
హైదరాబాద్, సాక్షి: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేయడానికి ఓ వ్యక్తి యత్నించాడు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ అప్రమత్తం కావటంతో ప్రమాదం తప్పింది. కొండాపూర్ మజీద్ బండలో ఓ ప్రైవేట్ స్కూల్‌కి వెళ్లేందుకు పిల్లలు ఆటో కోసం చూశారు. అయితే.. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ పిల్లలు చేయిపట్టుకొని ఆటోలో ఎక్కించాడు. అనంతరం ఆటో మజీద్ బండ స్మశానవాటికవైపు వేళ్తుండటంతో అనుమానం వచ్చిన చిన్నారులు ఆ వ్యక్తిని ప్రశ్నించారు.
అప్రమత్తం అయిన ఆటో డ్రైవర్ పిల్లలతో పాటు ఉన్న కిడ్నాపర్ పట్టుకొని సమీపంలో ట్రాఫిక్ పోలీసులకు అప్పగించాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ చందానగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉదయం 9 గంటలకు చందానగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన చిన్నారులు సుమారు 8 గంటల పాటు స్టేషన్‌లో ఉన్నారు. కిడ్నప్ ఘటనస్ధలం తమ పరిధిలోకి రాదంటూ సాయంత్రం గచ్చిబౌలీ పోలీసులకు అప్పగించారు. సకాలంలో స్పందించి తమ పిల్లలను కిడ్నాపర్ నుంచి రక్షించిన ఆటో డ్రైవర్‌ను పిల్లల కుటుంబ సభ్యులు అభినందించారు. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment