Sam Pitroda
-
ఆ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం: జైరాం రమేష్
న్యూఢిల్లీ: భారత్ కు చైనా శత్రువు కాదంటూ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా(sam pitroda) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తమకేమీ సంబంధం లేదని అంటోంది ఈ వ్యవహారంపై జాతీయ కాంగ్రెస్ పార్టీ. దీనిపై కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్చార్జి జై రాం రమేష్(Jairam Ramesh స్పందించారు. అది శామ్ పిట్రోడో వ్యక్తిగత అభిప్రాయమని, దానితో పార్టీకి సంబంధం లేదన్నారు. శామ్ పిట్రోడో చేసిన వ్యాఖ్యలు పార్టీపై ఎటువంటి ప్రభావం చూపదని జై రాం రమేష్ క్లారిటీ ఇచ్చారు.చైనా(China)పై శామ్ పిట్రోడా వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఖచ్చితంగా భారత జాతీయ కాంగ్రెస్ అభిప్రాయాలు కావన్నారు. చైనా అతిపెద్ద విదేశాంగ, భద్రత విధానంతో పాటు మనకు ఆర్థిక సవాలుగా మిగిలిపోయింది అని జైరాం రమేష్ పేర్కొన్నారు. దీనికి తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు జై రాం రమేష్కాగా, పొరుగు దేశం చైనాను శత్రువులా చూడొద్దని సంచలన వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడో.. లేదంటే చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించని విధంగా ఉంటుందని హెచ్చరించారు.భారత్ తన వైఖరి మార్చుకొని చైనాను శత్రువులా చూడటం మానుకోవాలని సూచించారు. తొలినుంచి చైనాతో భారత్ అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరి ఇరుదేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతోందని శామ్ పిట్రోడా తాజాగా ఓ వార్తాసంస్థకు ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. చైనా నుంచి భారత్‌కు ఏం ముప్పుందో తనకు అర్థం కావడం లేదన్నారు.చైనా పట్ల మన దేశ వైఖరి మొదటిరోజు నుంచి ఘర్షణాత్మకంగానే ఉందన్నారు. ఇప్పటికైనా భారత్ వైఖరిని మార్చుకోవాలని సూచించారు.ఇది కేవలం చైనా విషయంలోనే కాదని, ఇతర దేశాలకు కూడా వర్తిస్తుందని చెప్పారు. అమెరికా కూడా చైనాను శత్రువులా చూస్తూ భారత్‌కు కూడా అదే అలవాటు చేస్తోందని విమర్శించారు.గతంలో కూడా పలు అంశాలపై పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తాను ఇరకాటంలో పడి కాంగ్రెస్ పార్టీని కూడా ఇరకాటంలో పడేశారు. కాగా, భారత్,చైనా సంబంధాలు అంతంత మాత్రమే ఉన్న వేళ పిట్రోడా చైనాను ఎక్కువ చేసి చూపిస్తూ మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేతలు పిట్రోడాపై ఫైర్ అవుతున్నారు. దాంతో కాంగ్రెస్ దిగివచ్చింది. తమ పార్టీకి శామ్ పిట్రోడో వ్యాఖ్యలతో ఎటువంటి సంబంధం లేదంటూ జై రాం రమేష్ వ్యాఖ్యానించడం అందుకు ఉదాహరణ. -
మరో వివాదంలో శామ్ పిట్రోడా..!ఈసారి చైనాపై..
న్యూఢిల్లీ:ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో తన పార్టీ కాంగ్రెస్‌ను మరోసారి ఇరకాటంలో పెట్టారు. పొరుగు దేశం చైనాను శత్రువులా చూడొద్దని శామ్ పిట్రోడా అన్నారు. లేదంటే చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించని విధంగా ఉంటుందని హెచ్చరించారు.భారత్ తన వైఖరి మార్చుకొని చైనాను శత్రువులా చూడటం మానుకోవాలని సూచించారు. తొలినుంచి చైనాతో భారత్ అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరి ఇరుదేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతోందని శామ్ పిట్రోడా తాజాగా ఓ వార్తాసంస్థకు ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. చైనా నుంచి భారత్‌కు ఏం ముప్పుందో తనకు అర్థం కావడం లేదన్నారు. చైనా పట్ల మన దేశ వైఖరి మొదటిరోజు నుంచి ఘర్షణాత్మకంగానే ఉందన్నారు. ఇప్పటికైనా భారత్ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. ఇది కేవలం చైనా విషయంలోనే కాదని, ఇతర దేశాలకు కూడా వర్తిస్తుందని చెప్పారు. అమెరికా కూడా చైనాను శత్రువులా చూస్తూ భారత్‌కు కూడా అదే అలవాటు చేస్తోందని విమర్శించారు.గతంలో కూడా పలు అంశాలపై పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తాను ఇరకాటంలో పడి కాంగ్రెస్ పార్టీని కూడా ఇరకాటంలో పడేశారు. కాగా, భారత్,చైనా సంబంధాలు అంతంత మాత్రమే ఉన్న వేళ పిట్రోడా చైనాను ఎక్కువ చేసి చూపిస్తూ మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేతలు పిట్రోడాపై ఫైర్ అవుతున్నారు. -
రాహుల్ గాంధీ ‘పప్పు’ కాదు: శామ్ పిట్రోడా
వాషింగ్టన్ డీసీ : కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ ఓవర్సీస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా టెక్సాస్‌లో ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశంలో పిట్రోడా.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ‘పప్పు’ కాదని, ఉన్నత విద్యావంతుడు, వ్యూహకర్త అన్నారు. పప్పు అని బీజేపీ కోట్లు ఖర్చు చేస్తున్న ప్రచారానికి రాహుల్ వ్యక్తిత్వం పూర్తి విరుద్ధం. ఆయనకు (రాహుల్ గాంధీ) విజన్ ఉంది. నేను మీకో విషయం చెప్పాలి. అతను పప్పు కాదు. అతను బాగా చదువుకున్నారు. ఏదైనా విషయంపై లోతుగా ఆలోచించే వ్యూహకర్త . అతనిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు’ అని పిట్రోడా వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి : సుప్రీం కోర్టులో జూనియర్ వైద్యురాలి ఘటన కేసు విచారణవివాదాలకు కేరాఫ్ అడ్రస్ శామ్ పిట్రోడాకాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల వేళ..ఆయన చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. లోక్ సభ ఎన్నికల వేళ భారత్‌లోని భిన్నత్వం గురించి.. పిట్రోడా మాట్లాడుతూ..తూర్పు భారతాన ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమ వాసులు అరబ్బులుగా..ఉత్తరాది వాళ్లు శ్వేత జాతీయులుగా,దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా కన్పిస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి.దీంతో కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై పిట్రోడా వివరణ ఇవ్వడంతో తిరిగి పార్టీ ఓవర్సీస్ ఛైర్మన్‌గా శామ్ పిట్రోడాను కాంగ్రెస్ తిరిగి నియమించింది. అమెరికా పర్యటనలో రాహుల్ 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ తొలిసారి అమెరికాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 8వ తేదీన డల్లాస్‌లో, 9-10 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో విద్యావేత్తలు, జర్నలిస్టులు, థింక్ ట్యాంక్ ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు. #WATCH | Texas, USA: Chairman of Indian Overseas Congress, Sam Pitroda says, "...Rahul Gandhi's agenda is to address some of the larger issues, he has a vision contrary to what BJP promotes by spending crore and crore of rupees. I must tell you he is not 'Pappu', he is highly… pic.twitter.com/28zgNI6BQj— ANI (@ANI) September 9, 2024 -
శాం పిట్రోడాకు కీలక బాధ్యతలు.. ప్రధాని ఎప్పుడో చెప్పారు: కిరణ్ రిజిజు
లోక్‌సభ ఎన్నికల వేళ భారతీయుల చర్మ రంగుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడాకు కాంగ్రెస్ ఓవర్సీస్ అధ్యక్షుడిగా తిరిగిబాధ్యతలు అప్పగించడంపై బీజేపీ తాజాగా విమర్శలు గుప్పించింది. దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజుజు స్పందిస్తూ.. శాం పిట్రోడాకు కాంగ్రెస్ మళ్లీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందని ప్రధాని మోదీ గతంలోనే చెప్పారని అన్నారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు పెట్టారు. ‘ప్రధాని మోదీ ఊహించినట్లే.. రాహుల్ గాంధీ సలహాదారుడు, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లుగా , ఈశాన్య ప్రజలు చైనీస్‌గా కనిపిస్తారు, వెస్ట్ ఇండియన్లు అరబ్బులు, ఉత్తర భారతీయులు శ్వేతజాతీయులుగా కకనిపిస్తారని వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి మళ్లీ కీలక పదవి అప్పగించారు. ఈ చర్చ మమ్మల్ని ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే దీనిని ప్రధాని మోదీ ముందుగానే ఊహించారు’. అని పేర్కొన్నారు.ఈ మేరకు గతంలో ఓ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడిన వీడియోను జత చేశారు. ‘కొన్నిసార్లు ఆ పార్టీ (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) పక్కా ప్లాన్‌తో ఉంటుంది. వారి నేతలు సొంతంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తారని నేను అనుకోను. ముందు వారితో అలా మాట్లాడిస్తారు. ఆ తర్వాత పార్టీ వారిని దూరం పెడుతుంది. కొన్నాళ్లకు మళ్లీ వారిని ప్రధాన కార్యకలాపాల్లోకి తీసుకొస్తారు.అమెరికాలోని వారి గురువు (పిట్రోడా) విషయంలోనూ ఇలాగే జరగనుంది. ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ బాధ్యతలు అప్పగిస్తారు చూడండి..! కొత్త అంశాలను తెరపైకి తెచ్చి ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు, ప్రత్యర్థులను తప్పుదోవ పట్టించేందుకు ఆ పార్టీ చేస్తున్న కుట్రలివి’ అని మోదీ ఆ వీడియోలో అన్నారు.కాగా లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. భారత్‌లో తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమవాసులు అరబ్బుల మాదిరిగా కనిపిస్తారు. ఇక ఉత్తరాది వాళ్లు శ్వేత జాతీయులుగా, దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేపాయి. ఈ క్రమంలోనే పిట్రోడా తన పదవికి రాజీనామా చేయగా.. ఇప్పుడు మళ్లీ ఆయననే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా పార్టీ నియమించింది. -
వివాదాస్పద వ్యాఖ్యలు.. శామ్ పిట్రోడాకు కాంగ్రెస్‌కు కీలక పదవి
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ దక్షిణాది భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా మరోసారి వార్తల్లో నిలిచారు. భారతీయుల చర్మ రంగుపై జాతివివక్షతో వ్యాఖ్యలు చేయడంతో ఆయన కోల్పోయిన పదవి మళ్లీ దక్కింది. శామ్ పిట్రోడాను బుధవారం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా హస్తం పార్టీ తిరిగి నియమించింది.శామ్ పిట్రోడాను తక్షణమే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్‌గా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించినట్లు సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటనలో తెలిపారు.కాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తూర్పు భారతీయులు చైనియుల్లా, దక్షిణాది భారతీయులు ఆఫ్రికన్ల కనిపిస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో మే 8న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా చేశారు. -
ఈవీఎంల హ్యాకింగ్ సాధ్యమే: పిట్రోడా
ఢిల్లీ: పోలింగ్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) హ్యాకింగ్‌కు గురువుతున్నాయంటూ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై తాజాగా కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈవీఎం మిషన్లను హ్యాక్ చేయడానికి, ఫలితాలను తారుమారు చేయడానికి అవకాశం ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్వేర్, కాంప్లెక్స్ సిస్టంల రంగాల మీద సుమారు అరవై ఎళ్లపాటు నేను పనిచేశాను. అదే విధంగా నేను ఈవీఎం యంత్రాల వ్యవస్థను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఈవీఎంలను హ్యాక్ చేయటం సాధ్యం అవుతుంది.దీని వల్ల ఫలితాలకు కూడా మారిపోతాయి. ఇటువంటి సమయంలో సంప్రదాయ పాత బ్యాలెక్ ఓటింగ్ విధానమే చాలా ఉత్తమమైంది. ఓట్ల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగవు. బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి’’ అని అన్నారు.I have spent about 60 years in the forefront of #electronics, #telecom,IT, #software, #complex systems and a lot more. I have studied #EVM system carefully and believe that it is possible to manipulate. The best approach is the traditional paper ballet to count as casted.— Sam Pitroda (@sampitroda) June 16, 2024 ‘పోలింగ్‌లో ఉపయోగించే ఈవీఎం మిషన్లతో పాటు, వీవీప్యాట్ స్లిప్స్ కోసం వీవీప్యాట్ యాంత్రాలు కూడా అమర్చబడి ఉన్నాయి. వీవీప్యాట్ యంత్రాల సాయంతో కూడా ఈవీఎంలను హ్యాక్ చేయడానికి అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది’ అని అన్నారు.The #EVM debate in #India continues to get hotter due to a comment from #Elon Musk .The facts are clear. It is not just the stand alone EVM but a complex system with #VVPAT & associated processes and logistics that is open to selective manipulation.— Sam Pitroda (@sampitroda) June 16, 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వీవీప్యాట్, ఓటర్లు జాబితా, వేసిన ఓట్లు, లెక్కించిన ఓట్లు, మొత్తం ఓట్లు, విజేతలు(ఓట్లు), ఓడిపోయినవారు (ఓట్లు) వంటి వాటిపై పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించబడింది. వీటిని పరిగణలోకి తీసుకొని ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి’ అని శ్యామ్ పిట్రోడా సూచించారు.Confusion created about #VVPAT, #voter lists, votes casted, counted, margins, winners, losers, etc. during recent #election in #India needs careful consideration to build trust between #voters and the #ECI.— Sam Pitroda (@sampitroda) June 16, 2024ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందిస్తూ.. ఈవీఎంలు అస్సలు హ్యాక్ చేయడాని వీలు లేదని తెలిపింది. భారత్‌లో ఉపయోగించే ఈవీఎంలకు బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ వంటి వైర్లెస్, వైర్ కనెక్షన్లు ఉండవని పేర్కొంది. దీంతో ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశమే లేదని స్పష్టం చేసింది. అయితే తాజాగా శ్యామ్ పిట్రోడా లేవనెత్తిన వీవీప్యాట్ మిషన్ల అంశంతో ఈవీఎంలను హ్యాక్ చేయడానికి అవకాశం ఉన్నట్లు వస్తున్న అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.సంబంధిత కథనం: ఈవీఎంల గుట్టు విప్పేదెవరు? -
రంగును బట్టి రాజకీయాలా?
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లను పోలి ఉంటారన్న శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆధునిక మానవుని ఆవిర్భావం తొలుత ఆఫ్రికాలోనే జరిగిందనీ, అక్కడి నుంచి వారు వివిధ ప్రాంతాలకు వలస పోయారనీ, అందులో ప్రస్తుత భారతదేశం కూడా ఒకటనీ శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. అలాంటప్పుడు ఆఫ్రికన్లతో పోలిక ఎవరికైనా ఎందుకంత ఉలికిపాటుకు గురి చేయాలి? వలసలు, సాంకర్యాల క్రమంలో మనుషులు తమ ఒరిజినల్ లక్షణాలలో కొన్నింటిని నిలుపుకొన్నారు, కొన్నింటిని కోల్పోయారు. ఇందుకు అనుగుణంగా దక్షిణ భారతీయుల రంగు ఉత్తరాదివారితో తేడాగా ఉండటం సహజం. ఆ చర్మపు రంగును గురించి, ‘వీరంతా ద్రవిడులు’ అనే ఈసడింపులు తెలిసిన విషయమే. ఈ విధమైన భావనలు ఏవీ దేశానికి మంచివి కావు.దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లను పోలి ఉంటా రంటూ శామ్ పిట్రోడా (ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్‌గా రాజీనామా చేశారు) చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం సాగుతున్నది. రాజకీయాలను పక్కన ఉంచి మానవ వికాస శాస్త్రాన్ని, మానవ వలసల కోణాలను పరిశీలిస్తే ఆ వ్యాఖ్యలలో తప్పే మిటో అర్థం కాదు. వానరాల నుంచి ఆధునిక మానవుని ఆవిర్భావం తొలుత ఆఫ్రికాలోనే జరిగిందనీ, అక్కడి నుంచి వారు భూగోళంలోని వివిధ ప్రాంతాలకు వలస పోయారనీ, అందులో ప్రస్తుత భారతదేశం కూడా ఒకటనీ శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. ఈ సూత్రీకరణను ప్రపంచమంతా కూడా ఆమోదిస్తున్నది. మనకు మాత్రం సైన్సు కన్నా రాజకీయాలు ముఖ్యం గనుక పిట్రోడా మాటలపై భూమ్యాకాశాలను ఏకం చేసే హంగామాను సృష్టిస్తున్నాము.ఇంతకూ పిట్రోడా అన్నదేమిటి? ఆయన దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లను పోలి ఉంటారని మాత్రమే అనలేదు. దేశంలోని తూర్పు ప్రాంతాల వారు చైనీయులవలె, పశ్చిమ ప్రాంతాల వారు అరబ్బుల వలె, ఉత్తరాది వారు శ్వేతజాతీయులవలె ఉంటారని కూడా అన్నారు. ఈ పోలికలలో తక్కిన మూడింటిని వదలి, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్ల వలె ఉంటారన్న మాట ఒక్కటే వివాదమైంది. వివాదమైంది అనటంకన్న వివాదంగా మార్చారనటం సరైనదవుతుంది. ఈ చర్చ లోకి వెళ్లే ముందు ఒక విషయం గుర్తు చేసుకోవాలి. స్వయంగా బీజేపీకి చెందిన తరుణ్ విజయ్ అనే నాయకుడు, తను రాజ్యసభ సభ్యునిగా, ‘పాంచజన్య’ పత్రిక సంపాదకునిగా ఉండినపుడు, ‘‘మనం (అనగా ఉత్తరాది వారం) దక్షిణాది వారితో కలిసి ఉండటం లేదా?’’ అని వ్యాఖ్యానించారు. అనగా, తాము తెల్లగా ఉంటామని, ఉత్తమ స్థాయి వారమని, దక్షిణాది వారు నల్లగా ఉంటారని, అధమ స్థాయి వారని, అయినప్పటికీ తమది ఉదార స్వభావం గనుక అటువంటి వారితో కలిసి జీవిస్తున్నామని అర్థం. వాస్తవానికి దక్షిణాది వారి చర్మపు రంగును గురించి, కను ముక్కుల తీరు గురించి, భాషా సంస్కృతుల గురించి, ‘వీరంతా ద్రవి డులు’ అనే పద్ధతిలో ఈసడింపులు చేయటం అందరికీ తెలిసిన విషయమే. ఎన్టీఆర్ రాక వరకు అందరూ కట్టగట్టి ‘మద్రాసీ’లే. ఈ ధోరణికి బీజేపీ, సంఘ్ పరివార్ సైతం మినహాయింపు కాదన్నది ఇక్కడ గుర్తించవలసిన విషయం. ప్రస్తుత వివాద సందర్భంలోనూ ఈ సంగతి గుర్తించాలి. పిట్రోడా కాంగ్రెస్ నేత అయినందున, ఆయన మాటలను వివాదం చేస్తే తమకు రాజకీయంగా లాభిస్తుందనే సంకుచిత ఆలోచన తప్ప, ఇందులో బీజేపీ వివేకం ఏమీ కన్పించదు. మనకు తెలిసి మానవ వికాస శాస్త్రం, ప్రపంచవ్యాప్తంగా వలసల చరిత్ర, ఇటీవలి సంవత్సరాలలో జరిగిన డీఎన్ఏ పరిశోధనలు చెప్తున్న విషయాలు కొన్నున్నాయి. ఇండియా, చైనా, ఉత్తర యూరప్‌లలో ప్రాథమిక స్థాయి మానవ జాతులు స్వల్ప స్థాయిలో రూపుదిద్దుకున్న ప్పటికీ, ఆధునిక మానవుని ఆవిర్భావం తొలుత జరిగింది ఆఫ్రికాలోని తూర్పు భాగాన గల రిఫ్ట్ వ్యాలీలో. వేలాది సంవత్సరాల కాలంలో అటువంటి ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో శాస్త్రీయమైన పురావస్తు అధ్యయనాలు చెప్పాయి. వాటిపై కెన్యా రాజధాని నైరోబీ, ఇథియో పియా రాజధాని అడ్డిస్ అబాబాలలోని జాతీయ మ్యూజియాలలో గొప్ప ప్రదర్శనలున్నాయి. ఈ రెండింటినీ నేను స్వయంగా చూడటమే గాక, రిఫ్ట్ వ్యాలీలోని కొంత భాగంలో ప్రయాణించాను. ఆధునిక మానవుని ఆవిర్భావం పరిస్థితి ఇది కాగా, ఆ ప్రాంతం నుంచి మాన వులు రెండు లక్షల సంవత్సరాల క్రితం నుంచి మొదలుకొని ప్రపంచం నలువైపులా ఎట్లా వలస వెళ్లారో, ఆ విధంగా 70 వేల ఏళ్ల క్రితం ప్రస్తుతం మనం అంటున్న భారతదేశంలోకి ఏ విధంగా ప్రవేశించారో అనేక అధ్యయనాలున్నాయి.తర్వాత వేల సంవత్సరాలలో ప్రపంచమంతటా జరిగినట్లేఇండియాలో కూడా లెక్కలేనన్ని జాతి సాంకర్యాలు జరిగాయి. పైన చెప్పుకున్నట్లు అప్పటికే ఇక్కడ స్వల్ప స్థాయిలో ప్రాథమిక మానవులు ఉండగా, తర్వాత కాలాలలో తూర్పు ఆసియా నుంచి మంగోలాయిడ్లు, మధ్య ఆసియాలోని కాస్పియన్ సముద్ర ప్రాంతం నుంచి ఆర్యులు, పశ్చిమాసియా నుంచి అరబ్బులు, పారశీకుల పూర్వీకులు ఇటువైపు వలసలు వస్తూ పోయారు. తిరిగి వీరందరి మధ్య సాంక ర్యాలు, వలసలు వేలకు వేల సంవత్సరాల పాటు సాగాయి. దేశంలోని అన్ని ప్రాంతాల స్త్రీ, పురుషుల డీఎన్‌ఏలపై జరిగిన ఆధునిక శాస్త్ర పరిశోధనలు, పురావస్తు పరిశోధనలు తేల్చిన విషయాలివి. అయితే ఈ వలసలు, సాంకర్యాల క్రమంలో వేర్వేరు జాతులు, ప్రాంతాల మనుషులు తమ ఒరిజినల్ లక్షణాలలో కొన్నింటిని తరతరాలుగా నిలుపుకోవటం, కొన్నింటిని ఒక మేర కోల్పోవటం జరుగుతూ వస్తు న్నదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఉదాహరణకు అండమాన్, నికో బార్ ఆదిమవాసి తెగలు, దేశంలోని మారుమూల అడవులలో నివసించే ఆటవిక జాతులకు ఇతరులతో సాంకర్యం దాదాపు లేనందున, వారిలో ఇప్పటికీ ఆఫ్రికన్ డీఎన్ఏ యథాతథంగా కనిపిస్తుందంటారు. అటువంటి స్థితిలో ఆఫ్రికన్లతో పోలిక ఎవరికైనా ఎందుకంత ఉలికి పాటుకు, వ్యతిరేక భావనకు గురి చేయాలి?దక్షిణాది ప్రజలు, ఈశాన్య భారత లేదా తూర్పు భారత వాసులు, పశ్చిమ, ఉత్తర ప్రాంతాల వారి రంగు తేడాలకు మూలాలు దీనంతటిలో ఉన్నాయి. దక్షిణ–ఉత్తర భారత భాషలు, సంస్కృతులు, దేవతలు, ఆలోచనా ధారల మధ్య, చివరకు రాజకీయాల మధ్య కనిపించే వ్యత్యాసాలకు గల మూలాలను శాస్త్రీయంగా శోధిస్తూ పోతే బోధపడేది ఇదే. ఆధునిక మానవుల ఆవిర్భావానికి, వారి వలసలకు, పరస్పర సాంకర్యాలకు లక్షలాది, వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది. ఇందుకు ప్రపంచంలోని ఏ ప్రాంతంగానీ, భారతదేశంగానీ ఎంత మాత్రం మినహాయింపు కావు. పైన చెప్పుకొన్నట్లు, ఈ పరిణామ క్రమం ఒకవైపు అనంతంగా సాగుతూనే, మరొకవైపు అనేకులు తమ ఒరిజినల్ డీఎన్ఏలోని, ఒరిజినల్ లక్షణాలలోని కొన్ని భాగాలను అదేవిధంగా నిలుపుకొన్నారు. అట్లా ఎవరెంత నిలుపుకొన్నారు, అవి ఏ మేరకు నిలిచి ఉన్నాయనేది అనేక పరిస్థితులపై ఆధారపడి సాగుతూ వస్తున్నది.ఇందుకు అనుగుణంగా దక్షిణ భారతీయుల రంగు కన్నా ఉత్తరాదివారు, పశ్చిమ, తూర్పువాసుల రంగు తేడాగా ఉండటం సహజం. కానీ దానినిబట్టి వివక్షలు ఏర్పడాలంటే, తక్కిన ముగ్గురి లోనూ ఆఫ్రికన్ డీఎన్ఏ ఉంది. వారి పూర్వీకులు సైతం ఆఫ్రికన్లే. అటువంటపుడు, ఇంకా ఒక మేర మిగిలి ఉన్న రంగును బట్టి తరుణ్ విజయ్ అనే పెద్దమనిషి గానీ, మరొకరుగానీ, తమవంటి పూర్వీకులే గల దక్షిణ భారత ప్రజలను చిన్నచూపు చూడటం విజ్ఞతగల పని అవుతుందా? ఇంతకూ పిట్రోడా ఆ మాటలన్నది ఎందుకో తెలియదు గానీ, మానవ వికాస శాస్త్రం దృష్టితో, ప్రపంచవ్యాప్త వలసల చరిత్ర దృష్టితో, డీఎన్ఏ పరిశోధనల దృష్టితో సరిగా ఇవే మాటలను ఇప్పటికి ఎందరో అన్నారు, రాశారు. ఎన్నికల సమయం గనుక ఇది అధికార పక్షానికి ఒక మంచి ఆయుధంగా మారింది.ఈ సందర్భంలో మరొకటి గుర్తుకు వస్తున్నది. ఆర్యుల, ఉత్తరాది వారి ఆధిపత్యంగల పార్టీలు, ప్రభుత్వాలు ద్రవిడుల దక్షిణాదిని రాజకీయంగా జయించాలని, తమ ఆధిపత్యం కిందకు తెచ్చుకోవా లని ప్రయత్నిస్తున్నాయని, నిరంతరం వివక్షకు గురి చేస్తున్నాయనే వాదనలు పెరియార్ రామస్వామి తర్వాత, హిందీ వ్యతిరేక, ఉత్తరాది వ్యతిరేక ఉద్యమాల తర్వాత ఇప్పటికీ ముందుకు వస్తుంటాయి. ఈ విధమైన భావనలు ఏవీ దేశానికి మంచివి కావు. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
‘ఇండియా’ కూటమి సిగ్గు పడాలి
న్యూఢిల్లీ: పిట్రోడా వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. ‘‘నేను దక్షిణ భారతదేశం నుంచి వచ్చా. నేను భారతీయురాలిగా కనిపిస్తా. నా బృందంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారు సైతం సభ్యులుగా ఉన్నారు. వారంతా భారతీయులుగానే కనిపిస్తారు. నా సహచరులైన పశి్చమ ప్రాంతాల ప్రజలు కూడా భారతీయులుగానే కనిపిస్తారు. రాహుల్ గాం«దీకి గురువైన ఓ జాత్యహంకారికి మాత్రం భారతీయులు ఆఫ్రికన్లు, చైనీయులు, అరబ్బులు, శ్వేతజాతీయులుగా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల అసలు రంగు బయటపడింది. అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పాలి. విపక్ష ‘ఇండియా’ కూటమి సిగ్గు పడాలి’’ అని నిర్మలా సీతారామన్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సోనియా గాంధీ కుటుంబంతో పిట్రోడాకు దశాబ్దాలుగా అనుబంధం ఉందని చెప్పారు. పిట్రోడాను ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవి నుంచి తక్షణమే తొలగించాలని స్పష్టం చేశారు. దక్షిణ భారత ప్రజలను ఆఫ్రికన్లతో పోలుస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై నాలుగు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించాలని అన్నారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను హేళన చేస్తూ మాట్లాడుతుంటారని, దీని వెనుక శామ్ పిట్రోడా సలహాలు ఉంటాయని రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. దురదృష్టకరం: జైరామ్ రమేశ్ శామ్ పిట్రోడా వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పందించారు. ఇండియాలోని వైవిధ్యాన్ని వరి్ణస్తూ పిట్రోడా ప్రస్తావించిన పోలికలు దురదృష్టకరమని పేర్కొన్నారు. అవి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని చెప్పారు. పిట్రోడా అభిప్రాయాలతో తమ పారీ్టకి ఎలాంటి సంబంధం లేదని తేలి్చచెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
శామ్ పిట్రోడా మరో దుమారం
న్యూఢిల్లీ: అమెరికాలో అమల్లో ఉన్న వారసత్వ పన్ను తనకు బాగా నచి్చందని, అది న్యాయంగా ఉందని వ్యాఖ్యానించి రాజకీయ వివాదానికి తెరతీసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శామ్ పిట్రోడా ఆ గొడవ సద్దుమణగ ముందే మరో దుమారం సృష్టించారు. దక్షిణ భారతదేశ ప్రజలు అఫ్రికన్లలా ఉంటారని ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పిట్రోడాను సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తప్పుపట్టారు. తాజాగా ఓ పత్రికకు ఇచి్చన ఇంటర్వ్యూలో శామ్ పిట్రోడా మాట్లాడుతూ... భారత్ విభిన్నమైన దేశం అని అభివరి్ణస్తూ కొన్ని పోలికలను ప్రస్తావించారు. అవే ఆయనను ఇప్పుడు ఇరకాటంలోకి నెట్టేశాయి. ‘‘మనది లౌకిక దేశం. బ్రిటిష్ పాలకులపై మన స్వాతంత్య్ర సమరయోధులు సాగించిన పోరాటాల వల్ల భారత్ లౌకిక దేశంగా ఆవిర్భవించింది. ప్రపంచవ్యాప్తంగా మనది ఉత్తమమైన ప్రజాస్వామ్య దేశం. 75 ఏళ్లుగా ప్రజలు సంతోషకరమైన వాతావరణంలో కలిసిమెలిసి జీవిస్తున్నారు. అక్కడక్కడా జరిగిన చిన్నపాటి గొడవలను పక్కనపెడితే ఇక్కడెంతో వైవిధ్యం, భిన్నత్వం కనిపిస్తాయి. భారత్‌లో ఈశాన్య ప్రాంతాల ప్రజలు చైనీయుల్లా, పశి్చమ ప్రాంతాల జనం అరబ్బుల్లాగా, ఉత్తరాది ప్రజలు శ్వేతజాతీయుల్లాగా, దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారు. అది పెద్ద విషయం కాదు. ఏది ఎలా ఉన్నప్పటికీ మనమంతా సోదర సోదరీమణులం. దేశంలోని విభిన్నమైన భాషలు, మతాలు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను మనం పరస్పరం గౌరవించుకుంటున్నాం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన మూలాల్లోనే ఉన్నాయి’’ అని శామ్ పిట్రోడా చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. మరోవైపు పిట్రోడా వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. పిట్రోడా రాజీనామా.. ఆమోదించిన అధిష్టానం తన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీయడంతో శామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధిష్టానం వెంటనే ఆమోదించింది. రాజీనామా చేయాలన్నది పిట్రోడా సొంత నిర్ణయమని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ చెప్పారు. -
కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి శామ్ పిట్రోడా బుధవారం(మే8) సాయంత్రం రాజీనామా చేశారు. పిట్రోడా రాజీనామా చేసిన వెంటనే పార్టీ దానిని ఆమోదించింది. భారత్‌లోని వివిధ ప్రాంతాల వారి శరీర రంగులపై పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా ఉంటారనడంపై దుమారం రేగింది. పిట్రోడా వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. పిట్రోడా వ్యాఖ్యలను ప్రధాని మోదీ కూడా ఎన్నికల ప్రచార సభలో ప్రస్తావించడంతో వివాదం పెద్ద దైంది. మొత్తం వ్యవహారం పిట్రోడా రాజీనామాతో క్లైమాక్స్‌కు చేరింది. -
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాహుల్ గాంధీ మెంటర్ ఆలోచన, వైఖరిని వెల్లడిస్తుందని అన్నారు.లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. ఇటీవల వారసత్వ పన్నుపై మాట్లాడి వివాదంలో చిక్కుకున్న ఆయన.. తాజాగా, జాత్యహంకార వ్యాఖ్యలతో తీవ్ర దుమారాన్ని రేపారు. పిట్రోడా జాతి వివక్షకు పాల్పడుతున్నారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ ఎక్స్ వేదికగా స్పందించారు. నేను దక్షిణ భారతీయురాలిని. నేను భారతీయురాలిగా కనిపిస్తున్నాను అని అన్నారు.కానీ రాహుల్ గాంధీకి గురువు పిట్రోడా జాత్యహంకారానికి మనమందరం ఆఫ్రికన్, చైనీస్, అరబ్, శ్వేతజాతీయులుగా కనిపిస్తున్నాము. మీ ఆలోచనా విధానాన్ని, మీ వైఖరిని వెల్లడించినందుకు ధన్యవాదాలు. మీ వ్యాఖ్యలు ఇండియా కూటమికే అవమానం అని మండ్డారు. కాగా, పిట్రోడా వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఖండించింది. ‘పిట్రోడా వ్యాఖ్యలు దురదృష్టకరం. ఆమోదయోగ్యం కాదు’ అని పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ స్పష్టం చేశారు. I am from South India. I look Indian! My team has enthusiastic members from north east India. They look Indian! My colleagues from west India look Indian! But, for the racist who is the mentor of @RahulGandhi we all look African, Chinese, Arab and the White! Thanks for… pic.twitter.com/UzXi4ndwhk— Nirmala Sitharaman (Modi Ka Parivar) (@nsitharaman) May 8, 2024 -
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
ఢిల్లీ: భారత దేశంలోని భిన్నత్వంపై శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆయిన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపాయి. ‘భారత దేశంలోని భిన్నత్వం గురించి శ్యామ్ పిట్రోడా అటువంటి వ్యాఖ్యలు చేయటం చాలా దృరదృష్టం. ఆమోదించదగినవి కావు. ఆయన చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు’అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు.The analogies drawn by Mr. Sam Pitroda in a podcast to illustrate India's diversity are most unfortunate and unacceptable. The Indian National Congress completely dissociates itself from these analogies.— Jairam Ramesh (@Jairam_Ramesh) May 8, 2024 ‘భారత్‌లో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. తూర్పు వైపు ఉన్న ప్రజలు చైనా వారిని పోలి ఉంటారు. దక్షిణం వైపు ఉన్న ప్రజలు అరబ్ వారిలా ఉంటారు. ఉత్తర దిక్కు వాళ్లు అయితే నల్లగా లేదా తెల్లగా ఉంటారు. దక్షిణ భారతంలోని ప్రజలు అఫ్రికా వారిలా కనిపిస్తారు’అని శ్యామ్ పిట్రోడా ఓ ఇంటర్వ్యూలో భారత్‌లో భిన్నత్వం గురించి మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు జాత్యహంకారంతో కూడినవి బీజేపీ నేతలు మండిపడ్డారు.ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ సైతం స్పందించారు. తెలంగాణలోని వరంగల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ మాట్లాడారు. ‘ శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. శరీర వర్ణం పేరుతో దేశ ప్రజలను ఎవరైనా అగౌరవ పరిస్తే.. ఎట్టిపరిస్థితుల్లో సహించబోము. మోదీ ఇలాంటి వాటిని అస్సలు సహించరు’అని మోదీ మండిపడ్డారు. -
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం.. మండిపడ్డ బీజేపీ
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నేత శ్యామ్ పిట్రోడా ఇటీవల వారసత్వ పన్నుపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటంతో.. అధికార బీజేపీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. తాజాగా ఆయన జాతీయ ఐక్యతపై చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. ఓ ఇంటర్వ్యూ భారత్ గురించి మాట్లాడారు."We could hold together a country as diverse as India, where people on East look like Chinese, people on West look like Arab, people on North look like maybe White and people in South look like Africa" 💀💀(VC : @TheStatesmanLtd) pic.twitter.com/aPQUyJflag— Darshan Pathak (@darshanpathak) May 8, 2024‘భారత్‌లో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. తూర్పు వైపు ఉన్న ప్రజలు చైనా వారిని పోలి ఉంటారు. దక్షిణం వైపు ఉన్న ప్రజలు అరబ్ వారిలా ఉంటారు. ఉత్తర దిక్కు వాళ్లు అయితే నల్లగా లేదా తెల్లగా ఉంటారు. దక్షిణ భారతంలోని ప్రజలు అఫ్రికా వారిలా కనిపిస్తారు’ అని శ్యామ్ పిట్రోడా తెలిపారు.Sam bhai, I am from the North East and I look like an Indian. We are a diverse country - we may look different but we are all one. Hamare desh ke bare mein thoda to samajh lo! https://t.co/eXairi0n1n— Himanta Biswa Sarma (Modi Ka Parivar) (@himantabiswa) May 8, 2024శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఖండించారు. ‘శ్యామ్ భాయ్.. నేను ఈశాన్య భారతీయుడను. నేను భారతీయుడిలాగే కనిపిస్తాను. భిన్నత్వమున్న దేశంలో ఉన్నా.. భిన్నంగా కనిపించినా మేమంతా ఒక్కటే అని ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ వేశారు. ముందు భారత దేశ భిన్నత్వం గురించి ఎంతోకొంత అర్థం చేసుకోవాలని శ్యామ్ ప్రిటోడాకు హితవు పలికారు. శ్యామ్ చేసిన వ్యాఖ్యలపై ఈశాన్య భారతంలోని ముఖ్యమంత్రులు, మణిపూర్ సీఎం ఎన్ బిరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. -
పిట్రోడా వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్లారిటీ.. చల్లారని దుమారం
కాంగ్రెస్ ఓవర్సీస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా వ్యాఖ్యలు దేశంలో రాజకీయ దుమారం రేపాయి. ప్రజల ఆస్తులపై కాంగ్రెస్ కన్నుపడిందన్న ప్రధాని మోదీ విమర్శలకు మరింత ఆజ్యం పోశాయి. పిట్రోడా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చినా దుమారం చల్లారలేదు.లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు.. హస్తం పార్టీని వివాదంలోకి నెట్టేశాయి. అమెరికా తరహాలో భారత్‌లోనూ వారసత్వ పన్ను విధించడంపై చర్చ జరగాలంటూ బాంబు పేల్చారు పిట్రోడా. వారసత్వ పన్ను విధానం ప్రకారం.. అమెరికాలో ఓ వ్యక్తి మరణిస్తే, అతని ఆస్తుల్లో 45 శాతం మాత్రమే వారసులకు బదిలీ అవుతుంది. మిగిలిన 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. భారత్‌లో ఇలాంటి విధానం లేదని.. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్న శామ్ పిట్రోడా వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. అలాంటి విధానాలు పౌరులకు న్యాయం చేస్తాయా అని ప్రశ్నించింది. పిట్రోడా వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. ప్రజల ఆస్తుల్ని దోచేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు.ప్రధాని మోదీ విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. పిట్రోడా ప్రకటనకు.. పార్టీకి సంబంధం లేదని.. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టంచేసింది. ఈ విషయంలో బీజేపీ కావాలని రాద్దాంతం చేస్తోందని ఆక్షేపించారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్.మరోవైపు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక సర్వే హామీపై క్లారిటీ ఇచ్చారు రాహుల్ గాంధీ. దేశంలో ఎంతమందికి అన్యాయం జరిగిందో తెలుసుకునేందుకే సర్వే చేస్తాం అంటున్నామని.. ఈ సర్వే తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పలేదన్నారు. ఈ సర్వేతో అసలు సమస్య ఏంటో, ఎక్కడుందో అర్థమవుతుందంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.శామ్ పిట్రోడా ప్రస్తావించిన వారసత్వ ఆస్తిపై పన్ను విధానం.. భారత్‌లో 1985లోనే రద్దయ్యింది. అప్పట్లో దీనిని ఎస్టేట్ ట్యాక్స్ అని పిలిచేవారు. 20లక్షలకుపైగా విలువైన ఆస్తులు వారసత్వంగా దక్కితే.. దాదాపు 85శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియాలో ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అమల్లో ఉంది. -
Sam Pitroda: వారసత్వ పన్ను.. నచ్చేస్తోంది
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం వస్తే దేశ సంపదను పునఃపంపిణీ చేస్తామంటూ కాంగ్రెస్ ఇచి్చన హామీకి మద్దతుగా ఆ పార్టీ నాయకుడు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్, సోనియా గాంధీ కుటుంబానికి సన్నిహితుడు అయిన శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన ఈ నెల 23న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికాలో వారసత్వ పన్ను అమల్లో ఉందని, అలాంటి విధానం మన దేశంలోనూ అమల్లోకి తీసుకొస్తే బాగుంటుందని పరోక్షంగా సూచించారు.‘‘అమెరికాలో వారసత్వ పన్ను చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఉదాహరణకు ఎవరికైనా 100 మిలియన్ల డాలర్ల ఆస్తి ఉండి మరణిస్తే, ఆ ఆస్తిలో కేవలం 45 శాతమే అతడి వారసులకు చెందుతుంది. మిగిలిన 55 శాతం ఆస్తిని ప్రభుత్వం స్వా«దీనం చేసుకుంటుంది. ఇది నిజంగా ఆసక్తికరమైన చట్టం. ఆస్తులు సంపాదిస్తే సమాజంలో ఇతర ప్రజల కోసం సింహభాగం వదులుకోవాలని ఈ చట్టం చెబుతోంది.సంపాదించిన వ్యక్తికే మొత్తం ఆస్తి చెందదు. దాదాపు సగ భాగమే అతడిది అవుతుంది. ఈ చట్టం నాకు నచ్చేస్తోంది’’ అని శామ్ పిట్రోడా పేర్కొన్నారు. వాస్తవానికి అమెరికా అంతటా వారసత్వ పన్ను చట్టం అమల్లో లేదు. కొన్ని రాష్ట్రాల్లోనే అమలవుతోంది. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో శామ్ పిట్రోడా బుధవారం వివరణ ఇచ్చారు. తన ఉద్దేశాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకోవడం దురదృకరమని అన్నారు. ‘గోడీ మీడియా’ వక్రభాష్యం చెబుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని మోదీ చెబుతున్న అబద్ధాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి తన వ్యాఖ్యలకు వక్రీకరించారని ఆరోపించారు. అమెరికా వారసత్వ పన్ను గురించి ఒక ఉదాహరణగా మాత్రమే చెప్పానని వివరించారు.మాకు ఆ ఉద్దేశం లేదు: జైరామ్తాజా వివాదంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పందించారు. దేశంలో వారసత్వ పన్ను విధించే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదని బుధవారం తేలి్చచెప్పారు. నిజానికి ఇలాంటి పన్నును ప్రవేశపెట్టాలన్న ఆలోచన ఉన్నట్లు బీజేపీ ప్రభుత్వమే గతంలో వెల్లడించిందని గుర్తుచేశారు. 1985లో ఎస్టేట్ పన్నును అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ రద్దు చేశారని జైరామ్ రమేశ్ తెలిపారు. -
నామ్‌దార్‌కు ఇద్దరు బ్యాట్స్‌మెన్
దేవ్‌గఢ్ (జార్ఖండ్) / పాలిగంజ్ (బిహార్)/తాకి (పశ్చిమబెంగాల్): లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోనున్న నేపథ్యంలో నామ్‌దార్‌కు బాసటగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు బ్యాట్స్మన్లను బరిలోకి దింపిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శనకు బాధ్యత వహించే పనిని ఆ పార్టీ మణిశంకర్ అయ్యర్, శామ్ పిట్రోడాలకు అప్పగించిందని విమర్శించారు. బుధవారం జార్ఖండ్‌లోని దేవ్‌గఢ్, బిహార్‌లోని పాటలీపుత్ర, పశ్చిమబెంగాల్లోని తాకి ఎన్నికల సభల్లో ఆయన మాట్లాడారు. ‘1984లో సిక్కుల ఊచకోతపై ‘అయ్యిందేదో అయిపోయింది’ అని ఒకరంటారు. ఇంకొకరు గుజరాత్ ఎన్నికల్లో నన్ను దూషించిన తర్వాత ఇన్నాళ్లూ తెరవెనుక ఉండి.. ఇప్పుడు మళ్లీ నాపై దాడికి (నీచ్ ఆద్మీ అంటూ) దిగుతున్నారు’ అని పిట్రోడా, అయ్యర్‌లను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. మే 23న ఏం జరగబోతోందనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అని సభకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలనుద్దేశించి ప్రధాని అన్నారు. కాంగ్రెస్‌కు ఈ విషయం బాగా తెలుసని, అందుకే ఫలితాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతోందని చెప్పారు. ఓటమిని ఎవరి తలపై రుద్దాలా అనే ఆలోచనలో పడిందన్నారు. నామ్‌దార్ కారణంగా ఓటమి పాలయ్యామని కాంగ్రెస్ ఎప్పుడూ చెప్పుకోదని, అది రాజవంశ సూత్రాలకు విరుద్ధమని విమర్శించారు. కేవలం ఐదో విడత ఎన్నికల తర్వాత మాత్రమే ఆ కుటుంబానికి చెందిన సమీప సభ్యులిద్దరూ సొంతగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టారని ఎద్దేవాచేశారు. బరిలోకి దిగకుండానే మ్యాచ్ ఆడే సాహసం కెప్టెన్‌ను అడక్కుండా వారు చేయరన్నారు. నిందను మోసేందుకు కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారన్నారు. ఉగ్రవాదులు, నక్సలైట్లు, వారి మద్దతుతారులను ప్రోత్సహించేలా రాజద్రోహ చట్టాన్ని నీరు గార్చాలని కాంగ్రెస్ ప్రయత్నించిందన్నారు. కానీ బీజేపీ అందుకు అనుమతించదని, తమ ప్రభుత్వం ఉగ్రవాదుల స్థావరాల్లోకి వెళ్లి మరీ దాడి చేసిందని చెప్పారు. భూతాలను తరిమినట్టు వారిని తరిమి కొట్టాలన్నారు. సైన్యానికి ఈ మేరకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామన్నారు. దేశ భద్రత ఒక అంశమే కాదని మహా కల్తీ కూటమి నేతలంటున్నారని మోదీ ఆరోపించారు. లెక్కలేనన్ని ఉగ్రదాడుల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు అది ఒక అంశంగా కాకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఢిల్లీలో కూర్చున్నవారికి గిరిజనుల బాధలు పట్టవన్నారు. ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉండబోతున్నాయంటూ.. ఈసారి బిహార్‌కు తాజా అభివృద్ధి గంగ (వికాస్ కీ గంగ)ను తీసుకువస్తానని ప్రధాని అన్నారు. అయితే మరింత గొప్ప విజయం లభించేలా చివరి విడత పోలింగ్ ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం గూండాస్వామ్యంగా మారింది పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం గూండాస్వామ్యంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెంగాల్ రాష్ట్రంలో ఆత్యయిక స్థితిని సృష్టించారనీ, ప్రతీ దాన్ని నాశనం చేయడానికి ఆమె ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మోదీ ధ్వజమెత్తారు. ప్రజల ధైర్యం, నిశ్చయాలే ఆమె ‘తీవ్ర బాధాకరమైన పాలన’ నుంచి విముక్తి కల్పిస్తాయని మోదీ అన్నారు. ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు జిల్లాల్లో మోదీ బుధవారం ప్రచారం నిర్వహించారు. బెంగాల్‌లోని 42 సీట్లలో తమ పార్టీయే అధిక సీట్లు గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
పిట్రోడా బహిరంగ క్షమాపణ చెప్పాలి
ఖన్నా(పంజాబ్): 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లపై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు తమ పార్టీ నేత అయిన శ్యామ్ పిట్రోడా సిగ్గుపడాలని, దేశ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ పేర్కొన్నారు. సోమవారం పంజాబ్‌లోని ఖన్నాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. ‘పిట్రోడా జీ, మీరలా అనడం పూర్తిగా తప్పు. అందుకు మీరు సిగ్గుపడాలి. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయనకు ఫోన్లో చెప్పా. అదే విషయాన్ని ఇప్పుడు బహిరంగంగా మీకు వెల్లడిస్తున్నా’ అని రాహుల్ అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో నోట్లరద్దు, జీఎస్టీ కారణంగా ప్రజల కొనుగోలు శక్తిని పూర్తిగా హరించి వేశాయని, లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు, రైతులకు మద్దతు ధర, ప్రతి బ్యాంకు అకౌంట్లో రూ.15 లక్షల జమ వంటి గత ఎన్నికల హామీలను బీజేపీ విస్మరించిందని మండిపడ్డారు. బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. రఫేల్ ఒప్పందంపై 15 నిమిషాల బహిరంగ చర్చకు వచ్చేందుకు కూడా ఆయన భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రధాని మోదీ విమర్శించడం అంటే దేశ ప్రజలను విమర్శించడమేనని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల కోసం న్యాయ్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ పథకం కింద పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.72 వేలు చొప్పున జమ కావడమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. 1984లో దేశరాజధానిలో సిక్కుల ఊచకోతపై కాంగ్రెస్ ఓవర్సీస్ విభాగం చీఫ్ శ్యామ్ పిట్రోడా ‘జరిగిందేదో జరిగిపోయింది’ అంటూ మాట్లాడటంపై తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో చేసిన ఇలాంటి వ్యాఖ్యలను ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తుండటంతో నష్ట నివారణకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు. -
శ్యామ్ పిట్రోడా సిగ్గుపడాలి : రాహుల్ గాంధీ
చండీగఢ్ : 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడాపై ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు సిగ్గుపడాలని, జాతి మొత్తానికి క్షమాపణ చెప్పాలని సూచించారు. బీజేపీని విమర్శించే క్రమంలో శ్యామ్ పిట్రోడా మాట్లాడుతూ.. ‘1984లో జరిగిందేదో జరిగిపోయింది. అయితే ఇప్పుడేంటి’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ లక్ష్యంగా బీజేపీ సహా ఇతర పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చదవండి : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు; అయితే ఇప్పుడేంటి? ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పంజాబ్‌లోని ఫతేగర్ సాహిబ్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘ 1984 ఘటన గురించి శ్యామ్ పిట్రోడా అలా మాట్లాడటం పెద్ద తప్పు. జాతి మొత్తానికి బహిరంగంగా ఆయన క్షమాపణ చెప్పాలి. ఈ విషయం గురించి ఆయనతో ఫోన్లో మాట్లాడాను. మీ వ్యాఖ్యలకు సిగ్గుపడాలని చెప్పాను’ అని పేర్కొన్నారు. కాగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీని 1984లో ఆమె అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాత్‌సింగ్‌లు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఇందిరా గాంధీని హత్య చేసింది సిక్కు మతస్తులు కావడంతో సిక్కులకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. ఈ ఘటనలో అనేక మంది సిక్కు సోదరులు అసువులు బాసారు. -
ఆ వ్యాఖ్యలే కాంగ్రెస్ స్వభావం
రోహతక్: సిక్కుల ఊచకోత ఉదంతంపై కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ స్వభావాన్ని, లక్షణాన్ని తెలియజేస్తున్నాయంటూ ప్రధాని మోదీ అన్నారు. ‘1984లో అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడేంటి?’ అని పిట్రోడా వ్యాఖ్యానించడం తెల్సిందే. మోదీ హరియాణాలోని రోహ్తక్, హిమాచల్ ప్రదేశ్‌లోని మండిల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘కాంగ్రెస్ పార్టీ మనుషులు ఎంత దురహంకారులో పిట్రోడా చెప్పిన ఒక్క మాటలో తెలిసిపోయింది. ఈ మాటలే కాంగ్రెస్ గుణం, ఉద్దేశం’ అని మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. వాళ్లకు ప్రాణమంటే విలువలేదు కాంగ్రెస్ పార్టీ మనుషులకు ప్రాణం అంటే అసలు విలువే లేదనీ, మనిషిని వాళ్లు ఎప్పుడూ మనిషిగా గుర్తించరంటూ కాంగ్రెస్‌పై మోదీ మాటల దాడి చేశారు. ఒక్క ఢిల్లీలోనే 1984లో 2,800 మందికి పైగా సిక్కులను ఊచకోత కోశారనీ, మిగిలిన చోట్ల కూడా ఈ హత్యలు జరిగాయని మోదీ అన్నారు. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై సోనియా, రాహుల్‌లు దేశప్రజలకు క్షమాపణ చెప్పాలని పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ మిత్రపక్షాల నేతలు డిమాండ్ చేశారు. విడదీయాలనుకుంటున్నారు: పిట్రోడా తన మాటల్లో బీజేపీ పెడార్థాన్ని తీస్తోందనీ, వాస్తవాలను పక్కదోవ పట్టించి, వారి వైఫల్యాలను మరుగుపరిచి, కాంగ్రెస్ నుంచి తనను విడదీసేందుకే ఆ పార్టీ ఇలా చేస్తోందని పిట్రోడా ఆరోపించారు. గతంలో జరిగిన విషయాలకు, ప్రస్తుత ఎన్నికలకు సంబంధం లేదని పిట్రోడా అన్నారు. పిట్రోడా క్షమాపణ చెప్పాల్సిందే: రాహుల్ న్యూఢిల్లీ: సిక్కుల ఊచకోతపై వ్యాఖ్యలకు శామ్ పిట్రోడా క్షమాపణ చెప్పాల్సిందేనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. ‘పిట్రోడా మాటఅనుచితం, గర్హనీయం. నేను ఆయనతో ఈ విషయమై నేరుగా మాట్లాడతాను. ఆయన కచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే’ అని రాహుల్ అన్నారు. 1984 నాటి సిక్కుల ఊచకోత ఘటన ఎంతో విషాదకరమైనదనీ, తీవ్ర బాధను కలిగించిందని, బాధితులకు న్యాయం జరగడంతోపాటు నేరస్తులను శిక్షించాలని ఆయన పేర్కొన్నారు. -
‘క్షమించండి.. భాష రాకపోవడం వల్లే ఇలా జరిగింది’
న్యూఢిల్లీ : నాకు హిందీ సరిగా రాదు. దాంతో వాళ్లు నా మాటల్ని వక్రీకరించారు అంటున్నారు కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ పిట్రోడా. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి పిట్రోడా అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. బీజేపీ నాయకులతో పాటు.. సిక్కు సంఘాల నాయకులు కూడా శ్యామ్ పిట్రోడా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దాంతో దిగొచ్చిన శ్యామ్ పిట్రోడా క్షమాపణలు చెప్పడమే కాక.. ‘నాకు హిందీ సరిగా రాదు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి ‘జరిగింది చాలా దారుణం’ అని చెప్పాలనుకున్నాను. కానీ భాష సరిగా రాకపోవడంతో బురా(చెడ్డది) అనే పదాన్ని బయటకు అనలేకపోయాను. దాన్ని బీజేపీ వినియోగించుకుంది. నా మాటల్ని పూర్తిగా వక్రీకరించింది. సిక్కుల ఊచకోత దారుణం అని నా అభిప్రాయం. కానీ దాన్ని సరిగా వ్యక్తపర్చలేకపోయాను. ఇందుకు నన్ను క్షమించండి’ అన్నారు శ్యామ్ పిట్రోడా. Sam Pitroda, Congress: What I meant was move on. We have other issues to discuss as to what BJP govt did and what it delivered. I feel sorry that my remark was misrepresented, I apologise. This has been blown out of proportion. https://t.co/PV5Im5hzce — ANI (@ANI) May 10, 2019 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లలో నానావతి కమిషన్ ఇచ్చిన నివేదికలో.. భారతదేశంలో చెలరేగిన మారణహోమంలో ఇది ఒకటి. ప్రభుత్వమే తన సొంత పౌరులను పొట్టనబెట్టుకుంది అని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రధాని రాజీవ్ గాంధీ కార్యాలయం నుంచే ఆదేశాలు వచ్చాయి. ఈ కర్మకు వాళ్లు ఫలితం అనుభవించే రోజును చూడాలని దేశం మొత్తం ఎదురుచూస్తోంది’ అంటూ బీజేపీ ట్వీట్ చేసింది. ఈ విషయంపై స్పందించిన శ్యామ్ పిట్రోడా.. ‘ అప్పుడేం జరిగింది? ఆ విషయాన్ని పక్కనబెట్టి ఈ ఐదేళ్లలో ఏం జరిగిందో దాని గురించి మాట్లాడండి. 1984లో జరిగిందేదో జరిగిపోయింది. అయితే ఇప్పుడేంటి? అదే విధంగా రాజీవ్ గాంధీ ఐఎన్ఎస్ విరాట్‌ను సొంత ట్యాక్సీలా వాడుకున్నారనేది అబద్ధం. బాధ్యత ఉన్న నేవీ అధికారులు ఈ విషయంపై స్పందిస్తారని ఆశిస్తున్నా’ అని వ్యాఖ్యానించడంతో ఈ వివాదం ప్రారంభమయ్యింది. -
జరిగిందేదో జరిగింది.. అయితే ఇప్పుడేంటి?
న్యూఢిల్లీ : 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్యామ్ పిట్రోడా క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఢిల్లీలో జరిగిన అల్లర్లలో సిక్కులు మరణించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ...‘ 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లలో నానావతి కమిషన్ ఇచ్చిన నివేదికలో.. భారతదేశంలో చెలరేగిన మారణహోమంలో ఇది ఒకటి. ప్రభుత్వమే తన సొంత పౌరులను పొట్టనబెట్టుకుంది అని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రధాని రాజీవ్ గాంధీ కార్యాలయం నుంచే ఆదేశాలు వచ్చాయి. ఈ కర్మకు వాళ్లు ఫలితం అనుభవించే రోజును చూడాలని దేశం మొత్తం ఎదురుచూస్తోంది’ అంటూ బీజేపీ ట్వీట్ చేసింది. ఈ విషయంపై స్పందించిన శ్యామ్ పిట్రోడా.. ‘ అప్పుడేం జరిగింది? ఆ విషయాన్ని పక్కనబెట్టి ఈ ఐదేళ్లలో ఏం జరిగిందో దాని గురించి మాట్లాడండి. 1984లో జరిగిందేదో జరిగిపోయింది. అయితే ఇప్పుడేంటి? అదే విధంగా రాజీవ్ గాంధీ ఐఎన్ఎస్ విరాట్‌ను సొంత ట్యాక్సీలా వాడుకున్నారనేది అబద్ధం. బాధ్యత ఉన్న నేవీ అధికారులు ఈ విషయంపై స్పందిస్తారని ఆశిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. కాగా శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ, శిరోమణి అకాలీదళ్ నేతలు మండిపడుతున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన పిట్రోడా వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. ‘ సిక్కు సమాజం ఎంతో వేదన అనుభవించింది. 1984లో కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురైన వారి కుటుంబాలు ఇప్పటికీ బాధ పడుతూనే ఉన్నాయి. ఢిల్లీలో జరిగిన ఈ దాడిపై శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు ఇవి.. జరిగిందేదో జరిగిపోయిందట. భారత్ ఇలాంటి పాపాలు చేసిన కాంగ్రెస్ హంతకులను ఎన్నటికీ క్షమించబోదు అంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ట్వీట్ చేశారు. ఇక మాజీ ప్రధాని ఇందిరా గాంధీని 1984లో ఆమె అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాత్‌సింగ్‌లు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఇందిరా గాంధీని హత్య చేసింది సిక్కు మతస్తులు కావడంతో సిక్కులకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. ఈ క్రమంలో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో సిక్కు యువకులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. 34 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈ కేసులో ఢిల్లీ కోర్టు ఇటీవలే తీర్పు వెలువరించింది. ఈ కేసులోని నిందితుల్లో ఒకరికి మరణ శిక్ష, మరొకరికి యావజ్జీవ శిక్షను విధించింది. ఈ కేసులో దోషులుగా తేలిన యశ్పాల్ అనే వ్యక్తికి ఉరిశిక్ష, నరేష్ అనే వ్యక్తికి జీవిత ఖైదు ఖరారు చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. Agony of the entire Sikh community. Suffering of all those Sikh families killed by Congress leaders in 1984. Attack on Delhi’s secular ethos. All Summed up in these three words by Sam Pitroda - Hua To Hua. India will never forgive #MurdererCongress for its sins. pic.twitter.com/ouYXeHJHlf — Chowkidar Amit Shah (@AmitShah) May 9, 2019 -
‘మోదీ ఫోన్ చేసుంటే సరిపోయేది’
సాక్షి, న్యూఢిల్లీ: ‘మోదీతో నాకు మంచి పరిచయం ఉంది. బాలాకోట్ దాడులను ఉద్దేశించి నేను చేసిన వ్యాఖ్యలపై ఆయనకు అభ్యంతరాలుంటే నాకు ఫోన్ చేసుంటే సరిపోయేద’ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సలహాదారు శ్యామ్ పిట్రోడా అన్నారు. బాలాకోట్‌లో వాయుసేన జరిపిన దాడులపై ఇటీవల పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. ఈ వివాదానికి సంబంధించిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. ‘నేను చెప్పిన మాటల్ని వక్రీకరించారు. నేనొకవేళ తప్పుగా మాట్లాడి ఉంటే క్షమాపణలు అడిగేవాడ్ని. నేను గాంధీ తత్వాన్ని పాటించే గుజరాతీ కుటుంబంలో పుట్టాను. హింసను విడనాడి.. సత్యం, ప్రేమకు దగ్గరగా ఉండాలని నమ్మే సిద్ధాంతం మాది. ఒకరి మీద ఇంకొకరు బాహ్య దాడి చేయడాన్ని సమర్థించను. దాని బదులు మన అంతరంగాన్ని బలపరుచుకోవడమే మేలని నమ్ముతాను. నేను స్వతహాగా హింసను వ్యతిరేకిస్తాను. ముంబై ఉగ్రఘాతుకం తర్వాత ముష్కరులపై అప్పటి మన్మోహన్ ప్రభుత్వం ప్రతిదాడులకు దిగకపోవడాన్నీ సమర్థిస్తా.. అలాగే ఇప్పటి పుల్వామా ఘటనకు ప్రతీకారంగా బాలాకోట్‌లో మన వాయుసేన జరిపిన దాడులకూ మద్దతిస్తాను. ఈ రెండు సంఘటనలు ఆయా ప్రభుత్వాల నిర్ణయమని నేనన్నాను. ఒకసారి సర్కార్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను. హింసతో దేన్నీ సాధించలేము. ఇవి నేను పార్టీపరంగా కాకుండా వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు. ప్రధాని హోదాలో మోదీ అలా వ్యవహరించి ఉండాల్సింది కాదు. వీటిపై అభ్యంతరాలుంటే మోదీ నన్ను సంప్రదించి ఉండాల్సింద’ని పిట్రోడా వివరించారు. -
‘కాంగ్రెస్ గెలిస్తే.. పాక్‌లో దీపావళి’
గాంధీనగర్ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గనుక గెలిస్తే.. పాక్ దీపావళి పండుగ జరుపుకుంటుందని బీజేపీ సీనియర్ నేత, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆరోపించారు. బాలాకోట్‌లో జరిగిన మెరుపు దాడులకు సంబంధించి ఆధారాలు చూపాలంటూ శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఆదివారం బీజేపీ పార్టీ అధ్వర్యంలో జరిగిన ‘విజయ్ సంకల్ప్’ ర్యాలీ ప్రారంభోత్సవానికి హాజరైన విజయ్ రూపానీ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ ఉగ్రవాదులకు పుట్టినిల్లు అనే విషయం ప్రపంచానికంతటికి తెలుసు. కానీ రాహుల్ గాంధీ టీచర్ శామ్ పిట్రోడా మాత్రం ఎవరో పది మంది ఉగ్రవాదులు చేసిన పనికి పాకిస్తాన్‌ను నిందించడం సరికాదంటూ ఆ దేశం తరఫున వకల్తా పుచ్చుకుంటారు. పైగా సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన ఆధారాలను చూపించమంటూ డిమాండ్ చేస్తారు. దేశం కోసం ప్రాణాలర్పించే సాయుధ బలగాలను పదే పదే అవమానించడం విపక్షాలకు అలవాటుగా మారిందం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ‘ఒక వేళ మే 23న గనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. పాక్ దీపావళి చేసుకుంటుంది. ఎందుకంటేం పాక్, కాంగ్రెస్ ఎల్లప్పుడు కలిసే ఉంటాయి’ అంటూ విమర్శల వర్షం కురిపించారు. మోదీ భాయ్ భారత్‌ను రామ రాజ్యంగా మార్చలనుకుంటున్నారన్నారు. కానీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్‌లు, టెర్రరిస్ట్‌లు, నక్సలైట్లు, అవినీతిపరులు, మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేష్, చంద్రబాబు లాంటి స్వార్థ ప్రతిపక్ష నేతలు మోదీని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అయితే జనాలు వారి ఆటలు సాగనివ్వరని తెలిపారు. పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాలంటే మోదీనే మరోసారి గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. -
నిరుద్యోగ నిర్మూలనే నినాదం
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశం ఎదుర్కొనే సమస్యల్లో నిరుద్యోగమే అతిపెద్ద సమస్యని, ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అదే ప్రధాన ప్రచారాస్త్రం కానుందని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు శ్యామ్ పిట్రోడా అన్నారు. దేశంలో వ్యవసాయ సంక్షోభం నెలకొందని, ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో అది కూడా ఒకటని ఆయన తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ తీవ్ర ప్రభావం చూపనుంద న్నారు. ‘‘నిరుద్యోగం.. నిరుద్యోగం.. నిరుద్యోగం.. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం. కానీ, ఇప్పటికీ మనం కొత్త ఉద్యోగాలను సృష్టించలేకపోయాం. ఇప్పుడు కొత్త ఉద్యోగాలను ఏవిధంగా సృష్టించాలన్నదే నిజమైన సవాలు. దేశంలో ఇంత భారీగా నిరుద్యోగం పెరిగిపోవడానికి కారణం నోట్ల రద్దు, జీఎస్టీనే. ఇప్పుడు గనుక మనం నిరుద్యోగంపై దృష్టి పెట్టకపోతే ఇదో పెద్ద సమస్యగా తయారై పోతుంది’’ అని హెచ్చరించారు. కచ్చితంగా నిరుద్యోగ సమస్యను కాంగ్రెస్ రూపుమాపగలదా అని ప్రశ్నించగా అందుకు సమాధానమిస్తూ...‘‘ మీరే చూస్తారుగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను. వివిధ రాజకీయపార్టీల భాగస్వామ్యంతో కూటమిని ఏర్పాటు చేసి త్వరలోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోదీకి సరైన పోటీదారు అని అనుకుంటున్నారా అన్న ప్రశ్నగా...‘‘ఎన్నికల్లో పోటీని ఇద్దరు వ్యక్తుల మధ్య సవాళ్లుగా చూడొద్దని సమాధానమిచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ఈ ఎన్నికలు ప్రేమకు, విద్వేషానికి మధ్య, భావజాలాలకు మధ్య జరిగే పోటీ అని ఆయన స్పష్టం చేశారు. -
పాక్‌పై ఐఏఎఫ్ దాడి తప్పు
న్యూఢిల్లీ: పుల్వామా ఘటనకు ప్రతీకారంగా పాక్‌పై ఐఏఎఫ్ జరిపిన దాడులను కాంగ్రెస్ ఓవర్సీస్ విభాగం అధ్యక్షుడు శామ్ పిట్రోడా తప్పుపట్టారు. బాలాకోట్‌లోని ఉగ్ర శిక్షణ శిబిరాలపై దాడికి సంబంధించి మరిన్ని వివరాలను ముఖ్యంగా మృతుల సంఖ్యను వెల్లడించాలని పిట్రోడా శుక్రవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘వాళ్లు(ఐఏఎఫ్) 300 మంది ఉగ్రవాదులను చంపడం సరే. దీనిని నిరూపించేందుకు తగిన ఆధారాలు చూపగలరా?. సరిహద్దు అవతలి నుంచి కొందరు ఇక్కడికి వచ్చి దాడులు చేశారు. ఇంతకు ముందు ఇలాంటివి ఎన్ని జరగలేదు? ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ముంబైలోనూ దాడి జరిగింది. దీనిపై స్పందించిన అప్పటి యూపీఏ వెంటనే సరిహద్దుల్లోకి విమానాలను పంపించలేదు. కానీ, ఒక సంఘటన ఆధారంగా ఇలా చేయడం దాడి చేయడం సరైన విధానం కాదు’ అన్నారు. ‘కొందరు ఉగ్రవాదులు జరిపిన దాడికి పాక్‌ను శిక్షించడం సరికాదు. 8మంది ఉగ్రవాదులు వచ్చి ముంబైలో దాడి చేశారు. అంతమాత్రాన పాక్‌పై విరుచుకుపడతారా? కొందరు వ్యక్తులు చేసిన పనికి దేశ ప్రజలందరినీ తప్పుపడతారా? ప్రధాని తీరు నిరాశ కలిగించింది ‘నేను కొన్ని వివరాలు మాత్రమే అడిగా. అదీ వ్యక్తిగతంగానే, ఇందులో కాంగ్రెస్ ప్రమేయమేమీ లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కుంది. దానిపై అంతగా స్పందించాల్సిన అవసరం లేదు. అదీకూడా ప్రధానిస్థాయి వ్యక్తి. ఆయన సమాధానంతో నిరాశ చెందా’ అన్నారు. ‘మోదీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే పుల్వామా ఘటన చేసుకుంది. బాలాకోట్‌పై ఐఏఎఫ్ జరిపిన దాడి మన బలగాల సాహసానికి ప్రతీక. ప్రధాని మోదీ, బీజేపీ తమ వ్యక్తిగత అభిప్రాయాలను విద్వేషాన్ని ప్రచారం చేసుకోవడానికి వాడుకోవడం ఆపాలి. సైనిక బలగాల త్యాగాలను స్వార్థానికి వాడుకోవడం మానాలి’ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ప్రజలు క్షమించబోరు: మోదీ శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని విరుచుకుపడ్డారు. ఆయన తన మాటలతో పాక్ జాతీయ దినోత్సవాలకు అంకురార్పణ చేశారంటూ ఎద్దేవా చేశారు. ఉగ్రవాదులను క్షమించే సహజ స్థావరాలుగా మారాయంటూ ప్రతిపక్షాలను విమర్శించారు. శుక్రవారం ఆయన ట్విట్టర్లో ప్రజలు క్షమించరు(జన్తా మాఫ్ నహీ కరేగీ)అనే హ్యాష్‌ట్యాగ్‌తో స్పందించారు. ‘కాంగ్రెస్ రాచ కుటుంబానికి విశ్వాసపాత్రుడొకరు ప్రజలకు ఇప్పటికే తెలిసిన విషయాన్ని మరోసారి అంగీకరించారు. ఉగ్ర మూకల చర్యలకు దీటుగా బదులివ్వడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. ఉగ్రవాద చర్యలకు వారికి అర్థమయ్యే భాషలో బదులిచ్చాం. మన బలగాల త్యాగాలను అవమానిస్తూ ప్రకటనలు చేస్తున్న ప్రతిపక్ష నేతలను ప్రశ్నించాలని భారతీయులకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతిపక్షాల చేష్టలను 130 కోట్ల మంది భారతీయులు క్షమించబోరు, మర్చిపోరు’ అని అన్నారు. -
ప్రశ్నించడం మా హక్కు: అఖిలేష్ యాదవ్
లక్నో: బీజేపీ భారత ఆర్మీలా వ్యవహరించడం మానాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ శుక్రవారం మండిపడ్డారు. ఆర్మీని అవమానిస్తున్నాయని ప్రధాని మోదీ ప్రతిపక్ష పార్టీలపై ఎదురుదాడికి దిగిన నేపథ్యంలో అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మోదీ ప్రభుత్వం ఆర్మీలా వ్యవహరిస్తోంది. రాజకీయ నాయకులను ప్రశ్నించడం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు. తమనెవరూ ప్రశ్నించొద్దని భావించే ప్రభుత్వాలు ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరమైనవ’’ని మోదీకి ఘాటుగా జవాబిచ్చారు. ఇదిలా ఉండగా.. ‘‘పుల్వామా లాంటి దాడులు కాంగ్రెస్ హయాంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ ప్రభుత్వంలో కూడా పలుమార్లు జరిగాయి. 2008లో ముంబైలో ఉగ్రదాడి జరిగినప్పుడు అప్పటి యూపీఏ ప్రభుత్వం పాక్‌పై సైనిక యుద్ధ విమానాలను పంపింది. కానీ కొందరు ఉగ్రవాదులు చేసిన పనికి మొత్తం పాకిస్తాన్‌పై దాడి చేయడాన్ని సరైన చర్యగా తాను భావించలేద’’ని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సలహాదారు శ్యామ్ పిట్రోడా ఇటీవల చేసిన వ్యాఖ్యలకు జవాబుగా మోదీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. ‘కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు అందరికీ తెలిసినవే. ఉగ్రవాదులకు దీటుగా కాంగ్రెస్ ఎప్పుడూ బదులివ్వలేదు. కానీ ఇది నూతన భారతదేశం. మేం టెర్రరిస్టులకు వారి భాషలో వారికి అర్థమయ్యేలా సరైన జవాబులు ఇవ్వగలమని పరోక్షంగా ప్రతి దాడులు చేస్తామ’ని మోదీ విరుచుకుపడ్డారు. -
‘పిట్రోడా.. దేశం మిమ్మల్ని క్షమించదు’
న్యూఢిల్లీ : పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై భారత వాయుసేన జరిపిన దాడులను తప్పు పడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. భారత బలగాలను కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు మోదీ. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన మోదీ కాంగ్రెస్‌ను విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ‘ఉగ్రదాడికి దీటుగా బదులివ్వడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. ఇప్పుడు ఆ విషయాన్ని కాంగ్రెస్ రాజకుటుంబానికి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి కూడా ఒప్పుకున్నారు. ఉగ్రవాదుల పక్షాన మాట్లాడటం, మన సాయుధ బలగాలను ప్రశ్నించడం విపక్షాలకు అలవాటుగా మారింది. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేస్తున్న జవాన్లను ప్రతిపక్ష నేతలు పదే పదే అవమానిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని ఈ దేశ ప్రజలు క్షమించర’ని హెచ్చరించారు. అంతేకాక ‘ఈ దేశ ప్రజలను నేను కోరేది ఒక్కటే.. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేతలను ప్రశ్నించండి. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలను క్షమించబోమని వారికి అర్థమయ్యేలా వారి భాషలోనే చెప్పండి. జవాన్లకు ఈ దేశం మద్దతుగా నిలుస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. (పాక్‌పై దాడి చేయడం సరి కాదు : పిట్రోడా) Loyal courtier of Congress’ royal dynasty admits what the nation already knew- Congress was unwilling to respond to forces of terror. This is a New India- we will answer terrorists in a language they understand and with interest! https://t.co/Mul4LIbKb5 — Chowkidar Narendra Modi (@narendramodi) March 22, 2019 -
పాకిస్తాన్‌పై దాడి చేయడం మంచి పద్దతి కాదు
-
పాక్‌పై దాడి చేయడం సరి కాదు : పిట్రోడా
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ దాడులను ఎన్నికల జిమ్ముక్కుగా విమర్శిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్‌పై దాడులు చేయడం మంచి పద్దతి కాదన్నారు. పుల్వామా ఉగ్రదాడిపై స్పందిస్తూ.. ‘ఈ దాడుల గురించి నాకు పూర్తిగా తెలీదు. కానీ ఇలాంటి దాడులు గతంలో జరిగాయి. ముంబైలో కూడా చోటు చేసుకున్నాయి. ఇలాంటి దాడులు జరిగిన వెంటనే ప్రతీకారంగా మనం మన విమానలను పాకిస్తానపై దాడులకు పంపడం చేస్తాం. కానీ కొందరు ఉగ్రవాదులు చేసిన పనికి మొత్తం పాకిస్తాన్‌పై దాడి చేయడం మంచి పద్దతి కాదు. ఇలాంటి దాడులు చేసే వారు ప్రపంచంతో ఎలా వ్యవహరిస్తారో నాకు అర్థం కావడం లేద’ని తెలిపారు. ఈ సందర్భంగా ముంబై దాడులను గుర్తు చేసుకుంటూ.. ‘ఓ 8 మంది వచ్చి మన దేశంలో దాడులు చేసి వెళ్లారు. ఈ చర్యలకు ఆ దేశాన్ని మొత్తం నిందించడం సరికాదు. ప్రతీకార దాడులను నేను నమ్మన’ని స్పష్టం చేశారు. (‘పుల్వామా’ను మర్చిపోం: దోవల్) Sam Pitroda,Indian Overseas Congress Chief on #PulwamaAttack:Don’t know much about attacks,it happens all the time,attack happened in Mumbai also,we could have then reacted and just sent our planes but that is not right approach.According to me that’s not how you deal with world. pic.twitter.com/QZ6yXSZXb2 — ANI (@ANI) March 22, 2019 -
రాహుల్–ప్రియాంక ద్వయం కీలకం: పిట్రోడా
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఫలితాలను ప్రభావితం చేయడంలో రాహుల్– ప్రియాంక ద్వయం కీలకంగా మారనున్నారని సాంకేతిక నిపుణుడు, కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా అన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్–ప్రియాంక ద్వయంతోపాటు సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సిందియా, మిలింద్ దేవ్రా వంటి యువనేతలతో మంచి బృందం ఏర్పడిందని ఆయన కితాబునిచ్చారు. భవిష్యత్తుపై కొత్త దార్శనికత, ఉద్యోగ కల్పనపై శ్రద్ధ, అందరికీ అవకాశాలు కల్పించగలిగిన నేత దేశానికి అవసరమన్నారు. 2014 ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఎన్నో విషయాలను ఆకళింపు చేసుకుని ‘పరిణతి పొందిన, తెలివైన, దృఢమైన నేతగా దేశ ప్రధాని పదవికి అర్హత సాధించారు. ఆయనకు వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాలు లేవు. దేశం కోసం, ప్రజల కోసం పనిచేయడంపైనే ఆయన శ్రద్ధంతా’అని వివరించారు. ప్రియాంక ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించడంపై ఆయన స్పందిస్తూ.. ఆమె మంచి రాజకీయనేత, పార్టీకి ఆమె గొప్ప ఆస్తి’అని అభివర్ణించారు. తన అన్న రాహుల్‌తోపాటు ఆమె కూడా యువతను ముఖ్యంగా మహిళలను ఆకట్టుకోవడంలో ముందుంటారు’అని చెప్పారు. ‘కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక రాహుల్ ప్రజాదరణ బాగా పెరిగింది. ఆయన స్వేచ్ఛగా తన నిర్ణయాలను అమలు చేసే వీలు చిక్కింది. పార్టీలోకి యువ నాయకుల బృందాన్ని తయారు చేసుకుంటున్నారు. పాత తరం నాయకులను గౌరవిస్తున్నారు’అని తెలిపారు. ఎన్నికల్లో ఈవీఎంల వాడకంపై ఆయన మాట్లాడుతూ.. ఎక్కడా కూడా భారత్‌లో మాదిరిగా ఈవీఎంల సాంకేతికతను వాడటం లేదు. ఈవీఎంల పనితీరుపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దానిని విస్మరించడం సరికాదు’అని పేర్కొన్నారు. ఏఐసీసీ ఓవర్సీస్ విభాగం అధ్యక్షుడు, గాంధీ కుటుంబానికి చిరకాల మిత్రుడు అయిన శామ్ పిట్రోడా.. రాజీవ్ గాంధీ హయాంలో సీ–డాట్ ఏర్పాటుకు, యూపీఏ హయాంలో నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్, నాలెడ్జి కమిషన్ల ఏర్పాటుకు కృషి చేశారు. -
ఆలయాలు ఉద్యోగాలను సృష్టించలేవు
గాంధీనగర్: దేవాలయాలు ఉద్యోగాలను సృష్టించలేవనీ, ఆ శక్తి కేవలం సైన్స్ కు మాత్రమే ఉందని ప్రముఖ సాంకేతిక నిపుణుడు శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. ‘ఉద్యోగకల్పన, ఎంట్రప్రెన్యూర్షిప్’ అంశంపై గుజరాత్‌లోని కర్ణావతి విశ్వవిద్యాలయంలో పిట్రోడా మాట్లాడారు. ‘దేశంలో దేవాలయం, మతం, దేవుడు, కులం గురించి వాదోపవాదాలు విన్నప్పుడు నాకు ఇండియా గురించి చాలా బాధ కలుగుతుంది. ఆలయాలు రేపు ఉద్యోగాలను సృష్టించలేవు. కేవలం సైన్స్ మాత్రమే భవిష్యత్‌ను సృష్టించగలదు. యువతకు అనర్హులైన రాజకీయ నేతలు పనికిమాలిన విషయాలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని పిట్రోడా చెప్పారు. ప్రస్తుతం టెలికాం రంగం తరహాలో మరో పదేళ్లలో ఇంధనం, 20 ఏళ్లలో రవాణా కారు చౌకగా మారిపోతాయన్నారు. -
కాలిఫోర్నియా వర్సిటీలో రాహుల్ ప్రసంగం
వాషింగ్టన్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అమెరికా బర్క్లీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సోమవారం ప్రసంగించనున్నారు. భారత్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల గురించి ఆయన ఉపన్యసిస్తారు. రాహుల్ తాత, తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా బర్క్లీలో 1949లో ఓ సారి ఉపన్యాసం ఇచ్చారు. దాదాపు రెండు వారాలపాటు రాహుల్ అమెరికాలో ఉంటారని ఆయన పర్యటన ఏర్పాట్లు చూస్తున్న ప్రముఖ సాంకేతిక నిపుణుడు శ్యాం పిట్రోడా చెప్పారు. రాహుల్ అమెరికాలోని రాజకీయ నాయకులను, వివిధ రంగాల్లోని నిపుణులను, భారత సంతతి ప్రజలను ఈ వారంలో కలవనున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, అవకాశాలపై వివిధ దేశాలకు చెందిన నిపుణులతో రాహుల్ చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారని శ్యాం పిట్రోడా వెల్లడించారు. భారత సంతతి ప్రజలను రాహుల్ న్యూయార్క్‌లో కలుసుకుంటారన్నారు. అమెరికాలో అధికార రిపబ్లికన్ పార్టీ నాయకులతో కూడా రాహుల్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ‘ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఏం జరుగుతోంది? ప్రపంచ దృక్కోణం ఎలా ఉంది? అనే విషయాలను రాహుల్ మరింతగా అర్థం చేసుకోవాలనుకుంటున్నార’ని శ్యాం పిట్రోడా చెప్పారు. రాహుల్ గాంధీ అమెరికాలో బహిరంగ సమావేశాలు నిర్వహించడం, రాజకీయ నాయకులతో భేటీ అవ్వడం, ఉపన్యాసాలివ్వడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలోనూ రాహుల్ ప్రసంగించనున్నారు. -
ఒడిశా సాంకేతిక సలహాదారుగా పిట్రోడా
భువనేశ్వర్: జాతీయ విజ్ఞాన కమిషన్ మాజీ చైర్మన్, ప్రధానమంత్రి మాజీ సలహాదారు శామ్ పిట్రోడా ఒడిశా ప్రభుత్వ సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ట్వీటర్ ద్వారా వెల్లడించారు. 'శామ్ పిట్రోడాను ఒడిశా ప్రభుత్వ సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 2036 విజన్ ఒక రూపం సంతరించుకోబోతోంది' అని ట్వీట్ చేశారు. శామ్ పిట్రోడాకు రాష్ట్ర కేబినెట్ ర్యాంకు హోదా కల్పించారు. ఒడిశా ప్రభుత్వం చేపట్టిన విజన్ 2036 కోసం ఆయన పనిచేయనున్నారు. ఒడిశాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతో విజన్ 2036 డాక్యుమెంట్ ను ఇటీవల నవీన్ పట్నాయక్ ప్రకటించారు. -
రానున్న పదేళ్లు దేశాభివృద్ధికి ఎంతో కీలకం
‘మీట్ ది ప్రెస్’లో ప్రధానమంత్రి సలహాదారు శ్యామ్ పిట్రోడా సాక్షి, బెంగళూరు: రానున్న పదేళ్లు భారతదేశ అభివృద్ధికి ఎంతో కీలకమైనవని ప్రధానమంత్రి సలహాదారు శ్యామ్ పిట్రోడా పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశ అభివృద్ధి ఒక కూడలి వరకు చేరుకుందని, కూడలి వద్ద కనిపిస్తున్న మార్గాల్లో ప్రజలు ఏ మార్గాన్ని ఎంచుకుంటారనే విషయంపై భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్, రిపోర్టర్స్ గిల్డ్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారమిక్కడ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం మనకు అందుబాటులోకి వచ్చిన బయోటెక్, నానోటెక్, స్టెమ్ టెక్నాలజీ వంటి ఎన్నో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు ఎన్నో సమస్యలకు సులువైన పరిష్కారాలను చూపుతున్నాయని, అయితే వాటిని మనం సరైన దారిలో ఉపయోగించుకోవడం లేదని అన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఎప్పుడో రూపొందించిన విద్యా బోధనా విధానాలనే మనం అనుసరిస్తున్నామంటే మార్పును స్వాగ తించడానికి ఎంత మాత్రం ఇష్టపడుతున్నామనే విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు. క్రికెట్, బాలీవుడ్ గాసిప్స్, రాజకీయాలు వంటి విషయాలపై చర్చించేందుకు తప్ప దేశంలో ఎలాంటి టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నారు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలేమిటి అనే విషయాలపై ప్రజలతో పాటు మీడియా కూడా చర్చించడం లేదని అన్నారు. అందుకే అసలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎలాంటి అభివృద్ధి జరుగుతోందనే విషయంపై ప్రజలు కనీస సమాచారం కూడా లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు సరైన అవకాశాలు కల్పిస్తేనే.... ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారత్‌లోనే ఎక్కువ సంఖ్యలో యువత ఉందని శ్యామ్ పిట్రోడా పేర్కొన్నారు. అయితే భారత్‌లోని యువతకు సరైన అవకాశాలు కల్పించినప్పుడే ప్రపంచ దేశాలకు భారత్ మోడల్‌గా నిలుస్తుందని అన్నారు. ఇక ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువ శాతం యువతే ఉన్నా అన్ని రంగాల్లోనూ విధి విధానాలను రూపొందించే వారు మాత్రం 50-60 ఏళ్ల మధ్య ఉన్న వారే ఉంటున్నారని అన్నారు. ఆ విధానాలను అనుభవించే వారు మాత్రం 20ఏళ్ల వారై ఉంటున్నారని తెలిపారు. అమెరికా మోడల్‌ను కాపీ కొట్టడం కాకుండా సొంత ఆలోచనలకు పదును పెట్టడం ద్వారా భారతదేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు నడిపేందుకు ఆస్కారం ఉంటుందని శ్యామ్ పిట్రోడా పేర్కొన్నారు. సూపర్ పవర్ అని ఎలా అంటారు.... భారతదేశంలో 300 మిలియన్ల మంది ప్రజలు కనీసం తినడానికి తిండి కూడా లేకుండా ఇబ్బంది పడుతుంటే భారత్‌ను సూపర్ పవర్‌గా ఎలా అభివర్ణిస్తారని శ్యామ్ పిట్రోడా ప్రశ్నించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు, యువతకు ఉద్యోగాలు కల్పించిన తరువాత భారత్‌ను సూపర్ పవ ర్గా చెప్పుకోవచ్చని, అప్పటి దాకా సూపర్ పవర్‌గా ఎదిగేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు. ఇక ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి అందుబాటులోకి తెచ్చిన పరిజ్ఞానాన్ని వాడుకోవడానికి కూడా భారత్‌లో చాలా మంది ఇష్టపడడం లేదని, ఐటీ శాఖలోని ఉద్యోగులే ఆ శాఖకు చెందిన వివిధ పత్రాలను ఇప్పటికీ కంప్యూటర్లో పొందుపరచకుండా ఫైల్స్ రూపంలోనే ఉంచేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని శ్యామ్ పిట్రోడా పేర్కొన్నారు. -
నూతన ఆవిష్కరణలతో దేశాభివృద్ధి : శాం పిట్రోడా
పుట్టపర్తి, న్యూస్‌లైన్: నూతన ఆవిష్కరణల ద్వారా దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు యువత కృషి చేయాలని ప్రధాన మంత్రి సలహాదారు శాం పిట్రోడా పిలుపునిచ్చారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో శుక్రవారం జరిగిన సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 32వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. భారత్ నేడు ఎంతో అభివృద్ధి చెందిందని, అన్ని రంగాల్లోనూ అగ్రదేశాలతో పోటీ పడుతోందని చెప్పారు. బయోటెక్, ఆటమిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర రంగాల్లో ఎంతో వేగంగా దూసుకుపోతోందన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయని తెలిపారు. అయితే, మనం ఎదుర్కోవాల్సిన సవాళ్లు ఇంకా అనేకం ఉన్నాయని వివరించారు. ప్రతి వ్యక్తి స్వీయ పరివర్తన ద్వారా అభివృద్ధి మార్గంలో నడవాలని సూచించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, కష్టపడేతత్వాన్ని పెంపొందించేలా విద్యావిధానాన్ని కొనసాగించడం సత్యసాయి విద్యాసంస్థలకే సాధ్యమన్న విషయాన్ని తాను గ్రహించానని శాం పిట్రోడా అన్నారు. సవాళ్లను అధిగమించడంలో విద్యా సంస్థల పాత్ర కీలకం సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ చాన్సలర్, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ వెంకటాచలయ్య మాట్లాడుతూ మానవతా విలువలతో కూడిన విద్యనందించే గొప్ప విద్యా వ్యవస్థను సత్యసాయి నెలకొల్పారని కొనియాడారు. సమాజాభివృద్ధికి దోహదపడే అనేక ప్రయోగాలు నేడు విద్యాలయాల్లోనే కొనసాగుతున్నాయని చెప్పారు. పుట్టపర్తిలోని సత్యసాయి విద్యాసంస్థలు అటువంటి ప్రయోగశాలలుగా వెలుగొందుతున్నాయన్నారు. అనంతరం ప్రతిభ కనపరిచిన 25 మంది విద్యార్థులకు వెంకటాచలయ్య బంగారు పతకాలు ప్రదానం చేశారు.