Lift Accident
-
అరుణవ్ చిరునవ్వులు.. ఇక కానరావు
నాంపల్లి: చిరునవ్వుల అరుణవ్ ఊపిరాగింది. ఇరు కుటుంబాల ఆశల కిరణం ఆరిపోయింది. లిఫ్టులో ఇరుక్కుని చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరేళ్ల బాలుడు అరుణవ్ శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో మృతి చెందాడు. అరుణవ్‌ను బతికించడానికి నిలోఫర్ వైద్యులు శత విధాలా ప్రయతి్నంచినా ఫలితం దక్కలేదు. మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో బాలుడు మృతి చెందినట్లు నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.రవికుమార్ ప్రకటించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి బంధువులకు అప్పగించారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడు ఆరేళ్లకే కన్నుమూయడంతో అజయ్‌కుమార్ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అత్తను చూసేందుకు వచ్చి.. గోడేఖీ ఖబర్ ప్రాంతానికి చెందిన అజయ్‌కుమార్ దంపతులకు ఒకే ఒక సంతానం. మగ పిల్లాడు పుట్టడంతో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అజయ్‌కుమార్ సోదరి, అరుణవ్ మేనత్త జయశ్రీ అలియాస్ ఆయేషా శాంతినగర్‌లో నివాసం ఉంటున్న ఇమ్రాన్‌తో ప్రేమ వివాహం చేసుకున్నారు. సోదరి ప్రేమ వివాహం చేసుకోవడంతో చాలా రోజులు అజయ్‌కుమార్ కుటుంబం జయశ్రీ అలియాస్ ఆయేషాతో దూరంగా ఉంటోంది. ఆయేషాకు ఇటీవల తన పుట్టింటితో బంధం మళ్లీ చిగురించింది. మాట్లాడుకోవడాలు, వచి్చపోవడాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే బాలుడు అరుణవ్ శుక్రవారం తన తాతయ్యతో కలిసి శాంతినగర్‌లోని మేనత్త ఇంటికి వచ్చి లిఫ్టులో ఇరుక్కుపోయాడు. అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. రెండు కుటుంబాల మధ్య చిగురించిన బంధంలో బాలుడి మరణం విషాదాన్ని నింపింది. -
లిఫ్టులో ఇరుక్కుపోయిన ఆరేళ్ల బాలుడు
నాంపల్లి: ఆరేళ్ల బాలుడు లిఫ్టులో ఇరుక్కుపోయి.. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయిన ఘటన నాంపల్లి పరిధిలోని మాసబ్‌ట్యాంక్ శాంతినగర్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గోడేఖీ ఖబర్ ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ ప్రైవేట్ హెల్త్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కుమారుడు అరుణవ్ (6) ఉన్నాడు. శాంతినగర్ కాలనీ మఫర్ కంఫర్టెక్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న తన అత్తమ్మ ఆయేషా ఇంటికి తాతయ్యతో కలిసి అరుణవ్ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో వచ్చాడు. అపార్ట్మెంట్ మూడో అంతస్తుకు వెళ్లేందుకు తాతా, మనవడు లగేజీతో లిఫ్టు ముందు నిలబడ్డారు. కిందికి వచ్చిన లిఫ్టు లోపలికి మొదట అరుణవ్ వెళ్లాడు. బాలుడి తాత కొంత లగేజీని లిఫ్టులో పెట్టాడు. మిగిలిన లగేజీని తెచ్చేందుకు అతడు మళ్లీ లిఫ్టు బయటికి వెళ్లాడు. అంతలోనే అరుణవ్ బటన్ నొక్కాడు. అంతే.. క్షణాల్లో లిఫ్టు కదిలి పైకి వెళ్లింది. లిఫ్టు గ్రిల్స్ తెరిచే ఉండటంతో బయపడ్డ అరుణవ్ లిఫ్టు నుంచి దూకాడు. ఈ క్రమంలో లిఫ్టుకు, స్లాబ్ గోడకు మధ్యలోని సందులో ఇరుక్కుపోయాడు. అప్పటికే లిఫ్టు.. మొదటి ఫ్లోర్ స్లాబ్ వద్దకు చేరుకుని నిలిచిపోయింది. అందులో ఇరుక్కున్న అరుణవ్ గట్టిగా అరిచాడు. అపార్ట్మెంట్లోని వారంతా అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాంపల్లి ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు ఫైర్ సిబ్బందికి, హైడ్రా డీఆర్ఎఫ్ బలగాలను రప్పించారు. గ్యాస్ కట్టర్లతో తొలగించి.. ఘటనా స్థలానికి చేరుకున్న బలగాలు గ్యాస్ కట్టర్లు, ఫైర్ విభాగానికి చెందిన పరికరాలతో లిఫ్టు ఫ్రేమ్‌ను కట్ చేశారు. రెండు గంటల పాటు శ్రమించి స్లాబ్ గోడను తొలగించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ యజ్ఞనారాయణ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పి.దత్తు తమ బృందాలతో ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. బాలుడిని ప్రాణాలతో బయటికి తీసి చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో బాలుడు.. నిలోఫర్ ఆస్పత్రి ఐసీయూలో అరుణవ్‌ను వెంటిలేటర్ మీద ఉంచి ఆక్సిజన్, ప్లూయిడ్, గ్లూకోజ్‌ను అందిస్తున్నారు. 24 గంటలు గడిస్తే తప్ప బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.రవికుమార్ తెలిపారు. బాధిత బాలుడిని స్థానిక ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ పరామర్శించారు. లిఫ్టు పని తీరుపై అనుమానాలు.. శాంతినగర్ కాలనీలోని మఫర్ కంఫర్టెక్ అపార్ట్మెంట్ మొత్తం నాలుగు అంతస్తులు ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌ను మఫర్ అనే సంస్థ నిర్మించి గ్రిల్స్‌తో కూడిన లిఫ్టును ఏర్పాటు చేసింది. ఎక్కడైనా గ్రిల్స్ మూస్తేనే లిప్ట్ పైకి కదులుతుంది. కానీ ఇక్కడి లిఫ్టు గ్రిల్స్ వేయకుండానే, కేవలం బటన్ నొక్కగానే పైకి కదిలింది. ఇలా లిఫ్టు పని చేయడంతోనే బాలుడు ఇరుక్కుపోవడానికి కారణమైందని భావిస్తున్నారు. -
HYD: లిఫ్టు ప్రమాదం విషాదాంతం.. బాలుడు అర్ణవ్ మృతి
సాక్షి, నాంపల్లి: ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ లిఫ్టులో ఇరుక్కుపోయిన అర్ణవ్(6) తాజాగా మృతిచెందాడు. నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ణవ్ మృతిచెందినట్టు శనివారం మధ్యాహ్నం వైద్యులు తెలిపారు. వెంటిలేటర్‌పై చికిత అందించినప్పటికీ బాలుడిని కాపాడుకోలేకపోయారు. అయితే, లిఫ్టు ప్రమాదంలో పొత్తి కడుపు నలిగిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. అలాగే, ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్టు వైద్యులు చెప్పారు. దీంతో, బాలుడు చనిపోయినట్టు స్పష్టం చేశారు. ప్రమాదం ఇలా జరిగింది..నాంపల్లి పోలిస్‌స్టేషన్ పరిధిలోని ఆగాపుర గోడేకిఖబర్ ప్రాంతానికి చెందిన అజయ్‌కుమార్ ప్రైవేట్ హెల్త్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆయన కుమారుడు అర్ణవ్(6).. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో తన తాతతో కలిసి రెడ్‌హిల్స్ శాంతినగర్ పార్కు ఎదురుగా ఉన్న మఫర్ కంఫర్ట్ అపార్ట్మెంట్ మూడో అంతస్తులో నివసిస్తున్న మేనత్త వద్దకు వెళ్లాడు. తాతా, మనవడు లగేజీతో లిఫ్టు ముందు నిలబడ్డారు. కిందికి వచ్చిన లిఫ్టు లోపలికి మొదట బాలుడు వెళ్లాడు. బాలుడి తాత కొంత లగేజీని లిఫ్టులో పెట్టాడు. మిగిలిన లగేజీని తెచ్చేందుకు అతడు మళ్లీ లిఫ్టు బయటికి వెళ్లాడు.అంతలోనే అర్ణవ్ బటన్ నొక్కాడు. అంతే.. క్షణాల్లో లిఫ్టు కదిలి పైకి వెళ్లింది. లిఫ్టు గ్రిల్స్ తెరిచే ఉండటంతో బయపడ్డ బాలుడు లిఫ్టు నుంచి దూకాడు. ఈ క్రమంలో లిఫ్టుకు, స్లాబ్ గోడకు మధ్యలోని సందులో ఇరుక్కుపోయాడు. అప్పటికే లిఫ్టు.. మొదటి ఫ్లోర్ స్లాబ్ వద్దకు చేరుకుని నిలిచిపోయింది. అందులో ఇరుక్కున్న అర్ణవ్ గట్టిగా అరిచాడు. అపార్ట్మెంట్లోని వారంతా అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాంపల్లి ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు ఫైర్ సిబ్బందికి, హైడ్రా డీఆర్ఎఫ్ బలగాలను రప్పించారు.రెండు గంటల పోరాటం..మొదట గ్యాస్కటర్తో లిఫ్టు గ్రిల్స్‌ను తొలగించే ప్రయత్నం చేసినా.. బాలుడి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చివరికి లిఫ్టు గోడలను బద్దలుకొట్టారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి అతికష్టమ్మీద బాలుడిని బయటికి తీశారు. నడుము, కడుపు భాగానికి తీవ్ర గాయాలై.. అపస్మారకస్థితికి చేరిన బాలుడికి 108 వైద్య బృందం ఆక్సిజన్ అందించి.. అనంతరం నిలోఫర్ ఆసుపత్రికి తరలించింది. బాలుడికి ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, పరిస్థితి విషమంగానే ఉందని నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తెలిపారు.లిఫ్టు పని తీరుపై అనుమానాలు.. శాంతినగర్ కాలనీలోని మఫర్ కంఫర్టెక్ అపార్ట్మెంట్ మొత్తం నాలుగు అంతస్తులు ఉంది. ఈ అపార్ట్‌మెంట్‌ను మఫర్ అనే సంస్థ నిర్మించి గ్రిల్స్‌తో కూడిన లిఫ్టును ఏర్పాటు చేసింది. ఎక్కడైనా గ్రిల్స్ మూస్తేనే లిప్ట్ పైకి కదులుతుంది. కానీ ఇక్కడి లిఫ్టు గ్రిల్స్ వేయకుండానే, కేవలం బటన్ నొక్కగానే పైకి కదిలింది. ఇలా లిఫ్టు పని చేయడంతోనే బాలుడు ఇరుక్కుపోవడానికి కారణమైందని భావిస్తున్నారు. -
నాగోలులో లిఫ్ట్ ప్రమాదం.. 8 మందికి తీవ్ర గాయాలు
హైదరాబాద్, సాక్షి: నాగోల్‌లోని ఓ ప్రముఖ హోటల్లో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. కిన్నెర గ్రాండ్ హోటల్లో నాలుగో అంతస్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగా కిందపడిపోయింది. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ఎంత మంది ఉన్నారన్నది తెలియరాలేదు. అయితే ఎనిమిది మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడ్డ వాళ్లను ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. బాధితులు హోటల్లో జరిగిన ఎంగేజ్మెంట్ పంక్షన్‌కి వచ్చినట్లు తెలుస్తోంది. -
లిఫ్ట్ లో ఇరుక్కుపోయి బ్యాంక్ సెక్యూరిటీ గార్డు
-
లిఫ్ట్ లేదన్నది గమనించకుండా అడుగుపెట్టడంతో.. తీవ్ర విషాదం!
సంగారెడ్డి: లిఫ్టులో ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రామచంద్రాపురం పట్టణంలోని అశోక్‌నగర్ లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామచంద్రాపురం పట్టణ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో నివాసం ఉండే జేమ్స్(38) కొరియర్ బాయ్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అశోక్‌నగర్‌లోని నివాస్ టవర్స్ అపార్ట్మెంట్లో కొరియర్ రిటర్న్ ఉంటే దానిని తీసుకోవడం కోసం అపార్ట్‌మెంట్‌ని 4వ అంతస్థుకు వెళ్లాడు. కొరియర్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్‌కు వచ్చేందుకు లిఫ్ట్ గేటు తీసుకొని లిఫ్ట్ లేదన్న విషయాన్ని గమనించకుండా అడుగుపెట్టాడు. 4వ అంతస్థు నుంచి లిఫ్ట్ పైన పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లిఫ్ట్ డోర్ సమస్య ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇవి కూడా చదవండి: ఇంటి నుంచి వెళ్లి వ్యక్తి తీవ్ర నిర్ణయం! -
కుప్పకూలిన లిఫ్ట్.. ఏడుగురు కార్మికుల మృతి..!
ముంబై: మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ హైరైజ్అపార్ట్మెంట్లో నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ కూలి ఏడుగురు కూలీలు మృత్యువాతపడ్డారు. టెర్రస్ నుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రంవెలుగు చూసింది. ఈ మేరకు థానే మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. కాగా థానేలోని ఘోడ్‌బందర్ రోడ్లో 40 అంతస్థుల భవనం నిర్మాణంలో ఉంది. ఆదివారం బిల్డింగ్ టెర్రస్‌పై వాటర్ఫ్రూఫింగ్ పనులు జరిగాయి. సాయంత్రం పనులు ముగించుకున్న కార్మికులు 5.30 గంటల సమంలో పైనుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్‌లోని సపోర్టింగ్ కేబుల్స్‌లో ఒకటి తెగిపోవడంతో లిఫ్ట్ అమాంతం కిందకు పడింది. ఈ ఘటనలో యిదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సహాయక చర్యలు చేపట్టారు. లిఫ్ట్ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మృతులను మహేంద్ర చౌపల్(32), రూపేష్ కుమార్ దాస్(21), హరున్ షేక్(47), మిత్లేష్(35), కారిదాస్(38)తోసహా మరో ఇద్దరి గుర్తించాల్సి ఉంది. ప్రమాదంపై థానే డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ అధికారి యాసిన్ తాడ్వి మాట్లాడుతూ.. ఇది నిర్మాణ లిఫ్ట్ అని, సాధారణ ఎలివేటర్ కాదని తెలిపారు. 40వ అంతస్తు నుంచి కుప్పకూలి P3 (అండర్ గ్రౌండ్ థర్డ్ లెవల్ పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ ఏరియా) వద్ద పడిందని యాదవ్ పేర్కొన్నారు. చదవండి: అమ్మా.. నేను చనిపోతే నీకు రూ.10 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది... #WATCH | Five people died, and a few were injured after a lift collapsed in Maharashtra's Thane: Thane Municipal Corporation pic.twitter.com/AuDiVms1aW — ANI (@ANI) September 10, 2023 -
వైరు తెగి కిందపడిన లిఫ్ట్
హైదరాబాద్: షాపింగ్ చేసేందుకు స్మార్ట్ బజార్‌కు వెళ్లిన ముగ్గురు లిఫ్ట్ వైరు తెగడంతో కింద పడటంతో తీవ్రంగా గాయపడిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాంనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దూలపల్లి ప్రాంతానికి చెందిన దేవరకొండ శివ తన సోదరి కీర్తనతో పాటు స్నేహితురాలు సునయనతో కలిసి దూలపల్లిలోని ఏఎంఆర్ కాంప్లెక్స్‌లోని స్మార్ట్ బజార్ వెళ్లారు. మూడో అంతస్తులోని విలేజ్మండీకి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. మూడవ అంతస్తులోకి వెళ్లే సమయంలో ఒక్కసారిగా లిఫ్ట్ వైరు తెగి కింద పడింది. ఈ ఘటనలో కీర్తన, సునయనలకు కాళ్లు విరగడంతో శివకు నడుం విరిగింది. స్థానికులు వారిని సూరారం నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. శివ తండ్రి భిక్షపతి ఫిర్యాదు మేరకు పోలీసులు భవన యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లిఫ్ట్ పని చేస్తూ ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి మాదాపూర్: నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్ వర్క్ చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడటంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇజ్జత్ నగర్లో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ తిరుపతి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గద్వాల్ జిల్లాకు చెందిన వడ్డెర క్రిష్ణ బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చాడు. బుధవారం మధ్యాహ్నం అతను భార్య కవితతో కలిసి నిర్మాణంలో ఉన్న భవనం లిఫ్ట్ వర్క్ చేస్తుండగా ప్రమాదవశాత్తు 5వ ఫ్లోర్ నుంచి ఇద్దరూ కింద పడ్డారు. ఈ ఘటనలో క్రిష్ణ అక్కడికక్కడే మృతి చెందగా, అతడి భార్య కవిత గాయాలతో బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
తెగిన లిఫ్ట్ వైర్, 8వ ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా పడిపోవడంతో..
నోయిడా: ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో చెప్పలేము. ఊహించని ప్రమాదాలతో రెప్పపాటులో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తాజాగా అలాంటి ఘటన చోటుచేసుకుంది. ఓ బిల్డింగ్‌లోని లిఫ్ట్ ఒక్కసారిగి కిందకు జారడంతో గుండెపోటుకు గురై ఓ మహిళా ప్రాణాలు కోల్పోయింది. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో గురువారం ఈ ఘోరం వెలుగుచూసింది. నోయిడాలోని సెక్టార్ 137లో పరాస్ టియెర్రా సొసైటీలోని ఓ అపార్ట్మెంట్లోని లిఫ్ట్‌లోకి 73 ఏళ్ల వృద్ధురాలు వెళ్లింది. ఈ క్రమంలో లిఫ్ట్ వైర్ ఒక్కసారిగా తెగిపోవడంతో 8 ఫ్లోర్లు కిందకు జారిపడింది. అయితే లిఫ్ట్ గ్రౌండ్‌ను ఢీకొట్టకుండా మధ్య అంతస్తుల్లో చిక్కుకుపోయింది. ఊహించని పరిణామంతో లిఫ్ట్‌లో ఒంటరిగా ఉన్న మహిళ స్పృహతప్పి పడిపోయింది. కాసేపటికి గమనించిన సిబ్బంది మహిళను ఫెలిక్స్ ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ గంటకే మృతిచెందింది. అయితే మహిళ తల వెనక, మోచేతి వద్ద గాయాలున్నట్లు వైద్యులు తెలిపారు. లిఫ్ట్ పడిపోవడం వల్ల ఆమెకు ఈ గాయాలైనట్లు పేర్కొన్నారు. మహిళను ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు పల్స్ లేదని ఆకస్మిక ఘటనతో ఆమెకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు అపార్ట్‌మెంట్‌కు చెందిన వందలాది మంది సొసైటీ కాంప్లెక్స్ బయటకు వచ్చి జరిగిన ఘోరానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. వృద్ధురాలి మృతికి యజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. చదవండి: ఎట్టకేలకు సీఎం ‘కుర్చీ’లో కూర్చున్న అజిత్ పవార్ -
లిఫ్ట్ వైరు తెగి ఇద్దరు కార్మికుల మృతి
ఇబ్రహీంపట్నం: లిఫ్ట్ వైరు తెగిపడి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన శనివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ ప్లాంట్ (ఎన్టీటీపీఎస్) ప్రాంగణంలో జరిగింది. ఎన్టీటీపీఎస్లో నిర్మిస్తున్న 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌లో పని చేసేందుకు ఉదయం 9గంటలకు కార్మికులు వచ్చారు. ప్లాంట్‌లోని 16వ చానల్ (అంతస్తు)లో పని చేసే కార్మికులు 20మంది కిందకు వచ్చేందుకు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ కిందకు వచ్చిన తర్వాత 18 మంది దిగారు. జార్ఖండ్‌కు చెందిన కార్మికులు చోటూ కుమార్‌సింగ్ (23), జితేంద్రసింగ్ (24) లిఫ్ట్ నుంచి బయటకు వస్తుండగా, ఒక్కసారిగా డోరు మూసుకుపోయి మళ్లీ పైకి వెళ్లిపోయింది. సుమారు 150 అడుగుల ఎత్తులో ఉన్న 16వ చానల్‌కు వెళ్లిన తర్వాత లిఫ్ట్ వైరు తెగి కిందపడిపోయింది. లిఫ్ట్‌లో చిక్కుకుపోయిన చోటూ కుమార్‌సింగ్, జితేంద్రసింగ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని సహచర కార్మికులు బయటకు తీసి ఎన్టీటీపీఎస్ బోర్డు వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పది మంది ఎక్కాల్సిన లిఫ్ట్‌లో ఒకేసారి 20మంది రాకపోకలు సాగిస్తున్నారని, మెటీరియల్ కూడా దానిలోనే తరలిస్తున్నారని, అధిక బరువు వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారు. భద్రత వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎన్టీటీపీఎస్ ప్లాంట్ మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, ఉద్యోగాలు ఇవ్వాలని వివిధ పార్టీల నాయకులు ప్లాంట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఇబ్రహీంపట్నం సీఐ పి.శ్రీను నేతృత్వంలో మృతదేహాలను పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం
-
ఘోర ప్రమాదం.. వైర్లు తెగి ఊడిపడిన లిఫ్ట్.. ముగ్గురి మృతి
సాక్షి, ఎన్టీఆర్: జిల్లాలోని ఇబ్రహీంపట్నం వీటీపీఎస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వైర్లు తెగడంతో లిఫ్ట్ అమాంతం కిందపడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో లిఫ్టులో మొత్తం 8 మంది ఉన్నారు. వీరంతా పైకి వెళ్తుండగా లిఫ్టు వైర్లు ఒక్కసారిగా తెగిపోయాయి. దీంతో అంతా లిఫ్టుతో పాటు కిందపడిపోయారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చదవండి: పెళ్లింట విషాదం.. అప్పుడు వరుడి తండ్రి.. ఇప్పుడు వధువు తండ్రి.. -
లిఫ్టులో ఇరుక్కొని.. రెండు కాళ్లు పోగొట్టుకున్న మెకానిక్
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్‌లోని ఓ హోటల్ లిఫ్టులో ఇరుక్కొని ఓ మెకానిక్ రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. లిఫ్టులో ఇరుక్కున్న పోలీస్ అధికారిని రక్షించేందుకు వచ్చి మెకానిక్ ప్రమాదవశాత్తు లిఫ్టులో ఇరికి రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం అత్తాపూర్‌లోని ఎస్వీఎం గ్రాండ్ బాంకెట్ హాల్లో సోమవారం రాత్రి విందును ఏర్పాటు చేసింది. ఈ విందు కోసం స్నేహితులను బంధువులను ఆహ్వానించారు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ పోలీసు అధికారి సత్యనారాయణ రాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు విందుకు హాజరయ్యేందుకు వచ్చారు. మొదట కుటుంబ సభ్యులు లిఫ్ట్ ద్వారా పైకి వెళ్లిన అనంతరం కిందికి వచ్చింది. పోలీసు అధికారితో పాటు మరో నలుగురు లిఫ్టులో ఎక్కారు. మొదటి అంతస్తుకు వెళ్ళగానే ఆ లెఫ్ట్ కాస్త చెడిపోయింది. దీంతో నిర్వాహకులు ఒరిస్సాకు చెందిన నిరంకర్ అనే లిఫ్ట్ మెకానిక్‌ను హోటల్ వద్దకు రప్పించి మరమ్మతులు ప్రారంభించారు. పోలీసు అధికారిని బయటకు తీశాడు. అనంతరం మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో ఇరికిపోయాడు. దీంతో రెండు కాళ్లు కాస్త అందులో నుజ్జు నుజ్జు అయ్యాయి. అప్పటికే చేరుకున్న ఇతర ఎలక్ట్రీషియన్లు మరమ్మతులు చేపట్టి గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చదవండి: హైదరాబాద్: మియాపూర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం -
దాగుడుమూతలు ఆడుతూ.. లిఫ్ట్ ప్రమాదంలో బాలిక మృతి
ముంబై: దాగుడుమూతల ఆట ఆడుతూ 16 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన ముంబైలోని మన్‌ఖుర్డ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....16 ఏళ్ల రేష్మా ఖారవి తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అక్కడ స్నేహితులతో దాగుడు మూతల ఆట ఆడుతోంది. ఆ ఆటలో భాగంగా స్నేహితులను వెతికే క్రమంలో ఆ లిఫ్ట్ ఎలివేటర్ వద్ద ఉన్న కిటికిలో తల పెట్టింది. ఇంతలో అనుహ్యంగా లిఫ్ట్ కిందకు రావడంతో ఆమె తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఇదంతా హౌసింగ్ సోసైటి నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ బాలిక తండ్రి రవి ఖర్వి ఆందోళన చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా లిఫ్ట్ ఓపెనింగ్‌ని అద్దాలతో కవర్ చేయాలని అన్నారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని లిఫ్ట్ పాడై ఉన్నట్లు గుర్తించారు. యంత్రాల లోపం కారణంగానే ఇలా అకస్మాత్తుగా కిందకు వెళ్లినట్లు చెప్పారు. బాధితుడి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హౌసింగ్ చైర్మన్‌ని, సెక్రటరీని అరెస్టు చేసినట్లు తెలిపారు. బాధితురాలి కుటుంబం సాథే నగరంలో ఉంటారని, ఆమె దీపావళి సందర్భంగా మన్‌ఖుర్డ్‌లో హౌసింగ్ సోసైటి ఐదో అంతస్థులో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడూ ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు పోలీఉలు వెల్లడించారు. (చదవండి: పనిమనిషితో సహా జంట అనుమానాస్పద మృతి..కానీ రెండేళ్ల చిన్నారి....) -
పరామర్శకు వెళ్లి మృత్యుఒడిలోకి.. లిఫ్ట్ రూపంలో మృత్యువు ఎదురైంది!
సాక్షి, ఖమ్మం: జిల్లాలోని తెలంగాణ ఆసుపత్రిలో దారుణ విషాద చోటుచేసుకుంది. ఆసుపత్రి యాజమాన్యం కారణంగా ఓ మహిళ మృతిచెందింది. ఆసుపత్రిలోని లిఫ్ట్లోపడిపోయి ఓ మహిళ చనిపోయింది. వివరాల ప్రకారం.. మృతురాలు ప్రమీల.. తెలంగాణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువులను పరామర్శించేందుకు వెళ్లింది. పరామర్శ అనంతరం.. తిరిగి వెళ్లే క్రమంలో ప్రమీల.. ఆసుపత్రిలో ఉన్న బటన్ నొక్కింది. ఈ క్రమంలో లిఫ్ట్ కిందకు రాకుండానే డోర్ తెరుచుకుంది. దీంతో, లిఫ్ట్ వచ్చిందనుకున్న మహిళ అడుగు ముందుకు వేయగానే.. లిప్ట్ గుంతలో పడిపోయింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న మరో ఇద్దరు మహిళలు.. కంగారుపడి గట్టిగా అరిచారు. ఈ ప్రమాదంలో ప్రమీల లిఫ్ట్‌లోనే మృతిచెందింది. -
రక్షించినందుకు చెంపదెబ్బలు తిన్న సెక్యూరిటీ గార్డు
ఇటీవలకాలంలో చిన్న స్థాయిలో ఉన్న ఉద్యోగులంటే చిన్న చూపో ఏంటో తెలియదు. వారిపట్ల చాలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. ఐనా మనుషులన్నాక తప్పులు అనేవి సహజం. మందలించి వదిలేయాలి గానీ చేయి జేసుకోవడం అనాగరికం. ఇక్కడొక వ్యక్తి కూడా సెక్యూరిటి గార్డు పట్ల అలానే అనుచితంగా ప్రవర్తించాడు. వివరాల్లోకెళ్తే...గుర్గావ్లోని వరుణ్ నాథ్ అనే వ్యక్తి సోమవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. వెంటనే సెక్యూరిటీ గార్డు అప్రమత్తమై ఆ వ్యక్తిని రక్షించి బయటకు వచ్చేలా చేశాడు. ఐతే ఆ వ్యక్తి ఆ ప్రమాదం నుంచి బయటపడి వచ్చిన వెంటనే అదే పనిగా సెక్యూరిటీ గార్డును చెంపదెబ్బలు కొడతాడు. ఆ తర్వాత ఆ లిఫ్మ్యాన్ని కూడా గట్టిగా కొడతాడు. #WATCH | Haryana: A resident of The Close North Apartments in Gurugram thrashed security guards after being briefly stuck in lift; FIR filed I helped him get out of the lift within 3-4 minutes. As soon as he got out, he started beating me up: Guard Ashok Kumar (CCTV visuals) pic.twitter.com/mtcXOy8zTh — TOI Gurgaon (@TOIGurgaon) August 29, 2022 ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో అపార్ట్మెంట్ గార్డులు వరుణ్‌నాథ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. అంతేగాదు సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇటీవల నోయిడాలో ఒక మహిళ గేట్ ఆలస్యంగా తీసినందుకు సెక్యూరిటీ గార్డును దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తించి జైలు పాలైన ఘటన మరువక మునుపే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. (చదవండి: ఆస్ట్రిచ్ పక్షిలా దుస్తులు ధరించి... జూలో హల్చల్! ఎందుకలా చేశాడంటే...) -
అతనే గనుక ఆ సమయంలో అక్కడ లేకపోతే !
బీజింగ్: కొన్ని అనుకోని ప్రమాదాలు జరిగినపుడు ఆ సమయంలో ఎవరైనా వచ్చి అంత పెద్ద ఆపద నుంచి కాపాడితే మనం ఆ ఘటనను, కాపాడిన వారిని మనం ఎప్పటికీ మర్చిపోలేం. మన పెంపుడు జంతువులు ఒక్కొసారి తెలిసితెలియక చేసే పనుల వల్ల అవి ప్రాణాల మీదకు తెచ్చుకన్న సందర్భాలు అనేకం చూసే ఉంటాం. అచ్చం అలానే చైనాలోని ఒక కుక్క లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి ఎలా ప్రాణాల మీదకు తెచ్చుకుందో చూడండి. (చదవండి: వామ్మె! ఈ గుమ్మడి కాయ 17 మంది బరువుతో సమానం) అసలు విషయంలోకి వెళ్లితే ....ఒక కుక్క తన యజమాని తో పాటు లిఫ్ట్ వెళ్లడంలో ఈ కుక్క మిస్సవుతుంది. దీంతో ఆ కుక్క కాసేపటి తర్వాత లిఫ్ట్ వచ్చి ఆగాక నెమ్మదిగా ఒక్కత్తే ఎక్కుతుంది. కానీ దాని మెడకు ఉన్న గొలుసు కొంత భాగం బయట ఉండిపోతుంది. అయితే ఆ కుక్క లోపలికి వెళ్లంగానే లిఫ్ట్ డోర్లు మూసుకుపోయి వెళ్లడం మొదలవంగానే ఆ గోలుసు లిఫ్ట్ డోర్లో ఇరక్కుపోయి ఆ కుక్క మెడకి ఉరిలా పడిపోతుంది. అంతే అది అరుస్తూ గుంజుకుంటూ ఉంటుంది. అదే సమయం ఒక డ్రైవర్ అక్కడ ఉండటంతో ఆ కుక్కను కాపాడతాడు. అయితే ఆ గొలుసు ఇరుక్కు పోవడంతో రాదని బావించి, మెడకు గొలుసును తొలగించి రక్షిస్తాడు. ఆ తర్వాత కుక్క యజమానికి దాన్ని ఇచ్చేస్తాడు. ఈ ఘటన లిఫ్ట్‌లో ఉన్న సీసీటీవీ కెమరాలో రికార్డు అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ సమయంలో అక్కడ ఎవ్వరు లేకపోతే కుక్కకు ఏమైదో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: చూడ్డానికి పిల్ల...కానీ చెరుకు గడలను ఎలా లాగించేస్తుందో!) -
పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే
సాక్షి, ఉప్పల్ (హైదరాబాద్): ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం ఉప్పల్‌లోని శ్రీకర్ హెల్త్ కేర్ ఆస్పత్రి వార్షికోత్సవానికి ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, మాజీ కార్పొరేటర్ మందముల్ల పరమేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం ఆస్పత్రిలోని మొదటి అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. కొంతదూరం వెళ్లగానే లిఫ్ట్ ఉన్నట్లుండి పెద్ద శబ్ధం చేస్తూ కింద పడిపోయింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది, ఎమ్మెల్యే గన్మెన్లు లిఫ్ట్ గ్రిల్స్‌ను తెరిచి వారిని బయటకు తీసుకొచ్చారు. అందరూ సురక్షితంగా బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆస్పత్రిలో అకస్మాత్తుగా జరిగిన ఘటనతో పేషెంట్లు, సహాయకులు ఆందోళనకు గురయ్యారు. -
లిఫ్ట్ కూలి అయిదుగురి మృతి
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలోని వర్లీలో లిఫ్ట్ నేలకూలిన ఘటనలో అయిదుగురు మృత్యువాత పడ్డారు. అందిన వివరాల మేరకు వర్లీ బీడీడీ చాల్స్ హనుమాన్ గల్లీలోని అంబికా బిల్డర్స్ సైట్లో శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హన్మాన్ గల్లీ ప్రాంతంలో అంబికా బిల్డర్స్‌కు చెందిన ఓ భవనం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులు జరుగుతుండగానే సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్దం చేస్తూ లిఫ్ట్ వేగంగా నేలకూలింది. దీంతో అక్కడ ఉన్నవారు భయాందోళనలతో ఉరుకులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలను ప్రారంభించారు. ఈ ఘటనలో మరణించిన వారిని అవినాష్ దాస్ (35), లక్ష్మణ్ మండల్ (35), భరత్ మండల్ (28), చిన్మయ్ మండల్ (33)లుగా గుర్తించారు. మరో వ్యక్తి వివరాలు తెలియరాలేదు. అతని వయసు సుమారు 45 ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
విషాదం: లిఫ్టులో ఇరుక్కొని బాలుడు మృతి
ముంబై : ముంబైలోని ధారావిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. ధారావికి చెందిన మహ్మద్ హోజైఫ్ షేక్ అనే ఐదేళ్ల బాలుడు లిఫ్టు డోరులో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. షాహుర్ నగర్‌లోని కోజీ షెల్టర్ అనే అపార్ట్మెంట్లో శనివారం హోజైఫ్ షేక్ తన స్నేహితులతో కలిసి కింది ఫ్లోర్‌కు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. ఆ లిఫ్ట్‌కు గ్రిల్స్‌తో పాటు డోర్ కూడా ఉంది. అయితే లిఫ్ట్ కింది ఫ్లోర్ రాగానే డోరు తెరుచుకోవడంతో షేక్‌తో మినహా మిగతా పిల్లలు బయటికి వెళ్లిపోయారు. అందరికంటే చివర వచ్చిన షేక్ బయటికి వచ్చి లిఫ్టు గ్రిల్స్ వేస్తుండగా వెనుక ఉన్న డోర్ మూసుకుపోయింది. దీంతో రెండు డోర్ల మధ్య ఉండిపోయిన జోహైఫ్ షేక్‌కు బయటకు ఎలా రావాలో అర్థం కాలేదు. ఈలోగా మరొకరు లిఫ్టు బటన్ నొక్కేయడంతో కిందకు కదిలింది. దీంతో రెండు డోర్ల మధ్య ఉన్న బాలుడు లిఫ్టు గ్రిల్స్‌లో నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కాగా ఈ ఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. -
లిఫ్ట్ ప్రమాదం.. గాయపడిన తిరుమల భక్తుడు
సాక్షి, చిత్తూరు: తిరుమలలోని ఓ అతిథి గృహంలో ప్రమాదం చోటు చేసుకుంది. అతిధి గృహంలోని లిఫ్ట్ బుధవారం ప్రమాదానికి గురవడంతో ఓ భక్తుడు గాయపడిన సంఘటన స్తానికంగా ఆందోళన కలిగించింది. అతిథి గృహంలో కరెంట్ నిలిచిపోవడంతో రన్నింగ్‌లో ఉన్న లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో భక్తులను లిఫ్ట్ నుంచి బయటకు దించే క్రమంలో ఓ భక్తుడు ఒక్కసారిగా కింద పడిపోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక సిబ్బంది వెంటనే తిరుపతిలోని రూయా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సదరు భక్తుడిని వెంకటగిరికి చెందిన జయప్రకాశ్‌గా అధికారులు గుర్తించారు. -
న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం, ఆరుగురు మృతి
సాక్షి, న్యూఢిల్లీ: నూతన సంవత్సర వేడుకలు ఆ ఇంట విషాదాన్ని నింపింది. ప్రమాదవశాత్తూ లిఫ్ట్ కూలిన ఘటనలో ప్రముఖ వ్యాపారవేత్త పునీత్ అగర్వాల్, ఆయన కుమార్తెతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. కొత్త సంవత్సరం సందర్భంగా ఇండోర్ పాటల్‌పానీలో ఫామ్‌హౌస్‌లో పునీత్ అగర్వాల్ న్యూ ఇయర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులందరూ అక్కడకు చేరుకున్నారు. నిర్మాణంలో ఉన్న భవనం పైకి వెళ్లేందుకు పునీత్‌తో పాటు పలువురు లిఫ్ట్ ఎక్కగా, ప్రమదవశాత్తూ లిఫ్ట్(ఎలివేటర్) తీగ తెగిపోవడంతో ఒక్కసారిగా వంద మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. దాంతో వీరంతా కాంక్రీట్ గుంతలో పడిపోయారు. దుర్ఘటనలో పునీత్ అగర్వాల్ (53), ఆయన కుమార్తె పాలక్ (27), అల్లుడు పాల్కేశ్, మనవడు నవ్తో పాటు బంధువులు గౌరవ్, ఆర్యవీర్ ప్రాణాలు విడిచారు. ఇక ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పునీత్ అగర్వాల్ భార్య నిధి అగర్వాల్ పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా పునీత్ అగర్వాల్ దేశంలోనే అతి పెద్ద కాంట్రాక్టర్లలో ఒకరు. పాత్ ఇండియా సంస్థ ద్వారా వంతెనలు పర్యవేక్షణ, హైవే నిర్మాణాలు, టోల్ ఫ్లాజాల నిర్మాణాలతో పాటు అనేక రాష్ట్రాల్లో ముఖ్యమైన రహదారి ప్రాజెక్ట్‌లను చేపట్టింది. -
లిఫ్ట్ కిందపడి బాలుడు మృతి
సాక్షి, హైదరాబాద్ : రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచవటి కాలనీలోని రోడ్ నెంబర్ 10, టీవీఎస్ లేక్ వ్యూ అపార్ట్మెంట్లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ధనుష్ అనే ఓ బాలుడు ఆడుకుంటూ లిఫ్ట్ కిందపడి చనిపోయాడు. ఈ సంఘటన బాలుడి కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. కాగా ధనుష్ కుటుంబం రెండు నెలల క్రితమే ఈ అపార్ట్‌మెంట్‌కు వచ్చింది. -
భద్రతలేని బతుకులు!
సాక్షి, అమరావతి : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో ప్రజాప్రతినిధుల కోసం 12 అంతస్తుల భవన నిర్మాణ పనుల వద్ద నిర్మాణ సంస్థ ఎన్సీసీ నిర్లక్ష్యంతో సోమవారం ముగ్గురు కూలీల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అక్కడ సాగుతున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో లిఫ్ట్ జారి పడి అందులో ఉన్న ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. 12 అంతస్తుల టవర్స్ నిర్మాణం చేస్తున్న సమయంలో ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన కనీస బాధ్యతను నిర్మాణ సంస్థలు విస్మరించాయి. గత అనుభవాలున్నా.. పట్టదు ప్రజాప్రతినిధుల క్వార్టర్స్ వద్దే ఈ ఏడాది మే నెలలో విషాహారం భుజించిన 30 మంది కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. పరిస్థితి విషమించడంతో పశ్చిమబెంగాల్‌కు చెందిన ఇద్దరు కూలీలు మృతి చెందారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే మరో ముగ్గురు కూలీలు మరణించడంతో కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకఘటన జరిగిన తర్వాత కూడా ఎన్సీసీ సంస్థ పాఠాలు నేర్వడం లేదు. కనీసం కూలీలకు పరిహారం అందజేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తుళ్లూరు మండలం నేలపాడు వద్ద తాత్కాలిక హైకోర్టు నిర్మాణం వద్ద టిప్పర్ కింద పడి ఒక కూలీ మృతి చెందారు. ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని వస్తున్న కూలీలపై నిర్మాణ సంస్థలు కనికరం చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నా పట్టించుకున్న పాపానపోవడం లేదు. సంఘటన జరిగిన తర్వాత అధికారులు హడావుడి చేసి ఆ తర్వాత చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు లేకపోలేదు. గుంతల్లో పడి ఆరుగురు మృతి రాజధాని పరిధిలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏడీసీ) అంతర్గత రహదారుల నిర్మాణాలను చేపట్టింది. రోడ్ల పక్కన డ్రెయినేజీ కోసం పది అడుగుల మేర గుంతలు తవ్వారు. గతేడాది అక్టోబర్‌లో కురిసిన వర్షాల వల్ల గుంతల్లో పది అడుగుల మేర వర్షపు నీరు నిలిచింది. శాఖమూరు వద్ద అర్ధరాత్రి వేళ ఇద్దరు యువకులు బైక్‌పై వెళుతూ గుంతలో పడి ప్రాణాలు వదిలారు. రోడ్డు కోసం గుంత తవ్విన చోట నిర్మాణ సంస్థ హెచ్చరిక బోర్డు పెట్టకపోవడంతోనే ఆ ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు ఆరోపించారు. అలాగే గతేడాది ఆగస్టులో తుళ్లూరు మండలం దొండపాడు వద్ద ఆడుకోవడానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు గుంతల్లో పడి ప్రాణాలు వదిలారు. అలాగే తుళ్లూరు మండల కేంద్ర సమీపంలో ఓ వ్యక్తి చనిపోయారు. తుళ్లూరు(తాడికొండ): లిఫ్ట్ ప్రమాదం జరిగిన స్థలాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ మంగళవారం పరిశీలించారు. తుళ్లూరు డీఎస్పీ కేశప్ప ప్రమాదం జరిగిన తీరును కలెక్టర్‌కు వివరించారు. అనంతరం నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడారు. కనీస జాగ్రత్త చర్యలు తీసుకోపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రాయపూడి నుంచి అమరావతి మండలం ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న కార్మికుల మృతదేహాలను పరిశీలించి, మృతుల బంధువులను పరామర్శించారు. కలెక్టర్‌తోపాటు జేసీ దినేష్, అడిషనల్ ఎస్పీ ప్రసాద్, తుళ్లూరు తహసీల్దార్ సంజీవకుమారి, తుళ్లూరు సీఐ విజయకృష్ణ ఉన్నారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారమివ్వాలి.. కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తూ, కనీస భద్రతా ప్రమాణాలను పాటించకుండా వ్యవహరిస్తున్న ఎన్సీసీ నిర్మాణ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతి చెందిన ముగ్గురు కార్మికుల ప్రతి కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని అందించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. మంగళవారం తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో ఎన్సీసీ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన సముదాయాన్ని సీఐటీయూ నాయకుల బృందం పరిశీలించింది. నిర్మాణాల వద్ద అంబులెన్స్‌లు ఎక్కడ..? రాజధానిలో నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో అనుకోని ప్రమాదాలు సంభవిస్తే అత్యవసర వైద్యం కూడా అందుబాటులో లేకుండా పోయింది. చాలా నిర్మాణ సంస్థలు అంబులెన్స్‌లను నిర్మాణాలు జరుగుతున్న చోట అందుబాటులో ఉంచడం లేదు. ఫలితంగా ప్రమాదం జరిగిన వెంటనే ప్రాథమిక వైద్యం అందకపోవడంతోనే కూలీలు తనువు చాలిస్తున్నారు. నిర్మాణ కంపెనీలు నిబంధనలు పాటించకున్నా సంబం ధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. -
విషాదం: లిఫ్ట్ వైర్ తెగి ఇద్దరి కార్మికుల మృతి
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని జైనథ్ మండలం చనాక కొరాట బ్యారేజ్ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. పెన్ గంగా నదిపై నిర్మిస్తున్న బ్యారేజ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో భాగంగా బ్యారేజ్ గేట్లు బిగిస్తుండగా లిఫ్ట్ వైర్ తెగిపడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ బ్యారేజీకి సంబంధించి ఇంకా మూడు గేట్లు బిగించాల్సి ఉండగా ఇప్పటికే పనులు నత్తనడకన సాగుతూ ఉన్నారు. బుధవారం 16వ నంబర్ గేట్ బిగిస్తుండగా ప్రమాదవశాత్తు లిఫ్ట్‌వైర్ తెగింది. దీంతో 200 అడుగుల ఎత్తులో నుంచి వారు ఒక్కసారిగా కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు కూలీలను చికిత్స నిమిత్తం తరలించారు. అయితే సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానిక కూలీలు పేర్కొంటున్నారు. -
4 గంటల నరకయాతన.. లిఫ్ట్ గోడలు పగలగొట్టి..
సాక్షి, హైదరాబాద్ : చందానగర్ పాపిరెడ్డి కాలనీలోని రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్లో మూడేళ్ల బాలుడు లిఫ్ట్‌లో చిక్కుకున్నాడు. సుమారు నాలుగు గంటలపాటూ నరకయాతన అనుభవించాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, 108 ఉద్యోగులు శ్రమించి బాలుడిని సురక్షితంగా రక్షించడంతో బాలుడు ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. దీంతో స్థానికులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. స్వగృహలో అపార్ట్మెంట్లోని బ్లాక్ నంబర్ ఈఏ2లో నివాసం ఉండే ఫనీంద్ర చారి కుమరుడు సౌర్యన్ ఆడుకుంటూ లిఫ్ట్ ఎక్కాడు. పై వరకు వెళ్లిన లిఫ్ట్ సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. దీంతో సౌర్యన్ అరవడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. లిఫ్ట్ గోడలు పగలగొట్టి బాలుడుని రక్షించడంతో నాలుగు గంటల ఉత్కంఠకు తెర పడింది. -
మైనంపల్లికి త్రుటిలోతప్పిన ప్రమాదం
హైదరాబాద్: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. లిఫ్ట్ తెగిపడటంతో ఆయనతో పాటు మరో నలుగురికి స్వల్పగాయాలయ్యా యి. చిక్కడపల్లి సాయికృప హోటల్లోని నాల్గవ అంతస్తులో బుధవారం జరిగిన టీఆర్ఎస్ నేత ఎర్రం శ్రీనివాస్‌గుప్తా కుమారుడి తొట్టెల కార్యక్రమానికి మైనంపల్లి హాజరయ్యారు. శ్రీనివాస్‌గుప్తాను మైనంపల్లి అభినందించి తిరిగి వెళ్లిపోతున్న క్రమంలో వీడ్కోలు ఇచ్చేందుకు గుప్తాతో సహా స్థానికనేతలైన అమర్నాథ్రెడ్డి, బద్దం మోహన్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి లిఫ్ట్ ఎక్కారు. మూడో అంతస్తుకి రాగానే లిఫ్ట్‌వైరు తెగిపోవడంతో లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. దీంతో మైనంపల్లికి ఎడమకాలి తొడవద్ద గాయమైంది. ఆయన్ని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొం దుతున్న వారిని మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముఠాగోపాల్ పరామర్శించారు. లిఫ్ట్ నిర్వహణ పట్ల యాజమాన్యం శ్రద్ధ తీసుకోవాలని టీఆర్ఎస్ కార్యకర్తలు హోటల్ వద్ద ఆందోళన చేశారు. -
లిప్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి
-
ఫంక్షన్ హాల్లో దారుణం : లిఫ్ట్‌లో కాలు ఇరికి..
సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లో జరిగిన ఓ వివాహవేడుకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బండ్లగూడలో జాగీర్ రాధా నగర్‌లోని కేకే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో లిఫ్ట్‌లో కాలు ఇరికి ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటనతో బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఫంక్షన్ హాల్ యజమాని పరారయ్యాడు. రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
వివంత గర్ల్స్ హాస్టల్’లో మహిళ మృతి
హిమాయత్‌నగర్: పై అంతస్తు లోనుంచి కిందికి దిగే క్రమంలో లిఫ్ట్ ఎక్కేందుకు సిద్ధపడిన ఓ మహిళ గుంతలో పడి ప్రాణాలు కోల్పోయింది. లిఫ్ట్ రాకుండానే దాని డోరు తెరుచుకోవడంతో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ దుఘటన గురువారం నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరగ్గా.. శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. జియాగూడకు చెందిన కె.రేఖ(45) హిమాయత్‌నగర్ తెలుగు అకాడమీ సమీపంలోని ‘వివంత గర్ల్స్ హాస్టల్’లో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఎప్పటిలాగే గురువారం ఉదయం పనిలోకి వచ్చి హాస్టల్లోని గదులు శుభ్రం చేసి సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఐదో అంతస్తులో ఉన్న రేఖ లిఫ్ట్ బటన్ నొక్కింది. లిఫ్ట్ వచ్చిందని గేట్ తీసి కాలు ముదుకేయడంతో ఒక్కసారిగా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్‌పై పడిపోయింది. ఈ ప్రమాదంలో రేఖ తలకు బలమైన గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా ఆమె మార్గమధ్యలోనే మరణించింది. హాస్టల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సైదులు తెలిపారు. తాగి పడిపోయిందన్న యజమాని వివంత గర్ల్స్ హాస్టల్‌ను శివ అనే వ్యక్తి నడుపుతున్నాడు. హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే రేఖ చనిపోయినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై హాస్టల్ యజమానిని ‘సాక్షి’ వివరణ కోరగా.. రేఖ మద్యం తాగి డ్యూటీకి వచ్చిందని, అందుకే వెళ్లేప్పుడు లిఫ్ట్ గేటు తీసి కిందపడిపోయి చనిపోయిందన్నారు. అయితే, మద్యం తాగిన ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులన్నీ చేయగలిగింది కానీ..లిఫ్ట్‌ని మాత్రం గుర్తించలేకపోయిందా అంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం నారాయణగూడలో.. నారాయణగూడ ఏఐటీయూసీ భవన్‌లోని ‘యునైటెడ్ ఇండియా ఇన్సురెన్స్’లో డెవలప్మెంట్ అధికారిగా పనిసే ఆనందరావు రెండేళ్ల క్రితం ఇలాంటి దుర్ఘటనలోనే ప్రాణాలు కోల్పోయారు. కార్యాలయంలో విధులు ముగించుకుని బయటకు వెళ్లే క్రమంలో ఆయన మూడో అంతస్తులో లిఫ్ట్ బటన్‌ను నొక్కారు. లిఫ్ట్ వచ్చిందనుకుని గేటు లాగి కాలు లోపలికి వేయడంతో జారి కిందపడి అక్కడిక్కడే మృతిచెందారు. గురువారం జరిగిన ఘటనలోను రేఖ అలాగే ప్రాణాలు కోల్పోయింది. పలు భవనాల్లో నిత్యం వినియోగించే లిఫ్ట్‌లను సరిగా నిర్వహించకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు గానే లిఫ్టుల ఏర్పాటుకు ‘లిఫ్ట్ ఇన్స్పెక్టర్ సర్టిఫికెట్’ ఉండాలనే ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే, ఇంత వరకూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జీహెచ్ఎంసీలో సైతం భవన నిర్మాణాల్లో లిఫ్టుల ఏర్పాటు, నిర్వహణపై కూడా నిబంధనలు లేకపోవడం గమనార్హం. నిర్వహణ పట్టించుకోని అధికారులు పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్యం కారణంగా తరచూ లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం మృతి చెందిన పి.ఆనందరావు, గురువారం ప్రాణాలు కోల్పోయిన రేఖ లిఫ్ట్ కంటే ముందు గేటు తెరుచుకోవడం వల్లే మరణించడం గమనార్హం. లిఫ్టులు, వాటి నిర్వహణను జీహెచ్ఎంసీలోని ఏ విభాగమూ పట్టించుకోవడం లేదు. ఇక్కడ లిఫ్ట్ ఇన్స్పెక్టర్లు సైతం లేకపోవడం సిగ్గుచేటు. తప్పనిసరి అనుకుంటే పొరుగు రాష్ట్రం నుంచి పిలిపించి సర్టిఫై చేసుకోవాల్సిన దుస్థితి మన నగరంలో ఏర్పడింది. భవనం ఎత్తును బట్టి 10 మీటర్లు దాటితే లిఫ్ట్ ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ, లిఫ్టుల స్టెబిలిటీ, నిర్వహణకు మాత్రం ఎలాంటి నిబంధనలు లేవు. ఏటా వేల సంఖ్యలో భవనాలు నిర్మాణం జరుగుతున్న జీహెచ్ఎంసీలో లిఫ్ట్ ఇన్స్పెక్టర్ లేకపోవడం దారుణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ♦ వ్యాపార సంస్థలతో పాటు నివాస అపార్ట్మెంట్లలోనూ లిఫ్టులతో అప్రమత్తంగా ఉండాలి. నిర్ణీత వ్యవధుల్లో సర్వీసు చేయించడం, లిఫ్ట్ ఆపరేటర్ విధుల్లో ఉండేలా చూడడం తప్పనిసరి. ♦ సామర్థ్యాన్ని బట్టి ముగ్గురు పట్టే లిఫ్టుల నుంచి 40 మంది వరకు వెళ్లగలిగే లిఫ్టులు వాడుకలో ఉన్నాయి. సాధారణంగా సామర్థ్యానికి మించి ఎక్కువమంది ఎక్కినా కదలకుండా మొరాయించడం.. తలుపులు వేయకపోతే పనిచేయకపోవడం వంటి ఏర్పాట్లు లిఫ్టుల్లో ఉంటాయి. కానీ దీర్ఘకాలం పాటు సర్వీసులో ఉన్న లిఫ్ట్‌లు సాంకేతిక లోపాలతో ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్వహణలో నిర్లక్ష్యం.. ♦ స్టెబిలిటీ లేకపోవడం.. నాసిరకం లిఫ్టులు వాడటం ప్రమాదాలకు ఒక కారణం కాగా, కనీస నిర్వహణ లేకపోవడం ప్రమాదాలకు తావిస్తోంది. ♦ లిఫ్టులో ఆపరేటర్ తప్పనిసరిగా ఉండాలి. కానీ నగరంలో చాలా భవనాల్లో ఆపరేటర్ అన్న ఊసే ఉండదు. ♦ పనిచేసే ‘అలార్మ్’ బెల్ ఉండాలి. లేని పక్షంలో కనీసం ఫోన్ చేసేందుకు వీలుగా ల్యాండ్‌లైన్ ఉండాలి. ఇవి ఎక్కడా కానరావు. ♦ సాధారణంగా లిఫ్ట్ ఏర్పాటు సమయంలోనే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రైవేటు సంస్థలు సంబంధిత లిఫ్ట్ కంపెనీలతో ఏఎంసీ(యాన్యువల్ మెయింటనెన్స్ కాంట్రాక్ట్) కుదుర్చుకుంటాయి. నిర్ణీత వ్యవధుల్లో పరీక్షించడం, అవసరాన్నిబట్టి పరికరాలు సరఫరా చేయడం, తగిన మరమ్మతులు చేయాలి. కానీ ఇవి దాదాపు ఉండనే ఉండవు. ♦ విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లాంటి వాటిల్లో ఇవి మరింత పకడ్బందీగా ఉండాలి. ♦ అత్యవసర సమయాల్లో ఫోన్ చేసేందుకు వీలుగా సంబంధిత ఎమర్జెన్సీ నెంబర్లు లిఫ్టులో కనబడేలా ఉండాలి. -
మంత్రి జోగురామన్నకు తప్పిన ప్రమాదం
సాక్షి, మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్నకు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి జోగు రామన్న సోమవారం ఉదయం మంచిర్యాలకు వచ్చారు. ఆసుపత్రిని ప్రారంభించిన తర్వాత ఇతర విభాగాలను పరిశీలించేందుకు లిఫ్ట్‌లో వెళ్తుండగా లిఫ్ట్ వైర్ తెగిపడింది. ఈ ప్రమాదంలో జోగు రామన్నకు ఎలాంటి గాయాలు అవ్వలేదు. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన మంత్రి, మిగతా కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొన్నారు. సామర్ధ్యానికి మించి ఎక్కువ మంది లిఫ్ట్‌లో ఎక్కడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. -
లిఫ్ట్‌లో ఇరుక్కుని బాలుడు మృతి
కాచిగూడ : అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుని బాలుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చెప్పల్‌బజార్ ప్రాంతానికి చెందిన దుగ్గి కుమారుడు వేణు (12) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో పేపర్‌బాయ్‌గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం బర్కత్‌పుర భూమన్నలేన్లోని ఓ అపార్ట్మెంట్లో మూడో అంతస్తుకు వెళ్లి పేపర్ వేసిన అతను కిందకు దిగిచ్చిన అనంతరం మరో సారి పైకి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. ప్రమాదవశాత్తు అందులో ఇరుక్కుని మృతి చెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దాదాపు ఐదారు గంటలు శ్రమించి అతి కష్టంపై మృతదేహాన్ని బయటికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించడంలో ఆలస్యం కావడంతో గురువారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. కాచిగూడ ఎస్ఐ లక్ష్మయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లిఫ్ట్‌లో ఆటలా?.. ఈ వీడియో చూడండి
బీజింగ్ : సరదా కోసం స్పృహ మరిచి చేసే పనులు ఒక్కోసారి తెలీకుండానే ప్రాణాల మీదకు తీసుకొస్తుంటాయి. తాజాగా చైనాలోని క్సింజ్హెంగ్ పట్టణంలోని హెనన్ ప్రొవిన్స్‌లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (లిఫ్ట్‌లో మూత్రం పోసి...) స్థానికంగా ఉన్న ఓ అపార్ట్మెంట్ కిందకు వచ్చేందుకు ఓ బాలుడు లిఫ్ట్ ఉపయోగించాడు. ఆ సమయంలో అతనితోపాటు ఓ బాలిక కూడా లిఫ్ట్‌లో ఉంది. ఉన్నట్లుండి ఆ పిల్లాడు తన కాలితో లిప్ట్ డోర్‌ను బలంగా అదిమాడు. అయితే కింది ఫ్లోర్‌కు వెళ్లాక ఒత్తిడి ఎక్కువై ఆ డోర్ కాస్త బద్ధలై ఆగిపోయింది. ఊహించని ఆ ఘటనతో ఉలిక్కిపడ్డ చిన్నారులు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న మెయింటెనెన్స్ సిబ్బంది వచ్చి వారిద్దరినీ రక్షించారు. ఇక ఆ వీడియోను వైరల్ చేస్తూ జాగ్రత్తగా ఉండాలంటూ పలువురు సూచిస్తున్నారు. కొసమెరుపు.. లిఫ్ట్ డోర్‌ను పాడు చేసినందుకు డబ్బు చెల్లించాలని బాలుడి తల్లిని అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కోరింది. అయితే లిఫ్ట్ డోర్లు పాడైపోయాయని.. భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాన్ని తన కొడుకు ముందే భయటపెట్టాడు కాబట్టి అంతా తన కొడుక్కి కృతజ్ఞతలు చెప్పాలని ఆ తల్లి వాదించింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆ పిల్లాడి పేరెంట్స్‌దే తప్పన్న కామెంట్లు చేస్తున్నారు. -
లిఫ్ట్‌లో ఆటలు.. సాయం కోసం ఆర్తనాదాలు
-
ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్‌లు
లిఫ్ట్‌లు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతున్నాయి. బహుళ అంతస్తులు ఉండే అపార్ట్మెంట్స్, షాపింగ్ మాల్స్‌లో సౌకర్యవంతం కోసం లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే వాటి వినియోగంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అక్కడక్కడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిపై పూర్తి అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాతగుంటూరు : రాజధానిలోని రెండు జిల్లాల్లో జనాభా ఎంత పెరిగినా అందరికీ నివాసయోగ్యమైన అక్షయపాత్రలా మార్చినవి అపార్ట్మెంట్లే. వేల కుటుంబాలు తల దాచుకుంటున్నది ఈ బహుళ అంతస్తుల భవనాల్లోనే. అందరికీ కింద ఫ్లోర్లే దొరకవు గనుక పై అంతస్తుల్లోనైనా నివాసం తప్పనిసరి. అన్ని మెట్లు ఎక్కలేని వారిని రివ్వున పైకి చేర్చే లిఫ్ట్‌లు ఉండటంతో ఇక చింతే లేదు. అయితే అంతటి మేలు చేసే లిఫ్ట్ వినియోగంలో ఏ మాత్రం ఏమరుపాటు ఉన్నా ప్రాణాల మీదకు వచ్చేంత ప్రమాదాలు పొంచి ఉన్నాయనేది గమనించాల్సిన అంశం. పలువురి మృతి.. ఈ నెల 3న లిఫ్ట్‌ల కారణంగా ఇరువురు మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కొంతకాలంగా మరమ్మతులకు గురైన విషయం తెలియక డోర్ తెరుచుకుని ఉన్న ఖాళీ లిఫ్ట్‌లోకి వెళ్లి ప్రమాదానికి గురై వ్యక్తి మృతి చెందాడు. అలాగే, ప్రకాశం జిల్లా చీరాలలో మొదటి గేటు వేసి రెండో గేటు మూసే క్రమంలో మరో వ్యక్తి లిఫ్ట్ బటన్ నొక్కడంతో అది పైకి వెళ్లడంతో గేటుకు గోడకు మధ్యలో తల ఇరుక్కుపోవడంతో అతని తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు నెలల క్రితం నగరంలోని ఓ జిమ్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన హీరో నిఖిల్ గ్రిల్ లిఫ్ట్‌లో అంతరాయం ఏర్పడడంతో సుమారు 20 నిమిషాల పాటు ఇరుక్కు పోయారు. గ్రిల్స్‌ను తొలగించడంతో హీరో సుక్షితంగా బయటకు వచ్చిన ఘటన జరిగింది. ఇలాంటి ఘటనలు దాదాపు అపార్ట్‌మెంట వాసులందరికి ఓ హెచ్చరిక లాంటివి. ప్రతి ఒక్కరూ తమ భవనాల్లోని లిఫ్ట్‌ల నిర్వహణ ఎలా ఉందో తరచూ చూసుకోవాల్సి తరుణమిది. ప్రస్తుతం మూడు రకాల లిఫ్ట్‌లు వినియోగంలో ఉన్నాయి. 1–గ్రిల్స్ లిఫ్ట్ : ఈ లిఫ్ట్‌కు ఉన్న రెండు డోర్లు గ్రిల్‌తో రూపొందించడంతో గాలి, వెలుతురు ఉంటుంది. రెండు డోర్లు లాక్ అయిన తర్వాత కిందకైనా పైకి అయినా మూవ్ అవుతుంది. సరిగా లాక్ అవకపోతే హెచ్చరిస్తుంది. పిల్లలు గ్రిల్లో చేతులు పెట్టి ప్రమాదాలకు గురవుతున్న కారణంగా ప్రస్తుతం వీటి డిమాండ్ తగ్గింది. 2–ఆటోమేటిక్ డోర్ లాక్ లిఫ్ట్ : ఈ లిఫ్ట్‌కు లోపల గ్రిల్ ఉంటే బయట ఆటోమేటిక్‌గా దానంతట అదే మూసుకుపోయే డోర్ ఉంటుంది. లోపల డోర్ లాక్ అయిన వెంటనే ఇది కూడా లాక్ అవుతుంది. ప్రస్తుతం ఈ లిఫ్ట్‌ల వినియోగం అధికంగా ఉంది. గాలీ, వెలుతురు తక్కువగా ఉంటుంది. కరెంట్ పోయినపుడు రన్నింగ్‌లో ఉన్న లిఫ్ట్ ఆగిపోతే చీకటిమయమవుతుంది. అందులో ఉన్నవారు ఇబ్బంది పడకముందే జనరేటర్ ఆన్‌చేసి లిఫ్ట్ పని చేసేలా చూడాలి. జనరేటర్ పని చేయకపోతే మాత్రం కష్టం. కొత్తగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్లలో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. అపార్ట్మెంట్ నిర్మాణంలో ఉండగానే కొందరు తాత్కాలికంగా లిఫ్ట్‌ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది సరైన విధానం కాదు. పూర్తిస్థాయిలోనే లిఫ్ట్ ఏర్పాటు చేసుకోవాలి. 3–స్ప్రింగ్ డోర్ లిఫ్ట్ : ఈ లిఫ్ట్‌లను ఆస్పత్రులు, పెద్ద పెద్ద హోటళ్లలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటి డోర్లు తాము చేరవలసిన అంతస్తు రాగానే వాటంతట అవే తెరుచుకుంటాయి. లోపలికి వెళ్లగానే డోర్లు మూసుకుంటాయి. వీటి నిర్వహణకు లిఫ్ట్ బాయ్ ఎల్ల పుడూ అందుబాటులో ఉంటాడు. అతనే ఆపరేట్ చేస్తాడు. వీటిలో అంతగా ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. అపార్ట్మెంటు లిఫ్ట్‌లు నలుగురు, ఐదుగురికి మాత్రమే పరిమితమైతే వీటిల్లో ఒకేసారి పదిమంది వరకు ఎక్కే వెసులుబాటు ఉంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ♦ లిఫ్ట్‌కు ఉన్న రెండు డోర్లు పూర్తిగా లాక్ కానిదే పని చేయదు. అలా లేకపోయినా పని చేస్తుందంటే అది పాడైనట్లు గుర్తించాలి. ♦ దయచేసి డోర్ లాక్ చేయండి.. వంటి రికార్డ్ చేసిన హెచ్చరిక వాఖ్యాలు లేదా బీప్ సౌండ్ లేకుండా లిఫ్ట్ పని చేసినా అది ఉపయోగించడం క్షేమం కాదు. ♦ లిఫ్ట్ సామర్థ్యానికి మించి ఎక్కువమంది ఎక్కినా మధ్యలోనే ఆగిపోవడం, త్వరగా చెడిపోవడం జరుగుతుంది. ♦ రెండు డోర్లు పూర్తిగా లాక్ అవకముందే తాము చేరుకోవలసిన లేదా దిగవలసిన అంతస్తు బటన్ నొక్కరాదు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే లిఫ్ట్ గమ్యాం చేరుకోకముందే ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ♦ పెద్దల తోడు లేకుండా పిల్లలను పంపించకూడదు. పిల్లలు దానిని ఆట వస్తువుగా భావించి, కిందకు, పైకి వెళ్లేందుకు పదే పదే లిఫ్ట్ బటన్లను వినియోగించడం వలన అది చెడిపోయే అవకాశం ఉంటుంది. ♦ ప్రతి నెలా లేదా కనీసం మూడు నెలలకు ఒకసారైనా లిఫ్ట్ సాంకేతిక నిపుణులతో సర్వీసు చేయిస్తే మంచి కండీషన్లో పని చేస్తుంది. ♦ పాడైన లిఫ్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించరాదు. ♦ అపార్ట్మెంట్లో నివసించే వారందరూ లిఫ్ట్ వినియోగంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ♦ లిఫ్ట్ వినియోగం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సాంకేతిక నిపుణులతో అవగాహన సదస్సులు నిర్వహించడం మంచిది. మూడు నెలలకోసారి సర్వీసింగ్ తప్పనిసరి.. మేం అన్ని జాగ్రత్తలు తీసుకునే లిఫ్ట్‌లను ఫిట్ చేస్తాం. లిఫ్ట్ వినియోగానికి సంబంధించి బోర్డును లిఫ్ట్ బయట, లోపల అందరికి కనిపించేలా ఏర్పాటు చేస్తున్నాం. అయితే మూడునెలలకోసారైనా సర్వీసింగ్ చేయించాలి. ఏమైనా విడిభాగాలు పోతే వెంటనే వేయించాలి. – హర్షవర్ధన్, బిల్డర్, గుంటూరు -
లిఫ్ట్ మీద పడి బాలుడి దుర్మరణం
హైదరాబాద్: అపార్ట్మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఓ బాలుడు బలయ్యాడు. తెరిచి ఉన్న సెల్లార్ లిఫ్ట్ క్యాబిన్లోకి తొంగిచూసిన చిన్నారిపై లిఫ్ట్ వచ్చి పడింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం హైదరాబాద్ చంపాపేట డివిజన్ దుర్గానగర్‌లో జరిగింది. దుర్గానగర్‌లోని శ్రీ సత్యసాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ వాచ్‌మన్ చొల్లంగి శ్రీనివాస్, సూర్యకుమారి దంపతులకు ఇద్దరు సంతానం. వీరి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కాజులూరులోని తర్లంపుడి గ్రామం. ఆదివారం ఉదయం శ్రీనివాస్ పెద్ద కుమారుడు వెంకట తస్వంత్(8) ఆడుకుంటూ వెళ్లి ఎలాంటి రక్షణ లేని లిఫ్ట్ సెల్లార్ క్యాబిన్లోకి తొంగి చూస్తున్నాడు. అదే సమయంలో పైఅంతస్తు నుంచి దూసుకువచ్చిన లిఫ్ట్ బాలుడిపై పడింది. దీంతో తస్వంత్ తలకు తీవ్ర గాయమైంది. తల్లి గమనించి కుమారుడిని బయటకు తీసుకువస్తుండగా అప్పటికే మృతిచెందాడు. ఆడుతూ కనిపించిన కుమారుడు క్షణాల్లో ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తస్వంత్ మరణానికి అపార్ట్మెంట్ నిర్వాహకు ల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకులు, బంధువులు ఆరోపించారు. సెల్లార్లో లిఫ్ట్ చుట్టూ రక్షణ చర్యలు తీసుకోలేదని, దీంతో బాలుడు ప్రమాదానికి గురయ్యాడని అన్నారు. శ్రీను కుటుంబాన్ని అపార్ట్మెంట్ నిర్వాహకులు, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అపార్ట్మెంట్ నిర్వాహకులే బాధ్యత వహించాలి: బాలల హక్కుల సంఘం తస్వంత్ మృతికి అపార్ట్మెంట్ నిర్వాహకులు బాధ్యత వహించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుత్‌రావు డిమాండ్ చేశారు. సెల్లార్లో లిఫ్ట్ చుట్టూ రక్షణ గోడలు లేకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని, అపార్ట్మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల నగరంలో తరచూ లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. బాలుడి కుటుంబానికి నిర్వాహకులు నష్టపరిహారం చెల్లించాలని, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
కర్మన్‌ఘాట్‌లో విషాదం..
హైదరాబాద్: సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మన్‌ఘాట్ దుర్గానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక సత్యసాయి అపార్ట్మెంట్లో ఎలాంటి రక్షణలేని లిఫ్ట్.. పదేళ్ల పసిబాలుడి ప్రాణాల్ని మింగింది. ఆదివారం ఉదయం ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. దుర్గానగర్‌లోని సత్యసాయి అపార్ట్మెంట్లో శ్రీనివాస్ అనే వ్యక్తి గతకొంతకాలంగా వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు పదేళ్ల కొడుకు తస్సావంత్ ఉన్నాడు. ఆదివారం ఉదయం బాలుడు ఆడుకుంటూ.. లిఫ్ట్ కోసం ఏర్పాటుచేసిన బేస్గుంతలోకి తొంగిచూస్తుండగా కిందకు దూసుకొచ్చిన లిఫ్ట్ అతని తలకు బలంగా తగిలింది. దీంతో అక్కడికక్కడే బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనతో బాలుడి తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బాలుడి మృతదేహంపై పడి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అపార్ట్మెంట్లో లిఫ్ట్‌కు ఎలాంటి రక్షణలు లేకపోవడంతోనే బాలుడు మృతిచెందాడని, అపార్ట్మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ మున్సిపాలిటీ సిబ్బంది లిఫ్ట్‌ల విషయంలో నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నారా? లేదా? అన్నది చూడకుండానే అపార్ట్మెంట్లకు అనుమతులు ఇస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. లిఫ్ట్ తలపై పడి పదేళ్ల బాలుడు మృతి -
లిఫ్ట్ అనుకుని ఎక్కబోయి అనంత లోకాలకు!
సాక్షి, రాజమహేంద్రవరం : వేర్వేరు లిఫ్ట్ ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లక్ష్మివారపుపేటలో చక్రవర్తి ఫోర్ట్ అపార్ట్మెంట్లో యర్రంశెట్టి గంగరాజు ( 65 ) మృతిచెందాడు. రెండో ఫ్లోర్ లో లిఫ్ట్ ఉందనుకుని తలుపుతీసి ఎక్కబోగా తలక్రిందులుగా కిండపడ్డాడు. దీంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తణుకు మండలం కాల్థారి గ్రామానికి చెందిన గంగరాజు నెయ్యి విక్రయిస్తుంటాడు. నెయ్యి అమ్మకానికి అపార్ట్మెంట్ పైఫ్లోర్ లోకి వెళ్లిన గంగరాజు కిందకి దిగే సమయంలో ఈ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. త్రీటౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు చీరాలలో పెళ్లింట్లో విషాదం చీరాల : ప్రకాశం జిల్లా చీరాలలో లిఫ్ట్ ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. దీంతో పెళ్లింట్లో విషాదం చోటుచేసుకుంది. చీరాలలోని రంగ అపార్ట్మెంట్లో వివాహ వేడుకకు హాజరైన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి లిఫ్ట్ ఎక్కాడు. అయితే ప్రమాదవశాత్తూ అతడి తల లిఫ్ట్‌లో ఇరుక్కోవడంతో లక్ష్మీనారాయణ మృతిచెందాడు. మృతుడు వరుడికి మేనమామ అవుతాడని సమాచారం. -
ప్రాణం తీసిన లిఫ్టు..
సాక్షి, హైదరాబాద్: లిఫ్టు పనిచేయక అందులో ఇరుక్కొని ఒకరు మృతి చెందిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ కార్యాలయ భవనంలో ఈ ప్రమాదం జరిగింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయం ఈ భవనంలో నడుస్తోంది. ఈ సంస్థ ఉద్యోగి ఆనందరావు(56) మంగళవారం సాయంత్రం లిఫ్టులో ఇరుక్కొని చనిపోయాడు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట కాగా, ఉద్యోగ రీత్యా సనత్‌నగర్‌లో ఉంటున్నారు. -
ప్రైవేటు ప్రీప్రైమరీకి గుర్తింపు తప్పనిసరి!
- ఈ నెల 31లోగా గుర్తింపు తీసుకోవాల్సిందేనన్న విద్యాశాఖ - గుర్తింపు ప్రక్రియ మార్గదర్శకాలు జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ (ప్రీప్రైమరీ) నిర్వహిస్తున్న ప్రతి ప్రైవేటు పాఠశాల తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రీప్రైమరీ తరగతులను నిర్వహిస్తున్న, కొత్తగా ప్రారంభించే పాఠశాలలు ప్రీప్రైమరీకి ఈ నెల 31వ తేదీలోగా అనుమతులు తీసుకోవాలని పేర్కొంది. దీనికి సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. లిఫ్ట్ ప్రమాదం నేపథ్యంలో మేల్కొన్న విద్యాశాఖ రాష్ట్రంలో 11,470 ప్రైవేటు పాఠశాలలు ఉండగా, వాటిల్లో ప్రీప్రైమరీ సెక్షన్లు కలుపుకొని మొత్తంగా 31.28 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి పాఠశాల ప్రీప్రైమరీ విద్యను కొనసాగిస్తున్నది. రెండు నెలల కిందట నగరంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఓ విద్యార్థి లిఫ్ట్‌లో ఇరుక్కొని చనిపోయిన నేపథ్యంలో ప్రీప్రైమరీకి గుర్తింపు అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వం ప్రీప్రైమరీకి ప్రత్యేకంగా అనుమతి ఇవ్వకున్నా గత 20–25 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు ప్రీప్రైమరీ విద్యను కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వ విధానం ప్రకారం బడిలో 5 ఏళ్లు నిండినవారినే ఒకటో తరగతిలో చేర్చించాలి. జీవో నంబర్ 1లోని నిబంధనల ప్రకారం ప్రీప్రైమరీ నియంత్రణ పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ నుంచి గుర్తింపు తీసుకోవాలంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గుర్తింపు సరే.. సిలబస్ ఏదీ? ఇన్నాళ్లు ప్రైవేటు పాఠశాలల్లో ప్రీప్రైమరీకి సంబంధించిన అం«శాన్ని పెద్దగా పట్టించుకోని విద్యాశాఖ అధికారులు సిలబస్ రూపకల్పనకు సిద్ధమైనా మళ్లీ వెనకడుగు వేసింది. ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకొని సిలబస్‌ను ప్రకటించి, ఆ తరువాత ప్రీప్రైమరీకి గుర్తింపు అడగాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. అయితే, విద్యాశాఖ మాత్రం గుర్తింపు వేరు.. సిలబస్ వేరు.. అని పేర్కొంటోంది. ప్రీప్రైమరీ అనుమతుల ఉత్తర్వుల్లోని నిబంధనలివే.. ► వెంటిలేషన్ కలిగిన భవనాల గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్రీప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయాలి. ► వాణిజ్య సముదాయాలు, మార్కెట్లు, వ్యాపార ప్రాంతాలు, సినిమా హాళ్లకు దూరంగా ఉండాలి. ► పిల్లల ఆట వస్తువులు ప్రమాదకరం కానివై ఉండాలి. ► వారికి అవసరమైన సేవలు అందించేందుకు శిక్షణ పొందిన సిబ్బందిని(ఆయాలు) నియమించాలి. ► తరగతి గదులు, టాయిలెట్లు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలి. ► ఫస్ట్ ఎయిడ్ సదుపాయం ఉండాలి. ► పిల్లల భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే సిబ్బందిని ఏర్పాటు చేయాలి. -
లిఫ్ట్‌లో ప్రమాదం.. 8 మందికి గాయాలు
-
లిఫ్ట్‌లో ప్రమాదం.. 8 మందికి గాయాలు
విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చి 8 మంది భక్తులు ప్రమాదానికి గురయ్యారు. భవానీపురంలోని భవానీ టవర్స్‌లో లిఫ్ట్‌లో ఎక్కి కిందికి దిగేందుకు బయలుదేరారు. లిఫ్ట్ కేబుల్స్ తెగిపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కిందపడి పోయింది. దీంతో గాయపడిన ఎనిమిది మందిని దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నాణ్యతలేని లిఫ్ట్‌ను అమర్చిన బిల్డర్ అమర్నాథ్పై అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
లిఫ్ట్ కిందపడి మహిళ మృతి
పుట్టపర్తి మండలకేంద్రంలోని శ్రీసాయిసదన్ అపార్ట్మెంట్లో బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. లిఫ్ట్ లాక్ ఓపెన్ కావడంతో ప్రమాదవశాత్తూ లిఫ్ట్ కిందపడి శారద(45) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఆల్వాల్ మండలం వెంకటాపూర్ గ్రామం. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
కూలిన లిఫ్ట్.. తలసానికి తప్పిన ప్రమాదం
హైదరాబాద్: రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ లిఫ్ట్ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని సెయింట్ థెరిస్సా ఆస్పత్రిలో సోమవారం లిఫ్ట్‌లో వెళ్తుండగా ఒక్కసారిగా వైరు తెగి మొదటి అంతస్తు నుంచి లిఫ్ట్ కింద పడింది. ఈ ఘటనలో మంత్రితో పాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. సనత్‌నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఖలీల్‌బేగ్ తండ్రి మీర్జా అమానుల్లాబేగ్ సెయింట్ థెరిస్సా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆయనను పరామర్శించేందుకు మంత్రి తలసాని ఆస్పత్రికి వచ్చారు. అమానుల్లాబేగ్ వద్దకు వెళ్లేందుకు మొదటి అంతస్తులో లిఫ్ట్ ఎక్కారు. ఆయనతో పాటు మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, నాయకులు సురేశ్‌గౌడ్, ఖలీల్బేగ్లతో పాటు 15 మంది వరకు ఉన్నారు. భారంగా పైకి కదిలిన లిఫ్ట్ క్షణాల్లోనే వైర్ తెగి గ్రౌండ్‌ఫ్లోర్ (సెల్లార్)లో పడింది. అప్రమత్తమైన అక్కడి సిబ్బంది సెల్లార్‌కు చేరుకుని లిఫ్ట్‌లో ఉన్న మంత్రి, ఇతరులను బయటకు తీశారు. ఈ ఘటనలో మంత్రి కాలు బెనకడంతో పాటు చేతికి స్వల్ప గాయం కావడంతో ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం ఇతర కార్యక్రమాలకు హాజరయ్యేందుకు మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మాజీ కార్పొరేటర్ శేషుకుమారి కాలు ఫ్రాక్చర్ కాగా మరికొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా సమయంలో లిఫ్ట్ నిర్వహణ చూసుకునే సిబ్బంది లేకపోవడం, లిఫ్ట్ కెపాసిటీని తెలియజేస్తూ సూచనలు ఏమీ చేయకపోవడం, లిఫ్ట్ వైర్ కూడా పాతది కావడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మంత్రి క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
లిఫ్ట్ తలపై పడి ఒకరి మృతి
హైదరాబాద్: సరిగా పనిచేయని లిఫ్ట్‌ను ఉపయో గించబోయి.. అది తలపై పడడంతో బుధవారం డి.శ్రీనివాస్ అనే వ్యాపారి మృతి చెందాడు. హైదరా బాద్ చింతల బస్తీలోని భవిష్య్ అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీనివాస్‌కు భార్య సునీత, ముగ్గురు పిల్లలు మౌనిక, రితిక, ముకుంద్ ఉన్నారు. ఉదయం 7.30 గంటల సమయంలో తన కుమారుడు ముకుంద్‌ను స్కూల్‌కు పంపేందుకు శ్రీనివాస్ లిఫ్ట్ వద్దకు వచ్చారు. అక్కడి బటన్‌ను రెండు మూడు సార్లు నొక్కినా లిఫ్ట్ రాకపోవడంతో చెక్క తలుపు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలోంచి లోపలకు తల పెట్టి చూశారు. అదే సమయంలో లిఫ్టు పైనుంచి వేగంగా కిందకు వచ్చి శ్రీనివాస్ తలపై పడడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీనిని గమనించిన చుట్టుపక్కల ఫ్లాట్ల వారు వెంటనే ఆయనను అంబులెన్స్‌లో బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. కానీ, శ్రీనివాస్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా.. ఈ అపార్ట్మెంట్లో లిఫ్ట్ సరిగ్గా పనిచేయడం లేదని, దానిని ఉపయోగించవద్దని నిర్వాహకులు సూచించినట్లు తెలిసింది. అయినా కొందరు ఉపయోగిస్తున్నారు. -
యశోదా ఆస్పత్రిలో కూలిన లిఫ్ట్
హైదరాబాద్: ఈ మధ్యన నగరంలో లిఫ్ట్ ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ఇటీవల పలు అపార్ట్మెంట్లు, శంషాబాద్‌లోని వీజేఆర్ రెసిడెన్సీ హోటల్లో, సెక్రటేరియేట్‌లో కూడా లిఫ్ట్ ప్రమాదాలు జరిగాయి. ఈ రోజు సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో లిఫ్టు ఏకంగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే లిఫ్ట్ మొదటి అంతస్థు నుంచి కూలడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లుగా భావిస్తున్నారు.