ఈవీఎంల హ్యాకింగ్‌ సాధ్యమే: పిట్రోడా | congress leader Sam Pitroda reacts om EVMS debate says Possible to manipulate | Sakshi
Sakshi News home page

ఈవీఎంల హ్యాకింగ్‌ సాధ్యమే: పిట్రోడా

Published Mon, Jun 17 2024 2:08 PM | Last Updated on Mon, Jun 17 2024 6:43 PM

congress leader Sam Pitroda reacts om EVMS debate says Possible to manipulate

ఢిల్లీ: పోలింగ్‌లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు​ (ఈవీఎం) హ్యాకింగ్‌కు గురువుతున్నాయంటూ టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై తాజాగా కాంగ్రెస్‌ నేత శ్యామ్‌ పిట్రోడా ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

ఈవీఎం మిషన్లను హ్యాక్‌ చేయడానికి, ఫలితాలను తారుమారు చేయడానికి అవకాశం ఉన్నట్లు అభి​ప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన  ‘ఎక్స్‌’  వేదికగా స్పందించారు. 

‘‘ఎలక్ట్రానిక్స్‌, ఐటీ, సాఫ్ట్‌వేర్‌, కాంప్లెక్స్‌  సిస్టంల  రంగాల మీద సుమారు అరవై ఎళ్లపాటు నేను పనిచేశాను. అదే విధంగా నేను ఈవీఎం యంత్రాల వ్యవస్థను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఈవీఎంలను హ్యాక్‌  చేయటం సాధ్యం అవుతుంది.దీని వల్ల ఫలితాలకు కూడా మారిపోతాయి. ఇటువంటి సమయంలో  సంప్రదాయ పాత  బ్యాలెక్‌ ఓటింగ్‌ విధానమే చాలా ఉత్తమమైంది. ఓట్ల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు  జరగవు. బ్యాలెట్‌ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి’’ అని అన్నారు.

 

‘పోలింగ్‌లో ఉపయోగించే ఈవీఎం మిషన్లతో పాటు, వీవీప్యాట్‌ స్లిప్స్‌  కోసం వీవీప్యాట్‌  యాంత్రాలు కూడా అమర్చబడి ఉన్నాయి. వీవీప్యాట్‌ యంత్రాల సాయంతో కూడా ఈవీఎంలను హ్యాక్‌ చేయడానికి అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది’ అని అన్నారు.

 

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వీవీప్యాట్‌, ఓటర్లు జాబితా, వేసిన ఓట్లు, లెక్కించిన ఓట్లు, మొత్తం ఓట్లు, విజేతలు(ఓట్లు), ఓడిపోయినవారు (ఓట్లు) వంటి వాటిపై పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించబడింది. వీటిని పరిగణలోకి తీసుకొని ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి’ అని శ్యామ్‌ పిట్రోడా సూచించారు.

ఎలాన్‌ మస్క్ చేసిన ఆరోపణలపై ఎన్నికల  సంఘం స్పందిస్తూ.. ఈవీఎంలు అస్సలు హ్యాక్‌ చేయడాని వీలు లేదని తెలిపింది. భారత్‌లో ఉపయోగించే ఈవీఎంలకు బ్లూటూత్‌, వైఫై​, ఇంటర్‌నెట్‌ వంటి వైర్‌లెస్‌, వైర్‌ కనెక్షన్లు ఉండవని పేర్కొంది. దీంతో ఈవీఎంలను హ్యాక్‌ చేసే అవకాశమే లేదని స్పష్టం చేసింది. అయితే తాజాగా శ్యామ్‌ పిట్రోడా లేవనెత్తిన వీవీప్యాట్‌ మిషన్ల అంశంతో ఈవీఎంలను హ్యాక్‌ చేయడానికి అవకాశం ఉన్నట్లు వస్తున్న అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.

సంబంధిత కథనం: ఈవీఎంల గుట్టు విప్పేదెవరు?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement