Poonam Kaur's Sensational Tweet On AP Politics - Sakshi
Sakshi News home page

Poonam Kaur: ఏపీ పాలిటిక్స్‌పై పూనమ్‌ ట్వీట్‌.. ఆమెపై బూతులతో రెచ్చిపోతున్న ఆయన ఫ్యాన్స్‌

Published Mon, Jul 17 2023 9:02 AM | Last Updated on Mon, Jul 17 2023 9:37 AM

Poonam Kaur Tweet On Ap Politics - Sakshi

నటి పూనమ్‌ కౌర్‌.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటిగా కంటే కూడా సోషల్‌ మీడియాలో ఆమె చేస్తున్న పలు వ్యాఖ్యలతో ఎక్కువగా పాపులర్‌ అయ్యారు. సమాజంలో జరిగే సంఘటనలు, రాజకీయ వ్యవహరాలపై స్పందిస్తూ ఆమె చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి భారీగానే దుమారం రేపుతూ ఉంటాయి. వాటి వల్ల ఆమె కూడా ట్రోలింగ్‌కు కూడా గురవుతుంటారు కూడా.. తాజాగా పూనమ్‌ ఏపీ పాలిటిక్స్‌పై ఇలా ట్వీట్‌ చేసి మరోసారి వార్తల్లోకెక్కారు.

(ఇదీ చదవండి: లిప్‌లాక్‌,బోల్డ్‌ సీన్స్‌పై మా ఇంట్లో ఏమన్నారంటే: బేబీ హీరోయిన్‌)

ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య కొందరు ఫేక్‌ లీడర్లు మహిళల మీద ఎక్కడా లేని అభిమానాన్ని చూపుతూ రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వాళ్లను నమ్మోద్దు. మహిళలకు ఎదో జరిగిపోతుందని వారికి అంతగా అందోళన ఉంటే ఢిల్లీలో రెజ్లర్లు చాలా రోజుల పాటు నిరసన దీక్ష చేశారు. కనీసం వారికి అనుకూలంగా ఒక్కమాటైనా వీరు మాట్లడలేకపోయారే. వాళ్ల సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఏపీలో ఈ నకిలీ లీడర్లు ఎక్కడా లేని ప్రేమను కురిపిస్తున్నారు. ఇలాంటి లీడర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. అంటూ నటి పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌ చేశారు.

ఈ వ్యాఖ్యలు ఆమె ఏ రాజకీయ నాయకుడిని ఉద్దేశించి చేశారనేది పేరు మాత్రం తెలుపలేదు. కానీ ఆమె ట్వీట్‌ కింద కొందరు బూతు పదాలతో పలు కామెంట్లు చేస్తున్నారు. మా నాయకుడు పవన్‌ కల్యాణ్‌ను అంటున్నావ్‌ కదా అంటూ.. కొందరు జనసేన, పవన్‌ ఫోటోలను డీపీలుగా పెట్టుకుని బూతు పదాలతో రెచ్చిపోతున్నారు. కొందరైతే ఏకంగా రాయలేని భాష ఉపయోగిస్తూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఇంకోసారి ఇలాంటి కామెంట్లు పెడితే ఏం జరుగుతుందో కూడా ఊహించలేవంటూ పూనమ్‌కు వార్నింగ్‌ ఇస్తూ పవన్‌ ఫోటోను డీపీగా పెట్టుకుని వార్నింగ్‌ ఇస్తున్నారు.

దీంతో ఆమె ఇన్‌స్టాలో మరో ట్వీట్‌ చేశారు. 'మీరందరూ నా గురించి ఒకటి గుర్తుపెట్టుకోండి. నా పేరు 'కౌర్‌' అని మీరు మర్చిపోతున్నారు. సూమారుగా 5 ఏళ్లు అవుతుంది. కొంచెం ఆలోచించండి.' అని పోస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement