సంజనను పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ | cherukupalli sitaramulu visits kamineni hospitals | Sakshi
Sakshi News home page

సంజనను పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ

Oct 5 2016 10:23 AM | Updated on Jul 11 2019 8:38 PM

మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు.

హైదరాబాద్ : మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. వాహనం ఢీకొని తీవ్ర గాయాలపాలై కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లికూతుళ్లు... శ్రీదేవి, సంజనలను బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం వైద్యులను అడిగి వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అలాగే అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంజన తాతయ్య నరేందర్ను కూడా సీతారాములు పరామర్శించారు. సంజన కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వనికి విజ్ఞప్తి చేశారు. యువకులు తప్పతాగి వాహనం నడుపుతూ సమయంలో రోడ్డు దాటుతున్న తల్లీకుమార్తెలు శ్రీదేవి, సంజనను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తల్లీకుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సంజనకు తీవ్ర గాయాల వార్త విన్న ఆమె తాతయ్య గుండె నొప్పితో కుప్పకూలారు. దీంతో ఆయన్ని కూడా కామినేని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement