
ప్రతీకాత్మక చిత్రం
నాగోలులోని కిన్నెర గ్రాండ్ హోటల్‌లో నాలుగో అంతస్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగా..
హైదరాబాద్, సాక్షి: నాగోల్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. కిన్నెర గ్రాండ్ హోటల్‌లో నాలుగో అంతస్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగా కిందపడిపోయింది. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ఎంత మంది ఉన్నారన్నది తెలియరాలేదు. అయితే ఎనిమిది మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.
గాయపడ్డ వాళ్లను ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. బాధితులు హోటల్‌లో జరిగిన ఎంగేజ్మెంట్ పంక్షన్‌కి వచ్చినట్లు తెలుస్తోంది.