Political Leader
-
తొలితరం రాజకీయ దిగ్గజం : ఆసక్తికర సంగతులు
భారత స్వాతంత్య్రోద్యమ తొలితరం మేరునగధీరుల్లో మహదేవ గోవింద రనడే ఒకరు. 1943లో ఆయన శత జయంతి కార్యక్రమంలో డా‘‘ బీఆర్అంబేడ్కర్ మాట్లాడుతూ... ‘రనడే కేవలం ఆజానుబాహుడు మాత్రమే కాదు; విశాల భావాలు కలిగిన వారూ, ప్రజల పట్ల సమదృష్టిని కలిగిన వారు కూడా’ అని ప్రశంసించారు. ఓరిమి కలిగిన ఆశావాది.తన జీవిత కాలంలో‘వక్తృత్వోత్తేజక సభ’, ‘పూర్ణ సార్వజనిక సభ’, ‘మహారాష్ట్ర గ్రంథోత్తేజక సభ’, ‘ప్రార్థనా సమాజం’ లాంటి సంస్థలను స్థాపించారు. తన సాంఘిక, మత సంస్కరణల ఆలోచనలకు అనుగుణంగా ‘ఇందు ప్రకాష్’ అనే మరాఠీ–ఆంగ్ల దినపత్రికను నిర్వహించారు.మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నిఫాడ్‌లో 1842 జనవరి 18న జన్మించారు. కొల్హాపూర్‌లోని ఒక మరాఠీ పాఠశాలలో చదివారు. తర్వాత ఓ ఆంగ్ల మాధ్యమ పాఠశాలకు మారారు. 14 ఏళ్ల వయసులో బాంబేలోని ఎల్ఫిన్స్టన్ కళాశాలలో చేరారు. బాంబే విశ్వవిద్యాలయం మొదటి విద్యార్థుల్లో ఆయనా ఒకరు. 1867లో ఎల్ఎల్బీ పట్టా పుచ్చు కున్నారు. 1871లో పూనాలో సబార్డినేట్ జడ్జిగా నియమితులయ్యారు. ఆయన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం గమనించిన ఆంగ్లేయులు 1895 దాకా ఆయనను బాంబే హైకోర్టుకు పంపే పదోన్నతికి అడ్డు పడుతూ వచ్చారు. ఆయన కొన్ని పాశ్చాత్య భావాలకు ప్రభావితులయ్యారు.అందరికీ విద్య, సమానత్వం, మానవత్వం వంటివి ఇందులో ప్రధాన అంశాలు. మత పరంగా హిందూమతంలో ఆయన చేయాలనుకున్న సంస్కరణలు ప్రార్థనా సమాజం స్థాపించడానికి ప్రేరణ. గోపాలకృష్ణ గోఖలే, బాల గంగాధర తిలక్ వంటి స్వాతంత్య్ర సమర యోధులకు రాజకీయ గురువుగా పేరు పొందారు. తుదకు 1901 జనవరి 16న తుదిశ్వాస విడిచారు. నేటి స్వేచ్ఛా భారతానికి దారులు వేసిన ఆయన చిరస్మరణీయులు.– యం. రాం ప్రదీప్; జేవీవీ సభ్యులు, తిరువూరు(రేపు మహాదేవ గోవింద రనడే జయంతి) -
Karnataka: వీడియోలతో బెదిరించి మంత్రి అయ్యాడు
బనశంకరి: కాంట్రాక్టర్లపై బెదిరింపులు, అలాగే అత్యాచారం, హనీట్రాప్ కేసులు ఎదుర్కొంటూ అరెస్టయిన రాజరాజేశ్వరి నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న తనను వాడుకుని ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులను హనీట్రాప్ చేయించారని మహిళ ఆరోపించారు. బెంగళూరులో ఇది జరిగిందని, నా భర్త, పిల్లలను చంపేస్తానని బెదిరించి హనీట్రాప్ చేయించారని తెలిపారు. చాలా మంది మహిళలతో ఈ మహిళపై అత్యాచారం కేసులోనే మునిరత్న అరెస్టయ్యారు. ఆమె బుధవారం నగరంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. తనకు భద్రత కల్పిస్తే, మాజీ సీఎం హనీట్రాప్ విషయాలను సిట్‌కు అందజేస్తానని తెలిపారు. మునిరత్న తనలాగే చాలామంది మహిళలను హనీ ట్రాప్ కు వాడుకున్నారని, తనకు మొబైల్ ఫోన్ ఇచ్చి సదరు వ్యక్తుల వద్దకు పంపించేవారని చెప్పారు. మునిరత్న బంధువు సుధాకర్ కూడా హనీట్రాప్ దందాలో పాల్గొనేవాడని చెప్పారు. హెచ్ఐవీ కలిగిన యువతితో.. మునిరత్న బెదిరించి తనతో హనీ ట్రాప్ చేసిన సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయని, తాను సొంతంగా ఎవరినీ ట్రాప్ చేయలేదని ఆమె చెప్పారు. ఆయన మాజీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను హనీట్రాప్ చేసి వీడియో తీశారని, ఏసీపీ, సీఐ కూడా హనీట్రాప్ చేయించారని తెలిపారు. హెచ్ఐవీ జబ్బు కలిగిన యువతిని రాజకీయ నేతల వద్దకు పంపేవారని, 10 నిమిషాలు సమయం ఇస్తే బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై.విజయేంద్రను కలిసి మునిరత్న అక్రమాలను వివరిస్తానని, ఆయనను ఇంకా పారీ్టలో ఎందుకు కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మునిరత్న మంత్రిగా ఉండగా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారో కొన్ని ఫోటోలను ఆమె విడుదల చేశారు. హనీ ట్రాప్ వీడియోల ద్వారా అప్పటి సీఎంలను బెదిరించి మంత్రి పదవి పొందారని అన్నారు. నాకు ఏమైనా జరిగితే మునిరత్న కారణమన్నారు. అత్యాచారం ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారని, దీనిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టానన్నారు. తనకు రక్షణ కలి్పంచాలని పదే పదే కోరారు. -
‘సాయం చేయరూ’... వాట్సప్‌పై దర్శన్?
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య తరువాత దర్శన్ ఏం చేయాలో దిక్కుతోచక అనేక తప్పులు చేశాడు. అవన్నీ విచారణలో వెలుగు చూస్తున్నాయి. కేసు తనపైకి ఉండేందుకు ముగ్గురు రౌడీలకు రూ.30 లక్షలు ఇవ్వడం మొదలుకుని అనేక తప్పులు చేస్తూ వచ్చారు. అవన్నీ ఇప్పుడు సాక్ష్యాధారాలుగా మారి ఆయన మెడకు చుట్టుకున్నాయి. రేణుకాస్వామి హత్య అనంతరం... కేసు నుంచి బయటపడేయాలని దర్శన్ పలువురు రాజకీయ నేతలను వాట్సాప్ ద్వారా కోరినట్టు పోలీసులు గుర్తించారు. దర్శన్‌ను అరెస్టు చేశాక అతని మొబైల్ స్వాధీనం చేసుకుని వాట్సాప్ కాల్స్మెసేజెస్ రిట్రీవ్ చేయగా ఈ సంచలన విషయాలు వెలుగు చూశాయి. -
చెప్పింది చేసిన అరుదైన నేత
వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం. రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడిన వారిలో వైఎస్సార్‌ది మొదటి స్థానం. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రయత్నించారు. ఎప్పుడూ తెలుగువారి సంప్రదాయ పంచెకట్టులోనే కనిపించేవారు. వివిధ సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులు ఎదురైనప్పుడు నవ్వుతూ పలకరించేవారు. ఆయన మాటలూ, చేతల్లో హుందాతనం తొణికిసలాడేది. ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ప్రజా నాయకుడాయన.రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి అంతిమ ఘడియల వరకూ ఓటమి ఎరుగని నేత. తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్‌గా చిరస్థాయిగా నిలిచిన ఆయన పూర్తి పేరు యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. నేటి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో రాజారెడ్డి, జయమ్మ దంపతులకు 1949 జూలై 8న జన్మించారు. బళ్లారిలో పాఠశాల విద్యాభ్యాసం, తర్వాత విజయవాడ లయోలా కళాశాలలో పీయూసీ ఉత్తీర్ణులై, 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదివారు.తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల నుంచి హౌస్ సర్జెన్సీ పూర్తి చేసి వైద్య విద్యలో పట్టా అందుకున్నారు. తరువాత జమ్మలమడుగు క్యాంబెల్ ఆసుపత్రిలో వైద్యునిగా పేదలకు ఏడాది కాలం సేవలందించారు. తర్వాత కొంతకాలం జమ్మలమడుగులో వైద్యాధికారిగా పనిచేసి, అనంతరం తండ్రి రాజారెడ్డి పేరుతో 30 పడకల ఆసుపత్రి నిర్మించి, పేదలకు వైద్య సేవలు అందించి, రెండు రూపాయల డాక్టర్‌గా గుర్తింపు పొందారు.తండ్రి కోరిక మేరకు 1978లో తొలిసారి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, జనతాపార్టీ అభ్యర్థి నారాయణరెడ్డిపై 20 వేల 496 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి శాసన సభలో కాలు పెట్టినప్పటినుంచీ 2009 వరకు ఆయన పోటీ చేసిన అన్ని సార్లూ విజయం సాధించారు. 4 పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు పీసీసీ అధ్యక్షుడిగా, మూడు పర్యాయాలు సీఎల్పీ నేతగా, రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా, రాజకీయ నేతలకు మార్గదర్శకంగా నిలిచారు.పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న వైఎస్సార్ 2004 మే 14న తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, ఉచిత విద్యుత్, పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బకాయిల రద్దుపై తొలి, మలి సంతకాలు చేశారు. అది మొదలు ఎన్నో ప్రజా ప్రయోజన పథకాలు ప్రవేశపెట్టి అమలు జరిపారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటివి ఆయనను చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేశాయి.నిర్లక్ష్యం నీడలో ఉన్న కడప జిల్లాను 2004–09 కాలంలో సమగ్రాభివృద్ధి దిశగా పరుగులు పెట్టించారు. కడప మునిసిపాలిటీని కార్పొరేషన్‌గా, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట మేజర్ పంచాయతీలను మునిసిపాలిటీలుగా రూపొందించారు. జిల్లాలో యోగి వేమన యూనివర్సిటీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, పశువైద్య విద్య కళాశాలను నెలకొల్పారు. జిల్లా కేంద్రంలో రిమ్స్ వైద్య కళాశాల, 750 పడకల రిమ్స్ ఆసుపత్రి, దంత వైద్యశాల, అలాగే ట్రిపుల్ ఐటీ నెలకొల్పారు. అనేక పరిశ్రమలు స్థాపింపజేశారు.ఆయన హయాంలో జలయజ్ఞంలో భాగంగా సుమారు రూ. 12 వేల కోట్లతో కడప జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు. గాలేరు–నగరి సుజల స్రవంతి, గండికోట కెనాల్, టన్నెల్, గండికోట వరదకాల్వ, గండికోట ఎత్తిపోతల పథకాలు వైఎస్ హయాంలో రూపొందించినవే. మైలవరం ఆధునికీకరణ, సర్వారాయ సాగర్, వామికొండ ప్రాజెక్టు, సీబీఆర్, పీబీసీ, వెలిగల్లు, తెలుగుగంగ ప్రాజెక్టు పనులు చకచకా సాగించారు. ఇంతలో 2009 సెప్టెంబర్ 2న సంభవించిన ఆయన అకాల మరణం రాష్ట్ర అభివృద్ధికి పెద్ద కుదుపయ్యింది. – నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్, 98481 28215 (నేడు వైఎస్సార్ 75వ జయంతి) -
నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కృష్ణా జిల్లా
-
చంద్రబాబుకు తగ్గట్టే.. టీడీపీ అభ్యర్దుల నోటి జారుడు!
వాలంటీర్ల వ్యవస్థ మీద, వాలంటీర్ల మీద తెలుగుదేశం లీడర్లు చేస్తున్న కామెంట్లు, అనుసరిస్తోన్న ధోరణి తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోంది. చంద్రబాబు తగ్గట్టే కొందరు టీడీపీ అభ్యర్దులు కూడా నోటికి ఎంత మాట వస్తే అంతా మాట్లాడి వివాదాస్పదులవుతున్నారు. వలంటీర్లను స్లీపర్ సెల్స్ అని, టెర్రరిస్టులని శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్ది బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించడం దారుణంగా ఉంది. దీనిపై వలంటీర్లు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వలంటీర్లపై ద్వేషంతో ప్రవర్తిస్తోంది. తొలుత చంద్రబాబు కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసినా, ఆ తర్వాత వారి ప్రాముఖ్యత, ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను గుర్తించక తప్పలేదు. మొదట వలంటీర్లు అంటే మూటలు మోసే ఉద్యోగమని చంద్రబాబు అవహేళన చేశారు. ఇళ్లలో మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు కొడుతున్నారని నీచంగా ఆరోపించారు. దానిపై తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి, తాను కూడా వలంటీర్ల వ్యవస్తను కొనసాగిస్తానని ప్రకటించారు. పైగా 'వలంటీర్లకు ఏభై వేల రూపాయల వరకు వచ్చే ఏర్పాటు చేస్తారట. అదెలాగో ఎవరికి తెలియదు'. వలంటీర్లకు ఆయన తాయిలాలు వేసే దశకు వచ్చారంటే ఆ వ్యవస్థ ఎంత బలంగా నాటుకుంది అర్ధం చేసుకోవచ్చు. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికు ప్లస్ అవుతున్నదన్నదే ఆయన బాధ. టీడీపీ నేతలలో వలంటీర్లు అంటే భయం ఏర్పడింది. దానికి తోడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు చేసిన అనుచిత వ్యాఖ్యల ప్రభావం తమమీద పడుతుందేమోనన్న సందేహం వారిలో ఉంది. 'పవన్ కల్యాణ్ అయితే ఏకంగా వలంటీర్లను కిడ్నాపర్లతో పోల్చారు. నిజానికి వలంటీర్లలో అరవై నుంచి డెబ్బై శాతం మంది మహిళలు ఉన్నారు. అయినా వీరిద్దరూ దారుణంగా మాట్లాడారు. వారికంటే తానేమీ తక్కువ తీసిపోలేదన్నట్లు సుధీర్ రెడ్డి వంటి వారు మరీ మాట్లాడి ప్రజల ఆగ్రహానికి గురి అవుతున్నారు'. కరోనా కష్టకాలంలో ఏపీలో ప్రజలకు అండగా ఉండి వలంటీర్లు చేసిన సేవలను ఇప్పుడు అంతా గుర్తు చేసుకుంటున్నారు. సొంత కుటుంబ సభ్యులే పలకరించడానికి భయపడిన రోజుల్లో కరోనా సోకిన వారిని ఆస్పత్రులలో చేర్చి, వారికి చికిత్స జరిగేదాక శ్రద్ద తీసుకున్న వలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చారంటే వారి సంస్కారం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వలంటీర్ల వ్యవస్త సఫలం అవుతుందని తెలుగుదేశం, జనసేన నేతలు ఊహించలేదు. అందుకే ఇష్టారీతిన మాట్లాడి నోరుపారేసుకున్నారు. ఆ తర్వాత తప్పును గుర్తించినా లాభం లేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కో వలంటీరు వందల మందిని ప్రభావితం చేయగలిగే శక్తి మంతులయ్యారన్నది వీరి అనుమానం. వలంటీర్లు సేవలందిస్తున్న ఆ వ్యవస్థను నెలకొల్పి ప్రజల ఇళ్ల వద్దకే పాలనను తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహన్రెడ్డిది. ఆ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతోంది. కులం, ప్రాంతం, పార్టీ.. ఇలాంటి వాటితో నిమిత్తం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఏపీలో మొదటిసారిగా ఇలా స్కీములు అమలు అవుతున్నాయి. 'గతంలో చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు అరాచకాలు చేస్తే, అవినీతి విశృంఖలంగా చేస్తే టీడీపీ గబ్బు పట్టిపోయింది'. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో వలంటీర్ల సేవలు ప్రజలకు బ్రహ్మాండంగా అందుతుండడంతో పూర్వకాలంలో టీడీపీకి ఓటు వేసినవారు సైతం ఇప్పుడు వైఎస్సార్సీపీ వైపు మొగ్గుతున్నారు. దాంతో కంగారు పుట్టిన టీడీపీ నేతలు అనుచితంగా మాట్లాడి మరింత అప్రతిష్టపాలవుతున్నారు. ప్రస్తుతం ఏపీలో రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉన్నారు. వీరి సేవలకు సంతోషపడి ఒక్కో వలంటీర్‌కు పది మంది చొప్పున టీడీపీ వారు మారినా, పాతిక లక్షల మంది వైఎస్సార్సీపీకి అనుకూలం అవుతారన్నది వీరి అంచనా. అందుకే వలంటీర్ల వ్యవస్థను అవుననాలో, లేక కాదానలో తేల్చుకోలేక, ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడి మరింతగా పలచన అవుతున్నారు. 'గతంలో రోజుల తరబడి వృద్ధులు తమ పెన్షన్ల కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరగవలసి వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఇళ్లకే వలంటీర్లు వచ్చి ఇస్తుండడంతో వృద్ధులంతా పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను తమ బిడ్డగా చూసుకుంటున్నారు. ఆ విషయాన్ని వారు బహిరంగంగానే చెబుతున్నారు. సహజంగానే అది టీడీపీవారికి గంగవెర్రిలెత్తిస్తుంటుంది'. 'చిత్రం ఏమిటంటే ప్రధాని మోదీని చంద్రబాబు టెర్రరిస్టు అని వ్యాఖ్యానిస్తే, టీడీపీ నేతలు బొజ్జల వంటివారు వలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చుతున్నారు'. చంద్రబాబు ఇప్పుడు మోదీని పొగుడుతున్నట్లే వీరు కూడా వలంటీర్లను ప్రశంసించక తప్పని స్థితి ఏర్పడింది. 'వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏభై ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమిస్తే, ఇప్పుడు చంద్రబాబు ప్రతి ఇరవై కుటుంబాలకు ఒక వలంటీర్‌ను పెడతానని చెబుతున్నారు. ఇంటి వద్దకే పెన్షన్ పంపిస్తానని అంటున్నారు'. జనం వీటిని నమ్ముతారా? కచ్చితంగా నమ్మరు. వలంటీర్లను తెగతిట్టి, ఇప్పుడు ఇంకా ఎక్కువ మందిని పెడతామంటే అన్నిటిలోను యుటర్న్ తీసుకున్నట్లు దీనిలో కూడా మాట మార్చి ప్రజలను ఏమార్చడానికి పాట్లు పడుతున్నారని తెలియడం లేదా! – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అమర్ రచన "మూడు దారులు" పై.. కల్లూరి భాస్కరం సమీక్ష!
సహచర పాత్రికేయ మిత్రుడు దేవులపల్లి అమర్ తన నాలుగున్నర దశాబ్దాల అనుభవసారం రంగరించి రచించిన ‘మూడు దారులు - రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు’ అనే ఈ పుస్తకంలో మొత్తం 15 అధ్యాయాలు ఉన్నాయి. ‘రాజకీయాలు-ఒక సమాలోచన’ అనే అధ్యాయంతో మొదలయ్యే ఈ రచనలో అమర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు-మొదట ఆంధ్రరాష్ట్రాన్ని, ఆ తర్వాత అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ను - ఏకచ్చత్రంగా ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వాల గురించి, కాంగ్రెస్ ముఠాకలహాల గురించి, ఒకరినొకరు పడదోసుకుంటూ సాగించిన రాజకీయక్రీడ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి వివరించి ఈ తొలి అధ్యాయం ద్వారా ఈ పుస్తకానికి ఒక చారిత్రక ప్రతిపత్తిని సంతరించారు. ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయాన్ని ‘చరిత్రను తిరగ తోడటం దేనికి?’ అనే ప్రశ్నతో అమర్ ప్రారంభిస్తారు. ‘చరిత్ర పుటలను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ వర్తమానంలోకి రాలేమా, రావచ్చు కానీ గతాన్ని నిశితంగా పరికించినప్పుడు మాత్రమే వర్తమానాన్ని బేరీజు వేయగలం. అంతేకాదు వర్తమానంలో చోటు చేసుకుంటున్న మార్పులను, జరుగుతున్న సంఘటనలను నిష్పాక్షిక దృష్టితో చూసే వీలు కలుగుతుంది’ అంటూ ప్రారంభంలోనే ఈ పుస్తకంలోని థీమ్‌కి ఒక డెప్త్ తీసుకువచ్చారు, దీనిని చరిత్రగా చూపించారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి ఒకే కాలంలో రాజకీయరంగ ప్రవేశం చేయడం, భిన్నమైన దారుల్లో వెళ్లడం, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి ప్రవేశం ఇవన్నీ ఈ పుస్తకంలో రచయిత చర్చించారు. ఈ విషయాల్లో ఎక్కడా రచయిత బేసిక్ ఫ్యాక్ట్స్‌తో కాంప్రమైజ్ కాలేదు. బేసిక్ ఫ్యాక్ట్స్‌పై, పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలపై ఇంకొంచెం స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నం చేశారు తప్ప ఫ్యాక్ట్స్‌ను డిస్టార్ట్ చేయడం గానీ, కప్పిపుచ్చడం గానీ చేయలేదని ఈ పుస్తకం చదివినప్పుడు నాకు అర్థమైంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ ముగ్గురు నాయకులూ, వారు అనుసరించిన దారుల గురించి ప్రధానంగా చర్చించిన పుస్తకం ఇది. ఈ పుస్తకంలో వైస్రాయి ఘట్టం చదువుతున్నప్పుడు నాకు ఒక సినిమా చూస్తున్నట్టు అనిపించింది. నిజంగా ఒక సినిమాకు సబ్జెక్టు అది. అమర్ ఈ పుస్తకంలో బేసిక్ ఫ్యాక్ట్స్‌తో కాంప్రమైజ్ అవలేదనడానికి ఇంకో ఉదాహరణ ఏం చెబుతానంటే, వైస్రాయ్‌తో ముడిపడిన ఈ మొత్తం ఉదంతంలో ఎన్టీఆర్ స్వయంకృతం కూడా చాలా ఉంది. రాజకీయంగా అనుభవం లేకపోవడం, చెప్పినా వినకపోవడం, మొండితనం వంటివి కూడా దీనికి కొంత దోహదం చేశాయి. ఆ సంగతినీ అమర్ ప్రస్తావించారు. ఆవిధంగా రెండువైపులా ఏం జరిగిందో చిత్రించారు. అలాగే లక్ష్మీపార్వతి జోక్యాన్నీ ఆయన దాచలేదు. ఆ తరువాత మీడియా! ఇందులో ఎన్టీఆర్ వ్యక్తిగత వ్యవహార శైలి, అల్లుళ్లతో సహా ఆయన కుటుంబ సభ్యుల పాత్ర, ఆయన అర్ధాంగి పాత్ర.. వీటన్నిటితో పాటు మీడియా కూడా ప్రధాన పాత్రధారి. ఎన్టీఆర్ అధికారచ్యుతికి సంబంధించిన మొత్తం ఉదంతంలో మీడియా పాత్ర గురించి, మీడియా వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా ఒక పుస్తకం రావాలని! ప్రీ-తెలుగుదేశం, పోస్ట్-తెలుగుదేశం అనే డివిజన్‌తో తెలుగు మీడియా చరిత్ర రాయాలని నేనంటాను. నాదెండ్ల భాస్కరరావు చేసిన దానికి చంద్రబాబు చేసినది ఒకవిధంగా పొడిగింపే. మొత్తం మీద అమర్ ఈ పుస్తకంలో పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలనే అందించారు. ప్రత్యక్షసాక్షిగా తన దృక్కోణాన్ని కలుపుకుంటూ వాటిని కథనం చేశారు. చివరిగా జగన్ మోహన్ రెడ్డిగారి విషయానికి వచ్చేసరికి ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహార శైలి, ఆయన ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాలు, ఇతరత్రా చర్యలు, విధానాల గురించి చెప్పారు. ఈ అధ్యాయంలో కూడా అమర్ ఫ్యాక్ట్స్‌తో రాజీపడలేదనే విశ్వసిస్తున్నాను. (ఫిబ్రవరి ఒకటవ తేదీన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో దేవులపల్లి అమర్ రాసిన మూడు దారులు పుస్తక పరిచయ సభలో పాత్రికేయ ప్రముఖులు, రచయిత కల్లూరి భాస్కరం చేసిన సమీక్ష నుంచి ముఖ్య భాగాలు). ఇవి చదవండి: Lok Sabha polls 2024: సోషల్ మీడియా... నయా యుద్ధరంగం -
రానున్న లోక్‌సభ ఎన్నికలపై.. బీజేపీ నేతల గురి!
సాక్షి, పెద్దపల్లి: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ అంశాలతో ప్రభావితమయ్యే నియోజకవర్గమవడం, ఎస్సీ స్థానం కావడంతో ఇక్కడ గెలుపును ఆ పార్టీ నిర్దేశించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు సాధించకపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు జాతీయ అంశాల ఆధారంగా తమకు మద్దతు పలుకుతారని బీజేపీ అధిష్టానం అంచనా వేస్తుంది. ఇందులో భాగంగా రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా బీజేపీ అంతర్గతంగా అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తుంటే, మరోవైపు ఇక్కడ పోటీ చేసేందుకు సిద్ధమవుతోన్న నేతలు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతున్నారు. పార్టీ దృష్టిలో పడేందుకు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో వాల్‌రైటింగ్స్ చేయిస్తూ, ఫ్లెక్సీలు కూడా కట్టిస్తున్నారు. వికసిత్ సంకల్ప్ భారత్ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. టీడీపీ, బీజేపీ పోత్తులో గెలుపు! పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కంచుకోటగా నిలుస్తోంది. అలాగే బీజేపీ సైతం ప్రత్యక్షంగా పోరులో నిలవక, పోత్తులో భాగంగా టీడీపీకి పలుమార్లు సీటు కేటాయించింది. అందులో భాగంగా 2004లో టీడీపీ తరుఫున డాక్టర్ సుగుణకుమారి పోటీ చేసి గెలిచారు. 2019లో బీజేపీ తరుఫున ఎస్.కుమార్ నిలవగా 92,606 ఓట్లు సాధించారు. పార్లమెంట్ పరిధిలో గతంలో కంటే ఓటు బ్యాంకు స్థిరంగా పెరగడాన్ని గమనిస్తోన్న అధిష్టానం గతంలో వైఫల్యాలకు గల కారణాలను విశ్లేషించుకుంటుంది. పొత్తులో టీడీపీ గెలిచిందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీకి సానుకూల వాతవరణం నెలకొన్న నేపథ్యంలో సరైన అభ్యర్థిని దింపి పక్కా ప్రణాళికతో గెలవవచ్చని భావిస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన అభ్యర్థులకు గట్టి పోటీనిచ్చే అభ్యర్థులను బరిలో దింపేలా అధిష్టానం ఆలోచిస్తుంది. ఇందులో భాగంగా ఇదే నియోజకవర్గంలోని మాజీ ఎంపీ, మాజీ మంత్రిని పార్టీలో చేర్చుకొని టిక్కెట్ ఇచ్చేందుకు సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. ఎంపీ టికెట్ రేసులో వీరే.. పెద్దపల్లి పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు పలువురు నాయకులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పాలకుర్తి మండలానికి చెందిన ఐఏఎస్ నరహరి క్లాస్మేట్, అతను స్థాపించిన ఆలయ ఫౌండేషన్ సీఈవో మిట్టపల్లి రాజేందర్‌కుమార్, విశ్వహిందూ పరిషత్ నాయకుడు అయోధ్య రవి, బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగాల కుమార్, కరీంనగర్‌కు చెందిన బీజేపీ ఎస్సీ రాష్ట్ర మోర్చా అధికార ప్రతినిధి జాడి బాల్‌రెడ్డి, క్యాతం వెంకటరమణ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వీరిలో ముగ్గురి పేర్లతో కూడిన షార్ట్ లిస్టు బీజేపీ అధిష్టానానికి చేరింది. అయితే పార్టీ టికెట్ వీరిలో ఎవరికై నా ఇస్తారా, చివరి నిమిషంలో మరెవరినైనా రంగంలోకి దింపుతారా అనే అంశం ఆసక్తిగా మారింది. ఇవి చదవండి: కేసీఆర్ హామీతో.. ఆ స్థానం పదిలమేనా!? -
తెలంగాణలో తీన్ మార్..
-
చింతమనేని సీట్ సిరిగిపోయిందా ?
రౌడీ ఎమ్మెల్యే అనే ట్యాగ్ లైను వేసుకోవడానికి తెగ ఇష్టపడే దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఇప్పుడు గడ్డు కాలం వచ్చింది.. 'ఆయనొద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ తెలుగు తమ్ముళ్లు అక్కడక్కడా ఫ్లెక్సీలు కట్టడం తెలుగుదేశాన్ని.. చంద్రబాబును కలవరపరుస్తోంది. నోటి దురుసుకు చేయి జోరుకు మారు పేరుగా నిలిచిన చింతమనేని గతంలో టీడీపీ హయాంలో ఉన్నపుడు మహా ఉజ్వలంగా వెలిగిపోయారు. తన దెందులూరు నియోజకవర్గానికి ఆయనే ముఖ్యమంత్రి, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, గనులు.. ఇలా అన్ని శాఖలకూ ఆయనే అధిపతి. అడ్డొస్తే అడ్డంగా నరికేసినంత పని చేసేవారు. ఆ దూకుడులో భాగంగానే ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిని ఈడ్చి కొట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ తరువాత అనుమతులు లేకుండా అడవీ భూముల్లో రోడ్లు వేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ సిబ్బందిని కొట్టారు.. అంతేకాకుండా అధికారంలో ఉన్నపుడు నోటి దురుసును అడ్డూ అదుపూ లేకుండా పోయేది. 'ఏంటీ పవన్ కళ్యాణ్ మద్దతుతో కదా మీరు గెలిచారు' అని అడిగితే.. 'హహ.. పవన్.. ఒక సన్నాసి.. సొంత అన్నను పాలకొల్లులో గెలిపించలేనివాడు మా చంద్రబాబును గెలిపిస్తాడా..? ఊరుకోండయ్యా..' అని సెటైర్లు వేశారు. 'ఒరేయ్ మీరు ఎస్సీలు..! మీకెందుకురా రాజకీయాలు..? మేము రాజకీయాలు చేస్తాం' అని ఓపెన్ సభలో చెప్పడం కూడా ఆయనకే చెల్లింది. ఆ తరువాత ప్రభుత్వంతో పాటు అతనూ ఓడిపోయినా కూడా.. అయన జోరు తగ్గకపోయేసరికి పోలీస్ కేసుల్లో పడ్డారు. మళ్ళీ బయటకు వచ్చాక అదే దూకుడు చూపడం మొదలైంది. మొన్నటికి మొన్న తన వ్యవసాయ భూముల్లో మేకలు మేస్తున్నాయని కొందరు మేకలకాపరులమీద దాడి చేయడమే కాకుండా రెండు మేకలు సైతం తన కార్లో ఎత్తుకెళ్ళి తనకు ఎదురే లేదని మరోమారు చాటిచెప్పారు. అది కాస్తా వివాదంగా.. యాదవులు సంఘటితమై గళం ఎత్తేసరికి ఆయన కాస్త వెనక్కితగ్గారు. ఇదిలా ఉండగా ఆయనకు మళ్ళీ దెందులూరు టికెట్ ఇస్తారని వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు మొదలయ్యాయి. 'ప్రజా వ్యతిరేకి.. రౌడీ అయిన చింతమనేని మాత్రం వద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ అయన వ్యతిరేకులు, కొందరు టీడీపీ నాయకులూ ఫ్లెక్సీలు పెట్టారు. ఇది కాస్తా చింతమనేని ప్రభాకర్‌కు ఇబ్బందికరంగా మారింది. తనను ఓడించిన వైఎస్సార్సీపీ నాయకుడు అబ్బయ్య చౌదరి మీద ప్రతీకారం తీర్చుకుంటానని భావించి.. ఎన్నికలకోసం వెయిట్ చేస్తున్న చింతమనేని ప్రభాకర్‌కు ఇప్పుడు ఇలా వ్యతిరేకపవనాలు వీయడం ఇబ్బందికరంగా మారింది. మరి చంద్రబాబు ఆయనను మారుస్తారో.. కొత్తవాళ్లను తీసుకొస్తారో.. లేదా 'రౌడీలకు టిక్కెట్లు ఇవ్వకపోతే ఎలా ? వాళ్ళే కదా అసలైన నాయకులూ' అని భావించి మళ్ళీ ఆయనకే టికెట్ ఇస్తారో చూడాలి. -- సిమ్మాదిరప్పన్న ఇవి చదవండి: చంద్రబాబు.. లోకేశ్‌కు మేము పేరు పెట్టలేమా?: మంత్రి బుగ్గన ఫైర్ -
చంద్రబాబు నాన్చుడి ధోరణి.. డౌటెవరు?, ఔటెవరు?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పరుగులు పెట్టిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు పెద్ద పీట వేస్తూ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతోంది. ప్రతిపక్ష టీడీపీలో మాత్రం ఈ విషయంలో గందరగోళం నెలకొంది. గెలుపు గుర్రాలేవో, కుంటి గుర్రాలేవో తేల్చుకోలేక సతమతమవుతోంది. సీట్లు ఎవరికి ఇవ్వాలో తెలీక తలపట్టుకుంటోంది. ఈ నాలుగున్నరేళ్లూ చురుకై న పాత్ర పోషించడంలో సీనియర్ నాయకులు ఘోరంగా విఫలమైన నేపథ్యంలో మళ్లీ వారికి టికెట్లిస్తే పుట్టి మునుగుతుందేమోనన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. వీళ్లకు ఈసారి డౌటే..? కొంతమంది సీనియర్ నాయకులకు ఈసారి టికెట్లు ఇవ్వడానికి అధిష్టానం నిరాకరిస్తోంది. ఇందులో తొలివరసలోకి రెండు జిల్లాల పార్టీ అధ్యక్షులు ఉన్నట్టు తెలిసింది. కాలవ శ్రీనివాసులు రాయదుర్గంలో కచ్చితంగా ఓడిపోతారని, అందుకే పార్లమెంటుకు పంపించాలని ఆలోచిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిని కూడా పెనుకొండ అసెంబ్లీ కాకుండా హిందూపురం పార్లమెంటుకు పోటీ చేయించాలన్న యోచనలో ఉన్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను కృష్ణా జిల్లాకు పంపాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్లకు హుళక్కేనా? గుంతకల్లులో జితేందర్‌గౌడ్‌ను తప్పించి మరొకరికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఇక.. శింగనమలలో బండారు శ్రావణికి టికెట్ అనుమానంగా ఉంది. ధర్మవరం టికెట్ రేసులో ఉన్న పరిటాల శ్రీరామ్‌కు నిరాశ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయి, బీజేపీలో చేరిన వరదాపురం సూరిని తిరిగి పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వాలని ఉన్నారు. కళ్యాణదుర్గంలోనూ గతంలో పోటీచేసిన అభ్యర్థిని నిలపడం లేదు. అనంతపురం అర్బన్ టికెట్ ఈసారి ప్రభాకర్ చౌదరికి లేదని కరాఖండీగా చెప్పినట్టు తెలుస్తోంది. కదిరిలో కందికుంట ప్రసాద్‌కు నకిలీ డీడీల కేసులో శిక్ష ఖరారైన నేపథ్యంలో ఆయన భార్యకు టికెట్ ఇస్తే గెలుస్తుందా అన్న అనుమానంలో అధినాయకత్వం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థుల ఎంపిక గందరగోళంగా ఉందని ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు నాన్చుడు ధోరణి తమ మెడకు చుట్టుకుంటోందంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. రూ.20 కోట్లు ఎక్కడ తేవాలి? ఇటీవల జిల్లాలోని టీడీపీ ఓ నియోజకవర్గ నేత టికెట్ కోసం ప్రయత్నించగా రూ.20 కోట్లు ఉంటే చూపించు టికెట్ ఆలోచిస్తాం అని అధిష్టానం చెప్పినట్లు తెలిసింది. రూ.20 కోట్లు రెడీ చేసుకుంటేనే టికెట్ ఇస్తామని, లేదంటే వేరే ఆలోచిస్తామని తెగేసి చెప్పడంతో చాలామంది నాయకులు బెంబేలెత్తుతున్నారు. రిజర్వుడు నియోజకవర్గ అభ్యర్థులకు కూడా డబ్బు రెడీ చేసుకుంటేనే టికెట్ ఉంటుందని చెబుతుండడంతో పోటీకి ముందుకొచ్చే అభ్యర్థులు కూడా వెనకడుగు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీని వైఎస్సార్సీపీ చావుదెబ్బ కొట్టింది. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టిస్తుండడంతో ఇప్పటికీ కోలుకోలేదు. ఈ క్రమంలోనే చంద్రబాబు వైఖరితో పార్టీ పరిస్థితి పూర్తిగా కనుమరుగైపోయే దశకు చేరుకుంటోందని ఆ పార్టీ కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు నిట్టూరుస్తున్నారు. ఇవి చదవండి: టీడీపీలో ట్విస్ట్.. కేశినేని నానికి షాకిచ్చిన చంద్రబాబు -
తెలుగు తమ్ముళ్ల డిష్యుం డిష్యుం! తన్నుకున్నారిలా..
తూర్పుగోదావరి: కొత్త సంవత్సరం ఆరంభం రోజునే తునిలో తెలుగు తమ్ముళ్లు తన్నులాటలకు దిగారు. యనమల బ్రదర్స్ అనుచరులు రెండు వర్గాలుగా విడిపోయి.. డిష్యుం డిష్యుం అంటూ పిడిగుద్దులు కురిపించుకున్నారు.. తన కళ్ల ముందే తెలుగు ‘తమ్ముళ్లు’ అరుపులు, కేకలతో.. ముష్టిఘాతాలతో ఫైటింగ్‌కు దిగినా.. ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు సైలెంటుగా ఉండిపోవడం చూపరులను విస్మయపరచింది. తన వరకూ వస్తేనే కానీ తత్త్వం బోధపడదంటారు పెద్దలు. ప్రజాదరణ కోల్పోయి, అధికారానికి దూరమై ఏళ్లు గడుస్తున్నా పార్టీలో గ్రూపులను కట్టడి చేయలేని దుస్థితిని తెలుగుదేశం అగ్ర నేతలు ఎదుర్కొంటున్నారు. టీడీపీలో గ్రూపు రాజకీయాలకు ఆది గురువుగా విమర్శలు ఎదుర్కొనే శాసనమండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడుకు ఇప్పుడు దాదాపు అటువంటి పరిస్థితే ఎదురైంది. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఆయన.. టీడీపీ ఆవిర్భావం నుంచీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాపై ఆధిపత్యం కోసం.. ఇటు కాకినాడ మెట్ట ప్రాంతం, అటు కోనసీమలో గ్రూపులను పెంచి పోషిస్తూ వచ్చారు. టీడీపీ అధికారంలో ఉండగా జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, దివంగత నేతలు మెట్ల సత్యనారాయణరావు, బొడ్డు భాస్కర రామారావులను గ్రూపులుగా చేసి, ఉమ్మడి జిల్లాపై పెత్తనాన్ని చెలాయించిన చరిత్ర రామకృష్ణుడు సొంతమనే వారు ఆ పార్టీలో కోకొల్లలు. ఇన్నేళ్ల పాటు తాను పెంచి పోషించిన గ్రూపు రాజకీయాలు.. తీరా సొంత నియోజకవర్గం తునిలో భగ్గుమనేసరికి రామకృష్ణుడికి దిక్కుతోచడం లేదనే చర్చ టీడీపీ వర్గాల్లో నడుస్తోంది. రగులుతున్న కృష్ణుడి వర్గం సొంత కుమార్తె దివ్యను తన రాజకీయ వారసురాలిగా చేసేందుకు.. మూడు దశాబ్దాలుగా తన వెంట నడిచిన వరుసకు సోదరుడైన యనమల కృష్ణుడిని బలవంతంగా టీడీపీ తుని నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి రామకృష్ణుడు తప్పించారు. అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను దివ్యకు అప్పగించారు. ఆమెకు పార్టీలో ఎదురుండకూడదనే ఉద్దేశంతో కృష్ణుడిని వ్యూహాత్మకంగానే తప్పించారని ఆయన వర్గం కొంత కాలంగా రగిలిపోతోంది. దివ్యకు పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించడంపై కినుక వహించిన కృష్ణుడు.. కొంత కాలం అలకబూనారు. రాజకీయంగా పక్క చూపులు చూశారు. ఆ సమయంలో నియోజకవర్గ బాధ్యతలను రామకృష్ణుడి సొంత సోదరుని కుమారుడు రాజేష్ తన భుజాన వేసుకున్నారు. విధి లేని పరిస్థితుల్లో కృష్ణుడు టీడీపీలో తిరిగి క్రియాశీలకంగా మారారు. పార్టీపై పెత్తనం కోసం ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. అప్పటికే దివ్య కనుసన్నల్లో నియోజకవర్గ బాధ్యతలను కృష్ణుడు చూస్తున్నా.. టీడీపీ తొండంగి మండల బాధ్యతలు మాత్రం రాజేష్ చేతుల్లోనే ఉన్నాయి. ఒకప్పుడు నియోజకవర్గం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న కృష్ణుడి వర్గానికి ఇది అవమానంగానే అనిపించింది. దీంతో ఆ వర్గం సమయం కోసం వేచి చూస్తోంది. ముందస్తు వ్యూహమేనా..! రాజేష్‌ను ఎంత మాత్రం భరించలేని కృష్ణుడు నయాన భయాన ఆయనను పార్టీకి దూరం చేసేందుకు కొంతకాలం నుంచి ఎత్తుగడలు వేస్తున్నారు. దీనిలో భాగంగానే తొలి ప్రయత్నంగా సోమవారం జరిగిన నూతన సంవత్సర వేడుకలను వేదికగా చేసుకున్నారు. రామకృష్ణుడు కళ్లెదుటే రచ్చరచ్చ చేశారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే కృష్ణుడు తన అనుచరులతో రాజేష్‌పై దాడి చేయించారని టీడీపీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. తన్నుకున్నారిలా.. తుని మండలం ఎస్.అన్నవరం శివారు గెడ్లబీడు వద్ద సాయి వేదికలో సోమవారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఇందులో యనమల రామకృష్ణుడు, దివ్యలకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు పలు గ్రామాల నుంచి తెలుగు తమ్ముళ్లు వచ్చారు. వారు వరుస క్రమంలో వెళ్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో రామకృష్ణుడి సొంత అన్న కుమారుడు రాజేష్ అక్కడకు చేరుకున్నారు. రామకృష్ణుడిని, దివ్యను కలిసేందుకు క్యూతో ప్రమేయం లేకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. అదను కోసం వేచి ఉన్న కృష్ణుడి వర్గీయులు దీనిని అవకాశంగా మలచుకున్నారు. అందరూ క్యూలోనే రావాలంటూ అక్కడున్న వారిని అప్పటికే వారు కట్టడి చేస్తున్నారు. ఈ సమయంలో రాజేష్ క్యూలో కాకుండా నేరుగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో అతడిని కృష్ణుడి వర్గం లక్ష్యంగా చేసుకుని ఒక్కసారిగా దాడులకు దిగింది. రాజేష్‌పై ఆయన సొంత చిన్నాన్న రామకృష్ణుడు, దివ్య సమక్షంలోనే పిడిగుద్దులతో ఈ దాడి జరిగింది. అయినప్పటికీ రామకృష్ణుడి అనుచరులు కిమ్మనకుండా ఉండిపోయారు. ఇరు వర్గాలకూ సర్ది చెప్పలేక, వారిని కట్టడి చేయలేక నిర్లిప్తంగా చూస్తూ ఊరుకుండిపోయారు. ఆయన సైలెంటుగా ఉండిపోవడానికి కృష్ణుడు దూరమైతే రాజకీయంగా ఇబ్బంది పడతామనే భయం తప్ప మరొకటి కారణం కాదని పలువురు అంటున్నారు. కుమార్తె దివ్య ఇన్చార్జిగా ఉన్న సొంత నియోజకవర్గం తునిలోనే కళ్లెదుటే ఇంత జరిగినా.. చివరకు ఇరువర్గాలను సముదాయించడానికి తలప్రాణం తోకకొచ్చినట్టయ్యిందని అంటున్నారు. ఇన్నేళ్లూ పార్టీలో గ్రూపులను ప్రోత్సహించిన యనమల.. రక్త సంబంధీకులు, దాయాదుల పోరు, గ్రూపు రాజకీయాలు భగ్గుమనడంతో.. వాటి ప్రభావాన్ని స్వయంగా రుచి చూశారని టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఇవి చదవండి: దిగజారుతున్న టీడీపీ గ్రాఫ్.. 'పరిటాల' ఓవరాక్షన్‌కు బ్రేక్..! -
నా ఆత్మహత్యకు ఆ ముగ్గురే కారణం!
కరీంనగర్: ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇందుకు ఆ ముగ్గురే కారణం..’ అంటూ ఓ యువకుడి సూసైడ్‌నోట్ సిరిసిల్లలో సోమవారం కలకలం సృష్టించింది. బాధితుడు మీడియా ప్రతినిధులకు నేరుగా వాట్సాప్‌లో పంపించిన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్లకు చెందిన ఓ ప్రముఖుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేశాడు. ఎన్నికల్లో అతని విజయం కోసం ఆ యువకుడితోపాటు అతని స్నేహితులు పనిచేసేందుకు రూ.లక్ష పారితోషికం మాట్లాడుకున్నట్లు తెలిపారు. అయితే ఎన్నికల్లో అతను.. లేదంటే ఓ జాతీయ పార్టీ ప్రతినిధి గెలుస్తారని.. మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పుకొచ్చాడని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత డబ్బులు ఇవ్వమంటే బెదిరింపులకు పాల్పడుతున్నాడని సదరు యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనపైనే కేసు పెడతామని బెదిరించినట్లు వాపోయాడు. చేసిన పనికి డబ్బులు రాక తనతోపాటు స్నేహితులు కూడా ఇబ్బందుల పడుతున్నారని పేర్కొన్నాడు. ఎమ్మెల్యేగా పోటీచేసిన సదరు అభ్యర్థి, అతని సడ్డకుడు, పద్మశాలి వర్గానికి చెందిన మరో నాయకుడు కలిసి మోసం చేశారని, తన ఆత్మహత్యకు వారే కారణం అంటూ ఆ నోట్ రాసుకొచ్చాడు. ఈ విషయంపై సిరిసిల్ల పోలీసులు విచారణ చేపడుతున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం! -
‘ఖద్దరు గుండె’ల్లో కలవరం!
సాక్షి, కామారెడ్డి: పదవుల మీద వ్యామోహంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన వాళ్లలో చాలా మంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో బీపీ, షుగర్ వంటి సమస్యలతో సతమతమవుతూ హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్‌లకు గురవుతున్నారు. అలాంటి వారిలో కొందరు సమయానికి వైద్యం అంది ప్రాణాలతో బయట పడుతుండగా, మరికొందరు తనువు చాలిస్తున్నారు. కాలం కలిసిరాక పదవులు దరిచేరలేదనే వేదనకు గురై కొందరు, దర్పం కోసం అడ్డగోలు ఖర్చులు చేసి అప్పులపాలై అవస్థలు పడి మరికొందరు అనారోగ్యం పాలవుతున్నారు. చాలా మంది నాయకులు, ప్రజాప్రతినిధులు బీపీ, షుగర్ లెవల్స్ పెరిగిపోయి హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్‌లకు గురవుతున్నారు. ఒక్కోసారి తీవ్ర ఒత్తిడితో గుండెనాళాల్లో రక్తప్రసరణ నిలిచిపోయి, బ్రెయిన్లో నరాలు చిట్లిపోయి సకాలంలో వైద్యం అందక ప్రాణా లు కోల్పోతున్నారు. రాజకీయంగా ఎదిగినవారే కాకుండా ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. మెజారిటీ ప్రజాప్రతినిధులు, నాయకుల్లో బీపీ, షుగర్ సమస్య కామన్‌గా కనబడుతోంది. ట్యాబె ట్స్ వాడేవాళ్లు కొందరైతే, ఇన్సులిన్ తీసుకుంటున్నవారూ కొందరున్నారు. బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేసుకునేందుకు కొందరు నాయకులు, ప్రజాప్రతినిధులు నిత్యం వ్యాయామం, యోగా చేస్తుండగా, ఇంకొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా ఏదైనా సమ స్య ఎదురైనపుడు తీవ్ర ఒత్తిడికి గురై హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్‌లు వచ్చి తనువు చాలిస్తున్నారు. ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేసిన ఈగ గంగారెడ్డి తనకు ఏదైనా నామినేటె డ్ పదవి వస్తుందేమోనని ఆశపడ్డారు. ఏదీ దక్కలే దు. నాయకుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవ డంతో మానసిక వేదనతో పక్షవాతానికి గురై ఆస్ప త్రిపాలయ్యారు. అదృష్టం కొద్దీ బయటపడినా ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోయారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి జెడ్పీటీసీ మిన్కూ రి రాంరెడ్డికి ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల తర్వాత జెడ్పీ వైస్ చైర్మన్ పదవి రావాలి. కానీ పదవి రాకపోవడంతో ఆయన మనోవేదనకు గురవగా, గుండె నాళాలు బ్లాక్ అయ్యాయి. సమయానికి ఆ స్పత్రికి వెళ్లడంతో స్టంట్లు వేశారు. దీంతో కోలుకున్నాడు. భిక్కనూరు జెడ్పీటీ సీ సభ్యురాలి భర్త, మాజీ స ర్పంచ్ నాగభూషణంగౌడ్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌తో పక్షవాతానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భిక్కనూరులో మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న హన్మంత్‌రెడ్డి ఇటీవల కిడ్నీ సమస్యతో ఆస్పత్రిపాలై చికిత్స పొందుతున్నారు.భిక్కనూరు మార్కెట్ కమిటీ మా జీ చైర్మన్ బాణాల అమృతరెడ్డి కిడ్నీలు దెబ్బతినడంతో ఆయన భార్య కిడ్నీ ఇవ్వగా కోలుకున్నారు. ఇక్కడే మార్కెట్ చైర్మన్‌గా పనిచేసిన చిట్టెడి భగవంతరెడ్డి రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో తిరిగి ఆర్థికంగా చితికిపోయి అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారెందరో.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పలువురు నాయకులు హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్‌లతో ప్రాణాలు కోల్పోయారు. కామారెడ్డి జిల్లాలో అయితే గ్రామ, మండల స్థాయిలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు గా పనిచేసిన వాళ్లు పలువురు ప్రాణాలు కో ల్పోయారు. గాంధారి మండలం గౌరారం సర్పంచ్‌గా పనిచేసిన మహేందర్ రెండేళ్ల కింద గుండెపోటుతో చనిపోయాడు. ఇటీవల జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ సంపత్‌రెడ్డి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కొంత కా లం కిందటే ములుగు జెడ్పీ చైర్మన్ జగదీశ్ గుండెపోటుతో చనిపోయారు. గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పనిచేసిన పాలమూరు జిల్లాకు చెందిన గాయకుడు సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఒత్తిడిని అధిగమిస్తేనే.. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లలో కొందరు అవకాశాలు అందింపుచ్చుకుని తక్కువ కాలంలో ఎదుగుతున్నారు. వాళ్లను చూసి తాము కూడా స్థాయికి మించిన ఆలోచనలు చేస్తున్నారు. కొందరు దశాబ్దాలు కష్టపడినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. అలాగని అందరిదీ అదే పరిస్థితి అని కాదు. కానీ కొందరు ఒక్కసారిగా ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఆరాటంతో అడ్డగోలుగా ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నారు. తాము పెట్టుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో ఆందోళనకు గురై ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. అత్యాశకు పోకుండా, స్థాయికి మించి ఆలోచనలు చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామం, మెడిటేషన్, యోగా, వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పలువురు సూచిస్తున్నారు. -
ఎన్నికల గ్యారంటీలు ‘జుమ్లా’లేనా?
దేశంలోని దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు తరచుగా చెప్పే మాట తమకు అధికారం ఇస్తే ప్రజలను సాధికారులుగా చేస్తాం అన్నది. అసలు సాధికారత (ఎంప వర్మెంట్) అంటే అర్థం ఏమిటి? దీనికి విస్తృతమైన అర్థాలు ఉన్నాయి. ముందుగా శారీరకంగా బలహీనంగా ఉన్న వ్యక్తి లేదా అతని కుటుంబాన్ని బలోపేతం చేయడం, ఆ తర్వాత ఆ కుటుంబాన్ని సామాజికంగా బలోపేతం చేయడం అన్నది సాధికారతలో ఓ భాగం. కుటుంబాన్ని బలోపేతం చేయడ మనే ప్రక్రియ ఎలా జరుగుతుంది? ప్రతిరోజూ బలవర్ధకమైన ఆహారాన్ని వ్యక్తికి లేదా అతని కుటుంబానికి అందించాలి. వారు ఆరోగ్యంగా ఉండేటట్లు చూడాలి. అలా ఎంతకాలం చేయాలి? జీవితకాలంపాటు ఈ ప్రక్రియ కొనసాగాలి. కానీ, ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉండేది ఐదేళ్లపాటు మాత్రమే. ఐదేళ్లు ఉండే ప్రభుత్వం ఏ వ్యక్తినైనా, కుటుంబా న్నైనా, వర్గాన్నైనా జీవితకాలం పాటు పోషించలేదు కదా? అటువంటప్పుడు వారు సాధికారులు ఎలా అవుతారు?! ఆధునిక చైనా పితామహుడిగా చెప్పుకొనే డెంగ్ జియావో పింగ్ దీనినే ఓ ఉదాహరణ ద్వారా వివరించారు. ఆకలి గొన్న వ్యక్తికి రోజూ ఓ చేప చొప్పున ఇస్తూపోతే... అది ఇచ్చినంత కాలమే అతని ఆకలి తీరుతుంది. అదే అతనికి చేపలు పట్టే విద్య నేర్పించి, ఓ వలను ఇవ్వగలిగితే అతడు తన జీవితకాలం తన పొట్టను తానే పోషించుకొంటాడు. పైగా తన కుటుంబాన్ని సైతం ఆదుకోగలుగుతాడు. ప్రభు త్వాలు ప్రజలకు సంక్షేమం ఎలా ఇవ్వాలో సూక్ష్మంగా చెప్పాడు డెంగ్ ఈ ఉదాహరణ ద్వారా. ఇదే సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలో పెట్టడం ద్వారానే డెంగ్ తన పాలనలో చైనాను ప్రపంచంలో ఓ బలమైన ఆర్థిక శక్తిగా రూపొందించగలిగాడు. ప్రజల సమస్త వ్యక్తిగత, సామాజిక అవసరాలన్నింటినీ తామే తీర్చగలమన్న భ్రమల్ని వారిలో కల్పిస్తూ కొన్ని రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకొంటున్నాయి. ఓట్ల కోసం హామీలు గుప్పించడం రాజకీయ పార్టీలకు రివాజుగా మారింది. అది ఇటీవలి కాలంలో మరింత వెర్రితలలు వేస్తోంది. వ్యవసాయరంగం మెరుగుదల, మౌలిక సదుపాయాల విస్తరణ; విద్య, వైద్యం వంటివి సామాన్యులకు అందుబాటులోకి తేవడం, శాంతి భద్రత లను పటిష్టపర్చి పారిశ్రామిక పెట్టుబడుల్ని ఆకర్షించడం ద్వారా నిరుద్యోగాన్ని పారద్రోలడం వంటి చర్యలు ఏ ప్రభుత్వానికైనా ప్రాధాన్యం కావాలి. మహిళలు, బాలలు, వృద్ధులకు తగిన సామాజిక సంరక్షణ కల్పించడం ప్రభు త్వాల బాధ్యత. వీటిపైన దృష్టి పెట్టగలిగితే ప్రజలను సాధికారుల్ని చేసినట్లే. భారతదేశం నిద్రపోతున్న ఓ ఆర్థిక దిగ్గజం (స్లీపింగ్ జెయింట్) అని 70వ దశకంలోనే నాటి సింగపూర్ అధ్యక్షుడు ‘లీ కువాన్ యు’ అన్నారు. 1991లో పీవీ నర సింహారావు దేశ ప్రధాని అయిన తర్వాత గానీ దేశానికి పట్టిన స్తబ్ధత వదలలేదు. దశాబ్దాలపాటు పట్టి పీడించిన కొన్ని జాడ్యాలను వదిలించుకొని ఆర్థిక వ్యవస్థ వడి వడిగా అడుగులు వేస్తూ... పీవీ – డా‘‘ మన్మోహన్ సింగ్‌ల ద్వయం చూపిన సంస్కరణల బాటలో ముందుకు సాగిన ప్రస్థానానికి దాదాపు 3 దశాబ్దాల వయస్సు. ఈ కాలంలో దేశం చాలా రంగాలలో అభివృద్ధి చెందిన మాట నిజం. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నది అన్నది కూడా ఓ వాస్తవం. అయితే, ఈ ప్రస్థానం ఏ దిశగా సాగుతోంది? దేశంలోని సహజ వనరులన్నీ ప్రజలందరికీ సమానంగా చెందాలన్న రాజ్యాంగ లక్ష్యాలకు, రాజ్యాంగ నిర్మాత డా‘‘ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు భిన్నంగా దేశ సంపద కొంత మంది పారిశ్రామిక వేత్తలకు దఖలు పడింది. ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్‌కు చెందిన ఇద్దరు లేదా ముగ్గురు మొదటి వరుసలో ఉండగా, మరో 10 మంది రెండో వరుసలో కనిపిస్తారు. అదే సమయంలో... ప్రపంచ ఆకలి సూచీలో 180 దేశాల జాబితాలో ఇండియా 165 –170 స్థానాల మధ్య ఊగిసలాడుతోంది. మనకంటే పొరుగునున్న ఆసియా దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్ ఆకలి సూచీలో మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఆర్థిక దిగ్గజమైన భారత్‌కు ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా? ఈ 3 దశాబ్దాలలో దేశ సంపద బాగా పెరిగింది. దేశ స్థూల ఉత్పత్తి 40 లక్షల కోట్లు దాటింది. అదే సమయంలో దేశంలో ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోయినట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. దేశంలో పేదలు మరింత పేదలయ్యారు. సంపన్నులు పైపైకి ఎగబాకుతున్నారు. ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన సోషలిజం స్థానంలో చాలాకాలంగా ‘పాపులిజం’ వచ్చి చేరింది. ‘అన్ని వర్గాలకూ అన్నీ’ అన్నదే పాపులిజం మూల సూత్రం. ఓట్లు రాల్చే ఈ ‘ఇజం’ చుట్టూనే నేటి రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. ఈ పాపులిజం ఇటీవలి కాలంలో వెర్రితలలు వేయడమే నేటి విషాదం! దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు ‘జాకబ్ జుమా’ పాపులిస్ట్గా మారి దేశాన్ని అప్పుల ఊబిలో నెట్టివేశారు. ఆ దేశ జీడిపీలో అప్పుల నిష్పత్తి 50 శాతం దాటిన నేపథ్యంలో... సొంత పార్టీ వారే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి పదవి నుంచి దించి వేశారు. ‘జాకబ్ జుమా’ ఉదంతం ప్రపంచంలో అనేక దేశాలకు గుణపాఠం నేర్పింది. మొత్తం జీడీపీలో అప్పుల శాతం 24 శాతం మించరాదనీ, అదికూడా వృద్ధిరేటు 7 శాతం దాటినప్పుడే అది ఆమోదయోగ్యం కాగలదనీ ప్రముఖ ఆర్థికవేత్తలు నిగ్గు తేల్చారు. అయితే, భారత్‌లో కొన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి లెక్కల్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అధికారం కోసం మొదట కర్ణాటకలో, ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలు, ఇతర హామీల విలువ కనీసం రెండు రాష్ట్రాల బడ్జెట్‌తో సమానం. ఇవి నెరవేర్చాలంటే ప్రజలపై అధికంగా పన్నులు వేయాలి, ఎఫ్.ఆర్.బి.ఎం.ను మించి అప్పులు తేవాలి. అవీ చాలక పోతే ప్రభుత్వ భూములు అమ్మాలి. ఇప్పటికే విలువైన ప్రభుత్వ భూములు చాలావరకు వేలంలో పోయాయి. భవి ష్యత్ అవసరాలకోసం తిరిగి భూములు కొనాల్సిన దుఃస్థితి ఇకపై రావొచ్చు. ఇక ఎటొచ్చీ, కొన్ని పథకాలను అమలు చేయకుండా మంగళం పాడొచ్చు. అలాగే ఎన్నికల ముందు ప్రకటించిన గ్యారంటీలను సైతం ఎత్తివేయవచ్చు. రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోకు ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడమే ఎడాపెడా హామీలు ప్రకటించడానికి కారణం అవుతోంది. మన దేశంలో రాజకీయ పార్టీల హామీల అంశంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకో వడానికి నిరాకరిస్తున్నాయి. అందువల్ల ఆకాశమే హద్దుగా కొన్ని రాజకీయ పార్టీలు హామీల సునామీ సృష్టిస్తున్నాయి. 2014లో బీజేపీ తన మేనిఫెస్టోలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అందిస్తామని చెప్పింది. విదేశాల్లో పోగుపడిన నల్ల ధనాన్ని వెనక్కి రప్పించి అందరి ఖాతాల్లో 15 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తామని బీజేపీ అగ్రనేతలు నమ్మకంగా చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ హామీల సంగతేమిటని కేంద్రమంతి ‘అమిత్ షా’ను నిలదీస్తే, అవన్నీ ‘ఎన్నికల జుమ్లా’ అని ఆయన ఒక్క మాటతో తేల్చేశారు. అంటే, ఎన్నికల సందర్భంలో ఎన్నో గాలి వాగ్దానాలు చేస్తుంటాం. వాటిని మీరు సీరియస్‌గా తీసుకొంటే ఎలా? అనే అర్థంలో కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. ప్రజలు ఈ ‘జుమ్లా’ మాటలు నమ్మడం లేదనే కారణంగానే ఇపుడు గ్యారెంటీలు ఇస్తున్నారు. సదరు గ్యారెంటీలు అమలు జరుగుతాయన్న గ్యారెంటీ కూడా లేదు. ఇదొక చేదు వాస్తవం. వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
మాతోనే ప్రజలని ఎందుకన్నార్ సార్! ఇప్పుడు చూడండి అందరూ వెళ్లిపోయారు!
మాతోనే ప్రజలని ఎందుకన్నార్ సార్! ఇప్పుడు చూడండి అందరూ వెళ్లిపోయారు! -
ఆ పార్టీలో టికెట్ ఇవ్వనందుకే చేరాను.. సారీ సిద్ధాంతాలు నచ్చక చేరా!!
ఆ పార్టీలో టికెట్ ఇవ్వనందుకే చేరాను.. సారీ సిద్ధాంతాలు నచ్చక చేరా!! -
అమ్మ నుంచి చాలా నేర్చుకున్నా
సాక్షి, హైదరాబాద్: అమ్మ నుంచి ఎంతో నేర్చు కున్నానని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు వెల్లడించారు. ఆది వారం బేగంపేట్‌లోని గ్రాండ్ కాకతీయ హోటల్లో ఫ్యూచర్ ఫార్వార్డ్ తెలంగాణలో భాగంగా ‘విమెన్ ఆస్క్ కేటీఆర్’ ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజా జీవితంలో ఉండటంతో తన తండ్రితో తక్కువ సమయం గడిపానన్నారు. ‘మా అమ్మని చూసి చాలా నేర్చుకున్నా. నా భార్య కూడా చాలా ఓపికగా ఉంటుంది. నా చెల్లి కవిత చాలా డైనమిక్. మా కుటుంబంలోనే తనంత ధైర్యవంతులు లేరు. నా కూతురు ఇంత చిన్న వయసులోనే చాలా బాగా ఆలోచిస్తుంది. కూతురు పుట్టాక నా జీవితం చాలా మారింది’అని వివరించారు. మహిళలు మానసికంగా చాలా బలవంతులు.. హైదరాబాద్ నుంచి వచ్చిన క్రీడాకారుల్లో ఎక్కువ మంది మహిళలే ఉండటం గర్వకారణమన్నారు. కోవిడ్ సమయంలో సుచిత్రా ఎల్లా, మహిమా దాట్ల వంటివారు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. మహిళలు మానసికంగా చాలా బలంగా వుంటారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతీ ఇంటికి మంచినీళ్లు అందించామని, మైనారిటీ పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించామని చెప్పారు. ప్రతి చిన్నారిపై రూ.10 వేలకు పైగా ఖర్చు చేస్తున్నామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 61 శాతానికి పెరిగాయని తెలిపారు. స్త్రీనిధి కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. తెలంగాణ, ఏపీలో మహిళలు స్త్రీనిధి రుణాలను 99 శాతం తిరిగి చెల్లిస్తున్నారని చెప్పారు. తాము మేనిఫెస్టోలో మహిళల కోసం ప్రత్యేకంగా పెట్టిన పథకాల్లో కొన్నింటిని పూర్తి చేశామని, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని తెలిపారు. మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, కల్యాణ లక్ష్మి, అమ్మఒడి వంటి సేవలను తెచ్చామని వివరించారు. నెగెటివ్బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేటీఆర్ చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు చాలా తక్కువ వడ్డీతో రుణాలిస్తామన్నారు. డీప్ ఫేక్‌తో రాజకీయ నేతలకూ ప్రమాదమే.. కాగా, డీప్ ఫేక్.. మహిళలకు మాత్రమే కాదు.. రాజకీయ నేతలకు సైతం ప్రమాదమేనని చెప్పారు. తమ ప్రత్యర్థులు డీప్ ఫేక్ వాడి దుష్ప్రచారం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఒక్కోసారి టాక్సిక్‌గా తయారవుతోందని, ప్రతిపక్షాలు సోషల్ మీడియాని వాడుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. మాట్లాడే హక్కుని ఎదుటివారిని దూషించడానికి వాడకూడదని స్పష్టంచేశారు. మహిళకు సంబంధించిన సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నామని చెప్పారు. ప్రతి పక్షాలకు కూడా బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని తెలుసని, కానీ వాళ్లు నటిస్తున్నారని అన్నారు. విద్యావంతులైన మహిళలు రాజకీయంగా కూడా అడుగులు వేయాలని కేటీఆర్ సూచించారు. -
పొలిటికల్ నేతలపై క్రిమినల్ కేసులు.. సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని(క్రిమినల్ కేసులకు సంబంధించి) కోరుతూ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను సుప్రీంకోర్టు.. హైకోర్టులకు అప్పగించింది. వివరాల ప్రకారం.. దేశంలో తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించే విషయంలో, ఏకరీతి మార్గదర్శకాలను రూపొందించడం కష్టమని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది. ఇదే సమయంలో అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను హైకోర్టులకు అప్పగించింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని, ఈ కేసులను ఏడాదిలోగా పరిష్కరించేలా చూడాలని అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించినట్లు పిటిషనర్, న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ్ తెలిపారు. Supreme Court issues directions for speedy disposal of criminal cases against MP/MLAs. Supreme Court says it would be difficult for it to form a uniform guideline for trial courts relating to speedy disposal of cases against MP/MLAs. Supreme Court asks High Courts to register a… pic.twitter.com/O2izpfV3Nl— ANI (@ANI) November 9, 2023 సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఇవే.. ►ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారాన్ని పర్యవేక్షించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలి. ►కేసులు త్వరగా పరిష్కరించడాన్ని, పర్యవేక్షించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్పనిసరిగా ప్రత్యేక టైటిల్ ఏర్పాటు చేయాలి ►అవసరాన్ని బట్టి ప్రత్యేక బెంచ్ క్రమ వ్యవధిలో కేసులు లిస్ట్ చేయాలి ►కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు హైకోర్టు తగిన ఆదేశాలు ఇవ్వాలి. VIDEO | "Today, the Supreme Court has given a historic verdict. The Supreme Court judgment has come with regard to our first prayer. The court has directed all the high courts to constitute a special bench to monitor cases of MPs, MLAs and ensure that these cases are decided… pic.twitter.com/WgcLerxIoR— Press Trust of India (@PTI_News) November 9, 2023 -
కేసీఆర్‌ని మట్టికరిపించిన ఏకైక నేత
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను తొలినాళ్లలో ఎన్నికల్లో ఓ నేత మట్టికరిపించారు. 1983లో కేసీఆర్ టీడీపీ నుంచి పోటీ చేయగా, ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి అనుంతుల మదన్ మోహన్ పోటీ చేశారు. నాటి ఎన్నికల్లో మదన్ మోహన్ కేసీఆర్‌పై 887 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే కేసీఆర్‌కు ఇదే మొదటి ఓటమి కావడం విశేషం. ఆ తర్వాత కేసీఆర్ 13 సార్లు వరుసగా విజయం సాధించారు. ఇందులో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే, ఐదుసార్లు ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు కేసీఆర్. కాగా తనను ఓడించిన మదన్ మోహన్‌ను కేసీఆర్ 1989, 1994లలో వరుసగా ఓడించారు. కొంతకాలానికి రాజకీయాలకు దూరమైన మదన్ మోహన్ 2004లో కన్నుమూశారు. -
పరమ పదవి సోపానం
మేకల కళ్యాణ్ చక్రవర్తి : ఎవరికి ఏం రాసిపెట్టి ఉంటుందో ఎవరికి తెలుసు అంటారు పెద్దలు. రాజకీయాల్లో అయితే ఈ నానుడి సరిగ్గా సరిపోతుంది. ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లోకి వచ్చే నాయకులు ఎప్పుడు ఎలాంటి పదవులు చేపడతారో, ఏ హోదాలో ప్రజల సేవకు అంకితమవుతారో ఊహించలేని పరిస్థితి. వారికి దేశ ప్రధాని మొదలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అసెంబ్లీ స్పీకర్లుగా, శాసనమండలి చైర్మన్లుగా, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా వివిధ హోదాల్లో పనిచేసే అవకాశం దక్కుతుంది. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పదవుల్లో ఏది దక్కినా రాజకీయ నాయకుడిగా విజయవంతమైనట్టే. ఇక మంత్రి హోదాలు అదనం. ఇలాంటి రాజకీయ నేతల జాబితా తెలంగాణలో చాంతాడు కంటే పొడవుగానే ఉందని చరిత్రను పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. పీవీది ప్రత్యేక స్థానం రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న పీవీ నర్సింహారావు దేశంలో అత్యున్నత రాజకీయ పదవులు అనుభవించారు. తన రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసిన మంథని నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పీవీ.. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహా్మనందరెడ్డి కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా, ప్రధాన మంత్రిగా కూడా పనిచేసిన ఘనత దక్కించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని హనుమకొండ, నంద్యాలతోపాటు మహారాష్ట్రలోని రాంటెక్, ఒడిశాలోని బరంపురం లోక్‌సభ స్థానాల నుంచీ పీవీ గెలుపొందారు. ఇక, ఆ తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పలు హోదాల్లో రాష్ట్ర, దేశ ప్రజలకు సేవచేసిన జాబితాలో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఆయన కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్ ఎంపీగా, సిద్ధిపేట, గజ్వేల్ ఎమ్మెల్యేగా, కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో మంత్రిగా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన ఆయన రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నారు. జాబితా చాలా పెద్దదే.. పలు చట్టసభల్లోకి ప్రవేశించిన నేతల్లో తెలంగాణకు చెందిన చాలా మంది ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో చురుగ్గా ఉన్నవారిని ఒక్కసారి పరిశీలిస్తే కిషన్‌రెడ్డి (ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర కేబినెట్ మంత్రి), ధర్మపురి శ్రీనివాస్ (ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి), సురేశ్òÙట్కార్ (జహీరాబాద్ ఎంపీ, నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే), సత్యవతి రాథోడ్ (డోర్నకల్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి), మాలోతు కవిత (మహబూబాబాద్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ)లు పలు పదవుల్లో పనిచేశారు. సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీతోపాటు అదే జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచారు. సోయం బాపూరావు, గెడం నగేశ్, రమేశ్ రాథోడ్‌లు కూడా ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీగా గెలుపొందారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి (మిర్యాలగూడ ఎంపీ, ఎమ్మెల్సీ, శాసనమండలి చైర్మన్‌గా), అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ఎంపీగా, పాతబస్తీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. తమ్మినేని వీరభద్రం (ఎంపీ, ఎమ్మెల్యే) పువ్వాడ నాగేశ్వరరావు (ఎంపీ, ఎమ్మెల్సీ), భట్టి విక్రమార్క (ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే), టి. జీవన్‌రెడ్డి (జగిత్యాల ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా), కె.ఆర్.సురేశ్‌రెడ్డి (ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్, రాజ్యసభ ఎంపీ), షబ్బీర్‌అలీ (ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి), బాలాగౌడ్ (నిజామాబాద్ ఎంపీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్), ఆకుల లలిత (ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ), జువ్వాది చొక్కారావు (ఎమ్మెల్యే, ఎంపీ), చెన్నమనేని విద్యాసాగర్‌రావు (ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి), కెప్టెన్ లక్ష్మీకాంతరావు (ఎమ్మెల్యే, ఎంపీ), బాగారెడ్డి (ఎమ్మెల్యే, ఎంపీ, రాష్ట్రమంత్రి), సోలిపేట రాంచంద్రారెడ్డి (ఎమ్మెల్యే, రాజ్యసభ ఎంపీ), దేవేందర్‌గౌడ్ (ఎమ్మెల్యే, మంత్రి, రాజ్యసభ ఎంపీ), పట్నం మహేందర్‌రెడ్డి (ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాష్ట్ర మంత్రి), డాక్టర్ కె.లక్ష్మణ్ (ఎంపీ, ఎమ్మెల్యే), వి.హనుమంతరావు (ఎమ్మెల్యే, ఎంపీ), సలావుద్దీన్ ఒవైసీ (ఎంపీ, ఎమ్మెల్యే), మల్లురవి (ఎంపీ, ఎమ్మెల్యే)లు కూడా పలు హోదాల్లో రాజకీయాల్లో సేవలందించారు. గత చరిత్రను తరచిచూస్తే జి.వెంకటస్వామి ఒకసారి ఎమ్మెల్యేగా, ఏడుసార్లు ఎంపీగా గెలుపొందారు. కాంగ్రెస్ నేత చకిలం శ్రీనివాసరావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, కమ్యూనిస్టు దిగ్గజాలు భీంరెడ్డి నర్సింహారెడ్డి, ధర్మభిక్షం, రావి నారాయణరెడ్డి,లు కూడా ఎమ్మెల్యే, ఎంపీలుగా పనిచేశారు. మూడు, నాలుగు హోదాల్లో.. రాష్ట్ర స్థాయిలోని ఉభయసభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కొందరు దక్కించుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఒక సభ, దేశ స్థాయిలో మరో సభలోకి ప్రవేశించారు మరికొందరు. రాష్ట్రస్థాయిలోని రెండు సభలు, జాతీయ స్థాయిలోని మరో సభలో అడుగుపెట్టారు ఇంకొందరు. కడియం శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎల్.రమణలు మూడు సభల్లో (అసెంబ్లీ, శాసన మండలి, పార్లమెంట్) ప్రవేశించిన అదృష్టజాతకులుగా నిలిచిపోతారు. కడియం, ఎల్.రమణ రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. ఇక, ఎమ్మెల్యే, ఎంపీ కేటగిరీలో ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న పలువురు నాయకులు మంత్రి హోదాలో కూడా పనిచేశారు. మల్లారెడ్డి (మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీ, రాష్ట్రమంత్రి), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్లగొండ ఎమ్మెల్యే, భువనగిరి ఎంపీ, మంత్రి), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కోదాడ, హుజూర్నగర్ ఎమ్మెల్యే, నల్లగొండ ఎంపీ, మంత్రి), ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి, వర్ధన్నపేట ఎమ్మెల్యే, వరంగల్ ఎంపీ, మంత్రి), ఎన్. ఇంద్రకరణ్‌రెడ్డి (ఆదిలాబాద్ ఎంపీ, నిర్మల్ ఎమ్మెల్యే, మంత్రి), వేణుగోపాలాచారి (ఆదిలాబాద్ ఎంపీ, నిర్మల్ ఎమ్మెల్యే, మంత్రి)లు ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. -
సీటివ్వలేదని ఆ పార్టీలో చేరావు.. అక్కడ కూడా సీటు హామీ లేనపుడు పాత పార్టీలోనే ఉంటే పోలా!
సీటివ్వలేదని ఆ పార్టీలో చేరావు.. అక్కడ కూడా సీటు హామీ లేనపుడు పాత పార్టీలోనే ఉంటే పోలా! -
ఆ లీడర్లను నమ్మొద్దు.. ఏపీ పాలిటిక్స్‌పై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్
నటి పూనమ్ కౌర్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటిగా కంటే కూడా సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న పలు వ్యాఖ్యలతో ఎక్కువగా పాపులర్ అయ్యారు. సమాజంలో జరిగే సంఘటనలు, రాజకీయ వ్యవహరాలపై స్పందిస్తూ ఆమె చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి భారీగానే దుమారం రేపుతూ ఉంటాయి. వాటి వల్ల ఆమె కూడా ట్రోలింగ్‌కు కూడా గురవుతుంటారు కూడా.. తాజాగా పూనమ్ ఏపీ పాలిటిక్స్‌పై ఇలా ట్వీట్ చేసి మరోసారి వార్తల్లోకెక్కారు. (ఇదీ చదవండి: లిప్‌లాక్,బోల్డ్ సీన్స్‌పై మా ఇంట్లో ఏమన్నారంటే: బేబీ హీరోయిన్) ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య కొందరు ఫేక్ లీడర్లు మహిళల మీద ఎక్కడా లేని అభిమానాన్ని చూపుతూ రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వాళ్లను నమ్మోద్దు. మహిళలకు ఎదో జరిగిపోతుందని వారికి అంతగా అందోళన ఉంటే ఢిల్లీలో రెజ్లర్లు చాలా రోజుల పాటు నిరసన దీక్ష చేశారు. కనీసం వారికి అనుకూలంగా ఒక్కమాటైనా వీరు మాట్లడలేకపోయారే. వాళ్ల సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఏపీలో ఈ నకిలీ లీడర్లు ఎక్కడా లేని ప్రేమను కురిపిస్తున్నారు. ఇలాంటి లీడర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. అంటూ నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఆమె ఏ రాజకీయ నాయకుడిని ఉద్దేశించి చేశారనేది పేరు మాత్రం తెలుపలేదు. కానీ ఆమె ట్వీట్ కింద కొందరు బూతు పదాలతో పలు కామెంట్లు చేస్తున్నారు. మా నాయకుడు పవన్ కల్యాణ్‌ను అంటున్నావ్ కదా అంటూ.. కొందరు జనసేన, పవన్ ఫోటోలను డీపీలుగా పెట్టుకుని బూతు పదాలతో రెచ్చిపోతున్నారు. కొందరైతే ఏకంగా రాయలేని భాష ఉపయోగిస్తూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఇంకోసారి ఇలాంటి కామెంట్లు పెడితే ఏం జరుగుతుందో కూడా ఊహించలేవంటూ పూనమ్‌కు వార్నింగ్ ఇస్తూ పవన్ ఫోటోను డీపీగా పెట్టుకుని వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో ఆమె ఇన్‌స్టాలో మరో ట్వీట్ చేశారు. 'మీరందరూ నా గురించి ఒకటి గుర్తుపెట్టుకోండి. నా పేరు 'కౌర్' అని మీరు మర్చిపోతున్నారు. సూమారుగా 5 ఏళ్లు అవుతుంది. కొంచెం ఆలోచించండి.' అని పోస్ట్ చేశారు. The people who are shouting at the top of their voice about women issues , as if they are highly concerned are the one who did not speak a word for #Wrestlers , beware of fake leaders who concern when it’s to their benefit and convenience.#AndhraPradesh — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 16, 2023 -
టీడీపీ నేతలకు కొత్త టెన్షన్.. రూటు మార్చిన పచ్చ పార్టీ లీడర్లు!
అభివృద్ధి అనేది టీడీపీ ఎజెండాలో లేని విషయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పనుల్ని అడ్డుకోవడమే పచ్చ పార్టీ నేతల పని. అన్ని ఆటంకాలు అధిగమించి పనులు సాగుతుంటే మాత్రం ఆ ఘనత తమదే అని డప్పు కొట్టుకోవడంలో కూడా టీడీపీ నేతలు ముందుంటారు. అనంతపురం జిల్లాలోని ఒక టీడీపీ నేత డప్పు ఎలా కొట్టుకుంటున్నారంటే.. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ ఛైర్మన్ వైకుంఠం ప్రభాకర చౌదరి అభివృద్ధి అంటే నేనే అని డప్పు కొట్టుకోవడంలో ఆరితేరిపోయారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ తరపున జేసీ దివాకరరెడ్డి ఎంపీగా, ప్రభాకర చౌదరి టౌన్ ఎమ్మెల్యేగా కొనసాగారు. అనంతపురం టౌన్లో ఏ పని చేయాలన్నా ఇద్దరి మధ్యా ఏకాభిప్రాయం కుదిరేది కాదు. పట్టణంలో ఏ పనీ చేయకుండా, ఇద్దరు గొడవ పడటంతోనే ఐదేళ్ళు ముగిసిపోయింది. అందుకే టీడీపీ పాలనలో అనంతపురం పట్టణం అభివృద్ధి జరగకపోగా.. మరింత వెనుకపడిపోయింది. గత ఎన్నికల్లో ప్రభాకరచౌదరి మీద విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే అయ్యాక నగరం అభివృద్ధి పథంలో సాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనంతపురం నగర అభివృద్ధికి ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అనంతపురం అభివృద్ధికి 650 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కేంద్రంతో మాట్లాడి అనంతపురం నగరం మీదుగా ఓ జాతీయ రహదారిని మంజూరు చేయించారు. అనంతపురం నగరంలో కొత్త ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. హైవే పనులు కూడా 80 శాతం పూర్తి కావటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరం అభివృద్ధి అంతా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళడం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి నచ్చడంలేదు. ఇలాగే సాగితే నగరంలో పచ్చ పార్టీకి ఉనికి ఉండదని భయపడి.. అభివృద్ధిని వక్రీకరించడం ప్రారంభించారు. అనంతపురం నగరంలో నిర్మాణమవుతున్న 42, 44 జాతీయ రహదారుల లింక్ హైవే టీడీపీ హయాంలోనే మంజూరు అయిందని.. పనులు ప్రారంభం అయ్యే లోగా ప్రభుత్వం మారిపోయిందంటూ ప్రభాకర్ చౌదరి గోబెల్స్ ప్రచారం ప్రారంభించారు. వాస్తవానికి జాతీయ రహదారిగా ఉన్న అనంతపురం సుభాష్ రోడ్డును స్టేట్ హైవేగా మారుస్తూ టీడీపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం విక్రయాలకు నేషనల్ హైవే నిబంధనలు అడ్డురావటంతో నగర అభివృద్ధి గురించి ఆలోచించకుండా టీడీపీ నేతలు హైవే హోదానే తగ్గించేశారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రభాకర్ చౌదరి దీనికి ఏ మాత్రం అడ్డుచెప్పలేదు. మద్యం అమ్మకాల కోసం చంద్రబాబు అనంతపురం నగరంలోని జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చేశారు. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పును గుర్తించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో అనంతపురం ప్రధాన రహదారిని తిరిగి నేషనల్ హైవే జాబితాలో చేర్చాలని సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అలాగే పంగల్ రోడ్డు నుంచి బళ్లారి రోడ్ దాకా కొత్తగా నాలుగు లేన్ల హైవే నిర్మించాలని.. అనంతపురం క్లాక్ టవర్ దగ్గరున్న పాత బ్రిడ్జి స్థానంలో కొత్త ఫ్లై ఓవర్ నిర్మించాలని కేంద్ర మంత్రి గడ్కరీని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో 310 కోట్లతో జాతీయ రహదారి మంజూరు అయింది. హైవే పనులు జరక్కుండా అడుగడుగునా అడ్డు పడిన టీడీపీ నేతలు.. అభివృద్ధి పనులు చివరి దశకు చేరటంతో రూటు మార్చారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. పనులన్నీ పూర్తి అయితే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ నామరూపాల్లేకుండా పోతుందన్న భయం టీడీపీ నేతల్ని వెంటాడుతోంది. పచ్చ పార్టీ రాజకీయ డ్రామాలు నమ్మవద్దని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రజలకు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: టీడీపీలో సీటు కోసం నానాపాట్లు.. సీనియర్ నేతకు సర్దుబాటు అవుతుందా? -
తెగేసి చెబుతున్న తెలుగు తమ్ముళ్లు.. గోపాలపురం టీడీపీలో ఏం జరుగుతోంది?
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం టీడీపీలో వర్గపోరు భగ్గుమంటోంది. ఇన్చార్జ్గా ఉన్న నేతను తప్పించి మరొకరిని నియమించడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. పై చేయి సాధించేందుకు రెండు వర్గాలు హోరా హోరీ తలపడుతున్నాయి. ఏ వర్గమూ బెట్టు వీడకపోవడంతో.. అంతంత మాత్రంగా ఉన్న కేడర్ రెండు వర్గాల మధ్య నలిగిపోతోంది. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని గోపాలపురం తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు కాక రేపుతోంది. నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జ్ ని మార్చినప్పటి నుండి ఇక్కడ అసమ్మతి సెగలు రగులుతున్నాయి. గోపాలపురం ఇన్చార్జి గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పనితీరుపై విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు ఆయన స్థానంలో మద్దిపాటి వెంకటరాజును నియమించారు. దీంతో గోపాలపురంలో ముప్పిడి, మద్దిపాటి వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. కొత్త ఇంచార్జ్ మద్దిపాటి వెంకటరాజు తమను పట్టించుకోవడంలేదని, తనకు కావాల్సిన వారికే పదవులు ఇచ్చుకుంటున్నారని ముప్పిడి వర్గం మండిపడుతోంది. ఇన్ చార్జ్ గా మద్దిపాటిని తప్పించి మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావునే మళ్ళీ కొనసాగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమం రోజే దేవరపల్లిలో రెండు వర్గాలు కొట్టుకున్నాయి. తాజాగా ద్వారకా తిరుమల మండలంలో కూడా మద్దిపాటికి వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మద్దిపాటి వెంకట్రాజు తీరుపై నియోజకవర్గ టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. కొంత మంది బడా నాయకుల్ని వెంట బెట్టుకుని మద్దిపాటి రాజకీయం చేస్తున్నాడని, గ్రామాల్లో యువకులకు పెత్తనమిచ్చి, నాయకులను అసమర్థులుగా తయారుచేశాడని, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడని సీనియర్లు మండిపడుతున్నారు. మంగళగిరి కార్యాలయంలో 200 మంది నాయకులు, కార్యకర్తలు మద్దిపాటి నాయకత్వాన్ని వ్యతిరేకించినా అర్ధరాత్రి 12 గంటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అతడినే ఇన్చార్జిగా ప్రకటించడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామంతా పార్టీ కోసం కష్టపడుతున్నామని, డబ్బు తగలేసుకుని పార్టీని నిలబెట్టుకుంటున్నా విలువలేకుండా చూస్తున్నారంటూ వాపోతున్నారు. రాజమండ్రి మహానాడు పూర్తయినందున త్వరలోనే నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఇన్చార్జి విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని నాయకులు నిర్ణయించారు. పార్టీ కోసం శ్రమిస్తున్నవారిని పట్టించుకోవడంలేదని, ఇన్చార్జ్ నియామకం విషయంలో అందరికీ అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని పార్టీ పరిస్తితిని అధిష్టానానికి తెలియచేద్దామని, తమ కష్టాన్ని పరిగణలోకి తీసుకోకపోతే అప్పుడే తగిన నిర్ణయం తీసుకుందామని మద్దిపాటి వెంకటరాజును వ్యతిరేకిస్తున్న వర్గం నిర్ణయించుకుంది. చంద్రబాబు నిర్ణయం తమకు అనుకూలంగా లేకపోతే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని గోపాలపురం తెలుగుతమ్ముళ్ళు తెగేసి చెబుతున్నారు. చదవండి: అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీపై మంత్రి పెద్దిరెడ్డి రియాక్షన్ -
‘గులాబీ’కి చికాకు తెప్పిస్తున్నారా?.. బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి?
ఉమ్మడి నల్గొండ జిల్లాను మరోసారి స్వీప్ చేయడానికి బీఆర్ఎస్ నాయకత్వం వేస్తున్న ప్లాన్ ఏంటి? అధినేత ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు పొరపాట్లు సరిచేసుకుంటున్నారా? తప్పులు దిద్దుకోనివారి పరిస్థితి ఏంటి? టిక్కెట్ కోసం కొట్టుకుంటున్నవారిని ఎలా దారికి తెస్తారు? గులాబీ పార్టీకి చికాకు తెప్పిస్తున్న నియోజకవర్గం ఎక్కడుంది? అది కాంగ్రెస్‌కు కంచుకోట నల్గొండ జిల్లాను కాంగ్రెస్‌కు కంచుకోట అని చెబుతారు. ఇక్కడి నుంచి ఇద్దరు ఎంపీలు కూడా ప్రస్తుతం కాంగ్రెస్‌కు చెందినవారే ఉన్నారు. కాని ఒక్కరంటే ఒక్కరు కూడా హస్తం పార్టీ ఎమ్మెల్యే ఈ జిల్లాలో లేరు. జిల్లా మొత్తం గులాబీ పార్టీ ఎమ్మెల్యేలే. మునుగోడు గెలుచుకోవడం ద్వారా నల్గొండ జిల్లాను గులాబీ సేన క్లీన్ స్వీప్ చేసేసినట్లయింది. రానున్న ఎన్నికల్లో కూడా మొత్తం 12 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని జిల్లాలో తమదే తిరుగులేని ఆధిపత్యం అని చాటుకోవడానికి గులాబీ పార్టీ నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు పార్టీకి చికాకు తెప్పిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం దేవరకొండలో నేతల మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరినట్లు సమాచారం. సిటింగ్ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్న దేవేందర్ నాయక్ మధ్య సీటు పోరు కొంతకాలంగా సాగుతోంది. పార్టీ ఫిరాయించి వచ్చిన రవీంద్రకుమార్‌కు కాకుండా తొలినుంచీ ఉద్యమంలో ఉన్న తనకు టిక్కెట్ ఇవ్వాలని మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన దేవేందర్ నాయక్ గట్టిగా పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల సందర్భంగా ఇద్దరి మధ్య ఆధిపత్యపోరు మరోసారి బయట పడినట్లు తెలుస్తోంది. ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతన్న సమయంలోనే దేవేందర్ నాయక్ తన వర్గంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లారట. అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసమ్మతి వెనుక ఓ సీనియర్ నేత మరోవైపు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కేడర్‌కు కూడా అర్థంకాక తలలు పట్టుకున్నారట. ఇదే విషయం అధినేత దృష్టికి కూడా వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తీరు పట్ల నియోజకవర్గంలోని నేతలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని టాక్ నడుస్తోంది. పార్టీ గాని, ప్రభుత్వం కాని నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వడంలేదని గులాబీ పార్టీ నేతలు ఎమ్మెల్యే పట్ల గుర్రుగా ఉన్నారు. ఎమ్మెల్యేను వ్యతిరేకించే నేతలంతా ఒక వర్గంగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో రవీంద్ర కుమార్‌కు టికెట్ ఇస్తే సహకరించేది లేదని తేల్చి చెప్పేశారట. ఈ అసమ్మతి వెనుక జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత ఉన్నారనే ప్రచారం కూడా సాగుతోంది. రవీంద్ర కుమార్ మాజీ గురువు అయిన ఆ నేత....తనను కాదని మరో పవర్ సెంటర్లో చేరిపోయిన తన మాజీ శిష్యుడిపై ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉన్నారనే ప్రచారం సైతం సాగుతోంది. ఆ సీనియర్ నేతకు దేవరకొండపై మంచి పట్టు ఉండటంతోపాటు తన వైరివర్గంలో చేరిన ఎమ్మెల్యేకు ఎలా అయినా చెక్ పెట్టాలని వ్యూహాలు పన్నుతున్నారట. ఇదే సమయంలో టికెట్ ఆశిస్తున్న దేవేందర్ నాయక్‌ను తన వైపు తిప్పుకున్నారట. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో దేవరకొండలో జరుగుతున్న వ్యవహారాలు పార్టీ నాయకత్వానికి చికాకు కలిగిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు నేతల మధ్య టిక్కెట్ పోరు ఎక్కడికి దారితీస్తుందో అన్న ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. చదవండి: బెజవాడ రాజకీయాలు.. కేశినేని నాని దారెటు? -
డిఫరెంట్ లుక్స్‌లో టాప్ లీడర్స్: దిమ్మదిరిగే ఫోటోలు
-
చంద్రబాబు బ్యాచ్ అంటేనే ఇంత.. ఇవేం చీప్ ట్రిక్స్!
తెలుగుదేశం పార్టీకి ఇదేం ఖర్మో?. ఇదేం ఖర్మరా బాబూ అంటూ చంద్రబాబు నిర్వహిస్తున్న సభలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. పార్టీ అధినేతకే దిక్కు లేనపుడు నియోజకవర్గ స్థాయి నేతల పరిస్థితి ఎలా ఉంటుంది?. అనేక చోట్ల మాజీ మంత్రుల సభలకు జనం రావడంలేదని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. జనం లేని సభల గురించి దృష్టి మరల్చడానికి పచ్చ పార్టీ నాయకులు వేస్తున్న ఎత్తులు ఏంటి?.. రాష్ట్ర ప్రజల్ని ఆకర్షించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని పాట్లు పడుతున్నా.. వారిని ఎవరూ పట్టించుకోవడంలేదు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకే జనం లేక దిగులు చెందుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేక ప్రజల్ని రెచ్చగొడదామనే ఉద్దేశంతో ఇదేం ఖర్మరా బాబూ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. స్థానిక నాయకులు ఎంత ప్రయత్నించినా ఏ సభా సక్సెస్ కావడంలేదు. చంద్రబాబు సభలకే దిక్కులేకపోతే.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా అదే తరహా సభలు నిర్వహిస్తూ ఖాళీ కుర్చీలకు ఉపన్యాసాలిస్తున్నారు. జనం లేరని చీప్ ట్రిక్స్‌కు పాల్పడుతున్నారు అయ్యన్న. అయ్యన్న ఎప్పుడు.. ఎలా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. సభల్లో మహిళలు ఉన్నారన్న ఇంగితం కూడా లేకుండా బహిరంగంగా బూతులు మాట్లాడతారు. అసందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడతారు. దీంతో అయ్యన్న సభలంటే ప్రజలకే కాదు.. టీడీపీ కార్యకర్తలకు కూడా విసుగు పడుతోంది. అయ్యన్న తీరుతో నర్సీపట్నం నియోజకవర్గంలో ఆయన నిర్వహించే ఇదేం ఖర్మ రా బాబు కార్యక్రమానికి స్పందన లేకుండా పోయింది. అయ్యన్న ప్రసంగించే సమయంలో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తన సభలకు జనాలు రాకపోవడంతో వైయస్సార్సీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా.. చంద్రబాబు మాదిరిగానే అయ్యన్నపాత్రుడు కూడా వ్యవహరిస్తున్నారు. నాతవరం మండలంలో జరిగిన సభ అట్టర్ ప్లాప్ అయ్యింది. ప్రజలే కాదు టీడీపీ కార్యకర్తలు కూడా ఈ సభను పట్టించుకోలేదు. వేదిక మీద తెలుగుదేశం పార్టీ నాయకులు తప్ప వేదిక కింద ఎవరూ లేరు. దీంతో టీడీపీ సభ వేదిక పైకి ఎవరో రాయి విసిరారంటూ నానా హంగామా సృష్టించారు. దమ్ము, ధైర్యం ఉంటే చూసుకుందాం రండి అంటూ సవాల్ చేశారు. వాస్తవానికి అయ్యన్న సభ వేదికపై ఎవరూ రాళ్లు విసరలేదు. ఒకవేళ ఎవరైనా రాయి విసిరితే టీడీపీ కార్యకర్తలు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు?. విసిరిన రాళ్ళను ఎందుకు చూపించలేదు?. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. రాళ్ళు విసిరినవారిని ఎందుకు పట్టుకోలేదు?. నిజంగా రాళ్ళు విసిరి ఉంటే ఎల్లో మీడియా ఊరుకుంటుందా?. రాళ్ళు విసిరితే సభ వేదికపై టీడీపీ నేతలు తాపీగా జీడిపప్పు తింటూ కూర్చుంటారా?. ఈ ప్రశ్నలకు టీడీపీ నేతల నుంచి సమాధానం లేదు. టీడీపీ నేతల సభలకు జనాలు రాకపోవడం వల్లనే ఇటువంటి నీతిమాలిన రాజకీయాలకు దిగుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రస్థాయిలో చంద్రబాబు ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తుంటే.. నియోజకవర్గాల్లో అయ్యన్న లాంటి నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా టీడీపీ నేతలు ఇటువంటి సిగ్గుమాలిన రాజకీయాలకు స్వస్తి పలకాలని సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది మోదీ కాదు’ -
రాజకీయాల్లో సినిమావాళ్ల విలువ ఎంతంటే..
రాజకీయాలలో సినిమా వాళ్ల పాత్ర ఏమిటి?.. వాళ్లు ప్రచారం చేసినంత మాత్రాన గెలిచిపోతారా? ప్రతిసారి ఎన్నికల సమయంలో ఇలాంటి చర్చలు సహజంగానే జరుగుతుంటాయి. తెలుగు సినీ ప్రముఖుడు బ్రహ్మానందం కర్నాటకలోని చిక్ బళ్లాపూర్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయనను చూడడానికి జనం కూడా బాగానే వచ్చారు. కానీ, ఆయన మద్దతు ఇచ్చిన బిజెపి అభ్యర్ధి డాక్టర్ సుధాకర్ మాత్రం పరాజయం చెందారు!. అయితే.. డాక్టర్ సుధాకర్.. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగానే ఇక్కడ గెలిచారు. కాని.. ఆ తర్వాత పరిణామాలలో పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉప ఎన్నికలో పోటీచేసి సుమారు 35 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అంత మెజార్టీ వచ్చింది కదా అనే ధీమాతో.. తాజా అసెంబ్లీ ఎన్నికలో కూడా గెలుస్తాననే భావనలో కూరుకుపోయిన సుధాకర్‌కు చిక్ బళ్లాపూర్ ఓటర్లు షాక్ ఇచ్చారు. సుమారు 10,500 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారాయన. తెలుగువారు కూడా గణనీయంగా ఉండే ఆ నియోజకవర్గంలో బ్రహ్మానందం ప్రచారం కూడా ఉపయోగపడుతుందని ఆశించారు. దాని వల్ల ఏమనా కాంగ్రెస్ అభ్యర్ధి అయ్యర్ మెజార్టీ కాస్త తగ్గిందేమో తెలియదు కాని, బిజెపి ఓటమి మాత్రం తప్పలేదు. నిజానికి బ్రహ్మానందం రాజకీయ మిషన్ తో అక్కడ ప్రచారం చేయలేదు. తనకు వ్యక్తిగత సంబంధాలు ఉండడంతో ఆ నియోజకవర్గంలో ప్రచారం చేసి వచ్చారట. ఇలా కొన్నిసార్లు యాక్టర్ లు సిద్దాంతాలు,పార్టీలతో నిమిత్తం లేకుండా తమకు ఉన్న సంబంధ, బాంధవ్యాల రీత్యా ప్రచారం చేస్తుంటారు. అన్నిసార్లు వాటి వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పలేం కాని, కొన్నిసార్లు కొంత ప్రయోజనం ఉండవచ్చు. అంతమాత్రాన వారే రాజకీయాలు శాసించే పరిస్తితి లేదనే చెప్పాలి. ఇందుకు కొన్ని మినహాయింపులు ఉండవచ్చు. 👉 తమిళనాడులో అన్నాదురై, కరుణానిది, ఎమ్.జి.ఆర్, జయలలిత వంటివారు ఆ రాష్ట్ర రాజకీయాలను శాసించారు. తమకు ఉన్న సినిమా పాపులారిటీతో పాటు పార్టీ సిద్దాంతం కూడా వారికి కలిసి వచ్చింది. ప్రజలలో మమేకం అయ్యే వారి లక్షణం ఉపయోగపడింది. కానీ, అక్కడే మరో నటుడు విజయకాంత్ రాణించలేకపోయారు. కమల్ హసన్‌ది అయితే మరీ దయనీయం. రజినీకాంత్ రాజకీయాలలోకి రావాలో ,వద్దో తేల్చుకోలేక చివరికి ఆ వైపు వెళ్లరాదని నిర్ణయించుకున్నారు. 👉 ఏపీలో ఎన్టీఆర్(దివంగత) వచ్చేవరకు సినిమావారికి విశేష ప్రాధాన్యం లేదనే చెప్పాలి. కళావాచస్పతి కొంగర జగ్గయ్య ఒకసారి లోక్ సభకు మాత్రం కాంగ్రెస్ పక్షాన ఎన్నికయ్యారు. అది 1971 లో ఇందిరాగాంధీ వేవ్ లో అని గుర్తించాలి. ఆ తర్వాత ఆయన ఒకసారి అసెంబ్లీకి పోటీచేసి ఘోరంగా ఓటమి చెందారు. ఆయన ఒక్కరే కాదు. ప్రముఖ నటుడు కృష్ణ, జమున,కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, శారద, మురళీమోహన్, రామానాయుడు ఇలా పలువురు సినిమావారు ఎన్నికల రాజకీయాలలో ఒకసారికే పరిమితం అయ్యారు. విజయనిర్మల ఆ ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయారు. మరో నటుడు నరేష్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కాని సఫలం కాలేదు. 👉 తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్.టి.రామారావు 1983లో రెండు చోట్ల, 1985లో మూడు చోట్ల పోటీచేసి విజయం సాధించి రికార్డు సృష్టించారు. కాని 1989 లో ఆయన రెండు చోట్ల పోటీచేసి ఆశ్చర్యంగా ఒకచోట ఓటమి చెందారు. మళ్లీ 1994లో రెండు చోట్ల పోటీచేసి గెలిచారు. తొమ్మిది చోట్ల పోటీచేసి ఎనిమిదింట గెలవడం ఒక రికార్డే అయినా, ఒకసారి ఓటమి మాత్రం ఆయన ప్రతిష్టను దెబ్బతీసింది. ఆయన ఒక సిద్దాంతంతో ప్రజల ముందుకు రావడం, అప్పట్లో రాజకీయ శూన్యత ఉండడం కలిసి వచ్చింది. అయితే ఎన్.టి.ఆర్.ను 1989లో ఓడించడంలో కొంతమంది సినిమావారి ప్రచార ప్రభావం కూడా కొంత ఉపయోగపడింది. అంటే జనంలో ప్రభుత్వంపై, లేదా ఒక రాజకీయ పార్టీపై వ్యతిరేకత ఏర్పడినప్పుడు సినిమావారి ప్రచారాలు అదనంగా కలిసి వస్తాయని అనుకోవచ్చు. అదే ప్రభుత్వంపై లేదా రాజకీయ పార్టీ పై వ్యతిరేకత లేనప్పుడు ఎంత పెద్ద సినీ నటుడు ప్రచారం చేసినా ప్రయోజనం ఉండదని అనుభవం చెబుతుంది. 👉 ప్రముఖ నటుడు చిరంజీవి సొంతంగా పార్టీ పెట్టి రెండు చోట్ల పోటీచేసి ఒకచోట మాత్రమే గెలవగలిగారు. ఆ తర్వాత ఎక్కువకాలం ఆయన పార్టీని నడపలేకపోయారు. చిరంజీవి సభలకు జనం పోటెత్తినా ఆశించిన ఓట్లు రాలేదు. ఆయనకు రాజకీయ వ్యూహం కొరవడడమే కారణం అని చెప్పాలి. ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించి కేవలం ప్రచారానికి పరిమితం అయ్యారు. టీడీపీ గెలుపునకు ఆయనే కారణమని అభిమానులు భావించేవారు. అదే పవన్ కళ్యాణ్ 2019లో మరో రాజకీయ కూటమి ఏర్పాటు చేసి పోటీలో దిగి రెండు చోట్ల పోటీచేస్తే , ఆ రెండిట ఓడిపోవడం విశేషం. ఆయన ఫెయిర్ రాజకీయాలు చేయకపోవడం, తెలుగుదేశంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంటకాగడం, ఆయనను నమ్ముకున్న అబిమానులు, కాపు సామాజికవర్గ నేతల అబిప్రాయాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి కారణాల వల్ల ఆయన రాజకీయంగా సఫలం కాలేకపోయారు. తిరిగి 2024లో కూడా టిడిపికి తోక పార్టీగానే ఉండాలని ఆయన నిర్ణయించుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకాలం ఆయనను సి.ఎమ్.,సి.ఎమ్.అంటూ నినదించిన అభిమానులకు ఆశాభంగం కలిగిస్తూ చంద్రబాబుకు ఆయన ఆ విషయంలో సరెండర్ అయిపోయి తనకు బలం లేదని చెప్పేసుకుని దెబ్బతిన్నారు. ఒక్క ఎమ్మెల్యేగా గెలిస్తే చాలన్న ఆయన కోరిక 2024లో నెరవేరుతుందా?లేదా? అన్నది చూడాల్సి ఉంది. 👉 వైఎస్సార్సీపీ పక్షాన పోటీచేసి మరో ప్రముఖ నటి రోజా మంత్రి కాగలిగారు. ఆమె ఇప్పటికి రెండుసార్లు విజయం సాధించారు. ఒక ప్రముఖ పార్టీలో కొనసాగి,నాయకుడి పట్ల విధేయతతో ఉండడం , ఒక సిద్దాంతానికి కట్టుబడి ఉండడం వంటి కారణాలు ఆమె రాజకీయ సాఫల్యానికి కారణాలుగా కనిపిస్తాయి. మరో ప్రముఖ నటి జయప్రద ఏపీ నుంచి తొలుత రాజ్యసభ సభ్యురాలైనా, ఆ తర్వాతకాలంలో ఆమె యూపీ నుంచి రెండుసార్లు లోక్ సభ కు ఎన్నికై సంచలనం సృష్టించారు. యుపిలో మాజీ ముఖ్యమంత్రి మూలాయం సింగ్ యాదవ్ తో పాటు , ఆయన పార్టీలోని కొందరి అండ ఉండడంతోనే అది సాద్యమైంది. 👉👉జాతీయ రాజకీయాలలోకాని, ఆయా రాష్ట్రాలలో కాని సినీ ప్రముఖులు పూర్తి స్థాయిలో రాణించిన సందర్భాలు తక్కువేనని చెప్పాలి. కాకపోతే యాక్టర్ లకు ఉండే అడ్వాంటేజ్ ఏమిటంటే వారు తమ సినిమాల ద్వారా ప్రజలను కొంత ప్రభావితం చేస్తారు. జనంలోకి వస్తే వారిని తేలికగా గుర్తు పడతారు. వారి గ్లామర్ ఆ రకంగా ఉపయోగపడుతుంది. అందుకే ఏదైనా వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి కూడా సినీ నటులను అతిధులుగా ఆహ్వానిస్తుంటారు. అంతమాత్రాన ఆ వ్యాపారాలు సక్సెస్ అయిపోతాయని కాదు. వారి వ్యూహంతో పాటు, ప్రజలలో తేలికగా బ్రాండ్ ఇమేజీ తెచ్చుకోవడానికి సినీ నటులు ఉపయోగపడతారని భావించడమే. అలాగే రాజకీయాలలో కూడా వీరు కొంత బ్రాండ్ ఇమేజీకి పనికి వస్తారు కాని, సిద్దాంత పునాది, పెద్ద రాజకీయ పార్టీ మద్దతు లేకుండా వీరు రాణిస్తారని, వీరి ప్రచారంతోనే అభ్యర్ధులు గెలిచిపోతారని అనుకుంటే అది భ్రమేనని పలు అనుభవాలు తెలియచేస్తున్నాయి. ::: కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు కన్నెర్ర
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు కన్నెర్రజేసింది. రాజకీయ నాయకులు మతాన్ని రాజకీయాలకు వాడుకోవడం ఆపినప్పుడే వాటికి అడ్డుకట్ట పడుతుందని పేర్కొంది. ‘‘దేశం ఎటు పోతోంది? విద్వేష ప్రసంగాలు ఓ విషవలయం. రాజకీయాలను మతంలో కలపడం పెను సమస్యకు దారి తీస్తోంది. విచ్ఛిన్న శక్తులే ఇందుకు పాల్పడుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం తక్షణం ఓ మార్గం చూడాలి’’ అని న్యాయమూర్తులు కె.ఎం.జోసెఫ్, బి.వి.నాగరత్న ధర్మాసనం బుధవారం అభిప్రాయపడింది. ఇటీవలి తీర్పులోనూ సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని నొక్కిచెప్పిందని గుర్తు చేసింది. ‘‘టీవీల్లో, మీడియాలో, బహిరంగ వేదికలపై రోజూ ఇలాంటి శక్తులు ఇతరులపై విద్వేష వ్యాఖ్యలకు పాల్పడుతూనే ఉన్నాయి. ఎంతమందిపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టగలం? తోటివారిపై, సామాజిక వర్గాలపై విద్వేష వ్యాఖ్యలు చేయబోమని ప్రజలే ప్రతినబూనితే బాగుంటుంది’’ అని సూచించింది. దివంగత ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్‌పేయి వంటివారి ప్రసంగాలు ఎంతో హుందాగా ఉండేవంటూ గుర్తు చేసింది. వాడీవేడి వాదనలు.. ‘‘విద్వేష ప్రసంగాలపై సకాలంలో చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిస్తేజంగా మారాయి. అందుకే కోర్టులకు పని పడుతోంది’’ అంటూ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇలా మౌనంగా ఉండే పక్షంలో ప్రభుత్వాల ఉనికికి అర్థమేముందని ప్రశ్నించింది? రాష్ట్రాల సంగతేమో గానీ ఈ వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వానికి వర్తించవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. కేరళ, తమిళనాడుల్లో నేతల విద్వేష ప్రసంగాల ఉదంతాలను కూడా ఈ పిటిషన్‌తో కలిపి విచారించాలని కోరారు. వాటికి సంబంధించిన వీడియో క్లిప్‌ల ప్రదర్శనకు అనుమతించాలని కోరడంతో దీన్నో డ్రామాగా మార్చొద్దని ధర్మాసనం పేర్కొంది. ‘‘దేనికైనా ఓ పద్ధతుంటుంది. మేం వీడియో క్లిప్‌లు చూడాలని మీరు భావిస్తే దాన్ని మీ పిటిషన్లో చేర్చండి’’ అని సూచించింది. విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. -
పొలిటీషియన్ తో ప్రేమలో పడిన పరిణీతి ?
-
మళ్లీ పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ నటి.. వెడ్డింగ్ కార్డ్ వైరల్
బాలీవుడ్ హీరోయిన్ స్వరభాస్కర్ ఫహద్ అహ్మద్ అనే రాజకీయ నేతను సీక్రెట్‌గా పెళ్లాడిన సంగతి తెలిసిందే. జనవరి 6న అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా స్వరభాస్కర్ మరోసారి పెళ్లికి సిద్ధమైంది. తాను ప్రేమించిన ఫహద్ అహ్మద్‌నే మరోసారి పెళ్లాడనుంది. ఇటీవల వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ తాజాగా మరోసారి సాంప్రదాయబద్దంగా వివాహం చేసుకోనున్నారు. ఈనెల 11నుంచి హల్దీ, మెహందీ, సంగీత్ ఇలా పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఢిల్లీలోని స్వరభాస్కర్ అమ్మమ్మ ఇల్లు వీరి పెళ్లివేదిక కానుంది. ఈనెల 15-16 తేదీల్లో ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో స్వరభాస్కర్వివాహం ఘనంగా జరనుంది. దీనికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Prateeq Kumar (@prateeq) -
రాజకీయ క్రీడలో ప్రభుత్వ అధికారి ఔట్.. ఇక్కడ ఇంతే!
సాక్షి,మేడ్చల్(హైదరాబాద్): మేడ్చల్ మున్సిపాలిటీలో చైర్పర్సన్, కౌన్సిలర్లు ఆడిన రాజకీయ క్రీడలో కమిషనర్ అవుట్ అయ్యారు. చైర్పర్సన్ లక్ష్యంగా సాగిన ఈ రాజకీయ క్రీడలో కౌన్సిలర్ల బంతికి చైర్పర్సన్ కాకుండా కమిషనర్ చిక్కాడు. ఆరు నెలలుగా మేడ్చల్ మున్సిపాలిటీలోని అధికార పార్టీలో 16 మంది కౌన్సిలర్లు, చైర్పర్సన్ దీపికా నర్సింహా రెడ్డిల మధ్య రాజకీయ అగాధం ఏర్పడింది. 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్పర్సన్, కమిషనర్ అహ్మద్ షఫిఉల్లా కుమ్మక్కై అభివృధ్ధి చేయకుండా అవినితీకి పాల్పడుతున్నారని విమర్శిస్తూ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. ఆరు నెలలుగా మేడ్చల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా వీడి జోరుగా రాజకీయాలు చేస్తున్నారు. కొందరు వైస్ చైర్మన్ గ్రూపుగా, మరి కొందరూ చైర్పర్సన్ గ్రూపుగా మారారు. చైర్‌పర్సన్‌పై అవిశ్వాస నోటీసులు ఇవ్వగా రెండో డిమాండ్ కింద కమిషనర్‌ను బదిలీ చేయాలని పట్టుబట్టారు. కమిషనర్ చైర్‌పర్సన్‌తో కుమ్మక్కై తమను ఖాతరు చేయడం లేదని, ఆయన్ను బదిలీ చేయాలని అధిష్టానం వద్ద పట్టుబట్టి కూర్చున్నారు. మంత్రి ఇంట్లో సమావేశంతోనే.. మేడ్చల్ మున్సిపాలిటీలో సమావేశాలు నిర్వహిస్తే తరుచూ రచ్చ చేస్తున్నారని, మీడియా ముంగిట అసమ్మతి వెల్లగక్కుతున్నారని మంత్రి మల్లారెడ్డి చైర్పర్సన్, అధికారులు, కమిషనర్, అధికార పార్టీ కౌన్సిలర్లతో తమ ఇంట్లో రెండు రోజుల క్రితం రహస్య సమావేశం నిర్వహించారు. అవిశ్వాస విషయం చట్ట పరిధిలో ఉండటంతో అది పక్కన పెట్టి అసమ్మతి కౌన్సిలర్ల వాదనను మంత్రి విన్నారు. తమకు విలువ ఇవ్వని కమిషనర్ అహ్మద్ షఫిఉల్లాను బదిలీ చేయాలని గట్టిగా వాదించడం, ఒక్కసారిగా బదిలీ చేసే అధికారం లేకపోవడంతో మంత్రి మల్లారెడ్డి ఇక్కడ రాజకీయం ప్రదర్శించారు. కౌన్సిలర్ల డిమాండ్ మేరకు కమిషనర్ అహ్మద్ షఫిఉల్లా వెళ్లిపోవాలని మంత్రి ఆదేశించినట్లు సమాచారం. బదిలీకి వెంటనే ఆస్కారం లేకపోవడంతో కమిషనర్ 15 రోజుల పాటు దీర్ఘకాలికంగా సెలవు పెట్టి వెళ్లిపోయారు. చట్టం చెప్పే కమిషనర్... సెలవులపై వెళ్లిన కమిషనర్ అహ్మద్ షఫిఉల్లా ముక్కుసూటిగా మాట్లాడే అధికారిగా మేడ్చల్‌లో తన ముద్ర వేశారు. ప్రతి విషయంలో తాను చట్టం ప్రకారంగా ఉంటూ పనులను ఆ ప్రకారంగానే చేస్తానని బల్ల గుద్ది చెప్పేవాడు. ఎవరికి అనుకూలంగా ఉండకుండా తన దైన శైలిలో పనిచేసి ఆఖరుకు సెలవు పెట్టే వరకు తెచ్చుకున్నాడు. తనపై ఆరోపణలు చేసిన కౌన్సిలర్లకు ఆయన గతంలో మున్సిపల్ కార్యాలయంలోనే నాపై ఆరోపణలు చేసిన వారికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, ఏది ఉన్నా తాను ఉన్నతాధికారులకు చెప్పుకుంటానని మీడియా ముందు తేల్చి చెప్పాడు. అధికార పార్టీ నాయకులు, కౌన్సిలర్లకు అండగా ఉండకపోవడంతో ప్రభుత్వ అధికారి తనకు ఇష్టం, అవసరం లేకున్నా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాల్సి వచ్చింది. రాజకీయ నాయకుల క్రీడలో ఓ అధికారి సెల్ఫ్ అవుట్ అవ్వడం స్థానిక ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చదవండి యజమాని భార్యతో డ్రైవర్ వివాహేతర సంబంధం.. చివరికి షాకింగ్ ట్విస్ట్ -
సోనియాకు అడ్డుపడి చిన్నమ్మ శపథం! ఆనాడు అలా జరగకపోయి ఉంటే..
దేశంలో కుటుంబ, వారసత్వ రాజకీయాలు వేళ్లానుకునిపోయిన సమయం అది. ఆ సమయంలో.. భర్త చనిపోవడంతో ఆమెనే ప్రధాని అవుతుందని అంతా భావించారు. కానీ, పీఎం పదవితో పాటు పార్టీ పగ్గాలనూ వద్దనుకుని పార్టీ క్యాడర్‌ను, యావత్ దేశాన్ని నివ్వెరపోయేలా చేశారామె. దాదాపు అర్ధదశాబ్దంపాటు రాజకీయం ఊసే ఎత్తలేదు. అయితే.. పార్టీ అంతర్గత సంక్షోభం, ఎన్నికల్లో దారుణ ఓటమి సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. దశాబ్దంపాటు పవర్ఫుల్ ఉమెన్‌గా ప్రపంచాన్ని ఆకట్టుకోలిగారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా.. సంక్షోభంలో ఉన్న ప్రతిసారీ తన మార్క్ చూపిస్తూ పరిస్థితులను కొంతైనా చక్కబెడుతూ వచ్చారు. సోనియా గాంధీ.. అప్పటిదాకా రాజీవ్ గాంధీ సతీమణి. భర్త మరణాంతరం దాదాపు అర్థదశాబ్దంపాటు రాజకీయాల్లోకి రావడానికి అనాసక్తిని కనబరిచారు. అయితే.. 1996 ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ ఛిన్నాభిన్నం అయ్యింది. మూకుమ్మడిగా సీతారాం కేసరి నాయకత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించారు. పార్టీలోని చాలామంది సొంత కుంపట్లను ఏర్పాటు చేసుకున్నారు. దేశ రాజకీయాల్లో.. కాంగ్రెస్‌కు గడ్డుపరిస్థితులు ఎదురయ్యాయి. నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని ఒత్తిళ్లు పెరిగాయి. ఆ పరిణామాల నడుమ రాజకీయాల్లోకి అన్యమనస్కంగానే అడుగుపెట్టారామె. 1997 కలకత్తా(కోల్‌కతా)లో జరిగిన ప్లీనరీ సెషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం పుచ్చుకున్నారామె. ఆపై 62 రోజులకే ఆమెకు పార్టీ బాధ్యతలు ఆఫర్ చేయగా.. అందుకు ఆమె అంగీకారం కూడా తెలిపారు . అయితే.. ప్రధాని అభ్యర్థిత్వానికి ఆమె పేరు తెర మీదకు రావడంతో.. 1999 మే నెలలో పార్టీలో సీనియర్లు ముగ్గురు వ్యతిరేక గళం వినిపించారు. విదేశీ మూలాలు ఉన్న ఆమె.. భారత్‌కు ఎలా ప్రధాని అవుతారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో.. పార్టీకి రాజీనామా చేసేసి బయటి నుంచి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యారామె. కానీ, ఆమెను నిలువరించిన పార్టీ.. ఆ ముగ్గురు రెబల్స్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ ముగ్గురే శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్.. వాళ్లు స్థాపించుకున్న పార్టీనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. వీళ్లే కాదు.. పార్టీ నుంచి బయటకు వచ్చిన మరికొందరు సొంత పార్టీలను ఏర్పాటు చేసుకున్నారు కూడా. ఇది ఆమె ప్రధాని పదవికి అడ్డు తగిలిన మొదటి సందర్భం. 1999 సార్వత్రిక ఎన్నికల్లో సోనియా గాంధీ.. కర్ణాటక బళ్లారి నుంచి, ఉత్తర ప్రదేశ్ అమేథీ నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ ఘన విజయం సాధించారామె. ఈ రెండింటిలో ఆమె అమేథీనే ఎంచుకున్నారు. ఇక బళ్లారిలో ఆమె ఓడించింది ఎవరినో తెలుసా?.. చిన్నమ్మగా పేరొందిన సుష్మా స్వరాజ్‌ను. సోనియాగాంధీ బంపర్‌మెజార్టీతో నెగ్గినప్పటికీ.. వాజ్‌పేయి పేరు, ఛర్మిష్మా, ఇతరత్రా కారణాలతో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టింది. ఆ సమయంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగారామె. 2000 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరగ్గా.. అవతలి అభ్యర్థి జితేంద్ర ప్రసాదను 97 శాతం మార్జిన్‌తో ఓడించారామె. అప్పటి నుంచి ఓటింగ్ లేకుండానే ఆమె ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. అంతేకాదు.. 2003లో ఏకంగా వాజ్‌పేయి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారామె. అధికారంలోకి యూపీఏ కూటమి 2004 సార్వత్రిక ఎన్నికల్లో.. సోనియా గాంధీ ఆమ్ ఆద్మీ(ఆర్డీనరీ మ్యాన్) పేరుతో దేశవ్యాప్త ప్రచారం నిర్వహించారు. అప్పటికే బీజేపీ ఇండియా షైనింగ్ పేరుతో ప్రచారంలో ఉంది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఊహించని పరాభవం ఎదురైంది. ఆ ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి పోటీ చేసి.. 2 లక్షలకు పైచిలుకు ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు సోనియా గాంధీ. దాదాపు 15 పార్టీల కూటమి యూపీఏ పేరుతో కేంద్రంలో అధికారం చేపట్టేందుకు సిద్ధం అయ్యింది. ఈ ఎన్నికల విజయంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన సోనియా గాంధీనే దేశానికి ప్రధాని కాబోతున్నారంటూ చర్చ మొదలైంది. కానీ.. ► ప్రతిపక్ష కూటమి సోనియా ప్రధాని కాకుండా మోకాలడ్డింది. సుష్మా సర్వాజ్ అయితే ఏకంగా హెచ్చరికలకే దిగారు. సోనియా గనుక దేశానికి ప్రధానిని చేస్తే.. తాను గుండు చేయించుకుంటానని, కటిక నేలపై నిద్రిస్తానని శపథం చేసి.. రాజకీయ దుమారం రేపారు. మరోవైపు ఎన్డీయేలోని పక్షాలు న్యాయపరమైన కారణాలు చూపించి అభ్యంతరాలు లేవనెత్తారు. భారత పౌరసత్వ చట్టం 1955 సెక్షన్ 5 ప్రకారం.. కోర్టును ఆశ్రయించారు. కానీ, కోర్టు ఆమెకు ఊరటనే ఇచ్చింది. ► రాజకీయంగా చెలరేగుతున్న రగడ కారణంగా.. ప్రధాని పదవి చేపట్టకూడదనే నిర్ణయానికి వచ్చారామె. బదులుగా ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌ను ప్రధాని పదవికి నామినేట్ చేశారామె. పార్టీ నేతలు కూడా అందుకు అంగీకరించారు. ఆ సమయంలో ఆమె త్యాగనీరతిని అభిమానులు ఆకాశానికెత్తగా.. పొలిటికల్ స్టంట్ అంటూ ప్రత్యర్థులు పెదవి విరిచారు. ఇది రెండోసారి. ► ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ వివాదం కారణంగా.. ఎంపీ పదవికి, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్ పదవికి ఆమె రాజీనామా ప్రకటించారు. ఆపై 2006 మే నెలలో జరిగిన ఉప ఎన్నికలో రాయ్ బరేలీ నుండి 400,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ► 2009లో ఆమె నాయకత్వంలోనే మళ్లీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ కేంద్రంలో కొలువు దీరింది. ఆ ఎన్నికల్లో 206 లోక్‌సభ సీట్లు గెలవగా.. 1991 నుంచి అప్పటిదాకా ఏపార్టీ కూడా అంత సీట్లు గెలవకపోవడం విశేషం. ఈ ఎన్నికల్లోనూ రాయ్ బరేలీ నుంచి ఆమె గెలుపొందారు. ► 2013లో.. పదిహేనేళ్లపాటు వరుసగా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్‌గా పని చేసిన వ్యక్తి రికార్డును నెలకొల్పారామె. ► 2013లోనే.. ఎల్జీబీటీ హక్కులను బలపరుస్తూ ఐపీసీ సెక్షన్ 377 మద్దతు ప్రకటించారు. ► 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైంది. కాంగ్రెస్‌కు 44, మొత్తంగా యూపీఏ కూటమికి 59 సీట్లు మాత్రమే దక్కాయి. అయితే.. రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ గెలుపొందారు. ► అదే ఏడాదిలో తెలుగు రాష్ట్రాల విభజన ద్వారా సోనియమ్మగా పార్టీ నేతలచేత పిలిపించుకున్నారామె. ► ప్రతిపక్షాన్ని బంధించే జిగురు లాంటి వ్యక్తి సోనియా. ఈ కామెంట్ చేసింది ఎవరో కాదు వామపక్ష దిగ్గజ నేత సీపీఐ(ఎం) సీతారాం ఏచూరి. కాంగ్రెస్ పగ్గాలు సోనియాకా? రాహుల్‌కా? అనే చర్చ నడిచిన సమయంలో ఆయన సోనియాకే ఓటేశారు. ► 2016 నుంచి ఎన్నికల ప్రచారానికి ఆమె దూరంగా ఉంటూ వచ్చారు. 2017 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీకి 49వ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టారు. తిరిగి.. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె ప్రచారం ద్వారా తెర మీదకు వచ్చారు. బీజాపూర్‌లో ఆమె బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 78 సీట్లు సాధించి రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అదే సమయంలో బీజాపూర్ పరిధిలోని ఐదు స్థానాల్లో నాలుగింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. జనతా దళ్ (సెక్యులర్)తో పోత్తు విషయంలోనూ ఆమె క్రియాశీలకంగా వ్యవహరించారు. ► 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్-యూపీఏ కూటమి ఓటమిపాలైంది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో.. తిరిగి సోనియా గాంధీకే పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. ► కాంగ్రెస్‌కు కుటుంబ పార్టీ అనే మచ్చ చెరిపేసేందుకు.. శాశ్వత అధ్యక్ష ఎన్నిక జరగాలని, ఆ నాయకత్వంలోనే 2024 ఎన్నికలకు వెళ్లాలని సోనియా గాంధీ ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ఆమె అధ్యక్ష ఎన్నికల్లో మద్దతు ప్రకటించారు. అయితే గెహ్లాట్ ఎన్నికల బరి నుంచి తప్పుకోగా.. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో మల్లికార్జున ఖర్గే ఘన విజయం సాధించి కాంగ్రెస్‌కు గాంధీయేతర కుటుంబ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ► 1999లో అమేథీ నుంచి 4,18,960 ఓట్లు(67.12 శాతం ఓటు షేర్), బళ్లారి నుంచి 4,14,650 ఓట్లు(51.70 శాతం ఓటు షేర్) మెజార్టీతో ఆమె నెగ్గారు. ఆ తర్వాత 2004 ఎన్నికలో రాయ్ బరేలీ నుంచి 3,90,179 ఓట్ల మెజార్టీతో.. 2006 ఉప ఎన్నికలో ఏకంగా 4,74,891 ఓట్ల మెజార్టీతో ఆమె నెగ్గారు. తిరిగి 2009 ఎన్నికలో 4,81,490 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో 5,26,434 ఓట్ల మెజార్టీ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో 5,34,918 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ప్రతీ ఎన్నికకు ఆమె విక్టరీ మెజార్టీ గణనీయంగా పెరుగుతూ పోవడం గమనార్హం. ► 2004-14 అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో దేశంలో శక్తివంతమైన మహిళలు, ప్రభావశీలుర జాబితాలోనూ ఆమె ప్రతీ ఏడాది నిలుస్తూ వచ్చారు. ► 2007లో టైమ్స్ మ్యాగజైన్.. టాప్ 100 ప్రభావశీలుర జాబితాలో సోనియా గాంధీకి చోటు ఇచ్చింది. ► 2013లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలో శక్తివంతమైన వ్యక్తుల్లో 21వ ర్యాంక్, మహిళల్లో 9వ ర్యాంక్ కట్టబెట్టింది. ► మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా.. 2007 అక్టోబర్ 2వ తేదీన ఐక్యరాజ్య సమితిలో ఆమె ప్రసంగించారు. ఆనాటి నుంచి గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినంగా పాటిస్తూ వస్తున్నారు(ఐరాసలో తీర్మానం పాస్ అయ్యింది 2007 జులై 15న). ► నేషనల్ అడ్వైజరీ కమిటీ చైర్‌పర్సన్‌గా, యూపీఏ చైర్‌పర్సన్‌గానూ ఆమె కీలక నిర్ణయాల్లో ముఖ్యభూమిక పోషించారు. అందులో నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టంగా మారడం అనే రెండు ప్రధానమైనవి ఉన్నాయి. రాయ్‌పూర్(ఛత్తీస్‌గఢ్) కాంగ్రెస్ ప్లీనరీలో 76 ఏళ్ల సోనియా గాంధీ ప్రసంగిస్తూ.. పొలిటికల్ రిటైర్మెంట్ సంకేతాలు ఇచ్చిన సందర్భంలో.. -
సాయన్న భౌతికకాయానికి నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు
-
హామీల పేరుతో ‘చుక్కలు’ చూపిస్తున్నారుగా అని అంటున్నాడ్సార్!
హామీల పేరుతో ‘చుక్కలు’ చూపిస్తున్నారుగా అని అంటున్నాడ్సార్! -
ఎవరేమోగానీ.. మీరయితే ఈ మధ్యన అలానే తీర్పులిస్తున్నారు సార్!
ఎవరేమోగానీ... మీరయితే ఈ మధ్యన అలానే తీర్పులిస్తున్నారు సార్! -
వీళ్లతో ఓటేయించుకోవాలంటే మనకు ఎన్ని కోట్లు కావాలో!?
-
విశ్వసనీయతే అధికారానికి సోపానం
విశ్వసనీయత గల నాయకులకు అధికారం దగ్గరగా ఉంటుంది. అనేక మంది నాయకులు అనేక దశాబ్దాలుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పరిపాలన సాగించారు. విశ్వసనీయత కోల్పోయినప్పుడు ప్రజలు వారిని గద్దెదించారు. ఉదాహరణకు ఏ సామాజిక మాధ్యమాలూ లేనటువంటి కాలంలోనే ఇందిరాగాంధీ తప్పు చేస్తే ప్రజలు ఓడించి, అధికారానికి దూరం చేశారు. అందుకే విశ్వసనీయత రాజకీయాల్లో చాలా అవసరం. విశ్వసనీయతతో జ్యోతిబసు మూడు దశాబ్దాలు పరిపాలించారు. లాలూ 15 సంవత్సరాలు, ఒకప్పుడు బిజూ పట్నాయక్, ఇప్పుడు నవీన్ పట్నాయక్, కరుణానిధి, జయలలిత, వైఎస్, మమతా బెనర్జీ, ఎన్టీఆర్... ఇలా అనేక మందిని మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో కొత్తగా కేజ్రీవాల్ ఢిల్లీ లోనూ విశ్వసనీయతతో గెలుస్తూ వస్తున్నారు. నా విశ్లేషణ ప్రకారం భారతదేశ రాజకీయాల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి తర్వాత అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుల్లో నరేంద్ర మోదీ మొదటి వరుసలో ఉంటారంటే అతిశయోక్తి లేదు. గుజరాత్లో మూడు సార్లు హ్యాట్రిక్ విజయం సాధించి, మరో మూడుసార్లు గుజ రాత్ను బయట ఉండి గెలిపించిన నాయకుడిగా ఖ్యాతి చెందారు. అదే విధంగా 2014, 2019 పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రధాని అభ్యర్థిగా ప్రజలు నరేంద్ర మోదీని నమ్మి భాజపాను గెలిపించారు. ఇప్పుడు హ్యాట్రిక్ దిశగా 2024 పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. బెంగాల్లో కమ్యూనిస్టుల తర్వాత మమతా బెనర్జీ వరుసగా మూడుసార్లు ప్రజల అచంచల విశ్వాసంతో అధికారాన్ని చేపట్టారు. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ప్రజల విశ్వాసాన్ని చూరగొని ఐదో సారి అధికారాన్ని నిలబెట్టుకుంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కరుణానిధి, జయలలిత తమ ప్రభావాన్ని ప్రజల్లో నిలబెట్టుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టి రామారావు ప్రజల్లో విశ్వసనీయ నేతగా మన్ననలు పొందారు. ఒంటిచేత్తో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. పేదప్రజల మనిషిగా సుస్థిర స్థానాన్నిపొందారు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల మన్నన, విశ్వాసాలు పొందారు. అదే చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పటికీ, మరో 13 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ ప్రతి ఎన్నికల్లోనూ ఎవరో ఒకరితో పొత్తుతోనే గెలుపొందారు. ఒంటరిగా ఎప్పుడు కూడా గెలవలేకపోయారు. 1999 ఎన్నికల్లో భాజపాతో జట్టుకట్టి గెలుపొందారు. 2004 ఎన్నికల్లో తిరిగి భాజపాతో జట్టుకట్టారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్, కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు వెళ్ళి ఓటమి పాలయ్యారు. 2014లో మళ్ళీ భాజపా, జనసేనతో జట్టుకట్టి విజయం సాధించారు. 2019లో తెలుగుదేశానికీ, ఎన్టీఆర్‌కూ బద్ధ శత్రువైన కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకొని పరువు పోగొట్టుకున్నారు. ఒకసారి అటల్ బిహారీ వాజ్‌పేయి చరిష్మాతో పొత్తులో విజయం సాధించారు. మరోసారి నరేంద్ర మోదీ హవాలో గెలుపొందారు. కానీ ఎన్నడూ ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోలేదు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలూ ఎన్నికలకు సిద్ధమౌతున్న నేపథ్యంలో చంద్రబాబు మాత్రం పొత్తుల కోసం తహతహలాడుతున్నారు. జనసేనతో కలవాలనీ, భాజపాతో కూడా కలిసి పనిచెయ్యాలనీ ఉవ్విళ్ళూరుతున్నారు. 2014 పొత్తులను మళ్ళీ పునరావృతం చెయ్యాలనే గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఒంటరి పోరుతోనే బరిలోకి దిగాలని నిశ్చయించారు. ఏది ఏమైనా రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా ఉండనున్నాయి. - రఘురామ్ పురిఘళ్ళ బీజేపీ సీనియర్ నాయకులు, న్యూఢిల్లీ -
Sharwanand : హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్! పెళ్లి ఎప్పుడంటే..
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయితో శర్వా ఏడడుగులు వేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన ఆమెతో శర్వానంద్ ఏడడుగులు వేయనున్నారట. ఇప్పటికే పెళ్లి, నిశ్చితార్థం డేట్ కూడా దాదాపు ఖాయమైనట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఈనెల26న శర్వానంద్ ఎంగేజ్మెంట్ వేడుక ఘనంగా జరనున్నట్లు సన్నిహితవర్గాలనుంచి సమాచారం అందుతోంది. ఈ క్రమంలో శర్వానంద్ పెళ్లిచేసుకునే అమ్మాయి ఎవరా అన్న ఆరాతీయగా, ఆమె మాజీ మంత్రి మనువరాలు అని తెలుస్తోంది. దీన్నిబట్టి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి శర్వానంద్ అల్లుడు కాబోతున్నాడట. కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరగనుందట. ఇక పెళ్లి ఏప్రిల్‌లో ఉంటుందని.. శర్వా డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోనున్నట్లు సమాచారం. -
ఏమో... గుర్రం ఎగురా వచ్చు
కథతో మొదలెట్టుకుందాం. ఒక మోసగాడు కొయ్యగుర్రాన్ని రాజాస్థానానికి పట్టుకుని వచ్చి ‘రాజా.. ఈ గుర్రం ఎగురుతుంది. పదివేల వరహాలకు అమ్ముతాను’ అంటాడు. ఎగిరే గుర్రాన్ని ఎవరు వద్దనుకుంటారు? ‘ఎగరకపోతేనో?’ అంటాడు రాజు. ‘ఎగురుతుంది రాజా. పున్నమిరోజు వెన్నెల రాత్రి ధవళ వస్త్రాలు ధరించి అధిరోహించు. ముల్లోకాలు తిప్పి తెస్తుంది’ అంటాడు. పదివేల వరహాలు మోసగాడికి దక్కాయి. పున్నమి వచ్చింది. వెన్నెల రాత్రి వచ్చింది. ధవళ వస్త్రాలతో రాజు గుర్రం ఎక్కాడు. గుర్రం కదల్లేదు. మెదల్లేదు. ముఖం జేవురించిన రాజు ‘వాడి తల ఉత్తరించండి’ అన్నాడు భటులతో. భటులు వెళ్లి మోసగాణ్ణి పట్టుకొని వస్తే వాడు దబ్బున కాళ్ల మీద పడి ‘రాజా... ఎక్కడో పొరపాటు జరిగింది. ఆరు నెలలు సమయం ఇవ్వండి. ఈలోపు గుర్రం ఎగరకపోతే అప్పుడు నన్ను ఉరి తీయండి’ అన్నాడు. రాజు నెమ్మదించాడు. మోసగాణ్ణి మరోమారు నమ్మి చెరసాలకు పంపాడు. చెరసాలలో సీనియర్ ఖైది ఈ మోసగాణ్ణి చూసి ‘ఒరే... ఎలాగూ గుర్రం ఎగరదు. నీ తల తెగిపడకా తప్పదు. ఈ ఆరునెలల సమయం ఎందుకు అడిగావు?’ అంటాడు. దానికి మోసగాడు ‘ఏమో ఎవరు చూడొచ్చారు. ఈ ఆరు నెలల్లో ఏమైనా జరగొచ్చు. రాజు నన్ను క్షమించవచ్చు. లేదా జబ్బు పడవచ్చు. గుండాగి చావొచ్చు. ఏమో... ఆరు నెలల్లో శత్రురాజు ఈ దేశం మీదకు దండెత్తి ఆక్రమించవచ్చు. ఏమో... వరదలు ముంచెత్తి ఈ చెరసాల గోడలను బద్దలు కొట్టవచ్చు. ఏమో... ఇవన్నీ జరగకపోతే కనీసం గుర్రం ఎగురా వచ్చు’ అంటాడు. ఆశ అంటే అది. కాలం మీద ఆశ. కాలం భవిష్యత్తులో మొదలయ్యి వర్తమానంలోకి వచ్చి గతంలోకి జారుకుంటుంది. మనకు గతం మాత్రమే తెలుసు. వర్తమానం సంభవిస్తూ ఉండగా అంచనా ఉండదు. భవిష్యత్తు ఆచూకీ తెలియదు. కాలం హాయిగా గడవాలని ఏ మనిషైనా కోరుకుంటాడు. హాయిగా గడవడం కోసం శ్రమ పడతాడు. హాయిగా గడవదేమోనని భయపడతాడు. ‘రోజులన్నీ ఒక్కలాగే ఉండవు’ అని కలవరపడే మనిషే ‘రోజులన్నీ ఒక్కలాగే ఉంటాయా ఏంటి’ అని ఏదో ఒక గుడ్డి నమ్మకం కాలం మీద పెట్టుకుంటాడు. ఇదేమీ తెలియని కాలం ఆవిశ్రాంతంగా ఉద్భవిస్తూ, జనిస్తూ, సకల ప్రాణికోటికి సమంగా బట్వారా అవుతూ, రెప్పపాటు నుంచి మన్వంతరాల వరకూ జరిగే ఘటనలను తనలో లీనం చేసుకుంటూ ముందుకు సాగిపోతుంటుంది. కాలం ముందుకే సాగగలగడం మనిషి అదృష్టం. టైమ్ మిషన్ ఎక్కి వెనక్కు వెళ్ళాలని అనుకుంటాడుగాని వెనక్కు వెళితే ఏముంటుంది? గుప్తుల స్వర్ణయుగంలో కూడా దోమలు ఉంటాయి. మశూచి ఉండే ఉంటుంది. ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని మనిషి అనుకుంటాడు గానీ గత కాలం పట్ల అసంతృప్తే మనిషిని ముందుకు నడిపించేది. గత కాలపు అనుభవాలలోని లోటును గ్రహించడం వల్లే మనిషి భవిష్యత్తు ఆవిష్కరణలు చేసేది. గతంలో రాజు గారికి రాచకురుపు వస్తే రాకుమారుడు గుర్రం తీసుకుని విరుగుడు ఆకుల కోసం వేయి యోజనాలు ప్రయాణించాల్సి వచ్చేది. ఇవాళ బంజారా హిల్స్‌లో అడుగుకొక కేన్సర్ హాస్పిటల్ ఉంది. గతంలో నలభై, నలభై ఐదేళ్లకు మనిషి పుటుక్కుమనేవాడు. ఇవాళ షుగర్, బిపిలను మేనేజ్ చేసుకుంటూ అతి సులభంగా ఎనభై ఏళ్లు జీవిస్తూ ఉన్నాడు. పాలకుల, శ్రీమంతుల, నగర పెద్దల పిల్లలకు మాత్రమే పరిమితమైన గురుకుల విద్య నేడు సకల వర్గాలకు మిడ్ డే మీల్స్ విత్ బాయిల్డ్ ఎగ్ దొరుకుతూ ఉంది. గతం లోపాలను చెరిపేసుకుంటూ కాలాన్ని సరిదిద్దుకుంటూ మనిషి ముందుకు సాగడం వల్ల జరిగే మేళ్లు ఇవి. మరి గత కాలాన్ని ఎందుకు గౌరవించాలి? విలువలకు. వెర్రిబాగులతనానికి. అకలుషితానికి. రుచికి. పరిమళానికి. బాంధవ్యాలకు. ఆపేక్షలకు. నిజాయితీకి. నిరాడంబరతకు. బాగా బతకాలని భవిష్యత్తు మీద ఆశ పెట్టుకునే మనిషి ఇవి లేకుండా బాగా బతకలేడు. ఏ మంచిని వదలుకుని ఏ చెడును ముందుకు తీసుకెళుతున్నావన్న కాల అప్రమత్తత మనిషికి ఉండాలి. గతాన్ని లోడి, దాని గాయాలను కెలికి, అందులోని చెడు ఘటనలు వెలికి తీసి వాటిని ఎవరో ఒకరి ద్వేషానికి ఉపయోగిస్తూ, గతంలోని ఫలానా కారణం వల్ల భవిష్యత్తులో ఫలానా వారికి గుణపాఠం చెప్పాలి అని ప్రచారం చేస్తూ ఉంటే కనుక రాబోయే కాలం గడ్డుకాలమే అవుతుంది. గతంలోని ద్వేషం వద్దు. గతంలోని యుద్ధం వద్దు. గతంలోని దోపిడి వద్దు. గతంలోని ఎక్స్‌ప్లాయిటేషన్ వద్దు. గతంలోని పాపాలను భవిష్యత్తులో కడుక్కోవడానికి మాత్రమే మనిషి కాలాన్ని వారధి చేసుకోవాలి. కొత్త సంవత్సరం వచ్చిన ప్రతిసారి మనిషి కాలం మీద ఆశ పెట్టుకునే వెల్కమ్ చెబుతాడు. గతం గతః అనుకుంటాడు. ఇకపై మంచి జరగాలని సగటు మనసుతో కోరుకుంటాడు. పాత బాధలను తలువనివ్వని కొత్త కాలం కోసం ప్రార్థనలు చేస్తాడు. కాని ప్రజల మంచికాలం పాలకుల గుప్పిట్లో ఉంది. ఒక ఫైల్ మీద బాధ్యత లేని సంతకం, అమానవీయ చట్టం, తప్పుడు నిర్ణయం ప్రజలకు చేటుకాలం తెస్తుంది. ‘తమకు మాత్రమే మంచి కాలం ఉండాలని’ పాలకులు ప్రజలకు చెడుకాలం తెచ్చి పెట్టినంత కాలం మన టైము బాగుంటుందని, బాగు పడుతుందని ఆశ పెట్టుకోవడం వృధా. మన కాలం బాగుండాలంటే పాలకులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. పాలనా వ్యవస్థలను హెచ్చరించగలగాలి. పరిపాలనను సరిదిద్దడానికి గట్టిగా నిలబడాలి. మన నొసటి కాలాన్ని మనమే రాసుకోవాలి. 2023లో అలా జరుగుతుందని ఆశిద్దాం. ఏమో... గుర్రం ఎగురా వచ్చు. హ్యాపీ న్యూ ఇయర్. -
‘ఈడీ’నామ సంవత్సరం.. గుట్టలుగా నోట్ల కట్టలు..
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఈ పేరు వింటనే ఈ ఏడాది ఎంతో మంది పొలిటికల్ లీడర్లు, ప్రముఖులు వణికిపోయారు. ఎందుకంటే 2022లో ఈడీ దాడుల కారణంగా కొన్ని వందల కోట్ల అక్రమ సంపాదన బయటకు వచ్చింది. దీంతో, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రముఖ రాజకీయ నేతలతో సహా ప్రముఖులు సైతం జైలు ఊసలు లెక్కబెట్టారు. కానీ, వీరంతా ప్రతిపక్ష నేతలు కావడంతో కేంద్రం తీవ్ర విమర్శులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఈడీ దాడులు జరగడం విశేషం. ఈడీ జోరు పెంచిన కారణంగా ఈ ఏడాదిని ‘ఈడీనామ సంవత్సరం’గా పేర్కొనవచ్చు.. 1. నేషనల్ హెరాల్డ్ కేసు.. ఈ కేసులో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటుగా రాహుల్ గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలను ఈడీ ప్రశ్నించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ముందుగా రాహుల్ గాంధీ.. ఈడీ అధికారుల ఎదుట హాజరవుతున్న క్రమంలో ఢిల్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈడీ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఢిల్లీలో ర్యాలీ తీశారు. దీంతో, ఉద్రిక్తత నెలకొంది. ఈడీ అధికారులు రాహుల్ గాంధీని ఐదు రోజుల్లో దాదాపు 50 గంటల పాటు విచారించారు. ఇక, ఈడీ విచారణ అనంతరం.. తన ఓర్పును చూసి ఈడీ అధికారులే షాక్ అయ్యారని రాహుల్ చెప్పుకొచ్చారు. తర్వాత ఈ కేసులో ఈడీ.. సోనియాను విచారించింది. కాగా, ఈడీ విచారణకు ముందే సోనియా కరోనా బారినపడటంతో విచారణ ఆలస్యమైంది. అనంతరం, సోనియా.. ఈడీ విచారణను హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారం ఈడీ నడుచుకుంటోందని, ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనిగా పెట్టుకుందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. సోనియా గాంధీ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. వీరి విచారణల అనంతరం, ఈడీ అధికారులు.. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ సహా మరికొంత మందికి నోటీసులు ఇచ్చి విచారించింది. ఈ క్రమంలో ఈడీ విచారణ రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టించింది. 2. బెంగాల్లో పార్థా చటర్జీ ప్రకంపనలు.. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న బెంగాల్లో ఈడీ దాడులు దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారాయి. బెంగాల్ విద్యాశాఖ మంత్రి, టీఎంసీ నేత పార్థా చటర్జీ.. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ఈడీ అధికారులు మంత్రి పార్థా చటర్జీ సహా, అర్పిత ముఖర్జీని అరెస్ట్ చేశారు. ఇక, వీరి విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. టీచర్ పోస్టులకు, బదీలీలకు పార్థా చటర్జీ భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నట్టు వెల్లడైంది. ఈ కేసులో దాదాపు 50 కోట్ల రూపాయల నగదు.. కిలోల్లో బంగారం, లగర్జీ కార్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. దీంతో, సీఎం మమత.. టీఎంసీ నుంచి పార్థా చటర్జీని తొలగించారు. 3. పంజాబ్‌లో మైనింగ్ కేసు.. పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాజీ సీఎం చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ బావమరిది భూపేందర్ సింగ్ హనీపై ఇసుక మాఫియా కేసులో భాగంగా ఈడీ కేసు నమోదు చేసి విచారణ జరిపింది. ఈ కేసులో విచారణలో భాగంగా ఈడీ అధికారులు దాదాపు రూ.10 కోట్లు, 21 లక్షలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో భాగంగా మాజీ సీఎం ఛన్నీని కూడా ఈడీ విచారించింది. 4. జార్ఖండ్ సీఎంకు ఈడీ షాక్.. అక్రమ మైనింగ్ వ్యవహారంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ నోటీసులు జారీచేసింది. ఇదే కేసులో సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రాను ఈడీ అరెస్టు చేసింది. అతనిపై మనీ లాండరింగ్ కేసు నమోదుచేసిన అధికారులు.. జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మిశ్రాతోపాటు అతని వ్యాపార భాగస్వాముల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 50 బ్యాంకు అకౌంట్లలో రూ.13.32 కోట్ల నగదును సీజ్ చేశారు. మే నెలలో సీఎం సోరెన్‌తోపాటు జార్ఖండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ ఇంట్లో కూడా ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఇదే క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తనకు తానుగా గనులను కేటాయించుకున్నారని, సీఎం సోరెన్‌ను ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర గవర్నర్‌కు కేంద్ర ఎన్నికల సంగం సూచించిన విషయం తెలిసిందే. దీంతో, ఈ కేసు వ్యవహారం జార్ఖండ్‌లో సోరెన్ తన సీఎం పదవి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ కేసు రాష్ట్రంలోనే కాకుండా రాజకీయంగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. 5. ఢిల్లీలో ఆప్‌ను తాకిన ఈడీ.. ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు ఈడీ అధికారులు షాకిచ్చారు. మనీలాండరింగ్ కేసులో మే ౩౦వ తేదీన సత్యేంద్ర జైన్‌ను ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని 2017 ఆగష్టు 24వ తేదీన సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఆధారంగా ఈడీ ఇన్విస్టిగేషన్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే సత్యేంద్రను మే ౩౦వ తేదీన అరెస్ట్ చేసి తీహార్ జైలులో పెట్టారు. అరెస్ట్ అనంతరం.. ఆయన బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఇదిలా ఉండగా.. ఇటీవలే జైలులో మంత్రి సత్యేంద్ర జైన్‌కు వీఐపీ సేవలు అందుతున్నాయనే వార్తలు, వీడియోలు బయటకు వచ్చాయి. జైలులో మసాజ్, ఇంటి ఫుడ్ తీసుకున్న వీడియోలు లీక్ అయ్యాయి. దీంతో, ఈ వ్యవహారంలో ఈమధ్యే తీహార్ జైలు సూపరింటెండెంట్ని సస్పెండ్ చేశారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి అదే జైలులో ఉన్న సహ నిందుతులను సత్యేంద్ర పదే పదే కలుస్తున్నారని, తద్వారా ఈ కేసుని ప్రభావితం చేస్తున్నారని ఈడీ ఆరోపిస్తోంది. దీంతో, సత్యేంద్ర జైన్ జైలు వ్యవహారం దేశంలో హాట్ టాపిక్ మారింది. 6. శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఈడీ షాక్.. మహారాష్ట్రలో పాత్రా చాల్ కుంభకోణానికి సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో భాగంగా ముంబైలోని సంజయ్ రౌత్ ఇంట్లో సోదాలు జరిపిన ఈడీ అధికారులు లెక్కల్లో చూపని నగదును గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. పాత్రా చాల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్‌ను కూడా ఈడీ అదుపులోకి తీసుకుంది. మనీ ల్యాండరింగ్ కేసులో రూ. 11 కోట్ల నగదు, పత్రా చాల్ ల్యాండ్ స్కామ్ కేసులో పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇక, ఈ కేసులో దాదాపు 100 రోజులు జైలు జీవితం గడిపిన అనంతరం.. కోర్టు సంజయ్ రౌత్‌కు బెయిల్ మంజూరు చేయడంతో రౌత్ విడుదలయ్యారు. 7. దావూద్ ఇబ్రహీం కారణంగా నవాబ్ మాలిక్ అరెస్ట్.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్‌ను ఈడీ అరెస్టు చేసింది. పీఎంఎల్ఏ (అక్రమార్జన నిరోధక చట్టం) కింద మాలిక్ స్టేట్మెంట్ను రికార్డు చేశామని, ఆయన సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని ఈడీ అధికారులు చెప్పారు. దావూద్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన ఒక ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మాలిక్‌పై కేసు నమోదు చేసింది. ముంబై దాడులతో సంబంధమున్నవారితో మాలిక్‌కు స్థిరాస్తి సంబంధాలున్నాయని, అందువల్ల ఆయన్ను ప్రశ్నించాల్సి ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో, ఈ వ్యవహారం మహారాష్ట్రలో సంచలనంగా మారింది. ఈ కేసులో భాగంగా ముంబైలో దావూద్ హవాలా లావాదేవీలతో సంబంధం ఉందంటూ దావూద్ సోదరి, సోదరుడు, చోటా షకీల్ బావమరిది సహా పలువురికి సంబంధించిన ఇళ్లపై ఈడీ రైడింగ్లు జరిపి కేసు నమోదు చేసింది. గతంలో దావూద్ తదితరులపై ఎన్ఐఏ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అంశాల ఆధారంగా ఈడీ దాడులు నిర్వహించింది. 2005లో ముంబైలోని కుర్లా ప్రాంతంలోని రూ.300 కోట్ల విలువైన స్థలాన్ని కేవలం రూ.55 లక్షలకే మాలిక్ పొందాడని ఈడీ తెలిపింది. ఇందులో ఆయనకు దావూద్ సోదరి హసీనా పార్కర్‌తో పాటు దావూద్ సన్నిహితులు సాయం చేశారని తెలిపింది. దావూద్‌తో మాలిక్‌కు సంబంధం ఉందన్న ఆధారాల్లేవని మాలిక్ న్యాయవాదులు చెప్పారు. ఈడీ చెబుతున్న లావాదేవీ 1999కి సంబంధించినదని తెలిపారు. ఇక, మాలిక్ అరెస్ట్‌ను ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సహా పలువురు నేతు ఖండించారు. 8. ఢిల్లీ లిక్కర్ స్కాం.. దేశ రాజధాని ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కేసులో దేశవ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అమిత్ అరోరా సహా పలువురు అరెస్ట్ అయ్యారు. ఇక, ఈ కేసులో ఈడీ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఇండోస్పిరిట్ కంపెనీకి ఢిల్లీలో ఎల్1 లైసెన్సుతో వచ్చిన షాపుల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వాటా ఉందని ఈడీ పేర్కొంది. లిక్కర్ స్కాం ద్వారా సంపాదించిన ఈ ఆదాయంలో ఎక్కువ భాగం కవితకు చేరినట్టు ఈడీ ఆరోపించింది. లిక్కర్ స్కాంకు సంబంధించి ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో ఏర్పాటుచేసిన మీటింగ్‌లో కవితతో పాటు అమిత్ అరోరా, దినేశ్ అరోరా, సమీర్ మహీంద్రు పాల్గొన్నారని ఈడీ చార్జిషీట్లో ప్రస్తావించింది. కవిత వాడిన ఫోన్ల వివరాలను, వాటిని ఐఎంఈఐ నంబర్లను కూడా ఈడీ ప్రస్తావించింది. ఇక, ఇదే కేసులో గతంలో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు. ఈ కేసులో భాగంగానే కవితను సీబీఐ కూడా విచారించింది. 9. విజయవాడ ఆసుపత్రుల్లో ఈడీ దాడులు.. విజయవాడలోని ఆసుపత్రుల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గుంటూరు జిల్లా చినకాకానిలోని ‘ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్’లో అక్రమాలపై ఈడీ కొరడా ఝుళిపించింది. ఆ అకాడమీ నిర్వహిస్తున్న ఆస్పత్రి, మెడికల్ కాలేజీల నిధులను నిబంధనలకు విరుద్ధంగా కొల్లగొట్టడంపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఎన్ఆర్ఐ ఆస్పత్రితోపాటు విజయవాడలో నివసిస్తున్న ఆ ఆస్పత్రి డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, ఉప్పలాపు శ్రీనివాసరావు, వల్లూరిపల్లి నళినీమోహన్ల నివాసాలలో 40 ఈడీ బృందాలు ఏకకాలంలో విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. రెండు ఆస్పత్రుల్లో పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ సీట్ల అమ్మకం, అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలో పెట్టుబడులపై ఆరా తీశారు. దాదాపు రూ.100 కోట్లు వరకు ఆర్థిక వ్యవహారాలు నడిచినట్లు సమాచారం. 10. గ్రానైట్ విషయంలో గంగులపై ఈడీ దాడి.. టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్‌ను ఈడీ టార్గెట్ చేసింది. గంగుల నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్లో సోదాలు నిర్వహించారు. గంగుల కమలాకర్‌కు చెందిన శ్వేత గ్రానైట్‌తో పాటు కరీంనగర్‌లోని మహవీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్ కార్యాలయాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. గంగులతో పాటు ఇతర గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలను ఉల్లంఘించినందుకే సోదాలు నిర్వహిస్తున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. అనంతరం, గంగుల కమలాకర్ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. - ఇవే కాకుండా.. ఎంపీ కార్తీ చిదంబరం చైనా వీసా కేసులో కూడా ఆయన్ను ఈడీ విచారించింది. ఈ కేసులో చిదంబరం మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ పేర్కొంది. యస్-బ్యాంక్, డీహెచ్ఎఫ్ఎల్ ఫ్రాడ్ కేసులో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగా రూ. 415 కోట్లను ఈడీ ఎటాచ్ చేసింది. జమ్మూ-కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్ వ్యవహరంలో మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేసింది. -
కైకాల మృతి పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం
దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, మంత్రులు, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. కైకాల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘సార్వ భౌమ’ అనిపించుకున్న మేటి నటుడు: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విభిన్నపాత్రల్లో నటించి, తన విలక్షణ నటన ద్వారా నవరసనటనా సార్వ భౌమ అనిపించుకున్న మేటి నటుడు కైకాల సత్యనారాయణ మరణం విచారకరమని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ‘‘కైకాల ఆరు దశాబ్దాల సినీ జీవితంలో 777 చిత్రాలలో నటించారు. కేవలం నటుడు గానే కాకుండా చిత్రం నిర్మాణం కూడా చేపట్టి పలు సినిమాలు నిర్మించి మంచి ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ రంగంలో అడుగు పెట్టిన ఆయన మచిలీపట్నం లోక్ సభ నుంచి ఎన్నికై పార్లమెంటు సభ్యుడి గాను తన సేవలను ప్రజలకు అందించారు. సత్యనారాయణ మరణం సినీ రంగానికి తీరని లోటు’’ అని మంత్రి కారుమూరి అన్నారు. ఇండస్ట్రీకి తీరని లోటు: మంత్రి వేణు కైకాల మృతి పట్ల మంత్రి వేణుగోపాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 700 చిత్రాలకు పైగా నటించిన కైకాల మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అన్నారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంతో బాధాకరం: మంత్రి రోజా సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ గారు 750 కిపైగా సినిమాల్లో నటించి `నవరసనటనా సార్వభౌముడు` అనిపించారని మంత్రి రోజా ట్విట్ చేశారు. మరణం ఎంతో బాధాకరమని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కైకాల కుటుంసభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
కిలోల కొద్ది బంగారం కొంటున్నా.. కానీ రాజయోగం లేదు
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్ సరాఫరా సంఘం(సెస్) ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. పార్టీల నుంచి ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తంగళ్లపల్లి మండలం నుంచి సెస్ ఎన్నికల బరిలో ఉంటున్నట్లు ప్రకటించిన ఓ పార్టీ నాయకుడు రాజయోగం కోసం అదృష్ట ఉంగరం కొనేందుకు వెళ్లిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 15 ఏళ్ల క్రితం సదరు నాయకుడు బంగారం, అదృష్ట ఉంగరాల వ్యాపారి వద్ద అరతులం, తులం కొనేవాడని.. అదృష్ట ఉంగరం తీసుకున్న తర్వాత కిలోల కొద్దీ బంగారం కొంటున్నాడని చెప్పుకొచ్చాడు. తాను అదృష్ట ఉంగరం కొన్నప్పటి నుంచి ఆర్థికంగా బలంగా పడ్డానని, కానీ రాజయోగం మాత్రం రావడం లేదని అనడం కొసమెరపు. ఇదంతా సదరు వ్యాపారికి చెందిన యూట్యూబ్ ఛానల్లో 8 నెలల కిత్రం పోస్టు చేయగా.. సెస్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు వైరల్ గామరింది. చదవండి: సీబీఐ విచారణ తర్వాత తొలిసారి స్పందించిన కవిత -
పొలిటికల్ తిట్లలో పోషకాలెక్కువ...
ఇప్పుడు ఓ చందమామ కథ చెప్పుకుందాం,. అనగనగా ఓ ఊర్లో ఓ గయ్యాళి గంగమ్మ ఉండేది. ఆమె నోటికి ఊరంతా హడలిపోయేది. ఇంట్లో ఉన్న భర్తను, పిల్లలను నానా తిట్లు తిడుతుండేది. ఆమె ఇంటి ముందు నుంచి ఊరివారెవరైనా వెళ్లడానికే భయపడేవారు. ఆమె తిట్లు అంత ఘాటుగా ఉండేవి. ఆమె నోటికి దడిచి కొడుకుకు పిల్లను ఇవ్వడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరికి అతని పరిíస్థితి అర్థం చేసుకుని, ప్రేమించిన తెలివైన అమ్మాయి ఓ సాధువును ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న సాధువు గంగమ్మను మార్చాలని ఆ ఇంటికి వెళ్లాడు. ఆ ఇంటికి వెళ్లిన సాధువు ఆమె నోటితీరుకు, ఆమె తిట్లకు అవాక్కయ్యాడు. కాసింత తేరుకుని.. ఆమె మారదని నిర్ణయించుకుని, కాసింత మంత్ర జలం తీసి.. ‘‘ఇక నుంచి ఎప్పడు ఎవరు ఎవరిని తిట్టినా తిట్ల దెయ్యం ప్రత్యక్షం అవుతుంది. తిట్లు సమంజసమే అయితే ఇబ్బంది పెట్టిన వారిని, లేకుంటే అకారణంగా తిట్టిన వారిని తిట్ల దయ్యం ఏడిపిస్తుంది లేదా తినేస్తుంది’’ అని శపించి వెళ్లిపోయాడు. ఆ మరుక్షణం తిట్లభూతం ప్రత్యక్షమై గంగమ్మ ఇంట్లో వీరంగం వేసింది. గంగమ్మ నోరు మూతపడి... పిల్లల ప్రేమ పెళ్లికి వెళ్లింది... కథ కంచికి వెళ్లింది. ఇప్పుడా తిట్ల భూతాలు రాజకీయ నాయకుల ఇంటివద్ద.. పార్టీ ఆఫీసుల వద్దా తిరుగుతున్నాయట. మొన్న మునుగోడు ఎన్నికల సమయంలో వీధుల్లో వీరంగం వేసినవి కూడా ఇవేనట! ఈ మధ్య తిండిపై బాగా ధ్యాస పెరిగింది. తినేది ఆర్గానికా, కాదా... క్యాలరీ ఫుడ్డా కాదా... ఇలా తర్జన భర్జనలు బాగా పెరిగాయి. ఏంతింటే మంచిదో డైటీషియన్లను, మంతెన సత్యనారాయణ రాజు లాంటి వారిని అడగడం ఎక్కువ యింది. నిజానికి ఏం తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందో, శక్తి వస్తుందో మన ప్రధానిని అడిగితే తెలుస్తుంది. రోజూ రెండుమూడు కేజీల తిట్లు.. ‘‘మోదీజీ మీరు అలసిపోరా.. అని ఇటీవల కొంతమంది నన్ను అడిగారు. వారికి నేనిచ్చిన సమాధానం ఏమిటో తెలుసా, రోజూ నేను 2, 3 కేజీల తిట్లు తింటున్నా. అవన్నీ ప్రొటీన్‌గా మారేలా నన్ను దేవుడు ఆశీర్వదించాడు. మనను తిట్టే తిట్ల గురించి మనం పట్టించుకోవద్దు. కార్యకర్తలు మజా చెయ్యాలి. 20–22 ఏళ్లుగా రాత్రీ పగలు తేడా లేకుండా నన్ను తిడుతూనే ఉన్నారు... వాటిలో చిత్ర విచిత్రమైన తిట్లు ఉన్నాయి. వాటివల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. ’’ హైదరాబాద్‌లో సభాముఖంగా ప్రధాని చెప్పిన చిట్కా ఇది. అందరూ, ముఖ్యంగా రాజకీయ నాయకులు పాటించదగ్గది. నడక నుంచి పరుగులు.. రాహుల్ గాంధీ చలో జోడో యాత్ర అంటూ నడక మొదలు పెట్టి, దేశమంతా తిరుగుతూ మన రాష్ట్రంలోకి వచ్చే సరికి ఏకంగా పరుగులు మొదలు పెట్టారు. మిగతా వారంతా ఆయనతో పరుగెత్తలేక అలసిపోయారు. మిగతా పరుగులు మహారాష్ట్రలో చేసుకోండి అంటూ ఆయాస పడి చెతులేత్తేశారట.. అంటే మోదీ భాషలో చెప్పాలంటే రాహుల్ గాంధీకి తిట్లు బాగానే వంటబట్టినట్టున్నాయి. తనీ స్థాయికి రావడానికి చిత్రవిచిత్రమైన తిట్లే అంటున్న ప్రధాని మాటలు విన్నారా రాహుల్ జీ! తిట్లకు వెరవకండి. వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలైన తిట్లు, రకరకాల రుచుల్లో ఉంటాయి. హాయిగా తినండి. మీరు కూడా ఏనాడో ఒకనాడు మోదీ స్థాయికి చేరతారు. ప్రొటీన్ ఫార్ములా... కొద్ది నెలలుగా రాష్ట్ర రాజకీయాల్లో వేడి.. అకస్మాత్తుగా బీజేపీలో పోరాటపటిమ పెరిగాయి. దీనికి ఇంత శక్తి రావడానికి టీఆర్ఎస్ అందునా కేసీఆర్ పవర్ఫుల్ తిట్లే కార ణంగా తోస్తోంది. వీళ్ల తిట్లలో బాగా పోషకాలు ఉన్నట్టున్నాయి. రోజురోజుకూ బీజేపీ కార్యకర్తలు బలం పుంజుకుంటున్నారు. ‘‘ ..పిస్సగాడిద కొడుకు, రండ మంత్రి, చేవ లేని దద్దమ్మ, బుట్టాచోర్, కిరికిరి గాళ్లు...’’ మోదీ అన్నట్టు ఇట్లాంటి చిత్ర విచిత్ర తిట్లలో ఎన్ని పోషకాలుంటాయి మరి!.. అందుకే బీజేపీ కార్యకర్తలు బలం పుంజుకుని విజృంభించేస్తున్నారు. ఈ ప్రొటీన్ ఫార్ములా అన్ని పార్టీలకు వర్తిస్తుందని బీజేపీ నాయకులు విస్మరించి నోరు జారు తున్నట్టున్నారు. అలా నోరు జారడం వల్ల మొన్న ఓ ఎంపీ ఇంటిముందు తిట్ల భూతాలు ఎలా వీరంగం చేశాయో చూశాం కదా. పైన మనం చెప్పుకున్న కథలోలాగా తిట్ల భూతాలు తప్పెవరిదైనా వదలవు. తిట్లతో పోషకాలే కాదు. ప్రాబ్లెమ్స్ తప్పవన్న మాట. ఇక ఏం పర్లేదు అనుకుని రిలాక్సయిన టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులూ ఒక్కసారిగా మేల్కోని యాక్టివయ్యింది, బలపడుతోంది, నోరు జాడిస్తోంది... నేషనల్ లెవల్ ఇంపోర్టెడ్ తిట్లనుంచి, లోకల్ నేతల నాటు తిట్ల నుంచీ గ్రహించిన పోషకాలతోనేనని బీజేపీ నాయకులు కూడా గుర్తించి జాగ్రత్త పడాలి. ప్రజల తిట్లు మరింత పవర్ఫుల్.. ఇప్పడు ముఖ్యమంత్రి, ప్రధానితో సహా, అన్ని కేంద్ర, రాష్ట్ర మంత్రులు, నాయకుల నోటి నుంచి వస్తోన్న సేమ్ విమర్శ.. ‘ఊరికే నోరు పారేసుకోవడం, తిట్టడం తప్ప, మేం చేస్తున్న డెవలప్మెంట్ను చూసేదేలేదు...’ అని. నిజమే, రాజకీయ నాయకులు డెవలప్మెంట్ చూడరు, తిట్లు తిడతారు, తింటారు కానీ, డెవలప్మెంట్ చూసే సెక్షన్ కూడా ఉంది. వాళ్లే కామన్‌పీపుల్. ‘‘రోడ్డు వేయించే మొహాల్లేవు కానీ, ఓటు వెయ్యాలట ఓటు! ఐదొందలు, వెయ్యి చేతుల పెట్టి, సిగ్గు శరం లేదా ఓటడగడానికి. గెలిపియ్యుర్రి డబ్బులు తీసుకుని. మన బతుకులు నాశనమైతయి..’’ ‘మా గల్లీకి ఏ పార్టోల్లూ ప్రచారానికి రాకండి...మేం ఓట్లేయం. మీకు ఎప్పటికీ బుద్ది అస్తలేదు..’’ ఎలక్షన్ టైంలో ఇలాటి తిట్లు వింటుంటాం. ఇవి డెవలప్మెంట్ చూస్తున్న జనం.. నాయకులకు కంచాల నిండా పెడుతున్న తిట్లు.. తినలేనంతగా, అరిగించుకోలేనంతగా. ఈ తిట్లకూ పోషక విలువలు ఉంటాయంటారా?... మోదీ భాషలో ఉండవచ్చు కానీ, ప్రజల తిట్లతో బలం రాజకీయ నాయకులకు రాదు ప్రజాస్వామ్యానికి వస్తుంది. పైగా, పైన కథలో..సాధువు క్రియేట్ చేసిన తిట్లభూతం... న్యాయం వైపు ఉంటదని, అన్యాయం చేస్తే తింటదని చెప్పుకున్నాం కదా! ... సో తిట్లు జాగ్రత్తగా ఎంచుకొని తినండి. -సరికొండ చలపతి -
పవన్ కల్యాన్ గూడ జన సేనను తెలుగుదేసంల కల్పుతడేమో..
లష్కర్ల రేల్ గాడి ఎక్కితె అద్ద గంటల మా వూర్కి బోవచ్చు. మా వూరు బోన్గిరి. బోన్గిరిల బాహర్పేటల మేము ఉండెటోల్లం. ఊల్లె నాకందరు సుట్టాలే. పొట్ట తిప్పలకు పట్న మొచ్చి యాభై ఏండ్లయితున్నది. బోన్గిరిల పోశమ్మ గుడి ఎదురుంగ మా ఇల్లున్నది. మా పక్కింట్ల యాద్గిరి మామ ఉన్నడు. మామ అంటె సంత మామ గాదు. వర్సకు మామ. పనిబడ్తె గాయిన పట్నమొచ్చిండు. పనంత అయినంక ఆనంద్ బాగ్ల ఉంటున్న మా ఇంటికొచ్చిండు. గాయినను సూడంగనే నాకు మా వూరును సూసినట్లనిపిచ్చింది. పట్నం మంచి చెడ్డ లర్సుకునే తంద్కు కుద్దు వూరే నడ్సుకుంట నాతాన్కి వొచ్చినట్లు గొట్టింది. ‘మామా! బాగున్నావె’ అని అడ్గిన. ‘బాగున్నర’ అని యాద్గిరి మామ అన్నడు. గా ముచ్చట గీ ముచ్చటైనంక గాయిన రాజకీయాలల్లకు దిగిండు. ‘ఏం మామా! ఎప్పుడు రాజకీయాలు మాట్లాడ్తవేందే?’ ‘రాజకీయాలు గాన్ది ఏమన్న ఉన్నదా? రామాయనమంత రాజకీయమే. బారతమంత రాజకీయమే’ అన్కుంట యాద్గిరి మామ సిగిలేట్ ముట్టిచ్చిండు. ‘విబీషనుడు గోడ దుంకి రాముని దిక్కుకు వొచ్చిండు. గోడ దుంకె బట్కె అన్న జాగల లంకకు రాజైండు. గదే తీర్గ తెలుగు దేసం కెల్లి టీఆర్ఎస్లకు దుంకిన తలసాని, కాంగ్రెస్ కెల్లి దుంకిన సబితా ఇంద్రారెడ్డి అసుంటోల్లు మంత్రులయ్యిండ్రు. ఎలచ్చన్ల ముంగట గోడ దుంకుట్లు ఎక్వయితయి. గోడ దుంకె టోల్లందరు గల్సి విబీషనునికి గుడి గట్టియ్యాలె. గాయినకు మొక్కి నంకనే పార్టి ఫిరాయించాలె.’ ‘బారతం సంగతేందే?’ ‘గంత ఆత్రమైతే ఎట్లరా? కౌరవులు, పాండవుల నడ్మ జాగ పంచాతి అయింది. గా పంచాతిని తశ్వ జేసెతంద్కు కిష్నుడు ఒక్క తీర్గ కోషిస్ జేసిండు. గాయినెంత కోషిస్ జేసినా సూది మొనంత జాగ గుడ్క పాండవులకిచ్చే సవాల్లేదని దురియోదనుడన్నడు. దాంతోని పాలోల్ల నడ్మ విద్దమొచ్చింది. కర్నున్ని ఎవ్వలు లేని జాగలకు కిష్నుడు దీస్క బోయిండు. నువ్వు సూతుని కొడ్కువు గాదు. కుంతి కొడ్కువు. నువ్వు పాండవుల దిక్కుకొస్తివా అంటె పెద్దన్నా అన్కుంట గాల్లు నీ కాల్లు మొక్కుతరు. నిన్ను రాజును జేస్తరు అని కిష్నుడన్నడు. గాయిన ఎంత గనం జెప్పినా కర్నుడిన లేదు. బీజేపీ దిక్కుకెల్లి ఇద్దరు సన్నాసి గాల్ల తోని ఇంకొకడు మొయినాబాద్ ఫాంహౌజ్కొచ్చిండ్రు. తలా నూరు కోట్ల రూపాయలే గాకుంట గనుల సుంటియి గుత్తకిప్పిస్తం అని ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతా రావు, హర్షవర్దన్ రెడ్డిలను బుద్గ రిచ్చినా గాల్లు గోడ దుంక లేదు. ఇక ముంగట ఎవలన్న గోడ దుంకుమని అంటె చెప్పుతోని కొడ్తమని అనుండ్రి అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే లకు కేసీఆర్ జెప్పిండ్రు’ అన్కుంట యాద్గిరి మామ గిలాస్ నీల్లు దాగిండు. ‘ఆంద్ర సంగతేంది?’ ‘ఆంద్రప్రదేస్ల పవన్ కల్యాన్ చెప్పు చేత్ల బట్కోని చెంగడ బింగడ ఎగురుతుండు. నాకు తిక్కుంది, గా దాన్కి లెక్క లేదు అన్కుంట శిగమూగుతుండు. విశాకపట్నం, చోళ హోటల్ల ప్రతాని మోదీని గల్సిండు. రొండు చేతులతోని చెప్పులు బట్కోని శిగమూగుత. ఒక చెప్పు మీరియ్యుండ్రి. ఇంకో చెప్పు చెంద్రబాబిస్తడు. చెప్పులను చేతులల్ల బట్టుకుంట. ముక్యమంత్రినైత అని అన్నడు.’ ‘శానేండ్ల కింద ముక్యమంత్రి కుర్సి కోసం చిరంజీవి ప్రజా రాజ్జెం బెట్టిండు. గప్పుడు గాయిన పార్టి గుర్తు సూర్యుడు. అరచేతి నడ్డుపెట్టి సూర్య కాంతి నాపలేరన్నడు. గని గా అరచెయ్యే సూర్యున్ని మాయం జేసింది. ప్రజా రాజ్జెంను దీస్కబోయి కాంగ్రెస్‌ల గల్పిండు. గాయిన తీర్గనే పవన్ కల్యాన్ గూడ జన సేనను తెలుగుదేసంల కల్పుతడేమో మామా’ ‘కల్పినా కల్పొచ్చురా. పవన్ అనేటి పతంగిని చెంద్రబాబు ఎక్కిస్తున్నడు. వైఎస్సార్సీపీ మోదీ కాల్లు మొక్కుతున్నదని జనసేన లీడర్ బొలివేటి అంటె మల్లీ పారి అంటివా చెప్పు తెగుతది అని మల్లాది విష్ను అన్నడు. వారీ! నువ్వు కొల్వు ఇడ్సి పెట్టి పాత చెప్పుల దుక్నం బెట్టురా! రేల్ గాడికి సైమమైంది. వొస్తరా!’ అన్కుంట మామ బోయిండు. (క్లిక్ చేయండి: నిజాన్కి నేనే గెల్సిన.. రేపు తెలంగాన ముక్యమంత్రిని నేనే..) తోక: మొన్న చాచా నెహ్రూ జయంతి అయ్యింది. ‘బాల్ దివస్ శుభాకాంక్షలు’ అని ఒక లీడర్‌కు జెబ్తె – ‘నా బాల్ (జుట్టు) నల్ల గున్నది’ అని గాయిన అన్నడు. - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
హనీట్రాప్ కేసులో సంచలనం.. ఒక్కొక్కటిగా వెలుగులోకి లీలలు
సాక్షి, గద్వాల: హనీట్రాప్ వ్యవహారం జోగుళాంబ గద్వాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా ఓ ఖాకీ పాత్రపై కూడా ఆరోపణలు వెల్లువెత్తడం జిల్లావ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ప్రధాన సూత్రధారుల్లో ఓ యువ నేతతో పోలీసు అధికారికి స్నేహం ఉండటంతో.. సదరు నేతకు ఖరీదైన నజరానాలు ఇవ్వడం వంటి విషయాలు వెలుగు చూస్తుండటం కేసును మరో స్థాయికి తీసుకెళ్తుంది. అదేవిధంగా గతంలో ఇక్కడ పనిచేసిన నియోజకవర్గ స్థాయి పోలీసు అధికారి, పశుసంవర్ధక శాఖలో పనిచేసిన జిల్లా స్థాయి అధికారి నెరపిన ‘లీలలు’ సైతం ఇప్పుడు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఇందులో బాధితులు ఎవరూ కూడా ముందుకు రాకపోవడం, మరోవైపు కేసులో పలుకుబడి గల నాయకుల నుంచి ఒత్తిళ్లు, పలు రకాల ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా అటు తిరిగి.. ఇటు తిరిగి తమ కొంపనే ముంచుతుందనే ఉద్దేశంతో పోలీసులు అత్యవసరంగా కేసు మూసేందుకు అనామకులపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన సూత్రధారులతో దోస్తానా.. హనీట్రాప్ వ్యవహారంలో ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన సూత్రధారులతో జిల్లాలో పనిచేస్తున్న ఓ ఖాకీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య నెలకొన్న సన్నిహిత సంబంధాల కారణంగా ఇద్దరి మధ్య పలు రకాల లావాదేవీలు కొనసాగినట్లు తెలిసింది. అలాగే ఇటీవల ప్రధాన సూత్రధారికి సంబంధించి వ్యక్తిగత వేడుకలో సదరు ఖాకీ అధికారి ఖరీదైన నజరానాను ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. అయితే ప్రధాన సూత్రధారి అనుకోని విధంగా పంజరంలో చిక్కడం.. యువతులు, మహిళలతో సాగించిన వ్యవహారాలు వెలుగులోకి రావడంతో సదరు ఖాకీ ఖంగుతిన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే భయంతో సదరు అధికారి లోలోపల మదనపడుతున్నట్లు తెలిసింది. చదవండి: గద్వాలలో హనీట్రాప్ కలకలం!.. ఫోన్లో 150 మంది మహిళల ఫొటోలు వివరాలు వెల్లడిస్తున్న సీఐ చంద్రశేఖర్, వెనక నిందితుడు తిరుమలేష్ రాజకీయ నేతల ఒత్తిళ్లు ఈ హనీట్రాప్ వ్యవహారంలో బాధితులు ఎవరూ కూడా కేసు పెట్టేందుకు ముందుకు రాకపోవడం.. పలుకుబడి గల నేతల నుంచి ఒత్తిళ్లు రావడం.. మరోవైపు కొందరు ఖాకీల పాత్రపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ తలనొప్పిని వదిలించుకునేందుకు పోలీసులు అనామకులపై కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకునేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇద్దరిపై కేసు నమోదు కాగా ఒకరిని రిమాండుకు తరలించడం, మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు విలేకరులకు తెలిపారు. అలాగే ఇందులో ఏ రాజకీయ పారీ్టకి సంబంధించిన నేతలు లేరని చెప్పారు. కాగా.. అసలు సూత్రధారులను వదిలి అమాయకుడైన తమ కుమారుడిని (తిరుమలేష్ అలియాస్ మహేశ్వర్‌రెడ్డి)ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపండంపై తల్లిదండ్రులు పద్మ, నారాయణలు పట్టణ పోలీసుస్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. పాత అధికారులు వెలుగులోకి ఇదిలా ఉంటే గతంలో జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన ఓ ఖాకీ అధికారి, అదేవిధంగా పశుసంవర్ధక శాఖలో పనిచేసిన ఓ జిల్లా స్థాయి అధికారి నెరపిన రాసలీలల వ్యవహారం కూడా గుప్పుమంది. సాధారణ ప్రజలు చేస్తే దండన విధించే పోలీసులు.. వారి శాఖలోనే పనిచేసే కొందరు ఖాకీలపై ఆరోపణలు వస్తే మాత్రం పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారనే వి మర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును పోలీసులు లోతుగా విచారణ జరిపి ఇందులో ప్రధాన సూత్రధారులను గుర్తించి కఠిన శిక్ష వేస్తేనే ఇలాంటి లతో సహా ఫిర్యాదు చేశారు. కఠిన చర్యలు.. మీరు చెబుతున్నట్లు ఈ వ్యవహారంలో పోలీసు పాత్ర ఉందనడం అవాస్తవం. మహిళల పట్ల జరిగే ఇలాంటి వ్యవహారాలు సహించేది లేదు. ఏదైనా నిర్దిష్టమైన ఆధారాలుంటే పోలీసులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందులో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు. అదేవిధంగా ఆధారాలు లేని ప్రచారాలను కూడా మీరు నమ్మకుండా ఇలాంటి సున్నితమైన అంశంలో సమన్వయం పాటిస్తే బాగుంటుంది. ఈ కేసు విచారణ కొనసాగుతుంది. మీరు చెప్పినట్లు ఏదైనా ఆధారాలు లభిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. – రంజన్ రతన్‌కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల -
Sakshi Cartoon 26-09-2022
అలాగే బోగస్ నాయకులను కూడా ఏరివేయమంటున్నాడు! -
ప్రజాప్రతినిధి ఇంట్లో పెళ్లికి నేతల జేబులు ఖాళీ.. వాట్సాప్ చాటింగ్ వైరల్
సాక్షి, కరీంనగర్: రాజువారింట్లో వివాహనికి రాజ్యమంతా కదిలి వెళ్తుంది. మరి వెళ్లే ప్రజలంతా ఖాళీ చేతులతో వెళ్తారా? ఎవరి స్థోమతకు తగినట్లుగా వారు కానుకలు తీసుకెళ్తారు. జిల్లాలో ఓ నియోజకవర్గంలో కీలక ప్రజాప్రతినిధి ఇంట్లో త్వరలో మోగనున్న పెళ్లి భాజాలు.. నేతల జేబులు ఖాళీ చేస్తున్నాయి. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా.. ఇప్పుడు రాష్ట్రమంతటా మోరుమోగిపోతోంది. నెట్టింట్లో వైరల్‌గా మారింది. అసలు విషయం ఏంటంటే.. ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో త్వరలో పెళ్లి జరగాల్సి ఉంది. అసలే పెద్ద ప్రజాప్రతినిధి. అందులోనూ ఆయన ఇంట్లో శుభకార్యం. ఆయన అనుచరులు ఉత్తినే ఉంటారా? అంతా కలిసి భారీ బహుమతి తీసుకెళ్లి చదివించాలని నిర్ణయించారు. వెంటనే వాట్సాప్ గ్రూపుల్లో చాటింపు వేశారు. సర్పంచులు ఇంత, ఎంపీటీసీలు ఇంత అంటూ రేటు ఫిక్స్ చేశారు. వారిలో ఆ నేతకు వీరాభిమాని అయిన ఓ గ్రామస్థాయి నేత ఈ వ్యవహారాన్ని మొత్తం అన్నీ తానై చూసుకుంటున్నారు. కొందరు నగదు రూపంలో చెల్లింపులు చేస్తుండగా.. మరికొందరు తమకు తోచిన కానుకలు సమర్పించుకుంటున్నారు. రామడుగు మండలంలోని ఒక గ్రామ మాజీ సర్పంచికి ఆ శుభకార్యానికి కావాల్సిన కోడిగుడ్లు సరఫరా చేయాలని ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. కొడిమ్యాల మండలానికి చెందిన ఒక నాయకునికి చికెన్, చొప్పదండి కేంద్రానికి చెందిన నాయకునికి మటన్ పంపించాల్సి ఉంటుందని సదరు అనుచరుడు హంగామా చేస్తున్నట్లు సమాచారం. చదవండి: మర్రి శశిధర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. స్పందించిన మాణిక్యం ఠాగూర్ ఈ వ్యవహారంపై ఓ గ్రామ సర్పంచిని ‘సాక్షి’ వివరణ కోరింది. స్పందించిన సదరు సర్పంచి.. ‘మేమంతా కానుకలను ఇష్టపూర్వకంగానే ఇస్తున్నాం. ఇందులో ఎవరి బలవంతం లేదు’ అని స్పష్టం చేశాడు. ఇదే నేత సరిగ్గా ఏడాది కింద.. పోలీసు పోస్టింగు విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొనడం గమనార్హం. ఏడాదిలో మూడోది..! కరీంనగర్ జిల్లాలో నేతల ఇళ్లల్లో పెళ్లిళ్లు జరిగిన సమయంలో ఇలాంటి కానుకల కోసం చందాలు సేకరించడం ఏడాదిలో ఇది మూడో ఘటన. ఆగస్టులో ఓ పార్టీ నేత ఇంట్లో వివాహం జరిగినప్పుడు పలు మహిళా సంఘాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా చందాలు సేకరించారు. అప్పట్లో ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఏడాదిలో కలెక్టరేట్లోని ఓ ఉన్నతాధికారి ఇంట్లో పెళ్లి కోసం కూడా దాదాపు రూ.50 లక్షల వరకు వసూలు చేశారని ఉద్యోగులు గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో ఏడాదికాలంలో పెళ్లికానుకల చందాల వసూలులో ఇది మూడోది. ఈ షాదీ ముబారక్ కానుకల వ్యవహారం ఇటు అధికారుల్లో, నేతల్లో ఒక సంప్రదాయంగా మారుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: కేసీఆర్ చేసింది పెద్ద రిస్కే.. ఇది ఆషామాషీ విషయం కాదు -
బాలుడి ముక్కు కొరికేసిన పొలిటికల్ లీడర్.. అంత కోపం దేనికో?
లక్నో: నలుగురికి మంచి చెడులు చెప్పాల్సిన నాయకులే ఒక్కోసారి వారు చేసే పనులతో నవ్వులపాలవుతుంటారు. ఓ రాజకీయ నాయకుడు కోపంతో తమ ఇంట్లో పని చేసే 16 ఏళ్ల బాలుడి ముక్కును కొరికేశాడు. తీవ్ర రక్త స్రావంతో ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పుర్‌లో సోమవారం వెలుగులోకి వచ్చింది. అభయ్ నామ్‌దేవ్ అనే బాలుడు.. సచిన్ సాహూ అనే రాజకీయ నాయకుడి ఇంట్లో సహాయకుడిగా పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం బాలుడు చిన్న తప్పు చేశాడని కోపంతో రగిలిపోయిన సాహూ అతడి ముక్కు కొరికేశాడు. తీవ్ర రక్తస్రావమైన బాలుడిని శనివారం రాత్రి స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఝాన్సీ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవటం వల్ల చర్యలు తీసుకోలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఎస్పీ నేత కారును ఢీకొట్టి.. 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు డ్రైవర్.. వీడియో వైరల్ -
క్యాసినో వ్యవహారంలో కీలక పరిణామం
-
ఉద్యమాల పురిటిగడ్డకు వారసులొస్తున్నారు.. ఎమ్మెల్యే రేసులో నేతల పిల్లలు
సాక్షి, కరీంనగర్: రాష్ట్ర రాజకీయాల్లోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాది ప్రత్యేక స్థానం. ఉద్యమాల పురిటిగడ్డగా పేరొందిన జిల్లా.. మొదటి నుంచీ రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగి ఉంది. రాజకీయ వారసత్వాలు ఈ జిల్లాకు కొత్తేంకాదు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న ఎమ్మెల్యేల్లో మంథని, సిరిసిల్ల, హుస్నాబాద్ స్థానాల్లో ఉన్నవారు ఈ తరహాలోనే రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లోనూ తమ వారసులను బరిలో దింపేందుకు చాలామంది సీనియర్ నేతలు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. కొందరు కుమారులను, కుటుంబసభ్యులను బరిలో దించే యోచనలో ఉండగా.. మరికొందరు తమ రాజకీయ వారసత్వాన్ని మూడోతరానికి అందించే ప్రయత్నాల్లో తలమునకలయ్యాయి. ‘బంధువులు రుతువుల్లాంటి వారు. వస్తారు.. పోతారు.. కానీ, వారసులు చెట్లలాంటివారు.. వస్తే పాతుకుపోతారు’ అంటూ ఓ సినిమాలోని డైలాగు ప్రస్తుతం జిల్లా రాజకీయాలకు సరిగ్గా సరిపోతోంది. మొత్తానికి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలన్నీ తమ కుటుంబ సభ్యులను, మనవళ్లను రాజకీయ యవనికపైకి తీసుకొస్తుండటం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న తనయుడు శ్రీరాం ఇందుర్తి నియోజకవర్గం నుంచి 1999లో ఎమ్మెల్యేగా గెలిచిన బొమ్మ వెంకన్న తనయుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి ఈసారి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. హుస్నాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జీగా కొనసాగుతున్న శ్రీరాం.. నియోజకవర్గంలో పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఈటల రాజేందర్ సతీమణి జమునారెడ్డి ఈసారి తాను హుజూరాబాద్ కాకుండా గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని ఈటల రాజేందర్ ప్రకటించిన నేపథ్యంలో ఈసారి జమునారెడ్డిని రంగంలోకి దించుతారన్న ప్రచారం జోరందుకుంది. ఇప్పటిదాకా హుజూరాబాద్ నుంచి మొత్తం ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఈటల గెలిచారు. ప్రతిసారీ డమ్మీ అభ్యర్థిగా జమునారెడ్డి నామినేషన్ వేస్తూ వచ్చారు. నియోజకవర్గపు వ్యవహారాలన్నీ తెలిసి ఉండటం ఆమెకు కలిసి వస్తుందంటున్నారు. కోరుట్లలో కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కుమారుడు సంజయ్ వయోభారం కారణంగా విద్యాసాగర్‌రావు తన కుమారుడు సంజయ్‌ని ఈసారి తన స్థానంలో పోటీ చేయిస్తారని సమాచారం. విద్యాసాగర్‌రావుకు ఉన్న అనుభవం, సంజయ్.. కేటీఆర్ కలిసి చదువుకోవడం కలిసి వచ్చే అంశాలని స్థానికులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల డబుల్ బెడ్ ఇళ్ల ప్రారంభోత్సవం సమయంలో మంత్రి కేటీఆర్ పదే పదే సంజయ్ పేరును పలకడాన్ని కూడా ఉదాహరిస్తున్నారు. విద్యాసాగర్‌రావు కుమారుడు వికాస్ విద్యాసాగర్‌రావు కుమారుడు వికాస్.. కొంతకాలంగా వేములవాడ నియోజకవర్గంలో వైద్యశిబిరాలు నిర్వహిస్తూ స్థానికంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన కుటుంబ నేపథ్యంతో బీజేపీ నుంచి ఈసారి వేములవాడ నుంచి బరిలో దిగుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెస్సార్ మనవడు మెన్నేని రోహిత్‌రావు మూడుసార్లు ఎంపీగా.. ఆర్టీసీ చైర్మన్‌గా.. రాష్ట్ర మంత్రిగా.. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగి.. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పని చేసిన దివంగత నేత ఎం.సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్) మనవడు మెన్నేని రోహిత్‌రావు రానున్న ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు నియోజకవర్గంలో పార్టీ అధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తాత ఎమ్మెస్సార్ చేసిన సేవలు, అభివృద్ధి తనకు కలసి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి గంగుల కుమారుడు హరిహరణ్ మంత్రి గంగుల కమలాకర్ కుమారుడు గంగుల హరిహరణ్ రాజకీయ ప్రవేశం ఖాయమని ప్రచారం జోరందుకుంది. ఇటీవల హరిహరణ్ జన్మదిన వేడుకల సమయంలో గంగుల వారసుడిగా హరిహరణ్ వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్‌గా పోటీ చేస్తారని అనుచరులు హడావుడి చేయడం త్వరలోనే ఆయన రాజకీయాల్లోకి వస్తారన్న సంకేతాలు కేడర్‌కు వెళ్లినట్లయింది. జువ్వాడి చొక్కారావు మనవడు నిఖిల్ చక్రవర్తి తెలంగాణ సమరయోధుడు, మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు మనువడు నిఖిల్ చక్రవర్తి కూడా ఈసారి కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్‌పై కన్నేశారు. యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నిఖిల్ చక్రవర్తి తాత వారసత్వం తనకు అన్నివిధాలా కలిసి వస్తుందని ధీమాగా ఉన్నారు. -
మర్యాద మంటగలుస్తోంది.. నోరు.. జారిపోతున్నాం!
నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయం.. లోక్‌సభ సమావేశాలు జరుగుతున్నాయి. ఏదో అంశంపై వేడి వేడిగా చర్చ జరుగుతోంది. ప్రఖ్యాత సోషలిస్టు నేత రామ్ మనోహర్ లోహియా ఆగ్రహంతో.. ‘ప్రధాని నెహ్రూ మొఘల్ చక్రవర్తుల కోర్టుల్లో చప్రాసీలుగా పనిచేసిన వంశం నుంచి వచ్చినవాడు..’ అని మాట తూలారు. తమ పూర్వీకులను అంతమాట అన్నా.. ‘నేను సాధారణ ప్రజల మనిషిని అని ఇన్నాళ్లుగా చెప్తునే ఉన్నాను. ఇప్పటికైనా గౌరవనీయ సభ్యుడు ఈ విషయాన్ని అంగీకరించారు’ అన్నారు నెహ్రూ నవ్వుతూ.. అది 1962.. చైనా దురాక్రమణపై పార్లమెంటులో చర్చ జరుగుతోంది.. ఆక్సాయ్‌చిన్‌ను చైనా ఆక్రమించడంపై ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. ‘అది చాలా చిన్న భాగం అక్కడ గడ్డి కూడా మొలవదు. వ్యర్థ భాగమే’.. ఆ నిరసనకు అప్పటి ప్రధాని నెహ్రూ సమాధానం. ‘మరి నా తలపై కూడా ఏమీ మొలవట్లేదు. అది కూడా వ్యర్థమేనా?’.. స్వపక్షమే అయినప్పటికీ కాంగ్రెస్ ఎంపీ మహవీర్ త్యాగి చురక .. నెహ్రూ సహా అంతా ఘొల్లుమని నవ్వారు.. ►ఇక కొద్దికాలం క్రితం రాజ్యసభలో చర్చ.. ‘విదేశాలన్నా, వారి తెల్ల తోలు అన్నా భారతీయులకు మోజెక్కువ. తెల్లని వధువే కావాలనుకుంటారు..’ అంటూ వెటకారంతో దక్షిణాది మహిళల శరీరం, వారి ఛాయపైనా రాజ్యసభలో కామెంట్లు.. నిజానికి ఇక్కడ చర్చ అంశం ‘బీమాలోకి విదేశీ పెట్టుబడులు...’. కానీ కామెంట్స్ చేసినది స్త్రీలు, వారి శరీరాలపై.. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న ఓ బిహార్ ఎంపీ తీరు ఇది.. ఈ వ్యాఖ్యలపై మహిళా సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా తన ‘మాట’ను వెనక్కి తీసుకోవడానికి ఆయన మొరాయించారు. ..ఇదీ ఇప్పటి పెద్దల సభలో మర్యాద. ►ఇక ఇప్పుడు అన్‌పార్లమెంటరీ పదాల (అమర్యాద నుంచి అసభ్యందాకా అర్థం రూపాంతరం చెందింది) గురించి మాట్లాడుకునే సందర్భం వచ్చింది. లోక్‌సభ ‘అన్‌పార్లమెంటరీ’ పుస్తకంలో కొత్తగా ‘కోవిడ్ వ్యాప్తి కారకుడు, సిగ్గుచేటు, వంచకుడు, అవినీతి పరుడు, అసమర్థుడు, కపటబుద్ధి’లాంటివి చేర్చారు. ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన జుమ్లా అనే పదాన్ని (మన స్థానిక నేతల నోటి నుంచి తరచూ వింటున్నాం) కూడా నిషేధించారు. ►‘మేం కొత్తగా చేర్చిందేమీ లేదు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో వద్దనుకుని తొలగించిన పదాలనే ఇప్పుడు మేమూ అన్‌పార్లమెంటరీ పదాల్లో చేర్చాం. 1954 నుంచీ ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది..’అని లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా చెబుతున్నారు.. అన్నీ మాట్లాడుకోవచ్చు, భావప్రకటనా స్వేచ్ఛకు అడ్డేమీ ఉండదని అంటున్నారు. అమర్యాద.. బాగా పెరిగింది..! ►1954 నుంచి చేర్చుతూ పోతూంటే అన్‌పార్లమెంటరీ పదాలు, నిబంధనలు గట్రా కలిసి ఇప్పటికి ఏకంగా 900 పేజీల పుస్తకంగా తయారైంది. ఈ కరదీపిక మన రాజకీయ ఔన్నత్యానికి సూచికలాంటిది. పదునైన మాటలు, భావాలతో కూడిన ఈ పట్టిక రాజకీయ నేతల హుందాతనానికి ప్రతీక అనుకుందాం. కొంచెం అటు ఇటుగా అసెంబ్లీలు, శాసన మండళ్లకూ ఇవి వర్తిస్తాయి. ►‘పిల్లాడు బూతులు మాట్లాడుతున్నాడు. పొలిటికల్ లీడర్లు మాట్లాడుతుంటే టీవీ పెట్టారా..?’’.. ఇది ఇటీవల సామాజిక మాధ్యమాల్లో తరచుగా కనిపిస్తున్న, వినిపిస్తున్న జోక్. మన నేతలు మాటలతో సభ్య సమాజానికి ఇస్తున్న మెసేజ్ ఇదీ.. ►‘పెద్ద మగాడివా.. నోర్మూస్కో.. చెయ్యి తీస్తా.. నీయవ్వ.. గాజులు వేసుకోలే.. నాలుక కోస్తా..’.. ఇవన్నీ వీధి చివర గలాటాలోనో, రచ్చబండ దగ్గర గొడవలోనో వినిపిస్తున్నవి కాదు. అచ్చంగా మనం ఓట్లేసి.. ‘మా బతుకులు మార్చండి. మీరు చర్చలు చేసుకుని, మాట్లాడుకుని మా భవిష్యత్తు తీర్చిదిద్దండి’అంటూ చట్టసభలకు పంపిన గౌరవనీయ ప్రజాప్రతినిధులే చర్చలను ఇలాంటి మాటలతో రచ్చ చేస్తున్నారు. చదవండి: అన్పార్లమెంటరీకి నిర్వచనం ఇదే.. విపక్షాల సెటైర్లు అవినీతీ.. అమర్యాదే.. సమాజంపై వీటి ప్రభావం వంటి విషయాలు వదిలేసి ‘పొలిటికల్’గా చూస్తే.. ఈ అమర్యాద, అసభ్య (అన్‌పార్లమెంటరీ) పదాల లిస్టులు ఎందుకు పెరుగుతాయి? ‘పాలక పక్షం’అవసరం కోసమే కదా! లేటెస్ట్ లిస్టు చూడండి. ‘అవినీతిపరుడు.. అసమర్థుడు.. కపట బుద్ధి.. నియంత.. సిగ్గుచేటు’ఇలాంటి పదాలు కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. ‘‘ఈ పదాలు లేకుండా విపక్షాలు ఏం మాట్లాడుతాయి? ప్రభుత్వంలో ఉన్న పార్టీ చేసే పనులే ఇవి కదా! వీటి గురించి మాట్లాడకుండా నోరు మూస్తే ఎలా?’’ అని విపక్షాలు భగ్గుమంటున్నాయి. ‘జై మోదీ’ తప్ప అన్నీ అన్‌పార్లమెంటరీ పదాలేనా అని విమర్శిస్తున్నాయి. ‘మీ అసమర్థతను, అవినీతిని, అబద్ధాలను ప్రజలకు చెప్పొద్దా? మేం అనొద్దా’అంటూ గగ్గోలు పెడుతున్నాయి. ఇలా వేటినైతే నిషేధిస్తూ వెళుతున్నారో.. అవే పదాలు పాలక, ప్రతిపక్ష రాజకీయాలకు పర్యాయపదాలు కావడం ‘అమృతోత్సవ భారతా’నికి గొంతులో గరళమే.. మరి పాలక పక్షాలు ఇలా తమకు అనువైన పదాల ‘లిస్టు’ను నిషేధిత జాబితాలో చేర్చడం ఇప్పుడే జరిగిందా..? ►2012లో యూపీఏ ప్రభుత్వం కూడా ఇదే చేసింది. అప్పట్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు తరచూ మాట్లాడే ‘అలీబాబా 40 దొంగలు, బద్మాష్, బ్లాక్మెయిల్..’వంటి పదాలను అన్ పార్లమెంటరీ లిస్టులో పెట్టింది. అంటే రాజకీయ ప్రయోజనాల కోసం మర్యాద పూర్వకంగా అమర్యాదకర లిస్టులు మారుతాయన్నమాట. ►మాటలు బుక్కుల్లోకి చేరుతున్నాయి.. కానీ బయటికి రాకుండా ఆగుతున్నాయా? అందరికీ సమాధానం తెలిసిన ప్రశ్నే ఇది. పార్లమెంటులో మాటలపై కోర్టులు జోక్యం చేసుకోలేవు. కానీ లోక్‌సభలో స్పీకర్, పెద్దల సభ చైర్మన్ వాటిని కంట్రోల్ చేయవచ్చు. మాటలను వెనక్కి తీసుకోవాలని సభ్యులను ఆదేశించవచ్చు. తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు. రికార్డుల్లోంచి తొలగించవచ్చు. కానీ ఈ మాట చూడండి.. ►‘మీరు నిషేధించిన మాటలే వాడుతాను. కావాలంటే నన్ను సస్పెండ్ చేసుకోండి..’ అని టీఎంసీ నేత ఓబ్రియాన్ అంటున్నారు. ‘తగ్గేదేలే’అనే మన రాజకీయ వ్యవస్థకు, మనం పైన వేసుకున్న ప్రశ్నకు చక్కని సమాధానం ఇది. అయితే.. అసాధారణంగా స్వయంగా ప్రధాని మోదీ మాటలనే రాజ్యసభలో రికార్డుల నుంచి తొలగించిన సందర్భాలూ ఉన్నాయి. ►సభ్యులు మాట్లాడే మాటలను పార్లమెంట్ సిబ్బంది రాసుకుని, అందులో అభ్యంతరకరమైన మాటలను స్పీకర్‌కు ఇవ్వడం, స్పీకర్ వాటిని రికార్డుల నుంచి తొలగించడం ఒకప్పుడయితే ఓకే.. ఇప్పుడంతా లైవ్.. రికార్డుల నుంచి తొలగించేలోపే జనంలో ఆ మాటలన్నీ రికార్డయిపోతాయి. అందుకే సామాజిక మాధ్యమాల్లో ఓ కుర్రాడి మాట.. ‘సభల్లో ఫైట్లే లైవ్‌లో చూస్తున్నాం.. ఇక తిట్లెందుకు కంట్రోల్ చెయ్యడం. సరదాగా ఉంటుందని కానీయండి..’అని.. చదవండి: ఏ పదాన్ని నిషేధించలేదు: లోక్‌సభ స్పీకర్ ఇది బాగుంది ‘ఖలిస్తానీ, చెంచా, చెంచాగిరీ, పిరికివాడు, క్రిమినల్, గాడిద, అహంకారి..’సభలో ఇలాంటివి మరొక వ్యక్తిని అనకూడదు. ఎవరిని వారే అనుకుంటే తప్పులేదట.. ఓ వెసులుబాటు ఇది బాగుంటుంది అధ్యక్షా.. మీ సభల్లోనే కాదు. మా వీధుల్లో కూడా.. ‘బట్టేబాజ్, బచ్చా, సన్నాసి, బేవకూఫ్, సాలే, గూట్లే, లఫంగి’వంటి పదాలు మారుమోగుతున్నాయి. ఇవి ఆపడానికి నిబంధనలు పెట్టండి.. మరిన్ని కరదీపికలు వేయండి.. ఓ విన్నపం మాటలకు ‘కట్టడి’ఉంది! రాజ్యాంగంలోని 105 (2) ఆర్టికల్ ప్రకారం.. ‘పార్లమెంటు సభ్యులు సభల్లో మాట్లాడే అంశాలపై ఏ కోర్టులో, ఎలాంటి విచారణ జరగడానికి వీల్లేదు’.. అంటే పార్లమెంటులో సభ్యులు మాట్లాడే మాటలకు రాజ్యాంగ రక్షణ ఉంది. కానీ చట్టసభల నిర్వహణ నిబంధనలు ఆయా సభల్లో సభ్యులు ‘సరిగా’ ప్రవర్తించేలా, ‘సరిగా’ మాట్లాడేలా చూసుకునే బాధ్యతను, అధికారాన్ని లోక్‌సభలో స్పీకర్‌కు, రాజ్యసభలో చైర్మన్‌కు దఖలుపర్చాయి. లోక్‌సభ నియమావళిలోని రూల్ 380, 381 ప్రకారం.. ‘సభలో జరిగే చర్చల్లో ఏవైనా మాటలు ఎవరినైనా అగౌరవపర్చేలా, అసభ్యంగా ఉంటే.. స్పీకర్ ఆ పదాలను సభ రికార్డుల నుంచి తొలగించవచ్చు’. 400 ఏళ్ల నాటి నుంచే ‘అన్ పార్లమెంటరీ’ గొడవ చట్ట, ప్రజాప్రతినిధుల సభల్లో ‘అన్ పార్లమెంటరీ’పదాల గొడవ ఈనాటిదేమీ కాదు. బ్రిటిష్ చరిత్రకారుడు పాల్ సీవార్డ్ రాసిన వివరాల ప్రకారం.. 1604వ సంవత్సరంలోనే సభ్యుల మాటలను తొలగించే ‘పని’ మొదలైంది. నాటి బ్రిటిష్ సభలో అంతకుముందు రోజు జరిగిన చర్చలో లారెన్స్ హైడ్ అనే న్యాయవాది వాడిన ‘అభ్యంతరకర’మాటలపై.. మరునాడు చర్చించి రికార్డుల నుంచి తొలగించారు. అప్పుడే ‘సభలో చర్చ జరిగే విషయాన్ని వదిలేసి వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడకుండా స్పీకర్ నియంత్రించాలి’అని నిబంధననూ పెట్టుకున్నారు. ఆస్ట్రేలియాలో ప్రతినిధుల సభలో ‘అబద్ధాలకోరు (లైయర్), మూగ (డంబో)’పదాలను ‘అన్ పార్లమెంటరీ’గా ప్రకటించుకుంది. ‘చిన్నపిల్లల్లా వ్యవహరించడం (చైల్డిష్నెస్)’అనే పదాన్నీ నిషేధించుకుంది. న్యూజిలాండ్ చట్టసభల్లో ‘కమ్మో (కమ్యూనిస్టు అనే పదానికి షార్ట్‌కట్)’పదాన్ని అనుమతించరు. కెనడాలో అయితే మరో అడుగు ముందుకేసి.. ‘దుష్ట మేధావి (ఈవిల్ జీనియస్), కెనడియన్ ముస్సోలిని (ముస్సోలిని అనేది ఒకప్పటి ఇటలీ నియంత పేరు), జబ్బుపడ్డ జంతువు (సిక్ యానిమల్)’వంటి పదాలూ నిషేధిత జాబితాలో పెట్టుకున్నారు. ఇవేకాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల చట్టసభల్లో పాలకవర్గాలు ‘అన్ పార్లమెంటరీ’మాటలను లిస్టుల్లో పెట్టేసుకుంటూనే ఉన్నాయి. నోటికి బట్టకట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. -సరికొండ చలపతి చదవండి: సభా విలువలు కాపాడాలి -
వారసులొస్తున్నారు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ అంటూ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వచ్చే ఎన్నికల్లో పోటీకి పలువురు ముఖ్య నేతల తనయులు సై అంటున్నారు. గతంలో ఉమ్మ డి జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసిన నేతల పిల్లలే కా కుండా.. ప్రస్తు తం కీలక పదవు ల్లో ఉన్న వారి తన యులు కూడా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వీరిలో కొందరు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసినా అదృష్టం కలిసి రాలేదు. వీరితో పాటు మరికొంత మంది యువ నాయకులు రంగంలోకి దిగనున్నారు. ఎన్నికలకు ఏడాదిపైగా ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే జనంలోకి వెళ్తున్నారు. కేవలం పార్టీ కార్యక్రమాల్లోనే కాదు బంధువులు, కార్యకర్తలు, సామాజిక వర్గం ప్రజలు, అభిమానులు ఇలా ఎవరి ఇళ్లలో ఎలాంటి శుభ, అశుభ కార్యక్రమాలు జరిగినా క్షణాల్లో వాలిపోతున్నారు. ఏదో ఒక కార్యక్రమం పేరుతో నియోజకవర్గాల్లో కలియతిరుగుతున్నారు. ఓటర్ల అభిమానాన్ని చూరగొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే ఆయా పార్టీల అధిష్టానాల వద్ద పావులు కదుపుతున్నారు. మాస్ టు క్లాస్.. శేర్లింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కుమారుడు రవికుమార్ యాదవ్ ఈసారి ఎన్నికల్లో తన అదృష్ణాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఏడాది క్రితం ఈయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. విద్యార్థి, యువజన నాయకుడిగా పని చేసిన అనుభవం ఉంది. తరచూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నాడు. అటు మాస్‌తో పాటు ఇటు క్లాస్ పీపుల్తోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు. పట్నం’పై ప్రశాంత్ కన్ను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కిషన్‌రెడ్డి సుదీర్ఘ కాల ఎమ్మెల్యేగా పని చేయడం, వయసు మీదపడటంతో తన స్థానంలో కుమారుడిని రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్‌కు కార్పొరేటర్‌గా పని చేసిన అనుభవం ఉంది. షాద్‌నగర్‌లో పాగా కోసం.. మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తనయుడు ఏపీ మిథున్‌రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. గతంలో ఆయన తండ్రి టీఆర్ఎస్ ఎంపీగా పని చేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో తండ్రితో పాటు ఆయన కూడా బీజేపీ గూటికి చేరాడు. షాద్‌నగర్‌లో నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నాడు. చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తండ్రి బాటలో రవీంద్రుడు షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పెద్ద కుమారుడు వై.రవీందర్ యాదవ్ కూడా అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కేశంపేట్ ఎంపీపీగా ఉన్నారు. తండ్రి స్థానంలో తరచూ నియోజకవర్గం అంతా కలియతిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అవకాశం లభిస్తే.. పోటీకి రెడీగా ఉన్నట్లు సమాచారం. గెలుపే లక్ష్యంగా.. మంత్రి పటోళ్ల సబితాఇంద్రారెడ్డి తనయుడు పటోళ్ల కార్తిక్‌రెడ్డి ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో ఉన్నారు. 2014లో చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. ప్రస్తుతం ఆయన శివారులోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం. బయటకు కనిపించకపోయినా ఆయా నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. 111జీవో ఎత్తివేత అంశంపై సుదీర్ఘ కాలంగా పోరాటం చేశాడు. ఈసారైనా దీవిస్తారా.. మాజీ హోంమంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్ తనయుడు వీరేందర్‌గౌడ్ కూడా వచ్చే ఎన్నికల్లో బరిలో నిలవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత 2014లో టీడీపీ నుంచి చేవేళ్ల ఎంపీ స్థానానికి పోటీ చేశాడు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం అసెంబ్లీ లేదా చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్నాడు. -
‘త్వరలో వస్తున్నా.. ఇక్కడే కదా ఉంటారు, వెయిట్ చేయండి’
సాక్షి, చెన్నై: రాష్ట్రవ్యాప్త పర్యటనను త్వరలో ప్రారంభించి చురుకైన రాజకీయాల్లో దిగుతున్నట్లు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలి శశికళ ప్రకటించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించి విడుదలైన శశికళను ఇంకా పలు కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి కేసు, విదేశీ మారకద్రవ్యం, కొడనాడు ఎస్టేట్, బెంగళూరు పరప్పన అగ్రహార జైలు అధికారులకు రూ.2 కోట్ల లంచం కేసుల విచారణలో ఆమె తలమునకలై ఉన్నారు. ఈ కేసుల నుంచి విముక్తి, అన్నాడీఎంకేను కైవసం చేసుకోవడం కోసం ఆమె గత కొంతకాలంగా ఆధ్యాత్మిక పర్యటనలు సాగిస్తున్నారు. రాష్ట్రంలోని అనేక ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా చెన్నై నుంచి తిరుచ్చిరాపల్లికి ప్రయాణం అవుతూ విమానాశ్రయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనల్లో ఉన్నానని వెల్లడించారు. ఈ పర్యటన ముగిసిన వెంటనే క్రీయాశీలక రాజకీయాలపై దృష్టి సారిస్తానని చెప్పారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి పదవులపై త్వరలో అప్పీలు చేస్తానని స్పష్టం చేశారు. కొడనాడు హత్య, దోపిడీ నేర ఘటనలపై ఎవైనా అనుమానాలు ఉన్నాయా ని మీడియా ప్రశ్నించగా బదులివ్వకుండానే వెళ్లిపోయారు. అనంతరం తిరుచ్చి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ రణక్షేత్రంలో ఒంటరిగా దిగుతారా..? పార్టీలతో పొత్తపెట్టుకుంటారా అని ప్రశ్నించగా మీరంతా ఇక్కడే కదా ఉంటారు, వేచి చూడండి అంటూ బదులిచ్చారు. మీకు స్వాగతం చెప్పేవారిని టీటీవీ దినకరన్ బహిష్కరిస్తారని ప్రచారం జరుగుతున్నదని ప్రశ్నించగా, ప్రస్తుతం ఆలయానికి వెళుతున్నా, తరువాత బదులిస్తానంటూ వెళ్లిపోయారు. -
మల్లు స్వరాజ్యం పార్థివదేహానికి ప్రముఖుల నివాళులు (ఫొటోలు)
-
భారత్‌పై దావూద్ ఇబ్రహీం మళ్లీ గురి
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మళ్లీ భారత్‌పై గురిపెట్టాడా? ప్రముఖ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలను హత్య చేసేందుకు సిద్ధమయ్యాడా? ఈ ప్రశ్నలకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అవుననే సమాధానం చెబుతోంది. భారత్‌లో భీకర దాడులతో అల్లకల్లోలం సృష్టించేందుకు దావూద్ ఓ ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు ఎన్ఐఏ బహిర్గతం చేయడం సంచలనాత్మకంగా మారింది. ‘ఇండియాటుడే’ కథనం ప్రకారం.. దావూద్‌పై ఎన్ఐఏ ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దేశవ్యాప్తంగా పలు కీలక ప్రాంతాల్లో పేలుడు పదార్థాలు, మారణాయుధాలతో విరుచుకుపడేందుకు దావూద్ ముఠా ప్రణాళిక రూపొందించిందని ఎఫ్ఐఆర్లో ప్రస్తావించింది. ఢిల్లీ, ముంబై నగరాలపై దావూద్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు ఎన్ఐఆర్ వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సాయం అందించారన్న ఆరోపణలతో దావూద్ ఇబ్రహీంతోపాటు అతడి అనుచరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవలే మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ కేసులో దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను న్యాయస్థానం ఈ నెల 24వ తేదీ వరకు ఈడీ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. -
Yogi Adityanath: ఆయనొక క్రౌడ్ పుల్లర్.. మాటలు తూటాల్లా పేలుతాయ్..
ఆరెస్సెస్ తయారు చేసిన నాయకుడు కాదు కానీ ఆ సంస్థకే హిందుత్వ ఎజెండాపై పాఠాలు చెప్పగలరు. జన్‌సంఘ్–బీజేపీ మూలాలు ఉన్నవారు కాదు కానీ కమలం పార్టీకే దేశభక్తిపై ప్రబోధాలు చెయ్యగలరు. గోరఖ్‌నాథ్ మఠం నీడలో, స్వయంశక్తితో ఎదిగారు. హిందూరాజ్య స్థాపనే లక్ష్యమని ఎలుగెత్తి చాటుతున్నారు. కుదిరితే ఆయనని ప్రేమిస్తారు. లేదంటే ద్వేషిస్తారు/ ఆయన విషయంలో మధ్యేమార్గానికి తావే లేదు. అభిమానులు భావి భారత ప్రధానిగా కీర్తిస్తారు/ ఆయనే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్/ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీకి ప్రధాని మోదీ ఛరిష్మాయే బలం. కానీ యూపీలో యోగి జనాకర్షణ అదనపు బలం. మతపరంగా ఓట్లను సంఘటితం చేయడమనే ఏకైక వ్యూహంతోనే మళ్లీ సీఎం పీఠం ఎక్కాలన్న పట్టుదలతో ఉన్నారు. చదవండి: బీజేపీని ఓడించే శక్తి గాంధీలకు లేదు! ఇలా చేస్తే సాధ్యమే.. ► 1972 సంవత్సరం జూన్ 5న పాంచూర్ జిల్లా పౌరి ఘర్వాల్ (ఇప్పటి ఉత్తరాఖండ్)లో ఆనంద్‌సింగ్ బిస్త్, సావిత్రి దేవి దంపతులకు జన్మించారు ► రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన యోగి అసలు పేరు అజయ్‌సింగ్ బిస్త్. ► రిషికేష్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. గణిత శాస్త్రంలో డిగ్రీ పట్టా తీసుకున్నారు ► 1990 ప్రాంతంలో అయోధ్యలో రామ మందిరం ఉద్యమంలో చేరారు. యూపీ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ మఠం ప్రధాన పూజారి అవైద్యనాథ్కి ప్రథమ శిష్యుడిగా మారారు. ఆయనే అజయ్‌సింగ్ పేరుని యోగి ఆదిత్యనాథ్‌గా మార్చారు. చదవండి: యూపీ ఎన్నికలు: కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ఇదే ►1994లో గోరఖ్‌నాథ్ మఠం పూజారి అయ్యారు. ► రాజకీయాల నుంచి అవైద్యనాథ్ విశ్రాంతి తీసుకున్నాక ఆయన అడుగుజాడల్లో 1998లో తన 26 ఏళ్ల వయసులోనే బీజేపీ తరఫున పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పట్నుంచి వరసగా అయిదుసార్లు గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు ► 2002లో హిందు యువ వాహిని అనే సంస్థను స్థాపించి గో సంరక్షణ, లవ్ జిహాదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించి పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా తన ఇమేజ్ను పెంచుకున్నారు. ►2014లో అవైద్యనాథ్ కన్నుమూశాక గోరఖ్‌నాథ్ మఠం ప్రధాన పూజారిగా యోగి నియమితులయ్యారు. గోరఖ్‌నాథ్ ట్రస్ట్ ఫండ్ నిర్వహించే ఆస్పత్రులు, పాఠశాలలు, కళాశాలల బాధ్యతలు కూడా తీసుకున్నారు. ►బీజేపీ అధిష్టానంతో యోగి ఆదిత్యనాథ్ సంబంధాలు ఎప్పుడూ అంత సఖ్యంగా లేవు. హిందుత్వపై బీజేపీ మెతక వైఖరి అవలంబిస్తోందన్న ఆరోపించేవారు. విభేదాలు వచ్చిన ప్రతీసారి బీజేపీ అభ్యర్థులపై తన సొంత మనుషుల్ని పోటీకి నిలిపి గెలిపించుకునేవారు. దీంతో పార్టీయే తన మాట వినే పరిస్థితి తీసుకువచ్చేవారు. ► యోగి ఒక క్రౌడ్ పుల్లర్. ఆయన మాటలు తూటాల్లా పేలుతూ ఉంటాయి. యోగి ఉపన్యాసాలు వినడానికి జనం ఎగబడతారు. ఆ లక్షణాలే బీజేపీలో ఆయనని స్టార్ క్యాంపైనర్ని చేశారు. 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం చేశారు. ఎన్నికల్లో గెలిచాక సూపర్‌స్టార్‌గా మారి యూపీ సీఎం పీఠాన్ని అధిరోహించారు. ►అప్పటికే గోరఖ్‌పూర్ ఎంపీగా ఉన్న ఆయన ఆ పదవికి రాజీనామా చేసి సీఎం అయ్యాక శాసనమండలికి ఎన్నికయ్యారు. ఇప్పుడు గోరఖ్‌పూర్ నుంచి తొలిసారిగా అసెంబ్లీ బరిలో దిగుతున్నారు ► అవినీతి, భయం, హింస, చీకట్లు లేని ఉత్తరప్రదేశ్ దిశగా తీసుకువెళ్లడంలో విజయవంతమవుతున్నానని యోగి పదే పదే చెప్పుకుంటున్నారు. రాష్ట్ర వార్షిక స్థూల ఉత్పత్తిని రూ.10.9 లక్షల కోట్ల నుంచి రూ.21.73 లక్షల కోట్లకి తీసుకువెళ్లినట్టు యోగి చెప్పుకున్నారు. ►శాంతి భద్రతలు అమలు ఎలా ఉంటుందో చూడాలంటే యూపీకి రండి అంటూ ఆయన సవాల్ చేస్తూ ఉంటారు. కానీ యూపీలో మహిళలపై గత అయిదేళ్లలో నేరాలు 66 శాతం పెరిగాయని స్వచ్ఛంద సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ►యోగి అధికారంలోకి వచ్చాక యూపీలో జరిగిన ఘర్షణల్లో 43% మైనార్టీలపై దాడులేనని మానవహక్కుల కమిషన్ వెల్లడించింది. ► బలవంతపు మతమార్పిడుల నిషేధ చట్టం, జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చారు. ►అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కరోనా కట్టడికి యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న చర్యల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించింది. ► ‘‘నేను హిందువుని అలా చెప్పుకోవడానికి గర్వపడతా’’ అని ప్రకటించుకుంటారు. హిందుత్వ ఎజెండా యోగిని ఈసారి ఎన్నికల్లో ఏ మేరకు ఆదుకుంటుందో చూడాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చేపల పెంపకం కోసం డజన్ల కొద్దీ తాబేళ్లకు విషం ఇచ్చి... చివరకు
ముంబై: ముంబైకి సమీపంలోని సరస్సులో డజన్ల కొద్దీ తాబేళ్లను మృతి చెందాయి. అంతేకాదు తాబేళ్ల మరణానికి ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన విషమే కారణమని వన్యప్రాణుల నిపుణులు తెలిపారు. ముంబైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్యాణ్ నగరంలోని సరస్సు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అక్కడ స్థానిక రాజకీయ నాయకుడు ఫిర్యాదు మేరకు వైల్డ్ యానిమల్ అండ్ రెప్టైల్ రెస్క్యూ కన్జర్వేషన్ బృందం రంగంలోకి దిగింది. అయితే ఆ సరస్సులో సుమారు 57 ఫ్లాప్షెల్ తాబేళ్లు చనిపోయాయని, కాగా ఆరు తాబేళ్లను రక్షించినట్లు యానిమల్ అండ్ రెప్టైల్ రెస్క్యూ కన్జర్వేషన్ బృందానికి చెందిన సుహాస్ పవార్ చెప్పారు. ఈ మేరకు సుహాస్ పవార్ మాట్లాడుతూ..."గత రెండేళ్లుగా ఉన్న కోవిడ్-19 ఆంక్షల కారణంగా తాబేళ్లు అధిక సంఖ్యలో పెరిగి ఉండవచ్చు. పైగా సరస్సులో కొంతమంది చేపల పెంపకం సాగిస్తున్నారు. అయితే ఇవి చేపలను తిని అధిక సంఖ్యలో పెరిగాయన్న కోపంతో స్థానికులే ఉద్దేశపూర్వకంగా విషం ఇచ్చి ఉండవచ్చు. అయితే ఈ తాబేళ్లు అరుదైనవి కావు గానీ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం రక్షిత జాతి" అని చెప్పారు. (చదవండి: 120 ఏళ్ల వృక్షానికి 24 గంటల కాపలా!!) -
ఇద్దరు రాజకీయ నేతల దారుణ హత్య.. 144 సెక్షన్ విధింపు
తిరువనంతపురం: కేరళలోని అలప్పుజ జిల్లాలో ఇద్దరు రాజకీయ నేతలు హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా సెక్రటరీ రంజిత్ శ్రీనివాసన్, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ)నేత కేఎస్ షాన్‌ను గుర్తుతెలియని దుండగులు ఆదివారం ఉదయం చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఎ.అలెగ్జాండర్ అలప్పుజ జిల్లాలో 144 సెక్షన్‌ను విధించారు. బీజేపీ నేత శ్రీనివాసన్(40)ను తన ఇంటిలోనే గుర్తుతెలియని దుండగులు దాడిచేసి చంపారు. ఆయన 2016 ఎన్నికల్లో అలప్పుజ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత కె.ఎస్ షాన్‌ను కూడా గుర్తుతెలియని ముఠా చేతిలో హత్య గురయ్యారు. ఈ ఘటనపై ఎస్డీపీఐ స్పందిస్తూ.. తమ నాయకుడి హత్య వెనుక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రమేయం ఉందని ఆరోపించింది. చదవండి: కోతి వర్సెస్ కుక్క! సోషల్ మీడియాలో రచ్చ రచ్చ! ఇద్దరు రాజకీయ నేతల హత్యలపై కేరళ సీఎం పినరయ్ విజయన్ స్పందిస్తూ.. హత్యలపై వేగంగా దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. సమాజంలో గందరగోళం సృష్టించే ఈ చర్యలను ఖండిస్తున్నానని తెలిపారు. శ్రీనివాసన్ మృతిపై కేంద్ర మంత్రి వి.మురళీధరన్ మాట్లాడుతూ.. తమ పార్టీ నేతను ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టుల గ్రూప్ హత్య చేసిందని ఆరోపించారు. శ్రీనివాసన్ హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు చేసి నేరస్తులను శిక్షించాలని తెలిపారు. రెండు పార్టీల సంబంధించిన నేతలు హత్యకు గురికావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. Kerala: I've been told that State Secy of BJP OBC Morcha was stabbed to death, this morning. This is the handy work of Islamic terrorist group is the info coming from Alleppey (Alappuzha). I demand the State govt to take strict action against perpetrators:Union Min V Muralidharan https://t.co/VRuiureFOH pic.twitter.com/BW8Z9riTjR — ANI (@ANI) December 19, 2021 -
వరి వార్
-
Medchal: రాజకీయ నాయకులంతా ఆ గ్రామం నుంచే..
సాక్షి, మేడ్చల్: మండల రాజకీయ హెడ్ క్వార్టర్‌గా ఆ గ్రామం నిలిచింది. దశాబ్దాల నుంచి లీడర్లను అందిస్తున్న మెషినరీగా ఈ గ్రామం నిలవడం విశేషం. మొదటి నుంచి రాజకీయ చైతన్యానికి పేరుగాంచిన గౌడవెళ్ళి తాజాగా మూడు ప్రధాన పార్టీల మండల అధ్యక్షులను అందివ్వడంతో మరోసారి ఆ గ్రామం పేరు మండలంలో చర్చనీయాంశంగా మారింది. చదవండి: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం గ్రామంలో ఘనమైన రాజకీయ చరిత్ర గ్రామానికి చెందిన దివంగత స్వాతంత్ర సమరయోధుడు సింగిరెడ్డి వెంకట్రాంరెడ్డి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా పని చేశారు. ఆయన మరణం తర్వాత ఆయన సతీమణి ఉమాదేవి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశారు. ► గ్రామానికి చెందిన సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్‌గా, పీసీసీ సీనీయర్ అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారు. ►గ్రామానికి చెందిన దయానంద్‌యాదవ్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, నరేందర్‌రెడ్డి మండల బీజేపీ అధ్యక్షుడిగా, రమణారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ► ఇదే గ్రామం నుంచి ఎంపీటీసీగా గెలిచిన పద్మజగన్‌రెడ్డి ప్రస్తుతం మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఉన్నారు. గ్రామానికి చెందిన రణదీప్‌రెడ్డి డైరక్టర్‌గా ఎన్నికై మేడ్చల్ సహకార సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. చదవండి: హుజురాబాద్ ఉపఎన్నిక: రెండో డోసు సర్టిఫికెట్ ఉంటేనే రండి! ► మూడు ప్రధాన పార్టీ అధ్యక్షులు, మండల పరిషత్ అ«ధ్యక్షురాలు గౌడవెళ్ళి వారే కావడంతో మండల రాజకీయం గౌడవెళ్ళి చుట్టూ తిరుగుతోంది. అందరూ 50 ఏళ్ల వయస్సులోపు వారు కావడంతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మండల రాజకీయాన్ని రంజుగా నడిపిస్తున్నారు. ►రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న సురేందర్ ముదిరాజ్ ఈ గ్రామ సర్పంచే. ►జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రంరెడ్డి, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ అమరం మోహన్‌రెడ్డి, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలు సరస్వతీ గుండ్లపోచంపల్లికి చెందిన వారే. ►మండలంలో అధికంగా రాజకీయం గుండ్లపోచంపల్లి, గౌడవెళ్ళి చుట్టు ఉండటంతో ఇతర గ్రామాల నాయకుల అసహనం కనిపిస్తున్నా చైతన్యం ఎక్కువగా ఉండటంతో నాయకులు గౌడవెళ్ళి నాయకులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. -
నల్ల ధనవంతుల గుట్టురట్టు!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది సంపన్నులు, ప్రముఖులు, రాజకీయ నేతల రహస్య ఆస్తులు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలను ‘పండోరా పేపర్స్’ పేరిట ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) ఆదివారం బహిర్గతం చేసింది. ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద లీక్ అని భావిస్తున్నారు. వీరిలో భారతదేశానికి చెందిన బడా బాబులు ఉండడం గమనార్హం. ధనవంతుల కంపెనీలు, ట్రస్టులకు సంబంధించిన 12 మిలియన్ల (1.20 కోట్లు) పత్రాలను తాము సేకరించినట్లు ఐసీఐజే వెల్లడించింది. పన్నుల బెడద లేని పనామా, దుబాయ్, మొనాకో, కేమన్ ఐలాండ్స్ తదితర దేశాల్లో వారు నల్ల ధనాన్ని దాచుకోవడానికి, రహస్యంగా ఆస్తులు పోగేసుకోవడానికి డొల్ల కంపెనీలను సృష్టించారని తెలిపింది. వీరిలో అమెరికా, ఇండియా, పాకిస్తాన్, యూకే, మెక్సికో తదితర దేశాలకు చెందినవారు ఉన్నారని స్పష్టం చేసింది. ► జోర్డాన్ రాజు, ఉక్రెయిన్, కెన్యా, ఈక్వెడార్ దేశాల అధ్యక్షులు, చెక్ రిపబ్లిక్ ప్రధాని, యూకే మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ ఆస్తులు, ఆర్థిక వ్యవహారాల వివరాలు పండోరా పత్రాల్లో ఉన్నాయి. ► పండోరా లీక్డ్ డాక్యుమెంట్లలో 300 మందికిపైగా భారతీయుల వివరాలున్నాయి. వీరిలో చాలామంది ఆర్థిక నేరగాళ్లు, మాజీ ఎంపీలే కావడం విశేషం. వీరు ఇప్పటికే దర్యాప్తు సంస్థల నిఘా పరిధిలో ఉన్నారు. ► ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి 18 దేశాల్లో ఆస్తులు ఉన్నట్లు వార్తలొచ్చాయి. ► బయోకాన్ సంస్థ ప్రమోటర్ కిరణ్ మజుందార్ షా భర్త ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం ఓ ట్రస్టును ఏర్పాటు చేశాడు. భారత్‌లో బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరి ట్రస్టును ఏర్పాటు చేసింది. అతడు పారిపోవడానికి నెల రోజుల ముందు ఈ ట్రస్టును నెలకొల్పారు. ► 2016లో వెలుగులోకి వచి్చన పనామా పేపర్ల లీకు తర్వాత నల్ల ధనవంతులు అప్రమత్తమయ్యారు. విదేశాల్లోని తమ ఆస్తులపై నిఘా సంస్థల కన్ను పడకుండా పునర్వ్యస్థీకరించుకున్నారు. అంటే ఆస్తులను చాలావరకు అమ్మేసుకొని, నగదుగా మార్చుకున్నారు. వీరిలో మాజీ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడు. ► జోర్డాన్ రాజు అబ్దుల్లా2 అమెరికా, యూకేలో 10 కోట్ల డాలర్ల ఆస్తులను కూడబెట్టాడు.. ► పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులకు, ఆయన కేబినెట్ మంత్రులకు కోట్ల డాలర్ల విలువైన కంపెనీలు, ట్రస్టులు ఉన్నాయి. ► ఇమ్రాన్ ఖాన్ మిత్రుడు, పీఎంల్–క్యూ పార్టీ నేత చౌదరి మూనిస్ ఎలాహీకి అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉంది. ► రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మొనాకోలో ఖరీదైన ఆస్తులున్నాయి. ► యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిన్, ఆయన భార్య లండన్‌లో కార్యాలయం కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో 3,12,000 పౌండ్ల మేర స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టారు. ఐసీఐజే ట్వీట్ తాము సేకరించిన 1.2 కోట్ల పత్రాల ఆధారంగా సంపన్నుల ఆర్థిక రహస్యాలను బహిర్గతం చేస్తామని ఐసీఐజే ఆదివారం ఉదయం ట్వీట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల్లో 600 మందికిపైగా పాత్రికేయులు ఈ ‘పండోరా పత్రాలను’సేకరించారని వెల్లడించింది. ఎంతో శ్రమించి పరిశోధన సాగించారని, ధనవంతుల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక రహస్యాలను తెలుసుకున్నారని వివరించింది. -
మందు బాబులకు పండగ.. దసరాకు ముందే కిక్కు
సాక్షి,కరీంనగర్: నోటిఫికేషన్‌కు ముందే హుజూరాబాద్ ఉప ఎన్నికకు మద్యం కిక్కు ఎక్కుతోంది. ఈటల రాజేందర్ రాజీనామాతో నియోజకవర్గంలో ఎన్నికల వేడి ప్రారంభం కాగా.. అప్పటి నుంచే మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఇక హుజూరాబాద్‌లో ఉప ఎన్నికకు ఈసీ పచ్చజెండా ఊపడంతో మద్యం మరింత ఏరులైపారనుంది. ఇప్పటికే రికార్డుస్థాయిలో మద్యం అమ్ముడుపోతుండగా.. పార్టీలు, కులసంఘాలు, సమావేశాలు ఏవైనా మద్యం కిక్కు తప్పనిసరిగా మారింది. ఐదు మాసాలుగా హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో రూ.వందలకోట్లలో లిక్కర్ అమ్మకాలు జరుగుతన్నాయి. ఈ ప్రభావం మరో రెండునెలలు ఉండనుంది. మొత్తంగా ఉప ఎన్నిక నేపథ్యంలో దసరాకు ముందే ఇక్కడివారికి కిక్కు ఎక్కుతోందని చెప్పుకుంటున్నారు. అమ్మకాల జోరు.. పక్క జిల్లాల నుంచి దిగుమతి ► హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక వేడి ప్రారంభమైనప్పటి నుంచి నియోజకవర్గంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట ఎక్సైజ్ సర్కిల్లో మొత్తం 29 దుకాణాలున్నాయి. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రూ.125కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా.. 2021లో రూ.170కోట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాదికన్నా సుమారు రూ.45 కోట్ల వ్యాపారం అధికంగా జరిగింది. ► గతేడాది ఆగస్టు వరకు రూ.3.60 లక్షల బీర్లు, లిక్కర్లు అమ్ముడవగా, ప్రస్తుతం లిక్కరు,బీర్లు కలిపి 3,92,616 కేసుల మద్యం అమ్ముడైంది. ముఖ్యంగా గత మూడు నెలల నుంచే రెట్టింపు మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. జిల్లామొత్తం రూ.320 కోట్ల వ్యాపారం జరగ్గా.. 55శాతం అమ్మకాలు ఇక్కడే జరగడం విశేషం. నోటిఫికేషన్‌తో అమ్మకాల జోరు మరింత పెరగనుంది. ► హుజూరాబాద్ నియోజకవర్గానికి కేవలం కరీంనగర్ జిల్లాకు చెందిన మద్యమే కాకుండా, వివిధ జిల్లాల నుంచి కూడా దిగుమతి అవుతోంది. ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే పెద్దఎత్తున మద్యం నిల్వలు హుజూరాబాద్‌కు చేరుకున్నాయని సమాచారం. ఎన్నికల నేపథ్యంలో ఆబ్కారీశాఖకు కూడా భారీగానే ఆదాయం పెరగనుంది. ► ఎన్నికల షెడ్యూలు ఖరారవడం... దసరా తర్వాత ఎన్నికలు ఉండడంతో మద్యం అమ్మకాలు మరింత పెరగనున్నాయి. యేటా దసరాకు రూ.కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. అయితే ఈసారి హుజూరాబాద్‌లో ఇటు ఎన్నికలు, అటు దసరా పండగ మరింత కిక్కునిస్తుందని తెలుస్తోంది. చదవండి: వేడెక్కిన రాజకీయం: హుజూరా‘బాద్షా’ ఎవరో? -
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఫోకస్‌గా పనిచేసి ప్రజల్లో ఎండగట్టాలని, టీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చి అమలు చేయలేని అన్ని అంశాలపై పోరాటాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశం నిర్ణయించింది. నిరుద్యోగ అంశంతోపాటు ఇతర అన్ని ప్రజాసమస్యలపై పోరాట కార్యాచరణను రూపొందించాలని తీర్మానించింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకమైన తర్వాత శనివారం పీఏసీ తొలి సమావేశం గాంధీభవన్‌లో జరిగింది. కమిటీ చైర్మన్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కమిటీ కన్వీనర్, మాజీమంత్రి షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, అజారుద్దీన్, ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ సీఎల్పీ నేత కె.జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, పొదెం వీరయ్య, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీమంత్రులు రేణుకాచౌదరి, బలరాం నాయక్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, వంశీ చంద్‌రెడ్డిలు హాజరు కాగా, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ గైర్హాజరయ్యారు. మరో వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ అనారోగ్య కారణాలతో హాజరుకాలేదు. గత రెండు నెలల కార్యక్రమాలు భేష్ రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజాసమస్యలు, భారత్‌బంద్, పోడు భూములపై పోరు తదితర అంశాలు పీఏసీలో చర్చకు వచ్చాయి. గత రెండు నెలలుగా జరుగుతున్న పార్టీ పోరాట కార్యాచరణ బాగుందని, అయితే దీన్ని మరింత ఉధృతం చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో నిలదీయాలని, అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు నిరుద్యోగ సమస్యపై ఉద్యమించాలని నిర్ణయించారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఈ అన్ని అంశాలను లేవనెత్తి పరిష్కారమయ్యే దిశలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఈ నెల 27న దేశవ్యాప్తంగా జరగబోయే ‘భారత్‌బంద్’ను ప్రధాన ప్రతిపక్షంగా ముందుండి నడిపించాలని నిర్ణయించారు. అక్టోబర్ 5న పోడు భూముల హక్కుల సాధన కోసం ప్రతిపక్షాలు నిర్వహించ తలపెట్టిన 400 కిలోమీటర్ల రాస్తారోకోలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలని తీర్మానించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. కాగా, సమావేశం అనంతరం రేవంత్, భట్టి, మధు యాష్కీగౌడ్, చిన్నారెడ్డి, మల్లురవి విలేకరులతో మాట్లాడారు. భట్టి మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని తీర్మానించినట్టు వెల్లడించారు. పంజగుట్టలో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున తామే ఏర్పాటు చేస్తామని తెలిపారు. పలువురు నేతలు.. పలు సూచనలు సమావేశంలో నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ డ్వాక్రా మహిళల సమస్యల గురించి ప్రస్తావించారు. వారికి కొత్తరుణాలివ్వడంలోనూ, ఇచ్చిన రుణాలకు వడ్డీ చెల్లింపులోనూ, అభయహస్తం అమల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని, ఆ దిశలో కార్యాచరణ రూపొందించాలని నేతలు నిర్ణయించారు. పంజగుట్టలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, బీసీ గర్జన పేరుతో బహిరంగసభలు ఏర్పాటు చేయాలని వీహెచ్ సూచించారు. కాగా, సీనియర్ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, కోదండరెడ్డిలను కూడా పీఏసీ సమావేశానికి ఆహ్వానించాలని వీహెచ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, రేణుకాచౌదరిలు ప్రతిపాదించారు. కాగా, పీఏసీ కన్వీనర్‌గా మాజీమంత్రి షబ్బీర్ అలీ ఈ సమావేశంలోనే బాధ్యతలు స్వీకరించారు. సమావేశం అనంతరం హైదరాబాద్‌లో ఆయన పార్టీ నేతలకు విందు ఇచ్చారు. -
గుజరాత్ డ్రగ్స్‌తో ఏపీకి సంబంధం లేదు: డీజీపీ సవాంగ్
-
గుజరాత్ డ్రగ్స్‌తో ఏపీకి సంబంధం లేదు: డీజీపీ సవాంగ్
సాక్షి, అమరావతి: విజయవాడ కేంద్రంగా ఎటువంటి డ్రగ్స్ సరఫరా జరగలేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రా పోర్టులో దొరికిన హెరాయిన్‌పై కొన్ని తప్పుడు వార్తలు ప్రచారమవుతున్నాయని, డ్రగ్స్‌తో ఏపీ రాష్ట్రానికి సంబంధం లేదని వెల్లడించారు. విజయవాడలో జీఎస్టీ అడ్రస్ మాత్రమే ఉందని, హెరాయిన్‌ను విజయవాడకు గానీ, ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రదేశాలకు కానీ దిగుమతి చేసుకున్నట్లు ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. ఆఫ్గనిస్తాన్ నుంచి ముంద్రా పోర్టుకు వేరే కన్సైన్మెంట్ ముసుగులో హెరాయిన్ దిగుమతి చేసుకొనే క్రమంలో పట్టుబడిందిగా మాత్రమే డీఆర్ఐ, కేంద్ర సంస్థల అధికారులు పేర్కొన్నట్లు తెలిపారు. చదవండి: అక్రమ మద్యం తయారీపై ఉక్కుపాదం: సీఎం జగన్ అయితే కొంతమంది రాజకీయ నాయకులు డ్రగ్స్ వ్యవహారంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ తరహా తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. అన్ని అంశాలపై డీఆర్ఐ, కేంద్ర సంస్థలు ముమ్మరంగా పరిశోధన చేస్తున్నాయని డ్రగ్స్ వ్యవహారంలో డీఆర్ఐకి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం దీనిపై తగిన ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. కాబట్టి, ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రకటనలు చేయడం, ప్రజల మనసుల్లో భయాందోళనలు రేకెత్తించడం, ప్రజలను తప్పు దోవ పట్టించడం మానుకోవాలని హితవు పలికారు. చదవండి: ‘తల్లిదండ్రులను వేధించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు’ ‘సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి, నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ప్రజాప్రతినిధుల మీద ఉందన్న విషయాన్ని మరిచిపోవడం బాధాకరం. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ముంద్రా పోర్ట్ లో డీఆర్ఐ అధికారులు హెరాయిన్ స్వాధీనం చేసుకున్న విషయం అందరికీ విదితమే. ఈ అంశంపై విజయవాడ కమిషనర్ ఇప్పటికే ప్రెస్ నోట్ విడుదల చేసి ఆ అంశానికీ, విజయవాడకు లింక్ చేయడం సమంజసం కాదని చెప్పారు. అయినా రాజకీయ నాయకులు ఈ అంశాన్ని మరీమరీ ప్రస్తావించడం సరికాదు. నేరం ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో లేవన్న విషయం అటు డీఆర్ఐ, కేంద్ర సంస్థలు, ఇటు పత్రికలు ధృవీకరిస్తున్నా, సీనియర్ నాయకులు అపోహలు సృష్టించడం భావ్యం కాదు. ఆషి ట్రేడింగ్ కంపెనీ చిరునామా మాత్రమే విజయవాడగా ఉంది. వారి కార్యకలాపాలు ఇసుమంతైనా ఏపీలో లేవు’ అని డీజీపీ సవాంగ్ తెలిపారు. చదవండి: ‘అమెరికన్ కార్నర్’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం జగన్ -
మంత్రి ట్రై చేశాడు కుదరలే.. పళ్లతో కట్ చేసేశాడు
కరాచీ: సాధారణంగా షాపులు ప్రారంభోత్సవం అంటే సెలబ్రిటీలు, సినీ తారలు, రాజకీయ నేతలను పిలుస్తుంటారు. ఇక వాళ్లు కార్యక్రమానికి వచ్చినప్పటి నుంచి నిర్వాహకులు ఏ లోటు లేకుండా చూసుకుంటారు. ఇదంతా ప్రతీ ఈవెంట్లో జరిగే తతంగమే. అయితే ఓ ఈవెంట్ నిర్వాహకులు చేసిన చిన్న పొరపాటు కారణంగా మంత్రి షాపు ఓపనింగ్ను కత్తితో గాక తన పళ్లతో కొరిక కట్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. సెప్టెంబర్ 2 న, జైళ్ల శాఖ మంత్రి, పంజాబ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫయాజ్-ఉల్-హసన్ చోహన్ను రావల్పిండి నియోజకవర్గంలోని ఓ ఎలక్ట్రానిక్స్ షాపు ప్రారంభానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. షాపు ఓపనింగ్ అంటే రిబ్బన్ కటింగ్ కామన్ అనే విషయం తెలిసిందే. కార్యక్రమానికి వచ్చిన ఆయనకు రిబ్బన్ కట్ చేసేందుకు ఇచ్చిన కత్తెర సరిగా కట్ కాలేదు. అది తుప్పు పట్టిపోవడంతో మరో సారి కట్ చేయాలని ప్రయత్నించినా ఆ రిబ్బన్ అసలు కట్ చేయలేకపోయాడు. దీంతో చేసేందేం లేక ఆ మంత్రి తన పళ్లతో ఆ రిబ్బన్‌ను కట్ చేశాడు.ప్రస్తుతం ఆ వీడియోను ఫయాజ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారి హల్చల్ చేస్తోంది. Ribbon cutting ceremony by Fayyaz ul Hsssan Chohan pic.twitter.com/lsaELc4WME — Murtaza Ali Shah (@MurtazaViews) September 2, 2021 చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్.. అయినా స్మోక్ చేయకూడదు! -
దారుణం: రాజకీయ నాయకుడి వేధింపులకు మహిళ బలి
వలిగొండ: పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని అరూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అరూర్‌కు చెందిన సుద్దాల యాదమ్మ(43)కు సంబంధించిన భూతగాదాలో నరసాయగూడెంకు చెందిన రాజకీయ నాయకుడు తుమ్మల నర్సయ్య కలగజేసుకొని విసిగిస్తుండటంతో మనస్తాపానికి గురైన ఆమె సోమవారం రాత్రి తన ఇంట్లో పురుగు మందు తాగింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే యాదమ్మను 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేందర్ తెలిపారు. -
అవినీతి మరక: గద్వాలలో ఖాకీలు వర్సెస్ ఖద్దరు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ఖాకీలు వర్సెస్ ఖద్దరు అన్నట్లు పోరు తుది అంకానికి చేరింది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన పోలీస్ శాఖపై ఇటీవల కాలంలో పలు అవినీతి మరకలు వెలుగుచూడగా.. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా ఓ సర్కిల్‌స్థాయి అధికారి అవినీతి బాగోతం బట్టబయలు కాగా సంచలనం సృష్టించింది. ఈ మేరకు దృష్టి సారించిన రాష్ట్రస్థాయి అధికారులు ప్రక్షాళనకు నడుం బిగించారు. ఇందులో భాగంగా సదరు అధికారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు పలువురిని బదిలీ చేశారు. ప్రధానంగా సస్పెన్షన్ వేటు తర్వాతే ఒక్కొక్కటిగా సమీకరణలు మారాయి. తన సన్నిహితుడిగా పేరున్న ఆ అధికారిని వైరి వర్గ నేతల ఫిర్యాదుతో సస్పెండ్ చేయడాన్ని సవాల్‌గా తీసుకున్న జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి చక్కదిద్దుకునే కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బదిలీ తప్పదని గ్రహించిన ఖాకీలు కొందరు ‘ఖద్దరు’తో రాజీకి ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. (చదవండి: పవిత్రబంధంలాంటి ఈ భార్యాభర్తలను ఆదుకోండి) వైరి వర్గానికి చెక్ పెట్టేలా.. తనకు సన్నిహితుడిగా ముద్రపడిన సదరు అధికారిని సస్పెండ్ చేయడం పట్ల జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి జీర్ణించుకోలేకపోయారు. తన పార్టీలోని వైరి వర్గంతో పాటు వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు పోలీసులతో తన ఆధిపత్యానికి గండిపడుతుందని భావించిన ఆయన రాష్ట్రస్థాయిలో పక్కా స్కెచ్‌తో పావులు కదిపినట్లు సమాచారం. అధిష్టానం నుంచి ఆశీస్సులు సైతం ఉండడంతో పోలీస్‌శాఖలో వైరి వర్గానికి మద్దతిస్తున్న ఖాకీలను బదిలీ చేయించడంతో పాటు తన అనుకూల వర్గానికి పెద్దపీట వేసేలా ముందుకు సాగుతున్నట్లు జిల్లాలో చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఓ ఉన్నతాధికారి, కొందరు పోలీసుల బదిలీలతో పాటు పలువురికి పోస్టింగ్ లభించినట్లు సదరు ప్రజాప్రతినిధి అనుచర వర్గాలు బాహాటంగానే చర్చించుకుంటున్నాయి. త్వరలో మరో అధికారి సైతం బదిలీ కానున్నట్లు ముందస్తుగా లీక్‌లు ఇస్తున్నాయి. (చదవండి: ఎమ్మెల్యే స్వగ్రామంలో క‘న్నీటి’ కష్టాలు..) బెడిసికొట్టిన రాజీయత్నాలు.. మారిన పరిస్థితుల్లో ఏం చేయలేమని గ్రహించిన పలువురు ఖాకీలు సదరు ప్రజాప్రతినిధితో రాజీయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. పట్టణానికి చెందిన సినిమా రంగంలోని ప్రముఖ వ్యక్తి ద్వారా రాయబారం నడిపినట్లు తెలిసింది. అయితే సదరు ప్రజాప్రతినిధి ససేమిరా అనడంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేఖా మిల్లు ఘటనపై చర్యలు హుళక్కేనా.. ఓ సీఐ ‘ఫోర్జరీ’పై కేసు నమోదు లేనట్టేనా.. అనే అనుమానాలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. వీటికి సంబంధించి ఓ పోలీస్ అధికారిని సంప్రదించగా.. ‘ఈ రోజు, రేపు, ఇంకెప్పుడైనా బదిలీ ఆర్డర్ వస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని ముక్తసరిగా సమాధానమిచ్చారు. -
సోషల్ వార్: కత్తులు దూస్తున్న అధికార, విపక్ష నేతలు
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో రాజకీయ పార్టీల నడుమ ‘సోషల్ వార్’ నడుస్తోంది. ఫలితంగా రోజురోజుకూ ‘పొలిటికల్’ హీట్ పెరుగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. అధికార, విపక్ష పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాల వేదికగా కత్తులు దూసుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శలకు సైతం దిగుతున్నారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే నిధులు వస్తాయంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ డిమాండ్ చేస్తున్నారు. వాటిని తిప్పికొడుతూ అధికార పార్టీ నేతలు పెడుతున్న పోస్టింగులతో రచ్చవుతోంది. దళిత బంధు పథకానికి శ్రీకారం చుడుతున్న ప్రభుత్వం.. ఉప ఎన్నిక జరుగనున్న హుజురాబాద్‌లోని మొత్తం దళిత కుటుంబాలకు సాయం అందించనున్నట్లు ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందించనున్నట్లు తెలిపింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నేతలు సామాజిక మాధ్యమాల వేదిక విమర్శలు కురిపిస్తున్నారు. మన ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే మన దగ్గర కూడా ఉప ఎన్నికలు వస్తాయని, తద్వారా మనకూ నిధుల వరద పారుతుందని ప్రచారం ప్రారంభించారు. జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేల ఫొటోలు పెట్టి మరీ రాజీనామా చేయాలంటూ వైరల్ చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు రంగంలోకి దిగాయి. అదే సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడి ప్రారంభించాయి. ప్రభుత్వం కల్యాణలక్ష్మి ఇస్తున్నందుకు రాజీనామా చేయాలా..? లేక రైతుబంధు ఇస్తున్నందుకు రాజీనామా చేయాలా? అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. దీంతో రెండు, మూడ్రోజులుగా సోషల్ మీడియాలో పొలిటికల్ వార్ జోరుగా సాగుతోంది. మితిమీరితే కేసులు తప్పవు..! సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న యుద్ధం పరిమిత స్థాయిలో ఉంటే ఫర్వాలేదు. కానీ పరుష పదాలతో పాటు హెచ్చరించే పోస్టులు పెడితే మాత్రం ఎవరైనా ఇబ్బందులు పడాల్సిందే. విమర్శలు మితిమీరి అదుపు తప్పితే కేసులతో పాటు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఉత్పన్నమవుతాయని పోలీసులతో పాటు న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజీనామాలు డిమాండ్ చేయడం, ఎందుకు రాజీనామా చేయాలని ఎదురు దాడికి పరిమితమైతే ఏ ఇబ్బంది ఉండదు. కానీ కొందరు మా జోలికొస్తే ఊరుకునేది లేదని, తాటా తీస్తామనే పెద్ద పెద్ద పదాలు వాడుతూ రెచ్చగొడుతున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆయా రాజకీయ పార్టీల నేతలు తమ సోషల్ మీడియా బాధ్యులతో పాటు పార్టీల శ్రేణులను నిలువరించక పోతే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదముంది. వ్యక్తిగత విమర్శలకూ వెనుకాడడం లేదు.. రాజీనామాల డిమాండ్‌తో మొదలైన సోషల్ వార్ క్రమంగా ముదురుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ చివరకు వ్యక్తిగత విమర్శలకూ దిగుతున్నారు. కొందరైతే పరిమితులు దాటి వ్యవహరిస్తున్నారు. మా జోలికొస్తే తాటా తీస్తామంటూ పెడుతున్న పోస్టింగులు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రాజకీయ పార్టీల మధ్య సాగుతున్న సోషల్ వార్ ఎటు దారి తీస్తుందోనన్న చర్చ నడుస్తోంది. అన్ని పార్టీలకూ సోషల్ మీడియా విభాగాలు.. అధికార టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన సోషల్ మీడియా విభాగాలు క్రియాశీలకంగా పని చేస్తున్నాయి. అయితే, ఎన్నికల సమయంలో హడావుడి చేసే ఆయా పార్టీల ‘సోషల్ వారియర్లు’ ఈ సారి ముందుగానే యాక్టివ్ అయ్యారు. అప్పుడే ఎన్నికలు వచ్చాయా అన్న రేంజ్లో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నాయి. వాట్సప్, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు రాజీనామాల డిమాండ్లు, ఎందుకు రాజీనామా చేయాలన్న ఎదురుదాడులతో కూడిన పోస్టులే కనిపిస్తున్నాయి. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో అన్ని చోట్లా టీఆర్ఎస్కు చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారంతా రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తుండగా, అధికార పక్షం ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నిస్తోంది. ఇదే సమయంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. -
మాటలు - మంటలు
-
గతంలో ఎమ్మెల్యే.. ప్రస్తుతం బతుకు జీవనానికి మేకల పెంపకం
చెన్నై: దివంగత సీఎం జయలలిత నోట చెల్లకుట్టి (ముద్దుబిడ్డ)గా పిలవడ్డ ఓ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం మేకల్ని పెంచుతున్నారు. బతుకు జీవనం కోసం బెల్లం పట్టిలో రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. 2003లో తూత్తుకుడి జిల్లా సాత్తాన్ కులం అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ప్రకటించారు. అధికార అన్నాడీఎంకే అభ్యర్థిగా ఎవర్ని నిలబెట్టాలో అన్న చర్చ సాగుతున్న సమయంలో అనూహ్యంగా కుగ్రామం నుంచి నీలమేఘ వర్ణం అనే రైతు తెరపైకి వచ్చాడు. ఎన్నికల ఖర్చుకు కూడా తన వద్ద చిల్లి గవ్వ లేదని పార్టీ దృష్టికి ఆ రైతు తీసుకొచ్చాడు. అయితే, పార్టీ కోసం శ్రమిస్తున్న నిజమైన కార్యకర్తగా ఉన్న నీల మేఘ వర్ణం సాత్తాన్‌కులం అభ్యర్థి అని అప్పటి సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత స్పష్టం చేశారు. అమ్మ ఆజ్ఞతో ఎన్నికల్లో పోటీ చేసిన నీల మేఘ వర్ణం ఉప ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ సమయంలో చెల్లకుట్టి అంటూ నీల మేఘంను జయలలిత వర్ణించారు. ఆ తర్వాత పరిణామాలతో పునర్విభజనలో సాత్తాన్‌కులం ఎన్నికల చిత్ర పటం నుంచి గల్లంతైంది. ఎప్పటికీ రైతునే.. ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం అభివృద్ధికి తన శాయశక్తులా నీలమేఘం శ్రమించారు. అమ్మ ఆశీస్సులో గ్రామాల్లో రోడ్లు, ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు చేయించారు. అయితే, ఇప్పడు ఈ నీలమేఘం సాధారణ కార్యకర్తగా అన్నాడీఎంకేలో మారారు. ఇప్పుడు ఆయన మేకల్ని పెంచుతూ, తన గ్రామంలోని బెల్లం పట్టిలో రేయింబవళ్లు పనిచేస్తున్నారు. తనకు ఈ పని కొత్త కాదు అని, తన తండ్రి ఇచ్చి వెళ్లిన సంపద అంటూ నీల మేఘం తనను కలిసిన మీడియాతో చెప్పారు. పదువులు వస్తాయి...వెళ్తాయని.. అయితే, తాను ఎప్పడూ సాదాసీదా రైతునే అని ధీమా వ్యక్తం చేశారు. తన తండ్రి చిన్న పాటి బెల్లం పట్టి ఇచ్చి వెళ్లాడని, దాని ద్వారా వచ్చిన సంపాదనతో మేకల్ని కొని మేపుకుంటున్నట్టు పేర్కొన్నారు. అమ్మ ఉన్నప్పుడు పార్టీలో గౌరవం ఉండేదని, ఇప్పుడు పట్టించుకునే వాళ్లు లేకున్నా, తాను మాత్రం రెండాకులపై ఉన్న విశ్వాసంతో నేటికి అన్నాడీఎంకే కార్యకర్తనే అని ఆనందంతో ముందుకు సాగారు. -
టీజేఎస్‌కు శ్రీశైల్‌రెడ్డి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి (టీజేఎస్) పొలిటికల్ అఫైర్స్ కమిటీకి, జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం చైర్మన్ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు శ్రీశైల్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సమాజం కోసం రాజకీయంగా చేయాల్సినంత చేయలేకపోతున్నామని, టీజేఎస్ ఆ దిశగా ముందుకు పోవడంలేదని, ఇంకా ఉద్యమ పంథా తప్ప రాజకీయ ధోరణి లేదనే తీవ్ర అసంతృప్తి, బాధతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. లోతైన, సునిశితమైన ఆలోచన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కు పంపిన లేఖలో పేర్కొన్నారు -
నా రాజకీయాల్ని నా బిడ్డలే అసహ్యించుకున్నారు: సీనియర్ నటుడు
సినిమావాళ్లు రాజకీయాల్లోకి వస్తున్నారంటే అభిమానులకు ఎక్కడా లేని సంబురం. బ్యానర్లు కట్టడం దగ్గరి నుంచి సోషల్ మీడియా ప్రచారం దాకా మామూలు హడావిడి ఉండదు.అయితే ఆ అభిమానం అన్నివేళలా ఆదుకుంటుందనే గ్యారెంటీ ఉండదు!. ఫ్యాన్స్ సంగతేమోగానీ తన కుటుంబం తన నిర్ణయాన్ని స్వాగతిస్తారని అనుకున్నాడట హాలీవుడ్ సీనియర్ హీరో ఆర్నాల్డ్ ష్వాజ్నెగ్గర్. కానీ, దానికి విరుద్ధంగా సొంత బిడ్డలే తనను అస్యహించుకున్నారని చెబుతున్నాడు. డెబ్భై మూడేళ్ల వయసున్న ఆర్నాల్డ్.. ఫ్యాక్స్ న్యూస్ ఛానెల్‌కి ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ.. నటుడిగా ఉన్న నేను గవర్నర్‌గా ఎన్నికయ్యాక నా పిల్లలు ఎంతో సంతోషిస్తారని అనుకున్నా. కానీ, వాళ్లు ఆ టైంలో నన్ను, నా పదవిని ఎంతో అసహ్యించుకున్నారు. వాళ్లు నా సినిమాలు చూసి పెరిగారు. నాతో పాటు సెట్స్‌లోకి వచ్చి సందడి చేశారు. అది వాళ్లకు వినోదం. కానీ, రాజకీయాల సాకుతో వాళ్లను హాలీవుడ్ నుంచి షిప్ట్ చేయడం వాళ్లకు నచ్చలేదు. పైగా అక్కడ(కాలిఫోర్నియా) నేనేం అభివృద్ధి చేయలేదని వాళ్ల అభిప్రాయం. నా పరిమితులు నాకుంటాయి కదా. అది వాళ్లు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే నా రాజకీయాలు వాళ్లకు అసహ్యంగా అనిపించాయి. నన్నూ ద్వేషించారు’ అని చెప్పుకొచ్చాడు ఆర్నాల్డ్. ‘రాజకీయాలు.. సినిమాలు రెండు పడవల మీద ప్రయాణం లాంటివి. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా మునిగిపోక తప్పదని రొనాల్డ్ రీగన్ లాంటి స్వఅనుభవం ఉన్నవాళ్లు ఏనాడో చెప్పారు. అది నాకు తర్వాతే అర్థమైంది’ అని ఆర్నాల్డ్ తెలిపాడు. కాగా, 2003 నుంచి 2011 వరకు కాలిఫోర్నియా గవర్నర్‌గా పని చేశాడు ఆర్నాల్డ్. ప్రస్తుతం కొత్త సినిమాలేమీ ఓకే చేయని ఆర్నాల్డ్.. 2019లో టెర్మినేటర్ డార్క్ ఫేట్ ద్వారా తెరపై కనిపించారు. View this post on Instagram A post shared by Arnold Schwarzenegger (@schwarzenegger) చదవండి: లులు అంటే ఏంటో తెలుసా? -
ఇదే నామాట.. నా మాటే శాసనం.. తహసీల్దార్‌పై ఎమ్మెల్సీ సోదరి జులుం..
సాక్షి ప్రతినిధి, వరంగల్: జిల్లాలో మరో తహసీల్దార్ బదిలీ జరిగింది. అయితే, ఇది సాధారణ బదిలీ కాదు! మైనింగ్ మాఫియాను అడ్డుకున్నందుకు వేలేరు తహసీల్దార్ విజయలక్ష్మి బ‘ది’లీ అయినట్లు తెలుస్తోంది. సుమారు వారం పాటు తర్జనభర్జన చేసిన జిల్లా యంత్రాంగం ఎట్టకేలకు రాజకీయ నేతల ఒత్తిడికే తలొగ్గినట్లు కనిపిస్తోంది. వేలేరు తహసీల్దార్‌ను కలెక్టరేట్‌కు బదిలీ చేసి సమస్యకు పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే తహసీల్దార్, వేలేరు జెడ్పీటీసీకి నడుమ జరిగిన ఫోన్ సంభాషణ బయటకు లీక్ కావడంతో మొత్తం వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇప్పుడిది అటు ఉద్యోగ, ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలేం జరిగింది.. వేలేరు మండలం షోడషపల్లి శివారు లోక్యాతండాలో కొంత కాలంగా మొరం అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో రాజకీయ ఒత్తిడి నేపథ్యాన చాలాకాలంగా రెవెన్యూ యంత్రాంగం చూసీచూడనట్లు ఉంటోంది. కానీ స్థానిక ప్రజాప్రతినిధుల నడుమ తలెత్తిన అంతర్గత వివాదాల కారణంగా మైనింగ్‌పై తరుచూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో మొరం తరలిస్తున్న వాహనాలను వేలేరు తహసీల్దార్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో అధికారులు అడ్డుకున్నారు. వీటిని సీజ్ చేసి పెద్ద మొత్తంలో జరిమానా విధించడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సోదరి.. వేలేరు జెడ్పీటీసీ సరిత రంగంలోకి దిగారు. నేరుగా తహసీల్దార్‌కు ఫోన్ చేసిన సీజ్ చేసిన వాహనాలకు కేవలం రూ.25వేల చొప్పున మాత్రమే జరిమానా విధించాలని సూచించారు. అక్కడి నాయకుల మాటలు విని ఎక్కువ ఫైన్ వేయొద్దని చెప్పారు. అంతేకాకుండా తాను ఎమ్మెల్సీ సోదరినని.. తాను చెబితే ఎమ్మెల్సీ చెప్పినట్లుగానే భావించాలని తెలిపారు. దీనికి తహసీల్దార్ ససేమిరా అన్నారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చెప్పి ఒక్కో వాహనానికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. దీంతో వివాదం మరింత ముదిరింది. జెడ్పీటీసీ – తహసీల్దార్ నడుమ మాటామాటా పెరిగినా, తహసీల్దార్ వెనక్కి తగ్గలేదు. దీంతో ఆమెను బదిలీ చేయించేందుకు ఉన్నతాధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. ఫలితంగా ప్రజాప్రతినిధి మాట విననందుకు తహసీల్దార్ విజయలక్ష్మి అక్కడి నుంచి కలెక్టరేట్ బదిలీ అయ్యారు. గ్రామస్తుల ఫిర్యాదు తహసీల్దార్ – జెడ్పీటీసీ నడుమ వ్యవహారం రచ్చగా మారడంతో గ్రామంలో మైనింగ్‌ను వ్యతిరేకిస్తున్న వారు తెరపైకి వచ్చారు. ఏకంగా వారు «పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలా వ్యవహారం పెద్దగా మారుతుండడంతో ఇరువర్గాల వారికి కూర్చోబెట్టి సయోధ్య కుదర్చడానికి కొందరు ప్రజాప్రతినిధులు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. అయితే, ఫోన్లో మాట్లాడే క్రమంలో స్థానిక నాయకులపై కూడా జెడ్పీటీసీ అనుచితంగా మాట్లాడటం గ్రామస్తులు, పలువురు ప్రజాప్రతినిధులను ఆగ్రహానికి గురిచేసినట్లు సమాచారం. దీంతో వీరిని కూడా బుజ్జగించేందుకు చర్యలు మొదలయ్యాయని తెలుస్తోంది. నేనే సమాచారం ఇచ్చా... మొత్తం వ్యవహారంపై వేలేరు జెడ్పీటీసీ చాడ సరిత వివరణ ఇస్తూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. లోక్యాతండా నుంచి కొందరు మొరం తరలిస్తుండగా తానే అడ్డుకుని తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా మైనింగ్ అధికారులకు సైతం ఫోన్లో సమాచారం ఇచ్చానని పేర్కొన్నారు. అంతేతప్ప ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని పేర్కొన్నారు. ఇక కలెక్టరేట్ అధికారులు మాత్రం వేలేరు తహసీల్దార్ బదిలీ వ్యవహారాన్ని పరిపాలనా సౌలభ్యం కోసమే చేపట్టినట్లుగా చూడాలని చెబుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లు కొన్ని సందర్భాల్లో సహజమే అయినా వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సామరస్య పూర్వకంగా పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: పేకాటలో దొరికిన మంత్రి మల్లారెడ్డి సోదరుడు -
పొలిటికల్ లీడర్?
హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఏ పాత్రలో కనిపించనున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే ఇందులో ఎన్టీఆర్ మాఫియా డాన్‌గా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రశాంత్ నీల్ పొలిటికల్ స్క్రిప్ట్‌ను రెడీ చేశారని, ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్‌గా కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్ తాజా టాక్. మరి.. ఎన్టీఆర్‌ను ప్రశాంత్ నీల్ పొలిటికల్ లీడర్‌గా చూపిస్తారా? మాఫియా డాన్గానా? అసలు విషయం తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. -
Delhi High Court: పోలీసులపై ఢిల్లీ ధర్మాసనం ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య లక్షల్లో పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయినా వైరస్ బారిన పడి చనిపోతున్నవారి సంఖ్య తగ్గట్లేదు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, మందుల కొరతతో వందలాది మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఢిల్లీ ఆస్పత్రుల్లో పడకల, ఆక్సిజన్ కొరత నెలకొనడంతో.. సకాలంలో వైద్యం అందక అధిక సంఖ్యలో కరోనా రోగులు మరణించారు. ఒక్క సర్ గంగారాం ఆస్పత్రిలోనే 20 పైగా కరోనా రోగులు ఆక్సిజన్ కొరతతో చనిపోయారు. తాజాగా ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కి తరలిస్తుండటంతో ఆస్పత్రుల్లో కొరత ఏర్పడింది. ప్రభుత్వం దీన్ని ఎదుర్కోవడంలో విఫలమవుతోందని ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్లకు ఆక్సిజన్ పంపిణీ చేసి చేతులు దులిపేసుకుంటే ఎలా అని ప్రశ్నించింది. ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్‌కి తరలకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, ఆక్సిజన్ సిలిండర్ అక్రమంగా నిల్వ చేసిన కేసుకు సంబంధించి.. ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసీ) అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌తో సహా.. మరో తొమ్మిది మంది రాజకీయ నాయకులకు ఢిల్లీ పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వడంపై సోమవారం ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. "మీరు బాధ్యతతో వ్యవహరించాలి. ఆక్సిజన్, కరోనా మందులు.. నిల్వచేసుకుని వ్యాపారం చేయడానికి ఇది సమయం కాదు. రాజకీయ పార్టీలు దీన్ని ఆసరాగా తీసుకుని వ్యాపారంగా ఎలా మార్చుకుంటాయి? ప్రిస్క్రిప్షన్ లేకుండా వారు ఆక్సిజన్ ఎలా కొనుగోలు చేయవచ్చు? నిజం ఏంటో..బయట పెట్టే ఆసక్తి మీకు లేదు అనిపిస్తోంది." అంటూ విపిన్ సంఘి, జస్మీత్ సింగ్ ధర్మాసనం ఢిల్లీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. "కొంతమంది రాజకీయ ప్రముఖులు దీనిలో ఉన్నందున, ఈ విధంగా దర్యాప్తు చేయడం సరికాదు. ప్రజలకు సేవ చేయడం మీ విధి. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. కరోనా మందుల కొరత కారణంగా ఎంత మంది మరణించారో గ్రహించారా అని ప్రశ్నించింది. అంతే కాకుండా దీనిపై సరైన విచారణ జరపాలని ఢీల్లీ ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. పేద ప్రజల అందించే ఔషధాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్)కు అప్పగించాలని ఆశిస్తున్నట్లు కోర్టు తెలిపింది. (చదవండి: Myanmar: మా పౌరులు మరణిస్తున్నారు..దయచేసి స్పందించండి) -
Etela Rajender: సరైన సమయంలో సరైన నిర్ణయం
సాక్షి, కరీంనగర్: రాజకీయ భవిష్యత్తుపై సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రకటిస్తానని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మూడు రోజులుగా వేలాది మంది ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో మాట్లాడానన్నారు. ఉమ్మడి కరీంనగర్ నుంచే కాకుండా ఖమ్మం సహా 9 పాత జిల్లాల నుంచి కార్యకర్తలు పరామర్శించేందుకు వచ్చినట్లు తెలిపారు. బుధవారం హుజూరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తనను కలవడానికి వచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ సంఘాల వారితో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘నా నిర్ణయానికి సంబంధించి నియోజకవర్గంలోని ప్రజలు రెండు రకాలుగా అభిప్రాయాలను వెల్లడించారు. వాటిని బేరీజు వేసుకుంటున్నా. ప్రస్తుతం కరోనాతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. కరోనాను నివారించడంతోపాటు, కరోనా బారిన పడ్డ వారిని కాపాడుకోవడం ముఖ్యమైన అంశం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో హుజూరాబాద్ కీలకంగా వ్యవహరించింది. 20 ఏళ్లుగా ఇక్కడి ప్రజలకు తెలంగాణ ఉద్యమ అనుబంధం ఉంది. నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలోని ఉప్పల్‌లో రైల్‌రోకో చేసి అప్పటి ఢిల్లీ సర్కారుకు తెలంగాణ చైతన్యాన్ని చాటి చెప్పాం. అప్పుడు ఉప్పల్ రైల్వేస్టేషన్లో పోలీసులు ఫైరింగ్‌కు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఈ ప్రాంత ప్రజలు లెక్కచేయలేదు. ఉద్యమాన్ని ధైర్యంతో ముందుకు తీసుకెళ్లారు. టీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ఇస్తే నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. ఇక్కడి ప్రజలు, నాయకుల కమిట్మెంట్ ఎంతో గొప్పది. నాకు జరిగిన అన్యా యాన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. నేను తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి పనిచేస్తామంటున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు వచ్చి మీకు జరిగిన అన్యాయం, దుర్మార్గం సహించరానిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎన్నారైలు కూడా వారి సలహాలు, సూచనలు ఇచ్చారు’అని ఈటల వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ఏం కోరుకున్నారో అది నేడు జరగడం లేదన్నారు. ఇప్పుడు ఆత్మ గౌరవం ప్రధాన సమస్యగా మారిందని, హైదరాబాద్‌లో ఉన్న తన ఆత్మీయులు, శ్రేయోభిలాషులతో మాట్లాడి సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానని ఈటల చెప్పారు. రాజీనామాపై భిన్నాభిప్రాయాలు మూడు రోజులపాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గ పర్యటన పూర్తి చేసుకున్నమాజీ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం సాయంత్రం తిరిగి శామీర్‌పేటలోని తన నివాసానికి చేరుకున్నారు. మూడు రోజులపాటు హుజూరాబాద్ క్యాంపు కార్యాలయంలో స్థానిక నేతలు, కార్యకర్తలతో పాటు పార్టీకి చెందిన అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నేతలతో ఈటల భేటీ అయ్యారు. శాసనసభ్యత్వంతో పాటు పారీ్టకి రాజీనామా చేసే విషయంలో ఈటల అనుచరులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. పార్టీలో కొనసాగాలని కొందరు కోరగా, రాజీనామా చేసి బయటకు వస్తే వెంట నడుస్తామని మరికొందరు ప్రకటించారు. దీంతో వివిధ రంగాలకు చెందిన వారితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలనే యోచనకు ఈటల వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు మెదక్ జిల్లా అచ్చంపేట, హకీంపేట అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కిన ఈటల, దేవరయాంజాల్ భూముల విషయంలోనూ న్యాయ నిపుణులతో చర్చించనున్నట్లు సమాచారం. ( చదవండి: ఈటల రాజేందర్ బర్తరఫ్‌పై నిరసన ) -
సార్ తలుచుకుంటే.. అక్రమ నిర్మాణాలకు కొదువా..
సాక్షి, కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో ఆయన అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి. ఓ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచిన ‘సార్’.. కార్పొరేట్ కళాశాలలతో పోటీపడే స్థాయి విద్యాసంస్థలకు అధిపతి. ఇంటర్మీడియెట్ నుంచి ఇంజినీరింగ్ కళాశాలల వరకు ఆయన విద్యా వ్యాపారం విస్తరించింది. అంతటి పెద్ద మనిషి ప్రభుత్వ నిబంధనలను కాలరాశారు. కరీంనగర్ శివార్లలోని విలువైన స్థలంలోని విద్యాసంస్థల ఆవరణలో ఓ ఇంటర్నేషనల్ స్కూల్ కోసం జరిపిన నిర్మాణానికి గ్రామ పంచాయతీ, లేదా పట్టణాభివృద్ధి సంస్థ అనుమతి తీసుకోవాలనే చిన్న లాజిక్‌ను ఆయన మరిచారు. ఏకంగా 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగంతస్థుల భవనాన్ని నిర్మించారు. కళాశాల పరిధిలోని తన స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి.. ఆవరణలో తారు రోడ్లను వేయిస్తున్నారు. ‘నన్ను అడిగే వారెవరు?’ అనే ధోరణిలో ‘సార్’ సాగిస్తున్న నిర్మాణాల గురించి తెలిసినా గ్రామ పంచాయతీ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారి చూసీ చూడనట్టుగానే వదిలేశారు. కరీంనగర్ పట్టణాభివృద్ధి సంస్థ ‘సుడా’ ఇటువైపే చూడలేదు. బొమ్మకల్ చౌరస్తాలో జీ+3 నిర్మాణం... కరీంనగర్ బొమ్మకల్ చౌరస్తాలో బైపాస్‌ను ఆనుకొని ఉన్న భూములను గతంలోనే కొనుగోలు చేసిన ప్రజాప్రతినిధి తన గ్రూప్ విద్యాసంస్థలను నెలకొల్పారు. ఇదే క్రమంలో తెలిసో, తెలియకో అక్కడే ఉన్న ప్రభుత్వ స్థలంలో కొంత భాగం కూడా ఆయన ఆధీనంలోకి వెళ్లింది. దీనిపై బొమ్మకల్ గ్రామ పంచాయతీకి చెందిన కొందరు వార్డు సభ్యులు, లోక్‌సత్తా వంటి సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జిల్లా కలెక్టర్ భూమిని సర్వే చేయించారు. కళాశాల స్థలానికి, వ్యవసాయ భూమికి మధ్యన సర్వే నంబర్ 28లో ఉన్న సుమారు ఎకరం 26 గుంటల భూమి ప్రభుత్వానిదని తేల్చారు. ఈ సర్కారు భూమి చుట్టూ గోడ కడతామన్న జిల్లా అధికారులు రాతి ఖనీలు పాతి, ప్రభుత్వ స్థలమనే బోర్డు ఏర్పాటు చేసి వదిలేశారు. అదే సమయంలో కళాశాల ప్రాంగణంలో ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణం జరుపుకుంటున్న మూడంతస్థుల భవనం గురించి కూడా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో నిర్మాణం కూడా పూర్తయిన ఈ భవనంలో అంతర్జాతీయ స్థాయి స్కూల్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. గ్రామ పంచాయతీ, సుడా అనుమతి లేకుండా... బొమ్మకల్ చౌరస్తాలోని ప్రజాప్రతినిధికి చెందిన విద్యాసంస్థల క్యాంపస్‌లో గత ఏడాది జీ+3 అంతస్థుల్లో భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. కరోనా సమయంలో శరవేగంగా నిర్మాణం పూర్తయింది. సుమారు 20వేల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాలో నిర్మాణం పూర్తయిన ఈ భవనానికి బొమ్మకల్ గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి లేదు. భవన నిర్మాణం కోసం గ్రామ పంచాయతీకి దరఖాస్తు కూడా చేసుకోలేదని వార్డు సభ్యుడు తోట కిరణ్ ‘సాక్షి’కి తెలిపారు. దీనిపై డీపీఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి బి.సురేందర్‌ను ప్రశ్నించగా అనుమతి లేని విషయాన్ని ‘సాక్షి’తో ధ్రువీకరించారు. తాను రెండున్నర నెలల క్రితమే బదిలీపై వచ్చానని, అంతకు ముందున్న కార్యదర్శి అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవనాన్ని ఆపాలని నోటీస్ ఇచ్చేందుకు వెళ్లగా, కళాశాల సిబ్బంది అనుమతించలేదని తెలిసిందన్నారు. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) పరిధిలో ఉన్న ఈ స్థలంలో ఇంటిని నిర్మించుకోవాలన్నా ఆ సంస్థ అనుమతి తప్పనిసరి. అయినా ఎలాంటి అనుమతి లేకుండానే భవన నిర్మాణం పూర్తవడం విశేషం. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కావడంతో ‘సార్’ను అడిగే వారే లేకుండా పోయారు. ప్రభుత్వ ఆధీనంలోని బావి నుంచే పొలాలకు నీరు ప్రజాప్రతినిధి కొనుగోలు చేసిన భూముల్లో కొన్ని ఎకరాల్లో విద్యాసంస్థలు నడుస్తుండగా, మరికొన్ని ఎకరాల్లో వ్యవసాయం చేయిస్తున్నారు. ఈ భూముల కోసం తవ్విన పాత వ్యవసాయ బావిని ఆధునికీకరించారు. అయితే జిల్లా రెవెన్యూ అధికారుల సర్వేలో ఆ బావి కూడా సర్కారు శిఖం భూమిలో ఉన్నట్లుగా తేలింది. సర్కారు భూమి చుట్టూ ప్రహరీ కట్టాలని భావించినప్పటికీ, ఒత్తిళ్ల మేరకు ఖనీలతో వదిలేశారు. ఇప్పుడు అదే వ్యవసాయ బావి ప్రజాప్రతినిధికి చెందిన వరి పొలాలకు, కళాశాల ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న స్కూల్ భవనం, రోడ్లకు నీటిని సరఫరా చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రెండు మోటార్లు కూడా పని చేస్తున్నాయి.