hacking
-
సైబర్ కేటుగాళ్ల కొత్త ఎత్తు.. వాట్సాప్ హ్యాకింగ్!
సాక్షి, హైదరాబాద్: కంటికి కనిపించకుండా ఆన్లైన్ ద్వారా అందినకాడికి దండుకొనే సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు పంథా మార్చుకుంటున్నారు. తాజాగా వారు వేస్తున్న ఎత్తుగడే ‘వాట్సాప్ హ్యాకింగ్’. దీనికి చిత్తవుతున్న అనేక మంది ఆర్థికంగా నష్టపోతున్నట్లు ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కౌన్సిల్ (ఎన్సీఎస్సార్సీ) గుర్తించింది. దాదాపు నెల నుంచి జోరుగా సాగుతున్న ఈ మోసాల బారినపడకుండా ఉండాలంటే వాట్సాప్ వినియోగదారులు కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్సీఎస్సార్సీ డైరెక్టర్ డాక్టర్ ఇ.కాళీరాజ్ నాయుడు స్పష్టం చేశారు. కేరళలో మొదలైన ఈ తరహా నేరాలు తమిళనాడు, తెలంగాణకు సైతం విస్తరించాయని చెప్పారు. ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన వాట్సాప్ హ్యాకింగ్ జరుగుతున్న తీరుతెన్నులు, ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.సైబర్ మోసాలు చేసేది ఇలా.. » దేశవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల ఫోన్ నంబర్లను సైబర్ నేరగాళ్లకు డార్క్ వెబ్ ద్వారా కొని వాటి ఆధారంగా ప్రధానంగా వృద్ధులు, గృహిణులనే టార్గెట్‌గా చేసుకొని స్కామ్‌లకు పాల్పడుతున్నారు. » ఓ వినియోగదారుడి ఫోన్లో ఉన్న వాట్సాప్ మరో ఫోన్లో యాక్టివేట్ కావాలంటే యాక్టివేషన్ కోడ్‌గా పిలిచే ఓటీపీ తప్పనిసరి. టార్గెట్ చేసిన వ్యక్తుల వాట్సాప్‌ను తమ ఫోన్లలో యాక్టివేట్ చేసుకోవడానికి సైబర్ నేరగాళ్లు పక్కా పథకం ప్రకారం కథ నడుపుతున్నారు. » తొలుత తమ వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీన్ని యాక్టివేట్ చేస్తూ టార్గెట్ చేసిన వ్యక్తుల మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తున్నారు. వాట్సాప్ యాప్ నుంచి యాక్టివేషన్ ఓటీపీ అసలైన వినియోగదారుడి ఫోన్ నంబర్‌కు వెళ్లగానే కేటుగాళ్లు ఆ నంబర్‌కు కాల్ చేస్తున్నారు. తాము ఓ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పొరపాటున మీ నెంబర్ ఎంటర్ చేశామని.. అందువల్ల తమకు రావాల్సిన ఓటీపీ మీ నంబర్‌కు వచ్చినందున దాన్ని చెప్పాలని కోరుతున్నారు. ఇందులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేకపోవడంతో తేలిగ్గా నమ్ముతున్న బాధితులు ఎదుటివారు ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతో ఆ ఓటీపీ చెప్పేస్తున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు అప్పటికే సిద్ధం చేసుకున్న వాట్సాప్ యాప్‌లో ఎంటర్ చేస్తున్నారు. » ఈ పరిణామంతో బాధితుడి నంబర్‌తో పనిచేసే వాట్సాప్ అతని/ఆమె ఫోన్ నుంచి సైబర్ నేరగాడి ఫోన్లో యాక్టివేట్ అయిపోతోంది. ఆ వెంటనే వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘టూ స్టెప్ వెరిఫికేషన్’కు సైబర్ క్రమినిల్స్ మార్చేస్తున్నారు. దీనివల్ల బాధితుల వాట్సాప్ సైబర్ నేరగాళ్ల అధీనంలోకి వెళ్లిపోతోంది. అనంతరం వాట్సాప్ బ్యాకప్ నుంచి బాధితుడి కాంటాక్ట్స్, ఇతర వివరాలను తమ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. » వాట్సాప్ కాంటాక్ట్స్ ఆధారంగా స్నేహితులు, సన్ని హితులను గుర్తించి వారికి బాధితులు పంపినట్లే సందేశం పంపుతూ వైద్య అవసరాల పేరిట డబ్బు డిమాండ్ చేస్తున్నారు. బ్యాకప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫొటోలను మార్ఫింగ్ చేయడం ద్వారా ఆయా వ్యక్తులు ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నట్లు చూపిస్తున్నారు. » ఇలా సందేశాలు అందుకున్న వాళ్లు డీపీ, ఫోన్ నంబర్ చూసి తమ వారే ఆపదలో ఉన్నారని భావించి వీలైనంత మొత్తం బదిలీ చేస్తున్నారు. » కొన్ని కాంటాక్ట్స్‌కు వాట్సాప్ క్యూఆర్ కోడ్ పంపి స్కాన్ చేయించి వాట్సాప్‌ను అ«దీనంలోకి తీసుకుంటున్న సైబర్ నేరస్తులు.. ఆ తర్వాత అప్పటికే సంగ్రహించిన బాధితుడి వాయిస్ ఆధారంగా ఏఐ సాంకేతికతను వినియోగించి వారి పరిచయస్తులు, బంధువులకు ఫోన్ చేసి ఆస్పత్రిలో ఉన్నామని చెప్పి డబ్బు గుంజుతున్నారు. » కొన్ని సందర్భాల్లో బాధితుడికి సంబంధించిన వ్య క్తిగత, సున్నిత సమాచారాన్ని అడ్డం పెట్టుకొని దా న్ని ఆన్లైన్లో పెడతామని భయపెట్టి వీలైనంత మేర దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. » సైబర్ నేరస్తులు కాజేసేవి చిన్న మొత్తాలే కావడంతో అనేక మంది ఫిర్యాదు చేయట్లేదు.వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ..» వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. అందులో ‘టూ స్టెప్ వెరిఫికేషన్’ను యాక్టివేట్ చేసుకోవాలి. దీనివల్ల ఒకవేళ ఆ నంబర్‌తో కూడిన వాట్సాప్‌ను సైబర్ నేరస్తులు మరో ఫోన్లో యాక్టివేట్ చేసేందుకు మాయమాటలతో ఓటీపీ తెలుసుకున్నా.. వినియోగదారులు ముందే క్రియేట్ చేసి పెట్టుకున్న 6 అంకెల యాక్టివేషన్ పిన్ నంబర్ వారికి తెలియనందున మరో ఫోన్లో వాట్సాప్ యాక్టివేట్ కాదు. » డీపీలు, స్టేటస్‌లను ‘ఓన్లీ కాంటాక్ట్స్’కు మాత్రమే కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.» వీలైనంత వరకు చాట్ బ్యాకప్‌ను తగ్గించుకోవాలి. అందుక వాట్సాప్ సెట్టింగ్స్‌లో డౌన్లోడ్ ఆప్షన్‌ను ‘నన్’అని ఎంపిక చేసుకొని యాక్టివేట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటో డౌన్లోడ్ ఎంచుకోవద్దు. ఆటో డౌన్లోడ్ ఆప్షన్ వల్ల ఒకవేళ సైబర్ నేరస్తులు ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను మాల్వేర్ రూపంలో పంపితే వినియోగదారుడి ప్రమేయం లేకుండా ఆ వైరస్ ఫోన్లో ఇన్స్టాల్ అయ్యే ప్రమాదముంది. -
ఈవీఎంలతో గెలుస్తామంటే కుదరదు అక్కడ!
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అలియాస్ EVMలు. ప్రతీ ఐదేళ్లకొకసారి ఇవి మనల్ని పలకరిస్తుంటాయి. అయితే వాటి ద్వారా పడిన ప్రతీ ఓటుకు నిజంగా భద్రత ఉంటుందా?. ఈవీఎంలను హ్యక్ చేసి మెజారిటీ ప్రజలిచ్చిన తీర్పును మార్చే అవకాశాలు ఏమాత్రం లేవా? అనే అనుమానాలు కలగడం సహజమే. మొన్నీమధ్య ఏపీ ఎన్నికల టైంలో.. అంతకు ముందు.. మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల టైంలో ఈ తరహా ప్రశ్నలెన్నో తలెత్తాయి. అందుకేనేమో.. అమెరికాలాంటి అగ్రదేశం గత రెండు దశాబ్దాల ప్రయత్నాలతో ఎన్నికల విధానాన్ని ఈవీఎంల నుంచి మళ్లీ బ్యాలెట్‌కు తెచ్చుకుంది. నవంబర్ 5వ తేదీన జరగబోయే పోలింగ్ బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరగబోతోంది. 95 శాతం రిజిస్టర్డ్ ఓటర్లు అక్కడ పేపర్‌పై టిక్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 69.9 శాతం ఓటర్లు హ్యాండ్మార్క్డ్ పేపర్ బ్యాలెట్స్ విధానంలో ఓటేయొచ్చని, అలాగే బ్యాలెట్ మార్కింగ్ డివైజ్లతో(డిజిటల్ బ్యాలెట్.. ఓటేసి అప్పటికప్పుడే ఆ ప్రింట్ బయటకు తీయొచ్చు కూడా) కూడిన పేపర్బ్యాలెట్ ఓటింగ్ వైపు మరో 25.1 శాతం మంది మొగ్గుచూపిస్తారని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన.. కేవలం ఐదు శాతం ఓటర్లు మాత్రం మన దగ్గర ఈవీఎంల తరహా డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్(DRE) ద్వారా ఓటేసే ఛాన్స్ ఉంది.అక్కడ ఏరకంగా ప్రయత్నించినా ప్రజా తీర్పును మార్చడానికి వీలుండదన్నమాట. ఈవీఎంల మేనిపులేషన్తో గెలవడం అక్కడ ఎంతమాత్రం కుదరదన్నమాట. సాంకేతికతను ముందుగా పుణికిపుచ్చుకునే అమెరికాలో.. ఈ తరహా ఓటింగ్ ఇంకా జరుగుతుండడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే.. అమెరికాలో 2000 సంవత్సరం దాకా పేపర్ బ్యాలెట్స్ ఓటింగ్ జరిగేది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ వైపు అడుగులేసింది. ఓటర్లు డీఆర్ఈ లేదంటే పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటేసే వీలు కల్పించారు. 2006 మధ్యంతర ఎన్నికల టైంలో 41.9 శాతం ఓటింగ్ డీఆర్ఈ వ్యవస్థ ద్వారానే జరిగింది. అయితే విదేశీ కుట్రలకు అవకాశం, హ్యాకింగ్ ఆరోపణల నేపథ్యంలో డీఆర్ఈపై అక్కడి ఓటర్లలోనూ నమ్మకం సన్నగిల్లింది. 2008 ఎన్నికల నుంచి డీఆర్ఈను ఓటర్లు తిరస్కరిస్తూ వచ్చారు. 2016 అమెరికా ఎన్నికల టైంలో రష్యా జోక్యం ఆరోపణలతో పూర్తిగా వాటిని పక్కన పడేశారు అక్కడి ఓటర్లు.అందుకే అనుమానాలుఈవీఎం 'అన్లాకింగ్'పై రాజకీయ దుమారం కొత్తేం కాదు. మన దేశంలో ఈసీ అందుకు అవకాశమే లేదని చెబుతున్నా.. కొన్ని ఎన్నికల ఫలితాలతో ప్రజల్లోనూ వాటి వాడకంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాల టైంలో నడిచిన చర్చే ఇందుకు ఉదాహరణ. ఈ తరుణంలో ఆధునిక ఈవీఎంల వాడకం బదులు సంప్రదాయ రీతిలో పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగించాలనే అంశాన్ని కొందరు తెరపై తెచ్చారు. ఈ క్రమంలో..ఇదీ చదవండి: ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల మీద సమారు అరవై ఏళ్ల పాటు నేను పనిచేశాను. ఈవీఎం యంత్రాల వ్యవస్థనూ క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమే. దీని వల్ల ఫలితాలు తామరుమారవుతాయి. ఈవీఎంల కంటే పాత బ్యాలెట్ పేపర్ విధానమే చాలా ఉత్తమమైంది. ఇందులో అయితే ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగవు. బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి.:::కాంగ్రెస్ నేత శ్యామ్పిట్రోడాభారత్లో వాడే ఈవీఎంలు అమెరికాలో వాడే తరహావి కావు. ఇక్కడి ఈవీఎంలు కంప్యూటర్ ప్లాట్‌ఫాం మీద తయారు చేయలేదు. వాటికి బయటి నుంచి ఎలాంటి నెట్‌వర్క్‌తో అనుసంధానించే అవకాశమే లేదు. రీ ప్రోగ్రామింగ్ కూడా వీలు లేదు. ఇలాంటి పరికరాలను హహ్యాక్ చేయడం కుదరదు. కావాలంటే ప్రపంచ దేశాలు భారత ఈవీఎంలను వారి ఎన్నికల్లో వాడుకోవచ్చు.:: కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్భారత్లో వాడుతున్న ఈవీఎంలకు సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి రక్షణ ఉందనేది మనకెవరికీ తెలియదు. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్‌కు సంబంధించి ఈవీఎంలు ISO 27001 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది నిపుణులు తేల్చాలి. ఈవీఎంల భద్రతకు ఎలాంటి సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను వాడుతున్నారనేది ఇప్పటివరకు బహిర్గతమవలేదు. ఎవరికీ తెలియదు.::: సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ఈవీఎంలను మనం తొలగించాలి. వీటిని వ్యక్తులు లేదంటే ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం. ఇది ఏ దేశానికైనా నష్టమే కలిగిస్తుంది.:: ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్ఇదీ చదవండి: మీకు తెలుసా? ఈ దేశాల్లో పేపర్ బ్యాలెటే ముద్దునిపుణుల నుంచి సామాన్యుల దాకా ఈవీఎంల వాడకంపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతుంటారు. కానీ, ఈ మధ్యకాలంలో పాపులర్ టెక్నాలజీ నిపుణులు కూడా వాటి పని తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తుండడం చూస్తున్నాం. దీంతో ఈవీఎంలపై అనుమానాలకు శాస్త్రీయ నివృత్తి అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఈవీఎంలపై ఇంతమంది ఇన్ని అభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నపుడు ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడితేనే బెటరని సామాన్యులతో పాటు పార్టీల అధినేతలు సూచిస్తున్నారు. ఈవీఎంలు వాడకంలో అయ్యే ఖర్చుతో పోలిస్తే బ్యాలెట్ విధానంలో ఖర్చు కొద్దిగా పెరిగినప్పటికీ, ఎన్నికల ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ ఓటర్లకు ప్రజాస్వామ్యంపై పూర్తి నమ్మకం కలగాలంటే బ్యాలెట్ పేపరే బెస్ట్ అనే వాదన వినిపిస్తోంది. ‘‘పేపర్ బ్యాలెట్‌తో ఓటర్ల విశ్వాసాన్ని పెంచవచ్చు. మనలాంటి ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలి. రెండింటినీ నిర్ధారించడానికి ఏకైక మార్గం, పేపర్ బ్యాలెట్‌కి తిరిగి వెళ్లడం. USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే మరియు డెన్మార్క్‌లతో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, మనం ప్రపంచంలోని ఇతర దేశాలతో మార్పులు చేసి పేపర్ వైపు వెళ్లే సమయం ఇది. బ్యాలెట్, ఇది ఓటర్ల విశ్వాసాన్ని పెంచుతుంది. విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలి’’:::హర్యానా ఎన్నికలపై.. ఎగ్జిట్‌పోల్స్‌కు విరుద్ధంగా వెలువడిన ఫలితాలపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ట్వీట్ -
సైబర్ దొంగ.. ఏఐకూ బెంగ!
కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువ అన్నది సామెత. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థల పరిస్థితి కూడా ఇలానే ఉంది. అద్భుతాలు సృష్టించే కృత్రిమ మేధోశక్తి (ఏఐ) గుప్పిట్లో ఉన్నా.. సైబర్ దొంగల ‘చోరకళ’ మాత్రం ఆ సంస్థలను భయపెడుతూనే ఉంది. ఏఐతో సమానంగా పనిచేస్తూ, డేటాను దొంగిలించే టూల్స్‌ను వారు రూపొందిస్తున్నారు. ఏఐతో దూసుకుపోతున్న బహుళ జాతి ఐటీ కంపెనీలు డేటా సెక్యూరిటీ సమస్యలను ఎదుర్కొనేందుకు ఎన్ని కోట్లయినా వెచ్చించేందుకు సిద్ధమవడం గమనార్హం. ప్రముఖ డేటా సెక్యూరిటీ, రెసిలెన్స్ సంస్థ ‘వీమ్’ఇటీవల సైబర్ దాడులపై చేసిన అధ్యయన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.సైబర్ దొంగల చేతుల్లో గ్లోబల్ డేటా..వీమ్ అధ్యయనం ప్రకారం..2023లో మైక్రోసాఫ్ట్, మెటా, ఓపెన్ ఏఐ వంటి పలు గ్లోబల్ సంస్థలు కూడా సైబర్ క్రిమినల్స్ చేతికి చిక్కాయి. వారు ర్యాన్సమ్వేర్ను తేలికగా ఆయా సంస్థల సర్వర్లలోకి పంపారు. కొన్ని కంపెనీల డేటా బ్యాకప్, రికవరీ, సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను గుప్పిట్లోకి తీసుకున్నారు. కంపెనీల నిర్వహణ, రహస్య సమాచారం, వ్యాపార లావాదేవీల డేటాను చోరీ చేశారు. సర్వర్లను ఎన్‌క్రిప్ట్ చేశారు. ఇలా సైబర్ దాడులకు గురైన సంస్థల్లో 81 శాతం కంపెనీలు చేసేదేమీ లేక, సైబర్ నేరస్తులకు గుట్టుచప్పుడు కాకుండా సొమ్మును ముట్టజెప్పాయని తేలింది. ఇలా డబ్బులు ఇచ్చినా కూడా మూడింట ఒకవంతు సంస్థలు, వ్యక్తులు డేటాను తిరిగి పొందలేకపోయారని అధ్యయనంలో తేలింది. 45 కోట్ల వినియోగదారులున్న మైక్రోసాఫ్ట్..5.5 కోట్ల కస్టమర్ల డేటానే పూర్తిస్థాయిలో తిరిగి పొందగలిగిందని నివేదిక పేర్కొంది. అంతపెద్ద కంపెనీలే నిస్సహాయ స్థితికి వెళ్తుంటే..పరిస్థితి ఏమిటని వీమ్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.ఎదురవుతున్న సవాళ్లు..ప్రపంచవ్యాప్తంగా కంపెనీలన్నీ కృత్రిమ మేధతో పనిచేయడం అనివార్యమైంది. అన్ని సంస్థలూ ఇందుకోసం టూల్స్‌ను సమకూర్చుకుంటున్నాయి. డిజిటల్ లావాదేవీలు, ఈ–కామర్స్, స్మార్ట్ సిటీలు, ప్రత్యేక క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో పెద్ద ఎత్తున డిజిటల్ డేటాను సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే సైబర్ నేరస్తులూ అప్డేట్ అవుతున్నారు. ఏఐ ఆధారిత మాల్వేర్లు, వైరస్‌లను రూపొందిస్తున్నారు. వాటితో కంపెనీల సర్వర్లపై దాడులు చేస్తున్నారు. ఏఐని అభివృద్ధి చేస్తున్న మేధావులే ఈ వినాశకర శక్తుల జాబితాలోనూ ఉంటున్నారని అంతర్జాతీయ సైబర్ సంస్థలు అంటున్నాయి. ‘ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ విధానాలపై, సైబర్ సెక్యూరిటీ చైన్ లింక్’పై అధ్యయనం చేసిన వారే సైబర్ దాడుల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నారని పేర్కొంటున్నాయి.ఇదీ చదవండి: కొత్త అప్డేట్.. యాపిల్‌లో అదిరిపోయే ఫీచర్!రక్షణ వ్యవస్థలపై ఫోకస్ఏఐ ఆధారిత వ్యవస్థలను రక్షించే విధానాలపై కంపెనీలు ఫోకస్ చేశాయి. ప్రతీ కంపెనీ దీనిపై కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. దీన్ని మరింత విస్తృతం చేయాలని, పరిశోధన విధానాలను ప్రతీ కంపెనీలు అభివృద్ధి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డేటా స్టోరేజీ గతం కన్నా భిన్నంగా ఉంటోందని..ఇందుకోసం మైక్రో ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని పేర్కొంటున్నారు.సైబర్ నేరాల లెక్కలివీ..వరల్డ్ సైబర్ క్రైం ఇండె క్స్– 2024 ప్రకారం.. సైబర్ నేరాల ఆనవాళ్లు రష్యాలో ఎక్కువగా ఉన్నాయి.ఉక్రెయిన్, చైనా, అమెరికా, నైజీరియా, రొమేనియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.గ్లోబల్ సైబర్ క్రైమ్ నివేదిక ప్రకారం 2025 నాటికి ఏటా 10 ట్రిలియన్ డాలర్లకు పైగా సైబర్ నేరాలపై ఖర్చు పెట్టాల్సి వస్తుంది.సైబర్ నేరాలు గడచిన 11 ఏళ్లలో 15.63 ట్రిలియన్ డాలర్లకు చేరినట్టు స్టాటిస్టా సర్వే చెబుతోంది. ఇది 2029 నాటికి మూడు రెట్లు పెరిగే వీలుందని పేర్కొంది. -
లింక్ క్లిక్ చేస్తే.. ఖాతా ఖాళీ
నాలుగు రోజుల కిందట పలమనేరుకు చెందిన రాము అనే వ్యక్తి సెల్‌ఫోన్‌లోని వాట్సాప్‌కు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు పేరిట ఒక ఏపీకే ఫైల్ వచ్చింది. దానిపై క్లిక్ చేయడంతో కొన్ని క్షణాలు సెల్‌ఫోన్ హ్యాంగ్ అయినట్లు అనిపించింది. కొద్దిసేపటి తర్వాత అతను ఒక దుకాణంలో సరుకులు కొనుగోలు చేసి గూగుల్ పే ద్వారా రూ.300 చెల్లించాడు. ఆ వెంటనే అతని బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.6వేలను విత్ డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో కంగుతిన్న రాము బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీస్తే విదేశాల నుంచి వాట్సాప్‌కు హ్యాకర్లు పంపిన ఏపీకే ఫైల్‌పై క్లిక్ చేయడంతో ఫోన్ హ్యాక్ చేసి గూగుల్ పే వాడినప్పుడు పాస్‌వర్డ్‌ను సేకరించి డబ్బులు స్వాహా చేశారని తేలింది. ఇదే తరహాలో కొద్దిరోజులుగా పలమనేరు ప్రాంతంలో వందలాది మందికి జాతీయ బ్యాంకుల పేరుతో మోసపూరిత ఏపీకే ఫైల్స్, యాప్ లింక్‌లు వస్తున్నాయి.హ్యాకర్లు ఇటీవల బ్యాంకుల పేరిట ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. వివిధ రకాల బ్యాంకుల పేరుతో మోసపూరిత ఏపీకే ఫైళ్లు, యాప్‌ల లింక్‌లను వాట్సాప్‌కు పంపిస్తున్నారు. వాటిపై క్లిక్ చేసినవారి సెల్ఫోన్లను హ్యాకింగ్ చేస్తున్నారు. ఆ ఫోన్‌ను తమ ఆ«దీనంలోకి తీసుకుంటున్నారు. మనతో సంబంధం లేకుండా మన మొబైల్‌ను మిర్రర్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను లూటీ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా మన వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న సభ్యులకు మన ఫోన్ నుంచే ఒకేసారి ఏపీకే, బగ్ యాప్ లింకులను పంపిస్తున్నారు. మనపై ఉన్న నమ్మకంతో స్నేహితులు, బంధువులు, తెలిసినవారిలో ఎవరైనా ఆ యాప్‌ల కింద ఉన్న బగ్ లింక్‌ను టచ్ చేస్తే వాళ్ల ఫోన్లను కూడా హ్యాకింగ్ చేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లోని నగదును లూటీ చేస్తున్నారు. – పలమనేరుఎక్కువగా గ్రూపులకు... మన మొబైల్ నంబర్‌కు సాధారణంగా దేశం కోడ్ +91గా ముందుంటుంది. కానీ హ్యాకర్లు మన నంబర్‌ను హ్యాక్ చేసి దాని ముందు +44 పెట్టి ఇంటర్నెట్, డార్క్‌నెట్ ఆధారంగా వాట్సాప్‌లో మోసపూరిత బగ్స్, లింకులు పంపిస్తున్నారు. ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఈ తరహా మెసేజ్‌లు వస్తున్నట్లు తెలుస్తోంది. మెసేజ్ పంపిన మొబైల్ నంబర్ తెలిసిన వారిదిలాగే కనిపిస్తుంది. కానీ ఇందులో ఇంటర్నేషనల్ కోడ్ మాత్రం మార్పు ఉంటుంది. ఈ విషయం తెలియని వాట్సాప్ గ్రూపుల్లోని సభ్యులు మనవాళ్లే మెసేజ్ పంపారని ధైర్యంగా ఆ లింకును ఓపెన్ చేసి మోసపోతున్నారు. అదేవిధంగా గూగుల్, జూమ్ మీటింగ్‌లలో ఎక్కువ మంది పాల్గొన్నప్పుడు డార్క్‌నెట్ ద్వారా ఆ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఒకరి నంబరు హ్యాక్ చేసి, అతని నంబరు ద్వారా మిగిలిన సభ్యులు అందరికీ మోసపూరిత యాప్‌లు, బగ్స్ లింక్‌లను కొన్ని నిమిషాల్లోనే పంపిస్తున్నారు. వారు కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ వీటిపై క్లిక్ చేస్తే సులభంగా హ్యాకింగ్ చేస్తున్నారు. ఇలా చేస్తే మేలు... మన సెల్‌ఫోన్ ఒక్కసారిగా హ్యాంగ్ అయితే వెంటనే హ్యాక్ అయ్యిందేమోనని అనుమానించాలి. గత కొన్ని రోజులుగా ఏమైనా కొత్త లింక్‌లపై క్లిక్ చేశారా.. అనేది చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా మోసపూరిత లింక్, ఫైల్‌పై క్లిక్ చేసినట్లు గుర్తిస్తే వెంటనే ఫోన్‌ను రీసెట్ కొట్టాలి. ఫోన్లోని ఈ–మెయిల్, పాస్వర్డ్లు అన్ని మార్చివేయడం మంచింది. హ్యాకింగ్ అనుమానం వస్తే ఫోన్‌పే, గూగుల్ పే, మొబైల్ బ్యాంకింగ్ వంటివి పూర్తిగా నిలిపివేయాలి. ఫోన్‌పే, గూగుల్ పే, పే టీఎం వంటి పేమెంట్ యాప్‌లు అన్ ఇన్స్టాల్ చేయాలి. కాగా, బ్యాంకుల నుంచి వాట్సాప్‌కు ఎటువంటి మెసేజ్‌లు, లింక్‌లు పంపించరని బ్యాంకర్లు చెబుతున్నారు. ఏదైనా బ్యాంకు పేరుతో మెసేజ్ వస్తే వెంటనే సమీపంలోని బ్రాంచ్‌లో గానీ, పోలీసులకు గానీ ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. -
ఈ-సిమ్ పేరుతో మోసం.. రూ.27 లక్షలు మాయం
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ మోసాలకు బలైపోయి భారీగా డబ్బు పోగొట్టుకున్నవారు కోకొల్లలు. ఇటీవల ఇలాంటి సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ మహిళ సుమారు రూ. 27 లక్షలు పోగొట్టుకుంది.నోయిడాలోని సెక్టార్ 82లో నివాసం ఉంటూ.. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న 'జ్యోత్సానా భాటియా'కు ఆగస్టు 31న టెలికాం కంపెనీకి చెందిన కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ నుంచి తనకు వాట్సాప్ కాల్ వచ్చిందని పోలీసులకు తెలిపింది. మొబైల్ ఫోన్ పోయినట్లయితే.. యాక్టివేట్ అయ్యే ఈసిమ్ కొత్త ఫీచర్ల గురించి కాలర్ ఆమెకు చెప్పినట్లు వెల్లడించింది. కాలర్ చెప్పేది నిజమని నమ్మని భాటియా 'ఈసిమ్'కు మారేందుకు అతడు సూచించిన విధంగా చేసింది. ఇందులో భాగంగానే ఆమె మొబైల్‌కు వచ్చిన ఒక కోడ్ ఎంటర్ చేయమని అడగగా.. ఆమె అది కూడా పూర్తి చేసింది.కాలర్ చెప్పినవన్నీ చేసిన తరువాత ఆమె సిమ్ డీయాక్టివేట్ అవుతుందని.. మరో రెండు మూడు రోజుల్లో ఫిజికల్ సిమ్ వస్తుందని చెప్పాడు. మూడు రోజుల తరువాత కూడా ఆమెకు సిమ్ రాలేదు. దీంతో ఆమె కస్టమర్ కేర్ సిబ్బందికి కాల్ చేసింది. వారు డూప్లికేట్ సిమ్ కోసం సర్వీస్ సెంటర్ వద్దకు రావాలని సూచించారు. ఆమె వారు చెప్పినట్లుగా సర్వీస్ సెంటర్ వద్ద డూప్లికేట్ సిమ్ తీసుకుని ఫోన్లో వేసుకుని యాక్టివేట్ చేసింది.మొబైల్ నెంబర్ యాక్టివేట్ అవ్వగానే.. బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు డిడెక్ట్ అయినట్లు వరుస మెసేజ్‌లు వచ్చాయి. సైబర్ నేరస్థుడు తన ఫిక్డ్ డిపాజిట్ నుంచి డబ్బు తీసుకున్నట్లు, కొంత డబ్బు ఇతర ఖాతాలకు మళ్లించినట్లు తెలిసింది. అంతే కాకుండా ఆమె పేరుమీద రూ. 7.40 లోన్ కూడా తీసుకున్నట్లు తీసుకుంది.ఇదీ చదవండి: ఆధార్ ఫ్రీ అప్డేట్: యూఐడీఏఐ కీలక నిర్ణయం సైబర్ నేరగాడు.. మొబైల్ నెంబర్ ద్వారా బ్యాంకింగ్ అప్లికేషన్ హ్యాక్ చేసి.. ఈ మెయిల్ ఐడీలను సైతం మార్చేశాడని ఆమె పోలీసులకు వెల్లడించింది. మొత్తం మీద ఆమె రూ. 27 లక్షలు పోగొట్టుకున్నట్లు తెలిపింది. నిందితున్న పట్టుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.ఈ-సిమ్ అంటే..ఈ-సిమ్ అనేది ఒక డిజిటల్ సిమ్ కార్డు. కాబట్టి ఈ-సిమ్ ఉపయోగిస్తే.. ఫిజికల్ సిమ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. దీనిని అధికారిక వెబ్సైట్లో లేదా సర్వీస్ సెంటర్లలో పొందవచ్చు. ఈ-సిమ్ పొందాలనుకునేవారు టెలికామ్ ఎగ్జిక్యూటివ్‌ను కలిసిన తరువాత మారడం ఉత్తమం. -
భారత్, యూఎస్ కంపెనీల సర్వర్లపై చైనా దాడి?
చైనాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్ ఇండియాతోపాటు అమెరికాలోని కొన్ని కంపెనీల సర్వర్లపై దాడికి పాల్పడినట్లు లుమెన్ టెక్నాలజీస్‌కు చెందిన బ్లాక్ లోటస్ ల్యాబ్స్‌లోని భద్రతా పరిశోధకులు తెలిపారు. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం వోల్ట్ టైఫూన్ అని పిలువబడే చైనీస్ హ్యాకింగ్ గ్రూప్ అమెరికా, ఇండియాలోని ఇంటర్నెట్ కంపెనీలపై దాడికి పాల్పడింది. అందుకోసం కాలిఫోర్నియాకు చెందిన వెర్సా నెట్వర్క్స్ అనే స్టార్టప్ కంపెనీ సాఫ్ట్‌వేర్‌లోని భద్రతా లోపాన్ని ఉపయోగించుకున్నట్లు పరిశోధకులు తెలిపారు.చైనీస్ గ్రూప్ చేసిన ఈ సైబర్ దాడివల్ల అమెరికాకు చెందిన నాలుగు ఇంటర్నెట్ కంపెనీలు, భారత్‌లోకి ఒక కంపెనీ ప్రభావితం చెందినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. వెంటనే స్పందించిన సదరు కంపెనీలు నెట్వర్క్ కాన్ఫిగరేషన్ల నిర్వహణకు సహాయపడే వెర్సా నెట్‌వర్క్‌ల సాఫ్ట్‌వేర్‌లో లోపం కనుగొన్నారు. గతంలో వెర్సా బగ్‌ను గుర్తించి జూన్ 2023లో పరిష్కారాన్ని విడుదల చేసినప్పటికీ, సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల తిరిగి దాడికి గురయ్యాయని భావిస్తున్నారు.ఇదీ చదవండి: తగ్గనున్న చిన్న బ్యాంకుల రుణ వృద్ధి..!వోల్ట్ టైఫూన్ హ్యాకింగ్ సర్వర్లు యూఎస్‌లోని నీటి వసతి, పవర్ గ్రిడ్ వంటి కీలక సేవలందించే సాఫ్ట్వేర్లలో చొరబడ్డాయని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. వోల్ట్ టైఫూన్ నిజానికి ‘డార్క్ పవర్’ అని పిలువబడే ఒక క్రిమినల్ గ్రూప్ అని, దానితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి సైబర్అటాక్ల పేరుతో అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చైనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపింది. -
‘ఈవీఎం’ సేఫేనా..? జోరందుకున్న చర్చ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) సేఫా..? వాటిలో పడిన ఓటు భద్రమేనాా..? ఈవీఎంలను హ్యక్ చేసి మెజారిటీ ప్రజలిచ్చిన తీర్పును మార్చొచ్చా..? ప్రస్తుతం ఈ ప్రశ్నలపైనే మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిపుణుల నుంచి సామాన్యుల దాకా ఈవీఎంల వాడకంపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు. ఇటీవల కొందరు పాపులర్ టెక్నాలజీ నిపుణులే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో ఈవీఎంలపై అనుమానాలకు శాస్త్రీయ నివృత్తి అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఈలాన్ మస్క్ అయితే ఈవీఎంల వాడకానికి పూర్తిగా ఫుల్స్టాప్ పెట్టాలని ట్వీట్ చేసి సంచలనానికి తెర తీశారు. మస్క్ ఈ తరహా అభిప్రాయం వెలిబుచ్చిన సమయానికే మహారాష్ట్రలోని ముంబై నార్త్‌వెస్ట్ నియోజకవర్గంలో ఓటీపీ ద్వారా ఈవీఎంను తెరిచారన్న వివాదం వెలుగులోకివచ్చింది. దీంతో ఈవీఎంల భద్రతపై చర్చ జోరందుకుంది.భారత్‌కు చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేధావి శ్యామ్ పిట్రోడా కూడా ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమేమీ కాదన్నారు. వీరే కాక తాజాగా సైబర్ లా నిపుణుడు, ప్రముఖ న్యాయవాది పవన్ దుగ్గల్ కూడా ఇంచు మించు ఇదే చెప్పారు. ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు ఛాన్సు లేకపోలేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా..? అనే సమాధానం లేని ప్రశ్న మళ్లీ అందరి మెదళ్లను తొలుస్తోంది. అసలు మస్క్ ఏమన్నారు.. సందర్భమేంటి..? ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడంతో హ్యాకింగ్‌ను నివారించొచ్చని టెస్లా అధినేత మస్క్ ఇటీవల సూచించారు. అమెరికా నియంత్రణలో ఉన్న ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన అధ్యక్ష ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలి. వీటిని వ్యక్తులు లేదా ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుంది’అని మస్క్ ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశారు.మస్క్‌కు మాజీ ఐటీ మంత్రి కౌంటర్లో వాస్తవమెంత..?మస్క్ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసిన వెంటనే ఎక్స్‌లో మాజీ కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. భారత్‌లో వాడే ఈవీఎంలు అమెరికాలో వాడే తరహావి కావు. ఇక్కడి ఈవీఎంలు కంప్యూటర్ ప్లాట్‌ఫాం మీద తయారు చేయలేదు. వాటికి బయటి నుంచి ఎలాంటి నెట్‌వర్క్‌తో అనుసంధానించే అవకాశమే లేదు. రీ ప్రోగ్రామింగ్ కూడా వీలు లేదు. ఇలాంటి పరికరాలను హహ్యాక్ చేయడం కుదరదు. కావాలంటే ప్రపంచ దేశాలు భారత ఈవీఎంలను వారి ఎన్నికల్లో వాడుకోవచ్చు’అని సూచించారు.రాజీవ్ చంద్రశేఖర్ లాజిక్ కరక్టేనా.. సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ ఏమన్నారు.. ‘ఒక కంప్యూటర్‌కు బయటి నుంచి ఎలాంటి నెట్‌వర్క్‌తో అనుసంధానం లేనపుడు హ్యాక్ చేయడం కష్టమే కావచ్చు. అయితే ఎలాంటి వ్యవస్థనైనా ఏమార్చి దానిలో జోక్యం చేసుకునే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నా. నిజానికి భారత్‌లో వాడుతున్న ఈవీఎంలకు సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి రక్షణ ఉందనేది మనకెవరికీ తెలియదు. భారత్‌లో అసలు సైబర్ భద్రతకు సంబంధించి పక్కా చట్టమే ఇప్పటివరకు లేదు.‘ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్‌కు సంబంధించి ఈవీఎంలు ISO 27001 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది నిపుణులు తేల్చాలి. ఈవీఎంల భద్రతకు ఎలాంటి సైబర్ సెక్యూరిటీ పప్రోటోకాల్‌ను వాడుతున్నారనేది ఇప్పటివరకు బహిర్గతమవలేదు. ఎవరికీ తెలియదు’అని సైబర్ లా నిపుణులు, ప్రముఖ న్యాయవాది పవన్‌దుగ్గల్ వ్యాఖ్యానించారు.శ్యామ్ పిట్రోడా అనుమానాలేంటి..?ఈవీఎంలపై టెక్నాలజీ నిపుణుడు శ్యామ్ పిట్రోడా కుండ బద్దలు కొట్టారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమేనని తేల్చి చెప్పారు. ‘ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల మీద సమారు అరవై ఏళ్ల పాటు నేను పనిచేశాను. ఈవీఎం యంత్రాల వ్యవస్థనూ క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమే. దీని వల్ల ఫలితాలు తామరుమారవుతాయి. ఈవీఎంల కంటే పాత బ్యాలెట్ పేపర్ విధానమే చాలా ఉత్తమమైంది. ఇందులో అయితే ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగవు. బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి. కొంత మంది చెబుతున్నట్లు ఈవీఎంలు కేవలం స్టాండలోన్ పరికాలే కాదు. వాటికి వీవీప్యాట్ వ్యవస్థ అమర్చి ఉంటుంది. ఇంతేగాక వీటిని తయారు చేసే క్రమంలో, రవాణా చేసే సందర్భాల్లో ఏమైనా జరిగేందుకు అవకాశం ఉంటుంది’అన్నారు. బ్యాలెట్ పేపరే పరిష్కారమా..? ఈవీఎంలపై ఇంతమంది ఇన్ని అభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నపుడు ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడితేనే బెటరని సామాన్యులతో పాటు పార్టీల అధినేతలు సూచిస్తున్నారు. ఈవీఎంలు వాడకంలో అయ్యే ఖర్చుతో పోలిస్తే బ్యాలెట్ విధానంలో ఖర్చు కొద్దిగా పెరిగినప్పటికీ, ఎన్నికల ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ ఓటర్లకు ప్రజాస్వామ్యంపై పూర్తి నమ్మకం కలగాలంటే బ్యాలెట్ పేపరే బెస్ట్ అన్న వాదన వినిపిస్తోంది. -
ఈవీఎంల హ్యాకింగ్ సాధ్యమే: పిట్రోడా
ఢిల్లీ: పోలింగ్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) హ్యాకింగ్‌కు గురువుతున్నాయంటూ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై తాజాగా కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈవీఎం మిషన్లను హ్యాక్ చేయడానికి, ఫలితాలను తారుమారు చేయడానికి అవకాశం ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్వేర్, కాంప్లెక్స్ సిస్టంల రంగాల మీద సుమారు అరవై ఎళ్లపాటు నేను పనిచేశాను. అదే విధంగా నేను ఈవీఎం యంత్రాల వ్యవస్థను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఈవీఎంలను హ్యాక్ చేయటం సాధ్యం అవుతుంది.దీని వల్ల ఫలితాలకు కూడా మారిపోతాయి. ఇటువంటి సమయంలో సంప్రదాయ పాత బ్యాలెక్ ఓటింగ్ విధానమే చాలా ఉత్తమమైంది. ఓట్ల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగవు. బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి’’ అని అన్నారు.I have spent about 60 years in the forefront of #electronics, #telecom,IT, #software, #complex systems and a lot more. I have studied #EVM system carefully and believe that it is possible to manipulate. The best approach is the traditional paper ballet to count as casted.— Sam Pitroda (@sampitroda) June 16, 2024 ‘పోలింగ్‌లో ఉపయోగించే ఈవీఎం మిషన్లతో పాటు, వీవీప్యాట్ స్లిప్స్ కోసం వీవీప్యాట్ యాంత్రాలు కూడా అమర్చబడి ఉన్నాయి. వీవీప్యాట్ యంత్రాల సాయంతో కూడా ఈవీఎంలను హ్యాక్ చేయడానికి అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది’ అని అన్నారు.The #EVM debate in #India continues to get hotter due to a comment from #Elon Musk .The facts are clear. It is not just the stand alone EVM but a complex system with #VVPAT & associated processes and logistics that is open to selective manipulation.— Sam Pitroda (@sampitroda) June 16, 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వీవీప్యాట్, ఓటర్లు జాబితా, వేసిన ఓట్లు, లెక్కించిన ఓట్లు, మొత్తం ఓట్లు, విజేతలు(ఓట్లు), ఓడిపోయినవారు (ఓట్లు) వంటి వాటిపై పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించబడింది. వీటిని పరిగణలోకి తీసుకొని ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి’ అని శ్యామ్ పిట్రోడా సూచించారు.Confusion created about #VVPAT, #voter lists, votes casted, counted, margins, winners, losers, etc. during recent #election in #India needs careful consideration to build trust between #voters and the #ECI.— Sam Pitroda (@sampitroda) June 16, 2024ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందిస్తూ.. ఈవీఎంలు అస్సలు హ్యాక్ చేయడాని వీలు లేదని తెలిపింది. భారత్‌లో ఉపయోగించే ఈవీఎంలకు బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ వంటి వైర్లెస్, వైర్ కనెక్షన్లు ఉండవని పేర్కొంది. దీంతో ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశమే లేదని స్పష్టం చేసింది. అయితే తాజాగా శ్యామ్ పిట్రోడా లేవనెత్తిన వీవీప్యాట్ మిషన్ల అంశంతో ఈవీఎంలను హ్యాక్ చేయడానికి అవకాశం ఉన్నట్లు వస్తున్న అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.సంబంధిత కథనం: ఈవీఎంల గుట్టు విప్పేదెవరు? -
హ్యాకింగ్ సాధ్యమేనా ?
-
హ్యాకింగ్.. ‘పోలీస్’ షేకింగ్!
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల వ్యవధిలో తెలంగాణ పోలీసు శాఖకు చెందిన రెండు కీలక యాప్‌లు హ్యాకింగ్‌కు గురవడం కలకలం సృష్టిస్తోంది. సైబర్ నేరగాళ్లు తెలంగాణ పోలీస్‌కు చెందిన హాక్ ఐ యాప్‌తోపాటు పోలీస్ అంతర్గత విధుల్లో అత్యంత కీలకమైన టీఎస్‌కాప్ యాప్‌ను సైతం హ్యాక్ చేశారు. వీటి నుంచి హ్యాకర్లు పోలీస్ శాఖకు సంబంధించిన కీలక డేటాను, ఫొటోలను చేజిక్కించుకుని.. డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సైబర్ నేరగాళ్లకు సంబంధించిన కేసులను పరిష్కరించే పోలీసులు తమ సొంత యాప్‌లు హ్యాక్ గురైన విషయాన్ని గుర్తించడంలో మాత్రం ఆలస్యం జరిగింది. హాక్ ఐ యాప్ హ్యాకింగ్ గురైన తర్వాత వారం రోజులకు టీఎస్‌కాప్ యాప్ హ్యాక్ అయిందని.. రెండింటి హ్యాకింగ్ ఒకే హ్యాకర్ కారణమై ఉంటారని అనుమానిస్తున్నారు. హాక్ ఐ యాప్ హ్యాకింగ్‌కు గురవడంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఇప్పటికే ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్‌శాఖకు సంబంధించిన కీలక యాప్‌ల హ్యాకింగ్ నిజమేనని.. రెండింటిని హ్యాక్ చేసింది ఒకరేనా, వేర్వేరు వ్యక్తులా అన్నది తేల్చాల్సి ఉందని టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కీలక వ్యవహారాలన్నీ అందులోనే.. తెలంగాణ పోలీసుల రోజువారీ విధుల్లో టీఎస్‌కాప్ యా ప్ది ప్రధాన భూమిక. 2018లో ప్రారంభించిన ఈ యాప్‌లో పాత నేరస్తుల సమాచారం, క్షేత్రస్థాయిలో నిందితులను గుర్తించేందుకు అవసరమైన ఫేషియల్ రికగ్నిషన్ యాప్, సీసీటీఎన్ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్), రవాణాశాఖ సమాచారం వంటి మొత్తం 54 సర్విసులు పోలీసులకు క్షేత్రస్థాయి విధుల కోసం అందుబాటులో ఉంటాయి. లక్షలాది మంది నేర స్తుల ఫొటోలు, వేలిముద్రలు, ఇతర వివరాలు, గత కొన్నేళ్లలో నమోదైన నేరాల వివరాలు, రోడ్డు ప్రమాదాలు, ఆయా కేసులలో నిందితులు, బాధితుల ఫోన్ నంబర్లు, దర్యాప్తులో అవసరం మేరకు ఆధార్‌కార్డు, ఇతర ధ్రువపత్రాల వివరాలు, వాహనాల నంబర్లు, సీసీ టీవీ కెమెరాల జియో ట్యాగింగ్ వివరాలు, క్రైం సీన్ ఫొటోలు, వీడియో లు, సాక్షుల స్టేట్మెంట్ రికార్డులు, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ వివరాలు ఇలా చాలా సమాచారాన్ని టీఎస్‌కాప్ యాప్ వేదికగా నిర్వహిస్తున్నారు. ఇంత కీలమైన యాప్ హ్యాక అవడంపై పోలీస్‌శాఖలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆన్లైన్లో డేటా అమ్మకం? టీఎస్‌కాప్ యాప్‌లోని యూజర్ డేటాను సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో విక్రయానికి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై డేటా భద్రత పరిశోధకుడు శ్రీనివాస్ కోడాలి.. తన డిజిటల్దత్తా పేరిట ఉన్న ట్విట్టర్ అకౌంట్లో ‘టీఎస్‌కాప్ సహా మొత్తం తెలంగాణ కాప్‌ల నెట్‌వర్క్‌ను ఎవరో హ్యాక్ చేశారు.ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన కంపెనీ.. యాప్‌లో పాస్‌వర్డ్‌లను ప్లెయిన్ టెక్ట్స్‌గా పొందుపర్చడం, యాప్ సీసీటీఎన్ఎస్కు కనెక్ట్ అయి ఉండటం వంటివి సులభంగా హ్యాక్ అవడానికి కారణాలై ఉండొచ్చు’’అని పేర్కొన్నారు. హ్యాకర్ కొనుగోలుదారులను ప్రలోభపెట్టడానికి ఆన్లైన్ ఫోరమ్‌లలో నమూనా డేటాను పోస్ట్ చేశాడని., నేరస్తుల రికార్డులు, తుపాకీ లైసెన్సులు, ఇతర డేటాను కూడా పొందుపర్చాడని తెలిపారు. హ్యాకింగ్ క్రైం ఫోరం అయిన బ్రీచ్ ఫోరమ్స్‌లో పేర్కొన్న ప్రకారం.. టీఎస్‌కాప్, హాక్ ఐ నుంచి లీకైన డేటాలో 2 లక్షల మంది యూజర్ల పేర్లు, ఈ–మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు , అడ్రస్‌లు 1,30,000 ౖ రికార్డులు, 20 వేల ప్రయాణ వివరాల రికార్డులను డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. కీలక విభాగాలు, పోలీస్ అధికారుల వివరాలు కూడా..? హాక్ ఐ, టీఎస్‌కాప్ యాప్‌లు హ్యాకింగ్‌కు గురవడంతో.. సైబర్ నేరగాళ్ల చేతికి ఏసీబీ, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్, సీసీఆర్బీ, సీసీఎస్, సీఐడీ, కంట్రోల్ రూమ్‌లు, సీపీ ఆఫీస్‌లు, డీసీఆర్బీలు, గ్రేహౌండ్స్, జీఆర్పీ, ఇంటెలిజెన్స్, ఐటీ కమ్యూనికేషన్స్, లా అండ్ ఆర్డర్, ఎస్పీ ఆఫీసులు, ఎస్ఓటీ, స్పెషల్ బ్రాంచ్‌లు, స్పెషల్ యూనిట్లు, టాస్‌్కఫోర్స్, ట్రాఫిక్, టీజీఎస్పీ ఇలా చాలా విభాగాల సమాచారం చిక్కి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. డేటా భద్రత పరిశోధకుడు శ్రీనివాస్ కోడాలి కూడా.. ‘‘అధికారుల పేర్లు, పోలీసు స్టేషన్ అనుబంధాలు, హోదాలు, ఫొటోలతో సహా సమాచారం డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టారు, వందల మంది పోలీసు అధికారుల వివరాలు అందులో ఉన్నాయి’’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. అత్యుత్తమ టెక్నాలజీ ఉన్న టీఎస్‌కాప్ యాప్‌కు గతంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నుంచి ‘సాధికార పోలీసు విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’విభాగంలో అవార్డు దక్కింది. అలాంటి టీఎస్‌కాప్ యాప్ హ్యాక్ అవడంపై విమర్శలు వస్తున్నాయి. కొందరు సులువుగా ఉండే పాస్వర్డ్లు పెట్టుకోవడంతో హ్యాకింగ్ సులువైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ డేటా బ్రీచ్‌పై ఇప్పటికే తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
గతేడాది రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన నటి రేణు దేశాయ్. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి అభిమానులను మెప్పించారు. గుంటూరులోని స్టువర్టుపురం గజదొంగ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా రేణు దేశాయ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందో తెలుసుకుందాం.రేణు దేశాయ్ తన ఇన్‌స్టాలో క్యూఆర్ కోడ్‌ను షేర్ చేస్తూ విరాళాలు కావాలంటూ అభ్యర్థించింది. అయితే ఇంత త్వరగా స్పందించి విరాళం అందించి.. మానవత్వం చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. నా వంతుగా నేను కూడా సాయం చేస్తున్నప్పటికీ.. మిగిలిన అమౌంట్ కోసం నా ఫాలోవర్స్‌ను అడుగున్నానని రాసుకొచ్చింది. ప్రతిసారీ నా డబ్బును ఇవ్వలేను.. ఎందుకంటే నా దగ్గర కూడా కొంత మాత్రమే డబ్బులు మిగిలి ఉన్నాయని పేర్కొంది. అయితే ఎవరైనా ఆమె అకౌంట్‌ను హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేశారా? అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ వీడియోను పంచుకుంది.రేణు దేశాయ్ మాట్లాడుతూ.. 'ఫుడ్ పాయిజన్ తో కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాగాలేదు. అందుకే వీడియో చేయలేదు. అయితే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టింది నేనే. నా అకౌంట్‌ను ఎవరూ హ్యాక్ చేయలేదు. నేను కూడా రెగ్యులర్‌గా డొనేట్ చేస్తూనే ఉంటాను. కానీ అప్పుడప్పుడు నాకు కూడా లిమిట్ ఉంటుంది. డొనేషన్స్‌కి నా డబ్బులంతా ఇచ్చేస్తే నాకోసం.. నా పిల్లల కోసం కావాలి కదా. నా వరకు సాయం చేశాక.. ఏదైనా బ్యాలెన్స్ కావాలంటే ఫాలోవర్స్‌ను అడుగుతున్నా. యానిమల్స్, చిన్నపిల్లల కోసం కూడా నేను విరాళాలు ఇస్తున్నా. అదే నా ఫైనల్ టార్గెట్ కూడా. త్వరలోనే వాటికోసం ఓ షెల్టర్ కూడా నిర్మిస్తాను. అప్పుడు నేనే మిమ్మల్ని అధికారికంగా విరాళాలు సేకరిస్తా. నా రిక్సెస్ట్‌కు స్పందించి రూ.3500 పంపించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ' అంటూ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
ఇది... పెగ్గా సెస్!
ఉండిలో అంతసేపు ఉండి వాళ్లతో విసిగి వేగి వేసారి ఇంటికి వచ్చిన చంద్రయ్యకు ఇల్లంతా హడావుడిగా కనిపించింది. రామయ్య, అచ్చయ్య,వెంకన్నలాంటి వాళ్లతో పాటు వకీళ్లు కూడా కనిపించారు. వాళ్ళ హడావిడితో పాటు సంటోడి ముఖంలో ఆందోళన చూసేసరికి ఏం అర్థం కాలేదు. ‘‘ఏటయ్యింది?’’ అడిగాడు. అయినా అంతా నిశ్శబ్దం. ఎవరి నోటి నుంచి బదులు రాలేదు. ‘‘సెస్! అడుగుతున్నది మిమ్మల్నే. అంతా బెల్లం నోట్లో ఎట్టుకున్నట్టు మాహాడరే?’’ సున్నితంగా గద్దించాడు. ‘‘అయ్యా! అది కాస్తంత ఇబ్బందికర పరిస్థితి’’ వకీలు రవీంద్ర గంభీర వదనంతో పలికాడు. ‘‘అదేనయ్యా అదేటో సెప్తేనే కదా తెలిసేది? గౌరమ్మా ఏటైనాది? నువ్వైనా సెప్పు’’ అన్నాడు దూరంగా ఉన్న భార్య వైపు చూస్తూ. ‘‘అది ఏటంటే... మన సంటోడు పోన్లో మాట్లాడే దంతా ఇనేత్తున్నారంట. ఒకేపు కేసులు గట్రా ఉన్నాయి గందా? అదేదో పెగాసస్ అంట. దాంతో మన సంటోడు పోన్లో దూరి మొత్తం ఇనేస్తున్నారంట’’ సస్పెన్స్‌కి తెరదించుతూ భార్య గౌరీ చెప్పింది. ‘‘మీరేం కంగారు పడకండి. ఈ సంగతి ఢిల్లీకి కూడా కంప్లైంట్ చేశా’’ అన్నాడు రవీంద్ర కోటు, టై సవరించుకొంటూ. ఆ మాటకి ఉలిక్కిపడ్డాడు చంద్రయ్య. వెంటనే రామయ్య అందుకుంటూ, ‘‘ప్రెస్ మీట్ కూడా పెట్టాం. అధికార పార్టీ కుట్రని కడిగిపారేశాం’’ అన్నాడు అచ్చయ్య వైపు మెచ్చుకోలుగా చూస్తూ. ‘‘అంతేకాదు రేపు ఆందోళన కార్యక్రమాలు కూడా ప్లాన్ చేశాం’’ అచ్చయ్య ఉత్సాహంగా పలికాడు. ‘‘ఇది దేశంలోనే అతి పెద్ద కుట్ర’’ వెంకన్న ఆవేశంగా పలికాడు. ‘‘అసలు ఈ పెగా సెస్సు...’’ ఎప్పటిలాగే కాగితాలు ఏవో చూపుతూ పొట్టాభి ఏదో చెప్పబోయాడు. చంద్రయ్యకు ఆగ్రహం తన్నుకొచ్చింది. అవ్యక్తమైన ఉద్వేగాన్ని అణచుకొంటూ ‘‘సెస్! ఊరుకొండెహె. అంతా మీ మానాన మీరు చేసుకెల్లి పోవడమేనా? కనీసం ముందు నాతో ఒక ముక్క సెప్పాలని తెల్దేటి? పెతివాడికి అతి ఉత్సాహం!’’ చంద్రయ్య తనని తను తమాయించుకొని, ‘‘సరే సరే. ఢిల్లీ లెవెల్ దాకా తీసుకెల్లారన్నమాట. సర్లే ఆ తర్వాత ఎలా ముందుకు బోవాలో రేపు చర్చిద్దాం వెళ్ళండి’’ అన్నాడు కూల్ గా. ‘‘నువ్వూ ఎల్లి తొంగో’’ అన్నాడు సంటోడితో. ‘‘ఏటీ అలా సిటపటలాడిపోతున్నారు. ఎండదెబ్బ కొట్టేసి నాదా?’’ అన్నది గౌరీ దగ్గరకొస్తూ. ‘‘నాక్కాదు నీ కొడుక్కి కొట్టినాది. నేను అలా కాస్త బయిటికి ఎల్లొస్తే చాలు. ఏదో ఒక పేడ తట్ట ఎట్టేస్తాడు. అవునే నాకు తెలవక అడుగుతాను. ఆడి పోను హ్యాకింగ్ చేసేవాడు ఎవడుంటాడు?’’ ‘‘అంటే వాడి ఫోను హ్యాకింగ్ అవలేదా?’’ చిరుకోపం ప్రదర్శిస్తూ అడిగింది గౌరీ. ‘‘సెస్. మల్లీ అదే మాట. వాడి ఫోనుతో ఎవరికి పనే? ‘‘మరెవరికి పని?’’ రెట్టించింది గౌరీ. ‘‘ఇంకెవరికి? నాకు, నీకు, కాదంటే కోడలు పిల్లకు’’ ‘‘అంటే ఏటి మీరు అనేది?’’ అనుమానంగా చూస్తూ అడిగింది గౌరీ. ‘‘మరేటుంది? నేనే చేశాను. అంతా నేనే చేశాను. ఒకేపు నేను వాడి కోసం పడరాని పాట్లు పడుతూ, నానా తిట్లు తింటూ, ఎండలో తిరుగుతూ ఉంటే, ఈడేమో ఏసీలో తొంగొని, 24 గంటలు ఫోన్‌తో కాలం గడిపేస్తుంటాడు. అసలు ఆ ఫోన్లో ఏటుందో తెలుసుకుందామని నేనే ఆ పని చేశా! తీరా ఫోన్లో సమాచారం మరి ఏటున్నదో తెలుసా?? ఫోన్ అంతా అమెరికా ఫ్రెండ్స్‌తో చాటింగ్‌లు, వీడి వీర గాథలు, సిగ్గీలు, జొమాటోల ఆర్డర్లు. ఈ మధ్య కాస్త ఎండలో తిరగటం మొదలెట్టిన దగ్గర నుంచి ఫోన్ అంతా సిగ్గీ ఆర్డర్లే. సిగ్గు లేకపోతే సరి. ఈ సమాచారం తెలుసుకొని ఎవరైనా ఏం చేసుకుంటారు? ఇంత హడావిడి జరుగుతున్నా బాధ్యత లేదు. ఓ ఎదవ హడావిడి తప్ప. పోనీ నాతో పాటు తిప్పుకుందాం అంటే, ఎక్కడ ఏ పేడతట్ట ఎత్తాడో అని భయం’’ అంటూ అసలు సంగతి బయట పెట్టే సరికి గౌరీ అవాక్కయిపోయింది. పి. విజయబాబు వ్యాసకర్త పూర్వ సంపాదకులు -
ట్యాపింగ్ దుమారం : మీకూ ఇలా అవుతోందా? చెక్ చేసుకోండి!
రాను రాను ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. 2024లో ఫోన్ హ్యాకింగ్ అనేది దాదాపు ప్రతి వినియోగదారుని ఆందోళన రేపుతోంది. డెలాయిట్ నిర్వహించిన ఇటీవలి సర్వేలో 67శాతం మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ గాడ్జెట్స్ భద్రతపై ఆందోళన చెందుతున్నారని కనుగొన్నారు. 2023 ఏడాదితో ఇది పోలిస్తే 54 శాతం పెరిగింది. మొన్నపెగాసెస్ వివాదం ప్రకంపనలు రేపింది. ప్రస్తుతం తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ దుమారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇది వినియోగదారుల వ్యక్తిగత వ్యవహారాల గోప్యత, భద్రతపై గుబులు రేపుతోంది. ఈ నేపథ్యలో ఫోన్ హ్యాక్ అయిందని గుర్తించాలి? ముఖ్యంగా అమ్మాయిలు,మహిళలు ఈ విషయంలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ ఫోన్ ఎవరైనా ట్యాపింగ్ చేస్తున్నారన్న విషయాన్ని ఎలా గుర్తించాలి? ⇒ కాల్స్ మాట్లాడుతున్న సమయంలో అసాధారణ శబ్దాలు, అస్పష్టంగా దూరంనుంచి శబ్దాలు రావడం కెమెరా, మైక్రోఫోన్లు యాదృచ్ఛికంగా ఆన్ కావడం. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లలో అయితే స్క్రీన్ పైభాగంలో నారింజ లేదా ఆకుపచ్చ లైట్ వెలుగుతుంది. ⇒ ఉన్నట్టుండి ఫోన్ బ్యాటరీ చార్జింగ్ తగ్గిపోవడం,బ్యాటరీ కండిషన్ సరిగ్గానే ఉన్నా, పెద్దగా యాప్స్ అవీ వాడపోయినా, తరచుగా ఛార్జ్ చేస్తున్నా కూడా వేగంగా అయి పోతుంటే మాత్రం అప్రమత్తం కావాలి. ⇒ ఫోన్ షట్ డౌన్ కావడానికి చాలా సమయం పడుతోందా? ముఖ్యంగా షట్ డౌన్ కావడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకుంటే, ప్రత్యేకించి కాల్, టెక్స్ట్, ఇమెయిల్ లేదా వెబ్ బ్రౌజింగ్ తర్వాత ఇలా జరుగుతోంటే. థర్ట్ పార్టీకి మన డేటాను ట్రాన్స్మిట్అవుతోందా అని అనుమానించాలి. ⇒ మొబైల్ స్పైవేర్ ఫోన్‌ని నిరంతరం ట్రాక్ చేస్తూ, డేటాను ఎక్కువ వాడుకుంటుంది.ఫోన్ చార్జింగ్‌లో లేకపోయినా, ఎక్కువ మాట్లాడకపోయినా ఉన్నట్టుండి ఫోన్ వేగంగా వేడెక్కుతోందా? ఇది గమనించాల్సిన అంశమే. మామూలుగా ఉన్నపుడు కూడా ఫోన్ విపరీతంగా వేడెక్కడం కూడా ఒక సంకేతం. సాధారణంగా గేమింగ్ లేదా సినిమాలు చూసినప్పుడు సాధారణంగా ఫోన్లు వేడెక్కుతుంటాయి. హ్యాకర్లు మన ఫోన్ టార్గెట్ చేశారా అని చెక్ చేసుకోవాల్సిందే. ⇒ సైలెంట్ మోడ్‌లో ఉన్నప్పటికీ కాల్లు, నోటిఫికేషన్స్ స్వీకరిస్తూ, ఆకస్మికంగా రీబూట్ అవుతున్నా రిమోట్ యాక్సెస్ అయిందనడానికి సూచిక కావచ్చు. జాగ్రత్త పడాలి. ⇒ స్మార్ట్‌ఫోన్ అకస్మాత్తుగా స్లో కావడం. యాప్‌లను ఇన్స్టాల్ చేశారో ట్రాక్ చేసి, మీరు ఇన్స్టాల్ చేయని యాప్‌లు కూడా కనిపిస్తే..అది హ్యాకింగ్‌కు సంకేతం కావచ్చు. ⇒ ఫోన్ తరచుగా సడన్ రీబూట్లు, షట్‌డౌన్, లేదా రీస్టార్ట్ అవుతూ ఉండవచ్చు. స్క్రీన్ లైట్లో మార్పులు కనిపిస్తే ఏదైనా మాల్వేర్ ఎఫెక్ట్ అయి ఉండవచ్చు. జాగ్రత్తలు ఈ జాగ్రత్తలను పాటిస్తూ మొబైల్ భద్రతకోసం విశ్వసనీయ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకోండి. అనుమానాస్పద లింక్‌లు, మెసేజ్‌లకు స్పందించకుండా ఉండటం ఉత్తమం. ముఖ్యంగా ట్యాప్ అయిందో లేదో తెలుసుకోవాలంటే.. *#*#4636#*#* – ఈ కోడ్‌ని డయల్ చేయండి. మీ ఫోన్ ట్రాక్ అవుతోందా, లేదా ట్యాప్ అవుతోంది తెలియ చెప్పే కోడ్ (నెట్మోనిటర్) కోడ్. ఫోన్ ఆపరేటింగ్ సిస్టంను బట్టి ఈ కోడ్‌ను డయల్ చేయాల్సి ఉంటుంది. Android యూజర్లు *#*#197328640#*#* లేదా *#*#4636#*#* ని డయల్ చేయాలి. iPhone యూజర్లు అయితే: *3001#12345#* ని డయల్ చేయాలి. -
ఇద్దరు వ్యక్తుల ప్రైవేటు సంభాషణ మూడో వ్యక్తి ఎలా వింటున్నాడు..!
ఫోన్ ట్యాపింగ్.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్యాపింగ్ మాటున కొందరు అధికారులు సాగించిన దందా.. రోజురోజుకూ వెలుగుచూస్తున్న సంచలన విషయాలు విస్తుగొలుపుతున్నాయి. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు.. ఫిర్యాదుల వంటి విషయాలను పక్కనపెడితే.. అసలు ట్యాపింగ్ కథేంటి? దీనిని ఎలా చేస్తారు? ఇద్దరు వ్యక్తులు ప్రైవేటుగా మాట్లాడుకునే మాటలన్నీ మూడో వ్యక్తి ఎలా వినగలుగుతున్నాడు? ఓసారి చూద్దామా? ► ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు టెలిఫోన్ లేదా మొబైల్ ఫోన్ లేదా ఇంటర్నెట్ ద్వారా జరిపే సంభాషణలను వారికి తెలియ కుండా రహస్యంగా వినడం, రికార్డు చేయడాన్నే ట్యాపింగ్ అంటారు. వాస్తవానికి ట్యాపింగ్ చేయడం చట్టవిరు ద్ధం. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ట్యాపింగ్ చేయాల్సి వస్తే.. నిర్దేశిత ప్రభుత్వ ఏజెన్సీలు కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాలి. ప్రైవేటు వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యాపింగ్ చేయడానికి అనుమతి లేదు. అనుమతి పొందిన ప్రభుత్వ సంస్థలు సైతం ట్యాపింగ్ చేయడానికి బోలెడు నిబంధనలు పాటించాలి. ఎవరి ఫోన్ అయినా గరిష్టంగా 180 రోజులు మాత్రమే ట్యాపింగ్ చేయాలి. పైగా ప్రతి 60 రోజులకు ఓసారి తాజాగా అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో అనుమతి లేకుండా గరిష్టంగా 24గంటలకు మించి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ సదరు ట్యాపింగ్‌కు కేంద్ర హోంశాఖ అనుమతి నిరాకరిస్తే అప్పటివరకు రికార్డు చేసిన సంభాషణలన్నీ 48 గంటల్లోగా ధ్వంసం చేయాల్సి ఉంటుంది. ట్యాపింగ్‌లో రకాలు.. సెల్యులర్ ఇంటర్సెప్టర్లు.. ► వీటిని ఐఎంఎస్ఐ క్యాచర్స్ లేదా స్టింగ్రేస్ అని పిలు స్తారు. టవర్ల ద్వారా ప్రసార మయ్యే నిర్దేశిత మొబైల్ సిగ్నల్స్‌ను ఇవి అడ్డుకుంటా యి. అందు లోని డేటాను క్యాప్చర్ చేయడమే కాకుండా.. మొబైల్ లొకేషన్ కూడా ట్రాక్ చేస్తాయి. కాల్స్‌తో పాటు ఎస్సెమ్మెస్ లను సైతం సంగ్రహిస్తాయి. వీఓఐపీ ఇంటర్సెప్షన్ సాధనాలు.. ► వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) కమ్యూనికేషన్లను సంగ్రహించేందుకు రూపొందించిన సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఆధారిత సాధనాలివి. వీఓఐపీ ప్రొటోకాల్స్‌లోని బలహీనతలను ఆసరాగా చేసుకుని ఇంటర్నెట్లో ప్రయాణించే డేటా ప్యాకెట్లను ఇవి అడ్డుకుని అందులోని డేటాను సంగ్రహిస్తాయి. క్లోన్డ్ సిమ్ కార్డులు.. ► ట్యాపింగ్ చేయాలనుకున్న వ్యక్తి సిమ్‌కు క్లోన్డ్ సిమ్ సంపాదిస్తే చాలు.. సదరు వ్యక్తి మొబైల్ ఫోన్‌కు వచ్చే కాల్స్ అన్నీ చక్కగా వినొచ్చు. రాజకీయపరమైన నిఘా.. ► సర్వీస్ ప్రొవైడర్ సహకారంతో రాజకీయ నాయకుల కాల్స్ రికా ర్డు చేస్తారు. ప్రభుత్వం నుంచి దీనికి అనుమతి ఉండదు. అందువల్ల ఇది అక్రమ ట్యాపింగ్. మానిటరింగ్ సాఫ్ట్వేర్.. హానికరమైన సాఫ్ట్వేర్ లేదా స్పైవేర్‌ను నిర్దేశిత వ్యక్తి మొబైల్ ఫోన్లో వారికి తెలియకుండా చొప్పిస్తారు. ఇవి ఆ ఫోన్ సంభాషణలను రికార్డు చేసి బయటి వ్యక్తు లకు పంపించడంతోపాటు ఫోన్లో ఉన్న సమస్త సమాచారాన్ని మనకు తెలియకుండా బహిర్గతం చేస్తుంది. అధికారిక ట్యాపింగ్.. ప్రభుత్వ అనుమతి తీసుకుని సర్వీస్ ప్రొవైడర్ సహకారంతో చేసే ట్యాపింగ్ ఇది. క్లండెస్టైన్ రికార్డర్ ఉపయోగించి సంభాషణలను రికార్డు చేస్తారు. లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు డిజి టల్ ఫోరెన్సిక్స్ కోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ సాధనాలను ఉపయోగించి ఈ ట్యాపింగ్ చేస్తాయి. ల్యాప్‌టాప్ సైజు పరికరంతోనే.. ► అక్రమంగా ట్యాపింగ్ చేసేవాళ్లకు పెద్దగా ఎక్విప్మెంట్ కూడా అక్కర్లేదు. ఓ ల్యాప్ టాప్ సైజులో ఉండే సెల్యులర్ ఇంటర్సెప్షన్ మెషీ న్ను కారులో పెట్టుకుంటే చాలు.. ఎవరి ఫోన్ అయినా సులభంగా ట్యాప్ చేసేయొచ్చు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన వ్యక్తి ఇల్లు లేదా ఆఫీసు వద్ద కారు పార్క్ చేసుకుంటే చాలు అవతలి వ్యక్తి సంభాషణలన్నీ వినొచ్చు.. రికార్డు చేయొచ్చు. ఇందుకోసం ముందుగా ఆ వ్యక్తి ఫోన్ నంబర్‌ను మెషీన్లో ఫీడ్ చేయాలి. అనంతరం ఆ వ్యక్తికి ఫోన్ వస్తే.. ఆటోమేటిగ్గా మెషీన్లో రికార్డు అయిపో తుంది. సదరు వ్యక్తి గొంతును రికార్డు చేసి మెషీన్లో ఫీడ్ చేసినా సరే.. దాని ఆధారంగా ఆ కాల్‌ను మెషీన్ రికార్డు చేస్తుంది. ఇజ్రాయెల్ పేరే ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలు తెరపైకి వచ్చిన ప్పుడు ఇజ్రాయెల్ పేరే వినిపిస్తుంది. అధునాతన సాంకేతిక రంగానికి ఇజ్రాయెల్ ప్రసిద్ధి చెందడమే ఇందుకు కారణం. ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీతో సహా నిఘా, గూఢచార సేకరణ పరికరాలను అభివృద్ధి చేసే నైపుణ్యం ఇజ్రాయెల్ సొంతం. ఇటీవల మన దేశంలో సహా పలు దేశాల్లో సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ రూపొందించింది ఇజ్రాయెలే కావడం గమనార్హం. ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికి ఉంది? జాతీయ స్థాయిలో ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రీసెర్చ్ అనాలసిస్ వింగ్, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో పాటు రాష్ట్ర పోలీసు విభాగాలు నిబంధనలకు అనుగు ణంగా ఎవరి ఫోన్ అయినా ట్యాపింగ్ చేయొచ్చు. సెల్యులర్ ఇంటర్‌సెప్టర్ ఎలా పనిచేస్తుందంటే? ఇది చాలా సులభమైన ట్యాపింగ్ ప్రక్రియ. కాకపోతే ఖరీదు మాత్రం చాలా ఎక్కువ. చిన్న సూట్ ్డకేసులో ఇమిడిపోయే ఈ పరికరంతో.. నిర్దేశిత వ్యక్తుల ఫోన్లను భౌతికంగా ముట్టు కోకుండా.. ఎలాంటి స్పైవేర్లూ చొప్పించకుండా ట్యాపింగ్ చేయొచ్చు. సాధారణంగా మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు మన సెల్ ఫోన్ నుంచి సిగ్నల్స్ సమీపంలోని టవర్ ద్వారా నిర్దేశిత మార్గంలో అవతలి వ్యక్తికి చేరతాయి. ఈ ప్రక్రియలో సెల్ టవర్ల నుంచి ప్రసారమయ్యే సిగ్నల్స్‌ను నేరుగా ఈ మెషీన్లు సంగ్రహించి ఆ సంభాషణలు వినేలా, రికార్డు చేసేలా పనిచేస్తాయి. ఈ మెషీన్లలో కూడా చాలా రకాలున్నాయి.200 మీటర్ల పరిధి నుంచి దాదాపు 20 కిలోమీ టర్ల పరిధిలోని సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ఇవి సంగ్రహించగలవు. కొన్ని మెషీన్లు సెల్‌ఫోన్ నుంచి వచ్చే సిగ్నల్స్‌ను టవర్‌కు వెళ్లకుండా ముందుగానే సంగ్రహిస్తాయి. అలాగే సామార్థ్యాన్ని బట్టి పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యలో కాల్స్ వరకు ఒకేసారి ఈ మెషీన్లు రికా ర్డు చేయగలవు. కాల్స్, ఎస్సెమ్మెస్‌లే కాకుండా సోషల్ మీడియాతోపాటు మన సెల్ డివైస్ లోని సమస్త సమాచారాన్ని యాక్సెస్ చేసే ఇంటర్సెప్టర్లు ఉన్నాయి. వాస్తవా నికి వీటిని కొనాలన్నా చాలా అనుమ తుల తతంగం ఉంటుంది. అయితే, ఇజ్రాయెల్, సింగ పూర్ తదితర దేశాల నుంచి వీటిని అక్రమ పద్ధతిలో సమ కూర్చుకుంటున్నారు. మీ ఫోన్లో వైరస్ ఉందా!? తగిన జాగ్రత్తలతో డేటాను భద్రపరచుకోవచ్చంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్లు అందు బాటులోకి వచ్చాక మన పనులు ఎంత సులు వయ్యాయో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దానితో బోలెడు ముప్పులు సైతం పొంచి ఉన్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తు న్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు ఫోన్లలోకి ఏదో ఒక రూపంలో వైరస్‌ను చొప్పించి ఫొటో లు, వీడియోలు సహా కీలక డేటా కొట్టేయడం, మార్ఫింగ్‌కు వాడుకోవడం లేదా ఆ సమాచారంతో బ్లాక్మెయిల్ చేయడం వంటి ఆగడాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మన ఫోన్లో వైరస్ చొరబడితే దాని పనితీరు ఎలా ఉంటుందో, హ్యాకింగ్‌కు గురైన ఫోన్‌ను తిరిగి ఎలా బాగుచేసుకోవాలో కీలక సూచనలు చేశారు. హ్యాకింగ్‌కు గురయ్యే ఫోన్ పనితీరు ఇలా ► ఫోన్ చార్జింగ్ చేసిన కాసేపటికే చార్జింగ్ డౌన్ కావడం లేదా వేగంగా బ్యాటరీ తగ్గి పోవడం ఫోన్ హ్యాకింగ్‌కు అత్యంత ముఖ్య మైన సంకేతం. మన ఫోన్లో ఏవైనా అనుమానాస్పద సాఫ్ట్వేర్లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటే.. మన మొబైల్ ఫోన్‌ను తక్కువగా వాడినా, బ్యాటరీ మాత్రం అసాధరణంగా తగ్గిపోతుంది. ► మనకు తెలియని సోర్స్‌ల నుంచి కొత్తకొత్త యాడ్స్ వస్తుండటం, ఫ్లాష్ యాడ్స్ వస్తుండటం సైతం హ్యాకింగ్‌కు గురైనట్లు తెలిపే సూచిక. ► మనకు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ రన్ అవడం, కొన్ని హిడెన్ యాప్స్ పనిచేస్తుండటంతో మొబైల్ ఫోన్ బాగా వేడెక్కుతుంది. ఇలా జరిగితే కూడా ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానించాలి. ► కొత్త నంబర్ల నుంచి తరచూ ఫోన్ కాల్స్ వస్తుండటం, టెక్సŠట్ మెసేజ్‌లలో వింత సింబల్స్, క్యారెక్టర్ల కాంబినేషన్స్‌తో రావడం గమనిస్తే ఫోన్ హ్యాక్ అయినట్లు గుర్తించాలి. ► మొబైల్‌ఫోన్ హ్యాక్ అయితే పనితీరు బాగా నెమ్మదిస్తుంది. ఫోన్‌కాల్ చేయడానికి, మెసేజ్‌లు ఓపెన్ కావడానికి, ఇతర యాప్‌లు పనిచేయడం నెమ్మదిగా జరుగుతుంది. ► ఫోన్లోని కెమెరా, మైక్రోఫోన్లు మనకు తెలియకుండానే యాక్టివ్ కావడం గమనిస్తే అనుమానించాల్సిందే. ► ఫోన్లోని స్క్రీన్‌లాక్, యాంటీ వైరస్ వంటి సెక్యూరిటీ ఫీచర్లన్నీ మనకు తెలియకుండానే డిసేబుల్ కావడం ఫోన్ హ్యాకింగ్ అయ్యిందనడానికి అత్యంత కీలకమైన మార్పుగా గుర్తించాలి. ఫోన్ హ్యాక్ అయితే ఏం చేయాలి..? ► ఏదైనా ఉత్తమమైన యాంటీ వైరస్ సాప్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకొని ఫోన్‌ను స్కాన్ చేయాలి. ► ఫోన్లో అనుమానాస్పద యాప్‌లను గమనిస్తే వాటిని వెంటనే డిలీట్ చేయాలి. ► ఫోన్ హ్యాక్ అయి, ఫోన్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నట్లు అనుమానిస్తే వెంటనే ఇంటర్నెట్ డేటా ఆఫ్ చేయాలి. వైఫై కనెక్షన్ తొలగించాలి. ఇలా చేయడం వల్ల హ్యాకర్లకు డేటా ట్రాన్స్ఫర్ ఆగిపోతుంది. ► ఫోన్ స్కీన్ర్ లాక్, యాప్ లాక్‌లు, ఈ–మెయిల్, సోషల్ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లను మార్చేయాలి. ఇలా చేయడం వల్ల మన వ్యక్తిగత సమాచారం చోరీ కాకుండా అడ్డుకోవచ్చు. ► పైవన్నీ చేసినా ఫలితం లేనట్లు గుర్తిస్తే వెంటనే ఫోన్‌ను రీసెట్ చేయాలి. దీనివల్ల మాల్వేర్ అంతా పోవడంతోపాటు అను మాస్పద యాప్‌లు డివైస్ నుంచి తొలగి పోతాయి. అయితే మన వ్యక్తిగత సమా చారం, ఫొటోలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు.. ► మొబైల్ ఫోన్లోని ఫొటోలు, వీడియో లు, ఇతర డేటాను, సోషల్ మీడియా ఖాతాల్లోని సమాచారాన్ని ఎప్పటిక ప్పుడు పెన్‌డ్రైవ్, ఇతర డివైస్‌లలో బ్యాకప్ చేస్తూ ఉండాలి. ఫోన్ హ్యాక్ అయినా వెంటనే దాన్ని రీసెట్ చేయొ చ్చు.ముందే బ్యాక్అప్ ఉంటుంది కాబ ట్టి డేటా పోయే ప్రమాదం ఉండదు. ► యాపిల్, ఆండ్రాయిడ్ ఫోన్లకు ఆరు అంకెల పాస్వర్డ్లు తప్పక పెట్టుకోవాలి. వాటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ► కొత్త యాప్‌లు ఇన్స్టాల్ చేసే ముందు పూర్తిగా వాటికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి. ► పబ్లిక్ వైఫైను వీలైనంత వరకు వాడకపోవడం ఉత్తమం. తప్పనిసరైతే వీపీఎన్ టూల్స్ ద్వారా వాడాలి. ఇలా చేయడం వల్ల మన డేటా ప్రైవేటు ఎన్క్రిప్టెడ్ చానల్ ద్వారా వెళ్తుంది. -
20 దేశాలను టార్గెట్ చేసిన చైనా హ్యాకర్లు..? కీలక పత్రాలు లీక్..
చైనాకు చెందిన హ్యాకర్లు విదేశీ ప్రభుత్వాలు, సంస్థలపై సైబర్ దాడులకు పాల్పడినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. ఇండియాతోపాటు ఇతర దేశాలకు చెందిన గోప్యంగా ఉండాల్సిన సమాచారాన్ని దొంగలించినట్లు వార్తలు ప్రచురితమయ్యాయి. చైనా ప్రభుత్వం మద్దతున్న ఓ హ్యాకింగ్ సంస్థకు చెందిన కీలక పత్రాలు ఇటీవల లీకయ్యాయి. ఆ డాక్యుమెంట్లలో సంచలన విషయాలు బయటపడినట్లు కథనాలు వెలువడ్డాయి. సాఫ్ట్వేర్ లోపాలతో.. విదేశీ ప్రభుత్వాలు, కంపెనీలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడినట్లు అందులో తేలింది. మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్‌కు చెందిన సాఫ్ట్వేర్ వ్యవస్థల్లో లోపాలను ఉపయోగించుకుని ఈ దాడులు చేసినట్లు తెలిసింది. గతవారం గిట్‌హబ్‌లో లీకైన పత్రాలు షాంఘై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐసూన్ అనే కంపెనీకి చెందినవని సమాచారం. చైనా ప్రభుత్వ కంపెనీలు, మంత్రిత్వ శాఖలకు ఈ సంస్థ థర్డ్ పార్టీ హ్యాకింగ్ సేవలు అందిస్తోంది. 20 దేశాలు టార్గెట్.. ఇతర దేశాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేలా సైబర్ దాడులకు పూనుకునేలా చైనా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని ఆ పత్రాల్లో ఉన్నట్లు తెలిసింది. భారత్, యూకే, తైవాన్, మలేషియాతోపాటు మొత్తం 20 దేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అందులో ఉంది. అయితే ఈ పత్రాల లీక్‌కు ఎవరు బాధ్యులో కనుగొనేందుకు చైనా పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: భవిష్యత్తులో కరెంట్ కష్టాలు తీరేనా..? ఏం చేశారంటే.. హ్యాకర్ల నుంచి లీకైన పత్రాల ద్వారా తెలిసిన సమాచరం ప్రకారం కథానాల్లో వెలువడిన వివరాలు ఇలా ఉన్నాయి.. భారత్ నుంచి 100 గిగాబైట్ల(జీబీ) ఇమిగ్రేషన్ డేటాను సేకరించారు. హ్యాకర్లు వివిధ దేశాల్లోని 80 టార్గెట్ల నుంచి డేటాను దొంగలించారు. దక్షిణ కొరియా టెలికాం ప్రొవైడర్ నుంచి 3 టెరాబైట్ల(టీబీ) కాల్ లాగ్స్ సమాచారాన్ని సేకరించారు. దీనిపై కేంద్రప్రభుత్వం స్పందించలేదు. -
ఇండస్ట్రీలోనే అలాంటి తొలి చిత్రం.. అవార్డ్ కైవసం!
కావ్య కీర్తి కీలక పాత్రలో నటించిన చిత్రం హలో బేబీ. ఈ మూవీ తాజాగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రానికి రామ్ గోపాల్ రత్నం దర్శకత్వం వహించారు. ఎస్‌కేఎంఎల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మించారు. తాజాగా ఈ అవార్డును తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో నిర్మాత ఆదినారాయణకు అందించారు. కాగా.. ఈ సినిమా ఇండస్ట్రీలోనే మొదటి హ్యాకింగ్ చిత్రంగా నిలిచింది. కేవలం సోలో క్యారెక్టర్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు రాష్ట్రాల్లో 200కి పైగా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేసిన మేకర్స్ హిందీలో కూడా రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుని యు/ఎ సెన్సార్ సర్టిఫికేట్ అందుకుంది. ఇండస్ట్రీలో తొలి హ్యాకింగ్ చిత్రంగా గుర్తింపు తెచ్చుకుందని సెన్సార్ అధికారులు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాకు సుకుమార్ పమ్మి సంగీతమందించారు. -
భారతీయ జర్నలిస్టుల ఫోన్లపై పెగాసస్ నిఘా!
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ నిఘా సాఫ్ట్‌వేర్‌తో కేంద్రప్రభుత్వం హ్యాకింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలకు తాజాగా బలం చేకూరింది. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లతో దేశంలోని ప్రముఖుల ఐఫోన్లను లక్ష్యంగా చేసుకున్నారంటూ ‘యాపిల్’ నుంచి అప్రమత్తత సందేశాలు అక్టోబర్‌లో వచి్చన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు భారతీయ జర్నలిస్టులు తమ ఫోన్లను ల్యాబ్ పరీక్షకు పంపించగా అవి పెగాసస్ స్పైవేర్ హ్యాకింగ్‌కు గురయ్యాయని తేలింది. తమ సెక్యూరిటీ ల్యాబ్ పరీక్షలో ఈ విషయం నిర్ధారణ అయిందని లాభాపేక్షలేని అంతర్జాతీయ సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురువారం ప్రకటించింది. దీంతో ఆనాడు చాలా మందికి పొరపాటున అలర్ట్‌లు వచ్చాయన్న యాపిల్ ఇచి్చన వివరణ తప్పు అని తేలింది.∙పెగాసస్ తమ నిఘా సాఫ్ట్‌వేర్‌ను కేవలం దేశాల ప్రభుత్వాలకే విక్రయిస్తోంది. భారత్‌కు చెందిన నిఘా విభాగం సైతం ఇదే సంస్థ నుంచి కొంత హార్డ్‌వేర్‌ను 2017లో కొనుగోలుచేసినట్లు వాణిజ్య గణాంకాల్లో వెల్లడైంది. ఈ స్పైవేర్ సాయంతో దేశంలోని ప్రముఖులు, రాజకీయవేత్తలు, సామాజిక కార్యకర్తలు, న్యాయమూర్తుల ఫోన్లను హ్యాక్ చేశారని 2021 జూలైæ నెలలో అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడటం తెల్సిందే. భారత్‌లోనూ ప్రముఖులు ఈ హ్యాకింగ్బారిన పడ్డారని ‘ది వైర్’ వార్తాసంస్థ సంచలన కథనం వెలువరిచింది. ‘ది వైర్’ వెబ్సైట్ ఎడిటర్ సిద్ధార్థ్ వరదరాజన్, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అండ్ కరప్షన్ రిపోర్ట్ ప్రాజెక్ట్(ఓసీసీఆర్పీ) సౌత్ ఆసియా ఎడిటర్ ఆనంద్ మంగ్నాలే ఫోన్లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని ఆమ్నెస్టీ వెల్లడించింది. వివాదాన్ని కప్పిపుచ్చే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వమే యాపిల్ సంస్థపై ఒత్తిడి తెచ్చి తప్పుడు అలర్ట్‌లు వచ్చాయని చెప్పించిందని ‘వాషింగ్టన్ పోస్ట్’ పేర్కొంది. ‘ భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల ఐఫోన్ యూజర్లకు ఇలా పొరపాటున అలర్ట్‌లు వెళ్లాయి’’ అని యాపిల్ ఆనాడు ప్రకటించింది. రాహుల్ గాం«దీసహా పలువురు విపక్ష నేతలు, జడ్జీలు, సామాజిక కార్యకర్తల ఫోన్ల హ్యాకింగ్ ఉదంతం గతంలో పార్లమెంట్‌నూ కుదిపేసింది. ఇంత జరిగినా ‘‘తాము స్పైవేర్‌ను ఇజ్రాయెల్ సంస్థ నుంచి కొనలేదు. వినియోగించలేదు’’ అని మోదీ సర్కార్ చెప్పకపోవడం గమనార్హం. భారత రక్షణ నిఘా విభాగానికి చెందిన సిగ్నల్ ఇంటెలిజెంట్ డైరెక్టరేట్ గతంలో కాగ్సైట్ అనే సంస్థ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేసిందని ఆరోపణలు వచ్చాయి. -
మీ ఫోన్ హ్యాక్ అయిందా..? తెలుసుకోండిలా..
ఫోన్ హ్యాకింగ్..ఇటీవల అందరినీ భయపెడుతున్న పదం. సైబర్ నేరగాళ్లు ప్రపంచంలో ఏ మూలనో నక్కి, ఫోన్లపై దాడి చేస్తూనే ఉన్నారు. మనం వాడే ఫోన్లలో సాప్ట్‌వేర్‌ను జొప్పించి స్మార్ట్ఫోన్లను హ్యాక్ చేస్తుంటారు. మన ప్రమేయమేమీ లేకుండానే ఫోన్‌ను వాడేస్తుంటారు. అనుచిత యాప్‌లను ఇన్స్టాల్ చేస్తుంటారు. ఒక్కసారి వ్యక్తిగత వివరాలు వాళ్ల అధీనంలోకి వెళ్లిపోతే ఫోన్లోని విలువైన సమాచారం చోరీకి గురవుతుంది. మనకు తెలియకుండానే బ్యాంక్ లావాదేవీలు చేసేస్తారు. నిజానికి ఏ స్మార్ట్‌ఫోనూ పరిపూర్ణమైంది కాదు. అప్పుడప్పుడు ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ అదేపనిగా ఇబ్బందులు సృష్టిస్తుంటే ‘ఫోన్‌ను ఎవరైనా హ్యాక్ చేశారా?’ అనే సందేహం కలగటంలో ఆశ్చర్యమేమీ లేదు. దాన్ని ఆపాలంటే.. అసలు మన ఫోన్ హ్యాకింగ్‌కి గురైందో తెలుసుకోవాలంటే.. అలాకాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఈ కథనంలో తెలుసుకుందాం. ఫోన్ హ్యాక్ అయితే.. మనం ఇన్స్టాల్ చేయని కొన్ని యాప్స్ సైతం ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంటే హ్యాకింగ్‌కు గురైందేమోనని అనుమానించాల్సిందే. బ్యాటరీ ఛార్జింగ్ సాధారణ రోజుల్లో కన్నా వేగంగా అయిపోతుంటే స్పైవేర్, మాల్వేర్ హ్యాకర్లు మనకు తెలియకుండానే మన ఫోన్‌ని ఉపయోగిస్తున్నారని తెలుసుకోవాలి. ఔట్‌గోయింగ్ కాల్స్ విభాగంలో కొత్త నెంబర్లు, ఔట్బాక్స్లో మనం పంపని ఎసెమ్మెస్‌లు కనిపిస్తుంటాయి. మన ప్రమేయం లేకుండానే తరచూ పాప్-అప్స్ హోం స్క్రీన్ మీద ప్రత్యక్షం అవుతుంటాయి. హ్యాక్‌కి గురైన ఫోన్‌కి పోస్ట్ పెయిడ్ డేటా ప్లాన్ సదుపాయం ఉంటే బిల్లులు అసాధారణంగా, ఎక్కువగా వస్తుంటాయి. బ్రౌజర్ హోం పేజీ మనం వాడుతున్నది కాకుండా, తరచూ వేర్వేరుగా కనిపిస్తుంటుంది. మనం ఓపెన్ చేయని పేజీలూ హిస్టరీ విభాగంలో కనిపిస్తుంటాయి. ఫోన్ వేగం మందగిస్తుంటుంది. తెలియని నంబర్ల నుంచి కాల్స్ లేదా స్పామ్ మెసేజ్‌లు వస్తున్నా.. ఫోన్ నుంచి స్పామ్ మెసేజ్‌లు వెళ్తున్నా హ్యాక్ అయ్యిండొచ్చని అనుకోవాలి. మనకు తెలియకుండానే స్క్రీన్‌లాక్, యాంటీవైరస్ వంటి భద్రతా ఫీచర్లు డిసేబుల్ అయితే సందేహించాల్సిందే. ఏం చెయ్యాలి? ఫోన్ హ్యాక్ అయ్యిందనిపిస్తే ముందుగా కాంటాక్ట్ నంబర్లున్న వ్యక్తులకు ఫోన్ హ్యాక్ అయ్యిందనే విషయాన్ని తెలపాలి. మన ఫోన్ నుంచి వచ్చే అనుమానిత లింకులేవీ క్లిక్ చేయొద్దని వారికి తెలియజేయాలి. ఫోన్ వైఫై, మొబైల్ డేటాను టర్న్ఆఫ్ చేయాలి. దీంతో మోసగాళ్లకు ఫోన్ మీద మరింత ఆధిపత్యం ఉండకుండా చేయొచ్చు. ఫోన్లోని మాల్వేర్ను గుర్తించి, తొలగించటానికి యాంటీ-మాల్వేర్ సాఫ్ట్వేర్ తోడ్పడుతుంది. దీన్ని తరచూ రన్ చేస్తుండాలి. ఒకవేళ అలాంటి సాఫ్ట్వేర్ లేనట్లయితే ఆథరైజ్డ్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసి, రన్ చేయాలి. ఫోన్ హ్యాక్ అయినప్పుడు లాగిన్ పాస్‌వర్డ్‌లను మోసగాళ్లు తెలుసుకునే ప్రమాదముంది. కాబట్టి మాల్వేర్ను తొలగించిన తర్వాత అన్ని పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసుకోవాలి. ప్రతి ఖాతాకూ వేర్వేరుగా కఠినమైన పాస్‌వర్డ్‌లను నిర్ణయించుకోవాలి. ఫోన్లో పొరపాటున మాల్వేర్ చొరపడటానికి ప్రధాన కారణం అనుమానిత యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవటం. ఫోన్ హ్యాక్ అయ్యిందని అనిపిస్తే యాప్‌ల జాబితాను నిశితంగా పరిశీలించాలి. థర్డ్ పార్టీ యాప్ స్టోర్ నుంచి లేదా ఇతర సోర్సుల నుంచి డౌన్లోడ్ అయిన యాప్‌లు కనిపిస్తే వెంటనే డిలీట్ చేయాలి. ఆ యాప్‌లు ఏయే డేటాను యాక్సెస్ చేస్తున్నాయో కూడా చూడాలి. దీంతో ఏ ఖాతా పాస్వర్డ్లు మార్చాలో తెలుస్తుంది. ఇదీ చదవండి: ఎయిర్ఇండియా బాహుబలి! ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే చాలావరకు మాల్వేర్ తొలగిపోతుంది. అయితే దీంతో ఫోన్లో స్టోర్ అయిన ఫొటోలు, నోట్స్, కాంటాక్ట్స్ వంటి సమాచారమూ పోతుంది. కాబట్టి ఫోన్‌ను రీసెట్ చేయటానికి ముందు డేటాను బ్యాకప్ చేయాలి. అయితే యాప్స్‌ను బ్యాకప్ చేయొద్దు. ముఖ్యంగా ఫోన్లో మాల్వేర్ ఉన్నట్టు అనుమానిస్తే అసలే యాప్స్‌ను బ్యాకప్ చేయొద్దు. అదనపు భద్రత కోసం ముఖ్యమైన యాప్‌లన్నింటికీ టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెట్ చేసుకోవాలి. బ్యాంకు ఖాతాలు, ఈమెయిళ్లు, ఇతర రహస్య ఖాతాల వంటి వాటిల్లో ఏదైనా అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నాయేమో కనిపెడుతుండాలి. పాస్వర్డ్ మేనేజర్ వంటి భద్రమైన యాప్‌ను వాడితే తప్ప ఫోన్లో పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డు వివరాల వంటి కీలకమైన సమాచారాన్ని సేవ్ చేయొద్దు. -
డార్క్‌వెబ్‌లో ‘బీఎస్ఎన్ఎల్’ యూజర్ల డేటా
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ వినియోగదారుల సమాచారాన్ని చోరీచేసిన ఓ హ్యాకర్ ఆ వివరాలను ఆన్లైన్లో విక్రయానికి పెట్టాడు. దీంతో ఆయా కస్టమర్ల గోప్యతకు విఘాతం కలిగింది. తనను ‘పెరిల్’గా పేర్కొన్న ఓ హ్యాకర్.. డార్క్‌వెబ్‌లో ఆ సమస్త వివరాలను పొందుపరిచాడు. దీంతో యూజర్ల గుర్తింపు బహిర్గతమవడంతోపాటు వారి సమాచారం సాయంతో మరో ఆర్థిక మోసం, ఆన్లైన్మోసానికి ఆస్కారం ఏర్పడింది. దాదాపు 29 లక్షల వరుసల డేటాను సంపాదించానని హ్యాకర్ తన డార్క్‌వెబ్ పేజీలో పేర్కొన్నాడు. శాంపిల్‌గా మొదట 32,000 లైన్ల డేటాను అందరికీ కనిపించేలా పెట్టాడు. ఆయా బీఎస్ఎన్ఎల్ ఫైబర్, ల్యాండ్‌లైన్ యూజర్ల పేరు, ఈమెయిల్ ఐడీ, బిల్లుల సమాచారం, ఫోన్ నంబర్లు, ఇతర వ్యక్తిగత డేటాను వెబ్సైట్లో విక్రయానికి పెట్టాడు. కస్టమర్ ఇన్ఫర్మేషన్, నెట్వర్క్ వివరాలు, ఆర్డర్లు, హిస్టరీ అందులో ఉన్నాయి. డేటా చోరీతో వెంటనే అప్రమత్తమై తమ యూజర్ల డేటా రక్షణకు బీఎస్ఎన్ఎల్ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరిగాయి. ‘ ఇది బీఎస్ఎన్ఎల్కు, దాని వినియోగదారులపై విస్తృతస్థాయిలో దు్రష్పరిణామాలు చూపిస్తుంది’ అని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఇండియా ఫ్యూచర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కనిష్క్ గౌర్ ఆందోళన వ్యక్తంచేశారు. -
మొన్న శాంసంగ్.. తాజాగా యాపిల్ ప్రొడక్ట్‌లపై కేంద్రం హైరిస్క్ అలర్ట్..
కేంద్రప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్-ఇన్) ఇటీవల శాంసంగ్ కంపెనీ ఉత్పత్తుల్లో అనేక లోపాలు ఉన్నాయని గుర్తించిన సంగతి తెలిసిందే. ఫలితంగా సైబర్ నేరస్థులు శాంసంగ్ ఫోన్లు వాడుతున్న లక్షల మంది వినియోగదారుల నుంచి తమ వ్యక్తిగత డేటాను దొంగలించే ప్రమాదం ఉందని సెర్ట్ పేర్కొంది. తాజాగా యాపిల్ ఉత్పత్తులకు కూడా ఇదే తరహాలో ప్రమాదం ఉందని కేంద్రం తెలిపింది. ఈ కంపెనీకి చెందిన పలు ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) వెల్లడించింది. దీని వల్ల యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూజర్లు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఐఫోన్, యాపిల్ వాచ్, మ్యాక్ బుక్, ఐపాడ్, యాపిల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పాటు సఫారీ బ్రౌజర్లో ఈ భద్రతా పరమైన లోపాలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ తన అడ్వైజరీలో వివరించింది. ‘యాపిల్ ఉత్పత్తుల్లో పలు సెక్యూరిటీ లోపాలు బయటపడ్డాయి. దీని వల్ల హ్యాకర్లు యాపిల్ ఉత్పత్తుల్లోని భద్రతా పరిమితులను అధిగమించి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉంది’ అని సెర్ట్ తెలిపింది. ఈ లోపాలను హ్యాకర్లు గుర్తిస్తే సెక్యూరిటీ పరిమితులను అధిగమించగలరని, ఏకపక్షంగా కోడ్‌ను ఎగ్జిక్యూట్ చేసి కీలక సమాచారాన్ని పొందే ప్రమాదం ఉందని తెలిపింది. ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 17.2 కంటే ముందు వెర్షన్లు, ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 16.7.3 కంటే ముందు వెర్షన్లు, మ్యాక్ ఓఎస్ సొనోమా 14.2, వెంట్యురా 13.6.3, మానిటరీ 12.7.2, యాపిల్ టీవీ ఓఎస్ 17.2, యాపిల్ వాచ్ ఓఎస్ 10.2, సఫారీ 17.2 కంటే ముందు వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ వెల్లడించింది. కాగా.. యాపిల్ ఉత్పత్తులకు కేంద్రం గతంలోనూ పలుమార్లు ఇలాంటి అలర్ట్‌లు జారీ చేసింది. ఇదీ సంగతి: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కేంద్రం హై అలర్ట్! ఇటీవలే శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్‌తో పనిచేసే శాంసంగ్ ఫోన్లలో భద్రతాపరమైన లోపం ఉందని, దీనివల్ల వినియోగదారులకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది. కాబట్టి యూజర్లు లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ వివరించింది. -
ఐఫోన్లు హ్యాక్..షాక్ లో నేతలు..
-
యాపిల్‌కు నోటీసులు
న్యూఢిల్లీ: విపక్ష ఎంపీల ఐఫోన్లకు వచ్చిన హ్యాకింగ్ అలర్ట్‌ల ఉదంతంలో కేంద్ర సైబర్‌సెక్యూరిటీ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. భారత కంప్యూటర్ అత్యవసర స్పందనా బృందం(సీఈఆర్టీ–ఇన్) సంస్థ తన దర్యాప్తు ఇప్పటికే ప్రారంభించిందని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ గురువారం చెప్పారు. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లు ఐఫోన్ల దాడికి యత్నించినట్లు ఏమైనా ఆధారాలుంటే సమరి్పంచాలని ఐఫోన్ తయారీసంస్థ యాపిల్‌ను కోరుతూ కేంద్రం నోటీసులు పంపింది. సీఈఆర్టీ–ఇన్ ఆధ్వర్యంలో జరిగే దర్యాప్తుకు యాపిల్ సంస్థ సహకరించనుందని కృష్ణన్ చెప్పారు. సీఈఆర్టీ అనేది జాతీయ నోడల్ ఏజెన్సీ. కంప్యూటర్ భద్రతను సవాల్ చేసే ఘటనలు సంభవించినపుడు వెంటనే సీఈఆర్టీ స్పందించి తగు సూచనలు, సలహాలు ఇస్తుంది. -
మరో నిఘా నేత్రం?
నిత్యం ఏవో కళ్ళు మనల్ని గమనిస్తున్నాయంటే ఎలా ఉంటుంది? చేతిలోని మన చరవాణి సైతం చటుక్కున ప్రత్యర్థిగా మారిపోయే ప్రమాదం ఉందని తెలిస్తే ఏమనిపిస్తుంది? ఫోన్లలోని కీలక సమాచారాన్ని చేజిక్కించుకొనేందుకు ‘పాలకవర్గ ప్రాయోజిత ఎటాకర్లు’ ప్రయత్నిస్తున్నారంటూ ఆపిల్ సంస్థ అక్టోబర్ 31న పంపిన అప్రమత్తపు ఈ–మెయిల్స్‌తో అదే జరిగింది. ఐ–ఫోన్లు వాడుతున్న పలువురు ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులే కాదు... ప్రపంచమంతా ఉలిక్కిపడింది. వ్యక్తిగత డేటా, గోప్యతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందంటూ దేశవ్యాప్తంగా ఆపిల్ ఐ–ఫోన్ వినియోగదారులు పలువురికి ఇలా పారాహుషార్ సందేశాలు అందడం తేలికైన విషయమేమీ కాదు. సహజంగానే కేంద్ర ఐటీ శాఖ మంత్రి ప్రభుత్వం హ్యాకింగ్‌కు పాల్పడుతోందనే ఆరోపణల్ని కొట్టిపారేశారు. దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామన్నారు. ఈ అప్రమత్తత నోటిఫికేషన్లు పంపిన టెక్ దిగ్గజం ఆపిల్‌కు నోటీసులిచ్చి, సహకరించాల్సిందిగా కోరారు. ఫోన్లు – కంప్యూటర్ల హ్యాకింగ్, పాలకపక్షాల గూఢచర్యం ఆధునిక సాంకేతిక యుగం తెచ్చిన అతి పెద్ద తలనొప్పి. ఇది అనేక దేశాల్లో గుట్టుగా సాగుతూనే ఉంది. పులు కడిగిన ముత్యాలమని చెప్పుకొనే పాలకవర్గాలు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా యన్నది కీలకం. డేటా లీకేజీలు, గూఢచర్య సాఫ్ట్వేర్ వినియోగాలు మనకూ కొత్త కావు. దేశంలో ఇజ్రాయెలీ గూఢచర్య సాఫ్ట్వేర్ ‘పెగసస్’ వినియోగం సహా పలు ఆరోపణలపై గతంలో విచారణలు జరిగాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగబోవని హామీలూ వచ్చాయి. అన్నీ నీటిమూటలే. పెగసస్ సాఫ్ట్వేర్ కొనలేదని ప్రభుత్వం తోసిపుచ్చినా, కొత్త గూఢచర్య సాఫ్ట్వేర్ల కొనుగోలుకు భారత్ ఉత్సుకత చూపుతుందని విదేశీ పత్రికల్లో విశ్వసనీయ కథనాలు వచ్చాయి. సుప్రీం కోర్ట్ నియమించిన కమిటీ కొన్ని ఫోన్లను పరిశీలించి, పెగసస్ వినియోగంపై కచ్చితమైన సాక్ష్యాధారాలు లభించలేదని చెబుతూనే, ఈ దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని కుండబద్దలు కొట్టింది. అందుకే, తాజా విచారణపైనా అపనమ్మకం వ్యక్తమైతే తప్పుపట్టలేం. తాజా అప్రమత్త సందేశాలు పంపడానికి కారణాలను ఆపిల్ వివరించిన తీరూ అస్పష్టంగా ఉంది. అది సమగ్రంగా కారణాలను వివరించాల్సింది. అసలు ‘పాలకవర్గ ప్రాయోజిత’ ఎటాకర్లు అనే పదానికి ఆ సంస్థ చెబుతున్న వ్యాఖ్యానం, జనానికి అర్థమవుతున్న టీకా తాత్పర్యం వేర్వేరు. పుష్కలంగా నిధులు, వ్యవస్థీకృత సామర్థ్యం, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలున్నవన్నీ ఆ వర్గం కిందకు వస్తాయన్నది ఆపిల్ మాట. ప్రభుత్వ జోక్యం లేనిదే అది అసాధ్యమనేది అందరికీ తెలుసు. అందుకే, తాజా రగడపై అటు భారత అటు ప్రభుత్వం, ఇటు ఆపిల్ క్రియాశీలంగా వ్యవహరించాలి. వినియోగదారుల్ని అప్రమత్తం చేయడమే నేరమన్నట్టు ప్రభుత్వం, ఆపిల్ చెవులు మెలేస్తే దేశంలో పెట్టుబడులకు ప్రతికూల వాతావరణమే మిగులుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 శాతం మంది ఆపిల్ ఐ–ఫోన్లు వాడుతుంటే, వారిలో 7 శాతం మన దేశంలోనే ఉన్నారు. తమ ఉత్పత్తులు పూర్తి సురక్షితమనీ, హ్యాకింగ్ అవకాశం అత్యల్పమనీ, ఆ యా దేశాల ప్రభుత్వాల పక్షాన తాము గూఢచర్యానికి ఎన్నడూ పాల్పడబోమనీ ఆపిల్ కూడా నమ్మకం కలిగించాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటైన పార్లమెంటరీ సంఘం తక్షణం సమావేశమై, ఆపిల్ సందేశాలపై విచారణ జరపాలంటూ ప్రతిపక్ష సభ్యులు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు. అయితే, ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ఫోన్ల హ్యాకింగ్ వాదనను ‘యాక్సెస్ నౌ’ సంస్థ సమర్థిస్తోందనీ, కోటీశ్వరుడైన అమెరికన్ ఫైనాన్షియర్ జార్జ్ సోరోస్‌కు ఆ సంస్థలో పెట్టుబడులున్నాయి గనక ఆయనకు ఈ హ్యాకింగ్ వివాదంతో సంబంధం ఉందనీ అధికార బీజేపీ ఐటీ విభాగాధిపతి ఆరోపించారు. పాలక వర్గాలపై ఆరోపణలు వచ్చినప్పుడు అవి నిరాధారమని నిరూపించి, నిజాయతీని నిరూపించు కోవాలి. అది వదిలేసి బోడిగుండుకూ, మోకాలుకూ ముడిపెడితే ప్రయోజనం శూన్యం. అదే సమ యంలో ఇచ్చిన సమాచారంపై దృష్టిపెట్టకుండా, తెచ్చిన వార్తాహరుడిపై కత్తులు నూరితే కష్టం. ఆపిల్ అప్రమత్తతకు సరిగ్గా ఒక రోజు ముందరే మన ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్’ నుంచి దాదాపు 80 కోట్ల మంది పౌరుల ఆధార్ వివరాలు లీకయ్యాయి. దీనిపైనా లోతైన విచారణ జరపాల్సి ఉంది. ఆధార్ వివరాలు నమోదు చేసే ‘యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా’ సర్వర్ కట్టుదిట్టమైనదే. కానీ, ఇతర మార్గాల్లో వివరాలు బయటకు పొక్కుతున్నాక ఇక గోప్యతకు అర్థమేముంది! వ్యక్తిగత డిజిటల్ డేటా రక్షణపై ఇటీవలే చట్టం చేసిన ప్రభుత్వం సమాచార సేకరణ, నిల్వ, వినియోగంపై కట్టుదిట్టమైన నియమావళి సత్వరం తీసుకురావాలి. ప్రజాస్వామ్యానికి కీలకమైన ప్రతిపక్షాలు, పాత్రికేయులపై నిఘా పెట్టి, పౌరుల ప్రాథమిక హక్కయిన గోప్యతను తుంగలో తొక్కాలనుకుంటే అది ఘోరం. ఈ వ్యవహారంపై ప్రజల్లో చైతన్యం పెంచి, ఇలాంటి ఉల్లంఘనల్ని ప్రతిఘటించేలా సంసిద్ధం చేయాలి. పాలకపక్షాలు ఈ ఆరోపణల్లోని నిజానిజాల నిగ్గు తేల్చాలి. పదేపదే ఆరోపణలు వస్తున్నందున వ్యక్తిగత సమాచార గోప్యతకు భంగం వాటిల్లకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పరిష్కార మార్గాల అన్వేషణే కాదు... ఆచరణలోనూ ప్రజలందరికీ నమ్మకం కలిగించాలి. గోప్యత ఉల్లంఘన జరిగినట్టు తేలితే, కఠిన చర్యలు చేపట్టాలి. అలాకాక, రెండేళ్ళ క్రితం నాటి ‘పెగసస్’ లానే దీన్ని కూడా చాప కిందకు నెట్టేయాలని పాలకులు ప్రయత్నిస్తేనే చిక్కు. రాజకీయ రచ్చగా మారుతున్న తాజా వ్యవహారంలో అసలు సంగతి వదిలేసి, కొసరు విషయాలు మాట్లాడుకుంటే ఎన్నటికీ ఉపయోగం లేదు. -
విపక్ష నేతల ఐఫోన్ల కు హ్యాకింగ్ అలర్ట్స్
-
ప్రతిపక్ష ఎంపీల ఐఫోన్ల హ్యాకింగ్!
న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు తారస్థాయికి చేరిన వేళ విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్ వార్తలు దేశవ్యాప్తంగా పెను రాజకీయ సంచలనానికి దారితీశాయి. కాంగ్రెస్ మొదలుకుని పలు విపక్షాల ఎంపీలు తదితరుల ఐఫోన్లకు దాని తయారీ సంస్థ యాపిల్ నుంచి మంగళవారం వచ్చిన హ్యాకింగ్ అలర్టులు తీవ్ర కలకలం రేపాయి. ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న హ్యాకర్లు మీ ఐఫోన్లను నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ వచ్చిన హెచ్చరిక నోటిఫికేషన్లు సంచలనం సృష్టించాయి. ఇది కచ్చితంగా కేంద్రంలోని మోదీ సర్కారు పనేనంటూ విపక్ష నేతలు భగ్గుమన్నారు. గతంలో పెగసెస్ సాఫ్ట్‌వేర్‌తో తమపై గూఢచర్యం చేసిన బీజేపీ, ఎన్నికల వేళ మరోసారి ఇలాంటి చౌకబారు చర్యలకు దిగిందంటూ దుయ్యబట్టారు. ఈ ఆరోపణలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించి వాస్తవాలు వెలుగులోకి తెస్తామని ప్రకటించింది. మరోవైపు ఈ కలకలం నేపథ్యంలో, తమ నోటిఫికేషన్లలో కొన్ని ఫేక్ అలర్టులు కూడా ఉండొచ్చంటూ యాపిల్ స్పందించింది. భారత్‌లోనేగాక 150 దేశాల్లో పలువురు యూజర్లకు ఇలాంటి అలర్టులు వచ్చాయని పేర్కొంది. అయితే ఈ అలర్టులకు దారితీసిన కారణాలను బయట పెట్టేందుకు నిరాకరించింది. దుయ్యబట్టిన విపక్ష నేతలు ఈ ఉదంతంలో కేంద్రప్రభుత్వ పాత్ర కచ్చితంగా ఉందంటూ విపక్ష నేతలు ఆరోపించారు. తమ ఫోన్లలో అభ్యంతరకర సమాచారాన్ని చొప్పించి అందుకు తమను బాధ్యులను చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ అంశాన్ని తక్షణం లోక్‌సభ హక్కుల కమిటీకి నివేదించాలని డిమాండ్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ, గోప్యతలపై ఇలాంటి దాడి దారుణమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తదితర విపక్ష నేతలను విచారణ పేరుతో వేధించడం, తాజాగా వారి ఫోన్ల హ్యాకింగ్‌కు ప్రయత్నించడం మోదీ సర్కారు అభద్రతా భావానికి సూచనలని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. లోతుగా దర్యాప్తు: ఐటీ మంత్రి వైష్ణవ్ విపక్ష నేతల ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొట్టిపారేశారు. మోదీ నాయకత్వంలో దేశ ప్రగతిని చూసి ఓర్వలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అయితే ఈ ఉదంతంపై కూలంకషంగా దర్యాప్తు జరిపించి నోటిఫికేషన్ల వ్యవహారాన్ని నిగ్గుదేలుస్తామని ప్రకటించారు. ‘పూర్తి పారదర్శకంగా సరైన సమాచారాన్ని అందజేయడం ద్వారా విచారణలో మాతో కలిసి రావాల్సిందిగా యాపిల్‌ను కోరాం. ముఖ్యంగా ప్రభుత్వ దన్నుతో హ్యాకింగ్ జరగవచ్చని ఏ ఆధారంతో చెప్పారో వివరించాలని సూచించాం. ఇది పూర్తిగా సాంకేతికపరమైన దర్యాప్తు. కనుక కంప్యూటర్ సెక్యూరిటీ సంబంధిత అంశాలకు బాధ్యత వహించే జాతీయ నోడల్ ఏజెన్సీ సెర్ట్–ఇన్ దీన్ని చేపడుతుంది.’ అని మంత్రి ప్రకటించారు. ఇలాంటి నోటిఫికేషన్లు 150కి పైగా దేశాల్లోని ఐఫోన్ యూజర్లకు వచ్చాయని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గుర్తు చేశారు. నా ఫోన్ తీసుకోండి: రాహుల్ ఈ ఉదంతంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. విపక్ష నేతల ఐఫోన్ల హ్యాకింగ్ కచ్చితంగా మోదీ సర్కారు పనేననంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ‘మేం భయపడేది లేదు. మా ఫోన్లను ఎంతగా హాకింగ్ చేసుకుంటారో చేసుకోండి. మీకు కావాలంటే చెప్పండి, నా ఫోన్ కూడా ఇస్తా’ అంటూ విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్త గౌతం అదానీయే ప్రస్తుతం దేశాన్ని రిమోట్ కంట్రోల్‌తో నడుపుతున్నారని ఆరోపించారు. ‘ఇప్పుడు దేశంలో అదానీయే నంబర్ వన్. తర్వాతి స్థానాల్లో మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నారు. మోదీ ఆత్మ అదానీ దగ్గరుంది. అందుకే అదానీని ఎవరైనా ఒక్క మాటన్నా వెంటనే నిఘా వర్గాలు రంగంలోకి దిగుతున్నాయి. అలర్టులు అందుకున్న నేతలు.. మల్లికార్జున ఖర్గే, శశి థరూర్, పవన్ ఖేరా, కె.సి.వేణుగోపాల్, సుప్రియా శ్రీనేత్, టి.ఎస్.సింగ్‌దేవ్, భూపీందర్ సింగ్ హుడా, రాహుల్‌గాంధీ సహాయకులు, మహువా మొయిత్రా (టీఎంసీ), సీతారాం ఏచూరి (సీపీఎం), ప్రియాంకా చతుర్వేది (శివసేన–యూబీటీ), రాఘవ్ ఛద్దా (ఆప్), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), సమీర్ సరణ్ (ఓఆర్ఎఫ్ అధ్యక్షుడు), సిద్ధార్థ్ వరదరాజన్ (ద వైర్ వ్యవస్థాపక ఎడిటర్), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓఎస్డీ తదితరులు యాపిల్ అలర్టులో ఏముందంటే... ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే హాకర్లు మీ ఐఫోన్‌ను టార్గెట్ చేసుకుని ఉండొచ్చని యాపిల్ అనుమానిస్తోంది. బహుశా మీ హోదా, మీరు చేస్తున్న పనుల వల్ల మీరు వ్యక్తిగతంగా వారి లక్ష్యంగా మారి ఉండొచ్చు. ఇలాంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని హాకర్లు మీ ఫోన్‌ను హాక్ చేసి తమ అ«దీనంలోకి తీసుకుంటే అందులోని సున్నితమైన డేటా, సమాచారంతో పాటు కెమెరా, మైక్రోఫోన్ వారి చేతిలోకి వెళ్లిపోతాయి. ఇది ఫేక్ హెచ్చరికే అయ్యుండే ఆస్కారమూ లేకపోలేదు. కానీ దయచేసి దీన్ని సీరియస్‌గా తీసుకోండి’ -
ఐఫోన్ హ్యాకింగ్‌పై కేంద్రం క్లారిటీ, ఎంపీలపై మండిపడిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారన్న ప్రతిపక్ష ఎంపీల ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. 150 దేశాలకు యాపిల్ సంస్థ అడ్వైజరీ జారీ చేసిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం తెలిపారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ అలర్ట్‌లు తప్పుడుగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు మంత్రి చెప్పారు. వార్నింగ్ మెసేజ్‌ల విషయంలో దర్యాప్తునకు కేంద్రం ఆదేశించినట్టుతెలిపారు. మెసేజ్‌లు అందుకున్న వారితో పాటు యాపిస్ సంస్థ కూడా ఆ దర్యాప్తునకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వమే తమ ఫోన్లను హ్యాక్ చేస్తోందని విపక్ష ఎంపీల ఆరోపణలపై కేంద్ర మంత్రి మండిపడ్డారు. ప్రియంక చతుర్వేది, శశిథరూర్, మహువా మొయిత్రా, అసదుద్దీన్ ఓవైసీ లాంటి ఎంపీలు పని గట్టుకుని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పిస్తుంటారంటూ కౌంటర్ ఎటాక్ చేశారు. శశిథరూర్, మహువా మొయిత్రా, ఓవైసీ, ఆప్‌కి చెందిన రాఘవ్ చద్దాతో సహా పలువురు విపక్ష ఎంపీ తమ ఐఫోన్లకు వచ్చిన యాపిల్ వార్నింగ్ మెసేజ్‌లను సోషల్ మీడియాలోనూ పోస్టు చేసిన సంగతి తెలిసిందే. -
ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ అలర్ట్.. మీ ఫోన్ హ్యాక్ అవుతుందంటూ వార్నింగ్
న్యూఢిల్లీ: పలువురు లోక్‌సభ ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ ఫోన్ వార్నింగ్ అలర్ట్ పంపింది. ఎంపీల యాపిల్ ఐడీ ఆధారంగా స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ తమ ఐఫోన్, ఈ-మెయిల్స్ హ్యాక్ చేస్తున్నట్లు హెచ్చరించింది. వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మెసెజ్ అందుకున్న వారిలో త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, శివసేన(ఉద్దవ్ వర్గం) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఉన్నారు. కేంద్రలోని బీజేపీ ప్రభత్వం తన ఫోన్, ఈ-మెయిల్‌ను హ్యక్ చేసేందుకు ప్రయత్నిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ఈ మేరకు యాపిల్ సంస్థ నుంచి తన ఫోన్‌కు వచ్చిన హెచ్చరిక మెసెజ్ స్క్రీన్‌షాట్‌ను ట్విటర్లో చేశారు. ‘ప్రభుత్వం నా ఫోన్, ఈ-ఇమెయిల్‌లను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తోందని హెచ్చరిస్తూ ఆపిల్ నుంచి టెక్స్ట్, ఈ మెయిల్ వచ్చింది. మీ భయం నన్ను మీపై జాలిపడేలా చేస్తుంది’ అంటూ అదానీ, పీఎంవో, హోమంమంత్రి కార్యాలయాలను ఉద్ధేశిస్తూ ట్వీట్ చేశారు. So not just me but also @MahuaMoitra has received this warning from Apple. Will @HMOIndia investigate? https://t.co/aS01YQpRpB — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) October 31, 2023 అదే విధంగా శివసేన(ఉద్దవ్ వర్గం) రాజ్యసభ ఎంపీ, తను, మరో ముగ్గురు ఇండియా కూటమి సభ్యులకు ఈ మెసెజ్ అందినట్లు మహువా పేర్కొన్నారు. ఆమెకు అందిన ఈ మెసెజ్‌లో ‘హెచ్చరిక:మీ యాపిల్ ఐడీతో అనుసంధానించిన ఐఫోన్‌ను స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ మీ ఐఫోన్‌ను టార్గెట్ సేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఉంది. Received from an Apple ID, threat-notifications@apple.com, which I have verified. Authenticity confirmed. Glad to keep underemployed officials busy at the expenses of taxpayers like me! Nothing more important to do?@PMOIndia @INCIndia @kharge @RahulGandhi pic.twitter.com/5zyuoFmaIa — Shashi Tharoor (@ShashiTharoor) October 31, 2023 మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరరూర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. తనకు కూడా యాపిల్ నుంచి హెచ్చరిక సందేశం వచ్చినట్లు పేర్కొన్నారు. తన ఫోన్, ఈ-మెయిల్ లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొంటూ ట్విటర్లో పీఎంవోను ట్యాగ్ చేశారు. ప్రభుత్వానికి చేయడానికి ఇంతకుమించిన ముఖ్యమైన పని మరేం లేదా అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. వీరితో హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సైతం ఈ హెచ్చరికను అందుకున్నారు. తనకు వచ్చిన మెసెజ్‌ను ఒవైసీ ట్విటర్లో పంచుకున్నారు. Received from an Apple ID, threat-notifications@apple.com, which I have verified. Authenticity confirmed. Glad to keep underemployed officials busy at the expenses of taxpayers like me! Nothing more important to do?@PMOIndia @INCIndia @kharge @RahulGandhi pic.twitter.com/5zyuoFmaIa — Shashi Tharoor (@ShashiTharoor) October 31, 2023 Received an Apple Threat Notification last night that attackers may be targeting my phone ḳhuub parda hai ki chilman se lage baiThe haiñ saaf chhupte bhī nahīñ sāmne aate bhī nahīñ pic.twitter.com/u2PDYcqNj6 — Asaduddin Owaisi (@asadowaisi) October 31, 2023 -
దుకాణంలో మాయమాటలతో.. ఫోన్‌పే మోసం.. ఏమైందో తెలస్తే షాక్!
సాక్షి, ఖమ్మం: పట్ట పగలు సినీ ఫక్కీలో దుండగుడు డబ్బులు కాజేశాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న బాధితుడు విస్తుపోయాడు. బాధితుడి కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని కిరాణా దుకాణానికి ఒడిశాకు చెందిన వ్యక్తి సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చాడు. తన ఫోన్ ఇంటి దగ్గర మర్చిపోయానని, ‘మీ’ ఫోన్ ఇస్తే సరుకుల లిస్ట్‌ను ఇంట్లో వారిని అడిగి కనుక్కుంటానని నమ్మించాడు. దీంతో సదరు దుకాణ యజమాని ఫోన్‌ను సదరు వ్యక్తికి ఇచ్చి దుకాణంలో సరుకులు కడుతున్నాడు. ఇదే అదునుగా ఫోన్ మాట్లాడినట్లు నటించి ఫోన్ పే ద్వారా (పాస్వర్డ్ సులభంగా ఉండటంతో) రూ.72,500 కాజేశాడు. అనంతరం సదరు మోసగాడు సరుకుల లిస్టు ఇంటి దగ్గర ఉందని, వెంటనే వెళ్లి తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ తరువాత దుకాణ యజమాని ఫోన్‌ను పరిశీలిస్తే ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే మోసపోయినట్లు గ్రహించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అందులోని పూర్తి వివరాలు పరిశీలిస్తే ఒడిశాకు చెందిన వ్యక్తిగా చూపిస్తోందని బాధితుడు గెల్లా వాసు వివరించారు. -
ప్రభాస్ ఇన్‌స్టా అకౌంట్ మిస్.. హ్యాక్ అయ్యిందా?
సోషల్ మీడియాకు కాస్త దూరంగానే ఉంటాడు ప్రభాస్. ఆయనకు ఇన్‌స్టా, ఫేస్బుక్,ఎక్స్ అకౌంట్లు ఉన్నా.. వాటిని సినిమా ప్రమోషన్స్ కోసమే వాడుతుంటాడు. తాజాగా ఈ పాన్ ఇండియా స్టార్ ఇన్‌స్టా అకౌంట్‌ని ఎవరో హ్యాక్ చేశారు. ఇన్‌స్టాలో ప్రభాస్ పేరును సెర్చ్ చేస్తుంటే.. ‘ఈ పేజీ అందుబాటులో లేదు’అనే సందేశం వస్తోంది. ఫ్యాన్‌మేడ్ అకౌంట్స్ మాత్రం కనిపిస్తున్నాయి కానీ అఫిషియల్ అకౌంట్ మిస్ అయింది. ప్రస్తుతం హ్యాక్ అయిన అకౌంట్‌ని వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రభాస్ టీమ్ ప్రయత్నిస్తోంది. కాగా, జులై నెలలో ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ కూడా హ్యాకింగ్‌కు గురైంది. ‘మనుషులు దురదృష్టవంతులు’ అంటూ హ్యాకర్లు ప్రభాస్ అకౌంట్ నుంచి ఓ వీడియో వదిలారు. అది చూసి ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కంగారు పడ్డారు. దీంతో తన అకౌంట్ హ్యాక్ అయినట్లు ప్రభాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్ అవ్వడం పట్ల ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాంటీ ఫ్యాన్సే హ్యాక్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ సినిమా విషయాలకొస్తే.. డిసెంబర్ 22న సలార్ పార్ట్ 1 విడుదల కాబోతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతీహాసన్ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కీ 2898 ఏడీ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్, సందీప్ వంగతో స్పిరిట్ చిత్రాల్లో ప్రభాస్ నటించనున్నాడు. -
మృణాల్ ఠాకూర్‌కు బెదిరింపులు.. అసలేం జరిగింది!
బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల్లో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. బాలీవుడ్లో కొన్ని సినిమాలు చేసినా సీతారామం సినిమాతోనే ఫేమ్ సంపాదించింది. ఈ చిత్రంలో ఆమె అందం, అభినయానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. ఆ సినిమాతో ఏకంగా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే తాజాగా మృణాల్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మృణాలు తన ఇన్‌స్టాలో వీడియో షేర్ చేస్తూ.. ' నా ఈ-మెయిల్ ఖాతా హ్యాక్ చేశారు. దీని ద్వారా గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నారు. తన వ్యక్తిగత సమాచారం, స్క్రిప్ట్‌లన్నీ అందులోనే ఉన్నాయి.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు అసలేం జరిగిందని షాక్‌కు గురయ్యారు. కానీ అయితే ఇదంతా నిజంగా జరగలేదని తెలుస్తోంది. కేవలం ఓ షో ప్రమోషన్ కోసం దీనిని షూట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. టాలీవుడ్ హీరోలు రానా , వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో హిందీలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌లో రానా.. సెలబ్రిటీల సమస్యలు తీర్చే పాత్రలో కనిపించారు. తాజాగా మృణాల్ ఠాకూర్ రానానాయుడు ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో 'తన మెయిల్ ఖాతా హ్యాక్‌కు గురైందని.. ఏం చేయాలో తెలియక రానా నాయుడుని సంప్రదించానని చెప్పుకొచ్చింది. రానా సాయంతోనే సమస్య పరిష్కారించారని తెలిపింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా అధిగమించాలో తెలియాలంటే రానా నాయుడు చూడాలని సలహా ఇచ్చింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఇప్పటికే ఈ సిరీస్ ప్రమోషన్లలో జాన్వీకపూర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
షాకింగ్! టీఎస్పీఎస్సీకి హ్యాకింగ్ బెడద.. పరీక్షలు వాయిదా!
సాక్షి, హైదరాబాద్: టౌన్‌ప్లానింగ్, పశు సంవర్థక శాఖ పరిధిలోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈవారం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) నిర్వహించాల్సిన అర్హత పరీక్షలు ఆకస్మికంగా వాయిదాపడ్డాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కిందనే అనుమానంతో కమిషన్ ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. పరీక్ష నిర్వహణకు ముందే దానికి సంబంధించిన సమాచారాన్ని, పరీక్ష తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ క్రమంలో కమిషన్ అధికారుల కంటే ముందుగా ఈ వివరాలను ఎవరో పరిశీలించినట్లు అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో ముందుజాగ్రత్తగా పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అభ్యర్థులకు సంక్షిప్త సమాచార రూపంలో రిజిస్టర్డ్ ఫోన్ నంబర్లకు ఆదివారంనాటి పరీక్ష రద్దు సమాచారాన్ని అందించినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. దీంతోపాటు ఈ నెల 15, 16వ తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు శనివారం రాత్రి కమిషన్ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. పోలీసు కేసు నమోదు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష నిర్వహణలో హ్యాకింగ్ జరిగినట్లు టీఎస్పీఎస్సీ అధికారులు అనుమానిస్తున్నారు. కమిషన్‌కు సంబంధించిన అత్యంత గోప్యతతో కూడిన ఫైళ్లు కంప్యూటర్లో తెరిచి ఉన్నట్లు అనుమానించిన అధికారులు తక్షణ చర్యల్లో భాగంగా పరీక్షను వాయిదా వేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో పోలీసు అధికారులు, సైబర్ సెక్యూరిటీస్ విభాగం అధికారులతో కలిసి విచారణ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. పరీక్ష నిర్వహించిన తర్వాత సమస్య వెలుగు చూసే కంటే ముందస్తుగా దానిని వాయిదా వేయడం మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ అధికారులు చెబుతున్నారు. అంతర్గత విచారణ షురూ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షకు సంబంధించిన సమాచారం లీకైందనే అనుమానాలపై కమిషన్ అధికారులు అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. మరోవైపు పోలీసులు సైతం ఈ అంశాన్ని సవాలుగా తీసుకున్నట్లు తెలిసింది. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన తదితర అంశాల్లో దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచిన టీఎస్పీఎస్సీలో ఇలాంటి అపశ్రుతులు రావడంతో పరపతి దెబ్బతింటుందనే భావనతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనే సంకల్పంతోనే పరీక్షల వాయిదా వేసినట్లు ఓ అధికారి తెలిపారు. -
ఐఫోన్ యూజర్లు జాగ్రత్త... ప్రభుత్వ హెచ్చరిక!
యాపిల్ ఐఫోన్లు ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన స్మార్ట్ఫోన్లు. చాలా మందికి ఇవంటే మోజు. డిజైన్, ఇతరత్రా ఫీచర్ల కోసం వీటిని ఇష్టపడతారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగిస్తున్న తమ ఫోన్ల భద్రత విషయంలో ఆపిల్ సంస్థ ఎప్పటికప్పడు నూతన ఐఓఎస్ వర్షన్లను విడుదల చేస్తూనే ఉంటుంది. వాటిని వెంటనే అప్డేట్ చేసుకోవాలని యూజర్లకు సూచిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది కొత్త వర్షన్లను అప్డేట్ చేయకుండా పాత వర్షన్లనే వినియోగిస్తుంటారు. అలాంటి వారిని భారత ప్రభుత్వం హెచ్చరించింది. పాత వర్షన్లు సురక్షితం కాదని, హ్యాకర్లు సులువుగా వాటిని హ్యాక్ చేస్తున్నారని గుర్తించిన మీదట ప్రభుత్వం ఈ హెచ్చరిక జారీ చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు అందించిన నివేదిక ప్రకారం.. ఐఓఎస్‌లో హ్యాకింగ్‌కు అనేక ఆస్కారాలు ఉన్నాయి. యూజర్ల సున్నితమైన సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది. 16.3.1, అంతకు ముందుటి వర్షన్లతో ఉన్న ఐఫోన్8 లేదా ఆ తర్వాత వచ్చినవి, ఐపాడ్ ప్రో అన్ని మోడళ్లు, ఐపాడ్ ఎయిర్ థర్డ్ జనరేషన్, ఆ తర్వాతవి, ఐపాడ్ ఎయిర్ ఫిఫ్త్ జనరేషన్, ఆ తర్వాతివి, ఐపాడ్ మినీ ఫిఫ్త్ జనరేషన్, ఆతర్వాతి వాటిపై హ్యాకర్ల ప్రభావం ఉంటుందోని పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ యూజర్లు కూడా.. అలాగే శాంసంగ్ గెలాక్సీ వినియోగదారులకు కూడా భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. శాంసంగ్ కూడా తమ యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త వర్షన్లను సూచిస్తూనే ఉంటుంది. అయితే పాత వర్షన్లకు అలవాటు పడిన వినియోగదారులు వాటిని అలాగే కొనసాగిస్తుంటారు. అలాంటి జాగ్రత్త పడాలి. ఈ స్మార్ట్ఫోన్లలో వచ్చే శాంసంగ్ గెలాక్సీ స్టోర్ యాప్‌లో హ్యాకింగ్ ప్రమాద ఆస్కారాన్ని గుర్తించినట్లు CERT-In పేర్కొంది. 4.5.49.8కి ముందుటి శాంసంగ్ గెలాక్సీ స్టోర్ యాప్ వెర్షన్‌తో ఫోన్లను ఇది ప్రభావితం చేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లలోనూ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హ్యాకింగ్ ప్రమాదాన్ని గుర్తించింది. 109.0.1518.78కి ముందున్న ఎడ్జ్ బ్రౌజర్ వెర్షన్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. ఇది టార్గెటెడ్ సిస్టమ్‌లో డినైల్ ఆఫ్ సర్వీస్ (DoS) ఆప్షన్లను సైతం మార్చగలిగే అవకాశాన్ని హ్యాకర్‌రకు ఇస్తుంది. -
ఆర్సీబీకి షాక్.. ట్విటర్‌ను కూడా వదల్లేదు
ఐపీఎల్లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు పేరుంది. సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న జట్టు కూడా ఆర్సీబీనే. అలాంటి ఆర్సీబీ ట్విటర్‌ను హ్యాక్ చేయడం సంచలనం కలిగించింది. శనివారం (జనవరి 21) ఉదయం 4 గంటల సమయంలో అకౌంట్ హ్యాక్ చేసినట్లు ఆర్సీబీ ప్రకటించింది. హ్యాకర్లు ప్రొఫైల్ నేమ్‌ని ‘బోర్డ్ ఏప్ యాచ్ క్లబ్’గా మార్చారు. ప్రొఫైల్ పిక్‌గా కార్టూన్ ఇమేజ్ పెట్టారు. అకౌంట్ బయోలో ఎన్ఎఫ్టీ గురించి అప్డేట్ చేయడంతో పాటు దానికి సంబంధించిన కొన్ని ట్వీట్లను పోస్ట్ చేశారు. ఆర్సీబీ ట్విటర్ ఖాతా హ్యాక్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2021లో కూడా ఈ టీమ్ ట్విటర్ ఖాతా హ్యాక్ అయింది.ఆర్సీబీ ట్విటర్ ఖాతాలను రెండుసార్లు హ్యాక్ చేసిన హ్యాకర్లు.. ఆగస్టు 2022లో ఆర్సీబీ యూట్యూబ్ చానెల్‌ను కూడా హ్యాక్ చేశారు. ప్రస్తుతం ట్విట్టర్ ఖాతాని తిరిగి పునరుద్దరించినట్లు ఆర్సీబీ ప్రకటించింది. Rcb acc hacked?😭 pic.twitter.com/0PoVZaH2yc — SDS (@Saumyadeep63) January 21, 2023 Kohli 👑 Bengaluru 🏠 ABD 👽 Chinnaswamy 🏟️ IPL 2023 🏏 Play Bold 💪 Vibe check complete ✅ Yes! We can confirm that our Twitter handle is restored. Phew! 😅 — Royal Challengers Bangalore (@RCBTweets) January 21, 2023 చదవండి: రెజ్లర్ల మీటూ ఉద్యమం.. క్రీడాశాఖ కీలక నిర్ణయం 'టీమిండియా రైట్ ట్రాక్‌లోనే వెళ్తుందా?'.. మీకేమైనా అనుమానమా! -
ప్రముఖ నటుడి ట్విటర్ హ్యాక్..!
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. దయచేసి ఎవరూ కూడా తన అభిమానులు ఆందోళనకు గురి కావొద్దని తెలిపారు. అకౌంట్ తిరిగి సరిచేసేంత వరకు అభిమానులు దాని జోలికి వెళ్లొద్దని కోరారు. నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు దయచేసి అభిమానులు ఎవరూ నా అకౌంట్వెళ్లొద్దు. నా అకౌంట్ నుంచి వచ్చిన ఎటువంటి పోస్టులను అంగీకరించొద్దు. సమస్య పరిష్కరించాక నేను మీకు అప్ డేట్స్ ఇస్తా.' ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ఇటీవలే శాండల్‌వుడ్‌లోనూ ఓ స్టార్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. కాంతార ఫేమ్ కన్నడ స్టార్ కిశోర్ కుమార్‌కు ట్విట్టర్లో ఓ సమస్య ఎదురయ్యింది. ట్విట్టర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఓ ఈ సందేశం కనిపించింది. దీంతో ఆయన ట్విట్టర్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని అందుకే తన ఖాతాను నిలిపివేశారని అన్నారు. కానీ.. తన ఆ తర్వాత అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేయడం వల్లే ఇలా జరిగిందని కిశోర్ ఇన్‌స్టాలో తెలిపారు. -
ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లపై దాడి.. చైనా హ్యాకర్ల పనే: కేంద్రం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లోని సర్వర్లపై జరిగిన దాడి ఘటనలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఎయిమ్స్‌పై సైబర్ దాడి చైనా హ్యకర్ల పనేనని తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. హ్యకింగ్‌కు గురైన లక్షల మంది రోగుల వివరాలను ఆసుపత్రి వర్గాలు తిరిగి పొందాయని పేర్కొంది. ‘ఎయిమ్స్ సర్వర్లపై దాడి చేసింది చైనీయులే. హ్యకింగ్ చైనా నుంచే జరిగినట్లు విచారణలో తేలింది. మొత్తం 100 సర్వర్లున్న ఢిల్లీ ఎయిమ్స్‌లో 40 ఫిజికల్‌గా 60 వర్చువల్‌గా పనిచేస్తున్నాయి.ఇందులో ఐదు ఫిజికల్ సర్వర్లలో హ్యకింగ్ జరిగింది. ఇది చాలా నష్టాన్ని కలిగించింది. కానీ ఇప్పుడు హ్యకింగ్‌కు గురైన అయిదు సర్వర్లలోని డేటా విజయవంతంగా తిరిగి పొందాం’ అని కేంద్ర మంత్రిత్వశాఖ తెలిపింది. మొదట నవంబరు 23న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో సిస్టమ్స్ పనిచేయకపోవడాన్ని గుర్తించారు. రెండు రోజుల తర్వాత ఢిల్లీ పోలీస్‌లోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ యూనిట్ ఎయిమ్స్‌లోని సర్వర్లలో హ్యకర్లు చొరబడినట్లు గుర్తించింది. అయితే సిస్టమ్‌ను పునరుద్ధరించేందుకు హ్యాకర్లు రూ. 200 కోట్లు క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని అడిగినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఖండించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ సర్వర్లపై దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ చేపట్టింది. వీవీఐపీలు సహా లక్షలాది రోగుల వైద్య రికార్డుల సమాచారం గాలికి పోయిన ఎయిమ్స్ ఘటన దేశంలోనే అతి పెద్ద సైబర్ దాడి. ఒక భారతీయ సంస్థపై ఇంత తీవ్రమైన దాడి మునుపెన్నడూ జరగలేదు అని దేశ తొలి సైబర్ సెక్యూరిటీ హెడ్ మాట. చదవండి: మీరు తాగొచ్చారు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం -
రెచ్చిపోతున్న హ్యాకర్స్.. ‘ఐసీఎంఆర్’పై 6వేల సార్లు సైబర్ దాడి!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రఖ్యాత ఆసుపత్రి ఎయిమ్స్‌పై సైబర్ దాడి జరిగి సర్వర్లు డౌన్ అయిన విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రెండు వారాలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో సర్వర్లు పని చేయటం లేదు. ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలోని అత్యున్నత వైద్య వ్యవస్థలే లక్ష్యంగా దుండగులు సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఎయిమ్స్ తర్వాత భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)పై సైబర్ దాడికి యత్నించారు హ్యాకర్స్. ఐసీఎంఆర్ వెబ్‌సైట్‌పై సుమారు 6వేల సార్లు దాడి చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఐపీ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో ట్రేస్ చేయగా.. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న హాంకాంగ్‌కు చెందిన ఐపీగా తేలిందన్నారు అధికారులు. అయితే, అప్డేటెడ్ ఫైర్‌వాల్, పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకోవటం ద్వారా ఐసీఎంఆర్ వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురికాలేదని స్పష్టం చేశారు అధికారులు. హ్యాకర్స్ 6వేల సార్లు ప్రయత్నించినా వారి దుశ్చర్య ఫలించలేదన్నారు. మరోవైపు.. ఢిల్లీ ఎయిమ్స్ ముందు ఉన్న సఫ్దార్‌గంజ్ ఆసుపత్రిపై డిసెంబర్ 4న సైబర్ దాడి జరిగింది. అయితే, ఎయిమ్స్‌తో పోలిస్తే నష్టం తక్కువేనని అధికారులు తెలిపారు. ఒక రోజంతా తమ సర్వర్ పని చేయలేదని ఆసుపత్రి వైద్యులు బీఎల్ శెర్వాల్ తెలిపారు. ఎన్ఐసీ కొన్ని గంటల్లోనే సేవలను పునరుద్ధరించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: తమిళనాడు ఆసుపత్రిపై హ్యాకర్ల పంజా.. 1.5లక్షల మంది రోగుల డేటా విక్రయం! -
8 రోజులుగా ఎయిమ్స్ సర్వర్ డౌన్.. ఇద్దరిపై వేటు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రఖ్యాత ఆసుపత్రి ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) సర్వర్ హ్యాకైంది. గత ఎనిమిది రోజులుగా పని చేయడం లేదు. సర్వర్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్న హ్యాకర్లు రూ.200 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ది ఇండియా కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేస్తోంది. ఎనిమిది రోజులు గడిచినా పరిస్థితి అలాగే కొనసాగుతుండటంతో.. ఢిల్లీకి చెందిన ఇద్దరు విశ్లేకులను సస్పెండ్ చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనల కింద మరికొంత మందిపై వేటు పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ‘సర్వర్ హ్యాక్ అయిన క్రమంలో శానిటైజింగ్ ప్రక్రియ మొదలైంది. మొత్తం 50 సర్వర్లలో ఇంతకు ముందు 15 మాత్రమే శానిటైజింగ్ చేయగా.. ప్రస్తుతం ఆ సంఖ్యను 25కు పెంచారు. అలాగే 400లకుపైగా ఎండ్‌పాయింట్ కంప్యూటర్లను స్కాన్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ సైతం అప్లోడ్ చేస్తున్నారు.’ అని అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు.. సర్వర్ డౌన్ సమస్యను పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎయిమ్స్ మంగళవారం ఓ ప్రకటన చేసింది. సర్వర్లలో ఈ-హాస్పిటల్ డేటా పునరుద్ధరణ చేసినట్లు పేర్కొంది. సేవలను పునరుద్ధరించే ముందు నెట్వర్క్ శానిటైజింగ్ కొనసాగిస్తున్నట్లు తెలిపింది. పెద్ద సంఖ్యలో కంప్యూటర్లు, సర్వర్లు, డేటా ఉండటం వల్ల ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఔట్‌పేషెంట్, ఇన్‌పేషెంట్, ల్యాబ్‌లు వంటి అన్ని సేవలు మాన్యువల్‌గా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఎయిమ్స్ సర్వర్ హ్యాకింగ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ది ఇండియా కంప్యూటర్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఢిల్లీ పోలీసు, ఇంటలిజెన్స్ బ్యూరో, కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), కేంద్ర హోంశాఖలు దర్యాప్తు చేపట్టాయి. దర్యాప్తు సంస్థల సూచలన మేరకు ఢిల్లీ ఎయిమ్స్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇదీ చదవండి: షాకింగ్:హైస్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్స్, గర్భనిరోధకాలు..! -
నేను చనిపోయాననడంతో తీవ్రమైన భయానికి గురయ్యా.. నటి ఆవేదన
ప్రముఖ పంజాబీ నటి నికిత్ ధిల్లాన్ సోషల్ మీడియా ఖాతా ఇటివలే హ్యాకింగ్‌కు గురైంది. ఆమె ఖాతాలో హ్యాక్ చేసిన ఓ దుండగుడు నటి చనిపోయిందని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వెంటనే ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలయింది. ఈ వార్త విని నటి తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు తెలిపింది. ఆ సమయంలో అత్యంత భయానక పరిస్థితి ఎదురైందన్నారు. కుటుంబ సభ్యులంతా తీవ్ర మనోవేదనకు గురయ్యారని నటి నికిత్ ధిల్లాన్ వివరించింది. ఆమె ఇన్‌స్టా పోస్ట్‌లో.. 'మా ప్రియమైన కుమార్తె నికిత్ ధిల్లాన్ అకాల మరణాన్ని ప్రకటించడం చాలా బాధగా ఉంది. మా కుటుంబానికి గోప్యతను అనుమతించమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం అని రాసి ఉంది. ' హ్యాకర్ పోస్ట్ చేశారు. నికిత్ ధిల్లాన్ మాట్లాడుతూ.. 'మా అమ్మమ్మ భటిండాలో నివసిస్తోంది. ఎవరో ఫోన్ చేసి నేను చనిపోయారని చెప్పారని తెలిసింది. వెంటనే ఆమె మా అమ్మని పిలిచి తీవ్రంగా ఏడ్చింది. ఆమె మానసికంగా కుంగిపోయింది. మేమంతా ఏం జరిగిన విషయం ఆమె వివరించినా ఓదార్చలేకపోయాం. హ్యాకింగ్, సోషల్ మీడియా గురించి ఆమెకు అర్థం కాలేదు. ఆమె వయసు రీత్యా మేం దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాం అనుకుంది. ఈ వార్త ఆమెను తీవ్రంగా ప్రభావితం చేసింది. మరుసటి రోజు నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె ఏడుస్తూనే ఉంది'అంటూ ధిల్లాన్ భయానక పరిస్థితిని వివరించారు. ఆమె మాట్లాడుతూ.. 'నా కలలో కూడా ఇంత దూరం వెళతారని నేను ఊహించలేదు. ఇలాంటి పరిస్థితికి ఎలా స్పందించాలో నాకు తెలియలేదు. ఇది పబ్లిసిటీ స్టంట్ అని చాలా మంది భావించి ఉంటారు. కానీ నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఎంత షాక్‌కు గురయ్యారో నాకు మాత్రమే తెలుసు.'అని వాపోయింది పంజాబీ నటి. దాదాపు రెండున్నర ఏళ్ల క్రితం నా ఫేస్బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైనప్పుడు మొహాలీ సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశా. అప్పుడు వారు నాకు ఎలాంటి సాయం చేయలేదు. కాల్ స్క్రీన్ షాట్ కూడా సైబర్ సెల్‌కు సమర్పించినా ఇప్పటికీ పట్టించుకోలేదని వాపోయింది నటి. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ గురి కావడంతో ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ' అని వాపోయింది. View this post on Instagram A post shared by Nikeet Dhillon (@nikeetdhillon) -
ఆరు రోజులుగా ఎయిమ్స్ సర్వర్ హ్యాక్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రఖ్యాత ఆస్పత్రి ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడకల్ సైన్సెస్ (ఎయిమ్స్) సర్వర్ హ్యాకైంది. ఆరు రోజులుగా పని చేయడం లేదు. సర్వర్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్న హ్యాకర్లు రూ.200 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని ది ఇండియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషిచేస్తోంది. ఢిల్లీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్, స్ట్రాటెజిక్ ఆపరేషన్స్ విభాగం కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. బుధవారం ఉదయం స్తంభించిన సర్వర్‌లో దాదాపు నాలుగు కోట్ల మంది రోగుల ఆరోగ్య, బిల్లుల చెల్లింపుల సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. డేటా అంతా అమ్మకానికి వస్తే అప్రతిష్ట తప్పదని పోలీసు, ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. మాజీ ప్రధానమంత్రులు, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయమూర్తుల ఆరోగ్య సమాచారం సైతం సర్వర్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అందుకే హ్యాకర్లు రూ.200 కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. -
పాస్వర్డ్ మేనేజర్ సంస్థకే హ్యాకర్ల షాక్:మూడు కోట్ల యూజర్ల భద్రత గోవిందేనా?
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఉపయోగించే పాస్వర్డ్ మేనేజర్, లాస్ట్‌పాస్‌కు హ్యాకర్లు భారీ షాకిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 33మిలియన్లకు పైగా ప్రజలు ఉపయోగించే పాస్వర్డ్ మేనేజర్ లాస్ట్‌పాస్‌కు సేబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఇటీవల సంస్థ సిస్టమ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి సోర్స్ కోడ్, యాజమాన్య సమాచారాన్ని దొంగిలించారని తెలుస్తోంది. అయితే దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి కొంత సమయం పడుతుందని, కానీ తమ కస్టమర్ల భద్రతకు ఢోకా లేదని తెలిపింది. ఈ మేరకు సంస్థ ట్విటర్ ద్వారా సమాచారాన్ని వెల్లడించింది. అయితే తమ ఖాదారులు పాస్ట్వరర్డ్స్కు వచ్చిన ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది.ప్రస్తుతానికి వారుఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. లాస్ట్‌పాస్ నిర్వహణకు ఉద్యోగులు ఉపయోగించే సాఫ్ట్వేర్ డెవలపర్ లోకి "అనధికారిక పార్టీ" ప్రవేశించిందని తన పరిశోధనలో తేలిందని తెలిపింది. నేరస్థులు ఒక్క డెవలపర్ అకౌంట్‌కి మాత్రమే యాక్సెస్ పొందారని పేర్కొంది. అయితే సైబర్ సెక్యూరిటీ వెబ్సైట్ బ్లీపింగ్ కంప్యూటర్ రెండు వారాల క్రితమే ఉల్లంఘన గురించి లాస్ట్‌పాస్ అడిగిందని నివేదించింది. మరోవైపు లాస్ట్‌పాస్ తక్షణమే స్పందించి సమాచారం అందించడంపై కంప్యూటర్ సైబర్ సెక్యూరిటీ విశ్లేషకుడు అలెన్ లిస్కా సంతోషం వ్యక్తంచేశారు. అయితే చాలామందికి రెండు వారాలు చాలా ఎక్కువ సమయం అనిపించినప్పటికీ, పరిస్థితిని పూర్తిగా అంచనా వేయడానికి టీమ్స్‌కి కొంత సమయం పట్టొచ్చన్నారు. కానీ కస్టమర్ పాస్‌వర్డ్‌లను యాక్సెస్ చేసే అవకాశం లేదని లిస్కా చెప్పారు. ఇది ఇలా ఉంటే సోర్స్‌కోడ్, ప్రొప్రయిటరీ సమాచారాన్ని దొంగిలించిన హ్యాకర్లకు,కస్టమర్ల డేటా చోరీ చేయడంపెద్ద కష్టం కాదని, పాస్వర్డ్ వాల్ట్‌ల కీలను యాక్సెస్ చేసేసి ఉంటారని సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరుగా వ్యాపించాయి. అయితే ఈ అంచనాలపై లాస్ట్సాప్ స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా మాన్యువల్‌గా ఆధారాలను నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే తన యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ లేదా జీమెయిల్ లాంటి బహుళ ఖాతాల కోసం హార్డ్-టు-క్రాక్, ఆటోమేటెడ్ జనరేటెడ్ పాస్‌వర్డ్‌లను అందిస్తుంది లాస్ట్‌పాస్. We recently detected unusual activity within portions of the LastPass development environment and have initiated an investigation and deployed containment measures. We have no evidence that this involved any access to customer data. More info: https://t.co/cV8atRsv6d pic.twitter.com/HtPLvK0uEC — LastPass (@LastPass) August 25, 2022 -
బహ్మరెడ్డి... ఓ ‘సర్కార్’!
సాక్షి, హైదరాబాద్: విజయ్ కథానాయకుడిగా వచ్చిన సర్కార్ సినిమా గుర్తుందా..? అందులో ఎన్నారై, బడా వ్యాపారవేత్త అయిన కథానాయకుడు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడికి వస్తాడు. అప్పటికే ఆ ఓటు ఎవరో వేసేశారని తెలుసుకుని న్యాయపోరాటం చేస్తాడు. దాదాపు ఇలాంటి ఉదంతమే నగరంలో చోటు చేసుకుంది. సినిమాలో ఓటు అంశం సాధారణ ఎన్నికలకు సంబంధించినదైతే... ఇక్కడ మాత్రం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎల్రక్టానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ గవర్నింగ్ కౌన్సిల్ది. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం... ఖైరతాబాద్‌లోని ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) తెలంగాణ స్టేట్ సెంటర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న బి.బ్రహ్మరెడ్డి న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్‌కు (ఐఈటీఈ) కార్పొరేట్ మెంబర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో ఈయనకు ఓటుహక్కు ఉంది. దీనికి సంబంధించిన ఎన్నికలు ఈ ఏడాది జూన్‌లో జరిగాయి. ఆ నెల 30వ తేదీ రాత్రి 11.59 నిమిషాల వరకు ఆన్లైన్లో ఓటు వేసుకునేందుకు అర్హులకు అవకాశం ఇచ్చారు. ఈ ఆన్లైన్ ఓటింగ్ కోసం అర్హులైన ఐఈటీఈ ఓటర్లు తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ లేదా ఫోన్‌కు వచ్చే ఓటీపీ సహాయంతో అధికారిక వెబ్‌సైట్‌లోని ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఆపై అక్కడ ఉన్న ఆప్షన్స్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఐఈటీఈ ఓటర్లు అంతా ఇలానే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బ్రహ్మారెడ్డి జూన్ 30 మధ్యాహ్నం 2.10 గంటలకు ఓటు వేయడం కోసం అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అయ్యారు. అయితే అప్పటికే ఈ ఓటు వేరే వాళ్లు వేసినట్లు అందులో కనిపించింది. తన ఈ–మెయిల్ ఐడీ, యూజర్ ఐడీ తదతరాలను హ్యాక్ చేసిన దుండగులు ఇలా చేశారని ఆయన అనుమానించారు. దీంతో ఇటీవల సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతిక దర్యాప్తు చేపట్టారు. ఆన్లైన్ ఓటింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అందించాల్సిందిగా కోరుతూ ఐఈటీఈకి లేఖ రాశారు. ఆ ఎన్నికల్లో మహారాష్ట్రకు చెందిన వాళ్లు గెలిచారని, తన ఓటు కూడా ఆ రాష్ట్రంలోని అమరావతి నుంచే వేసినట్లు తెలుస్తోందని బ్రహ్మరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ అంశాన్ని సైతం పరిగణలోకి తీసుకున్న సైబర్ క్రైమ్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. (చదవండి: వచ్చేస్తున్నాయ్ వందేభారత్ రైళ్లు) -
'అర్థం పర్థం లేని ట్వీట్స్.. మాకేదో తేడా కొడుతోంది'
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి శుక్రవారం ఎప్పుడు లేనంత కొత్తగా కనిపించాడు. ఎక్కువగా క్రికెట్ సంబంధిత అంశాలపై చర్చలు జరిపే రవిశాస్త్రి ఉన్నట్లుండి తన లుక్‌ను పూర్తిగా మార్చేశారు. ఫ్లెష్ జాకెట్.. కూలింగ్ గ్లాసెస్.. మెడలో గోల్డ్ చైన్.. స్వాగ్లుక్ దుమ్మురేపాడు. అయితే ఈ ఫోటోలు షేర్ చేయడం వరకు ఓకే.. కానీ అసలు సమస్య అక్కడే మొదలైంది. హుందాగా కనిపించే రవిశాస్త్రిలో ఇన్ని వేరియషన్స్ ఉన్నాయా అన్న అనుమానం క్రికెట్ ఫ్యాన్స్‌కు కలిగింది. ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రి ట్విటర్ అకౌంట్ హ్యాక్‌కు గురైందంటూ పేర్కొన్నారు. ఎప్పుడు లేనంతగా రవిశాస్త్రి సింగిల్ లైన్ క్యాప్షన్స్ ఎక్కువగా జత చేశారు. మూడు ఫోటోలు షేర్ చేసిన ఆయన.. మూడు విభిన్నమైన లైన్స్‌ను క్యాప్షన్‌గా పెట్టారు. చివరగా..''నేను చిల్ అవ్వాలంటే ఏమి చెయ్యాలి''.. ''మంచి మూడ్‌లో ఉన్నా.. నన్ను ఏమైనా అడగొచ్చు'' అంటూ శాస్త్రి నుంచి ట్వీట్ వచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్.. ''అర్థం పర్థం లేని ట్వీట్స్.. కచ్చితంగా రవిశాస్త్రి అకౌంట్ హ్యాక్ అయినట్లే'' అంటూ కన్ఫర్మ్ చేశారు. కాగా రవిశాస్త్రి ప్రస్తుతం ఐపీఎల్ 2022(ఇండియన్ ప్రీమియర్ లీగ్) బ్రాడ్కాస్ట్ డ్యూటీ నిర్వహిస్తున్నాడు. ఆటగాళ్ల బ్యాటింగ్, ఆటతీరు, ఫామ్ తదితర అంశాలపై చర్చలు జరుపుతూ బిజీబిజీగా ఉన్నాడు. కాగా గతేడాది టి20 ప్రపంచకప్ వరకు రవిశాస్త్రి టీమిండియా హెడ్‌కోచ్‌గా వ్యవహరించాడు. అయితేఘా టోర్నీలో టీమిండియా సూపర్-12 దశను దాటలేక చతికిలపడింది. అందునా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో భారత ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కాగా అతని హయాంలో టీమిండియా మేజర్ టోర్నీల్లో గెలవనప్పటికి స్వదేశంలో, విదేశాల్లో చారిత్రాక సిరీస్‌లు గెలిచింది. ఇక టీమిండియా తరపున మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన రవిశాస్త్రి టీమిండియా తరపున 80 టెస్టులు, 150 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: Ravi Shastri New Look: న్యూలుక్స్తో దుమ్మురేపుతున్న టీమిండియా మాజీ కోచ్ Mujhe kya mein toh chill hun 🍻 — Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022 I’m in a good mood today, ask me anything. #AskRavi — Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022 -
ఆన్లైన్లో ‘పాఠాలు’ నేర్చుకుని.. డబ్బులు కొట్టేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: పేజీ సంస్థకు చెందిన సర్వర్‌ను హ్యాక్ చేసిన దినేష్ దాని పూల్ ఖాతా నుంచి రూ.52.9 లక్షలు కాజేయడంతో విషయం పోలీసుల వరకు వచ్చి చిక్కాడు. అదే ఓ హ్యాకర్ ఏదైనా పేమెంట్ గేట్‌వే సంస్థ లేదా ప్రైవేట్ బ్యాంక్ సర్వర్‌ను టార్గెట్ చేసి, దాని కస్టమర్ల ఖాతాల నుంచి రూ.10 చొప్పున కాజేస్తే అసలు బయటకే రాదు. సునామీ ఎటాక్స్‌గా పిలిచే ఈ తరహా సైబర్ దాడులు ఇటీవల పెరిగిపోయాయని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. హ్యాకర్లలో ఇంజినీరింగ్, బీటెక్ విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారని, ఆన్లైన్లో ‘పాఠాలు’ నేర్చుకుని, డార్క్‌వెబ్‌లో సాఫ్ట్వేర్లు ఖరీదు చేసి తమ పని పూర్తి చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఆందోళన కలిగించే ఈ అంశంపై దృష్టి పెట్టి సైబర్ నిఘా ముమ్మరం చేశామని పేర్కొంటున్నారు. ఎప్పుడూ పెద్ద మొత్తాల జోలికి పోరు.. సర్వర్లోకి ప్రవేశించే హ్యాకర్లు ఆయా సంస్థల పూల్ ఖాతాలకు యాక్సెస్ చేస్తారు. అక్కడ నుంచి ఒకేసారి పెద్ద మొత్తాలు కాజేస్తే విషయం కేసుల వరకు వెళ్లి వీళ్లు చిక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే హ్యాకర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద మొత్తాల జోలికి వెళ్లట్లేదు. ప్రధానంగా ఆయా సంస్థల వినియోగదారుల ఖాతాలను టార్గెట్ చేస్తున్నారు. ఒక్కో ఖాతా నుంచి, ఒక్కో దఫా కనిష్టంగా రూ.1 గరిష్టంగా రూ.5 మాత్రమే కాజేస్తారు. ఇలా ఒకేసారి వందల, వేల ఖాతాల్లోనివి తాము తెరిచిన వర్చువల్ ఖాతాల్లోకి మళ్లించి బిట్‌కాయిన్స్‌గా మార్చేస్తారు. గమనించినా ఫిర్యాదు చేయరనే... ఖాతాదారుల నగదు కాజేస్తున్న హ్యాకర్లు ఆ లావాదేవీకి సంబంధించిన అలెర్ట్ కూడా వారికి వెళ్లకుండా సర్వర్లోనే మ్యానేజ్ చేస్తున్నారు. ఫలితంగా తన ఖాతా నుంచి ఈ మొత్తం పోయిందనే విషయం కస్టమర్లు గుర్తించలేరు. రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.30 వేలు.. ఇలా రౌండ్ ఫిగర్ నగదు ఉన్న వాటి ఖాతాల జోలికి హ్యాకర్లు వెళ్లరు. అయినప్పటికీ వినియోగదారుడు నగదు పోయినట్లు గుర్తించినా చిన్నమొత్తం కావడంతో ఫిర్యాదు వరకు వెళ్లరు. ఇలా ఒకేసారి వందల, వేల ఖాతాలను టార్గెట్ చేస్తున్న హ్యాకర్‌కి చేరే మొత్తం మాత్రం భారీగానే ఉంటుంది. తన చేతిలో ఉన్న డబ్బు ఖర్చయ్యే వరకు లేదా విషయం ఖాతాదారుడు మర్చిపోతాడని భావించే కాలం వరకు ఈ సునామీ ఎటాక్ చేసిన హ్యాకర్ మరో ప్రయత్నం చేయరు. ఎక్కడా తమ ఉనికి బయటపడకుండా.. నగరానికి చెందిన అనేక మంది ఇంజినీరింగ్, బీటెక్ విద్యార్థులు హ్యాకర్లుగా మారారు. వివిధ రకాలైన యూట్యూబ్ వీడియోలు, ఆన్లైన్ అంశాల ఆధారంగా హ్యాకింగ్‌పై పట్టు సాధిస్తున్నారు. ఇది చేయడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్స్‌ను డార్క్‌వెబ్‌లో ఖరీదు చేస్తున్నారు. టార్గెట్ చేసిన సంస్థ సర్వర్‌ను హ్యాక్ చేయడానికి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) ఐపీలను వాడుతున్నారు. వీటి ఆధారంగా ఆ సంస్థ సర్వర్లోకి ప్రవేశిస్తున్నారు. వాటి ఫైర్ వాల్స్ బలహీనంగా ఉండటం, సైబర్ సెక్యూరిటీలో లోపాలు వీరికి కలిసి వస్తున్నాయని పోలీసులు వివరిస్తున్నారు. (క్లిక్: మ్యాట్రిమొనిలో ఎన్నారై పేరుతో మోసం! చివరకు..) బిల్లుల చెల్లింపులోనూ గోల్మాల్... ఈ సునామీ ఎటాక్స్ చేసే హ్యాకర్లు ‘బిల్లు చెల్లింపు’లోనూ గోల్‌మాల్స్ చేస్తుంటారు. వివిధ పోస్టు పెయిడ్ సేవలు పొందే పరియస్తులైన కస్టమర్ల కోసమే కమీషన్లు తీసుకుని ఈ పని చేస్తుంటారు. బ్రాండ్ బ్యాండ్ సహా వివిధ సేవలకు అందించే సంస్థలు తమ ఖాతాదారుడికి ప్రతి నెలా బిల్లు పంపిస్తుంటాయి. దీని చెల్లింపులు అతడు ఆన్లైన్లో చేస్తుంటాడు. రూ.10 వేల బిల్లు ఉంటే రూ.1000 తీసుకుని ‘మాఫీ’ చేయడం హ్యాకర్ పని. వినియోగదారుడి నుంచి ఈ మొత్తం కమీషన్‌గా తీసుకునే సునామీ హ్యాకర్ ఆ సంస్థ సర్వర్‌ను హ్యాక్ చేసి, బిల్లు మొత్తం క్లియర్ అయినట్లు సున్నాగా మార్చేస్తుంటాడు. ఇది కేవలం పరిచయస్తులైన వారితో కుమ్మక్కై చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. హ్యాకింగ్ విషయాన్ని ఆయా సంస్థలు గుర్తించలేకపోతున్నాయని వివరిస్తున్నారు. (క్లిక్: హైఫై ఫ్లైఓవర్.. ఎస్సార్డీపీ పనుల్లో మరో ప్రత్యేకత!) -
సంచలనం, టీనేజర్ చేతికి మైక్రోసాఫ్ట్ రహస్యాలు..భారీగా పడిపోతున్న షేర్లు!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ టెక్ కంపెనీలను టీనేజర్ పరుగులు పెట్టిస్తున్నాడు. మైక్రోసాఫ్ట్‌తో పాటు ఎన్వైదా, యుబిసాఫ్ట్, శాంసంగ్ సంస్థల్ని హ్యాక్ చేశాడు. దీంతో ఆందోళనకు గురైన ఆ సంస్థలు సైబర్ సెక్యూరిటీ నిపుణుల్ని ఆశ్రయించడంతో ఈ హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సైబర్ నిపుణులు సైతం హ్యాకింగ్ వెనుక ల్యాప్సస్$ (Lapsus$) అనే గ్రూప్ ఉన్నట్లు నిర్ధారించారు. హ్యాకింగ్ ఎందుకు చేశారనే అంశంపై స్పష్టత లేకున్నా..ఆ హ్యాకింగ్ గ్రూప్‌కు మాస్టర్ మైండ్ 16ఏళ్ల టీనేజరేనని తేలింది. సైబర్ నిపుణుల అంతర్గత విచారణలో ఇంగ్లాండ్‌లోని ఆక్స్ఫర్డ్ ప్రాంతంలో టీనేజర్ తన తల్లితో కలిసి ఉంటున్నట్లు గుర్తించారు. టీనేజరే అయినా దిగ్గజ కంపెనీలను హ్యాక్ చేయడంతో దాదాపూ 15వేల మంది క్లయింట్ల డేటా బహిర్ఘతం అయ్యింది. అందుకే హ్యాకింగ్ కోసం ఏదైనా సైబర్ గ్యాంగ్ హస్తం ఉందా అన్న కోణంలో సదరు సైబర్ ఎక్స్ పర్ట్స్ సభ్యులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అంతా సీక్రెట్ దర్యాప్తులో నిందితుడు 'వైట్', 'బ్రీచ్బేస్' అనే మారు పేర్లతో హ్యాకింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు హ్యాకింగ్ కోసం ఉపయోగిస్తున్న 7అకౌంట్లను సైబర్ నిపుణులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఓ అకౌంట్ బ్రెజిల్‌కు చెందిన మరో యువకుడికి చెందిందని, ఇంతపెద్ద కంపెనీలను ఎందుకు హ్యాక్ చేస్తున్నారు. హ్యాక్ చేస్తే కలిగే లాభాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..టీనేజర్‌కు హ్యాకింగ్‌లో నైపుణ్యంగా ఎక్కువగా ఉందన్నారు. ల్యాప్సస్$ గ్రూప్ పేరుతో చేస్తున్న హ్యాకింగ్ కారణంగా సాఫ్ట్వేర్ కంపెనీ ఓక్తాకు చెందిన 366మంది క్లయింట్లు నష్టపోయారు. ఓక్తా షేర్లు 9శాతం పడిపోయాయి.ఆ కంపెనీ కార్యకాలపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇప్పుడు ఇదే అంశం మిగిలిన సంస్థలకు ఆందోళన కలిగిస్తుందన్నారు. కంపెనీలను హ్యాక్ చేయడానికి, వారి డేటాను దొంగిలించి, దానిని విడుదల చేసేందుకు పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేసే ప్రయత్నం జరుగుతుందనే అనుమానాలు సైబర్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు టీనేజర్ నివసించే ప్రాంతాన్ని గుర్తించినా, అతని జాడ తెలియరాలేదు. హ్యాకర్స్ టార్గెట్ ఏంటీ? అనే విషయాలతో పాటు టీనేజర్‌ను పట్టుకునేందుకు మరింత సమయం పట్టనున్నట్లు సమాచారం. -
‘రొమేనియా ఐపీ’.. బ్యాంకుకు టోపీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సర్వర్‌ను హ్యాక్ చేసి రూ.12.93 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారంలో కీలకాంశాలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. యూరోపియన్ దేశమైన రొమేనియాకు చెందిన ఐపీ అడ్రస్‌తో జావా స్క్రిప్ట్ ఫైల్(జేఎస్‌డబ్ల్యూ) పంపడం ద్వారా ఈ పని చేసినట్లు తేల్చారు. బ్యాంక్ డబ్బును ‘పంచుకున్న’గ్యాంగ్స్‌లో రెండింటిని పట్టుకున్న అధికారులు మరో రెండింటి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అడ్మిన్ మెయిల్‌ను స్ఫూఫ్ చేసి... లక్నోకు చెందిన లక్కీ డార్క్ నెట్లో చేసిన ప్రకటనతో సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. వీరిలో గతేడాది జూలైలో తెలంగాణ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి రూ.1,96,88,136 కాజేసిన నైజీరియన్లు ఉన్నారు. అలా వీరికి హైదరాబాద్‌లోని కో–ఆపరేటివ్ బ్యాంకులపై అవగాహన ఉండటంతో ప్రాథమిక పరిశీలన చేసి మహేష్ బ్యాంక్ ను ఎంచుకున్నారు. రొమేనియాకు చెందిన ఐపీ అడ్రస్‌తో అంతర్జాతీయంగా సేవలు అందించే ఎం247 సంస్థ వీపీఎన్‌ను వాడుకున్నారు. వీటి ద్వారా గతేడాది నవంబర్‌లో మహేష్ బ్యాంకునకు సంబంధించిన అన్ని కార్యాలయాల్లోని కంప్యూటర్లకూ ఒకేసారి కీ–లాగర్స్ పంపారు. ఆ బ్యాంక్ అడ్మిన్ మెయిల్ ఐడీని స్ఫూఫ్ చేసిన సైబర్ నేరగాళ్లు దాని నుంచి ఆర్టీజీఎస్ అప్డేట్ పేరుతో జేఎస్‌డబ్ల్యూ ఫైల్ పంపారు. బ్యాంక్ నెట్‌వర్క్‌కు సరైన ఫైర్‌వాల్స్ లేకపోవడంతో ఈ కీ–లాగర్స్‌తో కూడిన మెయిల్ కంప్యూటర్ల వరకు చేరింది. అక్కడ పనిచేసే సిబ్బందికి సైతం సైబర్ సెక్యూరిటీపై అవగాహన లేకపోవడంతో ప్రొసీడ్ అని కొట్టడంతో కీ–లాగర్స్ వారి కంప్యూటర్లలో ఇన్స్టాల్ అయిపోయాయి. దీని ద్వారానే గత నెల 22, 23 తేదీల్లో బ్యాంక్ చెస్ట్ ఖాతాకు సంబంధించిన రూ.12.93 కోట్లను స్వాహా చేశారు. పరారీలో నగరానికి చెందిన గ్యాంగ్స్... ఈ విషయం తెలుసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిపుణుల సాయంతో ఆ రెండు కంప్యూటర్లనూ స్వాధీనం చేసుకున్నారు. వాటికి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి హ్యాకర్లకు సంబంధించిన ఆ«ధారాలు సేకరించారు. యూపీ వాసి లక్కీతో పాటు నాగోల్‌లోని శాన్విక ఎంటర్ప్రైజెస్, కేపీహెచ్‌బీలోని ఫార్మాహౌస్లకు చెందిన కరెంట్ ఖాతాలను వినియోగించిన రెండు ముఠాలను ఇప్పటికే అరెస్టు చేశారు. మరో రెండు గ్యాంగ్స్ పరారీలో ఉన్నాయి. అంతర్జాతీయ దర్యాప్తు అవసరం అపెక్స్ బ్యాంక్, మహేష్ బ్యాంక్ సర్వర్లను హ్యాక్ చేయడానికి వాడిన ఐపీ అడ్రస్‌లు, వీపీఎన్ సర్వీస్‌లు ఒకటే. దాని కోసం అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంది. తొలుత ఎం247 సంస్థ నుంచి లాగిన్ వివరాలు తెలియాలి. అది కూడా అంతర్జాతీయ సంస్థ అయినందున ఆయా దేశాలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. – నగర పోలీసు ఉన్నతాధికారి -
మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
-
సంసద్ టీవీ యూట్యూబ్ చానల్ హ్యాక్
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారాలు చేసే సంసద్ టీవీకి చెందిన యూట్యూబ్ చానల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్‌చేశారు. దీంతో అప్రమత్తమైన యూట్యూబ్ సంస్థ.. సమస్యకు కొద్ది గంటల్లోనే చెక్ పెట్టింది. సోమవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంటకు సంసద్ టీవీ యూట్యూబ్ చానల్‌ను హ్యాకర్లు హ్యాక్ చేసి చానెల్ పేరును ఇథీరియం( ఒక క్రిప్టో కరెన్సీ పేరు)గా మార్చారు. హ్యాకింగ్ జరిగిన విషయాన్ని ఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే సంసద్ టీవీ సంబంధిత అధికారులకు తెలిపామని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ–ఇన్) తెలిపింది. చానెల్ హ్యాక్‌కు గురైందని తెలిపే స్క్రీన్షాట్లను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. చదవండి: (ప్రఖ్యాత గాయని సంధ్యా ముఖర్జీ కన్నుమూత) -
సెలబ్రిటీలకు హ్యాకింగ్ షాక్ !
-
Cryptocurrency: బాబ్బాబు.. కొట్టేసిందంతా వెనక్కి ఇచ్చేయండ్రా!
ఊహించని రీతిలో లాభాలను కురిపిస్తున్నాయనే ఆనందమే కాదు.. క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా హ్యాకర్ల ముప్పు పొంచి ఉండడంతో అభద్రతా భావానికి లోనవుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వాలు, ఆర్థిక విభాగాలు లేవనెత్తుతున్న అభ్యంతరాల్లో ఇది కూడా ఉంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్ ‘క్యూబిట్ ఫైనాన్స్’ నుంచి సుమారు 80 మిలియన్ డాలర్ల (600 కోట్ల రూపాయలకు పైనే) క్రిప్టోకరెన్సీ చోరీకి గురైంది. పక్కాగా ప్లాన్ చేసిన హ్యాకర్లు ఈ ఏడాది ఆరంభంలోనే ఈ భారీ చోరీకి పాల్పడ్డారు. ఇది గ్రహించిన క్యూబిట్ ఫైనాన్స్.. హ్యాకర్లతో బేరానికి దిగింది. మొదట కొంచెం సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చిన క్యూబిట్.. అటుపై కొంచెం తగ్గి ట్వీట్లు చేసింది. The protocol was exploited by; 0xd01ae1a708614948b2b5e0b7ab5be6afa01325c7 The hacker minted unlimited xETH to borrow on BSC. The team is currently working with security and network partners on next steps. We will share further updates when available. — Qubit Finance (@QubitFin) January 28, 2022 కొట్టేసిందంతా తిరిగి ఇచ్చేయాలని, బదులుగా.. మంచి నజరానా ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు ఎలాంటి న్యాయపరమైన చర్యలకు వెళ్లమని మాటిస్తోంది కూడా. ఇక క్రిప్టోకరెన్సీలో అరుదైన సర్వీస్‌ను క్యూబిట్ అందిస్తోంది. దీని ప్రకారం.. బ్రిడ్జ్ అనే సర్వీస్‌లో వివిధ రకాల బ్లాక్‌చెయిన్స్ ఉంటాయి. డిపాజిట్ చేసిన క్రిప్టోకరెన్సీని వేరొకదాంట్లోనూ విత్‌డ్రా చేసుకోవచ్చు. An appeal to the exploiter: It's not too late to return to funds. We will pay the maximum bounty reward as mentioned as well as not seek any legal charges if you return the funds and do right by the community. — Qubit Finance (@QubitFin) January 28, 2022 అయితే 2020లో బినాన్స్ స్మార్ట్‌చెయిన్‌ను లాంఛ్ చేసినప్పటి నుంచి డెఫీ(అప్‌కమింగ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ) ప్రాజెక్టులకు హ్యాకింగ్ తలనొప్పులు ఎదురవుతున్నాయి. కిందటి ఏడాది ఏప్రిల్‌లో యురేనియం ఫైనాన్స్ నుంచి 50 మిలియన్ డాలర్లు, మే నెలలో వీనస్ ఫైనాన్స్ నుంచి 88 మిలియన్ డాలర్లు హ్యాకర్ల బారినపడింది. చదవండి: క్రిప్టో దెబ్బకి మిలియనీర్ల నుంచి బికారీలుగా మారిన వేలమంది! -
ముందు సర్వర్లోకి.. తర్వాత నెట్‌వర్క్‌లోకి..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో జరిగిన రూ.12.93 కోట్ల సైబర్ నేరం కేసులో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కాస్త పురోగతి సాధించారు. హ్యాకింగ్ ఎలా జరిగిందో దర్యాప్తు అధికారులకు స్పష్టత వచ్చింది. గురువారం బంజారాహిల్స్‌లోని సర్వర్ సంస్థ కార్యాలయానికి వెళ్లిన అధికారులు.. మహేష్ బ్యాంకు అధికారులు, సర్వర్ నిర్వాహకులతో పాటు ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక బృందంతో కలిసి విశ్లేషించారు. సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ ఐపీ అడ్రస్‌లు వాడి తొలుత సర్వర్‌లోకే ప్రవేశించారని, ఆపై బ్యాంక్ నెట్‌వర్క్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నారని గుర్తించారు. నగదు బదిలీ అయిన వాటిలో 3 కరెంట్ అకౌంట్లకు సంబంధించిన వారితో సైబర్ నేరగాళ్లకు సంబంధం ఉండకపో వచ్చని భావిస్తున్నారు. లావాదేవీల సమాచారం వీరికి చేరకుండా సైబర్ నేరగాళ్లు వారి ఖాతాలతో లింకై ఉన్న ఫోన్ నంబర్లను మార్చేశారు. బషీర్‌బాగ్ బ్రాంచ్‌లో షానాజ్ బేగం పేరుతో ఓ మహిళ తెరిచిన సేవింగ్ ఖాతాతో లింకైన నంబర్‌ను మాత్రం నేరగాళ్లు మార్చలేదు. దీంతో ప్రతి లావాదేవీకి సంబంధించిన ఓటీపీ, సమాచారం ఆమె నంబర్‌కు చేరాయి. బ్యాంకు అధికారుల నుంచి ఫోన్ అందుకున్నప్పటి నుంచి ఆమె ఫోన్ స్విచ్చాఫ్ కావడం, ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఆ మహిళ పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. ఈ 4 ఖాతాల నుంచి డబ్బు ఉత్తరాదితో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని 129 ఖాతాల్లోకి వెళ్లింది. వాటి నుంచి మరికొన్ని ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. ఈ ఖాతాదారులను పట్టుకుంటే సూత్రధారుల గురించి తెలుస్తుందని.. ప్రత్యేక బృందాలను ఆ రాష్ట్రాలకు పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
Twitter: సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ట్విట్టర్ హ్యాక్
సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించిన ట్విట్టర్ ఖాతా బుధవారం హ్యాక్ అయ్యింది. పైగా హ్యకర్లు ఖాతా పేరును ఎలెన్ మస్క్ అని పేరు మార్చారు. అంతేకాదు ప్రోఫైల్‌లో చేప ఫోటో పెట్టారు. అదే సమయంలో కొన్ని ట్వీట్లు కూడా చేశారు. అయితే కొద్ది సమయంలోనే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆ ఖాతాను రికవరి చేసిందని ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో ఆ ట్విట్టర్ ఖాతా యథావిధిగా పనిచేస్తోంది. ఆ ట్వీట్లు కూడా తొలగించారు. అయితే హ్యాకర్లు గతంలో ప్రధాని మోదీ ఖాతాను హ్యాక్ చేసిన వారే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఖాతాను కూడా హ్యాక్ చేసి ఉండవచ్చు. ఎందుకంటే అప్పుడూ మోదీ ఖాతా హ్యాక్ అయినప్పుడు ఏం కంటెంట్ ఉందో అదే కంటెంట్ ఈ ఖాతాలో కూడా ఉంది. ఇటీవల చాలామంది ప్రముఖుల ఖాతాలు హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. (చదవండి: ఒమిక్రాన్ ఉధృతిని ఆపలేం.. బూస్టర్‌తో ప్రయోజనం ఉండకపోవచ్చు! అయినా ఆందోళనవద్దు!: డాక్టర్ జైప్రకాష్) -
హ్యాక్ అయితే 7 లోపు సంప్రదించండి
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌లోని ఎన్ఎస్వో సంస్థ తయారీ నిఘా సాఫ్ట్వేర్ ‘పెగగస్’ కారణంగా మొబైల్‌ఫోన్ హ్యాకింగ్‌కు గురైనట్లు భావించే బాధితులు జనవరి ఏడో తేదీ లోపు తమను సంప్రదించాలని సుప్రీంకోర్టు నియమించిన సాంకేతిక కమిటీ ప్రజలకు సూచించింది. ఈ మేరకు కమిటీ ఆదివారం ఒక పబ్లిక్ నోటీస్‌ను జారీచేసింది. ‘ పెగసస్ మాల్వేర్ తమ ఫోన్‌ను హ్యాక్ చేసిందని ఎందుకు భావిస్తున్నారో తగు కారణాలను కమిటీ ముందు ఆయా బాధితులు వెల్లడించాలి. హ్యాక్ అయిన మొబైల్/డివైజ్‌ను టెక్నికల్ కమిటీ పరిశీలించేందుకు మీరు అంగీకరిస్తారా? అనే విషయాన్నీ కమిటీకి పంపే ఈ–మెయిల్లో స్పష్టం చేయాలి’ అని ఆ నోటీస్‌లో కమిటీ పేర్కొంది. ‘ మీ కారణాలు సహేతుకమైనవని కమిటీ భావిస్తే ఆ మొబైల్/డివైజ్‌ను కమిటీ పరిశీలన/పరీక్ష/దర్యాప్తునకు తీసుకుంటుంది’ అని నోటీస్‌లో పేర్కొన్నారు. విపక్ష పార్టీల ముఖ్యనేతలు, ప్రముఖ సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు, జడ్జీలు సహా ప్రముఖుల మొబైల్ ఫోన్లను మోదీ సర్కార్ పెగసస్ స్పైవేర్‌తో హ్యాక్ చేసి నిఘా పెట్టిందని పెను దుమారం చెలరేగిన విషయం విదితమే. -
ల్యాప్‌టాప్, పీసీలలో ఇలా చేస్తున్నారా? ఇక మీ పని అయిపోయినట్టే..
మీరు మీ సొంత/కంపెనీ ల్యాప్‌టాప్, పీసీలోని గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లలో ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను సేవ్ చేస్తున్నారా? అయితే, ఇక మీ పని అయిపోయినట్టే. హ్యాకర్లు మీ ల్యాప్‌టాప్, పీసీలోని పాస్‌వర్డ్‌లను రెడ్ లైన్ మాల్ వేర్ సహాయంతో హ్యాక్ చేసే అవకాశం ఎక్కువ ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. ఇటీవల కాలంలో ఇంటి నుంచి పనిచేసే వారి శాతం రోజు రోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. వారు తమ కార్యాలయ పనులతో పాటు ముఖ్యమైన పనులకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను ల్యాప్‌టాప్, పీసీలోని గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లలో సేవ్ చేసుకుంటున్నారు. అయితే, ఇలా చేయడం వల్ల భారీ ముప్పు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఆహ్న్ ల్యాబ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మధ్యకాలంలో ఒక కంపెనీకి చెందిన ఉద్యోగి ఇంటి నుంచి పనిచేస్తున్న సమయంలో ఇతర ఉద్యోగులు వాడే ల్యాప్‌టాప్‌లో పనిచేసేవారు. అయితే, ఆ ల్యాప్‌టాప్‌లో సమాచారాన్ని దొంగిలించే రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ ఉందనె విషయం అతనికి తెలియదు. ఈ విషయం తెలియక ఆ ఉద్యోగి తను వాడుతున్న ల్యాప్‌టాప్‌లో గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను సేవ్ చేశాడు. అప్పటికే ల్యాప్‌టాప్‌లో ఉన్న రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ ఆ సమాచారాన్ని మొత్తం హ్యాకర్ల చేతికి ఇచ్చింది. అయితే, మరో కీలక విషయం ఏమిటంటే. ఈ రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ చాలా తక్కువ ధరకు లభిస్తున్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ డార్క్ వెబ్ సైట్లలో దీనిని $150కు కొనుగోలు చేయవచ్చు. అంటే, ఎవరైనా, మీ ల్యాప్‌టాప్, పీసీలలో ఈ స్పై సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే ఇక మీ పని అంతే అని నిపుణులు అంటున్నారు. అందుకే, మీ సొంత ల్యాప్‌టాప్, పీసీలతో కంపెనీ ఇచ్చే వాటిలో పాస్‌వర్డ్‌లను సేవ్ చేసుకోకుండా ఉండాలని సూచిస్తున్నారు. ఈ రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ మొదట మార్చి 2020లో రష్యన్ డార్క్ వెబ్‌లో కనిపించింది. ఇలాంటి మాల్ వేర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. (చదవండి: 50 బిలియన్ డాలర్ల లక్ష్యం..! యాపిల్..మేక్ ఇన్ ఇండియా..!) -
నా పిల్లల ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు హ్యాకయ్యాయి
లక్నో: తన కుమార్తె, కూతురుకు చెందిన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లు హాకింగ్‌కు గురయ్యాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఆరోపించారు. లక్నోలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఫోన్ల ట్యాపింగ్ వదిలేయండి. నా పిల్లల ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాక్ చేశారు. ఈ ప్రభుత్వానికి ఏ పనీ లేదా?’అని వ్యాఖ్యానించారు. సీఎం యోగి తన ఫోన్లను ట్యాప్ చేసి, సంభాషణల రికార్డులను ప్రతి రోజూ వింటున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ రెండు రోజుల క్రితం తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ‘నేను బాలికను. నేను పోరాడతాను’ నినాదంతో తాను చేపట్టిన కార్యక్రమం కారణంగానే ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్‌లో మహిళలతో సభ ఏర్పాటు చేసి, పలు పథకాలు ప్రకటించాల్సి వచ్చిందని ప్రియాంక అన్నారు. చదవండి: (Mamata Banerjee: కోల్‌కతా దీదీదే.. తృణమూల్ ‘హ్యాట్రిక్’) -
మమత సర్కార్‌కు సుప్రీంలో చుక్కెదురు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లోని మమతా బెనర్జీ సర్కారుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పెగసస్ నిఘా సాఫ్ట్‌వేర్‌తో హ్యాకింగ్ ఉదంతంపై బెంగాల్ ప్రభుత్వం వేరుగా విచారణ చేయించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీం రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎంబీ లోకూర్ ఆధ్వర్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వం నియమించిన కమిటీ దర్యాప్తుపై స్టే విధించింది. ఇప్పటికే పెగసస్ హ్యాకింగ్‌పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పెగసస్‌పై దర్యాప్తు చేయించబోమంటూ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిన తర్వాత కూడా బెంగాల్ ప్రభుత్వం వేరుగా విచారణ కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది ఎంఎల్ శర్మ వేసిన పిటిషన్‌ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘లోకూర్ కమిషన్ విచారణ ఉండదని గతంలో బెంగాల్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా! కానీ, మళ్లీ దర్యాప్తు కొనసాగుతోంది. ఏమిటిది?’అని ప్రశ్నించింది. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలకు తెలియజేస్తానని బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ లాయర్ ఏఎం సింఘ్వి ధర్మాసనానికి నివేదించారు. న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు వెలువరించేదాకా లోకూర్ కమిషన్ తన విచారణను నిలిపివేస్తుందని ఆయన తెలిపారు. స్పందించిన ధర్మాసనం..‘రాష్ట్ర ప్రభుత్వం సంకటస్థితి అర్థమైంది. పెగసస్ హ్యాకింగ్ విషయంలో దర్యాప్తును నిలుపుదల చేయాలని సంబంధిత అన్ని వర్గాలకు నోటీసులు ఇస్తున్నాం’అని పేర్కొంది. భారత్‌లోని వివిధ వర్గాలకు చెందిన 300 మంది ఫోన్లపై పెగసస్ స్పైవేర్ నిఘా పెట్టిందంటూ ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ బయటపెట్టిన విషయం తెలిసిందే. -
దిగ్గజ టెక్ కంపెనీలను వణికిస్తున్న "లాగ్4జే" లోపం
Log4j Vulnerability 2021: ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక సాఫ్ట్ వేర్ లోపం దిగ్గజ ఐటీ కంపెనీలను వణీకిస్తుంది. ఇటీవల వెలుగు చూసిన భారీ లోపం అని యుఎస్ ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది. ఈ లాగ్4జే లోపం వల్ల హ్యాకర్లు సులభంగా కంప్యూటర్ వ్యవస్థలను యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. ఈ లోపం వల్ల దిగ్గజ టెక్ కంపెనీలు విస్తృతంగా ఉపయోగించే లైబ్రరీ లాగ్4జే వ్యవస్థ ప్రభావితం కానుంది. లాగ్4జే వ్యవస్థను అపాచీ లాగింగ్ సర్వీస్ అనే కంపెనీ సృష్టించింది. ఇది టెక్ కంపెనీలు అత్యంత ఎక్కువగా ఉపయోగించే వెబ్ సర్వర్. యాపిల్ ఐక్లౌడ్ నుంచి ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ మైన్ క్రాఫ్ట్, అమెజాన్ వంటి అనేక ఇతర భారీ టెక్ కంపెనీలను ఈ లోపం ప్రభావితం చేస్తుంది. లాగ్4జే అంటే ఏమిటీ..? ప్రముఖ యాప్స్ లోకి లాగిన్ అయ్యేందుకు ఉపయోగించే లైబ్రరీ వంటి సాఫ్ట్‌వేర్‌ను ‘లాగ్4జే’ అంటారు. దీనిని ‘అపాచీ లాగింగ్ సర్వీస్’ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఆ అప్లికేషన్లో మన యాక్టివిటీలకు సంబంధించిన మొత్తం డేటా నమోదు చేసి ఉంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాఫ్ట్ వేర్ డెవలపర్లకు ఈ ‘లాగ్4జే’ పరిచయం అక్కర లేని పేరు. అయితే, ఈ సాఫ్ట్వేర్ ను పలు దిగ్గజ కంపెనీలతో ఇతర యాప్ సంస్థలు కూడా విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఈ లోపాన్ని లాగ్4షెల్ అని కూడా పిలుస్తారు. మొదట ఓపెన్ సోర్స్ డేటా సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్ "లూనాసెక్" పరిశోధకులు ఈ లోపం గురుంచి హైలైట్ చేశారు. (చదవండి: శామ్సంగ్కు రియల్మీ ఝలక్.. అమ్మకాల్లో మరో రికార్డు) ఈ సమస్య మొదట మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని మైన్ క్రాఫ్ట్ కనుగొంది. అయితే లాగ్4జే లోపం వల్ల అనేక సేవలు ఈ హ్యాకింగ్ బారిన పడే అవకాశం ఉన్నట్లు లూనాసెక్ హెచ్చరిస్తుంది. లాగిన్, పాస్వర్డ్ ఎంటర్ చేసే చోట ఒక కోడ్‌ను నమోదు చేయడం ద్వారా దాని వినియోగదారులను దారి మళ్లించి హ్యాక్ చేయవచ్చని గుర్తించారు. గత పదేళ్లలో ఎన్నడూ చూడని పెద్ద లోపంగా సైబర్ సెక్యూరిటీ సంస్థలు దీన్ని పేర్కొంటున్నాయి. ఈ బగ్ లాగ్4జే అన్ని వెర్షన్లను ప్రభావితం చేయదు. 2.0 - 2.14.1 మధ్య వెర్షన్లను మాత్రమే ప్రభావితం చేయనుంది. ఇప్పటికే ఈ లోపం ఉన్న సిస్టమ్స్‌ను గుర్తించి హ్యాక్ చేయడానికి వీలుగా టూల్స్ కూడా అభివృద్ధి చేశారని వైర్డ్.కామ్ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ లాగ్4జె లోపం బిట్‌కాయిన్ మైనింగ్‌పై ప్రభావం చూపకపోయిన క్రెడెన్షియల్స్, డేటా దొంగతనాలు జరిగే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఇంటర్నెట్లో ఈ లోపాన్ని వాడుకోవాలని చూసేవారిపై తమ ఇంటెలిజెన్స్ బృందం ఓ కన్నేసి పెట్టినట్లు టెక్ దిగ్గజం వెల్లడించింది. ఇప్పటికే అపాచీ ‘లాగ్4జే’ వాడే అప్లికేషన్లను పరిశీలిస్తున్నామని.. ఎక్కడైనా హ్యాకర్లు చొరబడినట్లు తెలిస్తే వినియోగదారులకు సమాచారం ఇస్తున్నట్లు వెల్లడించింది. గూగుల్ గూగుల్ క్లౌడ్ ‘లాగ్4జే’లోని లోపంపై ప్రకటన చేసింది. "మేము ప్రస్తుతం గూగుల్ క్లౌడ్ ఉత్పత్తులు, సేవలపై ఈ లోపం ప్రభావాన్ని అంచనా చేస్తున్నాము. మా కస్టమర్లకు కమ్యూనికేషన్ ఛానల్స్ ద్వారా అప్ డేట్ చేస్తున్నాము" అని పేర్కొంది. (చదవండి: కాగ్నిజెంట్‌లో కీలక స్థానంలో సోమా పాండే) -
పారా హుషార్: కొత్త ఏడాది.. కొత్త ఆశలతో పాటు కొత్త సమస్యలు
ప్రపంచం ఇప్పుడిప్పుడే కరోనా నుంచి తేరుకుంటోంది! కానీ..ఏళ్లుగా పీడిస్తున్న హ్యాకింగ్, స్కామింగ్ చికాకులు మాత్రం ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలు లేవు సరికదా... వచ్చే ఏడాది మరింత పెరుగుతాయంటోంది నార్టన్ ల్యాబ్స్!! కొత్త పోకడలతో, కొంగొత్త పద్ధతులతో ఐటీ వినియోగదారుల నుంచి డబ్బు లాగేసేందుకు స్కీములేస్తారని... పారాహుషార్ అని హెచ్చరిస్తోందీ సంస్థ! సాక్షి, హైదరాబాద్: 2021కు ముగుస్తోంది. కొత్త ఏడాది.. కొత్త ఆశలతోపాటు... కొత్త సమస్యలు కూడా ఉండబోతున్నాయన్నది నిపుణుల మాట. సైబర్ సెక్యూరిటీ విషయంలో రానున్న 12 నెలలు ఎంతో ఆసక్తికరమని అంటోంది ప్రఖ్యాత సైబర్ సెక్యూరిటీ సంస్థ నార్టన్ ల్యాబ్స్. క్రిప్టో కరెన్సీకి ప్రాచుర్యం దక్కుతున్న తరుణంతో దీన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే వాళ్లూ ఎక్కువవుతారని, అకాల వర్షాలు, వరదల్లో చిక్కుకున్న వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ స్కామర్లు కొంగొత్త స్కీములు రచిస్తారని అంచనా వేస్తోంది. అంతేకాదు.. వీటన్నింటి విరుగుడే లక్ష్యంగా సైబర్ ఆక్టివిజమ్ కూడా ఊపందుకుంటుందని చెబుతోంది. 2022 సంవత్సరంలో సైబర్ ప్రపంచంలో సంభవించగల ఐదు అంశాలు.. నార్టన్ ల్యాబ్స్ అంచనాల మేరకు... క్రిప్టో కరెన్సీ తోడుగా... 2022లో క్రిప్టో కరెన్సీని వస్తు/సేవల వినియోగానికి అంగీకరించే కంపెనీలు పెరుగుతాయి. అదే సమయంలో ఈ డిజిటల్ కరెన్సీ తీరుతెన్నులు తెలియని అమాయకులను లక్ష్యంగా చేసుకుని స్కామర్లు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కాయిన్లు ఉచితంగా ఇస్తున్నామని కొందరు, నకిలీ యాప్‌లతో ఇంకొందరు ఇప్పటికే క్రిప్టో కరెన్సీ ఆధారిత నేరాలకు పాల్పడుతుండగా.. కొత్త ఏడాదిలో మరిన్ని కొత్త కుయుక్తులు పన్నే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఐడీలు? వర్క్ ఫ్రమ్ హోమ్, జూమ్ కాల్, ఆన్లైన్లో అవసరమైనవి తెప్పించుకోవడం... కరోనా కారణంగా ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయిన కార్యక్రమాలివి. ఈ క్రమంలోనే స్మార్ట్ఫోన్లతో అవసరమైన డాక్యుమెంట్లను అటూ ఇటూ పంపుతుండటమూ కద్దు. అయితే వీటితో అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో మరింత సురక్షితమైన రీతిలో మన వ్యక్తిగత వివరాలను పంపేందుకు వాటిని గుర్తించే అవసరం ఏర్పడింది. కంప్యూటర్ రంగంలో ఇటీవలి కాలంలో బాగా అభివృద్ధి చెందిన బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సాయంతో ఈ సమస్యను అధిగమించే ప్రయత్నం వచ్చే ఏడాది జరగనుంది. ఎల్రక్టానిక్ ఐడీ లేదా ‘ఈఐడీ’ పేరుతో బ్లాక్‌చెయిన్ ఆధారిత గుర్తింపు కార్డుల జారీకి కొన్ని ప్రభుత్వాలూ పట్టుబడుతున్నాయి. సైబర్ నిరసనలు, ఉగ్రవాదమూ... సైబర్ టెర్రరిజమ్, ఆక్టివిజమ్ 2021లోనూ భారీగానే నడిచింది. కాకపోతే వచ్చే ఏడాది ఇది మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. డబ్బు కోసం నేరాలకు పాల్పడటం సైబర్ క్రిమినల్స్ చేసే పనైతే.. హ్యాకింగ్ మాత్రం కొన్నిసార్లు నిరసనలకూ ఉపయోగపడుతున్నాయి. హ్యాక్టివిస్టులంటారు ఇలా నిరసనలకు పాల్పడే వారిని! ఈ రకమైన హ్యాక్టివిజమ్ వచ్చే ఏడాదీ కొనసాగనుంది. ప్రభుత్వాలకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని బహిరంగపరచడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. నేరగాళ్లకూ అండగా ఏఐ... మానవాళి మరికొంచెం సుఖంగా ఉండేందుకు కృత్రిమ మేధ ఎంత ఉపయోగకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే వచ్చే ఏడాది ఈ అత్యాధునిక టెక్నాలజీ సైబర్ నేరగాళ్ల పని కూడా సులువు చేయనుంది. డీప్‌ఫేక్ వంటి టెక్నాలజీల కారణంగా అసలు, నకిలీల మధ్య అంతరం చెరిగిపోతుండటాన్ని నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకోనున్నారు. కష్టాల్లో డబ్బులేరుకునే రకాలు... మనిషి కష్టాలతో కూడా డబ్బులు సంపాదించుకునే రకాలు 2022లో మరింత ఎక్కువవుతారు. చోరీ చేసిన సమాచారం సాయంతో ప్రభుత్వాలు, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి డబ్బు లాగేసేందుకు వీరు ప్రయత్నిస్తారు. చదవండి: సైబర్ మోసాలకు గురయ్యారా? అయితే ఈ నంబర్ మీకోసమే.. ఎందుకింత గలీజ్ అయితున్నరు? పోలీసులకు రవి ఫిర్యాదు -
కొత్త ఏడాది ‘కొత్త’ ముసుగుతో చెలరేగిపోనున్న సైబర్ దొంగలు!
2021కు ముగుస్తోంది. కొత్త ఏడాది.. కొత్త ఆశలతోపాటు... కొత్త సమస్యలు కూడా ఉండబోతున్నాయన్నది నిపుణుల మాట. సైబర్ సెక్యూరిటీ విషయంలో రానున్న 12 నెలలు ఎంతో ఆసక్తికరమని అంటోంది ప్రఖ్యాత సైబర్ సెక్యూరిటీ సంస్థ నార్టన్ ల్యాబ్స్. క్రిప్టో కరెన్సీకి ప్రాచుర్యం దక్కుతున్న తరుణంతో దీన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే వాళ్లూ ఎక్కువవుతారని, అకాల వర్షాలు, వరదల్లో చిక్కుకున్న వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ స్కామర్లు కొంగొత్త స్కీములు రచిస్తారని అంచనా వేస్తోంది. అంతేకాదు.. వీటన్నింటి విరుగుడే లక్ష్యంగా సైబర్ ఆక్టివిజమ్ కూడా ఊపందుకుంటుందని చెబుతోంది. 2022 సంవత్సరంలో సైబర్ ప్రపంచంలో సంభవించగల ఐదు అంశాలు.. నార్టన్ ల్యాబ్స్ అంచనాల మేరకు... క్రిప్టో కరెన్సీ తోడుగా... 2022లో క్రిప్టో కరెన్సీని వస్తు/సేవల వినియోగానికి అంగీకరించే కంపెనీలు పెరుగుతాయి. అదే సమయంలో ఈ డిజిటల్ కరెన్సీ తీరుతెన్నులు తెలియని అమాయకులను లక్ష్యంగా చేసుకుని స్కామర్లు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కాయిన్లు ఉచితంగా ఇస్తున్నామని కొందరు, నకిలీ యాప్‌లతో ఇంకొందరు ఇప్పటికే క్రిప్టో కరెన్సీ ఆధారిత నేరాలకు పాల్పడుతుండగా.. కొత్త ఏడాదిలో మరిన్ని కొత్త కుయుక్తులు పన్నే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఐడీలు? వర్క్ ఫ్రమ్ హోమ్, జూమ్ కాల్, ఆన్లైన్లో అవసరమైనవి తెప్పించుకోవడం... కరోనా కారణంగా ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయిన కార్యక్రమాలివి. ఈ క్రమంలోనే స్మార్ట్ఫోన్లతో అవసరమైన డాక్యుమెంట్లను అటూ ఇటూ పంపుతుండటమూ కద్దు. అయితే వీటితో అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో మరింత సురక్షితమైన రీతిలో మన వ్యక్తిగత వివరాలను పంపేందుకు వాటిని గుర్తించే అవసరం ఏర్పడింది. కంప్యూటర్ రంగంలో ఇటీవలి కాలంలో బాగా అభివృద్ధి చెందిన బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సాయంతో ఈ సమస్యను అధిగమించే ప్రయత్నం వచ్చే ఏడాది జరగనుంది. ఎలక్ట్రానిక్ ఐడీ లేదా ‘ఈఐడీ’ పేరుతో బ్లాక్‌చెయిన్ ఆధారిత గుర్తింపు కార్డుల జారీకి కొన్ని ప్రభుత్వాలూ పట్టుబడుతున్నాయి. సైబర్ నిరసనలు, ఉగ్రవాదమూ... సైబర్ టెర్రరిజమ్, ఆక్టివిజమ్ 2021లోనూ భారీగానే నడిచింది. కాకపోతే వచ్చే ఏడాది ఇది మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. డబ్బు కోసం నేరాలకు పాల్పడటం సైబర్ క్రిమినల్స్ చేసే పనైతే.. హ్యాకింగ్ మాత్రం కొన్నిసార్లు నిరసనలకూ ఉపయోగపడుతున్నాయి. హ్యాక్టివిస్టులంటారు ఇలా నిరసనలకు పాల్పడే వారిని! ఈ రకమైన హ్యాక్టివిజమ్ వచ్చే ఏడాదీ కొనసాగనుంది. ప్రభుత్వాలకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని బహిరంగపరచడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. నేరగాళ్లకూ అండగా ఏఐ... మానవాళి మరికొంచెం సుఖంగా ఉండేందుకు కృత్రిమ మేధ ఎంత ఉపయోగకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే వచ్చే ఏడాది ఈ అత్యాధునిక టెక్నాలజీ సైబర్ నేరగాళ్ల పని కూడా సులువు చేయనుంది. డీప్‌ఫేక్ వంటి టెక్నాలజీల కారణంగా అసలు, నకిలీల మధ్య అంతరం చెరిగిపోతుండటాన్ని నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకోనున్నారు. కష్టాల్లో డబ్బులేరుకునే రకాలు... మనిషి కష్టాలతో కూడా డబ్బులు సంపాదించుకునే రకాలు 2022లో మరింత ఎక్కువవుతారు. చోరీ చేసిన సమాచారం సాయంతో ప్రభుత్వాలు, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి డబ్బు లాగేసేందుకు వీరు ప్రయత్నిస్తారు. -
అలెర్ట్: ఈ వైఫై రూటర్లు వాడుతున్నారా..? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..!
సైబర్ నేరస్తులు పంథా మార్చారు. ఇన్ని రోజులు మెయిల్స్, మెసేజెస్, ఫ్రీగిఫ్ట్ లు పేరుతో బ్యాంక్ అకౌంట్లలో ఉన్న మనీని కాజేసేవారు. కానీ ఇప్పుడు రూటు మార్చి వైఫై రూటర్ల సాయంతో వైరస్ పంపి పర్సనల్ కంప్యూటర్లు, ఆఫీస్‌లో కంప్యూటర్లపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాడుల్లో వ్యక్తులు, లేదంటే సంస్థల రహస్యాల్ని స్వాధీనం చేసుకుంటున్నారు. వాటిని అడ్డం పెట్టుకొని కావాల్సిన మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని మిలియన్ల వైఫై రూటర్లలో సుమారు 226 భద్రతా లోపాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ 'ఐఓటీ ఇన్స్పెక్టర్', టెక్నాలజీ మ్యాగజైన్ 'చిప్' పలు నివేదికల్ని విడుదల చేసింది. నెట్‌గేర్, ఆసుస్, సినాలజీ,డీ - లింక్, ఏవీఎం,టీపీ -లింక్, ఇడి మ్యాక్స్ సంస్థల రూటర్లలో సెక్యూరిటీ సమస్యలు తలెత్తాయని, తద్వారా యూజర్ల వ్యక్తిగత డేటాను దొంగిలించేందుకు అవకాశం ఉన్నట్లు నివేదికల్లో పేర్కొన్నాయి. ఈ సెక్యూరిటీ సమస్యలు వెలుగు రావడంతో సంబంధిత సంస్థలు.. ఆ సమస్యని పరిష్కరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఐఓటీ ఇన్స్పెక్టర్ సంస్థ సీటీఓ ఫ్లోరియన్ లుకావ్స్కీ మాట్లాడుతూ.. మిలియన్ల రూటర్లలో తలెత్తిన 226 భద్రతా లోపాల వల్ల తలెత్తే నష్టం ఒకే విధంగా ఉంటుందని చెప్పలేం. కానీ అదే భద్రతా లోపాల్ని అడ్డంపెట్టుకొని హ్యాక్ చేయడం హ్యాకర్లకు చాలా సులభం' అవుతుందని అన్నారు. అయితే ఈ సమస్యలకు రూటర్లలో వినియోగించే కొత్త కాంపోనెంట్స్, ల్యూనిక్స్ కెర్నాల్ అనే ఆపరేటింగ్ స్టిస్టమ్ తో పాటు ఇతర డేటా సర్వీసులను టార్గెట్ చేసుకొని సైబర్ దాడులు జరిగే ప్రమాదం ఉందని అన్నారు. సైబర్ దాడుల నుంచి సేఫ్‌గా ఉండాలంటే ఇటీవల నార్డ్ పాస్ అనే సంస్థ 50 దేశాలకు చెందిన ప్రజలు ఎలాంటి పాస్‌వర్డ్‌లను వినియోగిస్తున్నారు. ఆ పాస్‌వర్డ్‌లను ఎంత సమయంలో హ్యాక్ చేయొచ్చు అనే అంశంపై సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో మనదేశానికి చెందిన ప్రజలు..సెకను కన్నా తక్కువ సమయంలో హ్యాక్ చేసే విధంగా పాస్ వర్డ్ అనే వర్డ్‌ను పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటున్నారని తేలింది. దీంతో పాటు 12345, 123456, 123456789, 12345678, india123, 1234567890, 1234567 పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటున్నట్లు నార్డ్ పాస్ పేర్కొంది. అలా కాకుండా కష్టతరమైన వర్డ్స్‌లేదంటే నెంబర్స్ పెట్టుకోవడం వల్ల వైఫై రూటర్ల ద్వారా జరిగే హ్యాకింగ్ నుంచి సురక్షింతంగా ఉండొచ్చని ఫ్లోరియన్ లుకావ్స్కీ సూచించారు. చదవండి : వాటిని పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటే..కొంప కొల్లేరే -
చరిత్రలో మరో అతిపెద్ద హ్యాకింగ్.. వందల కోట్లు హాంఫట్!
ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీ యుగంలో యూజర్ల వివరాలు ఎంత భద్రంగా ఉన్నాయి అనేది మనకు ఒక ప్రశ్నార్ధకంగా మారింది. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద కంపెనీలు కూడా హ్యకర్స్ బారిన పడుతున్నాయి. ఇటీవల ఒక హ్యాకర్ల బృందం డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్(డిఫై) సంస్థ బాడ్జర్ డీఏఓకు భారీ షాక్ ఇచ్చింది. దీంతో సరికొత్త ట్రేడింగ్‌గా మారిన క్రిప్టోకరెన్సీ వ్యవస్థ ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. పటిష్టమైన భద్రతా వ్యవస్థగా చెప్పుకుంటున్న బ్లాక్‌చైయిన్ టెక్నాలజీని కూడా హ్యాకర్లు చేధించారు. చరిత్రలో మరోసారి 120.3 మిలియన్ డాలర్ల(సుమారు రూ.900 కోట్లు) క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టారు. బ్లాక్‌చైయిన్ టెక్నాలజీ సంస్థ బాడ్జర్ డీఏఓపై హ్యాకర్లు దాడి చేశారు. కళ్లు మూసి తెరిచే లోగా వందల కోట్ల రూపాయల విలువ చేసే డిజిటల్ కరెన్సీని దోచుకున్నారు. డీసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే బాడ్జర్ డీఏఓ యాప్‌ను హ్యాక్ చేసినట్లు ప్రముఖ బ్లాక్ చైన్ సెక్యూరిటీ సంస్థ పెక్ షీల్డ్ మొదట కనుగొంది. Here is the current whereabouts as well as the total loss: $120.3M (with ~2.1k BTC + 151 ETH) @BadgerDAO pic.twitter.com/fJ4hJcMWTq — PeckShield Inc. (@peckshield) December 2, 2021 పెక్ షీల్డ్ సంస్థ ఈ హ్యాకింగ్ గురుంచి బయట పెట్టిన తర్వాత సదురు సంస్థ ఈ విషయం దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది. కస్టమర్లు మరోసారి హ్యాకింగ్ బారిన పడకుండా ఉండటానికి తాత్కాలికంగా లావాదేవీలు నిలిపివేసినట్లు పేర్కొంది. ఈ సమస్యను దర్యాప్తు చేయడానికి బాడ్జర్ డీఏఓ యుఎస్, కెనడియన్ అధికారులతో పాటు చైన్లాలైసిస్ కంపెనీని కూడా నియమించింది. ఈ మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని బాధితులకు తిరిగి చెల్లిస్తుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. Badger has received reports of unauthorized withdrawals of user funds. As Badger engineers investigate this, all smart contracts have been paused to prevent further withdrawals. Our investigation is ongoing and we will release further information as soon as possible. — ₿adgerDAO 🦡 (@BadgerDAO) December 2, 2021 బాడ్జర్ డీఏఓ బాడ్జర్ డీఏఓ అనేది ఒక డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సంస్థ. ఈ బాడ్జర్ డీఏఓ అప్లికేషన్లలో వినియోగదారులు రుణాలను పొందడానికి బిట్ కాయిన్‌ను తాకట్టు పెట్టుకోవచ్చు. డిఏఓ అనేది ఆటోమేటెడ్ & డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సంస్థ. ఇది బ్లాక్ చైన్ ఆధారిత స్మార్ట్టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఈ బాడ్జర్ డీఏఓ ఎథెరియం ప్లాట్ ఫారంను నిర్మించారు. (చదవండి: పొరపాటున వాట్సాప్ స్టేటస్ పెడితే..) -
బిట్‌కాయిన్ కుంభకోణం: వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు..
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బిట్‌కాయిన్ కుంభకోణంలో సీసీబీ పోలీసుల విచారణలో రోజూ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కుంభ కోణానికి కేంద్రబిందువైన శ్రీకృష్ణ అలియాస్ శ్రీకి, పలు వెబ్సైట్లను హ్యాక్ చేసి బిట్‌కాయిన్ కార్యకలాపాలకు ఎలా పాల్పడింది బహిర్గతమైంది. ఐదేళ్ల పాటు బిట్‌కాయిన్ దందాలో భాగస్వామిగా తాజాగా సీసీబీ పోలీసులకు పట్టుబడిన రెండో వ్యక్తి రాబిన్ ఖండేన్వాలా. ఇతడు శ్రీకి దందా పట్ల నోరువిప్పాడు. హ్యాకింగ్ ఎలా చేశారు, ఎవరికి బిట్కాయిన్లను విక్రయించారు, ఈ దందాలో ఎవరెవరు భాగస్వామిగా ఉన్నారు అనే విషయాలపై రాబిన్ ఏడు పేజీల వాంగ్మూలం ఇచ్చాడు. ఎవరీ ఖండేన్వాలా? పశ్చిమబెంగాల్ కు చెందిన రాబిన్ఖండేన్వాలా సీఏ పట్టభద్రుడు కాగా 2012 నుంచి 16 వరకు తండ్రి నిర్వహించే రైస్‌మిల్ చూసుకునేవాడు. 2016లో రాబిన్ సర్వీసెన్ పేరుతో బిట్‌కాయిన్ లావాదేవీలను ప్రారంభించాడు. పలు వెబ్సైట్ల తెరిచి అమ్మకం, కొనుగోళ్లను చేసేవాడు. ఇంతవరకు రూ.50 కోట్లు వ్యవహారాలు నిర్వహించినట్లు తెలిసింది. 2017 ఏప్రిల్‌లో హ్యాకర్ శ్రీకృష్ణ ఆన్లైన్లో పరిచయమయ్యాడు. ఇద్దరు చాటింగ్ చేసుకునేవారు. ఈ సమయంలో శ్రీకృష్ణ తనవద్దనున్న 900 బిట్కాయిన్లు విక్రయించాలని కోరగా, రాబిన్ వాటిని అమ్మి ఆ డబ్బును శ్రీకి అకౌంట్లోకి జమచేశాడు. సుమారు రూ. ఐదారు కోట్ల వ్యవహారాలు నడిపారు. వందలాది కాయిన్ల అమ్మకాలు శ్రీకి గోవాలో పోకర్ ఆన్లైన్ గేమ్ వెబ్సైట్లను హ్యాక్ చేశాడని రాబిన్ చెప్పాడు. అలా శ్రీకి కోట్లాది రూపాయలను దోచుకుని గోవాలో విలాసాలు చేసేవాడు. 2017 నుంచి అనేక వెబ్సైట్లను హ్యాక్ చేసిన శ్రీకి 130 బిట్కాయిన్లను రాబిన్ ఖండేన్వాలాకు ఇచ్చాడు. దీనిని విక్రయించి రూ.3.48 కోట్ల నగదును 50 మందికి పైగా అకౌంట్లలోకి జమచేశాడు. మిగిలిన డబ్బును శ్రీకి జల్సాలకు చెల్లించాడు. శ్రీకి హ్యాక్ చేయడానికి యాపిల్ మ్యాక్‌బుక్ ప్రొ ల్యాప్‌టాప్‌ను వినియోగించేవాడు. హవాలా ద్వారా రూ.4.98 కోట్లు 2017లో శ్రీకృష్ణ ఇరిడియం టోకెన్లను అందించి రాబిన్ ద్వారా అమ్మేయించాడు. 2018లో బెంగళూరు కు వచ్చినప్పుడు శ్రీకి హ్యాకర్ అని తెలిసిందని విచారణలో చెప్పాడు. ఒక హోటల్లో శ్రీకి, మహమ్మద్ నలపాడ్ తదితరులు తనను కలిశారని తెలిపాడు. బిట్కాయిన్ల గురించి చర్చ జరిపామని, కొద్దినెలల తరువాత ఓ కేసులో నలపాడ్ అరెస్టయ్యాడు. ఈ సమయంలో శ్రీకికి తన ఇంట్లో ఐదురోజులు ఆశ్రయం ఇచ్చానని, ఈ సమయంలో ఢిల్లీ, చండీఘడ్, జైపూర్, ముంబై తదితరాలకు వెళ్లినట్లు రాబిన్ చెప్పాడు. 2018లో శ్రీకి అడగడంతో 30 బిట్కాయిన్లను బదిలీ చేశానని, సుజయ్, సునీశ్, ప్రసిద్ధ్ శెట్టి, సురేశ్ అనే వారిని పరిచయం చేశాడన్నారు. శ్రీకి కి నగదు కావాలనడంతో హైదరాబాద్ అభిషేక్ ద్వారా హవాలా మార్గంలో మొత్తం రూ.4.98 కోట్ల నగదు పంపించానని వివరించాడు. బిట్‌కాయిన్ నిందితులను వదలం : సీఎం శివాజీనగర: బిట్ కాయిన్ స్కామ్‌ను బయటికి తీసుకురావడం, విచారణ చేపట్టింది మేమే. ఇందులో ఎంతటి బలమైన వ్యక్తులున్నా శిక్షిస్తాం అని సీఎం బొమ్మై చెప్పారు. ఆదివారం విధానసౌధ ముందు నెహ్రూ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించిన తరువాత మాట్లాడారు. ఈ కేసులు ఈడీ, సీబీఐకి అప్పగించాము. వారు కోరిన సమాచారాన్ని అందించాము. 2018లో కాంగ్రెస్ సర్కారు నిందితుడు శ్రీకృష్ణను విచారించి ఉంటే అన్ని విషయాలూ బహిరంగమయ్యేవి. ఈ కేసు విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. ఎక్కడ మోసం జరిగినా చర్యలు తీసుకొంటాము అని చెప్పారు. నన్ను వదిలేయండి: నలపాడ్ బిట్‌కాయిన్ స్కామ్‌లో నా పాత్ర లేదు, అనవసరంగా నా పేరును ప్రస్తావించి వేధించవద్దు అని కాంగ్రెస్ నేత మహమ్మద్ నలపాడ్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ 2021 జనవరిలో బిట్ కాయిన్ కేసు బయటికి వచ్చింది. దీంతో నాకు సంబంధం ఉంటే ఎప్పుడో అరెస్టు చేసేవారు కదా అని అన్నారు. యూబీ సిటీలో గొడవ కేసులో 117 రోజులు జైలులో ఉన్నాను, మా నాన్న హ్యారిస్ ఎమ్మెల్యే కాబట్టి నాపై కొందరు బురదచల్లుతున్నారు అని అన్నారు. నన్ను, నా కుటుంబాన్ని వదిలేయండి అని కోరారు. -
అతని కథ సినిమాకు ఏమాత్రం తీసిపోదు!
సాక్షి, బనశంకరి(కర్ణాటక): బెంగళూరువాసి శ్రీకృష్ణ అలియాస్ శ్రీకి పేరు చెబితే రాజకీయనేతలు, ప్రముఖ వ్యక్తులు హడలిపోతారు. శ్రీకి నుంచి రాజకీయ నేతలు, వారి సుపుత్రులు భారీగా బిట్కాయిన్ల డబ్బును స్వీకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పెద్ద రాజకీయ కలకలం ఏర్పడింది. ఇతని కథ సినిమాకు ఏమాత్రం తీసిపోదంటారు. జయనగర నివాసి గోపాల్ రమేశ్ కుమారుడైన శ్రీకి అంతర్జాతీయ స్థాయి హ్యాకర్‌గా గుర్తింపు పొందాడు. తన ఆధారాలు చిక్కకుండా హ్యాక్ చేయడం ఇతని ప్రత్యేకత. ఇందుకోసం ఎప్పడూ సొంత ల్యాప్‌టాప్, కంప్యూటర్, మొబైల్‌ఫోన్‌ను వాడింది లేదు. 4వ తరగతి నుంచి షురూ.. నాలుగో తరగతి చదువుతుండగానే మొబైల్‌ఫోన్‌ను హ్యాక్ చేసే నైపుణ్యం పొందిన శ్రీకి హైస్కూల్లో చేరేటప్పటికి ప్రముఖ హ్యాకర్‌గా గుర్తింపుపొందాడు. 17 ఏళ్లు వయసులోనే ఇళ్లు వదిలిపెట్టి ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌కు పారిపోగా పోలీసులు కనిపెట్టి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఎప్పుడూ స్కూల్‌కి గైర్హాజరయ్యే ఇతడు తోటి విద్యార్థులు, పాఠశాల కంప్యూటర్లను హ్యాక్ చేసి ఔరా అనిపించేవాడు. వీవీ పురం ప్రైవేటు కాలేజీలో పీయూసీ కంప్యూటర్ సైన్సు చదువుతుండగా ప్రపంచస్థాయి హ్యాకర్లతో పరిచయమైంది. పీయూసీ తరువాత ఉన్నత విద్య కోసం నెదర్లాండ్‌కు వెళ్లడంతో అందులో నిష్ణాతునిగా మారాడు. అక్కడి హ్యాకర్లతో గొడవలు వచ్చి తిరిగి బెంగళూరుకు చేరుకున్నాడు. పెద్దవాళ్లతో స్నేహం.. తెలివితేటలను ఉపయోగించి నగరంలో ప్రముఖ వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు, సీనియర్ పోలీస్ అధికారులు, వారి పిల్లలతో స్నేహం పెంచుకున్నాడు. యుబీ సిటీలో ఎమ్మెల్యే హ్యారిస్ కుమారుడు నలపాడ్, విద్వత్ అనే యువకునిపై దాడిచేసిన సమయంలో శ్రీకి కూడా ఉన్నాడు. దాంతో కొన్నాళ్లు పరారయ్యాడు. డబ్బు కొల్లగొట్టి విలాసాలు.. బెంగళూరులో మకాం వేసి ప్రభుత్వ వెబ్సైట్లు, టెండర్లను హ్యాక్ చేసేవాడు. తద్వారా కోట్లాది రూపాయలను కొల్లగొట్టి స్టార్ హోటళ్లు, క్రూయిజ్ ఓడల్లో, విమానాల్లో విలాసంగా గడపడం ఇతని నైజం. అయితే గత జనవరిలో సీసీబీ పోలీసులు శ్రీకిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడంతో కష్టాలు మొదలయ్యాయి. అప్పుడే క్రిప్టో కరెన్సీ దందా వెలుగుచూసింది. ఇతని అకౌంట్లలో ఉన్న సుమారు రూ.9 కోట్ల విలువచేసే బిట్కాయిన్ల సీజ్ చేశారు. కొన్నినెలల పాటు జైల్లో ఉండి ఇటీవలే విడుదలయ్యాడు. -
యాపిల్‌కు భారీ షాక్, ఒక్క సెకన్లో ఐఫోన్13 హ్యాక్
గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమిని వెనక్కి నెట్టిన యాపిల్ సంస్థకు భారీ షాక్ తగిలింది. ఇటీవల యాపిల్ విడుదల చేసిన 'ఐఫోన్ -13 ప్రో'ను సెకన్ల వ్యవధిలో 'వైట్ హ్యాట్' హ్యాకర్స్ హ్యాక్ చేశారని చైనాకు చెందిన టెక్ అనాలసిస్ సంస్థ ఐథోమ్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. షావోమిని వెనక్కి నెట్టింది.. కానీ గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కెనాలిస్ ప్రకారం..ఈ ఏడాది క్యూ3 (జులై నుంచి సెప్టెంబర్) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో టెక్ దిగ్గజం యాపిల్ 15 శాతం వాటాతో.. చైనాకు చెందిన షావోమిని అధిగమించింది. తిరిగి రెండో స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. అందుకు కారణం ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌కు విపరీతమైన డిమాండ్ పెరగడమేనని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. యాపిల్ సంస్థ ప్రతి ఏడాది నిర్వహించే 'యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్'ను ఈ ఏడాది నిర్వహించింది. ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ద్వారా సెప్టెంబర్ 14న నిర్వహించిన ఈవెంట్లో యాపిల్ సంస్థ ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. సెక్యూరిటీ విషయంలో తిరుగు లేదు ఈ సందర్భంగా యాపిల్ ప్రతినిధులు మాట్లాడుతూ తాము విడుదల చేసే, లేదంటే విడుదల కానున్న ఐఫోన్లలో ప్రైవసీ,సెక్యూరిటీ విషయంలో రాజీపడబోమని తెలిపారు. కానీ చైనా 'వైట్ హ్యాట్' హ్యాకర్స్ మాత్రం ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లను ఎలా హ్యాక్ చేయొచ్చో..తాజాగా యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 13సిరీస్ ఫోన్లను సెకన్లలో హ్యాక్ చేయొచ్చని తెలిపారు. ఒక్క సెకన్లో హ్యాక్ చేశారు ఇటీవల చైనాలో 4వ 'టియాన్ఫు కప్' ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ కాంటెస్ట్ జరిగింది. ఈ కాంటెస్ట్‌లో వైట్ హ్యాట్ హ్యాకర్ ఐఫోన్ 13 ప్రోని సెకన్లలో హ్యాక్ చేశాడు. హ్యాక్ చేసిన హ్యాకర్ ఐఫోన్లో ఉన్న ఫోటో ఆల్బమ్, యాప్‌లకు యాక్సెస్ చేశాడు. అంతేకాదు అందులో ఉన్న డేటాను ఈజీగా డిలీట్ చేయడం సాధ్యమైందని ఐథోమ్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. మరి ఈ ఐఫోన్13 ప్రో హ్యాకింగ్ పై ఐఫోన్ ప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. వైట్ హ్యాట్ హ్యాకర్లు అంటే ఎవరు వైట్ హ్యాట్ హ్యాకర్లు లేదా ఎథికల్ హ్యాకర్స్. ఈ హ్యాకర్స్‌ను ఆయా సంస్థల్లో లేదంటే, టెక్నాలజీలోని లోపాల్ని గుర్తిస్తారు. నిబంధనలకు అనుగుణంగా లోపాల్ని గుర్తించేలా పనిచేసే వీళ్లని ఆయా టెక్ సంస్థలు, లేదంటే ప్రభుత్వాలు సైతం నియమించుకుంటాయి. చదవండి : ఐఫోన్ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో.. -
పెగాసెస్: ప్రిన్సెస్ ఫోన్ హ్యాక్ చేసిన మాజీ భర్త
దుబాయ్: దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్-మక్తూమ్ తన మాజీ భార్య ప్రిన్సెస్ హయా బింట్, ఆమె న్యాయవాదుల ఫోన్లను హ్యాక్ చేయమని ఆదేశించినట్లు తెలిసింది. వారి పిల్లల కస్టడీకి సంబంధించిన ఇంగ్లండ్ హైకోర్టులో చైల్డ్-కస్టడీ ఫాక్ట్-ఫైండింగ్ కేసు నడుస్తోన్న సంగతి తెలిసిందే. దీని విచారణలో భాగంగా మొహమ్మద్ తన మాజీ భార్య ప్రిన్సెస్ హయాను వెంటాడి.. బెదిరింపులకు గురి చేసినట్లు ఇంగ్లండ్ హైకోర్టు అభిప్రాయపడింది. ప్రిన్సెస్ హయా ఫోన్ హ్యాక్ చేయడం కోసం మహమ్మద్ అధునాతన "పెగసస్" సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించినట్లు తెలిసింది. ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ జాతీయ భద్రతా ప్రమాదాలను ఎదుర్కోవడానికి దేశాల కోసం ఈ సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసింది. ఇది మనదేశలో కూడా పెగాసస్ పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొహమ్మద్.. తన మాజీ భార్య, జోర్డాన్ రాజు అబ్దుల్లా సోదరి ప్రిన్సెస్ హయా బింట్ అల్-హుస్సేన్‌తో పాటు ఆమెకు సన్నిహితంగా ఉన్న వారి ఫోన్లను హ్యాక్ చేయడానికి పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకున్నట్లు తెలిసింది (చదవండి: మేఘాలకే షాకిచ్చి.. వానలు కురిపించి..) మొహమ్మద్ కోసం పనిచేస్తున్న వారు బ్రిటిష్ రాజధాని సమీపంలోని హయా ఎస్టేట్‌కి ప్రక్కనే ఒక భవంతిని కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ చర్యలను ఇంగ్లండ్ కోర్టు తప్పుపట్టింది. హయాను వెంటాడే ఈ చర్యల వల్ల ఆమె ఎంతో అసురక్షితంగా ఫీలవుతుందని.. ఊపిరి కూడా పీల్చుకోలేకపోతుంది అని కోర్టు అభిప్రాయపడింది. మొహమ్మద్ తన ఇద్దరు కుమార్తెలను అపహరించాడని, వారి పట్ల దురుసుగా ప్రవర్తించాడమే కాక వారి ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తించాడని కోర్టు నిర్ధారించిన 19 నెలల తర్వాత తాజాగా తీర్పులు వెల్లడించింది. ఈ సందర్భంగా "తాజాగా వెల్లడయిన అంశాలు విశ్వాసాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు స్పష్టం చేస్తున్నాయి" అని ఇంగ్లండ్, వేల్స్‌లోని కుటుంబ విభాగం అధ్యక్షుడు జడ్జి ఆండ్రూ మెక్‌ఫార్లేన్ తన తీర్పులో వెల్లడించారు. (చదవండి: ఒకప్పుడు ఇసుకతో ఎడారిగా.. ఇప్పుడు ప్రపంచంలోని అద్భుతాలకు.. ) మొహమ్మద్ షేక్ కోర్టు తీర్మానాలను తిరస్కరించారు, అవి అసంపూర్ణ వాస్తవాలపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. "నాపై చేసిన ఆరోపణలను నేను ఎప్పుడూ ఖండిస్తూనే ఉన్నాను.. ఇప్పుడు కూడా అదే చేస్తాను" అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కొన్నేళ్ల క్రితం హయా(47), తన ఇద్దరు పిల్లలు జలీలా(13), జాయెద్‌లను తీసుకుని బ్రిటన్ పారిపోయారు. అప్పటి నుంచి పిల్లల కస్టడీకి సంబంధించి మొహమ్మద్, హయాల మధ్య సుదీర్ఘమైన, ఖరీదైన న్యాయపోరాటం జరుగుతుంది. అంతేకాక హయా తన బ్రిటిష్ అంగరక్షకులలో ఒకరితో సంబంధం కలిగి ఉందనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. హ్యాకింగ్‌కు గురి అయిన వారిలో హయా తరఫు న్యాయవాది ఫియోనా షాక్లెటన్ కూడా ఉన్నారు. గత ఏడాది ఆగస్టులో హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. (చదవండి: బాడీగార్డ్‌తో సంబంధం.. రూ. 9 కోట్లు చెల్లించిన ప్రిన్సెస్) హ్యాకింగ్ వార్తలు వెలుగు చూసిన తర్వాత పెగసస్‌ను దుర్వినియోగం చేసినట్లు ఆధారాలు లభించినట్లయితే తాము చర్యలు తీసుకుంటామని.. యూఏఈతో తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని ఎన్ఎస్ఓ వెల్లడించినట్లు హయా తరఫు న్యాయవాది తెలిపారు. ఈ విషయంపై ఎన్ఎస్ఓ స్పందించలేదు. చదవండి: ప్రపంచమే హాయిగా నిద్రపోతోంది -
ఘరానా దొంగకే చీఫ్ సెక్యూరిటీ జాబ్!
డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కి గట్టి దెబ్బ కొట్టిన వైట్ హ్యాట్ మరో సంచలనం సృష్టించాడు. ఏ చోటైతే 12 వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టాడో.. తిరిగి అదే సంస్థ నుంచి చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫీసర్ జాబ్ సంపాదించాడు. దోపిడి చేసిన వాడికి దండన విధించే అవకాశం ఇవ్వకుండా అతని మెడలో దండలు వేయాలని ఆ కంపెనీ ఎందుకు అనుకుంటోంది. దానికి గల కారణమేంటీ ? సాక్షి, వెబ్‌డెస్క్: డీసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే పాలిగాన్ డిఫై యాప్ గత వారం హ్యాకింగ్‌కు గురైంది. ఈ యాప్‌లో లావాదేవీలు నిర్వహిస్తున్న క్రిప్టో కరెన్సీ భారీ ఎత్తున దోపిడి అయ్యింది. పాలినెట్‌వర్క్ నుంచి ఈథేరమ్‌కి సంబంధించి 273 మిలియన్ టోకెన్లు, బినాన్స్ స్మార్ట్ చైయిన్‌కి సంబంధించి 253 మిలియన్ల టోకెన్లు, 85 మిలియన్ల యూఎస్ డాలర్ కాయిన్లు, 33 మిలియన్ల విలువైన స్టేబుల్ కాయిన్లను స్వాహా అయ్యాయి. మొత్తంగా 611 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని హ్యాకర్ తస్కరించారు. ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలకు సమానం. మంచిదొంగ బ్లాక్ చెయిన్ టెక్నాలజీని క్రాక్ చేసి క్రిప్టో కరెన్సీ కొట్టేసిన హ్యాకర్‌కి పాలినెట్‌వర్క్ టీమ్ లేఖ రాసింది. దోచేసిన సొత్తును తిరిగి ఇచ్చేయ్సాలిందిగా విజ్ఞప్తి చేసింది. దీనికి స్పందించిన హ్యాకర్ మరుసటి రోజే హ్యాకర్ సానుకూలంగా స్పందించి కొట్టేసిన సొత్తులో 260 మిలియన్ డాలర్లు జమ చేశారు. ఇందులో ఈథేరియమ్ 3.3 మిలియన్ డాలర్లు, బినాన్స్ స్మార్ట్ కాయిన్లు 256 మిలియన్లు, పాలిగాన్ 1 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని పాలినెట్‌వర్క్ డిఫై యాప్‌లో జమ చేశాడు. దీంతో అప్పటి నుంచి ఈ హ్యాకర్ని వైట్హ్యాట్గా పేర్కొటోంది బాధిత పాలినెట్ వర్క్. వైట్‌హ్యాట్ సాధారణంగా హ్యాకర్లు ఎవరో, ఎలా ఉంటారో తెలియదు. హ్యాకర్లను సూచించేందుకు నల్లటోపీ లేదా హుడీ క్యాప్ ధరించి ముఖం సరిగా కనిపించని వ్యక్తి ఇమేజ్‌ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాలక్రమేనా హ్యాకర్లకు బ్లాక్‌హ్యాట్ పేరు స్థిరపడిపోయింది. అయితే ఇందులో బాధితుల మేలు కోరి హ్యాక్ చేసే వారు కూడా ఉంటారు. వీరిని ఎథికల్ హ్యాకర్లుగా పేర్కొంటారు. ఏదైనా సంస్థకు సంబంధించి సైబర్ సెక్యూరిటీలో లోపాలను బయటపెట్టేందుకు వీరు హ్యాక్ చేస్తుంటారు. వీరిని వైట్ హ్యాట్గా పేర్కొనడం రివాజుగా మారింది. సెక్యూరిటీ చీఫ్ ప్రస్తుతం పాలినెట్వర్క్ని హ్యాక్ చేసింది ఒక్కరా లేక కొంత మంది హ్యకర్ల గ్రూపా అనే అంశంపై స్పష్టత లేదు. ఐనప్పటికీ వైట్హ్యాట్ను ఒక్కరిగానే గుర్తిస్తూ పాలినెట్ వర్క్ కబురు పంపింది. మీరు హ్యాక్ చేయడం వల్ల మా డిఫై యాప్‌లోని లోపాలు తెలిశాయి. మీలాంటి నిపుణుల అవసరం మాకు ఉంది. కాబట్టి పాలినెట్వర్క్కి చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా సేవలు అందివ్వాలని కోరింది. అంతేకాదు హ్యాక్ చేసిన సొమ్ములో ఐదు మిలియన్ డాలర్లను మీ ఖర్చు కోసం అట్టే పెట్టుకుని హ్యాక్ చేసిన క్రిప్టో కరెన్సీలో మిగిలిన దాన్ని తిరిగి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. #PolyNetwork has no intention of holding #mrwhitehat legally responsible and cordially invites him to be our Chief Security Advisor. $500,000 bounty is on the way. Whatever #mrwhitehat chooses to do with the bounty in the end, we have no objections. https://t.co/4IaZvyWRGz — Poly Network (@PolyNetwork2) August 17, 2021 ఇది ఎత్తుగడా? వైట్హ్యాట్కి పాలినెట్‌వర్క్ చేసిన విజ్ఞప్తిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొద్ది మంది పాలినెట్ చర్యను స్వాగతిస్తుండగా మరికొందరు హ్యాక్ అయిన సొమ్మను రాబట్టుకునేందుకు పాలినెట్‌వర్క్ వేసిన ఎత్తుగడగా పరిగణిస్తున్నారు. మరికొందరు హ్యాక్ చేసిన సొమ్ము వందల మిలియన్ డాలర్లు ఉండగా హ్యాకర్‌కు జాబ్‌తో పనేంటి అంటూ స్పందిస్తున్నారు. డీఫై యాప్ సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి, వాటి పైన సెంట్రల్ బ్యాంకులు అజమాయిషీ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలు, రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తాయి, ఇక డీఫై అంటే డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని అర్థం. అంటే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, మధ్యవర్తులు లేకుండా జరిగే ఆర్థిక వ్యవహరాలు. ఇందులో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర అని పనులు నిర్వహిస్తారు. అయితే ఇందులో మారకంగా క్రిప్టోకరెన్నీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్ చెయిన్ అనే ఆర్టిఫీయల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్‌లను డీయాప్ అంటే డీ సెంట్రలైజ్డ్ యాప్ అని అంటారు. ఇలా పని చేసే పాలినెట్‌వర్క్ డీఫై యాప్ హ్యాకింగ్‌కి గురైంది. -
అభ్యంతకర మెసేజ్‌లు..పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ యాంకర్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ యాంకర్, నటి గాయత్రి భార్గవి ఫేస్బుక్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. దీంతో వెంటనే ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. గుర్తు తెలియని దుండగులు తన ఫేస్బుక్ పేజీని హ్యాక్ చేసి వివిధ మతాలకు సంబంధించి అభ్యంతకరమైన పోస్టులు చేస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ అంశంపై మాట్లాడిన ఏసీపీ కె. వి. ఎం. ప్రసాద్.. యాంకర్ భార్గవి ఎఫ్బీ అఫీషియల్ అకౌంట్‌తో పాటు మరో అకౌంట్‌ను దుండగులు ఆమె పేరు మీద క్రియేట్ చేసినట్లు గుర్తించామన్నారు. సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని, ఎప్పకప్పుడు పాస్ వర్డ్స్‌ను మార్చుకోవాలని సూచించారు. యాంకర్ భార్గవి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. View this post on Instagram A post shared by Gayatri Bhargavi (@gayatri_bhargavi) -
మంచి దొంగలు.. వీళ్లు చేసిన పనేంటో తెలుసా?
Hackers Returning Crypto: డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో అతి పెద్ద చోరీగా చెప్పుకుంటున్న పాలి నెట్వర్క్ హ్యాకింగ్ విషయంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఛేదించి క్షణాల్లో పన్నెండు వేల కోట్ల రూపాయల విలువైన క్రిప్టో కరెన్సీని కొట్టేసిన హ్యాకర్లు. ఆ తర్వాత ఎందుకనో మెత్తపడ్డారు. అందులో దాదాపు సగం సొమ్మును తిరిగి ఇచ్చేశారు. హ్యాకింగ్‌లో కొత్త రికార్డు పటిష్టమైన భద్రతా వ్యవస్థగా పేర్కొంటున్న బ్లాక్‌చైయిన్ ఫ్లాట్‌ఫామ్‌పై నడిచే డీఫై యాప్ పాలినెట్వర్క్ను ఇటీవల హ్యాక్ అయ్యింది. సైబర్ నేరగాళ్లు ఈ యాప్ నుంచి ఏకంగా 611 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 12 వేల కోట్ల రూపాయల విలువైన క్రిప్టో కరెన్సీని కొట్టేశారు. పాలినెట్‌వర్క్ నుంచి తమకు అనుకూలమైన ఖాతాలకు క్రిప్టో కరెన్సీని తరలించుకుపోయారు. క్షణాల్లో జరిగిన ఈ మెరుపు హ్యాకింగ్‌తో బిత్తరపోయిన పాలి నెట్వర్క ఆ తర్వాత తేరుకుంది. కొన్ని వేల మందికి సంబంధించిన డిజిటల్ కరెన్సీని కొట్టేయడం సరికాదని... దయ ఉంచి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ హ్యాకర్లను సోషల్ మీడియా వేదికగా హ్యాకర్లను పాలిగాన్ నెట్వర్క్ కోరింది. $260 million (As of 11 Aug 04:18:39 PM +UTC) of assets had been returned: Ethereum: $3.3M BSC: $256M Polygon: $1M The remainings are $269M on Ethereum, $84M on Polygon — Poly Network (@PolyNetwork2) August 11, 2021 హ్యాకర్ల మంచి మనసు పాలిగాన్ నెట్వర్క్ చేసిన విజ్ఞప్తికి హ్యాకర్లు స్పందించారు. తాము దారి మళ్లించిన సొత్తులో కొంత భాగాన్ని పాలి నెట్వర్క్ సూచించిన ఖాతాలో జమ చేశారు. కొట్టేసిన సొత్తులో 260 మిలియన్ డాలర్లు జమ చేశారు. ఇందులో ఈథేరియమ్ 3.3 మిలియన్ డాలర్లు, బినాన్స్ స్మార్ట్ కాయిన్లు 256 మిలియన్లు, పాలిగాన్ 1 మిలియన్ డాలర్లు ఉన్నాయంటూ పాలినెట్ వర్క్ ప్రకటించింది. హ్యాకర్లు విడదల వారీగా సొమ్మును పాలిగాన్ నెట్వర్క్కి తిరిగి బదిలీ చేస్తున్నారు. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి, వాటి పైన సెంట్రల్ బ్యాంకులు అజమాయిషీ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలు, రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తాయి, ఇక డీఫై అంటే డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని అర్థం. అంటే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, మధ్యవర్తులు లేకుండా జరిగే ఆర్థిక వ్యవహరాలు. ఇందులో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర అని పనులు నిర్వహిస్తారు. అయితే ఇందులో మారకంగా క్రిప్టోకరెన్నీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్ చెయిన్ అనే ఆర్టిఫీయల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్‌లను డీయాప్ అంటే డీ సెంట్రలైజ్డ్ యాప్ అని అంటారు. ఇలా పని చేసే పాలినెట్‌వర్క్ డీఫై యాప్ హ్యాకింగ్‌కి గురైంది. -
చరిత్రలో అతిపెద్ద హ్యాకింగ్.. పన్నెండు వేల కోట్లు హాంఫట్!
డీసెంట్రలైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కి భారీ షాక్ తగిలింది. సరికొత్త ట్రేడింగ్‌గా ట్రెండ్ అవుతోన్న క్రిప్టోకరెన్సీ వ్యవస్థ కుదుపుకు లోనైంది. పటిష్టమైన భద్రతా వ్యవస్థగా చెప్పుకుంటున్న బ్లాక్‌చైయిన్‌ను హ్యాకర్లు చేధించారు. చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టారు. 12 వేల కోట్లు పాలిగాన్ బ్లాక్‌చైయిన్ టెక్నాలజీపై హ్యాకర్లు దాడి చేశారు. కళ్లు మూసి తెరిచే లోగా వేల కోట్ల రూపాయల విలువ చేసే డిజిటల్ కరెన్సీని దోచుకున్నారు. డీసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే పాలినెట్‌వర్క్ యాప్‌ను హ్యాక్ చేశారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పాలినెట్‌వర్క్ నుంచి ఈథేరమ్‌కి సంబంధించి 273 మిలియన్ టోకెన్లు, బినాన్స్ స్మార్ట్ చైయిన్‌కి సంబంధించి 253 మిలియన్ల టోకెన్లు, 85 మిలియన్ల యూఎస్ డాలర్ కాయిన్లు, 33 మిలియన్ల విలువైన స్టేబుల్ కాయిన్లను స్వాహా చేశారు. మొత్తంగా 611 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని తస్కరించారు. ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలకు సమానం. తిరిగి ఇచ్చేయండి బ్లాక్ చెయిన్ టెక్నాలజీని క్రాక్ చేసి క్రిప్టో కరెన్సీ కొట్టేసిన హ్యాకర్లకు డీఫై యాప్ అయిన పాలినెట్‌వర్క్ టీమ్ లేఖ రాసింది. ఇందులో హ్యాకింగ్‌లో దోచేసిన సొత్తును తిరిగి ఇచ్చేయ్సాలిందిగా విజ్ఞప్తి చేసింది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ వ్యవస్థకు సంబంధించి మీరు కొట్టేసిన డబ్బు అతి పెద్దదని పేర్కొంది. ఇంత పెద్ద ఆర్థిక నేరాలకు పాల్పిడన వారు తర్వాత పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మీరు కొట్టేసిన సొమ్మును తిరిగి వినియోంచుకోలేరని సూచించింది. డీఫై యాప్ సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి, వాటి పైన సెంట్రల్ బ్యాంకులు అజమాయిషీ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలు, రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తాయి, ఇక డీఫై అంటే డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని అర్థం. అంటే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, మధ్యవర్తులు లేకుండా జరిగే ఆర్థిక వ్యవహరాలు. ఇందులో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర అని పనులు నిర్వహిస్తారు. అయితే ఇందులో మారకంగా క్రిప్టోకరెన్నీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్ చెయిన్ అనే ఆర్టిఫీయల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్‌లను డీయాప్ అంటే డీ సెంట్రలైజ్డ్ యాప్ అని అంటారు. ఇలా పని చేసే పాలినెట్‌వర్క్ డీఫై యాప్ హ్యాకింగ్‌కి గురైంది. భిన్నాభిప్రాయాలు పాలినెట్‌వర్క్ హ్యాకింగ్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇటువంటి ఆర్థిక నేరాలను అరికట్టేందుకే రూల్స్, రెగ్యులేషన్స్ ఏర్పాటు చేశారని, వాటని కాదని ముందుకు వెళితే ఇలాగే జరగుతుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు బ్లాక్ చైయిన్ టెక్నాలజీని క్రాక్ చేయడం అంత ఈజీ కాదని, హ్యాకర్ల మేథస్సు హ్యాట్సాఫ్ అంటున్నారు. ఇక హ్యాక్ చేసిన క్రిప్టో కరెన్సీతో పెద్దగా ప్రయోజనం ఉండదని ఇంకొందరి అభిప్రాయంగా వ్యక్తమైంది. హ్యాక్ చేసిన సొమ్ము తిరిగి ఇచ్చేస్తే... హ్యాకర్లను శిక్షించకుండా ఉద్యోగం ఇవ్వాలన్న వారూ ఉన్నారు. Hope you will transfer assets to addresses below: ETH: 0x71Fb9dB587F6d47Ac8192Cd76110E05B8fd2142f BSC: 0xEEBb0c4a5017bEd8079B88F35528eF2c722b31fc Polygon: 0xA4b291Ed1220310d3120f515B5B7AccaecD66F17 pic.twitter.com/mKlBQU4a1B — Poly Network (@PolyNetwork2) August 11, 2021 -
సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లపైనా ‘నిఘా’
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్‌తో నిఘా పెట్టిన వారి జాబితాలో ఇద్దరు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు కూడా ఉన్నారని ‘ది వైర్’ న్యూస్ పోర్టల్ బుధవారం వెల్లడించింది. సుప్రీంకోర్టు జడ్జి వాడిన పాత ఫోన్ నంబరు కూడా దీంట్లో ఉందని తెలిపింది. రిజిస్ట్రార్లు ఎన్కే గాంధీ, టీఐ రాజ్‌పుత్‌లు సుప్రీంకోర్టులోని ‘రిట్’ విభాగంలో పనిచేసినపుడు.. 2019లో వీరి ఫోన్లపై నిఘా పెట్టారు. ప్రతి ఏడాది దాదాపు వెయ్యికి పైగా రిట్ పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అవుతాయని, వీటిలో ప్రభుత్వానికి ఇబ్బందికరమైనవి, రాజకీయంగా సున్నితమైన అంశాలకు సంబంధించినవి కూడా ఉంటాయని వైర్ పేర్కొంది. అందువల్లే రిజిస్ట్రార్లపై కన్నేసి ఉంచారని వివరించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా వాడిన పాత ఫోన్ నంబరు కూడా నిఘా జాబితాలో ఉంది. సదరు ఫోన్ నంబరు 2014లోనే వాడటం ఆపేశానని అరుణ్ మిశ్రా తెలిపారు. అయితే 2018 దాకా ఇది ఆయన పేరుపైనే ఉందని వైర్ తెలిపింది. జస్టిస్ అరుణ్ మిశ్రా పాత ఫోన్ నంబరును 2019లో నిఘా జాబితాలో చేర్చారు. ఆయన 2020లో రిటైరయ్యారు. మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సన్నిహితుడు, ఆయన దగ్గర పనిచేసే జూనియర్ ఎం.తంగదురై ఫోన్‌పైనా నిఘా పెట్టారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థ తయారుచేసిన పెగసస్ స్పైవేర్‌తో విపక్ష నాయకులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు, జర్నలిస్టులపై (మొత్తం 300 మందిపై) కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందని తమ పరిశోధనలో తేలిందని అంతర్జాతీయ మీడియా సంస్థల కన్సార్టియం వెల్లడించినప్పటి నుంచి భారత్‌లో దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. రాహుల్‌గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఇద్దరు కేంద్రమంత్రులు, మాజీ ఎన్నికల కమిషనర్, 40 మంది పాత్రికేయుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని తెలిపింది. ప్రభుత్వాలకు మాత్రమే తాము పెగసస్ స్పైవేర్‌ను అమ్ముతామని ఎన్ఎస్ఓ ప్రకటించింది. చట్ట విరుద్ధంగా ఎవరిపైనా నిఘా పెట్టలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా... అంటే దానర్థం ఈ నిఘా సాఫ్ట్వేర్ భారత ప్రభుత్వం వద్ద ఉన్నట్లు, దాన్ని వాడుతున్నట్లు అంగీకరించడమేనని విపక్షాలు అంటున్నాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన జూలై 19 నుంచి పెగసస్ అంశంపై పార్లమెంటును ప్రతిపక్షాలు స్తంభింపజేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో విస్పష్ట ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. -
పెగసస్ ఆరోపణలు నిరాధారం: నడ్డా
పణజి: పెగసస్ స్పైవేర్ అంటూ వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించి లేవనెత్తే అంశా లేవీ లేకనే ప్రతిపక్షాలు ఇటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నాయని విమర్శించారు. పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తుతున్న అంశాలు నిరాశాపూరితాలు, అవి అసలు అంశాలే కావని పేర్కొన్నారు. ఏం చేయాలో తెలియకనే, పార్లమెంట్లో ఇలా అవాంతరాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తు న్నాయని చెప్పారు. అన్ని విషయాలపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆదివారం గోవాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలతలో పార్లమెంట్ సమావేశాలు గత రికార్డులను తుడిచిపెట్టాయని చెప్పారు. ప్రధాని ప్రకటన చేయాలి: చిదంబరం పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై ప్రధాని మోదీ పార్లమెంట్లో ఒక ప్రకటన చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం డిమాండ్ చేశారు. హ్యాకింగ్ ఆరోపణలపై ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయించాలి లేదా దీనిపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని నియమించాలన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ విజయానికి పెగసస్ స్నూపింగ్ కూడా సాయపడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. -
ప్రపంచమే హాయిగా నిద్రపోతోంది
జెరూసలేం: పెగసస్ స్పైవేర్ వివాదస్పదం కావడంతో ఆ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన ఇజ్రాయెల్‌కు చెందిన కంపెనీ ఎన్ఎస్ఒ గ్రూపు దానిని పూర్తిగా సమర్థించింది. ఇలాంటి నిఘా సాఫ్ట్వేర్లు ఇంటెలిజెన్స్, పోలీసుల చేతుల్లో ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హాయిగా నిద్రపోతున్నారని, రాత్రి వేళల్లో నిర్భయంగా రోడ్లపై తిరుగుతున్నారని పేర్కొంది. ఒక్కసారి ప్రభుత్వ సంస్థలకి ఆ టెక్నాలజీని విక్రయించిన తర్వాత దానిని తాము ఆపరేట్ చేయబోమని, అంతేకాదు తమ క్లయింట్లు సేకరించిన డేటాతో తమకు యాక్సెస్ కూడా ఉండదని ఆ సంస్థ స్పష్టం చేసింది. భారత్ సహా ప్రపంచంలోని వివిధ దేశాల ప్రభుత్వాలు పెగసస్ ద్వారా రాజకీయ నేతలు, మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేసి నిఘా పెట్టారని మీడియాలో కథనాలు వచ్చి ఈ మొత్తం వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఎన్ఎస్ఒ గ్రూపు స్పందించింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హాయిగా రాత్రిళ్లు నిద్రపోతున్నారంటే, పూర్తి స్థాయి రక్షణ కవచం మధ్య రాత్రిళ్లు రోడ్లపై తిరుగుతున్నారంటే పెగసస్ వంటి సాంకేతిక పరిజ్ఞానానికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. నేరాలు–ఘోరాలు, ఉగ్రవాద కార్యకలాపాలు వంటివి నిరోధించడంలో భద్రతా వ్యవస్థకి ఇలాంటి సాఫ్ట్వేర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి’’ అని ఆ కంపెనీ అధికారి ప్రతినిధి పేర్కొన్నారు. ప్రపంచం మరింత సురక్షితంగా, ఉగ్రవాదం బెడద లేకుండా భద్రంగా ఉండడానికే తాము పెగసస్ వంటి స్పైవేర్లు రూపొందిస్తున్నామని చెప్పారు. ఎందరో ఉగ్రవాదుల కుట్రల్ని భగ్నం చేయడానికి ఉపయోగపడిన ఈ సాఫ్ట్‌వేర్‌ని దుర్వినియోగం చేయడం సరైన పని కాదని ఆ సంస్థ పేర్కొంది. పౌర సమాజంపై నిఘా ఆందోళనకరం: అమెరికా పౌరసమాజంపైనా, ప్రభుత్వాన్ని విమర్శించే వారిపైన పెగసస్ వంటి నిఘా సాఫ్ట్వేర్లు ప్రయోగించడం అత్యంత ఆందోళన కలిగించే అంశమని అమెరికా అభిప్రాయపడింది. మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, విపక్ష నేతలు, సమాజంలోని ఇతరుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. భారత్‌లో మొత్తం 300 ఫోన్ నంబర్లని ట్యాప్ చేయడానికి పెగసస్‌ని వాడారని, వీరిలో జర్నలిస్టులు, విపక్ష నాయకులు, సిట్టింగ్ న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక కార్యకర్తలు ఉన్నట్టుగా అంతర్జాతీయ మీడియా ప్రసారం చేసిన కథనాలపై అమెరికా సౌత్ అండ్ సెంట్రల్ ఆసియన్ అఫైర్స్ తాత్కాలిక సహాయమంత్రి డీన్ థాంప్సన్ స్పందించారు. ఇదంతా భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు. -
మైక్రోసాఫ్ట్ ఎక్చేంజ్ హ్యాకింగ్ చైనా పనే!
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ ఎక్చేంజ్ ఈమెయిల్ సర్వర్ హ్యాకింగ్‌లో చైనా పాత్ర ఉందని అగ్రరాజ్యం ఆరోపించింది. ఈ సర్వర్ హ్యాకింగ్‌తో ప్రపంచంలోని పలు కంప్యూటర్లలో సమాచార భద్రతపై అనుమానాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే! ఇలాంటి సైబర్ బెదిరింపులకు బీజింగ్ మూలస్థానమని, అక్కడ నుంచి పలువురు ప్రభుత్వ మద్దతున్న హ్యాకర్లు ప్రముఖ కంపెనీల సైట్లను హ్యాక్ చేసి భారీగా డబ్బులు డిమాండ్ చేశారని బైడెన్ ప్రభుత్వం, అమెరికా మిత్రదేశాలు ఆరోపిస్తున్నాయి. చైనా స్టేట్ సెక్యూరిటీ మంత్రి ఇలాంటి క్రిమినల్ కాంట్రాక్ట్ హ్యాకర్లను వాడుతున్నాడని, వీరు హ్యాకింగ్, హైటెక్ దొంగతనాల్లాంటివి చేస్తున్నారని బైడెన్ ప్రభుత్వంలో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు చైనాకు చెందిన నలుగురిపై అమెరికా న్యాయశాఖ హ్యాకింగ్‌కు సంబంధించిన ఆరోపణలపై కేసులు పెట్టింది. వీరంతా పలు యూనివర్సిటీలు, కంపెనీలు, ప్రభుత్వ సంస్థల కంప్యూటర్ వ్యవస్థల్లోకి అక్రమంగా చొరబడ్డారని ఆరోపించింది. ఒకపక్క రష్యాకు చెందిన సిండికేట్లు అమెరికా మౌలిక సదుపాయాలపై సైబర్ దాడులు చేస్తున్న తరుణంలో మరోవైపు చైనా నుంచి ఇలాంటి దాడులు ఎదురుకావడం బైడెన్ ప్రభుత్వానికి గడ్డు సమస్యగా మారింది. ప్రస్తుత ఆరోపణలతో చైనాపై ఎలాంటి ఆంక్షలు పెట్టకున్నా, చైనా దౌత్య అధికారులను పిలిచి ఈ విషయమై సీరియస్‌గా హెచ్చరించినట్లు తెలిసింది. ఈయూ, బ్రిటన్ సైతం పలు ప్రభుత్వ సంస్థలు, రాజకీయ పార్టీలు, కీలక పరిశ్రమల సైట్లపై చైనా హ్యాకర్లే దాడి చేస్తున్నారని యూరోపియన్ యూనియన్, బ్రిటన్ సైతం ఆరోపిస్తున్నాయి. చైనా గ్రూపులు ఫిన్లాండ్ పార్లమెంట్ సహా పలు కీలక సంస్థలపై గురిపెట్టారని యూకే నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ తెలిపింది. చైనా భూభాగం నుంచే ఈ దాడులు జరుగుతున్నాయని, మేథోహక్కుల దోపిడికి హ్యాకర్లు పాల్పడుతున్నారని ఈయూ ప్రతినిధి జోసెఫ్ బొర్రెల్ చెప్పారు. మైక్రోసాఫ్ట్ ఎక్చేంజ్ సైబర్ అటాక్ చైనా దన్నున్న గ్రూపుల పనేనని యూకే ఫారిన్ సెక్రటరీ డొమినిక్ రాబ్ ఆరోపించారు. నిజానికి ఇలాంటి సీరియస్ దాడులకు రష్యా క్రిమినల్ గ్రూపులు పెట్టింది పేరు. పలుమార్లు రష్యా ఇంటిలిజెన్స్ సంస్థలకు, హ్యాకర్ గ్రూపులకు సంబంధాలు బయటపడుతూనే ఉన్నాయి. అయితే క్రిమినల్ కాంట్రాక్ట్ హ్యాకర్లను చైనా ప్రభుత్వం నేరుగా వాడుకోవడం ఇటీవలి కాలంలో ముఖ్య పరిణామమని అధికారులు చెప్పారు. జనవరిలో మైక్రోసాఫ్ట్ ఎక్చేంజ్ హ్యాకింగ్‌ను కనిపెట్టారు. ఈ విషయమై ఎఫ్‌బీఐ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, ఇన్ఫ్రా సెక్యూరిటీ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇతర దేశాలు చైనా దుశ్చర్యలను ఖండించేందుకు బైడెన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ఆరోపణలన్నింటినీ చైనా కొట్టిపారేస్తోంది. ఆధారాల్లేకుండా ఆరోపణలు వద్దని హెచ్చరించింది. -
అయిదు సార్లు ఫోన్లు మార్చా..అయినా వదల్లే: పీకే
సాక్షి, న్యూఢిల్లీ: పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలు అటు లోక్సభలోకూడా తీవ్ర దుమారాన్ని రాజేసాయి. తాజాగా ఈ సెగ రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్‌ను కూడా తాకింది. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయిదుసార్లు తాను ఫోన్లు మార్చానని, అయినా ఇప్పటికీ హ్యాకింగ్ కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు. ఇజ్రాయెల్ స్పైవేర్ 'పెగసాస్' టార్గెట్ చేసిన ప్రముఖుల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా ఉండటం గమనార్హం. ది వైర్ నివేదిక ప్రకారం ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ ఫోన్‌ను కేంద్రం హ్యాక్ చేసింది. ఫోరెన్సిక్ విశ్లేషణ ప్రకారం 2018 నుంచి 2019 ఎన్నికల ముందు వరకు ప్రశాంత్ కిషోర్ ఫోన్‌ను ట్యాప్ చేశారని, అలాగే జూలై 14 చివరిసారి ట్యాప్ అయినట్టు తెలుస్తోంది. ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్ ద్వారా దేశీయంగా ప్రముఖుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని ఆరోపణలు గుప్పుమున్నాయి.ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 300 మంది భారతీయుల ఫోన్లను ట్యాపింగ్ చేయగా, ఇందులో 40 మంది ప్రముఖ జర్నలిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా హ్యాకర్లు టార్గెట్ చేసినట్లు సమాచారం. వైష్ణవ్ ఆయన భార్య పేరుతో రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్ల చివరి అంకెలు బహిర్గతమైన రికార్డుల్లో కన్పిస్తున్నాయని వైర్ తెలిపింది. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోనే బీజేపీ అధికారం చేపట్టేందుకు ప్రచార వ్యూహకర్తగా కిశోర్ కీలక పాత్ర పోషించారు. అయితే ఆ తరువాత బీజేపీ వ్యతిరేక పార్టీలకే పనిచేస్తూ వచ్చారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ భారీ మెజార్టీతో విజయం సాధించడంలో పీకే కృషి చాలా ఉంది. కాగా ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ సంచలనంగా మారింది. కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు జడ్జిలు, ఆర్ఎస్ఎస్ నేతలు,జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్‌పై సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఎన్ఎస్ఓ గ్రూప్, పెగాసస్ మాలావేర్ క్లయింట్ల జాబితాలో ఉన్న పది దేశాలలో భారతదేశం ఒకటి -
సేవింగ్స్ అకౌంట్ నుంచి రూ.94 లక్షలు మాయం.. ట్విస్ట్ ఏంటంటే..
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): అకౌంట్లను హ్యాక్ చేసి రూ.94.72 లక్షలను దోచిన అంతర్జాతీయ ముఠాకు చెందిన ముగ్గురిని బెళగావి జిల్లా సదలగా పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో ఉండే నైజీరియా వాసి ఉజకా పీటర్‌గోజి(40), మహారాష్ట్రవాసులు హరిశంకర పాండే (28), అభిజిత్ ఘనశ్యామ్ మిశ్రా(27)లను అరెస్ట్ చేశారు. బెళగావి జిల్లా నిప్పాణి తాలూకా బోరగాం అరిహంత సహకార బ్యాంక్‌కు చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలను ఈ ముఠా మే 28న డ్రా చేసింది. జూన్ 3న శమనెవాడిలోని అరిహంత సహకార బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతాలో ఉన్న రూ.79 లక్షలకు పైగా నగదును బదిలీ చేసుకుంది. భారీగా డబ్బులు మాయం కావడంపై బ్యాంక్ మేనేజర్ అశోక సదలగా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తుచేసి ముంబైలో మోసగాళ్లను పట్టుకున్నారు. చదవండి: దావణగెరెలో మిస్సి కాటు బాలిక మృత్యువాత -
పార్లమెంట్ సభ్యుల ఈమెయిల్ ఖాతాలపై సైబర్ దాడి..!
వార్సా: పోలాండ్ పై భారీఎత్తున సైబర్ దాడి జరిగింది. ఏకంగా పార్లమెంట్ సభ్యుల ఈ మెయిల్ ఖాతాలు హ్యాకింగ్ కు గురయ్యాయి. సుమారు పన్నెండు మంది ఎంపీల ఈమెయిల్ ఖాతాలపై హ్యాకర్లు విరుచుకుపడ్డారు. ఎంపీల ఖాతాలు హ్యాకింగ్ కు గురైనట్లు పోలాండ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారించారు.. హ్యాకింగ్ కు గురైన వారి ఖాతాలో ఆ దేశ ప్రధానమంత్రి ముఖ్య సలహాదారు మిచల్ దోర్జిక్ ఖాతా కూడా వుంది. పోలాండ్ కు సంబందించిన రహస్య పత్రాలను హ్యాకర్లు తస్కరించరని ఇంటెలిజెన్స్ ఆధికారులు తెలిపారు. యూఎన్సీ 1151 అని పిలవబడే హ్యాకర్లు దాడి చేశారని పోలాండ్ ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశారు. -
వాట్సాప్ వార్నింగ్.. ఈ యాప్ వాడితే మీ అకౌంట్ బ్లాక్
ప్రపంచ వ్యాప్తంగా మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి ఫోన్ లో వాట్సాప్ యాప్ ఉండాల్సిందే. దీనికి పెరుగుతున్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని చాలా ఫేక్ యాప్స్ పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా వాట్సాప్ లో లేని కొన్ని ఫీచర్స్ అందిస్తూ జీబీ వాట్సాప్ వేగంగా ముందుకు వచ్చింది. దీనిలో వాట్సాప్ యాప్ లో లేని అనేక ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలో తీసుకొచ్చిన ప్రైవసీ రూల్స్ కారణంగా జీబీ వాట్సాప్ విపరీతంగా పెరగిపోయింది. సులభంగా వాట్సాప్ స్టేటస్ డౌన్ లోడ్ చేసుకోవడం వంటివి. మీరు కనుక ఈ థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేస్తే అన్ఇన్స్టాల్ చేయమన్న చేయలేరు. వాట్సాప్ యాప్ లో లేని అద్భుతమైన అనేక ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారిని వాట్సాప్ హెచ్చరించింది. ఈ యాప్ వల్ల సెక్యూరిటీ పరంగా అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ జీబీ వాట్సాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో గానీ, ఇతర ఆండ్రాయిడ్ యాప్ స్టోర్లలోగానీ దొరకదు. అందువల్ల, ఈ యాప్ ద్వారా మీ డేటాకు సెక్యూరిటీ ఉండదని మీ వాట్సాప్ ఖాతా హ్యాక్ అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకున్న వారి ఒరిజినల్ వాట్సాప్ ఖాతాను బ్లాక్ చేసే అవకాశం ఉంది. అందువల్ల, మీ మొబైల్లో జీబీ వాట్సాప్ యాప్ ఉంటే వెంటనే దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకోండి. చదవండి: జూలై 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఇవే! -
Cyber Crime: ఇదంతా చేసింది కొడుకే అని తెలిసి..
వాణీ, రఘురామ్ (పేర్లు మార్చడమైనది) దంపతులు. ఇద్దరూ ఉద్యోగస్థులు. ఇద్దరికీ అయిదంకెల జీతం. ఒక్కగానొక్క కొడుకు. చింతల్లేని చిన్నకుటుంబం. నెలవారీ క్రెడిట్ కార్డ్ బిల్లు చూడగానే గుండెల్లో రాయిపడినట్టు అయ్యింది వాణీకి. తనకున్న రెండు ఖాతాల క్రెడిట్, డెబిట్ కార్డుల నుంచి ఐదు లక్షల పై చిలుకు బిల్లు చూసేసరికి షాక్ అయ్యింది. భర్త రఘురామ్‌కి ఈ విషయం చెప్పింది. సందేహం వచ్చిన రఘురామ్ తన క్రెడిట్, డెబిట్ కార్డు బిల్లులు చెక్ చేశాడు. ఆరు లక్షలపైనే ఖర్చు చేసినట్టుగా తన బ్యాంకు ఖాతాలు చూపించాయి. ఆన్లైన్లో అకౌంట్ తనిఖీ చేస్తే ఏవేవో సైట్లకు డబ్బు బదిలీ చేసినట్టుగా ఉంది. ఇద్దరికీ ఏం చేయాలో అర్ధం కాలేదు. తమ అకౌంట్ హ్యాక్ అయ్యిందని మాత్రం అర్థం అయ్యింది. వెంటనే సైబర్ క్రైమ్‌ను సంప్రదించారు. ఓటీపీ డెలిట్ విషయం తెలిసి వాణీ రఘురామ్‌లు ఆశ్చర్యపోయారు. స్మార్ట్‌ఫోన్ తమ జీవితాల్లో నింపుతున్న అల్లకల్లోలాన్ని తెలుసుకున్నారు. వాణీ రఘురామ్ల ఏకైక పుత్రుడు విక్రాంత్ (పేరుమార్చడమైనది) టెన్త్ క్లాసు చదువుతున్నాడు. వీడియో గేమ్స్ అంటే పిచ్చి. తమ ఫోన్లలో గేమ్స్ ఆడుతుంటే విసుగనిపించి, కొడుక్కి ఓ స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. ప్రతీనెలా పాకెట్ మనీ కింద కొడుకుకి నాలుగు వేల రూపాయలు ఇచ్చేవారు. విక్రాంత్ ఆ డబ్బు పెట్టి, ఆన్లైమ్ గేమ్స్ కొనుగోలు చేసి మరీ ఆడుతుండేవాడు. వాణీ జాబ్ వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తడంతో ఆర్నెల్లుగా ఇంటి వద్దే ఉంటోంది. కొడుక్కి పాకెట్ మనీ ఇవ్వడం తగ్గించింది. ఏమైనా ఫుడ్ కావాలంటే ఇంటి వద్దే చేసి పెడుతున్నాను కదా! అనేది. దీంతో తల్లితండ్రుల నుంచి మనీ ఎలా దొంగిలించాలా అని రకరకాల ప్రయత్నించాడు. నగదు కాకుండా తనకు ఆన్లైన్ పేమెంట్ అవసరం. అందుకు తల్లి, తండ్రి బ్యాంక్ కార్డులపై నెంబర్లు నోట్ చేసుకున్నాడు. వారికి తెలియకుండా వారి అకౌంట్ నుంచి, తనకు కావల్సిన సైట్ల నుంచి గేమ్స్ కొనుగోలు చేసి, ఆడటం మొదలుపెట్టాడు. బ్యాంకు నుంచి ఓటీపీ వచ్చే సమయంలో ఫ్రెండ్స్‌తో మాట్లాడాలనో, మరో అబద్ధమో చెప్పి ఫోన్ తీసుకునేవాడు. మనీ ట్రాన్సాక్షన్ అయిన తర్వాత ఆ వివరాలను వెంటనే డిలీట్ చేసేవాడు. మొదట్లో తక్కువ మొత్తంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ గురించి పట్టించుకోని వాణీ, రఘురామ్‌లు ఆ తర్వాత నెలల్లో పెద్ద మొత్తంలో తేడా రావడంతో అకౌంట్స్ హ్యాక్ అయినట్టు గుర్తించారు. ఇదంతా చేసింది కొడుకే అని తెలిసి అయితే ఆ పని చేసింది తమ కొడుకే అని నిపుణుల ద్వారా తెలిసి ఆశ్చర్యపోయారు. గేమింగ్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కి ఎంతగా ఎడిక్ట్ అయ్యాడో తెలుసుకున్నారు. భవిష్యత్తు గురించి ఆలోచించి, నిపుణుల కౌన్సెలింగ్‌తో కొడుకులో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ వ్యసనం (డిఎస్ఎమ్) డయాగ్నోస్టిక్ – స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ జాబితాలో చేర్చలేదు. కానీ, మానసిక నిపుణులు మాత్రం దీనిని జూదం, మాదకద్రవ్య వ్యసనాలతో పోల్చారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం జరిపిన ఒక పరిశోధన లో స్మార్ట్‌ఫోన్‌కి ఎడిక్ట్ అయినవారిలో ఏదో కోల్పోతున్నామనే భయం, ఆందోళన, అసంతృప్తి, సామాజిక ఆందోళన, ఒత్తిడి వంటివి అధికంగా ఉంటాయని స్పష్టం అయింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని స్మార్ట్‌ఫోన్ ను అధికంగా వాడే పిల్లలను గమనింపుతో గైడెన్స్ చేయడం అవసరం. వ్యసనం వైపుగా అడుగులు సౌలభ్యం, ఉపయోగం, రకరకాల ఆసక్తుల కారణంగా స్మార్ట్‌ఫోన్ మనపై ఆధిపత్యం వహిస్తున్నాయన్నది తెలిసిందే. వేలి కొసలతో చేసే పదే పదే ‘క్లిక్’ లు వ్యసనం వైపు మరుల్చుతున్నాయి. ఇటీవల మనస్తత్వవేత్తలు, మానసిక వైద్యులు స్మార్ట్‌ఫోన్ వ్యసనం గురించి పదే పదే హెచ్చరిస్తున్నారు. ఈ వ్యసనం ఎంత దూరం వెళుతుందంటే తెలియకుండానే నేరం వైపుగా అడుగులు వేయిస్తుంది. విక్రాంత్‌ను గేమింగ్ యాప్స్ ఇలాగే ఆకర్షించాయి. తల్లీతండ్రీ తనకు ఇచ్చే పాకెట్‌మనీ సరిపోకపోవడంతో తనే ఆన్లైన్ గేమింగ్ ద్వారా ఆదాయాన్ని పొందాలనుకున్నాడు. అందుకు ఆన్లైన్ గేమింగ్స్ ఇచ్చే పాయింట్స్ ద్వారా అయితే డబ్బును సులువుగా రాబట్టచ్చు అనుకున్నాడు. మొదట్లో గేమింగ్ యాప్స్ వినియోగదారుడికి ఎక్కువ పాయింట్స్ ఇచ్చి, ఆకర్షిస్తాయి. దాంతో స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ గంటల కొద్దీ గేమింగ్ చేస్తూనే ఉంటారు. ఎక్కువ పాయింట్స్ పొందాంటే ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. దీంతో ఆ డబ్బును ఎక్కడి నుంచి రాబట్టాలా అని దారులు వెతుకుతారు. పిల్లలు వారి మానాన వారు ఫోన్లో ఉన్నారు కదా అనో, వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు కదా అనో పర్యవేక్షణలో లోపం జరిగితే చివరికి కోలుకోలేనంత అనర్థాలు తలెత్తుతుతాయి. విక్రాంత్ లాంటి పిల్లలు మన మధ్యే ఉంటారు కాబట్టి జాగ్రత్త వహించడం ముఖ్యం. డబ్బు ఒక్కటే కాదు అధికంగా వాడితే మానసిక, శారీరక స్థితిలోనూ గణనీయమైన హానిని డిజిటల్ ప్లాట్‌ఫామ్ కలిగిస్తుంది. ముందే గుర్తించి కట్టడి చేయడం మేలు చేస్తుంది. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: బ్లాక్‌మెయిలింగ్: నాతో పాటు చెల్లెలు ఫొటోలూ పంపాను -
ఎయిర్ ఇండియా లో హ్యాకింగ్ కలకలం
-
Whatsapp Hacking: ఎన్ఆర్ఐల వాట్సాప్నూ వాడేసుకుంటున్నారు!
సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. ఒక్కో తరుణంలో ఒక్కో తరహా నేరాలు చేసే ఈ క్రిమినల్స్ తాజాగా వాట్సాప్‌ను తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. విదేశాల్లో ఉన్న భారతీయుల (ఎన్ఆర్ఐ) ఖాతాలను హ్యాక్ చేస్తూ ఇక్కడ ఉన్న వారి సంబంధీకుల నుంచి డబ్బు కాజేస్తున్నారు. ఈ తరహా నేరాలకు సంబంధించి బుధ, గురువారాల్లో రెండు కేసులు నమోదైనట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. ఈ వాట్సాప్ హ్యాకింగ్ అనేది కొన్నాళ్లుగా సాగుతోంది. ఇప్పటి వరకు ఇక్కడి వారి ఫోన్లనే హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు తాజాగా పంథా మార్చారు. అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐలకు చెందినవి హ్యాక్ చేయడం మొదలెట్టారు. సాధారణంగా ఎవరైనా ఒక స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ను వాడుతూ... మరో ఫోన్లోకి మారితే... ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా తమ ఫోన్లో వాట్సాప్‌ను ఇన్స్టాల్ చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు అందులో తాము టార్గెట్ చేసిన యూఎస్‌లోని ఎన్ఆర్ఐ నెంబర్లు ఎంటర్ చేస్తున్నారు. దీని వెరిఫికేషన్ కోడ్ అసలు యజమాని వద్దకు వెళ్తుంది. వివిధ పేర్లతో సంప్రదిస్తున్న సైబర్ నేరగాళ్లు ఓ లావాదేవీలో పొరపాటున మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేశామని, దీంతో ఓటీపీ మీకు వచ్చిందని చెప్పి వెరిఫికేషన్ కోడ్ తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో బ్యాంకులతో పాటు ఇతర కాల్ సెంటర్ల పేర్లు వాడుతున్నారు. ఇలా ఓటీపీని చేజిక్కించుకుని తమ ఫోన్లలో ఎన్ఆర్ఐల నెంబర్‌తో వాట్సాప్ యాక్టివేట్ చేసుకుంటున్నారు. ఆ వెంటనే వారి వాట్సాప్ డీపీని కాపీ చేసి తమ దానికి పెట్టేస్తున్నారు. దీంతో పాటు సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను మార్చేస్తూ టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకుంటున్నారు. దీని వల్ల అసలు వ్యక్తి ఈ విషయం గుర్తించి తన ఫోన్లో వాట్సాప్‌ను మరోసారి యాక్టివేట్ చేసుకోవాలని భావించినా... అది సాధ్యం కాదు. ఇలా అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ నెంబర్లు సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన శ్రీరామ్‌కు బుధవారం ఓ వాట్సాప్ సందేశం వచ్చింది. అమెరికాలో ఉంటున్న తన సమీప బంధువు సుజాత నెంబర్ నుంచి పంపినట్లు ఉంది. మెడికల్ ఎమర్జెన్సీ అని, డబ్బు కావాలంటూ అందులో ఉండటంతో శ్రీరామ్ రెండు బ్యాంకు ఖాతాల్లోకి రూ.10.98 లక్షలు బదిలీ చేశారు. కూకట్‌పల్లికి చెందిన నరేంద్రకు ఈ నెల 10న అమెరికాలో ఉంటున్న తన బాల్య స్నేహితుడు రవి శ్రీనివాస్ పేరుతో సందేశం వచ్చింది. ఈయన కూడా ఆ సందేశాల్లో సూచించిన బ్యాంకు ఖాతాల్లోకి రూ.10.98 లక్షలు బదిలీ చేశారు. ఆపై ఈ బాధితులు ఇద్దరూ అమెరికాలో ఉంటున్న వారి సంప్రదించి జరిగిన మోసం తెలుసుకున్నారు. దీంతో బుధవారం శ్రీరామ్, గురువారం నరేంద్ర సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యా దు చేయడంతో కేసులు నమోదయ్యాయి. వీరు పంపిన డబ్బు ఢిల్లీ, రాజస్థాన్‌లకు చెందిన బ్యాంకు ఖాతాలకు వెళ్లినట్లు పోలీసులు తేల్చారు. ఈ ఖాతాల సారూప్యత నేపథ్యంలో ఒకే వ్యక్తి లేదా గ్యాంగ్ రెండు నేరాలకు పాల్పడినట్లుఅంచనా వేస్తున్నారు. ముందు ఇక్కడివే హ్యాక్ చేస్తారు ఈ సైబర్ నేరగాళ్లు తొలుత ఇక్కడ ఉన్న వారి వాట్సాప్ నెంబర్లే హ్యాక్ చేస్తారు. అలా వారి యాప్‌లో ఉన్న వివిధ గ్రూపుల్లోని కాంటాక్ట్స్, చాటింగ్స్ తదితరాలు పరిశీలిస్తారు. అందులో ఉన్న విదేశీ నెంబర్లను ఎంపిక చేసుకుని, అనువైన వాటిని హ్యాక్ చేసి అసలు కథ నడిపిస్తారు. ఈ తరహా నేరాలు ఇంకా జరిగే ప్రమాదం ఉంది. కేవలం సందేశాల ఆధారంగా ఆర్ధిక లావాదేవీలు చేయకూడదు. ఇలాంటి సందర్భాల్లో ఎవరికైనా డబ్బు పంపేప్పుడు వారితో ఓసారి మాట్లాడి నిర్థారించుకోవాలి. ఆ తర్వాత కూడా డబ్బు పంపే ముందు అన్నీ సరిచూసుకోవాలి. – కె.బాలకృష్ణ రెడ్డి, సైబర్ క్రైమ్ ఏసీపీ, సైబరాబాద్. చదవండి: సైకో భర్త ఘాతుకం.. ఇద్దరు భార్యలను.. -
పైకి చూస్తే మైనర్.. పనులు మాత్రం ముదురే
సాక్షి, హైదరాబాద్: పైకి చూస్తే మైనరే. చేసే పనులు మాత్రం ముదురే. పక్కింటి బాలుడే కదా అని కాస్త చనువుగా ఉంటే నమ్మక ద్రోహానికి ఒడిగట్టాడు. ఓ యువతికి చుక్కలు చూపించాడు. బాధితురాలి ఫిర్యాదుతో సదరు ‘మైనర్’ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఓ సందర్భంలో ఆమెకు సహకరించిన ఇతగాడు దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. సిటీకి చెందిన ఓ యువతి వైద్య విద్యనభ్యసిస్తున్నారు. ఆమెకు చెందిన ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ ఖాతాల్లో గతంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. వాటిని పరిష్కరించడంతో పాటు తొలగించడం కోసం ఆమె తన పక్కింట్లో ఉండే ఓ బాలుడి సహాయం తీసుకున్నారు. అతడు ఈ యువతితో స్నేహంగా, ఆత్మీయంగా మెలిగేవాడు. ఆమెకు సహకరించిన ఇతగాడు తన ఈ– మెయిల్ ఐడీ, పాస్వర్డ్ తదితరాలను సంగ్రహించాడు. అదను చూసుకుని ఆమె మెయిల్ ఐడీని యాక్సెస్ చేశాడు. దాని ద్వారా ఆమె ఆన్లైన్ క్లాసుల్లోకి అక్రమంగా ప్రవేశించేవాడు. అంతటితో ఆగకుండా ఆ క్లాసుల్లో ఆమె పోస్టు చేస్తున్నట్లు అసభ్య, అశ్లీల ఫొటోలు షేర్ చేసేవాడు. ఆ మెయిల్లో ఆమె సేవ్ చేసుకున్న ఫొటోలను తన అధీనంలోకి తీసుకున్నాడు. తన వద్ద ఉన్న మెయిల్ వివరాల ఆధారంగా వారి ఇంటి వైఫై కనెక్షన్‌ను యాక్సెస్ చేసి ఫోన్లు హ్యాంగ్ అయ్యేలా చేశాడు. ఇలా వాటిని గుర్తుతెలియని వ్యక్తి హ్యాక్ చేసిన భావన కలిగించాడు. బాధితురాలి ఫేస్బుక్ ఖాతాను యాక్సెస్ చేసిన బాలుడు అందులో ఆమె చేసినట్లు అశ్లీల ఫొటోలు పోస్టు చేశాడు. ఆమెతో పాటు వారి కుటుంబికుల దైనందిన జీవితాలను చూస్తున్న ఈ మైనర్ ఆ వివరాలను వారికి మెయిల్ చేసి తమ ఫోన్లు హ్యాక్ అయినట్లు భావించేలా చేశాడు. ఈ పనులు చేస్తూ తనలో తాను వికృతానందం పొందేవాడు. కొన్ని సందర్భాల్లో నిజం తెలియని బాధితురాలు ఈ బాలుడి వద్దకే వచ్చి విషయం చెప్పేది. తన ఫేస్బుక్ ఖాతా బ్లాక్ చేయాలని కోరేది. ఆమె ముందు అలాగే చేసిన మైనర్ ఆ తర్వాత యాక్టివ్ చేసే వాడు. తుదకు సైబర్ వేధింపులతో విసిగివేసారిన బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు పూర్వాపరాలు పరిశీలించి, సాంకేతికంగా దర్యాప్తు చేసి యువతి పక్కింటి బాలుడే బాధ్యుడని తేల్చారు. అతడిని పట్టుకుని న్యాయస్థానం ఆదేశాల మేరకు అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు. చదవండి: ఖైరతాబాద్: ఆన్లైన్ క్లాసుల్లో అశ్లీల ఫోటోలు షేర్ చేస్తూ..