Kidnap attempt
-
Hyderabad: గచ్చిబౌలిలో కిడ్నాప్ కలకలం
హైదరాబాద్, సాక్షి: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేయడానికి ఓ వ్యక్తి యత్నించాడు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ అప్రమత్తం కావటంతో ప్రమాదం తప్పింది. కొండాపూర్ మజీద్ బండలో ఓ ప్రైవేట్ స్కూల్‌కి వెళ్లేందుకు పిల్లలు ఆటో కోసం చూశారు. అయితే.. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ పిల్లలు చేయిపట్టుకొని ఆటోలో ఎక్కించాడు. అనంతరం ఆటో మజీద్ బండ స్మశానవాటికవైపు వేళ్తుండటంతో అనుమానం వచ్చిన చిన్నారులు ఆ వ్యక్తిని ప్రశ్నించారు. అప్రమత్తం అయిన ఆటో డ్రైవర్ పిల్లలతో పాటు ఉన్న కిడ్నాపర్ పట్టుకొని సమీపంలో ట్రాఫిక్ పోలీసులకు అప్పగించాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ చందానగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉదయం 9 గంటలకు చందానగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన చిన్నారులు సుమారు 8 గంటల పాటు స్టేషన్లో ఉన్నారు. కిడ్నప్ ఘటనస్ధలం తమ పరిధిలోకి రాదంటూ సాయంత్రం గచ్చిబౌలీ పోలీసులకు అప్పగించారు. సకాలంలో స్పందించి తమ పిల్లలను కిడ్నాపర్ నుంచి రక్షించిన ఆటో డ్రైవర్‌ను పిల్లల కుటుంబ సభ్యులు అభినందించారు. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. -
బాల్య వివాహం.. సినిమా స్టైల్లో విద్యార్థిని కిడ్నాప్‌కు యత్నం..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఓ యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలంగా మారింది. దావణగెరె విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థిని కిడ్నాప్‌నకు గురైన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బళ్లారి జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని దావణగెరె విశ్వవిద్యాలయంలో చదువుకుంటోంది. విద్యార్థిని తల్లితో పాటు మరో ఇద్దరు యువకులు సినిమా తరహాలో కళాశాల ఆవరణలో నుంచి కారులో కిడ్నాప్ చేస్తుండగా కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది అడ్డగించి రక్షించారు. వివరాల్లోకి వెళితే.. బళ్లారి జిల్లాకు చెందిన ఓ యువతికి ఇష్టం లేకున్నా తల్లిదండ్రులు అప్పట్లో బాల్యవివాహం చేశారు. ఈనేపథ్యంలో కిడ్నాప్‌నకు గురైన ఆమ్మాయి ఉన్నత విద్యను అభ్యసించేందుకు విశ్వవిద్యాలయంలో చేరింది. తనకు బాల్య వివాహం చేసినప్పడు అతని గురించి తెలియదని, తనను పెళ్లి చేసుకొన్న సదరు వ్యక్తికి మంచి నడత లేకపోవడం వల్ల అతనితో కాపురం చేయడం ఇష్టం లేదని తేల్చి చెప్పింది. ఈనేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థినిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై దావణగెరె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
పిల్లలు పుట్టలేదనే బాధతో చివరికి ఇలా..
సంగారెడ్డి: పిల్లలు లేరనే బాధతో ఆరు నెలల పాపను ఎత్తుకెళ్లిన సంఘటన సంగారెడ్డిలో జరిగింది. చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితుడిని 24గంటల్లో పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు డీఎస్పీ రమేష్ కుమార్ శనివారం వెల్లడించారు. మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన దంపతులు వల్లేపు రాజు, యేసుమని తమ ఇద్దరు పిల్లలతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి చెకప్ కోసం తరచూ వస్తుండేవారు. శుక్రవారం ఆస్పత్రికి వచ్చిన వారు రాత్రి పాత బస్టాండ్ సమీపంలోని గంజి మైదాకు వెళ్లి అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో నిద్రించారు. ఆ పక్కనే గద్దైపె పట్టణానికి చెందిన మన్నే అనిల్, అతని స్నేహితుడు శ్రీశైలం మద్యం సేవిస్తున్నారు. అయితే అనిల్‌కు పెళ్లయ్యి ఏడేళ్లవుతున్నా పిల్లలు లేరనే బాధతో పక్కనే నిద్రిస్తున్న చిన్నారి రూపని తన స్నేహితుడి సహాయంతో ఎత్తుకెళ్లాడు. తెల్లారి నిద్రలేచే సరికి పాప కనిపించకపోవడంతో దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకొని పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించగా, అతని స్నేహితుడు శ్రీశైలం పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. కిడ్నాప్ కేసును చాకచక్యంగా ఛేదించిన పట్టణ సీఐ శ్రీధర్‌రెడ్డి, రూరల్ సీఐ సుధీర్ కుమార్, ఇన్స్పెక్టర్ మహేష్‌లను అభినందించారు. అలాగే మరో ముగ్గురు కానిస్టేబుళ్లు శాఖీర్, మల్లారెడ్డి, శేఖర్‌కు నగదు పురస్కారం అందజేశారు. -
పోలీసులమంటూ కిడ్నాప్‌లు
కృష్ణరాజపురం: డబ్బున్న వారిని చూసి కిడ్నాప్ చేసి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ఘరానా ముఠాను బెంగళూరు బ్యాటరాయనపుర పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్, మహారాష్ట్రకు చెందిన సిద్దార్థ, నాగురావు, కిరణ్, బానుదాస్. వీరు పోలీస్ అధికారులమని చెప్పుకుంటూ ధనవంతులను అపహరించే దందాకు పాల్పడుతున్నారు. శివారెడ్డిని కిడ్నాప్ చేసి.. వివరాలు.. ఇటీవల ఈ ముఠా శివారెడ్డి అనే రియల్టర్‌ను కిడ్నాప్ చేసి డబ్బు వసూలు చేయడంతో బాధితుడు బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి ఇటీవల నిందితులు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని క్లబ్లో ఉండగా అరెస్టు చేశారు. శివారెడ్డి, అతని స్నేహితురాలు పనిమీద హైదరాబాద్‌కు వెళ్ళిన సమయంలో హరీష్ ద్వారా వీరు పరిచయం అయ్యారు. తరువాత బెంగళూరులో భూమి కొనాలని వచ్చి శివారెడ్డిని పిలిపించి కిడ్నాప్ చేశారు. వసంతకు ఫోన్ చేసి రూ.50 లక్షలు ఇస్తేనే శివారెడ్డిని వదిలివేస్తామన్నారు. దీంతో వసంత రూ. 11 లక్షలు తీసుకెళ్లి ఈ ముఠాకు ఇవ్వగా అతన్ని విడిచిపెట్టారు. తరువాత బాధితులు వచ్చి బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్టు చేశారు. హరీష్ పరారీలో ఉన్నాడు. ఈ ముఠా బెంగళూరు, హైదరాబాద్‌లలో పలు నేరాలకు పాల్పడినట్లు అనుమానాలున్నాయి. (చదవండి: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం... నడిరోడ్డుపై పల్టీ కొట్టి..) -
అర్ధరాత్రి ప్రేమ జంట కిడ్నాప్‌యత్నం
సాక్షి, మచిలీపట్నం: ఆదివారం రాత్రి 11 గంటలు దాటింది.. కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్.. ఓ యువజంట బస్టాండ్ టేబుల్‌పై కూర్చుంది. నలుగురు వ్యక్తులు మెరుపు వేగంతో వచ్చి ఆ జంటను చుట్టుముట్టారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే బలవంతంగా ఈడ్చు కుంటూ విజయవాడ బస్సు ఎక్కించారు. మాట్లాడకుండా వారి నోరు నొక్కేశారు. ఇంతలో తన స్నేహితుడిని బస్సు ఎక్కించేందుకు బస్టాండ్‌కు వచ్చిన మచిలీపట్నం పీఆర్వో జాకబ్ ఆ జంటకు ఏ ఆపద వచ్చిందోనని బస్సును ఆపే ప్రయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో ‘సాక్షి’రిపోర్టర్‌కు సమాచారం ఇచ్చారు. తర్వాత ఫోన్లో పోలీసులకు చెప్పడంతో నైట్ పెట్రోలింగ్ చేస్తున్న పామర్రు పోలీసులు సినీ ఫక్కీలో బస్సును వెంబడించారు. ఆ జంటతో పాటు వార్ని బలవంతంగా తీసుకెళ్తున్న ఆ నలుగురు వ్యక్తులను బస్సు నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఆరా తీయగా, వారు తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం ప్రాంతానికి చెందిన వారని గుర్తించారు. నాలుగు రోజుల క్రితం పారిపోయి బందరు ప్రాంతానికి వచ్చారు. ఎక్కడా ఆశ్రమం దొరక్కపోవడంతో రాత్రి పూట బస్టాండ్‌లో తలదాచుకునే వారని పోలీసుల విచారణలో గుర్తించారు. ప్రేమికులను తీసుకెళ్లేందుకు వచ్చిన వారిని మందలించారు. కొత్తగూడెం పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని ఆ రాష్ట్రానికి ప్రత్యేక వాహనంలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. -
దారుణం : కిడ్నాప్‌ను అడ్డుకున్నారు.. కానీ
కోల్‌కతా : వివాహ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వెళ్తున్న ఓ కుటుంబంపై దాడిచేసిన దుండగులు మహిళను ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. అయితే, కుటుంబ పెద్ద అప్రమత్తంగా వ్యవహరించి ఆమెను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కోల్‌కతాలోని టాంగ్రా ప్రాంతంలోని క్రిస్టోఫర్ రోడ్డులో జరిగింది. వివరాలు.. గోపాల్ ప్రమాణిక్ (55) తన కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం ఓ పెళ్లికి హాజరయ్యాడు. వేడుక పూర్తయ్యాక రాత్రి 11:45 గంటల సమయంలో వారంతా ఇంటికి తిరుగుపయనమయ్యారు. ఆయన కోడలు (28) మిగతా కుటుంబ సభ్యులు ముందు నడుస్తుండగా.. ప్రమాణిక్ వారిని అనుసరిస్తున్నాడు. ఈక్రమంలో అంబులెన్స్‌లో దూసుకొచ్చిన కొందరు దుండగులు ప్రమాణిక్ కోడలిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఆమెను బలవంతంగా కారులో ఎక్కిస్తుండగా.. అప్రమత్తమైన ప్రమాణిక్ వాహనానికి అడ్డుగా నిలిచాడు. అంతలోనే కుటుంబసభ్యులు కూడా డ్రైవర్‌ను డోర్లో నుంచి పట్టుకున్నారు. దీంతో ఇక పట్టుబడ్డామని గ్రహించిన దుండగులు సదరు మహిళను వదిలేసి.. ఒక్కసారిగా కారును ముందుకు పోనిచ్చారు. ప్రమాణిక్‌ను ఢీకొట్టి పరారయ్యారు. తీవ్రగాయాలైన ప్రమాణిక్‌ను ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. -
పదో తరగతి విద్యార్థి కిడ్నాప్‌కు యత్నం
అనంతపురం, కళ్యాణదుర్గం రూరల్: కిడ్నాప్‌కు గురైన పదో తరగతి విద్యార్థి మార్గమధ్యలో తప్పించుకుని తల్లిదండ్రుల వద్దకు చేరిన ఘటన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి తెలిపిన వివరాలిలా.. నారాయణపురం గ్రామానికి చెందిన నాగలక్ష్మి, అంజినప్పల కుమారుడు అజిత్ స్థానిక జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా కారులో వచ్చిన ముగ్గురు అజిత్‌ను ఆపి మల్లాపురం గ్రామానికి దారి అడిగారు. దారి చూపి ముందుకెళుతుండగా వారు పాఠశాల వద్ద దింపుతామంటూ కారులో ఎక్కించుకున్నారు. పాఠశాల వద్ద ఆపకుండా వెళ్తుండటంతో గట్టిగా అరవడం తో కళ్లకు, నోటికి గంతలు కట్టి కంబదూరుకు తీసుకెళ్లారు. అక్కడి మద్యం కోసం దుకాణం వద్ద కారు ఆపిన సమయంలో విద్యార్థి తప్పించుకున్నాడు. సమీపంలో ఉన్న ఇళ్లలోకి వెళ్లి జరిగిన విషయాన్ని వారి ద్వారా తల్లిదండ్రులకు ఫోన్లో చేరవేశాడు. వారు అక్కడికి చేరుకొని బాలుడిని వెంట తీసుకెళ్లారు. ఈ విషయమై కళ్యాణదుర్గం రూరల్ సీఐ శివశంకర్‌నాయక్ స్పందిస్తూ.. ఘటనపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. -
కలకలం రేపిన హెచ్ఎం కిడ్నాప్
-
కొంకుదురులో అదృశ్యం.. కాకినాడలో ప్రత్యక్షం
సాక్షి, బిక్కవోలు (తూర్పుగోదావరి) : మండలంలోని కొంకుదురు, కే.సావరం గ్రామాల మధ్య శుక్రవారం సాయంత్రం పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామానికి చెందిన సత్తి శ్రీనివాసరెడ్డి ఆలియాస్ వార్త శ్రీను మాయమై ఐదు గంటల అనంతరం కాకినాడ రెండో పట్టణ పోలీస్టేషన్లో ప్రత్యక్షమైన ఘటన గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ వార్త బిక్కవోలు, పెదపూడి మండలాల్లో చర్చనీయాంశమైంది. శుక్రవారం సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం తొస్సిపూడి నుంచి కొంకుదురు మీదుగా స్వగ్రామం మామిడాడ బయలుదేరాడు. కొంకుదురు దాటిన తరువాత సావరం వద్ద నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని దుండగులు శ్రీనివాసరెడ్డి కారును వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో కారు ఆపి కిందకు దిగిన అతడిని దుండగులు దాడి చేసి తమ కారులోకి బలవంతంగా తీసుకుని పోయారని కుమారుడు శివారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే దీనికంతటికి శ్రీనివాసరెడ్డి గతంలో ఫైనాన్స్ వ్యాపారికి ఇవ్వవలసిన నగదు బకాయే కారణమని పలు అనుమానాలు ఉన్నాయి. ఈ లోపు శ్రీనివాసరెడ్డి కాకినాడ పోలీస్టేషన్‌కు చేరుకుని తాను కిడ్నాప్‌కు గురికాలేదని వాంగ్మూలం ఇచ్చినట్టు పోలీసులు తెలపడంతో కథ సుఖాంతమైంది.. నేను కిడ్నాప్ కాలేదు ఐదు గంటల పాటు ఉత్కంఠ రేపిన శ్రీనివాసరెడ్డి కిడ్నాప్ వ్యవహారం ఆయన వాగ్మూంలంతో సద్దుమణిగింది. తనను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా కారుకు ప్రమాదం జరిగిందని, దీంతో హుటాహుటిన కాకినాడ ఆసుపత్రికి వెళ్లగా ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో కిడ్నాపయ్యానని అందరు ఆందోళన చెందారని, తాను పోలీసుల వద్ద క్షేమంగానే ఉన్నానని శ్రీనివాసరెడ్డి తెలిపినట్టు ఎస్సై వాసు తెలిపారు. -
వైద్య విద్యార్థిని కిడ్నాప్‌కు విఫలయత్నం
సాక్షి, అమలాపురం: అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో ఓ పీజీ వైద్య విద్యార్థిని ఆమె పరిచయస్తుడు కిడ్నాప్ చేసేందుకు యత్నించి విఫలం చెందాడు. చివరకు చిక్కుల్లో పడి పోలీసు కేసులో ఇరుక్కున్నాడు. అనపర్తి ప్రాంతానికి చెందిన ఆ వైద్య విద్యార్థినిని కడపకు చెందిన, ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న అవినాష్ అనే వ్యక్తి ఈ కిడ్నాప్‌నకు విఫలయత్నం చేశాడు. ఆ వైద్య విద్యార్థిని సాహసించి ఆ నయవంచకుడి చెర నుంచి తప్పించుకుంది. అమలాపురం తాలూకా పోలీసు స్టేషన్లో అతడిపై కేసు నమోదు కావడంతో పాటు అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అమలాపురం, ఐ.పోలవరం మండలం పాత ఇంజరం ప్రాంతాల్లో జరిగింది ఈ సంఘటన. వివరాలిలా.. వైద్య విద్యార్థినికి ఇటీవలే మెడిసిన్ పీజీ చదువుతున్న ఓ యువకుడితో వివాహ నిశ్చితార్థమైంది. ధనిక కుటుంబానికి చెందిన ఆ వైద్య విద్యార్థినిని కలిసేందుకు గతం నుంచి పరిచయం ఉన్న అవినాష్ అనే వ్యక్తి సోమవారం అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తన స్నేహితుడు అజయ్‌తో కలిసి కారులో వచ్చాడు. ‘నీతో మాట్లాడాలి’ అని ఆ వైద్య విద్యార్థినిని కారు ఎక్కించుకుని అయినవిల్లి వైపు తీసుకు వెళ్లాడు. అప్పటికే ఆ వైద్య విద్యార్థిని తనకు ఏదో హాని తలపెట్టేలా ఉన్నాడని గ్రహించింది. పథకం ప్రకారం ఓ చోట మోటారు సైకిల్‌ను సిద్ధం చేసుకున్న అవినాష్ కారును మధ్యలో తన స్నేహితుడికి అప్పగించి, బైక్‌పై వైద్య విద్యార్థిని ఎక్కించుకుని ఆమెను యానాం– ఎదుర్లంక వంతెన వైపు 216 జాతీయ రహదారిపై తీసుకుని వెళుతుండగా.. తనకు ఏదో కీడు తలపెడుతున్నాడని గమనించిన ఆమె యానాం– ఎదుర్లంక వంతెన ఇవతల పాత ఇంజరం వద్ద రోడ్డు చెంతన ఉన్న ఐ.పోలవరం పోలీసు స్టేషన్ రాగానే బైక్ నుంచి దూకేసింది. ఇది గమనించిన ఓ కానిస్టేబుల్ ఆమెను లేవదీశాడు. అవినాష్ అక్కడి నుంచి బైక్‌పై వేగంగా పరారయ్యాడు. కిడ్నాప్ కేసు నమోదు.. బైక్ నుంచి దూకేసిన విద్యార్థినిని పోలీసు స్టేషన్లోకి తీసుకుని వెళ్లి విచారించారు. తనను అవినాష్ అనే వ్యక్తి కిడ్నాప్‌కు యత్నించాడని, తనను చంపేస్తాడేమోనని భయంగా ఉందని ఐ.పోలవరం ఎస్సై రాముకు వివరించింది. దీంతో ఆమెను అమలాపురం డీఎస్పీ బాషా వద్దకు తీసుకుని వెళ్లి అక్కడ విచారించారు. సీఐ భీమరాజును దీనిపై దర్యాప్తు చేయమని డీఎస్పీ ఆదేశించారు. అవినాష్ స్నేహితుడిగా కారుతో వచ్చిన అయినవిల్లి మండలం సిరిపల్లికి చెందిన అజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారైన అవినాష్ కోసం గాలిస్తున్నారు. -
కిడ్నాపర్‌ను పట్టుకున్న గ్రామస్తులు
సాక్షి, గూడూరు(వరంగల్) : చిన్న పిల్లలను అపహరించబోతున్న కిడ్నాపర్‌ను గ్రామస్తులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మండలంలోని గుండెంగలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కేసముద్రం మండల కేంద్రంలోని కట్టుకాల్వకు చెందిన తూరాల రాజు, లక్ష్మి దంపతులు ప్రతీ సంవత్సరం సంచార జీవనం గడుపుతూ పెరిగే చెట్లకు మందులు సరఫరా చేస్తుంటారు. ప్రతీ సంవత్సరం వాళ్లు గుండెంగ వస్తుంటారు. వారికి ఇద్దరు పిల్లలు జీవన్(4), రమేష్(3). కాగా, భార్య లక్ష్మి చనిపోగా ఇద్దరు చిన్నారులతో 4 రోజుల క్రితం గుండెంగకు చేరుకున్న రాజును భార్య ఎక్కడికి పోయిందంటూ గ్రామానికి చెందిన హోటల్ యజమానులు దేవా, వాసు అడిగారు. తన భార్య లక్ష్మి చనిపోయిందని పిల్లలు నాతో పాటు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఆ ఇద్దరు హోటల్ యజమానులకు మగపిల్లలు లేకపోవడంతో ఆ ఇద్దరిని పెంచుకుంటామని చెప్పి నాలుగు రోజులుగా వారి వద్ద ఉంచుకుంటున్నారు. కాగా, చెన్నారావుపేట మండలం బోజెర్వుకు చెందిన అంగడి సమ్మయ్య, సరోజన దంపతులు హైదరాబాద్‌లో కూలీ చేసుకుంటూ ఉంటారు. వారిద్దరు సాయంత్రం 4 గంటలకు గతంలో పరిచయస్తుడైన తూరాల రాజు వద్దకు చేరుకుని ఇద్దరు చిన్న పిల్లలను తాము హైదరాబాద్‌కు తీసుకెళ్తామని చెప్పి రూ.1 లక్ష ఇచ్చే విధంగా మాట్లాడుకున్నారు. ముందుగా ఇస్తేనే పిల్లలను ఇస్తానని రాజు చెప్పగా, వారు తర్వాత ఇస్తామన్నారు. అయినా రాజు వినకపోవడంతో అంగడి సమ్మయ్య.. రాజుకు మద్యం తాగించాడు. అనంతరం సమ్మ య్య భార్య సరోజన వారికి కొద్దిదూరంలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను పట్టుకొని ఓ కిరాణ షాపు పక్కన ఉన్న ఆటో వద్దకు బలవంతంగా తీసుకెళ్తోంది. దీంతో పిల్లలు భయపడి ఏడ్వడం మొదలుపెట్టారు. గమనించిన సమీపంలోని హోటల్ యజమాని భార్య వచ్చి చిన్నారులను ఎటు తీసుకెళ్తున్నావని అడగ్గా ఆమెను నెట్టివేసింది. వెంటనే పిల్లలను ఎత్తుకెల్లే వ్యక్తిగా గుర్తించిన ఆ మహిళ అరిచింది. దీంతో సరోజన పిల్లలను వదిలేసి పారిపోయింది. ఆ తరువాత అక్కడకు చేరుకున్న సమ్మయ్య ఆమె తన భార్యగా చెప్పడంతో అసలు విషయం తెలిసిపోయింది. ఆ తరువాత రాజు వారిద్దరు పిల్లలను ఇస్తే రూ.1 లక్ష ఇస్తామన్నారని, డబ్బులు ముందు ఇస్తే ఇస్తానన్నానని, తాను మద్యం మత్తులో ఉండగా పిల్లలను పట్టుకెళ్తున్నారన్నారు. వెంటనే వారు ఆ వృద్ధుడిని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు సంఘటనా వివరాలు తెలుసుకొని వృద్ధుడు, ఇద్దరు పిల్లలతో పాటు వారి తండ్రి రాజును స్టేషన్‌కు తరలించారు. ఈ విషయమై ఎస్సై ఎస్కే.యాసిన్ వివరణ అడగ్గా, ఫిర్యాదు ఏమీ రాలేదని, పిల్లల తండ్రి, కిడ్నాపర్ మద్యం మత్తులో ఉన్నారని, ఐసీడీఎస్ వారిని రప్పించి పిల్లలను వారికి అప్పగిస్తామని, అతనిపై కేసు నమోదు చేస్తామన్నారు. -
కిడ్నాప్ మిస్టరీ
-
బాలిక అపహరణకు యత్నం
బుచ్చినాయుడుకండ్రిగ : ఇంటి ముందు ఆరుబయట తల్లిదండ్రుల పక్కన పడుకుని నిద్రిస్తున్న బాలికను అర్ధరాత్రి అపహరణకు యత్నించిన సంఘటన మండలంలోని తానిగిల్లు గిరిజన కాలనీలో చోటు చేసుకుంది. తల్లిదండ్రుల కథనం.. తానిగిల్లుకు చెందిన మానికల వెంకటమ్మ, నాగరాజుల కుమార్తె వైష్ణవి (10) స్థానిక ప్రాథమిక పాఠశాల్లో 4 వ తరగతి చదువుతోంది. వేసవికాలం కావడంతో తల్లిదండ్రులతో కలసి సోమవారం రాత్రి ఇంటి ముందు ఆరుబయట పడుకుంది. తల్లి పక్కన నిద్రిస్తున్న వైష్ణవిని అర్ధరాత్రి అనంతరం ఓ ఆగంతకుడు భుజాలపై వేసుకుని ఎత్తుకెళ్లాడు. వెంకటమ్మకు అకస్మాత్తుగా మెలకువ రావడం..కుమార్తె వైష్ణవి కనిపించకపోవడంతో ఆందోళన చెందింది. గమనించేసరికి తన కుమార్తెను ఎత్తుకుపోతున్న ఆగంతకుడిని గమనించి కేకలు వేసింది. దీంతో కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగువారు అతడిని వెంబడించారు. దీంతో ఆగంతకుడు పాపను తీసుకుపోవడం కుదరని గ్రహిం చి, వదిలిపెట్టి, చీకట్లో పరారయ్యాడు. మంగళవా రం వైష్ణవి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఏఎస్ఐ భాస్కర్‌రెడ్డి కేసు నమోదు చేశారు. -
కృష్ణాజిల్లాలో కిడ్నాప్ కలకలం
సాక్షి, కృష్ణా: జిల్లాలోని పెనమలూరు మండలం వణుకూరులో కిడ్నాప్ ఉదంతం కలకలం రేపింది. వణకూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారు. సామిల్ (కట్టె మిషన్)లో పనిచేసే అతన్ని గుంటూరు నుంచి వచ్చిన వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకొని.. కొంతదూరం వరకు తీసుకెళ్లి దాడి చేశారు. కారులో తిప్పుతూ దాడి చేసిన అనంతరం అతన్ని రోడ్డుపై వదిలేసి పారిపోయారు. ఈ మేరకు బాధితుడు పెనమలూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆర్ధిక వ్యవహారాల కారణంగానే బాధితుడిని కిడ్నాప్ చేసేందుకు దుండగులు ప్రయత్నించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
యువతి కిడ్నాప్‌నకు యత్నం
అనంతపురం, తాడిపత్రి అర్బన్: ఓ యువతిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులు అడ్డుకున్న సంఘటన గురువారం తాడిపత్రి పట్టణంలోని జీడీఆర్ నగర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... తాడిపత్రి పట్టణంలోని జీడీఆర్ నగర్లో నివాసముంటున్న లక్ష్మిదేవి, శ్రీధర్‌బాబుల కుమార్తె రజిత ఇంటివద్ద కూర్చుని ఉండగా గురువారం నంద్యాల పట్టణం వైఎస్ఆర్ నగర్‌కు చెందిన నాగరాజు అనే వ్యక్తి వచ్చి బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. అడ్డుపడ్డ తల్లి కళ్లలో కారం చల్లాడు. ఇది గమనించిన స్థానికులు అడ్డుకున్నారు. వారి కళ్లల్లో కూడా కారం కొట్టబోయాడు. అయితే దారు నాగరాజును చాకచక్యంగా పట్టుకున్నారు. రజిత బంధువులు కొందరు అతడిని పట్టణ శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లి కొట్టడంతో తీవ్రగాయాలయ్యయి. స్థానికులు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో బాధితుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తరలించారు. నాగరాజు గతంలో కూడా రజితను తీసుకెళ్లినట్లు ఈ ఏడాది జూన్‌లో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రజిత కర్నూలు జిల్లా మహానందిలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న సమయంలో నాగరాజుతో చనువు ఏర్పడింది. ఇది తెలిసిన తల్లిదండ్రులు చదువు మానిపించి కుమార్తెను ఇంటివద్ద ఉంచుకున్నారు. ప్రస్తుతం రజిత తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కూతుర్ని ప్రేమించాడని..
కృష్ణలంక(విజయవాడ తూర్పు): తన కూతురును ప్రేమించాడనే కోపంతో ఓ యువకుడితోపాటు అతని స్నేహితుడిని అమ్మాయి తల్లిదండ్రులు కిడ్నాప్ చేయడానికి యత్నించి పోలీసులకు చిక్కిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కిడ్నాప్ ఘటన ఈ నెల 16న జరగ్గా పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులను 17న అరెస్టు చేశారు. కోరువాడ శ్రీనివాసరావు జెంట్స్ బ్యూటీపార్లర్ నిర్వహిస్తూ విజయవాడ చుట్టుగుంటలో నివాసముంటున్నాడు. కొడుకు నాగసాయి నూజివీడులోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. ప్రసాదంపాడుకు చెందిన వడ్ల శ్రీనివాసరావు కుమార్తె, నాగసాయి ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన అమ్మాయి తండ్రి తన కూతురును, నాగసాయిని మందలించాడు. నాగసాయి తండ్రికి ఫోన్ చేసి ‘మీ అబ్బాయిని అదుపులో పెట్టుకో.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని’ హెచ్చరించాడు. నాగసాయిని తండ్రి మందలించాడు. మనస్తాపం చెందిన యువతి ఈ నెల 16న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. నాగసాయి అమ్మాయికి ఫోన్ చేయగా.. తాను అమ్మవారి గుడివద్ద ఉన్నానని తెలియజేయడంతో నాగసాయి, అతని స్నేహితుడు మణిదీప్, తండ్రి కలసి అక్కడకు వెళ్లి అమ్మాయిని తీసుకుని ఆమె తండ్రికి ఫోన్‌చేసి సమాచారమిచ్చారు. ఇదంతా చేసింది నాగసాయేనంటూ దుర్భాషలాడుతూ అమ్మాయి తండ్రితోపాటు మరికొంతమంది యువకులు అతడిని ఇష్టానుసారంగా కొట్టారు. అంతటితో ఆగకుండా నాగసాయితోపాటు అతని స్నేహితుడిని కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. అబ్బాయి తండ్రి కోరివాడ శ్రీనివాసరావు తన కొడుకును కొంతమంది కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారధి వద్ద కారును గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు దాన్ని అడ్డగించి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. నాగసాయి, అతని స్నేహితుడిని కిడ్నాప్ చేశారని అమ్మాయి తండ్రి శ్రీనివాసరావు, తల్లి చంద్ర, సుబ్రమణ్యం, వేణు, శివ, జగదీష్, రూపేష్సాయి, సాయివివేక్, ధీరజ్‌లను అరెస్టు చేశారు. -
ఏపీజీవీబీ చైర్మన్ కిడ్నాప్‌నకు యత్నం
తిరుమలాయపాలెం : ఆంధ్రప్రదేశ్ గ్రామీణవికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) చైర్మన్ వి.నర్సిరెడ్డిని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండా వద్ద కిడ్నాప్ చేసేందుకు నలుగురు దుండగులు యత్నించిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సిరెడ్డి అసిస్టెంట్ మేనేజర్ ప్రసాద్‌తో కలిసి బుధవారం ఉదయం కొత్తగూడెంలో గ్రామీణ బ్యాంక్ రీజినల్ స్థాయి కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం..ఖమ్మం రీజినల్ ఆఫీస్‌లో బ్యాంక్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సాయంత్రం 6:30 గంటలప్పుడు తన ఇన్నోవా వాహనంలో వరంగల్ బయల్దేరారు. ఈయన ఖమ్మంతో పాటు 8 జిల్లాలకు బ్యాంక్ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా..హెడ్డాఫీస్ వరంగల్ కావడంతో అక్కడికి వెళుతున్నారు. తిరుమలాయపాలెం మండలం చంద్రుతండా వద్దకు రాగానే వెనుక నుంచి ఓ కారు హారన్ కొడుతూ ఈయన వాహనాన్ని ఓవర్టేక్ చేసేందుకు తరచూ యత్నిస్తూ, ఓ సారి వెనుకనుంచీ ఢీకొట్టడంతో ఆగిపోయారు. కారులోంచి దిగిన నలుగురు వ్యక్తులు మద్యం మత్తులో ఒక్కసారిగా వీరి వద్దకు వచ్చి..డ్రైవర్‌ను వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు. తాము చైర్మన్‌ను కిడ్నాప్ చేస్తామని బెదిరించారు. డ్రైవర్ భయంతో అరవడంతో..చైర్మన్ తన వాహనంలోంచి ఒక్క ఉదుటున బయటికి రావడం..అదే సమయంలో వరంగల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఎదురెళ్లి చేతులెత్తడంతో అది ఆగింది. దీంతో..ఆయన అందులోకి ఎక్కి మరిపెడ (బంగ్లా)లో దిగి..పోలీసులను ఆశ్రయించారు. వారు చైర్మన్‌ను తీసుకొచ్చి.. సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించి, ఇది తమ పరిధి కాదని, తిరుమలాయపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చారు. చైర్మన్ బస్సును ఆపుజేయడంతోటే నిందితులు కారును వదిలి పరారయ్యారు. ఆ వాహనంలో దాడి చేసేందుకు వినియోగించే దొడ్డు కర్రలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కారును తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తనకు వ్యక్తిగత కక్షలు లేవని, పాలనాపరంగా సిబ్బందిపై చర్యలు తీసుకోవడం తప్పా..తానెవరిపై వ్యక్తిగతంగా కక్ష కట్టలేదని, ఈ కిడ్నాప్ యత్నం ఎందుకు జరిగిందో, ఎవరు చేయజూశారో అర్థం కావట్లేదని చైర్మన్ నర్సిరెడ్డి వివరించారు. కారులోని కాగితాలను పరిశీలించగా.. ఉసిళ్ల రవీందర్ పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లుగా గుర్తించారు. చైర్మన్ నర్సిరెడ్డి ఫిర్యాదు మేరకు..ఏసీపీ నరేష్‌రెడ్డి, కూసుమంచి, ఖమ్మం రూరల్ సీఐలు వసంతకుమార్, తిరుపతిరెడ్డి, ఎస్ఐ సర్వయ్య అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. చంపేస్తామని బెదిరించారు.. ఎన్ని డబ్బులైనా ఇస్తామని, చైర్మన్‌ను వదిలేయాలని బెదిరించినా తి రగబడి ఎదిరించా. వాళ్లు నా∙మెడను గట్టిగా పట్టుకుని, పర్సును కూడా లాక్కెళ్లారు. -
పసి బాలుడి కిడ్నాప్‌కు యత్నం!
కశింకోట (అనకాపల్లి): మండలంలోని చింతలపాలెం గ్రామంలో నిద్రపోతున్న పసి బాలుడిని బుధవారం అర్ధరాత్రి ముగ్గురు దొంగల ముఠా అపహరించడానికి ప్రయత్నించింది. ప్రజలు అ ప్రమత్తం కావడంతో బాలుడు దక్కాడు. స్థానికులు అందించిన వివరాల ప్రకారం.. చింతలపాలెంకు చెందిన బుదిరెడ్డి గణేష్, కుమారి దంపతులకు పాప, బాబు ఉన్నారు. వీరు ఎప్పటిలాగే ఇంటి మేడపై నిద్రపోతున్నారు. అర్ధరాత్రి సమయంలో ముగ్గురు దొంగలు ముసుగు వేసుకొని వచ్చారు. వారిలో ఇద్దరు ఇంటి కింద గమని స్తుండగా, ఒక వ్యక్తి మేడపైకి ఎక్కి నిద్రిస్తున్న బా లుడు తేజ(2)ను ఎత్తుకొని కిందికి వేగంగా వస్తూ అక్కడ ఉన్న వంట పాత్రలను తన్నుకున్నాడు. దీంతో శబ్దం కావడంతో మెలకువ వచ్చి గణేష్ చూసే సరికి బాలుడిని దొంగలు ఎత్తుకు పోవడానికి ప్రయత్నించడాన్ని గమనించాడు. వెంటనే తేరుకొని దొంగకాలు పట్టుకొని కేకలు చేశాడు. దీంతో చుట్టుపక్కల వారు రావడంతో బాలుడిని కింద పడేసి వదిలించుకొని పరారయ్యారు. బాలుడికు స్వల్పంగా గాయం కావడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందివ్వడంతో ఎస్ఐ బి.మధుసూదనరావు సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. పోలీసు గస్తీని ఏర్పాటు చేసి రక్షణ కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిగితే స్థానికులా? దొంగల ముఠా వచ్చిందా? అనే విషయాలు వెల్లడి కాగలవన్నా రు. పిల్లలను ఎత్తుకుపోతున్నారన్న ప్రచారాన్ని పోలీసులు వదంతులుగా కొట్టి పారేసిన నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
మన్యంలో ముఠా కలకలం
సీతంపేట : ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న మన్యంలో ఆదివారం అర్ధరాత్రి కలకలం రేగింది. కొంతమంది గుర్తుతెలియని దొంగల ముఠా సంచిరిస్తూ చిన్నారులనే టార్గెట్ చేస్తూ తీసుకువెళ్లడానికి యత్నిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీనిలో భాగంగా ఆదివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో ఓ వీధిలో నివర్తి రమేష్ ఇంట్లో గుర్తుతెలియని మహిళ దూరి ఆయన కుమార్తె స్వాతిక(3)ను కిడ్నాప్ చేయడానికి యత్నించింది. తలుపులు లేని కిటికీలోనుంచి తల్లి జ్యోతి పక్కనే పడుకున్న బాలిక కాళ్లు పట్టుకుని లాగేయడంతో తల్లికి తెలివివచ్చింది. బాలికను విడిపించుకునే క్రమంలో కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు రావడంతో బాలికను అక్కడ వదిలేసి పరుగులకించినట్టు బాలిక కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి, యువకులంతా రాత్రి ఎంత వెతికినా దొరకలేదు. స్థానిక ఎస్ఐ కె.రాముతో పాటు పోలీసులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని గాలించారు. అయినా ఎవరూ పట్టుబడలేదు. నలుగురు వచ్చారని, ముగ్గురు మగాళ్లు, ఒక మహిళ వచ్చిందని ఆటోతో వెళ్లిపోయారని కొంతమంది చెబుతున్నారు. అలాగే రాజన్నగూడలో సైతం ఆదివారం మధ్యాహ్నం గుర్తుతెలియని మహిళ జీడిపిక్కలు ఏరడానికి వెళుతున్న చిన్నారులను వెంబడించిందని, చిన్నారులు తప్పించుకున్నారని ఎంపీపీ ప్రతినిధి చంద్రశేఖరరావుతో పాటు గ్రామస్తులు తెలిపారు. అలాగే వలగెడ్డ, పెద్దూరులలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నట్టు ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వదంతులే... ఇవన్నీ వదంతులేనని పాలకొండ డీఎస్పీ స్వరూపారాణి అన్నారు. ఐటీడీఏ వద్ద సోమవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ ఎటువంటి మూఠాలు సంచరించడం లేదన్నారు. ప్రజలు ఇటువంటివి నమ్మవద్దన్నారు. కొత్త వ్యక్తులు సంచరిస్తే సమాచారమివ్వాలన్నారు. ప్రజలు బయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. దీనికి సంబంధించి మైక్ ద్వారా ప్రజల్ని చైతన్యం చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఆమెతో పాటు సీఐ జె.శ్రీనివాసరావు, ఎస్ఐ రాము ఉన్నారు. -
కలకలం రేపిన బాలిక కిడ్నాప్ ఘటన
సాక్షి, నారాయణఖేడ్: ఆరేళ్ల బాలికను కడ్నాప్‌నకు యత్నించిన ఘటన నారాయణఖేడ్ పట్టణంలో శనివారం కలకలం రేపింది. నారాయణఖేడ్ పట్టణంలోని నెహ్రూనగర్‌కు చెందిన ఎక్బాల్ ఆహ్మాద్ కూతురు సిద్రాబేగం (6) ఉదయం ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెకందిన వెంకటేశం(48) బాలికను భుజంపై వేసుకొని పరుగులు పెట్టాడు. ఇది గమనించిన కాలనీ వాసులు బాలిక తండ్రి ఎక్బాల్ అహ్మద్‌కు విషయం తెలియజేశారు. బాలికను ఎత్తుకొని పరుగెడుతున్న నిందితుడిని బైక్‌పై వెంబడించి శాస్త్రినగర్‌లో పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. కాగా నిందితుడు మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించినట్లు ఇన్చార్జి డీఎస్పీ నల్లమల రవి తెలిపారు. నిందితుడిని ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయానికి తరలిస్తామని చెప్పారు. -
భర్తను కొట్టి భార్యను ఎత్తుకెళ్లే యత్నం
సాక్షి, గుంటూరుఈస్ట్: భార్యాభర్తలను కొట్టి, ఆరు నెలల గర్భంతో ఉన్న మహిళను లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు ఓ కిరాతకుడు. చుట్టు పక్కల వారు అడ్డుకుని, బాధితులను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం గురువారం బాధితులు పాతగుంటూరు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు ములుగూరి రాణి తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు రూరల్ మండలం బుడంపాడు ఎస్సీ కాలనీకి చెందిన ములుగూరి రాణికి చిన్నతనంలోనే తల్లి, తండ్రి చనిపోవడంతో షాపుల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. 2017 ఆగస్టులో పాతగుంటూరుకు చెందిన ఎం.శ్రీనివాస్‌ను ప్రేమించి, కులాంతర వివాహం చేసుకుంది. ఆర్టీసీ కాలనీ 5వ లైనులో కాపురం పెట్టారు. ఈనెల 25న పాత స్నేహితుడైన శారదాకాలనీకి చెందిన వివాహితుడు తురకా సునీల్ ఆమె ఇంటికి వచ్చి భర్తను వదిలేసి తన వెంట రావాలంటూ ఒత్తిడి చేశాడు. రాణి తిరస్కరించడంతో తీవ్రంగా కొట్టి ఆమె సెల్‌ఫోన్ పగులకొట్టాడు. ఇంటికి చేరుకున్న భర్త శ్రీనివాస్‌ను కూడా కొట్టి ఆమెను వదిలిపెట్టి వెళ్లాలని బెదిరించాడు. చుట్టుపక్కల వారు కలుగజేసుకుని సునీల్‌ను వారించి పంపించి వేశారు. అదే రోజు రాత్రి 11.30 గంటల సమయంలో సునీల్ తన మిత్రుడు రామారావును వెంటపెట్టుకుని మళ్లీ రాణి ఇంటికి వచ్చి భార్యా భర్తలిద్దరిని తీవ్రంగా కొట్టారు. ఆమె మెడలోని గొలుసును, చేతి పర్సులో ఉన్న మరో బంగారు గొలుసును లాక్కున్నారు. గొడవను గమనించిన చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చి పిలిపించడంతో విషయాన్ని తెలుసుకుని సునీల్, రామారావు అక్కడి నుంచి పరారయ్యారు. గర్భంపై తన్నిన నిందితుడు ఆరు నెలల గర్భిణి అయిన రాణి పొట్ట మీద మీద, నడుము మీద సునీల్ తన్ని, కొట్టి గాయపరిచాడు. గురువారం దంపతులు ఇద్దరు పాతగుంటూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమకు ప్రాణ రక్షణ కల్పించాలని వేడుకున్నారు. సునీల్ నేర స్వభావం కలవాడని, అతనికి ఉన్న పలుకుబడితో ప్రాణాలు తీయడానికైనా వెనుకాడడని రాణి కన్నీరుమున్నీరయింది. తనకు తన భర్తకు ఎటువంటి అండ లేని కారణంగా పోలీసులే రక్షణ కల్పించాలని వేడుకుంది. -
కిడ్నాప్ కలకలం
అన్నవరం(ప్రత్తిపాడు): అన్నవరంలో ఓ వివాహితను కిడ్నాప్ చేసేందుకు ఓ అగంతకుడు ప్రయత్నించగా ఆమె చాకచక్యంగా కారులో నుంచి దూకి తప్పించుకుంది. ఆ ఘటన వివరాలను గురువారం రాత్రి అన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ప్రత్తిపాడు సీఐ అద్దంకి శ్రీనివాసరావు ఇలా వెల్లడించారు. సామర్లకోట మండలం హుస్సేన్‌పురంలో ఉంటున్న ఏనుగుల శిరీషకు విశాఖ జిల్లా చింతపల్లికి చెందిన మహేష్‌తో ఏడాది క్రితం వివాహమైంది. శిరీష కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో చదువుతూ తన స్వగ్రామం హుస్సేన్పురంలోనే ఉంటూ రోజూ కాకినాడ కళాశాలకు వెళ్లి వస్తోంది. బుధవారం సాయంత్రం మహేష్ అన్నవరానికి చెందిన తన బంధువులకు చెందిన నీలి రంగు రెనాల్ట్ పల్స్ కారు(ఏపీ 5 బీడీ 1567)లో హుస్సేన్ పురం వెళ్లాడు. అక్కడి నుంచి భార్యాభర్తలు ఇరువురు గురువారం ఉదయం అన్నవరంలోని శ్రీసత్యదేవుని ఆలయానికి వచ్చి స్వామివారి వ్రతమాచరించి దర్శనం చేసుకున్నారు. అనంతరం కొండ దిగువకు వచ్చి ఎస్బీఐ ఏటీఎం వద్ద కారు ఆపి తన బంధువులకు ఫోన్ చేసి కారు తీసుకెళ్లిపోమని చెప్పాడు. తరువాత ఆ కారు ఇంజిన్ ఆపకుండా మహేష్ అందులో నుంచి దిగి వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి వెళ్లాడు. ఈ లోపు ఓ అగంతకుడు ఆ కారు డ్రైవర్ సీటులోకి ఎక్కి అతి వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోతుండడంతో మహేష్‌తో పాటు అతడి బంధువులు ఆ కారును ఆపేందుకు ప్రయత్నించారు. ఫలితం లేక మోటార్ సైకిల్‌పై వెంబడించారు. కారులో ఉన్న శిరీష కూడా గట్టిగా కేకలు వేస్తుండడంతో బెండపూడి వద్ద అగంతకుడు కారు ఆపాడు. ఆమె కారు డోర్ తీసుకుని కిందకు దూకేసింది. ఈ లోపు మహేష్, అతడి బంధువులు అక్కడికి చేరుకోవడంతో ఆ అగంతకుడు కారు వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. కారును ధర్మవరం వరకు వెంబడించిన మహేష్ బంధువులు ఆ తరువాత కారు ఆచూకీ తెలియక వెనుదిరిగారు. అప్రమత్తమైన పోలీసులు కిడ్నాప్ విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. కృష్ణవరం టోల్గేట్ సిబ్బందికి ఫోన్ చేసి కారును ఆపాలని సూచించారు. హైవే మీద అన్ని పోలీస్స్టేషన్లను అలర్ట్ చేశారు. గురువారం రాత్రి మహేష్, శిరీష, వారి బంధువుల నుంచి సీఈ శ్రీనివాసరావు పూర్తి వివరాలు సేకరించారు. త్వరలోనే ఆ నిందితుడిని పటుకుంటామని తెలిపారు. అగంతకుడు ముఖానికి గుడ్డ కట్టుకున్నాడని, కారులో తన ఫోన్, బ్యాగ్ ,పర్స్ ఉన్నాయని శిరీష తెలిపింది. -
విద్యార్థినుల కిడ్నాప్ కలకలం
పత్తికొండ టౌన్: కర్నూలు జిల్లా పత్తికొండలో గురువారం విద్యార్థినుల కిడ్నాప్ కలకలం రేగింది. ఆరుగురు విద్యార్థినులను దుండగులు ఆటోలో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. వారి చెర నుంచి విద్యార్థినులు తప్పించుకున్నారు. బాధిత విద్యార్థినుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పత్తికొండ పట్టణానికి చెందిన హేమ, ఇందు, ఆశా, పూజిత, షమీసునీషా, ఫర్జానా స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. గురువారం సమ్మెటివ్ పరీక్షలు ముగిసిన తర్వాత సాయంత్రం ఫర్జానా అనే విద్యార్థిని తనకు కడుపునొప్పి ఉందని చెప్పింది. మాత్రలు తీసుకుందామని మిగిలిన ఐదుగురితో కలసి తేరుబజారుకు వెళ్తుండగా రెండు ఆటోల్లో దుండగులు వచ్చారు. విద్యార్థినులను బలవంతంగా ఆటోల్లోకి ఎక్కించారు. అరిస్తే చంపేస్తామని బెదిరించారు. వారంతా తలకు మంకీ క్యాప్‌లు ధరించారని విద్యార్థినులు చెపుతున్నారు. ఫర్జానా ఆటోలో నుంచి దూకి పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులకు సమాచారం అందించింది. ఆటోల్లో ఉన్న ఐదుగురు విద్యార్థినులను దుండగులు బ్లేడ్లతో గాయపరిచి, వదిలివెళ్లినట్లు చెబుతున్నారు. గాయపడిన విద్యార్థినులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం తెలియడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానికులు పెద్దసంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సదరు విద్యార్థినులను ఎస్ఐ మధుసూదన్‌రావు విచారణ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, సీపీఐ రాష్ట్ర నాయకుడు రామచంద్రయ్య పోలీస్‌స్టేషన్‌కు వచ్చి విద్యార్థినులను పరామర్శించారు. సీఐ విక్రంసింహా, ఎస్ఐ మధుసూదన్‌రావు విద్యార్థినులు, తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులను వేర్వేరుగా విచారణ చేస్తున్నారు. -
విద్యార్థిని కిడ్నాప్‌నకు యత్నం
జంగారెడ్డిగూడెం రూరల్: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం జీడిగింజల ఫ్యాక్టరీ సమీపంలో ఓ విద్యార్థినిని కారులో ఎక్కించుకుని కిడ్నాప్‌కు యత్నించిన సంఘటన చోటుచేసుకుంది. విద్యార్థిని తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గుర్వాయిగూడెంకు చెందిన విద్యార్థిని జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఆదివారం సాయంత్రం కళాశాలలో ప్రైవేట్ తరగతులు ముగించుకుని స్వగృహానికి తన స్కూటీపై వెళుతుండగా జీడిగింజల ఫ్యాక్టరీ సమీపంలో వెనుక నుంచి ఓ కారు వే గంగా వచ్చి ఆగింది. కారులో నుంచి దిగిన వ్యక్తి స్కూటీని ఆపి వెనుక ఎవరో వ్యక్తులు కిడ్నాప్ చేసేందుకు వస్తున్నారని, మీ ఇంటి వద్ద దింపుతానని విద్యార్థినిని నమ్మబలికాడు. ఈ మాటలు నమ్మిన విద్యార్థిని కారులో ఎక్కి కూర్చుంది. కారు గుర్వాయిగూడెంలో విద్యార్థిని ఇంటి వద్దకు వచ్చినా ఆపకుండా వేగంగా వెళ్లిపోయింది. దీంతో అప్రమత్తమైన విద్యార్థిని మద్ది ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోకి వచ్చేసరికి కారు డోర్ తీసి దూకే యత్నం చేయబోయింది. దీంతో కిడ్నాప్‌కు యత్నించిన వ్యక్తి కారును ఒక్కసారిగా ఆపివేశాడు. దీంతో తాను కారు దిగానని విద్యార్థిని తెలిపింది. తర్వా త తన పుస్తకాల బ్యాగును కారులో ఉన్న వ్యక్తి కిందకు విసిరేసి ఏలూరు వైపు వెళ్లిపోయాడని చెప్పింది. కారు లో ఒక వ్యక్తే ఉన్నాడని అతడే కారు నడుపుతున్నాడని తెలిపింది. విషయాన్ని విద్యార్థిని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది. -
భీమవరంలో యువతి కిడ్నాప్‌కు యత్నం
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో సోమవారం రాత్రి ఓ యువతిపై కిడ్నాప్ యత్నం జరిగింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన యువతి భీమవరంలోని ఓ రొయ్యల కంపెనీలో పనిచేస్తోంది. సోమవారం రాత్రి ఆమె స్వగ్రామానికి వెళ్లేందుకు స్థానిక బస్టాండ్‌కు వెళ్లింది. అదే సమయంలో బస్టాండ్ కు వచ్చిన ఇద్దరు యువకులు ఐబీ పోలీసులమంటూ బెదిరించి తమ వెంట తీసుకెళ్లేందుకు యత్నించారు. ఆమె కేకలు వేయటంతో అక్కడే ఉన్న ప్రయాణికులు వారికి దేహశుద్ధి చేసి వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. -
గాంధీలో శిశువు కిడ్నాప్ కలకలం
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో శిశువును కిడ్నాప్ చేసేందుకు ఓ మహిళ యత్నిచింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అప్పడే పసికందును కిడ్నాప్ చేసేందుకు మేరీ మహిళ యత్నించింది. కిడ్నాప్ చేసిన పాపను ఆటోలో తీసుకెళ్తుండగా అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను పట్టుకున్నారు. పాపను తల్లిదండ్రులకు అప్పగించి కిడ్నాప్ కు యత్నించిన మహిళను చిలకలగూడ పోలీసులకు అప్పజెప్పారు. పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసు స్టేషన్‌కు చేరిన మధుప్రియ ప్రేమ వ్యవహారం
-
పోలీసు స్టేషన్‌కు చేరిన మధుప్రియ ప్రేమ వ్యవహారం
వర్ధమాన గాయని మధుప్రియ ప్రేమ వ్యవహారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ‘ఆడపిల్లనమ్మా...’ పాటతో గాయనిగా ప్రాచుర్యం పొందిన మధుప్రియ ప్రేమ వ్యవహారం పోలీసు స్టేషన్‌కు చేరింది. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన మంగి శ్రీకాంత్‌తో మధుప్రియ ప్రేమ వ్యవహారం రెండేళ్లుగా సాగుతోంది. నెల రోజుల క్రితమే మేజర్ అయిన మధుప్రియ.. ఇక శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దాంతో సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని వాసవీ గార్డెన్స్‌లో శుక్రవారం ఉదయం 11.20కి వీరిద్దరికీ పెళ్లి చేయాలని శ్రీకాంత్ తల్లిదండ్రులు నిర్ణయించారు. అయితే, వీళ్ల పెళ్లికి మధుప్రియ తల్లిదండ్రులు అంగీకరించలేదు. కెరీర్ మీద దృష్టి పెట్టాల్సిన వయసులో అప్పుడే పెళ్లి చేసుకోవడం సరికాదని చెప్పారు. కానీ, పెళ్లివైపే మొగ్గుచూపిన మధుప్రియ.. రెండు రోజుల క్రితం కాగజ్‌నగర్‌లోని శ్రీకాంత్ ఇంటికి చేరుకుంది. శుక్రవారం ఉదయం 11.20 నిమిషాలకు పెళ్లి చేసేందుకు నిర్ణయించిన శ్రీకాంత్ తల్లిదండ్రులు ఈ మేరకు శుభలేఖలు కూడా పంచారు. దీంతో మధుప్రియ బంధువులు శ్రీకాంత్ ఇంటిపై దాడి చేసి, ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లికి అంగీకరించేది లేదని, పెళ్లి జరగనివ్వబోమని చెప్పినట్లు తెలిసింది. పెళ్లికి మధుప్రియ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో.. ఆమె ప్రేమ వ్యవహారం బెడిసికొట్టి పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. గురువారం అర్ధరాత్రి సమయంలో మధుప్రియ తల్లిదండ్రులు కాగజ్‌నగర్‌లోని శ్రీకాంత్ ఇంటి వద్దకు చేరుకుని గొడవ చేయడంతో ప్రేమ జంట డీఎస్పీ చక్రవర్తిని ఆశ్రయించారు. దీంతో పోలీసులు వారికి రక్షణ కల్పించారు. అనంతరం వాళ్లిద్దరికీ కౌన్సెలింగ్ చేశారు. అయితే తాము మేజర్లం కాబట్టి పెళ్లి చేసుకుంటామని మధుప్రియ, శ్రీకాంత్ వాదిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు వీళ్ల పెళ్లిపై ఇరువైపులా బంధువులు పోలీసు స్టేషన్లో వేర్వేరుగా ఫిర్యాదులు ఇచ్చారు. మధుప్రియ కుటుంబం హైదరాబాద్‌లోని నల్లకుంటలో నివాసం ఉంటుంది. అక్కడే ఆమెకు శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్. మధుప్రియ, శ్రీకాంత్ ఇద్దరూ మేజర్లు కావడం, వాళ్లకు పెళ్లి చేసుకోవడం ఇష్టం కావడంతో వాళ్ల పెళ్లికి తమకు అభ్యంతరం ఏమీ లేదని డీఎస్పీ చక్రవర్తి తెలిపారు. -
కిడ్నాప్ చేయబోయి.. దొరికిపోయింది
అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుంతకల్లు మండలకేంద్రంలో యూకేజీ చదువుతున్న రమ్యచందన అనే నాలుగేళ్ల చిన్నారిని జ్యోతి(22) అనే మహిళ కిడ్నాప్ యత్నానికి ప్రయత్నించింది. చిన్నారి టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో చాక్లెట్లు ఆశ చూపి తీసుకెళ్లబోయింది. బురఖా ధరించి ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆరాతీయడంతో కిడ్నాప్ వ్యవహారం బయటపడింది. అనంతరం ఆమెకు స్థానికులు దేహశుద్ధి చేశారు. మహిళ హ్యాండ్ బాగ్‌లో ఓ కత్తి, రెండు బ్లేడ్లు, 7 సిమ్‌లు కార్డులు ఉండటం చూసి టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి ఆమెను స్టేషన్ కు తరలించారు. -
చిన్నారి కిడ్నాప్‌కు యత్నం
గుంటూరు: పాఠశాలలో ఆడుకుంటున్న చిన్నారిని దుండగులు కిడ్నాప్‌కు యత్నించిన ఘటన తాడేపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. బ్రహ్మానందపురానికి చెందిన దామవరపు కిషోర్‌కుమార్ (7) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఉదయం స్నేహితులతో పాఠశాల ఆవరణలో ఆడుకుంటుండగా.. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు పల్సర్ వాహనం పై వచ్చి కిషోర్‌కుమార్‌ను అపహరించుకు వెళ్లారు. ఇది గమనించిన ఇతర విద్యార్థులు గట్టిగా కేకలు వేయడంతో పాటు వారిని వెంబడించి... పట్టుకోవడానికి ప్రయత్నించారు. దాంతో భయపడిన దుండగులు బాబును వదిలి పరారయ్యారు. స్కూల్ సిబ్బంది ఈ విషయాన్ని వెంటనే కిషోర్ తల్లిదండ్రులకు తెలిపారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థుల కిడ్నాప్ కు విఫలయత్నం
విజయనగరం : విజయనగరం జిల్లాలోని భోగాపురంలో ఇద్దరు విద్యార్థులను కిడ్నాప్ చేసేందుకు ఆగంతకులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. స్తానికంగా ఉండే గంటాన జగదీష్‌కుమార్(13), కనకరాజు(6) శనివారం ఉదయం స్కూల్ బస్ కోసం రోడ్డు పక్కన వేచి ఉన్నారు. ఇంతలో మాస్కులు ధరించి నల్లటి మారుతి కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారులో ఎక్కాలంటూ పిల్లలను బలవంతం చేశారు. ఎక్కకపోతే చంపుతామని కత్తులతో బెదిరించారు. అయినా విద్యార్థులు కారు ఎక్కకపోయే సరికి, వారిని బలవంతంగా కారులోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. దీంతో భయంతో విద్యార్థులు పెద్దగా కేకలు వేశారు. ఇంతలో స్థానికులు అటుగా రావడంతో దుండగలు విద్యార్థులను వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. (భోగాపురం) -
పొన్నవోలు కిడ్నాప్ యత్నంపై బార్ అసోసియేషన్ ఖండన
హైదరాబాద్: హైకోర్టు బార్ అసోసియేషన్ బుధవారం మధ్యాహ్నం అత్యవసర భేటీ అయింది. ఈ భేటిలో లాయర్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కిడ్నాప్ యత్నాన్ని ఖండిస్తూ హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కిడ్నాప్ యత్నంపై తెలంగాణ, ఏపీ డీజీపీలకు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేస్తామని హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గిరిధరరావు మీడియాకు తెలిపారు. నెల్లూరు జిల్లా పరిషత్ ఎన్నికల్లో జరిగిన అరాచకాలను హైకోర్టుకు విన్నవించిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని కిడ్నాప్‌యత్నం జరిగింది. దీనిపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఎన్నిక నిర్వహణకు కోర్టు ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని, ఎన్నికలు సజావుగా జరపాలని ఆదేశాలు పొందిన నేపథ్యంలో కిడ్నాప్ కు కొందరు ప్రయత్నించారు. ఈ నెల 5న జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ గొడవలు సృష్టించి, ఎన్నికలను వాయి దా వేయించిన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రజాహిత వ్యాజ్యంగా దాఖలు చేసిన న్యాయవాది సుధాకర్‌రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. -
రైల్వేస్టేషన్లో యువతి అపహరణకు యత్నం
సికింద్రాబాద్ : మాయమాటలు చెప్పి యువతి (16)ని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. రైల్వే ఇన్స్పెక్టర్ అంబటి ఆంజనేయులు కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన యువతి కొద్దిరోజుల క్రితం బోయిన్‌పల్లిలో ఉండే తమ బంధువుల ఇంటికి వచ్చింది. బుధవారం తిరిగి విజయవాడ వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చి.. 8వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై రైలు కోసం ఎదురు చూస్తోంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి మాయమాటలు చెప్పి ఆమెను తనతో తీసుకెళ్లేందుకు యత్నించాడు. అతని కుతంత్రం గ్రహించిన ఆ యువతి తాను రానని చెప్పింది. దీంతో అతను చేతులు పట్టుకుని బలవంతంగా లాక్కెళ్లేందుకు యత్నించగా.. కేకలు వేసింది. ఇది గమనించిన తోటి ప్రయాణికులు యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో నిందితుడు మల్కాజిగిరి వసంతపురి కాలనీకి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి పి.పరంజ్యోతి(62) అని తేలింది. రైల్వేపోలీసులు అతడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
అనంతపురం కలకలం రేపిన బాలిక కిడ్నాప్
అనంతపురం: ఓ బాలికను కిడ్నాప్ చేయడానికి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. 13 ఏళ్ల మూగ బాలికను కొందరు దుండగులు కిడ్నాప్ చేసేందుకు పాల్పడ్డారు. ఆ దుండగుల కిడ్నాప్ ఘటనను స్థానికులు గమనించి వారిని పట్టుకున్నారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. మూగ బాలికను ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అనే దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
అనంతపురంలో మూగబాలిక కిడ్నాప్ కలకలం
-
ఇద్దరు యువతులను కిడ్నాప్ చేసే యత్నం
హైదరాబాద్ : హైదరాబాద్‌లో సాప్ట్వేర్ ఉద్యోగిని అత్యాచార ఘటనను మరవక ముందే .... రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం ఇద్దరు యువతులను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన సంఘటనలు కలకలం రేపాయి. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా చిలకలూరు పేటలో ఓ డిగ్రీ విద్యార్థిని ఆటో డ్రైవర్ కిడ్నాప్‌కు యత్నించిన ఘటన స్థానికంగా సంచలం సృష్టించింది. నాదెండ్ల మండలం గణపవరంకు చెందిన మోక్ష చిలకలూరిపేటలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రతిరోజు ఆమె ఆటోలో కళాశాలకు వెళుతోంది. ఈనేపథ్యంలో మంగళవారం ఉదయం మోక్ష కళాశాలకు ఆటోలో వెళుతుండగా డ్రైవర్ కాలేజీ దగ్గర ఆపకుండా ముందుకు తీసుకువెళ్లాడు. దాంతో విద్యార్థిని గట్టిగా కేకలు వేసినా ఫలితం లేకపోవటంతో నడుస్తున్న ఆటోలో నుంచి కిందకు దూకేసింది. ఈ విషయం గమనించిన స్థానికులు ఆటోను వెంబడించినా ఫలితం లేకపోయింది. గాయపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇక పశ్చిమగోదావరి జిల్లాలో ఓ యువతి కిడ్నాప్ యత్నం జరిగింది. చింతలపూడి మండలం సమ్మెటవారిగూడానికి చెందిన సురేష్, టి.నరసాపురం మండలం శ్రీరామవరానికి చెందిన ఓ యువతి ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఆ సమయంలో ఇద్దరు ప్రేమించుకున్నారు. రెండేళ్ల వీరి ప్రేమ మనస్పర్థలతో ముగిసింది. అనంతరం ఆ యువతి మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. దీంతో కక్ష కట్టిన సురేష్... ఆ యువతిని కిడ్నాప్ చేయాలనుకున్నాడు. అందుకు... మరో ఐదుగురితో కలిసి కిడ్నాప్ చేసేందుకు పథకం వేశాడు. యువతిని ఇంటికి వెళ్లి దాహమంటూ... క్లోరోఫాంతో కిడ్నాప్ చేయాలని భావించారు. ఆతర్వాత యువతిని కిడ్నాప్ చేయటానికి యత్నించగా... స్థానికులు గమనించి... పట్టుకున్నారు. నలుగురు చిక్కగా... కిడ్నాప్‌కు మూలసూత్రధారి.. మరొకతను పారిపోయాడు. కిడ్నాపర్లను చెట్టుకు కట్టేసి చితకొట్టిన స్థానికులు ఆ తరువాత పోలీసులకు అప్పగించారు. -
మలుపు తిరిగిన కిడ్నాప్.. సాఫ్ట్వేర్ యువతిపై రేప్
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ యువతి కిడ్నాప్ ఉదంతం మరో మలుపు తిరిగింది. బాధితురాలిపై ఇద్దరు దుండగులు అత్యాచారం పాల్పడినట్టు గుర్తించారు. ఈ అకృత్యానికి పాల్పడిన ఇద్దరు నిందితులు సతీష్, వెంటేశ్వర్లులను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వోల్వోకారులో కిడ్నాప్ చేసిన దుండగులు మెదక్ జిల్లా కొల్లూరు వద్ద బిర్లా స్కూలు సమీపంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఆరు గంటలపాటు ఆమెను చిత్రహింసల పాల్జేసినట్టు తెలిపారు. ఈ నెల 18న మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద ఆమెను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. సీసీ కెమెరా దృశ్యాలాధారంగా నిందితులను గుర్తించినట్టు సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డుపై పర్యవేక్షణ లోపం కూడా ఈ సంఘటనకు కారణమని అన్నారు. టోల్గేట్ వద్ద సీసీ కెమెరాలు సరిగా పనిచేయడం లేదని వెల్లడించారు. ఎన్ఐఏ సహాయంతో కేసును ఛేదించినట్టు చెప్పారు. బాధితురాలికి 'అభయ' అని పేరు పెట్టారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని కిడ్నాప్ యత్నం నిందితుల అరెస్ట్
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని కిడ్నాప్ యత్నం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కారు డ్రైవర్‌తో పాటు అతడి స్నేహితుణ్ని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో క్యాబ్ డ్రైవర్లపై ఐపీసీ 365 సెక్షన్ కింద కిడ్నాప్ కేసు నమోదు చేసినట్టు మాదాపూర్ అదనపు ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 18న సాఫ్ట్వేర్ ఉద్యోగిణి కిడ్నాప్‌కు మాదాపూర్‌లో దుండగులు యత్నించారు. అయితే సెల్ఫోన్లో స్నేహితుడు చెప్పిన సలహాను పాటించడం ద్వారా ఆమె కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా బయటపడింది. గుంటూరు జిల్లాకు చెందిన ఆ యువతి(22) మాదాపూర్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. నగరంలోని గౌలిదొడ్డిలోని ఓ ప్రైవేటు మహిళా హాస్టల్లో ఉంటోంది. ఈ ఉదంతం ఐటీ జోన్లో మహిళల భద్రతపై సందేహాలను రేకిత్తించింది.