
మలుపు తిరిగిన కిడ్నాప్.. సాఫ్ట్‌వేర్ యువతిపై రేప్
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ యువతి కిడ్నాప్ ఉదంతం మరో మలుపు తిరిగింది. బాధితురాలిపై ఇద్దరు దుండగులు అత్యాచారం పాల్పడినట్టు గుర్తించారు. ఈ అకృత్యానికి పాల్పడిన ఇద్దరు నిందితులు సతీష్, వెంటేశ్వర్లులను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వోల్వోకారులో కిడ్నాప్ చేసిన దుండగులు మెదక్ జిల్లా కొల్లూరు వద్ద బిర్లా స్కూలు సమీపంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఆరు గంటలపాటు ఆమెను చిత్రహింసల పాల్జేసినట్టు తెలిపారు. ఈ నెల 18న మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద ఆమెను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.
సీసీ కెమెరా దృశ్యాలాధారంగా నిందితులను గుర్తించినట్టు సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డుపై పర్యవేక్షణ లోపం కూడా ఈ సంఘటనకు కారణమని అన్నారు. టోల్గేట్ వద్ద సీసీ కెమెరాలు సరిగా పనిచేయడం లేదని వెల్లడించారు. ఎన్ఐఏ సహాయంతో కేసును ఛేదించినట్టు చెప్పారు. బాధితురాలికి 'అభయ' అని పేరు పెట్టారు.