సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కిడ్నాప్‌ యత్నం నిందితుల అరెస్ట్ | Vain bid to kidnap software employee, Cab Driver held | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కిడ్నాప్‌ యత్నం నిందితుల అరెస్ట్

Published Tue, Oct 22 2013 12:46 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Vain bid to kidnap software employee, Cab Driver held

హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కిడ్నాప్‌ యత్నం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కారు డ్రైవర్‌తో పాటు అతడి స్నేహితుణ్ని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో క్యాబ్ డ్రైవర్లపై ఐపీసీ 365 సెక్షన్ కింద కిడ్నాప్ కేసు నమోదు చేసినట్టు మాదాపూర్ అదనపు ఇన్‌స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు తెలిపారు.

ఈ నెల 18న సాఫ్ట్వేర్ ఉద్యోగిణి కిడ్నాప్‌కు మాదాపూర్లో దుండగులు యత్నించారు. అయితే సెల్‌ఫోన్‌లో స్నేహితుడు చెప్పిన సలహాను పాటించడం ద్వారా ఆమె కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా బయటపడింది. గుంటూరు జిల్లాకు చెందిన ఆ యువతి(22) మాదాపూర్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. నగరంలోని గౌలిదొడ్డిలోని ఓ ప్రైవేటు మహిళా హాస్టల్‌లో ఉంటోంది. ఈ ఉదంతం ఐటీ జోన్లో మహిళల భద్రతపై సందేహాలను రేకిత్తించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement