ఆదిపురుష్ రిలీజ్.. మనోజ్ చేసిన పనికి ప్రశంసలు | Manchu Manoj Bhuma Mounika Watch Adipurush With Orphan Childrens | Sakshi
Sakshi News home page

Manchu Manoj Bhuma Mounika: ఆదిపురుష్ రిలీజ్.. గొప్ప మనసు చాటుకున్న మనోజ్ -మౌనిక

Published Fri, Jun 16 2023 11:21 PM | Last Updated on Fri, Jun 16 2023 11:23 PM

Manchu Manoj Bhuma Mounika Watch Adipurush With Orphan Childrens - Sakshi

ప్రభాస్ ఆదిపురుష్ ప్రపంచవ్యాప‍్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమా విడుదల రోజు ఎక్కడా చూసిన జై శ్రీరామ్ నినాదాలే వినిపించాయి.  అయితే ఈ సినిమాకు ఇప్పటికే ఆదిపురుష్ టీం కొందరికి ఉచితంగా టికెట్స్ అందిస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఇవాళ ఆదిపురుష్ విడుదల సందర్భంగా టాలీవుడ్ దంపతులు మంచు మనోజ్- భూమా మౌనిక చేసిన పనికి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతకీ ఈ జంట ఏం చేశారో తెలుసుకుందాం. 

(ఇది చదవండి: సినిమా బాలేదన్నందుకు చితక్కొట్టిన ఫ్యాన్స్‌.. వీడియో వైరల్‌)

ఇటీవలే మంచుమనోజ్ తన పుట్టిన రోజులు వేడుకలను అనాథాశ్రమంలో జరుపుకున్న సంగతి తెలిసిందే. వారందరికీ పుస్తకాలు, బ్యాగులు అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. తాజాగా ఆదిపురుష్ రిలీజ్ సందర్భంగా అనాథ పిల్లలతో కలిసి మంచు మనోజ్- మౌనిక సినిమాను వీక్షించారు. పిల్లల కోసం టికెట్స్ మంచు మనోజ్ కొనుగోలు చేశారు. ప్రసాద్ ఐమాక్స్‌లో అనాథ పిల్లలతో కలిసి సినిమా చూస్తున్న ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. అలాంటి వారి కోసం మనోజ్ దాదాపు 2500 టికెట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో మంచు మనోజ్ చేసిన పనికి ప్రభాస్ ఫ్యాన్స్ సైతం అభినందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement