sanjana
-
తెలుగింటి.. వెలుగులు! ఇంతకూ ఎవరా అమ్మాయిలు..?
అమ్మానాన్నలు వెంట లేకుండానే... టీచర్లు తోడు లేకుండానే ఈ అమ్మాయిలు ధైర్యంగా దేశం దాటి చైనా వెళ్లారు. శాస్త్ర సాంకేతిక సదస్సులో 38 దేశాల నుంచి హాజరైన బృందాలలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. తెలుగు వారి తెలివితేటలను నిరూపించుకున్నారు. అంతర్జాతీయ ప్లాట్‌ఫారంపై అదరగొట్టారు. భావి శాస్త్రవేత్తలుగా భళా అనిపించుకున్నారు. ఎంచక్కా తిరిగి వచ్చారు. తమ అనుభవాలను సాక్షితో సంతోషంగా పంచుకున్నారు.ఇంతకూ ఎవరా అమ్మాయిలు..?ఆంధ్రప్రదేశ్, కాకినాడకు చెందిన సాయిశ్రీ శ్రుతి చిట్టూరి, లక్ష్మీ ఆశ్రిత నామ, సంజన పల్లా, వైష్ణవి వాకచర్లలకు అంతర్జాతీయ వేదికపై భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. చైనీస్ అసోషియేషన్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, చైనా ఎడ్యుకేషన్ క్యాంప్ రెగ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన యూత్ సైన్స్ టెక్నాలజీ వర్క్‌షాపులో ఈ స్టూడెంట్స్ పాల్గొన్నారు. సదస్సులో పాల్గొని ఇటీవలే తిరిగి వచ్చారు.ఆలోచనలను పంచుకున్నాం..దక్షిణాఫ్రికా, నేపాల్, ఆస్ట్రేలియా, మంగోలియా తదితర దేశాలæవిద్యార్థినుల పరిశోధన అంశాలపై ఆలోచనలు పంచుకోవడానికి మాకు మంచి అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఒకే వయస్సు వాళ్లం ఒక చోట చేరి ఎంపిక చేసుకున్న అంశాలపై విశ్లేషించుకోవడానికి ఈ సదస్సు ఉపకరించింది.– వైష్ణవి. ఎంపీసీ విద్యార్థిని, కాకినాడపురాతన జీవశాస్త్రంపై పరిశోధన..ఈ వర్క్‌షాపు ద్వారా వివిధప్రాంతాల విశిష్టత, ఆయాప్రాంతాల్లో జీవరాశుల స్వభావం, స్థితిగతులపైప్రాథమికంగా కొంత అవగాహన ఏర్పరుచుకుకో గలిగాం. భవిష్యత్తులో శాస్త్రవేత్తలం కావాలనే మా సంకల్పానికి ఈ వర్క్‌షాపు కచ్చితంగా ఉపయోగమే.– సంజన, బైపీసీ విద్యార్థిని, కాకినాడఎనిమిదో ఏడు..చైనా ఏటా ప్రపంచ స్థాయిలో 2017 నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ వర్క్‌షాపు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలు, వివిధ భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆలోచనలను పంచుకోవాలి. అలా భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారీ అమ్మాయిలు. భావి శాస్త్రవేత్తలకు దిక్సూచి: విశ్వం ఆవిర్భావం నుంచి నేటివరకూ ప్రపంచంలో చోటు చేసుకున్న మార్పులపై నిరంతరం పరిశోధనలు కొనసాగడం ఈ వర్క్‌షాపు లక్ష్యం. ఈ వర్క్‌షాపు లో ఎంపీసీ స్టూడెంట్స్ (శృతి, వైష్ణవి) ‘చేజింగ్ ద సన్’ అంశాన్ని, బైపీసీ స్టూడెంట్స్ (లక్ష్మి ఆశ్రిత, సంజన) ఫాజిల్స్ ను ఎంపిక చేసుకున్నారు. వివిధ దేశాల నుంచి ఎంపికైన వారితో తమ అభి్రపాయాలను పంచుకుని విజయ వంతంగా తిరిగి వచ్చారు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, కాకినాడ. ఫొటోలు: తలాటం సత్యనారాయణ -
బుమ్రా లవ్ జర్నీ ఎలా మొదలైందంటే..
-
Sanjana Thakur: కామన్వెల్త్ బహుమతి గెలిచిన అమ్మ కథ
ఆధునిక జీవితం అమ్మను ఎక్కడకు చేర్చింది?వృద్ధాశ్రమానికి.ఒకమ్మాయికి వృద్ధాశ్రమంలో నుంచి ఒక తల్లిని ఇంటికి తెచ్చుకోవాలని అనిపిస్తుంది. కాని వృద్ధాశ్రమంలో చూస్తే అందరు తల్లులూ అద్భుతంగా అనిపిస్తారు. ఇంత మంచి తల్లులను ఎందుకు పెట్టారోనని సంజనా ఠాకూర్ రాసిన కథ కామన్వెల్త్ ప్రైజ్ 2024 గెలుచుకుంది. సంజనా ఠాకూర్ పరిచయం.‘స్కూల్ టీచర్లకు నన్ను తిట్టాలని ఉండేది. కాని తిట్టలేకపోయేవారు. సంజనా బాగా చదువుతుంది... హోమ్ వర్క్ చేస్తుంది... కాని క్లాస్ జరుగుతుంటే టేబుల్ కింద కూచుని కథల పుస్తకం చదువుతోంది అని కంప్లయింట్ చేసేవారు. నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే అంత పిచ్చి. మా అమ్మ రోజూ నాకు కథలు చదివి వినిపించేది. నేను మా ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్లినా పార్టీలకు వెళ్లినా పుస్తకం పట్టుకుని మూలన కూచునేదాన్ని. చిన్నప్పుడే రాయడం మొదలెట్టాను. ఇప్పుడు ఈ గుర్తింపు రావడం సంతోషంగా ఉంది’ అంటుంది 26 సంవత్సరాల సంజనా ఠాకూర్. ముంబైకి చెందిన సంజన ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ లో ఎం.ఎఫ్.ఏ. ఫిక్షన్ చదువుతోంది. ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్’ పోటీల్లో పాల్గొని 2024 సంవత్సరానికి విజేత అయింది.ఐదు లక్షల బహుమతికామన్వెల్త్ దేశాలలోని యువ రచయితలను ఉత్సాహపరచడానికి కామన్వెల్త్ ఫౌండేషన్ ఏటా కథల పోటీ నిర్వహిస్తుంది. 18 ఏళ్లు పైబడిన వారు దీనికి అర్హులు. నేరుగా ఇంగ్లిష్‌లో కాని లేదా ఇంగ్లిష్‌లో అనువాదమైన స్థానికభాష కథగాని పంపవచ్చు. 2500 పదాల నుంచి 5000 పదాల వరకూ కథ ఉండాలి. ఇందులో మళ్లీ ఐదు రీజియన్లకు (ఆఫ్రికా, ఆసియా, కెనడా–యూరప్, పసిఫిక్) ఐదుగురు రీజనల్ విన్నర్స్‌ను ప్రకటిస్తారు. వీరి నుంచి ఓవరాల్ విన్నర్‌ను ఎంపిక చేస్తారు. 2024కు ఆసియా రీజనల్ విన్నర్‌గా నిలిచిన సంజనా ఠాకూర్ ఓవరాల్ విన్నర్‌గా కూడా ఎంపికైంది. నగదు బహుమతిగా 5000 పౌండ్లు గెలుచుకుంది.కథ పేరు ఐశ్వర్యారాయ్‘అమెరికాలో నేనొక బొమ్మల షాపులో తిరుగుతున్నప్పుడు కేవలం అమ్మ బొమ్మలు అమ్మే ఒక షాప్ ఉంటే ఎలా ఉంటుందా అనే ఆలోచన వచ్చింది. అక్కడినుంచి పిల్లలు అమ్మల్ని దత్తత తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన కొనసాగింది. ఇండియాలో పట్టణ సంస్కృతి ఇప్పుడు ఇళ్లల్లో అమ్మకు చోటు లేకుండా చేస్తోంది. ఆమె వృద్ధాశ్రమంలో ఉండాల్సి వస్తోంది. నా కథలో అన్వి అనే అమ్మాయి ఒక వృద్ధాశ్రమానికి వెళ్లి ఒక అమ్మను దత్తత తీసుకోవాలనుకుంటుంది. కాని ఒక్కో అమ్మ ఒక్కో లక్షణంలో గొప్పగా కనిపిస్తుంది. అమ్మలందరూ తమ అనుబంధం రీత్యా ఐశ్వర్యారాయ్ కంటే తక్కువ సౌందర్యవతులు కాదు. ఏ అమ్మ సౌందర్యమైనా బంధం రీత్యా ఐశ్వర్యారాయ్ అంత అందమైనదే. అందుకే ఆ పేరుతోనే కథ రాశాను. వ్యంగ్యం, చెణుకులు ఉండటంతో నా కథను జడ్జిలు మెచ్చుకొని ఉండొచ్చు’ అని తెలిపింది సంజనా.త్వరలో పుస్తకం‘త్వరలో 15 కథలతో నేను పుస్తకం తెస్తాను. ఇప్పటికే రాశాను. అందులో అన్ని కథల్లోనూ తల్లులూ కూతుళ్లు కనిపిస్తారు. వారి భిన్న భావోద్వేగాలు చర్చకు వస్తాయి. ప్రస్తుతం నా థీసిస్‌లో భాగంగా ఈ కథలను సబ్మిట్ చేయగానే పుస్తకం పని మొదలెడతాను. ప్రపంచ సాహిత్యంలో చాలా మంచి రచనలు వస్తున్నాయి. మన దేశం నుంచి అరుంధతి రాయ్ శైలి నాకు బాగా నచ్చుతుంది’ అందామె.సాహిత్యాన్ని ఒక చదువుగా... రచనను ఒక ఉపాధిగా చేసుకోదలిచింది సంజన. -
మిస్ టీన్ గ్లోబల్ ఇండియా విజేత సంజన
చంద్రగిరి (తిరుపతి జిల్లా): జైపూర్‌లో స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్‌కి చెందిన ది పేజెంట్ స్టార్ మిస్ టీన్ ఇండియా నిర్వహించిన ఈవెంట్ మిస్ టీన్ గ్లోబల్ ఇండియా–2024 టైటిల్‌ను చంద్రగిరికి చెందిన ఆలత్తూరు పావని, సుబ్రమణ్యం కుమార్తె సంజన వరద(18) గెలుచుకున్నారు. ఈ నెల 7–12 వరకు మలేసియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన మిస్ టీన్ గ్లోబల్–2024 పోటీలో భారత్‌కు సంజన వరద ప్రాతినిథ్యం వహించింది.ఈ పోటీల్లో ఆమె 1వ రన్నరప్‌గా నిలిచింది. సంజన బెంగళూరులో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతూ గతంలో జాతీయస్థాయిలో అవార్డును గెలుచుకుంది. ఈ ప్రతిష్టాత్మక విజయంతోపాటు, సంజన వరద సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ అవార్డు, పాపులర్ అవార్డును కూడా అందుకుంది. ఇంకా ఆమె తన పిత్తా ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు సహాయం చేయడంలో చేసిన కృషికి అత్యుత్తమమైన దాతృత్వ అవార్డుతో గ్లోబల్ సంస్థ సత్కరించింది. అంతర్జాతీయ స్థాయిలో మిస్ ఇండియా కీరీటాన్ని సాధించడమే తన ధ్యేయమని, దానికోసమే కష్టపడతానని స్టార్ మిస్ టీన్ ఇండియా గ్రహీత సంజన వరద అన్నారు. -
కేరాఫ్ క్లాసిక్ బ్యూటీ.. 'సంజనా బత్రా'!
పేరు.. సంజనా బత్రా హోమ్ టౌన్ అండ్ వర్క్ ప్లేస్ రెండూ కూడా ముంబయే! ఎడ్యుకేషన్ .. యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో స్క్రీన్ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో మాస్టర్ డిగ్రీ. మరి ఫ్యాషన్ రంగంలో.. నో ఫార్మల్ ఎడ్యుకేషన్. ఫ్యాషన్ మీదున్న ఆసక్తే ఆమెను స్టార్ స్టయిలిస్ట్‌ని చేసింది. పర్సనల్ స్టయిల్.. Classic, Chic.. eclectic! వర్క్ డిస్క్రిప్షన్.. fast-paced, challenging and creatively satisfying.ప్రకృతైనా.. కళాఖండమైనా.. చివరకు చక్కటి డ్రెస్ అయినా.. ఇలా కంటికింపుగా ఏది కనిపించినా మనసు పారేసుకునేదట సంజనా.. చిన్నప్పటి నుంచీ! వాళ్ల నాన్నమ్మ వార్డ్ రోబ్‌లో చున్నీలు, ఆమె డ్రెసింగ్ టేబుల్లో నెయిల్ పాలిష్, లిప్‌స్టిక్‌ల కలెక్షన్స్ ఉండేవట. వాటితో తన చెల్లెలిని ముస్తాబు చేసేదట సంజనా. అది చూసి ఇంట్లోవాళ్లంతా మెచ్చుకునేవారట. ఆ ఈస్తటిక్ సెన్స్ పెరగడానికి సెలవుల్లో కుటుంబంతో కలసి చేసిన యూరప్ ట్రిప్సే కారణం అంటుంది ఆమె.అక్కడ తనకు పరిచయం అయిన ఫ్యాషన్ ప్రపంచం తన మీద చాలా ప్రభావం చూపిందని చెబుతుంది. అయితే అది ఒక ప్యాషన్గానే ఉంది తప్ప దాన్నో కెరీర్‌గా మలచుకోవాలనే ఆలోచనెప్పుడూ రాలేదట. కానీ క్రియేటివ్ రంగంలోనే స్థిరపడాలనే తపన మాత్రం మెండుగా ఉండిందట. అందుకే లండన్‌లో ఫిల్మ్ స్టడీస్ చేసింది. స్వదేశానికి తిరిగొచ్చాక అడ్వరై్టజింగ్ ప్రొడక్షన్ హౌస్‌లో పని చేయడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే స్టయిలింగ్ మీద ఆమె దృష్టి పడింది.బ్యూటీ అండ్ లైఫ్‌స్టయిల్‌కి సంబంధించిన ఒక వెబ్ మ్యగజైన్కి ఎడిటర్‌గానూ వ్యవహరించసాగింది. ఆ సమయంలోనే హృతిక్ రోషన్ నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమా (ప్రొడక్షన్లో)కి పనిచేసే ఆఫర్ వచ్చింది. స్టయిలింగ్‌ని ఇంకా లోతుగా పరిశీలించే అవకాశం దొరికిందని హ్యాపీగా ఒప్పుకుంది. స్టయిలింగ్ మీద పూర్తి అవగాహనను తెచ్చుకుంది కూడా! ఆ సినిమా అయిపోయాక సెలబ్రిటీ స్టయిలిస్ట్‌ల దగ్గర అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తులు పెట్టుకుంది. వాళ్ల దగ్గర్నుంచి ఎలాంటి స్పందన రాలేదు కానీ.. ‘బాలీవుడ్ నటి నర్గిస్ ఫక్రీ పర్సనల్ ఫొటో షూట్ ఉంది.. ఆమెకు స్టయిలింగ్ చేయగలవా?’ అంటూ ఓ కాల్ వచ్చింది.ఎదురుచూస్తున్న ఆపర్చునిటీ దరి చేరినందుకు ఆనందం.. ఆశ్చర్యం.. అంతలోనే సంశయం.. చేయగలనా అని! ‘గలను’ అనే ఆత్మవిశ్వాసంతో ఆ చాన్స్‌ని తీసుకుంది. అక్కడి నుంచి ఆ జర్నీ మొదలైంది. ఆమె వర్క్‌కి ఎందరో సెలబ్రిటీలు ఇంప్రెస్ అయ్యారు. తమ స్టయిలిస్ట్‌గా సంజనాను అపాయింట్ చేసుకున్నారు. వాళ్లలో ఆలియా భట్, ప్రాచీ దేశాయ్, శిల్పా శెట్టి, పరిణీతి చోప్రా, కల్కి కోశ్చిలిన్, హుమా కురేశీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి ఎందరో నటీమణులున్నారు. వీళ్లంతా ఏ చిన్న వేడుకకైనా సంజనా మీదే డిపెండ్ అవుతారు. హెడ్ టు టో వరకు వీళ్లను ఆమె అలంకరించాల్సిందే!"ఫ్యాషన్ అండ్ స్టయిల్‌కి చాలా ఇంపార్టెంట్ ఇస్తాను. అవి మన ఇండివిడ్యువాలిటీ, పర్సనాలిటీలను రిఫ్లెక్ట్ చేస్తాయి. నా దృష్టిలో స్టయిలిష్ స్టార్ అంటే అనుష్క శర్మనే. నేను స్టయిలింగ్ చేసే సెలబ్రిటీల్లో మాత్రం నాకు శిల్పా శెట్టి, పరిణీతి అంటే ఇష్టం!" – సంజనా బత్రా -
డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో అప్పుడెప్పుడో భానుమతి.. ఆ తర్వాత సావిత్రి .. ఆపై విజయ నిర్మల.. ఆ తర్వాత బి జయ.. ఇలా తరానికి ఒక్క లేడీ డైరెక్టర్ కనిపిస్తుంటారు. ఏ ఇండస్ట్రీలో అయినా అంతే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది. ఇప్పుడిప్పుడే మహిళా డైరెక్టర్స్ చాలా మంది వస్తున్నారు. మెగా ఫోన్ పట్టి తమ సత్తా చూపిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో కొందరు లేడీ డైరెక్టర్స్ వచ్చి సత్తా చూపించారు. విజయాలు కూడా అందుకున్నారు. అలా మొదలైంది, కల్యాణ వైభోగమే, ఓ బేబీ సినిమాలను డైరెక్ట్ చేసిన నందిని రెడ్డి మంచి దర్శకురాలిగా గుర్తింపు సాధించారు. అలాగే 2021లో ‘వరుడు కావలెను’ సినిమాతో లక్ష్మీ సౌజన్య... ఆ తర్వాత విడుదలైన ‘పెళ్లి సందD’ సినిమాతో గౌరీ డైరెక్టర్స్‌గా రాణించారు. తాజాగా పలు సినిమాల్లో హీరోయిన్గా నటించిన సంజన అన్నే కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నారు. సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో తెరకెక్కబోతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంజన అన్నే దర్శకత్వం వహిస్తున్నారు .కాగా.. సంజన అన్నే గతంలో నేనే రాజు నేనే మంత్రి, నీకు నాకు పెళ్లంట టామ్ టామ్ లాంటి చిత్రాల్లో నటించింది. -
'హి' చిత్రం విజయం సాధించాలి: మంత్రి హరీశ్ రావు
బిగ్‌బాస్ ఫేమ్ సంజన అన్నే ప్రధాన పాత్రలో నటించిన నటించిన తాజా చిత్రం ‘ హి (హంట్స్ ఎవ్రివన్)’. అర్జున్ ఆర్య, రాగినమ్మ, శివ, రసూల్, సంజయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాస్ ఎం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డబ్ల్యూఎంబి పిక్చర్స్ బ్యానర్ పై సుస్మ సుందర్ నిర్మించారు.తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'హి' చిత్రం అందరికి నచ్చాలని, ఈ సినిమాతో చిత్రంలో పనిచేసిన నటీనటులకు సాంకేతిక నిపుణులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘‘హి’లో హారర్ తో పాటు థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి, అలాగే ఆడియన్స్ సస్పెన్స్ అయ్యే ఎపిసోడ్స్ ఈ మూవీలో ప్రేత్యేకం’అని చిత్రబృందం పేర్కొంది. -
అందాల పోటీల్లో మెరిసిన చంద్రగిరి సంజన..
చంద్రగిరి (తిరుపతి రూరల్): జాతీయ స్థాయి అందాల పోటీల్లో చంద్రగిరి యువతి మెరిసింది. ఈ నెల 16న జైపూర్‌లో జరిగిన ‘స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియా–2023’ పోటీలలో చంద్రగిరికి చెందిన సంజన మిస్ ఇండియా కిరీటం కైవశం చేసుకుంది. కాగా, ఫైనల్స్‌లో 47 మంది పాల్గొనగా.. వారిలో స్టార్ మిస్ టీన్ గ్లోబ్ ఇండియాగా సంజన ఎంపికైంది. ఆ వివరాలను ఆమె తల్లిదండ్రులు గురువారం మీడియాకు తెలిపారు. చంద్రగిరి మాజీ ఎంపీటీసీ అల్లతూరు మోహన్ మనమరాలైన సంజన మోడలింగ్‌పై మక్కువ పెంచుకుంది. 2023 మేలో బెంగళూరులో ప్రిలిమినరీ రౌండ్లో 300 మందికి పైగా బాలికలు జూమ్ కాల్లో పాల్గొనగా.. ఫైనల్స్‌కు 57 మంది ఎంపికయ్యారు. వారిలో సంజన ఒకరు. ఈ నెల 16 నుంచి జైపూర్‌లో జరిగిన గ్రాండ్ ఫైనల్లో 47 మంది పాల్గొనగా.. వారిలో సంజన మొదటి స్థానం పొందింది. ఇది కూడా చదవండి: మీ ఓటు ఉందా?.. చెక్ చేసుకోండి -
స్వీట్ ఎక్స్పెరిమెంట్: పరిశోధనత్రయం
3డీ బయో ప్రింటెడ్ హ్యూమన్ మోడల్స్ రూపకల్పనకు గాను ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలకు ‘బెస్ట్ రీసెర్చ్’ అవార్డు వచ్చింది. సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఉదయ్ సక్సేనా, డాక్టర్ సుబ్రహ్మణ్యం వంగల పర్యవేక్షణలో యువ శాస్త్రవేత్తలు శరణ్య, అర్పిత రెడ్డి, ఆర్. ఎన్, సంజన బత్తుల సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ఇది. వీళ్లు టైప్ 2 డయాబెటిస్ డ్రగ్‌ను టెస్ట్ చేసే త్రీడీ బయో ప్రింటెడ్ హ్యూమన్ లైక్ టైప్ 2 డయాబెటిస్ మోడల్ని డెవలప్ చేశారు. అలానే టైప్ 2 డయాబెటిస్ నివారణకు అవసరమైన సప్లిమెంట్‌ను కూడా రూపొందించారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలు సాక్షితో పంచుకున్న వివరాలివి. దాదాపుగా ప్రతి సృష్టి మానవ దేహభాగాలను పోలిన మోడల్స్‌ను సృష్టించి వాటి మీద ఔషధాల పని తీరును పరిశీలించడం ద్వారా సత్వర ఫలితాలను సాధించవచ్చని నిరూపించారు ఈ యంగ్ సైంటిస్ట్‌లు. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. కోవిడ్‌ను నియంత్రించడానికి తయారు చేసిన మందులు ఎలా పని చేస్తున్నాయోనని నిర్ధారణ చేసుకోవడానికి జంతువుల మీద ప్రయోగించి తెలుసుకునే సమయం లేకపోయింది. ఒక ఔషధం ప్రయోగ దశలన్నీ పూర్తి చేసుకుని మార్కెట్లోకి రావడానికి సంవత్సరాలు పడుతుంది. కోవిడ్ సమయంలో అంత సమయం లేదు. అప్పుడు ఈ త్రీడీ బయోప్రింటెడ్ హ్యూమన్ లైక్ మోడల్ బాగా ఉపయోగపడింది. అలాగే ఇదే టెక్నాలజీ ఆధారంగా టైప్ 2 డయాబెటిస్ డ్రగ్ చూపిస్తున్న ప్రభావాన్ని యాక్యురేట్‌గా తెలుసుకునే విధంగా హ్యూమన్‌లైక్ టైప్ 2 డయాబెటిస్ మోడల్ని డెవలప్ చేశారు. ప్రస్తుతం ఈ యంగ్ సైంటిస్ట్‌లు ముగ్గురూ రీసెర్చ్ అసోసియేట్లుగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లో ఇన్క్యుబేషన్ సెంటర్లోని రీజెనె ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పరిశోధనలు చేస్తున్నారు. ‘‘హెల్త్ సైన్సెస్‌లో పరిశోధనల అవసరం చాలా ఉంది. కోవిడ్ పాండమిక్ సమయంలో హ్యూమన్‌లైక్ మోడల్ ఆవశ్యకత తెలిసింది. మా పరిశోధనలో త్రీడీ బయో ప్రింటెడ్ హ్యూమన్ వాస్క్యులార్ లంగ్ మోడల్ తర్వాత టైప్ టూ డయాబెటిస్ మోడల్ మీద దృష్టి పెట్టాం. దాదాపుగా ఏడాది పాటు జరిగిన ప్రయోగం ఇది. ఒక వ్యక్తి డయాబెటిక్ దశకు చేరకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలిగిన విధంగా ఈ న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్‌ని రూపకల్పన చేయడంలో సక్సెస్ అయ్యాం. సమాజానికి అవసరమైన పని చేశామనే సంతృప్తి కలుగుతోంది’’ అన్నారు సంజన. ఆమెరికాలో పుట్టిన తెలుగమ్మాయి సంజన. గ్రాడ్యుయేషన్ యూఎస్‌లోని యూసీ డేవిస్‌లో పూర్తి చేసి హైదరాబాద్‌లో పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. సంజన బత్తుల ‘‘సాధారణంగా జంతువుల మీద ప్రయోగం చేసి ఆ తర్వాత మనుషుల మీద క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. ఒక ఔషధం ఇలా అన్ని దశలూ పూర్తి చేసుకోవడానికి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది. అంతే కాదు, కొన్ని సందర్భాల్లో జంతువుల్లో మంచి ఫలితాలనిచ్చిన డ్రగ్ మనుషులలో అంత కచ్చితంగా పని చేయకపోవచ్చు కూడా. మేము రూపొందించిన ప్రయోగంలో హ్యూమన్ లైక్ డిసీజ్ మోడల్స్‌ని డెవలప్ చేసి వాటి మీద ఔషధాన్ని ప్రయోగించాం. దాంతో రిజల్ట్ త్వరగా తెలుసుకోగలిగాం. అలాగే టైప్ టూ డయాబెటిస్ మోడల్లో వివిధ రకాల యాంటీ డయాబెటిక్ డ్రగ్స్‌తోపాటు డివిటిజ్ అనే న్యూట్రాస్యుటికల్ సప్లిమెంట్‌ని కూడా ప్రయోగించి చూశాం. ఈ న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్ కండరాల్లో గ్లూకోజ్ స్వీకరణకు పనిచేస్తుంది. క్లినికల్ ట్రయల్స్ కూడా మంచి ఫలితాలనిచ్చాయి. ఈ సప్లిమెంట్ మార్కెట్లోకి వచ్చి ఐదు నెలలైంది’’ అని చెప్పారు అర్పిత రెడ్డి. ఆమెది వ్యవసాయ కుటుంబం. కర్నాటకలోని కోలార్ జిల్లా, శ్రీనివాసపుర తాలూక, రాయల్పాడు గ్రామం. మైసూర్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ, బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్‌లో సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ డయాగ్నస్టిక్స్‌లో పీజీ డిప్లమో చేశారు. అర్పిత రెడ్డి, ఆర్. ఎన్ టైప్ వన్ జన్యుకారణాలతో వస్తుంది. టైప్ టూ డయాబెటిస్ మన దగ్గర లైఫ్ స్టయిల్ డిసీజ్‌గా మారిపోయింది. డయాబెటిక్ కండిషన్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. ఒక వ్యక్తి డయాబెటిస్ కండిషన్‌కి రావడానికి ముందు కొంతకాలం ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉంటారు. ఆ దశలో తెలుసుకోగలిగితే దేహానికి జరిగే నష్టాన్ని నివారించవచ్చు. అందుకే మేము కండరాల కణజాలం మీద పని చేసే సప్లిమెంట్ మీద దృష్టిపెట్టాం’’ అని చెప్పారు శరణ్య. ఆమెది కేరళ రాష్ట్రంలోని కన్నూరు. మంగుళూరు యూనివర్సిటీ నుంచి బయో కెమిస్ట్రీలో పీజీ, ప్రోటియోమిక్స్లో పీజీ డిప్లమో చేశారు. శరణ్య – వాకా మంజులారెడ్డి -
సాఫ్ట్వేర్ జాబ్ వదులుకుని వచ్చా: ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ హీరోయిన్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ మూవీతో టాలీవుడ్‌కు పరిచమైన బ్యూటీ సంజన ఆనంద్. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా మూవీ సక్సెస్ నేపథ్యంలో సంజన ఆనంద్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘నేను పుట్టి పెరిగింది బెంగుళూరులోనే. నా మాతృభాష కన్నడ. నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను. సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా రెండేళ్లు జాబ్ కూడా చేశాను. మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే ఇష్టం. నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. చదవండి: ‘సీతారామం’ మూవీపై ‘ది కశ్మీర్ ఫైల్స్ ’డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు మంచి జాబ్ వదులుకుని వెళ్లడం ఎందుకని మా పేరెంట్స్ అన్నారు. కానీ ఇక్కడ ఎంతో కొంత సాధించాలనే పట్టుదలతోనే వచ్చాను’ అని తెలిపింది. అలాగే ‘‘నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమాలో నా పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కొత్తగా వచ్చిన హీరోయిన్స్‌కి ఇలాంటి రోల్స్ దొరకడం కష్టం. నా నటన బాగుందని అందరు అంటుంటే చాలా సంతోషంగా ఉంది. అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. కొన్ని కథలు నా దగ్గరికి వచ్చాయి. అవి ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చింది. అనంతరం గ్లామర్ షోపై ఆమె స్పందిస్తూ.. కథకి అవసరమైనంత వరకు స్కిన్ షో చేయడానికి రెడీ కానీ, అంతకు మించిన పరిధిని దాటేది మాత్రం లేదని తేల్చి చెప్పంది. -
Miss India USA 2022: మిస్ ఇండియా యూఎస్–2022 రన్నరప్‌గా సంజన
సాక్షి, పశ్చిమగోదావరి(పెనుగొండ): అమెరికా న్యూజెర్సీలో జరిగిన మిస్ ఇండియా యూఎస్–2022 పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రుకు చెందిన చేకూరి సంజన రెండో రన్నరప్‌గా నిలిచింది. బుధవారం రాత్రి విజేతలను ప్రకటించగా, ఆ వివరాలను శుక్రవారం పెనుగొండ మండల సర్పంచ్ల చాంబర్ అధ్యక్షురాలు దండు పద్మావతి మీడియాకు వెల్లడించారు. తన సోదరుడు చేకూరి రంగరాజు, మధు దంపతుల కుమార్తె అయిన సంజన ఎంఎస్ చదువుతూ పోటీల్లో పాల్గొందని, గత 20 ఏళ్లుగా వారు అమెరికాలో ఉంటున్నట్టు తెలిపారు. (క్లిక్: ఆర్య వల్వేకర్... మిస్ ఇండియా–యూఎస్ఏ) చదవండి: (Thopudurthi Prakash Reddy: శ్రీరామ్.. నోరు జాగ్రత్త) -
ఆర్య వల్వేకర్... మిస్ ఇండియా–యూఎస్ఏ
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ యువతి ఆర్య వల్వేకర్(18) మిస్ ఇండియా యూఎస్ఏ–2022 గెలుచుకున్నారు. వర్జీనియాకు చెందిన ఆర్య న్యూజెర్సీలో జరిగిన 40వ వార్షిక పోటీలో మిస్ఇండియా యూఎస్ఏ కిరీటం గెలుచుకుంది. సౌమ్య శర్మ, సంజన చేకూరి రన్నరప్‌లుగా నిలిచారు. సినిమాల్లోకి రావాలన్నది తన స్వప్నమని ఆర్య వల్వేకర్ ఈ సందర్భంగా చెప్పారు. ‘నన్ను నేను వెండితెరపై చూసుకోవాలని.. సినిమాలు, టీవీల్లో నటించాలనేది నా చిన్నప్పటి కల’ అని పీటీఐతో ఆమె అన్నారు. 18 ఏళ్ల ఆర్య వల్వేకర్.. వర్జీనియాలోని బ్రియార్ వుడ్స్ హై స్కూల్లో చదువుకున్నారు. మానసిక ఆరోగ్యం, బాడీ పాజిటివిటీ హెల్త్‌పై ఆసక్తి కనబరిచే ఆమె పలు అవగాహనా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. యుఫోరియా డాన్స్ స్టూడియోను స్థాపించి స్థానికంగా పిల్లలకు డాన్స్ నేర్పిస్తున్నారు. కొత్త ప్రదేశాల పర్యటన, వంట చేయడం, చర్చలు.. తనకు ఇష్టమైన వ్యాపకాలని వెల్లడించారు. యోగా చేయడం తనకు ఇష్టమన్నారు. ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులు, చెల్లెలితో గడపడంతో పాటు... స్నేహితుల కోసం వంటలు చేస్తుంటానని చెప్పారు. ఇక పోటీల విషయానికొస్తే... మిస్ ఇండియా–యూఎస్ఏతో పాటు మీసెస్ ఇండియా, మిస్ టీన్ ఇండియా –యూఎస్ఏ కాంపిటేషన్స్ జరిగాయి. అమెరికాలోని 30 రాష్ట్రాలకు చెందిన 74 మంది పోటీదారులు వీటిలో పాల్గొన్నారు. వాషింగ్టన్కు చెందిన అక్షి జైన్ మిసెస్ ఇండియా యూఎస్ఏ, న్యూయార్క్‌కు చెందిన తన్వీ గ్రోవర్ మిస్ టీన్ ఇండియా యూఎస్ఏగా నిలిచారు. (క్లిక్: భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్ మనసులో మాట) -
ఇలాంటి చిత్రాలు భావితరాలకు అవసరం
‘‘ప్రజలను చైతన్యవంతులను చేయాలనే మంచి కాన్సెప్ట్‌తో తీస్తున్న ‘సాచి’ సినిమా పెద్ద విజయం సాధించాలి. ఇలాంటి సినిమాలు భావితరాలకు అవసరం’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సంజన, మూలవిరాట్ అశోక్ రెడ్డి ప్రధాన పాత్రల్లో వివేక్ పోతిగేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సాచి’. సత్యానంద్ స్టార్ మేకర్స్ సమర్పణలో ఉపేన్ నడిపల్లి, వివేక్ పోతిగేని నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సత్యానంద్ మాస్టర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్లాప్ కొట్టారు. నిర్మాత రామ్మోహన్ రావు గౌరవ దర్శకత్వం వహించారు. వివేక్ పోతిగేని మాట్లాడుతూ– ‘‘ఖమ్మంలో జరిగిన వాస్తవ ఘటనతో ‘సాచి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను’’ అన్నారు. ‘‘తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో నిర్మిస్తున్నాం’’ అన్నారు ఉపేన్ నడిపల్లి. ఈ చిత్రానికి సంగీతం: వి. భరద్వాజ్. -
నీరజ్‌ను చంపినవాళ్లను అరెస్ట్ చేశాం: డీసీపీ జోయల్ డేవిస్
హైదరాబాద్: సరూర్ నగర్ ఘటన తరహాలోనే సంచలనం సృష్టించింది చర్చనీయాంశంగా మారింది బేగంబజార్ పరువు హత్య. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు నగర వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. శనివారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. కేసు పురోగతి వివరాలను వెల్లడించారు. ఈ ఉదంతంలో మధ్యవర్తుల ద్వారా నిందితులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించినట్లు తెలిపిన డీసీపీ.. గంటల వ్యవధిలోనే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గతేడాది ఏప్రిల్‌లో సంజన, నీరజ్ పన్వార్‌లు షంషీర్‌గంజ్‌లోని సాయిబాబా ఆలయంలో ప్రేమపెళ్లి చేసుకున్నారు. వీళ్ల వివాహం పెద్దలకు ఇష్టం లేదు.. ఒప్పుకోలేదు. దీంతో వీళ్లిద్దరూ ఫలక్‌నుమాలోని షంషీర్‌గంజ్‌లో కాపురం పెట్టారు. నీరజ్ వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో సంజన బంధువులు నీరజ్‌పై కక్ష పెంచుకున్నారు. తాగిన మైకంలో ఈ నేరం చెయ్యాలి అని అనుకున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతాలో హైదరాబాద్ బేగంబజార్ మార్కెట్ వద్ద నీరజ్ పన్వర్ అలియాస్ బంటీపై హత్యకు స్కెచ్ గీశారు. నీరజ్ తన తాతయ్యతో కలిసి బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్తుండగా యాదగిరి గల్లి, చేపల మార్కెట్ వద్ద అతడిని ఆపి కత్తులు, బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావానికి గురై ఓజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు నీరజ్. నిందితులను.. అభినందన్ యాదవ్, విజయ్ యాదవ్, సంజయ్ యాదవ్, రోహిత్ యాదవ్, మహేష్ అహీర్ యాదవ్‌తో పాటు ఒక మైనర్ కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నీరజ్‌ను ఆరుగురు కలిసే చంపారని డీసీపీ వెల్లడించారు. నగర సీపీ ఆదేశాల మేరకు ఏడు బృందాలను ఏర్పాటుచేయగా.. షాహినాయత్‌గంజ్ పోలీసులు 24 గంటల్లో నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. -
పెళ్లైనప్పటి నుంచి మాటలు లేవు.. నా భర్తను చంపింది వాళ్లే: నీరజ్ భార్య
సాక్షి, హైదరాబాద్: తన భార్తను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడు నీరజ్ భార్య సంజన కోరారు. నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. కాగా బేగంబజార్‌కు కోల్సివాడికి చెందిన నీరజ్ పన్వార్ (21) శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో నలుగురు దుండగులు కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. తాతతో కలిసి నీరజ్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చేపల మార్కెట్ సమీపంలో మాటేసిన దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడి చేసి.. కత్తులతో పొడిచి చంపారు. వేరే కులానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నందుకే యువతి కుటుంబ సభ్యులు కక్ష పెంచుకుని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇటీవల సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యను మరువక ముందే చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది ఈ ఘటనపై నీరజ్ భార్య స్పందిస్తూ.. వివాహం అయినప్పటి నుంచీ వారి నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయని చెప్పారు. తన కజిన్ విజయ్, సంజులే ఈ హత్య చేశారని, మరో ముగ్గురుతో కలిసి ఈ దారుణానికి తెగబడ్డారని తెలిపింది. వారి నుంచి తనకు, తన అత్త, మామలకు కూడా ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. నీరజ్‌తో పెళ్లి అయినప్పటి నుంచి వారితో సంబంధాలు లేవని తెలిపింది. ‘నేను వివాహం చేసుకున్న తర్వాత నా బిడ్డ చనిపోయింది అని వారు నన్ను వదిలేశారు. కానీ వాళ్లు ఇప్పుడిలా చేయడం వల్ల నాకు అన్యాయం జరిగింది’ అంటూ సంజన వాపోయింది. ఇక వ్యాపారి నీరజ్ పన్వార్ హత్యను నిరసిస్తూ బేగంబజార్ వ్యాపారులు మార్కెట్ బంద్ పాటిస్తున్నారు. నీరజ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారవేత్తలందరూ ఈ హత్యను ఖండిస్తున్నామని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను శిక్షించాలని కోరుతున్నారు. పోలీసులు వేగంగా స్పందించిన నిందితులను అరెస్ట్ చేయడంపై కృతజ్ఞతలు తెలిపిన వ్యాపారులు వారికి త్వరగా శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడితేనే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగవని చెబుతున్నారు. తన కుమారుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడు నీరజ్ పన్వార్ తండ్రి జగదీష్ ప్రసాద్ పన్వార్ డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం , కమిషనర్ ఆఫ్ పోలీస్ తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. చదవండి: పురిటి నొప్పులతో ఆసుపత్రికి.. అమ్మతనం ఆస్వాదించకుండానే.. -
స్వల్ప బడ్జెట్‌తో స్త్రీలకు లోకం చూపిస్తోంది!
అమ్మాయ్ వెళ్దామా... వదినా వెళ్దామా... పొరుగింటి పిన్నిగారూ వెళ్దామా.. ఇరుగింటి లక్ష్మిగారూ రెడీనా... కేవలం ఆడవాళ్లు మాత్రమే కలిసి పర్యటనలు చేస్తే ఎలా ఉంటుంది? మగవాళ్ల అదుపు, ఆజమాయిషీ, అనవసర కేరింగ్ లేకుండా స్వేచ్ఛగా తాము మాత్రమే రెక్కలు ధరిస్తే ఎలా ఉంటుంది? కేరళకు చెందిన సజనా అలీకి ఈ ఆలోచనే వచ్చింది. ‘అప్పూపత్తాడి’ (దూదిపింజె పురుగు) పేరుతో లేడీస్ ఓన్లీ ట్రావెల్ గ్రూప్న నడుపుతూ స్వల్ప బడ్జెట్‌తో స్త్రీలకు లోకం చూపిస్తోంది. ఆడవారి భ్రమణకాంక్షకు ఇది బెస్ట్ టూర్ టికెట్. కిచెన్లోనే ఉండిపోతున్నారా? ఆఫీస్ పనితోనే సరిపోతోందా? ఎక్కడికైనా కదులుదామంటే భర్తగారికి వీలవుతుందో కాదో. పిల్లలు పరీక్షలు అంటారో ఏమో. లేకుంటే ‘ఇప్పుడు ఏం అవసరం. ఓటిటిలో సినిమా చూసి పడుకోక’ అనొచ్చు కదా. ఏడ్చినట్టుంది. లోకం అంటే ఇదేనా. ఇంతేనా? ఉదాహరణకు వీటిలో ఎన్ని చూసి ఉంటారు మీరు? లక్నో, అలహాబాద్, గయా, పాట్నా, వారణాసి, గౌహతి, కోల్కటా ఆఖరున మేఘాలయా. వీటిలో నిజంగా ఎన్ని చూసి ఉంటారు మీరు. సజనా అలీని కలిస్తే ఇవన్నీ మిమ్మల్నో 15 రోజుల ట్రిప్పులో చూపించేస్తుంది. ఖర్చు? చాలా తక్కువ. తోడు? మొత్తం ఆడవాళ్లే. అక్కడా అక్కడా అక్కడా... లోకం చూడాలనుకుని తపించే స్త్రీలు... వారు గృహిణులు కావచ్చు, ఉద్యోగినులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు... ఒక గ్రూప్‌గా బయలుదేరి వెళతారు. సజనా అలీ మొత్తం ఏర్పాట్లు చేస్తుంది. కొత్త దోస్తులు... కొత్త లోకం... ఇంతకు మించి ఆనందం ఏముంటుంది? లోకం చూడకుండా కళ్లుండి గంతలు కట్టుకుంటామా? ∙∙ దూదిపింజె పురుగును మనం చూసి ఉంటాం. తేలిగ్గా సన్నటి దారాల ఒంటితో గాలిలో అలా తేలుతూ వెళుతుంటుంది. గాలి ఎటు వీస్తే అటు దాని పయనం. హాయిగా వెళుతూ ఉండటమే. సజనా అలీ 2016లో మొదలెట్టిన ట్రావెల్ సంస్థ పేరు కూడా అదే... మలయాళంలో ‘అప్పుపత్తాడి’ అని. కోజికోడ్‌కు చెందిన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ ఉద్యోగం మానేసి కేవలం టూర్ ఆపరేషన్స్‌తో ఉపాధి పొందుతోంది. ఇందులో రెండు సంతృప్తులు. ఒకటి తాను తిరగగలుగుతోంది. రెండు తన వంటి స్త్రీలను తిప్పగలుగుతోంది. ‘మా నాన్న లారీ డ్రైవర్. తాను వెళ్లిన చోటు గురించి వచ్చి ఇంట్లో చెబుతుండేవాడు. నేనూ వస్తాను అంటే తీసుకెళ్లేవాడు కాదు... ఆడపిల్లలకు వాష్‌రూమ్ సౌకర్యాలు ఉండవని. కాని ఎప్పుడైనా ఒకరోజు దూరం ట్రిప్పులు వెళుతుంటే తీసుకెళ్లి తెచ్చేవాడు. నాకు చాలా సంతోషం వేసేది. పెద్దదాన్నయి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాక ఒకసారి అందరం విమెన్ కొలిగ్స్‌తో ఒరిస్సా టూర్ ప్లాన్ చేశాను. 2015లో. ఎనిమిది మంది వస్తామన్నారు. తీరా బయల్దేరే సమయానికి ఎవరూ రాలేదు. నేనొక్కదాన్నే మిగిలాను. కాని నేను ఆగలేదు. ఒక్కదాన్నే బయలుదేరి 8 రోజుల పాటు తిరిగి ఆ విశేషాలు ఫేస్బుక్లో పెట్టాను. అవి చూసి ఎవరైతే రాము అన్నారో వాళ్లంతా ఈసారి పిలూ వస్తాం అన్నారు. ఆ ఉత్సాహంతో కేరళలోనే కొల్లం జిల్లాలో ఉండే రోసెమలా అనే ట్రెక్కింగ్‌కి ప్లాన్ చేశాను. 20 మంది వస్తామని ఎనిమిది మంది తేలారు. ఆ 8 మందిమే ఒక జీప్ తీసుకుని వెళ్లాం. వచ్చిన వాళ్లంతా బాగా ఎంజాయ్ చేశారు. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన– ఎందుకు కేవలం స్త్రీల కోసమే ట్రిప్స్ ప్లాన్ చేయకూడదు? అని. ఇక ఉద్యోగం మానేసి ‘అప్పుపత్తాడి’ ట్రావెల్ సంస్థను ప్రారంభించాను’ అంటుంది సజనా అలీ. ∙∙ సజనా అలీ చేసిన ఈ ఆలోచనలో ఒక మేలు, ఒక ఇబ్బంది ఉన్నాయి. మేలు ఏమిటంటే కుటుంబంతో మాత్రమే ప్రయాణం చేయాలనుకునే స్త్రీలు ఆ తప్పనిసరిని వదులుకుని ‘తోడు మహిళలు ఉన్నారు’ అని చెప్పి టూర్లకు రాగలగడం. ఇబ్బంది ఏమిటంటే.. అందరూ ఆడవాళ్లే అయితే సేఫ్టీ సంగతి ఏమిటి? అనే ప్రశ్న తలెత్తడం. ‘సేఫ్టీ గురించి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఎక్కడెక్కడ బస చేయాలో ఏ రూట్లో వెళ్లాలో పక్కా ప్లాన్ చేసుకుంటాం. స్త్రీలకు తమ జాగ్రత్త తమకు తెలుసు. ఏ ఇబ్బందీ లేదు’ అంటుంది సజనా అలీ. అయితే ఈ జాగ్రత్త కంటే కూడా ఆమె శ్రద్ధ పెట్టే విషయం– బడ్జెట్. ‘ఎక్కువ మంది స్త్రీలు మిడిల్ క్లాస్ నుంచి ఉంటారు. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి తిరగడం వారికి వీలు కాదు. అందుకే వీలైనంత తక్కువ ఖర్చులో వారిని తిప్పి చూపించడానికి నేను ప్రాధాన్యం ఇస్తాను. ఆ మేరకు రూములు, రెస్టరెంట్లతో టై అప్ చేసుకుంటాను’ అంటుంది సజనా అలీ. సజనా అలీ కేరళ కేంద్రంగా పని చేస్తూ దేశమంతా విమెన్ ఓన్లీ టూర్లు నిర్వహిస్తోంది. తాజాగా తన ఫేస్బుక్ పేజీలో ధనుష్కోటికి వెళ్లిన బృందం ఫొటో పెట్టి ‘338వ ట్రిప్’ అని పోస్ట్ చేసింది. అంటే గత ఐదేళ్లలో ఆమె 338 విమెన్ ఓన్లీ టూర్లు ఆపరేట్ చేసింది. ఎంత లేదన్నా ఐదు వేల మంది స్త్రీలు దేశంలోని రంగు రంగుల ప్రాంతాలను, సంస్కృతులను ఆమె పుణ్యాన దర్శించి ఉంటారు. రోజువారీ రొడ్డకొట్టుడు నుంచి బయటపడటానికి కొద్ది మంది గృహిణులు కలిసి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవడం ఇటీవలి సినిమాల్లో కనిపిస్తోంది. ఆ సినిమాల కంటే ముందే సజనా అలీ స్త్రీలకు ప్రకృతి సినిమా చూపిస్తోంది. అలాంటి వారి స్ఫూర్తితో ఈ కోవిడ్ గోల తగ్గాక మీరూ రెక్కలు కట్టుకుని తోటి మిత్రులతో ఎగిరెళ్లిపోండి. హ్యాపీ జర్నీ. -
Sanjana Chatlani: ఆ అక్షరాల రూపకర్త.. ఒకింత ఆశ్చర్యం, గర్వం!
రోలెక్స్, ది రిట్జ్ కార్ల్టన్, ఫ్యూచర్ గ్రూప్, గూచి, లూయీ వ్యుట్టన్, మిఖాయిల్ కోర్స్, జిమ్మీ చూ, గూగుల్ ఇండియా, ది వెడ్డింగ్ ఫిల్మర్, టాటా జోయా... ఇలా ఎన్నో ఎన్నెన్నో కంపెనీలు. ఈ పేర్లతోపాటు ఆయా కంపెనీల అక్షరరూపం కూడా కళ్ల ముందు మెదిలి తీరుతుంది. ఆ ఆక్షరాలకు ఓ రూపం పురుడు పోసుకున్నది మనదేశంలోనే. ఆశ్చర్యమే కాదు ఒకింత గర్వంగానూ ఉంటుంది మరి. ఈ అక్షరాల రూపకర్త పూనాకు చెందిన సంజన చత్లాని. ఆమె తన జీవితాన్ని అక్షరాలా అక్షరాలతోనే దిద్దుకుంది. తన కెరీర్‌ను తానే అందంగా రాసుకుంది. నిస్తేజం నుంచి ఉత్తేజం అది 2015 ఆగస్టు. సంజన చట్లాని కాలేజ్ నుంచి సమాజంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లు అవి. ఓ కార్పొరేట్ కంపెనీలో మార్కెటింగ్ అసిస్టెంట్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది. మూడున్నరేళ్ల ఉద్యోగ జీవితం ఆమెకు ఏ మాత్రం సంతృప్తినివ్వలేదు. అంతటి నిస్పృహలోనూ ఆమెకు సాంత్వన చేకూరుతున్న విషయం ఒక్కటే. కుటుంబంతో యూఎస్‌కి వెళ్లినప్పుడు లాస్ ఏంజెల్స్, శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన కాలిగ్రఫీ క్లాసులకు హాజరైంది. అప్పుడు నేర్చుకున్న కాలిగ్రఫీలో తోచిన నాలుగు అక్షరాలు రాసుకున్నప్పుడు మనసు ఆనందంగా ఉంటోంది. ‘తనను ఆనందంగా ఉంచని ఉద్యోగంలో కొనసాగడం కంటే తనకు సంతోషాన్నిస్తున్న కాలిగ్రఫీలోనే జీవితాన్ని వెతుక్కుంటే తప్పేంటి’ అనుకుంది సంజన. ఉద్యోగం మానేసి ముంబయిలో ఒక చిన్న గదిలో ‘ద బాంబే హ్యాండ్ లెటరింగ్ కంపెనీ’ సంస్థను స్థాపించింది. సాధనేలోకం సంజన సొంతంగా కంపెనీ స్థాపించిన తర్వాత ఆర్డర్ల కోసం ప్రయత్నించలేదు. అక్షరాలను అందంగా రాయడం అనే ప్రక్రియను సాధన చేయడానికే ఎక్కువ సమయం కేటాయించింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే కాలిగ్రఫీ వర్క్‌షాపులకు హాజరయ్యేది. తిరిగి వచ్చిన తర్వాత స్టూడియోలో కూర్చుని ప్రాక్టీస్ చేస్తూ టైమ్ మర్చిపోయేది. అలా రోజుకు పన్నెండు గంటల సేపు స్టూడియోలోనే గడిపిన రోజులున్నాయి. ఆ అలవాటు ఆమె కెరీర్లో బిజీ అయిన తర్వాత అంత నిడివి స్టూడియోలో పని చేయడానికి దోహదం చేసింది. ఇప్పుడు ఆమె క్లయింట్ల జాబితాలో ప్రపంచంలో అనేక ప్రఖ్యాత కంపెనీలున్నాయి. ఇంతగా పేరు వచ్చేసింది కదా అని కూడా ఆమె రిలాక్స్ కావడంలేదు. ఆర్డర్ల పని పూర్తయిన తర్వాత రోజుకు కనీసం మూడు గంటల సేపు అక్షరాలను కొత్తగా రాయడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. మొదట్లో బిజినెస్ ఆర్డర్స్ లేని రోజుల్లో సంజన దీపావళి శుభాకాంక్షల గ్రీటింగ్ కార్డ్స్ రాసి స్నేహితులకు, బంధువులకు పంపించేది. ఆ గ్రీటింగ్ కార్డులు అందుకున్న వారి ప్రశంస లు నోటిమాటగా ప్రచారం కల్పించాయి. ఇప్పుడు మనదేశంలో అత్యుత్తమ కాలిగ్రఫీ ఆర్టిస్టుల్లో ఆమె ఒకరు. ఆటిజమ్కి ఔషధం సంజన ఇప్పుడు మనదేశంలో సామాన్యులకు కూడా కాలిగ్రఫీ గురించి తెలియచేయాలనే సంకల్పంతో పని చేస్తోంది. కాలిగ్రఫీ సాధన చేయడం ద్వారా ఆటిజమ్ నుంచి బయటపడవచ్చని, ఆటిజమ్ పిల్లలకు ఉచితంగా వర్క్‌షాపులు నిర్వహిస్తోంది. కాలిగ్రఫీ నేర్చుకోవడానికి జీవితకాలం సరిపోదని, ఎన్ని రకాలుగా సాధన చేసినా ఇంకా ఎన్నో మిగిలిపోయి ఉంటాయని చెప్తోంది. రానున్న ఏడాది జనవరిలో ఆమె యూకేలో మూడు నెలల అడ్వాన్స్డ్ స్టడీ కోసం వెళ్తోంది. అంతటి అంకితభావంతో పని చేస్తుంటే... విజయం వారిని నీడలా వెంటాడుతుంది. సంజన చట్లాని -
వైరల్ వీడియో: డాన్స్ బాగుంది సంజన.. బుమ్రా ఎక్కడ?
-
వైరల్: డాన్స్ బాగుంది సంజన.. బుమ్రా ఎక్కడ?
ముంబై: ఐపీఎల్-2021 వాయిదా పడటంతో స్పోర్ట్స్ ప్రజెంటర్, టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా సతీమణి సంజనా గణేషన్ ఇంట్లోనే సమయం గడుపుతున్నారు. మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉల్లాసంగా స్టెప్పులేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో.. ‘‘మీరు బాగా డ్యాన్స్ చేస్తున్నారు. మరి బుమ్రా ఎక్కడ వదినమ్మా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంజనా- బుమ్రా ఈ ఏడాది మార్చి 15న గోవాలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యంత సన్నిహితుల మధ్య వీరిద్దరు వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ఇక పెళ్లి కారణంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌కు దూరమైన బుమ్రా.. ఐపీఎల్-2021 సీజన్లో భాగంగా తిరిగి మైదానంలో దిగాడు. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు టోర్నీ వాయిదా పడటంతో ఇంటికి చేరుకున్నాడు. ఇక సంజన సైతం ఐపీఎల్ అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్ ప్రజెంటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇంగ్లండ్‌తో సిరీస్, వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ ఆడేందుకు బుమ్రా ఇంగ్లండ్ పయనానికి సన్నద్ధమయ్యే క్రమంలో క్వారంటైన్లో ఉండగా, సంజన ఇలా ఒక్కరే డ్యాన్స్ చేస్తూ కనిపించడం విశేషం. ఇదిలా ఉండగా.. ఇంగ్లండ్ సిరీస్ ముందు క్వారంటైన్ రోజుల్ని కుదించాలన్న బీసీసీఐ విజ్ఞప్తికి ఈసీబీ సానుకూలంగా స్పందించింది. తద్వారా నాలుగో రోజు నుంచే జట్లు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలు దొరుకుతుంది. అయితే క్రికెటర్లకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చిన ఈసీబీ.. ఆటగాళ్ల కుటుంబ సభ్యుల క్వారంటైన్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చదవండి: ఆస్ట్రేలియన్లు.. ఆస్ట్రేలియన్లలా ఆడరు ఎందుకో?! WTC Final: అతడు ఫాంలో ఉంటే భారత్‌దే గెలుపు! -
ఎన్నో మధుర జ్ఞాపకాలు.. నా గుండె తరుక్కుపోతోంది
సిడ్నీ: ‘‘థాంక్యూ ఇండియా.. నన్ను సొంత మనిషిలా ఆదరించారు. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితులు చూస్తుంటే గుండె పగిలిపోతోంది. దయార్ద హృదయం, ఇతరులపై కూడా ప్రేమను కురిపించే గల మంచి మనుషులు అక్కడ ఉన్నారు. త్వరలోనే పరిస్థితి చక్కబడుతుంది’’అంటూ ఐపీఎల్-2021 ప్రజెంటర్, ఆస్ట్రేలియన్ నెరోలీ మెడోస్ భావోద్వేగపూరిత లేఖను పంచుకున్నారు. కోవిడ్-19తో పోరాడుతున్న భారత్‌కు సహాయం అందించాలనుకునే ఆస్ట్రేలియన్లు, యూనిసెఫ్ ఆస్ట్రేలియా ద్వారా విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. కాగా మహమ్మారి కరోనా ఉధృతి నేపథ్యంలో ఆటగాళ్లు వరుసగా వైరస్ బారిన పడటంతో ఐపీఎల్-2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో విదేశీ ఆటగాళ్లు, ఇతర సిబ్బంది, టీవీ ప్రజెంటర్లు సొంత దేశాలకు వెళ్లిపోయారు. అయితే, భారత్‌ను ఇలాంటి పరిస్థితుల్లో విడిచి వెళ్లడం వేదనకు గురిచేసిందని ఇప్పటికే పలువురు పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో నెరోలీ మెడోస్ సైతం.. భారత్‌లో ఉన్ననాళ్లూ అక్కడి ప్రజలు, సహచర ఉద్యోగులు తనపై చూపించిన ఆప్యాయతకు ముగ్ధురాలిని అయ్యానంటూ అభిమానం చాటుకుంటున్నారు. ‘ఎన్నో మధుర జ్ఞాపకాలు.. ఇప్పటికీ నా బాగోగుల గురించి అడుగుతున్నారు. క్లిష్ట సమయంలోనూ నా మంచి గురించి ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంగా బీసీసీఐ. స్టార్ స్పోర్ట్స్ ఇండియా, సంజనా గణేషన్, భావనా బాలక్రిష్ణన్ తదితరులకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నా. నన్ను సొంత మనిషిలా జాగ్రత్తగా చూసుకున్నారు. సురక్షితంగా ఇంటికి చేర్చారు. మీ ప్రేమకు కృతజ్ఞురాలిని. ఇండియా త్వరలోనే మామూలు స్థితికి వస్తుంది’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా నెరోలీ సంజనా గణేషన్, బ్రెట్ లీతో పాటు పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. చదవండి: పుజారా ఆస్ట్రేలియన్ మాదిరిగానే బ్యాటింగ్ చేశాడు.. -
సంజన బర్త్‌డే: బుమ్రా లవింగ్ పోస్ట్ వైరల్
సాక్షి,ముంబై: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన భార్య సంజన గణేశన్ పుట్టినరోజు సందర్భంగా ఒక అందమైన ఫోటోను షేర్ చేశాడు. అంతేకాదు అంతకంటే లవింగ్ పోస్ట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ‘‘ప్రతి రోజు నా మనసు దోచుకునే నా ప్రాణమా...నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు...ఐ లవ్ యూ’’ అంటూ బుమ్రా 30వ పుట్టినరోజు జరుపుకుంటున్న తన హృదయరాణికి విషెస్ తెలిపాడు. ఐపీఎల్ 2021 రద్దు కావడంతో ఈ ప్రేమ పక్షులకు కలిసి వచ్చిందంటూ ఫెండ్స్, ఇతర అభిమానులు కామెంట్స్ చేశారు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బుమ్రా, మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజన గణేశన్‌ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. అనేక ఊగాహానాలతో బుమ్రా పెళ్లి వార్త సోషల్ మీడియాలో కొన్ని రోజులు ట్రెండింగ్‌లో నిలిచింది. చివరికి మార్చి 14న గోవాలో ఇద్దరూ మూడు ముళ్ల బంధంతో ఏకమై పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. View this post on Instagram A post shared by jasprit bumrah (@jaspritb1) -
భార్య సంజనా ఫోటోకు బుమ్రా రియాక్షన్
ముంబై: గత నెల 14వ తేదీన గోవాలో స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్- టీమిండియా పేసర్ బుమ్రాలు అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానుల్ని పలకరిస్తూనే ఉన్నారు. తమ ఫొటోలు, వీడియోలు పోస్ట్ వారి అప్డేట్స్ను అందిస్తున్నారు. ఇటీవల సంజనాతోపెళ్లి జరిగి నెల అయిన సందర్భంగా సెలబ్రేట్ చేసుకున్న విషయాన్ని బుమ్రా తన ట్వీటర్ అకౌంట్ ద్వారా స్పష్టం చేశాడు. ఒక నెల ప్రేమలో ఎన్నో జ్ఙాపకాలు అంటూ ట్వీటర్ లో షేర్ చేశాడు. ‘కడుపుబ్బా నవ్వులు.. సిల్లీ జోక్స్, సుదీర్ఘమైన చర్చలు.. శాంతి’ అంటూ రాసుకొచ్చాడు. తాజాగా బుమ్రా-సంజనాల మరొకసారి సోషల్ మీడియా ద్వారా అభిమానుల్ని పలకరించారు. బుధవారం తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సంజనా ఒక పోస్ట్ చేశారు. తను రీసెంట్ తీసుకున్న ఫోటోను షేర్ చేశారు. దానికి ‘ఒక మంచి లైట్. గ్రేట్ ఫోటో’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీనికి రెండు హృదయాల ఎమిటికాన్స్ జత చేసి తన భార్యపై ప్రేమను చాటుకున్నాడు బుమ్రా. పెళ్లి తర్వాత కాస్త విశ్రాంతి తీసుకున్న ఈ జంట.. మళ్లీ తమ విధుల్లో బిజిబిజీగా ఉన్నారు. స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్ అయిన సంజన.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను కవర్ చేస్తుండగా, ఆ లీగ్ ముంబై ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు బుమ్రా. గతేడాది జరిగిన ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవగా అందులో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఆ లీగ్‌లో బుమ్రా 27 వికెట్లు సాధించి ముంబై తరఫున అత్యధిక వికెట్ల సాధించిన బౌలర్‌గా నిలిచాడు. View this post on Instagram A post shared by Sanjana Ganesan (@sanjanaganesan) -
టీవీ బ్రేక్‌లో వచ్చే ఈ అమ్మాయిని గుర్తుపట్టారా?
టీవీలో బ్రేక్ వస్తే.. ఈ అమ్మాయి తప్పకుండా మీకు దర్శనమిస్తుంది. ఎందుకంటే, ఆ ఐదు నిమిషాల బ్రేక్‌లో పది యాడ్స్ వస్తే.. ఒక దానిలోనైనా సంజనా సంఘీ నటించి ఉంటుంది. పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ఢిల్లీలోనే.. తండ్రి సందీప్ సంఘీ బిజినెస్‌మన్, తల్లి సుగాన్ హోమ్ మేకర్, అన్న సమీర్ గూగుల్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇదీ సంజన కుటుంబం. పదమూడేళ్ల వయసులో బాలీవుడ్ మూవీ ‘రాక్‌స్టార్’తో బాలనటిగా ఎంటర్ అయినా, నటిగా గుర్తింపు సాధించింది మాత్రం 2019లో ‘దిల్ బేచారా’ సినిమాతో. క్యాన్సర్ రోగిగా తను కనబరచిన నటన చాలా మందిని కంటతడి పెట్టించింది. ఫిట్నెస్ పట్ల చాలా శ్రద్ధ సంజనాకు. యోగాతోనే తన రోజు మొదలవుతుంది. కథక్ డాన్స్‌లో శిక్షణ తీసుకుంది. యాడ్స్, మూవీస్ అంటూ ఎంత బిజీగా ఉన్నా చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఇంటర్లో తను సాధించిన మార్కులకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రశంసా పత్రం బహూకరించి, అభినందించారు. ఇక లేడీ శ్రీరామ్ కాలేజీ నుంచి మాస్ కమ్యూనికేషన్స్‌లో గోల్డ్ మెడల్ పొందింది. అభిరుచులు.. పెంపుడు కుక్కతో ఆడుకోవడం, షాపింగ్ చేయడం. మురికివాడల్లోని పిల్లలకు చదువు చెప్పడం. సినిమా కంటే ముందు వాణిజ్య ప్రకటనలు ఆమెను ప్రేక్షకులకు పరిచయం చేశాయి. తన క్యూట్ ఫేస్‌తో కోకా కోలా, క్యాడ్బరీ, మింత్రా, ఎయిర్‌సెల్, డాబర్, తనిష్క్ వంటి సుమారు నూటాయాభై ప్రకటనల్లో కనిపించింది. ఆ తర్వాత ‘హిందీ మీడియం’, ‘ఫుక్రే రిటర్న్స్’ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆదిత్యరాయ్ కపూర్‌తో కలసి ‘ఓమ్’ సినిమాలో నటిస్తోంది. పుస్తకాలతో స్నేహం చేసే ఆమె.. కాలేజీ రోజుల్లోనే ‘యూత్ కీ ఆవాజ్’, ‘ది శాటిలైట్’ వెబ్‌సైట్స్‌కు ఫీచర్ రైటర్‌గా పనిచేసింది. చదువు పూర్తి చేసిన తర్వాత కొద్దిరోజులు బీబీసీలో ఇంటర్న్‌షిప్ కూడా చేసింది. రాక్‌స్టార్ మూవీ షూట్లోనే నటిగా మారాలని నిర్ణయించుకున్నా.. అప్పటి వరకు నేను సినిమాల్లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు - సంజనా సంఘీ చదవండి: కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్ టాలీవుడ్లో మరో విషాదం.. పూజా హెగ్డే ఎమోషనల్ ట్వీట్ -
బుమ్రా-సంజనాల ‘వన్ మంత్ ఆఫ్ లవ్’ సెలబ్రేషన్స్
ముంబై: గత నెల 14వ తేదీన గోవాలో స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్- టీమిండియా పేసర్ బుమ్రాలు అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానుల్ని పలకరిస్తూనే ఉన్నారు. తమ ఫొటోలు, వీడియోలు పోస్ట్ వారి అప్డేట్స్ను అందిస్తున్నారు. తాజాగా సంజనాతోపెళ్లి జరిగి నెల అయిన సందర్భంగా సెలబ్రేట్ చేసుకున్న వవిషయాన్ని బుమ్రా తన ట్వీటర్ అకౌంట్ ద్వారా స్పష్టం చేశాడు. ఒక నెల ప్రేమలో ఎన్నో జ్ఙాపకాలు అంటూ ట్వీటర్ లో షేర్ చేశాడు. ‘కడుపుబ్బా నవ్వులు.. సిల్లీ జోక్స్, సుదీర్ఘమైన చర్చలు.. శాంతి. ఇవి నా బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత మా నెల ప్రేమలో ముచ్చట్లు ’ అని బుమ్రా రాసుకొచ్చాడు. కాగా , కెరీర్ పరంగా టీమిండియా పేస్ దళానికి నాయకత్వం వహిస్తున్న 27 ఏళ్ల బుమ్రా... ఇప్పటి వరకు 19 టెస్టులు, 67 వన్డేలు, 50 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 83, వన్డేల్లో 108 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్లో 5 సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్‌కు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్టు అయిన సంజన, ఆ తర్వాత టీవీ ప్రజెంటర్‌గా అవతారమెత్తారు. ప్రపంచకప్, ఐపీఎల్ వంటి క్రికెట్ మెగా టోర్నీలు సహా ఇతర క్రీడలకు సంబంధించిన ఈవెంట్లలో భాగస్వామ్యమయ్యారు. బుమ్రాతో పెళ్లి తర్వాత భారత్-ఇంగ్లండ్‌తో సిరీస్‌లో సంజనా పాల్గొనగా, బుమ్రా విశ్రాంతి తీసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌తో బుమ్రా బిజీగా ఉన్నాడు. One month of love, belly laughs, silly jokes, long conversations and peace. One month of being married to my best friend.❤ pic.twitter.com/yraFiVTciM — Jasprit Bumrah (@Jaspritbumrah93) April 15, 2021 -
తనే నా ప్రపంచం: బుమ్రా, సంజన పెళ్లి వీడియో వైరల్
అనేక ఊహాగానాలకు తెరదించుతూ టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, టీవీ ప్రెజెంటర్ సంజన గణేషన్ ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. మార్చి 15న జరిగిన ఈ వేడుకకు గోవా వేదికగా మారింది. ‘మా జీవితంలోనే అత్యంత ఆనందకరమైన రోజు. మా పెళ్లి వార్తను, ఆనందాన్ని మీ అందరికీ తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం’ అంటూ బుమ్రా ట్వీట్ చేశాడు. బుమ్రా, సంజనల పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. తాజాగా వీరి వివాహానికి చెందిన ఓ వీడియో సోషల్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. దీనిని మంగళవారం వెడ్డింగ్ ఫిల్మర్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ పోస్టు చేసింది. ‘‘నువ్వు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావ్ అని నేను అడిగాను. దానికి ‘ఎందుకంటే ఇప్పుడు తనే నా ప్రపంచం’ అని అతను బదులిచ్చాడు.’’అనే క్యాషన్‌తో షేర్ చేశారు.ఈ వీడియోలో పెళ్లికూతురుగా ముస్తాబైన సంజనను తన తండ్రి మండపం వద్దకు తీసుకు రావడంతో మొదలైన ఈ వీడియోలో వధూవరూలిద్దరూ పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్నారు. పెళ్లి దండలు మార్చుకుంటూ బుమ్రా, సంజన ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మీ జంట చూడముచ్చటగా ఉందంటూ మరోసారి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: సంజనతో బుమ్రా పెళ్లి.. హర్ట్ అయిన అనుపమ బుమ్రా పెళ్లి వేడుకల ఫోటోలు.. కొత్త తలనొప్పులు View this post on Instagram A post shared by Vishal Punjabi (@theweddingfilmer)