Adipurush Movie
-
ప్రియుడితో కలిసి పెళ్లికి హాజరైన ఆదిపురుష్ భామ..!
ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ కృతిసనన్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ ఏడాది బాలీవుడ్లో పలు చిత్రాలతో మెప్పించింది. అయితే గత కొంతకాలంగా కృతి ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కబీర్ బహియా అనే వ్యాపారవేత్తతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల అతని బర్త్ డే సందర్భంగా కృతి చేసిన పోస్ట్ చూస్తే వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు అర్థమవుతోంది. దీంతో కృతి సనన్ కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందా? అని తెగ చర్చించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో కృతిసనన్ తాజాగా ఓ పెళ్లి వేడుకలో మెరిసింది. ఆ పెళ్లి మరోవరిదో కాదు.. తన ప్రియుడు కబీర్ బహియా బంధువులదే కావడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వీరిద్దరి రిలేషన్‌పై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో కృతి సనన్ పెళ్లి చేసుకోబోతోందా? అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.కాగా.. గతంలో కృతి సనన్, కబీర్ బహియా కలిసి విదేశాల్లో వేకేషన్‌కు వెళ్లారు. ఆ సమయంలో వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. అయితే తమ రిలేషన్ గురించి వీరిద్దరు ఎక్కడా బయటికి చెప్పలేదు. కబీర్ బహియా పుట్టినరోజు సందర్భంగా కృతి సనన్ అతనితో ఉన్న రొమాంటిక్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోతో తమ రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చేసింది.కబీర్ బహియా లండన్‌కు చెందిన వ్యాపారవేత్త. అతని తండ్రి కుల్జిందర్ బహియా యూకే-ఆధారిత ట్రావెల్ ఏజెన్సీ అయిన సౌతాల్ ట్రావెల్ వ్యవస్థాపకుడు. అతను స్టార్ ఇండియన్ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి సన్నిహితుడు కూడా. మరోవైపు కృతి సనన్ ఈ ఏడాది తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా, క్రూ, దో పట్టి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. -
డేటింగ్లో ఆదిపురుష్ భామ.. బాయ్‌ఫ్రెండ్‌కు స్పెషల్ విషెస్
ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్. ఈ ఏడాది క్రూ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఇటీవల దో పట్టి మూవీలోనూ కనిపించింది. అయితే ఇటీవల విదేశాల్లో వేకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తన బర్త్ డే వేడుకలు సైతం విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంది. ఆ పార్టీలో ఆమె బాయ్ ఫ్రెండ్ కబీర్ బహియా కూడా ఫోటోల్లో కనిపించారు. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ అప్పట్లో వార్తలొచ్చాయి.తాజాగా ఇవాళ కబీర్ బహియా బర్త్ డే సందర్భంగా అతనికి విషెస్ తెలిపింది. ఇద్దరు కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. హ్యాపియస్ట్ బర్త్ డే అంటూ లవ్ సింబల్‌ను జోడించింది. ఈ పోస్ట్ చూస్తే వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు అర్థమవుతోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఈ జంట డేటింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. కబీర్ బహియా యూకేలో ప్రముఖ వ్యాపారవేత్త అని సమాచారం.అంతేకాకుండా కృతి సనన్ సోదరి నుపుర్ సనన్, ఆమె ప్రియుడు స్టెబిన్ బెన్ సైతం కబీర్ దహియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. ఇటీవలే దీపావళి సందర్భంగా కబీర్, కృతి కుటుంబ సభ్యులతో దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా.. కృతి చివరిసారిగా నటించిన దో పట్టి ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో కాజోల్, షాహీర్ షేక్ కూడా కీలక పాత్రల్లో నటించారు. -
ఆదిపురుష్ వల్ల ఎంతో ఏడ్చా..: రచయిత
సినిమా బాగుందంటే జనాలు నెత్తినపెట్టుకుంటారు. అదే తేడా వచ్చిందంటే మాత్రం తీవ్రంగా విమర్శిస్తారు. ప్రభాస్ ఆదిపురుష్ విషయంలో ఇది నిరూపితమైంది కూడా! ఈ సినిమాలోని క్యారెక్టర్ల లుక్స్‌పై, దాన్ని డిజైన్ చేసినవారిపై, డైరెక్టర్‌పై, రచయితపై ఆగ్రహంతో విరుచుకుపడ్డారు.ఏదీ శాశ్వతం కాదుఅలా ఈ ట్రోలింగ్ నుంచి కోలుకోవడానికి చాలా సమయమే పట్టిందంటున్నాడు గేయ, సంభాషణల రచయిత మనోజ్ ముంతషీర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకున్నాను. ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. అలాగే ఈరోజు మంచి అనిపించింది కాస్తా రేపటికి చెడుగా అనిపించవచ్చు. లేదా ఈరోజు చెడు అనుకుందే రేపు మంచిగా అనిపించనూవచ్చు.ట్రోలింగ్ చూసి ఏడ్చా..ఆదిపురుష్ సమయంలో వచ్చిన ట్రోలింగ్ చూసి ఏడ్చాను. కానీ కుంగిపోలేదు. తిరిగి నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇందుకోసం పగలూరాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నాను. బాలీవుడ్ విషయానికి వస్తే ఇదొక మార్కెట్. ఇక్కడ ఎలాంటి నియమనిబంధనలు ఉండవు. కేవలం లాభం ఒక్కటే ఆశిస్తారు. నాతో వారికేదైనా లాభం ఉందనిపిస్తే నాదగ్గరకు వస్తారు. అలా ఇప్పుడు నన్ను మళ్లీ సంప్రదిస్తున్నారు అని మనోజ్ చెప్పుకొచ్చాడు.చదవండి: టిన్ అండ్ టీనా మూవీ రివ్యూ -
ఆదిపురుష్‌కు మంచి వసూళ్లు వచ్చాయ్.. ప్రభాస్‌తో పాటు ఆ హీరో..
ఫ్లాప్ అవడం వేరు, అప్రతిష్ట మూటగట్టుకోవడం వేరు. కొన్ని కథలు బాగున్నా కలెక్షన్స్ కూడబెట్టడంలో విఫలమై ఫ్లాప్‌గా నిలుస్తాయి. మరికొన్ని భారీ బడ్జెట్, భారీ తారాగణంతో ఊరిస్తూ ఊదరగొడుతూ బాక్సాఫీస్ ముందుకు వచ్చి అట్టర్‌ఫ్లాప్‌గా నిలుస్తాయి. అంతేనా దారుణంగా ట్రోలింగ్‌కు గురవుతాయి. ఆదిపురుష్ సినిమా రెండో కోవలోకి వస్తుంది.ఆదిపురుష్‌పై ట్రోలింగ్భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తుందని అంతా అనుకున్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. అంతేకాదు, నటీనటుల లుక్‌పైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. వానరాలను చూపించిన తీరు కూడా జనాలకు నచ్చలేదు. ఇలా ఒక్కటేమిటి, బోలెడు తప్పులను జనాలు సోషల్ మీడియాలో ఎత్తిచూపుతూ దర్శకుడు ఓం రౌత్‌ను ఏకిపడేశారు.బానే ఆడిందిఅయితే తన సినిమాకేమైందంటున్నాడు ఓం రౌత్. తాజాగా ఓ మరాఠీ షోలో మాట్లాడుతూ.. సినిమాను విమర్శించడం వేరు, బాక్సాఫీస్ వద్ద దాని పనితీరు వేరు. ఆదిపురుష్ సినిమానే ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఇది మొదటి రోజు ఒక్క ఇండియాలోనే రూ.70 కోట్లు రాబట్టింది. మొత్తంగా దాదాపు రూ.400 కోట్లు వసూలు చేసింది. అంటే బాక్సాఫీస్ వద్ద బానే ఆడింది.నేను పట్టించుకోనుఇక్కడ డబ్బులు పోలేదు. కాకపోతే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు థియేటర్లో కొన్ని సీన్లు రికార్డు చేసి ఆన్లైన్లో ట్రోల్ చేశారు. అలాంటివాటిని నేనసలు పట్టించుకోను. అయినా ఫ్లాపులతో సంబంధం లేకుండా తమ పాపులారిటీని చెక్కుచెదరనివ్వకుండా కాపాడుకునే హీరోలు ఇద్దరే ఇద్దరు. ఒకరు ప్రభాస్, మరొకరు సల్మాన్ ఖాన్. వారి ఇమేజ్ చెక్కుచెదరదువీరికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్ని ఫ్లాపులు వచ్చినా వీరి ఇమేజ్ అలాగే ఉంటుంది. సినిమా వైఫల్యంతో సంబంధం లేకుండా వారి క్రేజ్ అలాగే కొనసాగుతుంది అన్నారు. ఇకపోతే దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.393 కోట్లు వసూలు చేసింది.చదవండి: ప్రముఖ నటులపై అత్యాచార కేసు నమోదు -
విషాదం.. ‘ఆదిపురుష్’ నటి కన్నుమూత
చిత్ర పరిశ్రమలో విషాదం చేసుకుంది. ప్రముఖ నటి ఆశా శర్మ(88) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆశా..ఆదివారం ఉదయం తుదిశ్వాస విడినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. 13 ఏళ్ల వయసులోనే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ని ప్రారంభించింది ఆశా శర్మ. ఆ తర్వాత నటిగా మారింది. 1920, హమ్కో తుమ్సే ప్యార్ హై, హమ్ తుమ్హారే హై సనమ్‌తో పాటు మొత్తం 40 పైగా సినిమాల్లో నటించింది. ధర్మేంద్ర, హేమమాలిని మూవీ ‘దో దిశాయీన్’ మూవీలోనూ అద్భుత నటనను కనబరిచి ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రంలో ఆశాతో పాటు ప్రేమ్ చోప్రా, అరుణా ఇరానీ, నిరుపా రాయ్‌తో పాటు పలువురు నటించారు. చివరగా ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమాలో శబరి పాత్రను పోషించింది. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. ‘కుంకుమ్ భాగ్య’, ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’, ‘ఏక్ ఔర్ మహాభారత్’ లాంటి సీరియల్స్‌తో కీలక పాత్రలు పోషించింది. #cintaa expresses its condolences on the demise of Asha Sharma #condolence #restinpeace @poonamdhillon @dparasherdp @itsupasanasingh @HemantPandeyJi_ @ImPuneetIssar @rishimukesh @bolbedibol @iyashpalsharma @SahilaChaddha @actormanojjoshi @RealVinduSingh @HetalPa45080733 @ljsdc pic.twitter.com/RihVuk7I5g— CINTAA_Official (@CintaaOfficial) August 25, 2024 -
రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. నిజమేనా?
హీరో ప్రభాస్ పేరుకే పాన్ ఇండియా స్టార్. కానీ చూస్తే చాలా సింపుల్‌గా ఉంటాడు. బయట కావొచ్చు, మీడియాలోనూ పెద్దగా కనిపించడు. సినిమా రిలీజ్ టైంలో తప్పితే డార్లింగ్‌ని చూడటం కూడా కష్టమే. ఫుడ్ విషయంలో సహ నటీనటుల్ని ఆశ్చర్యపరిచే ప్రభాస్.. నిర్మాతలకు అండగా ఉంటాడు. తాజాగా ఓ నిర్మాత కోసం తన పారితోషికాన్నే తగ్గించుకున్నాడనే వార్తలొస్తున్నాయి. ఇంతకీ ఇది నిజమేనా?'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్.. వసూళ్లకు తగ్గట్లే తన రెమ్యునరేషన్ కూడా పెంచాడు. రూ.100 కోట్ల మార్క్ ఎప్పుడో దాటేశాడని టాక్. రీసెంట్ బ్లాక్ బస్టర్ 'కల్కి 2898 AD' చేసినందుకు గానూ రూ.150 కోట్లు తీసుకున్నాడని సమాచారం. ఇదంతా పక్కనబెడితే ప్రస్తుతం చేస్తున్న 'రాజాసాబ్' కోసం మాత్రం తన పారితోషికాన్ని కాస్త తగ్గించాడట.(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి')'రాజాసాబ్' సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. గతంలో ఈ ప్రొడక్షన్ హౌస్.. 'ఆదిపురుష్' చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ క్రమంలోనే కొంతమేర నష్టాలొచ్చాయట. ఇందుకు బదులుగానే ప్రభాస్, 'రాజాసాబ్' కోసం కేవలం రూ.100 కోట్లని మాత్రమే పారితోషికంగా తీసుకున్నాడని తెలుస్తోంది. అధికారికంగా బయటకు రానప్పటికీ ఇది నిజమై ఉండొచ్చని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే మూవీ 'రాజా సాబ్'. ఈ ఏడాది క్రిస్మస్కి రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. దీని తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2.. వరసగా రానున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే రాబోయే ఐదేళ్ల వరకు ప్రభాస్ డైరీ ఖాళీ లేనట్లే. ఇవన్నీ పూర్తయ్యేసరికి డార్లింగ్ హీరో రెమ్యునరేషన్ రూ.200 కోట్ల మార్క్ దాటేస్తుందేమో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే: యానిమల్ నటుడు షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటుడు సిద్దాంత్ కర్నిక్ గతేడాది సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ చిత్రంలో కనిపించారు. 2023 డిసెంబర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సిద్ధాంత్ కర్నిక్.. ప్రభాస్ ఆదిపురుష్‌లోనూ నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హజరైన సిద్ధాంత్ తన కెరీర్లో ఎదురైన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని షాకింగ్ కామెంట్స్ చేశారు. అదేంటో తెలుసుకుందాం.సిద్ధాంత్ కర్నిక్ మాట్లాడుతూ.. " అప్పడప్పుడే నా కెరీర్ ప్రారంభించా. 2005లో కేవలం 22 ఏళ్ల వయసులోనే పరిశ్రమలోకి ప్రవేశించా. ఓ సినిమా ఛాన్స్ కోసం కోఆర్డినేటర్ని కలిశా. అతను నా పోర్ట్‌ఫోలియో తీసుకుని రాత్రి 10:30 గంటలకు ఇంటికి రమ్మన్నాడు. ఆ టైమ్‌లో పిలవడం నాకు కాస్తా వింతగా అనిపించింది. అయినా అవకాశం కోసం వెళ్లక తప్పలేదు. ' అని అన్నారు. అనంతరం మాట్లాడుతూ..' అవకాశాల కోసం కొన్ని విషయాల్లో రాజీపడక తప్పదు. లేకపోతే నీకు ఎలాంటి పని ఉండదని అన్నాడు. దీంతో అతని మాటలను నేను వెంటనే గ్రహించా. ఆ సమయంలో అతను నాకు చాలా దగ్గరగా వచ్చాడు. నేను వెంటనే ఇంట్రెస్ట్ లేదని చెప్పి బయటకొచ్చేశా' అని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అతను నా సినిమా అవకాశాలను దెబ్బతీస్తాడేమోనని భయపడినట్లు వెల్లడించారు. కానీ కొన్నేళ్ల తర్వాత ఓ ఈవెంట్లో అతనే నన్ను అభినందించాడని తెలిపారు. కాగా.. సిద్ధాంత్ కర్నిక్ యానిమల్, ఆదిపురుష్ వంటి చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా ఫేమస్ వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ సీజన్- 2 కీలక పాత్ర పోషించాడు. 2004లో టీవీ షో రీమిక్స్‌తో కర్నిక్ తన కెరీర్ ప్రారంభించాడు. -
Kriti Sanon: మహారాణిలా వెలిగిపోతున్న ఆదిపురుష్ హీరోయిన్ (ఫోటోలు)
-
కలర్‌ఫుల్ డ్రెస్‌లో ఆదిపురుష్ భామ కృతి సనన్.. ఫోటోలు
-
‘ఆదిపురుష్’లో రావణుడిని వీధి రౌడీలా చూపించడం బాధేసింది: ‘రామాయణ్’సీత
రామాయణం ఇతిహాసం ఆధారంగా ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారణంగా బోల్తా పడింది.అంతేకాదు ఈ మూవీలోని ప్రధాన పాత్రలను తీర్చిదిద్దిన విధానంపై అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సైఫ్ అలీఖాన్ పోషించిన రావణాసూరుడు పాత్రపై ఎన్నో వివాదాలు వచ్చాయి. రామాయణ ఇతిహాసాన్ని అపహాస్యం చేసేలా చిత్రాన్ని తెరకెక్కించారని ఓ వర్గం మండిపడింది. తాజాగా ‘రామాయణ్’ సీరియల్లో సీతగా నటించిన దీపికా చిఖ్లియా కూడా ‘ఆదిపురుష్’సినిమాపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ సినిమాలో రావణుడిని వీధి రౌడీలా చూపించారని మండిపడ్డారు. ‘ఆదిపురుష్ సినిమా చూసి నేటి తరం పిల్లలు రామాయణం అంటే ఇలానే ఉంటుందని భావించే అవకాశం ఉంది. అది భవిష్యత్తుకే ప్రమాదకరం. ఇందులో చూపించినట్లుగా రావణుడు మరీ అంత చెడ్డవాడు కాదు. ఆయన గొప్ప శివ భక్తుడు. ఆయనలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. మాంసాహారం తినడు. సీతాదేవిని అపహరించడమే ఆయన చేసిన పెద్ద తప్పు. సీతాదేవి కూడా అలా ఉండదు. ఈ సినిమాలో చూపించినట్లుగా రావణుడు ఉండడని పిల్లలకు ఎవరూ వివరించడం లేదు. నేను ఈ సినిమాను థియేటర్లో చూడలేదు. టీవీలో కొంచెం చూడగానే నచ్చలేదు. సృజనాత్మకంగా ఏదో కొత్తగా చూపించాలనే తాపత్రయంలో రామాయణం గొప్పతనాన్ని తగ్గించేస్తున్నారు’ అని దీపికా చిఖ్లియా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతీశెట్టి సీతగా నటించారు. -
నా భర్త అలా ఉంటే చాలు.. ఇంకేం అక్కర్లేదు: కృతి సనన్
ఒంటరిగా ఉన్న హీరోయిన్లు చాలామంది గత కొన్నాళ్లలో పెళ్లి చేసేసుకుంటున్నారు. ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసి, వివాహ బంధంలోకి అడుగుపెట్టేస్తున్నారు. మరికొందరు అందుకు తగ్గ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. అలా ఇప్పుడు కృతి సనన్ కూడా పెళ్లికి రెడీ అయిపోయినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే కాబోయే భర్త ఎలా ఉండాలో హింట్స్ కూడా ఇచ్చేస్తోంది. ఈ మధ్య ఈమె లండన్‌కి చెందిన కబీర్ బహియాతో అనే వ్యాపారవేత్తతో కలిసి కనిపించడంతో ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ముఖానికి సర్జరీ చేసుకుని షాకిచ్చిన యువ నటి.. ఫొటో వైరల్)'ఏ విషయంలోనైనా మనం ఆశ పెట్టుకుంటే ఒత్తిడితో ఇబ్బంది పడతాం. అందుకే నేను ఎలాంటి ఆశ పెట్టుకోను. ఏం జరిగినా సరే తీసుకోవడానికి రెడీగా ఉంటాను. ఇకపోతే నాకు కాబోయే భర్త నాతో నిజాయతీగా ఉండాలి. నన్ను నవ్వించాలి. నన్ను, నా పనిని గౌరవించాలి. నాతో ఎక్కువ టైమ్ గడపాలి. అన్నింటికి ముఖ్యమైంది నన్ను బాగా చూసుకోవాలి. అలా అని నాతో సరితూగాలనే కోరిక అయితే లేదు' అని కృతి సనన్.. కాబోయే వాడి గురించి చెప్పుకొచ్చింది.కృతి చెప్పిన దానిబట్టి చూస్తుంటే త్వరలో పెళ్లి చేసుకునేలా కనిపిస్తుంది. మరి లండన్ వ్యాపారవేత్తతో ఏడడుగులు వేస్తుందా? లేదంటే ఈమె మనసులో మరెవరైనా ఉన్నారా అనేది క్లారిటీ రావాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. 'ది క్రూ' మూవీతో ఈ మధ్య హిట్ కొట్టింది. ప్రస్తుతం హీరోయిన్ కమ్ నిర్మాతగా 'దో పత్తీ' మూవీ చేస్తోంది. (ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్‌కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?) -
Sri Rama Navami 2024: వెండితెర శ్రీరామచంద్రులు వీరే
శ్రీరాముడితో తెలుగు తెరకు మంచి అనుబంధమే ఉంది. ఇప్పటికే రాముడు, రామాయణంపై పదుల సంఖ్యల్లో సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ మొదలు ప్రభాస్ వరకు పలువురు స్టార్ హీరోలు రాముడి పాత్రలు పోషించి మెప్పించారు. రేపు(ఏప్రిల్ 17) శ్రీరామనమవి. ఈ సందర్భంగా రామాయణం నేపథ్యంలో వచ్చిన సినిమాలు, రాముడిగా మెప్పించిన హీరోలపై ఓ లుక్కేయండి. ♦తొలిసారి టాలీవుడ్ తెరపై రాముడి పాత్ర పోషించింది యడవల్లి సూర్య నారాయణ. ‘పాదుకా పట్టాభిషేకం’సినిమాలో సూర్యనారాయణ రాముడిగా నటించాడు. బాదామి సర్వోత్తం దర్శకత్వం వహించిన ఈ సినిమా 1932లో విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగులో వచ్చిన రెండో టాకీ మూవీ ఇది. ఇదే టైటిల్‌తో 1945లో మరో సినిమా తెరకెక్కింది. ఇందులో సి.ఎస్.ఆర్ ఆంజనేయులు రాముడిగా నటించి మెప్పించారు ♦ ఆ తర్వాత 1944లో వచ్చిన శ్రీ సీతారామ జననం సినిమాలో ఏఎన్నార్ శ్రీరాముడి పాత్ర పోషించి ప్రేక్షకుల మనసును దోసుకున్నాడు. ♦ శ్రీరాముడు పాత్రను ఎంతమంది పోషించినా.. అందరికి గుర్తిండేది మాత్రం ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. వెండితెర రాముడు అనగానే అందరికి గుర్తొచ్చే రూపం ఎన్టీఆర్. 1959లో విడుదలైన సంపూర్ణ రామాయణంతో తొలిసారి రాముడు గెటప్‌లో కనిపించాడు ఎన్టీఆర్. ఆత ర్వాత లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్దం సినిమాల్లో కూడా రాముడిగా కనిపించి మెప్పించాడు. ♦ఎన్టీఆర్ రాముడిగా నటించడమే కాదు.. రామాయణం నేపథ్యంతో వచ్చిన చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన దర్శకుడిగా ‘శ్రీరామ కల్యాణం’, శ్రీరామ పట్టాభిషేకం సినిమాలు చేశాడు. శ్రీరామ పట్టాభిషేకంలో ఆయనే శ్రీరాముడి పాత్రలో కనిపిస్తే.. సీతారామ కల్యాణంలో మాత్రం హరనాథ్ రాముడి గెటప్ వేశాడు. ♦ 1968లో వచ్చిన ‘వీరాంజనేయ’ సినిమాలో కాంతారావు రాముడిగా కనిపించాడు. 1976లో దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘సీతా కల్యాణం’లో రవికుమార్ రాముడిగా నటించి ఆకట్టుకున్నాడు. ♦ టాలీవుడ్ సొగ్గాడు శోభన్ బాబు కూడా రాముడి గెటప్‌లో ఆకట్టుకున్నాడు. బాపు దర్శకత్వంలోనే 1971లో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’లో టాలీవుడ్ సోగ్గాడు శోభన్‌బాబు రాముడి పాత్రలో నటించి మెప్పించారు. ♦ 1997లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాల రామాయణం’లో జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా కనిపించాడు. ఈ చిత్రం నేషనల్ అవార్డుని కూడా అందుకోవడం విశేషం. ♦ నాగార్జున నటించిన ‘శ్రీ రామదాసు’ సినిమాలో సుమన్ రాముడిగా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. ♦ కోడిరామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన దేవుళ్లు’ సినిమాలో ఒక పాటలో శ్రీకాంత్ కాసేపు రాముడిగా కనిపించి అలరించాడు. ♦ నందమూరి బాలకృష్ణ సైతంగా రాముడిగా నటించి మెప్పించాడు. బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం సినిమాలో బాలయ్య ఎన్టీఆర్ పాత్రను పోషించాడు. 2011లో వచ్చిన ఈ చిత్రంలో నయనతార సీతాగా నటించింది. ♦శ్రీరామ రాజ్యం తర్వాత చాలా కాలంపాటు రామాయణం, రాముడి నేపథ్యంలో సినిమాలు రాలేదు. దాదాపు 12 ఏళ్ల తర్వాత రామాయణం నేపథ్యంలో వచ్చిన ‘ఆదిపురుష్’చిత్రంలో ప్రభాస్ రాముడిగా మళ్లీ తెలుగు తెరపై మెరిశాడు.ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామాయణానికి ఆధునిక టెక్నాలజీతో రూపొందించారు. -
ప్రభాస్ ఆదిపురుష్‌పై ట్రోల్స్.. డైరెక్టర్‌ను భయపెట్టారు: నటుడు కామెంట్స్!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరెకెక్కించిన ఈ చిత్రం గతేడాది రిలీజైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపర్చింది. రామాయణాన్ని ఇప్పటి సినీ ప్రియులకు అనుగుణంగా తెరకెక్కించడంలో ఓం రౌత్ సక్సెస్ కాలేకపోయారు. దీంతో ఆదిపురుష్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. తాజాగా ఈ మూవీపై వచ్చిన విమర్శలపై ఆదిపురుష్ నటుడు బిజయ్ ఆనంద్ స్పందించారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కళను విమర్శించడం సరికాదని హితవు పలికారు. సినిమా నచ్చకపోతే చూడటం మానేయాలి కానీ..నటీనటులను, చిత్రబృందాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. బిజయ్ ఆనంద్ మాట్లాడుతూ..'మీకు సినిమా నచ్చకపోతే చూడటం మానేయండి. అంతే నటీనటులను విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఒక సినిమా తీయాలంటే అందులో ఎంత కష్టం ఉంటుందో అందరికీ తెలుసు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీయడం అంటే మాటలు కాదు. మీకు నచ్చితేనే సినిమా చూడండి. కొంతమంది కళాకారులను భయపెట్టాలని చూస్తున్నారు. కానీ ఓం రౌత్ అలాంటి భయపడలేదు. ట్రోల్స్ పట్టించుకోకుండా ధైర్యంగా ఉన్నాడు. అందుకే అతను నాకు ఇష్టం' అని అన్నారు. తాజాగా బిజయ్ ఆనంద్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. కాగా.. బిజయ్ ఆనంద్ ఆదిపురుష్ చిత్రంలో బ్రహ్మ పాత్రలో కనిపించారు. తాజాగా విడుదలైన బడే మియాన్ చోటే మియాన్ సినిమా ప్రమోషన్స్‌లో ఈ కామెంట్స్ చేశారు. -
కోట్లు విలువ చేసే కారు కొన్న 'ఆదిపురుష్' రైటర్.. రేటు ఎంతో తెలుసా?
ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా గురించి చెప్పగానే చాలామంది ఫ్యాన్స్ భయపడిపోతారు. ఎందుకంటే రామాయణం పేరు చెప్పి విచిత్రమైన సీన్స్ అన్నీ తీశారు. ఈ విషయంలో దర్శకుడు ఓం రౌత్ ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు. అలానే ఇదే సినిమాకు రచయితగా చేసిన మనోజ్ ముంతాషిర్ అనే వ్యక్తిపై కూడా అప్పట్లో దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు మరోసారి సదరు మనోజ్ వార్తల్లో నిలిచాడు. ఎందుకో తెలుసా? (ఇదీ చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో చరణ్‌ని అవమానించిన షారుక్.. షాకింగ్ పోస్ట్) బాలీవుడ్‌లోని టాప్ రైటర్స్‌లో మనోజ్ ముంతాషిర్ ఒకరు. 'తేరే మిట్టి', 'గల్లియన్', 'కౌన్ తుజే' లాంటి కల్ట్ సాంగ్స్ రాసింది ఈయనే. అలానే 'బాహుబలి' హిందీ వెర్షన్ కోసం కూడా ఈయన పనిచేశారు. కానీ ఎప్పుడైతే 'ఆదిపురుష్' సినిమాలో హనుమంతుడి పాత్రకు వింత డైలాగ్స్ రాశారో.. ప్రేక్షకులు ఈయన్ని ఓ రేంజులో ఆడుకున్నారు. అప్పట్లో కొన్ని నెలల పాటు ఈయనపై ట్రోలింగ్ జరిగింది. దీంతో జనాలు ఈయన్ని దాదాపుగా మార్చిపోయారు. అలాంటిది రైటర్ మనోజ్ ముంతాషిర్.. తాజాగా ఖరీదైన మెర్సిడెజ్ మేబ్యాచ్ ఎస్-క్లాస్ బెంజ్ కారు కొనుగోలు చేశారు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.2.71 కోట్లు వరకు ఉంటుందని టాక్. మిగతా ఖర్చులన్నీ కలిపి చూసుకుంటే దాదాపు రూ.3 కోట్ల విలువైన కారు అనుకోవచ్చు. బాలీవుడ్లో అనిల్ కపూర్, షాహిద్ కపూర్, కంగనా రనౌత్, కియారా అడ్వాణీ, ప్రియాంక చోప్రా లాంటి టాప్ స్టార్స్ మాత్రమే ఈ కారుని ఉపయోగిస్తున్నారు. అలాంటిది రైటర్ మనోజ్ దీన్ని కొనుగోలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: ఆ మూడు సినిమాలే నా కెరీర్‌ని మలుపు తిప్పాయి: మహేశ్ బాబు) -
అట్టర్ ఫ్లాప్‌గా ఆదిపురుష్.. ఎట్టకేలకు స్పందించిన బాలీవుడ్ స్టార్
సినిమా జయాపజయాలను ముందుగా ఊహించడం కష్టం. ఫలానా కథతో సినిమా తీస్తే ఆడుతుంది, ఫలానా కథతో సినిమా తీస్తే ఆడదు అని ముందే పసిగడితే ఇండస్ట్రీలో ఫ్లాపులెందుకు ఉంటాయి? అలా అని తీసుకున్న కథ ఒక్కటి బాగుంటే సరిపోదు.. దాన్ని తెరకెక్కించే విధానం, ప్రేక్షకులను ఆకర్షించేలా తీర్చిదిద్దగలిగే టాలెంట్ ఉండాలి. ఇది లేకపోవడం వల్లే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆదిపురుష్ అతి ఘోరమైన అపజయాన్ని మూటగట్టుకుంది. ఏడు నెలల తర్వాత పెదవి విప్పిన నటుడు గతేడాది జూన్ 16న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్లాప్ టాక్ రావడంతో ఎవరూ పెద్దగా మీడియా ముందుకు రాలేదు. దాదాపు ఏడు నెలల తర్వాత తొలిసారి ఈ సినిమా ఫెయిల్యూర్‌పై స్పందించాడు సైఫ్ అలీ ఖాన్. ఇతడు ఆదిపురుష్‌లో లంకేశ్ (రావణుడు)గా నటించాడు. ఇతడి లుక్‌పై విపరీతమైన ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే! సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. 'ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నదాన్ని నేను బలంగా నమ్ముతాను. నన్ను నేను స్టార్ అని ఎన్నడూ ఫీలవలేదు. నా పేరెంట్స్ పెద్ద స్టార్స్.. కానీ సింప్లిసిటీకే ఓటేసేవారు. వాస్తవంలో బతకాలి.. నేను కూడా వాస్తవంలోనే బతకాలనుకున్నాను. ఓటముల గురించి భయపడిపోను. ఆదిపురుష్నే ఉదాహరణగా తీసుకుందాం. కొన్నిసార్లు రిస్కు చేయాలి.. ఓటమిని తీసుకోగలగాలి. జీవితమన్నాక అన్నీ ఉండాలి. ఓటమితో బాధపడి ముడుచుకుపోకూడదు. మనం మనవంతు ప్రయత్నించాం, దురదృష్టం కొద్దీ వర్కవుట్ కాలేదు. నెక్స్ట్ సినిమాకు చూసుకుందాంలే అని ధైర్యంగా ముందుకు సాగిపోవాలి! నేను అదే చేశాను' అని సైఫ్ అలీ ఖాన్ చెప్పుకొచ్చాడు. చదవండి: ఓటీటీలో బేబి హీరో కొత్త సినిమా.. సైలెంట్‌గా స్ట్రీమింగ్.. -
ఆదిపురుష్..కొన్ని సీన్స్ నచ్చలేదు: ప్రశాంత్ వర్మ
ఆదిపురుష్ సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగా నచ్చాయి. మరికొన్ని అంతగా ఆకట్టుకోలేదని, తానైనే వాటిని మరింత అద్భుతంగా తీర్చిదిద్దేవాడినని ‘హనుమాన్’దర్శకుడు ప్రశాంత్ వర్మ అన్నాడు. తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆదిపురుష్‌లో కొన్ని సీన్స్‌ని చూసి ఆశ్చర్యపోయాను. అద్భుతంగా తెరకెక్కించారు. అయితే..కొన్ని సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. నేనే గనుక ఆ సినిమా తీసి ఉంటే.. ఆ సన్నివేశాలను బాగా చేసేవాడిని కదా అనిపించింది. నాకే కాదు.. ఏ ఫిల్మ్ మేకర్‌కి అయినా అలాంటి భావన కలుగుతుంది. ఆ సినిమా ఫలితం నాపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. నా టీమ్ సపోర్ట్‌ని ‘హను-మాన్’ని అనుకున్న విధంగా తీర్చిదిద్దగలిగాం’అని ప్రశాంత్ వర్మ అన్నారు. (ఇదీ చదవండి: స్టార్ హీరో కొత్త సినిమా.. తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానుందా?) హను-మాన్’విషయాకొస్తే.. తేజా సజ్జా, అమృతా అయ్యర్ జంటగా నటించిన చిత్రమిది. వరలక్ష్మీ శరత్‌కుమార్, వినయ్‌రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలైన ఈ చిత్రం.. తొలి రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 250 కోట్ల వరకు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక వచ్చే ఏడాది ఈ సినిమాకు సీక్వెల్ ‘జై హనుమాన్’ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ ఆ సినిమా పనులను ప్రారంభించారు. ఓ స్టార్ హీరో ఇందులో నటించబోతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్ నన్ను కావాలనే కొట్టింది.. బాడీపై 30 చోట్ల గాయాలు: శ్రద్ధా దాస్) -
'డంకీ' ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంత తక్కువా..? సలార్‌కు లైన్ క్లియర్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. పఠాన్, జవాన్ సినిమాలతో ఈ ఏడాది రెండు భారీ బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు. తాజాగా డిసెంబర్ 21న 'డంకీ'తో వచ్చేశాడు. రాజ్‌కుమార్ హిరానీ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ పట్ల పాజిటివ్ టాక్ ఉన్నా.. ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే అలరిస్తుందని టాక్ వినిపిస్తుంది. భారీ అంచనాలతో విడుదలైన డంకీ చిత్రం మొదటిరోజు ఆశించిన కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ ఏడాదిలో వచ్చిన పఠాన్, జవాన్ చిత్రాల మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్‌ను డంకీ దాటలేకపోయింది. సినిమా ట్రేడ్ వర్గాల ప్రకారం డంకీ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసులు చేసింది. నెట్ కలెక్షన్స్ ప్రకారం అయితే రూ. 30 కోట్లు అని చెప్పవచ్చు. అయితే ఈ ఏడాదిలో వచ్చిన పఠాన్ మొదటిరోజు రూ. 106 కోట్లు కలెక్ట్ చేయగా జవాన్ రూ. 129 కోట్లు రాబట్టింది. రెండు వరుస భారీ హిట్లు కొట్టిన తర్వాత వచ్చిన చిత్రం డంకీ... దీంతో ఈ సినిమా రూ. 130 కోట్ల మార్క్‌ను దాటుతుందని అందరూ అంచనా వేశారు. డంకీ చిత్రం మేకర్స్ అధికారికంగా కలెక్షన్స్ వివరాలు ప్రకటించలేదు. ప్రభాస్ ప్లాప్ సినిమాను దాటలేకపోయిన 'డంకీ' ప్రభాస్ ప్లాప్ సినిమా అయిన ఆదిపురుష్ చిత్రం కంటే డంకీ మూవీకి కలెక్షన్స్ తక్కువ వచ్చాయి. ఆదిపురుష్ సినిమా మొదటి రోజు 140 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నెట్ కలెక్షన్స్ ప్రకారం అయితే రూ. 37 కోట్లు. బాలీవుడ్లో మొదటిరోజు వచ్చిన టాప్ కలెక్షన్స్ లిస్ట్‌లో డంకీ చిత్రం 7వ స్థానంలో ఉంది. ఈ లెక్కన చూస్తే ప్రభాస్ సలార్‌తో భారీ రికార్డ్స్ కొట్టడం ఖాయం అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు డంకీ మూవీకి చెప్పుకోతగిన టాక్ రాలేదు. రాజ్ కుమార్ హిరానీ కేరీర్‌లోనే వీకెస్ట్ సినిమాగా డంకి పేరు తెచ్చుకుంది. అసలే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా వెనుకబడింది. సలార్ మాత్రం 33 లక్షల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడపోయాయని సమాచారం. సలార్‌తో ప్రభాస్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం. -
ఆదిపురుష్ కి రికార్డు స్థాయిలో TRP
-
ఆదిపురుష్‌కు పని చేయడమే నేను చేసిన పెద్ద తప్పు: రచయిత
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్ చిత్రాల్లో ఆదిపురుష్ ఒకటి. ఈ సినిమాకు వచ్చినన్ని విమర్శలు ప్రభాస్ నటించిన మరే చిత్రానికీ రాలేదు. ఆ రేంజ్లో ఈ మూవీపై ట్రోలింగ్ జరిగింది. సినిమాలో నటీనటుల గెటప్స్, డైలాగ్స్ దగ్గరినుంచి విజువల్ ఎఫెక్ట్స్ వరకు అన్నింటి మీదా విమర్శలు వచ్చాయి. ఈ సినిమాకు సంభాషణల రచయితగా పని చేసిన మనోజ్ ముంతషీర్ మీదైతే లెక్కలేనంత ట్రోల్ జరిగింది. ఆయన రాసిన ఓ డైలాగ్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో దాన్ని మార్చేసి ప్రేక్షకులకు సారీ కూడా చెప్పాడు. వాళ్లకు నేను ఎప్పటికీ హీరోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆదిపురుష్ వల్ల ఎదురైన ఇబ్బందులు పేర్కొన్నాడు. 'ఈ ప్రపంచం ఓ రోజు మనల్ని మంచివాడిగా చూస్తుంది. మరో రోజు చెడ్డవాడిగా చూస్తుంది. కానీ మన కుటుంబానికి మాత్రం మనం ఎప్పటికీ హీరోనే! నేనొక తప్పు చేశాను.. ఆదిపురుష్ సినిమాకు రచయితగా పనిచేసి చాలా పెద్ద తప్పు చేశాను. కానీ దాని నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇక నుంచి ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తాను. సెకండ్ ఛాన్స్ కావాలి ఆ సినిమా రిలీజయ్యాక వచ్చిన విమర్శలపై స్పందించకుండా ఉంటే బాగుండేది. అప్పటికే జనాలు నామీద కోసంతో ఊగిపోతున్నారు. అలాంటప్పుడు సంయమనంతో సైలెంట్‌గా ఉంటే అయిపోయేది. కానీ నన్ను ఇంకా ద్వేషించారు. చంపుతామని బెదిరించారు. అప్పుడు నేను విదేశాలకు వెళ్లిపోయి ఆ వివాదం సద్దుమణిగేంతవరకు అక్కడే ఉన్నాను. ఇక ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలకు పని చేసిన నాకు సెకండ్ ఛాన్స్ కావాలి. బాహుబలి హిందీ డబ్బింగ్‌తో పాటు తేరి మిట్టీ, దేశ్ మేరే వంటి ఎన్నో చిత్రాలకు రచయితగా పని చేశాను. అసలు నా పాటలు మోగకుండా రామనవమి, దీపావళి, దసరా పండగలే జరగవని నేను సగర్వంగా చెప్పగలను' అని చెప్పుకొచ్చాడు మనోజ్ ముంతషీర్. చదవండి: తినడానికి తిండి లేని రోజులు.. కన్నీళ్లు పెట్టుకున్న శోభ తల్లి -
హిట్ కొట్టినా... 'ఆదిపురుష్'ని దాటలేకపోయిన 'జవాన్'
బాద్షా షారుక్ ఖాన్ మరో హిట్ కొట్టేశాడు. 'జవాన్'తో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం వస్తున్న టాక్, కలెక్షన్స్ చూస్తుంటే.. మరో రూ.1000 కోట్ల పక్కా అనిపిస్తుంది. ఈ ఏడాది 'పఠాన్'తో దుమ్ములేపాడు. ఇప్పుడు మరోసారి రచ్చ చేస్తున్నాడు. అంతా బాగానే ఉంది కానీ ఓ విషయంలో 'జవాన్', ప్రభాస్ 'ఆదిపురుష్'ని మాత్రం దాటలేకపోయింది. కింగ్ ఖాన్ షారుక్ దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత.. ఈ ఏడాది 'పఠాన్'తో బ్లాక్‌బస్టర్ కొట్టాడు. ఇప్పుడు 'జవాన్'తో సూపర్‌హిట్ కొట్టేశాడు. తమిళ దర్శకుడు అట్లీ తీసిన ఈ చిత్రంలో కథ కొత్తగా లేనప్పటికీ.. స్రీన్ ప్లే రేసీగా ఉండటం, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయే రేంజులో ఉండేసరికి జనాలకు సినిమా నచ్చేసింది. దీంతో తొలిరోజు ఏకంగా రూ.129.6 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: ఓటీటీలో రిలీజైన సూపర్‌హిట్ సినిమా.. కానీ?) అయితే హిట్‌తో షారుక్ ఖాన్.. తొలిరోజు అద్భుతమైన వసూళ్లు సాధించి ఉండొచ్చు. కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ లో ప్రభాస్ ని మాత్రం దాటలేకపోయాడు. ఎందుకంటే ఈ ఏడాది జూన్ లో రిలీజైన 'ఆదిపురుష్' చిత్రానికి తొలిరోజు రూ.136.84 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే దేశవ్యాప్తంగా ఫస్ట్ డే కలెక్షన్స్ లో ప్రభాస్ టాప్ లో ఉన్నట్లే. మరి డార్లింగ్ హీరోని బీట్ చేయాలంటే మళ్లీ 'సలార్' రావాలేమో? 'జవాన్' కథేంటి? భారత్-చైనా సరిహద్దుల్లోని నదిలో గాయాలతో ఉన్న ఓ వ్యక్తి కొట్టుకొస్తాడు. కట్ చేస్తే ముంబయిలో విక్రమ్ రాథోడ్ (షారుక్ ఖాన్).. ఆరుగురు అమ్మాయిలతో కలిసి మెట్రో ట్రైన్‌ని హైజాక్ చేస్తాడు. ప్రయాణికుల్ని విడిచిపెట్టాలంటే రూ.40 వేల కోట్లు కావాలని అంటాడు. అనుకున్నది సాధిస్తాడు కూడా. ఇంతకీ విక్రమ్ రాథోడ్ ఎవరు? జైలర్‌గా పనిచేస్తున్న ఆజాద్‌తో ఇతడికి సంబంధం ఏంటనేదే 'జవాన్' స్టోరీ. (ఇదీ చదవండి: 'జవాన్' మూవీ రివ్యూ) God is so kind Thank you everyone Thank you for the Massy-ive love ❤ Book your tickets now!https://t.co/uO9YicOXAI Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/q1TdI37nJZ — atlee (@Atlee_dir) September 8, 2023 Top 5 Openers WW Box Office[2023]#Adipurush - ₹ 136.84 cr#Jawan - ₹ 125.05 cr#Pathaan - ₹ 106 cr#Jailer - ₹ 95.78 cr#PonniyinSelvan2 - ₹ 61.53 cr — Manobala Vijayabalan (@ManobalaV) September 8, 2023 -
అంత జరిగినా కూడా నేను వెనుకడుగు వేయలేదు: కృతిసనన్
సినిమా రంగంలో రాణించడానికి ప్రతిభ ఉంటే చాలదు. కృషి, శ్రమ, అన్నింటికీ మించి అదృష్టం చాలా ముఖ్యం. అయినా ఒక్కోమెట్టు ఎక్కాలంటే ఎన్నో అవమానాలను, చేదు అనుభవాలు ఎదుర్కోకతప్పదు. ముఖ్యంగా హీరోయిన్లు ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటుంటారు. బాలీవుడ్ నటి కృతిసనన్ ఇలాంటి అవమానాలను ఎదుర్కొందట. దక్షిణాది చిత్రాల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపే ఈ బాలీవుడ్ బ్యూటీ ఇంతకుముందే తెలుగులో మహేష్‌బాబు సరసన నేనొక్కడినే చిత్రంలో నటించింది. (ఇదీ చదవండి: Jawan Review: 'జవాన్' మూవీ రివ్యూ) ఇటీవల ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ఆదిపురుష్ చిత్రంలో సీతగా నటించింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో కృతిసనన్‌కు పెద్దగా గుర్తింపు రాకపోయినా ఈమె హిందీలో నటించిన 'మిమి' చిత్రానికిగాను జాతీయ ఉత్తమ నటి అవార్డును తెచ్చిపెట్టింది. అలాంటి నటి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన తొలి రోజులను గుర్తు చేసుకుంది. మొదట్లో మోడల్‌గా చేస్తూనే నటిగా అవకాశాల కోసం ప్రయత్నించానని చెప్పింది. ఇందుకు చాలా అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పింది. 'చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఒక డాన్స్ సన్నివేశంలో నేను పొరపాటు చేయడం వల్ల నృత్య దర్శకుడు చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.. ఒక ఫామ్‌హౌస్‌లో షూట్. ఆ ప్రాంతమంతా గడ్డితో పాటు తేమగా ఉంది. అందువల్ల నా హీల్స్ ఆ గడ్డిలో చిక్కుకుపోయాయి. డ్యాన్స్‌లో సరైన మూమెంట్ రాలేదు. దీంతో డ్యాన్స్ మాస్టర్ ఫైర్ కావడమే కాకుండా చెత్తగా మాట్లాడాడు. ఆ సమయంలో సుమారు 50 మంది మోడల్స్ అక్కడ ఉన్నారు. అలాగని తాను వెనుకడుగు వేయలేదు.' అని నటిగా తన పయనాన్ని పట్టుదలతో కొనసాగించానని పేర్కొంది. ఆ తరువాత ఆ డానన్స్ మాస్టర్‌తో కలిసి పనిచేసినట్లు చెప్పింది. -
చంద్రయాన్-3 విజయంతో మళ్లీ తెరపైకి వచ్చిన ఆదిపురుష్
ప్రభాస్- కృతి సనన్ నటించిన ఆదిపురుష్ భారీ డిజాస్టర్‌తో పాటు ఆ సినిమాపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఒక రకంగా ప్రభాస్ నటించిన ఏ సినిమాకు ఇంతలా వ్యతిరేఖత రాలేదనే చెప్పాలి. తాజాగ చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయింది. చంద్రమండలంపై భారత్ అడుగుపెట్టింది. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ సినిమా పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. (ఇదీ చదవండి: చంద్రయాన్-3 పై సినిమా.. ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోనే) చంద్రయాన్-3 కోసం రూ.615 కోట్ల బడ్జెట్ మాత్రమే ఖర్చు అయింది. కానీ 'ఆదిపురుష్' కోసం రూ.700 కోట్లు ఖర్చు పెట్టి ఏం సాధించారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ లెక్కన 'ఆదిపురుష్' కంటే తక్కువ ఖర్చుతో ఇస్రో శాస్త్రవేత్తలు భారతీయ జెండాను చంద్రమండలంపై సగర్వంగా ఎగురవేశారని చెప్పవచ్చు. ఆదిపురుష్ లాంటి చెత్త సినిమాలు తీయకుండా దేశానికి ఉపయోగపడే పనులకు ఖర్చుపెడితే బాగుంటుందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వివిధ సినిమాలకు సంబంధించిన ప్రాజెక్టుల వ్యయాలతో చంద్రయాన్-3 బడ్జెట్‌ను నెటిజన్లు పోలుస్తూ... ఇస్రోను ప్రశంసిస్తున్నారు. హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ కూడా 'ఓపెన్‌హైమర్' సినిమా కోసం రూ. 800 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. అణుబాంబు సృష్టికర్త జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇదే దర్శకుడు సుమారు పదేళ్ల కిందటే ఇంటర్స్టెల్లార్ అంతరిక్షం కాన్సెప్ట్‌తో వచ్చిన సనిమా కోసం ఏకంగా రూ.1350 కోట్లు ఖర్చుబెట్టాడు. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆదిపురుష్, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రభాస్ రాఘవుడిగా నటించిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా టీజర్, పోస్టర్లు రిలీజ్ చేసినప్పుడే అభిమానులు డౌట్ పడ్డారు. ఎక్కడో తేడా కొడుతోంది, అసలీ చిత్రం వర్కవుట్ అవుతుందా? అని అనుమానించారు. అసలు వందల కోట్లు గుమ్మరించి ఇంత పేలవంగా, నిర్లక్ష్యంగా సినిమా తీస్తున్నారేంటని ఆగ్రహం సైతం వ్యక్తం చేశారు. దీంతో ఓం రౌత్ మరింత టైం తీసుకుని ఈసారి కాస్త మెరుగ్గా టీజర్ విడుదల చేశాడు. పర్వాలేదు, సినిమాలో బాగానే మార్పులుచేర్పులు చేశారు అనుకున్నారంతా! జూన్ 16న సినిమా రిలీజవగా థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులు బిక్కమొహం వేశారు. ఇంకా ఎడిట్ చేయాల్సింది చాలా ఉందని, అసలు ఇప్పటివరకు వెండితెరపై రామాయణం చూసినవారికి, ఆ కథలు విన్నవారికి ఈ సినిమా ఏమాత్రం నచ్చదని తేల్చేశారు. ఫలితంగా సినిమా రిలీజైన మొదటి షో నుంచే నెగెటివిటీ పెరిగింది. ఆదిపురుష్‌కు దెబ్బ పడింది. దాదాపు రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఎన్నో విమర్శలు, వివాదాలను దాటుకుని ఆ మాత్రం రాబట్టిన ఈ సినిమా తాజాగా ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఆదిపురుష్ ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో రూ.150-200 కోట్లు పెట్టి మరీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డ ఈ సినిమాకు ఓటీటీలో స్పందన ఎలా ఉంటుందో చూడాలి! చదవండి: -
'కల్కి' టీమ్ ముందు జాగ్రత్త.. దానికి భయపడి!
జీవితంలో రెండో ఛాన్స్ ఉంటుందేమో గానీ సినిమాల్లో ఉండదు. అందుకే తీస్తున్నప్పుడు సరిగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. లేదంటే ఘోరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మధ్య అలా 'ఆదిపురుష్' విషయంలో జరిగింది. దర్శకుడు ఓం రౌత్‌ని అయితే ప్రతి ఒక్కరూ ట్రోల్ చేశారు. బండబూతులు తిట్టారు. దీంతో ప్రభాస్ 'కల్కి' జాగ్రత్త పడింది. అలా జరగకూడదని ముందే డిసైడ్ అయి ఓ పని చేసింది. డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'కల్కి 2898 AD'. ప్రాజెక్ట్ k అనే వర్కింగ్ టైటిల్‌తో మొన్నటివరకు నడిపించారు. కొన్నిరోజుల ముందు అమెరికాలో జరిగిన కామికాన్ ఫెస్ట్‌లో టైటిల్ పోస్టర్, గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేశారు. అయితే ప్రభాస్ ఫస్ట్ లుక్‌పై బోలెడన్ని విమర్శలు రాగా, గ్లింప్స్ మాత్రం బాగానే అనిపించింది. ఇప్పుడు వీటన్నింటిపై వచ్చిన రివ్యూలని చిత్రబృందం పరిశీలిస్తోంది. (ఇదీ చదవండి: ధోనీ తొలి సినిమా టాక్ ఏంటి? హిట్టా ఫట్టా?) ఇందులో భాగంగా గ్లింప్స్ వీడియోలో గ్రాఫిక్స్‌పై ఎలాంటి రివ్యూలు వచ్చాయనేది దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా పరిశీలిస్తున్నాడు. ఆ ఫొటోని నిర్మాత ప్రియాంక దత్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. వీటిని బట్టి ముందు ముందు గ్రాఫిక్స్ ఎలా ఉండనేది జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం వల్ల 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్‌కి కౌంటర్లు పడుతున్నాయి. అదేంటి 'కల్కి' గ్లింప్స్ గ్రాఫిక్స్ రివ్యూలని చిత్రబృందం పరిశీలిస్తే.. ఓం రౌత్‌ని ఎందుకు తిడుతున్నారో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది సెప్టెంబరులో 'ఆదిపురుష్' టీజర్ విడుదల చేయగానే ప్రతి ఒక్కరూ దర్శకుడిని విమర్శించారు. గ్రాఫిక్స్ సరిచేసేందుకు మరో ఆరు నెలలు సమయం తీసుకున్నప్పటికీ పెద్దగా మార్పులేం చేయలేకపోయాడు. దీంతో సినిమా రిలీజైన తర్వాత ఆ తిట్లు తప్పలేదు. ఇలా తమ మూవీ విషయంలో తప్పు జరగకుండా 'కల్కి' టీమ్ ముందు జాగ్రత్త తీసుకోవడం మంచి పనే. (ఇదీ చదవండి: ప్రముఖ యాంకర్‌తో హైపర్ ఆది పెళ్లి ఫిక్స్!) -
ప్రభాస్ పై అభ్యంతకరంగా బాలీవుడ్ డైరెక్టర్ మాటలు దాడి
-
నన్ను చాలా భయపెట్టిన సినిమా ఇదే..!
-
రోజూ రాత్రి తాగొచ్చి తెల్లారి నటిస్తే నమ్ముతారా?: వివేక్ అగ్నిహోత్రి
పాన్ ఇండియా స్టార్ ట్యాగ్ వచ్చినప్పటినుంచి ప్రభాస్ ఆ రేంజ్లో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా అందుకోలేకపోతున్నాడు. బాహుబలి తర్వాత అతడు చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. భారీ బడ్జెట్‌తో వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ కూడా బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డాయి. అయితే రాధేశ్యామ్ రిలీజైన రోజు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కశ్మీర్ ఫైల్స్ సినిమా కూడా విడుదలైంది. రాధేశ్యామ్ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవగా చిన్న సినిమా కశ్మీర్ ఫైల్స్ మాత్రం పాజిటివ్ టాక్‌తో వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అప్పటి నుంచి బాలీవుడ్‌ను, బాలీవుడ్లో సినిమాలు చేస్తున్న ప్రభాస్పైనా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వస్తున్నాడు. తాజాగా మరోసారి డార్లింగ్ హీరో మీద, అతడు చేసిన ఆదిపురుష్ చిత్రంపైనా విరుచుకుపడ్డాడు. 'ప్రజల నమ్మకాలకు సంబంధించిన కథలను ఎంచుకున్నప్పుడు మీక్కూడా దానిపై విశ్వాసం ఉండాలి లేదంటే ఆ సబ్జెక్ట్‌లో ఎంతోకొంత ప్రావీణ్యం ఉండాలి. దురదృష్టవశాత్తూ భారత్‌లో ఎవరూ దాన్ని పట్టించుకోవట్లేదు. రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను పెద్ద పెద్ద స్టార్లతో కలిసి సినిమా చేయాలనుకుంటే అది అంత ఈజీగా పూర్తవదు. ఒకవేళ పూర్తి చేసినా అది సంపూర్ణంగా ఉండదు. ఈ పురాణాలు వేల సంవత్సరాలుగా అందరి మనసుల్లో ముద్రపడి ఉన్నాయంటే దానికున్న ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. (ఆదిపురుష్‌లో ప్రభాస్ రోల్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ..) కొందరు స్క్రీన్‌పై వచ్చి నేనే దేవుడిని అని చెప్తే నిజంగానే అతడు భగవంతుడయిపోతాడా? రోజూ రాత్రి ఇంటికి తాగి వచ్చి తెల్లారి నేను దేవుడిని, నన్ను నమ్మండి అని చెప్తే ఎవరూ నమ్మరు. జనాలేమీ పిచ్చోళ్లు కారుగా' అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. వివేక్ అగ్నిహోత్రి వ్యాఖ్యలు ప్రస్తుతం ఫిల్మీదునియాలో వైరల్‌గా మారాయి. చదవండి: పెళ్లయిన 8 ఏళ్లకు బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ.. కానీ కడుపులోనే ఛాన్స్ ఇవ్వమంటే అవమానించాడు: డైరెక్టర్ -
ఆదిపురుష్ డైరెక్టర్ పోస్ట్.. ఓ రేంజ్లో ఆడేసుకున్న నెటిజన్స్ !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 16న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సినీ ప్రియులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు సినీ ప్రముఖులు ఆదిపురుష్ చిత్రంపై విమర్శలు చేశారు. (ఇది చదవండి: ఎక్కడైనా సరే 'తగ్గేదేలే'.. ఐకాన్ స్టార్ అరుదైన రికార్డ్!) ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ రచయిత మనోజ్ ముంతశిర్ డైలాగ్స్ రాశారు. పలు వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన ఆదిపురుష్‌ను రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. కానీ అభిమానుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. అయితే సినిమా విడుదలై దాదాపుగా నెల రోజులు దాటి పోవడంతో ఓం రౌత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తెగ వైరలవుతోంది. తనకు ఇష్టమైన ఆలయాలను సందర్శించానని ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఓం రౌత్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'శ్రీ మంగేశి దేవాలయం, శ్రీ శాంతదుర్గ దేవాలయం దర్శనం చేసుకున్నా. ఇక్కడికి వచ్చిన తరచుగా నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటా. ఈ రెండు పవిత్ర స్థలాలు నన్ను నా మూలాలకు కనెక్ట్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ దేవాలయాలను దర్శించుకుని దీవెనలు పొందాలని నేను ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఉంటా.' అని పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేశారు. కొంతమంది రూ.600 కోట్లను ఆగం చేశావు కదా కామెంట్స్ చేయగా.. మరికొందరేమో అన్న నువ్వు ఇంకా బతికే ఉన్నావా? అంటూ పోస్టులు పెడుతున్నారు. మరొకరు రాస్తూ దయచేసి మీరు దేవుళ్లకు సంబంధించిన సినిమాలు తీయవద్దని సలహా ఇస్తున్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ లీక్.. దెబ్బకు 2 మిలియన్లకు పైగా వ్యూస్!) View this post on Instagram A post shared by Om Raut (@omraut) -
ఆదిపురుష్ 2 కి సిద్ధమైన ఓంరౌత్.. ప్రభాస్ రియాక్షన్..
-
'ఆదిపురుష్' కంటే 'చంద్రయాన్-3' బడ్జెట్ తక్కువ.. మీకు తెలుసా?
Chandrayaan 3 Budget: సాధారణంగా రాకెట్ తయారీ అనగానే వేల కోట్లు ఖర్చు అనే మాట వినిపిస్తుంది. నాసా దగ్గర నుంచి ఇస్రో వరకు ఎవరైనా సరే ఈ విషయాన్ని ఒప్పుకొంటారు. కరెక్ట్‌గా చెప్పాలంటే అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది తప్పితే తగ్గే సమస్య ఉండదు. తాజాగా ఇస్రో శాస్త్రవేత్తలు 'చంద్రయాన్ 3' ప్రయోగం చేశారు. ఇది జాబిలి దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరింది. అయితే దీని బడ్జెట్, 'ఆదిపురుష్' బడ్జెట్ కంటే తక్కువనే టాక్ హాట్ టాపిక్‌గా మారింది. (ఇదీ చదవండి: 'బేబి' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!) ప్రయోగం సక్సెస్ బాహుబలి రాకెట్ ఎల్వీఎం-3 ఉపగ్రహ వాహక నౌక ద్వారా చంద్రయాన్-3 ప్రయోగం.. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:35 గంటలకు జరిగింది. దీన్ని మన ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఎల్వీఎం-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. బడ్జెట్ తక్కువే సాధారణంగా ఉపగ్రహ ప్రయోగాలు వేల కోట్ల ఖర్చుతో కూడుకున్నదని అందరూ భావిస్తారు. ఇస్రో శాస్త్రవేత్తలు మాత్రం 'ఆదిపురుష్' సినిమాకు అయిన దాని కన్నా తక్కువ బడ్జెట్‌తోనే 'చంద్రయాన్ 3'ని రూపొందించారట. ప్రభాస్ సినిమా కోసం నిర్మాతలు దాదాపు రూ.700 కోట్ల వరకు పెడితే.. 'చంద్రయాన్ 3' కోసం కేవలం రూ.615 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలుస్తోంది. మేం చెప్పిన దానిపై నమ్మకం కుదరకపోతే గూగుల్ లో ఓసారి సెర్చ్ చేయండి. మీకే క్లారిటీ వచ్చేస్తుంది. Chandrayaan-3, India’s third lunar exploration mission takes off from Sriharikota,Andhra Pradesh. 🚀LVM3 Launch Vehicle Mk III takes the Chandrayaan-3 spacecraft to Geo Transfer Orbit (GTO). 🌝#Chandrayaan3 consists of an indigenous propulsion module, lander module, and a rover… pic.twitter.com/pbhxmZO0Eq — All India Radio News (@airnewsalerts) July 14, 2023 (ఇదీ చదవండి: Baby Movie Review: ‘బేబీ’ మూవీ రివ్యూ) -
'ఆదిపురుష్' దెబ్బకు ఇరకాటంలో ఆ సినిమా!
OMG 2 Movie Controversy: 'చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం' అని తెలుగులో ఓ సామెత ఉంది. మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు సెన్సార్ బోర్డ్ తీరు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే గత నెలలో రిలీజైన 'ఆదిపురుష్' విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు మరోసారి అలా జరగకుండా ముందే జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. దీంతో స్టార్ హీరో నటించిన ఓ సినిమా ఇరకాటంలో పడిందనిపిస్తుంది. అక్షయ్‌కి దెబ్బ మీద దెబ్బ బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్‌ది సెపరేట్ రూటు. వేరే ఎవరికీ సాధ్యం కాని విధంగా యమ ఫాస్ట్ గా సినిమాలు చేస్తుంటాడు. ఏడాదికి 5-6 మూవీస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే గత కొన్నాళ్లుగా ఇతడికి అస్సలు కలిసి రావడం లేదు. గతేడాది ఆరు సినిమాలు రిలీజ్ చేస్తే.. అన్నీ బోల్తా కొట్టాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే 'సెల్ఫీ' అని ఓ రీమేక్ తో వచ్చాడు కానీ ఘోరంగా ఫ్లాప్ అయింది. (ఇదీ చదవండి: పెళ్లి జీవితంపై సంగీత కామెంట్స్.. అప్పట్లో చాలా దారుణంగా!) దేవుడే రక్షించాలి ప్రస్తుతం అక్షయ్ కుమార్ చేస్తున్న సినిమా 'ఓ మై గాడ్ 2'. గతంలో వచ్చిన హిట్ చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో శివుడి పాత్రలో అక్షయ్ నటిస్తున్నాడు. తాజాగా టీజర్ విడుదల చేశారు. స్టోరీ ఏంటనేది పెద్దగా చూపించకుండా, కేవలం పాత్రల్ని పరిచయం చేశారంతే. ఈ సినిమా హిట్ అయితేనే అక్షయ్ కాస్తయినా కుదురుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే కష్టమే. కాంట్రవర్సీ కాన్సెప్ట్! ఈ మధ్యే రిలీజైన 'ఆదిపురుష్' విషయంలో సెన్సార్ బోర్డు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. హనుమాన్ డైలాగ్స్ వల్ల చాలామంది తిట్టారు. ఇప్పుడు 'ఓ మై గాడ్ 2'కి అలా జరగక ముందే సెన్సార్ బోర్డు కళ్లు తెరుచుకున్నట్లు తెలుస్తోంది. కథ విషయంలో అభ్యంతరం చెప్పడంతో పాటు రివిజన్ కమిటీ వద్దకు ఈ సినిమాను పంపిందట. టీజర్ లో చూపించినట్లు ఇది దేవుడి సినిమానే అయినప్పటికీ.. అసలు కాన్సెప్ట్ సెక్స్ ఎడ్యుకేషన్, ఎల్జీబీటీక్యూ(ట్రాన్స్‌జెండర్ బైసెక్సువల్ లెస్బియన్) అని తెలుస్తోంది. ఇప్పుడిది కాస్త కాంట్రవర్సీగా మారింది. ఆగస్టు 11న థియేటర్లలోకి రావాల్సి ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో ఏంటో? (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 19 మూవీస్) -
ఆదిపురుష్ మూవీ లీక్.. దెబ్బకు 2 మిలియన్లకు పైగా వ్యూస్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 16న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సినీ ప్రియులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు సినీ ప్రముఖులు ఆదిపురుష్ చిత్రంపై విమర్శలు చేశారు. (ఇది చదవండి: కిరాక్ పార్టీ హీరోయిన్.. ఆ ఫిట్నెస్ ఏంట్రా బాబు!) అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఆన్లైన్లో లీకైన విషయం తెరపైకి వచ్చింది. ఇంతకుముందే ఈ చిత్రం ఆన్లైన్ పైరసీ జరిగింది. తాజాగా మరోసారి యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఆదిపురుష్ చిత్రం లీకైనట్లు తెలుస్తోంది. అయితే యూట్యూబ్‌లో హెచ్డీ క్వాలిటీలో చూడటానికి అందుబాటులోకి రావడంతో.. కొద్దిసేపటికే 2.3 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత చిత్రబృందం ఫిర్యాదు చేయడంతో యూట్యూబ్ నుంచి తొలగించారు. యూట్యూబ్‌లో లీక్ కావడం పట్ల చిత్ర బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. (ఇది చదవండి: RRR Sequel: రామ్‌చరణ్, తారక్లతోనే RRR2, కానీ దర్శకుడు మాత్రం జక్కన్న కాదట!) -
తప్పును అంగీకరిస్తున్నా.. దయచేసి క్షమించండి: ఆదిపురుష్ రైటర్
భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్’ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. రామాయణం ఇతీహాసం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతీసనన్ జానకిగా నటించారు. సాంకేతికపరంగా ఈ చిత్రం మెప్పించినా.. కంటెంట్ పరంగా మేకర్స్ చేసిన పొరపాట్లతో కొన్ని సన్నివేశాలు రామాయణానికి విరుద్ధంగా తీర్చిదిద్దారనే విమర్శలు వచ్చాయి. మరోవైపు పలు వివాదాలు కూడా ఈ చిత్రాన్ని చుట్టుముట్టాయి. అయితే తాజాగా ఈ చిత్ర డైలాగ్ రైటర్ మనోజ్ ముంతశిర్ క్షమాపణలు కోరారు. సోషల్ మీడియా వేదికగా తాము చేసిన తప్పును అంగీకరిస్తున్నట్లు పోస్ట్ చేశారు. (ఇది చదవండి: సరిగ్గా 127 ఏళ్ల క్రితం.. భారత్‌లో అడుగు పెట్టిన 'సినిమా' ) మనోజ్ ముంతశిర్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' ఆదిపురుష్ సినిమా వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. అందువల్ల నా రెండు చేతులు జోడించి.. మీ అందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. ప్రభు బజరంగ్ బలి మమ్మల్ని ఐక్యంగా ఉంచి.. మన పవిత్రమైన సనాతన, గొప్ప దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించుగాక.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. జూన్ 16న థియేటర్లలోకి వచ్చిన ఆదిపురుష్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. విజువల ఎఫెక్ట్స్ మినహాయిస్తే.. ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అంతేకాకుండా ఈ చిత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. దీంతో రచయిత మనోజ్ ముంతశిర్ సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కోరారు. (ఇది చదవండి: 15 ఏళ్లలో 11వ సినిమా.. బెడ్ షేర్ చేసుకుని ఉండుంటే..: నటి) View this post on Instagram A post shared by Manoj Muntashir Shukla (@manojmuntashir) -
Adipurush Movie: దర్శకుడు ఓం రౌత్ చేసిన పొరపాట్లు గుర్తించారా? (ఫోటోలు)
-
ఈ 'శూర్పణఖ' కథ కూడా కన్నీటి మయం
ప్రభాస్‌తో ఔెం రౌత్ తెరక్కించిన 'ఆదిపురుష్'. రామాయణం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణడి పాత్రలన్ని కూడా పాపులర్ అయిన నటులే పోషించారు. కానీ రామ-రావణ యుద్ధానికి కారణమైన రావణుడి సోదరి శూర్పణఖ పాత్రలో నటించిన తేజస్విని పండిట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. (ఇదీ చదవండి: Niharika Reaction: అందరినీ వేడుకుంటున్నా.. అర్థం చేసుకోండి: నిహారిక) ఆమె చేసింది రాక్షసి పాత్రే అయినా.. అందాల రాక్షసిగా ఆకట్టుకుంది ఈ బ్యూటీ. 2004లో ఎంట్రీ ఇచ్చి మరాఠిలో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఈ బ్యూటీకి ప్రస్థుతం అక్కడ పెద్దగా అవకాశాలు లేవనే చెప్పవచ్చు. పలు సినిమాల్లో గ్లామరస్ పాత్రల్లోనూ ఆకట్టుకుంది. పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. కానీ టాలెంట్ ఉన్నా కూడా ఆమెకు అంతగా గుర్తింపు రాలేదనే చెప్పవచ్చు. (ఇదీ చదవండి: ఆయనంటే భక్తి.. అందుకే మా అబ్బాయికి ఈ పేరు పెట్టాం: కాజల్) అయితే తేజస్విని పండిట్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే తన చిన్ననాటి స్నేహితుడైనా భూషణ్ బోప్చేను 2012లో వివాహం చేసుకుంది. వారి వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. తాజాగా అమె కుటుంబ విషయాల గురించి తెలుపుతూ.. ఒకానొక సమయంలో తినడానికి కూడా తిండి లేదని ఎమోషనల్ అయింది. తన ఇంట్లో కరెంట్ కూడా ఉండేది కాదు... కానీ అప్పులు మాత్రం ఇంటి నిండా ఉండేవి అని తెలిపింది. ఇప్పుడు ఆ జీవితాన్ని తలుచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయని పేర్కొంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే తేజస్విని పండిట్.. తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది. అక్కడ తనకు ఓక మిలియన్‌కు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. View this post on Instagram A post shared by Tejaswwini (@tejaswini_pandit) -
ఆదిపురుష్ కథ ముగిసినట్టే
-
మందు కొట్టి తీశారా?.. ఆదిపురుష్ మేకర్స్‌పై నటుడు ఆగ్రహం!
ప్రభాస్, కృతి సనన్ జంటగా ఆదిపురుష్ చిత్రంపై విమర్శలు ఇంకా ఆగడం లేదు. దర్శకుడు ఔం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏ మూహుర్తనా మొదలెట్టాడో ఆది నుంచి విమర్శల పాలవుతోంది. టీజర్ మొదలు సినిమా రిలీజ్ తర్వాత కూడా పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తాయి. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో కొన్ని పాత్రలు, డైలాగ్స్, కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు మాజీ నటులు మేకర్స్‌పై మండిపడ్డారు. ఆ తర్వాత ఆదిపురుష్ టీం తమ తప్పులను అంగీకరించిన సినిమాలో మార్పులు కూడా చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఆయనతో డేటింగ్.. నా జీవితమే నాశనమైంది: టాప్ హీరోయిన్) అయితే తాజాగా మరో నటుడు ఆదిపురుష్ మేకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ విందు ధారా సింగ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా హనుమంతుని పాత్రను వక్రీకరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. విందు ధారా సింగ్ చాలాసార్లు హనుమంతుడి పాత్రను తెరపై పోషించాడు. అంతే కాకుండా అతని తండ్రి, దివంగత నటుడు ధారా సింగ్, రామానంద్ సాగర్ టీవీ షో రామాయణంలో హనుమంతుడి పాత్రను కూడా పోషించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విందు ధారా సింగ్.. ఆదిపురుష్ నిర్మాతల తీరును ఎండగట్టారు. హనుమంతుడిగా నటించిన దేవదత్తా నాగేపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. హనుమంతుడు పవర్‌ఫుల్‌గా, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. ఆ పాత్రలో నటించిన దేవదత్తా నాగే హిందీలో కూడా సరిగ్గా మాట్లాడలేడు. అతడికి ఇచ్చిన డైలాగ్‌లతో ఆ పాత్రను మరోవిధంగా చూపారు. ఈ విషయంలో నిర్మాతలు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. హనుమంతుడి పాత్రలో తన తండ్రి ధారా సింగ్ చరిత్ర సృష్టించాడని.. ఆయన నటనకు మీరు దరిదాపుల్లోకి కూడా రాలేరని అన్నారు. విందు ధారా సింగ్ మాట్లాడుతూ.. 'వీళ్లు చేసిన పని చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది. మందు తాగి వచ్చారో కానీ.. వాళ్లు ఏం ఆలోచిస్తున్నారో కూడా వాళ్లకు తెలియదు. ఇంత భారీ బడ్జెట్‌తో అద్భుతమైన సినిమా తీసే గోల్డెన్ ఛాన్స్ నాశనం చేశారు. వారు తమాషా చేస్తూ కథతో ఆడుకున్నారు. అందుకే ఆదిపురుష్ తీవ్రంగా నిరాశపరిచింది.' అన్నారాయన. ఆదిపురుష్ వివాదం ఆదిపురుష్ చుట్టూ ఉన్న వివాదాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. సినిమా నిర్మాతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ గత నెలలో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముంబై పోలీసులకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ సెన్సార్ బోర్డు, చిత్ర నిర్మాతలపై తీవ్ర స్థాయిలో మడిపడింది. సెన్సార్ బోర్డ్ ఏం చేస్తోంది? మీరు భవిష్యత్ తరాలకు ఏం నేర్పాలనుకుంటున్నారు?" అని కోర్టు ప్రశ్నించింది. డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా.. ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. -
ప్రభాస్ 'ఆదిపురుష్'.. గేమ్ ఓవర్?
ఎన్నో అంచనాలతో పాన్ ఇండియా లెవల్లో బరిలోకి దిగిన 'ఆదిపురుష్' హంగామా చివరికొచ్చేసినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా హడావుడి పూర్తిగా తగ్గిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. అలానే కొన్నిచోట్ల ఈ మూవీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది! 'ఆదిపురుష్'కి థియేటర్లలో అదే చివరిరోజని అంటున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది? (ఇదీ చదవండి: 'గుడ్ నైట్' సినిమా రివ్యూ (ఓటీటీ)) ప్రస్తుత పరిస్థితి? 'ఆదిపురుష్' సందడి తొలివారం రోజుల మాత్రమే థియేటర్ల దగ్గర కనిపించింది. కరెక్ట్ గా చెప్పాలంటే సినిమా విడుదలైన వీకెండ్ అంటే మూడు రోజుల్లో రూ.340 కోట్ల గ్రాస్ వచ్చిందని నిర్మాతలు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత వసూళ్లలో ఘోరమైన డ్రాప్ కనిపించింది. 10 రోజుల్లో రూ.450 కోట్ల గ్రాస్ సాధించినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇప్పుడు పరిస్థితి పెద్దగా బాలేదు. కొన్ని థియేటర్లలో ఈ వారం తర్వాత 'ఆదిపురుష్' తీసేయబోతున్నట్లు సమాచారం. కేవలం మనదేశంలో రూ.300 కోట్ల వసూళ్ల మార్క్ ని ఇంకా దాటలేదని టాక్. ఓటీటీల్లోకి అప్పుడే! 'ఆదిపురుష్' రిజల్ట్ సంగతి పక్కనబెడితే... టీజర్ రిలీజైన దగ్గర నుంచి థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత గ్రాఫిక్స్ విషయంలో ఎంతలా ట్రోల్ చేశారో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది కాదన్నట్లు కొన్నిరోజుల ముందు పైరసీలో ఈ మూవీ తమిళ వెర్షన్ లీక్ అయిపోయింది. దీంతో మరో 1-2 వారాల్లో 'ఆదిపురుష్' ఓటీటీలోకి వచ్చేయబోతున్నట్లు సమాచారం. ఇదంతా చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర 'ఆదిపురుష్' గేమ్ ఓవర్ అయిపోయినట్లు అనిపిస్తుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) -
ఊహించని దెబ్బ కొట్టిన ప్రభాస్
-
'ఆదిపురుష్' ఓటీటీ రిలీజ్.. అనుకున్న టైమ్ కంటే ముందే?
ప్రభాస్ 'ఆదిపురుష్' బాక్సాఫీస్ దగ్గర నెమ్మదించింది. కలెక్షన్స్ దాదాపు అన్నిచోట్ల తగ్గిపోయాయి. జనాలు ఈ సినిమాని మెల్లగా మర్చిపోతున్నారు. ఇలాంటి సమయంలో చిత్రబృందానికి అనుకోని పెద్ద అవాంతరం ఎదురైంది. అలా జరగడంతో ఓటీటీలోకి ఈ చిత్రాన్ని అనుకున్న సమయం కంటే ముందే తీసుకొచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగింది? ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చు? (ఇదీ చదవండి: 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ) లీక్ చేశారు! రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' తీశారు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించారు. టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి థియేటర్లలోకి వచ్చి ఇన్నిరోజులు అవుతున్నా ఈ చిత్రంపై ఏదో ఓ వివాదం నడుస్తూనే ఉంది. ఇప్పుడు అదంతా కాదన్నట్లు పలువురు అజ్ఞాత వ్యక్తులు.. మొత్తం HD ప్రింట్ ని పైరసీ సైట్స్ లో పెట్టేశారు. అయితే అది తమిళ వెర్షన్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో రావడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. మరో రెండు వారాల్లో? ఓవైపు థియేటర్లలో ఉండగానే 'ఆదిపురుష్' ఇలా పైరసీ సైట్స్‌లో ప్రత్యక్షమవడం చిత్రబృందానికి పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తుంటే ఓవైపు సినిమా.. థియేటర్ల దగ్గర ఫెయిల్ కావడం, పైరసీ అయిపోవడం లాంటివి చూసి చిత్రబృందం ఆలోచనలో పడిపోయింది. ఆగస్టులో ఓటీటీలోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ మరో 1-2 వారాల్లో 'ఆదిపురుష్' ఓటీటీలోకి వచ్చేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. (ఇదీ చదవండి: సీఎం కొడుకు సినిమా హిట్ అయ్యిందా?) -
మా సినిమాలోని డైలాగ్స్ నాకే నచ్చలేదు: ఆదిపురుష్ నటుడు
ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్‌కు ఆది నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా హనుమంతుడి నోట వచ్చే మాస్ డైలాగులపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమైంది. ఈ డైలాగులు జనాలకు కనెక్ట్ అవుతాయనుకుంటే రివర్స్ అయిందేంటని నాలుక్కరుచుకున్న చిత్రయూనిట్ వెంటనే తప్పును సరిదిద్దుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ డైలాగులు కూడా సినిమాపై నెగెటివిటీ పెరిగేందుకు దోహదపడ్డాయి. అయితే ఆ డైలాగులు తనకు కూడా నచ్చలేదంటున్నాడు ఆదిపురుష్ నటుడు లావ్ పజ్నీ. సినిమాలో కుంభకర్ణుడిగా నటించిన అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'మనం డైరెక్టర్ ఏది చెప్తే అది చేయాల్సి ఉంటుంది. సినిమాను కొద్దికొద్ది భాగాలుగా చిత్రీకరిస్తూ పోయారు. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. సినిమాలోని వివాదాస్పద సంభాషణలు తొలగించినప్పటికీ.. ఒక హిందువుగా ఆ డైలాగులు విని నేను కూడా ఆవేదన చెందాను' అని చెప్పుకొచ్చాడు. చదవండి: పెళ్లికి ముందే ప్రియుడి ఇంటికి నటి.. వేణుమాధవ్‌తో రిలేషన్ ఏంటంటే? -
'ఆదిపురుష్' ఎఫెక్ట్.. ఆ 'రామాయణం' మళ్లీ రిలీజ్
ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా విడుదలై పదిరోజులు దాటిపోయింది. కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. జనాలు ఈ చిత్రం గురించి మాట్లాడుకోవడం మెల్లగా తగ్గించేస్తున్నారు. కానీ వివాదాలు మాత్రం వదలట్లేదు. తాజాగా అలహాబాద్ హైకోర్ట్ చిత్రబృందంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డైలాగ్స్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదలా ఉండగానే 'రామాయణ్' మరోసారి విడుదలకు సిద్ధమైంది. డేట్ కూడా ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. వివాదాలే వివాదాలు! 'ఆదిపురుష్' సినిమాని రామాయణంలోని అరణ్యకాండ, యుద్ధకాండ ఆధారంగా తీశారు. టీజర్ విడుదలైనప్పుడు రావణుడి గెటప్ వల్ల విపరీతంగా విమర్శలు వచ్చాయి. దీంతో ట్రైలర్స్ లో అతడిని అస్సలు చూపించలేదు. థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత రావణుడి కంటే.. గ్రాఫిక్స్, డైలాగ్స్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిపోయాయి. ఇది కాదన్నట్లు డైలాగ్ రైటర్ మనోజ్.. 'ఈ సినిమా రామాయణం కాదు', 'హనుమంతుడు దేవుడు కాదు' లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్- కె'.. ఆ విషయంలో ఆదిపురుష్‌ను దాటేయనుందా?) 'రామాయణ్' మరోసారి మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశాడని 'ఆదిపురుష్' డైలాగ్ రైటర్ మనోజ్‌ని చంపేస్తామని కొందరు బెదిరించారు. రామాయణాన్ని వక్రీకరించి ఈ సినిమా తీశారని కొందరు కేసు వేశారు. ఇలా 'ఆదిపురుష్' సినిమాపై లెక్కలేనంత నెగిటివిటీ వచ్చింది. ఈ క్రమంలోనే దయానంద్ సాగర్ 'రామాయణ్' సీరియల్ ని మరోసారి టీవీల్లో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రతిరోజూ రాత్రి! బాక్సాఫీస్ దగ్గర 'ఆదిపురుష్' కాస్త తగ్గిన నేపథ్యంలో 'రామాయణ్' సీరియల్ ని ఆ ఛానెల్ లో జూలై 3 నుంచి ప్రతిరోజూ రాత్రి 7:30 గంటలకు ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు. గతంలో పలుమార్లు ఈ సీరియల్ రీ రిలీజ్ చేస్తే ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారు. లాక్‌డౌన్‌లోనూ ప్రసారం చేస్తే అప్పుడు విశేషాదరణ దక్కింది. 'ఆదిపురుష్' ఎఫెక్ట్ నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి? (ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?) -
ప్రభాస్ 'ప్రాజెక్ట్- కె'.. ఆ విషయంలో ఆదిపురుష్‌ను దాటేయనుందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే ఆదిపురుష్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ విమర్శల పాలైంది. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పలు వివాదాలు చుట్టుముట్టాయి. డైలాగ్స్, పాత్రలతో పాటు సీత ఇండియాలో జన్మించినట్లు చూపించడం వివాదాలకు కేరాఫ్‌గా నిలిచాయి. తొలి మూడు రోజులు వసూళ్లు సాధించినా ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోయాయి. ఈ చిత్రం కోసం దాదాపుగా రూ.600 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఆదిపురుష్ నిలిచింది. (ఇది చదవండి: టాలీవుడ్ సినిమాతో ఎంట్రీ.. ఈ ఫోటోలోని హీరోయిన్ ఎవరో తెలుసా?) ఇక ప్రభాస్ తదుపరి చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్-కెలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. అంతేకాకుండా సీతారామం స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇంతటి భారీ తారగణంతో రూపొందుతున్న ఈ చిత్రం బడ్జెట్‌పైనే ఇప్పుడు చర్చ మొదలైంది. ఈ చిత్రంలోని నటీనటులు రెమ్యునరేషన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతోంది. భారీస్థాయిలో గ్రాఫిక్స్ ఉండనుండడంతో ఈ మూవీ బడ్జెట్ రూ. 600 కోట్లకు పైగానే ఉండనుందని టాక్ వినిపిస్తోంది. అదే గనుక నిజమైతే ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రాజెక్ట్-కె నిలవనుంది. ప్రాజెక్ట్-కె రెమ్యూనరేషన్స్ ప్రాజెక్ట్- కె కోసం ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ఎంత తీసుకుంటున్నారనే దానిపై అభిమానుల్లో చర్చ నడుస్తోంది. ప్రభాస్ ఈ చిత్రం కోసం రూ.150 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కమల్ హాసన్ ఈ చిత్రంలో కేవలం అతిథి పాత్రకే రూ.20 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకొణె ఈ చిత్రానికి రూ. 10 కోట్లు వసూలు చేస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీతో కలిపి ఇతరులకు మరో రూ.20 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వనున్నారు. దీంతో కేవలం ప్రాజెక్-కె రెమ్యూనరేషన్ కోసమే దాదాపు రూ.200 కోట్లు వెచ్చించనున్నట్లు సమాచారం.వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12, 2024న విడుదల కానుంది. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. (ఇది చదవండి: ఆదిపురుష్.. సెన్సార్ బోర్డుపై హైకోర్టు ఫైర్) -
ఆదిపురుష్.. సెన్సార్ బోర్డుపై హైకోర్టు ఫైర్
భారీ అంచాల మధ్య విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. రామాయణం ఇతీహాసం ఆధారంగా ఓ రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతీసనన్ జానకిగా నటించారు. సాంకేతికపరంగా ఈ చిత్రం మెప్పించినా.. కంటెంట్ పరంగా అలరించలేకపోవడంతో పాటు కొన్ని సన్నివేశాలు రామాయణానికి విరుద్ధంగా తీర్చిదిద్దారనే విమర్శలు వచ్చాయి. మరోవైపు పలు వివాదాలు కూడా ఈ చిత్రాన్ని చుట్టుముట్టాయి. ఈ చిత్రాన్ని వెంటనే నిలిపివేయాలంటూ పలు కోర్టులో పిటిషన్స్ దాఖలయ్యాయి. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్‌ని తొలగించాలాంటూ అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డుని ధర్మాసనం తప్పుబట్టింది. సెన్సార్‌కు పంపిన సమయంలో ఇలాంటి డైలాగ్స్‌ని ఎందుకు సమర్థించారని కోర్టు ప్రశ్నించింది. (చదవండి: ఓటీటీకి 'ది కేరళ స్టోరీ'.. ఆలస్యం అందుకేనన్న ఆదాశర్మ!) ఇలాంటి వాటి వల్ల భవిష్యతు తరాలకు ఎలాంటి సందేశాలను అందించాలనుకుంటున్నారని మండిపడింది. సినిమా దర్శకనిర్మాత విచారణకు హాజరుకాకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కాగా, ఆదిపురుష్ చిత్రంలో కొన్ని సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయని ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో..చిత్రబృందం వాటిని తొలగించింది. అయినప్పటికీ వివాదం మాత్రం ఆగడం లేదు. -
చవక రేటుకే ఆదిపురుష్ త్రీడీ టికెట్లు.. సెటైర్లు వేస్తున్న నెటిజన్స్
భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ హవా చప్పున చల్లారిపోయింది. తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.340 కోట్లు రాబట్టి రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తర్వాత మాత్రం మరో నూరు కోట్లు రాబట్టేందుకు వారం రోజులు తీసుకుంది. బాక్సాఫీస్ వద్ద దారుణ కలెక్షన్లు అందుకుంటున్న ఈ సినిమాను ఎలాగైనా గండం గట్టెక్కించాలని ప్రయత్నిస్తున్నారు నిర్మాతలు. ఈ క్రమంలోనే టికెట్ రేట్లు తగ్గిస్తూ వస్తున్నారు. తొలుత జూన్ 21న ఆదిపురుష్ త్రీడీ టికెట్ రేట్లను రూ.150కే అందుబాటులో ఉంచుతున్నామని ప్రకటించింది చిత్రయూనిట్. అది కూడా కేవలం రెండు రోజులు మాత్రమే ఆ ఆఫర్ అందుబాటులో ఉంటుందని చెప్పింది. కానీ ఈ ఎత్తు పారలేదు. ఆదిపురుష్‌పై వస్తున్న వ్యతిరేకత కలెక్షన్లకు గండి కొడుతూనే ఉంది. దీంతో తాజాగా మరోసారి టికెట్ రేట్లు తగ్గించారు. కేవలం 112 రూపాయలకే ఆదిపురుష్ 3D టికెట్లు బుక్ చేసుకోండి అని ప్రకటించారు. సోమవారం నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఆదిపురుష్ మేకర్స్ ప్రకటించిన బంపర్ ఆఫర్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 'మీరు ఫ్రీగా టికెట్లు ఇచ్చినా చూడం', 'మీరు టీజర్ రిలీజ్ చేసినప్పుడే సినిమాను ఎలా భ్రష్టుపట్టించారో అర్థమైంది', 'సినిమాకు వెళ్లి తలనొప్పి తెచ్చుకునేకన్నా ఇంట్లో ఉండటం నయం', 'అరె.. బాబూ.. రూపాయికి టికెట్లు ఇచ్చినా సరే చూసేదే లేదు', 'ఓం రౌత్ హనుమాన్ కోసం థియేటర్లో ఒక సీటు వదిలేయమన్నాడు, కాబట్టి మనమంతా వానర సేన కోసం సినిమా హాల్ అంతా వదిలేద్దాం' అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. Witness the epic saga unfold!🏹 Book your tickets starting from just Rs112/-* and experience the grandeur world of Adipurush🧡 Offer starts tomorrow! #JaiShriRam 🙏 Book your tickets on: https://t.co/0gHImE23yj#Adipurush now in cinemas near you ✨#Prabhas @omraut… pic.twitter.com/cQOKqn0I4S — T-Series (@TSeries) June 25, 2023 చదవండి: ఆదిపురుష్ 2 ఉందా? బూతులు మాట్లాడుతున్న జనాలు -
రావణుడిపై ఎన్టీఆర్ కామెంట్స్
-
'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!
డార్లింగ్ ప్రభాస్ పేరు చెప్పగానే ప్రస్తుతం అందరికీ గుర్తొచ్చేది 'ఆదిపురుష్'. రామాయణం ఆధారంగా ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. మనం వాటిని చూసి భక్తి పారవశ్యంలో మునిగిపోయాం. కానీ 'ఆదిపురుష్'పై వచ్చినన్నీ వివాదాలు మరే మూవీ విషయంలో జరగలేదని చెప్పొచ్చు. ఇప్పుడు దీనికి సీక్వెల్ తీయబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది. నిరాశపరిచిన 'ఆదిపురుష్'! 'బాహుబలి' తర్వాత ప్రభాస్.. పలు వైవిధ్యమైన సినిమాల్ని ఒప్పుకొన్నాడు. 'సాహో' యాక్షన్ ఎంటర్టైనర్ కాగా, 'రాధేశ్యామ్' ఓ లవ్ స్టోరీ, ఇప్పుడొచ్చిన 'ఆదిపురుష్' మైథలాజికల్ చిత్రం. 'బాహుబలి' తప్పితే మిగతా మూడు కూడా బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల వసూళ్లు సాధించాయి గానీ హిట్ అనిపించుకోలేకపోయాయి! ఇలా అంటే ఫ్యాన్స్ కి నచ్చకపోవచ్చు. అయినా ఇదే నిజం! (ఇదీ చదవండి: 'సలార్' నిర్మాతలకు షాకిచ్చిన ఆ సినిమా రిజల్ట్!) నో చెప్పిన ప్రభాస్! 'ఆదిపురుష్'లో రాముడిగా చేసిన ప్రభాస్ ని ఎవరూ పెద్దగా ఏం అనడం లేదు. కానీ డైరెక్టర్ ఓం రౌత్ ని బూతులు తిడుతున్నారు. ఇదంతా చూసి కూడా ప్రభాస్ దగ్గరకు సీక్వెల్ ప్రతిపాదనతో వెళ్లాడట. దీన్ని డార్లింగ్ హీరో సున్నితంగా తిరస్కరించాడట. ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంపైనే ఇన్ని వివాదాలు వచ్చాయి. సీక్వెల్ తీస్తే ఇంకెన్ని సమస్యలు వస్తాయోనని ప్రభాస్ భయపడి ఉండొచ్చు బహుశా! కలెక్షన్స్ ఎంత? తొలి మూడు రోజుల్లో రూ.340 కోట్ల వసూళ్లు సాధించిన 'ఆదిపురుష్'.. నాలుగురోజు నుంచి డల్ అయిపోయింది. చెప్పాలంటే రోజురోజుకీ దారుణంగా పడిపోయాయి. అలా మొత్తంగా పది రోజుల్లో రూ.450 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు. కరెక్ట్ గా చెప్పాలంటే ప్రస్తుతం ఈ సినిమాని జనాలు పెద్దగా పట్టించుకోవట్లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం లెక్కలు చూస్తుంటే భారీ నష్టాలు తప్పవని తెలుస్తోంది. అవి ఎంతనేది కొన్ని రోజులైతే క్లారిటీ వచ్చేస్తుంది. #Adipurush goes from strength to strength at the Global Box Office and collects Rs 450 CR in 10 days. Continues its steady march at the box office!#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar @TSeries @Retrophiles1 @UV_Creations @peoplemediafcy… pic.twitter.com/ErYJ1F8Mce — People Media Factory (@peoplemediafcy) June 26, 2023 (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. వీడియో రిలీజ్ చేసిన నటి సురేఖావాణి) -
ఆదిపురుష్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ఎలాంటి కామెంట్ చేశాడంటే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - కృతిసనన్ జంటగా ఓం రౌత్ తెరకెక్కించిన 'ఆదిపురుష్' విడుదలైన రోజు నుంచే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సినిమా విడుదలైన నాటి నుంచి ఏదో ఒక విధంగా విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని తెరకెక్కించినప్పటికీ.. ఇప్పటివరకూ వచ్చిన ఏ రామాయణ రచనలతోనూ దీనికి పోలిక లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ అని తెలిసినా..ఆ అవకాశం వదులుకోలేదు: అలియా) ఇప్పటికే చాలామంది ప్రముఖులు సినిమాపై విమర్శలతో విరుచకపడ్డారు. రావణుడితో హనుమంతుడి సంభాషణలపై కూడా తీవ్ర దుమారం రేగడంతో మేకర్స్ వాటిని మార్చిన విషయం తెలిసిందే. తాజాగా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ సినిమాపై కామెంట్ చేశాడు. ఆదిపురుష్ చూసిన తర్వాత బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఇప్పుడు అర్థమైందంటూ ఒక స్మైల్ ఎమోజీని చేర్చి ట్వీట్ చేశాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సెహ్వాగ్‌పై ఫైర్ అవుతున్నారు. క్రికెట్ తర్వాత ఇప్పుడు ఆదిపురుష్ మూవీపై దృష్టి పెడుతున్నారా..? న్యాయాన్ని ప్రజలు ఎందకు ద్వేషిస్తారో ఇప్పుడు అర్థం అవుతుంది అంటూ సెహ్వాగ్‌ను ట్రోల్ చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం సినిమాను ఇంకా బెటర్‌గా తీయాల్సిందంటూ ఆయనకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ట్విటర్లో వీరు చేసిన పోస్ట్‌కు సమాధానంగా వచ్చే కామెంట్స్ కూడా వైరల్ అవతున్నాయి. Adipurush dekhkar pata chala Katappa ne Bahubali ko kyun maara tha 😀 — Virender Sehwag (@virendersehwag) June 25, 2023 (ఇదీ చదవండి: Urvashi Rautela: అందులో ఫోటోలు ఉన్నాయి.. దొరికితే ఇవ్వండి) -
ఆదిపురుష్ విలన్‌కి కోట్ల విలువైన డైమండ్ వాచ్ గిఫ్ట్: ఎపుడు, ఎవరిచ్చారో తెలుసా?
రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ లైఫ్ స్టయిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఖరీదైన బంగ్లా, కార్లతోపాటు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, రాయల్ వాచీల కలెక్షన్ సైఫ్ సొంతం. అయితే ఇటీవల తన కోటి రూపాయల విలువైన లగ్జరీ గడియారాన్ని బ్రూనై సుల్తాన్ కుమార్తె గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతులను మీడియాతో పంచుకున్నాడు. అంతేకాదు ఒకానొక సందర్బంలో ఆ వాచ్‌ని అమ్మాలని కూడా ప్రయత్నించాడట. (వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?) లేటెస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్‌లో విలన్ పాత్రలో కనిపించిన సైఫ్ కొన్నేళ్ల క్రితం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇపుడు వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా సైఫ్ అలీఖాన్ బ్రూనై సుల్తాన్ కుమార్తె నుంచి వజ్రాలు పొదిగిన విలువైన గడియారాన్ని గిఫ్ట్ విషయంతో పాటు, ఒక ఫన్నీ విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. అతని మాటల్లో చెప్పాలంటే బ్రూనై సుల్తాన్ చాలా రిచ్. మైఖేల్ జాక్సన్‌ను పాడమని ఆహ్వానించేవారు. అలాగే అందులోనూ అతని కుమార్తెకు బాలీవుడ్ అంటే ఇష్టం. ఒకసారి అతను మమ్మల్ని ఆహ్వానించినట్టు గుర్తు.. లండన్‌లోని డోర్చెస్టర్ హోటల్లో నేను, మనీషా కొయిరాలా ఇంత కొంతమందిమి వెళ్లాం. అయితే పొరపాటున సుల్తాన్ కుమార్తె కోసం కేటాయించిన కుర్చీలో కూర్చున్నా. అక్కడ ఒక పెద్ద కుర్చీ, చిన్న కుర్చీ ఉన్నాయి, అయినా ఆలోచించకుండా కూర్చుండిపోయా. ఇంతలో సుల్తాన్ కుమార్తె ఒక పెట్టె ఇచ్చింది. అందులో వజ్రాలు పొదిగిన రోలెక్స్ వాచ్‌ని చూసి షాక్ అయ్యానని సైఫ్ చెప్పాడు. (టీసీఎస్‌లో రూ.100 కోట్ల స్కాం: ఇదిగో క్లారిటీ ) దీంతో పాటు మరో షాకింగ్ విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన భార్య కరీనా కపూర్ ఖాన్ దగ్గరున్న ఈ అమూల్యమైన లగ్జరీ వాచ్‌ని అమ్మాలనుకున్నాడట. రేస్ షూటింగ్ సమయంలో నిర్మాత రమేష్ తౌరానీకి విక్రయిద్దామనుకున్నా, చివరికి విరమించుకుని కరీనా కపూర్ ఖాన్‌కు ఇచ్చానని పేర్కొన్నాడు. పటౌడీ ప్యాలెస్ కాగా 2011లో తన తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మరణించిన తర్వాత సైఫ్ అలీఖాన్ తన పూర్వీకుల ఆస్తి పటౌడీ ప్యాలెస్‌ను తిరిగి కొనుగోలు చేశాడు. అది వారి హాలిడే హోమ్ కూడా. దీన్నే ఇబ్రహీం కోఠి అని కూడా పిలుస్తారు, పటౌడీ ప్యాలెస్ చివరి పాలక నవాబ్ ఇఫ్తికర్ అలీ ఖాన్ నుంచి అతని కుమారుడు మన్సూర్ అలీ ఖాన్‌కు ఇచ్చారు. 10 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ విలాసవంతమైన బంగ్లాలో ఏడు డ్రెస్సింగ్ రూమ్‌లు, ఏడు బెడ్రూమ్లు, ఏడు బిలియర్డ్ రూమ్‌లు, అలాగే రాజభవన డ్రాయింగ్ రూమ్‌లు , డైనింగ్ రూమ్‌లతో సహా 150 గదులు ఉన్నాయి. 2020 నాటికి పటౌడీ ప్యాలెస్ విలువ 800 కోట్లు. దీన్ని బట్టి ఈ ప్యాలెస్ ప్రస్తుత విలువను అంచనా వేసుకోవచ్చు. -
ఇటలీలో లగ్జరీ విల్లా: రూ.40 లక్షల అద్దె సంపాదన, ఎవరీ సూపర్‌స్టార్?
ఆదిపురుష్ సినిమాతో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి క్రేజీ అప్డేట్ ఒకటి హల్ చల్ చేస్తోంది. సూపర్‌స్టార్‌కి ఇటలీలో లగ్జరీ విల్లా ఉందట. ఈ విల్లాలోని కొంత భాగాన్ని అద్దెకిచ్చాడట. తద్వారా నెలకు రూ.40 లక్షల అద్దెను ఆర్జిస్తున్నాడు అనే టాక్ జోరుగా నడుస్తోంది. అయితే ఎప్పుడు కొన్నాడు అనేది మాత్రం స్పష్టత లేదు కానీ, ఈ ఊహాగానాలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. (రికార్డు రెమ్యూనరేషన్: ఈ రికార్డ్ సాధించిన తొలి హీరో ఎవరో తెలుసా?) దీంతో పాటు ఆర్థికంగా బలపడేందుకు ఇతర పెట్టుబడులు పెట్టాడని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. మూవీలు లేకుండా లీజర్‌గా ఉన్న సమయంలో ఇక్కడే హ్యాపీగా కాలం గడిపేస్తాడట. ఇంకా హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇల్లు కూడా ప్రభాస్ సొంతం. అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న ఈ ఇల్లు దాదాపు 90 కోట్ల రూపాయలు. డ్రెస్సింగ్ విషయంలో కూడా ఎక్కడా తగ్గని డార్లింగ్ ప్రభాస్‌కు రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ జాగ్వార్ తదితర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. (రూ. 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసిన సుహానా ఖాన్) ఆదిపురుష్ మూవీతో ఆకట్టుకుంటున్న ప్రభాస్, టాలీవుడ్ జక్కన్ తెరకెక్కించిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్యాన్ ఇండియా హీరోగా పాపులర్ అయిపోయాడు. దీంతో ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్లో పెరిగింది. ఈ నేపథ్యంలోనే లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ కోసమే ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్లు అందుకున్నాడని టాక్. (అపుడు కరోడ్‌పతి షో సెన్సేషన్: మరి ఇపుడు) కాగా నెక్ట్స్ పాన్ ఇండియా మూవీ సలార్ బిజినెస్‌పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్, ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్‌కు రడీ అవుతోంది. దీంతోపాటు ప్రభాస్ ప్రాజెక్ట్ కే, స్పిరిట్, రాజా డీలక్స్ తదితర భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
రావణుడిపై జూ.ఎన్టీఆర్ కామెంట్స్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ నటి కృతి సనన్ సీతగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. జూన్ 16న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తొలిరోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం కావడంతో సినీ విమర్శలకు ఆగ్రహానికి గురైంది. ఈ చిత్రంలోని కొన్ని పాత్రలు, డైలాగ్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సినిమాలో రావణుడిని చూపించిన విధానంపై ఇప్పటికే పలువురు మండిపడ్డారు. రావణుడి విచిత్రమైన హెయిర్ స్టైయిల్‌తో పాటు రెండు వరుసలలో పది తలకాయలను చూపించడం.. ఇలా పలు విషయాలు భారీ వివాదాలకు దారి తీశాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడు ఓం రౌత్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. (ఇదీ చదవండి: కేపీ చౌదరితో సురేఖా వాణి కూతురి ఫోటో వైరల్) అయితే జూ.ఎన్టీఆర్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జై లవకుశ సినిమా విడుదల సందర్భంగా జూ. ఎన్టీఆర్ రావణుడి పాత్ర వేసినప్పుడు రామాయణంతో పాటు రావణుడి గురించి ఎక్కడ సమాచారం సేకరించాడో తెలిపాడు. పౌరాణికానికి సంబంధించిని సినిమాలు చేస్తున్నప్పుడు అందులోని పాత్రల సమాచారం కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ అందులోని విషయాన్ని పాడు చేయకుంటే చాలని ఎన్టీఆర్ ఇలా తెలిపాడు. 'జై లవకుశ' సినిమా ప్రారంభానికి ముందే రావణుడి గురించి తెలుసుకునేందుకు.. ఆనంద్ నీలకంఠ రాసిన 'అసుర' అనే పుస్తకాన్ని చదివాను. రావణుడు 18 లోకాలకు రాజు మాత్రమే కాదు అసురుల చక్రవర్తి కూడా.. అన్ని లోకాలకు అధిపతి అయ్యాడంటే అతడికి ఎంత నేర్పు ఉండాలి. అలాంటి వ్యక్తి కళ్లు ఎలా ఉండాలి. ఇవన్నీ రావణుడిలో కనిపించాలి. అందుకే రాముడు కూడా యుద్ధం సమయంలో రావణాసురుడు చూడగానే ఇంత గొప్ప వ్యక్తివా నువ్వు అని పద్యాన్ని అందుకున్నాడు. అలా రావణడు ఎక్కడైనా నిలబడితే శత్రువు సైతం అతడిని పొగిడేలా ఉండాలి. అలా ఆ పాత్ర చేసేటప్పుడు నేను కూడా ఎలా మాట్లాడాలి? అన్న విషయాలను తెలుసుకున్నాను.' అని చెబుతూనే ఆ పుస్తకం తనకు జై లవకుశ సినిమా కోసం సహాయపడిందని తెలిపాడు. (ఇదీ చదవండి: వ్యూహం టీజర్..ఒక్క డైలాగ్‌తో అంచనాలు పెంచేసిందిగా!) ఒక సినిమాలో కేవలం రావణుడి పాత్ర చేస్తున్న ఎన్టీఅరే తన క్యారెక్టర్ కోసం అంత పరిశోధన చేస్తే.. ఆదిపురుష్‌లో రావణుడి పాత్ర కోసం మూవీ మేకర్స్ ఎంతలా కసరత్తు చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరోవైపు జైలవకుశ సమయంలో ఎన్టీఆర్ చేసిన కసరత్తుపై తన అభిమానులతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా ద్వారా మెచ్చుకుంటున్నారు. @tarak9999 did research like this for a small character then how much research should be done to make Ravan's Character 🤷♂️#ManOfMassesNTR #Ntr30 #Devara #Ravana pic.twitter.com/9leIW2FQf3 — Narasimha (@NTRNarasimha_) June 19, 2023 -
‘టీవీ రాముడి’ పాదాల చెంత అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లాడిని ఉంచగానే..
‘ఆది పురుష్’ సినిమాపై జరుగుతున్న హంగామా ఇప్పట్లో చల్లారేలా లేదు. రామాయణం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను చూసినవారంతా దర్శకనిర్మాత రామానంద్‌సాగర్ రూపొందించిన టీవీ రామాయణాన్ని గుర్తు చేసుకుంటున్నారు. టీవీ రామాయణంలో రాముని పాత్ర పోషించిన నటుడు అరుణ్ గోవిల్ కూడా ‘ఆది పురుష్’ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రామాయణం రూపొందించినప్పుడు దానిని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దామని, అందుకే ఇప్పటికీ నాటి రామాయణం సీరియల్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందన్నారు. సోషల్ మీడియాలో ‘ఆది పురుష్’సినిమాపై స్పందించిన ఆయన గతంలో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని వివరించారు. గతంలో ఒకసారి తనను సాక్షాత్తూ శ్రీరామునిగా భావించిన ఒక మహిళ తన పాదాల చెంత అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడిని ఉంచిందన్నారు. అప్పుడు తాను అనారోగ్యంతో బాధపడుతున్న ఆ పిల్లివాడిని ఆసుపత్రికి తీసుకువెళ్లాలలని చెబుతూ, పిల్లాడి ఆరోగ్యం కోసం ప్రార్థించానన్నారు. తరువాత ఆమె తన చేతిని ఆ కుర్రాడి తలపై ఉంచాలని కోరిందన్నారు. తరువాత ఆమె ఆ పిల్లాడిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిందన్నారు. మూడు రోజుల తరువాత ఆ మహిళ తన పిల్లాడిని తీసుకుని తిరిగి సెట్‌కు వచ్చిందని, అప్పుడు అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారన్నారు. ఆ పిల్లాడు అనారోగ్యం నుంచి కోలుకుని ఆడుకుంటున్నాడని అరుణ్ గోవిల్ తెలిపారు. దేశంలో శ్రీరామునిపై ప్రజలకు భక్తిశ్రద్ధలు ఆ స్థాయిలో ఉంటాయని అరుణ్ గోవిల్ దీనిని ఉదహరించారు. ఏ మతానికి సంబంధించిన సినిమా రూపొందించినా, అది విలువలతో కూడి ఉండాలని ఆయన సూచించారు. దేశంలోని ప్రజలు శ్రీరాముని పాత్రను ఎంతో గొప్పగా చూస్తారని, అందుకే ఓం రౌత్ రూపొందించిన రామాయణంలో విలువలు లేవని విమర్శిస్తున్నారన్నారు. రామాయణం రూపకల్పన విషయంలో తగిన విధంగా ఆలోచించి ఉంటే, ఇన్ని విమర్శలు వచ్చేవికావని, పైగా ప్రేక్షకులు మెచ్చుకునేవారన్నారు. ఇది కూడా చదవండి: ‘ఆదిపురుష్’ హనుమంతుని కండల రహస్యం ఇదేనట! -
ప్రభాస్ సరికొత్త రికార్డ్.. ఏ సౌత్ హీరో వల్ల కాలేదు!
మీకు తెలిసిన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ఎవరు? అని అడిగితే ఇప్పటి జనరేషన్ టక్కున చెప్పే పేరు ప్రభాస్. 'బాహుబలి' ముందు వరకు కేవలం తెలుగుకే పరిమితమైన ఇతడు.. ఆ తర్వాత తన రేంజుని అంతకంతకు పెంచుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడు ఏకంగా సౌత్ లో ఏ హీరోకి సాధ్యం కానీ విధంగా ఓ సరికొత్త రికార్డు సృష్టించాడు. పాన్ ఇండియా స్టార్ అంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించాలి. తన సినిమాలతో ఎంటర్ టైన్ చేయాలి. డార్లింగ్ ప్రభాస్ ని చూస్తుంటే అచ్చం అలానే అనిపిస్తోంది. ఎందుకంటే 'ఆదిపురుష్'నే తీసుకోండి. డివైడ్ టాక్ వచ్చినాసరే కలెక్షన్స్ సాధిస్తూనే ఉంది. సౌత్ లో అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. నార్త్ లో ఈ సినిమాకు ప్రేక్షకులు వెళ్తున్నారు. చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి కారణం వన్ అండ్ ఓన్లీ ప్రభాస్. (ఇదీ చదవండి: ఆ నెలంతా పాన్ ఇండియా మూవీసే.. ఏకంగా అన్ని!) 'బాహుబలి' తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్'.. ఇలా మూడు భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించాడు ప్రభాస్. వీటి టాక్ ఏంటనేది పక్కనబెడితే నార్త్ లో ఇవన్నీ కూడా కలెక్షన్స్ లో వావ్ అనిపించాయి. మొత్తం ఈ నాలుగు చిత్రాలు.. కేవలం హిందీలోనే తలో రూ.100 కోట్లు చొప్పున నెట్ వసూళ్లు సాధించాయి. తద్వారా దక్షిణాది నుంచి వెళ్లి బాలీవుడ్ లో ఈ ఘనత సాధించిన ఫస్ట్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రభాస్ తన నాలుగు సినిమాలతో తలో రూ.100 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధిస్తే దక్షిణాది నుంచి మరే హీరో కూడా కనీసం ఒక్కటంటే ఒక్క మూవీతోనూ ఈ క్లబ్ లో చేరలేకపోయాడు. దీన్నిబట్టే మీరు అర్థం చేసుకోవచ్చు అసలు సిసలు 'పాన్ ఇండియా స్టార్' ప్రభాస్ అని. మరోవైపు బాలీవుడ్ లో ఇలా రూ.100 కోట్లు సాధించిన హీరోలు ఒకరో ఇద్దరో ఉంటారంతే! (ఇదీ చదవండి: వారం గడిచింది.. 'ఆదిపురుష్' కలెక్షన్స్ ఎన్ని కోట్లు?) -
ఆదిపురుష్ జోరుకు బ్రేకులు...
-
వారం గడిచింది.. 'ఆదిపురుష్' కలెక్షన్స్ ఎన్ని కోట్లు?
ప్రభాస్ 'ఆదిపురుష్' కలెక్షన్స్.. రోజురోజుకీ డ్రాప్ అవుతూనే ఉన్నాయి. ఏడోరోజు కూడా చాలా అంటే చాలా తక్కువ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. తొలి మూడు రోజులు ఆహాఓహో అనే రేంజులో ఈ చిత్రం రూ.340 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. ఆ తర్వాత మాత్రం దెబ్బ మీద దెబ్బ అన్నట్లు తయారైంది. (ఇదీ చదవండి: రూ.200 కోట్ల దర్శకుడితో మెగాస్టార్ సినిమా?) విడుదలకు ముందు 'ఆదిపురుష్'కు ఓ మాదిరి హైప్ ఏర్పడింది. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తొలి మూడు రోజుల టాక్ ఏంటనేది బయటకొచ్చినా అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. నిర్మాణ సంస్థ బయటపెట్టిన దాని ప్రకారం ఫస్ట్ వీకెంట్ లో రూ.340 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ సోమవారం నుంచి మాత్రం 'ఆదిపురుష్'కి వరస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఓవైపు వివాదాలు పెరుగుతుంటే.. మరోవైపు కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. ఆరు రోజుల్లో రూ.410 కోట్ల గ్రాస్ సాధించిన ఈ మూవీకి ఏడో రోజు ఓవరాల్ గా రూ.10 కోట్ల వరకే కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిబట్టి ఓవరాల్ గా తొలివారంలో రూ.420 కోట్ల మేర గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే 'ఆదిపురుష్' ఇక కోలుకోవడం కష్టమే? (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!) -
బాలీవుడ్‌ను భయపెడుతున్న ప్రభాస్
కటౌట్ ఉన్నోడు కొంతవరకు మాత్రమే హైలెట్ అవుతాడు.. దిమాకున్నోడు దునియా మొత్తాన్నే ఏలుతాడు. తాజాగా బాలీవుడ్లో ప్రభాస్ రేంజ్ చూస్తే ఇలానే ఉంది. ఇప్పటికే వరుసగా తన నాలుగు సినిమాలు రూ. 300 కోట్ల క్లబ్లో చేరిపోయాయి. దీంతో రెబల్ స్టార్ ప్రభాస్ దెబ్బకు బాలీవుడ్ హీరోల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. తాజాగా ఆదీపురుష్ సినిమాపై డివైడ్ టాక్ వినిపించినా కలెక్షన్ల పరంగా పలు రికార్డుల దుమ్ము దులిపేశాడు. మొదటి మూడురోజుల్లోనే రూ.340 కోట్ల గ్రాస్‌ని వసూళ్లు చేసి ఆశ్చర్యపరిచాడు. ఇలా ఐదురోజుల్లోనే రూ. 400 కోట్ల మార్క్‌ను కూడా దాటేశాడు. (ఇదీ చదవండి: యూత్‌ను టార్గెట్ చేస్తూ.. బోల్డ్ కామెంట్స్ చేసిన నటి) దేశం మొత్తం ఆదీపురుష్పై విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఇలాంటి కలెక్షన్లు రావడం చాలా కష్టం కానీ ప్రభాస్ ప్రభంజనంతో అవన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పటికే బాహుబలి రెండు భాగాలతో పాటు సాహో కూడా రూ. 300 కోట్ల మార్కును దాటిన జాబితాలో ఉన్నాయి. ఇదే లిస్ట్‌లోకి ఆదిపురుష్ వచ్చి చేరింది. ఇప్పటి వరకు ఏ హీరోకు ఇలాంటి ఫీట్ సాధ్యపడలేదు. ప్రభాస్‌కు మాత్రమే ఇది సాధ్యమైంది. బాలీవుడ్లో కేవలం ఇద్దరు లేదా ముగ్గురికి సాధ్యమయ్యే ఈ అరుదైన ఫీట్‌ను టాలీవుడ్ నుంచి వచ్చిన ప్రభాస్ క్రియేట్ చేయడంతో వారిప్పుడు ఆశ్చర్యపోతున్నారు. కంటెంట్ లేదంటున్న సినిమాతోనే ఇన్ని రకాల విధ్వంసాలు సృష్టిస్తే... సలార్‌తో పాటు ప్రాజెక్ట్ కే చిత్రాలతో వస్తున్న ప్రభాస్‌ను ఇంకెవరు ఆపలేరని వారు అంచనా వేస్తున్నారు. రాబోయేరోజుల్లో ప్రభాస్ నుంచి బాలీవుడ్ హీరోలకు అతిపెద్ద ప్రమాదమే పొంచి ఉందని అక్కడి క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. వారి అంచనాలు నిజమయ్యేలా తాజాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రియా రెడ్డి ‘సలార్’ గురించి మాట్లాడి అంచనాలను భారీగా పెంచేసింది.'సలార్’ సినిమా ‘కేజీఎఫ్’కు మించి ఉంటుంది. ఒకరకంగా రెండు కేజీఎఫ్ సినిమాలకు సమానంగా సలార్ వస్తుంది. నేను ఇప్పటి వరకు ఇలాంటి స్క్రిప్ట్, యాక్షన్‌ను చూడలేదు. ప్రశాంత్ నీల్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ లాగా ఒక ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ప్రభాస్ ఇప్పటి వరకు చూడని విధంగా ఉంటాడు. ఇందులోని ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది' అని ఆమె చెప్పింది. సెప్టెంబరు 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. (ఇదీ చదవండి: పిల్లలు ఎందుకు కలగలేదో ఓపెన్‌గానే చెప్పేసిన నటి) -
ఆదిపురుష్ దెబ్బ...సలార్ టీజర్ వస్తోంది..!
-
ఆదిపురుష్‌పై బ్యాన్ ఎత్తివేత! జరగనివ్వనంటున్న మేయర్..
మొదట్లో బాక్సాఫీస్ దుమ్ము దులిపిన ఆదిపురుష్ ఇప్పుడు కలెక్షన్ల వేటలో నెమ్మదించింది. అయితే వివాదాలు, విమర్శలు మాత్రం ఇంతవరకు తగ్గనేలేదు. పైపెచ్చు రోజుకో వివాదం సినిమాను చుట్టుముడుతూనే ఉంది. ఇకపోతే ఆదిపురుష్‌లోని ఓ డైలాగ్ వల్ల నేపాల్ ప్రభుత్వం భారతీయ సినిమాలపై కన్నెర్రజేసింది. ఈ సినిమాలో.. సీత భారత్‌లో పుట్టిందని అర్థం వచ్చేలా ఓ డైలాగ్ ఉంది. దీనిపై నేపాల్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్ రాజధాని అయిన ఖాట్మండులో సినిమాపై నిషేధం విధించారు. అంతేకాకుండా హిందీ సినిమాలను సైతం బ్యాన్ చేశారు. దీనిపై మేకర్స్ క్షమాపణలు కోరినప్పటికీ అక్కడి ప్రభుత్వం మాత్రం కనికరం చూపించలేదు. దీంతో నేపాల్ ఫిలిం యూనియన్ ఆదిపురుష్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ పఠాన్ హై కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. సెన్సార్ బోర్డు ఆమోదించిన ఏ సినిమా ప్రదర్శనను కూడా ఆపడానికి వీల్లేదని తెలిపింది. ఆదిపురుష్‌పై బ్యాన్‌ను ఎత్తివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు మాటలు కూడా వినేదే లేదంటున్నాడు ఖాట్మండు మేయర్ బాలెన్ షా. 'దేశ సార్వభౌమాదిధికారం, స్వతంత్రత విషయానికి వస్తే నేను ఏ చట్టానికి, న్యాయానికి కూడా కట్టుబడి ఉండను' అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. చదవండి: మెగా ప్రిన్సెస్ రాక.. నిహారిక రియాక్షన్ చూశారా? నువ్వు లేకుండా ఇల్లు బోసిపోతోంది: నటి ఎమోషనల్ -
'ఆదిపురుష్' 6వ రోజు కలెక్షన్.. మరీ ఇంత తక్కువ!?
ప్రభాస్ 'ఆదిపురుష్' హడావుడి తగ్గినట్లే కనిపిస్తుంది. తొలి మూడు రోజుల్లో ఆకాశమే హద్దు అన్నట్లు రయ్ మని దూసుకెళ్లాయి. నాలుగో రోజు నుంచి సడన్ గా డ్రాప్ అయ్యాయి. ఆరో రోజైన బుధవారమైతే మరింత తక్కువగా వచ్చాయి. మొత్తం నంబర్ చూడటానికి పెద్దగా ఉండొచ్చు కానీ రోజువారీ లెక్కలు మాత్రం ట్రేడ్ వర్గాల్ని కలవరపెడుతున్నాయి. (ఇదీ చదవండి: అలాంటి రోల్స్ చేసి చాలా ఇబ్బందిపడ్డా: ఆశిష్ విద్యార్థి) ఆరురోజుల్లో ఎన్నికోట్లు? రామాయణం ఆధారంగా తీసిన 'ఆదిపురుష్' రిలీజ్ కి ముందు ఓ మాదిరి హైప్ ఏర్పరుచుకుంది. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత మొత్తం పరిస్థితి మారిపోయింది. చాలామందికి ఈ సినిమా నచ్చుండొచ్చు కానీ విమర్శలు చేసేవాళ్లు మాత్రం ఎక్కువయ్యారు. వాటి ప్రభావమో ఏమో గానీ కలెక్షన్స్ పై ఈ ఎఫెక్ట్ గట్టిగానే పడిందని చెప్పొచ్చు. ఆరో రోజు వరల్డ్ వైడ్ కేవలం రూ.15 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. దీంతో ఓవరాల్ నంబర్ రూ.410 కోట్లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి? రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ఆదిపురుష్'కి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో అనుకున్న దానికంటే తక్కువగానే థియేటర్లకు వెళ్తున్నారు. ఐదో రోజుకు మన రాష్ట్రాల్లో రూ.75.70 కోట్ల షేర్ ఉండగా, ఆరో రోజుకి రూ.77.53 కోట్లు అయింది. అంటే దాదాపు రూ.1.83 కోట్లు మాత్రమే వచ్చింది. వర్కింగ్ డేస్ లో ఇలా ఉంటే పర్లేదు గానీ ఈ వీకెండ్ లో మాత్రం పుంజుకోవాలి లేదంటే మాత్రం భారీ నష్టాలు తప్పవు!? #AdiPurush divine triumph all over🏹🔥#AdiPurushBlockBuster#AdiPurush3D#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar @SachetParampara @neerajkalyan_24 @TSeries @Retrophiles1 @UV_Creations @Offladipurush #Pramod #Vamsi @amb_cinemas @vishwaprasadtg… pic.twitter.com/j8LvW5l5PV — People Media Factory (@peoplemediafcy) June 22, 2023 (ఇదీ చదవండి: స్టార్ సింగర్ మెడలో డైమండ్ వాచ్.. ఎన్ని కోట్లో తెలుసా?) -
ప్రభాస్ 'ఆదిపురుష్'.. ఆ రెండు మినహాయిస్తే: రామాయణ నటుడు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. ఈనెల 16న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం తొలిరోజు నుంచే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. తొలిరోజే రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కానీ అంతే అంతేస్థాయిలో విమర్శల దాడి ఎదుర్కొంది. (ఇది చదవండి: ‘ఆదిపురుష్’ చూసి నిజంగా సిగ్గుపడుతున్నా.. ఓం రౌత్‌కు ఇవన్నీ అవసరమా?) తాజాగా రామాయణం టీవీ సీరియల్లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహ్రీ ఆదిపురుష్ చిత్రం చూశానని తెలిపారు. అయితే ఈ చిత్రంలో రెండు అంశాలు మాత్రమే తనకు నచ్చాయని వెల్లడించారు. కానీ ఈ సినిమా చూసేందుకు ఎందుకు వచ్చానా? అనిపించిందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదిపురుష్ తనను తీవ్రంగా నిరాశపర్చిందన్నారు. సునీల్ లహ్రీ మాట్లాడుతూ.. 'నేను ఆదిపురుష్ సినిమా చూశా. ఈ చిత్రంపై నాకు చాలా ఆశలు పెట్టుకున్నా. కానీ చాలా నిరాశకు గురి చేసింది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు ఈ చిత్రం ఎవరు తీశారు? నేను ఎందుకు సినిమా చూసేందుకు వచ్చానా అనిపించింది. హనుమాన్ను ఓ వీధి భాష మాట్లాడే వారిలా చూపించారు. సినిమాలో నాకు నచ్చినవి రెండే అంశాలు బాగున్నాయి. ఒకటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ. ఈ రెండు మినహాయిస్తే ఈ మూవీ చూసిన వారికి నిరాశ తప్పదు. సినిమా థియేటర్లో నా పక్కన కూర్చున్నవారు సైతం సినిమా బాగాలేదన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ తప్పా.. చిత్రంలో ఏం లేదని అన్నారు. మరో వ్యక్తి మాట్లాడుతూ రామాయణం పేరుతో ప్రజలకు ఏం చూపిస్తున్నారంటూ మండిపడ్డారని.' తెలిపారు. (ఇది చదవండి: 'ఏజెంట్'పై ఆ నిర్మాత కామెంట్స్.. దేవుడు కాపాడాడని! ) -
ఆదిపురుష్‌పై విమర్శలు.. స్పందించిన కృతి సనన్ తల్లి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. జూన్ 16న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తొలిరోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం కావడంతో సినీ విమర్శలకు ఆగ్రహానికి గురైంది. ఈ చిత్రంలోని కొన్ని పాత్రలు, డైలాగ్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. (ఇది చదవండి: ‘ఆది పురుష్’ హనుమంతుని కండల రహస్యం ఇదేనట!) అంతేకాకుండా సీత భారత్‌లో జన్మించినట్లు చూపించడంపై నేపాల్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఇండియన్ సినిమాలపై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆదిపురుష్ టీం వారిని క్షమాపణలు కోరింది. అయితే ఈ చిత్రంలో సీత పాత్రలో కృతి సనన్ నటించింది. ఈ చిత్రంలోని పాత్రలపై వస్తున్న విమర్శలపై తాజాగా కృతి సనన్ తల్లి గీతా సనన్ స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మేసేజ్ పోస్ట్ చేసింది. ఇన్‌స్టాలో గీతా సనన్ రాస్తూ.. 'ప్రజలు ఒక నిర్దిష్ట విషయాన్ని మంచి మనస్తత్వం, ఆలోచనతో చూడాలి. మనం సరైన దృక్పథంతో చూసినప్పుడే మనకు ప్రపంచం అందంగా కనిపిస్తుంది. మనకు భగవంతుడు రాముడు ప్రేమను పంచమని ప్రజలకు బోధించాడు. శబరి రామునికి అందించిన ప్రేమను చూడాలి కానీ.. ఆ వ్యక్తి తప్పులను చూడకూడదు. ఎదుటి వారి భావోద్వేగాలను మనం అర్థం చేసుకోవాలి. జై శ్రీరామ్' అంటూ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 28 సినిమాలు!) View this post on Instagram A post shared by Geeta Sanon (@geeta_sanon) -
ఆదిపురుష్ లో మేజర్ మిస్టేక్స్...ఇవే లేకుండా ఉండుంటే
-
‘ఆది పురుష్’ హనుమంతుని కండల రహస్యం ఇదేనట!
హీరో ప్రభాస్ నటించిన ‘ఆది పురుష్’ సినిమా చిత్రీకరించిన తీరుపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సినిమాలోని హనుమంతుని క్యారెక్టర్, అతని డైలాగ్స్‌పై విమర్శలు చుట్టుముట్టిన నేపధ్యంలో చిత్ర యూనిట్ ఆ డైలాగ్స్‌లో మార్పులు చేర్పులు చేసింది. ‘ఆది పురుష్’ సినిమాలోని హనుమంతుని పాత్రను దేవదత్త నాగె పోషించారు. మరాఠీ నటుడైన దేవదత్త నాగె దీనికిముందు ‘తాన్హాజీ’ సినిమాలో నటించారు. అలాగే ‘వీర్ శివాజీ’, ‘బాజీరావ్ మస్తానీ’ తదితర ప్రముఖ సీరియల్స్‌లో నటించారు. మహారాష్ట్రలోని అలీబాగ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం ముంబైలో తన భార్య కంచన్ నాగెతో పాటు ఉంటున్నారు. దేవదత్త నాగె వయసు 41. ఆయన 2013లో ‘వన్స్ అపాన్ ఆ టైమ్ ఇన్ ముంబై దోబారా’ సినిమాతో బాలీవుడ్లో కాలుమోపారు. ‘ఆది పురుష్’ సినిమా గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు హనుమంతునితో ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. తనకు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తొలిసారి జిమ్‌కు వెళ్లానని,ఆ జిమ్ పేరు హనుమాన్ వ్యాయామశాల అని అన్నారు. హనుమంతుని ఆశీర్వాదంతోనే సినిమాలో ఈ పాత్ర పోషించానని తెలిపారు. ఈ పాత్రను తాను భక్తిలో లీనమై చేశానని అన్నారు. దేవదత్త సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు 25 వేలకు మించిన ఫాలోవర్స్ ఉన్నారు. దేవదత్త సోషల్ మీడియాలో తరచూ తన ఫొటోలను షేర్ చేస్తుంటారు. రోజూ తగిన రీతిలో వ్యాయామం చేయడమే తన బాడీ బిల్డింగ్ సీక్రెట్ అని దేవదత్త తెలిపారు. ఇది కూడా చదవండి: భారీగా తగ్గిన ఆదిపురుష్ టిక్కెట్ల ధరలు.. -
ఆదిపురుష్ టీం బంపరాఫర్.. భారీగా టికెట్ల ధరలు తగ్గింపు!
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఔం రౌత్ తెరకెక్కించారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ మూవీ జూన్ 16న థియేటర్లలో రిలీజైంది. తొలిరోజే బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఈ చిత్రంలోని పాత్రలు, డైలాగ్స్‌పై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. దీంతో మూవీ మేకర్స్ తమ తప్పులను అంగీకరించి.. అభ్యంతరాలు వ్యక్తం చేసిన డైలాగ్స్ మార్చేశారు. దీంతో ప్రస్తుతం థియేటర్లలో మార్చిన సినిమానే ప్రదర్శిస్తున్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ సినిమా చూడలేదు, నా విజ్ఞప్తి మాత్రం ఇదే!: ‘రామాయణ్’ సీత) ఈ నేపథ్యంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. తొలి మూడు రోజులు కలెక్షన్ల వర్షం కురవగా.. ఐదో రోజుకు వచ్చేసరికి భారీస్థాయిలో పడిపోయాయి. దీంతో మళ్లీ ప్రేక్షకుల కోసం ఆదిపురుష్ మేకర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ల ధరను భారీగా తగ్గించారు. త్రీడీలో సినిమా చూసేందుకు రూ.150 లకే టికెట్స్ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడులో ఈ ఆఫర్ చెల్లదని తెలిపారు. ఈ టికెట్లపై 3D గ్లాస్ ఛార్జీలు అదనంగా ఉంటాయని పేర్కొన్నారు. (ఇది చదవండి: చరణ్ కంటే ఉపాసన ఆస్తుల విలువే ఎక్కువా? ఎన్ని కోట్లో తెలిస్తే.. ) View this post on Instagram A post shared by T-Series (@tseries.official) -
ఆదిపురుష్ సినిమా చూడలేదు, నా విజ్ఞప్తి మాత్రం ఇదే!: ‘రామాయణ్’ సీత
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. ఈ మూవీ టీజర్ నుంచి సినిమా రిలీజైన కూడా వివాదాలు వదలడం లేదు. మొదటి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ చిత్రంలోని హనుమంతుని డైలాగ్స్, పాత్రల వేషధారణను తప్పుబడుతున్నారు. అసలు రామాయణాన్ని వక్రీకరించారంటూ రోజు రోజుకు ఆదిపురుష్‌పై చిత్రబృందంపై మండిపడుతున్నారు. ఇప్పటికే శక్తిమాన్ నటుడు ముకేశ్ ఖన్నా దర్శకుడు ఔం రౌత్‌కు రామాయణం గురించి కొంచెం కూడా అవగాహన లేదని విమర్శించారు. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు!) తాజాగా రామాయణం సీరియల్లో సీత పాత్ర పోషించి నటి దీపికా చిక్లియా ఆదిపురుష్ నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై పురాణ, ఇతిహాసాలైన రామాయణంపై సినిమాలు తీయడం ఆపేయాలని దీపికా విజ్ఞప్తి చేశారు. ఆదిపురుష్‌పై మాట్లాడుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారమె. పాఠశాలల్లో విద్యార్థులకు పురాణాన్ని తప్పనిసరిగా బోధించాలని సూచించారు. రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణం సీరియల్లో దీపిక సీత పాత్ర పోషించింది. దీపికా మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమా గురించి నేను కామెంట్స్ చేయదలచుకోలేదు. నేను ఇంకా సినిమా చూడలేదు. కానీ నేను భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా. రామాయణం మన వారసత్వం. దీనిపై ఇక నుంచి సినిమాలు చేయకూడదనేది నా ఉద్దేశం. రామాయణంపై సినిమా చేసిన ప్రతిసారీ ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. రామాయణం మనకు చాలా పవిత్రమైనది. ఈ విషయంలో ఎవరినీ నొప్పించకూడదనుకుంటున్నా. మన విశ్వాసాన్ని మనం గౌరవించుకుందాం. రామాయణం అనేది వినోదానికి సంబంధించినది కాదు.' అని అన్నారామె. కాగా.. ఇప్పటికే దీపికా సహనటుడు అరుణ్ గోవిల్ కూడా ఆదిపురుష్ హాలీవుడ్ కార్టూన్ సినిమా అంటూ ఎద్దేవా చేశారు. కాగా.. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: చరణ్ కంటే ఉపాసన ఆస్తుల విలువే ఎక్కువా? ఎన్ని కోట్లో తెలిస్తే..) View this post on Instagram A post shared by Dipika (@dipikachikhliatopiwala) -
Adipurush AI Photos: ఆదిపురుష్ AI ఫోటోలు చూశారా? ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి (ఫొటోలు)
-
‘అంత తొందరెందుకు’.. ఢిల్లీ హైకోర్టులో ‘ఆదిపురుష్’కు స్వల్ప ఊరట
‘ఆపురుష్’ చిత్ర బృందానికి ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆదిపురుష్’ సినిమాఫై అత్యవసర విచారణ జరపాలని కోరుతూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా దాఖలు చేసిన ‘పిల్’ను ధర్మాసనం తిరస్కరించింది. ఈ చిత్రంపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చిచెప్పింది. ఈ నెల 30న విచారణకు రావాలని ఆదేశించింది. (చదవండి: ఆదిపురుష్' 5 రోజుల కలెక్షన్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు?) ఆదిపురుష్ చిత్రంలో వివాదాస్పదమైన అంశాలెన్నో ఉన్నాయని, నేపాల్ వంటి దేశాలు కూడా ఈ సినిమాను నిషేధించాయని హిందూ సేన లాయర్ పేర్కొన్నారు. ఈ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను, తొలగిస్తానని, డైలాగులను మారుస్తామని చిత్ర దర్శకుడు ఓంరౌత్ ప్రకటించినప్పటికీ అలాంటి చర్యలేవీ ఇప్పటివరకు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. వెంటనే ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని, ఈ మేరకు అత్యవసరంగా విచారణ జరపాలని హిందూ సేన లాయర్ కోరగా..హైకోర్టు అందుకు నిరాకరించింది. ఈ విషయంలో ఎలాంటి అత్యవసరం లేదని, జూన్ 30న విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ నెల 16న విడుదలై.. ప్రేక్షకుల నుంచి మిశ్రస స్పందనను సంపాదించుకుంది. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ.. అంతకు మించిన నిరసనలను ఎదుర్కొంటుంది. హిందూ సంఘాలతో పాటు పలువురు ప్రముఖులు ఈ సినిమాపై విమర్శలు చేస్తున్నారు. ఈ సినిమాపై నిషేధం విధించాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఆదిపురుష్‌పై సుమన్ రివ్యూ.. ప్రభాస్‌కు హ్యాట్సాఫ్.. కానీ..
ప్రభాస్ రాఘవుడిగా నటించిన ఆదిపురుష్ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. మొదటి మూడు రోజులు భారీ లెవల్లో కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత వసూళ్లు రాబట్టడంలో ఘోరంగా వెనకబడింది. ఇకపోతే శ్రీరామదాసులో రాముడిగా నటించిన సీనియర్ నటుడు సుమన్ తాజాగా ఆదిపురుష్‌పై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'రావణుడు సీతను ఎత్తుకుపోవడం నుంచి ఆమెను రక్షించడం వరకు మాత్రమే ఆదిపురుష్ తీశారు. మనం చిన్నప్పటి నుంచి సినిమాల్లో రాముడిని నీలిరంగులోనే చూశాం. అలాగే రాముడికి మీసాలు, గడ్డాలు కూడా ఉండవు. కానీ ఇందులో రాముడిని సాదాగా చూపించారు. అది చాలా పెద్ద రిస్క్. అయినా రెండున్నరేళ్లపాటు ప్రభాస్ ఆ బాడీని మెయింటైన్ చేయడం చిన్న విషయం కాదు. అందుకు అతడికి హ్యాట్సాఫ్ చెప్పాలి. రావణుడికి మోడ్రన్ హెయిర్ కట్ చేశారు. వేషధారణ మార్చారు. అది చాలా తప్పు. ఇలా డైరెక్టర్ చేసిన కొన్ని ప్రయోగాలు సినిమాలో ఇబ్బందికరంగా అనిపిస్తాయి. కొన్నిచోట్ల గ్రాఫిక్స్ బాగున్నాయి. మరికొన్నిచోట్ల గ్రాఫిక్స్ పాతదానిలా ఉన్నాయి. చదవండి: ఆదిపురుష్ 5 రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా? పాటలు నచ్చాయి. కృతీ సనన్ సీత క్యారెక్టర్లో బాగా చేసింది. ఈ సినిమాలో ఎమోషన్ మిస్ అయింది. చాలా చోట్ల సన్నివేశాలు హాలీవుడ్ సినిమాను గుర్తుకు తెచ్చాయి. ఈ తప్పులు చేయకపోయి ఉంటే ఇది అంతర్జాతీయ సినిమా అయి ఉండేది. ఆదిపురుష్ అనేది పవర్ఫుల్ టైటిల్.. కానీ సినిమా చూసి నిరాశ చెందాను. మైథాలజీ సినిమాలను దక్షిణాదివాళ్లే బాగా హ్యాండిల్ చేస్తారు' అని చెప్పుకొచ్చాడు సుమన్. చదవండి: ప్రేమలో అబద్ధాలు, మోసాలు నచ్చవు: రకుల్ ప్రీత్ సింగ్ -
ఆదిపురుష్ మూవీ కలెక్షన్స్
-
ఆదిపురుష్ కలెక్షన్స్...మూడురోజులు సర్ప్రైజ్... నాలుగో రోజు షాక్
-
'ఆదిపురుష్' 5 రోజుల కలెక్షన్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు?
డార్లింగ్ ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా బాక్సాఫీస్ దగ్గర పడుతూ లేస్తూ వెళ్తోంది. మంచి హైప్ తో విడుదలైన ఈ చిత్రం.. తొలి మూడురోజుల్లో అద్భుతమైన వసూళ్లు సాధించింది. రూ.340 కోట్ల వరకు సొంతం చేసుకుంది. నాలుగో రోజుకి మాత్రం అనుహ్యరీతిలో కలెక్షన్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు ఐదోరోజు కూడా మరింతగా తగ్గిపోయాయి. ఇంతకీ 'ఆదిపురుష్' ఓవరాల్ కలెక్షన్స్ ఎంత? అసలేం జరుగుతుంది? (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్ ముందే పసిగట్టిన ప్రభాస్.. ఆ వీడియో వైరల్!) కలెక్షన్స్ ఎంత? ఓ మాదిరి హైప్ తో రిలీజైన 'ఆదిపురుష్'.. తొలిరోజు రూ.140 కోట్ల వసూళ్లు సాధించింది. ఓ విధంగా చెప్పాలంటే మంచి ఆరంభం అని చెప్పొచ్చు. శనివారం, ఆదివారం కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా చెరో రూ.100 కోట్లు సాధించింది. దీంతో మూడు రోజుల్లో రూ.340 కోట్లు వచ్చాయి. నాలుగో రోజు మాత్రం కేవలం రూ.35 కోట్లు రావడం అందరినీ షాకయ్యేలా చేసింది. ఐదోరోజు మన దేశంలో కేవలం రూ.10 కోట్ల మాత్రమే నెట్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. గ్రాస్ తో కలిపి రూ.20 కోట్లు వచ్చాయి. దీన్నిబట్టి ఓవరాల్ గా ఐదు రోజుల్లో రూ.395 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి? 'ఆదిపురుష్' వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా సాగుతున్నాయి. మిగతా చిత్రాలకు ఇలా నిలకడగా ఉంటే పర్లేదు గానీ 'ఆదిపురుష్' విషయంలో ఇలా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రా-తెలంగాణలో కలిపి ఐదు రోజుల్లో రూ.75.70 కోట్ల షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్ షేర్ రూ.95 కోట్లు అని సమాచారం. మరింతగా పుంజుకోవాల్సిన రెండో వారంలో ఇలా డ్రాప్ కనిపిస్తుండటం ట్రేడ్ వర్గాల్ని కలవరపెడుతోంది. #Adipurush remains resilient at Global Box Office as it amassed ₹ 395 CR. on its day 5! The film keeps the momentum going on Tuesday.#BlockbusterAdipurush#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @DevdattaGNage… pic.twitter.com/qyz5GxH6P6 — People Media Factory (@peoplemediafcy) June 21, 2023 (ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్‌గా మారుతున్న ఆ పేరు!?) -
ఆదిపురుష్ గురించి ప్రభాస్ ఏం చెప్పాడంటే..
-
'ఆదిపురుష్' రిజల్ట్ ముందే పసిగట్టిన ప్రభాస్.. ఆ వీడియో వైరల్!
ఒక సినిమా చేస్తున్నప్పుడే హీరోలకు అది హిట్ అవుతుందా లేదా అనేది దాదాపుగా తెలిసిపోతుంది. ఒకవేళ ఏమైనా తేడా కొడితే రిజల్ట్ గురించి హీరోలు పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడరు. వీలైనంత వరకు సైలెంట్ గానే ఉంటారు. 'ఆదిపురుష్' విషయంలో మాత్రం రిజల్ట్ గురించి హీరో ప్రభాస్ ముందే పసిగట్టేశాడా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ఓ పాత వీడియోలో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలే ఈ కొత్త డౌట్స్ వచ్చేలా చేస్తున్నాయి. డార్లింగ్ ప్రభాస్ రాముడిగా నటించిన సినిమా 'ఆదిపురుష్'. థియేటర్లలోకి రాకముందు కొన్ని విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం.. ప్రేక్షకుల ముందుకొచ్చిన తర్వాత మరింతగా వివాదాలకు కారణమవుతోంది. కొందరికి ఈ మూవీ నచ్చింది, మరికొందరికి నచ్చలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలోనే ప్రభాస్ కి ఎందుకో సందేహం వచ్చింది. కానీ డైరెక్టర్ ఓం రౌత్.. ఇతడి మాట వినలేదనిపిస్తుంది. 'రాధేశ్యామ్' ప్రమోషన్స్ టైంలో ప్రభాస్ చేసిన కామెంట్స్ ఇదే నిజమనిపించేలా ఉన్నాయి. (ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!) 'ఆదిపురుష్ షూటింగ్ నాలుగు రోజులు జరిగిన తర్వాత నాకెందుకో ఔట్‌ఫుట్ మీద డౌట్ వచ్చింది. నేను ఈ సినిమా చెయ్యొచ్చా? ఇంతకుముందు నేను ఇలాంటి పాత్రలో నటించలేదు. మిగతా చిత్రాల విషయంలో తప్పు జరిగినా పర్లేదు కానీ రామాయణం విషయంలో తప్పు జరగకూడదు. ఆదిపురుష్ విషయంలో మనం తప్పు చేయకూడదు అని ఓం రౌత్ ని అడిగాను. అతను.. 'మీరు అలాంటి భయలేం పెట్టుకోవద్దు. సినిమా బాగా వస్తుంది, నేనున్నాను' అన్నాడు' అని ప్రభాస్ ఈ పాత వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్స్.. ప్రభాస్ ముందే 'ఆదిపురుష్' రిజల్ట్ ఊహించినట్లున్నాడు. అది చెబితేనే ఓం రౌత్ వినలేదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా 'రామాయణం' ఆధారంగా ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చినా 'ఆదిపురుష్' విషయంలో జరిగినంత రచ్చ అయితే ఎప్పుడు జరగలేదు. ఇక కలెక్షన్స్ విషయానికొస్తే.. తొలి మూడు రోజుల్లో రూ.340 కోట్లు వసూలు చేసింది. సోమవారానికి దారుణంగా పడిపోయింది. కేవలం రూ.35 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ వారం నిలబడితేనే సినిమా గట్టెక్కుతుంది. లేదంటే నష్టాలు తప్పవేమో అనిపిస్తోంది. (ఇదీ చదవండి: పాన్ ఇండియా హీరోలకు బోలెడు కష్టాలు.. ప్రభాస్ సహా వాళ్లందరూ!) -
Adipurush Mistakes: ఆదిపురుష్ మూవీ.. ఓం రౌత్ చేసిన అతిపెద్ద బ్లండర్స్ ఇవే!
ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన చిత్రం 'ఆదిపురుష్'. జూన్ 16న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శల దాడిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే సినిమాలోని పలు అంశాలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. డైలాగ్స్, పాత్రల వేషధారణపై పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి. సినిమా టీజర్ రిలీజైనప్పటి నుంచి సినిమా విడుదలైన తర్వాత కూడా ఆదిపురుష్‌పై విమర్శల దాడి ఆగడం లేదు. అసలు మీరు రామాయణమే కాదంటూ నెటిజన్స్‌తో పాటు కొందరు నటీనటులు సైతం విమర్శిస్తున్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ ఓ పెద్ద జోక్.. తీవ్ర విమర్శలు చేసిన నటుడు ) ఇవన్నీ పక్కనబెడితే దర్శకుడు ఓం రౌత్ చేసిన పొరపాట్లు ఏంటి? అసలు ఎక్కడ ఈ సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు ఓం రౌత్ విఫలమయ్యారు. రామాయణంలో పాత్రలకు ఆధునిక సాంకేతికతను జోడించడం సినిమాను దెబ్బతీసిందా? లేక పాత్రలను తీర్చిదిద్దడంలో.. వాస్తవాన్ని చూపించడంలో విఫలమయ్యారా? అనేది ఓ సారి పరిశీలిద్దాం. ఆదిపురుష్‌పై ఇంతలా విమర్శలు రావడానికి ప్రధాన కారణాలేంటో ఓసారి తెలుసుకుందాం. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ జూన్ 16న సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత తీవ్రస్థాయిలో విమర్శలకు గురైంది. విమర్శలకు దారితీసిన ప్రధాన తప్పిదాలివే! 1. రావణుడికి ఉన్న పది తలలపై ప్రేక్షకులు తీవ్రంగా ఎగతాళి చేశారు. అంతే కాకుండా రావణుడి కేశాలంకరణ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీతో పోలి ఉందని కామెంట్స్ చేశారు. 2. సినిమాలోని హనుమంతునిపై రాసిన డైలాగులు ప్రేక్షకులను, విమర్శకులను తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే డైలాగ్స్‌ను మారుస్తామని నిర్మాతలు ప్రకటించారు. 3.పుష్పక విమానంలో రావణుడు సీతను అపహరిస్తాడు. కానీ.. ఆదిపురుష్‌లో మాత్రం నల్లటి గబ్బిలం లాంటి పక్షిపై రావణుడు కనిపించాడు. ఇది కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. 4. సీత పాత్రలో కృతి సనన్ పలు రకాల రంగుల దుస్తులు ధరించింది. కానీ ఇతిహాసమైన రామాయణంలో రాముడు, సీత అజ్ఞాతవాసానికి వెళ్లారు. ఆ సమయంలో కేవలం కాషాయ రంగు దుస్తులు మాత్రమే ధరించారు. 5. డైలాగ్స్ పక్కన పెడితే చిత్రనిర్మాతలు రాఘవ అని కూడా పిలువబడే రాముడిని కోపంగా, మరింత దూకుడుగా ఉండే వ్యక్తిగా ఆదిపురుష్‌లో చూపించారు. ఇది కూడా సినిమాకు ఓ పెద్ద మైనస్ అనే చెప్పాలి. 6. పురాణాల ప్రకారం రావణుడి లంక బంగారు వర్ణంతో నిండి ఉంది. అయితే ఓం రౌత్ లంకను ఈ చిత్రంలో నలుపు, తెలుపులో చిత్రీకరించినందుకు నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. 7. ఇంద్రజిత్ పాత్రలో మేఘనాథ్‌కు చాలా టాటూలు వేయించుకున్నట్లు చూపించారు. దీంతో నెట్టిజన్స్ మీమ్స్ చేస్తూ ట్రోల్ చేశారు. (ఇది చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!) ఇలాంటి పొరపాట్లతో ఆదిపురుష్ టీం ఇప్పటికే అపఖ్యాతిని మూటగట్టుకుంది. వాస్తవానికి భిన్నంగా పాత్రలను చూపించిన ఓం రౌత్ తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఏదేమైనా పురాణ ఇతిహాసాలను తెరపై చూపించాలంటే వాస్తవాలను మరో కోణంలో చూపిస్తే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని తెలుస్తోంది. రామాయణం ఆధారంగా రాబోయే సినిమాల్లో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తపడతారని ఆశిద్దాం. -
‘ఆదిపురుష్’కు దెబ్బ మీద దెబ్బ.. రచయిత వివాదాస్పద వ్యాఖ్యలు!
‘ఆదిపురుష్’ సినిమా మొదలెట్టినప్పుడు ఆ చిత్రానికి ఎంత హైప్ వచ్చిందో ప్రస్తుతం అంతే వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకంగా ‘ఆదిపురుష్’ చిత్రాన్ని కొన్ని ప్రాంతాల్లో బ్యాన్ చేయాలని ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. రామాయణాన్ని వక్రీకరించారని.. కేవలం వీఎఫ్ఎక్స్తో హాలీవుడ్ చిత్రాల్ని తలపించిందని, రావణాసురుడి వేషధారణ సరిగా లేదని విమర్శలొచ్చాయి. ఇన్ని వివాదాల నడుమ ఆదిపురుష్ సినిమా డైలాగ్ రైటర్, లిరిసిస్ట్ మనోజ్ ముంతాషిర్ శుక్లా మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనొక భక్తుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా తెరకెక్కించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్’ ఇటీవల విడుదలై మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓవైపు భారీగా కలెక్షన్లను రాబడుతున్నా అంతే స్థాయిలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిపురుష్ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా మాట్లాడుతూ.. ‘హనుమంతుడు దేవుడు కాదు. ఆయనొక భక్తుడు. ఆయన భక్తిలో ఉన్న శక్తి కారణంగా మనమే ఆయనను భగవంతుడిని చేశామని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఉన్న వివాదాల నడుమ ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఆదిపురుష్ చిత్రానికి మరింత మైనస్‌గా మారే అవకాశం లేకపోలేదు. దీని ప్రభావం సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. జనాన్ని రెచ్చగొట్లే వ్యాఖ్యలు చేయకు అంటూ హెచ్చరిస్తున్నారు. “बजरंग बली भगवान नहीं हैं भक्त हैं हमने उनको भगवान बनाया बाद में” -@manojmuntashir तुम मूर्ख हो मनोज, मौन हो जाओ अभी भी समय है। pic.twitter.com/PSqLXpJ04q — BALA (@erbmjha) June 19, 2023 చదవండి: Salaar Movie: 'సలార్' కొత్త పోస్టర్ లో ఉన్నవి అవేనా? -
‘ఆదిపురుష్’ చూసి నిజంగా సిగ్గుపడుతున్నా.. ఓం రౌత్‌కు ఇవన్నీ అవసరమా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. ఈనెల 16న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం తొలిరోజు నుంచే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. తొలిరోజే రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. అంతేస్థాయిలో విమర్శల పాలైంది. రోజు రోజుకు ఈ చిత్రాన్ని విమర్శించే వారి సంఖ్యం పెరుగుతోంది. తాజాగా రామాయణం టీవీ సీరియల్లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహరి ఆదిపురుష్ చిత్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా వాస్తవానికి చాలా దూరంగా ఉందని విమర్శించారు. (ఇది చదవండి: 'సలార్' కొత్త పోస్టర్లో 'కేజీఎఫ్' కనెక్షన్.. గమనించారా? ) సునీల్ లహరి మాట్లాడుతూ.. 'వాల్మీకి రామాయణం ఆధారంగా సినిమా తీస్తున్నామని డిస్క్లెయిమర్లో స్పష్టంగా చెప్పడం చాలా నిరుత్సాహానికి గురిచేసింది. అలా ఎందుకు చెప్పారని నేను నిజంగా సిగ్గుపడుతున్నా. ఇది కేవలం ఫాంటసీ అని చెప్పి.. అందుకు భిన్నంగా తీశారు. పుష్పక విమానంతో రావణుడిని చూపించలేదు. మేఘనాథ్, లక్ష్మణ్ యుద్ధాన్ని నీటిలో చూపించారు. డైలాగులు చాలా దారుణంగా ఉన్నాయి. ఏ పాత్ర క్యారెక్టరైజేషన్ కూడా స్పష్టంగా లేదు. దర్శకుడు చాలా గందరగోళంగా ఉన్నట్లు కనిపించింది. అసలు ఈ సినిమా ఎందుకు తీశాడో తెలియదు. స్పెషల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్తో మాత్రమే సినిమాని నిలబెట్టలేరు. ఎందుకంటే రామాయణం గురించి సరళంగా చెప్పాలి. హనుమంతునితో ఎలాంటి పాత్రను క్రియేట్ చేశారో.. ఎలాంటి డైలాగులు చెప్పారో అర్థం కావడం లేదు. ' అని అన్నారు. సినిమాలోని పాత్రలపై గురించి ఆయన మాట్లాడుతూ.. 'ఆదిపురుష్‌లో పాత్రలు చూసి నిజంగా ఆశ్చర్యపోయా. రావణుడు అత్యంత సుందరమైన దేశానికి రాజు. అలా ఎందుకు చూపించారో నాకు తెలియదు. సినిమాలో నకిలీ సీతను తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్లు కథను సింపుల్‌గా చెప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. నాకు ఈ సినిమాలో అన్ని పాత్రలూ అయోమయంగా కనిపించాయి. వాటిలో ఏదీ స్పష్టంగా రాలేదు. ఇది నటీనటుల తప్పు కాదు. వారి పాత్రలను స్పష్టంగా లేనందున అలా జరిగింది. ఓం రౌత్ సెన్సిబుల్ డైరెక్టర్ అనుకున్నా. ఈ సినిమా తీయడంలో ఆయన మరింత తెలివిగా వ్యవహరించాల్సింది.' అని అన్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ ఓ పెద్ద జోక్.. తీవ్ర విమర్శలు చేసిన నటుడు) -
ఆదిపురుష్ విషయంలో ప్రభాస్ మౌనం.. ఎక్కడున్నాడు?...ఏం చేస్తున్నాడు
-
ఆదిపురుష్ ని బ్యాన్ చేసిన రాజకీయ నేతలు.
-
Adipurush: సినిమాను బ్యాన్ చేయాలంటూ ప్రధాని మోదీకి లేఖ
ప్రభాస్ రాముడిగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘ఆదిపురుష్’కు భారీగా విమర్శలు వస్తున్న తరుణంలో మూవీ మేకర్స్‌కు మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే సోమవారం నాడు మూవీకి భారీగా కలెక్షన్స్ తగ్గాయి. ఇన నుంచి కూడా ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు. ఈ తరుణంలో సినిమాను ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేయాలంటూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ వారు ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు. అంతే కాకుండా ఓటీటీలో కూడా సినిమా ప్రదర్శన జరగకుండా చూడాలని కోరారు. ఈ సినిమాలో శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, రావణుడి పాత్రలను మలిచిన తీరు బాగాలేదని లేఖలో పేర్కొన్నారు. (ఇదీ చదవండి: Adipurush: సోమవారం దారుణంగా పడిపోయిన కలెక్షన్స్.. కారణం ఇదే) భారతీయ ఇతిహాసమైన రామాయణం ఇమేజ్ను చెడగొట్టేలా ఆదిపురుష్ ఉంది. ఇందులోని డైలాగ్‌లు హిందూ మనోబావాలు దెబ్బతినేలా ఉన్నాయి. సినిమా కూడా చిన్నపిల్లలు ఆడుకునే వీడియో గేమ్‌లా చిత్రీకరించారని ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ వారు లేఖలో తెలిపారు. కాబట్టి సినిమా డైరెక్టర్ ఓం రౌత్‌తో పాటు రచయిత మనోజ్ ముంతాషిర్పై కేసు నమోదు చేసి భారతీయలు ప్రతిష్టను కాపాడాలంటూ వారు కోరారు. ఇలాంటి సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ భాగస్వామ్యం కావడం సిగ్గుచేటని వారు పేర్కొన్నారు. (ఇదీ చదవండి: లిటిల్ మెగా ప్రిన్సెస్ గురించి చిరు ఏమన్నారంటే?) All India Cine Workers Association write to Prime Minister Narendra Modi, requesting him to "stop screening the movie and immediately order a ban of #Adipurush screening in the theatres and OTT platforms in the future. "We need FIR against Director Om Raut, dialogue writer… pic.twitter.com/jYq3yfv05c — ANI (@ANI) June 20, 2023 -
క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!
'ఆదిపురుష్'కి బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. అలానే రోజురోజుకీ వివాదాలు కూడా ఎక్కువవుతున్నాయి. సినిమా స్టోరీ దగ్గర నుంచి పాత్రల గెటప్స్ వరకు చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఇవన్నీ కాదన్నట్లు 'ఆదిపురుష్' లోని ఓ డైలాగ్ వల్ల నేపాల్ ప్రభుత్వం.. భారతీయ సినిమాలపై నిషేధం విధించింది. ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. దీంతో 'ఆదిపురుష్' టీమ్.. నేపాల్ ప్రభుత్వానికి క్షమాపణలు చెబుతూ ఓ లెటర్ రిలీజ్ చేసింది. ఏం జరిగింది? 'ఆదిపురుష్' సినిమాని రామాయణం ఆధారంగా తీశారు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్ నటించారు. రిజల్ట్, వసూళ్ల గురించి పక్కనబెడితే ఇందులో సీత.. భారతదేశంలో పుట్టింది అనే అర్థం వచ్చేలా ఓ డైలాగ్ ఉంది. రిలీజ్ రోజే దీనిపై నేపాల్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దాన్ని తొలిగిస్తేనే ప్రదర్శిస్తామని పట్టుబట్టింది. అలానే రామాయణాన్ని వక్రీకరించేలా సినిమా తీశారని.. అక్కడ ప్రభుత్వ నేతలు భారతీయ సినిమాలపై నిషేధం విధించారు. (ఇదీ చదవండి: చరణ్-ఉపాసన బిడ్డకు ఆ నంబర్ సెంటిమెంట్!?) సారీ చెప్పిన నిర్మాతలు నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత ముదరకముందే 'ఆదిపురుష్' టీమ్ రాజీకి వచ్చింది. క్షమాపణలు చెబుతూ ఓ లెటర్ ని రిలీజ్ చేసింది. భారతీయ సినిమాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఖాట్మండు మేయర్ ని అభ్యర్థించింది. ఇందుకు సంబంధించిన ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. లేఖలో ఏముంది? 'నేపాల్ ప్రజల మనోభావాలు ఏ విధంగానైనా దెబ్బతీసుంటే మమ్మల్ని క్షమించాలి. మేం కావాలని ఎవరి సామరస్యాన్ని దెబ్బతీయాలనుకోలేదు. ఈ మూవీని క్రియేటివ్ కోణంలోనే చూడాలని కోరుకుంటున్నాం. చరిత్రపై ఆసక్తిని పెంచి, పెద్ద సంఖ్యలో ప్రేక్షకులని అలరించాలనే మా ఉద్దేశానికి మద్దతు ఇవ్వాలని మేం అభ్యర్థిస్తున్నాం' అని టీ-సిరీస్ లేఖలో ఉంది. పడిపోయిన కలెక్షన్స్ ఈ లేఖపై నేపాల్ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఎన్ని విమర్శలు వస్తున్నాసరే బాక్సాఫీస్ దగ్గర 'ఆదిపురుష్' కలెక్షన్స్ ప్రభంజనం ఆగట్లేదు. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.375 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తొలి మూడురోజులు బాగానే వసూళ్లు వచ్చినప్పటికీ, నాలుగో రోజు దారుణంగా తగ్గిపోయాయి. ఈ వారం కూడా 'ఆదిపురుష్' నిలబడితేనే లాభాల్లోకి వెళ్తుంది. లేదంటే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు కష్టాలు తప్పవు!? (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రైటర్‌కు బెదిరింపులు.. చంపేస్తామని!)