
సాక్షి, హైదరాబాద్: సినిమా పరిశ్రమలో అవకాశాలు కల్పిస్తానని సినిమాటోగ్రాఫర్ షన్ముఖ్ వినయ్ ఓ యువతిని మోసం చేసిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బొడుప్పల్‌కు చెందిన ఓ యువతి సినీ అవకాశాల కోసం వినయ్‌ను కలిశారు. ఈ సందర్భంగా వినయ్ బాధితురాలుకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. జనవరిలో సినిమా ఛాన్స్ పేరిట మాదాపూర్‌లోని ఓ గెస్ట్ హౌస్‌కు బాధితురాలిని పిలిపించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు గట్టిగా నిలదీయడంతో పెళ్లి చేసుకుంటానని మభ్య పెట్టాడు. ఆ తర్వాత వినయ్ ముఖం చాటేయడంతో సదురు యువతి మాదాపూర్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో వినయ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు రేపు కేసు నమోదు చేసినట్టు మాదాపూర్ ఏసీపీ ప్రసాద్‌రావు తెలిపారు. నిందితుడు వినయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment