ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు | Ashish Goud Condemns Sanjana allegations | Sakshi
Sakshi News home page

ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు: ఆశీష్‌ గౌడ్‌

Published Sun, Dec 1 2019 11:52 AM | Last Updated on Sun, Dec 1 2019 2:10 PM

Ashish Goud Condemns Sanjana allegations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వేధింపులకు పాల్పడినట్లు తనపై వచ్చిన ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్‌ కుమారుడు ఆశీష్‌ గౌడ్‌ ఖండించారు. నోవాటెల్‌ హోటల్‌కు వెళ్లిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. తనపై ఫిర్యాదు చేసిన అమ్మాయి ఎవరో తనకు తెలియదని ఆశీష్‌ గౌడ్‌ చెప్పారు. 

మరోవైపు ఆశీష్‌ గౌడ్‌ తమతో అసభ్యం ప్రవర్తించడమే కాకుండా, మద్యం బాటిళ్లతో దాడి చేసి...మొదటి అంతస్తు నుంచి తోసివేసే ప్రయత్నం చేశారంటూ బిగ్‌ బాస్‌ రెండో సీజన్‌ కంటెస్టెంట్‌ సంజన ఆదివారం మాదాపూర్‌ పోలీసుల్ని ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆశీష్‌ గౌడ్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

చదవండి: సంజనాతో మాజీ ఎమ్మెల్యే కొడుకు అసభ్య ప్రవర్తన 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement