
టాలీవుడ్ నటి, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్ గురైంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ వాటిని ఎవరూ నమ్మవద్దని అభిమానులను, సన్నిహితులను కోరింది. తనకు డబ్బులు అవసరమైతే డైరెక్ట్‌గా అడుగుతానని తెలిపింది. సోషల్ మీడియాలో ఎవరినీ నేను డబ్బులు అడగనని ట్వీట్ చేసింది. ఇలాంటి వాటి పట్ల దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించింది.
కాగా.. మంచు లక్ష్మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో బిట్‌కాయిస్, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో అప్రమత్తమైన మంచు లక్ష్మీ వెంటనే ట్విటర్ ద్వారా అభిమానులను, సన్నిహితులను అలర్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. చివరికీ నా మొబైల్ నంబర్ కూడా హ్యాకర్స్ గుర్తించారని ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఆఫ్రికా దేశం నైజీరియాకు చెందిన సైబర్ కేటుగాళ్లు ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది.
కాగా.. మంచు లక్ష్మీ ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్ ఫ్యాషన్ షో నిర్వహించింది. టీచ్ ఫర్ ఛేంజ్ పేరిట నిర్వహించిన ఈ ఈవెంట్‌లో పలువురు టాలీవుడ్ సినీతారలు హాజరైన సందడి చేశారు. ఆమె తమ్ముడు మంచు మనోజ్ సైతం ఈవెంట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలైన సంగతి తెలిసిందే.
ఇక సినిమాల విషయానికొస్తే మంచు లక్ష్మీ చివరిసారిగా మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మాన్‌స్టర్‌లో కనిపించింది. ఇందులో మోహన్‌లాల్, హనీ రోజ్, జానీ ఆంటోనీ, జగపతి బాబు కూడా అతిథి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆమె మెడికల్ సైకలాజికల్ థ్రిల్లర్ దక్ష – ది డెడ్లీ కాన్‌స్పిరసీలో కనిపించనుంది. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సముద్రఖని, విశ్వంత్, చిత్ర శుక్లా, మహేశ్, వీరేన్ తంబిదొరై కూడా నటించారు.
And they got to my number too! Wow! This is very scary! pic.twitter.com/3rOeiTgpwn
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) April 17, 2025
My Instagram has been hacked. Kindly do not engage with anything that is on my stories.
If I need money, I will ask you directly not on social media 😂
Will tweet once I get it all back in order…— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) April 17, 2025