Madhapur police station
-
జీవితం నచ్చలేదంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగి..
నగరంలో 18.. 28.. 29 ఏళ్ల వయసున్న ముగ్గురు యువకులు, 22 ఏళ్ల ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమ విఫలమైందని ఒకరు..ఈ జీవితం నచ్చలేదంటూ మానసిక వేదనతో మరొకరు.. పరీక్ష సరిగా రాయలేదనే భయంతో ఓ యువకుడు, అనారోగ్యం వేధిస్తోందని ఓ యువతి ఉసురు తీసుకున్నారు. క్షణికావేశం.. జీవితమంటే ఏర్పడిన భయం.. మానసిక ఒత్తిడితో బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఎంతో భవిష్యత్తు ఉన్న నలుగురు ప్రాణాలు తీసుకోవడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 1 ప్రియురాలికి వీడియో కాల్ చేసి.. ప్రేమ వ్యవహారంలో మనస్పర్థల కారణంగా ఓ యువకుడు ప్రియురాలికి వీడియో కాల్)(Video call) చేసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రాములు తెలిపిన ప్రకారం.. ఒడిశాలోని గంజాం జిల్లా జిల్లుండ జరడ గ్రామానికి చెందిన ధర్మ ప్రధాన్ (29) ఇరవై రోజుల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి రాయదుర్గంలోని అపర్ణ సైట్లో క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. అక్కడే లేబర్ కాలనీలో నివాసం ఉంటూ మంగళవారం సాయంత్రం 4.55 గంటల సమయంలో ఓ యువతికి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అంతకు ముందు చేతిపై కత్తితో కోసుకొని..ఆ తర్వాత వీడియో కాల్ చేసినట్లుగా ఎస్ఐ రాములు పేర్కొన్నారు. ప్రేమ వైఫల్యమే కారణమై ఉండవచ్చని పోలీసులు పేర్కొన్నారు. వీడియో కాల్ అందుకున్న యువతి హైదరాబాద్‌లో మరో సైట్లో పనిచేస్తున్న తమ బంధువులకు ఫోన్‌చేసి ధర్మ ప్రదాన్ విషయాన్ని చెప్పి అప్రమత్తం చేసింది. వెంటనే వారు సైట్‌లోని లేబర్ కాలనీకి వచ్చి చూడగా యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. వెంటనే రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం మృతుడి బంధువులు రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. 2 అనారోగ్య సమస్యలతో ఐటీ ఉద్యోగిని .. అనారోగ్య సమస్యలతో ఐటీ ఉద్యోగి (IT employee) ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం మాదాపూర్ పోలీస్‌స్టేషన్(Madhapur Police Station) పరిధిలో చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . మాదాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ చెందిన రిటోజ బసు(22) మాదాపూర్ సిద్దిఖ్‌నగర్ జోలో స్టెర్లింగ్ కో లివింగ్ హాస్టల్లో స్నేహితునితో కలసి నివాసం ఉంటున్నారు. గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తున్నారు. ఆమె స్నేహితుడు కోల్‌కత్తాకు చెందిన హర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరు కలిసి ఒక నెలక్రితమే హాస్టల్‌కు వచ్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఈ లోపే అనారోగ్య సమస్యల కారణంగా ఒత్తిడికి గురైన రిటోజ బసు హాస్టల్ భవనం ఆరవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్లోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 3 జీవితం నచ్చలేదంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తెలిపిన ప్రకారం..జగిత్యాల జిల్లా బూగారం మండలం భోపాల్‌పూర్ గ్రామానికి చెందిన గంతుల కుమార్ (28) ఎంబీఏ పూర్తి చేసి గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. బీకే గూడ సంజయ్ గాం«దీనగర్ కాలనీలో గంగాధర్ అనే స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు. బుధవారం ఉదయం గంగాధర్ బయటికు వెళ్లి తిరిగి 10 గంటల సమయంలో రూమ్‌కు వచ్చాడు. లోపలి నుంచి గడియ వేసి ఉండటంతో తలుపులు తట్టినా లోపల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో కిటికీలో నుంచి చూడగా కుమార్ ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి విచారణ జరిపారు. గదిలో ఓ సూసైడ్ నోట్‌ను స్వా«దీనం చేసుకున్నారు. ‘నాకు జీవితం నచ్చలేదు. నన్ను క్షమించండి’ అని నోట్ రాసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.4 పరీక్ష భయంతో సీఏ విద్యార్థిపరీక్ష సరిగా రాయలేదని ఓ సీఏ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా మాన్వి మండలం కరిటిగుడ్డ గ్రామానికి చెందిన రాజుశెట్టి కుమారుడు ఎస్.అమర్జీత్ (18) ఎస్ఆర్ నగర్ బాపూనగర్‌లోని జీవీ క్రేజీ పీజీ హాస్టల్లో ఉంటూ లక్ష్య కళాశాలలో సీఏ చదువుతున్నాడు. 2024 డిసెంబరు 22న పరీక్షలు రాసి సొంత గ్రామానికి వెళ్లాడు. పరీక్ష సరిగా రాయలేదని ఇంట్లో కుటుంబ సభ్యుల వద్ద బాధపడ్డాడు. ఫెయిల్ అవుతానేమో అని భయం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో గత జనవరి 27న మరో పరీక్ష రాయాల్సి ఉండటంతో తిరిగి నగరానికి వచ్చి హాస్టల్‌నే ఉంటున్నాడు. మంగళవారం ఉదయం కళాశాలకు వెళ్లాల్సి ఉండగా ఆరోగ్యం బాగాలేదని రూమ్మేట్ సుబ్రమణ్యంతో చెప్పి గదిలో ఉండిపోయాడు. రాత్రి 10.30 గంటల సమయంలో సుబ్రమణ్యం వచ్చి చూడగా లోపలి నుండి లాక్ చేసి ఉంది. ఎంత పిలిచినా పలుకక పోవడంతో అనుమానం వచ్చి హాస్టల్ నిర్వాహకులకు చెప్పగా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా అమర్జీత్ ఉరి వేసుకుని కనిపించాడు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరిపారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మాదాపూర్ పోలీసు స్టేషన్లో సిలిండర్ పేలుడు
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ పోలీసు స్టేషన్ పేలుడు చోటు సంభవించింది. సీజ్ చేసిన సిలిండర్లు పేలి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరికొని మంటలు ఆర్పుతున్నారు. పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలతో పోలీసు సిబ్బంది భయంతో బయటికి పరుగులు తీసింది. సమీపంలో పేల్చిన టపాకాయల మంటలు సిలిండర్లపై పడ్డట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: పూలే విగ్రహం ఏర్పాటుకు అభ్యంతరం ఏంటీ? -
కరోనాతో డీఎస్ఐ మృతి
మాదాపూర్(హైదరాబాద్): సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ పోలీసుస్టేషన్లో డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ (డీఎస్ఐ)గా పనిచేస్తున్న అబ్బాస్ అలీ(57) కరోనాతో మృతి చెందారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం బొంపల్లికి చెందిన అబ్బాస్ అలీ 1984లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. తర్వాత హెడ్ కానిస్టేబుల్‌గానూ రాణించాడు. ఎస్ఐగా ప్రమోషన్ వచ్చిన అనంతరం అంబర్ పేట్లో శిక్షణ పొంది 10 నెలల క్రితం మాదాపూర్ పీఎస్‌లో డీఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. గత మంగళవారం ఆయనకు నీరసంగా ఉండటంతో మాదాపూర్‌లోని మెడికోవర్ ఆస్పత్రిలో టెస్ట్ చేయగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో అదే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ రావడంతో పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఆయనకు భార్య, ఐదుగురు కొడుకులు, కూతురు ఉంది. మాదాపూర్ పీఎస్‌లో ఇప్పటికే పలువురు సిబ్బందికి కరోనా సోకినా అందరూ కోలుకున్నారు. -
వాలెంటైన్స్ డే: భజరంగ్‌దళ్ కార్యకర్తల బీభత్సం..!
-
మరోసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సంజన
సాక్షి, హైదరాబాద్ : పటాన్చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ తనతో అమర్యాదగా ప్రవర్తించినట్టు బిగ్‌బాస్–2 కంటెస్టెంట్ అన్నె సంజన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సంజన బుధవారం మరోసారి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అయితే పోలీసులు సంజనను విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిచారా లేక, కేసు పురోగతిని తెలుసుకోవడానికి ఆమె అక్కడికి వచ్చారా అన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా, ఆదివారం తెల్లవారుజామున స్నేహితులతో కలిసి నోవాటెల్‌లో గల ఆరిస్ట్రీ పబ్‌కు వెళ్లిన తనను.. ఆశిష్ చెప్పలేని రీతిలో దూషించినట్టు సంజన మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆశిష్ తమపైకి ఖాళీ మద్యం బాటిళ్లను విసిరాడని.. ఆ ప్రమాదం నుంచి తన స్నేహితురాలు తృటిలో తప్పించుకుందని ఆమె తెలిపారు. దీంతో తాము పోలీసులకు ఫోన్ చేశామని చెప్పారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఆశిష్ ఖండించారు. తను నోవాటెల్‌కు వెళ్లిన విషయం వాస్తమమేనని.. తనపై ఆరోపణలు చేసిన అమ్మాయి ఎవరో తనకు తెలియదని ఆశిష్ చెప్పారు. చదవండి : నందీశ్వర్ గౌడ్ కుమారుడిపై కేసు నమోదు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు: ఆశీష్ గౌడ్ -
ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు
సాక్షి, హైదరాబాద్ : వేధింపులకు పాల్పడినట్లు తనపై వచ్చిన ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్ ఖండించారు. నోవాటెల్ హోటల్‌కు వెళ్లిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. తనపై ఫిర్యాదు చేసిన అమ్మాయి ఎవరో తనకు తెలియదని ఆశీష్ గౌడ్ చెప్పారు. మరోవైపు ఆశీష్ గౌడ్ తమతో అసభ్యం ప్రవర్తించడమే కాకుండా, మద్యం బాటిళ్లతో దాడి చేసి...మొదటి అంతస్తు నుంచి తోసివేసే ప్రయత్నం చేశారంటూ బిగ్ బాస్ రెండో సీజన్ కంటెస్టెంట్ సంజన ఆదివారం మాదాపూర్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆశీష్ గౌడ్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చదవండి: సంజనాతో మాజీ ఎమ్మెల్యే కొడుకు అసభ్య ప్రవర్తన -
నన్నే గుర్తు పట్టలేదా అంటూ వీరంగం..
సాక్షి, హైదరాబాద్ : పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ మాదాపూర్‌లోని నోవాటెల్‌లో గల ఆరిస్ట్రీ పబ్‌లోయువతులపై వీరంగం సృష్టించాడు. దీంతో బాధితురాలు బిగ్ బాస్ –2 కంటెస్టెంట్ అన్నె సంజన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. బిగ్ బాస్–2 కాంటెస్టెంట్ అన్నె సంజన స్నేహితులు వి.శివాణి, వి.సంజన , రమేష్‌లతో కలిసి ఆదివారం తెల్లవారు జామున 2 గంటలకు నొవాటెల్‌లోని ఆర్టిస్ట్రీ పబ్‌కు వెళ్లింది. మొదటి అంతస్తులోని టేబుల్ వద్ద ఉండగా కింది ఫ్లోర్లో ఉన్న అశిష్ గౌడ్ 2.45 గంటలకు 8 మంది స్నేహితులు కలిసి పైకి వచ్చారు. మద్యం మత్తులో ఉన్న అశిష్ గౌడ్ నన్ను గుర్తు పట్టావా అని అడగ్గా లేదని సమాధానమిచ్చింది. దీంతో రెచ్చిపోయిన అతను ఇగో ఎక్కువ .. ఎందుకు గుర్తు పడతావంటూ చెప్పలేని రీతిలో దూషణలకు దిగాడు. అంతటితో ఆగక ఖాళీ మద్యం బాటిళ్లను విసిరాడు. వి.సంజన అనే యువతి తృటిలో తప్పించుకుంది. సంజన చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. స్నేహితుడు రమేష్ అడ్డుకోవడంతో వెనక్కు తగ్గారు. అక్కడే ఉన్న బౌన్సర్ అజార్ పట్టించుకోకపోవడంతో అశీష్ మరింత రెచ్చిపోయాడు. 3 గంటల సమయంలో పోలీస్ కంట్రోల్ రూ మ్కు ఫోన్ చేయడంతో 15 నిమిషాల వ్యవధిలో మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బౌన్సర్లు యువతులను వెనక ద్వారం వద్ద ఉంచి అశిష్ గౌడ్ అతని స్నేహితులను ప్రధాన ద్వారం నుంచి బయటకు పంపారు. సంజనతో పాటు మరో మగ్గురు స్నేహితులు కలిసి తెల్లవారు జామున 4.30 గంటలకు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులపై ఐపీసీ 354, 354ఏ, 309 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాటిళ్లు విసిరి, తోసేశాడు... గుర్తు పట్టలేదన్నందుకు మాటల్లో చెప్పలేని బూతులు తిట్టాడని బాధితురాలు అన్నె సంజన ‘సాక్షి’కి తెలిపారు. బూతులు తిడుతూ చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడన్నారు. తోసివేయడంతో ఓ దశలో కింది ఫ్లోర్లో పడిపోతానేమోనని భయమేసిందని, నా స్నేహితుడు అడ్డుకోవడంతో బయటపడ్డానని పేర్కొంది. ఆర్టిస్ట్రి పబ్ యాజామాన్యానికి కాల్ చేసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ఎస్ఐ శ్రీనివాస్ సీసీ పుటేజి స్పష్టంగా లేదని చెబుతున్నాడని, కేసు విత్‌డ్రా చేసుకోవాలని అశిష్ గౌడ్ చాలా మందితో ఫోన్లు చేయిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. ఆ పబ్‌కు నిబంధనలు వర్తించవు... నోవాటెల్ వీకెండ్లో పబ్‌లకు రాత్రి 1 గంటలకు పోలీసుల అనుమతి ఉంటుంది. ప్రతి వీకెండ్లో తెల్లవారు జామున 3.30 గంటల వరకు నోవాటెల్‌లోని అర్టిస్ట్రీ పబ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకు గలాట జరిగిందంటే నిబంధనలకు విరుద్ధంగా పబ్‌ను నిర్వహిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మాదాపూర్ పోలీసులతో పాటు సైబరాబాద్ ఎస్వో టీ పోలీసులు పబ్‌లపై నిఘా ఉంచుతున్నారు. తెల్లవారుజాము వరకు ఆర్టిస్ట్రీ పబ్ నడిచినా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శలు నెలకొన్నాయి. స్నేహితుడి కూతురితో అసభ్య ప్రవర్తన వాట్సాప్‌కు అశ్లీల చిత్రాలు మైనర్ బాలికకు అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కాచిగూడ ఇన్స్పెక్టర్ హాబీబుల్లా ఖాన్ తెలిపిన మేరకు.. హిమాయత్‌నగర్ రాయల్ డిమ్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న మహ్మద్ వాహిదోద్దిన్ (43) హరియంత్ మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. అక్కడ కొన్నేళ్లనుంచి మహ్మద్ వాహిదోద్దీన్ ఖాన్‌కు పంకజ్‌తో స్నేహం ఏర్పడింది. వాహిదోద్దీన్ తరచుగా ఇసామియా బజార్లో ఉంటున్న పంకజ్ ఇంటికి వచ్చి వెళ్లుతున్నాడు. దీంతో ఇంటర్మీడియట్ చదువుతున్న పంకజ్ కూతురు (17)తో వాహీదోద్దీన్ పరిచయం పెంచుకున్నాడు. ఆమె వద్ద ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్లో వాట్సప్‌లో అశ్లీల చిత్రాలను పంపిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఎంత చెప్పినా, మందలించినా వాహిదోద్దీన్ ఖాన్‌లో ఏమాత్రం మార్పురాలేదు. శనివారం రాత్రి పంకజ్ కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. పోలీసులు వాహిదోద్దిన్ ఖాన్ ను అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. -
టికెట్ తీసుకుంటుండగా బాలుడి కిడ్నాప్..!
సాక్షి, హైదరాబాద్ : ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లో ఓ బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకుంటుండగా తమ కుమారుడు జయప్రకాష్ (విక్కీ) కనిపించకుండా పోయాడని అతని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్ చుట్టు పక్కల అంతా వెతికామని, విక్కీ జాడ తెలియరావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడిని ఎవరో కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
సినీ అవకాశాల పేరిట యువతిపై అత్యాచారం
సాక్షి, హైదరాబాద్: సినిమా పరిశ్రమలో అవకాశాలు కల్పిస్తానని సినిమాటోగ్రాఫర్ షన్ముఖ్ వినయ్ ఓ యువతిని మోసం చేసిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బొడుప్పల్కు చెందిన ఓ యువతి సినీ అవకాశాల కోసం వినయ్‌ను కలిశారు. ఈ సందర్భంగా వినయ్ బాధితురాలుకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. జనవరిలో సినిమా ఛాన్స్ పేరిట మాదాపూర్‌లోని ఓ గెస్ట్ హౌస్‌కు బాధితురాలిని పిలిపించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు గట్టిగా నిలదీయడంతో పెళ్లి చేసుకుంటానని మభ్య పెట్టాడు. ఆ తర్వాత వినయ్ ముఖం చాటేయడంతో సదురు యువతి మాదాపూర్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో వినయ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు రేపు కేసు నమోదు చేసినట్టు మాదాపూర్ ఏసీపీ ప్రసాద్‌రావు తెలిపారు. నిందితుడు వినయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు వెల్లడించారు. -
దొంగ పోలీసు అడ్డంగా బుక్కయ్యాడు!
హైదరాబాద్ సిటీ: నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా ఉన్న మహిళల వద్ద నుంచి డబ్బులు, నగలు దోచుకుంటున్న ఓ నకిలీ పోలీసు (సూడో పోలీసు) ఆటకట్టించారు. మంగలే సుభాష్ మిట్టల్ అనే పాత నేరస్తుడు గతంలో ఎన్నో చోరీలకు పాల్పడ్డాడు. అయితే ఈ మధ్యకాలంలో ఆ దొంగ.. ఏకంగా పోలీసు అవతారం ఎత్తాడు. నేర ప్రవృత్తికి అలవాడు పడ్డ సుభాష్ మిట్టల్.. గత కొన్ని రోజులుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలు, వృద్ధులను టార్గెట్ చేసుకున్నాడు. పోలీస్‌నంటూ చెప్పి ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధులను బెదిరించేవాడు. ఆపై తనిఖీల పేరుతో వారి వద్ద నుంచి డబ్బులు, బంగారాన్ని దోచుకొని క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యేవాడు. ఈ క్రమంలో చోరీ చేసి పారిపోతుండగా మాదాపూర్ పోలీసులు ఆ దొంగ పోలీసును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రెండు బంగారు ఉంగరాలు, ఒక బంగారు గొలుసు, 15 తులాల వెండి పట్టాల గొలుసులు, రూ.23 వేల నగదు, ఒక బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడు సుభాష్ మిట్టల్‌ను రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
దొంగ పోలీసు అడ్డంగా బుక్కయ్యాడు!
-
బతుకు మట్టిపాలు!
⇒ ఇద్దరు మహిళా కూలీల సజీవ సమాధి ⇒ సెల్లార్లో పని చేస్తుండగా కూలిన మట్టిపెళ్లలు ⇒ మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన హైదరాబాద్: మట్టి పెళ్లలు వారి పాలిట మృత్యువయ్యాయి. సెల్లార్లో పనిచేస్తుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు మీద పడటంతో ఇద్దరు మహిళా కూలీలు సజీవ సమాధి అయ్యారు. సోమవారం ఉదయం మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాపూర్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మట్టిపెళ్లలు పడుతున్న విషయాన్ని గమనించి మరో నలుగురు బయటకు పరుగు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. వీరిలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా సిరగపురం మండలం బీపేట గ్రామానికి చెందిన దంపతులు పల్లపు పాపయ్య, కిష్టమ్మ(45), కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మహ్మద్‌నగర్ గ్రామానికి చెందిన ఎ.బాలయ్య అలియాస్ బాల్‌రాజ్, భారతమ్మ(25)తో పాటు శాంతమ్మ, హన్మాండ్లు కొండాపూర్‌లో వంశీరాం కన్స్ట్రక్షన్స్ సంస్థ చేపడుతున్న సెల్లార్లో కూలి పనుల కోసం వచ్చారు. రిటైనింగ్ వాల్‌తోపాటు ప్లింత్భీంల ఏర్పాటు కోసం గ్రానైట్ రాళ్లను కూలీలు మోస్తున్నారు. సోమవారం ఉద యం 9.45 గంటలకు సెల్లార్ తూర్పు వైపున ఒక్కసారిగా కుంగి మట్టి పెళ్లలు విరిగి పడ్డాయి. గ్రానైట్ రాళ్లు మోస్తున్న కిష్టమ్మ, భారతమ్మ ఆ మట్టి పెళ్లలో కూరుకుపోయి తుదిశ్వాస విడిచారు. పాపయ్య, బాలయ్య, శాంతమ్మ, హన్మాండ్లు మట్టి పెళ్లలు విరిగి పడటాన్ని గమనించి బయటకు పరిగెత్తి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. స్వల్పంగా గాయపడిన పాపయ్య, బాలయ్యను మాదాపూర్‌లోని మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రికి తరలించారు. మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలను వెలికి తీసేందుకు మాదాపూర్ పోలీసులు మూడు గంటలపాటు శ్రమించారు. పారతో మట్టిని తొలగించి రెండు మృతదేహాలను బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతదేహాలతో బాధిత కుటుంబాలు ధర్నా చేశారు. ఘటనా స్థలాన్ని మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ తదితరులు పరిశీలించారు. బిల్డర్, సైట్ ఇంజనీర్లపై కేసు మూడు సెల్లార్లు, జి ప్లస్ 3 అంతస్తులకు పాటి మహిపా ల్‌రెడ్డి పేరిట జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి అనుమతి ఉందని శేరిలింగంపల్లి సర్కిల్ 11 ఉపకమిషనర్ సురేశ్ రావు తెలిపారు. పనులను వంశీరాం కన్స్ట్రక్షన్స్ చేపడు తోందని, 30 అడుగుల లోతు సెల్లార్ తవ్వారని చెప్పారు. ప్రమాదానికి సంబంధించి బిల్డర్, సైట్ ఇంజనీర్, సూపర్వైజర్లపై ఐపీసీ 304 పార్ట్ 2 సెక్షన్ కింద కేసు నమో దు చేస్తామని మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. రూ.16 లక్షల నష్టపరిహారం: మేయర్ బిల్డర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్పష్టమవుతోందని మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొ న్నారు. లేబర్ విభాగం నుంచి రూ.6 లక్షలు, జీహెచ్ ఎంసీ నుంచి రూ.2 లక్షలు బాధిత కుటుంబాలకు అందజేస్తామ ని, బిల్డర్ నుంచి మరో రూ.8 లక్షలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మరణించిన వారి అంత్యక్రియలకు రూ. 50 వేలు అందజేస్తామని, క్షతగాత్రులకు ఉచితంవైద్యం అంది స్తామని చెప్పారు. ఘటనపై రెండు మూడు రోజుల్లో నివేది క అందించాలని అధికారులను ఆదేశించారు. మట్టి పెళ్లలు కూలి ఇద్దరు మహిళల మృతికి కారణమైన వారిపై క్రిమి నల్ కేసులు నమోదు చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. -
ఇంగ్లీష్ బ్రేక్‌ఫాస్ట్
ఇంటర్నేషనల్ రుచులు మాత్రమే కాదు గ్లోబల్ డైనింగ్ స్టైల్స్ సైతం ఇప్పుడు సిటీలో ఒక అవసరంగా మారాయి. విదేశాల నుంచి రాకపోకలు బాగా పెరగడం వల్ల వచ్చిన ఈ అవసరం నేపథ్యంలో మాదాపూర్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని సి-గస్తా రెస్టారెంట్ సరికొత్త బ్రేక్‌ఫాస్ట్‌ను పరిచయం చేస్తోంది. ‘ఇంగ్లిష్ బ్రేక్‌ఫాస్ట్’ పేరుతో ఈ రెస్టారెంట్ శనివారం ప్రారంభించిన మెనూలో... మొత్తం 15 నుంచి 20 రకాల వెరైటీలు అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. యూరోపియన్ శైలిని తలపిస్తూ కుస్‌కుస్ ఉప్మా, కోల్డ్‌కట్స్ వంటి డిఫరెంట్ ఐటెమ్స్‌తో పాటుగా ఎగ్‌తో చేసిన 10 రకాల వంటకాలు, హోమ్ మేడ్ చికెన్ సాసెస్, బ్రెడ్స్, జామ్స్ వంటివన్నీ అందిస్తున్నామన్నారు. - సిటీ ప్లస్ -
అభయ కేసు 11కు వాయిదా
రంగారెడ్డి జిల్లా కోర్టులు: మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అభయ కేసువిచారణను ఎల్బీనగర్లోని సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీ కోర్టుకు బదిలీచేశారు. సెషన్స్ కేసు నెం-51/14లో నిందితులైన సతీష్, వెంకటేష్‌లను జైలు అధికారులు గురువారం న్యాయస్థానంలో హాజరు పరిచారు. విచారణలో భాగంగా బాధితురాలిని డిఫెన్స్ కౌన్సిల్ విచారణ చేపట్టారు. తదుపరి సాక్షుల విచారణ కోసం కేసును ఈ నెల 11వ తేదీకి న్యాయమూర్తి నాగార్జున్ వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
మలుపు తిరిగిన కిడ్నాప్.. సాఫ్ట్వేర్ యువతిపై రేప్
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ యువతి కిడ్నాప్ ఉదంతం మరో మలుపు తిరిగింది. బాధితురాలిపై ఇద్దరు దుండగులు అత్యాచారం పాల్పడినట్టు గుర్తించారు. ఈ అకృత్యానికి పాల్పడిన ఇద్దరు నిందితులు సతీష్, వెంటేశ్వర్లులను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వోల్వోకారులో కిడ్నాప్ చేసిన దుండగులు మెదక్ జిల్లా కొల్లూరు వద్ద బిర్లా స్కూలు సమీపంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఆరు గంటలపాటు ఆమెను చిత్రహింసల పాల్జేసినట్టు తెలిపారు. ఈ నెల 18న మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద ఆమెను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. సీసీ కెమెరా దృశ్యాలాధారంగా నిందితులను గుర్తించినట్టు సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డుపై పర్యవేక్షణ లోపం కూడా ఈ సంఘటనకు కారణమని అన్నారు. టోల్గేట్ వద్ద సీసీ కెమెరాలు సరిగా పనిచేయడం లేదని వెల్లడించారు. ఎన్ఐఏ సహాయంతో కేసును ఛేదించినట్టు చెప్పారు. బాధితురాలికి 'అభయ' అని పేరు పెట్టారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని కిడ్నాప్ యత్నం నిందితుల అరెస్ట్
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని కిడ్నాప్ యత్నం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కారు డ్రైవర్‌తో పాటు అతడి స్నేహితుణ్ని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో క్యాబ్ డ్రైవర్లపై ఐపీసీ 365 సెక్షన్ కింద కిడ్నాప్ కేసు నమోదు చేసినట్టు మాదాపూర్ అదనపు ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 18న సాఫ్ట్వేర్ ఉద్యోగిణి కిడ్నాప్‌కు మాదాపూర్‌లో దుండగులు యత్నించారు. అయితే సెల్ఫోన్లో స్నేహితుడు చెప్పిన సలహాను పాటించడం ద్వారా ఆమె కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా బయటపడింది. గుంటూరు జిల్లాకు చెందిన ఆ యువతి(22) మాదాపూర్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. నగరంలోని గౌలిదొడ్డిలోని ఓ ప్రైవేటు మహిళా హాస్టల్లో ఉంటోంది. ఈ ఉదంతం ఐటీ జోన్లో మహిళల భద్రతపై సందేహాలను రేకిత్తించింది. -
సాఫ్ట్వేర్ యువతిపై లైంగిక దాడి యత్నం
-
సాఫ్ట్వేర్ యువతిపై లైంగిక దాడి యత్నం
హైదరాబాద్: ఓ సాఫ్ట్వేర్ యువతిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాష్ట్ర రాజధానిలో కలకలం రేపింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన ఆ యువతి హైటెక్ సిటీలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ గౌలిదొడ్డిలోని హాస్టల్లో ఉంటుంది. శుక్రవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఇనార్బిట్ మాల్లో షాపింగ్ చేసుకుని, హాస్టల్‌కు వెళ్లేందుకు రోడ్డుపై నుంచుంది. లిఫ్ట్ ఇస్తానంటూ ఓ క్యాబ్ రావడంతో అందులోకి ఎక్కింది. క్యాబ్ డ్రైవర్ ఆ యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించి, తప్పించుకుని వచ్చి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.