మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'ఆదిపురుష్' థియేటర్లలోకి వచ్చేసింది. డార్లింగ్ ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా 9000కి పైగా స్క్రీన్స్ లో రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడ చూసినా 'ఆదిపురుష్' హడావుడి కనిపిస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. టీజర్ విడుదల సమయంలో సినిమాపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత విడుదలైన ట్రైలర్లు విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చాయి. తాజాగా సినిమా కూడా భారీ విజయం సాధించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
(ఇదీ చదవండి: Adipurush: ఓం రౌత్, ప్రభాస్‌ను కలిపింది ఎవరు?)
జై శ్రీరామ్ నినాదాలతో థియేటర్స్ దగ్గర అభిమానులు సందడి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభాస్ అభిమానులు అర్ధరాత్రి నుంచే టపాసులుపేల్చుతూ.. డప్పులు వాయిస్తూ హంగామా చేస్తున్నారు . ఉదయం నాలుగు గంటలకే ఆదిపురుష్ బెనిఫిట్ షోలు ప్రారంభం కావడంతో సినిమా చూసిన అభిమానులు ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారని అంటున్నారు.
ఇదిలా ఉంటే థియేటర్ల వద్ద రివ్యూలు చెప్పే వారికి ప్రభాస్ అభిమానులు ఓ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇటీవల ఏ సినిమా విడుదల అయితే ఆ సినిమాకు సంబంధించిన గెటప్‌లు వేసుకొని వచ్చి మరీ రివ్యూలు చెప్పేవారిని చూస్తూనే ఉంటాం. అలాంటి వారి చేష్టలను చూస్తూ ఊరుకోం అని ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. అవతార్2 సినిమా విడుదల సమయంలో ఆ గెటప్స్ వేసుకొని కొంతమంది హల్ చల్ చేశారు.
ఇక ఇప్పుడు ఆదిపురుష్ రివ్యూలు చెప్తూ ఎవరైన హనుమంతుడు, రాముడు గెటప్‌లో వచ్చి.. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దని హెచ్చరిస్తున్నారు ఫ్యాన్స్. లైకులు కోసం, కామెంట్స్ కోసం అలాంటి పనులు చేస్తే ఊరుకోమని ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. దేవుడి సినిమా కాబట్టి.. ఆదిపురుష్ ప్రదర్శించే థియేటర్ల వద్ద ఎవరూ అసభ్యంగా ప్రవర్తించకండి అంటూ వారు తెలిపారు.
(ఇదీ చదవండి: Adipurush: హనుమాన్‌కు కేటాయించిన సీట్ ఇదే..)
Comments
Please login to add a commentAdd a comment