోహన్, మంగమ్మల కూతురు మాయను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. సంవత్సర కాలంగా వీరిద్దరూ ఇంటికి రాకుండా బయటనే ఉన్నారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు తండాకు రావాలని తెలపడంతో మాయ, సాగర్ శనివారం మంగంపేట్‌తండాకు వచ్చారు. తనకు రూ.2లక్షలు కావాలని ఇస్తే ఆటో నడిపిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటానని తెలిపాడు. ఈ విషయం మాట్లాడటానికి అత్తమామలను, రెండో భార్యను కూడా పిలిపించాడు. డబ్బులు ఇవ్వడానికి అత్తమామలు ఒప్పుకుని ఫోన్లో బంధువులతో ఈ విషయమై మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో కోపోద్రిక్తుడైన అల్లుడు సాగర్ అప్పటికే తెచ్చుకున్న కత్తులను తీసి అత్తమామలను పొడిచాడు. వారు అరవడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని అతన్ని వారించారు. కత్తిపోట్లతో గాయాలపాలై ఉన్న వారిని వాహనంలో మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. కాగా నిందితుడిని ఆయన తల్లి సహకరించడంతో అక్కిడి నుంచి పారిపోయినట్టు గ్రామస్తులు తెలిపారు. ఇవి చదవండి: తప్పిపోయి రెండేళ్లు దాటింది! ప్రస్తుతం.. -
ఆటో డ్రైవర్ దుర్మార్గం! వృద్ధురాలిపై..
యలమంచిలి: ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన ఆటో డ్రైవర్ దుర్మార్గంగా ప్రవర్తించాడు. వృద్ధురాలిపై దాడి చేసి ఆమె మెడలో పుస్తెలతాడును లాక్కుని పరారయ్యాడు. పరవాడ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాలివి. ఈ నెల 2వ తేదీన అనకాపల్లి మండలం నర్సింగరావుపేట, చవితిని వీధికి చెందిన చవితిని చిలకమ్మ (70) రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో ఉన్న తన కుమార్తె మరపురెడ్డి భవానీ ఇంటికి వెళ్లడానికి అనకాపల్లిలో ఆటో ఎక్కింది. ఆటో డ్రైవర్ ప్రయాణికులతో పాటుగా ఆమెను యలమంచిలి పట్టణానికి తీసుకొచ్చాడు. అప్పుడు చిలకమ్మ పంచదార్ల వెళ్లడానికి ఆటోని యలమంచిలిలో నిలపమని డ్రైవర్‌కు చెప్పగా నేను కూడా పంచదార్ల మీదుగా వెళతానని ఆమెను మభ్యపెట్టి ఆటోను పురుషోత్తపురం సమీపంలో ములకలాపల్లి మీదుగా పోలవరం కాలువ వైపు పోనిచ్చాడు. నిర్మానుష్య ప్రాంతానికి చేరాక ఆమెను బెదిరించి ఆమె మెడలో గల మూడు తులాల బంగారు గొలుసు, రెండు తులాల తాడును లాక్కొని ఆమె తలపై రాయితో కొట్టి ఉడాయించాడు. దీంతో ఆమె సంఘటన స్థలంలో స్పృహ తప్పి పడిపోయింది. కొంత సమయానికి కొత్తలి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆమెను గమనించి ఆటోలో యలమంచిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ కె.సన్నిబాబు బాధితురాలి నుంచి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వృద్ధురాలిపై దాడికి పాల్పడ్డ ఆటోడ్రైవర్ యలమంచిలిలో ఒక మందుల దుకాణం వద్ద ఆటోను నిలిపి మందులు కొనడానికి షాపు దగ్గరకు వెళ్లగా అక్కడ ఉన్న సీసీ పుటేజీ ఆధారంగా గుర్తించి విచారణ చేశారు. కొక్కిరాపల్లి సమీపంలో గురువారం ఆటోలను తనిఖీ చేస్తుండగా అనకాపల్లి బీఆర్టీ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ఎర్రబోయిన రెడ్డప్ప ఆలియాస్ శేఖర్‌గా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు చేసిన నేరాన్ని అంగీకరించడంతో అతనితో పాటు మరో ఆటో డ్రైవర్ భర్నికాల గంగరాజు పాత్ర ఉండడంతో వారి వద్ద నుంచి బంగారం అమ్మిన నగదు, ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ శుక్రవారం విలేకరులకు తెలిపారు. పథకం ప్రకారమే చోరీ.. కాగా అనకాపల్లిలో ఆటో ఎక్కడానికి వచ్చిన వృద్ధురాలు చవితిన చిలుకమ్మ మెడలో బంగారంపై కన్నేసిన నిందితులు పథకం ప్రకారమే ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. రెడ్డప్ప వృద్ధురాలి నుంచి దొంగిలించిన బంగారాన్ని స్నేహితుడు గంగరాజుకు ఇవ్వగా, గంగరాజు దానిని విక్రయించి వచ్చిన నగదు పంచుకుందామనుకున్నారు. క్రికెట్ బెట్టింగ్‌లు ఇతర అలవాట్లకు బానిసైన గంగరాజు అప్పుల పాలై రెడ్డప్పను డబ్బు అడిగాడు. స్నేహితుడు అడిగిన డబ్బు ఇవ్వడానికే ఈ దొంగతనం చేయాల్సి వచ్చిందని రెడ్డప్ప విచారణలో ఒప్పుకున్నట్టు ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. అన్నమయ్య జిల్లాకు చెందిన ఎర్రబోయిన రెడ్డప్ప ఆలియాస్ శేఖర్ అనకాపల్లి వలస వచ్చి కొంతకాలంగా భార్యతో కలిసి బీఆర్టీ కాలనీలో నివాసం ఉంటున్నాడని తెలిపారు. ఇటువంటి ఘటనల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఆటోల్లో ప్రయాణించేటపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ సూచించారు. ఇవి చదవండి: సీఏ విద్యార్థిని తీవ్ర నిర్ణయం! అసలేం జరిగింది? -
కట్నం తేవాలంటూ భార్యకు వేధింపులు
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలో డోలాస్‌నగర్‌లో నివాసముండే ఓ ఆటోడ్రైవర్ తన భార్య చనిపోవడంతో మ్యారేజ్ బ్యూరో ద్వారా వివాహమై భర్త వదిలేసిన ఓ మహిళను చర్చిలో వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న అనంతరం కట్నం కావాలని మొదటిభార్య సంతానంతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనపై 5 రోజుల క్రితం సదరు మహిళ తాడేపల్లి పోలీసులను ఆశ్రయించింది. ఆమెకు ఎటువంటి న్యాయం జరగకపోవడంతో మంగళవారం పోలీస్‌స్టేషన్ వద్ద ఆత్మహత్యయత్నం చేసింది. బాధిత మహిళ వివరాల ప్రకారం.. మ్యారేజ్‌బ్యూరో ద్వారా డోలాస్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ బుచ్చిబాబును అనురాధ 2023 ఫిబ్రవరి 11వ తేదీన ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకునేముందు తన భార్య చనిపోయిందని, తన ఇద్దరు పిల్లలు తన దగ్గర ఉండరని, సొంత ఇంట్లో నివాసముంటామని, మొదటి భర్తతో పుట్టిన నీ కొడుకును సైతం హాస్టల్లో ఉంచాలని బుచ్చిబాబు అనురాధతో చెప్పాడు. బుచ్చిబాబు కుమార్తెకు వివాహమైనా భర్తకు దూరంగా ఉండడంతో ఆమె కూడా అదే ఇంట్లో నివాసముంటోంది. వివాహమైనప్పటి నుంచి ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నాడని, ఇంటి ఖర్చుల నిమిత్తం డబ్బులు అడిగితే నువ్వు నాకు కట్నం ఇవ్వలేదు, ముందు కట్నం తేవాలని వేధింపులకు గురిచేశారని బాధితురాలు అనురాధ వాపోయింది. ఈవిషయమై నిలదీయడంతో తనపై పలుసార్లు దాడికి పాల్పడ్డాడని తెలిపింది. ఐదు రోజుల క్రితం బుచ్చిబాబు, అతని కుమార్తె, కుమారుడు, తల్లి తన నోట్లో గుడ్డలు కుక్కి ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని హింసించగా, వారినుంచి తప్పించుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చానని, ఇక్కడ పోలీసులు ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. చివరకు సీఐ మల్లిఖార్జునరావును కలవగా, మ్యారేజ్ సర్టిఫికేట్ తేవాలని సూచించారన్నారు. తన మొదటి భర్త వదిలేసి ఎటో వెళ్లిపోతే అతనితో విడాకులు అయినట్లు పత్రాలు, మరల బుచ్చిబాబును ద్వితీయ వివాహం చేసుకున్నట్లు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని అంటున్నారని, వివాహం జరిగిన చర్చిలో పాస్టర్‌ను మ్యారేజ్ సర్టిఫికేట్ అడిగితే మేము అలాంటివి ఇవ్వమని చెబుతున్నారని బాధిత మహిళ వాపోయింది. ఈక్రమంలో పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యయత్నం చేయగా స్థానిక మీడియా ప్రతినిధులు అడ్డుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులను వివరణ అడుగగా అనూరాధ రెండవ భర్త బుచ్చిబాబు అందుబాటులో లేడని, అతడ్ని పోలీస్‌స్టేషన్‌కు రావాలని వారి కుటుంబ సభ్యులకు హెచ్చరించామని, అనూరాధ, బుచ్చిబాబుల మధ్య సఖ్యత కుదరపోతే కేసు నమోదు చేసి ఫ్యామిలీ కౌన్సెలింగ్‌కు పంపనున్నట్లు తెలిపారు. -
బలవంతంగా ఆటోలో ఎక్కించి.. వివాహితపై కిరాతకంగా..
సాక్షి, ఆదిలాబాద్: వివాహితను వేధించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దుబ్బక సునీల్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం... మహారాష్ట్రకు చెందిన ఓ వివాహిత (30) తమ బంధువులుంటున్న అందర్‌బంద్ గ్రామానికి వెళ్లడానికి ఆదిలాబాద్ బస్టాండ్‌కు వచ్చింది. అక్కడి నుంచి ఇంద్రవెల్లి మండలంలోని దుర్వగూడ గ్రామానికి చెందిన పుసం హరిక్రిష్ణ, దుర్వ కాంతులతో పాటు మల్లాపూర్ గ్రామానికి చెందిన పుసం సుభాష్‌లు వివాహితను బలవంతంగా ఆటోలో ఎక్కించి ఇంద్రవెల్లి మండలానికి తీసుకొస్తూ అసభ్యకరంగా ప్రవర్తించి లొంగదీసుకునేందుకు యత్నించాడు. ప్రతిఘటించడంతో ఆటో నుంచి తోసేశారు. దీంతో వివాహిత కుడికాలుకు గాయమైంది. బుధవారం బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
హిజాబ్ ధరించి ఆటో నడుతుపుతున్న నజ్మా
ఓ యువకుడు యాచకుడి వేషంలో, కేజీల మొత్తంలో కరెన్సీ నాణేలను తీసుకుని ఐఫోన్ కొనడానికి వెళ్లిన వార్త ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.మంచి వయసు, ఓపిక ఉన్న వారే ఇలా చేస్తుంటే... ఓపిక లేకపోయినా సమాజంలో గౌరవంగా బతికేందుకు బురఖా వేసుకుని ఆటో నడుపుతోంది నజ్మా అన్సారీ. అయినా ఇతరుల ముందు చేయి చాచే కంటే.. కష్టపడడమే గౌరవం అనుకుంది. ‘గేర్లు మార్చేయండి చాలు గౌరవంగా బతకవచ్చు’ అని చెబుతూ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. నజ్మా అన్సారీ వయసు 45. ఉత్తరప్రదేశ్, మొరాదాబాద్ నగరంలోని కట్ఘర్లో ఆమె నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. 2010లో భర్త మరణించడంతో ఇంటి భారం ఆమె మీద పడింది. అప్పటిదాక గృహిణిగా ఉన్న నజ్మాకు తన కొడుకు, కూతుర్ని ఎలా పెంచాలో అర్థం కాలేదు. భర్త నడిపిన టీషాపును అద్దె కట్టలేక వదిలేసింది. ఇంట్లోనే టీ తయారు చేసి విక్రయించింది. అలా పిల్లల అవసరాలు చూసుకుంటూ ఉండగానే భర్త ఇన్సురెన్స్ డబ్బులు రూ.4.35 లక్షలు వచ్చాయి. మూడు లక్షల రూపాయలతో 2015లో కూతురికి పెళ్లి చేసింది. ఆదాయం సరిపోక.. టీ స్టాల్ నడుపుతూ కుటుంబాన్ని లాక్కొస్తున్న నజ్మాకు డబ్బులు సరిపోయేవి కావు. కూతురి పెళ్లి తరువాత ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. దీంతో భర్త ఇన్సురెన్స్ డబ్బుల్లో మిగిలిన మొత్తంతో ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కుంది. ఇంటి పనులన్నీ పూర్తిచేసి ఆటో తోలుతూ సంపాదిస్తోంది. అర్ధరాత్రనే భయం లేదు నజ్మా మూడు షిప్టుల్లో ఆటో నడుపుతోంది. బురఖా ధరించి ఉదయం తొమ్మిదిగంటలకు ఆటో స్టార్ట్ చేస్తుంది. ఎండ వేడికి బురఖాలో ఎక్కువ సమయం ఉండలేక మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటికి వచ్చేస్తుంది. తిరిగి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది వరకు ఆటో నడుపుతోంది. మళ్లీ రాత్రి తొమ్మిది నుంచి రెండుగంటల వరకు విరామం లేకుండా నడుపుతుంది. ఇలా మూడు షిప్టుల్లో మొత్తం మీద రోజుకి ఐదు నుంచి ఆరు వందల వరకు సంపాదిస్తోంది. స్థానిక ట్రాఫిక్ పోలీసులు నజ్మా ధైర్యాన్ని మెచ్చుకుని ప్రోత్సహిస్తున్నారు. అయితే నజ్మాను చూసిన ఓ హిందూ మహిళ కూడా ఆటో నడపడం మొదలు పెట్టింది. దీంతో ఆ మహిళ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగు పడ్డాయి. ఇలా ఇతరులకు స్ఫూర్తి నిలుస్తూనే, తన కష్టార్జితంతో హజ్ యాత్రకు వెళ్తానని చెబుతోంది నజ్మ. అడుక్కునే కంటే... ‘‘పేదరికం ఉందని అక్కడా ఇక్కడా చేయి చాచకుండా కష్టపడి ఏ పనైనా చేసి గౌరవంగా బతకవచ్చు. ఆటో గేర్లు మారుస్తూ, ప్రయాణికులను గమ్యాలకు చేరుస్తున్నాను. ఇక మహిళా డ్రైవర్‌గా నాకు రాత్రి సమయాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఎదురు కాలేదు. ముఖ్యమంత్రి యోగి ప్రభుత్వం వచ్చాక అర్ధరాత్రి బయటకు రావడానికి కూడా భయం వేయడం లేదు. ప్రభుత్వ అధికార యంత్రాంగం మాకు రక్షణ కల్పిస్తోంది. పరిస్థితులు మరింత దిగజారినప్పుడు అల్లా కాపాడతాడు’’ అని నజ్మా అన్సారీ ధైర్యంగా చెబుతోంది. -
ఉజ్జయిని కేసులో వారిపై కూడా చట్టపరమైన చర్యలు: ఏఎస్పీ
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉజ్జయిని మైనర్ బాలిక రేప్ సంఘటనలో నిందితుడిని కనుగొనేందుకు పోలీసులు విపరీతంగా శ్రమించారని తెలిపారు ఉజ్జయిని అడిషనల్ సూపెరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జయంత్ సింగ్ రాథోడ్. ఈ సందర్భగా సంఘటన జరిగిన తర్వాత బాధితురాలు అన్ని ఇళ్లు తిరుగుతూ సహాయం కోరినప్పుడు సాయం చేయడానికి నిరాకరించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. శభాష్ పోలీస్.. ఉజ్జయిని ఏఎస్పీ జయంత్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ ఈ సంఘటన జరిగినప్పుడు తామంతా రాష్ట్రపతి రాష్ట్రానికి వచ్చిన కార్యక్రమంలో బిజీగా ఉన్నామని వీడియో బయటకు రాగానే షాక్‌కు గురయ్యామన్నారు. విషయం తెలిసిన వెంటనే మొదట ఆసుపత్రికి వెళ్లి బాలికను పరామర్శించామని అనంతరం విచారణ చేపట్టి సుమారు 700 సీసీటీవీ ఫుటేజిలను పరిశీలించి భరత్ సోనీ అనే ఆటో డ్రైవర్‌ను నిందితుడిగా గుర్తించామన్నారు. దాదాపు 30-35 మంది పోలీసులు నిద్రాహారాలు మాని ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్నారని వారందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. బాధ్యతారాహిత్యం.. సంఘటన జరిగిన తర్వాత ఆమె మరో ఆటోలో కొంతదూరం ప్రయాణించిందని.. ఆ ఆటో డ్రైవర్ రాకేష్ మాలవ్య విషయం తెలిసి కూడా పోలీసులకు సమాచారం అందించకపోవడం వలన విషయం తెలిసేసరికి ఆలస్యమైందన్నారు. పోక్సో చట్టం ప్రకారం రాకేష్ చేసింది కూడా నేరమేనని అందుకే అతడిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. అత్యాచారం జరిగిన తర్వాత బాలిక ఒక్కో ఇల్లు తిరుగుతూ సాయమడిగినా ఎవ్వరూ స్పందించకపోవడంపై స్పందిస్తూ మానవతా కోణంలో వారు చేసింది తప్పేనని వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మరణశిక్ష విధించండి.. ఈ కేసులో నిందితుడైన ఆటో డ్రైవర్ భరత్ సోనీ తండ్రి జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ తన కుమారుడు తప్పు చేసినట్లు నిరూపితమైతే మరణశిక్ష విధించామని అంతకంటే పెద్ద శిక్ష మరొకటి లేదు కాబట్టి అదే అమలు చేయాలన్నారు. ఈ కేసును ఛేదించిన ఉజ్జయిని మహాకాల్ ఎస్సై అజయ్ వర్మ వారి బంధువులకు అభ్యంతరం లేకపోతే బాలికను దత్తత తీసుకుంటానని ప్రకటించి పెద్దమనసు చాటుకున్నారు. ఇది కూడా చదవండి: గ్యాంగ్‌స్టర్ సునీల్ నాహక్ హత్య -
ఆటో డ్రైవర్‌తో గొడవపడ్డ నటి.. డబ్బులివ్వకుండా చెక్కేసింది! ఇంత ఘోరమా?
కన్నడ బుల్లితెర నటి పద్మిని ఆటో డ్రైవర్‌తో గొడవపడింది. అతడికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా ఆటో మధ్యలో ఆపి వెళ్లిపోయింది. దీంతో డ్రైవర్.. నటి తనను మోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నటి పద్మిని మల్లేశ్వరంలోని మార్గోసా రోడ్ నుంచి బాణశంకరికి ఆటో బుక్ చేసింది. దీనికిగానూ ఆమె రూ.437 చెల్లించాల్సి ఉంటుందని ఉబర్ యాప్‌లో చూపించింది. ఆమె డ్రైవ్‌ను ఓకే చేసిన కుల్దీప్ అనే వ్యక్తి తనను ఆటోలో పికప్ చేసుకున్నాడు. మార్గమధ్యంలో వీరి ఆటో కొంత ట్రాఫిక్‌లో చిక్కుకుంది. దీంతో పద్మిని ఆటో డ్రైవర్ మీద అరిచింది. అసలు ఈ రోడ్లో నుంచి ఎందుకు తీసుకొచ్చావ్? ఇక్కడ ఇంత ట్రాఫిక్ ఉంది.. నువ్వు సరిగా ఆటో నడపట్లేదు అని తిట్టిపోసింది. ట్రాఫిక్ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను అని డ్రైవర్ చెప్తున్నా వినిపించుకోలేదు. మార్గమధ్యంలోనే ఆటో దిగిపోయింది. అతడికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టింది. డబ్బులివ్వమని అడిగితే ఇవ్వనని తెగేసి చెప్పింది. ఎక్కువ మాట్లాడితే ఉబర్‌కు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. చివరకు అన్నంతపని చేయడంతో ఉబర్ యాజమాన్యం అతడిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. అయితే ఆటో డ్రైవర్ నటి గొడవను తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. తను ఏ తప్పూ చేయకున్నా నటి గొడవపడిందని, డబ్బులివ్వకపోవడమే కాకుండా తనపైనే ఫిర్యాదు చేసిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా.. నటి పద్ధతి అస్సలు బాగోలేదని విమర్శిస్తున్నారు. నాలుగు వందల రూపాయలు ఇవ్వడానికి కూడా ఇంత కక్కుర్తా? అలాంటప్పుడు ఆటో బుక్ చేసుకోవడం దేనికని విమర్శిస్తున్నారు. చదవండి: అరుదైన వ్యాధితో బాధపడుతున్న నటి.. దానివల్ల భయంగా ఉందంటూ.. -
ఢిల్లీలో ట్రాఫిక్‌ను తపించుకునేందుకు ఆటో డ్రైవర్ ఎమ్ చేసాడో తెలుసా..!
-
చెన్నైలో ఆటో డ్రైవర్ సృజన.. అతని ఆటోనే ఓ మినీ గార్డెన్
అవడానికి అది ఓ చిన్న ఆటో మాత్రమే. కానీ అందులో ఏకంగా ఒక మినీ గార్డెన్‌నే సృష్టించాడతను. చెన్నైకి చెందిన కుబేందిరన్ అనే ఆటో డ్రైవర్ మది నుంచి పుట్టుకొచి్చన ఈ సృజనాత్మక ఆలోచన నెటిజన్ల మది దోచుకుంటోంది. ఇంటర్నెట్ నిండా అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది... కుబేందిరన్. చెన్నైలోని దాదాపు లక్ష మంది ఆటో డ్రైవర్లలో ఒకడు. కానీ పర్యావరణం మీది ప్రేమ అతన్ని మిగతా వారికంటే ఎంతో ప్రత్యేకంగా నిలిపింది. దేశమంతటా అతని పేరు మారుమోగేలా చేసింది. రకరకాల మీనియేచర్ మొక్కలు తదితరాలతో ఆటోను కదిలే తోటగా తీర్చిదిద్దాడు. ముందు, వెనక సీట్ల మధ్య, వెనక వైపు, సీలింగ్ మీద మాత్రమే గాక సీలింగ్ లోపలి వైపు కూడా పచ్చని మొక్కలతో నింపి ఆకట్టుకుంటున్నాడు. ఆ ఆహ్లాదాన్ని అనుభవిస్తూ ప్రయాణికులు మైమరచిపోతున్నారు. అందుకే ఇప్పుడు కుబేందిరన్ ఆటోను చెన్నైవాసులు ప్రయాణించే పార్కుగా అభివరి్ణస్తూ మురిసిపోతున్నారు. అందులో ప్రయాణించిన వాళ్లు ’గ్రీన్ ఆటో’, ’మూవింగ్ పార్క్’, ఇంకా రకరకాలుగా ప్రశంసిస్తున్నారు. ఇంత చక్కని ఆలోచన చేసినందుకు అతన్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు కూడా. మరెన్నో విశేషాలు: ఇది మాత్రమే కాదు, ఆటో ఎక్కే వారు చదువుకోవడం కోసం ఎన్నెన్నో స్ఫూర్తిదాయక పుస్తకాలు కూడా అందుబాటులో ఉంచాడు కుబేందిరన్. అంతేగాక వారికి స్వచ్ఛమైన చల్లని మంచినీరు కూడా ఇస్తాడు. వీటికి తోడు చక్కని సూక్తులు, నినాదాలతో కూడిన బ్యానర్లు కూడా ఆటో నిండా కనువిందు చేస్తుంటాయి. వాటిని తరచూ మారుస్తూ మరింత ఆకట్టుకుంటాడతను. రోడ్డు భద్రత గురించి కూడా అందరికీ వీలైనంత వరకూ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. తనవంతు సామాజిక బాధ్యతను పరిపూర్ణంగా నెరవేరుస్తూ శెభాష్ అనిపించుకుంటున్నాడు. ఆటోపై రూఫ్ గార్డెన్ కొన్నాళ్ల క్రితం ఢిల్లీకి చెందిన మహేంద్ర కుమార్ అనే ఆటో డ్రైవర్ కూడా ఇలాగే తన ఆటో రూఫ్ టాప్ మీద గార్డెన్ పెంచి వార్తల్లో నిలిచాడు. ఈ గార్డెన్ 2020 నుంచీ అందరినీ అలరిస్తోంది. కుమార్‌తో పాటు అతని ఆటో ఎక్కేవాళ్లు కూడా మండే ఢిల్లీ ఎండల్లో కూడా చక్కని చల్లదనం అనుభవిస్తూ ప్రయాణిస్తూ ఉంటారు. అతన్నీ, అతని ఆటో రూఫ్ టాప్నూ అంతా ఎప్పుడు చూసినా ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు! – నేషనల్ డెస్క్, సాక్షి -
1985లో టెన్త్.. 2023లో పీయూసీ.. విద్యాదాహాన్ని తీర్చుకుంటున్న ఆటోడ్రైవర్
బెంగళూరుకు చెందిన నిధి అగర్వాల్ ఇటీవల ఎక్స్(ట్విట్టర్)లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ ట్వీట్ చేశారు. ఆటో డ్రైవర్ భాస్కర్‌తో తనకు ఎదురైన అద్భుత అనుభవాన్ని ఆమె ఆ పోస్టులో తెలియజేశారు. భాస్కర్ ఇటీవలే తన ప్రీ- యూనివర్శిటీ(పీయూసీ) పరీక్ష రాశారని తెలిపారు. నిధి తన పోస్టులో ఆటో డ్రైవర్ భాస్కర్ 1985లో స్కూలు మానివేసినప్పటి నుంచి ఉన్నత విద్య చదవాలనే తపనతో ఉన్నారన్నారు. ఆటో డ్రైవర్‌కు సంబంధించిన ఒక ఫొటోతో పాటు నిధి అగర్వాల్ ఇలా రాశారు ‘ఈరోజు ఓలాక్యాబ్స్ ఆటో ద్వారా భాస్కర్ పరిచయం అయ్యారు. ఈ రోజే ఆయన పీయీసీ పరీక్షలోని ఆంగ్ల ప్రశ్నాపత్రం రాశారు. భాస్కర్ 1985లో 10వ తరగతి పాసయ్యాక ఈ ఏడాది పీయూసీ పరీక్ష రాశారు. భాస్కర్ పిల్లలు స్కూలులో చదువుతున్నారు. భాస్కర్‌కు చదువుపై ఉన్న శ్రద్ధ ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది’ అని రాశారు. నిధి అగర్వాల్ అందించిన ఈ పోస్టు ఇంటర్నెట్లో సందడి చేస్తూ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ఈ పోస్టుకు 1,500కు మించిన వీక్షణలు దక్కాయి. దేశంలో ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరులో ఇటువంటి అనేక కథలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఇది కూడా చదవండి: తరగతి గదిలోకి చొరబడి.. విద్యార్థుల సాక్షిగా భార్యకు తీన్ తలాక్! "Introducing Baskar ji, my @Olacabs auto companion today. He faced his English paper today, he is writing PUC exams this year after cleaning 10th in 1985. Father of two, with kids in 3rd and 6th grade. His enduring smile was truly motivating! @peakbengaluru pic.twitter.com/5R21YtdomZ — Nidhi Agarwal (@Ngarwalnidhi) August 26, 2023 -
బాలుడి గొంతు కోసిన ఆటో డ్రైవర్
హైదరాబాద్: మద్యం మత్తులో అకారణంగా ఓ ఆటో డ్రైవర్ ఓ బాలుడి గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఫరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథ నం మేరకు వివరాలిలా ఉన్నాయి. జగద్గిరిగుట్ట కూన మహాలక్ష్మీ నగర్లో ఉంటున్న లక్ష్మి, దుర్గయ్య దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. దుర్గయ్య కొన్నేళ్లుగా ఇంటికి రాకపోవడంతో పిల్లలతో కలిసి లక్ష్మి ఒంటరిగా ఉంటోంది. సోమవారం సాయంత్రం అదే బస్తీకి చెందిన ఆటో డ్రైవర్ యాదగిరి తప్పతాగి, రోడ్డుపై ఆడుకుంటున్న ఆదిత్య (9)తో మాటలు కలిపాడు. అతడికి మాయ మాటలు చెప్పి తనతో తీసుకెళ్లాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే తన జేబులో ఉన్న బ్లేడుతో బాలుడి గొంతు కోశాడు. దీంతో ఆదిత్య కుప్పకూలి పోయాడు. దీనిని గుర్తించిన స్థానికులు బాలుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థి తి విషమించడంతో గాంధీ ఆస్పతికి తరలించారు. ఆదిత్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడిని ఎందుకు చంపాలనుకున్నాడో కారణాలు తెలియరాలేదు. యాదగిరిని ఆదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఆటో డ్రైవర్‌కు 15 ఏళ్లు జైలు
విశాఖ లీగల్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఆటోడ్రైవర్‌కు 15 ఏళ్లు జైలుశిక్ష, రూ.50వేలు జరిమానా విధిస్తూ విశాఖ నగరంలోని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనందిని గురువారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా ఏడాదిపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. పోక్సో చట్టం కింద బాలికకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షలు పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి సూచించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ అందించిన వివరాల మేరకు... విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రాంజీ ఎస్టేట్‌కు చెందిన పదహారేళ్ల బాలిక 2016లో నగరంలోని రామా టాకీసు వద్ద ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరింది. మరికొందరు బాలికలతో కలిసి ఆమె ప్రతి రోజు ఆటోలో కళాశాలకు వెళ్లేది. ఈ క్రమంలో 2016, సెప్టెంబర్ 29న ఆటో డ్రైవర్ సాయిగణేష్(25) ఆ బాలికను ఒంటరిగా రామాటాకీస్ దగ్గర నుంచి పోర్టు స్టేడియం రోడ్డు మీదుగా అక్కయ్యపాలెం పైపుల సందులోకి తీసుకువెళ్లాడు. అక్కడ బాలికతో వికృతంగా ప్రవర్తించి లైంగిక దాడి చేశాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తిరిగి ఆటోలో తీసుకువచ్చి ఆమె ఇంటి దగ్గర వదలిపెట్టాడు. ఆటో డ్రైవర్ లైంగికదాడికి పాల్పడిన విషయాన్ని బాధితురాలు తన తల్లికి తెలియజేసింది. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తొలుత ఆమెను సెవెన్ హిల్స్ ఆస్పత్రికి, ఆ తర్వాత కేజీహెచ్‌కి తరలించి చికిత్స చేయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విశాఖ నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేశారు. అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో 15 ఏళ్లు జైలు శిక్ష, రూ.50వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. -
కిలో టమాట రూ.200.. ఈ ఆటోవాలా ఆఫర్ చూడండి.. ఫ్రీ ఇస్తాడట!
దేశంలో ఇటీవల టమాటా సృష్టిస్తున్న లీలలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడ చూసిన టమాటా గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే టమాటా ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. కిలో టమాటా ధర రూ.200కు పైగా అమ్ముడు పోయాయి. టమాటా ధరలు ఆకాశాన్నింటి.. కొందరు రైతులను కోటీశ్వరులను చేశాయి. టమాటా ఉచిత పథకాల ద్వారా మరికొందరు తమ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకుని లాభాల బాట పట్టారు. ఆటోవాలా సరికొత్త ఆఫర్.. వినియోగదారులు టమాటాలు కొనడానికి సంశయిస్తున్న సమయంలో చంఢీగర్కు చెందిన ఓ ఆటో డ్రైవర్ కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చాడు. తన ఆటోలో ప్రయాణించినవారికి కేజీ టమాటాలు ఉచితంగా ఇస్తానని ఉచిత పథకాన్ని పెట్టాడు. కానీ అందుకు సదరు ప్రయాణికుడు కనీసం ఐదు రైడ్లు చేయాలని కండీషన్ పెట్టాడు. ఇదీ కాకుండా ఆర్మీలో పనిచేసే సైనికులకు ఆయన గత 12 ఏళ్లుగా ఉచితంగా సేవలు అందిస్తాడు. గర్భణీ మహిళలను కూడా ఉచితంగా ఆస్పత్రికి తరలిస్తాడు. తన జీవనోపాధికి ఆటో మాత్రమే ఏకైక మార్గమని తెలిపిన ఆయన.. ఈ సేవల వల్ల తనకు సంతృప్తి కలుగుతుందని అన్నారు. ఇదే కాకుండా పాకిస్థాన్‌పై ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిస్తే ఐదు రోజుల పాటు ఉచితంగా ఆటో రైడ్లు అందిస్తానని చెప్పాడు. ఉచిత ప్రకటనలు.. ఆటోవాలానే మొట్టమొదటి వ్యక్తి కాదు. టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో ఇలాంటి ఆఫర్లతో పలువురు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పంజాబ్‌లో ఓ చెప్పుల దుకాణం యజమాని రూ.1000కి పైగా కొనుగోలు చేస్తే రెండు కిలోల టమాటాలు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటన చేశాడు. తన దుకాణంలో మొబైల్ కొనుగోలు చేస్తే కేజీ టమాటాలు ఉచితం అంటూ మరోచోట ఓ యజమాని ఆఫర్ పెట్టాడు. తాజాగా ఆటో డ్రైవర్ తన ఆటోలో ప్రయాణిస్తే టమాటాలు ఉచితం అంటూ కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చాడు. టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఢిల్లీ, పట్నా, లక్నో సహా పలు ముఖ్య నగరాల్లో రూ.80 కే కేజీ టమాటా లభ్యమయ్యేలా చర్యలు చేపట్టింది. ఇదీ చదవండి: సీఎం నివాసంలోకి చొరబాటుకు దుండగుడి యత్నం.. మారణాయుధాలతో.. -
వివాహేతర సంబంధం కారణంగా మహిళపై యాసిడ్ దాడి
సాక్షి ప్రతినిధి, విజయవాడ/భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో వితంతు మహిళపై ఓ ఆటోడ్రైవర్ యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలుడు, యువతి సహా ముగ్గురికి గాయాలయ్యాయి. ఆదివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకోగా.. కొద్దిగంటల్లోనే నిందితుణ్ణి అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా తెలిపిన వివరాల ప్రకారం.. ఐతవరం గ్రామానికి చెందిన 28 ఏళ్ల మహిళకు 8 ఏళ్ల క్రితం వివాహం కాగా.. ఆమెకు ఓ కుమారుడున్నాడు. భర్త మరణించడంతో ఆ మహిళ ఐతవరం వచ్చేసి తల్లిదండ్రుల వద్ద ఆశ్రయం పొందుతోంది. సుమారు 8 నెలల క్రితం నెల్లూరుకు చెందిన రాణింగారం మణిసింగ్ (32)తో ఆ మహిళకు ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. నెల్లూరులోనే ఆటో నడుపుతూ జీవనం సాగించే మణిసింగ్‌కు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడంతో ఆ మహిళ ఐతవరంలోనే వేరే ఇంటికి మారింది. ఆమె వద్దకు మణిసింగ్ తరుచూ వస్తుండేవాడు. ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకోగా.. మణిసింగ్‌కు క్షయ వ్యాధి సోకినట్టు తెలుసుకున్న సదరు మహిళ అతన్ని దూరం పెట్టింది. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న మణిసింగ్ ఆమెను హతమార్చాలని నిశ్చయించుకున్నాడు. నెల్లూరు నుంచే యాసిడ్ తెచ్చుకుని.. ఈ నెల 8వ తేదీ శనివారం నెల్లూరులో 100 మిల్లీలీటర్ల యాసిడ్ బాటిల్ కొనుగోలు చేసిన మణిసింగ్ మహిళ ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఆ ఇంట్లో ఆమె కుమారుడితో పాటు ఆమె సోదరి కుమార్తె ఉన్నారు. వారితో కలిసి మణిసింగ్ భోజనం చేసి అక్కడే నిద్రించాడు. ఆదివారం వేకువజామున 4 గంటలకు అందరూ నిద్రమత్తులో ఉండగా మణిసింగ్ తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను మహిళ ముఖంపై పోసి పరారయ్యాడు. ఈ ఘటనతో మహిళ శరీరం 20 శాతం గాయపడగా, ఆమె కుమారుడుకి, ఆమె సోదరి కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల ఆర్తనాదాలతో చుట్టుపక్కల వారు లేచి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నందిగామ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నందిగామ శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న మణిసింగ్ను ఉదయం 10 గంటలకు అరెస్ట్ చేశారు. అతడిపై నాన్‌బెయిలబుల్ కేసులు కట్టారు. బాధితులకు అండగా ప్రభుత్వం యాసిడ్ దాడిలో గాయపడ్డ బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆదివారం పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక ఎమ్మెల్యే జగన్మోహనరావు బాధితుల్ని పరామర్శించారు. -
5 గంటల్లో రూ.40.. కర్ణాటక ఆటో డ్రైవర్ల దయనీయ స్థితి..
బెంగుళూరు: ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఒకటి. ఈ పథకం అమల్లోకి రావడంతో మా జీవితాలు పెనం మీద నుంచి వెళ్లి పొయ్యిలో పడ్డాయని వాపోతూ కన్నీటి పర్యంతమయ్యాడు ఒక ఆటో డ్రైవర్. ఉదయం 8 గంటలనుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆటో నడిపినా రూ. 40 కూడా రాలేదన్నాడు. దయనీయం.. ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ తీశారో తెలియదు కానీ ఇప్పుడైతే బాగా వైరల్ గా మారింది. ఓ మీడియా ప్రతినిధి బెంగుళూరులోని ఒక ఆటో వద్దకు వెళ్లి డ్రైవరుతో మాటామంతీ కలపగా.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఇచ్చాక ఎవ్వరూ ఆటోలను పట్టించుకోవడమే లేదని ఆవేదన చెందాడు. ఉదయం నుండి ఐదు గంటలపాటు ఏకధాటిగా ఆటో నడిపినా పట్టుమని రూ.40 కూడా మిగలలేదని జేబులో నుంచి రెండు 20 రూపాయల నోట్లు చూపించి.. ఆటో బండి సంగతిలా ఉంటే మేము బ్రతుకు బండిని నడిపేదెలా అంటూ కంటతడి పెట్టుకున్నాడు. ఓ పెద్దాయన ఈ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. A Bengaluru auto driver in tears after collecting just Rs 40/- from 8 am to 1 pm. This is the result of free bus rides given by the new Cong govt in Karnataka. Pushing people into poverty. pic.twitter.com/2RZEjA9pw8 — Zavier (@ZavierIndia) June 25, 2023 ఎవరి దారి వారిది.. ఈ వీడియోకు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా ఉచితాలు ప్రకటించిందని.. వాటికి ఆకర్షితులై ప్రజలు ఓట్లేశారని.. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఇవి ప్రభావ చూవుతాయని ఒకరు అభిప్రాయాపడగా, ఆడవాళ్ళంతా బస్సుల్లో ఉంటే మగవాళ్ళంతా ఇళ్లల్లో దూరి తలుపులు వేసుకున్నారా? అని మరొకరు.. గతవారం జయదేవ నుండి మల్లేశ్వరం వెళదామంటే ఆటోస్టాండ్‌లో అందరూ ఖాళీగానే ఉన్నారు కానీ ఒక్క డ్రైవర్ కూడా రాలేదు.. రెట్టింపు చార్జీ ఇస్తామన్నా కూడా కనికరించలేదు. వీళ్లకు ఇదే తగిన శాస్తి అని వేరొకరు స్పందించారు. ఇది కూడా చదవండి: కంటతడి పెట్టిస్తున్న జొమాటో డెలివరీ బాయ్ వీడియో -
అటు ఇటు అయితే.. అంతే!... ఆటో డ్రైవర్ల తీరు మారడం లేదు
అల్లాదుర్గం(మెదక్): రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్‌శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆటో డ్రైవర్ల తీరు మారడం లేదు. ఆటోలో అధికసంఖ్యలో ప్రయాణికులను ఎక్కిస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిబంధనలు పాటించకుండా రోడ్లపై దూసుకుపోతున్నారు. అల్లాదుర్గం ఐబీ చౌరస్తా వద్ద ఓ డ్రైవర్ ఆటోలో ప్రయాణికులను కిక్కిరిసేలా ఎక్కించుకున్నాడు. అంతటితో ఆగకుండా టాప్ పైనా కొందరిని కూర్చోబెట్టుకున్నాడు. కొంచెం అదుపు తప్పినా వారి ప్రాణాలు గాలిలో కలిసే అవకాశం ఉందని తెలిసినా ఆటోను స్పీడ్‌గా నడుపుకుంటూ వెళ్తూ సాక్షి కెమెరాకు చిక్కాడు. -
మరదలుకు సర్ది చెప్పిన బావ.. ఆటో కిరాయికి వెళ్లి వస్తానని చెప్పిన శ్రీను..
వరంగల్ : కుటుంబ కలహాలతో ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని చింతలపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన దండుగుల శ్రీను(30), మౌనిక దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ప్రణయ్, కన్నయ్య ఉన్నారు. ఈ క్రమంలో కుటుంబ కలహాల నేపథ్యంలో కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం మళ్లీ గొడవపడ్డారు. దీంతో మౌనిక తన ఆడబిడ్డ వల్లెపు శ్రీలత ఇంటికి వెళ్లింది. శ్రీలత.. తమ్ముడు, మరదలుకు సర్ది చెప్పి ఇంటికి పంపించింది. అయితే ఆటో కిరాయికి వెళ్లి వస్తానని చెప్పిన శ్రీను.. మంగళవారం మధ్యాహ్నం తాను ఉరేసుకుంటున్నానని తన అక్క శ్రీలతకు వీడియోకాల్‌లో చేశాడు. శ్రీలత వెంటనే ఇంటి పక్కన ఉంటే చాపర్తి నగేశ్‌కు ఫోన్ చేసి విషయం తెలిపింది. దీంతో నగేశ్ వెళ్లే సరికి శ్రీను ఇంట్లో దూలానికి వేలాడుతూ చనిపోయి ఉన్నాడు. దీనిపై మృతుడి తల్లి ఐలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ చందర్రావు తెలిపారు. -
మద్యం మత్తులో ఆటో డ్రైవర్ బీభత్సం
కర్ణాటక: మద్యం మత్తులో ఓ ఆటో డ్రైవర్ విచ్చలవిడిగా ఆటో నడపడంతో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా ఓ పాదచారి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన బాగేపల్లి రోడ్డులో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు... బాగేపల్లి రోడ్డులోని శ్రీనివాసపుర గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వెంకట రమణ మద్యం తాగి ఒక్కడే ఆటోలో సొంత ఊరుకు బయలుదేరాడు. ఈ క్రమంలో వేగంగా వస్తూ మార్గం మధ్యలో రోడ్డుపై నడుచుకుని వెళ్తున్న నవీన్ అనే వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో ఆటోను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నవీన్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఆటో డ్రైవర్ వినూత్న ఆలోచన.. ఐడియా భలే ఉందే!
ఎండలతో బయటకు రావాలంటేనే జనం జంకుతున్న పరిస్థితుల్లో.. ఆటోడ్రైవర్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ ఆటోడ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. బస్తాలో వడ్ల గింజలు వేయడంతో అవి మొలకెత్తాయి. దీంతో నారుతో కూడిన బస్తాలను ఆటో టాప్‌పై వేయగా.. ఎండ వేడి నుంచి ఉపశమనం లభిస్తోందని చెప్పాడు. మహబూబాబాద్ జిల్లా నుంచి అద్దెపై ఖమ్మం వచ్చిన ఆటోడ్రైవర్‌ను పలకరించగా.. గంటకోసారి బస్తాను నీటితో తడుపుతుండడంతో తనతో ప్రయాణికులు సేదదీరుతున్నారని తెలిపాడు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఖమ్మం -
Vizag: ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేసిన ఆటోడ్రైవర్.. 24 గంటల్లోనే
కోవెలకుంట్ల(నంద్యాల)/తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర) : ఇద్దరు పిల్లలను ఆటోడ్రైవర్ కిడ్నాప్ చేసి తీసుకెళుతుండగా పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. బుధవారం కోవెలకుంట్ల సీఐ నారాయణరెడ్డి అందించిన సమాచారం మేరకు.. పట్టణంలోని నాగులకట్ట సమీపంలో నివాసముంటున్న షేక్ మహమ్మద్, షమీవున్ దంపతులకు షేక్ రిజ్వానా, షేక్ ఆసియా సంతానం. పెద్ద కుమార్తె స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి, చిన్న కుమార్తె ఇదే పట్టణంలోని గాంధీ సెంటర్ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో పిల్లలు పట్టణంలోని సెయింట్ జోసఫ్స్ పాఠశాలలో కబడ్డీ నేర్చుకునేందుకు వెళుతున్నారు. కోవెలకుంట్లకు చెందిన ఇమాంఉసేన్ పిల్లలను ఆటోలో ఎక్కించుకుని రోజూ పాఠశాల వద్ద వదిలేవాడు. మంగళవారం ఉదయం పిల్లలను ఆటోలో పంపించి తల్లిదండ్రులు పనుల నిమిత్తం వెళ్లిపోయారు. అయితే అతను పిల్లలను స్కూల్ వద్ద దించకుండా మాయమాటలు చెప్పి ఆటోను నంద్యాల వైపు మళ్లించాడు. నంద్యాలలో దిగి పిల్లలతో సహా గుంటూరు రైలెక్కాడు. రాత్రి అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది పట్టణంలోని పలు ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆటో డ్రైవర్ సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా వైజాగ్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని చిన్నారులను రక్షించారు. కోవెలకుంట్ల ఎస్ఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బృందాలు అక్కడకు చేరుకోగా రైల్వేపోలీసులు పిల్లలను వారికి అప్పగించారు. ఆటో డ్రైవర్ చిన్నారులను ఎత్తుకెళ్లి విక్రయించేందుకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. చిన్నారుల కిడ్నాప్ మిస్టరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. -
ఆటోడ్రైవర్ దారుణ హత్య..
విశాఖపట్నం: సస్పెక్టడ్ షీటు ఉన్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తెల్లారేసరికి రక్తపుమడుగులో ఉన్న అతడిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. దుర్గాబజార్‌లో నివాసముంటున్న ఏరుసుమాండాల ఆదినారాయణ అలియాస్ ఆది(30) ఆటో డ్రైవర్. ఆయన మంగళవారం రాత్రి స్నేహతుడి పుట్టినరోజు పారీ్టకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత పార్టీ ముగించుకుని ఇంటికి వస్తున్నాడు. అదే సమయంలో బాలాజీనగర్ ప్రాంతంలోని జీవీఎంసీ సులభ్ కాంప్లెక్స్ వద్ద కూర్చున్న అదే ప్రాంతానికి చెందిన జగదీ‹Ù, శివ అనే ఇద్దరు యువకులను కలిశాడు. వారితో ఆదికి పరిచయం లేకపోయినా.. మాటలు కలిపి అక్కడే కొద్దిసేపు ఉన్నాడు. ఈ క్రమంలో వారిద్దరితో ఆదికి చిన్నపాటి గొడవ జరిగింది. ఆ గొడవ పెరిగి కొట్లాటకు దారి తీసింది. ఆది అందుబాటులో ఉన్న కర్ర, బీరు బాటిల్ తీసుకుని వారిద్దరినీ కొట్టాడు. దీంతో ఆ యువకులు ఆదిపై తిరగబడి దాడి చేశారు. కర్రతో అతని తలపై బలంగా కొట్టారు. దీంతో ఆది సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. బుధవారం ఉదయం ఆరు గంటలకు స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. రక్తం మడుగులో ఉన్న ఆది మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కాగా.. ఆదిని హత్య చేసిన జగదీష్, శివ పోలీసులకు లొంగిపోయారు. తాము ఆదిని హత్య చేశామని ఒప్పుకున్నారు. ఆది తమ వద్దకు వచ్చి కావాలనే గొడవపడి మమ్మల్ని కొట్టడంతో.. దాడి చేసినట్లు పోలీసులకు తెలిపారు. వారిద్దర్నీ అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సోమశేఖర్ తెలిపారు.ఆదిపై సస్పెక్టడ్ షీట్ : రెండేళ్ల కిందట ఆరిలోవ కాలనీలో ఓ యువకుడిని హత్య చేసిన కేసులో ఆది నిందితుడని సీఐ సోమశేఖర్ తెలిపారు. దీంతో ఆయనపై సస్పెక్టడ్ షీటు తెరిచినట్లు తెలిపారు. ప్రతి ఆదివారం రౌడీ షీటర్లతో పాటు ఆది కూడా స్టేషన్‌కు వచ్చి రికార్డులో సంతకం చేస్తుండేవాడన్నారు. ఇప్పుడు ఈ హత్యకు పాత గొడవలు కారణమా.. యాదృచి్ఛకంగా యువకులు దాడి చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆది తండ్రి బంగారయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
చేతులే నేస్తాలుగా...
కష్టమంటే ఏంటో తెలియని చిన్నతనం. ఊహ తెలియకముందే పెళ్లి పేరుతో జీవనం. ఆదుకోని అయినవారు. అయినా చేతులున్నాయి కదా! అంటూ కొత్త జీవనం వైపుగా అడుగులు వేసి నేడు అందరితో శభాషని అనిపించుకుంటోంది ఆటోడ్రైవర్ సీతాదేవి. రోడ్లు ఊడ్చే పని నుంచి ఆ ఢిల్లీ రోడ్ల మీదే ఆటో నడుపుతూ, ముగ్గురు పిల్లలను చదివిస్తున్న సీతాదేవి ‘ఎన్నో ఒడిదుడుకుల జీవితం. కానీ, సొంత చేతులనే నమ్ముకున్నాను’ అని చెబుతోంది. ‘‘నేను మా అమ్మనాన్నలకు కొడుకుల కంటే తక్కువేమీ కాదని నిరూపించుకున్నాను. కొన్నేళ్ల క్రితం కష్టం వచ్చిందని పుట్టింటికి వెళితే, ఆదరించలేదు. అలాగని వారి మీద కోపం తెచ్చుకోలేదు. మా అమ్మనాన్నలది బీహార్. అక్కడే ఎనిమిదో తరగతి చదువుతుండగానే పెళ్లి చేశారు. ఆ వయసులో నాకెలాంటి తెలివితేటలు లేవు. నా భర్తతో కలిసి ఢిల్లీ వెళ్లిపోయాను. కానీ, ఆయన ఉద్యోగం గుజరాత్లో. పెళ్లయ్యాక ఐదేళ్లయినా పిల్లలు పుట్టలేదని అత్తింటిలో వేధింపులు. నన్ను వదిలేయమని నా భర్తతో బంధువులంతా చెప్పారు. ఆ యేడాదే గర్భవతిని అని తెలియడంతో నా పట్ల మా అత్తింటివాళ్ల ప్రవర్తనలో మార్పు వచ్చింది. కానీ, నా భర్త ఉద్యోగం పోవడంతో కుటుంబపరిస్థితి పూర్తిగా క్షీణించింది. అప్పుల్లో కూరుకుపోయారు. ఎనిమిది నెలల గర్భవతిని. పూట గడవని పరిస్థితి. ఉన్న వస్తువులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. పుట్టింటికి వెళితే గడపతొక్కనివ్వలేదు. తిరిగి ఢిల్లీ వెళ్లిపోయాను. తినడానికి ఏమీ లేని పరిస్థితి. మూడు రోజులు మంచినీళ్లు తాగి పడుకున్నాను. తెలిసినవారి ద్వారా రోడ్లు ఊడ్చే పని దొరికింది. దీంతో మరో చిన్న ఇంటికి మారిపోయాం. పురిటిబిడ్డను తీసుకునే పనికి వెళ్లేదాన్ని. ఆ సమయంలో మా అన్న రావడంతో కొద్దిగా వస్తువులు కొన్నాను. వచ్చే కొద్దిపాటి ఆదాయంతో పిల్లలకు పూట గడుస్తుంది కానీ, మున్ముందు రోజులెలా గడవాలా... అని ఆలోచించేదాన్ని. నాలుగు ఇళ్లలో వంటపని చేయడం ప్రారంభించాను. ఆదాయం బాగానే ఉండటంతో స్వీపర్ పని వదిలేశాను. ► పగలు వంటలు నాకు వండడం తెలుసు. కానీ, వెరైటీ వంటలు చేయడం రాదు. వంటల పుస్తకాలు కొని, చదివి వెరైటీ వంటలు నేర్చుకొని, ఇళ్లలో చేయడం మొదలుపెట్టాను. అలా నెలకు 10 నుంచి 12 వేల రూపాయల వరకు వచ్చేవి. ఈ సంపాదనతో నా ముగ్గురు పిల్లల పోషణ బాగానే చూసుకోగలిగాను. ► రాత్రిళ్లు ప్లాస్టిక్ సంచులు ప్రయత్నం లేకుండా మన తలరాతలో ఏది రాస్తే అది జరుగుతుందనుకోవడం తప్పు. పగలు వంటలతో పాటు రాత్రి ఇంటి వద్దే ప్లాస్టిక్ బ్యాగులు కుట్టేదాన్ని. పదకొండువందల రూపాయలతో పాత మెషిన్ కొని, బ్యాగులు కుట్టేదాన్ని. మెటీరియల్ ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి, వేరేవాళ్లకు కూడా పని ఇవ్వడం మొదలుపెట్టాను. అలా పదివేల ప్టాస్టిక్ సంచులు కుట్టించి ఇస్తే, సంచికి ఇరవై ఐదు పైసలు వచ్చేవి. ఈ సంపాదనతో బీహార్‌లో ఇల్లు కట్టుకున్నాను. ► బిజీ బిజీ చేతుల నిండా పనులు. నా రోజులు డబ్బుతో నిండిపోవడం మొదలయ్యాయి. వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్న అత్తమామల రుణం తీర్చేశాం. మా అమ్మనాన్నల లక్షన్నర అప్పు కూడా తీర్చి కొడుకుల కంటే నేనేమీ తక్కువ కాదని నిరూపించుకున్నాను. నాకు ముగ్గురు కొడుకులున్నారు. ఇద్దరు కాలేజీలో, ఒకరు పదోతరగతి చదువుతున్నారు. నా సంపాదనతోనే పిల్లలను చదివిస్తున్నాను. ► డ్రైవింగ్‌లో శిక్షణ దాదాపు పదేళ్ల క్రితం గృహహింసపై మా ప్రాంతంలో అవగాహనా కార్యక్రమం జరుగుతోంది. అప్పుడు ఓ లాయర్ మాట్లాడుతూ ‘‘మహిళలు గృహహింసను ఎందుకు అనుభవించాలి, భర్తపై ఆధారపడకుండా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడగలరు అని వివరించారు. ఆ సమయంలోనే అమ్మాయిలు డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకోవచ్చు అని చెప్పారు. దీంతో ఆ ఫౌండేషన్ వాళ్లు ఇచ్చిన ఆరు నెలల డ్రైవింగ్ శిక్షణ తీసుకున్నాను. అదే సంవత్సరం నేను ప్రొఫెషనల్‌గా డ్రైవింగ్ ప్రారంభించాను. అయితే, పిల్లల్ని చూసుకోవడం ఇబ్బందిగా ఉందని కొంతకాలం తర్వాత డ్రైవింగ్ మానేశాను. ఎనిమిదేళ్ల తర్వాత ఈ–ఆటో నడిపే అవకాశం వచ్చింది. కల్కాజీ మెట్రోలో ఈ–ఆటో ప్రారంభించినప్పుడు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను. ఇప్పుడు నెలకు 15 వేల రూపాయలు వస్తాయి. ఉదయం 10 గంటలకు ఈ–ఆటోతో మెట్రో పార్కింగ్ నుంచి బయల్దేరుతాను. సాయంత్రం 5 వరకు నడుపుతున్నాను. పని చిన్నదనీ, పెద్దదనీ అనుకోవద్దు. అలాగే, మన చుట్టూ ఉన్న జనం ఏం మాట్లాడుతారో కూడా పట్టించుకోవద్దు. పూర్తి విశ్వాసంతో పని చేస్తే చాలు. కొంతమందికి మనం నచ్చకపోవచ్చు. అందుకు చింతిస్తూ కూర్చోకుండా, పనిని చేస్తూనే ఉండాలి. ఒకరోజున విజయం కచ్చితంగా వస్తుంది’అని చెబుతున్న సీతాదేవి కృషి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిదాయకమని చెప్పాలి. పని చిన్నదనీ, పెద్దదనీ అనుకోవద్దు. అలాగే, మన చుట్టూ ఉన్న జనం ఏం మాట్లాడుతారో కూడా పట్టించుకోవద్దు. పూర్తి విశ్వాసంతో పని చేస్తే చాలు. ఒకరోజున విజయం కచ్చితంగా వస్తుంది. – సీతాదేవి -
Hyderabad: విద్యార్థినితో ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: విద్యార్థిని పట్ల ఓ ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆటో డ్రైవర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. టీచర్స్‌కాలనీకి చెందిన ఓ విద్యార్థిని స్థానిక ఓ కార్పొరేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. శివసాయినగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ యాకయ్య ఆ విద్యార్థినితో పాటు మరో ముగ్గురిని రోజూ ఆటోలో స్కూల్‌కు తీసుకెళ్లి తీసుకువస్తాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు స్కూల్ వదిలిన తర్వాత అందరినీ ఆటోలో ఎక్కించుకొని బయలుదేరాడు. మిగతా ముగ్గురిని వారి వారి ఇళ్ల వద్ద వదిలి ఆ విద్యార్తిని ఇంటికి తీసుకెళ్లకుండా వేరే చోటికి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం 1:20 గంటల వరకు ఇంటికి చేరుకునే కూతురు 1:30 గంటల వరకు రాకపోవడంతో తండ్రి ఆటో డ్రైవర్‌కు ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన ఆటో డ్రైవర్ మిగతా పిల్లలను వదులుతున్నాను సార్.. మా ఇంటికి వెళ్లే క్రమంలో మీ పాపను వదిలి వెళ్తానని సమాధానం చెప్పి పది నిమిషాల్లో ఆమెను ఇంటి వద్ద వదిలి వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లిన విద్యార్థిని ఆటో డ్రైవర్ తనను ఇంటికి తీసుకురాకుండా మరో చోటికి తీసుకెళ్లి నా పట్ల అసభ్యంగా వ్యవహరించాడని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తండ్రి ఆటో డ్రైవర్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిచాడు. జరిగిన విషయంపై నిలదీసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించాడు. -
నీకు ఇక్కడేం పని.. బైక్ ట్యాక్సీపై ఆటో డ్రైవర్ ఫైర్
బెంగళూరు: ప్రస్తుత కాలంలో బయటకు వెళ్లాలంటే కొంత మంది ట్యాక్సీలను వాడుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఓలా, ఉబర్, ర్యాపిడో టాక్సీలు, బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక, ట్యాక్సీలు అందుబాటులోకి రావడంతో కొన్ని సిటీల్లో ఆటోలకు డిమాండ్ తగ్గిపోయింది. దీంతో, వారు ట్యాక్సీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కర్నాటకలో ఓ ఆటో డ్రైవర్.. బైక్ ట్యాక్సీ డ్రైవర్‌ను వేధింపులకు గురిచేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వివరాల ప్రకారం.. బెంగళూరులోని ఇందిరానగర్ మెట్రోస్టేషన్ వద్ద ఓ ఆటో డ్రైవర్.. ర్యాపిడో బైక్ ట్యాక్సీ డ్రైవర్‌తో అనుచితంగా ప్రవర్తించాడు. అతడి ఫోన్ లాక్కుని ఆవేశంతో నేలపై కొట్టి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ సందర్బంగా ఆటో డ్రైవర్ మాట్లాడుతూ..‘మిత్రులారా, అక్రమ ర్యాపిడో వ్యాపారం ఎలా జరుగుతుందో చూడండి. వేరే దేశం నుండి మన దేశానికి వచ్చి రాజు ఇక్కడ బైక్ ట్యాక్సీ నడుపుకుంటున్నాడు. ఇలాంటి వారి కారణంగా మాకు వ్యాపారం లేకుండా పోయింది. వేరే దేశానికి చెందిన అతడు వైట్ నంబర్ ప్లేట్ బోర్ట్(ఎల్లో కలర్ ట్యాక్సీ నంబర్ ప్లేట్ కాకుండా) ఉన్నప్పటికీ ఒక అమ్మాయిని తీసుకెళ్లడానికి వచ్చాడు’ అంటూ సీరియస్ అయ్యాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బైకర్.. పోలీసుల ఫిర్యాదు చేయనప్పటికీ వీడియో ఆధారంగా పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టినట్టు తెలిపారు. సదరు ఆటోడ్రైవర్ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు. @indiranagaraps is investigating the incident. Strict and necessary action will be taken. https://t.co/QosaVAF0gO — ಬೆಂಗಳೂರು ನಗರ ಪೊಲೀಸ್ BengaluruCityPolice (@BlrCityPolice) March 7, 2023 -
ఆటో నుంచి రూ.500 నోట్ల వర్షం
నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం నోట్ల వర్షం కురిసింది. రోడ్డుపై వెళ్తున్న ఆటో నుంచి రూ.500 నోట్లు ఎగిరాయి. రోడ్డు మీద జలజలా రాలిపడ్డాయి. రోడ్డు మీద ఉన్న వారు కేకలు వేసినా ఆటోడ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. మడపాం టోల్గేట్ వద్ద ఒక ఆటోలో నుంచి రూ.500 నోట్లు కిందకు పడ్డాయి. గమనించిన టోల్గేట్ సిబ్బంది ఆటోడ్రైవర్‌ను కేకలు వేశారు. అయినా అతడు వినిపించుకోకుండా వెళ్లిపోవడంతో టోల్గేట్ సిబ్బంది రోడ్డుపై పడిన నోట్లను తీసుకున్నారు. పోలీసులకు విషయం తెలియడంతో నరసన్నపేట ఎస్ఐ సింహాచలం టోల్గేట్ వద్ద సీసీ పుటేజీని పరిశీలించారు. శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వైపు వస్తున్న పసుపురంగు ఆటోలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో పురుషులు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. కరజాడ వద్ద నుంచే వీరు నోట్లు విసురుకుంటూ వస్తున్నట్లు తెలిసింది. టోల్గేట్ వద్దకు వచ్చే సరికి నోట్ల వర్షం పెరిగింది. ఈ నోట్లు ఎవరివి, ఆ ఆటో ఎవరిది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ పుటేజీలో ఆటో నంబరును గుర్తించారు. ఇవి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోట్లు అనే ప్రచారం జరుగుతోంది. ఒక్క టోల్‌గేటు వద్దే రూ.88 వేలు లభిస్తే.. కరజాడ నుంచి లెక్కిస్తే లక్షల్లో ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి రూ.88 వేలను స్వాధీనం చేసుకున్నామని, సోమవారం తహసీల్దార్ కోర్టుకు పంపుతామని, ఎవరైనా క్లెయిమ్ చేయడానికి వస్తే ఆధారాలు చూసి విచారిస్తామని ఎస్ఐ తెలిపారు. -
వ్యక్తి దారుణ హత్య.. మృతదేహాన్ని మూటగట్టి ఇంటి ముందు పడేసి..
సాక్షి, హైదరాబాద్: ఓ ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. అంతమొందించిన దుండుగలే మృతదేహాన్ని గోనె సంచీలో మూటగట్టి ఇంటి ముందే మృతదేహాన్ని వదిలేయడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంజయ్‌గాంధీనగర్‌లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం, వెలిమెల గ్రామానికి చెందిన సురేష్ (28) 2016లో రేణుకను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కొన్నేళ్ల నుంచి సంజయ్‌గాం«దీనగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. వారికి ఆరేళ్లు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు ఆడ పిల్లలున్నారు. సురేష్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తుండగా రేణుక ఇంటి వద్దనే ఉంటోంది. ఆదివారం భర్త సురేష్‌ను ఆహారం తీసుకురమ్మని రేణుక బయటకు పంపింది. అర్ధరాత్రి అయినా సురేష్ ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ సైతం ఇంట్లో వదిలి వెళ్లినట్లు గుర్తించారు. సోమవారం తెల్లవారుజాము 5 గంటల ప్రాంతంలో ఇంటి ముందు గోనె సంచీలో మృతదేహం ఉన్నట్లు ఇంటి యజమాని గుర్తించాడు. దగ్గరకు వెళ్లి చూడగా సురేష్ రక్తపు మడుగులో ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. భార్యే హత్య చేయించిందా..! మృతుడు సురేష్ హత్య వెనుక భార్య హస్తమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరి కొంత మంది వ్యక్తులతో కలిసి రేణుక పథకం ప్రకారం హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో జీడిమెట్ల పోలీసులు రేణుకను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. -
బైకర్‌ను ఢీకొట్టి 1.5 కిమీ ఈడ్చుకెళ్లిన ఆటో డ్రైవర్.. అరుస్తున్నా ఆపకుండా..
పాట్నాా: బిహార్ సహర్సా జిల్లాలో ఢిల్లీ తరహా ఘటన జరిగింది. ఓ ఆటో డ్రైవర్ బైకర్‌ను ఢీకొట్టి 1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఆపమని అరుపులు, కేకలు పెట్టినా పట్టించుకోకుండా అలాగే వేగంగా ఆటోను పోనిచ్చాడు. చివరకు ఓ చోట ఆటో ఆపి బైకర్‌ను రోడ్డు పక్కన పడేసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమైన అతడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బైకర్ పరిస్థితి విషమంగా ఉందని, అతని కుడి కాలు తీవ్రంగా దెబ్బతిందని వైద్యులు తెలిపారు. అవసరమైతే కాలును పూర్తిగా తొలగించాల్సి రావచ్చని పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడ్డ బైకర్‌ను కోమల్ కిషోర్ సింగ్(25)గా గుర్తించారు. ఇతడు మంగళవారం తన స్వాగ్రామం హేంపూర్ వెళ్తుండగా బిహ్రా బ్రహాం ఆస్థాన్ వద్ద ఆటో ఢీకొట్టింది. దీంతో అతను ఆటో కిందే ఇరుక్కుపోయాడు. అయితే ఆటో డ్రైవర్ మాత్రం అక్కడి నుంచి పారిపోవాలని వాహనాన్ని అలాగే పోనిచ్చాడు. 1.5 కిలోమీటర్లు కిశోర్‌ను ఈడ్చుకెళ్లాడు. స్థానికులు ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. చివరకు బైకర్‌ను రోడ్డపక్కన పడేసి ఆటోడ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఢిల్లీలో జనవరి 1న అంజలి అనే యువతిని కారు ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో యువతి దారుణంగా చనిపోయింది. పోలీసులు నిందితులను గంటల్లోనే అరెస్టు చేశారు. చదవండి: ఈ పెళ్లికూతురు చాలా స్మార్ట్.. కారు వదిలి మెట్రోలో పెళ్లి మండపానికి.. -
మహిళా ఆటో డ్రైవర్‌కు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్
తమిళసినిమా: మొదట్లో అక్క పాత్రలు.. అమ్మ పాత్రలు పోషించి ఆ తర్వాత కథానాయకి స్థాయికి ఎదగడం సాధారణ విషయం కాదు. దాన్ని సాధ్యం చేసిన నటి ఐశ్వర్య రాజేష్. ఈమె ఇప్పుడు సాధారణ హీరోయిన్ గానే కాదు. లేడీ ఓరియంటెడ్ కథా త్రాల హీరోయిన్గా రాణిస్తున్నారు. తాజాగా ఆమె నటింన చిత్రం డ్రైవర్ జమున. మహిళా డ్రైవర్‌గా బలమైన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని 18 ప్రిన్స్ పతాకంపై ఎస్పీ చౌదరి నిర్మించారు. కింగ్స్ లిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా చిత్ర ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ గురువారం ఒక ప్రైవేట్ చానల్లో మహిళా ఆటోడ్రైవర్లను కలిశారు. ఇందులో చెన్నైతో పాటు ఇతర జిల్లాలకు చెందిన మొత్తం 40 మందికిపైగా మహిళ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. రీల్ మహిళా డ్రైవర్ ఐశ్వర్య రాజేష్‌తో రియల్ మహిళా ఆటో డ్రైవర్లు తమ అనుభవాలను పంచుకున్నారు. నటి ఐశ్వర్య రాజేష్ వారి సాధక బాధకలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళ ఆటో డ్రైవర్లలో ఒకరిని ఎంపిక చేసిన చిత్ర యూనిట్ ఆమెకు కొత్త ఆటోను కానుకగా అందించారు. దీని తాళం చెవిని ఆ మహిళా ఆటో డ్రైవర్‌కు నటి ఐశ్వర్యా రాజేష్ చేతుల మీదుగా అందించి ఆశ్చర్య పరిచారు. దీంతో డ్రైవర్ జమున చిత్ర యూనిట్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా పలువురు అభినందిస్తున్నారు. -
కవాడిగూడలో మిస్సైన తేజశ్రీ కోసం గాలింపు ముమ్మరం
-
భార్యతో సఖ్యతగా మెలుగుతున్నాడనే ఘాతుకం
స్నేహ బంధానికి ద్రోహం చేసి తన భార్యతో సఖ్యతగా మెలుగుతున్నాడని అనుమానం పెంచుకున్నాడు.. మానసిక క్షోభకు కారణమయ్యాడని మిత్రుడినే బద్ధ శత్రువుగా భావించి అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అదును చూసి మరో మిత్రుడి సహకారంతో దారుణంగా హత్య చేసి.. ఆపై ప్రమాదంగా చిత్రీకరించాడు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూడడంతో చివరకు కటకటాలపాలయ్యాడు. ఇదీ.. సూర్యాపేట జిల్లా మోతె మండలం అన్నారిగూడెం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన హత్యోందంతం వెనుక ఉన్న ప్రధాన కారణం. నల్గొండ: మోతె మండలం అన్నారిగూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నరేశ్ మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అతడి మరణం ప్రమాదవశాత్తు జరిగిందని కాదని.. హత్యేనని తేల్చారు. ఘాతుకానికి ఒడిగట్టిన సూత్రధారితో పాటు మరో ఇద్దరు పాత్రధారులను అరెస్ట్ చేశారు. మునగాల పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన పంది నరేశ్ (28), పడిశాల శంకర్‌ది ఒకే సామాజిక వర్గం. ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. వివాహాలు చేసుకుని నరేశ్ ఆటో డ్రైవర్‌గా, శంకర్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అనుమానం పెంచుకుని.. నరేశ్, శంకర్ ఇద్దరూ స్నేహితులు కావడంతో ఒకరింటికి ఒకరు వచ్చి పోతుండేవారు. శంకర్ లేని సమయంలో కూడా నరేశ్ ఇంటికి వచ్చి వెళ్తూ తన భార్యతో సఖ్యతగా మెలుగుతున్నాడని అనుమానం పెంచుకున్నాడు. ఆ విషయంలో తాను ఎక్కడా భయటపడకుండా నరేశ్‌తో స్నేహంగా ఉంటూనే అతడిపై కక్ష పెంచుకున్నాడు. అదును చూసి హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. మరో మిత్రుడి సహకారం తీసుకుని.. నరేశ్‌ని హత్య చేయడం తన ఒక్కడితో కాదని కారుడ్రైవర్‌గా పనిచేస్తున్న ఖమ్మం జిల్లా తిరుమాలయపాలెం మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన తన మిత్రుడు గుండెపంగు మధుసూదన్ సహకారం తీసుకుని పథకం రూపొందించి అమలు కోసం వేచి చూస్తున్నాడు. అందుకు అతడికి రూ.30వేలు ఇచ్చాడు. అందులో భాగంగా నవంబర్ 26న నరేశ్ తన అత్తగారి గ్రామం మునగాలలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. అప్పటికే స్నేహితుడు మధుసూదన్‌ను రప్పించుకున్న శంకర్ మద్యం సేవిద్దామని నరేశ్‌కు కబురు పెట్టాడు. దీంతో నరేశ్ అదేరోజు రాత్రి మోతె మండలం విభళాపురం గ్రామ శివారులో గల స్టీలు ప్లాంటు వద్దకు ఆటోలో చేరుకొని వారిద్దరితో కలిసి పూటుగా మద్యం సేవించాడు. నరేశ్ పూర్తిగా మత్తులోకి వెళ్లాక ఆటోలోనే మెడకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం ఆటోను పక్కనే ఉన్న ఎస్ఆర్ఎస్పీ కాల్వలోకి తోసేసి ప్రమాదంగా చిత్రీకరించారు. అనంతరం అన్నారిగూడెం గ్రామానికి చెందిన మరో మిత్రుడు దున్నపోతుల వెంకటేశ్వర్లుకు హత్యోదంతాన్ని వివరించారు. మధుసూదన్‌ను బైక్‌పై అతడి స్వగ్రామంలో విడిచిపెట్టి శంకర్, వెంకటేశ్వర్లు అన్నారిగూడెం చేరుకున్నారు. అనుమానంతో అదుపులోకి తీసుకుని.. ఇటీవల ఎస్ఆర్ఎస్పీ కాల్వలో నరేశ్ విగతజీవుడిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు అతడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా నరేశ్ స్నేహితుడు శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. కేసులో భాగస్వాములైన మధుసూదన్‌ను ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెం టోల్‌ప్లాజా వద్ద, వెంకటేశ్వర్లును అతడి స్వగ్రామంలో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివరించారు. కేసును ఛేదించిన మునగాల సీఐ ఆంజనేయులు, మోతె ఎస్ఐ ప్రవీణ్‌కుమార్, సిబ్బందిని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. సమావేశంలో మునగాల, నడిగూడెం ఎస్ఐలు లోకేశ్, నాగభూషణ్‌రావు తదితరులు ఉన్నారు. -
కిలాడీ ఆటో డ్రైవర్.. పంజగుట్టకు చేరుకోగానే ప్రయాణికుడిని ఆటోలోంచి తోసేసి..
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుడిని ఆటోలోంచి తోసేసిన ఓ ఆటో డ్రైవర్ సదరు వ్యక్తి సెల్‌ఫోన్ నుంచి గూగుల్ పే ద్వారా రూ. 57 వేల నగదు ట్రాన్స్ఫర్ చేసుకున్న ఘటన పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్‌కు చెందిన పి.వీరప్రతాప్ సింగరేణి ఉద్యోగి. ఈ నెల 23వ తేదీన ఈఎస్ఐ ఆసుపత్రికి వచ్చిన అతను అర్జెంట్‌గా మంచిర్యాల వెళ్లే క్రమంలో తెల్లవారు జామున 4:25కు ఈఎస్ఐ వద్ద సికింద్రాబాద్ వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. ఆటో పంజగుట్ట కూడలికి చేరుకోగానే ఆటోడ్రైవర్ వీరప్రతాప్‌ను ఆటోలోనుంచి బలవంతంగా బయటకు నెట్టివేసి ఆటో తీసుకుని బంజారాహిల్స్ వైపు వేగంగా వెళ్లిపోయాడు. వీరప్రతాప్ తేరుకుని కొద్దిసేపు తర్వాత చూసుకోగా అతని సెల్‌ఫోన్ కనిపించలేదు. అర్జెంట్‌గా ఊరు వెళ్లే క్రమంలో అతను మంచిర్యాలకు వెళ్లిపోయాడు. అక్కడ ఎటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసేందుకు చూడగా నో బ్యాలెన్స్ చూపించింది. దీంతో మంచిర్యాల యాక్సిస్ బ్యాంకులో సంప్రదించగా తన అకౌంట్ నుండి గూగుల్ పే ద్వారా 57362 రూపాయలు బదిలీ అయినట్లు నిర్ధారించారు. దీంతో తిరిగి నగరానికి వచ్చిన వీరప్రతాప్ శుక్రవారం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: శంషాబాద్‌లో కొత్త అంతర్జాతీయ టెర్మినల్.. 28 నుంచి కార్యకలాపాలు -
కంట్లో కారం చల్లి.. కత్తులతో పొడిచి..
చాంద్రాయణగుట్ట: పాత గొడవల నేపథ్యంలో ఓ ఆటోడ్రైవర్ దారుణ హత్యకు గురైన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు....తలాబ్‌కట్టకు చెందిన మహ్మద్ షాకీర్(30) ఆటోడ్రైవర్‌గా పని చేస్తూ భార్యతో పాటు ఇద్దరు పిల్లలతో సహా హఫీజ్‌బాబానగర్‌లో నివాసం ఉంటున్నాడు. గురువారం ఉదయం అతను ఆటోలో బ్యాటరీల లోడ్ తీసుకుని బాలాపూర్ నుంచి చాంద్రాయణగుట్టకు వస్తున్నాడు. డీఎల్ఆర్ఎల్ గేట్ వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన ఇబ్రహీం అతని స్నేహితులు ఆటోను అడ్డుకుని షాకీర్ కళ్లల్లో కారం చల్లారు. వెంటనే కత్తితో అతని మెడ, ఛాతిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు పరారయ్యారు. రోడ్డుపై ఆగి ఉన్న ఆటోలో రక్తపు మడుగులో పడిఉన్న షాకీర్‌ను గుర్తించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. ఫలక్‌నుమా ఏసీపీ షేక్ జహంగీర్, చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ కె.ఎన్.ప్రసాద్ వర్మ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే షాకీర్‌ను ఇబ్రహీం హతమార్చినట్లు సమాచారం. అప్పుల బాధ తాళలేక గతంలో షాకీర్ బెంగుళూర్ వెళ్లాడు. దీనిని అదునుగా చేసుకుని ఇబ్రహీం షాకీర్ భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. బెంగుళూర్ నుంచి తిరిగొచ్చిన షాకీర్ విషయం తెలుసుకొని ఇబ్రహీంతో గొడవ పడ్డాడు. అప్పట్లోనే కత్తులతో దాడులకు దిగగా స్నేహితులు అడ్డుకున్నారు. ఎప్పటికైనా చంపేస్తానంటూ షాకీర్ హెచ్చరించాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండడం...ఇటు చంపుతాడేమోన్న భయంతోనే ఈ హత్యకు ఒడిగట్టినట్లు తెలిసింది. నిందితులను దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదపులోకి తీసుకున్నారు. (చదవండి: భార్యను కత్తితో నరికి... మృతదేహానికి పూలమాల వేసి...) -
ఎయిర్‌పాడ్స్ మిస్, స్మార్ట్ ఆటో డ్రైవర్ ఏం చేశాడో తెలుసా?
బెంగళూరు:బెంగళూరుకు చెందిన యువతి ఆటోలో తన ఖరీదైన ఎయిర్పాడ్లను మర్చిపోయింది. ఆగండాగండి.. అయ్యో...అని అపుడే మీరు ఫిక్స్ అయిపోకండి..టెక్నాలజీపై అవగాహన ఉన్న ఆటో డ్రైవర్ చేసిన పని గురించి తెలుసుకుంటే.. శభాష్ అంటారు. టెక్ సిటీ బెంగళూరులో స్మార్ట్ అండ్ టెక్సావీ ఆటో డ్రైవర్ చేసిన పని ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. (ఆ విషయంలో మనవాళ్లు చాలా వీక్! మీరు అంతేనా?తస్మాత్ జాగ్రత్త!) సరే.. సూటిగా విషయంలోకి వచ్చేస్తే...షిడికా అనే యువతి ఆఫీసుకు వెళ్లే హడావిడిలో తన ఎయిర్పాడ్లను పనికి వెళుతుండగా ఆటోలో మర్చిపోయింది. కానీ కేవలం అరగంటలో తన విలువైన గ్యాడ్జెట్ దొరకడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. దీంతో ఈ విషయాన్నిఆమె ట్విటర్లో షేర్ చేశారు. దీంతో పోస్ట్‌కి వేలకొద్దీ లైక్స్, కామెంట్స్ వచ్చాయి. జయహో ఆటో డ్రైవర్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. (స్పోర్టీ లుక్‌లో 2023 కవాసాకి నింజా 650 బైక్: ధర తెలిస్తే షాకే!) ఆటోలో ఖరీదైన గ్యాడ్జెట్ ఎయిర్‌పాడ్స్‌ను గుర్తించిన ఆటో డ్రైవర్ దాని కనెక్ట్ చేసి, ఆమె పేరు ఉంటో కనుకున్నాడు. తనకు పేమెంట్ చేసిన ఫోన్‌పే ద్వారా నంబరు తెలుసుకుని ఆమెను డ్రాప్ చేసిన ప్లేస్కొచ్చి, అక్కడి బసెక్యూరిటీకి వాటిని హ్యాండోవర్ చేయడంతో కథ సుఖాంతమైందన్నమాట. Lost my AirPods while traveling in an auto. Half an hour later this auto driver who dropped me at WeWork showed up at the entrance & gave it back to security. Apparently, he connected the AirPods to find the owner's name & used his PhonePe transactions to reach me. @peakbengaluru — Shidika Ubr (@shidika_ubr) November 15, 2022 Auto drivers are more tech enthusiasts then engineers or what ?? ( Especially in Bangalore) 😂 — Dibyadyoti Sarkar (@dibyadyoti_) November 15, 2022 -
భయంకర దృశ్యాలు.. డ్రైవర్ వేధింపులు.. కదులుతున్న ఆటో నుంచి దూకడంతో
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో భయంకర ఘటన వెలుగు చూసింది. రద్దీగా ఉండే రహదారిపై వేగంగా ఆటో నుంచి ఓ మైనర్ బాలిక అకస్మికంగా రోడ్డు మీదకు దూకింది. డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో.. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మైనర్ ఆటోలో నుంచి కిందకు దూకినట్లు తేలింది. ఈ ప్రమాదంలో బాధితురాలి తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాలిక ఆటో నుంచి పడిపోవడాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన స్పందించి ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ రోడ్డు పక్కనున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీలో రద్దీగా ఉన్న రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ ఆటోరిక్షా నుంచి రోడ్డుపై పడినట్లు కనిపిస్తోంది. వెంటనే బైక్‌పై వెళ్తున్న వ్యక్తి బాలికను రక్షించేందుకు వచ్చాడు. మిగతా వారిని సాయం చేయాలని కోరుతూ ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. మరో వ్యక్తి తన షాపు నుంచి వాటర్ బాటిల్‌తో బయటకు వచ్చి బాధితురాలికి అందివ్వడం కూడా వీడియోలో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు డ్రైవర్ సయ్యద్ అక్బర్ హమీద్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: మహిళపై పెంపుడు కుక్క దాడి.. యజమానికి షాకిచ్చిన కోర్టు #WATCH #CCTV #Crime #BREAKING#Maharashtra In #Aurangabad auto driver #molested girl in moving auto,minor girl jumped from moving auto,#girlinjured After molesting the girl jumped from speeding #auto which was caught on CCTV #ACCIDENT pic.twitter.com/udGvgMgbry — Harish Deshmukh (@DeshmukhHarish9) November 16, 2022 -
Video: ఏకంగా రైల్వే ప్లాట్‌ఫామ్ మీదకు ఆటో.. తరువాత ఏం జరిగిందంటే.
మహారాష్ట్రలో వింత ఘటన చోటుచేసుకుంది. ముంబైలోని కుర్లా రైల్వే స్టేషన్లో ఓ ఆటో డ్రైవర్ తన వాహనంతో రైల్వేస్టేషన్‌లోకి వచ్చాడు. ప్రయాణికులతో రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఆటో డ్రైవర్ ఏకంగా ఏకంగా తన ఆటోను ప్లాట్‌ఫామ్ మీదకే పోనిచ్చాడు. ఈ దృశ్యాలు రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చివరికి రైల్వే పోలీసులు దృష్టికి చేరింది. దీంతో వారు ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు. కుర్లా రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫామ్ మీదకు ఆటో తీసుకొచ్చిన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రైల్వే యాక్ట్ ప్రకారం నిందితుడిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన శనివారం జరగ్గా.. తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఫన్నీగా కామెంట్ పెడుతుంటే మరికొందరు రైల్వే అధికారులను తీరును తప్పబడుతున్నారు. ఆటో ఏకంగా ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేదాక రైల్వే సిబ్బంది ఏం చేస్తున్నారని మండిడుతున్నారు. Kurla station auto mafia on the platform. Please check & verify this. Too much freedom given by Kurla @MTPHereToHelp & @RPFCRBB Coincidentally on the first day of new @drmmumbaicr Isn't this a safety hazard for trains? @SrdsoM @RailMinIndia @RPF_INDIA pic.twitter.com/dXGd95jkHL — Rajendra B. Aklekar (@rajtoday) October 15, 2022 -
షాకింగ్ ఘటన.. కాలేజీ విద్యార్థిని ఈడ్చుకెళ్లిన ఆటో డ్రైవర్, వీడియో వైరల్
ముంబై: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పట్టపగలే నడిరోడ్డుపై కాలేజీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ క్రూరంగా ప్రవర్తించాడు. ఈ ఘోరం సీఎం ఏక్నాథ్ షిండే నియోజకవర్గం థానే నగరంలో చోటుచేసుకోవడం గమనార్హం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. వివరాలు 21 ఏళ్ల యువతి కళాశాలకు వెళ్తుండగా రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఆటో డ్రైవర్ అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. దీంతో యువతి అతినిపై ఎదురు తిరిగి ప్రశ్నించగా.. అతడు ఆమె చేతిని పట్టుకొని లాగాడు. తరువాత నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా యువతి అతడిని వదిలిపెట్టలేదు. ఆటో తీసి పరారవుతుండగా అతడి చేతిని గట్టిగా పట్టుకుంది. అయితే ఆటో డ్రైవర్ యువతిని అలాగే 500 మీటర్లు తన బండితోపాటు ఈడ్చుకెళ్లాడు. అనంతరం ఆమెను ఓ చోట కింద పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. యువతిని గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆటోరిక్షా డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: రూ. 9 లక్షల లోన్ కట్టాలని బ్యాంక్ నోటీస్.. గంటల్లోనే అదృష్టం తలుపు తట్టింది Shocking! In CM’s constituency by an autodriver. HM should resign.#Maharashtra https://t.co/dL5JV3kMip — Shraddhey (@shraddhey) October 14, 2022 -
Sakshi Cartoon: నా ఓటు బీజేపీకే
నా ఓటు బీజేపీకే -
ఇదేం ట్విస్ట్.. ఆ ఆటోవాలా బీజేపీ మనిషి!
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు ప్రచారం ఊపందుకుంది. అధికార బీజేపీతో పాటు కొత్తగా అక్కడ పోటీ చేయాలని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నిరవధిక ప్రచారంతో హోరెత్తిస్తోంది. ఈ తరుణంలో ఈమధ్య జరిగిన ఓ పరిణామం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. సెప్టెంబర్ 12వ తేదీన ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అహ్మదాబాద్‌లో జరిగిన ఓ మీటింగ్‌కు హాజరయ్యారు. అక్కడ ఓ ఆటోవాలా.. తాను కేజ్రీవాల్ అభిమానినని, తన ఇంటికి వచ్చి భోజనం చేయాలని కోరాడు. దీంతో అనుకున్నదే తడవుగా అతని ఆటోలోనే ఇంటికి వెళ్లి కుటుంబంతో కలిసి భోజనం చేసి వచ్చాడు కేజ్రీవాల్. మార్గం మధ్యలో గుజరాత్ పోలీసులు ఆటోను అడ్డగించడం, ఎలాగోలా ఆటోవాలా ఇంటికి చేరుకుని భోజనం చేసి ఆ కుటుంబంతో కాసేపు సరదాగా గడిపారు ఢిల్లీ సీఎం. అయితే.. अहमदाबाद में ऑटो चालक विक्रमभाई दंताणी बड़े प्यार से अपने घर खाने पर लेकर गए, पूरे परिवार से मिलवाया, स्वादिष्ट खाने के साथ बहुत आदर-सत्कार दिया। इस अपार स्नेह के लिए विक्रमभाई और गुजरात के सभी ऑटो चालक भाइयों का ह्रदय से धन्यवाद। pic.twitter.com/SiFCZOizaW — Arvind Kejriwal (@ArvindKejriwal) September 12, 2022 ఈ ఎపిసోడ్లో ఇప్పుడొక ట్విస్ట్ వెలుగు చూసింది. ఆ ఆటోడ్రైవర్ బీజేపీ మనిషి అని, అన్నింటికన్నా ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని అనే విషయాన్ని వెల్లడించారు. బీజేపీ స్టేట్ మీడియా హెడ్ జుబిన్ ఆష్రా ఈ మేరకు ఆ ఆటోడ్రైవర్‌తో ఉన్న ఓ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఆప్ నేతలు తనకు డబ్బు ఇచ్చిన విషయాన్ని స్వయంగా ఆ ఆటోడ్రైవర్ ఒప్పుకున్నాడు కూడా. కేజ్రీవాల్‌ను తన ఇంటికి ఆహ్వానించిన అదే ఆటో డ్రైవర్ ఈ విక్రమ్ దంతాని. కానీ, ఇతగాడు చిన్నప్పటి నుంచి మోదీ అభిమాని. ఏదో డబ్బు ఆశతో ఆప్ వాళ్లు చెప్పినట్లు నటించాడు అని జుబిన్ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ये वही ऑटोवाला विक्रम दंतानी है जिसके घर केजरीवाल जी मीडिया को लेकर खाना खाने गए थे। विक्रम भाई का कहना है की केजरीवाल के लोग उन्हे पैसे की बात कहकर मनाए थे पर ये बचपन से ही मोदी जी के फैन हैं। 😁 pic.twitter.com/iWNBj4GqwK — Zubin Ashara (@zubinashara) September 30, 2022 -
Ishita Singh: ఆటో దిగుతుంటే అసభ్యంగా తాకి.. పారిపోయాడు
వైరల్: ఉబెర్ ద్వారా ఆటో నడిపే ఓ డ్రైవర్.. ఓ కాలేజీ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. చీకట్లో లైంగికంగా వేధించాడు. కానీ, ఆమె ఎదురు తిరగడంతో.. ఆటో వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. చెన్నైలో జరిగిన ఈ ఘటన.. ఇప్పుడు ట్విటర్ ట్రెండ్ ద్వారా వైరల్ అవుతోంది. ఇషితా సింగ్ అనే యువతి చెన్నై ఏసీజే ఇండియాలో జర్నలిజం కోర్సు చేస్తోంది. ఆదివారం రాత్రి ఈస్ట్ కోస్ట్ మద్రాస్ రెస్టారెంట్ నుంచి సెమ్మన్చెరిలోని ఐబీఐఎస్ ఓఎంఆర్ హోటల్‌కు ఆమె ఉబెర్ ఆటో బుక్ చేసుకుంది. ఆ సమయంలో ఆమెతో పాటు ఆమె స్నేహితురాలు కూడా ఉంది. అయితే.. గమ్యస్థానానికి చేరుకున్నాక కిందకు దిగే క్రమంలో డ్రైవర్ ఆమెను అసభ్యంగా తాకాడు. దీంతో ఆమె గట్టిగా అరిచి.. అతనితో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో ఆ ఇద్దరూ అతన్ని అడ్డుకునే యత్నం చేయగా.. అతను ఆటో అక్కడే వదిలేసి పారిపోయాడు. I’m a student journalist at @ACJIndia, Chennai. An @Uber Auto driver named Selvam ,sexually assaulted me by pressing my right breast, near Ibis OMR Hotel, when my friend and I returned from East Coast Madras to the hotel.@PoliceTamilnadu pic.twitter.com/jJMhx4zk5j — Ishita Singh (@IshitaS05978134) September 25, 2022 వెంటనే ఆమె పోలీసులకు ఫోన్ చేయగా.. అరగంట తర్వాత ఓ అధికారి అక్కడకు చేరుకున్నాడు. ఉదయం వరకు వేచిచూడాలని, ఈ రాత్రి స్టేషన్లో మహిళా సిబ్బంది ఉండరని అతను ఆమెకు సూచించాడు. అయినప్పటికీ స్టేషన్ బయటే ఉండి.. ఆమె రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చింది. ఆపై జరిగిన ఘటనను పూసగుచ్చినట్లుగా వివరిస్తూ.. మొత్తం ట్విటర్ నిండా ఫొటోలతో వివరించుకుంటూ పోయింది. ఈ క్రమంలో.. I had to file the complaint outside the station. Also, the station incharge gave us an A4 sheet to write an application instead of an FIR. (Usually, the Police ask you to file an application instead of an FIR, to suppress the matter and to avoid the work load). @vijaypnpa_ips pic.twitter.com/3JsifnjeVB — Ishita Singh (@IshitaS05978134) September 25, 2022 Case registered in Semmanchery Ps. We are searching for the auto driver — TAMBARAM CITY POLICE (@COPTBM) September 26, 2022 Hey Ishita, this is concerning. Please share the registered details via Direct Message with which the trip was requested. We'll follow up. https://t.co/1WqzzOmdKe — Uber India Support (@UberINSupport) September 25, 2022 ఆమె ట్వీట్లకు చాలామంది రకరకాలుగా స్పందించారు. పలువురు ప్రముఖులు సైతం ఆమె ట్వీట్లను రీట్వీట్లు చేశారు. చివరకు తంబారం పోలీస్ కమిషనరేట్ ఆమె ట్వీట్లకు స్పందించింది. కేసు నమోదు చేసుకుని.. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపింది. అయితే.. డ్రైవర్ సెల్వంను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీతో పాటు ఆ ఆటోను సైతం పోలీసులు సీజ్ చేసినట్లు బాధిత యువతి తాజాగా ట్విటర్ ద్వారా వెల్లడించింది. మరోవైపు ఉబెర్ సైతం ఈ ఘటనపై స్పందించింది. ఇషితను ప్రయాణానికి, ఘటనకు సంబంధించిన వివరాలను వ్యక్తిగతంగా తమకు తెలియజేయాలని కోరింది. ఇదీ చదవండి: రష్యా చెరలో అంతగా హింసను అనుభవించాడా? -
ఆటో డ్రైవర్‌కు రూ.25 కోట్ల లాటరీ
తిరువనంతపురం: కేరళలోని శ్రీవరాహం ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ అనూప్‌కు ఓనమ్ బంపర్ లాటరీలో రూ.25 కోట్ల జాక్‌పాట్ తగిలింది. మలేసియా వెళ్లి చెఫ్‌గా స్థిరపడాలనుకుని ఏర్పాట్లు చేసుకుంటున్న ఇతడు 22 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొని అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. అన్ని పన్నులు పోను అనూప్ చేతికి రూ.15 కోట్లు అందుతాయని నిర్వాహకులు చెప్పారు. ఈ డబ్బుతో అప్పులు తీర్చి, ఇల్లు కట్టుకుంటానని అనూప్ తెలిపాడు.