fance
-
ఆ లీడర్లను నమ్మొద్దు.. ఏపీ పాలిటిక్స్‌పై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్
నటి పూనమ్ కౌర్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటిగా కంటే కూడా సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న పలు వ్యాఖ్యలతో ఎక్కువగా పాపులర్ అయ్యారు. సమాజంలో జరిగే సంఘటనలు, రాజకీయ వ్యవహరాలపై స్పందిస్తూ ఆమె చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి భారీగానే దుమారం రేపుతూ ఉంటాయి. వాటి వల్ల ఆమె కూడా ట్రోలింగ్‌కు కూడా గురవుతుంటారు కూడా.. తాజాగా పూనమ్ ఏపీ పాలిటిక్స్‌పై ఇలా ట్వీట్ చేసి మరోసారి వార్తల్లోకెక్కారు. (ఇదీ చదవండి: లిప్‌లాక్,బోల్డ్ సీన్స్‌పై మా ఇంట్లో ఏమన్నారంటే: బేబీ హీరోయిన్) ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య కొందరు ఫేక్ లీడర్లు మహిళల మీద ఎక్కడా లేని అభిమానాన్ని చూపుతూ రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వాళ్లను నమ్మోద్దు. మహిళలకు ఎదో జరిగిపోతుందని వారికి అంతగా అందోళన ఉంటే ఢిల్లీలో రెజ్లర్లు చాలా రోజుల పాటు నిరసన దీక్ష చేశారు. కనీసం వారికి అనుకూలంగా ఒక్కమాటైనా వీరు మాట్లడలేకపోయారే. వాళ్ల సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఏపీలో ఈ నకిలీ లీడర్లు ఎక్కడా లేని ప్రేమను కురిపిస్తున్నారు. ఇలాంటి లీడర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. అంటూ నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఆమె ఏ రాజకీయ నాయకుడిని ఉద్దేశించి చేశారనేది పేరు మాత్రం తెలుపలేదు. కానీ ఆమె ట్వీట్ కింద కొందరు బూతు పదాలతో పలు కామెంట్లు చేస్తున్నారు. మా నాయకుడు పవన్ కల్యాణ్‌ను అంటున్నావ్ కదా అంటూ.. కొందరు జనసేన, పవన్ ఫోటోలను డీపీలుగా పెట్టుకుని బూతు పదాలతో రెచ్చిపోతున్నారు. కొందరైతే ఏకంగా రాయలేని భాష ఉపయోగిస్తూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఇంకోసారి ఇలాంటి కామెంట్లు పెడితే ఏం జరుగుతుందో కూడా ఊహించలేవంటూ పూనమ్‌కు వార్నింగ్ ఇస్తూ పవన్ ఫోటోను డీపీగా పెట్టుకుని వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో ఆమె ఇన్‌స్టాలో మరో ట్వీట్ చేశారు. 'మీరందరూ నా గురించి ఒకటి గుర్తుపెట్టుకోండి. నా పేరు 'కౌర్' అని మీరు మర్చిపోతున్నారు. సూమారుగా 5 ఏళ్లు అవుతుంది. కొంచెం ఆలోచించండి.' అని పోస్ట్ చేశారు. The people who are shouting at the top of their voice about women issues , as if they are highly concerned are the one who did not speak a word for #Wrestlers , beware of fake leaders who concern when it’s to their benefit and convenience.#AndhraPradesh — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 16, 2023 -
అభిమాని చేసిన పనికి భావోద్వేగానికి గురైన తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. బాలీవుడ్ నటుడు విజయ వర్మతో ప్రేమ వ్యవహారం నిజమేనని తను ఎప్పుడైతే ఒప్పుకుందో ఒక్కసారిగా అందరి దృష్టి తమన్నాపై పడింది. విజయ్ వర్మ విషయంలో తన నిర్ణయాన్ని కొందరు తప్పుబడుతున్నా మరికొందరు తనకు సపోర్టుగా నిలుస్తాన్నారు. దీంతో తమన్నాకు ఎక్కడికెళ్లిన అభిమానుల తాకిడి ఎక్కువైంది. తాజాగా ముంబై విమానాశ్రయంలో ఒక అభిమానితో తమన్నా చాలా క్లోజ్‌గా ఇంటరాక్ట్ అయ్యింది. (ఇదీ చదవండి: మొబైల్‌తో ఇబ్బంది పడుతున్నాను.. ఆషూ రెడ్డి వీడియో విడుదల) దీంతో ఆ అభిమాని భావోద్వేగానికి గురయ్యారు. తమన్నాను కలిసిన తర్వాత ఆ వ్యక్తి ఆమె పాదాలను తాకారు. అనంతరం ఒక బొకేతో పాటు లేఖను కూడా మిల్కీ బ్యూటీకి ఇచ్చారు. అపై తన చేతిపై పచ్చబొట్టు కూడా చూపించడంతో తమన్నా ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. టాటూలో 'లవ్ యు ది తమన్నా' అనే పదంతో పాటు తమ్ము ఫోటోను అభిమానంతో వేపించుకున్నారు. అనంతరం ఆ అభిమానిని తమన్నా కౌగిలించుకుని చాలాసార్లు 'ధన్యవాదాలు' అని చెప్తూనే కారులోకి వెళ్లింది. (ఇదీ చదవండి: ఆకాంక్ష పూరి నడుమును కెమెరాల ముందే పట్టుకున్న నటుడు) అభిమానుల స్పందన అయ్యో ఈ వీడియో చూస్తుంటే ఏడుపొస్తుంది. అభిమానుల పట్ల తమన్నా చూపించే ప్రేమ ఎలా ఉంటుందో.. ఈ వీడియో చూస్తే చాలంటూ ఒక ఫ్యాన్ కామెంట్ చేశాడు. తను బంగారం లాంటి వ్యక్తి 13 ఏళ్లుగా తెలుసు.. అభిమానులను చాలా గౌరవంగా భావింస్తుంది అంటూ తమన్నాను పలు అభినందనీయమైన కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
Adipurush: థియేటర్ అద్దాలు పగలగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్
ప్రభాస్ రాముడిగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం'ఆదిపురుష్' ప్రపంచవ్యాప్తంగా నేడు (జూన్ 16) విడుదలైంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్ల వద్ద జై శ్రీరామ్ నామంతో ప్రభాస్ ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. సినిమా ఇప్పటికే హిట్ టాక్ అందుకుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమాకు మంచి బజ్ రావడంతో థియేటర్లలో బొమ్మ పడటం ఒక నిమిషం ఆలస్యం అయినా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. (ఇదీ చదవండి: ఎవరైనా అలాంటి వేషాలు వేస్తే.. తాట తీస్తాం: ప్రభాస్ ఫ్యాన్స్) తాజాగా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని జ్యోతి థియేటర్లో ఆదిపురుష్ సినిమా ఆలస్యంగా ప్రదర్శించడం వల్ల యాజమాన్యంతో ఫ్యాన్స్ గొడవకు దిగారు. థియేటర్ సిబ్బంది సర్దిచెప్పడంతో సమస్య సద్దుమనిగింది. కానీ వారు థియేటర్లోకి వెళ్లిన తర్వాత అసలు సమస్య మొదలైంది. సినిమా ప్రారంభం అయ్యాక సౌండ్ సిస్టం సరిగా లేకపోవడంతో వారికి డైలాగ్‌లు అర్థం అవ్వడం లేదని మళ్లీ గొడవకు దిగడమే కాకుండా థియేటర్ అద్దాలను పగలగొట్టారు. దీంతో చేసేదేమి లేక థియేటర్ యాజమాన్యం సినిమా ప్రదర్శనను నిలిపేశారు. (ఇదీ చదవండి: Adipurush: ఎవరీ ఓం రౌత్.. ప్రభాస్‌కు ఎలా పరిచయం?) -
అలాంటి వారు థియేటర్ల వద్ద కనిపిస్తే.. ప్రభాస్ ఫ్యాన్స్ మాస్ వార్నింగ్
మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'ఆదిపురుష్' థియేటర్లలోకి వచ్చేసింది. డార్లింగ్ ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా 9000కి పైగా స్క్రీన్స్ లో రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడ చూసినా 'ఆదిపురుష్' హడావుడి కనిపిస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. టీజర్ విడుదల సమయంలో సినిమాపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత విడుదలైన ట్రైలర్లు విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చాయి. తాజాగా సినిమా కూడా భారీ విజయం సాధించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. (ఇదీ చదవండి: Adipurush: ఓం రౌత్, ప్రభాస్‌ను కలిపింది ఎవరు?) జై శ్రీరామ్ నినాదాలతో థియేటర్స్ దగ్గర అభిమానులు సందడి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభాస్ అభిమానులు అర్ధరాత్రి నుంచే టపాసులుపేల్చుతూ.. డప్పులు వాయిస్తూ హంగామా చేస్తున్నారు . ఉదయం నాలుగు గంటలకే ఆదిపురుష్ బెనిఫిట్ షోలు ప్రారంభం కావడంతో సినిమా చూసిన అభిమానులు ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారని అంటున్నారు. ఇదిలా ఉంటే థియేటర్ల వద్ద రివ్యూలు చెప్పే వారికి ప్రభాస్ అభిమానులు ఓ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇటీవల ఏ సినిమా విడుదల అయితే ఆ సినిమాకు సంబంధించిన గెటప్‌లు వేసుకొని వచ్చి మరీ రివ్యూలు చెప్పేవారిని చూస్తూనే ఉంటాం. అలాంటి వారి చేష్టలను చూస్తూ ఊరుకోం అని ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. అవతార్2 సినిమా విడుదల సమయంలో ఆ గెటప్స్ వేసుకొని కొంతమంది హల్ చల్ చేశారు. ఇక ఇప్పుడు ఆదిపురుష్ రివ్యూలు చెప్తూ ఎవరైన హనుమంతుడు, రాముడు గెటప్‌లో వచ్చి.. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దని హెచ్చరిస్తున్నారు ఫ్యాన్స్. లైకులు కోసం, కామెంట్స్ కోసం అలాంటి పనులు చేస్తే ఊరుకోమని ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. దేవుడి సినిమా కాబట్టి.. ఆదిపురుష్ ప్రదర్శించే థియేటర్ల వద్ద ఎవరూ అసభ్యంగా ప్రవర్తించకండి అంటూ వారు తెలిపారు. (ఇదీ చదవండి: Adipurush: హనుమాన్కు కేటాయించిన సీట్ ఇదే..) -
మరో బిడ్డకు స్వాగతం పలుకుతున్నాం: ప్రముఖ నటుడు
తమిళ సినిమాతో పాటు పలు తెలుగు సినిమాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్న నటుడు గణేష్ వెంకట్రామన్. 2015లో బుల్లితెర నటి నిషా కృష్ణన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తాజాగా అభిమానుల కోసం ఈ జంట సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేసింది. మరోసారి మాతృత్వ ప్రేమను పొందబోతున్నట్లు ఇన్‌స్టాలో నిషా తెలిపింది. వారికి ఇప్పటికే ఒక పాప ఉంది.. రెండోసారి గర్భం ధరించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బిగ్ బాస్ సీజన్-1తో గణేష్ వెంకట్రామన్ ప్రేక్షకులను మెప్పించాడు. (ఇదీ చదవండి: ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది: తమన్నా) కోలీవుడ్‌లో 'అభియుమ్ నానుమ్' చిత్రంలో త్రిషకు ప్రేమికుడిగా సినిమారంగంలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత కమల్‌హాసన్ హీరోగా నటించిన ఉన్నైప్పోల్, ఒరువన్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో నాగార్జున హీరోగా నటించిన ‘ఢమరుకం’ సినిమాలో విలన్‌గా నటించి పలు అవకాశాలు దక్కించుకున్నాడు. విజయ్ నటించిన వారిసు చిత్రంలో కీలకపాత్రను పోషించాడు. బాలీవుడ్లో కూడా ఒక చిత్రంలో నటించబోతున్నాడు. View this post on Instagram A post shared by Nisha Ganesh (@prettysunshine28) (ఇదీ చదవండి: ఆదిపురుష్‌ను ప్రమోట్ చేస్తున్న మంచు మనోజ్ దంపతులు) -
మాట సాయం
మోహన్ లాల్, మమ్ముట్టి మలయాళ ఇండస్ట్రీ సూపర్ స్టార్స్. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరి సినిమా రిలీజ్ అయినా ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అదే ఇద్దరూ ఒకే సినిమాకి వర్క్ చేస్తే పండగ డబుల్ అవుతుంది. మోహన్‌లాల్ నటించిన భారీ చిత్రం ‘ఒడియన్’. ఇందులో 25 ఏళ్ల కుర్రాడిలానూ కనిపిస్తారు మోహన్‌లాల్. ఈ సినిమాలో మోహన్‌లాల్ పాత్రను పరిచయం చేస్తూ మమ్ముట్టి డబ్బింగ్ చెప్పనున్నారట. ఇది వరకూ ‘శేషం కాల్చాయిల్, పడయోట్టం, హరికృష్ణన్స్’ తదితర సినిమాల్లో ఇద్దరూ కలసి నటించారు. ఆల్రెడీ మోహన్‌లాల్ నటించిన ‘1971: బియాండ్ బోర్డర్స్’ చిత్రానికి మమ్ముట్టి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇప్పుడు ‘ఒడియన్’కి. ఈ ఇద్దరు స్టార్స్ ఎంత స్నేహంగా ఉంటారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. -
'ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు.. సాయం చేయండి'
ముంబయి: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ముంబయి పోలీసుల సాయం కోరారు. తన ఇంటి ముందు ప్రతి ఆదివారం గుమిగూడుతున్న అభిమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నెట్టుకొంటూ వత్తిడికి లోనై ఇబ్బందులు పడుతున్నారని, వారిని సరిగా ఉంచేందుకు సహాయపడాలని విజ్ఞప్తి చేశారు. ఓ ఆదివారం నాడు ఒక మహిళ ఆమె చిన్న పిల్లలు తనకు షేక్ హ్యాండ్ ఇచ్చి అభిమానం తెలుపుకునేందుకు గుంపుమధ్య చిన్న సందు దొరికినా అందులోంచి దూరిపోతూ అవస్థలు పడుతూ ప్రమాదాన్ని లెక్కచేయకుండా రావడం తాను చూశానని, ఇది తనను తీవ్రంగా కలిచి వేసిందని చెప్పారు. మరో ఆదివారం వర్షం వచ్చి ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లినా మరో ఆదివారం నుంచి ఆ విషయం షరా మాములుగా తయారైందని, ఫ్యాన్స్‌కు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టేందుకు సహాయం చేయాలని ఆయన పోలీసులను కోరారు.