నిందితుడు పీట సంతోష్ ఆలియన్
సాక్షి, నాగోలు: మహబుబ్‌నగర్ జిల్లాకు చెందిన పీట సంతోష్ ఆలియన్ లడ్డు(28) నిరుద్యోగి. బ్యాక్‌డోర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాని డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. సంతోష్ ఇన్‌స్ట్రాగామ్‌లో బాధితురాలని పరిచయం చేసుకుని ఆమె ఫోన్‌నంబర్ సేకరించి వాట్సాప్‌లో చాటింగ్ చేసేవాడు. ఈ క్రమంలో ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.50వేల చెల్లించాలని ఆమెను కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమెపై పగ పెంచుకున్న సంతోష్ అసభ్యకరంగా ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేశాడు. ఆ తరువాత సోషల్ మీడియాలో ఆ ఫొటోలను ఆప్‌లోడ్ చేశాడు.
మరో యువతిని వాట్సాప్ ద్వారా పరిచయం చేసుకుని రైల్వే విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె నుంచి రూ.3,03,00లక్షలు వసూలు చేశాడు. ఆ తరువాత యువతి ఫోన్‌కాల్స్ ఎత్తడం మానేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి సంతో‹Ùను మంగళవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను స్వా«దీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. గతంలో మహబూబ్‌నగర్ 2వ పట్టణ పోలీస్‌స్టేషన్, సుల్తాన్‌బజార్, వరంగల్ ఇంతెజార్ గంజ్ పీఎస్‌లలో అరెస్టై బెయిల్‌పై బయటకి వచ్చాడని పోలీసులు తెలిపారు.
బాధితుల ఫిర్యాదుతో యువకుడి అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment