శ్యామ్ పిట్రోడా
గాంధీనగర్: దేవాలయాలు ఉద్యోగాలను సృష్టించలేవనీ, ఆ శక్తి కేవలం సైన్స్ కు మాత్రమే ఉందని ప్రముఖ సాంకేతిక నిపుణుడు శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. ‘ఉద్యోగకల్పన, ఎంట్రప్రెన్యూర్‌షిప్’ అంశంపై గుజరాత్‌లోని కర్ణావతి విశ్వవిద్యాలయంలో పిట్రోడా మాట్లాడారు. ‘దేశంలో దేవాలయం, మతం, దేవుడు, కులం గురించి వాదోపవాదాలు విన్నప్పుడు నాకు ఇండియా గురించి చాలా బాధ కలుగుతుంది.
ఆలయాలు రేపు ఉద్యోగాలను సృష్టించలేవు. కేవలం సైన్స్ మాత్రమే భవిష్యత్‌ను సృష్టించగలదు. యువతకు అనర్హులైన రాజకీయ నేతలు పనికిమాలిన విషయాలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని పిట్రోడా చెప్పారు. ప్రస్తుతం టెలికాం రంగం తరహాలో మరో పదేళ్లలో ఇంధనం, 20 ఏళ్లలో రవాణా కారు చౌకగా మారిపోతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment